తిరుమల ప్రసాదంపై బాబు, పవన్‌వి నీచ రాజకీయాలు | YSRCP members cleaned the roads in Tirupati with turmeric water | Sakshi
Sakshi News home page

తిరుమల ప్రసాదంపై బాబు, పవన్‌వి నీచ రాజకీయాలు

Feb 9 2026 3:49 AM | Updated on Feb 9 2026 3:49 AM

YSRCP members cleaned the roads in Tirupati with turmeric water

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజయ్‌కుమార్‌  

తిరుపతిలో రోడ్లను పసుపునీళ్లతో శుభ్రం చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు 

తిరుపతి మంగళం: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్‌కుమార్‌ మండిపడ్డారు. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను నిరసిస్తూ ఆదివారం తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద రోడ్లను వైఎస్సార్‌సీపీ శ్రేణులు పసుపునీళ్లతో కడిగి శుభ్రం చేశాయి. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాలు చేస్తో­న్న కూటమి నేతలను నీవే శిక్షించు వేంకటేశ్వరా అంటూ ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నారు. 

అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ..సీబీఐ తన విచారణలో నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా నివేదిక ఇచ్చిందని, అయినా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు శ్రీవారి లడ్డూపై చేసిన తప్పుడు ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి జంతువుల కొవ్వు కాదు బాత్‌రూం శుభ్రపరచడానికి వాడే కెమికల్స్‌ ఉపయోగించారని మరో పచ్చి అబద్ధాన్ని చెప్పి భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎన్‌డీడీబీ, సీబీఐ సిట్‌ నివేదికల్లో ఎక్కడా నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా నివేదిక ఇచ్చిందని చెప్పారని అజయ్‌కుమార్‌ గుర్తు చేశారు. ఎమ్మెల్యే నోట శ్రీవేంకటేశ్వరస్వామే నిజాలను పలికించారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యచ్చం వాసుయాదవ్, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement