బరువు తగ్గడం అనేది రోజువారీ తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ స్లిమ్ అవుతారు చాలామంది. అంతేగాదు కేవలం తీసుకునే ఆహారాన్ని చాలా తెలివిగా, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకుంటే..బరువు తగ్గడం అసాధ్యమైంది కాదు అని నిరూపించారు పలువురు. చక్కెర, ఉప్పు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించడం వల్ల బరువుని అదుపులో ఉంచుకోవడం తోపాటు ఉబ్బరాన్ని కూడా తగ్గించుకోవచ్చు అని అంటోంది కంటెంట్ క్రియేటర్ దీప్తి. ఈ మార్పుల తోపాటు క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర, కేలరీల లోటుని పాటిస్తే..అద్భతమైన ఫలితాలు సాధించొచ్చని అంటోంది. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.
కంటెంట్ క్రియేటర్ దీప్తి ఒకప్పుడు 92 కేజీల దాక అధిక బరువుతో ఉండేది. అలాంటి ఆమె అద్భతంగా సుమారు 32 కేజీల బరువు తగ్గారు. తాను ఆ ఐదు ఆహారాలకు దూరంగా ఉండటంతోనే ఇంతలా స్లిమ్‌గా మారినట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది. కేలరీలు లోటు ఉండాలనేది గుర్తించుకుంటే బరవు తగ్గడం ఏమంత కష్టం కాదని చెబుతోంది.
చక్కెర పానీయాలు
దీప్తి మొదటగా మానేసింది చక్కెర పానీయాలనే. ఇవి కొవ్వు పేరుకుపోవడానికి, నీరు నిలిచిపోవడానికి దారితీసి, ముఖం ఉబ్బినట్లుగా కనిపించేలా చేస్తాయి. వాటికి ప్రత్యామ్నాయంగా నిమ్మరసం, కొబ్బరి నీరు, గ్రీన్ టీ వంటి తీసుకోవాలని సూచించింది.
వైట్ బ్రెడ్
తాను వైట్ బ్రెడ్‌కి దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఎందుకంటే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. పైగా ఇది కొవ్వు సులభంగా పేరుకుపోవడానికి కారణమవుతుందని అన్నారు. వాటికి బదులుగా మల్టీగ్రెయిన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, సోర్‌డౌ, ఓట్స్‌ను ఎంచుకుంది.
ప్యాక్ చేసిన స్నాక్స్
చిప్స్, ఇతర ప్యాక్ చేసిన స్నాక్స్‌ను కూడా ఆమె మానుకుంది. వాటిలో తరచుగా ఉప్పు ఎక్కువగా ఉంటుందని, ఇది కడుపు ఉబ్బరాన్ని పెంచి, అనవసరమైన ఆకలి కోరికలను ప్రేరేపిస్తుందని అన్నారు. బదులుగా వేయించిన శనగలు, నట్స్, మఖానా వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా తీసుకోవాలని అన్నారు
వేయించిన ఫాస్ట్ ఫుడ్
వేయించిన బర్గర్లు, ఫ్రైస్, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ కూడా మానుకున్న జాబితాలో ఉన్నాయి. ఈ ఆహారాలలో సాధారణంగా కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉంటాయని, ఇవి అదనపు కేలరీలను జోడించడంతో పాటు మిమ్మల్ని నీరసంగా ఉంచుతాయని అంటోంది. ఆమె బదులుగా ఇంట్లో తయారు చేసిన ర్యాప్‌లు, పనీర్ లేదా చికెన్ టిక్కా, సాధారణ ఇంట్లో వండిన భోజనాన్ని ఇష్టపడింది.
అర్ధరాత్రి పూట చిరుతిండి
చివరగా కంటెంట్ క్రియేటర్ అర్ధరాత్రి పూట అడ్డదిడ్డంగా చిరుతిండి తినడం వంటి అలవాట్లకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. పడుకునే ముందు అనాలోచితంగా తినడం వల్ల, తెలియకుండానే రోజువారీ క్యాలరీల వినియోగం వేగంగా పెరిగిపోతుందని అన్నారు. అంతగా ఆకలిగా అనిపిస్తే హెర్బల్ టీ తాగి, నిద్రపోండని అన్నారు.
అదనంగా, ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు తాగడం, కనీసం ఏడు గంటల పాటు నిద్రపోవడం, ప్రతిరోజూ నడవడం వంటి అలవాట్లను కూడా దీప్తి సూచించింది. ఆమె ప్రకారం, కేలరీల వినియోగాన్ని తగ్గించి తినడంతో పాటు ఈ చిన్న చిన్న అలవాట్లను పాటించడం వల్ల, కాలక్రమేణా ముఖం, శరీరంలో స్పష్టమైన మార్పు కనిపించడమే గాక చూక్కని ఆకృతిలో స్లిమ్‌గా కనిపిస్తారని చెబుతోంది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: మాంసాన్ని తినే వ్యాధి'..! ఎందువల్ల వస్తుందంటే..)


