breaking news
tirumala
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
TTD: సామాన్య భక్తులకు షాక్ కొండకు రాకుండా...!
-
Mukkoti Ekadashi : వీఐపీల సేవలో టీటీడీ.. క్యూలైన్లలో భక్తుల కష్టాలు
-
తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)
-
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. నేడు బధవారం వైకుంఠ ద్వాదశి కావడంతో ఉదయం శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణి పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిమిత సంఖ్యలోనే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని, ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే రేపటి వరకు దర్శనం ఉంటుందని వెల్లడించారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనంలో భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అలిపిరి మెట్ల మార్గం ద్వారా లక్కీడిప్‌లో టికెట్ పొందిన భక్తులు మెట్టు మెట్టుకు పూజలు చేస్తూ భక్తిశ్రద్ధలతో తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుపతితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తులు కిటకిటలాడుతున్నారు.వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు: 67,053నిన్న తలనీలాలు సమర్పించిన భక్తులు: 16,301వైకుంఠ ఏకాదశి హుండీ ఆదాయం: ₹2.25 కోట్లు -
వైకుంఠ ఏకాదశి : తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం (ఫొటోలు)
-
ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు... శ్రీవారి సేవలో సీఎం రేవంత్ సహా ప్రముఖులు
-
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (చిత్రాలు)
-
ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ధనుర్మాస కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసిన అనంతరం వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు.రాత్రి 12:05 గంటలకు అర్చకులు, జీయర్ స్వాముల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలను తెరిచారు. అనంతరం నిత్య కైంకర్యాలు పూర్తి చేసి వేకువజాము 1:25 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సజావుగా సాగుతున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోమవారం ఒక్కరోజే సుమారు 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా కేవలం 2–3 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీవీఐపీల దర్శనాలు కేవలం మూడు గంటల పాటు మాత్రమే నేరుగా వచ్చిన వీవీఐపీలకు దర్శన టికెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. రాబోయే మూడు రోజుల కోసం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా సుమారు 1.89 లక్షల టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు.ఉదయం 4:30 గంటల నుంచి టోకెన్లు ఉన్న భక్తులకు వారి కేటాయించిన టైమ్ స్లాట్ల ప్రకారం సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు ఈవో వివరించారు. టోకెన్లు లేని భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోషల్ మీడియా, రేడియో అనౌన్స్మెంట్ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టామని చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి 8వ తేదీ మధ్య తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు.కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శనానికి పట్టే సమయం, రద్దీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు తాజా అప్డేట్స్ అందిస్తున్నామని తెలిపారు. భద్రత పరంగా సుమారు 3,500 మంది పోలీస్, విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.వైకుంఠ ద్వార దర్శనంలో ప్రముఖులువైకుంఠ ఏకాదశి సందర్భంగా అనేక మంది ప్రముఖులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, సినీ నిర్మాత డివివి దానయ్య దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా దర్శనం చేసుకున్నారు.నిర్మాత బండ్ల గణేష్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, క్రికెటర్ తిలక్ వర్మ, చాముండేశ్వరినాథ్, ఎమ్మెల్సీ భరత్, దేవినేని అవినాష్ తదితరులు వైకుంఠ ద్వార దర్శనంలో తరించారు. భక్తులు తమకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
జనవరి నెల శ్రీవారి ఆలయ విశేష పర్వదినాల తేదీల ప్రకటన
తిరుమల: జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల తేదీలన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. ఈ మేరకు జనవరి మాసం విశేష తేదీలను వెల్లడించింది. జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవంజనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొరజనవరి 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.జనవరి 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.జనవరి 14న భోగి.జనవరి 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.జనవరి 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.జనవరి 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.జనవరి 23న వసంత పంచమి.జనవరి 25న రథ సప్తమి -
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)
-
"తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మించాలి"
సాక్షి హైదరాబాద్: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు(సోమవారం) ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈసందర్భంగా రాష్ట్ర సమస్యలను అసెంబ్లీలో ప్రస్థావించారు. కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో రాష్ట్ర భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో మాదిరి తిరుపతిలోనూ తెలంగాణ భవన్ నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రానికి చెందిన భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాల అంశంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరారు. అదే విధంగా రాష్ట్రం నుంచి ఏటా అయ్యప్పస్వామి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు శబరిమలకు వెళుతుంటారని, సూదూర ప్రాంతం కావడంతో అక్కడ కూడా తెలంగాణ భవన్ నిర్మించే అంశం ప్రభుత్వం ఆలోచించాలని గంగుల కమలాకర్ ప్రభుత్వానికి సూచించారు. ఇదివరకే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తిరుపతిలో ఆ రాష్ట్రాలకు చెందిన భవన్లు నిర్మించుకున్నాయని దీంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రజాపతినిధులు అక్కడికి వెళ్లినప్పుడు వారికి ఇబ్బందులు కలగడం లేదన్నారు. కానీ తెలంగాణ ప్రజా ప్రతినిధులకు మాత్రం అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందుకే తిరుపతిలో తెలంగాణ భవన్ కూడా నిర్మిస్తే ప్రజాప్రతినిధులకు సౌకర్యంగా ఉండడంతో పాటు ప్రాధాన్యత కూడా ఉంటుందని గంగుల కమలాకర్ ప్రభుత్వానికి నివేదించారు. -
తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)
-
Tirumala: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,823 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,660 మంది భక్తులు తలనీలాలు అరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే తిరుమలలో చలి తీవ్రత పెరిగిపోయింది. భక్తులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూములు దొరకని భక్తులు వెయిటింగ్ హాళ్ల వద్ద, టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద చలికి వణుకుతూ కనిపిస్తున్నారు.రేపు ముక్కోటి ఏకాదశి వేడుకలుడిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేట్టారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించనున్నారు. తిరుపతి స్థానిక ఆలయాల్లో పుష్పాలంకరణలకు 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 1 లక్ష కట్ ఫ్లవర్స్ ఉపయోగించనున్నారు. శ్రీ గోవిందరాజవారి ఆలయంలో…తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా వేకువజామున 12.05 నుండి 1.35 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుండి రాత్రి 8.45 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 2 నుండి 3 గంటల వరకు తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాలు జరుగనున్నాయి. ఉదయం 3 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు అమ్మవారికి ఆస్థానం నిర్వహిస్తారు.శ్రీనివాసమంగాపురంలో …డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 1.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.అదేవిధంగా డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.అప్పలాయగుంటలో ….అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు.డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు.నారాయణవనంలో …నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు.డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6 నుండి 7 గంటల గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 8:15 నుండి 9 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరుగునుంది. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
నేటి అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించేందుకు టీటీడీ రంగం సిద్ధం చేసింది. జనవరి 8వ తేదీ రాత్రి 12గంటల వరకు 10 రోజులపాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది. సామాన్య భక్తులకు అధిక సమయాన్ని కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. టోకెన్లు పొందిన భక్తులకు మూడు ప్రవేశ మార్గాల నుంచి అనుమతిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన మంగళవారం ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించే అవకాశం కల్పిస్తారు. మొదటి మూడు రోజులు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. వీరికి అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 11 గంటల వరకు కృష్ణతేజ ప్రవేశమార్గం నుంచి, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏటీజీహెచ్ అతిథిగృహం నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశమార్గం నుంచి భక్తులను అనుమతిస్తాడు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఎస్ఈడీ, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరి మూడు రోజుల్లో స్థానికులకు రోజుకు 5 వేల మందికి చొప్పున ఇప్పటికే ఈ–డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. ఇప్పటికే సప్తగిరులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ పది రోజులు 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, పది టన్నుల ఫలాలు, నాలుగు లక్షల కట్ ఫ్లవర్స్‌తో శ్రీవారి ఆలయంతోపాటు, అనుబంధ ఆలయాలను అలంకరించనున్నారు. ఇల వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీప కాంతులతో శ్రీవారి ఆలయం, తిరుమల అలరారుతున్నాయి. ఆలయం వెలుపల శ్రీ రంగనాథస్వామి ఆలయ నమూనాను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోనే అష్టలక్ష్ములను, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సెట్టింగులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు శ్రీవారి ఆలయం ఎదుట అష్టలక్ష్ములను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజున ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు సాక్షి, అమరావతి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠద్వార దర్శనం కల్పించే అన్ని ఆలయాల వద్ద ఈ నెల 30న పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రద్దీని అంచనా వేసి ఆ సమాచారాన్ని పోలీసులకు అందించాలని దేవదాయశాఖ ఈవోలను ఆదేశించింది. -
దేవుడా.. ఇదేం విడ్డూరం!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ పిడుగులాంటి వార్తను విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దివ్య దర్శనం, టైం స్లాట్ టోకెన్ల పంపిణీని ముందుగానే నిలిపి వేసింది. టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావొచ్చని ప్రకటించింది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని డిసెంబర్ 30వ తేదీ నుంచి పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ తాజా నిర్ణయంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం అందని ద్రాక్షలా మారింది. ఆన్లైన్ ద్వారా మాత్రమే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఇవ్వడం ద్వారా గ్రామీణ, చదువుకోని భక్తులకు స్వామి వారి దర్శనాన్ని దూరం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా లక్కుంటేనే వైకుంఠ ద్వార దర్శనం అంటూ ఆన్ లైన్ లక్కీ డిప్ విధానం అమలు చేయటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులు ఆలయాలకు వెళ్లటం ఆనవాయితీ. ముఖ్యంగా కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు మూలల నుంచి భక్తులు వస్తుంటారు. అలా వచ్చే వారిలో టోకెన్లు కలిగిన వారు, లేని వారూ ఉంటారు. ఆన్లైన్లో దర్శన టికెట్లు పొందలేని భక్తులు తిరుపతిలో టైం స్లాట్ టోకెన్లు తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళుతుంటారు.ఆ 3 రోజులూ తిరుమలకు రావొద్దుడిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31న ద్వాదశి, జనవరి 1వ తేదీల్లో సామాన్య భక్తులు వెళ్లే సర్వ దర్శనం టోకెన్ల పంపిణీ నిలిపి వేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన వారిని మాత్రమే సర్వ దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. లక్కీ డిప్ టికెట్ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని ప్రచారం చేస్తోంది. జనవరి 2 నుంచి 8 వరకు ఆఫ్‌లైన్‌లో సర్వ దర్శనం కోసం అనుమతిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు, నడక మార్గంలో వచ్చే భక్తులను ఉద్దేశించి సోషల్ మీడియా, దినపత్రికల్లో టీటీడీ ప్రకటనలు సైతం ఇచ్చింది. అదే విధంగా గోవింద మాల ధరించిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. మాల ధరించిన భక్తులు కూడా సర్వ దర్శనం ఆన్ లైన్ టికెట్లు ఉంటేనే అనుమతి ఇస్తామని చెబుతున్నారు. ఈ విషయం ఏపీ, తెలంగాణా, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని భక్తులకు కూడా తెలిసేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని టీటీడీ ఈఓ తెలిపారు.నిర్వహణ చేతకాకేనా?గత వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో టోకెన్ల కోసం తొక్కిసలాట కారణంగా ఆరుగురు భక్తులు ప్రాణాలు కొల్పోగా, దాదాపు 40 మందికి పైగా భక్తులు గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో టీటీడీ తమ చేతికి మట్టి అంటకుండా అన్ని టికెట్లను ఆన్లైన్లో ఉంచి చేతులు దులుపుకుందని, నిర్వహణ చేతకాకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని భక్తులు విమర్శిస్తున్నారు. టీటీడీ తాజా నిర్ణయం కారణంగా తొలి మూడు రోజులు సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలకు దూరం అయ్యారు. లక్కీ డిప్ పేరుతో టీటీడీ పాలక మండలి భక్తుల మనోభావాలతో ఆడుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజుల తర్వాత మిగిలిన ఏడు రోజుల్లో శ్రీవారి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని చెబుతున్నారు.స్థానికుల పైనా వివక్ష!చంద్రబాబు పాలనలో డిప్ సిస్టమ్ ఏర్పాటు చేసి తమను శ్రీవారి దర్శనానికి దూరం చేశారని స్థానికులు, స్థానికేతరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో సుమారు 8 లక్షల మంది జనాభా ఉంటే.. కేవలం 15 వేల టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకోవటం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఆంక్షలు విధించి టికెట్లు ఇవ్వక పోవటంపై భక్తులు మండిపడుతున్నారు. వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎవరికి వారు కుటుంబాలతో సహా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుపతిలో భారీ ఏర్పాట్లు చేసి, నేరుగా భక్తులకు టోకెన్లు పంపిణీ చేశారు. క్యూలైన్లో వచ్చిన వారు వచ్చినట్లు టోకెన్లు తీసుకుని వెళ్లేవారు. స్థానికులతో పాటు అలా ఎంతో మందికి శ్రీవారి దర్శన అవకాశం కలిగింది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
-
సామాన్య భక్తులకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన సర్వదర్శనం నిలిపివేసిన TTD
-
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. సర్వదర్శనాలు బంద్
సాక్షి, తిరుపతి: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో మూడు రోజుల పాటు సామాన్య భక్తులు వెళ్లే సర్వదర్శనం నిలిపివేస్తున్నట్టు తాజాగా టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. గోవింద మాల ధరించిన భక్తులకు సైతం సర్వదర్శనం అనుమతి లేదని చెప్పుకొచ్చింది. దీంతో, టీటీడీ ఒంటెద్దు పోకడలపై భక్తులు మండిపడుతున్నారు. ఎన్నడూలేని విధంగా ఇలాంటి నిర్ణయాలు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.వివరాల ప్రకారం.. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, ద్వాదశి డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో సామాన్య భక్తులు వెళ్ళే సర్వ దర్శనం నిలిపి వేస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్లైన్లో లక్కీడిప్ ద్వారా టికెట్లు ఎంపికైన వారిని మాత్రమే సర్వదర్శనానికి దర్శనం అనుమతి ఉన్నట్టు తెలిపింది. లక్కీ డిప్ టికెట్ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని ప్రచారం చేస్తోంది. టికెట్ ఉన్న భక్తులు మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ విస్తృత ప్రచారం మొదలుపెట్టింది. జనవరి 2 నుంచి 8 వరకు ఆఫ్ లైన్లో సర్వదర్శనం కోసం అనుమతిస్తామని ప్రకటనలో వెల్లడించింది.శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను, నడిచి వచ్చే భక్తులను ఉద్దేశించి సోషల్ మీడియా, దిన పత్రికల్లో టీటీడీ ప్రకటనలు సైతం ఇచ్చింది. అలాగే, గోవింద మాల ధరించిన భక్తులకు కూడా సర్వదర్శనం అనుమతిలేదని తెలిపింది. ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భక్తులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు. కాగా, గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆఫ్ లైన్లో టికెట్లు కేటాయింపు ద్వారా తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే, వైకుంఠ ఏకాదశి రోజున తమకు స్వామి వారి దర్శనాన్ని దూరం చేస్తున్నారని ఆన్‌లైన్‌పై అవగాహన లేని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ఇలా ఆంక్షలు, టికెట్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ చర్యలపై భక్తులు మండిపడుతున్నారు. -
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సెలవుల నేపథ్యంలో తిరుమల, శ్రీశైల క్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. ఫలితంగా భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. దేవదేవుల దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా వసతుల కల్పన, దర్శనం కల్పనలో ప్రభుత్వం, టీటీడీ ఘోరంగా విఫలమయ్యాయి. పైగా శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లను టీటీడీ రద్దు చేసింది.ఆన్లైన్ శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా దర్శనం కొనసాగుతోంది. తిరుపతిలో శుక్రవారం ఉదయం చేపట్టిన దివ్యదర్శనం టోకెన్ల పంపిణీ కొద్దిసేపటికే ముగిసింది. ఉదయం 9 గంటలకే టోకెన్లు అయిపోవడంతో భూదేవి కాంప్లెక్స్ క్యూలైన్లకు అధికారులు తాళాలు వేశారు. దీంతో భక్తులు ఉసూరుమన్నారు. తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద గురువారం తోపులాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా భక్తులు భారీగా తరలిరావడంతో అలిపిరి టోల్ గేట్, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద రద్దీ భారీగా కనిపించింది. తిరుమలలో సర్వదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 30 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది. 30 నిముషాల్లో 15 వేల టికెట్లు ఎలా పూర్తవుతాయని ప్రశి్నస్తున్నారు. మల్లన్న సన్నిధిలోనూ అదే తీరు శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలోనూ మల్లికార్జున స్వామి దర్శనానికి తరలివచి్చన భక్తులు అవస్థలు పడుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం చేతులెత్తేసింది. వీఐపీల సేవలో తరిస్తున్న అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యుల తీరూ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సామాన్య భక్తులకు కనీసం తాగునీరూ అందించలేని దుస్థితి నెలకొంది. బిస్కెట్లు, అల్పాహారం, చంటిపిల్లలకు పాలూ ఇవ్వలేక దేవస్థానం చేతులెత్తేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది భక్తులు గంటల తరబడి కంపార్ట్మెంట్లలో ఉండలేక గోడలు దూకి బయటికి వచ్చేయడం గమనార్హం. భక్తుల రద్దీ దృష్ట్యా సీఆర్వో కార్యాలయం వద్ద వీఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపును దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసింది. -
TTD: అదే నిర్లక్ష్యం.. భక్తుల భద్రత గాలికి.. (ఫొటోలు)
-
తిరుమల క్యూలైన్లలో గందరగోళం..!
తిరుమలలో భక్తులకు నిన్న(గురువారం, డిసెంబర్ 25) అధికారులు చుక్కలు చూపించారు. తలా ఒక ఉచిత సలహాలిచ్చి.. నిలబడ్డ క్యూలోనే.. మరోసారి వేచిచూసేలా చేశారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేయలేకపోవడం వల్ల ఈ దుస్థితి నెలకొందని పలువురు భక్తులు ‘సాక్షి’తో వాపోయారు. గురువారం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అలిపిరి వద్ద కూడా క్యూలైన్లలో ఉన్న భక్తులపై లాఠీఛార్జీ జరిగిన విషయం తెలిసిందే..! తిరుమల క్యూలైన్లలోనూ గందరగోళం నెలకొన్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కల్యాణోత్సవంలో..గురువారం రద్దీ పెరగడంతో.. సుపథం ఎంట్రీ వద్ద సిబ్బంది కల్యాణోత్సవం భక్తులను నియంత్రించలేకపోయారు. దీంతో.. కొందరు టీటీడీ సిబ్బంది భక్తులను తప్పుదోవ పట్టించారు. ‘ఉదయం 10 గంటలకు సుపథం వద్ద క్యూలైన్లో నిలబడ్డాం. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. సెలవు రోజు, భక్తుల రద్దీని అంచనావేయలేకపోయిన టీటీడీ తొలుత ఒక్కరితోనే కల్యాణోత్సవం టిక్కెట్లు, ఆధార్ కార్డుల పరిశీలనకు నియమించింది. భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వచ్చారా? లేదా? అని తనిఖీ చేసేందుకు ఓ మహిళా వలంటీర్.. రద్దీ నియంత్రణకు విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించింది. 11 గంటల వరకు కూడా మేము సగం లైన్ వరకు వచ్చాయం. వెనక్కి తిరిగి చూస్తే.. క్యూ ఇంకా పెద్దగానే ఉంది. అంతలో మెడలో టీటీడీ ఐడీకార్డు వేసుకున్న ఓ వ్యక్తి మా దగ్గరకు వచ్చి.. కల్యాణోత్సవం కోసం వేచిచూసేవారికి నేరుగా లోనికి అనుమతి ఉంటుందని చెప్పాడు. అంతే.. క్యూలైన్లో సగం వరకు ఉన్న మేము, మా వెనకాల నిలబడ్డ వారు కూడా అటుగా పరుగులు తీశారు.తీరా అక్కడికి వెళ్తే.. కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. టీటీడీ వాళ్లు నేరుగా చెప్పొచ్చన్నారని పేర్కొనగా.. వారినే అడిగి లోనికి వెళ్లండని సమాధానం ఇచ్చాడు’ అని ఓ భక్తుడు ‘సాక్షి’తో వాపోయారు. తమతో ఇద్దరు చిన్నపిల్లలు, ఓ వృద్ధురాలు ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత భక్తులంతా తిరిగి క్యూలైన్లోకి రాగా.. మధ్యవరకు ముందు నిలబడ్డ భక్తులు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దీంతో తాము రెండుసార్లు క్యూలో నిలబడాల్సి వచ్చిందని పలువురు పేర్కొన్నారు.ఉదయం 11.30 కావొస్తున్నా.. కల్యాణం క్యూలైన్ తగ్గకపోవడం.. ఆ సమయానికల్లా క్యూకట్టాల్సిన ఊంజాల్ సేవ, చిన్నారులతో వచ్చేవారు సుపథం వద్ద గుమికూడారు. దాంతో.. అధికారులు నేరుగా అనుమతిస్తామని ప్రకటించారు. ఈ చర్య వల్ల ఉదయం 10 గంటల నుంచి క్యూలైన్లో ఉన్న తాము చాలా ఆలస్యంగా లోనికి వెళ్లాల్సి వచ్చిందని హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఊంజాల్ భక్తులకూ అంతే..!షెడ్యూల్ ప్రకారం ఊంజాల్ సేవ టికెట్ ఉన్న భక్తులు ఉదయం 11.30 నుంచి సుపథం వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఓ వైపు కల్యాణం టికెట్ భక్తులు లైన్లో ఉండగానే.. ఊంజాల్ సేవ వారు కూడా క్యూకట్టేశారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ‘కేవలం కల్యాణ సేవ భక్తులే క్యూలో ఉండాలి’ అని అనౌన్స్ చేసేవారు కూడా అక్కడ లేకపోవడంతో పరిస్థితి జటిలంగా మారింది. ‘మేము లైన్లో ఉండగానే.. మమ్మల్ని లోనికి పంపకుండా.. క్యూని ఆపేశారు. సుప్రభాతం టికెట్ ఉన్నవారు పక్కనుంచి రావాలని కోరారు.ఒకసారి మోసపోయాం. ఈసారి కూడా అంతే అనుకుని క్యూలోనే ఉన్నాం. అయితే.. ఊంజాల్ సేవ వారు ముందు ఉండడంతో.. మేము అటు ముందుకు.. ఇటు వెనక్కి కదలలేకపోయాం’ అని అనంతపురానికి చెందిన మరో భక్తుడు ‘సాక్షి’కి వివరించారు. కల్యాణం భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. టికెట్ వెరిఫికేషన్ చేసే సిబ్బంది సంఖ్యను అప్పటికప్పుడు మూడుకు పెంచి.. భక్తులను లోనికి పంపారు. అయితే.. ఈ ఆలస్యం ప్రభావం తదుపరి సేవలపై తీవ్రంగా పడింది. ఊంజాల్ సేవ భక్తులను మధ్యాహ్నం 12 గంటల నుంచి లోనికి అనుమతించారు.అయితే.. ఎలాంటి ప్రకటన లేకుండానే.. ఊంజాల్ సేవకు పంపకుండానే.. ఆ లైన్లో ఉన్న భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి తరలించారని హైదరాబాద్ శివార్లలోని బీరంగూడకు చెందిన భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మూడు నెలల క్రితమే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నా.. సాధారణంగా దర్శనానికి పంపారు. మాకు ఊంజాల్ సేవ మొక్కు ఉండగా.. దాన్ని తీర్చుకోలేకుండా టీటీడీ అధికారులు చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.సెల్‌ఫోన్ డిపాజిట్‌కు మరోసారి..ఊంజాల్ సేవ భక్తులకు టికెట్ వెరిఫికేషన్, సెక్యూరిటీ చెకింగ్ వరకు సెల్‌ఫోన్ వెంట తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది. చెకింగ్ వద్ద సెల్ఫోన్లను డిపాజిట్ చేయాలి. అయితే.. ఊంజాల్ భక్తులను నేరుగా దర్శనానికి పంపిన అధికారులు భయట క్యూలైన్ వద్ద ఉన్న కౌంటర్లోనే సెల్‌ఫోన్ డిపాజిట్ చేయాలంటూ హుకుం జారీ చేశారు. దాంతో షాక్ తిన్న భక్తులు.. చేసేది లేక.. మళ్లీ బయటకు వచ్చి, 40 నిమిషాలు సెల్‌ఫోన్ డిపాజిట్ కోసం క్యూకట్టాల్సి వచ్చింది. కనీసం ఇలాంటి వారిని నేరుగా లోనికి పంపించలేదని మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ భక్తురాలు ‘సాక్షి’తో తెలిపారు.ఇక చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులకు కల్పించే స్పెషల్ దర్శనం క్యూ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవ్వాల్సి ఉండగా.. దాన్ని కూడా ఆలస్యంగా మొదలు పెట్టడంతో.. చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రక్తదానం డోనర్ల దర్శనంలోనూ ఇలాంటి లోటుపాట్లే కనిపించాయని భక్తులు వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రద్దీ సమయాల్లో సమర్థులైన సిబ్బందిని సుపథం క్యూకౌంటర్ల వద్ద నియమించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.- సాక్షి వెబ్ డెస్క్ -
తిరుమలలో సైకో హల్చల్
సాక్షి, తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఓ సైకో కలకలం సృష్టించాడు. చిన్న పిల్లలను వెంటాడుతూ చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పిల్లలపై దాడి చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకున్న భక్తులు.. పోలీసులకు అప్పగించారు. సైకోను పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.కాగా, గత మార్చి నెలలో ఓ యువకుడు మద్యం తాగి మాడ వీధుల్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఓ మహిళతో గొడవకు దిగాడు. పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి.. ‘‘నేను లోకల్’’ అంటూ.. తిరుమల మాడ వీధుల్లో తిరుగుతూ ఓ మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో తాను మద్యం తాగుతాను.. కావాలంటే అక్కడ మద్యం కూడా అమ్ముతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక, విజిలెన్స్ అధికారుల ముందే ఇదంతా జరగడం గమనార్హం. అనంతరం, అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
ఒక్కప్పుడే బాగుంది.. ఈ ప్రభుత్వంలో తిరుమల దర్శనం అంటే నరకమే
-
భక్తుల ప్రాణాలతో చెలగాటం.. ఇంక మారవా నాయుడూ
-
శ్రీనివాస ఏంటి మాకు ఈ గోస.. తీరు మారని టీటీడీ.. భక్తుల ఆగ్రహం..
-
తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల తాకిడి పెరగడంతో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లను టీటీడీ రద్దు చేసింది. ఆన్లైన్ శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా దర్శనం కొనసాగుతోంది. రద్దీ కారణంగా నిన్న అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద తోపులాట జరిగిన విషయం తెలిసిందే.ఇక, తిరుమల శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు అన్నీ నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది. నిన్న(గురువారం) శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే 37,154 మంది భక్తులు తల నీలాలు అర్పించారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 4.12 కోట్లుగా ఉంది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీటీడీ ఘోర వైఫల్యం.. భక్తుల ఆగ్రహం (ఫొటోలు)
-
తిరుపతి అలిపిరి వద్ద తోపులాట
-
అలిపిరి క్యూలైన్లో తోపులాట.. టీటీడీపై భక్తుల ఆగ్రహం
సాక్షి, తిరుపతి: టీటీడీ నిర్లక్ష్యంతో.. ఈ ఏడాది ప్రారంభంలో తిరుమలలో జరిగిన తొక్కిసలాట భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అలిపిరి వద్ద గురువారం దాదాపు తొక్కిసలాట మాదిరి పరిస్థితులే కనిపించాయి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్ల జారీ నేపథ్యంలో భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో.. క్యూలైన్లో తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. భక్తుల్ని అదుపు చేసే పేరుతో లాఠీఛార్జ్‌కి దిగారు. అయితే.. పోలీసుల దురుసు ప్రవర్తనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపటికి భక్తులే నియంత్రించుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూసుకున్నారు. టీటీడీ నిర్లక్ష్య ధోరణితోనే తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని భక్తులు ఈ సందర్భంగా వాపోయారు.టీటీడీపై భక్తుల ఆగ్రహం.. తోపులాట ఘటనతో భక్తులు టీటీడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టీటీడీ మేనేజ్మెంట్ సరిగా లేదు. వీఐపీల సేవల్లో అధికారులు మునిగిపోతున్నారు. సామాన్య భక్తుల్ని పట్టించుకోవడం లేదు. స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం మాకు ఉండకూడదా?.. భక్తులు రద్దీ దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకు ఇచ్చే సర్వదర్శనం టికెట్లు పెంచాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు.సాక్షి సిబ్బందిపై దౌర్జన్యం.. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద పరిస్థితులను కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి సిబ్బందితో పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. సాక్షి ఫోటో గ్రాఫర్ కృష్ణను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అడ్డుకోగా.. అక్కడికి వచ్చిన అలిపిరి ఎవీఎస్వో రమేష్ ఫొటోగ్రాఫర్ కృష్ణ ఫోన్ లాక్కుని దురుసుగా ప్రవర్తించారు. అంత విషాదం జరిగినా.. నిర్లక్ష్యమా?ఈ ఏడాది ప్రారంభంలో.. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట తిరుమల చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర విషాదానికి దారి తీసింది. బైరాగిపట్టెడ వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్యూలైన్లో ఉన్నవాళ్లను ఒక్కసారిగా ఏదో పశువుల మాదిరి విడిచిపెట్టారని.. అందుకే తోపులాట జరిగిందని ఆ సమయంలో భక్తులు టీటీడీ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. -
తిరుమలకు పొటెత్తిన భక్తులు.. అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తులు పొటెత్తారు. వీకెండ్, వరుస సెలవులు ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో, అలిపిరి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల రాకతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో, శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు నిలిచిపోయారు. మరోవైపు.. అలిపిరి టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో, శ్రీవారి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. బుధవారం అర్ధరాత్రి వరకు 73,524 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,989 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 10 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
Tirumala: శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 73,524 మంది స్వామివారిని దర్శించుకున్నారు.29,989 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 10 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
-
విషపు రాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్లెం!
ఇకపై తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ, వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. – ఢిల్లీ హైకోర్టు హెచ్చరికసాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఇకపై వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ, తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’ అని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కథనాలు రాసిన ఈనాడు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలతో పాటు గూగుల్‌పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్.. సదరు మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. విచారణ సందర్భంగా అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. » గత ఏడాది నవంబర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను పట్టుకుని, వాస్తవాలను వక్రీకరిస్తూ ఈనాడు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలు తన ప్రతిష్ఠ దెబ్బతినేలా కుట్రపూరిత కథనాలు రాశాయని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా, జర్నలిజం విలువలకు తిలోదకాలిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ విషపు రాతలను అడ్డుకోవాలని, ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ప్రతివాదులు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ (ఈనాడు), తదితర సంస్థలకు నోటీసులు జారీ చేసింది.» వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దయాన కృష్ణన్... విచారణ సందర్భంగా ఆయనపై జరిగిన అసత్య ప్రచారాలు, కుట్రలను ఎండగట్టారు. ‘తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు సంస్థల విచారణ తేలనే లేదు. చార్జిషీట్లో నా క్లయింట్ పేరు కూడా లేదు. కానీ, ఈ మీడియా సంస్థలు మాత్రం కక్షగట్టి, ఆయన అక్రమాలకు పాల్పడ్డారని కథనాలు వండివార్చాయి. విచారణ జరగకముందే దోషిగా నిలబెట్టి ఉరితీశాయి’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు సాగుతుండగానే, మీడియా సమాంతర విచారణలు జరుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని, ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా, వాదనల తదుపరి విచారణను న్యాయమూర్తి జనవరి 29కి వాయిదా వేశారు. -
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సినీతారలు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)
-
మొన్న ఎగ్ బిర్యాని.. నిన్న ఎగ్స్.. తిరుమలలో వరుస అపచారాలు
-
తిరుమలలో మరో అపచారం..
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ విజిలెన్స్ వైఫల్యాలు బయటపడుతున్న నేపథ్యంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుమలలో మరో అపచారం జరిగింది. ఓ గదిలో భక్తుడి వద్ద కోడి గుడ్లను పట్టుకున్నారు. ఈ ఘటన కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. తిరుమలలో వరుస అపచారాలు, విజిలెన్స్ వైఫల్యాలు భక్తులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. గత నెలలో అలిపిరి మెట్లమార్గంలో నాన్ వెజ్ తింటూ ఉద్యోగాలు పట్టుబడిన సంగతి తెలిసిందే. అలాగే, గతంలో శ్రీవారి ఆలయం ముందున్న బస్టాండులో భక్తులు ఎగ్ బిర్యానీ తింటూ దర్శనమిచ్చారు. అలిపిరిలో మద్యం, నాన్‌వెజ్ కలకలం సృష్టించింది. అంతేకాకుండా తిరుమలలో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేసిన వీడియోలు బయటకువచ్చాయి. ఇక, తాజాగా తిరుమలలో కోడి గుడ్లను టీటీడీ సిబ్బంది గుర్తించారు. కౌస్తుభంలోని 538 గదిలో భక్తుడి వద్ద గుడ్లు చూసిన సిబ్బంది వారిని పట్టుకున్నారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
-
ఆధ్యాత్మిక ఆవాసం ధనుర్మాసం!
సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతితో ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసంప్రారంభాన్నే గ్రామీణ ప్రాంతాల్లో పండుగ నెల పెట్టడం అంటారు. భక్తవత్సలుడైన శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికమైన ఈ ధనుర్మాసం (Dhanurmasam) 16, మంగళవారం ప్రారంభమైన సందర్భంగా ఆ మాస విశిష్టతలను తెలుసుకుందాం...ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి రెండు పూటలా దీపారాధన చేయడం వల్ల శ్రీమహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం పెట్టే వరకు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.ఆధ్యాత్మిక ప్రయోజనాలకు ఆవాసంధనుర్మాసం విశేషమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం. ధనుర్మాసంలో స్నానం, దానం, హోమం, వ్రతం పూజలు చేయడం అత్యంత శుభప్రదం.సుప్రభాతానికి బదులు తిరుప్పావై ధనుర్మాసం విష్ణు పూజకు అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. తిరుమలలో అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై (tiruppavai) గానం చేస్తారు. అలాగే మిగిలిన విష్ణు ఆలయాల్లో కూడా ఉదయం అర్చనలు చేసి నివేదనలు సమర్పించి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా పిల్లలకు ప్రసాదం పంచడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం అనేది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిదని పండితులు చెబుతారు.అలక్ష్మిని ఆవలకు నెట్టే లక్ష్మీ పూజపవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రాలన్నీ దూరమవుతాయని విశ్వాసం. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి.. వాటిని బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజిస్తారు. మహాలక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం సకల శుభదాయకం.చదవండి: నెలగంట కట్టడం అంటే.. ఎంటే తెలుసా?గోదా రంగనాథుల కల్యాణం గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసం సమయంలో నిర్వహించే అతి ముఖ్యమైన ఆచారం. సాధారణంగా శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారి వివాహం ధనుర్మాసం చివరి రోజున అంటే భోగి నాడు జరుగుతుంది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే వారు గోదాదేవి, శ్రీ కృష్ణుడు లేదా శ్రీరంగనాథ స్వామి వారిని పూజించాలి. తిరుప్పావై పాశురాలను రోజుకు ఒక్కటి గానం చేయాలి. స్వామివారికి, అమ్మవారికి పొంగలి నివేదించాలి. ధనుర్మాసంలో ఒక్కపూట భోజనం, బ్రహ్మచర్యం పాటించడం అత్యంత శ్రేష్ఠం. గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణం చేయడం పరమ విశిష్టం. మనసు, వాక్కు, శరీరం ఈ త్రికరణాలను అత్యంత పరిశుద్ధంగా ఉంచుకున్న వారికి లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సకల సంపదలూ చేకూరతాయని శాస్త్ర వచనం. -
తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం
-
ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు (ఫోటోలు)
-
తిరుమలలో నటి స్వాతి దీక్షిత్ (ఫోటోలు)
-
టీటీడీ నిర్లక్ష్యం.. భూదేవి కాంప్లెక్స్‌లో మందు, బిర్యానీ!
సాక్షి, తిరుపతి: ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల ఆరాధన, గోవింద నామస్మరణతో నిండిపోవాల్సిన ప్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యంతో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం బాటిళ్లు, మాంసపు ప్యాకెట్లు కనిపించడం భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది.మద్యం, మాంసం నిషేధం ఉన్న ప్రదేశంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘గోవింద నామస్మరణ ఉండాల్సిన ప్రదేశంలో మద్యం, మాంసం ఎలా?” అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమల పవిత్రతకు విరుద్ధంగా పదే పదే అపచారాలు జరుగుతున్నాయి. టీటీడీ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.భూదేవి కాంప్లెక్స్‌లో మద్యం, మాంసం ప్రవేశం పూర్తిగా నిషేధం. అయినప్పటికీ, నిత్యం మద్యం బాటిళ్లు దర్శనమివ్వడం భద్రతా లోపాలను బహిర్గతం చేస్తోంది. టీటీడీ వెంటనే చర్యలు తీసుకుని, తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో మద్యం, మాంసం దర్శనమివ్వడం భక్తులలో ఆగ్రహం రేపుతూ, టీటీడీ విజిలెన్స్పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. -
శ్రీవారిలో సేవలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దంపతులు (ఫొటోలు)
-
దేవుడా... అలసిపోయావా?
అంతర్యామి అలసితి సొలసితి...అంటూ అన్నమయ్య నీరసంగా ఆపసోపలు పడుతూ పాడారే కానీ...ఇపుడు ఆ దేముడికే అలసట వచ్చిపడుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి క్షణం తీరిక దొరకట్లేదు. వేళాపాళ లేకుండా భక్తాదులు వచ్చి వాకిట నిలబడుతుండటంతో వారి ఆలనా పాలనా చూసుకోవాల్సిన పెనుబాధ్యత స్వామి వారి భుజస్కందాలపై ఉంది. అర్ధరాత్రి అపరాత్రి అయినా భక్తులు దర్శనమీయాల్సిందే....మా మొర ఆలకించాల్సిందే అంటూ మొండికేస్తున్నారు. పైగా వడ్డీకాసుల వాడి చెంత ఉత్త చేతులతో ఎలాగూ పోలేరు...పాలకమ్మన్యులు పోనివ్వరు కూడా. పోనీ రాత్రి బాగా పొద్దుపోయాక కాసింత నడుం వాలుద్దామన్నా...కళ్ళు మూసి తెరిచేలోగా సుప్రభాత సేవలు షురూ అయిపోతున్నాయి. అంతలోనే అర్చకులు, భక్తులు కమలాకుచ చూచుక కుంకుమ...అంటూ శ్లోకాలు అందుకుం టున్నారు. స్వామివారు బిక్కమొగం వేసుకుని తన ఇరు దేవేరులను చూస్తూ భక్తులకు విసుగు కనిపించనీయకుండా ప్రసన్నచిత్తులై దర్శనమీవాలి. ఒక్కసారి గమనించండి దేముడికి ఎంత కష్టం వచ్చిందో.అందుకే సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఏంటసలు మీ తీరు...భక్తి సరే...భగవంతుడి మాటేంటి? స్వామి వారిని కనీసం నిద్రకూడా పోనివ్వరా? అనేక దంతం భక్తానాం అంటారా సరే..మరి కోట్లాది మంది భక్తులు నిరంతరం స్వామి చెంత నిలుచునుంటే...దేముడికి కాసింత పర్సనల్ స్పేస్ అక్కర్లేదా? కాసులకు కక్కుర్తిపడి గర్భగుడి తలుపులు వేళలు పాటించకుండా తెరిచేస్తారా? ఇది మీరు దేముడికి చేస్తున్న అపచారం కాదా? అంటూ బృందావన్ లోని బంకీ బిహారీ ఆలయ వ్యవహారంపై మండిపడింది. శక్తి కొద్ది భక్తి అన్నారు కానీ కరెన్సీ కొద్ది భక్తి అనలేదు కదా...మరి డబ్బున్న భక్తుల కోసం ఆ దేముడ్ని ఎందుకండీ ఇబ్బంది పెడతారు అంటూ సుప్రీం సీరియస్ అయ్యింది.బంకీ బిహారీ జీ ఆలయంలో పాలకుల తీరుతెన్ను చూసి మండిపోయిన ఓ భక్తాగ్రేసరుడు సుప్రీం చెంతకు చేరాడు. నాస్వామిని వీళ్ళందరూ రాచి రంపాన పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. దర్శన వేళలతోపాటు ఆలయ సంప్రదాయాల్లో తెచ్చిన మార్పుల్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయడంతో ...సుప్రీం స్పందించక తప్పలేదు. ఆలయవేళల్లో మార్పు చేయడంతోపాటు దెహ్రి వంటి పలు ముఖ్యమైన ఆచారాలను బంద్ చేశారని పిటిషనర్ వాపోయారు. పోనీలే కనీసం ఓ భక్తుడైనా నా గురించి ఆలోచిస్తున్నాడని బంకీ బిహారీజీ అమందానంద కందళిత హృదయారవిందులై ఉప్పొంగి పోయుంటారుఈ సమస్య ఒక బంకీ బిహారీజీ...వేంకటేశ్వస్వామీ...సింహాద్రి అప్నన్న సామిలదే కాదు. అసలే మనకు ముప్పది మూడు కోట్ల దేముళ్ళు. కానీ కొందరికే భక్త పరంపర హెచ్చుగా ఉంటుంది. దాన్ని మనం తర్కించలేం. భక్తుని కష్టాలు భగవంతుడికే తెలుసంటారు...మరి భగవంతుడి కష్టాలు భక్తులకు తెలుసా? కనీసం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతసేపూ సేవలకు సొమ్ముకట్టామా....కాయకొట్టామా....ముడుపులు వేశామా...కొండవీటి చాంతాడంత కోరికల లిస్ట్ స్వామి ముందుంచామా....ఇదే తప్ప...అరె స్వామివారికి మనవల్ల ఎంత మనస్తాపం కలుగుతుంది...అసలు వారికి విశ్రాంతి దొరుకుతోందా అని ఎప్పుడైనా అనుకున్నామా? ఇదేం చోద్యం దేముడికి రెస్ట్ కూడా ఉంటుందా అని కొందరు ఎగతాళి చేస్తుంటారు...మరి ఆ స్లీపింగ్ స్లాటే లేకుంటే...ఉయ్యాల సేవలు...నిద్రపుచ్చే పాటలు ఎలా వచ్చాయండి? అని మరికొందరు లా పాయింటు లేవదీసి మరీ వాదిస్తుంటారు.ఇక తిరుమల వేంకటేశ్వరుడు...వారి భక్తిసామ్రాజ్యం ఎంత సువిస్తారమో....అక్కడ రాజకీయాలు అంతకన్నా విస్తారం. గత వైకుంఠఏకాదశి పుణ్యదినం కోసం ఎందరు భక్తులు టికెట్ల రద్దీలో చితికి ప్రాణాలు వదిలేశారో మనకు తెలుసు కదా. అదే సమయంలో గరికపాటివారి వ్యంగ్య ప్రసంగం తెగ వైరల్ కాలేదూ. అసలు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యం దక్కుతుంది...ముక్తి ప్రాప్తమవుతుందని అశేష ఆస్తికమహాశయుల ప్రగాఢ నమ్మిక. అయితే శక్తి లేనివారిలో భక్తులుండరా? నీ కొండకు నీవే రప్పించుకో...ఆపదమొక్కలు మాతో ఇప్పించుకో అని ఘంటసాల ఎంత ఆర్డ్రంగా పాడారు. భక్తుడు రావాలా...లేదా తనే ఆతని వద్దకు వెళ్లాలా అని డిసైడ్ చేయాల్సింది భగవంతుడు. కానీ మన సర్కారు మహత్తరంగా...ప్రచారాలు చేసి మీకు మోక్షం దక్కాలన్నా...పున్నెం రావాలన్నా తెల్లారు జాము ఉత్తర దర్శనం తప్పని సరి అది ఈరోజే అంటూ ఊదరగొట్టినందుకే కదా తొక్కిసలాట...మరణాలు సంభవించింది. దీని పై సర్కారు స్పందన ఉండదు....కానీ లడ్డూలో కల్తీ అంటూ రాజకీయం చేయడానికి సిద్ధం. సాక్షాత్తు సుప్రీం కోర్టే సర్కారును నిలదీసి...తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రచారాలు ఎలా చేస్తారు? భక్తుల మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ.. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. తన మహాప్రసాదం...భక్తులు భక్తితో కళ్లకద్దుకుని స్వీకరించే లడ్డూపైన వివాదలు పుట్టించడం గమనించిన ఆ దేవదేవుడి మనసు ఎంత వ్యాకులత చెంది ఉంటుందో కదా. అయినా ఆలయాల్లో రాజకీయాలేంటి అని స్వామివారు చిరాకుపడ్డా ఇపుడు లాభం లేదు. ఎందుకంటే తిరుమల ఆ దశను దాటిపోయింది. అక్కడ ప్రతీది రాజకీయమే. దర్శనంతో మొదలు లడ్డూ దాకా...భక్తుని మొదలు పాలక మండలి దాకా అంతా రాజకీయమే. ఇంత జరుగుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదంటే అది స్వామివారి వైభవం...వైభోగం అంతే. ఒక తిరుపతే కాదు దేశంలో ఏ ఆలయమైనా భక్తులతో కిటకిటలాడుతునే ఉంటుంది. ఈ దేశంలో మనుషులతో కిక్కిరిసి కనిపించేవి రెండే రెండు...ఇకటి ఆలయం...రెండోది ఆసుపత్రి.ఏది ఏమైనా సుప్రీం జోక్యంతో అయినా బంకీ బిహారీ జీ ...తిరుపతి వెంకన్నలకు కాసింత ఊరట లభిస్తే అదే పదివేలు.:::ఆర్ఎం -
కుటుంబంతో తిరుమల శ్రీవారి సేవలో రజనీకాంత్..
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ (ఫొటోలు)
-
Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు విక్రమ్ ప్రభు (ఫోటోలు)
-
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనానికి 15 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. సర్వదర్శనానికి 10 గంటలు. ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,142 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 26,619 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్లు. -
నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం. నిన్న శ్రీవారిని 75,343 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 26,505 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.69 కోట్లు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి పేర్నినాని
-
చెత్త కొండ అంటావా? సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలి
-
తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం
తిరుమల: తిరుమలలో శుక్రవారం డ్రోన్ కెమెరా కలకలం రేపింది. టీటీడీ మూడంచెల భద్రతను దాటుకుని ఓ భక్తుడు కెమెరాతో వచ్చాడు. వివరాల్లోకెళ్తే.. జైపూర్‌కు చెందిన శుభం ఖండేల్వాల్ అలియాస్ సర్వలక్షణ్ దాస్, ఒంగోలుకు చెందిన భాను సుందర్ అలియాస్ అర్జున్ బంద్ దాస్ అమెరికాకు చెందిన ప్రవాస భారతీయులు. వీరు శ్రీవారి దర్శనార్థం శుక్రవారం తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రత తనిఖీలను దాటుకుని తిరుమలకు డ్రోన్ కెమెరాను తీసుకొచ్చారు. శుభం ఖండేల్ వాల్ స్థానిక శిలాతోరణం వద్ద డ్రోన్ ఎగురవేసి చిత్రీకరించడం ప్రారంభించాడు. దీనిని గుర్తించిన భక్తులు.. టీటీడీ భద్రతాధికారులకు సమాచారం అందించగా, వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్‌లో చిత్రీకరించిన వీడియోలను పరిశీలించి వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. -
లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలా?
తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై దాడి చేయించడం చంద్రబాబుకు పరిపాటే. ఏకంగా న్యాయవ్యవస్థపైనే దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దుష్ప్రచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా?’’ - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘‘జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని అన్నావ్..! వాటికి ఆధారాలు దొరికాయా..?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల వెంకటేశ్వరస్వామి విశిష్టతను అభాసుపాలు చేస్తావా బాబూ? అంటూ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. బెయిల్‌పై ఉన్న చంద్రబాబు షరతులను ఉల్లంఘిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీసేయించుకుంటున్నారని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా బాబూ..? చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా! టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. వాటిని భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లాయా? వీటికి ఆధారాలున్నాయా? టీటీడీలో ఒక బలమైన తనిఖీ వ్యవస్థ (రోబస్ట్ ప్రొసీజర్) ఉంది. టీటీడీకి వచ్చే ఏ నెయ్యి ట్యాంకర్ అయినా ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లా»ొరేటరీస్) సర్టిఫికేషన్‌తోనే రావాలి. ఇది దశాబ్దాలుగా టీటీడీలో పాటిస్తున్న నిబంధన. ఈ సర్టిఫికెట్ లేకుండా తిరుమలలోకి ట్యాంకర్లు రావు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు. టీటీడీకి ఒక సొంత ల్యాబ్ కూడా ఉంది. ఆ ల్యాబ్‌లో మళ్లీ టెస్టు పాస్ అయితేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించి, వెనక్కి పంపిస్తారు. ఇలా గతంలో చంద్రబాబు హయాంలో 15 సార్లు వెనక్కి పంపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపారు. టీటీడీలో బలమైన తనిఖీ వ్యవస్థ ఉందని, సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. అలాంటప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడిది? కల్తీ నెయ్యి వాడితే నీ వైఫల్యం కాదా బాబూ? చంద్రబాబు హయాంలో, ఆయన నియమించిన టీటీడీ ఈవో టైమ్స్ నౌలో(ఈవో మాట్లాడిన వీడియో ప్రదర్శించారు) స్వయంగా ఆ ట్యాంకర్ల నెయ్యిని వినియోగించలేదని చెప్పారు. సెపె్టంబర్ 20, 2024న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నియమించిన టీటీడీ ఈవో.. నాలుగు నెయ్యి ట్యాంకర్లు టెస్టులు పాస్ కాకపోవడంతో రిజెక్ట్ చేసి వెనక్కి పంపించామని ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన హయాంలో జూలైలో∙4 ట్యాంకర్లు తిప్పి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయట! మరి అప్పుడు సీఎం ఎవరు? చంద్రబాబు కాదా..? ప్రభుత్వాన్ని నడిపేది ఆయన కాదా..? గతంలో రిజెక్టు చేసిన నెయ్యి ట్యాంకులు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వినియోగించారని సిట్ రిమాండ్ రిపోర్టులో రాసింది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరిని లోపల వేయాలి? ఇదే నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఆ నెయ్యి ట్యాంకులు ఎలా తిరిగి వచ్చాయి? చంద్రబాబు చెప్పినట్టుగా ఆ నెయ్యిని వాడి ఉంటే అది ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, అప్పటి టీటీడీ ఈవో ఇద్దరూ ఏం చేస్తున్నారు? వాళ్లిద్దరిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయలేదు? పైగా మాపై నిందలు వేస్తారా? చంద్రబాబు ముఠాకు దేవుడంటే భయం, భక్తీ లేదు. దుర్మార్గమైన అసత్యాలు ప్రచారం చేయడమే వీళ్ల పని. పైగా చంద్రబాబు వేసిన సిట్.. వ్యక్తులను ఇరికించాలనే ఆరాటం, తపన, తాపత్రయంతో తప్పులపై తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. 2014–19 మధ్య కిలో నెయ్యి రూ.276–రూ.314మరి అదంతా కల్తీ నెయ్యేనా బాబూ? స్వచ్ఛమైన నెయ్యి రూ.320కే మీరు ఎలా సప్లయ్ చేయిస్తారు? అని చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో రూ.3 వేలు అవుతుందని ప్రకటించారు. చంద్రబాబు గెజిట్ పత్రిక ఈనాడు అయితే కనీసం రూ.1,000–రూ.1,600 అని రాసింది. మరి టీటీడీలో ఇప్పుడు నెయ్యి ఎంతకు కొంటున్నారు? రూ.3 వేలు ఇస్తున్నారా? రూ.1,600 లేక రూ.1,000 ఇచ్చి కొంటున్నారా? 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ కిలో నెయ్యి రూ.276–314 మధ్య కొన్నాడు. ఇది రూ.320 కంటే తక్కువ కదా? కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. పైగా భోలే బాబా డెయిరీ విషయంలో చేస్తున్న దు్రష్పచారం అంతా ఇంతా కాదు. 2018 జూన్ 26న టీటీడీ బోర్డు మినిట్స్ చూస్తే భోలేబాబా ఎవరో తేలింది. హర్‡్ష ఫ్రెష్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది. ఈ సంస్థ టీటీడీకి పాలు సప్లై చేయడానికి డీమ్డ్ టు క్వాలిఫై అని సర్టిఫై చేసింది చంద్రబాబు హయాంలోనే. తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లయ్ చేస్తుంటాయి. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తుంటారు. ఎవరు తక్కువకు కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రొసీజర్. టెండర్లలో ఎల్–1 ఎవరుంటారో వారికి కేటాయిస్తారు. ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడానికి వీళ్లు ప్రయతి్నస్తున్నారు. నెయ్యిని సప్లై చేసే ఏ కంపెనీ అయినా కచ్చితంగా ఏన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకోవాలి, టీటీడీలో ఉన్న ల్యాబ్‌లో టెస్టులు పాసవ్వాలి. అప్పుడే ట్యాంకులు లోపలకు వెళ్తాయి. దుష్ప్రచారం ఆపాలని సుప్రీంకు వెళ్లింది మేం కాదా? టీటీడీ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం ఆపాలని, నిజాలు బయటకు తీసుకురావాలని సుప్రీం కోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ వాళ్లు కాదు. అలాంటిది.. సుబ్బారెడ్డిపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఎప్పుడైనా వెళ్లారా? హైదరాబాద్‌లో ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఆయన 1978 నుంచి 35–40 సార్లు అయ్యప్పమాల ధరించి కొండకు వెళ్లి ఉంటారు. అందులోనూ ఆయనది గురుస్వామి స్థానం. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో మీకే తెలియాలి. టీటీడీలో స్కాములన్నీ బాబువే! పరకామణి కేసులో దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు రూ.14 కోట్లు విలువైన ఆస్తులను దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా? దేశంలో అనేక చోట్ల, అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. కానీ, ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. తిరుపతి కోర్టులో చార్జిషీట్ వేశారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్నీ కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్టు ప్రొసీజర్‌తో జరిగాయి. జ్యుడీషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో సాంకేతిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు తప్పులేదు. కానీ, రాజకీయాల కోసం ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నాడనో.. భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నాడనో.. వారి మీద బురదజల్లాలని తప్పుడు స్టేట్మెంట్ కోసం అక్కడ పనిచేస్తున్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేశారు. ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత తప్పుడు కథనాలు రాయించారు.మీ హయాంలో పట్టుకోలేదేం బాబూ? ఆ దొరికిన దొంగ... 30 ఏళ్ల నుంచి జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్ల నుంచి పాల్గొంటున్నాడు. కొత్తగా మా ప్రభుత్వంలో వచి్చన వ్యక్తి కాదు. మరి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు పట్టుకోలేకపోయారు? ఆ దొంగను మేం పట్టుకున్నాం. వాస్తవానికి మేం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో తిరుమల హుండీ డబ్బు లెక్కింపు ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేశాం. దేవుడి సొమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త పరకామణి బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. దాన్ని సీఎం హోదాలో నేను ప్రారంభించా. 2023 ఫిబ్రవరి 5 నుంచి ఆ బిల్డింగ్‌లో పూర్తి స్థాయి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాత భవనంలో అరకొరగా సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే. బ్లయిండ్ స్పాట్స్ ఎక్కువ. వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో 360 డిగ్రీల కవరేజ్‌తో 4కే హెచ్డీ సీసీ టీవీ వ్యవస్థలు, హైబ్రీడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ తెచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత ఏప్రిల్ 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు మంచివారు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా..? ఆ వ్యక్తి దశాబ్దాలుగా ఇదే పనిచేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ చంద్రబాబు హయాంలో ఎవరూ పట్టుకోలేదు. మా హయాంలో పట్టుకున్నాం. గతంలో ఏం జరిగిందో దేవుడికే తెలుసు. రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లు దొరికితే.. ఏకంగా రూ.14 కోట్ల ఆస్తిని ఆ కుటుంబం దేవుడికి రాసిచ్చింది. న్యాయ వ్యవస్థపైనే దాడి..! చంద్రబాబు తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై సైతం దాడి చేయించడం పరిపాటే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి వర్ల రామయ్యతో మాట్లాడిస్తున్న మాటలు న్యాయ వ్యవస్థపై దాడి చేయించినట్లే! (వర్ల వీడియోను ప్రదర్శించారు)! ‘‘23–9–2025: ప్రాపర్టీ ఓనర్ ఎవరు? కోర్టు కూడా తప్పు చేసిందా.. అనుమానం వస్తుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరుతున్నా.. మీ తరఫున దర్యాప్తు చేయించాలి. ఈ కేసులు సీరియస్. ఎందుకు లోక్ అదాలత్‌తో దర్యాప్తు చేయిస్తారు? తిరుపతిలో రూమర్స్ వస్తున్నాయి. ఈ జడ్జిగారికి పైనుంచి ఎవరో మరో జడ్జి చెప్పారట. నేను జడ్జి ఎవరని అడగట్లేదు. అందరం మనుషులమే. ఈ జడ్జికి పైనుంచి ఎవరో జడ్జి చెప్పారట. ఏ జడ్జి చెప్పినా.. ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేసినా.. అన్యాయం జరిగింది మాత్రం స్వామి వారికే. 13–11–2025: తమిళనాడులో రిజిస్టర్ చేశారట ఆస్తులు. దీని వెనుక జడ్జి ఉన్నారని చెబుతున్నారు. రూ.50 లక్షల స్టాంపు డ్యూటీ కట్టారట. ఆ రూ.50 లక్షలు ఎవరు కట్టారు? జడ్జిలు, టీటీడీ అధికారులపై నిందలు సిగ్గుచేటు.. ఇలా ఏకంగా న్యాయవ్యవస్థపైనే చంద్రబాబు దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దు్రష్పచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా? తిరుమలకు పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తుంటారు. ఇలాంటి కేసులు ఏమైనా జరిగినప్పుడు తిరుపతిలో ఉన్న జడ్జిలు, సుప్రీం కోర్టు జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటారు. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో, దేశం మొత్తం చూస్తున్న కేసులో సలహాలు కోరతారు. జ్యుడీషియల్ పరిధిలో సలహాలు తీసుకుంటారు. ఏ తప్పూ జరగలేదు, ఏ తప్పూ చేయలేదు కాబట్టి సలహాలు తీసుకొని, ఇంప్లిమెంట్ చేశారేమో..! దాంట్లో రాజకీయం చేయడానికి ఏముంది? జడ్జిలపై, టీటీడీ అధికారులపై నిందలు వేయడం సిగ్గుచేటు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? టీడీపీ స్టాండ్ ఎలా ఉంటుందంటే.. ఈ ఏడాది సెపె్టంబర్ 1న చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, అత్యంత విశిష్టత కలిగిన సింహాచలంలో రూ.55 వేలు హుండీ డబ్బులు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ను పోలీసులకు అప్పగించి, ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఆ వ్యకిని ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు దీనిపై ఎందుకు విచారణ చేయలే దు? మొత్తం వారిద్దరి ఆస్తులపై విచారణ చేసి, వాటిని మొత్తం ఎందుకు స్వా«దీనం చేసుకోలేదు? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉంటే ఒక న్యాయం..! అదే అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం..! మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు? ఎక్కడైనా న్యాయం ఒక్కటే కదా!!టీటీడీలో బాబు స్కాములు ఇవీ...!రాష్ట్రంలో దేవుడి సొమ్ముతో స్కామ్‌లు చేసింది చంద్రబాబే. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిలతీర్థం వరకు శ్రీనివాస సేతు 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపాదన చేశారు. ఇందులో 67 శాతం ఖర్చు టీటీడీ, 33 శాతం ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించారు. అప్పటి తిరుపతి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను చంద్రబాబు పిలిపించుకుని రూ.684 కోట్లతో శ్రీనివాససేతు కట్టేయమని చెప్పారు. అయితే, ఆ మీటింగ్‌లో టీటీడీ ప్రతినిధులు లేకుండానే.. ఏకంగా 67 శాతం డబ్బులు టీటీడీ నుంచి తీసుకునేలా నిర్ణయం తీసేసుకున్నారు. అసలు బోర్డు అనుమతి, ఆమోదం లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఇది కాదా స్కామ్? మన ప్రభుత్వం వచ్చాక టీటీడీ బోర్డు రీ విజిట్ చేసి రూ.40 కోట్లు ఖర్చు తగ్గించింది. కొత్త బోర్డు రాకపోయి ఉంటే ఆ రూ.40 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయేవి? కమీషన్ల కోసం కక్కుర్తి! టీటీడీ డబ్బుల్లో 10 శాతానికి మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది టీటీడీ రూల్. చంద్రబాబు హయాంలో కమీషన్లకు కక్కుర్తిపడి రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్‌లో పెట్టించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచి్చన తర్వాత బోర్డు ఆ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బును విత్ డ్రా చేసి జాతీయ బ్యాంకులో పెట్టింది. ఆ తర్వాత మూడు నెలలకు ఎస్ బ్యాంక్ ఆర్థికంగా కుదేలయ్యింది. ఒకవేళ చంద్రబాబు పెట్టిన రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్‌లోనే ఉండి ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది? మరి ఏది స్కామ్? మాకు ఇవన్నీ తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాల్లో లాగకూడదని సమస్య పరిష్కరించి, సరిదిద్దాం. మన ఇప్పుడు వీళ్లు చేసేవి చూస్తుంటే అసలు ఏమీ జరగకపోయినా, మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తూ, రివర్స్ అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి టీటీడీ ఒక స్వతంత్ర వ్యవస్థ. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విధానాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేస్తున్నారు. అలాంటి ఆలయాన్ని, ఏకంగా దేవుడి ప్రతిష్టను మంటగలుపుతున్నామనే కనీస ధ్యాస కూడా లేకుండా, వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తూ చంద్రబాబు అత్యంత హేయమైన రాజకీయాలు చేస్తున్నారు. అది చంద్రబాబు సొంత సిట్! లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు వేసిన సిట్ చూస్తే వాళ్ల బాగోతం తెలిసిపోతుంది. సిట్‌లో ఉన్న గోపీనాథ్ జెట్టి.. ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పని చేసిన కృష్ణయ్యకు అత్యంత సమీప బంధువు (ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో దిగిన ఫొటో ప్రదర్శించారు). కృష్ణయ్యపై చంద్రబాబుకు ఎంత ప్రేమ అంటే.. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పెట్టుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్‌ను చేశారు. ఇలాంటి వ్యక్తి సమీప బంధువు సిట్ ఆఫీసర్లలో ఒకరు. మరో ఆఫీసర్ డీఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ట త్రిపాఠి ఎలాంటి వాడో చెప్పాల్సిన పనిలేదు. పల్నాడు జిల్లాలో ఆయన సృష్టించిన అల్లకల్లోలం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం భుజాన వేసుకుని పాకులాడారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ అధికారిని పక్కన కూర్చోబెట్టుకుని డీఐజీ స్థానం ఇచ్చి.. ఆయన చేస్తున్న మాఫియా కలెక్షన్లలో ప్రముఖ ప్రధాన పాత్ర ఇచ్చారు. ఇలాంటోళ్లు అందరూ సిట్‌లో ఉన్నారు. మరోవైపు వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అతను వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) పీఏ. వీపీఆర్ ఒక టీడీపీ ఎంపీ. ఆయన దగ్గర నుంచి ప్రతి నెలా అప్పన్న జీతం (చెక్కులు) తీసుకుంటున్నాడు. పైగా ఏపీ భవన్ ఉద్యోగి. వీపీఆర్ పీఏ, తర్వాత ఏపీ భవన్ ఉద్యోగి. మరి వైవీ సుబ్బారెడ్డి పిక్చర్లోకి ఎలా వచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఎంతసేపూ వైవీ సుబ్బారెడ్డి పీఏ అని గోబెల్స్ ప్రచారం చేస్తూ డ్రిల్ చేస్తున్నారు!. -
టీటీడీ లడ్డు వ్యవహారం: శ్యామల రావు వ్యాఖ్యలపై వైఎస్ జగన్
-
సింహాచలం చోరీ కేసు.. అశోక గజపతి మాటేంటి?
తాడేపల్లి, సాక్షి: దేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చేసిన ఆరోపణలే అందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారు. ఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?. తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్‌తోనే రావాలి. సర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్‌ల్లోనూ పరీక్షలో నెగ్గాలి. ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారు..అలా మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం. పకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది..అలాంటప్పుడు టీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?. ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? మరి తక్కువ ధరకు కొన్నారు కాబట్టి కల్తీ నెయ్యే అనుకోవాలా?.లడ్డూ ప్రసాదంలో దుష్ప్రచారాలు ఆపాలని.. నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిందే వైవీ సుబ్బారెడ్డి. ఆయన అపర భక్తుడు. నిత్యం గోపూజలు చేస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేసి గురుస్వామి అయ్యారు. అలాంటి వ్యక్తిని ఈ కేసుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పన్న సుబ్బారెడ్డి పీఏ అంటూ ప్రచారం చేశారు. ఆయన అప్పన్న అసలు ఎవరు?. ఏపీ భవన్ ఉద్యోగి. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి పీఏ. అధికార పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తి. ఎల్లో మీడియా ఎందుకు వైవీ సుబ్బారెడ్డి పీఏగా బోగస్ ప్రచారం చేస్తున్నాయి?. చంద్రబాబు లడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌లో ఏర్పాటు చేసిన అధికారులంతా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే. టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా కీలకంగా ఉన్నవాళ్లే.పరకామణి కేసులో.. పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి. అంతా పద్దతి ప్రకారమే జరిగింది. నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు. పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. దొంగను పట్టుకోవడం నేరమా?.. ఒక బీసీ పోలీస్ అధికారిని వెంటాడి.. వేధించి.. చనిపోయేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు.. అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీ జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీన రమణ, సురేష్ అనే ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారు. వీళ్లిద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. అలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదు?. విచారణ జరిపి పరకామణి కేసులా ఆస్తుల్ని స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు. సింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి. మరి ఆయన్ని విచారించారా?. వైవీ సుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా?.. అని ప్రశ్నించారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని టీటీడీలో రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు. ఇది ధర్మమేనా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. -
వివాదాల రాజేంద్ర ప్రసాద్.. ఆ విషయంలో ఏకైక వ్యక్తిగా ఘనత..!
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన చేస్తున్న కామెంట్స్. ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఆయన చేస్తున్న కామెంట్స్ కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారుతున్నాయి. డేవిడ్ వార్నర్ నుంచి బ్రహ్మనందం వరకు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. దీంతో ఆయనపై పలువురు నెటిజన్స్ మండిపడ్డారు. ప్రతిసారి ఇలా నోరు జారడం అలవాటైపోయిందని ఫైరయ్యారు.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా పేరున్న రాజేంద్ర ప్రసాద్ ప్రతిసారి అలా మాట్లాడడం చూస్తుంటే అభిమానులే షాకవుతున్నారు. ఒక్కోసారి అసలు ఆయనకు ఏమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఈవెంట్స్‌లో తప్పుగా మాట్లాడడం.. ఆ తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏకైక నటుడిగా ఘనత..అయితే ఇటీవల కొద్ది కాలంగా తన మాటలతో ట్రోల్స్‌కు గురవుతున్న రాజేంద్ర ప్రసాద్ ఓ మంచిపని కూడా చేశాడు. పవిత్రమైన తిరుమల సన్నిధిలో భక్తుల వసతి కోసం కాటేజీ నిర్మించినట్లు తెలిసింది. టి. సుబ్బరామిరెడ్డి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఈ కాటేజీ నిర్మించానని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా తిరుమల కొండపై కాటేజీ నిర్మించిన ఏకైక నటుడిగా రాజేంద్ర ప్రసాద్ ఘనతను సొంతం చేసుకున్నారు. -
తిరుమలలో జనసేన గొడుగు.. మండిపడుతున్న భక్తులు
తిరుమల: తిరుమలలో వర్షం కురవడంతో సోమవారం ఓ భక్తుడు జనసేన పార్టీకి సంబంధించిన గొడుగును శ్రీవారి ఆలయం ముందు వేసుకుని వెళ్లడం విమర్శలకు దారి తీసింది. తిరుమలలో రాజకీయ నాయకుల బొమ్మలు కానీ గుర్తులకు కానీ అనుమతి లేదు. ఎలాంటి ప్రచారాలకు తావు లేకుండా కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ తరుణంలో జనసేన పార్టీ గొడుగును చూసిన భక్తులు మండిపడుతున్నారు. -
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే..
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా ఈ-డిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశితో పాటు డిసెంబర్ 31, జనవరి 1 దర్శనం టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈ మూడు రోజులలో దాదాపు 1.80 లక్షల టోకెన్ల కోసం 24 లక్షల మంది భక్తులు ఈ-డిప్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. 9.6 లక్షల ఖాతాల నుంచి 24,05,237 లక్షల మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. డిసెంబరు 2న మధ్యాహ్నం 2 తర్వాత నిర్వహించే ఈ-డిప్ లాటరీలో ఎంపికైన భక్తులకు మెసేజ్ అందుతుంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. ఈ ఏడు రోజులకు సంబంధించి రోజుకు 15వేల చొప్పున రూ.300 దర్శనం టోకెన్లు డిసెంబరు 5వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. -
లక్కుంటేనే దర్శనమా?
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)
-
మీ వద్ద ఆధారాలు ఉంటే నేను సిద్దమే YV సుబ్బారెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
‘టీటీడీలో గత పదేళ్ల నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ చేయాలి’
న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాలకు ఇకనైనా ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. తిరుమల ప్రసాదంపై పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకని మాట్లాడితే మంచిదన్నారు. లడ్డూ ప్రసాదంపై జంతువుల కొవ్వు ఆరోపణలపై సిట్ ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఈరోజు(గురువారం, నవంబర్ 27వ తేదీ) న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. తిరుమల లడ్డూ విషయంలో తాము ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ప్రసాదం టెస్టింగ్ విసయంలో పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా కల్తీ జరుగుతుందన్నారు. తమ హయాంలో నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించామని, టీటీడీలో 15 ఏళ్లుగా ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాలన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించామన్నారు. ఈవో, చంద్రబాబులు తిరుమల లడ్డూ వివాదంపై పరస్పర విరుద్ధ ఆరోపణలు చేశారని, దానిపై ఇప్పటివరకఊ సిట్ క్లారిటీ ఇవ్వలేదన్నారు. తిరుమల లడ్డూ అంశంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎవరి మీద బురద జల్లుతున్నారని ప్రశ్నించారు. 2019-2024 వరకూ తయారైనా లడ్డూలన్నీ కల్తీ చేసినట్లు తప్పుడు ప్రచారాలకు దిగారన్నారు. రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి.. కోట్లాడి మంది భక్తుల మనోభవాలను దెబ్బతీస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో భక్తుల కానుకలను ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసిన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. గత పది ఏళ్ల నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ చేయాలిటీటీడీలో గత పది ఏళ్ల నెయ్యి కొనుగోళ్లపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు వైవీ సుబ్బారెడ్డి. ‘ 2014 నుంచి జరిగిన నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ జరపాలి. 2024 ఆగస్టులో బాబు హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు..దానిపై సమాధానం చెప్పాలి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. మేము, మా కుటుంబం ఎవరివద్ద డబ్బు తీసుకోలేదు. నేను లై డిటెక్టర్ పరీక్ష కు సిద్ధం. సత్య శోధన పరీక్షకు సిద్ధంగా ఉన్నా. నేను ఏ అవినీతికి పాల్పడలేదు. అలాగే, ఎస్ బ్యాంక్ లో టీటీడీ డబ్బు డిపాజిట్లు, శ్రీనివాస సేతు వ్యవహారంపై దర్యాప్తు చేయాలి. అప్పన్న నా పిఎ కాదు. ఆయనకు నాకు సంబంధం లేదు. అప్పన్న ఎంపీ వేమిరెడ్డి దగ్గర పని చేశారు’ అని తెలిపారు. -
తిరుమల: నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల
తిరుమల.: వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి నేడు(గురువారం, నవంబర్ 27 వ తేదీ) వైకుంట ద్వార దర్శన టికెట్ల విడుదల చేయనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు నుండి ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్టేషన్‌కు అవకాశం కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తొలి మూడు రోజులకు దర్శన టోకెన్ల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. .డిసెంబర్ 1వ తేదీ వరకు ...5 రోజుల పాటు టీటీడీ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, ప్రభుత్వ WhatsApp సర్వీసెస్ ద్వారా నమోదుకు అవకాశం కల్పించనుననారు. ఈ-డిప్ లో టోకన్ పొందిన భక్తులకు డిసెంబర్ 2వ తేదీన సందేశం వస్తుంది. .డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి, 31 ద్వాదశి, జనవరి1 న త్రయోదశి రోజులలో టికెట్లు ఉన్న వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పిస్తారు. దీనిలో భాగంగా .జనవరి 2 నుండి 8 తేది వరకు సర్వదర్శనంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8 తేది వరకు ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు. -
తిరుచానూరులో వైభవంగా రథోత్సవం
-
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ కారు
సాక్షి, తిరుమల: తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో ఈ రోజు ఉదయం కారు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో స్వల్ప గాయాలతోనే భక్తులు బయటపడ్డారని తెలుస్తోంది.సమాచారం ప్రకారం.. మొదటి ఘాట్ రోడ్డులోని 2వ కిలోమీటర్ మైలురాయికి సమీపంలో బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ కారులో ఉన్న భక్తులు తమిళనాడుకు చెందిన వారు కాగా తిరుమలకు పర్యటన కోసం వచ్చారు. అయితే కారులో ఉన్న వారందరూ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు.ఇదిలా ఉంటే ఈ ఘటన కారణంగా ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. కారు బోల్తా పడి రోడ్డుకు అడ్డంగా ఉండటంతో తిరుమల వెళ్లే భక్తుల వాహనాలకు మరింత ఆలస్యం ఏర్పడింది. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యను పరిష్కరించారు. గాయపడిన భక్తులను తక్షణమే ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. -
తిరుమల శ్రీవారి సేవలో నటి నిక్కీ గల్రానీ.. ఫోటోలు
-
తిరుమల ప్రసాదంపై కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన శివజ్యోతి
-
తిరుమల ప్రసాదంపై వ్యాఖ్యలు.. వివాదంలో 'శివ జ్యోతి'
యాంకర్ శివ జ్యోతి తరచుగా సోషల్‌మీడియాలో ట్రోల్స్ గురౌతూనే ఉంటారు. బిగ్‌బాస్‌తో మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్, పలు ప్రమోషన్స్‌తో బిజీగానే ఉన్నారు. అయితే, తాజాగా తన భర్తతో కలిసి తిరుమల వెళ్లారు. అక్కడ టీటీడీ అందించే ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె మరో వివాదంలో చిక్కుకున్నట్లు అయింది.తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్లో శివ జ్యోతితో పాటు తన సోదరుడు, భర్త ఉన్నాడు. సాధారణంగా దర్శనం కోసం క్యూలో ఉన్న భక్తల కోసం దేవుడి ప్రసాదంగా సాంబార్ రైస్, పెరుగు అన్నం టీటీడీ అందిస్తుంది. ఈ క్రమంలో ఆమె సోదరుడు భక్తుల కోసం ఇచ్చే అన్నప్రసాదం తీసుకుంటుండగా శివ జ్యోతి నోరుపారేసుకుంది. సోనీ కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ప్రెండ్స్ అంటూ కామెంట్ చేసింది. ఆపై ఆమె సోదరుడు కూడా తాను జీవితంలో ఎప్పుడూ కూడా అడుక్కోలేదని.., ఫస్ట్ టైమ్ ఇలా అడుక్కుంటున్నాను అంటూ ఆ వివాదాన్ని మరింత పెద్దది చేశాడు. తిరుపతిలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం తామేనని అంటూ తన భర్తతో శివ జ్యోతి కూడా మరోసారి మాటలు తూలింది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దేవుని ప్రసాదం విషయంలో ఇలాంటి చిల్లర కామెంట్లు ఏంటి అని ఏకిపారేస్తున్నారు. ఈ ఘటనపై శివ జ్యోతి క్షమాపణలు చెప్పే ఛాన్స్ ఉంది.బిడ్డ కోసం వెంకటేశ్వర స్వామిని పూజించిన శివ జ్యోతిశివ జ్యోతి ప్రేమ వివాహం చేసుకుంది. తనకు పిల్లలు కలగకపోవడంతో ఆమె చాలాసార్లు ట్రోలింగ్‌కు కూడా గురైంది. ఎన్నోసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకుంది. తిరుమల వెంకన్నను పూజిస్తే తప్పకుండా తన కోరిక తీరుతుందని ఆమెకు కొందరు సలహా ఇవ్వడంతో.. స్వామికి ఇష్టమైన సప్త శనివార వ్రతం చేసింది. 7 శనివారాల పాటు తన ఇంట్లోనే చాలా నిష్టగా పూజలు చేసింది. స్వామి దయతోనే తనకు బిడ్డ కలుగుతుందని ఒక వీడియో పోస్ట్ చేసింది. జీవితాంత స్వామి సేవలోనే ఉంటామని చెప్పింది. ఎన్నో పూజలు చేసినప్పటికీ కలగని సంతోషం సప్త శనివారం వల్ల తమ కోరిక తీరిందని పంచుకుంది. తిరుమల వెంకన్నను అంత భక్తితో పూజించిన శివజ్యోతి ఇప్పుడు దేవుడి ప్రసాదం గురించి తప్పుగా మాట్లడటంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే, కొందరు తెలియకనే నోరు జారిందని చెబుతున్నప్పటికీ ఆమె చేసింది ముమ్మాటికి తప్పేనని అంటున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము
సాక్షి, తిరుపతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద అర్చకులు ఇస్తీకఫల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున రాష్ట్రపతికి చిత్రపటాన్ని అందించారు.భక్తులకు చాక్లెట్లు పంచిన ముర్ముతిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనూహ్య చర్యకు దిగారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుగు పయనంలో ఆమె రాంభకిచా వద్ద తన కాన్వాయ్‌ను ఆపారు. వాహనం దిగిన ఆమె కరచలనం చేస్తూ స్వయంగా భక్తులకు చాక్లెట్లు పంచారు. ఈ క్రమంలో.. ఆమె కాన్వాయ్ దిగడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే.. రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురవారమే తిరుమల చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బస చేసిన ఆమె.. అంతకు ముందు తిరుచానూరు వెళ్లి శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి కాసేపట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి
-
బ్రహ్మోత్సవాలలో ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు
తిరుపతి, తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో టిటిడి చేపట్టిన విద్యుత్ అంలకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుచానూరు పరిసర ప్రాంతాలలో, తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయి. బ్రహ్మోత్సవాల రాత్రుల సమయాలలో పండుగ వాతావరణాన్ని మరిపిస్తున్నాయి.శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చిన్న, పెద్ద, మధ్య తరహా అమ్మవారి, స్వామి ప్రతిమలు దాదాపు 112కు పైగా అద్భుతమైన ఇల్యూమినేషన్ పనులు చేపట్టారు. ఈ సారి కొత్తగా తిరుచానూరు ఆస్థాన మండపం వద్ద అమ్మవారి ఆభరణాలు, ఆస్థాన మండపం ఎదురుగా అభిషేక లక్ష్మీ 3 డి విద్యుత్ ప్రతిమలను, పుష్కరిణి దక్షిణం వైపున గజ వాహనం, పుష్కరిణి తూర్పు వైపు త్రిముఖం, ఫ్లైఓవర్ సమీపంలో గోపురం లక్ష్మీ, తలుపుల మహా విష్ణు రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.పుష్కరిణి చుట్టూ 8 అష్ట లక్ష్మీ విద్యుత్ విగ్రహాలు, అన్నదానం సమీపంలో ధన లక్ష్మీ, పూడి సమీపంలో రాధాకృష్ణ, మార్కెట్ యార్డ్ వద్ద గడప లక్ష్మీ, అదేవిధంగా తిరుచానూరు పరిసర ప్రాంతాలలో మహా విష్ణు, గరుడ వాహనంపై స్వామి వారు, అమ్మవారు, కలశ లక్ష్మీ, విష్ణువు, లక్ష్మీ, అయోథ్య రాముడు, అష్ట లక్ష్మీలతో మహా విష్ణువు, విశ్వరూపం, అష్ట లక్ష్మీలు, లక్ష్మీ, సరస్వతి, వినాయకుడు, దశ విగ్రహాలు, ఎల్.ఈ.డి తోరణాలు, ఎల్.ఈ.డితో డిజైన్ చేసిన ఆర్చ్ లను ఏర్పాటు చేశారు. పద్మ సరోవరం లోపలి భాగంలో నాలుగు వైపులా జలపాతం ప్రవాహం వస్తున్నట్లు విద్యుత్ కాంతులు అదనపు ఆకర్షణ.తిరుచానూరు పరిసరాలు రాత్రుల సమయాలలో రజతంలా మెరిసిపోతున్నాయి. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక శోభను అందిస్తూ, భక్తుల హృదయాలను ఆకర్షిస్తున్నాయి. తిరుచానూరు అంతటా విద్యుత్ కాంతుల వెలుగులు భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. -
తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి
తిరుపతి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీమతి జానకీ దేవి, శ్రీ భానుప్రకాశ్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో శ్రీ చె. వెంకయ్య చౌదరి పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానం పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు తదితర జిల్లా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు రాష్ట్రపతికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. -
ముత్యపు పందిరి వాహనంపై అమ్మవారు
-
అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
సాక్షి,తిరుమల: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం ఉదయం 6.30 గంటలకు నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9.15 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు.టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి. మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో హరింద్రనాథ్, కంకణ భట్టార్ పి. శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబు స్వామి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈవో శ్రీ శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ, సోమవారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు.శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన బాగా ఉందని, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు. ఇదిలా ఉండగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. -
తిరుపతిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)
-
తిరుమలలో పెళ్లి వార్త ప్రకటించిన సాయి దుర్గా తేజ్
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Dharam Tej) తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ తర్వాత బ్రేక్ దర్శనంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.వచ్చే ఏడాదిలో తన వివాహం జరుగుతుందని మీడియాతో సాయి దుర్గా తేజ్ చెప్పారు. తనకు మంచి సినిమాలతో పాటు మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమల వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నామని దీంతో స్వామివారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగాలని అనుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలోనే తాను నటించిన ‘సంబరాల ఏటిగట్టు’ విడుదలవుతుందన్ని గుర్తుచేశారు. ఆ సినిమా అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు కోరారు. అయితే, వచ్చే ఏడాదిలోనే తన పెళ్లి ఉంటుందని తేజ్ చెప్పడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్రంలో సాయి దుర్గాతేజ్, ఐశ్వర్య లక్ష్మి జోడీగా నటిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. వాస్తవంగా దసరాకు విడుదల కావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే, 2026లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
TTD: ఫిబ్రవరి నెల దర్శన కోటా వివరాలు..
తిరుపతి: వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి దర్శన కోటా వివరాలను విడుదల చేసింది టీటీడీ ...నవంబర్ 18న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను విడుదల చేయనుంది.21న ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్ల విడుదల21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల24న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల24న ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన కోటా విడుదల24న మధ్యాహ్నం 3 గంటలకు వృద్దులు, దివ్యాంగుల కోటా విడుదల.25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల.25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి కోటా ఆన్లైన్లో విడుదల. -
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్‌కప్ విన్నర్ శ్రీచరణి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)
-
కపిల తీర్థం వద్ద అయ్యప్ప భక్తుల ఆందోళన..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో అయ్యప్ప భక్తుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు దిగింది. కపిల తీర్థం పుష్కరిణిలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల స్నానాలకు టీటీడీ అనుమతి ఇవ్వకపోవడంతో మాల ధరించిన స్వాములు ఆందోళనకు దిగారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు నినాదాలు చేశారు.వివరాల ప్రకారం.. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం తెల్లవారుజామున అయ్యప్ప భక్తులు ఆందోళన దిగారు. కపిల తీర్థం పుష్కరిణిలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల స్నానాలకు టీటీడీ అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో తెల్లవారుజామున స్నానం ఆచరించే అయ్యప్ప భక్తుల పట్ల టీటీడీ కఠినంగా వ్యవహరిస్తోందని స్వాములు ఆరోపించారు. టీటీడీ వైఖరిపై భక్తులు, స్వాములు మండిపడుతున్నారు. ఎట్టకేలకు అయ్యప్ప భక్తుల ఆందోళనతో దిగివచ్చిన టీటీడీ వారి స్నానాలకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులు.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ నాయుడు డౌన్ డౌన్.. టీటీటీ డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు.తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయం పుష్కరిణీ వద్ద అయ్యప్ప స్వాముల ఆందోళనస్నానం చేసేందుకు భక్తుల్ని అనుమతించని టీటీడీ విజిలెన్స్ అధికారులుటీటీడీ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన అయ్యప్ప భక్తులుకార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో స్నానాలకు దీపారాధనకు అనుమతించని అధికారులు… pic.twitter.com/s74F1Dp7jb— Rahul (@2024YCP) November 11, 2025అయితే, కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో భక్తుల స్నానాలకు, దీపారాధనకు టీటీడీ అనుమతి ఇవ్వలేదు. భక్తుల తాకిడి తక్కువగా ఉన్నప్పటికీ భక్తులపై విజిలెన్స్ అధికారులు ఆంక్షలు విధించారు. ఆలయంలో రద్దీ తగ్గుముఖం పట్టినప్పటికీ విజిలెన్స్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. దీంతో, తమకు కార్తీక మాసంలో కపిలేశ్వర స్వామి సన్నిధిలో కోనేరు దర్శనాన్ని దూరం చేస్తున్నరని భక్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భక్తులు ఆందోళనకు దిగడం గమనార్హం. దీంతో, టీటీడీ దిగి వచ్చింది. -
లడ్డూ ప్రసాదంపై బాబు సర్కారు కుట్ర!
సాక్షి అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకొచ్చే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం మరింత పదును పెట్టింది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు బరి తెగించింది. అందుకోసం పరస్పర విరుద్ధ ఆరోపణలు, అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి న్యాయస్థానాలను బురిడీ కొట్టించేందుకు కూడా తెగబడుతుండటం తీవ్ర విభ్రాంతి కలిగిస్తోంది. టీటీడీ నెయ్యి వివాదంలో సిట్ తాజాగా అరెస్టు చేసిన సుగంథ్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి అజయ్ కుమార్ సుగంథ్ రిమాండ్ నివేదికే అందుకు తాజా తార్కాణం.ఆ రిమాండ్ నివేదికలోని అంశాలను ఎల్లో మీడియాతోపాటు వివిధ మీడియా సంస్థలకు ముందుగానే లీక్ చేసి రాద్ధాంతం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం తన కుట్రలను నిస్సిగ్గుగా బయట పెట్టుకుంది. ఆ దుష్ప్రచార కథనాలను మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేయడం గమనార్హం. అంటే పక్కా కుతంత్రంతోనే ఈ దుష్ప్రచార కుట్రలకు ప్రభుత్వం బరి తెగించిందన్నది స్పష్టమవుతోంది. తిరుపతి పోలీసులు అరెస్టు చేసిన అజయ్ కుమార్ సుగంథ్‌ను నెల్లూరు ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా ఈ నెల 21 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడిన ప్రభుత్వ కుట్ర ఇలా ఉంది..జంతువుల కొవ్వు అన్నారు.. కాదు కాదు పామాయిల్ అంటున్నారు!తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి దుష్ప్రచారానికి పాల్పడిందన్నది ఈ రిమాండ్ నివేదిక బయటపెట్టింది. గత ఐదేళ్లలో లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. అదే నిరాధార ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా పదేపదే ఉద్ఘాటించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన విషయం తెలిసిందే. కాగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక స్పష్టం చేయడంతో ప్రభుత్వ కుట్ర బెడిసికొట్టింది.సీఎం చంద్రబాబు ఆరోపణలను ఖండిస్తూ అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు కూడా కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని స్పష్టం చేయడం గమనార్హం. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈవోపై ఒత్తిడి తెచ్చి ఆయన మౌనం దాల్చేలా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరో కుతంత్రానికి ఈ రిమాండ్ నివేదిక ద్వారా కుట్ర పన్నింది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో పామాయిల్, ఈస్ట్, ఇతర రసాయనాలు కలిపారని తాజాగా పేర్కొంది. జంతువుల కొవ్వు ఆరోపణలు బెడిసికొట్టడంతో నెయ్యిపై దుష్ప్రచారం చేసేందుకు పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్ కలిపారనే వాదనను తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది.అందుకోసం దర్యాప్తు పేరుతో సాక్షులను వివిధ డెయిరీ సంస్థల ప్రతినిధులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు చెప్పినట్లుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోతే అక్రమ కేసులో ఇరికిస్తారనే భయంతోనే డెయిరీ ప్రతినిధులు వారి ఒత్తిడికి తలొగ్గినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. భోలే బాబా డెయిరీపై భిన్న వాదనలు..లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం భోలే బాబా డెయిరీపై పరస్పర విరుద్ధ ఆరోపణలతో తన కుట్రలను బయటపెట్టుకుంటోంది. ఏపీ భవన్ ఉద్యోగి చిన్న అప్పన్నను పోలీసులు వైవీ సుబ్బారెడ్డి పీఏగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆయన భోలే బాబా డెయిరీని బెదిరించి రూ.50 లక్షలు లంచం అడిగారని ఆరోపించారు. అందుకు ఆ డెయిరీ నిరాకరించడంతో టీటీడీ జీఎంపై ఒత్తిడి తెచ్చి బ్లాక్ లిస్టులో పెట్టించారని పేర్కొన్నారు. మరో రెండు కంపెనీలకు భోలేబాబా డెయిరీ ఎల్ 1గా వచ్చినప్పటికీ ఆ డెయిరీని కాదని మరో రెండు డెయిరీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇప్పించినట్లు ఆరోపణలు చేశారు. ఆయన వ్యక్తిగత బ్యాంకు లావాదేవీలను వక్రీకరిస్తూ వాటిని ఆధారంగా చూపించేందుకు తాపత్రయపడ్డారు.కానీ అదే సమయంలో చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వద్ద పీఏగా పని చేశారన్న వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. పోలీసులు భోలేబాబా డెయిరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టిందని పేర్కొనడం గమనార్హం. అంటే భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సరఫరాను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే టీటీడీ నిలిపివేసిందని స్పష్టమవుతోంది. భోలే బాబా డెయిరీ రైతుల నుంచి ఒక్క చుక్క కూడా పాలు సేకరించలేదని సిట్ పేర్కొంది. కానీ అదే డెయిరీ యూపీలో 60 వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి పాల ఉత్పత్తులు తయారు చేస్తోందని అదే సిట్ పూర్తి భిన్నమైన వాదన వినిపించింది.భోలే బాబా డెయిరీ పేరుతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో అజయ్ కుమార్ సుగంథ్ రిమాండ్ రిపోర్టులో సిట్ కొత్త కట్టుకథను వినిపించింది. భోలే బాబా డెయిరీ సుగంథ్ ఆయిల్ ప్రొడక్ట్స్ ద్వారా కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు కొత్త కట్టుకథ సృష్టించింది. అందులో వివిధ ప్రైవేట్ డెయిరీల పాత్ర ఉన్నట్లు కూడా పేర్కొంది. ఆ మేరకు హర్‡్ష ట్రేడింగ్ కంపెనీ, హర్‡్ష డెయిరీ ప్రొడక్ట్స్ తదితర పేర్లను పేర్కొంది. అంటే ఆ కంపెనీ ప్రతినిధులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు పక్కాగా పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది.సుప్రీం తీర్పునూ బేఖాతర్ చేస్తూ...రాజకీయాల్లోకి కనీసం భగవంతుడినైనా దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం చంద్రబాబు బేఖాతర్ చేస్తోంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎల్లో మీడియా ద్వారా రాద్ధాంతం చేస్తోంది. అజయ్‌కుమార్ సుగంథ్ రిమాండ్ రిపోర్టును న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే ఎల్లో మీడియాకు చేరడం అందుకు నిదర్శనం. ఎల్లో మీడియా, కొన్ని ఇంగ్లీషు పత్రికలు, వెబ్సైట్లలో దుష్ప్రచార కథనాలను సోమవారమే వైరల్ చేయడం విభ్రాంతి కలిగిస్తోంది.టీటీడీ లడ్డూ ప్రసాదానికి కళంకం ఆపాదించేలా మీడియా చానళ్లలో చర్చా గోష్టి నిర్వహించింది. ఆ దుష్ప్రచార కథనాలను మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేయడం గమనార్హం. అంటే పక్కా పన్నాగంతోనే ప్రభుత్వం, ఎల్లో మీడియా లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి తెగబడినట్లు స్పష్టమవుతోంది. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ, తీర్పుతో నిమిత్తం లేకుండా ప్రజలను తప్పుదారి పట్టించడమే చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యమన్నది తేటతెల్లమవుతోంది. -
తిరుమల నడక దారిలో మాంసాహారం తింటున్న టీటీడీ ఉద్యోగులు
-
తిరుమలలో ఘోర అపచారం.. మాంసం తింటూ పట్టుబడ్డ టీటీడీ సిబ్బంది
-
తిరుమలలో మరో అపచారం.. తప్పు ఒప్పుకున్న టీటీడీ!
సాక్షి, తిరుమల: కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమలలో మరో అపచారం జరిగింది. తిరుమల నడకదారిలో మరోసారి మహాపచార ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తింటున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత.. మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తిన్నారు. ఈ సందర్బంగా కాలినడకన వెళ్తున్న భక్తులు వారిని ఈ అపచారంపై ప్రశ్నించగా.. సదరు సిబ్బంది భక్తులని బెదిరింపులకు గురిచేశారు. శ్రీవారి మెట్ల మార్గంలో ఘటన జరగడంతో భక్తులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఎట్టకేలకు ఈ ఘటనపై టీటీడీ స్పందిస్తూ..‘టీటీడీ ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే రామస్వామి, సరసమ్మ అనే ఉద్యోగులు నిన్న అలిపిరి వద్ద మాంసాహారం తిన్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో రామస్వామి, సరసమ్మ అనే ఇద్దరు ఉద్యోగులపై తిరుమల-2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించినట్టు తెలిపింది. -
తిరుమలలో రిలయన్స్ అధినేత: శ్రీవారిని దర్శించుకున్న అంబానీ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబానీ
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలియన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో.. భక్తులకు మా నిరాడంబరమైన సేవను కొనసాగిస్తూ, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కొరకు ఒక ఆధునికమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాలను (కిచెన్) నిర్మించనున్నట్లు తెలియజేయడానికి మేము ఎంతో గౌరవంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా అంబానీ పేర్కొన్నారు.ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) భాగస్వామ్యంతో మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో చేపడుతున్నాము. ఈ కొత్త వంటశాల అధునాతన ఆటోమేషన్‌ను కలిగి ఉంటుంది. ఇది ప్రతిరోజూ రెండు లక్షల కంటే ఎక్కువ మందికి కావలసిన భోజనాలను తయారుచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా, ప్రతి భక్తుడికి అత్యంత భక్తి, పరిశుభ్రత, శ్రద్ధతో తయారుచేసిన పౌష్టికాహార అన్నప్రసాదం ప్రేమతో అందించడం జరుగుతుంది.#WATCH | Andhra Pradesh | Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani, visits Sri Venkateswara Swamy Temple in Tirumala and offers prayers. pic.twitter.com/uDS0SnaIie— ANI (@ANI) November 9, 2025తిరుమల.. విశ్వాసం, కరుణ & నిస్వార్థ సేవకు శాశ్వత చిహ్నంగా నిలుస్తోంది. ఈ ప్రయత్నం ద్వారా, TTD దేవాలయాలన్నింటికీ అన్నసేవ సంప్రదాయాన్ని విస్తరించాలనే ఏపీ సీఎం ఉన్నత ఆశయానికి సహకరించడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. వేంకటేశ్వర స్వామివారికి సేవ చేయడం, 'ఏ భక్తుడూ ఆకలితో ఉండకూడదు' అనే తిరుమల దివ్య సంకల్పంలో ఒక చిన్న భాగం కావడం మాకు లభించిన భాగ్యం.ముఖేష్ అంబానీ.. కేరళలోని త్రిస్సూర్ జిల్లా, గురువాయూర్ పట్టణంలో ఉన్న గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయాన్ని కూడా సందర్శించారు. ఆయన ఆ దేవాలయానికి రూ. 15 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్సార్సీపీ నేతలు
-
తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
-
తిరుమల శ్రీవారి సేవలో నటి దివి (ఫొటోలు)
-
తిరుమల: అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలోమార్పు
తిరుపతి: తిరుమల అంగప్రదక్షణ టోకెన్ల జారీ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పుడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి FIFO(First In First Out)పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో విడుదలవుతాయి ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇదీ చదవండి:బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ: భూమన -
బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ: భూమన
సాక్షి, తిరుమల: ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనాలు సాధ్యం కాదన్నారు మాజీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ అని ఎద్దేవా చేశారు. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు దారుణంగా విఫలమయ్యారు. తిరుమలలో బ్లాక్ టికెట్ల దండా నడుస్తోందని భూమన ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ నాయుడు నేతృత్వంలో తిరుమల కొండపై అనేక అరాచకాలు జరుగుతున్నాయి. ఆయన భక్తులకు అందించిన ప్రత్యేక సేవలు ఏంటి?. రెండు గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ నాయుడు తన కార్యాలయంలోనే సెటిల్మెంట్లు చేస్తున్నారు. టీటీడీ చైర్మన్‌గా ఆయన దారుణంగా విఫలమయ్యారు. వీసీ సదాశివమూర్తిని తిరుమల కొండపై బీఆర్ నాయుడు బండ బూతులు తిట్టారు. బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ. తప్పులు ఎత్తి చూపడం నా బాధ్యత.. తప్పులు సరిచేసుకోవడం ఆయన బాధ్యత. వైఎస్సార్సీపీ హయాంలో అనేక ఆలయాలను నిర్మించాం అని చెప్పుకొచ్చారు. చేతలకు చెల్లుచీటి, కోతలకు ధనుష్కోటి..బీఆర్ నాయుడు ఏడాది పాలన.. అసమర్థుని జీవన యాత్ర లాగా అమోఘంగా ఉంది. చేతలకు చెల్లుచీటి, కోతలకు ధనుష్కోటి, కన్యాశుల్కం గిరీశంకు తలదన్నే విధంగా కోతలు కోస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. టీటీడీపై కనీస పరిజ్ఞానం లేదు, ఏ అధికారి మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ అసహనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్‌పై దాడి చేస్తూనే ఉన్నారు.. ఉసిగొల్పుతున్నారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు, 54 మంది గాయపడ్డారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసేస్తాం అని చెప్పారు, ఆ తర్వాత మీకు జ్ఞానోదయం అయ్యింది. మా పాలనలో 918 కోట్లు వచ్చాయని చెప్పుకున్నారు, అందులో 500 కోట్లు శ్రీవాణి నిధులే. అధికారులను బెదిరిస్తున్నారు. భగవంతుడు ఇచ్చే కానుకలు మీ గొప్పతనంగా చెప్పుకోవడం మీ అసమర్థతకు నిదర్శనం. మీ పాలనలో భక్తులకు ఒరిగిందేమీ లేదు. అన్నదానంలో వడ చేర్చి డీజే సౌండ్‌కు మించి ప్రచారం చేశారు.తిరుమలలో బ్లాక్ టికెట్స్ దందా..వేల కోట్లు విలువైన టీటీడీ స్థలం ప్రైవేట్ ముంతాజ్ హోటల్‌కు కట్టబెట్టారు. టీటీడీ స్థలం ఏదైనా పవిత్రమైన స్థలమే. మీ పాలనలో మద్యం మత్తులో తిరుగుతున్నారు. మీ పాలనలో కాళ్లకు చెప్పులు వేసుకుని మహా ద్వారం వరకు వచ్చారు. పది రోజులు పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం రద్దు చేయాలని కుట్రలు చేశారు. వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తొలగించే అధికారం పాలకమండలికి లేదు. భక్తులకు మీరు చేసిన సేవ ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10వేల ఆలయాలు నిర్మాణం చేస్తున్నాం అంటున్నారు. మేం చేసిన అభివృద్ధి మీరు కొనసాగిస్తున్నారు. తిరుమలలో బ్లాక్ టికెట్స్ దందా కొనసాగుతోంది. తిరుమలలో విజిలెన్స్ అధికారులు దందా కొనసాగిస్తున్నారు. బ్రాహ్మణ ద్వేషిగా మిమ్మల్ని ప్రజలు చూస్తున్నారు.భక్తులకు ఒరిగిందేమీ లేదు..టీటీడీలో డిప్యూటీ ఈవోలు బదిలీలు అని చెప్పి ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారు. స్వామి వారి ప్రథమ సేవకుడిగా ఉంటూ మాపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మీరు చైర్మన్‌గా ఉండటం వల్ల భక్తులకు ఒరిగిందేమీ లేదు. స్విమ్స్ పూర్తిగా నిర్వీర్యం జరిగింది. టీటీడీలో ఏసీబీ అధికారులు విచారణకు ఆదేశించడం అంటే టీటీడీ విజిలెన్స్ అధికారులపై నమ్మకం లేకపోవడమే అవుతుంది. ఐపీఎస్ స్థాయి, గెజిటెడ్ స్థాయి అధికారులను అవమానించడమే అవుతుందని అన్నారు. -
తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్ (ఫోటోలు)
-
తిరుమల కొండపై ఏడు అడుగుల మహిళ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ (ఫొటోలు)
-
YV సుబ్బారెడ్డి PAగా చేసిన అప్పన్న.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో అంబటి షాకింగ్ నిజాలు
-
శ్రీవారి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం
-
తిరుమలలో వైభవంగా శ్రీవారికి పుష్పయాగం (ఫోటోలు)
-
బాబు మరో కట్టు కథ!
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాల్లో చీవాట్లు, అక్షింతలతో అభాసుపాలైన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరో కట్టు కథ సృష్టించేందుకు కుట్ర పన్నుతోంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై నిజాలు నిగ్గుతేల్చాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై బురద జల్లేందుకు దుష్ప్రచారానికి దిగుతోంది. ఇందులో భాగంగా.. గతంలో సుబ్బారెడ్డి దగ్గర ఎప్పుడో పీఏగా పనిచేసిన చిన్నప్పన్న అనే చిరుద్యోగిని సిట్ అరెస్టుచేసింది. ఇతన్ని పావుగా వాడుకుని బాబు రూపొందించిన కట్టుకథ ఆధారంగా సుబ్బారెడ్డిపై సిట్ తప్పుడు ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓవైపు చిన్నప్పన్న ఆంధ్ర భవన్లో చిరుద్యోగి అంటూ.. మరోవైపు అదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ పరస్పర విరుద్ధ వాదనలు వినిపించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.చిన్నప్పన్న టీడీపీ ఎంపీ వేమిరెడ్డికి కూడా పీఏగా..2018కి ముందు సుబ్బారెడ్డి దగ్గర పనిచేసి మానేశాడు. అనంతరం ఢిల్లీలోని ఆంధ్రభవన్లో ఉద్యోగిగా చేరిన చిన్నప్పన్న ఏకంగా టీటీడీలోని ప్రొక్యూర్మెంట్ జీఎం స్థాయి అధికారులను సైతం ప్రభావితం చేశాడని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. చిన్నప్పన్న బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకున్న ఆస్తులు వంటి ఇతర అంశాలకు ముడిపెట్టి సుబ్బారెడ్డిని ఎలాగైనా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తుండడాన్ని చూస్తే ఇది పక్కా కుట్ర కథేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి.. ఇదే చిన్నప్పన్న ప్రస్తుత టీడీపీ ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దగ్గర కూడా గతంలో పీఏగా పనిచేశాడు. ‘సుప్రీం’ చెప్పినా మారని బాబు తీరు..తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని వినియోగించారంటూ చేసిన ఆరోపణలపై సాక్షాత్తు సుప్రీంకోర్టు సైతం మండిపడింది. విచారణ సందర్భంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచేలా బాబు వ్యాఖ్యలున్నాయని ఆక్షేపించింది. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దని కూడా హితవు పలికింది. సర్వోన్నత న్యాయస్థానమే బాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టినప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. వాస్తవానికి.. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడలేదని అప్పటి టీటీడీ ఈఓ శ్యామలరావు సైతం మీడియా సమావేశంలోనే కుండబద్ధలు కొట్టారు. డెయిరీల నుంచి వచ్చిన నెయ్యికి పరీక్షలు నిర్వహించి, నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేదని తేలిన రెండు ట్యాంకర్ల నెయ్యిని తిరిగి వెనక్కు పంపేశామని అప్పట్లో ఆయన తేల్చిచెప్పారు. ఇంత సుస్పష్టంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడనే లేదని తేలినప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బాబు పక్కా ప్రణాళికతో తాజా కుట్రకు తెరలేపారు.టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్ట్ విడుదల..ఇక గతేడాది సెప్టెంబరు 18న తిరుమల లడ్డూపై ఆరోపణలు చేస్తే, ఆ మర్నాడే అంటే సెప్టెంబరు 19న టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. నిజానికి.. అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్‌లో విడుదల చేశారు. అనంతరం.. సెప్టెంబరు 20న టీటీడీ ఈఓ మీడియా ముందుకొచ్చి ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యతలేదని తేలినందువల్ల, ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. ఆ తర్వాత సెప్టెంబరు 22న మళ్లీ ఈఓ మాట్లాడుతూ.. తాను స్వయంగా సంతకంచేసి, ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చానని చెబుతూ.. అందులోని అంశాలు చదివి వినిపించారు. తమకు ఎన్డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. ఈఓ ఎంతో గోప్యమని చెప్పిన ఎన్డీడీబీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చినప్పుడే బాబు రాజకీయ కుట్రలకు రోడ్‌మ్యాప్ వేశారని అందరూ ఊహించారు. ఇప్పుడు తాజాగా చిన్నప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ పిఏ అంటూ పదేపదే సుబ్బారెడ్డిపై దుష్ప్రచారానికి చంద్రబాబు సర్కారు, ఎల్లో మీడియా తెరలేపాయి. -
బీఆర్ నాయుడు వచ్చాకే తిరుమల గోశాల నిర్వీర్యం: భూమన
సాక్షి, తిరుపతి: బీఆర్ నాయుడు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోషాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గోశాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్న ఆలోచన తప్పే కదా? అని భూమన ప్రశ్నించారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అనే విషయం బోర్డు దృష్టికి వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడే స్వయంగా చెప్పారు. గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని వేసి స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చే ఆలోచన ఉందన్నారు. వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు. సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణపై, గోవుల మరణాలు జరుగుతున్నాయని చెప్పాను. దానికి నా మీద కేసులు పెట్టారు.అందుకు బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డిని నాపై ఉసిగొల్పారు. గోశాలపై వ్యాఖ్యలు చేసిన మీకు కూడా ఈ కేసులే వర్తిస్తాయి. నా మీద పెట్టిన కేసులో మీ మీద కూడా పెట్టాలి. దాదాపు 70ఏళ్ల టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోశాలను బీఆర్ నాయుడు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాత నిర్వీర్యం చేస్తున్నారు. గోశాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచనే తప్పే కదా?. మీ హయాంలో మీరు వైకుంఠ ఏకాదశి నిర్వహణను సరిగ్గా చేయలేరు, గోశాలను సరిగ్గా నిర్వహించలేరు. తిరుమలలో ఏం జరుగుతుందో యావత్ ప్రపంచానికి నా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. దానికి మీరు పెట్టిన కేసులన్నీ కూడా నన్ను భయపెట్టడానికి పెట్టినవే తప్ప మరొకటి కాదు. ఇలాంటి తప్పులు ఎన్ని మీరు చేసినా ఆ తప్పుల్ని ఎత్తి చూపటమే ఒక పూర్వ అధ్యక్షునిగా నా బాధ్యత. తిరుమలలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాను అని వ్యాఖ్యలు చేశారు. -
తిరుమల శ్రీవారి సేవలో హీరో అజిత్ (ఫొటోలు)
-
మొకాళ్లపై తిరుమల కొండపైకి టాలీవుడ్ నటి కూతురు.. వీడియో వైరల్!
టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కడికెళ్లినా ఫోటోలను షేర్ చేస్తోంది.ఇటీవల సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా తిరుమలను సందర్శించిన ఫోటోలు, వీడియోలను సుప్రీత మరోసారి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో తన తల్లితో కలిసి మొకాళ్లపై తిరుమల కొండను ఎక్కుతున్న వీడియోను కూడా పంచుకుంది. ఇది చూసిన అభిమానులు తల్లీకూతుళ్ల దైవభక్తికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
తిరుమల శ్రీవారి సేవలో ప్రభాస్ చెల్లెలు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పేర్ని నాని, కొడాలి నాని
-
తిరుమలలో హీరో సుధీర్‌బాబు, డైరెక్టర్ వేణు కుటుంబం (ఫోటోలు)
-
తిరుమలను వదలని వరుణుడు
సాక్షి, తిరుపతి/విశాఖ: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. దీంతో.. వాతావరణ శాఖ అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. ఇంకోవైపు.. తిరుమలలో వారం రోజులుగా ఎడతెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. జలాశయాలలో బారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే గోగర్భం డ్యామ్ నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. ముంపు ముప్పు దృష్ట్యా.. లోతట్టు ప్రాంతాల గ్రామాలను అప్రమత్తం చేశారు. తిరుమల భక్తుల రద్దీ ఇలా.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,110గా ఉంది. తలనీలాలు సమర్పించిన భక్తులు 25,695 మంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు.మరిన్ని వర్షాలుఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఎల్లుండికి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం. దీని ప్రభావంతో ఇవాళ(శనివారం, అక్టోబర్ 25)) కోనసీమ,కృష్ణా,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే.. ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
తిరుమలలో అభినయ.. కాలినడకన కొండ ఎక్కి.. (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో మిరాయ్ టీమ్ (ఫోటోలు)
-
ఏపీకి వాయుగుండం టెన్షన్.. తిరుమలలో భారీ వర్షం
సాక్షి, అమరావతి: ఏపీని వాయుగుండం టెన్షన్ పెడుతోంది. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్’, మరికొన్ని జిల్లాలకు ‘ఎల్లో’ ఎలర్ట్‌లను జారీ చేసింది. మరోవైపు.. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశముందని ఐఎండీ తెలిపింది. క్రమంగా నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తోంది. తర్వాత 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొంది. ఇది తుపానుగా బలపడే అవకాశముందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో శుక్ర, శనివారాల్లో మరో అల్పపీడనం ఏర్పడొచ్చని కొన్ని మోడళ్లు సూచిస్తున్నాయి. అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ బుధవారానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.రానున్న5రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు,ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపారు.దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 21, 2025తిరుమలలో భారీ వర్షం.. తిరుమలలో రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు టీటీడీ సిబ్బంది సూచనలు అందిస్తోంది.Most parts of #tirupati,#Chittoor districts will get light-moderate rains meanwhile intense bands from sea will cover #nellore district during next 2-3hrs. #NEM2025 #Monsoon2025 pic.twitter.com/EWnva4lHw3— tirupati weatherman (@TPTweatherman) October 22, 2025ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రైల్వే కోడూరు, రాజంపేట ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రాయచోటి ప్రాంతంలో పూర్తిగా నిండిన పింఛా ప్రాజెక్టు.. రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షాల కారణంగా జలాశయాలు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతున్నాయి. దీంతో, కడప, అన్నమయ్య జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.ఐదు రోజులు వానలే.. రాబోయే ఐదు రోజులూ రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, విపత్తుల నిర్వహణ సంస్థలు తెలిపాయి. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నాయి. RAINFALL ALERT TILL MORNING ⚠️Rounds of Heavy to Very Heavy rains to continue along #Tirupati and #Nellore districts while Prakasam district along with coastal areas of Konaseema, Kakinada, Anakapalle, Krishna and even #Visakhapatnam city to see a spell of rains around Early… pic.twitter.com/JAqpDj7HFv— Andhra Pradesh Weatherman (@praneethweather) October 21, 2025 -
తిరుమల శ్రీవారి సేవలో కమెడియన్ రఘు (ఫోటోలు)
-
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్ జామ్
సాక్షి, తిరుమల: తిరుమలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడ్డాయి. బండ రాళ్లు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. తిరుమలలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డులో తొమ్మిదో కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ బండరాళ్లు రోడ్డు మీద పడిపోవడంతో వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది కలిగింది. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు విరిగిపడిన కొండ చరియలను తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా జేసీబీలతో బండరాలను తొలగిస్తున్నారు. -
శ్రీవారి దర్శనం టికెట్ల పేరిట టీడీపీ నాయకుడి మోసం
-
టీటీడీ అధికారులపై హైకోర్టు అసహనం!
సాక్షి, విజయవాడ: తిరుమల పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27న ఈవో న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. -
తిరుమల స్వామివారి సేవలో కృతీ శెట్టి, వెంకీ కుడుముల (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నార్నె నితిన్ దంపతులు (చిత్రాలు)
-
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువ గా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయాయి. భక్తులు వేచి ఉన్న క్యూ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 74,468 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,878 మంది భక్తులు తలనీలాలు అరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకె న్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డ్రమ్స్ శివమణి (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)
-
తిరుమలలో మరో అపచారం.. వెకిలి చేష్టలతో అసభ్యకర రీల్స్
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు వెలసిన పవిత్రక్షేత్రం తిరుమలలో(tirumala) రీల్స్ తీసి వాటికి పాటలు జోడించి వెకిలి చేష్టలతో సోషల్ మీడియాలో(Social Media Reels) హల్చల్ చేస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. శ్రీవారి దర్శనానికి తిరుమల వస్తున్న కొందరు యువతీ యువకులు రీల్స్ పేరుతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం మాడవీధుల్లో, ఆలయ గోపురాలు కనిపించే విధంగా కొన్ని అసభ్యకరమైన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.తాజాగా శ్రీవారి ఆలయం ముందు ఓ యువతి రీల్స్ చేశారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు యువకులు మాడవీధుల్లో రీల్స్ చేయడం కూడా వైరల్‌గా మారింది. టీటీడీకి సంబంధించిన కొందరు వ్యక్తుల ద్వారా వీరు మాడవీధుల్లోకి ప్రవేశించారని, భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వామి సేవలో నిత్యం పాల్గొనేవారే ఇలా సోషల్ మీడియా వారితో కలిసి రీల్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ చేయడమే కాదు, తిరువీధుల్లోకి ఎలా వచ్చామో కూడా వారు తమ రీల్స్‌లో చెప్పుకొచ్చారు.చూశారా తమ్ముళ్లు మన మంచి ప్రభుత్వంలో తిరుమలలో కూడ రీల్స్ చేసుకునే సదుపాయం కల్పించాం pic.twitter.com/ZHj0oJyGq8— Ꮩᴀʀsʜᴀ Ꭱᴇᴅᴅʏ 🐬 (@YSvarshareddy) October 6, 2025గతంలో తిరుపతిలోని అలిపిరిలో డ్యాన్స్ చేస్తున్న యువతి వీడియో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా కొండపైనే సోషల్ మీడియా వ్యక్తులు వెర్రిపోకడలు పోతున్నారు. తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. తిరుమలలో అసభ్యకరమైన రీల్స్ తీయడంపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ పాలకమండలి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గుడిముందు ఇంత జరుగుతున్నా టీటీడీ మొద్దునిద్ర పోతోందా అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో వెంగమాంబ అన్నదాన సత్రంలో సోషల్ మీడియా రీల్స్ చేయించడం పై శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉన్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/8bUxzZ8W62— TOVINO𓃵 (@Vamos_Rafa23) October 7, 2025 -
తిరుమలలో భక్తుల రద్దీ ఇలా.. దర్శనం కోసం ఎన్ని గంటలంటే..
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న(గురువారం) స్వామివారిని 75,188 మంది భక్తులు దర్శించుకున్నారు. పండుగల వేళ భక్తుల సంఖ్య పెరగడంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంట సమయం పడుతోంది.ఇక, తిరుమలలో నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 31,640 మందిగా ఉంది. గురువారం స్వామివారి హుండీ ఆదాయం 2.66 కోట్లుగా టీటీడీ తెలిపింది. మరోవైపు.. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంట సమయం పడుతోంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 6 గంటలు.. ఇక, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. -
వైభవంగా శ్రీవారి రథోత్సవం..గోవిందనామస్మరణతో మారుమోగిన తిరుమల (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు..సూర్యప్రభ వాహనంపై శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల : అత్యంత వైభవంగా స్వర్ణరథోత్సవంలో శ్రీవారు (ఫొటోలు)
-
హనుమంత వాహనంపై కోదండ రాముని అలంకారంలో స్వామివారు (ఫొటోలు)
-
గరుడసేవ వైభవం.. దేశం నలుమూలల నుంచి భక్తుల రాక
-
బ్రహ్మోత్సవాల్లో నాల్గోరోజు శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు : కల్పవృక్ష వాహనంపై స్వామివారి వాహన (ఫొటోలు)
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు : ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ నటుడు (ఫొటోలు)
-
‘బాబూ.. ఇప్పుడు శ్రీవాణి ట్రస్టు డబ్బులు మీ ఇంటికి వస్తున్నాయా?’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు పదిరూపాయలు రాలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి ట్రస్టు విషయంలో చంద్రబాబు గతంలో విషం చిమ్మారు.. ఇప్పుడు అవే డబ్బు మీ ఇంటికి వస్తున్నాయా? అని ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అని కామెంట్స్ చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘శ్రీవాణి ట్రస్ట్ అవినీతి అంటూ, ట్రస్ట్ డబ్బులు తాడేపల్లికి వెళ్ళాయి అంటూ విష ప్రచారం చేస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్‌కు పనులు చేయడం మాత్రమే తెలుసు. దేశం అంతా దేవాలయాలు నిర్మాణం చేయాలని, ప్రత్యేక దర్శనం ద్వారా దర్శనాలు ఇవ్వాలని చూశారు. చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు పది రూపాయలు కూడా రాలేదు. వైఎస్ జగన్ పాలనలో శ్రీవాణి 2019 నుంచి ఇప్పటి వరకు 2038 కోట్లు జమ అయ్యాయి. అది జగన్ వల్లే జరిగింది.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశం అంతా ఆలయాలు నిర్మించండి అని చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు. 3500 ఆలయాలు వైఎస్ జగన్ పాలనలో పూర్తి అయ్యాయి. అందులో 300 ఆలయాలు జీవోద్ధరణ చేయించారు. ఇప్పుడు పాలన ఉండి ఉంటే దేశ వ్యాప్తంగా లక్ష గుళ్లు నిర్మాణం జరిగి ఉండేది. మరి.. ఇప్పుడు శ్రీవాణి నిధులు అన్ని చంద్రబాబు ఇంటికి వస్తున్నాయా?. శ్రీనగర్, ముంబై, భువనేశ్వర్, విశాఖలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మాణం చేశాం.నాడు శ్రీవాణి ట్రస్టుపై విషం చిమ్మారు.. ఇప్పుడు అదే ట్రస్ట్ గురించి మీరు పొగుడుతున్నారు. చంద్రబాబు.. మీ మాదిరిగా వైఎస్ జగన్ రంగనాయకుల మండపం గురించి చెప్పుకోలేదు. గుడి లోపల ఏఐ టెక్నాలజీ వాడటం ఆగమ శాస్త్రం విరుద్ధం. మీరు చెప్పినట్లు చేస్తే సంతృప్తికర దర్శనం అనేది దుర్లభం. అమరావతి గ్రాఫిక్స్ మాదిరే ఆదిదేవుడిని గ్రాఫిక్స్‌లో చూపించాలని చెప్పదలుచుకున్నారా?. వైఎస్ జగన్ చేసిన మంచిని అంగీకరించండి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఆయన కార్యాలయంలోనే బూతులు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. శ్రీవాణి ట్రస్ట్ రాగానే రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు.20 ఏళ్ల ముందే బాలకృష్ణకు పిచ్చి పట్టింది అని ఆయన బావగారు పుస్తకంలో రాశారు. ఆయన బావగారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాసుకొచ్చారు. బాలకృష్ణకు కృతజ్ఞత ఉంటుంది అనుకున్నా. దివంగత నేత వైఎస్సార్ ఆనాడు బాలకృష్ణకు సాయం చేశారు. బాలకృష్ణ తప్పతాగి మాట్లాడారు అని ఘాటు విమర్శలు చేశారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సింహ వాహనంపై స్వామివారు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు : హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)
-
తిరుమలలో వేంకటాద్రి నిలయం
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం వేంకటాద్రి నిలయం అందుబాటులోకి వచ్చింది. రూ.102 కోట్లతో టీటీడీ నిర్మించిన ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ సెంటర్ (పీఏసీ)–5ను గురువారం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చే వారిలో ఒకేసారి నాలుగువేల మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా ఈ భవనాన్ని నిర్మించారు. దీన్లో 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలు వేడినీటి సదుపాయం, ఒకేసారి 1,400 మంది భక్తులు భోజనం చేసేలా రెండు పెద్ద డైనింగ్ హాళ్లు తదితర సౌకర్యాలు కల్పించారు. ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కల్యాణకట్టను కూడా పీఏసీ–5 ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు ఒక భక్తురాలికి వసతి బుకింగ్ టోకెన్‌ను అందజేశారు. అనంతరం తిరుమల పోటులో ఏర్పాటు చేసిన సారి్టంగ్ యంత్రాలను ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యర్థాల సేకరణ యంత్రాన్ని ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పరిశీలించారు. టెక్నాలజీతో క్యూలైన్ల నిర్వహణకు ఐసీసీసీ అనంతరం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులు తీసుకురాకుండా అలిపిరి వద్దే నిలువరించేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచే పర్యవేక్షించాలని ఆదేశించారు. అలిపిరి నుంచే రద్దీ హీట్ మ్యాప్‌లను గుర్తించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీవారి ఏడుకొండలు ఏడురంగులతో గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాలను ఐసీసీసీతో అనుసంధానించాలన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా అత్యుత్తమ విధానాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. ఏఐ, క్వాంటం రెడీ అనలటిక్స్, మెషిన్ లెర్నింగ్ సాయంతో ఎంతమంది భక్తులు నిరీక్షణలో ఉన్నారో గుర్తించి అందుకనుగుణంగా క్యూలైన్ నిర్వహణ చేపడతామని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, లోకేశ్, సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకష్ణ పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, సీఎం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద ఉప రాష్ట్రపతికి టీటీడీ అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీవారి లడ్డూప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఉప రాష్ట్రపతి, సీఎం ఆలయంలో సుమారు 50 నిమిషాలు ఉన్నారు. ఈ సందర్భంగా సుమారు గంటన్నరపాటు సాధారణ భక్తుల దర్శనాన్ని టీటీడీ నిలిపేసింది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారినీ దర్శించుకున్నారు. -
తిరుమల బ్రహ్మోత్సవాలు..చిన్నశేషవాహనంపై శ్రీవారు (ఫొటోలు)
-
వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి (ఫొటోలు)
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేళాయె
-
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా అంకురార్పణ (చిత్రాలు)
-
‘జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్.. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు’
సాక్షి, తిరుపతి: తిరుమలను కూటమి నేతలు రాజకీయ స్వార్థాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్సార్సీపీ హయాంలోనే రవి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నామని తెలిపారు. తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సయమంలో పరకామణి ఘటన జరిగిందని రుజువైతే నా తల నరుక్కుంటాను అని సవాల్ విసిరారు. అలాగే, జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు అంటూ ఎద్దేవా చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ హయాంలో రవి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నాం. మా పాలనలోనే రవి కుమార్ దొంగతనం బయటపెట్టాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రవి కుమార్ చోరీ చేశాడు. రవి కుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులు టీటీడీకి ఇచ్చారు. రవి కుమార్ అనే దొంగను చంద్రబాబు ప్రభుత్వం పట్టుకుందా?. కొట్టేయాలని అనుకున్న వారు దొంగను పట్టుకుంటారా?. దమ్ముంటే, ధైర్యముంటే విజిలెన్స్ నివేదిక బయట పెట్టాలి. రవి కుమార్‌కు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఆస్తులు ఉన్నాయి. మా బినామీలకు ఆస్తులు రాసి ఇచ్చి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలి. మంత్రి ఆనం సమాధానం ఇచ్చాక కూడా ఆ నివేదిక ఎందుకు బయటకు రాదు?. ఆ నివేదికకు సంబంధించి చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉంది.జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు. నేను ఉన్నప్పుడు పరకామణి ఘటన జరిగిందని రుజువైతే నా తల నరుక్కుంటాను. దమ్ముంటే సీబీఐ చేత విచారణ చేయించండి. నిజాలు నిగ్గు తేలాలి అంటే సీబీఐ చేత విచారణ చేయించాలి. సీబీఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. పరకామణిలో ఏం జరుగుతుందో సీసీ ఫుటేజీ ద్వారా బయటపెట్టాలి. కూటమికి తాబేదార్లుగా ఉన్న అధికారులతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు రావు. చంద్రబాబు హయాంలో కొట్టేసిన స్వామి వారి నిధులను మేం ఆ దేవదేవుడికి రాయించాం. కోడిగుడ్డు మీద ఈకలు పీకడాన్ని కూటమి ప్రభుత్వం మానుకోవాలి. బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి అడుగడుగునా తప్పులే జరుగుతున్నాయి. చంద్రబాబు పాలనలో జరిగిన సీసీ కెమెరాలు పుటేజ్ బయట పెట్టాలి. లడ్డు విషయంలో జరిగిన తరహాలో సీబీఐ విచారణ జరిపించాలి. వందల కోట్లు మేము అవినీతికి పాల్పడ్డామని మాపై నిందలు వేశారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తాము అని చెప్పిన బీఆర్ నాయుడు ఇది చాలా మంచి స్కీమ్ అని మెచ్చుకున్నారు. 22-07-2025 రోజున శ్రీవాణి టికెట్ల ధరను రూ.2వేలకు పెంచడానికి తీర్మానం చేశారు. భగవంతుడిని అడ్డు పెట్టుకుని వ్యాపారం, రాజకీయాలు చేస్తున్నారు. పరకామణిలో ఏం జరుగుతుందో నిరంతరం చూపించాలి. వీఐపీ దర్శనాలు తగ్గిస్తున్నామని చెప్పి, ఇంకా పెంచుతూ పోయారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,249 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,901 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.04 కోట్లు సమర్పించారు.టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.


