తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామివారు భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు.
కన్నుల పండువగా సాగిన ఈ వాహనసేవలో అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ భక్తులు పులకించిపోయారు.
తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీవారిని చూసి వేలాది మంది భక్తులు భక్తిపారవశ్యంతో చేతులెత్తి మొక్కుకున్నారు.
"గోవిందా.. గోవిందా" అంటూ చేసిన నామస్మరణతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి క్షేత్రం ప్రతిధ్వనించింది.


