భార‌త్‌తో టెస్టు సిరీస్‌.. శ్రీలంక క్రికెట్ బోర్డు ఊహించ‌ని నిర్ణ‌యం | Sri Lanka Cricket Makes Stunning Gesture For Fans For 2-Match Test Series Against India | Sakshi
Sakshi News home page

IND vs SL: భార‌త్‌తో టెస్టు సిరీస్‌.. శ్రీలంక క్రికెట్ బోర్డు ఊహించ‌ని నిర్ణ‌యం

Aug 7 2026 6:40 PM | Updated on Aug 7 2026 7:26 PM

Sri Lanka Cricket Makes Stunning Gesture For Fans For 2-Match Test Series Against India

PC: X

టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు అభిమానులకు శ్రీలంక క్రికెట్ (SLC)  తీపి కబురు అందించింది. గాలే, కొలంబోల‌లో జ‌ర‌గ‌నున్న రెండు టెస్టు మ్యాచ్‌ల‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం  కల్పిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఎల్‌సీ పేర్కొంది.

కాగా ఈ సిరీస్ వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా జ‌ర‌గ‌నుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. 

అనంతరం రెండో టెస్టుకు(ఆగస్టు 23 నుండి 27) కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమివ్వనుంది. కాగా పెద్ద సంఖ్యలో వస్తారని ప్రేక్షకులు అంచనా వేస్తున్న శ్రీలంక క్రికెట్ బోర్డు.. రెండు మైదానాల్లోనూ ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేసింది.

సిరీస్ షెడ్యూల్ అండ్ స్టేడియం ఎంట్రీ వివరాలు:

తొలి టెస్టు మ్యాచ్

తేదీలు: ఆగస్టు 15 నుండి 19 వరకు  

వేదిక: గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

ఉచిత ఎంట్రీ గేట్: గేట్ నంబర్ 4 ద్వారా మాత్రమే ప్రవేశం  

రెండో టెస్టు మ్యాచ్

తేదీలు: ఆగస్టు 23 నుండి 27 వరకు  

వేదిక: సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC), కొలంబో  

ఉచిత ఎంట్రీ గేట్లు: గేట్ నంబర్లు 3, 4, 5, 7 
చదవండి: IND vs SL: విఫలమైన భారత బౌలర్లు.. భారీ స్కోర్‌ సాధించిన శ్రీలంక
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement