breaking news
laddu prasadam
-
తిరుమల ప్రసాదంపై బాబు, పవన్‌వి నీచ రాజకీయాలు
తిరుపతి మంగళం: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్‌కుమార్ మండిపడ్డారు. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను నిరసిస్తూ ఆదివారం తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద రోడ్లను వైఎస్సార్సీపీ శ్రేణులు పసుపునీళ్లతో కడిగి శుభ్రం చేశాయి. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాలు చేస్తోన్న కూటమి నేతలను నీవే శిక్షించు వేంకటేశ్వరా అంటూ ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నారు. అజయ్‌కుమార్ మాట్లాడుతూ..సీబీఐ తన విచారణలో నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా నివేదిక ఇచ్చిందని, అయినా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు శ్రీవారి లడ్డూపై చేసిన తప్పుడు ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి జంతువుల కొవ్వు కాదు బాత్రూం శుభ్రపరచడానికి వాడే కెమికల్స్ ఉపయోగించారని మరో పచ్చి అబద్ధాన్ని చెప్పి భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎన్డీడీబీ, సీబీఐ సిట్ నివేదికల్లో ఎక్కడా నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా నివేదిక ఇచ్చిందని చెప్పారని అజయ్‌కుమార్ గుర్తు చేశారు. ఎమ్మెల్యే నోట శ్రీవేంకటేశ్వరస్వామే నిజాలను పలికించారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యచ్చం వాసుయాదవ్, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి కోరల్లో కాలకూటం!
‘‘ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ’’. చిత్తం శివుడి మీద – భక్తి చెప్పుల మీద నిలుపుకొనే దొంగ భక్తుల ముసుగుల్ని మహాకవి వేమన ఏనాడో తొలగించాడు. ఇప్పుడు సమస్య కొందరు వ్యక్తులు, కొందరు భక్తులు వేసుకునే ముసుగుల గురించి కాదు. ఏకంగా ప్రభుత్వ వ్యవస్థే వేసుకున్న ప్రమాదకరమైన ముసుగు గురించి! ముసుగులు వేసుకున్న ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం కంటే దారుణమైన చెత్తబుద్ధి తాపంతో బుసకొడుతున్నది. రాజకీయంగా స్థిరపడటానికి మతాన్ని అస్త్రంగా మలుచుకోవాలనే నిశ్చయానికి కూటమి వచ్చేసిందని మొన్నటి కూటమి ప్రెస్‌మీట్, అందులో ముఖ్య నేత మాటలు రుజువు చేస్తున్నాయి. ఎన్నికల హామీలు వెక్కిరిస్తున్నాయి. పాలనా వైఫల్యం వెన్నాడుతున్నది. అప్పుల పర్వతం పెరిగిపోతున్నది. అభివృద్ధి పేరుతో జపిస్తున్న తూతూమంత్రానికి తుప్పిళ్లు తప్ప చింత కాయలు రాలడం లేదు. అదానీ – గూగుల్ డేటా సెంటర్‌కు మనం ఇరవై వేల కోట్లు రాయితీలిస్తే గూగుల్ వాళ్లు బెంగ ళూరులో 20 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఒకటి రెండు పెద్ద కంపెనీల పేర్లు చెప్పి అదే వరసలో ఊరూ పేరూ లేని ‘ఉర్సా’లకు భూసంతర్పణ చేస్తున్నాం. దానివల్ల సాధించబోయే అభివృద్ధి దృశ్యం త్వరలోనే ముందుకు రాబోతున్నది. అమరావతి పేరుతో తలపెట్టిన లక్షల కోట్ల జూదం ఒక ‘మాన్యుమెంటల్ ఫెయిల్యూర్’గా అల్లంత దూరంలో భయపెడుతున్నది. ఈ పరిస్థితుల్లో కూటమి సర్కార్‌కు కిం కర్తవ్యం? ‘‘లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె.... రావే ఈశ్వరా కావవే వరద’’. ఇక దేవుడే దిక్కని కూటమి నిర్ణయానికి రావడంలో ఆశ్చర్యమేమున్నది!‘పరిత్రాణాయ సా«ధూనాం... సంభవామి యుగేయుగే’ అన్నాడు కృష్ణపరమాత్ముడు. సన్మార్గులను రక్షించడానికీ, దుర్మా ర్గులను శిక్షించడానికీ తాను వస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని సన్మార్గులూ విశ్వసిస్తారు. దుర్మార్గులూ నమ్ముతారు. కూటమి సర్కార్‌కు ఇక్కడ దేవుడు దిగిరావలసిన అవసరం లేదు. దేవదేవుని పేరు, ఆ పేరు చుట్టూ ఉండే మతవిశ్వాసాలను కబ్జా చేసుకుంటే చాలు! కూటమి సర్కార్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నది. తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా చంద్రబాబు వ్యాఖ్యానాలు చేశారు. పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేశారని మొదట ఆరోపించారు. ఆయన ఆరోపణపై అప్పట్లోనే సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పింది. ఒకవైపు ‘సిట్’ను ఏర్పాటు చేసి, దాని దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. కోట్లాదిమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని ఇలా రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం మంచిది కాదని మందలించింది.ముఖ్యమంత్రి రాజకీయ ఉద్దేశాలను గ్రహించిన సర్వోన్నత న్యాయస్థానం నిష్పాక్షిక దర్యాప్తునకు స్వతంత్ర బృందమే మేలని భావించింది. సీబీఐ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతి నిధులు కూడా ఉండే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియ మించింది. ఈ బృందం దర్యాప్తు చేసి ఈమధ్యనే అభియోగ పత్రాన్ని (ఛార్జిషీట్) న్యాయస్థానం ముందుంచింది. చంద్ర బాబు, ఇతర కూటమి పెద్దలు, యెల్లో మీడియా కలిసి భువన భువనాంతరాల్లో చాటింపు వేయించినట్టుగా జంతు కొవ్వు కలవలేదని తమ దర్యాప్తులో తేలినట్టు ‘సిట్’ స్పష్టం చేసింది. అయినా సరే, జంతు కొవ్వు కలిసినట్టు తేలిందనే ప్రచారాన్ని కూటమి ఆపలేదు. పైగా ఊరూరా, వాడవాడనా ఫ్లెక్సీలు కూడా వేసింది. ఇది నూటికి నూరుపాళ్లు కోర్టు ధిక్కరణ! వేంకటేశ్వర స్వామినే రాజకీయాల్లోకి లాగడానికి భయపడనివాళ్లు కోర్టు ధిక్కరణకు భయపడతారా? తాజాగా ఆ నెయ్యిని బాత్ రూమ్‌లు కడిగే కెమికల్‌తో తయారు చేశారనే ప్రచారాన్ని చంద్ర బాబు ప్రారంభించారు. ఆ దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడే పద్ధతి ఈ విధంగానే ఉంటుందా?సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ తన ఆకాంక్షల మేరకు ఛార్జిషీట్ వేయలేదు కనుక ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం మరో కమిషన్ వేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు, దాంతోపాటు బాత్రూమ్లు కడిగే కెమికల్ కలిసిందనే రిపోర్టు వచ్చేవరకు చంద్రబాబు కమిషన్లను, కమిటీలను నియమిస్తూనే ఉంటారన్న మాట! అయితే ఇప్పుడు వివాదానికి కారణమైన నెయ్యి శాంపిల్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసు కున్నదే! అదే విచిత్రం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన నెయ్యి శాంపిల్‌ను పరీక్షిస్తే జగన్ కాలంలో జరిగిన కల్తీ కనిపించాలని కూటమి సర్కార్, యెల్లో మీడియా కోరుకుంటున్నాయి.వివాదానికి కేంద్ర బిందువైన భోలేబాబా డెయిరీ వాళ్లు అంతకుముందు చంద్రబాబు సర్కార్ ఉన్నప్పటి నుంచే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో (ఇతర డెయిరీల ద్వారా) తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఇది ఆన్ రికార్డ్! చంద్రబాబు కాలంలో కిలో నెయ్యికి రూ. 297 వసూలు చేసే వాళ్లు. ప్రభుత్వం మారిన తర్వాత 319 నుంచి 348 రూపాయల వరకు ధర పెరిగింది. ఇంత తక్కువ ధరకు నెయ్యి ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. నెయ్యి ట్యాంకర్లు తొలుత తిరుమలకు వెళ్లకుండా తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్‌కు చేరుకుంటాయి. మార్కెటింగ్, విజిలెన్స్, ప్రొక్యూర్మెంట్ అధికారుల సమక్షంలో శాంపిల్ తీస్తారు. ఈ శాంపిల్‌ను తిరుమలలోని నాణ్యతా పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. వారు ఓకే అన్న తర్వా తనే నెయ్యి ట్యాంకర్ తిరుమలకు బయల్దేరుతుంది. నాణ్యత లేదని తేలితే ట్యాంకర్‌ను వెనక్కు పంపిస్తారు. చాలాకాలంగా ఇటువంటి పకడ్బందీ విధానం అక్కడ అమల్లో ఉన్నది.వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి ట్యాంకర్లను నాణ్యత లేని కారణంగా 16 సార్లు వెనక్కు పంపి నట్టు రికార్డులు చెబుతున్నాయి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓ నాలుగు ట్యాంకర్లను తిరస్కరించి వెనక్కు పంపారు. దర్యాప్తులో తేలిన ఆందోళనకరమైన విషయం ఏమిటంటే – ఇలా వెనక్కు వెళ్లిన నాలుగు ట్యాంకర్లు ఒకచోట మాటువేసి ఉండి, కంపెనీ పేరు మార్చుకొని ‘పరీక్షలు’ నెగ్గి తిరుమలకు చేరుకున్నాయి. ఈ ట్యాంకర్లలో తీసిన శాంపిల్సే ఇప్పుడు దేశవ్యాప్త సంచలనాలకు కారణమయ్యాయి. చంద్రబాబు తొలిదఫా అధికారంలో ఉన్న సమయంలోనే బోలేబాబా టెండర్‌ను అనిల్ సింఘాల్ అనే ఐఏఎస్ అధికారి ఖాయం చేసుకొచ్చారు. అయనప్పుడు టీటీడీ ఈవోగా పని చేశారు. ఈ శాంపిల్స్ వివాదాస్పదమైన నేపథ్యంలో కూడా మరోసారి ఆయన్నే ఈవోగా నియమించారు. దీని భావమేమి తిరుమలేశా? వైసీపీ సర్కార్ హయాంలో తిరస్కరించిన 16 ట్యాంకర్లలో ఏ ఒక్కటీ తిరిగి కంపెనీ పేరు మార్చుకొని వచ్చిందనే దాఖలా లేదు. అప్పుడు లడ్డూల్లో వాడిన నెయ్యి శాంపి ల్స్‌ను పరీక్షించకుండానే మరి ఆ కాలమంతా కల్తీ జరిగిందని ఎలా చెబుతారు?చంద్రబాబు హయాంలో భోలేబాబా టెండర్ ఖరారైంది. ఈ టెండర్‌ను ఖరారు చేసిన అధికారి అప్పుడు ఈవోగా పని చేశారు. అప్పుడు కేవలం 297 రూపాయలకే ఆ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను వైసీపీ హయాంలో 16 సార్లు వెనక్కు పంపించారు. చంద్రబాబు హయాంలో శాంపిల్ తీసి వెనక్కి పంపిన ట్యాంకర్లు మళ్లీ వచ్చి తిరుమలకు వెళ్లాయి. దాని శాంపిల్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన తర్వాత అప్పుడు టెండర్ ఖరారు చేసిన అధికారే మళ్లీ ఈవోగా వచ్చారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఏమర్థమవుతుంది? చూపుడు వేలు ఏ వైపు తిరుగుతుంది? తిరుమల లడ్డూను వివాదాస్పదం చేయడం ద్వారా ప్రతిపక్షానికి బురద పూయాలనే సంకల్పం తప్ప మరోటి కన్పించడం లేదు. మొన్న గురువారం నాటి ఓ శుభముహూర్తాన, కూటమి నేతలంతా కొలువుదీరిన మీడియా సమావేశంలో ఎటువంటి దాపరికం లేకుండా ఈ సంకల్పాన్ని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.తిరుమల క్షేత్రం పవిత్రతను దెబ్బతీయడానికి ఒక మహాకుట్ర జరిగిందని, అందులో భాగంగానే లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ చేశారని తాను కనిపెట్టినట్టుగా ఆయన చెప్పుకున్నారు. దీన్ని హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిగా ఆయన భావించారు. తిరుమల పవిత్రతను, హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యతను స్వయంగా శ్రీవేంకటేశ్వరస్వామే తనకు అప్పగించారని ఆయన చెప్పారు. ఖతమ్. బారా ఖూన్ మాఫ్. అఖిలాంధ్ర జనులారా... చంద్రబాబు నుంచి ఇంకేమీ ఆశించకండి. ఆయన స్వామివారి ఆదేశాల మేరకు తిరుమల పవిత్రతను, హిందూ ధర్మాన్ని కాపాడే పనిలో నిమగ్నమై ఉంటారు. హిందూ ధర్మాన్ని ప్రస్తావిస్తూ ఈ సమావేశంలో ఆయన ఒకే ఒక్క నిర్వచనాన్ని ప్రవచించారు. ‘‘మన ధర్మం ప్రకారం పెళ్లిళ్లు స్వర్గంలో జరుగు తాయి. మనకు కుటుంబ విలువలుంటాయి. పెళ్లయిన తర్వాత విడాకులివ్వడం మన ధర్మం ప్రకారం సరైంది కాదు’’ అంటూ మాట్లాడారు. ఈ నిర్వచనానికి కూటమిలో ఏకాభిప్రాయం ఉన్నదో లేదో తెలియదు.తిరుమల పవిత్రతపై, హిందూ ధర్మంపై ప్రతిపక్ష పార్టీ కుట్ర చేస్తున్నదని ఆయన సారాంశం. దానికి వ్యతిరేకంగా కూటమి తోడ్పాటుతో పోరాటం చేస్తారట! ఎనభై ఐదు శాతం మంది హిందువులున్న రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే, హిందూ దేవుళ్ల పవిత్రతను దెబ్బతీయడానికి పనిచేస్తుందా? ఇంగిత జ్ఞానమున్నవాళ్లెవరైనా ఇలా మాట్లాడతారా? మాట్లాడితే నమ్ము తారా? ప్రతిపక్ష నేతకు లభిస్తున్న జనాదరణను తట్టుకోలేక నిస్పృహతో కూడిన మాటలుగానే వాటిని భావించాలి. ఈ నిస్పృహలో ఆయన ప్రజాస్వామిక విలువల్నీ, రాజ్యాంగ ధర్మాన్నీ తుంగలో తొక్కుతున్నారు.విజయవాడ నగరంలో డజన్లకొద్దీ ఆలయాలను చంద్ర బాబు కూల్చివేస్తే వాటిని పునర్నిర్మించిన ధార్మికుడు, దేశ వ్యాప్తంగా వందలాది శ్రీవారి ఆలయాలను నిర్మించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి. వేలాది గోవుల్ని అక్రమ రవాణా చేస్తుంటే, వాటిని వధించి గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే, ఈ వ్యాపారంలో ఆయన పార్టీ వారే భాగస్థులుగా ఉన్నా కఠిన చర్యలకు పూనుకోని వ్యక్తి చంద్రబాబు. వివిధ ప్రాంతాల నుంచి దేశవాళీ గోసంపదను సమీకరించి తిరుమ లలో గోశాలను ఏర్పాటు చేసి, స్వయంగా తన నివాసంలోనే గోవుల్ని పోషించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఆలయ రథం కాలిపోతే పట్టించుకోని పాలకుడు చంద్రబాబు. అంతర్వేదిలో ఓ రథాన్ని ఎవరో దుండగులు తగలబెడితే, వెంటనే సరికొత్త రథాన్ని తయారు చేయించడమే కాక, ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాసిన పారదర్శక పాలన జగన్‌ది. ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ ధర్మం విషయంలో జగన్ చిత్తశుద్ధిపై డజన్కిపైగా ఉదాహరణలివ్వవచ్చు. చంద్రబాబు పోటీయే కాదు.ఒక దేవుడిని విశ్వసించేవాడు, నమ్మేవాడు అందరు దేవుళ్లనూ ఆరాధిస్తాడు. ఇది ప్రాథమిక సూత్రం. అన్యమత స్థులెవరూ ఇతరుల ఆరాధనా స్థలాలపై దాడులు చేయరు. ఎక్కడో నూటికో కోటికో ఒక్కరుండే ఉన్మాదులు తప్ప! ఆకతాయిలు తప్ప! దొంగలు తప్ప!! ఇటువంటి వాళ్లు అన్ని చోట్లా, అన్ని మతాల్లో, అన్ని సమూహాల్లో ఉండవచ్చు. వాళ్లు చేసే చెదురుమదురు ఘటనల్ని గుదిగుచ్చి మతంపై దాడిగా ప్రచారం చేయడం దుర్మార్గమైన రాజకీయం. ప్రజల్ని రెచ్చగొట్టి లాభం పొందాలనే ఎత్తుగడ. రాజకీయ మనుగడ కోసం విసిరే ఆఖరి పాచిక. ఇటువంటి ఎత్తులకు ఆంధ్ర ప్రజలు పడిపోతా రనుకోవడం అవివేకం.అన్యమతస్థుల ఆలయ ప్రవేశానికి ఆంక్షలుండాలనీ, షరతులుండాలనీ, అన్య మతస్థులెవరూ అక్కడ పనిచేయకుండా చూస్తామనీ కూడా చంద్రబాబు చెప్పారు. ఇదేం గొప్ప విషయమా? సుప్రసిద్ధ షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్‌కు కాశీ విశ్వేశ్వరునితో ఉన్న అనుబంధం లోకానికి తెలిసిందే కదా! ‘అమెరికాలో స్థిరపడితే జీవితాంతం సకల సౌక ర్యాలు కల్పిస్తాన’ని ఓ సంపన్నుడు బిస్మిల్లా ఖాన్‌ను అడిగాడట! ‘సరే, గంగానదిని, విశ్వనాథుడినీ కూడా ఇక్కడికి తేగలవా? అలా అయితే ఇక్కడే ఉంటా’నని చెప్పాడట! సిరిసంపదల కంటే విశ్వనాథుడే మిన్నగా ఆయన భావించాడు. మన తెలుగు వాడు నాదస్వర బ్రహ్మ షేక్ చిన మౌలానాను శ్రీరంగం దేవ స్థానం ఆస్థాన విద్వాంసుడిగా గౌరవించిన సంగతి మరిచి పోదామా? గంధర్వ గాయకుడు యేసుదాసు ‘హరివరాసనం స్వామి విశ్వమోహనం’ అని పాడుతుంటే తన్మయత్వానికి లోనుకాని హిందూ భక్తులుంటారా? గంగా – యమునా తెహ జీబ్... భారతీయ సంస్కృతి. దాన్ని కాపాడుకోవడంలోనే దేశ పురోగతి దాగి ఉన్నది. దీన్ని ధ్వంసం చేయడానికి స్వయంగా పాలకులే ప్రయత్నిస్తే అది క్షమించరాని నేరమే అవుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
లడ్డూ కల్తీ జరిగింది చంద్రబాబు హయాంలోనే!
సాక్షి, హైదరాబాద్: తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ అన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కలియుగ దైవం శ్రీవారి మహా ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు వాడారనడానికి నోరెలా వస్తోంది?. లడ్డూలో ఎలాంటి కొవ్వు లేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికలు చెప్తున్నాయి. ఇప్పుడేమో లడ్డూ ప్రసాదంలో బాత్రూమ్ కెమికల్స్ వాడారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’’ అని కూటమి నేతలపై మండిపడ్డారు. తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకొని భ్రష్టు పట్టిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని వ్యాఖ్యానిస్తూ అపచారం చేస్తున్నారు. చంద్రబాబూ.. వెంటనే మీ మాటను వెనక్కి తీసుకోండి. బాత్ రూమ్ క్లీనర్‌కు వాడే రసాయనాలు వాడారని ఆరోపిస్తున్న మీది నోరా? ఇంకా ఏమైనా ?. 2018లో టీటీడీ హయంలో గీ ఫ్లేవర్ హెన్హన్సర్ ఎందుకు కొన్నారు ? ఆర్టిఫీషియల్ ఎందుకు కొనుగోలు చేశారు ?ఫ్లేవర్ గీ కోసం అరోమా కలుపడానికి 78 వేల కేజీలు కొనడానికి 2018లో చంద్రబాబు హయంలో టెండర్లు పిలిచారు. ఫ్లేవర్ హెన్హన్సర్ అంటే ఏంటి?. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ దెబ్బ తీసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మనిషి అన్నవారు దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతారా ?. చంద్రబాబు హయాంలో రూ. 3 కోట్లతో ఫ్లేవర్ గీ కోసం అరోమా కలిపింది వాస్తవం కాదా ?తిరుమల తిరుపతి దేవస్థానంపై నమ్మకం ఉంది కాబట్టే ప్రతిష్ట దెబ్బ తినకుండా మేం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ శాంపిల్స్ తీసుకుంది. టీడీపీపై దుష్ప్రచారం చేసిన వారు నిందితులు. రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. జంతువుల కొవ్వు కలవలేదు అనేది సుస్పష్టం. తప్పులన్నీ వారు చేసి.. నిందలు మాపై వేస్తున్నారుటీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,500 దేవాలయాలను జగన్ నిర్మించారు. చంద్రబాబు హయంలో ఎన్ని దేవాలయాలను కట్టారు?. పుష్కరాల సమయంలో ఆయన 40 దేవాలయాలను కూల్చారు. వాటిని వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే కట్టించారు. హిందూ ధర్మంపై మాకున్న నమ్మకం ఇది. దేవుడు దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు’’ అని మార్గాని భరత్ అన్నారు. -
పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి.. క్షమాపణ చెప్పాలి
సీబీఐ సిట్ చార్జ్‌షీట్ వేసిన తర్వాత అయినా చంద్రబాబు చేయాల్సిన పని ఏంటంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామి ముందు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కనీసం మానవత్వం ఉన్న మనిషైతే చంద్రబాబు అలాంటి పని ఎందుకు చేయడం లేదు?సీబీఐ సిట్ చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన వాస్తవాలను చూపించి ఎవరైనా చంద్రబాబుని ప్రశ్నిస్తే.. ఆయన అసహనంతో మా నాయకుల మీద దాడులు చేయించే నీచ స్థాయికి దిగజారిపోయాడు. అందులో భాగంగానే వరుసపెట్టి మా నాయకులు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకరరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద దాడి చేయడమే కాకుండా అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేశారు.అసలు చంద్రబాబుకు చిప్ సరిగ్గా ఉంటే ఇలాంటి పనులు చేయిస్తారా? తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా.. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు ఎలాంటి జంతు కొవ్వు లేదని ధ్రువీకరించినా.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్,లోకేశ్ తమ తీరు అస్సలు మార్చుకోవడం లేదు.తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న కూటమి నేతల ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు వక్రబుద్ధి, అబద్ధాలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్‌ను ఏర్పాటు చేసింది. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఎవరూ తప్పుపట్టలేరు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి పెద్దది కాదు. ఇవాళ చంద్రబాబు తన స్వార్థం కోసం వన్‌మ్యాన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఎలాంటి ప్రామాణికత ఉండదు. తనకు అనుకూలంగా రిపోర్టు రాకపోవడంతో మళ్లీ కొత్త కమిషన్ ఏర్పాటు చేసుకుని, తనకు అనుకూలమైన రిపోర్టు కోసం కుట్ర చేస్తున్నాడు. - వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సీబీఐ చార్జ్‌షీట్‌లో తేల్చి చెప్పింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలవలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చంద్రబాబు అన్యాయంగా ఇంకా దుష్ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు సీఎం కాక ముందు వరకు ఎవరైనా తిరుమల ప్రసాదం ఇస్తే కళ్లకు అద్దుకుని తినేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రసాదం పవిత్రతను చంద్రబాబు దిగజార్చాడు. ఒక అబద్ధాన్ని సృష్టించి రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబే. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌ల నివేదికలు స్పష్టం చేసినా చంద్రబాబు ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం దారుణం..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారని, కానీ చంద్రబాబువి అబద్ధాలని సీబీఐ చార్జ్‌షీట్ తేల్చేసిందని వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటిని శుక్రవారం వైఎస్ జగన్ పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. కక్షగట్టి దాడులుచంద్రబాబు అబద్ధాలను ప్రశ్నిస్తున్నందుకు చిప్ పని చేయక పోవడం వల్లే కక్షగట్టి దాడులకు దిగుతున్నారు. చేసిన తప్పు ఒప్పుకుని, లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు వన్‌మ్యాన్ కమిషన్ అంటూ అనుకూల నివేదిక కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆ కమిషన్‌కు ఏ మాత్రం విలువ ఉండదు. టీడీపీ గూండాలు గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో ఐదు కార్లు «ధ్వంసం చేయడంతోపాటు ఇల్లు, ఆఫీసులో విధ్వంసం సృష్టించి ఆఫీస్‌కు నిప్పుపెట్టారు. ఆ మర్నాడు ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జోగి రమేష్ ఇంటిపై ఏకంగా యాసిడ్ బాటిళ్లతో, పెట్రోల్ బాంబులతో వి«ధ్వంసం సాగించారు. అక్కడ అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్ తండ్రిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల సమక్షంలోనే రెండు చోట్లా దాడులు జరిగాయి. టీడీపీ గూండాలకు వారు అండగా ఉంటున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు రాష్ట్రంలో జంగిల్‌రాజ్ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు సర్కారు చర్యలు ఉన్నాయి. తప్పులు చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోం. సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. మరో మూడేళ్లలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇప్పుడు తప్పులు చేస్తున్న అందరినీ బోనులో నిలబెడతాం. వారికి శిక్ష తప్పదు. నాగరిక సమాజం తలదించుకునేలా.. రాష్ట్రంలో జంగిల్‌రాజ్ పరిపాలన సాగుతోంది. నాగరిక ప్రపంచం తలవంచుకునేలా చంద్రబాబునాయుడు చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో 5 కార్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. అద్దాలను పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లను దుర్భాషలాడారు. ఇంటి పక్కనే ఉన్న ఆఫీసులోకి చొరబడి విధ్వంసానికి దిగి ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగటాన్ని అంతా చూశాం. అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దహనకాండ జరిగింది. ఆ మర్నాడే ఇక్కడ కూడా సాయంత్రం అదే పరంపర కొనసాగింది. జోగి రమేష్ ఇంటిపైనా దారుణంగా దాడి చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని సీబీఐ తేల్చింది చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టించాడని సాక్షాత్తూ సీబీఐయే తేటతెల్లం చేస్తూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగా తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పందికొవ్వు కానీ, చేప నూనె కానీ కలపలేదని సీబీఐ స్పష్టం చేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు దు్రష్పచారం చేశాడు. ప్రతిష్టాత్మక ల్యాబ్‌లూ అదే నిర్ధారించాయి తిరుమలలో వాడిన నెయ్యిపై చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ల్యాబ్‌లు నిర్ధారించాయి. ఆ మేరకు నివేదికలు ఇచ్చాయి. అవి రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వారు పరీక్షించిన నెయ్యి శాంపిల్స్ అన్నీ కూడా చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయన మనిషి టీటీడీ ఈవోగా ఉండగా సేకరించినవే. సీబీఐ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీకి ఆ శాంపిల్స్ పంపారు. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, గొడ్డు కొవ్వు లేదని, పందికొవ్వూ లేదని, ఎలాంటి చేపనూనె కూడా కలవలేదని ఆ ల్యాబ్‌లు ధ్రువీకరించాయి. ఆ రిపోర్టులను సీబీఐ కూడా సరి్టఫై చేసింది. సీబీఐ సిట్ ఆ మేరకు చార్జ్‌షీట్ దాఖలు చేసింది. భూమన, వైవీకి సీబీఐ క్లీన్చిట్.. ఆ చార్జ్‌షీట్‌లో సీబీఐ మరో విషయం కూడా చెప్పింది... గతంలో టీటీడీ చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు వాళ్లు ఎలాంటి తప్పూ చేయలేదని, అన్యాయమైన పనులు చేయలేదని స్పష్టం చేసింది. అందుకే వారి పేర్లు చార్జ్‌షీట్‌లో పెట్టలేదు. వారిలో ఎవరినీ అరెస్టు చేయలేదు. అంటే సీబీఐ వారికి క్లీన్చిట్ కూడా ఇచ్చింది. ఇదొక్కటే కాదు.. ఆ చార్జ్‌షీట్‌లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. (పేజీ నెం 62 ప్రస్తావించారు) చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2024 జూలై 25న నెయ్యిలో నాణ్యత లేదని టీటీడీ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది (ఆ రిపోర్టు చదివి వినిపించారు. చార్జ్‌షీట్‌లోని పేజీ నెం 64, 44 అంశాలను చదివి వినిపించారు). కానీ ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దొడ్డిదారిన వేరేవాళ్ల పేరుతో తిరిగి వస్తే వాటిని టీటీడీ ఆమోదించింది. అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ వెల్లడించింది. అలా చంద్రబాబు ప్రభుత్వం మీద, వాళ్లు చేసిన తప్పుల మీద, వాళ్లు చేసిన అన్యాయంపై చార్జ్‌షీట్‌లో రాశారు. పాపం చేసింది ఎవరు బాబూ..? ఏకంగా సీబీఐనే చంద్రబాబు ప్రభుత్వం మీద ఈ మాదిరిగా చార్జిషీట్లో రాసిన తర్వాత అసలు పాపం చేసిన వాళ్లు ఎవరు? అని చంద్రబాబును, ఆయన కుమారుడిని, కూటమిలో ఉన్న పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నా. టీటీడీ నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు చెప్పారు..? సీబీఐ చెప్పిందా..? ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయా..? చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌తో పాటు రోజూ వారి పల్లకి మోస్తున్న ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) ప్రచారం చేయడం మినహా ఎవరైనా చెప్పారా? ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కన్నా హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలి.. అనిల్ సింఘాల్‌ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా నియమించారు. మా ప్రభుత్వం ఆయన్ను కొనసాగించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన్నే తెచ్చారు. శ్యామలరావును టీటీడీ ప్రక్షాళన కోసం తెచ్చానని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక చెప్పారు. ప్రక్షాళనకు ముందే ఆయన్ను ఎందుకు టీటీడీ ఈవోగా తొలగించారు? శ్యామలరావు ఈవోగా ఉన్నప్పుడు కొన్ని నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. అవే ట్యాంకర్లు.. మళ్లీ టీటీడీకి మరో డెయిరీ పేరుతో తిరిగి వచ్చినట్లు సీబీఐ సిట్ ధ్రువీకరించింది. మరి పాపం చేసింది ఎవరు చంద్రబాబూ? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. పూజలు చేయడం తప్పా..? మానవత్వం లేని చంద్రబాబుని ప్రశ్నిస్తూ.. ఆయనకు దేవుడు జ్ఞానోదయం కలిగించాలని ప్రార్థిస్తూ మా నాయకులు ఆలయాల్లో పూజలు చేశారు. ఆయనతోపాటు లోకేశ్, పవన్‌కల్యాణ్‌తో సహా ఇతర నాయకులకు బుద్ధి, జ్ఞానం కలగాలని, వారి చిప్ రిపేర్ చేయాలని మా నాయకులంతా గుళ్లల్లో పూజలు చేశారు. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేస్తూ శ్రీవారి ప్రతిష్టను మంట కలిపేస్తుంటే మావాళ్లు గుళ్లలో పూజలు చేయడం తప్పా? ఇది హత్యాయత్నం కాదా..? లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్ధమని అంత స్పష్టంగా, అన్ని విధాలుగా తేలిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి ఫ్లెక్సీలు కట్టి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా దు్రష్పచారం చేయడం ధర్మమేనా? ఆ ఫ్లెక్సీల్లో అన్యాయమైన మాటలు రాసి దు్రష్పచారం చేయడం న్యాయమేనా? చంద్రబాబు, లోకేశ్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రశ్నిస్తూ మా నాయకుడు జోగి రమేష్.. మీ చిప్ రిపేర్ చేసుకోమని సలహా ఇచ్చాడు. దానికి ఇంత అన్యాయమైన పని చేయడం ధర్మమేనా? సలహా ఇవ్వడం మినహా జోగి రమేష్ ఏమీ చేయలేదు. దానికే చంద్రబాబుకి అసహనం ఏస్థాయిలో వచ్చింది అంటే.. ఏకంగా యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేయించాడు. ఆ యాసిడ్ పడిన ప్రాంతంలో బండలు తీవ్రంగా కాలిపోయాయి. గోడల నిండా యాసిడ్ మరకలు కనిపిస్తున్నాయి. యాసిడ్ పడి డోర్లు కాలిపోయాయి. ఆ పక్కనే ఉన్న స్విచ్ బోర్డుల మీద పడి షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద ఘోరం జరిగి ఉండేది. ఇంట్లో ఉన్న కర్టెన్లు, ఉడెన్ ఫర్నీచర్లు కాలిపోతే పరిస్థితి తీవ్రరూపం దాల్చేది. ఇంట్లో 80 ఏళ్ల వయసున్న జోగి రమేష్ నాన్న నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా? బీసీ నాయకుడిగా జోగి రమేష్ ఎదుగుతుంటే, ప్రభుత్వ తప్పులపై ఆయన వాయిస్ బలంగా వినిపిస్తుంటే.. ఆ గొంతు నొక్కే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో దాడులు చేయిస్తున్నాడు. పోలీసులతో కలిసి టీడీపీ కుట్ర..జోగి రమేష్ ఇంటి మీద సాయంత్రం ఐదు గంటలకు దాడి జరిగితే.. ఆ దాడికి సంబంధించి పోలీసులు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కుట్రలు చేశారనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం (పోలీసులతో టీడీపీ నాయకులు మంతనాలు జరుపుతున్న ఫొటోను చూపారు). ఇదే సర్కిల్లో డీసీపీ రామకృష్ణ, ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్‌తో టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు దాడులకు సంబంధించి వ్యూహరచన చేశాడు. జోగి రమేష్‌ను హత్య చేసి, ఇంటి మీద దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసే కుట్రలకు ఇక్కడే పోలీసులతో టీడీపీ నాయకుడు మంతనాలు జరిపాడని క్లియర్‌గా తెలిసిపోతోంది. హత్యా యత్నం ఎలా చేయాలి? ఆ దాడికి పోలీసులు ఎలా సహకరించాలో పథక రచన చేశారు. ఏకంగా పోలీసులే టీడీపీ నాయకులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంతనాలు జరిపారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు ఏకంగా పోలీసులనే వెంటబెట్టుకుని కలసికట్టుగా జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగారు.ఈ పాపాలు ఎవరివి బాబూ?» నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి.. మళ్లీ అదే నెయ్యి ట్యాంకర్లు మరో పేరుతో వస్తే ఆమోదించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కదా.» అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ చెప్పింది. » చంద్రబాబు ప్రభుత్వం తప్పులు, వాళ్లు చేసిన అన్యాయాన్ని చార్జ్‌షీట్‌లో సీబీఐ రాసింది » టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్‌ను తీసుకొచ్చింది ఎవరు? » ప్రక్షాళన కోసం తెచ్చామన్న శ్యామలరావును తప్పించింది ఎవరు?ఇవిగో పచ్చి నిజాలు... సాక్ష్యాలుటీడీపీ నాయకుడు ఫతావుల్లా ఏకంగా యాసిడ్ బాటిల్, పెట్రోల్ బాంబులతో దాడి చేశాడు. దాడికి ముందు వాటితో ఉన్న ఫొటోల్లో క్లియర్‌గా చూడవచ్చు. పోలీసుల సమక్షంలోనే జోగి ఇంటిపైకి పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించాడు. ఫతావుల్లాతోపాటు ఆశా అనే టీడీపీ కార్యకర్త కూడా జోగి రమేష్ ఇంటి మీద పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడి చేసింది. ఆశా కుమార్తె పెళ్లికి చంద్రబాబు కూడా హాజరయ్యాడు. (చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రితో వారు దిగిన ఫొటోలు, ఆశా కుమార్తె పెళ్లికి హాజరైన చంద్రబాబు ఫొటోలు చూపించారు. పోలీసులతోనే కలసి వచ్చి వారి సమక్షంలోనే టీడీపీ నాయకులు దాడికి దిగిన వీడియోలు కూడా చూపారు). టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు, డీసీపీ, సీఐ మంతనాలు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులతో కలిసి టీడీపీ శ్రేణులు వస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. (టీడీపీ నాయకుడు బాటిల్ ఎగరేస్తూ పోలీసులతో కలిసి జోగి రమేష్ ఇంటి వద్దకు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్‌ను మీడియాకు చూపారు). మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేక జంగిల్ రాజ్‌లో ఉన్నామో చెప్పేందుకు ఈ వీడియోలే సాక్ష్యం. కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యేందుకు జోగి రమేష్ వెళ్తుండగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై దాడి జరిగినట్లు ఆయనకు సమాచారం వచ్చింది. ఈ విషయంపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసేందుకు జోగి రమేష్ ఫోన్ చేసినా స్పందించలేదు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి సమయంలోనూ ఇలాగే జరిగింది. అన్ని ఆధారాలున్నాయ్.. ఎవరినీ వదిలిపెట్టం.. దాడులు, విధ్వంసాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి గడప తొక్కుతాం. న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రంలో సాగుతున్న జంగిల్‌రాజ్ పాలనను దేశానికి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది మూడేళ్లే. ఆ తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇవాళ మా పార్టీ నాయకుల ఇళ్లపై గూండాగిరీ చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదు.బీసీలంటే చంద్రబాబుకు చులకన.. తంబళ్లపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. కమీషన్ల పంపకాల్లో తేడా రావడంతో ఆ వ్యవహారం బయటపడింది. ఆ కేసులో జయచంద్రారెడ్డిని అరెస్టు చేయాల్సింది పోయి సంబంధం లేని జోగి రమేష్‌ను కేసులో చేర్చారు. చంద్రబాబు రాజ్యంలో జోగి రమేష్ లాంటి వ్యక్తి నకిలీ లిక్కర్ తయారు చేయగలడా? ఆ లిక్కర్‌ను బెల్ట్ షాపుల్లోకి సరఫరా చేయగలరా? జోగి రమేష్ పై చంద్రబాబు ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. చేయని నేరానికి 83 రోజులు జైలులో పెట్టారు. ఆయన కుమారుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నాడని చిన్న పిల్లాడిపై ఏడు కేసులు పెట్టారు. జోగి రమేష్ భార్యపై పోలీసులే దౌర్జన్యం చేసి తిరిగి ఆమెపైనే కేసులు పెట్టారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న చులకన భావానికి జోగి రమేష్‌పై నమోదైన కేసులే నిదర్శనం. -
సీబీఐ క్లీన్‌చిట్‌పై ‘ఏకసభ్య’ డ్రామా!
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారానికి సీబీఐ సిట్ రిపోర్టుతో చెక్ పడటం.. కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఏకసభ్య విచారణ కమిషన్ అంటున్నారని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తదుపరి చర్యలు తీసుకోమని సీబీఐ సిట్ చెప్పలేదని.. దోషులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని గుర్తు చేశారు. మరి సిట్ రిపోర్టులో వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఎక్కడైనా ఉన్నాయా? అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు, సీబీఐ సిట్ చార్జిషీట్లో స్పష్టంగా తేల్చినా నిస్సిగ్గుగా ఇంకా కుట్రలు పన్నుతారా? అని ధ్వజమెత్తారు. ఏమీ లేకపోయినా రాజకీయ కుట్రలతో వైఎస్సార్ సీపీపై మూకుమ్మడిగా విష ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుప్రీం’ జోక్యంతో సాగని బాబు ఆటలు.. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయని దారుణమైన అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. తన ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్‌ను నియమించి వాటినే రిపోర్టులో ఇచ్చేద్దామని భావించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్ ఏర్పాటు కావడంతో ఆయన ఆటలు సాగలేదు. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ దర్యాప్తులో అన్నీ తేలిపోవడంతో.. చంద్రబాబు తనను తదుపరి చర్యలు తీసుకోమని చెప్పిందంటున్నారు. కానీ సీబీఐ సిట్ చెప్పింది.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోమనే. ఆ దోషుల్లో మీరు ఇంతగా విషం చిమ్ముతున్న జగన్ పేరు ఉందా? సిట్ రిపోర్టులో జగన్ కానీ, అప్పటి దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేరు కానీ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ ఈవో, జేఈవో.. ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పండి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సిఫార్సు చేసిన అధికారులే ఇందులో ఉన్నారు. ఈ పాపం వైఎస్ జగన్‌కు ఆపాదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నెయ్యి కిలో రూ.291కే మీరు కొనలేదా? శ్రీవారి ప్రసాదంలో కెమికల్స్ కలిశాయని, మార్కెట్ కన్నా తక్కువ రేటు రూ.319కే ఎలా ఆవు నెయ్యి కొన్నారని అడుగుతున్నారు. తక్కువ రేటుకు నెయ్యి కొన్నారు కాబట్టి కల్తీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీలో ఇద్దరు అధికారులు హర్‡్ష ఫ్రెష్ అనే డెయిరీని 2019 ఫిబ్రవరిలో ఆమోదిస్తే... ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. నాడు ఫిబ్రవరి తర్వాత ఉన్న ప్రభుత్వం మాదే అయితే మే నెలలో ఈసీతో పోట్లాడి మీరు క్యాబినెట్ మీటింగ్ ఎలా పెట్టారు? ఎలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు? పోలింగ్ తర్వాత కూడా మీ ప్రభుత్వం యాక్టివ్గానే పని చేసింది. 2019లో జగన్ సీఎం కాకముందే మీ ఆపద్ధర్మ ప్రభుత్వంలోనే ఈ హర్‡్ష ఫ్రెష్ డెయిరీని తీసుకొచ్చారు. ఆ తర్వాత అదే భోలే బాబా డెయిరీగా పేరు మార్చుకుంది. అప్పట్లో వీళ్లు 82 వేల కేజీలు ట్యాంకర్లలో, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మీరు కిలో నెయ్యి రూ.291కి ఎలా కొన్నారు? మా హయాంలో రూ.319, రూ.329కి కొనుగోలు చేస్తే తప్పు అంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా.. టెండర్లు వివరాలు తేదీలతో సహా బయటపెట్టండి. ఎవరు దొంగో ఎవరు దొరో తేలుతుంది. రోజుకో మతం పేరుతో పవన్ డ్రామా.. పవన్ కళ్యాణ్ ఉచ్ఛం నీచాలు మరిచి విషం చిమ్మే వ్యక్తి! క్రిస్టియన్ అంటారు.. బాప్టిజం తీసుకున్నా అంటారు. నన్ను, చంద్రబాబును తిడుతుంటే మీరు కాచుకోరా? అని పవన్ కళ్యాణ్ ఆయన అన్నయ్యను తిట్టారని జనసేన నేతలే చెబుతున్నారు. దేవుడంటే భయం లేని వారు ఇవాళ మాట్లాడుతున్నారు. అదే అన్నయ్య.. గతంలో దేవుడే లేడని అంటాడు! దేవుడిని విమర్శించను.. లేని వారి గురించి ఎలా మాట్లాడతా? అంటాడు. తమ్ముడు కోటింగ్ ఇచ్చాక బయటికి వచ్చి.. నేను సనాతన హిందువును! వైఎస్ జగన్ క్రిస్టియన్ అంటూ దిగజారి మాట్లాడుతున్నాడు. రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్లెవరో పవన్‌కు తెలియదా? ఆ ఘటన తర్వాత నెల రోజుల్లో కొత్తగా విగ్రహం చేయించి హైందవ సంప్రదాయాల ప్రకారం గత ప్రభుత్వం పునఃప్రతిష్టించిన విషయం తెలియదా? అంతర్వేది రథాన్ని కాల్చారంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. మీ ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం పక్కన పెంటపాడులో రథాన్ని తగలబెడితే చర్యలు తీసుకున్నారా? అంతర్వేదిలో దగ్ధమైన రథాన్ని మేం మళ్లీ ఉత్సవాల కల్లా కొత్తది చేయించి పెట్టాం. మరి మీరు పెంటపాడులో రథం తిరిగి చేయించారా? గుళ్లు ధ్వంసం చేసిన చరిత్ర బాబుదే 2015–16లో విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరుతో పలు ఆలయాలను ధ్వంసం చేసిన చంద్రబాబు... 250 గుళ్లు జగన్ ధ్వంసం చేశారని అనటానికి సిగ్గుందా? మతం పేరుతో విషం చిమ్ముతున్న మీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలే కదా అవి. ఉత్సవమూర్తులే కాదు.. గర్భగుడిలో ఉన్న మూర్తులను కూడా మీ ప్రభుత్వంలో ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గుళ్లలో కనీసం సంప్రోక్షణ చేశారా? అపచారం చేశామని చెంపలు వాయించుకున్నారా? ఎక్కడైనా మెట్లు కడిగారా? మీరు కూలదోసిన ప్రతీ ఆలయాన్ని జగన్ తిరిగి నిర్మించారు. దేవుడి మీద పగ పెట్టుకున్నారని అంటున్న పవన్.. ఆ దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నందుకు ఏమైపోతారో ఆలోచించుకోవాలి. అయోధ్యకు జంతుకొవ్వు, పందికొవ్వుతో లక్ష లడ్డూలు పంపించారని పవన్ ఈ రోజుకూ మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఉంటుందా? నాటి టీటీడీ బోర్డు సభ్యులు సౌరభ్ బోరా, మైహోం రామేశ్వరరావు అయోధ్యకు శ్రీవారి ప్రసాదం లక్ష లడ్డూలు పంపిద్దామని, అందుకు కావాల్సిన శ్రేష్టమైన 2 వేల కిలోల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. ఈ నిర్ణయానికీ, మా ప్రభుత్వానికీ సంబంధం లేదు. అది టీటీడీ బోర్డు నిర్ణయమే. కానీ పవన్ కళ్యాణ్ కొవ్వుతో చేసిన లడ్డూలు పంపించారని ఇవాళ్టికీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. జగన్ హిందూ ధర్మాన్ని గౌరవించలేదంటున్న పవన్.. తోలు బూట్లు వేసుకుని దేవుడికి పూజలు చేస్తూ హారతిస్తున్న మీ మిత్రుడు చంద్రబాబును ఏమంటారు? తండ్రి చనిపోయినా తలనీలాలు ఇవ్వని పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్లా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట. తిరుమలను దివ్యక్షేత్రంగా ప్రకటించింది వైఎస్సారే ఏడు కొండలను నాడు వైఎస్సార్ రెండు కొండలు అన్నారంటూ చంద్రబాబు, పవన్ దు్రష్పచారం చేస్తున్నారు. తిరుమల ఏడు కొండలను దివ్యక్షేత్రం అని పిలవాలని, ఆ కొండల మీద అన్యమత ప్రచారం నిషిద్ధమని 2007 జూన్ 2న వైఎస్సార్ జీవో ఇచ్చింది నిజం కాదా? ఇప్పుడు సర్వనాశనం అయిపోయేది, మట్టికొట్టుకుపోయేది ఎవరో పవన్ కళ్యాణ్ చెప్పాలి. తమ ఇంట్లో నుంచి చూస్తుంటే ఏడు కొండలు కనిపిస్తాయని, భక్తి పారవశ్యం చెందుతున్నట్లు చంద్రబాబు చెబుతున్న మాటలు.. వందకోళ్లను తినేసే తోడేలు సాయంత్రం ప్రవచనాలు చెబుతున్నట్లుంది! మీ మాటలు నమ్మటం లేదని పవన్ కళ్యాణ్‌తో చెప్పిస్తున్నట్లున్నారు. జనం ఆయన మాటలు కూడా నమ్మడం ఎప్పుడో మానేశారు.జంతు కొవ్వు ప్రచారం మీ నలుగురిదే వైఎస్ జగన్ క్రిస్టియన్ అని... శ్రీవేంకటేశ్వరస్వామికి హిందూ భక్తులను తగ్గించేయడానికే ఇదంతా చేశారని నిర్లజ్జగా పిచి్చమాటలు చెబుతున్న మీకు.. కల్తీ నెయ్యి నాలుగు ట్యాంకర్లు వాడి లడ్డూలు తయారు చేసినా నీచం అనిపించదు! జంతువుల కొవ్వు లేదని ఎవరు చెప్పారని గద్దిస్తున్న చంద్రబాబు... అది ఉందని ఎవరు చెప్పారో బయటపెట్టాలి. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి మినహా నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎవరూ చెప్పలేదు. 80 ఏళ్ల వయసులో ఏం మూటగట్టుకుపోదామని ఈ డ్రామాలు చంద్రబాబూ? పవన్ కళ్యాణ్ ఒక్కో దశలో ఒకలా.. క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, హిందువు అని మాట్లాడుతుంటారు. పీఏ అప్పన్నకు రూ.4.65 కోట్లు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. మరి మీ పీఏ శ్రీనివాస్‌కు రూ.2 వేల కోట్లు వచ్చాయని ‘ఈడీ’ చెప్పిన విషయాన్ని మర్చిపోతున్నారు. అది బహిర్గతం కాగానే ఆయన విదేశాలకు పారిపోయాడు. మీరు తిరిగి ముఖ్యమంత్రి కాగానే అమెరికా నుంచి తిరిగి ఇక్కడ వాలిపోయాడు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసి తానూ, తన కుమారుడు కలకాలం అధికారంలో ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. సీబీఐ సిట్ చార్జ్‌షీట్‌లో ఎక్కడా వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ వితండవాదం చేస్తున్నారు. రేపు కొత్త కమిషన్ (వన్‌మెన్ కమిషన్) వేసి జగన్‌ను, వైవీ సుబ్బారెడ్డిని చేర్చే దుర్బుద్ధితో ఉన్నారని దీన్నిబట్టి అర్ధం అవుతోంది. దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వీళ్ల మాటలున్నాయి. మతం పేరుతో జగన్‌ను నాశనం చేయాలని ఇలాంటి విషపూరిత మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అపచారాలను ప్రశ్నించాలని, కట్టడి చేయాలని స్వామీజీలను ప్రవచనకారులను, హైందవ ధర్మ పరిరక్షకులను కోరుతున్నాం.ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? శ్రీవేంకటేశ్వరస్వామివారికి తలపెట్టిన అపచారం తన మనసులో దహించేయడం వల్లే ప్రెస్మీట్లో అస్మదీయులు అడుగుతున్న ప్రశ్నలను కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారు. టీటీడీని ప్రక్షాళన చేయమని మీరు బాధ్యతలు అప్పగించిన ఈవో శ్యామలరావు ఇప్పుడు అక్కడ ఎందుకు లేరు? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నియమించిన ఈవో శ్యామలరావు... నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ జరిగిందని వెనక్కి పంపేశామని, వాటి శాంపిల్స్ ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపితే వనస్పతి ట్రేసెస్ ఉన్నాయని తేలిందని చెప్పారు. ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని ఆయన ఎక్కడా చెప్పలేదు. కేవలం వనస్పతి కలిసిందని మాత్రమే చెప్పారు. జంతుకొవ్వు కలిసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని లోకేశ్, చంద్రబాబు చెప్పారు. ఆవునెయ్యి కాకుండా జంతువుల కొవ్వు, నాసిరకం సరుకులతో జగన్ లడ్డూలు చేయించారని, తాము మాత్రం నాలుగు లారీలను వెనక్కి పంపామని చెప్పుకున్నారు. ఏఆర్ డెయిరీ నుంచి తెప్పించి వెనక్కి పంపిన నాలుగు లారీలు వైష్ణవీ డెయిరీకు వెళ్లాయని సిట్ రిపోర్టులో పేర్కొంది.ఈ విషయం భోలేబాబా వాళ్లే విచారణలో చెప్పారు. నెల రోజుల పాటు ఈ నాలుగు ట్యాంకర్లు కాళహస్తిలోని ఓ పెట్రోల్ బంకులో నిల్వ ఉంచి చివరికి సీలు కూడా తీయకుండా, సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవీ డెయిరీ పేరుతో కొండపైకి పంపారు. లడ్డూల్లో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? ఎవరు మట్టికొట్టుకుపోవాలి? ఎవరు సర్వనాశనం అవుతారు? -
సమాధానం చెప్పలేక బాబు అసహనం
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ వ్యవహారం గురించి మాట్లాడేందుకు జనసేన, బీజేపీతో కలసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తీవ్ర అసహనం ప్రదర్శించారు. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేయడంపై తన అనుకూల మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులతో సీఎం గురువారం సమావేశం నిర్వహించి లడ్డూ వ్యవహారంపై చర్చించారు. అనంతరం వారందరితో పాటు ఐదుగురు మంత్రులతో కలసి మీడియాతో మాట్లాడారు. సిట్ చార్జిషీట్లో జంతువుల కొవ్వు లేదని ఉంది కదా? అన్న విలేకరుల ప్రశ్నకు ఒక్కసారిగా ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘లేదని ఎక్కడుంది..? నీకేమైనా కల వచ్చింందా..? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా..? వాట్ ఆర్ యూ టాకింగ్..? మర్యాదగా చెబితే వినాలి..’ అంటూ చిందులు తొక్కారు. ఆ ప్రశ్న అడిగింది ఎల్లో మీడియా రిపోర్టరే కావడంతో కొంత తమాయించుకున్నా, ఆగ్రహాన్ని మాత్రం దాచుకోలేకపోయారు. సిట్ వేసిన చార్జిషీట్ ఇంకా నంబర్ అవలేదని, ఒక నివేదికను తమకు పంపి చర్యలు తీసుకోవాలని కోరిందని తెలిపారు. దానిపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే కోర్టుకు అదనపు వివరాలు ఇస్తామని చెప్పారు. సిట్ నివేదికలో రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి తయారైనట్లు ఉందన్నారు. సీబీఐ నివేదికలో ఎక్కడా కల్తీ లేదని చెప్పలేదన్నారు. ఎన్డీడీబీ నివేదికలోని అంశాన్నే తాను ప్రస్తావించానని చెప్పారు. హిందూ మతంలో విడాకులు ఇవ్వడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదికను చంద్రబాబు తమకు చదివి వినిపించారని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీటీడీ సహా అనేక పెద్ద ప్రాజెక్టుల్లో అక్రమాలకు గత ప్రభుత్వం తెర తీసిందని పీవీఎన్ మాధవ్ ఆరోపణలు చేశారు. -
లడ్డూపై అబద్ధాల ప్రచారం రాజకీయ కుట్రే!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగకుండానే జరిగిందని ప్రచారం చేయడం పెద్ద నేరం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ జరిగిందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను దోషిగా నిలబెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డుకు ఈడ్చడం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఏమాత్రం తగనిది. సీబీఐ నేతృత్వంలోని స్వతంత్ర సిట్ దర్యాప్తులో ఈ విషయాలన్నీ నేడు స్పష్టమయ్యాయి. అయినా వైఎస్సార్ సీపీని టార్గెట్ చేసేందుకు మళ్లీ దర్యాప్తు కమిటీని నియమిస్తామంటున్నారు. సీబీఐ తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వనందుకే ఈ కమిటీని నియమిస్తున్నారా?రాజకీయ లబ్ధి కోసం భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న చంద్రబాబు, ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని ప్రజలకు క్షమాపణ చెబుతారని ఆశించినవారికి నిరాశే మిగిలింది. తన తప్పు బయటపడకుండా ఉండేందుకు అనుకూల మీడియాతో కలిసి ప్రజ లను తప్పుదోవ పట్టించే కొత్త పంథాను ఆయన అనుసరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నేను మారిన మనిషిని, నన్ను నమ్మండి’ అని చెప్పి అధికారం దక్కించుకున్నాక, తన సహజ స్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో జంతు కొవ్వు కలవ లేదని తేలినా, పదే పదే అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఓపిక, సహనం ఉండాలి. ఎటు వంటి విచారణ లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండా ముఖ్యమంత్రే స్వయంగా కల్తీ జరిగిందని ప్రకటించడం వెనుక ఉన్న ప్రాతిపదిక ఏమిటో అర్థం కావడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సైతం ఘాటుగా స్పందించింది. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అపోహలు సృష్టించడం తగదని మందలించింది.భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థ లైన హరియాణాలోని ‘నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్ లోని ‘నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు’ పరిశోధనల ప్రకారం లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయింది. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కూడా జంతు కొవ్వు ప్రస్తావనే లేదు. ఇలాంటప్పుడు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టి చేసిన ఈ రాజకీయ క్రీడ అత్యంత దురదృష్టకరం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, ఇప్పటికైనా బాబు తన తప్పును ఒప్పుకుని హుందాగా వ్యవహరించడం అవసరం.దేవుని పేరుతో రాజకీయం చేసే బీజేపీ నాయకత్వం ఈ విష యంలో అనుసరిస్తున్న మౌనం విస్మయకరంగా ఉంది. ఒక మహిళా నేత తమ పార్టీకి కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండి, పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీకి చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే స్పందిస్తున్నారు. గతంలో కేంద్రం తెచ్చిన రైతు చట్టాలపై సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు నోరు మెదపని ఆమె, ఇప్పుడు కోర్టు చేసిన వ్యాఖ్యలపై వింతగా స్పందిస్తున్నారు. తన బంధువు దోషిగా తేలుతారని తెలిసి ఇటువంటి విమర్శలు చేస్తున్నారా? మరొక నాయకుడు ఆలయ మెట్లు కడుగుతూ, సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. తన రాజకీయ భాగస్వామిని రక్షించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జరిగిన తప్పునకు బాధ్యత వహిస్తూ భక్తులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది.డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డివ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు -
అడ్డంగా దొరికి.. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా?
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ మహాప్రసాద వ్యవహారంపై సీబీఐ నివేదికతో కూటమి పెద్దల వెన్నులో వణుకు మొదలైంది. కల్తీ జరిగిందని పదే పదే చెప్పాలంటూ తమ పార్టీల నేతలకు నేతలకు పవన్, చంద్రబాబు హుకూం జారీ చేశారు. అయితే అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో భారీ ప్రెస్‌మీట్‌తో ఇప్పుడు మరో నాటకానికి తెర తీశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై దర్యాప్తు వ్యవహారంలో కూటమి పెద్దలు గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇప్పటికే అబద్ధాలు ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అండ్ కో.. తాము చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ.. దొంగే దొంగా దొంగా అన్నచందాన మరోసారి అబద్ధపు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మీడియాపై చంద్రబాబు అసహనంతిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదని.. కూటమి సర్కార్ ఆధ్వర్యంలో ఉన్న సీబీఐ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లాంటి సంస్థలే తేల్చి చెప్పాయి. కానీ, ఎల్లో మీడియా మాత్రం సీబీఐ విచారణ, ఆ నివేదికలపైనా బురద జల్లుతూ తప్పుడు రాతలు రాస్తోంది. ఇదే విషయాన్ని పరోక్షంగా కొందరు మీడియా ప్రతినిధులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. అది విని ఆయన ఒక్కసారిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికలనే ఆయన తప్పుబట్టారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందని.. ఇప్పటిదాకా వచ్చిన నివేదీకలన్నీ ఏకసభ్య కమిటీ ముందు ఉంచుతామని.. సీబీఐ నివేదికపై ఆ కమిటీ విచారణ చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఊగిపోయిన పవన్జంతు కొవ్వు లేదని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసినా.. ఉందంటూ మళ్లీ ప్రచారంతో అపచారం చేస్తున్నారు. లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లో తేటతెల్లమైందంటూ ఇటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇష్టానుసారం మాట్లాడారు. ఏ నివేదికలోనూ వైఎస్సార్సీపీ నేతలకు క్లీన్ చిట్(అసలు ఎవరి పేరు లేదు కూడా) ఇవ్వలేదు. తాను, చంద్రబాబు ఒక్కటేనని.. మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటామని.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీతో మహా పాపం జరిగిందంటూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని, వైఎస్సార్సీపీ కీలక నేతలు వైవీసుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిని బద్నాం చేయాలనే కూటమి కుట్రలు సీబీఐ నివేదికతో పటాపంచలు అయ్యాయి. దీంతో కక్కలేక మింగలేని స్థితిలో ఉన్న కూటమి బ్యాచ్.. ఈ విషయంలో తప్పుడు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భావించింది. అందుకే సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ నిర్వహించి.. ఆపై మీడియా ఎదుట ప్రకటనలు చేసింది. ఇది చూసి అడ్డంగా దొరికిపోయి.. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా? అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ముందే చెప్పిన వైఎస్ జగన్చంద్రబాబు ఏకసభ్య కమిషన్ డ్రామా గురించి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముందే చెప్పారు. బుధవారం అంబటి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు’’ అంటూ మాట్లాడారు. జగన్ చెప్పినట్లే.. ఇవాళ చంద్రబాబు ఏకసభ్య కమిషన్ సీబీఐ సహా నివేదికలన్నింటిపైనా విచారణ జరుపుతుందంటూ ప్రకటించారు. -
చంద్రబాబు, పవన్ ఏకాంత చర్చలు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని అడ్డగోలుగా విష ప్రచారం చేసి దొరికిపోయిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇద్దరూ రెండున్నర గంటలపాటు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధాలని సీబీఐ సిట్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ ద్వారా బయటకొచ్చిన నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి పాపం మూటగట్టుకున్నారని ప్రజలు నమ్ముతుండడం.. వారు చెప్పిన అబద్ధాలను ఎంత సమర్థించుకుంటున్నా ప్రజలు నమ్మకపోవడంతో దీనిపై ఏం చేయాలని కూటమి నేతలు రెండ్రోజులుగా తర్జనభర్జన పడుతున్నారు. అందులోభాగంగానే చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్ బుధవారం సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది.ఇక లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయాలపై టీడీపీ శ్రేణులతో దాడి చేయించడంవల్ల ప్రభుత్వం తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపైనే ఎక్కువగా వీరు మాట్లాడుకున్నట్లు టీడీపీ నేతల ద్వారా తెలిసింది. అలాగే, త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల పంపకం పైనా ప్రాథమికంగా చర్చలు జరిపారు. బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలు తమకే కావాలని పట్టుబడుతుండడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ, జనసేన చెరొకటి పంచుకోవాలా లేక బీజేపీని ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాలని ఒప్పించాలా అనే అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే, ఈసారి జనసేనకు ఒక స్థానం కచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబును పవన్ కోరినట్లు తెలిసింది. అలాగే, తన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం వంటి అంశాలను కూడా పవన్ ప్రస్తావించినట్లు సమాచారం. దీంతోపాటు ఇంకా భర్తీ కావాల్సిన నామినేటెడ్ పదవులతోపాటు రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేకపోవడంవల్ల ఎదురవుతున్న సమస్యలపైనా చర్చించినట్లు తెలిసింది. -
దురుద్దేశంతోనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం
సాక్షి నెట్వర్క్: తిరుమల వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ... దురుద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిట్ నివేదికను వక్రీకరించి బ్యానర్లతో దుష్ప్రచారం చేస్తూ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అలాగే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినిపై దాడులకు పాల్పడిన గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. » మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు విజయవాడ, కొత్తపేట సీఐ కొండలరావుకు ఫిర్యాదు అందచేశారు. వైఎస్సార్ సీపీ ఎన్టీ ఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. » అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్, ఉరవకొండ సర్కిల్ కార్యాలయంలో, కదిరి పట్టణ పీఎస్‌లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మడకశిర వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈర లక్కప్ప ఆధ్వర్యంలో ఎస్ఐ లావణ్యకు ఫిర్యాదు చేశారు. » వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఫోర్తుటౌన్ పోలీస్ స్టేషన్లో, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పెందుర్తి పీఎస్‌లో, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి న్యూపోర్టు పీఎస్‌లో, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి ఎంవీపీ పీఎస్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. » మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు నర్సీపట్నం టౌన్ సీఐకి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్ యలమంచిలి రూరల్ ఎస్ఐకి, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు నక్కపల్లి పీఎస్‌లో, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. » డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు ఫిర్యాదు చేశారు. » పి.గన్నవరం పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్‌కు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్, కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ, తదితరులు సీఐ వైఆర్కే శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రత్తిపాడులో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తదితరులు సీఐ బి.సూర్య అప్పారావుకు ఫిర్యాదు చేశారు. » శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, జేఆర్‌పురం, పాతపట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం రూరల్, నరసన్నపేట పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. » మార్కాపురం జిల్లా గిద్దలూరులో నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి ఫిర్యాదు చేశారు. » పశ్చిమగోదావరి జిల్లా ఆచంట పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురుప్రసాద్ తదితరులు ఫిర్యాదు చేశారు. -
రెడ్బుక్కే రాజ్యాంగం.. నేనే ‘సుప్రీం’!
సాక్షి, అమరావతి: స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రీ, ఏ ముఖ్యమంత్రీగానీ తలపెట్టని దుస్సాహసానికి సీఎం చంద్రబాబు బరి తెగించారు! దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రాజకీయ కుట్రకు తెగబడ్డారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పట్టించుకోకుండా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని నిర్ధారిస్తూ ప్రముఖ సైంటిఫిక్ ల్యాబ్‌లు ఎన్డీఆర్ఐ, ఎన్డీబీ ఇచ్చిన నివేదికలను పక్కనపెట్టేసి సొంత విచారణకు సిద్ధమయ్యారు! సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ధిక్కరిస్తూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిపై మళ్లీ విచారణకు సొంత విచారణ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించారు. తద్వారా తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునే కుట్రలకు తెర తీశారు. దీనిపై తాజాగా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరపగా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ స్వతంత్ర సిట్ దర్యాప్తు నివేదికను తాము పరిగణలోకి తీసుకోబోమని ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి వేదికగా ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ఈ కుతంత్రానికి తెగించారు. లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు... రాజకీయ కక్ష సాధింపుతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులను నమోదు చేసేందుకు తమ వీర విధేయులతో విచారణకు ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కుతంత్రానికి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం గమనార్హం. అంటే సుప్రీం కోర్టుతో తమకేమాత్రం సంబంధం లేదని... టీడీపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఓ సమాంతర న్యాయ వ్యవస్థగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు. దేశ చరిత్రలో ఓ దుస్సాంప్రదాయానికి తెరతీశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేనేలేదని ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని చార్జిషీట్లో సీబీఐ సిట్ పేర్కొన్న అంశం సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ... బాబు బరితెగింపురాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తానని తాజాగా నిరూపించుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించే కుట్రకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే తెరతీసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఆయన నిరాధారణ ఆరోపణలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు విభ్రాంతి చెందారు. అంతే కాదు ఈ రాజకీయ కుట్రకు అధికారిక ముద్ర వేసేందుకు టీడీపీ అనుకూల ఐపీఎస్ అధికారులతో సిట్‌ను నియమించారు. దీనిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుళ్లను అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి హితవు చెప్పింది. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి నాణ్యతపై విచారించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది. ఆ స్థానంలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఆ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. దాంతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరిపి తన నివేదికను ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఈ పరిణామాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరించడానికి తెగబడ్డారు. 2024లోనే చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడం గమనార్హం. అనంతరం సీబీఐ ఆధ్వర్యంలోని స్వతంత్ర సిట్ ద్వారా దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ సిట్ ఆ కేసులో దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఇప్పుడు నెల్లూరు న్యాయస్థానంలో ఉంది. ఇంకా కొనసాగుతున్న ఆ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. కేబినెట్ వేదికగా న్యాయధిక్కార కుట్ర...సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఇతర మార్గాల ద్వారా సేకరించి న్యాయస్థానం పరిధిలోని అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించడం విస్మయపరుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై సమాంతరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. చార్జ్‌షీట్‌లోని అంశాలపై న్యాయస్థానం పరిశీలించి విచారించాలి. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలను వినిపించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనే ‘సుప్రీం’ అన్నట్లుగా బరి తెగించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా సాగుతున్న కేసు దర్యాప్తుపై తాము ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కేబినెట్ సమావేశానికి ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌లతో సమావేశమై చార్జ్‌షీట్‌లోని అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఈ సమావేశానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్‌చంద్ర లడ్హ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావడం గమనార్హం. సిట్ సభ్యుడిగా ఉన్న ఓ అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విస్మయపరుస్తోంది. అంటే సుప్రీం కోర్టు ఆదేశాలతో నియమించిన సిట్‌లో సభ్యుడిగా ఉన్న ఆ అధికారి... సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించే సమావేశంలో భాగస్వామి అయ్యారు. ఆది నుంచి అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఆ అధికారి మరోసారి రాజ్యాంగబద్ధ ధర్మం కంటే తన రాజకీయ విధేయతకే పెద్ద పీట వేశారు. ఇక ఎంపిక చేసిన మంత్రులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో కూడా సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలపై చర్చించారు. అంతే కాదు... సీబీఐ చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు విభేదించారు. ఆ చార్జ్‌షీట్ సమగ్రంగా లేదని వారే తీర్పునిచ్చేశారు. ఈ విధంగా తాము సమాంతర న్యాయ వ్యవస్థ అన్నట్టుగా వ్యవహరించారు. సీబీఐ దర్యాప్తు, నివేదికను తాము గుర్తించబోమని పరోక్షంగా ప్రకటించారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిజం చెప్పినందునే..చంద్రబాబు ప్రభుత్వం ఇంతగా బరితెగించి సుప్రీం కోర్టును ఎందుకు ధిక్కరించింది? అంటే కారణం ఒకటే... తిరుమల లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతోనే ఇంతటి దుస్సంప్రదాయానికి తెగబడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్... లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిగ్గు తేల్చింది. టీటీడీకి చెందిన నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి నెయి నమూనాలను సేకరించి దేశంలోని ప్రతిష్టాత్మకమైన హర్యానాలోని ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ), గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీబీ) ల్యాబొరేటలరీలకు పంపింది. ఆ ల్యాబరేటరీలలో పరీక్షించిన అనంతరం... ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదనే వాస్తవం నిగ్గు తేలింది. శాస్త్రీయంగా పరీక్షించిన రెండు ల్యాబొరేటరీలు సాధికారికంగా వేర్వేరు నివేదికలు ఇచ్చాయి. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఆ రెండు నివేదికలూ స్పష్టం చేశాయి. ఆ రెండు నివేదికలను ప్రస్తావిస్తూ సీబీఐ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాంతో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయ్యింది. జాతీయ పత్రికలు సైతం అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ మీడియా చానళ్లు, డిజిటల్ మీడియా కూడా ఆ విషయాన్ని అత్యంత ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఇక రాజకీయ పార్టీలతో నిమిత్తం లేని తటస్థులు, విశ్లేషకులు కూడా లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేననిఅభిప్రాయపడ్డారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు కొత్త కుతంత్రానికి తెరతీశారు. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించారు.నాడు పచ్చ సిట్.. నేడు పచ్చ కమిషన్!రాజకీయ కుట్ర కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు పంతం పట్టారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద సహాయక చర్యల్లో తన దారుణ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ దుష్ప్రచారానికి తెరతీశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే దుష్ప్రచార కుట్రకు సీఎం హోదాలో ఆయనే నేతృత్వం వహించి ఘోర అపచారానికి పాల్పడ్డారు. శ్రీవారి ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చే కుట్రకు రాజముద్ర వేసేందుకు చంద్రబాబు యత్నించారు. అందుకే ఈ అంశంపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయులైన రాష్ట్ర పోలీసు అధికారులతో సిట్‌ను నియమించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన వివాదాస్పద అధికారి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్‌కు చీఫ్‌గా నియమించడం గమనార్హం. మరో వీర విధేయ అధికారి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, అప్పటి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు (ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ)లను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి ఎవరో కాదు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా నియమితుడైన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యకు ఆయన అల్లుడు. పచ్చ సిట్ ద్వారా చంద్రబాబు కుట్రలను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దాంతో ఆ సిట్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసి స్వతంత్ర సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దాంతో చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ దర్యాప్తులో వెల్లడి కావడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. ఈసారి ఈ అంశంపై దర్యాప్తునకు కమిషన్‌ను నియమిస్తామని ప్రకటించింది. తమ వీర విధేయులైనవారిని అందులో చైర్మన్, సభ్యులుగా నియమించి తమ దుష్ప్రచార కుట్రకు అధికారిక ముద్ర వేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని స్పష్టమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.నివేదిక ఇలా ఉండాలి.. నిందితులుగా వీళ్లే!సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ మరీ సొంత కమిషన్ ఏర్పాటుకు బరితెగించడం వెనుక చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం సుస్పష్టం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని తాము చేసిన దుష్ప్రచారాన్ని బలపరుస్తూ ఓ నివేదిక ఇప్పించుకోవాలి. అంతే కాదు తాము రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలను ఆ కేసులో నిందితులుగా చేర్చాలి. వాస్తవాలు, ల్యాబరేటరీలలో పరీక్షలు, విధి విధానాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకే కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో పరోక్షంగా వెల్లడించారు. ఫలానా వారిని నిందితులుగా చేర్చడానికే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. ఆ కమిషన్‌కు అతి తక్కువ సమయమే ఇస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పడం గమనార్హం. అంటే దర్యాప్తుతో నిమిత్తం లేకుండా, వాస్తవాలను పట్టించుకోకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా నివేదిక ఇచ్చేవారినే కమిషన్ చైర్మన్, సభ్యులుగా నియమిస్తామని ప్రభుత్వం నిర్భీతిగా ప్రకటించుకున్నట్టే! అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చినట్టుగా నివేదికలు ఇప్పించుకుంటాం...! తమకు నచ్చనివారిపై అక్రమ కేసులు పెడతామంటే ఇక దేశంలో పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఎందుకు ఉన్నట్లని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు, వ్యవస్థలను తాము పట్టించుకోమంటూ చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వానికి తెగబడుతోందని విమర్శిస్తున్నారు. -
హింసన చణ... ధ్వంస రచన!
సుప్రసిద్ధ కథా, నవలా రచయిత రావి శాస్త్రి అయిదు దశాబ్దాల క్రితం ‘సొమ్మలు పోనాయండి’ అనే నవలిక రాశారు. ఊరి ప్రెసిడెంట్ కుట్రలకు బలైన ఒక సామాన్యుడి స్వీయ కథనమది. అతని కుటుంబాన్ని కడతేర్చిన ప్రెసిడెంట్‌ను వదిలి, వ్యవస్థలన్నీ ఏకమై ఆ సామాన్యుడికే నరకం చూపిన వైనం అందులో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన ఏణ్ణర్థంగా అచ్చం అదే రీతిలో సాగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన దుష్ప్రచారం బూటకమని సీబీఐ నివేదిక తేల్చినప్పటి నుంచీ ఆ అరాచకం మరిన్ని రెట్లు పెరిగింది. ఎప్పటిలాగే లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉన్నదనీ, కొవ్వెక్కిన ఈ మాయగాళ్ల పుర్రెలే వికృత పోకడలకు పోయాయనీ ప్రజలకు తేటతెల్లమైనప్పటి నుంచీ అధికార ముఠాకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు.ఆ పర్యవసానంగానే రోడ్లపైకొచ్చి దుర్భాషలతో, దుశ్చేష్టలతో రెచ్చిపోతున్నారు. హంతక దాడులకు తెగిస్తున్నారు. గృహ దహనాలకు పాల్పడుతున్నారు. ‘మళ్లీ మళ్లీ వస్తాం... అంతు తేలుస్తామ’ంటూ సవాళ్లు విసురుతున్నారు. సీబీఐ నివేదికను వక్రీ కరిస్తూ ఫ్లెక్సీలతో జనాన్ని ఏమార్చాలనుకుంటున్నారు. గుంటూరు నడిబొడ్డున తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త వందలాది మంది గూండాలను పోగేసి కర్రలు, రాడ్లతో వీధిన పడి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబటిరాంబాబు ఇంటిపై దాడికి దిగిన వైనం మీడియా సాక్షిగా ప్రపంచమంతా చూసింది.రక్షక భటులు భయభక్తులతో వారికి కాపలాగాసిన సంగతినీ అందరూ గమనించారు. ఆ మర్నాడు ఇబ్రహీంపట్నంలో అదే పునరావృతమైంది. తొలినాడు ఎంత విధ్వంసం చేసినా, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం తగలబెట్టడానికి కష్టపడాల్సి వచ్చిందని కాబోలు... ఇబ్రహీంపట్నంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైకి పెట్రోల్ బాంబులతో వచ్చారు. బండరాళ్లు విసిరారు. నిప్పుపెట్టారు. గుంటూరు నగర పోలీసుల మాదిరే ఇక్కడా ఈ కిష్కింధకాండకు పోలీసులు రక్షణగా నిలబడ్డారు.ఇదా ప్రజాస్వామ్యం?! పిల్లనిచ్చిన మామ పాలిటే కాదు... ఆంధ్రప్రదేశ్‌కు కూడా దశమ గ్రహంలా దాపురించి, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు వయసుడిగిన ఈ కాలంలో కూడా బాహాటంగా తన వికృత నైజాన్ని ప్రదర్శించటం చూసి జనం విస్తుపోతున్నారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్, కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా తదితరుల మరణాలకు కారకులెవరో... ఇప్పుడు టీడీపీలోనే ఉన్న సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణపై ఒకానొకప్పుడు హంతక దాడికి తెగించిందెవరో... అందరికీ తేటతెల్లమే. సాక్షాత్తూ మాజీమంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావే తోడల్లుడి హింసన చణనూ, ధ్వంస రచననూ పూసగుచ్చినట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం తగలబడిన వందలాది ఆర్టీసీ బస్సులు, పదేళ్లనాడు అమరావతిలో దగ్ధమైన అరటి తోటలు ఆ ప్రావీణ్యాన్ని కథలు కథలుగా చెబుతాయి.అవిభక్త ఏపీలో 1995 తర్వాత సకల వ్యవస్థలూ భ్రష్టుపట్టడానికి కారకులెవరో అందరికీ తెలుసు. కెమెరా లేదనుకుని సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్‌నే ‘వాడూ...వీడూ’ అని తూలనాడిన ఘనుడు బాబు నుంచి పుత్రరత్నమైనా, మరొకరైనా నేర్చుకునే సంస్కృతి ఏముంటుంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు. అందుకే గుడికెళ్లి వస్తున్న అంబటిపై బూతులు లంకించుకొని రెచ్చగొట్టి, ఆయన తిరిగి తిట్టారని రెచ్చిపోయింది టీడీపీ ముఠా. సంస్కారం ఉంది గనుక క్షమించమని అడిగారాయన. ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానన్నారు. కానీ పాపం పెరిగినట్టు పెరిగిన ఆ ముఠా అర్ధరాత్రి దాకా అల్లకల్లోలం సృష్టించింది. చివరకు అంబటినే ఖైదు చేయించింది. ఎంత విడ్డూరం?! ఏం జరుగుతోంది ఏపీలో? ప్రశ్నించే తత్వాన్ని హత్యాయత్నాలతో, విధ్వంసాలతో చంపేస్తారా? ఈవీఎంల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న అరాచకులు ఇక మారరా? ఇదే వారి నిర్ణయమైతే జనమే తొక్కి నార తీస్తారు. అదునుచూసి గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యంలో నారావారైనా, వేరేవారైనా ఇందుకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. -
కొనసాగుతున్న జంగిల్‌రాజ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు. వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది.పక్కా ప్లాన్‌తోనే దాడిఆదివారం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి చినబాబు డైరెక్షన్లో పక్కా ప్లాన్‌తో జరిగింది. బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడికి ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలు.. ప్రధానంగా విజయవాడలోని కృష్ణలంక, అజిత్‌సింగ్ నగర్, భవానీపురం ప్రాంతాలకు చెందిన బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు, కిరాయి రౌడీలు, రౌడీ షీటర్లను భారీగా టీడీపీ నేతల డైరెక్షన్లో ఇబ్రహీంపట్నం తరలించారు. వీరు పెట్రోలు బాంబులు, బాటిళ్లతో దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో సామగ్రి కాలి బూడిదైంది. ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో తగలబడుతున్న జోగి రమేష్ ఇల్లు ఇదే సమయంలో భారీగా గుమికూడిన టీడీపీ మూకలు.. కత్తులు, కర్రలు, బండరాళ్లతో సైర్వ విహారం చేసి ఇంటిపైన రాళ్ల వర్షం కురిపించాయి. గేటును పగలగొట్టే యత్నం చేశారు. రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి జగన్మోహన్రావు, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. జోగి కుటుంబ సభ్యులను అంత మొందించాలనే కుట్రతో, పక్కా ప్రణాళికతో ఈ దాడి చేసినట్లు స్పష్టం అవుతోంది. కాగా, జోగి రమేష్ రాత్రి 11 గంటలకు ఆయన ఇంటికి వచ్చి టీడీపీ మూకలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.రోడ్డుపై బైఠాయింపుజోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావును జూపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పరామర్శకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని దేవినేని అవినాష్ పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి, విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలియడంతో అక్కడికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకుంటుండంతో, ఆయన్ను అక్కడి నుంచి సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఖండించారు. ఇలాంటి దాడులకు వైఎస్సార్సీపీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ వద్దకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, పార్టీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.పోలీసుల ప్రేక్షక పాత్రటీడీపీ గూండాలు జోగి రమేష్ ఇంటిపై దాడికి వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామ మాత్రంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే టీడీపీ, బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడులు చేస్తున్నా చేష్టలుడిగి చూస్తు్తండిపోయారు. కనీసం వారిని నిలువరించ లేక, ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. మధ్యాహ్నం నుంచే జోగి రమేష్ ఇంటి వైపు వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను నిలువరించిన పోలీసులు, టీడీపీ గూండాలకు మాత్రం పచ్చ జెండా ఊపారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
బాబు, పవన్, లోకేశ్‌కు మంచి బుద్ధి ఇవ్వాలి
సాక్షి నెట్వర్క్: తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, లోకేశ్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు నిర్వహించి ఆలయాల్లో పెద్దఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల కల్తీ ఆరోపణలపై ప్రాయశి్చత్త పూజలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి నియోజకవర్గాల ఇన్చార్జిలు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పూజల్లో పాల్గొన్నారు. లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని, కల్తీ జరగలేదని సిట్ దర్యాప్తులో స్పష్టంగా తేలినా టీడీపీ కూటమి నేతలు బాధ్యతారహిత్యమైన ప్రకటనలు, వదంతులు వ్యాప్తి చేస్తుండడాన్ని నిరసిస్తూ అభిషేకాలు, పాప ప్రక్షాళన పూజలు చేశారు. తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతి ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ 101 టెంకాయలు కొట్టారు. శ్రీవారి భక్తుల మనోభావాలను రక్షించాలని కోరుతూ అద్దంకిలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ (అనంతబాబు) శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మెట్లను కడిగి పూజలు చేశారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో నాయకులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ పశ్చిమంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో మెట్లు కడిగారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ఆలయాలను నాయకులు శుద్ధిచేశారు. కొన్నిచోట్ల కొబ్బరికాయలు కొట్టారు. -
హైందవానికి ఆలన... జగన్ పాలన
చెరువు లేని చోట చేపలు పట్టిస్తాననీ, ఆకాశంలో కదలకుండా సూర్యుణ్ణి అలాగే ఉంచేస్తాననీ, గాలి పూసి ఏ గాయం అయినా మాయం చేస్తాననీ చెప్పి, ప్రసార మాధ్యమాల ద్వారా అది ఆయనకే సాధ్యం అని ఊదర గొట్టించి, మాటి మాటికీ ప్రజలను నమ్మించి అందలం ఎక్కి గొంతు కోసేవారు ఒకరు. ఇచ్చిన మాట కోసం, చేసిన వాగ్దానం కోసం, చెప్పిన నిజం నిలబెట్టడం కోసం, పేదవాడి కడుపు నింపడం కోసం, దిగువనున్న వారికి ఎగువ తరగతి చదువు అందివ్వడం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, సంక్షేమ పథకాల నిత్యవికాసం కోసం, జనం కొరకు, జనం మధ్య నిలబడి పనిచేసినవారు మరొకరు.మొదటి వారు చంద్రబాబు నాయుడు అయితే, రెండవ వ్యక్తి జగన్మోహన్రెడ్డి. అబద్ధానికీ నిజానికీ, చీకటికీ వెలుగుకూ మధ్య ఉన్నంత స్పష్టమైన తేడా ఈ ఇద్దరిలో! ఏమీ చేయకుండానే చేసినట్లు, చేస్తున్నట్లు, చేస్తూనే ఉన్నట్లు చెప్పి నమ్మించగలగడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పత్రికలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన రాగానికి తాళం వేసి, తప్పెట్లు మోగించి అభివృద్ధి ఆకాశం దాటేసింది అంటూ అరుస్తాయి. చిటికెల పందిళ్ళకు, ఊహల ఉత్సవాలకు, గాలిలో ఘనమైన మేడలకు, గ్రాఫిక్ ఇంద్రజాలాలకు బ్రాండ్ అంబా సిడర్ చంద్రబాబు. నేలమీద నిలబడి, కరోనాలో సైతం ప్రజల కోసం కష్టపడి, చేసిన ప్రతి వాగ్దానాన్నీ నిలబెట్టుకుని పెద్దగా ప్రచారం చేసుకోలేక పోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.శ్రీవారి పనులు ఆపొద్దు!పదుల సంఖ్యలో ఆలయాలను నేలమట్టం చేసిన చంద్రబాబు సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని నిలబెడతానని నిస్సిగ్గుగా చెబుతున్నాడు. దేవుడిని, దేవుడి ప్రసాదాన్ని రాజకీయం చేసిన మొదటి రాక్షస రాజకీయ నాయకుడు ఈయనే. నిజానికి హైందవ ధర్మానికీ, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికీ అపారమైన సేవ చేసిన వ్యక్తి జగన్ మాత్రమే. అంత సేవ చేసిన ఆయనను చంద్రబాబు విష ప్రచారపు ముసుగు వేసి అన్యుడని అవహేళన చేశాడు. జగన్ ముఖ్యమంత్రి అయిన కాలం నుంచి ఎన్నికల వరకు తిరుమల శ్రీవారికి, హైందవ ధర్మానికి ఆయన చేసిన సేవ ప్రత్యక్షంగా చూసినవాడిగా, ఆత్మ సాక్షిగా గుండెమీద చేయి వేసుకుని ఈ మాటలు చెబుతున్నాను. ఈ వ్యాసం రాస్తున్నాను. అందరికీ తెలియాల్సిన పచ్చి నిజాలివి. పచ్చమీడియా ఎప్పటికీ అంగీకరించని వాస్తవాలివి. తిరుమల శ్రీవారి మీద జగన్‌కు అపారమైన భక్తి, విశ్వాసం. 2019లో అఖండమైన మెజారిటీతో జగన్ ఎన్నికలలో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందే ఆయన తిరుమలకు వచ్చి, శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరమే అధికార పీఠంపై కూర్చున్నారు. ఆ రోజు జగన్‌తో పాటు నేనూ కారులో ఉన్నాను. అప్పుడు గరుడ వారధి (శ్రీనివాస సేతు) పనులు జరుగుతున్నాయి.ఆ స్తంభాలను చూసి ‘ఏమిటిది’ అని అడిగారు. ‘‘ఇది శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికుల సౌకర్యం కోసం నిర్మి స్తున్న ఫ్లై ఓవర్. దాదాపు 40 కోట్లు చంద్రబాబు హారతి చేశాడు. దీన్ని ఆపడం మంచిది’’ అని కారులోని ఓ ముఖ్య వ్యక్తి చెప్పాడు. దానికి జగన్ నవ్వుతూ, ‘‘శ్రీవారికీ, ఆయన భక్తులకూ ఉపయోగపడే వంతెనను ఆపడం అన్యాయం. వాటా తీసుకున్న వారి పాపం వారికే తగులుతుంది, తగిలింది. ఆపొద్దు, మరింత మెరుగుగా నిర్మించండి’’ అన్నారు. అభివృద్ధి పనులు ఎవరు ప్రారంభించినా ఆపకూడదు అన్నది ఆయన భావన.అప్పటికి కొద్దికాలం క్రితమే ఆయన సుదీర్ఘమైన పాద యాత్రతో 3,648 కి.మీ. నడిచి ఉన్నారు. ఆ అలసట కూడా మరిచి శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన పాదరక్షలు లేకుండా వెళ్ళారు. అలాంటి భక్తుడిని అన్యమతస్థుడు అని చంద్రబాబు, ఆయన మీడియా కొండంత ప్రచారం చేశాయి. జగన్ ఎంత సంప్రదాయబద్ధంగా ఆలోచిస్తా రంటే, ఆయనకు తిరుపతి గంగమ్మ గురించి ఆమె శ్రీవారి చెల్లెలు అని చెప్పాను. ఆయన ముందుగా, ముఖ్యమంత్రిగా గంగమ్మను దర్శించుకునే శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయాల పునరుద్ధరణ, గోసంరక్షణశ్రీవారి వైభవ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు జగన్ చేసిన సేవ మరెవ్వరూ చేయలేదు. భక్తికీ, రాజకీయానికీ ముడిపెట్టేంత నైచ్యానికి ఆయన ఏనాడూ దిగ జారలేదు. ధర్మాచరణ అంటే రాజకీయ అవసరాలకు శ్రీవారినీ, ప్రసాదాన్నీ వాడుకోవడం కాదు. శ్రీవారి ప్రసాదంలో పంది కొవ్వు, చేపకొవ్వు కలిసి కల్తీ జరిగిందని అసత్య ప్రచారం చేసిన వాళ్ళు భక్తులా? నిజానికి ఆ కొవ్వు వారి మస్తిష్కపు మకిలి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమలలో నిరంతర వేదఘోష ప్రతిధ్వనించింది. కోవిడ్ కాలం నుండి ‘నాద నీరాజన వేదిక’ మీద నిత్యం భారత, భాగవత, రామాయణ, సుందరకాండల ప్రవచన పరిమళం ఆ వైకుంఠాన్ని చేరింది.శ్రీవాణి ట్రస్టు ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది జగన్. ఆ నిధుల ద్వారా దేశ వ్యాప్తంగా 3,500 ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ జరిగింది. దాన్ని సహించలేక ఆ రోజు ఆ ట్రస్టును విమర్శించాడు చంద్రబాబు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకో వెళ్తున్నాయనీ, అధికారం వస్తే ఆ ట్రస్టు రద్దు చేస్తామనీ బీరాలు పలికాడు. ఇప్పుడు ఆ టికెట్ల సంఖ్య పెంచి, ఆలయాలు నిర్మిస్తాం అంటున్నాడు. ఎంత వంచన! గోసంతతిని మరింత పెంచాలని భావించి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విరాళాల క్రింద గిర్, కాంక్రీజ్, సాహిపాల్, పుంగనూరు, ఒంగోలు జాతులకు చెందిన గోమాతలను తిరుపతి గోశాలకు తీసుకువచ్చాం. వాటి సంర క్షణ, సంతతి వృద్ధికి మొదటిసారిగా ప్రణాళికలు తయారు చేసి అమలు పరిచాం. తెలుగు రాష్ట్రాలలోని గోశాలలను గుర్తించి మేత, నిర్వహణ వ్యయం అందించాం. అనేక ఆలయాలకు గోవులను విరాళంగా అందించాం. గోసేవా భాగ్యం హైందవ భక్తులందరికీ అందాలని అలిపిరి వద్ద గోమాత ప్రదక్షిణ శాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుత ప్రభుత్వంలో గోశాలల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో పత్రికలు, మీడియా చెప్పాయి. ఇప్పటి దేవ స్థానం అధ్యక్షుడే ముందు కాదని... తర్వాత అంగీకరించాడు. వెన్నలాంటి మనసున్న వేంకటేశ్వరుడు నవనీత ప్రియుడు. జగన్ ముఖ్యమంత్రి కావటానికి ముందు ఆ సేవ యాంత్రికంగా జరిగేది. దాన్ని పూర్తిగా మార్చివేశారు జగన్. శ్రీవారి సేవకుల సహాయంతో మజ్జిగను చిలికించి అప్పుడే తీసిన ఆ నవనీతాన్ని ఆ నవనీత చోరుడికి ఆరగింపుగా అందించే ఏర్పాటు చేశారు. ఎంత భాగ్యం ఇది. ఎంత సేవ ఇది. ఎంత మంచి ఆలోచన ఇది.ఎన్నెన్ని సంస్కరణలు!తిరుమల ఆస్థాన మండపంలో జాతీయ వేదసభ నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులను, మఠాధిపతులను ఆహ్వానించి హైందవ ధర్మ పరిరక్షణకు, వ్యాప్తికి అవసరమైన కార్యక్రమాలను, సలహాలను వారి నుంచి స్వీకరించాం. ఇతర మతాల వారు హిందూమతం స్వీకరించాలి అనుకుంటే అందుకు కేంద్రం తిరుమల కావాలని తీర్మానించాం. అందుకు ఒక వేదిక ఏర్పాటు చేశాం. దేశంలోనే ఇంతటి విప్లవాత్మక నిర్ణయం మొదటిగా తీసుకున్నది తి.తి.దేవస్థానమే. దానికి కారణం జగన్. వేదమూర్తి, వేదస్వరూపుడు అయిన శ్రీవారికి నిత్యం వేద ఘోష వినిపించాలని, భక్తులు అది విని తరించాలని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద శ్రీవేంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం ప్రారంభించాం. యువతరాన్ని సక్రమ మార్గంలో ఉంచాలని, శ్రీవారి భక్తి మరింతగా వారి హృదయాలలో నిండా లని శ్రీవారి గోవింద నామకోటి ప్రారంభించాం. యువతీ యువకులు గోవింద నామకోటి రాసి, ఆలయ అధికారులకు అందజేస్తే వారి కుటుంబానికి శ్రీవారి బ్రేక్ దర్శన సౌకర్యం కలిగించాం. దేశంలోని ప్రముఖ పండితుల సహాయంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మస్థలాన్ని గుర్తించాం. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సౌకర్యాలు కల్పించాం.శ్రీవారికి, శ్రీవారి వివిధ ఆలయాలలో ఉపయోగించిన పుష్పాలను వృథాగా పారవేయక వాటితో అగరుబత్తుల తయారీ ప్రారంభించాం. సప్తగిరులకు గర్తుగా ఏడురకాల పరిమళాల అగరుబత్తులు తయారు చేశాం. స్వామివారికి అలంకరించిన సుమాల పరిమళం... అగరుబత్తీగా మన ఇంట వెలగడం, ఆ పరిమళ భక్తి పరవశంలో మనం లీనం కావటం ఎంత అదృష్టం. అదీ గాక దీనివల్ల ఎందరో మహిళలలకు ఉపాధి ఏర్పడింది. బ్రేక్ దర్శనాలను దాదాపు తగ్గించి, సామాన్య భక్తుల దర్శ నాలకు ప్రాముఖ్యం ఇచ్చాం. క్యూలైన్లలో వేచివుండే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు కాఫీ, టీ, పాలు పంపిణీ చేశాం. కొండ మీద ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాం. శ్రీవారి ప్రసాదాల కవర్లను కూడా ప్లాస్టిక్ రహితంగా తయారుచేయించాం. కొండమీద పర్యావరణ హితమైన విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టాం. శిలాతోరణం వద్ద 10 ఎకరాలలో పవిత్ర ఉద్యాన వనం, గోగర్భం డ్యామ్ వద్ద 25 ఎకరాలలో పవిత్ర శ్రీగంధ ఉద్యానవనం ఏర్పాటు చేశాం.2021 అక్టోబరు 30, 31 తేదీలలో తిరుపతి మహతి ఆడిటోరియంలో జాతీయ గో సమ్మేళనం నిర్వహించాం. వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరయ్యారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపాం. తిరుమలలో నేడు ప్రతి పౌర్ణమికి శ్రీవారికి జరుగు తున్న గరుడసేవ ప్రవేశపెట్టింది జగన్ తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి. నాలుగు మాడ వీధులలో భక్తులు పాదరక్షలు ధరించ రాదని నిర్ణయం తీసుకున్నవారు జగన్మోహన్ రెడ్డి. అలిపిరి నుంచి కాలినడకన దర్శనం చేసుకున్న సమయంలో వారికి ఈ ఆలోచన వచ్చిందట. అలాంటి వ్యక్తిని, భక్తుడిని బూట్లు ధరించి పూజలు చేసేవారు విమర్శించడం ఎంత అన్యాయం?భక్తుల కోసం...అలిపిరి కాలినడక మార్గపు పైకప్పు ఎప్పుడో 40 సంవ త్సరాల క్రితం నిర్మించారు. అది పూర్తిగా పాడయింది. భక్తులకు అసౌకర్యంగా ఉండేది. ఓ దాత సహాయంతో, దాదాపు 25 కోట్ల వ్యయంతో దానిని పునర్నిర్మించాం. ఆ ఆదేశం ఇచ్చింది జగనే. ముఖ్యమంత్రిగా ఆయన దాన్ని 2021 అక్టోబరు 11న ప్రారంభించారు. కార్తీక మాసంలో మహిళల సామూహిక దీపారాధన ఉత్సవాలను 2020 నవంబరు 30న ప్రారంభించాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నగరాలలో సైతం ఈ కార్యక్రమం నిర్వహించాం.తిరుమలలో రూ. 100 కోట్ల వ్యయంతో మ్యూజియం అభివృద్ధి పనులు చేపట్టాం. ఈ మ్యూజియంలో సుమారు 4 వేల అరుదైన, అపురూపమైన హైందవధర్మ కళాఖండాలు, దేవతామూర్తులు రూపకల్పన చేశాం. శ్రీవారి వైభవం ప్రపంచంలోని వారందరూ తెలుసుకోవాలని, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ను హిందీ, కన్నడ భాషల్లో ప్రారంభించింది జగనే.తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో అధునాతన సి.టి. స్కాన్, ఎక్స్ రే మిషన్లు, 34 కోట్ల రూపాయల వ్యయంతో రోగుల కోసం నూతన గదులు నిర్మించాం. పేదలకు ఉచితంగా మోకాలు ఆప రేషన్లను ఆరోగ్యశ్రీ క్రింద చేయించాం. చెవుడు, మూగ పిల్లలకు రూ.10 లక్షలు ఖర్చు అయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషను ఉచితంగా చేయించాం. పెదవి చీలికతో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు స్మైల్ లైన్ సంస్థ సహకారంతో ఉచితంగా గ్రహణం మొర్రి ఆపరేషన్లు నిర్వహించాం.శ్రీవారికి తల్లి వకుళమాత. ఆమె ఆలయాన్ని ఏ పాలక మండలీ, ఏ ముఖ్యమంత్రీ పట్టించుకోలేదు. ఆ శిథిల ఆలయాన్ని ఓ దాత సాయంతో 12 కోట్ల రూపాయల వ్యయంతో వైభవంగా నిర్మించాం. దాన్ని జగన్ 2022 జూన్ 23న ప్రారంభించారు. తిరుమల శ్రీవారికి జరిగే అన్ని సేవలూ భక్తులందరూ దర్శించాలని, వైభవోత్సవాల పేరుతో వివిధ ప్రాంతాలలో నిర్వహించాం. మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించి వారి అనుమతితో వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులు ఉండేలా మార్పు చేశాం. దానివల్ల ఏటా దాదాపు 8 లక్షలమంది భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం ద్వారా శ్రీవారిని దర్శించు కున్నారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల వారికి స్వామిపట్ల మరింత భక్తి భావం ఏర్పడాలని, వారికి ఉచిత రవాణా, ఆహార, వసతి ఏర్పాట్లను చేసి వైకుంఠద్వార దర్శనం చేయించాం.ఉద్యోగుల కోసం...తి.తి.దే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగి చని పోయిన 90 రోజుల లోపు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా వ్యవస్థలో మార్పులు తెచ్చాం. అంతకు ముందు ఆ ఉద్యోగం రావడానికి సంవత్సరాలు పట్టేది. ఇందులో భాగంగా ఒకేరోజు 119 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చాం. ఈ మార్పులు జగన్ వల్లే సాధ్యమయ్యాయి. తి.తి.దేవస్థానం ఉద్యోగులకు చెన్నై, బెంగళూరు నగరా ల్లోని కార్పొరేట్ ఆస్పత్రులలో నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించేలా 2022 జనవరి 7న ఒప్పందం చేసు కున్నాం. శ్రీవేంకటేశ్వర మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపు 14 వేల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఒకే గొడుగు కిందికి తెచ్చాం. వీరందరికీ సీనియారిటీ, హెూదాను బట్టి జీతాన్ని 3 వేల నుంచి 20 వేల వరకు పెంచాం.తి.తి.దేవస్థానం ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మేలు ఒక చరిత్ర. ఈ ఉద్యోగులందరికీ న్యాయ వివాదాలు లేకుండా ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం వడమాలపేట మండలం, పాదిరేడు అరణ్యం గ్రామం వద్ద 300 ఎకరాల భూమిని సేకరించాం. ఇందుకోసం ఉద్యోగులు చెల్లించాల్సిన రూ.60 కోట్లు యాజమాన్యమే కలెక్టరుకు చెల్లించేలా చేసి భూమిని స్వాధీనం చేసుకున్నాం. ఈ భూమిని చదును చేసి, రోడ్లు, కాలువలు, ఇతర సౌకర్యాలు కల్పించాం. ప్రతి ఉద్యోగికీ 50 అంకణాల భూమి చొప్పున 5,518 మంది ఉద్యోగులకు జగన్ చేతుల మీదుగా పంపిణీ చేశాం. భవిష్యత్తు అవసరాల కోసం ఆ భూమిని ఆనుకుని ఉన్న మరో 132 ఎకరాల భూమిని రూ. 25 కోట్లు చెల్లించి కొనుగోలు చేశాం. తి.తి.దే. విశ్రాంత ఉద్యోగులకు కూడా ఇంటిస్థలాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో శ్రీకాళహస్తి మండలం, పల్లం వద్ద భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాం. కానీ అధికార మార్పిడి వల్ల నీలినీడలు ఏర్పడ్డాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇలాంటి వేల ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. కోవిడ్ వల్ల ప్రభుత్వం మీద ఎంతో ఆర్థికభారం పడినా ఆయన ఏ సంక్షేమ పథకమూ ఆప లేదు. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే జనం కోసం, సత్యం కోసం నిలబడినవారు బలయ్యారు. సోక్రటీసుకు విషం పెట్టి, బ్రూనోను శరీరమంతా తగులబెట్టి చంపారు. భగత్‌సింగును ఉరితీశారు. అల్లూరి సీతారామ రాజును కాల్చి చంపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తల నరికారు. ప్రజల కోసం నిలబడిన వారి అధికారం, జీవిత కాలం స్వల్పమే అయింది. జగన్ అధికార కాలం కూడా వేల అబద్ధాల మబ్బుల ముందు మసక బారింది. ఆయన ఓడిపోయాడే గాని ఇంకా చనిపోలేదు కదా అని తన అనుయాయ, శిష్యుని చేత బహిరంగంగా అనిపించిన పాషాణ హృదయ కుటిలత్వం చంద్రబాబుది. హైందవ ధర్మ రక్షణకు జగన్ చేసింది కొండంత, ఇక్కడ నేను చెప్పింది గోరంత. ఆయనపై నీచ నికృష్ట ఆరోపణలు చేసిన బూట్ల బాబు, గాలి సోకినట్లు గోల చేసే పవనానందులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. అందుకే మళ్ళీ మళ్ళీ అంటాను: హైందవానికి ఆలన – జగన్ పాలన అని. ఓం నమో వేంకటేశాయ!భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
చంద్రబాబుదే మహాపాపం.. రాజకీయ పాతకం!
‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయి..’ – నెల్లూరు న్యాయస్థానంలో తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమై స్థానంలో ఉంటూ రాజకీయ కుట్రలతో ఎంతకైనా దిగజారుతానని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు! తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు కలిసిందన్న తన నిరాధార ఆరోపణలు బెడిసికొట్టడం.. ముఖ్యమంత్రి హోదాలో మహాపచారానికి పాల్పడటంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుండటం, దారుణమైన అబద్ధాలాడిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తుండటంతో సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీలు శాస్త్రీయంగా నిర్ధారించగా.. అదే విషయాన్ని సీబీఐ సైతం తాజాగా చార్జ్‌షీట్‌లో స్పష్టం చేయడం తెలిసిందే. దీంతో తన పాచిక పారకపోవడంతో ఇతర అంశాలను వక్రీకరిస్తూ చంద్రబాబు బృందం మరో పన్నాగం పన్నింది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి కాంట్రాక్టులు కేటాయించారని.. చిన్నప్పన్నను వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ వక్రీకరణలకు పాల్పడుతోంది. కట్టబెట్టింది టీడీపీ హయాంలోనే.. చార్జ్‌షీట్‌లో వెల్లడించిన సీబీఐ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆపాదించేందుకు చంద్రబాబు బృందం పడరాని పాట్లు పడుతోంది. అసలు వాస్తవం ఏమిటంటే.. భోలే బాబా డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే. భోలే బాబా కంపెనీకి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారని సీబీఐ చార్జ్‌షీట్‌లో వెల్లడించడం గమనార్హం. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొంది. ‘లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలవనే లేదు. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయి..’ అని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది. .ఆ శాంపిల్స్.. బాబు సీఎం అయ్యాక తీసినవే ఇక ప్రస్తుతం కల్తీ అంటూ చేస్తున్న రాద్ధాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న నెయ్యి శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నవో తెలుసా..? చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక తీసిన శాంపిల్స్ అవి! ఆ నెయ్యి శాంపిల్స్ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో తీసినవే. మూడు టెస్టుల నివేదికల్లో నెయ్యి తగిన నాణ్యతతో లేదని తేలడంతో ఆ శాంపిల్స్‌ను జూలై 17న ఎన్డీడీబీ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ బోర్డు 2024 జూలై 23న నివేదిక ఇచ్చింది. అంటే మొత్తం వ్యవహారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే సాగింది. మరి ఆ నెయ్యిలో కల్తీ ఉంటే అందుకు బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిదేనన్నది సుస్పష్టం. కొనుగోలు కమిటీలో కొలుసు, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చంద్రబాబు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న మరో విషయం ఏమిటంటే... వైఎస్సార్సీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి సభ్యులుగా ఉన్నారు. నాడు టీటీడీ పర్చేజ్ కమిటీలో సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం. అదంతా కల్తీయేనా బాబూ?2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి నెయ్యి కిలో రూ.276 – రూ.314 మధ్య కొనుగోలు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే అది తక్కువే. మరి దాన్ని బట్టి బాబు సర్కారు కొన్న నెయ్యి అంతా కల్తీయేనని భావించాలా? శ్రీవారి సొమ్ములు దుర్వినియోగం చరిత్ర బాబుదే..! తిరుమల శ్రీవారి నిధుల వినియోగంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదే. అందుకు టీటీడీ తిరుపతిలో నిర్మించిన ఫ్లై ఓవరే నిదర్శనం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయం రూ.684 కోట్లలో టీటీడీ 67 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం వెచ్చించాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ కనీసం టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏకపక్షంగా వ్యవహరించారు. ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధమని వారించినా లెక్క చేయలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లై ఓవర్ నిర్మాణానికి టీటీడీ పాలకమండలిలో తీర్మానం చేసింది. అంతేకాదు.. నిర్మాణ వ్యయాన్ని రూ.40 కోట్లు తగ్గించి శ్రీవారి నిధులను ఆదా చేసింది. ఇక టీడీపీ హయాంలో టీటీడీ నిధులు రూ.1,300 కోట్లు ప్రైవేట్ రంగంలోని ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేయడంపై తీవ్ర విమర్శలు రేగినా చంద్రబాబు పట్టించుకోలేదు. అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులో ఉన్న టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించి... ప్రభుత్వ రంగంలోని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయించింది. తప్పుడు నివేదిక బాబు హయాంలోనే.. గతంలో భోలే బాబా డెయిరీ పేరు హర్ష్ ఫ్రెష్ డెయిరీ’. ఆ పేరుతోనే 2018 మేలో తొలిసారి టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. లీటరు నెయ్యి కేవలం రూ.290కే సరఫరా చేస్తామని టెండరు వేస్తే టీటీడీ సమ్మతించి కాంట్రాక్టు కట్టబెట్టింది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. హర్ష్ డెయిరీని తనిఖీ చేసేందుకు 2018 ఏప్రిల్ 17న అప్పటి టీటీడీ ఈవో నిపుణుల కమిటీని పంపారు. కానీ ఆ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చి మోసగించింది. హర్ష్ డెయిరీ రోజుకు 1,33,500 లీటర్ల ఆవు పాలు సేకరిస్తోందని... రోజుకు 4 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తోందని తప్పుడు నివేదిక ఇచ్చింది. ఆ విధంగా తప్పుడు నివేదిక ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కావడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 18న 82 వేల కిలోల ఆవునెయ్యి కొనుగోలుకు టీటీడీ పిలిచిన టెండర్లలో హర్ష్ డెయిరీ మళ్లీ పాల్గొని టెండరు దక్కించుకుంది. వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు...ఏపీ భవన్ ఉద్యోగి తిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ దుష్ప్ర చారం చేస్తోంది. ఈ కేసులో అరెస్టు అయిన ఆయన్ను వైవీ సుబ్బారెడ్డి పీఏగా దుష్ప్ర చారం చేయడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పీఏగా పని చేశారు. ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం. తిరుమల లడ్డూపై దుష్ప్ర చారం ఆపాలని, నిజాలు బయటకు తీయాలని సుప్రీంకోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ నేతలు కాదు. ఇక సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో వైఎస్సార్ సీపీ నేతలు సహా గత ప్రభుత్వంలో ఉన్నవారి పేర్లు ఏ ఒక్కరివీ లేవు. రాజకీయ కుట్రతో ఇంతటి బరితెగింపా బాబూ...! కేవలం రాజకీయ స్వార్థం కోసమే తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీసే కుట్రకు చంద్రబాబు తెగబడ్డారు. సీఎం హోదాలో దుష్ప్ర చార కుట్రకు బాబు నేతృత్వం వహించగా టీటీడీ ప్రధాన కార్యాలయం కేంద్రంగానే కుట్ర రచన సాగించి అమలు చేశారు. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కోసమే ఈ మహా పాపానికి ఒడిగట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో పంది, చేప కొవ్వులు కలిపారంటూ చంద్రబాబు దారుణమైన ఆరోపణలు చేశారు. ఏమాత్రం పాపభీతి లేకుండా శ్రీవారి ఆలయ పవిత్రతకు కళంకం తీసుకువచ్చేందుకు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసేందుకు కుతంత్రం పన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం..’ అనే పేరుతో 2024 సెప్టెంబర్ 20న ఒంగోలులో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాన్ని దీనికి వేదికగా చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారు. ఇక నారా లోకేశ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిపి అపవిత్రం చేశారని దారుణమైన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిపినట్లు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని పేర్కొనడం గమనార్హం. అసలు విషయం ఏమిటంటే... తిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడి కాలేదు. కేవలం రాజకీయ కుట్ర కోసమే చంద్రబాబు, ఆయన ముఠా ఎల్లో మీడియా సహకారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పక్కా పన్నాగం పన్నింది. ఇదిగో.. పంది కొవ్వు ఇంత శాతం..! ఆవు కొవ్వు ఇంత శాతం..! చేప కొవ్వు ఇంత శాతం..! అంటూ ఈనాడు, ఇతర ఎల్లో మీడియా పేజీలకు పేజీలు అవాస్తవ కథనాలతో దుష్ప్రచారం చేశాయి. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తెచ్చే కుట్రలో పాత్రధారిగా మారిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశి్చత్తం డ్రామాకు తెరతీశారు. మీడియా కెమెరాల ముందు విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లు కడిగి హైడ్రామాను రక్తి కట్టించారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతారం ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు.. సీబీఐ దర్యాప్తులో వెల్లడి.. చార్జ్‌షీట్‌లో స్పష్టీకరణ తిరుమల లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర బెడిసికొట్టింది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. ఈమేరకు నెల్లూరులోని న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సీబీఐ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్ర చార కుట్రలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు వెంటనే ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన్ను ప్రభుత్వ పెద్దలు అమరావతికి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాతే ఆయన్ను బదిలీ చేయడం గమనార్హం. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ నివేదిక వెల్లడించింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. శాస్త్రీయంగా విశ్లేషణ... సాధికారికంగా నిర్ధారణ... టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో నిర్ధారించింది. ఆ విషయాన్ని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్‌ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్(ఎన్డీడీబీ)లకు పంపించి పరీక్షలు నిర్వహించినట్టు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యా»ొరేటరీలు 2025 మార్చి 27, 2025 మే 16న రెండు వేర్వేరు నివేదికల్లో నిర్ధారించాయని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలె్రస్టాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలె్రస్టాల్ ఉంటుంది. కొలె్రస్టాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. నెయ్యి కొనుగోలుకు టీటీడీలో పటిష్ట వ్యవస్థరాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలనే కుట్రతో చంద్రబాబు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నెయ్యి, ఇతర సరుకులు కొనుగోలుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. టీటీడీ అనుసరించే పటిష్ట విధానం ఇదీ... లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. టెండర్లు కోట్ చేసిన వాటిలో ఎల్ 1గా వచ్చిన డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నియమ నిబంధనలను ఎవరూ మార్చేందుకు ఏమాత్రం అవకాశమే లేదు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ లడ్డూ తయారీకి నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్‌తో పాటు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తించిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ను కూడా సమర్పించాలి. ఓ ట్యాంకర్ నెయ్యి శాంపిల్‌లో 99.618 శాతం మిల్క్ ఫ్యాట్ ఉందని తేల్చుతూ ఎన్డీడీబీ కాల్ఫ్ 2024 జూలై 23న ఇచ్చిన టెస్ట్ రిపోర్టు ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని.. ఫారిన్ ఫ్యాట్ కలిసి ఉండొచ్చునని ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు 2024 జూలై 27న ఇచ్చిన షోకాజ్ నోటీసులో పేర్కొన్న టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా కేజీ నెయ్యిలో 208.851 మిల్లీ గ్రాముల వెజిటబల్ ఆయిల్ కలిసిందని.. ఫారిన్ ఫ్యాట్ కూడా కలిసి ఉండే అవకాశం ఉందని 2024 జూలై 28న ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు ఇచ్చిన రిజాయిండర్ షోకాజ్ నోటీసులో స్పష్టం చేసిన టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ 2024 జూలై 6, జూలై 15న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అదే నెల 22న సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న టీటీడీ అప్పటి ఈవో శ్యామలరావు (ఈయనే నెయ్యిలో జూలై 23న వనస్పతి డాల్డా వంటి వెజిటబుల్ ఆయిల్ కలిసిందని తిరుమలలో ఏడుకొండలస్వామి సాక్షిగా మీడియాకు చెప్పారు) » అలా ట్యాంకర్ నుంచి తిరుపతిలోనే మూడు శాంపిల్స్ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే ఆ నెయ్యిని టీటీడీ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తారు. శాంపిల్స్ పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే వెంటనే ఆ ట్యాంకర్లను తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపుతారు. తిరుమల కొండ కూడా ఎక్కనివ్వరు. » తగిన నాణ్యతతో లేని నెయ్యిని చాలాసార్లు వెనక్కి పంపారు. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు, 2019–24లో వైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని టీటీడీ రికార్డులే వెల్లడిస్తున్న వాస్తవాలు. బాబు దుష్ప్రచారంపై జాతీయ మీడియాలో విమర్శల వెల్లువ తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కుట్ర పన్నడంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చార్జిషీట్లో పేర్కొనడాన్ని జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ టీవీ చానళ్లు, డిజిటల్ మీడియా కూడా దీనికి అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. జంతువుల కొవ్వు కలిసింది అంటూ నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ శ్రీవారి భక్తులు, వివిధ రంగాల ప్రముఖులు డిమాండ్ చేయడాన్ని జాతీయ మీడియా ప్రస్తావించింది. -
వేద మంత్రాలతో.. హోరెత్తిన నిందా పరిహార హోమం
తిరుపతి సిటీ/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిందాపరిహార హోమాన్ని నిర్వహించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికతో స్పష్టమవడంతో ఇప్పటి వరకు ప్రసాదంపై జరిగిన దుష్ప్రచారంతో దెబ్బతిన్న శ్రీవారి పవిత్రతకు, ప్రతిష్టకు ప్రాయశ్చిత్తంగా తిరుపతి పద్మావతిపురంలోని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నివాసంలో శుక్రవారం శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో భూమన దంపతులు పాల్గొన్న ఈ కార్యక్రమం వేదమంత్రాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ప్రసాదంపై రాజకీయ నిందలా? ‘సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచపు అపనిందలు మోపారు. ఆ ఇద్దరూ కుమ్మకై దారుణమైన ఆరోపణలు చేశారు. పవన్‌కళ్యాణ్ అయితే దుర్గా మాత గుడి మెట్లు కడిగి అత్యంత నీచంగా ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతో విష ప్రచారానికి తెగబడ్డారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాల్లోకి లాగుతూ లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఈ ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నిందలకు పరిహారంగా శ్రీనివాస ప్రసాదం నిందా పరిహార హోమం నిర్వహిస్తున్నాం. దీనిద్వారా అపవాదులు తొలగిపోతాయని విశ్వసిస్తున్నాం. అయితే, లడ్డూ ప్రసాదంలో ఎక్కడా జంతు కొవ్వు కలవలేదని, ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం లేదని సీబీఐ తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు చెంపపెట్టుగా మారింది. దీనిని వారు జీర్ణించుకోలేక అనుకూల పత్రికలు, ఛానళ్ల ద్వారా ఇంకా తప్పుడు ప్రచారాన్ని కొనసాగించడం దారుణం’ అని భూమన అన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చిత్రాలు ఇక తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ నివేదికతో కూటమి పార్టీలు అడ్డంగా దొరికిపోయినప్పటికీ, టీడీపీకి చెందిన కొందరు ఇప్పటికీ ప్రసాదంపై విషప్రచారం చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లడ్డూతో వేంకటేశ్వరస్వామి ఫొటోలను ఏఐ సాయంతో ఎడిట్ చేస్తూ, మార్ఫింగ్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టులు.. వివిధ ప్రాంతాల్లో ఫెక్సీలు ఏర్పాటు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాలను మార్ఫింగ్ చేసిన పోస్టులు కనిపిస్తున్నాయని, శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు పెడుతున్నారని వారు ఆరోపించారు. హోమం భగ్నానికి యత్నం శ్రీనివాస ప్రసాదం నిందా పరిహార హోమాన్ని ఎలాగైనా భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీంతో కూటమి పార్టీలకు చెందిన గూండాలు ఒక్కసారిగా భూమన నివాసానికి వందల సంఖ్యలో చేరుకున్నారు. హోమం సమీపంలో నానాయాగీ చేస్తూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. ఫలితంగా స్థానికులు, హోమానికి హాజరైన వేద పండితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తమ దుష్ప్రచారాలు ప్రజల్లో బట్టబయలవుతాయన్న భయంతో కూటమి నేతలు హోమాన్ని అడ్డుకునేందుకు రౌడీమూకలను దింపారని భూమన ఆరోపించారు. టీడీపీకి చెందిన రాక్షస శక్తులు హోమం జరుగుతున్న తమ ఇంటిపై దాడికి ప్రయత్నించాయని, 100 మందికి పైగా రౌడీమూకలు అన్నమయ్య భవన్ సమీపంలో వీరంగం సృష్టించారని ఆయన తెలిపారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి విష సంస్కృతిని తీసుకొచి్చంది కూటమి పార్టీల పెద్దలేనని, తిరుపతి వంటి పవిత్ర క్షేత్రాన్ని రౌడీల నగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన నేతలే ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. -
బాబు కుట్రకు శిక్ష ఉండొద్దా?
‘ఆత్రగాడికి బుద్ధి మట్టు...’ అనే నానుడి ఉత్తపుణ్యాన రాలేదు. ప్రత్యర్థులపై బురద జల్లడం కోసం, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం ఎంతకైనా దిగజారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్మాదం ఆవహించిన చందాన 2024 సెప్టెంబర్‌లో ఒక మహాపరాధానికి పాల్పడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ఆరోపణకు సాహసించి ప్రపంచవ్యాప్తంగావున్న కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. నిజం నిలకడ మీద తేలుతుందన్నట్టు ఇన్ని నెలల తర్వాత ఇదంతా పచ్చి బూటకమని సీబీఐ దర్యాప్తు నిగ్గుతేల్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి లడ్డూకు వాడిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలో ఆవగింజంతైనా నిజం లేదని నిర్ధారించింది. హరియాణాలోని ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)లు వేర్వేరుగా ఆ నెయ్యి నమూనాలను పరీక్షించి వెల్లడించాయని సీబీఐ తన చార్జిషీటులో తెలియజేసింది. ఈ నమూనాలు నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి సేకరించామని వివరించింది. చిత్రమేమంటే తమ కుట్ర భళ్లున బద్దలైనా టీడీపీ నాయకు లకూ, వారి వందిమాగధ మీడియాకూ బుద్ధి రాలేదు. కిందపడ్డా తమదే పైచేయి అని చెప్పటానికి నానా తంటాలూ పడుతున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మరిన్ని వేల అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ఇలాంటి వంచకులను ఆ భగవంతుడు క్షమిస్తాడా? ప్రత్యర్థులపై పైచేయి సాధించ టానికి ఎత్తులు, పైయెత్తులేయటం... ఎలాగైనా గెలిచితీరాలని ఆత్రపడటం రాజకీ యాల్లో సర్వసాధారణం. కానీ మనిషి జన్మ ఎత్తినందుకు కనీసంగానైనా ఇంగితంఉండొద్దా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంపైనే నదురూ బెదురూలేకుండా విషం చిమ్మటం మహాపచారమన్న స్పృహ ఉండనవసరం లేదా? ఈ కుట్ర వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయి. అప్పటికి ఎడతెరిపి లేని వానలతో పొంగి ప్రవహిస్తున్న బుడమేరును కనీస ముందస్తు హెచ్చరిక లేకుండా, చడీచప్పుడూ కాకుండా వదలటం వల్ల విజయవాడ లోతట్టు ప్రాంతాలు మునిగాయి. 50 మందికి పైగా దుర్మ రణం పాలయ్యారు. అది సర్కారీ జలప్రళయమని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు తన కొంప కాపాడుకునేందుకే ఇలా చేయించారన్న విమర్శలూ వచ్చాయి. అంతేకాక ఎన్నికల సంఘం ఎంతో తాత్సారం చేసి, నిబంధనలు కాలరాసి ఏపీలో ఎన్నికలు జరిగిన 108 రోజుల తర్వాత బూత్‌ల వారీగా ఎవరికెన్ని ఓట్లు వచ్చాయన్న వివరాలతో కూడిన ఫామ్–20ని సెప్టెంబర్ 19న ఆన్లైన్లో పెట్టడానికి నిర్ణయించుకుంది. సరిగ్గా ఈ రెండు ఉపద్రవాలనుంచీ కాపాడుకోవటం కోసం అర్జెంట్‌గా జనందృష్టిని మళ్లించాలన్న ఆత్రుతలో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు కూతలు మొదల య్యాయి. ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పక్కతాళం వేశారు. అయోధ్యకు జంతువుల కొవ్వు కలిసిన లక్ష లడ్డూలు వెళ్లాయంటూ వదిరారు. ఇరు పార్టీలూ ఇలా దుష్ప్రచారం చేస్తున్నా, అదే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. సొంత మనుషులతో సిట్ వేసే ప్రయత్నం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌తో బెడిసికొట్టింది.అవకాశం దొరికినప్పుడల్లా ‘నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువున’ని స్వోత్కర్షలకు పోయే చంద్రబాబుకు వాస్తవంగా అలవాటైన ఏకైక విద్య అబద్ధాలాడటం. దాని సాయంతోనే తన మామ ఎన్టీఆర్ నుంచి కుట్రపూరితంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అంతకు ముందూ తర్వాతా కూడా తన ఎదుగుదల కోసం ఆయన చేయని పాపమంటూ లేదు. వీటన్నిటికీ పరాకాష్ఠ లడ్డూ ప్రసాదంపై సాగించిన దుష్ప్రచారం. ఇదే నేరాన్ని మరెవరైనా చేసివుంటే వ్యవస్థలు ఊరుకుంటాయా? కేసులు, శిక్షలూ లేకుండా వదులుతాయా? అందలాలెక్కినవారికి మాత్రం ఎందుకు మినహాయింపులుండాలి? ఇన్నేళ్ల పాపాలను ఈ అవసాన దశలోనైనా కడిగేసుకుందామనీ, ఇక బుద్ధెరిగి ప్రవర్తిద్దామనీ చంద్రబాబు అనుకోకపోవటం తెలుగు ప్రజల దురదృష్టం. -
ముక్కు నేలకు రాస్తారా? చెంపలేసుకుంటారా?
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక స్థలం, హిందువుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల ఆంధ్రప్రదేశలో ఉండటం ఆంధ్రులందరికీ గర్వకారణం. ఉత్తరాది నుంచి కూడా ఎంతో మంది బాలాజీ దర్శనానికి విచ్చేస్తూంటారు. ఇంతటి వైశిష్ట్యమున్న క్షేత్రంపై ఎవరు అపసవ్యంగా మాట్లాడినా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా అది క్షమించరాని నేరమే అవుతుంది. దురదృష్టవశాత్తూ ఈ పాపానికి సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరీలే పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ముందు వెనుక ఆలోచించకుండా.. పర్యవసానాల గురించి పట్టించుకోకుండా వీరు.. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు, చేపనూనె మిళితమైందని బహిరంగంగా ప్రకటించడం.. రాజకీయం కోసం ఈ పాపాన్ని ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నం చేయడం మనం చూశాం. కానీ చివరికేమైంది? నిజం నిగ్గుతేలింది. సుప్రీంకోర్టు స్వయంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులేవీ లేవని విస్పష్టమైన నివేదిక ఇచ్చింది. అయితే.. పామాయిల్ వంటికి కలిసినట్లు సిట్ తన ఛార్జ్‌షీట్‌లో తెలిపిందని ఎల్లోమీడియా ‘ఈనాడు’, ఆంధ్రజ్యోతిలు ముందస్తు కథనాలు ప్రచురించాయి. జంతు కొవ్వులు కలవలేదన్న అంశాన్ని పక్కనబెట్టి ఈ కథనాలు అల్లడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. సిట్ ఛార్జ్‌షీట్ వేస్తే అందులోని అంశాలపై ఎందుకు మీడియా బ్రీఫింగ్ జరగలేదు? తెలుగుదేశం మీడియాకు మాత్రమే అవసరమైనంత వరకే ఎలా లీక్ అయ్యింది? జంతు కొవ్వు కలవలేదన్న విషయం అధికారికంగా చెబితే టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని దాచేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఎల్లో మీడియా కథనాల ద్వారా అర్థమవుతున్నది ఒక్కటే. ఎలాగైనా సరే.. లడ్డూలో ఏదో కల్తీ జరిగిందన్న అనుమానాలు వ్యాప్తి చేయించి వైసీపీకి చెడ్డపేరు తేవాలని!. సిట్ ఎంత చిత్తశుద్ధితో ఈ కేసు విచారించిందన్నది కాసేపు పక్కనబెడదాం. పామాయిల్, డాల్డా వంటివి కలిసిన నెయ్యిని 2019-2024 మధ్యలో మాత్రమే వాడారా? లేక అంతకుముందు కూడా ఇలా జరిగిందా? అని చూస్తే సమాధానం దొరకదు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో విజయవాడలో ఒక కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అక్కడ తయారైన కల్తీ నెయ్యిని తిరుమలకు కూడా పంపుతున్నట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించినట్లు వార్తలొచ్చాయి.సుప్రీంకోర్టు సీబీఐతో మాత్రమే కాకుండా... రాష్ట్ర పోలీసు అధికారులు కూడా కలిసిన బృందంతో విచారణ జరిపించడంతో దర్యాప్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చలేక తంటాలు పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టి మరల్చేందుకు శతధా ప్రయత్నిస్తూన్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ క్రమంలోనే తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారన్న విమర్శ వస్తోంది. లడ్డూ కల్తీ వ్యవహారం మొత్తం రాజకీయమేనని దర్యాప్తులో కూడా నిగ్గుతేలింది. జంతుకొవ్వు అంటూ నీచమైన ఆరోపణ చేసిన చంద్రబాబు, ఆ తర్వాత మరింత తీవ్రంగా ఆరోపణలు చేసి దుర్గమ్మ గుడి మెట్లు కడిగి, తదుపరి తిరుపతిలో ‘‘ఐ యామ్ అన్ అపాలిజిటిక్ హిందూ’’ అని అరచి గీపెట్టిన పవన్ కల్యాణ్‌లను సిట్ ఎందుకు ప్రశ్నించలేదు? వీరుభక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు కాదా అని ఎందుకు అడగలేదు? కేంద్రంలోను, రాష్ట్రంలోను కూటమి పాలనే సాగుతుండడంతో వారి జోలికి వెళ్లలేదనుకోవాలి. జగన్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు టైమ్‌లో కూల్చిన గుడులను జగన్ కట్టించినా, అంతర్వేదిలో కాలిన రథాన్ని పునర్మించినా, ఆయా ఘటనలలో తక్షణమే చర్యలు తీసుకున్నా ఏదో రకంగా చంద్రబాబు, పవన్ లు మతం రంగు పులిమేవారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలకు టీడీపీ కార్యకర్తలే బాధ్యులని తేలినా వైసీపీకే ఆపాదించేవారు. పైగా నిందితుడైన ఒక టీడీపీ కార్యకర్తకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నగదు బహుమతి ఇచ్చారు. ఇప్పుడే కాదు.. గతంలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి యత్నాలు చేసేవారు. టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా ఏడు కొండలు, రెండు కొండలు అంటూ లేని వివాదాన్ని సృష్టించారు. వైఎస్సార్ తిరుమల స్వామివారి నిమిత్తం ఎస్వీబీసీ ఛానెల్‌ను తీసుకువస్తే అదంతా డబ్బు దండగ అంటూ అసెంబ్లీలో చంద్రబాబు వాదించారు. అయినా చంద్రబాబు హిందూ మతోద్ధారకుడు, వైఎస్ కాదన్నట్లు పిక్చర్ ఇస్తుంటారు. జగన్ ఎంత పవిత్రంగా స్వామివారి సేవలో పాల్గొన్నా.. ఏదో ఒక వదంతి సృష్టించి టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయించారు. ఇప్పటికీ అదే పనిలో ఉంటారు. కూటమి హయాంలో తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచంలో గోడ కూలి ఏడుగురు, కాశిబుగ్గ వద్ద తోపులాటలో మరికొందరు మరణించినా వాటిని మాత్రం కూటమి పెద్దలు సీరియస్ గా తీసుకోరు. లడ్డూ కల్తీ కేసుకు సంబంధించిన బోలేబాబా డెయిరీని 2018లోనే టీడీపీనే ఎంపిక చేసింది. ప్రమాణాలు పాటించడం లేదన్న కారణంగా జగన్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిందే తడవు.. ఈ కంపెనీ ఇంకో రూపంలో తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టుదారుల్లో ఒకటిగా మారింది. ఇవన్నీ సిట్ చెప్పిన వాస్తవాలే. కానీ.. నిందలు మాత్రం వైసీపీపై మోపుతూంటారు. 2014-19 మధ్య చౌక ధరకు నెయ్యిని కొన్న టీడీపీ అప్పుడు కల్తీ జరగలేదని ఎలా చెప్పగలదు? టీడీపీ, వైసీపీల రెండింటి హయాంలోనూ టీటీడీ కొన్ని నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపింది. కానీ.. ఒక్క వైసీపీ హయాంలోనే కల్తీ జరిగిందని ఎల్లో మీడియా పనికట్టుకుని రాస్తూంటుంది. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్న చిన్న అప్పన్న అనే వ్యక్తిని సుబ్బారెడ్డి కార్యదర్శిగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రభాకరరెడ్డి సతీమణి, ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ప్రస్తుత మంత్రి పార్ధసారధిలు అప్పట్లో వైసీపీలో ఉండేవారు. వారిద్దరూ టీటీడీ సభ్యులుగా పర్ఛేజింగ్ కమిటీలో పని చేసినప్పుడు ఏం జరిగింది? వారికి అసలు ఏమీ పాత్ర లేదని ఎలా చెప్పగలిగారు. వారిని కేసు నుంచి ఎలా తప్పించారు. వైవీ సుబ్బారెడ్డిపై రకరకాల కథనాలు రాసి అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు భగ్నమయ్యాయి. సుబ్బారెడ్డి తప్పిదం ఉన్నట్లు సిట్ ఎక్కడా చెప్పలేదు. అంటే ఇంతకాలం ఎల్లో మీడియా చేసిందంతా దుర్మార్గపు ప్రచారమే అవుతుంది కదా! మరో మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి ఈ ఆరోపణ రాగానే తిరుమల వెళ్లి ప్రమాణం చేశారే. అలాంటి పని టీడీపీ నేతలు ఎవరూ ఎందుకు చేయలేకపోయారు? రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదిరులు తిరుమలను వాడుకున్నట్లు తేలింది కదా? ఇప్పుడు వారిద్దరూ ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? ఎల్లో మీడియా చెంపలు వేసుకుంటుందా? అందుకే మాజీ మంత్రి పేర్ని నాని ఒక డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరుమలలో ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని, ఆయనకు వాతలు పెట్టాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఏపీలో ఉన్న గుడుల మెట్లన్నీ కడగాలని కూడా సలహా ఇచ్చారు. వారు ఎటూ ఆ పని చేయరు. అది వేరే విషయం. కనీసం ఇకనైనా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వీరు వ్యవహరిస్తారా? అన్నది డౌటే. ఏదైతేనేం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కల్తీ జరగలేదన్న విషయం స్పష్టం కావడం మాత్రం... కోట్లాది హిందూ భక్తులకు పెద్ద రిలీఫ్!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
స్వామిద్రోహుల లడ్డూ మోసం
చంద్రబాబు దైవభక్తి ఒక నాటకంజనక్షేమం ఒక బూటకంఅధికారం అన్నదే కీలకంసంపాదనే ఆయనకు మూలకంచంద్రబాబు ఒక స్వార్థ కీటకంహైందవ ద్రోహ రూపకంఇది నా వ్యక్తిగత అభిప్రాయం కానేకాదు. తిరుమల లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కలవనే లేదని సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ నిర్ధా రించిన తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనసుల్లో కలిగిన అభిప్రాయం. హిందువులు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. స్వామి వారి ప్రసా దాన్ని భక్తిశ్రద్ధలతో కళ్లకద్దుకుని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదాన్ని చంద్రబాబు ఆరోపణల తర్వాత, స్వీకరించాలంటే ఏదో అనుమానం. మనమెంత గానో ఇష్టపడే, పూజించే స్వామి వారి ప్రసాదమేనా? లేక పంది, ఆవు, చేపల కొవ్వుతో తయారు చేసిందా? అని హిందువుల మనసులు ఆవేదనతో గింజుకున్నాయంటే అనుమానం లేదు. అందుకే చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని 2024 సెప్టెంబర్ 18న తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసిన తర్వాత,హిందువులంతా మనసులో పరమ శివుడు గరళాన్ని దిగ మింగినట్టు క్షోభను అనుభవిస్తూ వచ్చారు. బయటపడిన నీచత్వంసుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియామకమైన సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ ఎట్టకేలకు నివేదికను న్యాయస్థానంలో సమర్పించింది. అందులోని అంశాలు కోట్లాది మంది హృదయభారాన్ని దించే సమాచారం. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు పదార్థాలూ లేవని ‘సిట్’ నిర్ధారించింది. ఈ నివేదిక తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను పెంచేలా ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నీచత్వాన్ని బయట పెట్టిందని చెప్పక తప్పదు. రాజకీయ ప్రత్యర్థుల్ని నేరుగా ఎదుర్కో లేక, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకుహిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అస్త్రంగా వాడుకోవడం దిగ్భ్రమ కలిగించింది. అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక ఉదంతాలున్నాయి. అయితే శ్రీవేంకటేశ్వరస్వామికి కూడా ద్రోహం తలపెట్టేంత దుర్మార్గం ఆయనలో ఉందని కలలో కూడా ఊహించ లేదు. కనీసం ‘సిట్’ నివేదిక వెలువడిన తర్వాతైనా ఆయనలో కాసింతైనా పశ్చాత్తాపం కలుగుతుందని సమాజం భావించింది. అలాంటిది లేకపోగా, తమ ప్రసార మాధ్యమాలు, అధికార బలంతో ఎలా పైచేయి సాధించాలని దేవుడితో రాజకీయ క్రీడ ఆడటానికే చంద్ర బాబు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు చేలో మేస్తే, తాను గట్టున ఎలా మేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరూపించుకుంటున్నారు. తనను తాను ‘సనాతని’గా ప్రచారం చేసుకుంటున్న పవన్ కల్యాణ్, దేవునికి అన్యాయం జరిగితే, బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న నాయకుడిగా రక్షణ కవచంగా ఉండాల్సింది. కానీ లడ్డూ ప్రసా దంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిసిందనే చంద్రబాబు ఆరోపణలు నిజమన్నట్టు దుష్ప్రచారం చేసిన ఘనతను పవన్ దక్కించుకున్నారు. చంద్రబాబు అండ్ కోకు జగన్‌పై దుష్ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. అయితే దాన్ని జనం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిట్టచివరి అస్త్రంగా లడ్డూ ప్రసాదమనే అస్త్రాన్ని ప్రయోగించారు. దేవుని భుజాల పైనుంచి జగన్‌ను రాజకీయంగా కాల్చాలనే ప్రయత్నం బూమరాంగ్ అయ్యింది.స్వామివారి పుణ్యమా అని... లడ్డూ ప్రసాదంలో కల్తీపై నిక్కచ్చిగా విచారణ జరిపించాలని వైసీపీ నాయకుడు, టీటీడీ పూర్వపు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఒకవేళ సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సీబీఐ నేతృత్వంలో విచారణ చేయాలని ఆదేశించకపోయివుంటే, స్వామి వారి ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర నెరవేరేదేమో! కానీ కలి యుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి చంద్రబాబు, ఆయన తాబేదా రులైన పాలకుల కుట్రల్ని గుర్తించి, సీబీఐతో విచారణ చేపట్టేలా చేయించారు. అందుకే సీబీఐ విచారణ జరిపి, చంద్రబాబు, ఆయన అనుచరులు ఆరోపణలు చేస్తున్నట్టు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఇదే చంద్రబాబు నియమించిన ‘సిట్’ విచారణ జరిపి ఉంటే, తన రాజకీయ స్వార్థానికి, ఆరోపణలే నిజమని నమ్మించేందుకు నివేదిక ఇప్పించేవారు. అలాగే వైవీ సుబ్బారెడ్డిని, నన్ను, ధర్మారెడ్డిని జైలుకు కూడా పంపి ఉండేవారు. సీబీఐ విచారణతో బాబు ఆటలు సాగలేదు. బాబు కోరుకున్నట్టుగా రాజకీయ లబ్ధి చేకూరకపోగా, యావత్ హిందూ సమాజం ఆయనను అసహ్యించుకుంటోంది. శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులూ నోళ్లు వెళ్లబెట్టేలా... చంద్రబాబు తన మాటలతో, చేష్టలతో, వంతపాడే ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడే నెయ్యిపై నిందారోపణలు చేయడాన్ని సమాజం గుర్తించింది. ఒక రాజకీయ నాయకుడికి, అతని దుశ్చర్యల్ని జనం పసిగట్టడం కంటే మరో శిక్ష అవసరం లేదు. పురాణ కాలంలో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు అందులో మద్యమాంసాలు కలిపేవారని కథలు కథలుగా విన్నాం. రాక్షసుల కంటే నీచస్థాయికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగజారారనేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంలో వారు చేసిన నానాయాగీని చూడాల్సి ఉంటుంది. దమ్ముంటే మొదటి నుంచీ వద్దాం!టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై విచారించిన ‘సిట్’... రాజకీయపరమైన అవినీతి లేదని స్పష్టంగా పేర్కొంది. అధి కారులు, సాంకేతిక నిపుణులు, డెయిరీ సంస్థల అధిపతులు కుమ్మక్కై పామాయిల్‌ను నెయ్యిగా భ్రమింపచేశారనేది ‘సిట్’ నివేదిక సారాంశం. ‘సిట్‘ నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడి నాలుక మడత పడింది. కల్తీ జరిగింది కదా అని కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారు. నిజంగా చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, భక్తి ఉంటే 2009 నుంచి 2019 వరకు టీటీడీలో నెయ్యి సరఫరాపై విచారణ చేయించాలి. ఇవాళ సీబీఐ నివేదికలో భోలేబాబా మార్గంగా వైష్ణవి, ఏఆర్ డెయిరీలకు నెయ్యి సరఫరా అయినట్టు ఉంది. అలాగే ప్రీమియం డెయిరీకి కూడా! ఈ ప్రీమియర్, ఆల్ఫా డెయిరీలే 2013 సంవ త్సరం నుంచి 90 శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేశాయి. ఇందుకు సంబంధించి మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి. ప్రీమియర్ డెయిరీ కూడా ఇవాళ భోలేబాబా దగ్గరి నుంచే నెయ్యి సరఫరా చేసినట్టు సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. టెండర్ నిబంధనల్ని మా హయాంలో సరళతరం చేయడం వల్ల కల్తీ జరిగినట్టు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నిబంధనల్ని సరళ తరం చేయాలని అనుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఆలోచనే కారణం. కొత్తగా వచ్చిన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అందుకే కొత్త కంపెనీలకు కూడా నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించాలని 2021లో టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. అయితే పాల ఉత్పత్తులు తగిన మోతాదులో లేకపోతే వెన్న కొనుగోలు చేయొచ్చనే నిబంధన నేటికీ ఉంది. ఆ తర్వాత నిబంధనను కఠినతరం చేసింది నా హయాంలోనే! ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకులపై సీబీఐ నేరారోపణ చేయలేదు. ఆ నేరంలో భాగస్వాములుగా టీటీడీ చైర్మన్లగా పని చేసిన మమ్మల్ని ఎక్కడా సీబీఐ చెప్పలేదు. నెయ్యి ప్రామాణికతల్ని మెరుగుపరచడానికి రూ.5.50 కోట్లతో మిషనరీల ఏర్పాటుకు టెండర్లను పిలిచింది మా హయాంలోనే! ఆ మొత్తాన్ని అందించడానికి దాత వచ్చింది కూడా మా హయాంలోనే. ఆ తర్వాత మా ప్రభుత్వం దిగిపోయింది. మీ హయాంలో చేసిందేమీ లేదు. పైగా మాపై నిందారోపణలు. ఇవాళ నిందితులుగా ‘సిట్’ పేర్కొన్న జీఎం సుబ్రమణ్యం 2016 నుంచి 18 వరకు ప్రొక్యూర్మెంట్ జీఎంగా కొనసాగారు. అది కూడా చంద్రబాబు టైమ్ లోనే! మరో నిందితుడు జగదీష్ కూడా 2018–21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ప్రొక్యూర్మెంట్ జీఎంగా నియమి తులయ్యారు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనే సాంకేతిక నిపుణులు 2013 నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్నారు. ఇవాళ వారిని నిందితులిగా సీబీఐ తేల్చింది. దీనికి మా నాయకు డైన వైఎస్ జగన్‌కు ఏంటి సంబంధం బాబు? సరైన పాప పరిహారంయజ్ఞం చేస్తున్న వ్యక్తి జగన్. అందులో రక్తం పోసే వ్యక్తులు చంద్రబాబు, పవవ్ కల్యాణ్. అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని పవనానంద స్వామి (పవన్ కల్యాణ్) ఆరోపించారు. అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన టీటీడీ సభ్యుడు సౌరబ్ బోరా... నేటికీ బోర్డు సభ్యుడే! కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు ధరించి, బహిరంగ సభలో పవన్ నిస్సిగ్గుగా మాట్లాడారు. శ్రీవారి ఆలయం అపవిత్రం అయ్యిందని విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగారు. ఇప్పుడు పవన్ నోటి ద్వారా వాస్తవం ఏంటో బయటికి రావాలి. కల్తీ జరిగిందనే కారణంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలారావు చెప్పారు. అవే ట్యాంకర్లు తిరిగి తిరుమలకు ఇదే చంద్రబాబు హయాంలో వెళ్లాయనీ, ప్రసాదంలో వినియోగించారనీ ‘సిట్’ తన నివేదికలో స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కలిపారని, పట్టుకున్నామని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని కోర్టుకు సీబీఐ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కల్తీ ఎవరి హయాంలో జరిగిందో ఇప్పుడు చెప్పు బాబు? అలాగే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, శ్రీవారి ఆలయ అర్చకులతో చంద్రబాబు సంప్రోక్షణ చేయించారు. తిరుమలలో నాలుగు అర్చక కుటుంబాలున్నాయి. స్వాములూ... మీరు మేల్కో వాలి. చంద్రబాబు నీచ కార్యక్రమాలకు తలొగ్గకండి. ఇప్పటికైనా హిందువులంతా వాస్తవాలు తెలుసుకుని, చంద్రబాబు శ్రీవారి ఆలయం కేంద్రంగా ఆడే రాజకీయ వికృత క్రీడను తిప్పి కొట్టాలి. పదవి పొందడానికి పాతాళం కన్నా కిందికి దిగజారి మాట్లాడే పాశవిక ప్రవృత్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కే చెల్లు. పాప పరిహా రానికి అమరావతి నుంచి తిరుమల ఆలయం వరకూ రోడ్లన్నీ పవన్ కడగాలి. చంద్రబాబు గుండు కొట్టించుకొని, కోట్లాదిమంది భక్తు లకు క్షమాపణ చెప్పాలి.ఓ విష్ణు పరమాత్మా! రాజకీయ స్వార్థానికి మిమ్మల్ని వాడు కున్న పాలకుల మధ్య బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నాం. అధికారమనే పొర కళ్లకు కప్పి, అంధత్వంతో పాలిస్తున్న వారికి బుద్ధి చెప్పడానికే ‘సిట్’ నివేదిక రూపంలో మా ముందుకొచ్చావు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదనే సత్యాన్ని చెప్పి, కోట్లాది మంది హిందువుల మనసుల్ని తేలికపరిచావు. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది స్వర్గం, ఏది సత్యం, ఏదసత్యం తెలుసు కోలేని దురవస్థలో కూటమి పాలకులున్నారు. ఏడుకొండలవాడా వెంకటరమణా... మీరు తలచుకోబట్టే లడ్డూ ప్రసాదంపై ఏడాదిగా ప్రచారమవుతున్నవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. భూమన కరుణాకరరెడ్డివ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
తిరుమల లడ్డూపై ఆగని టీడీపీ పాపపు ప్రచారం
సాక్షి, విజయవాడ: సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. లడ్డూ, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఏఐతో ఎడిట్లు చేస్తూ.. ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. దీనికి తోడు.. వైఎస్సార్సీపీ ద్రోహం చేసిందంటూ పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది. టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో.. వెంకటేశ్వర్ స్వామి ఫొటోలను మార్ఫింగ్ చేసిన పోస్టుల కనిపిస్తున్నాయి. శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు చేస్తున్నాయి ఈ పార్టీ శ్రేణులు. టీడీపీ తీరుపై వెంకటేశ్వర స్వామి భక్తులు మండిపడుతున్నారు. ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి కలిసిందని ప్రచారం చేశారని.. ఇప్పుడు అలాంటిదేం లేదని తేలినా కూడా దేవుడిని అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ‘‘మహా పాపం నిజం. 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించారు. దాంతోనే 20కోట్ల లడ్డూలు తయారు చేశారు. వైకాపా పెద్దలు రూ.251 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు’’ అని వాటిపై పేర్కొన్నారు. ఫ్లెక్సీలపై మాజీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు. వైఎస్సార్సీపీ హయాంలో (2019-24) మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజనిజర్ధాణలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయి. ఈ క్రమంలో.. దర్యాప్తు జరిపిన సీబీఐ నెయ్యి శాంపిల్స్‌లో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్‌లో ఇలాంటి చేష్టలకు దిగడం గమనార్హం. -
‘చంద్రబాబూ.. వెంకన్న స్వామి నిన్ను క్షమిస్తాడా?’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు పచ్చి అవకాశవాది అని.. అధికారం కోసం దేనికైనా తెగిస్తారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుమల మహా ప్రసాదం విషయంలో చంద్రబాబు చేసింది ఉత్త ప్రచారమేనని సీబీఐ రిపోర్ట్ ద్వారా వెల్లడైన నేపథ్యంలో.. గురువారం రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారు. మా మీద కేసులు పెడితే ఎదుర్కొంటాం. కానీ, దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అవకాశవాది. అధికారం కోసం ఆయన ఎంతకైనా తెగిస్తారు. ఈ విషయం మరోసారి రుజువైంది. చంద్రబాబు ఆరోపించినట్లుగా తిరుమల ప్రసాదంలో ఎక్కడా జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చింది. ‘చంద్రబాబుగారూ.. శ్రీవారిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయొచ్చా?. మీ సమయంలో జరిగిన పాపాలు మాపై రుద్దుతున్నారు. ఇందుకుగానూ ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా?’.. .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడని, ఆయనకు బుర్ర లేదని, చేసిన తప్పును ఒప్పుకుని తిరుమలకు వెళ్లి క్షమాపణ చెప్పాలి అని అంబటి డిమాండ్ చేశారు. -
తిరుమల లడ్డూ కల్తీ అయిందనే చెప్పండి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తాము చేసిన ప్రచారం తప్పని తేలిన నేపథ్యంలో బుధవారం కేబినెట్ భేటీలో చంద్రబాబు దానిపై మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. సిట్ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయ అంశాలపై మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై గతంలో తాము చేసిన ఆరోపణలను ఎలా సమర్థించుకోవాలనే దానిపైనే ఎక్కువసేపు చర్చించినట్లు సమాచారం. సిట్ ఇచ్చిన నివేదికలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొన్నారని, ఇది వైఎస్సార్సీపీకి ఆయుధంగా మారిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. దీనిపై బాబు స్పందిస్తూ.. సిట్ నివేదికపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రచారం చేయాలని, అసలు ఇంకా నివేదిక బయటకు రాలేదని చెప్పాలని సూచించినట్లు సమాచారం. గతంలో తాను చెప్పినట్లు జంతువుల కొవ్వు కలిసిందనే అంశాన్ని వదిలేసి కల్తీ జరిగిందనే విషయాన్ని మాత్రమే బయటకు చెప్పాలని.. అలాగే, పాలులేకుండా నెయ్యి తయారైందని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. మరోవైపు.. సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని, దానిపై ఇంకా ఎలా మాట్లాడాలో చూద్దామని అన్నట్లు సమాచారం. అయితే, ఇద్దరు మంత్రులు మాట్లాడుతూ.. ఇప్పటికే వైఎస్సార్సీపీ స్పీడుగా ఉందని చంద్రబాబు, టీడీపీ చెప్పినవన్నీ అబద్ధాలేననే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లారని అన్నట్లు తెలిసింది. అయినా పర్వాలేదని, సిట్ నివేదిక ఎలా ఉన్నా వెనక్కి తగ్గకుండా కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రచారం చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. సిట్ నివేదిక వైఎస్సార్సీపీకే వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుదామని, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏ అకౌంట్లో డబ్బులు జమ అయిన విషయాన్ని ఎక్కువగా మీడియాలో చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మంత్రుల పనితీరుపై అసంతృప్తి..చంద్రబాబు యథావిధిగా ఈ సమావేశంలోనూ మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరికి తమ శాఖలపై ఏమాత్రం పట్టులేదని, తమకు సంబంధించిన సబ్జెక్టులపై కూడా మాట్లాడలేకపోతున్నారని, రాజకీయ విమర్శలను వెంటనే తిప్పికొట్టలేకపోతున్నారని చెప్పినట్లు సమాచారం. లడ్డూ విషయంలో సిట్ నివేదికపై వైఎస్సార్సీపీ దూకుడుగా వెళ్తున్నా తమ వాళ్లు ధీటుగా జవాబు ఇవ్వలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. -
అంతా బాబు దుష్ప్రచారమే.. రాజకీయ రాద్ధాంతమే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది. అనంతరం చార్జ్‌షీట్‌ను నెల్లూరులోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల సమర్పించింది. మరోవైపు సీబీఐ నివేదిక పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చి దుష్ప్రచారానికి యత్నిస్తున్నారు. కాగా అసలు సీబీఐ దర్యాప్తులో ఏం వెల్లడైందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు తాజాగా బహిర్గతమయ్యాయి. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తులో నిగ్గు తేలింది. సీబీఐ శాస్త్రీయంగా విశ్లేషించి సాధికారికంగా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి..టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదువైఎస్సార్ సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తు నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్‌ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’కు పంపించి పరీక్షలు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యాబరేటరీలు ఈ ఏడాది మార్చి 27న నివేదించాయని సీబీఐ నివేదిక పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై బాబు దుష్ప్రచారంరాజకీయ కుట్రల కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు. 1994–1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతిల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ దుష్ప్రచారం చేశారు. వైస్రాయ్ హోటల్ కుట్రతో ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారు. కాగా ఈసారి ఏకంగా తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేలా చంద్రబాబు దుష్ప్రచార కుట్రలకు తెగబడటం విస్మయపరుస్తోంది. 2024 సెప్టెంబరు 18న చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ కుట్రకు తెగబడ్డారు. అంతేకాదు ఆ మర్నాడు అంటే సెప్టెంబరు 19న ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయంలో దాన్ని విడుదల చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇటువంటి దుష్ప్రచారం చేయడం విభ్రాంతి కలిగించింది. ఎందుకంటే.. అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. నిజంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారో లేదోఅని తెలుసుకునే అవకాశం ఆయనకు ఉంది. అయినా సరే కేవలం వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడం... ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చేందుకు కూడా వెనుకాడలేదు. కాగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అప్పుడే తిప్పికొట్టారు. గత ఏడాది సెప్టెంబరు 20న ఆయన తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలను పరోక్షంగా ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. నెయ్యి ట్యాంకర్లను తిరుపతిలోనే పరీక్షించి... నాణ్యత ఉన్నవాటినే తిరుమలకు పంపిస్తామని... తగిన నాణ్యతతో లేనివాటిని వెనక్కి పంపుతామన్నారు. అది దశాబ్దాలుగా టీటీడీ కచ్చితంగా పాటిస్తున్న విధానమేనని చెప్పారు. అదే విధంగా తగిన నాణ్యతతో లేని నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపామన్నారు. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించనే లేదని... అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరుమల ఘాట్ రోడ్డులోకి కూడా ప్రవేశించనివ్వలేదన్నారు. దాంతో శ్యామలరావుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను హుటాహుటిన అమరావతికి పిలిపించడం గమనార్హం. రాజకీయ కుట్రతో తాము చేసిన నిరాధార ఆరోపణలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ఆయన్ను మందలించినట్లు తెలుస్తోంది. అనంతరం కొంత కాలానికే టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. బాబు కుట్రకు పవన్ వత్తాసుశ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం కలిగించేందుకు చంద్రబాబు పన్నిన కుట్రకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వత్తాసు పలికారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆయన హైడ్రామాకు తెరతీశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను కడిగి చంద్రబాబు కుట్ర డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు యత్నించారు. ఇక టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలు లడ్డూ ప్రసాదంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారానికి తెగబడ్డాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నించాయి. దేవుణ్ని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం దేవుణ్ణి అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయటాన్ని మందలించినట్లేనని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వరద సహాయక చర్యల్లో వైఫల్యం...డైవర్షన్ కుట్రతోనే లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారంవిజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డైవర్షన్ కుట్రకు పాల్పడ్డారు. 2024 సెప్టెంబరులో విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా టీడీపీ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. కనీసం లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేయలేదు. సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. దాంతో జల ప్రళయం విజయవాడను ముంచెత్తింది. కేవలం చంద్రబాబు సర్కారు వైఫల్యంతో 50మందికి పైగా దుర్మరణం చెందారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకు తెరతీశారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారానికి తెగబడ్డారు. తద్వారా ప్రజల దృష్టి విజయవాడ వరదల నుంచి మళ్లించేందుకు యత్నించారు.కుట్రతోనే ‘పచ్చ’ సిట్... అడ్డుకున్న సుప్రీంకోర్టుతమ రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. టీడీపీ వీరవిధేయుడిగా ముద్రపడిన వివాదాస్పద అధికారి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ను నియమించింది. మరో టీడీపీ వీరవిధేయ అధికారి, విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టిని అందులో సభ్యుడిగా నియమించింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య అల్లుడే గోపీనాథ్ జెట్టి. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న తమ దుష్ప్రచారానికి రాజముద్ర వేయాలనే ఆ ఎత్తుగడ వేసింది. కాగా ఈ యత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఆ సిట్ ఏర్పాటు చెల్లదని చెప్పింది. ఆ స్థానంలో సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు చార్జ్‌షీట్‌ను సమర్పించింది. -
తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం
-
లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలా?
తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై దాడి చేయించడం చంద్రబాబుకు పరిపాటే. ఏకంగా న్యాయవ్యవస్థపైనే దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దుష్ప్రచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా?’’ - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘‘జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని అన్నావ్..! వాటికి ఆధారాలు దొరికాయా..?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల వెంకటేశ్వరస్వామి విశిష్టతను అభాసుపాలు చేస్తావా బాబూ? అంటూ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. బెయిల్‌పై ఉన్న చంద్రబాబు షరతులను ఉల్లంఘిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీసేయించుకుంటున్నారని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా బాబూ..? చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా! టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. వాటిని భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లాయా? వీటికి ఆధారాలున్నాయా? టీటీడీలో ఒక బలమైన తనిఖీ వ్యవస్థ (రోబస్ట్ ప్రొసీజర్) ఉంది. టీటీడీకి వచ్చే ఏ నెయ్యి ట్యాంకర్ అయినా ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లా»ొరేటరీస్) సర్టిఫికేషన్‌తోనే రావాలి. ఇది దశాబ్దాలుగా టీటీడీలో పాటిస్తున్న నిబంధన. ఈ సర్టిఫికెట్ లేకుండా తిరుమలలోకి ట్యాంకర్లు రావు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు. టీటీడీకి ఒక సొంత ల్యాబ్ కూడా ఉంది. ఆ ల్యాబ్‌లో మళ్లీ టెస్టు పాస్ అయితేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించి, వెనక్కి పంపిస్తారు. ఇలా గతంలో చంద్రబాబు హయాంలో 15 సార్లు వెనక్కి పంపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపారు. టీటీడీలో బలమైన తనిఖీ వ్యవస్థ ఉందని, సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. అలాంటప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడిది? కల్తీ నెయ్యి వాడితే నీ వైఫల్యం కాదా బాబూ? చంద్రబాబు హయాంలో, ఆయన నియమించిన టీటీడీ ఈవో టైమ్స్ నౌలో(ఈవో మాట్లాడిన వీడియో ప్రదర్శించారు) స్వయంగా ఆ ట్యాంకర్ల నెయ్యిని వినియోగించలేదని చెప్పారు. సెపె్టంబర్ 20, 2024న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నియమించిన టీటీడీ ఈవో.. నాలుగు నెయ్యి ట్యాంకర్లు టెస్టులు పాస్ కాకపోవడంతో రిజెక్ట్ చేసి వెనక్కి పంపించామని ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన హయాంలో జూలైలో∙4 ట్యాంకర్లు తిప్పి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయట! మరి అప్పుడు సీఎం ఎవరు? చంద్రబాబు కాదా..? ప్రభుత్వాన్ని నడిపేది ఆయన కాదా..? గతంలో రిజెక్టు చేసిన నెయ్యి ట్యాంకులు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వినియోగించారని సిట్ రిమాండ్ రిపోర్టులో రాసింది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరిని లోపల వేయాలి? ఇదే నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఆ నెయ్యి ట్యాంకులు ఎలా తిరిగి వచ్చాయి? చంద్రబాబు చెప్పినట్టుగా ఆ నెయ్యిని వాడి ఉంటే అది ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, అప్పటి టీటీడీ ఈవో ఇద్దరూ ఏం చేస్తున్నారు? వాళ్లిద్దరిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయలేదు? పైగా మాపై నిందలు వేస్తారా? చంద్రబాబు ముఠాకు దేవుడంటే భయం, భక్తీ లేదు. దుర్మార్గమైన అసత్యాలు ప్రచారం చేయడమే వీళ్ల పని. పైగా చంద్రబాబు వేసిన సిట్.. వ్యక్తులను ఇరికించాలనే ఆరాటం, తపన, తాపత్రయంతో తప్పులపై తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. 2014–19 మధ్య కిలో నెయ్యి రూ.276–రూ.314మరి అదంతా కల్తీ నెయ్యేనా బాబూ? స్వచ్ఛమైన నెయ్యి రూ.320కే మీరు ఎలా సప్లయ్ చేయిస్తారు? అని చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో రూ.3 వేలు అవుతుందని ప్రకటించారు. చంద్రబాబు గెజిట్ పత్రిక ఈనాడు అయితే కనీసం రూ.1,000–రూ.1,600 అని రాసింది. మరి టీటీడీలో ఇప్పుడు నెయ్యి ఎంతకు కొంటున్నారు? రూ.3 వేలు ఇస్తున్నారా? రూ.1,600 లేక రూ.1,000 ఇచ్చి కొంటున్నారా? 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ కిలో నెయ్యి రూ.276–314 మధ్య కొన్నాడు. ఇది రూ.320 కంటే తక్కువ కదా? కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. పైగా భోలే బాబా డెయిరీ విషయంలో చేస్తున్న దు్రష్పచారం అంతా ఇంతా కాదు. 2018 జూన్ 26న టీటీడీ బోర్డు మినిట్స్ చూస్తే భోలేబాబా ఎవరో తేలింది. హర్‡్ష ఫ్రెష్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది. ఈ సంస్థ టీటీడీకి పాలు సప్లై చేయడానికి డీమ్డ్ టు క్వాలిఫై అని సర్టిఫై చేసింది చంద్రబాబు హయాంలోనే. తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లయ్ చేస్తుంటాయి. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తుంటారు. ఎవరు తక్కువకు కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రొసీజర్. టెండర్లలో ఎల్–1 ఎవరుంటారో వారికి కేటాయిస్తారు. ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడానికి వీళ్లు ప్రయతి్నస్తున్నారు. నెయ్యిని సప్లై చేసే ఏ కంపెనీ అయినా కచ్చితంగా ఏన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకోవాలి, టీటీడీలో ఉన్న ల్యాబ్‌లో టెస్టులు పాసవ్వాలి. అప్పుడే ట్యాంకులు లోపలకు వెళ్తాయి. దుష్ప్రచారం ఆపాలని సుప్రీంకు వెళ్లింది మేం కాదా? టీటీడీ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం ఆపాలని, నిజాలు బయటకు తీసుకురావాలని సుప్రీం కోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ వాళ్లు కాదు. అలాంటిది.. సుబ్బారెడ్డిపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఎప్పుడైనా వెళ్లారా? హైదరాబాద్‌లో ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఆయన 1978 నుంచి 35–40 సార్లు అయ్యప్పమాల ధరించి కొండకు వెళ్లి ఉంటారు. అందులోనూ ఆయనది గురుస్వామి స్థానం. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో మీకే తెలియాలి. టీటీడీలో స్కాములన్నీ బాబువే! పరకామణి కేసులో దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు రూ.14 కోట్లు విలువైన ఆస్తులను దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా? దేశంలో అనేక చోట్ల, అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. కానీ, ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. తిరుపతి కోర్టులో చార్జిషీట్ వేశారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్నీ కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్టు ప్రొసీజర్‌తో జరిగాయి. జ్యుడీషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో సాంకేతిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు తప్పులేదు. కానీ, రాజకీయాల కోసం ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నాడనో.. భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నాడనో.. వారి మీద బురదజల్లాలని తప్పుడు స్టేట్మెంట్ కోసం అక్కడ పనిచేస్తున్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేశారు. ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత తప్పుడు కథనాలు రాయించారు.మీ హయాంలో పట్టుకోలేదేం బాబూ? ఆ దొరికిన దొంగ... 30 ఏళ్ల నుంచి జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్ల నుంచి పాల్గొంటున్నాడు. కొత్తగా మా ప్రభుత్వంలో వచి్చన వ్యక్తి కాదు. మరి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు పట్టుకోలేకపోయారు? ఆ దొంగను మేం పట్టుకున్నాం. వాస్తవానికి మేం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో తిరుమల హుండీ డబ్బు లెక్కింపు ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేశాం. దేవుడి సొమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త పరకామణి బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. దాన్ని సీఎం హోదాలో నేను ప్రారంభించా. 2023 ఫిబ్రవరి 5 నుంచి ఆ బిల్డింగ్‌లో పూర్తి స్థాయి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాత భవనంలో అరకొరగా సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే. బ్లయిండ్ స్పాట్స్ ఎక్కువ. వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో 360 డిగ్రీల కవరేజ్‌తో 4కే హెచ్డీ సీసీ టీవీ వ్యవస్థలు, హైబ్రీడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ తెచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత ఏప్రిల్ 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు మంచివారు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా..? ఆ వ్యక్తి దశాబ్దాలుగా ఇదే పనిచేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ చంద్రబాబు హయాంలో ఎవరూ పట్టుకోలేదు. మా హయాంలో పట్టుకున్నాం. గతంలో ఏం జరిగిందో దేవుడికే తెలుసు. రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లు దొరికితే.. ఏకంగా రూ.14 కోట్ల ఆస్తిని ఆ కుటుంబం దేవుడికి రాసిచ్చింది. న్యాయ వ్యవస్థపైనే దాడి..! చంద్రబాబు తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై సైతం దాడి చేయించడం పరిపాటే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి వర్ల రామయ్యతో మాట్లాడిస్తున్న మాటలు న్యాయ వ్యవస్థపై దాడి చేయించినట్లే! (వర్ల వీడియోను ప్రదర్శించారు)! ‘‘23–9–2025: ప్రాపర్టీ ఓనర్ ఎవరు? కోర్టు కూడా తప్పు చేసిందా.. అనుమానం వస్తుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరుతున్నా.. మీ తరఫున దర్యాప్తు చేయించాలి. ఈ కేసులు సీరియస్. ఎందుకు లోక్ అదాలత్‌తో దర్యాప్తు చేయిస్తారు? తిరుపతిలో రూమర్స్ వస్తున్నాయి. ఈ జడ్జిగారికి పైనుంచి ఎవరో మరో జడ్జి చెప్పారట. నేను జడ్జి ఎవరని అడగట్లేదు. అందరం మనుషులమే. ఈ జడ్జికి పైనుంచి ఎవరో జడ్జి చెప్పారట. ఏ జడ్జి చెప్పినా.. ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేసినా.. అన్యాయం జరిగింది మాత్రం స్వామి వారికే. 13–11–2025: తమిళనాడులో రిజిస్టర్ చేశారట ఆస్తులు. దీని వెనుక జడ్జి ఉన్నారని చెబుతున్నారు. రూ.50 లక్షల స్టాంపు డ్యూటీ కట్టారట. ఆ రూ.50 లక్షలు ఎవరు కట్టారు? జడ్జిలు, టీటీడీ అధికారులపై నిందలు సిగ్గుచేటు.. ఇలా ఏకంగా న్యాయవ్యవస్థపైనే చంద్రబాబు దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దు్రష్పచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా? తిరుమలకు పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తుంటారు. ఇలాంటి కేసులు ఏమైనా జరిగినప్పుడు తిరుపతిలో ఉన్న జడ్జిలు, సుప్రీం కోర్టు జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటారు. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో, దేశం మొత్తం చూస్తున్న కేసులో సలహాలు కోరతారు. జ్యుడీషియల్ పరిధిలో సలహాలు తీసుకుంటారు. ఏ తప్పూ జరగలేదు, ఏ తప్పూ చేయలేదు కాబట్టి సలహాలు తీసుకొని, ఇంప్లిమెంట్ చేశారేమో..! దాంట్లో రాజకీయం చేయడానికి ఏముంది? జడ్జిలపై, టీటీడీ అధికారులపై నిందలు వేయడం సిగ్గుచేటు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? టీడీపీ స్టాండ్ ఎలా ఉంటుందంటే.. ఈ ఏడాది సెపె్టంబర్ 1న చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, అత్యంత విశిష్టత కలిగిన సింహాచలంలో రూ.55 వేలు హుండీ డబ్బులు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ను పోలీసులకు అప్పగించి, ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఆ వ్యకిని ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు దీనిపై ఎందుకు విచారణ చేయలే దు? మొత్తం వారిద్దరి ఆస్తులపై విచారణ చేసి, వాటిని మొత్తం ఎందుకు స్వా«దీనం చేసుకోలేదు? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉంటే ఒక న్యాయం..! అదే అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం..! మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు? ఎక్కడైనా న్యాయం ఒక్కటే కదా!!టీటీడీలో బాబు స్కాములు ఇవీ...!రాష్ట్రంలో దేవుడి సొమ్ముతో స్కామ్‌లు చేసింది చంద్రబాబే. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిలతీర్థం వరకు శ్రీనివాస సేతు 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపాదన చేశారు. ఇందులో 67 శాతం ఖర్చు టీటీడీ, 33 శాతం ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించారు. అప్పటి తిరుపతి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను చంద్రబాబు పిలిపించుకుని రూ.684 కోట్లతో శ్రీనివాససేతు కట్టేయమని చెప్పారు. అయితే, ఆ మీటింగ్‌లో టీటీడీ ప్రతినిధులు లేకుండానే.. ఏకంగా 67 శాతం డబ్బులు టీటీడీ నుంచి తీసుకునేలా నిర్ణయం తీసేసుకున్నారు. అసలు బోర్డు అనుమతి, ఆమోదం లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఇది కాదా స్కామ్? మన ప్రభుత్వం వచ్చాక టీటీడీ బోర్డు రీ విజిట్ చేసి రూ.40 కోట్లు ఖర్చు తగ్గించింది. కొత్త బోర్డు రాకపోయి ఉంటే ఆ రూ.40 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయేవి? కమీషన్ల కోసం కక్కుర్తి! టీటీడీ డబ్బుల్లో 10 శాతానికి మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది టీటీడీ రూల్. చంద్రబాబు హయాంలో కమీషన్లకు కక్కుర్తిపడి రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్‌లో పెట్టించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచి్చన తర్వాత బోర్డు ఆ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బును విత్ డ్రా చేసి జాతీయ బ్యాంకులో పెట్టింది. ఆ తర్వాత మూడు నెలలకు ఎస్ బ్యాంక్ ఆర్థికంగా కుదేలయ్యింది. ఒకవేళ చంద్రబాబు పెట్టిన రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్‌లోనే ఉండి ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది? మరి ఏది స్కామ్? మాకు ఇవన్నీ తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాల్లో లాగకూడదని సమస్య పరిష్కరించి, సరిదిద్దాం. మన ఇప్పుడు వీళ్లు చేసేవి చూస్తుంటే అసలు ఏమీ జరగకపోయినా, మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తూ, రివర్స్ అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి టీటీడీ ఒక స్వతంత్ర వ్యవస్థ. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విధానాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేస్తున్నారు. అలాంటి ఆలయాన్ని, ఏకంగా దేవుడి ప్రతిష్టను మంటగలుపుతున్నామనే కనీస ధ్యాస కూడా లేకుండా, వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తూ చంద్రబాబు అత్యంత హేయమైన రాజకీయాలు చేస్తున్నారు. అది చంద్రబాబు సొంత సిట్! లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు వేసిన సిట్ చూస్తే వాళ్ల బాగోతం తెలిసిపోతుంది. సిట్‌లో ఉన్న గోపీనాథ్ జెట్టి.. ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పని చేసిన కృష్ణయ్యకు అత్యంత సమీప బంధువు (ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో దిగిన ఫొటో ప్రదర్శించారు). కృష్ణయ్యపై చంద్రబాబుకు ఎంత ప్రేమ అంటే.. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పెట్టుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్‌ను చేశారు. ఇలాంటి వ్యక్తి సమీప బంధువు సిట్ ఆఫీసర్లలో ఒకరు. మరో ఆఫీసర్ డీఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ట త్రిపాఠి ఎలాంటి వాడో చెప్పాల్సిన పనిలేదు. పల్నాడు జిల్లాలో ఆయన సృష్టించిన అల్లకల్లోలం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం భుజాన వేసుకుని పాకులాడారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ అధికారిని పక్కన కూర్చోబెట్టుకుని డీఐజీ స్థానం ఇచ్చి.. ఆయన చేస్తున్న మాఫియా కలెక్షన్లలో ప్రముఖ ప్రధాన పాత్ర ఇచ్చారు. ఇలాంటోళ్లు అందరూ సిట్‌లో ఉన్నారు. మరోవైపు వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అతను వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) పీఏ. వీపీఆర్ ఒక టీడీపీ ఎంపీ. ఆయన దగ్గర నుంచి ప్రతి నెలా అప్పన్న జీతం (చెక్కులు) తీసుకుంటున్నాడు. పైగా ఏపీ భవన్ ఉద్యోగి. వీపీఆర్ పీఏ, తర్వాత ఏపీ భవన్ ఉద్యోగి. మరి వైవీ సుబ్బారెడ్డి పిక్చర్లోకి ఎలా వచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఎంతసేపూ వైవీ సుబ్బారెడ్డి పీఏ అని గోబెల్స్ ప్రచారం చేస్తూ డ్రిల్ చేస్తున్నారు!. -
టీటీడీ లడ్డు వ్యవహారం: శ్యామల రావు వ్యాఖ్యలపై వైఎస్ జగన్
-
సింహాచలం చోరీ కేసు.. అశోక గజపతి మాటేంటి?
తాడేపల్లి, సాక్షి: దేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చేసిన ఆరోపణలే అందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారు. ఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?. తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్‌తోనే రావాలి. సర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్‌ల్లోనూ పరీక్షలో నెగ్గాలి. ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారు..అలా మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం. పకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది..అలాంటప్పుడు టీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?. ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? మరి తక్కువ ధరకు కొన్నారు కాబట్టి కల్తీ నెయ్యే అనుకోవాలా?.లడ్డూ ప్రసాదంలో దుష్ప్రచారాలు ఆపాలని.. నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిందే వైవీ సుబ్బారెడ్డి. ఆయన అపర భక్తుడు. నిత్యం గోపూజలు చేస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేసి గురుస్వామి అయ్యారు. అలాంటి వ్యక్తిని ఈ కేసుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పన్న సుబ్బారెడ్డి పీఏ అంటూ ప్రచారం చేశారు. ఆయన అప్పన్న అసలు ఎవరు?. ఏపీ భవన్ ఉద్యోగి. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి పీఏ. అధికార పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తి. ఎల్లో మీడియా ఎందుకు వైవీ సుబ్బారెడ్డి పీఏగా బోగస్ ప్రచారం చేస్తున్నాయి?. చంద్రబాబు లడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌లో ఏర్పాటు చేసిన అధికారులంతా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే. టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా కీలకంగా ఉన్నవాళ్లే.పరకామణి కేసులో.. పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి. అంతా పద్దతి ప్రకారమే జరిగింది. నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు. పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. దొంగను పట్టుకోవడం నేరమా?.. ఒక బీసీ పోలీస్ అధికారిని వెంటాడి.. వేధించి.. చనిపోయేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు.. అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీ జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీన రమణ, సురేష్ అనే ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారు. వీళ్లిద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. అలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదు?. విచారణ జరిపి పరకామణి కేసులా ఆస్తుల్ని స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు. సింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి. మరి ఆయన్ని విచారించారా?. వైవీ సుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా?.. అని ప్రశ్నించారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని టీటీడీలో రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు. ఇది ధర్మమేనా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. -
లడ్డూ ప్రసాదంపై బాబు సర్కారు కుట్ర!
సాక్షి అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకొచ్చే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం మరింత పదును పెట్టింది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు బరి తెగించింది. అందుకోసం పరస్పర విరుద్ధ ఆరోపణలు, అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి న్యాయస్థానాలను బురిడీ కొట్టించేందుకు కూడా తెగబడుతుండటం తీవ్ర విభ్రాంతి కలిగిస్తోంది. టీటీడీ నెయ్యి వివాదంలో సిట్ తాజాగా అరెస్టు చేసిన సుగంథ్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి అజయ్ కుమార్ సుగంథ్ రిమాండ్ నివేదికే అందుకు తాజా తార్కాణం.ఆ రిమాండ్ నివేదికలోని అంశాలను ఎల్లో మీడియాతోపాటు వివిధ మీడియా సంస్థలకు ముందుగానే లీక్ చేసి రాద్ధాంతం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం తన కుట్రలను నిస్సిగ్గుగా బయట పెట్టుకుంది. ఆ దుష్ప్రచార కథనాలను మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేయడం గమనార్హం. అంటే పక్కా కుతంత్రంతోనే ఈ దుష్ప్రచార కుట్రలకు ప్రభుత్వం బరి తెగించిందన్నది స్పష్టమవుతోంది. తిరుపతి పోలీసులు అరెస్టు చేసిన అజయ్ కుమార్ సుగంథ్‌ను నెల్లూరు ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా ఈ నెల 21 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడిన ప్రభుత్వ కుట్ర ఇలా ఉంది..జంతువుల కొవ్వు అన్నారు.. కాదు కాదు పామాయిల్ అంటున్నారు!తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి దుష్ప్రచారానికి పాల్పడిందన్నది ఈ రిమాండ్ నివేదిక బయటపెట్టింది. గత ఐదేళ్లలో లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. అదే నిరాధార ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా పదేపదే ఉద్ఘాటించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన విషయం తెలిసిందే. కాగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక స్పష్టం చేయడంతో ప్రభుత్వ కుట్ర బెడిసికొట్టింది.సీఎం చంద్రబాబు ఆరోపణలను ఖండిస్తూ అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు కూడా కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని స్పష్టం చేయడం గమనార్హం. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈవోపై ఒత్తిడి తెచ్చి ఆయన మౌనం దాల్చేలా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరో కుతంత్రానికి ఈ రిమాండ్ నివేదిక ద్వారా కుట్ర పన్నింది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో పామాయిల్, ఈస్ట్, ఇతర రసాయనాలు కలిపారని తాజాగా పేర్కొంది. జంతువుల కొవ్వు ఆరోపణలు బెడిసికొట్టడంతో నెయ్యిపై దుష్ప్రచారం చేసేందుకు పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్ కలిపారనే వాదనను తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది.అందుకోసం దర్యాప్తు పేరుతో సాక్షులను వివిధ డెయిరీ సంస్థల ప్రతినిధులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు చెప్పినట్లుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోతే అక్రమ కేసులో ఇరికిస్తారనే భయంతోనే డెయిరీ ప్రతినిధులు వారి ఒత్తిడికి తలొగ్గినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. భోలే బాబా డెయిరీపై భిన్న వాదనలు..లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం భోలే బాబా డెయిరీపై పరస్పర విరుద్ధ ఆరోపణలతో తన కుట్రలను బయటపెట్టుకుంటోంది. ఏపీ భవన్ ఉద్యోగి చిన్న అప్పన్నను పోలీసులు వైవీ సుబ్బారెడ్డి పీఏగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆయన భోలే బాబా డెయిరీని బెదిరించి రూ.50 లక్షలు లంచం అడిగారని ఆరోపించారు. అందుకు ఆ డెయిరీ నిరాకరించడంతో టీటీడీ జీఎంపై ఒత్తిడి తెచ్చి బ్లాక్ లిస్టులో పెట్టించారని పేర్కొన్నారు. మరో రెండు కంపెనీలకు భోలేబాబా డెయిరీ ఎల్ 1గా వచ్చినప్పటికీ ఆ డెయిరీని కాదని మరో రెండు డెయిరీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇప్పించినట్లు ఆరోపణలు చేశారు. ఆయన వ్యక్తిగత బ్యాంకు లావాదేవీలను వక్రీకరిస్తూ వాటిని ఆధారంగా చూపించేందుకు తాపత్రయపడ్డారు.కానీ అదే సమయంలో చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వద్ద పీఏగా పని చేశారన్న వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. పోలీసులు భోలేబాబా డెయిరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టిందని పేర్కొనడం గమనార్హం. అంటే భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సరఫరాను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే టీటీడీ నిలిపివేసిందని స్పష్టమవుతోంది. భోలే బాబా డెయిరీ రైతుల నుంచి ఒక్క చుక్క కూడా పాలు సేకరించలేదని సిట్ పేర్కొంది. కానీ అదే డెయిరీ యూపీలో 60 వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి పాల ఉత్పత్తులు తయారు చేస్తోందని అదే సిట్ పూర్తి భిన్నమైన వాదన వినిపించింది.భోలే బాబా డెయిరీ పేరుతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో అజయ్ కుమార్ సుగంథ్ రిమాండ్ రిపోర్టులో సిట్ కొత్త కట్టుకథను వినిపించింది. భోలే బాబా డెయిరీ సుగంథ్ ఆయిల్ ప్రొడక్ట్స్ ద్వారా కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు కొత్త కట్టుకథ సృష్టించింది. అందులో వివిధ ప్రైవేట్ డెయిరీల పాత్ర ఉన్నట్లు కూడా పేర్కొంది. ఆ మేరకు హర్‡్ష ట్రేడింగ్ కంపెనీ, హర్‡్ష డెయిరీ ప్రొడక్ట్స్ తదితర పేర్లను పేర్కొంది. అంటే ఆ కంపెనీ ప్రతినిధులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు పక్కాగా పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది.సుప్రీం తీర్పునూ బేఖాతర్ చేస్తూ...రాజకీయాల్లోకి కనీసం భగవంతుడినైనా దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం చంద్రబాబు బేఖాతర్ చేస్తోంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎల్లో మీడియా ద్వారా రాద్ధాంతం చేస్తోంది. అజయ్‌కుమార్ సుగంథ్ రిమాండ్ రిపోర్టును న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే ఎల్లో మీడియాకు చేరడం అందుకు నిదర్శనం. ఎల్లో మీడియా, కొన్ని ఇంగ్లీషు పత్రికలు, వెబ్సైట్లలో దుష్ప్రచార కథనాలను సోమవారమే వైరల్ చేయడం విభ్రాంతి కలిగిస్తోంది.టీటీడీ లడ్డూ ప్రసాదానికి కళంకం ఆపాదించేలా మీడియా చానళ్లలో చర్చా గోష్టి నిర్వహించింది. ఆ దుష్ప్రచార కథనాలను మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేయడం గమనార్హం. అంటే పక్కా పన్నాగంతోనే ప్రభుత్వం, ఎల్లో మీడియా లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి తెగబడినట్లు స్పష్టమవుతోంది. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ, తీర్పుతో నిమిత్తం లేకుండా ప్రజలను తప్పుదారి పట్టించడమే చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యమన్నది తేటతెల్లమవుతోంది. -
పరమ పవిత్రం.. శ్రీవారి లడ్డూ ప్రసాదం
సాక్షి, అమరావతి: రాజకీయ కుట్ర కోసం ఎంతకైనా దిగజారుతామని టీడీపీ కూటమి ప్రభుత్వం పదేపదే నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది. అందుకోసం ఏకంగా శ్రీవారి దివ్య క్షేత్రమైన తిరుమల పవిత్రత, లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యంపై దుష్ప్రచారం చేసేందుకు కూడా తెగిస్తామని నిరూపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలతో లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం తెచ్చేందుకు తెగబడుతోంది. ఆ పక్కా కుట్రలో భాగంగానే సిట్ నివేదిక పేరుతో ఎల్లో మీడియా ద్వారా మరోసారి విషం చిమ్ముతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై అవాస్తవ ఆరోపణలతో అసత్య కథనాలు వండి వారుస్తోంది. రాజకీయాలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు సూచనను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ దుష్ప్రచారానికి బరితెగిస్తోంది. శతబ్దాలుగా కొనసాగుతున్న లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగిస్తూ తమ మనోభావాలను దెబ్బ తీస్తున్న ఎల్లో మీడియాపై ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. అందుకే ఈ వ్యవహారంలో ఎల్లో మీడియా కుతంత్రాలను తిప్పికొడుతూ అసలు వాస్తవాలను “సాక్షి’ ప్రజల ముందు ఉంచుతోంది.చిన్న అప్పన్న ఏపీ భవన్ ఉద్యోగితిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ దుష్ప్రచారం చేస్తోంది. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పీఏగా పని చేశారు. ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం. చిరుద్యోగి అయిన ఆయన ఏకంగా టీటీడీ జీఎం స్థాయి ఉన్నతాధికారుల్ని ప్రభావితం చేశారని కట్టుకథలు అల్లుతోంది. ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన ఆస్తుల ఉదంతాన్ని వక్రీకరిస్తోంది. వాటి ఆధారంగా చిన్న అప్పన్నను బెదిరించి, వేధించి తమకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రమన్నది స్పష్టమవుతోంది. ఫిర్యాదుపై విచారణకు ఆదేశించడం కూడా తప్పేనా!? నెయ్యి నాణ్యతపై ఫిర్యాదు రావడంతో టీటీడీ చైర్మన్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించడం తప్పన్నట్టుగా పోలీసులు వక్రీకరిస్తుండటం గమనార్హం. ఓ అనాకమ ఫిర్యాదు వస్తే బోలే బాబా డెయిరీ సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను మైసూర్‌లోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించినట్టు పోలీసులు తమ నివేదికలో పేర్కొనడం గమనార్హం. మామూలుగా ఫిర్యాదు వస్తే విచారణకు ఆదేశించకపోతే పట్టించుకోలేదని విమర్శిస్తారు.. విచారణకు ఆదేశిస్తే ఎందుకు ఆదేశించారని ఈనాడు, ఇతర టీడీపీ ఎల్లో మీడియా తిరిగి ప్రశ్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. టీడీపీ రాజకీయ కుట్రలో భాగంగా కేవలం విష ప్రచారం చేయాలన్న కుట్రే తప్ప, వాస్తవాలతో తమకు నిమిత్తం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.చైర్మనే సర్వస్వం కాదు.. టీటీడీ బోర్డు ఉంటుంది ఇక రాజకీయ కుతంత్రంతో కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా టీటీడీ వ్యవస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. తిరుమల–తిరుపతి వ్యవహారాలకు టీటీడీ చైర్మనే సర్వస్వం, సర్వాధికారి కాదు. టీటీడీ బోర్డుదే అత్యున్నత అధికారం. ఆ బోర్డులో సభ్యులు చర్చించి తీసుకున్న నిర్ణయాలనే టీటీడీ అమలు చేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు నిర్ణయాన్ని కూడా అదే రీతిలో బోర్డు తీసుకుంది. ఎల్లో మీడియా ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్న మరో విషయం ఏమిటంటే.. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా సభ్యులుగా ఉన్నారు. టీటీడీ పర్చేజ్ కమిటీలో కూడా సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం. భోలే బాబా డెయిరీ పాల సేకరణపై భిన్న కథనాలుపోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ కూటమి ప్రభుత్వం కనికట్టు చేసేందుకు యత్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించి భోలే బాబా డెయిరీ గురించి ప్రభుత్వం, ఎల్లో మీడియా పరస్పర విరుద్ధ వాదనలు వినిపిస్తుండటమే అందుకు తార్కాణం. భోలే బాబా డెయిరీ రైతుల నుంచి ఒక్క పాల చుక్క కూడా సేకరించకుండా టీటీడీ నుంచి రూ.240 కోట్ల నెయ్యి కాంట్రాక్టు పొందిందని సిట్ దర్యాప్తులో వెల్లడైనట్టు ఎల్లో మీడియా తన కథనంలో పేర్కొంది. మళ్లీ భోలే బాబా డెయిరీ ఉత్తర్‌ప్రదేశ్‌లో 60 వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి, పాల ఉత్పత్తులు తయారు చేస్తోందని అదే కథనంలో పేర్కొనడం గమనార్హం. మరి ఆ డెయిరీ పాలు సేకరిస్తున్నట్టా.. సేకరించనట్టా? రెండూ ఎల్లో మీడియానే చెబుతుంటే అందులో ఏది వాస్తవం!?నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబు ప్రభుత్వమేకర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలం పాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ పరంపరను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తినా, చంద్రబాబు ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. అంటే నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొన లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వ లేదు కాబట్టి.. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనమని చెప్పింది. వాస్తవాలు అలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నందిని డెయిరీకి ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి ఎలా కాంట్రాక్టు ఇస్తారు? ఇస్తే అసలు టెండరు వేయని డెయిరీకి ఎలా కాంట్రాక్టు ఇచ్చారని అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ప్రశ్నించేది కాదా? టెండరులో పాల్గొన్న ఇతర డెయిరీలు కూడా అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేవి కదా! టీడీపీ వీరవిధేయ సిట్‌తో కుతంత్రంనెయ్యి వివాదాన్ని టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని కూటమి ప్రభుత్వం యత్నించింది. అందుకే ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో గత ఏడాది హడావిడిగా సిట్‌ను ఏర్పాటు చేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పని చేసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించింది. అప్పటి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజులను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అల్లుడు. రిటైరైన తర్వాత కొన్నేళ్లు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కృష్ణయ్యను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమించారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పదవి కట్టబెట్టడం గమనార్హం. సిట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత.. నెయ్యిలో కల్తీపై టీటీడీ ద్వారా తిరుపతిలోని ఈస్ట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించడం గమనార్హం. ఆ ఫిర్యాదు చేసే ముందు రోజు రాత్రే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐని బదిలీ చేసి, ఆ స్థానంలో టీడీపీకి అనుకూల పోలీసు అధికారిని నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. సుప్రీం కొరడా.. సిట్ క్లోజ్ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సీఎం హోదాలో ఉండి లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని చంద్రబాబును ప్రశ్నించింది. కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లడ్డూ ప్రసాదం అంశంపై సిట్ దర్యాప్తు సరిపోతుందా.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా.. అన్నది ఆలోచిస్తామని తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం తిరుపతిలో దర్యాప్తు నిర్వహిస్తున్న సిట్ కార్యకలాపాలను తక్షణం నిలిపి వేసింది. అనంతరం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర బృందం దర్యాప్తు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని పరిశీలకులు స్పష్టం చేశారు.డైవర్షన్ డ్రామా కోసం తిరుమల పవిత్రతపై దుష్ప్రచారంఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ డ్రామాలో భాగంగానే కల్తీ నెయ్యి అంటూ రాద్ధాంతం చేస్తోంది. అందుకోసం ఏకంగా తిరుమల ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు బరితెగిస్తోంది. గత ఏడాది బుడమేరుకు భారీ వరద వస్తుందని నిపుణులు ముందే హెచ్చరించినా, కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. దాంతో భారీ వరద విజయవాడను ముంచెత్తి అతలాకుతలం చేసింది. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిపై దుష్ప్రచారానికి తెగబడింది. కూటమి నేతలు, ఎల్లో మీడియా పక్కా పన్నాగంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ఏమాత్రం వెనుకాడ లేదు. కానీ టీడీపీ కూటమి నేతల కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అధికారిక ప్రకటనే తిప్పికొట్టింది. ఆ వ్యవహారం ఇలా సాగింది.2024 జులై 23వనస్పతి కలిసింది.. ట్యాంకర్లు వెనక్కి పంపాం నెయ్యిలో కల్తీ జరిగిందని శాంపిల్స్ పరీక్షల్లో తేలింది. వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కలిసిందని వెల్లడైంది. దాంతో కాంట్రాక్టరును బ్లాక్ లిస్ట్ పెట్టి షోకాజ్ నోటీసు ఇచ్చాం. ఆ సంస్థ సరఫరా చేసిన ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం కోసం వినియోగించనే లేదు. – టీటీడీ ఈవో శ్యామలరావు2024 సెప్టెంబర్ 18 నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు : చంద్రబాబుటీటీడీ ఈవో అధికారిక ప్రకటనలకు విరుద్ధంగా లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారు. సెప్టెంబర్ 22నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపాం : టీటీడీ ఈవోఅయినా సరే చంద్రబాబు ఆరోపణలను టీటీడీ ఈవో శ్యామలరావు తిప్పికొట్టారు. నమూనాలను పరీక్షించాక అది కల్తీ నెయ్యి అని తేలడంతో ఆ డెయిరీ పంపిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ డెయిరీ నుంచి నెయ్యి సరఫరాను నిలిపి వేశామని తెలిపారు.సెప్టెంబరు 22 ఆ నెయ్యి వాడారు : చంద్రబాబుఅయినా సరే చంద్రబాబు తన దుష్ప్రచారాన్ని కొనసాగించారు. నాలుగు ట్యాంకర్లు అప్పటికే వచ్చేశాయి. అందులోని కల్తీ నెయ్యిని వాడారని మళ్లీ దుష్ప్రచారం చేయడం గమనార్హం. అంటే వాస్తవాలతో తనకు నిమిత్తం లేదని, రాజకీయ ప్రయోజనం కోసం తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీసేందుకు వెనుకాడనని నిరూపించారు. ఇంతటితో ఆగకుండా, టీడీపీ కూటమి ప్రభుత్వం తన డర్టీ పాలిటిక్స్‌కు మరింత పదును పెట్టింది. 2024 సెప్టెంబర్ 18న తిరుమల లడ్డూపై ఆరోపణలు చేస్తే.. ఆ మర్నాడే అంటే సెప్టెంబర్ 19న ఎన్డీడీబీ నివేదికను టీడీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. వాస్తవానికి ఎన్డీడీబీ నివేదికను గోప్యంగా ఉంచాలి. కానీ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ టీడీపీ కార్యాలయం ఆ నివేదికను విడుదల చేయడం గమనార్హం.సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కోరిన వైవీ సుబ్బారెడ్డితిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచారంపై వైవీ సుబ్బారెడ్డి సత్వరం స్పందించారు. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోరినందునే వైవీ సుబ్బారెడ్డిపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోంది.టీటీడీలో నెయ్యి కొనుగోలుకు పటిష్ట వ్యవస్థ⇒ రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా మారింది. కానీ నెయ్యి, ఇతర సరుకులు కొనుగోలు చేసేందుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తోంది. నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసేందుకు టీటీడీ పటిష్ట విధానం అనుసరిస్తోంది.⇒ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. టెండర్లు కోట్ చేసిన వాటిలో ఎల్1గా వచ్చిన డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నియమ నిబంధనలను ఎవరూ మార్చేందుకు ఏమాత్రం అవకాశమే లేదు.⇒ లడ్డూ తయారీకి నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్‌తో పాటు, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తించిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ను కూడా సమర్పించాలి.⇒ అలా ట్యాంకర్ నుంచి తిరుపతిలోనే మూడు శాంపిల్స్ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే ఆ నెయ్యిని టీటీడీ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తారు. శాంపిల్స్ పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే వెంటనే ఆ ట్యాంకర్లను తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కు పంపుతారు. తిరుమల కొండ కూడా ఎక్కనివ్వరు.⇒ తగిన నాణ్యతతో లేని నెయ్యిని చాలాసార్లు వెనక్కి పంపారు. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు, 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపారని టీటీడీ రికార్డులే వెల్లడిస్తున్న వాస్తవం.ప్రస్తుత నెయ్యి వివాదం టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనిదే ప్రస్తుతం కల్తీ అంటూ చేçస్తున్న రాద్ధాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న నెయ్యి శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నవో తెలుసా..? 2024 జూన్ 12న తీసిన శాంపిల్స్ అవి. 2024 జూన్ 4నే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ కూటమి గెలిచిందన్నది తేలి పోయింది. జూన్ 12నే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడు టెస్టుల నివేదికల్లో నెయ్యి తగిన నాణ్యతతో లేదని తేలడంతో ఆ శాంపిల్స్‌ను జూలై 17న ఎన్డీడీబీ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ బోర్డు 2024 జూలై 23న నివేదిక ఇచ్చింది. అంటే మొత్తం వ్యవహారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే సాగిందన్నది సుస్పష్టం.జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ చెప్పనే లేదు నెయ్యి కల్తీ జరిగిందని మాత్రమే ఎన్డీడీబీ నివేదిక వెల్లడించగలదు. కానీ, ఆ కల్తీ జంతువుల కొవ్వు కలపడంతో జరిగిందని నిరూపించే అవకాశమే లేదని ఆహార శాస్త్రవేత్త నేహా దీపక్ షా స్పష్టం చేశారు. సోయాబీన్, పొద్దు తిరుగుడు పువ్వు, రేపీడ్స్, గోధుమ జెర్మ్, మొక్కజొన్న జెర్మ్, పత్తి విత్తనాలు, కొబ్బరి, పామ్ ఆయిల్ ద్వారా కూడా కల్తీ చేసే అవకాశాలున్నాయి. సాధారణంగా నెయ్యిలో కల్తీ చేయాలంటే వ్యాపారులు పామాయిల్, హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వును కలుపుతూ ఉంటారని ఆహార శాస్త్రవేత్తలు చెప్పారు. ఎందుకంటే అవి అయితేనే తక్కువ వ్యయంతో కల్తీ చేయవచ్చన్నారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి కల్తీ చేశారన్నది ఎన్డీడీబీ నివేదికలో స్పష్టం చేయనే లేదు. కానీ చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు మాత్రం టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతవుల కొవ్వు కలిపారని రాద్ధాంతం చేయడం కేవలం రాజకీయ కుట్రేనన్నది సుస్పష్టం. -
లడ్డూ నెయ్యి కేసులో ప్రధాన నిందితులకు బెయిల్
న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇటీవల పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రోలర్ల గురించి జస్టిస్ శ్రీనివాసరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన ఈ తీర్పు ట్రోలర్లకు ఓ మంచి అంశమవుతుందంటూ చురకలంటించారు. సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ నమోదైన కేసులో ప్రధాన నిందితులైన వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావడా, బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని వారిని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. లడ్డూ కల్తీ నెయ్యి సరఫరా విషయంలో సీబీఐ సిట్ నమోదు చేసిన కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్లు నాలుగున్నర నెలలకు పైగా జైల్లో ఉన్నారని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే దర్యాప్తు మొత్తం పూర్తయిందని, కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి వారిని జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించారని పేర్కొన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యారని, అడిగిన డాక్యుమెంట్లన్నీ కూడా అందచేశారని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. పిటిషనర్లు సాక్షులను బెదిరించారన్న సీబీఐ ఆరోపణలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. సీబీఐవి కేవలం నిందారోపణలే తప్ప, అందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.నా ఈ తీర్పు ట్రోలర్లకు మంచి అవకాశం..ఈ తీర్పు వెలువరించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి సామాజిక మాధ్యమాల ట్రోలర్ల గురించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన ఈ తీర్పు ట్రోలర్లకు ఓ మంచి అంశమవుతుందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆయన పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సింగయ్య మృతి వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది కూడా జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ట్రోల్ చేసేందుకు కూటమి మద్దతు ట్రోలర్లకు అవకాశంగా మారింది. -
పవన్.. కల్తీ మీ బుర్రలో జరిగింది: భూమన
తిరుపతి, సాక్షి: సనాతన ధర్మంకు విఘాతం కలిగితే తాను ముందు ఉంటానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో ఓ ప్రైవేట్ హోటల్‌కు అనుమతులివ్వడంపై హిందూ సంఘాలు పోరాటం చేస్తున్నా.. పవన్ మౌనంగా ఉండడంపై భూమన మండిపడ్డారు. అలాగే కేరళలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. తిరుపతిలో గురువారం ఉదయం భూమన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కిందటి ఏడాది సెప్టెంబర్ 20 తేదీన తిరుమలడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే.. నిర్ధారణ కాకుండా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్ రిపోర్ట్‌లో ఎక్కడా ‘నిర్ధారణ’ అనే విషయం ప్రస్తావించలేదు. .. తిరుమల పవిత్రతకు భంగం కలిగింది ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు ముంతాజ్ హోటల్‌కు అనుమతులు ఇచ్చారు. సనాతన ధర్మంకు విఘాతం కలిగిన ముందు ఉంటాను అని చెప్పిన పవన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్.. అది వ్యక్తిగతం, రాజకీయాలతో సంబంధం లేదని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఆ పర్యటనల్లో రాజకీయ విమర్శలు ఎలా చేస్తారు?కేరళకు వెళ్లి.. తిరుమల లడ్డూ గురించి తప్పుగా మాట్లాడారు. ఇది మాపై వేస్తున్న నింద కాదు.. స్వయంగా వెంకటేశ్వర స్వామి మీద వేస్తున్న నింద. మా హయాంలో అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలు కల్తీ నెయ్యితో చేసినవని పవన్ అన్నారు. లడ్డూలో కాదు.. కల్తీ మీ బుర్రలో జరిగింది. సౌరవ్ బోరా అనే ప్రస్తుత పాలక మండలి సభ్యుడు రూ. 30 లక్షలు ఖర్చు చేసి లక్ష లడ్డూలు తయారు చేయించారు. ఇప్పుడు ఆయన్ని కూడా అరెస్టు చేయించండి. .. పవన్ ఒకప్పుడు సూడో హిందువును, నేను బాప్టిజం తీసుకున్నా అన్నారు.. తన భార్య క్రిస్టియన్ , పిల్లలు క్రిస్టియన్ అన్నారు. ఆపై కాషాయం కట్టి సనాతన ధర్మం అంటూ ఊగిపోయారు. సనాతన ముసుగులో రాజకీయం చేసి, ప్రత్యర్థులు పార్టీలను నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ ముసుగులోనే తిరుమల పవిత్రతను పవన్ దిగజార్చుతున్నారు అని భూమన మండిపడ్డారు. తిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మీరు రావాలని హిందూ సంఘాలు పిలుస్తున్నాయి. తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ అమరణ నిరాహార దీక్ష కు మద్దతు ఇవ్వండి అని పవన్‌కు భూమన సూచించారు. -
కల్తీ నెయ్యి ఆరోపణలపై నలుగురి అరెస్ట్
తిరుమల: తిరుమలకు(tirumala) కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లుగా సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం కొద్ది నెలలుగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరాగ్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థలకు చెందిన కీలక వ్యక్తులను మూడు రోజులుగా తిరుపతిలో విచారిస్తోంది.విచారణకు సహకరించక పోవడంతో ఆదివారం వారిని అదుపులోకి తీసుకుంది. సీబీఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీరాంబతో పాటు రాష్ట్రం నుంచి విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి సత్యకుమార్ పాండా ఆధ్వర్యంలో విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజులుగా వీరేశ్ ప్రభు తిరుపతిలో మకాం వేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఎక్కువ మొత్తంలో సరఫరా చేయడానికి ఉత్తరాదికి చెందిన డెయిరీల నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి కొనుగోలు చేసినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఏఆర్ డెయిరీకి సహకరించిన సంస్థల ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం విపిన్ జైన్ (భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, భగవాన్‌పూర్, రూర్కీ, ఉత్తరాఖండ్), పోమిల్ జైన్ (భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్), అపూర్వ చావ్డా (సీఈఓ) వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, పునబాక, తిరుపతి జిల్లా), రాజురాజశేఖరన్ (ఏఆర్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్, దిండిగల్, తమిళనాడు ఎండీ)లను అరెస్ట్ చేసింది. వీరిని సోమవారం కోర్టులో హాజరు పరచనుంది. -
దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు
సాక్షి,విజయవాడ: అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ. కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గ వాసికెక్కిన ఇంద్రకీలాద్రి కూటమి పాలనలో అప్రతిష్ట పాలవుతుంది. అమ్మవారిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో.. ఆ గుడిలో లడ్డూ ప్రసాదాన్ని సేవిస్తే అంతే పుణ్యం వస్తుందని నమ్మే భక్తుల నమ్మకం వమ్ము అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా,లడ్డూ ప్రసాదంలో తల వెంట్రుక ప్రత్యక్షమవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ దేవాలయాల్లో ప్రసాదాల్లో నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు కలకలం రేపాయి. ప్రసాదంలో నాణ్యత లోపించడంపై భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. లడ్డూ ఫొటోల్ని మంత్రులు నారాలోకేష్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘తప్పు జరిగింది. మరోసారి లాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని మంత్రి ఆనం రీట్వీట్ చేశారు’.ఇంతకీ ఏం జరిగిందంటే?ఇటీవల ఓ భక్తుడు తన కుటుంబ సభ్యులతో దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. అంనతరం ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. అయితే తాను కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో వెంట్రుక కంట పడింది. లడ్డూలో వెంట్రుక పొరపాటున పడిందేమో అని అనుకున్నారు. సాయంత్రం తన భార్య కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో మరో వెంట్రుక కనపడడంతో భక్తుడు హతాశుడయ్యాడు. వెంటనే వెంట్రుక ఉన్న లడ్డూ ప్రసాదాన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. లడ్డూ ప్రసాదంలో వెంట్రుక పడిన విషయాన్ని మంత్రులు నారా లోకేష్,ఆనంకు ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.@naralokesh @Anam_RNReddy Respected sir yesterday we visited sri kanaka durga temple vijayawada the laddu prasadam was unhygienic we found hair in one laddu in the morning(we didn't take any photos of that)again my wife found hair in another Laddu now so pls look in to this sir pic.twitter.com/c6KjqAXLyE— Saran Baba (@SaranBaba1) February 8, 2025 ఆ ట్వీట్‌పై ఆనం రామనారాయణ రెడ్డి ట్వీట్లో దుర్గుగుడిలో తయారు చేసే లడ్డూ నాణ్యతా ప్రమాణాల్ని పాటిస్తే. నేను స్వయంగా లడ్డూ తయారు చేసే ప్రదేశాన్ని సందర్శిస్తానని తెలిపారు. ప్రసాదం పవిత్రంగా ఉంటామని చర్యలు తీసుకుంటాన్నారు. అయితే, ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో పలు దేవాలయాల్లో నాణ్యత లోపించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెజవాడ దుర్గ గుడిలో దర్శనం,అన్నప్రసాదం, ఇప్పుడు లడ్డూ ప్రసాదం తయారీ.. ఇలా వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టీటీడీలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలలో వరుస ఘటనలను కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఏకంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందడం, పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం.. ఈ ఘటన గురించి మరచిపోక ముందే 13న లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం జరగడంపై కేంద్రం దృష్టి సారించింది.తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై టీటీడీ నుంచి నివేదిక కోరింది. వరుస పరిణామాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించి, వాస్తవాలు తెలుసుకోవాలని కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. సంజీవ్ కుమార్ జిందాల్ ఆదివారం తిరుమలకు వస్తారని టీటీడీ చైర్మన్‌కు లేఖ పంపింది. అయితే ఆయన పర్యటన వాయిదా పడినట్లు శనివారం రాత్రి తిరిగి సమాచారం అందించింది. టీటీడీ చరిత్రలో కేంద్రం జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి టీటీడీని రాజకీయంగా వాడుకోవడంపై దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయన్న విచక్షణ మరచి, సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి ఉన్న రికార్డుకు మచ్చ తీసుకొస్తూ కనీస ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఒక్కసారిగా క్యూలైన్ గేట్లు తెరిచారు. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్లో షార్ట్ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో కౌంటర్లు, క్యూలలో వేలాది భక్తులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగడం ఆందోళనకు గురి చేసింది. వీటన్నింటికీ తోడు లోకేశ్ మనిషి లక్ష్మణ్‌కుమార్ ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతుండటం పట్ల టీటీడీ యంత్రాంగం మండిపడుతోంది. -
పక్కదారి పడుతున్న శ్రీవారి లడ్డూలు
-
శ్రీవారి లడ్డూలు గుటకాయ స్వాహా!
భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. ఇంటిదొంగల నిర్వాకంతో బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. వారం వారం తిరుమల నుంచి వచ్చే ఈ లడ్డూ ప్రసాదాల్లో కొన్నింటినే సామాన్య భక్తులకు విక్రయించి సింహభాగం స్వాహా చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ శ్రీవారి లడ్డూల్లో కల్తీ జరిగిందంటూ తెగ గుండెలు బాదుకున్న ముఖ్యనేతలు, ఉన్నతాధికారులు ఇప్పుడీ చేతివాటం గురించి తెలీదనుకోవాలా? తెలిసీ తెలియనట్లు నటిస్తున్నారనుకోవాలా? నిఘా విభాగం కూడా ఏమీ పట్టనట్లు ఉంటోంది. లోగుట్టు శ్రీవారికే ఎరుక. తమిళనాడు రాజధాని చెన్నై టి.నగర్ సమాచార కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై ‘సాక్షి’ నిఘాలో పలు విషయాలు తెలిశాయి. ఇవిగో ఆ వివరాలు..తిరుమల: శ్రీవారి ప్రసాదాలను సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకెళ్లాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంకల్పించింది. ఇందులో భాగంగా.. తిరుమల శ్రీవారి లడ్డూ పోటు నుంచి నేరుగా చెన్నై, బెంగళూరు సమాచార కేంద్రాలు.. విజయవాడ, విశాఖపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపాలు.. హైదరాబాద్‌లోని టీటీడీ ఆలయాలకు వీటిని తరలించి భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. ఎంతో సత్సంకల్పంతో శ్రీకారం చుట్టిన ఈ విధానానికి కొందరు ఇంటిదొంగలు శ్రీవారి ప్రసాదాన్ని పక్కదారి పట్టిస్తూ తూట్లుపొడుస్తున్నారు. చెన్నై నడివీధుల్లో బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. చిన్నలడ్డూలు 2, ఒక పెద్ద లడ్డూ, ఒక వడ కలిపి ప్రత్యేక ప్యాకింగ్ చేసి రూ.1,500కు అమ్మేసుకుంటున్నారు.చెన్నైలో బ్లాక్మార్కెట్లోకి..తిరుమలలో ఉన్న పోటు ఏఈఓ ఏ సెంటర్‌కు ఎన్ని లడ్డూలు పంపించాలన్న ఇండెంట్, డిమాండ్ ఆధారంగా వాటిని పంపిస్తారు. చెన్నై, బెంగళూరు సమాచార కేంద్రాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నందున చెన్నై కేంద్రానికి ప్రతీవారం 8 వేల నుంచి 10 వేల చిన్న లడ్డూలు, 300 పెద్ద లడ్డూలు, 300 వడలు పంపిస్తున్నారు. కానీ, చెన్నై టి.నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రంలో లడ్డూ ప్రసాదాలు విక్రయాలు జరిగే దగ్గరే పెద్దఎత్తున లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. ఇక్కడ పదేళ్లుగా చెన్నైలో తిష్టవేసిన ఇద్దరు అసిస్టెంట్ షరాబులు ‘శ్రీనివాసుడి’ ప్రసాదాలను సామాన్య భక్తులకు అందకుండా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తిరుమల నుంచి టీటీడీ వాహనంలో వచ్చిన స్టాక్‌ను ఇక్కడి సిబ్బంది శ్రవణం హాల్లో దించి అటునుంచి అటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో లడ్డూలను ట్రేల నుంచి బాక్స్‌లకు మార్చి ఓ ప్రైవేట్ వాహనంలో తరలించేస్తున్నారు. వచ్చిన లడ్డూల్లో కొన్నింటిని మాత్రమే విక్రయించి.. ఆ తర్వాత చిన్న లడ్డూల స్టాక్ అయిపోయిందంటూ ‘నో స్టాక్’ బోర్డు పెట్టేస్తున్నారు. 300 పెద్ద లడ్డూలు, 300 వడలు ఏనాడూ సామాన్య భక్తులకు విక్రయించిన దాఖలాల్లేవు. నిఘా వైఫల్యం..తిరుమలలో ఒక లడ్డూ ప్రసాదం అధిక ధరకు విక్రయిస్తే తీవ్రంగా పరిగణించే విజిలెన్స్ అధికారులు.. ఇక్కడ వేలకు వేలు లడ్డూలు ప్రైవేట్ వాహనంలో పక్కదారి పడుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో కంచే చేను మేస్తోందా అనే సందేహాలూ తలెత్తుతున్నాయి. చెన్నై టి.నగర్ సమాచార కేంద్రం నుంచి ప్రైవేట్ వాహనాల్లో స్టాక్ తరలిపోతుంటే సెక్యూరిటీ విభాగం ఏం చేస్తోందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. లోపలికి వచ్చే ప్రతి వాహనాన్ని భద్రతా సిబ్బంది రికార్డుల్లో ఎంట్రీ చేయాలి. కానీ, అలాంటిదేమీ జరుగుతున్న దాఖలాలు కనిపించట్లేదు. వాళ్లకు ఎలాంటి సంబంధం లేదంట?ఇదిలా ఉంటే.. చెన్నైలో జరుగుతున్న ఈ అవకతవకలపై తమకెలాంటి సంబంధంలేదని సంబంధిత అధికారులు అంటున్నారు. కేవలం స్టాక్ పంపించడం వరకే తమ బాధ్యత అని చేతులెత్తేస్తున్నారు. తిరుమల నుంచి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణలో టీటీడీ వాహనంలోనే ప్రసాదాలను పంపిస్తామని స్పష్టంచేస్తున్నారు. శ్రీవారి లడ్డూ విక్రయాలకు లెక్కా పత్రం లేదు..ఇక చెన్నైలో లడ్డూ ప్రసాదాల విక్రయాలకు లెక్కాపత్రం లేదు. సీసీ కెమెరాల నిఘా అంతకన్నాలేదు. అక్రమార్కుల ఆగడాలు చెల్లుబాటయ్యేలా సమాచార కేంద్రంలో ఉన్న శ్రవణం హాల్‌ను కేంద్రంగా చేసుకుని ఇష్టారాజ్యంగా బయటకు తరలించేస్తున్నట్లు ‘సాక్షి’ నిఘాలో బట్టబయలైంది. నిజానికి.. లడ్డూ ప్రసాదం విక్రయం సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగాలి. తిరుమలలో ఇస్తున్నట్లుగా ఆధార్ కార్డు ప్రామాణికంగా భక్తులకు రెండు లడ్డూలే ఇవ్వాలి. కానీ, ఇక్కడ అలాంటివేమీ జరుగుతున్నట్లు లేదు. సామాన్య భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందకుండా ఏఈవో, అసిస్టెంట్ షరాబులు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లుగా ఇక్కడ తిష్టవేసిన సిబ్బందిపై లోతుగా విచారణ జరపాల్సి ఉంది. లడ్డూ ప్రసాదాలు విక్రయించే కౌంటర్ నుంచి కాకుండా.. శ్రవణం హాల్ నుంచి విక్రయాలు చేస్తుండడంపై కూడా దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు. -
అహోబిలేషుడి లడ్డూకు కమీషన్ పోటు
ఆళ్లగడ్డ: టీడీపీ నేత కమీషన్ బాగోతం వల్ల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానంలో లక్ష్మీనరసింహ స్వామి లడ్డూ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ఎగువ, దిగువ క్షేత్రాల్లో లడ్డూ కౌంటర్లు వారం రోజులుగా మూత పడటంతో భక్తులు ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ కీలక నాయకుడే కారణమని తెలుస్తోంది. ప్రసాదాల తయారీకి సరుకులు సరఫరా చేసే వ్యాపారిని కమీషన్ కోసం ఆ నాయకుడు ఒత్తిడి చేశాడు. ఇందులో తనకు పెద్దగా ఏమీ మిగలదని, కమిషన్ ఇవ్వబోనని ఆ వ్యాపారి చెప్పడంతో సరుకుల సరఫరాను ఆపేయించారు. దీంతో టీడీపీ నాయకుడు, కొందరు దేవస్థాన నిర్వాహకులకు కలిపి 20 శాతం కమీషన్ ఇచ్చేటట్లు బాపట్లకు చెందిన కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని సరుకుల సరఫరా బాధ్యతను అప్పగించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా సరుకులు రాక పోవడంతో ప్రసాదాల తయారీ నిలిచిపోయింది. దీంతో విక్రయాలు లేక భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ప్రసాదంలోనూ కమీషన్ల కక్కుర్తి ఏమిటని వాపోతున్నారు. -
చంద్రబాబు ఆరోపణల వెనుక కుట్ర కోణం
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే ప్రకటించడం వెనుక కుట్ర కోణం ఉందని ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఆరోపించడం ప్రపంచాన్ని కలవర పెట్టిందని అన్నారు. ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే ఇలాంటి అంశాలను బహిరంగంగా ప్రకటించే ముందు దర్యాప్తు చేయాలన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్రైస్తవ ముద్ర వేసేందుకు చేసిన సందర్భాలను సైతం ఆయన ఇక్కడ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థల బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపారు. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్‌తో వాస్తవాలు తేలవని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. నెయ్యి శాంపిల్స్ పరీక్షలు చేసి, టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో వెనక్కు పంపించామని టీటీడీ ఈవో రిపోర్టులో స్పష్టంగా ఉన్నప్పటికీ, కల్తీ జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు పదే పదే బహిరంగంగా ప్రకటించడం దేనికి నిదర్శనం? ఇలా ఆరోపణలు చేశాక దర్యాప్తుకు ఆదేశిస్తారా? నిజానిజాలు నిర్ధారించుకోకుండా భక్తుల్లో అలజడి సృష్టించడానికి యతి్నంచడం కుట్ర కోణంగా భావించక తప్పదు. – ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్యస్వామి జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇదే వైఖరి⇒ తిరుమల బాలాజీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా ముఖ్యమంత్రే గత నెల 18న బహిరంగంగా ఆరోపించారు. ఆ తర్వాత ప్రసాదం కల్తీపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను నియమిస్తున్నట్టు సెపె్టంబర్ 26న ప్రకటించారు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణ చేసేటప్పుడు సీఎం స్థాయిలో ఉన్న వారు వాస్తవమా.. కాదా అని తొలుత దర్యాప్తు చేసి నిర్ధారించుకోవాలి. ⇒ కానీ ఇక్కడ అలా జరగలేదు. ముందు ఆరోపణ చేసి తర్వాత సిట్ దర్యాప్తు అన్నారు. పైగా కల్తీపై దర్యాప్తు కోసం అదే ప్రభుత్వం సిట్‌ను నియమించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనుకోవడం లేదు. జూలైలో కల్తీ జరిగిందని చెప్పి.. ఇంత కాలం తర్వాత ఇప్పుడు ఎందుకు సిట్‌ని నియమించారు? పైగా గత ప్రభుత్వంపై, నాటి సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రులపై చాలా పెద్ద ఆరోపణలు చేశారు. ⇒ జగన్ సీఎం అయినప్పటి నుంచి తిరుపతిలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఓ ప్రణాళిక ప్రకారం ఆరోపణలు చేస్తూ వచ్చారు. తద్వారా నాటి సీఎం వైఎస్ జగన్‌పై మత ముద్ర వేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. 2019లో సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. ఒక క్రైస్తవుడిని టీటీడీ చైర్మన్‌గా ఎలా నియమిస్తారని హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ వాస్తవమేంటంటే సుబ్బారెడ్డి గురించి తెలిసిన వారిని ఎవరిని అడిగినా ఆయన హిందువనే చెబుతారు. ఆయన 32 సార్లు మాల వేసుకుని శబరిమలకు వెళ్లివచ్చారు. ఇంట్లో గోశాల నిర్వహిస్తూ గోవులకు పూజ చేస్తున్నారు. ఇప్పుడు లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిపోయిందని చంద్రబాబు నాయుడు పత్రికల్లో పతాక స్థాయిలో స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టును సైతం కలవరపెట్టే అంశాలు చాలా ఉన్నాయి. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ప్రస్తుతం ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రత్యేక సిట్‌ను నియమించింది. తప్పుడు వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి⇒ జూలైలో నెయ్యి శాంపిల్ తీసుకుని టెస్ట్ చేశారని టీటీడీ రిపోర్టులో ఉంది. ఆ రిపోర్టులో కల్తీ జరిగిందని గానీ, ఫిష్ ఆయిల్, కొవ్వు కలిసిందని గానీ ఎక్కడా లేదు. నెయ్యి నాణ్యత టీటీడీ ప్రమాణాలకు తగ్గట్టుగా లేనందున తిప్పి పంపించామని ఉందే తప్ప ప్రసాదం తయారీకి పంపించామని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఒక అబద్ధాన్ని సృష్టించి.. విస్తృతంగా ప్రచారం చేశారన్నది వాస్తవం. ఇలాంటప్పుడు కల్తీ జరిగిందని ఎలా చెబుతారు? ప్రసాదంపై చేసిన ఆరోపణ కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసేది. ఆరోపణలు చేయడం సులువే, కానీ వాటిని నిరూపించాలిగా!⇒ వార్తాపత్రికలు కూడా జవాబుదారీగా ఉండాలి. రాజకీయ నాయకులు లడ్డూ ప్రసాదం, ఆలయ అంశాలను సమస్యగా మార్చి తమ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగానే చెప్పింది. ఈ హెచ్చరికను ప్రజలు ప్రశంసించారు. ఒకరి గుర్తింపును, ఎదుగుదలను రాజకీయంగా నాశనం చేసేందుకు తప్పుడు వార్తలను ప్రచారం చేసే ఏజెన్సీలు సైతం ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. -
బాబు గారి ‘కొవ్వు’ బాగోతం బట్టబయలు
సాక్షి, అమరావతి: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిపే ఆవు నెయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహించిన టెండర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనన్న విషయం మరోసారి బహిర్గతమైంది. అయిన వారికి కట్టబెట్టడం కోసం అడ్డగోలుగా నిబంధనలు మార్చేశారంటూ ఆయన చేసిన ఆరోపణల్లో వీసమెత్తు నిజం లేదన్నది మరోసారి వెల్లడైంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు నిర్వహించిన టెండర్లలో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పుడు అదే టెండర్ నిబంధనలతో తాజాగా పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు ఈనెల 7న (సోమవారం) టీటీడీ మార్కెటింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం సీఎం చంద్రబాబు బండారాన్ని బయటపెట్టింది. చంద్రబాబు ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో చేసినవేనన్న విషయాన్ని స్పష్టం చేసింది. స్వచ్ఛత కోసం ప్రమాణాలు పెంపు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ, అన్న ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి, ముడిసరుకుల సేకరణకు టీటీడీ మార్కెటింగ్ విభాగం ఎప్పటికప్పుడు టెండర్లు నిర్వహిస్తుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు ఆర్నెల్లకు ఓ సారి టెండర్లు పిలుస్తుంది. నెయ్యిలో తేమ శాతం 0.3 శాతానికి మించకూడదని, బూటిరో రిఫ్రాక్టో (బీఆర్) మీటర్ రీడింగ్ 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 40–43 మధ్య ఉండాలని, ఆర్ఎం వాల్యూ కనిష్టంగా 26 ఉండాలని, బౌడౌన్, మినరల్ ఆయిల్, ఫారిన్ కలర్స్ టెస్టుల్లో నెగెటివ్ రావాలని, మెల్టింగ్ పాయింట్ 27–37 డిగ్రీల మధ్య ఉండాలనే ఎనిమిది ప్రమాణాలతో 2019 మే 29 వరకూ టెండర్లు పిలిచేవారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు మరో తొమ్మిది ప్రమాణాలను అదనంగా చేర్చింది. మొత్తం 17 ప్రమాణాలతో రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించి, శ్రీవారి ఖజానాకు భారీగా ఆదా చేశారని టీటీడీ అధికారవర్గాలే చెబుతున్నాయి. నిబంధనలు మరింత కఠినతరం భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈమేరకు 2023 నవంబర్ 14న టీటీడీ బోర్డు సమావేశంలో తీరా>్మనాన్ని ఆమోదించి అమలు చేశారు. ఆవు నెయ్యి సేకరణ టెండర్లలో పాల్గొనాలంటే కనీసం ఐదేళ్లు వరుసగా డెయిరీలో నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండాలని, జాతీయ డెయిరీలైతే రోజుకు 4 లక్షల లీటర్లు, 1500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీలైతే రోజుకు 2 లక్షల లీటర్లు, రాష్ట్రంలోని డెయిరీలైతే రోజుకు లక్ష లీటర్ల పాలను సేకరిస్తుండాలని నిబంధనలు పెట్టారు. జాతీయ డెయిరీలైతే నెలకు 360 టన్నులు లేదా ఏడాదికి 5 వేల టన్నుల ఆవు నెయ్యి ఉత్పత్తి చేసి ఉండాలని, రూ.500 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలని షరతు విధించారు. 1,500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీలైతే నెలకు 180 టన్నులు లేదా ఏడాదికి 2,750 టన్నుల ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండి, రూ.250 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలని నిబంధన పెట్టారు. రాష్ట్రంలోని డెయిరీలకైతే నెలకు 90 టన్నులు లేదా ఏడాదికి 1,500 టన్నుల ఆవు నెయియని ఉత్పత్తి చేసి ఉండి.. రూ.వంద కోట్ల టర్నోవర్ ఉండాలని షరతు విధించారు. వాటిని నిక్కచ్చిగా అమలుచేయడంతో కాంట్రాక్టు పొందిన డెయిరీలు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని టీటీడీకి సరఫరా చేశాయి. ఇదే నిబంధనలతో ఎన్నికల సంఘం పర్యవేక్షణలో 2024 మార్చి 12న టీటీడీ పిలిచిన టెండర్లలో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. ఇప్పుడూ అవే నిబంధనలతో టీటీడీ టెండర్లు పిలవడం గమనార్హం. -
తీరు మారని టీడీపీ: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ లడ్డూ ప్రసాదం విషయంపై టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆక్షేపించారు. సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించాక తాను మీడియాతో మాట్లాడిన మాటల వీడియోను ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీల నేతలకు ట్యాగ్ చేస్తూ శనివారం ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. ఆ వీడియోలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినా, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడుతారు? ఒకవైపు విచారణ జరుగుతుండగా.. ఆ వ్యాఖ్యలతో సిట్ ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కావచ్చని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్టులోనే రాశారు కదా? ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు.. దేశంలో ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి కదా? ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది. ఆ నెయ్యి వాడనే లేదని ఈవో చెప్పారు. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి ఎందుకు సెప్టెంబరులో మాట్లాడినట్లు? జూలైలోనే ఎందుకు మాట్లాడలేదు? మీడియాతో మాట్లాడటానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా? సిట్ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు? మీడియాతో ఎలా మాట్లాడుతారు?’.. అని సుప్రీంకోర్టు గత 30వ తేదీన వ్యాఖ్యానించింది అని చెప్పారు. Even after the critical remarks of the Hon’ble Supreme Court against @ncbn , TDP continues to politicize the Laddu Prasadam issue. @BJP4India @INCIndia @arivalayam @BRSparty @samajwadiparty @AamAadmiParty @AIADMKOfficial @narendramodi @AmitShah @ShivSenaUBT_ @AITCofficial… pic.twitter.com/vefByATGT6— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2024ఈవో, సీఎం పరస్పర విరుద్ధ ప్రకటనలు‘ఎఫ్ఐఆర్ సెప్టెంబరు 25న రిజిస్టర్ చేస్తే.. అంతకు ముందే సెప్టెంబరు 18న ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. సిట్ ఏర్పాటైంది సెప్టెంబరు 26న అయితే.. అంతకన్నా ముందే ఎలా ప్రకటన ఇచ్చాడంటూ.. సీఎం బహిరంగ ప్రకటన కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుందని కోర్టు చెప్పింది. ఇన్ని రకాలుగా చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అయితే మళ్లీ ఇవాళ కూడా.. కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన తప్పును సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. బాబు తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న సిట్‌ను రద్దు చేస్తూ.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ అధికారులు, వారికి సహకారం అందించడానికి ఇద్దరు రాష్ట్ర అధికారులు.. వీరికి తోడు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ఒకరు నియమితులవుతారని.. వీరందరూ లడ్డూకి సంబంధించిన విషయంపై నివేదిక ఇస్తారని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించినా.. చంద్రబాబులో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆయనకు వ్యక్తిత్వం ఉంటే ముందు ప్రజలను క్షమాపణ కోరాలి. తర్వాత తిరుమలలో తప్పు చేశానని స్వామి వారిని వేడుకోవాలి. అవేవీ చేయడం లేదు. టీడీపీ దుష్ప్రచారం ఆపలేదు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అబద్ధాలకు రెక్కలుకట్టి గోబెల్స్ ప్రచారం చేస్తావా?
సనాతనా ధర్మం అంటే ఏమిటో అసలు ఆ మనిíÙకి తెలుసా? సాక్షాత్తు నువ్వు కూడా కూటమిలో ఉన్నావు. చంద్రబాబు నీ కళ్ల ఎదుటే తప్పు చేశాడు. దేవుడి విషయంలో చంద్రబాబు చేసిన తప్పు నీకే కాదు ఆరేళ్ల పిల్లాడికి కూడా కన్పిస్తోంది. నీ కళ్ల ఎదుటే వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను తగ్గిస్తూ.. విశిష్టతను దెబ్బతీస్తూ కావాలనే దుర్బిద్ధితో చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. రాజకీయ లబ్ధి పొందేందుకు కోట్ల మంది శ్రీవారి భక్తుల్లో ఒక అనుమానాన్ని రేకెత్తించాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అపవిత్రతను ఆపాదించే ప్రయత్నం చేస్తూ.. లడ్డూ విశిష్టతను తగ్గించే ప్రయత్నం చేశారు. అందులో నీవు కూడా భాగమే. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి : ‘వంద రోజుల పాలన వైఫల్యం.. సూపర్ సిక్స్‌తో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తుండటంతో వారి దృష్టి మళ్లించాలనే రాజకీయ దురుద్దేశంతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామితో ఆడుకుంటావా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి గోబెల్స్ ప్రచారం చేసి.. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టతను అపవిత్రం చేస్తావా? అంటూ మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ ఆరోపిస్తున్న సీఎం చంద్రబాబు చేసిన తప్పులు, చెప్పిన అబద్ధాలను ‘మీడియా’ ఎదుట సాక్ష్యాధారాలతో సహా మరోసారి వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. టీటీడీలో గొప్ప వ్యవస్థ జూలై 6, జూలై 12న వచ్చిన ట్యాంకర్లలో నెయ్యి నాణ్యత పరీక్షించిన తర్వాత వాటిని లోపలికి అనుమతించ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో స్వామి వారి ప్రసాదాలు, అడ్డూ, అన్న ప్రసాదాల తయారీకి అవసరమైన ముడి సరుకులు, నెయ్యి కొనుగోలు చేయడానికి అత్యంత గొప్ప, పటిష్టమైన వ్యవస్థ ఉంది. 2014–19 మధ్య నాణ్యత లేదని 14 నెయ్యి ట్యాంకర్లు వెనక్కు పంపగా.. మా హయాంలో 2019–24 మధ్య 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. నెయ్యి, ముడిసరుకుల సేకరణకు ఈ–టెండర్ల ద్వారా బిడ్లు నిర్వహిస్తారు. ఎల్–1కు 65 శాతం, ఆ తర్వాత బిడ్‌లో ఉన్న వారికి అదే ధరకు 35 శాతం ఇస్తారు. ఆ నెయ్యి వాడలేదని టీటీడీ ఈవోనే చెప్పారు తిరుమలకు టెండర్ ప్రకారం సరఫరా చేసే నెయ్యి ట్యాంకర్లు.. తమతో ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సరి్టఫికెట్ తీసుకురావాలి. ఆ సర్టిఫికెట్తో వచ్చినా, తిరుపతిలో ప్రతి ట్యాంకర్ శాంపిల్ మూడు సార్లు టెస్ట్ చేస్తారు. అలా జూలై 6, 12 తేదీల్లో వచ్చిన ట్యాంకర్లు తిరుపతిలో చేసిన నాణ్యత పరీక్షలో ఫెయిల్ అయితే, వాటిని వెనక్కు పంపారు. అవే శాంపిల్స్‌ను ఎన్డీడీబీకి పంపిస్తే, జూలై 23న రిపోర్ట్ వచ్చింది. దాంతో ఆ ట్యాంకర్లు వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీ వారికి నోటీసులు కూడా ఇచ్చారు. నాణ్యత లేని నెయ్యి వాడలేదని ఈవో స్పష్టంగా చెప్పినా (ఆ వీడియోను చూపారు).. తన 100 రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. సెపె్టంబరు 18న ఎన్డీఏ సమావేశంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ దారుణ ఆరోపణలు చేశారు. (అందుకు సంబంధించిన వీడియో చూపుతూ) ఆ వెంటనే రెండు రోజులకు, అంటే సెప్టెంబరు 20న టీటీడీ ఈవో ఇదే విషయంపై మాట్లాడుతూ.. కల్తీ నెయ్యి ట్యాంకర్లు నాలుగింటిని వెనక్కి పంపేశామని.. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనేలేదని స్పష్టం చేశారు. (ఆ వీడియోను ప్రదర్శించారు) అయినా కూడా మళ్లీ సెపె్టంబర్ 22న మాట్లాడిన చంద్రబాబు.. ఏ మాత్రం భయం, భక్తి లేకుండా తనకు రాజకీయ ఉద్దేశాలే ముఖ్యమని, స్వామి వారు అన్నా, తిరుపతి అన్నా భయం, భక్తి లేదని నిరూపిస్తూ.. తాను అంతకు ముందు చెప్పిన పచ్చి అబద్ధాలను మరోసారి వల్లె వేశారు. తిరుమలకు వచ్చిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడినట్లు (ఆ వీడియోను చూపుతూ) చెప్పారు. తప్పును గుడ్డిగా సమర్థి0చడం సనాతన ధర్మమా? ‘చంద్రబాబుతో పాటు నువ్వు కూడా ఆ అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నప్పుడు ఇంకా సనాతన ధర్మం గురించి నువ్వు ఏం మాట్లాడతావు? ఆ తప్పును గుడ్డిగా వెనకేసుకొస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడతావా? ఇది ఎంత వరకు ధర్మం’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. తప్పు చేయలేదు కాబట్టే సాక్ష్యాధారాలతో సహా నిజాలు చెప్పగలుగుతున్నామని స్పష్టం చేశారు. ‘చంద్రబాబు మాటలకు ఆయన నియమించుకున్న టీటీడీ ఈవో చెబుతున్న మాటలకు తేడా ఏమిటో స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా అమలువుతున్న గొప్ప సంప్రదాయాలను గుర్తు చేస్తున్నాం. పటిష్టమైన వ్యవస్థను మనమే దెబ్బతీసేలా.. మనంతట మనమే మన గుడిని.. మన స్వామి వారిని.. శ్రీవారి లడ్డూ విశిష్టతను తగ్గించుకునేలా మాట్లాడి.. మనమే సనాతన ధర్మం గురించి గొప్పలు చెప్పుకోవడం ఎంత వరకు సబబు?’ అంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
‘బాబు సిట్’ షట్టర్ క్లోజ్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన ‘సిట్’ స్కిట్ బెడిసికొట్టింది. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) షట్టర్ క్లోజ్ అయ్యింది. లడ్డూ ప్రసాదం అంశంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించడంతో సిట్ కథ మఖలో పుట్టి పుబ్బలో ముగిసినట్లైంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీవారి ఆలయ పవిత్రత, లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించేందుకు సైతం చంద్రబాబు వెనుకాడరన్న వాస్తవం జాతీయస్థాయిలో బట్టబయలైంది. కుట్ర పూరితంగానే సిట్లడ్డూ ప్రసాదంపై తన దుష్ప్రచారానికి రాజముద్ర వేసేందుకు చంద్రబాబు పక్కా పన్నాగంతోనే సిట్‌ను ఏర్పాటు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీతోపాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేసిన డిమాండ్‌ను అందుకే బేఖాతర్ చేశారు. టీడీపీ వీర విధేయులతో సిట్‌ను నియమించారు. అత్యంత వివాదాస్పద అధికారి, ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు కొమ్ము కాశారని ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించడం ప్రభుత్వ పెద్దల కుట్రను బయటపెట్టింది. ఈ బృందంలో విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజులను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అల్లుడు కావడం గమనార్హం. రిటైరైన తరువాత కొన్నేళ్లు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కృష్ణయ్యను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమించారు. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పదవి కట్టబెట్టడం గమనార్హం. సిట్ ఏర్పాటు చేసిన తరువాత టీటీడీ ద్వారా తిరుపతిలోని ఈస్ట్ పోలీసు స్టేషన్లో నెయ్యిలో కల్తీపై ఫిర్యాదు చేయించడం గమనార్హం. ఆ ఫిర్యాదు చేసే ముందు రోజు రాత్రే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐని బదిలీ చేసి ఆ స్థానంలో టీడీపీ అనుకూల పోలీసు అధికారిని నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. అనంతరం సిట్ బృందం తిరుమల–తిరుపతిలలో రెండు రోజుల పాటు దర్యాప్తు పేరిట హడావుడి చేసింది. సుప్రీం కొరడా... సిట్ క్లోజ్లడ్డూ అంశంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును గత నెల 30న తొలిసారి విచారించిన సమయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం హోదాలో ఉంటూ లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని సీఎం చంద్రబాబును ఆక్షేపించింది. కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. లడ్డూ ప్రసాదం అంశంపై సిట్ దర్యాప్తు సరిపోతుందా..? లేదంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్నది ఆలోచిస్తామని ఆ రోజే తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం తిరుపతిలో దర్యాప్తు నిర్వహిస్తున్న సిట్ కార్యకలాపాలను తక్షణం నిలిపివేసింది. తాజాగా శుక్రవారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి నిర్ణయాన్ని ప్రకటించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర బృందం దర్యాప్తు నిర్వíßæంచాలని ఆదేశించింది. దాంతో కుట్రపూరితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ కథ సమాప్తమైంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. దేవ దేవుడి విశిష్టత కాపాడాలి తిరుమల లడ్డూ ప్రసాదం కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు వెలువరించింది. కోట్లాది మంది ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ వారికి టీటీడీపై నమ్మకం కలిగించేలా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. లడ్డూ తయారీలో కల్తీ అయిన నెయ్యి వాడినట్టు తమకు ప్రాథమిక ఆధారాలు కనిపించట్లేదని అభిప్రాయపడింది. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా చేస్తున్న ఆరోపణలను తప్పుపట్టింది. ఆ రిపోర్టులో ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. సీఎం దగ్గర ఏదైనా మెటీరియల్ ఉందా? తొందరపడి ముందుగా మాట్లాడటం ఏమిటి? దేవుడిని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తారని నిలదీసింది. అదే సుప్రీంకోర్టు నిజాలను నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించడం శుభపరిణామం. ఈ క్రమంలోనే కోర్టును రాజకీయ రణరంగంగా వాడుకోవద్దని కూడా కోరింది. – ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతోంది. సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఊరికో మద్యం షాపును తెస్తోంది. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపింది. ఇందులో భాగమే శ్రీవారి లడ్డూ వివాదం. సనాతన ధర్మాన్ని ఇప్పుడు తానే కనిపెట్టినట్లు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. గతంలో కులాల మధ్య చిచ్చు పెట్టింది వీళ్లే. ఇప్పుడు మతాల మధ్య చిచ్పు పెడుతున్నారు. వీరందరికీ సుప్రీంకోర్టు తీర్పు గుణపాఠం కావాలి. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే దేవుడితో రాజకీయాలు సరికాదు దేశ సర్వోన్నత న్యాయ స్థానం శ్రీవారి ప్రతిష్టతను కాపాడే గొప్ప బాధ్యతను తీసుకుంది. దేవుడితో రాజకీయాలు చేయడం మంచిది కాదు. సర్వమతాలను సమానంగా గౌరవించాలి. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఒక్కోసారి ఒక్కో విధంగా ఆరోపణలు వినిపించాయి. సుప్రీంకోర్టు టీటీడీపై ప్రజలకున్న విశ్వాసాన్ని కాపాడేందుకు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. దీనిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. – వేముల హజరత్తయ్య గుప్త, న్యాయవాది కోర్టు తీర్పు గుణపాఠం కావాలిపవిత్రమైన తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీం తీర్పు అవకాశవాదులకు గుణపాఠం కావాలి. తిరుమల లడ్డూ కల్తీ అయిందని సరైన ఆధారాలతో నిర్ధారించకుండానే భక్తుల మనోభావాలను ప్రభావితం చేసేలా రాజకీయ పార్టీ నేతలు మాట్లాడటం తగదు. దీనిని దేశంలోని అన్ని హైందవ మఠాలు, పీఠాధిపతులు ముక్తకంఠంతో ఖండించాలి. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయం. టీటీడీ పాలక మండలిలో రాజకీయేతర వ్యక్తులను నియమించాలి. – బ్రహ్మశ్రీ అనిపెద్ది వెంకట నరసింహ శర్మ మూర్తి, కాణ్వ విద్యా పీఠాధిపతి -
‘బాబు సిట్’ను పక్కన పెట్టిన ‘సుప్రీం..’ ఇక 'సీబీఐ సిట్'
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారి ఉంటారు. ఈ సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోం. రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోము.– సుప్రీంకోర్టు సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తద్వారా దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తామే ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సిట్‌లో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారికి స్థానం కల్పించింది. ఈ సిట్ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోమంది. రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ కల్పతి వెంకటరామన్ విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో నెయ్యి కల్తీపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను పరిÙ్కరిస్తున్నట్లు ప్రకటించింది. స్వతంత్ర దర్యాప్తు కోసం వైవీ తదితరుల పిటిషన్లు... తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన సంపత్, శ్రీధర్, సురేష్ చవంకే వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. నెయ్యిలో జంతు కొవ్వులు కలిపారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన రాజకీయ ప్రకటనలపై అసహనం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా?లేక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చెప్పాలని సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతాను ఆదేశించిన విషయం తెలిసిందే. పత్రికా కథనాలను పట్టించుకోకండి.... తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ.. ఇది దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారమని పేర్కొనగా.. ధర్మాసనం స్పందిస్తూ, దేశం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలకు సంబంధించిందని తెలిపింది. ఈ వ్యవహారంలో ఆహార భద్రత కూడా ముడిపడి ఉందని ధర్మాసనం పేర్కొంది. తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు వ్యతిరేకం కాదని, అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు జరగడం సబబుగా ఉంటుందని మెహతా చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయిస్తే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్లు తాము పత్రికల్లో చదివామని గుర్తు చేసింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ పత్రికలు చాలా రాస్తున్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. టీటీడీ ఈవో చెప్పిన వాస్తవాలను వక్రీకరించాయని లూథ్రా తెలిపారు. దర్యాప్తు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని కోర్టు పర్యవేక్షించినా కూడా ఇబ్బంది లేదని నివేదించారు. సీఎం వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశమే లేదు... ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండేందుకు అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా సిట్ దర్యాప్తు ఉండబోదని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు ఓ విలువ ఉంటుందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఖచ్చితంగా సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ సమయంలో ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకుంటూ 100 రోజుల పాలనపై ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పారు. ఆయన మాట్లాడిన సందర్భం వేరన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) జూలైలో నివేదిక ఇచ్చిందన్నారు. దాని ఆధారంగా ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. జూలైలో నివేదిక వస్తే ముఖ్యమంత్రి సెపె్టంబర్లో ఎందుకు మాట్లాడారని ప్రశ్నించింది. ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. దీనిపై సిబల్ జోక్యం చేసుకుంటూ.. ఎన్డీడీబీ తన నివేదికలో ఎక్కడా జంతు కొవ్వు కలిసినట్లు చెప్పలేదని, వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉన్నట్లు చెప్పిందని నివేదించారు. అయితే ఇందుకు విరుద్ధంగా జంతు కొవ్వు అంటూ ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. కల్తీ నెయ్యిని కొండపైకి ఎందుకు అనుమతించారు..? అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన ట్యాంకులను వెనక్కి పంపామని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు ఉపయోగించలేదని టీటీడీ ఈవో పలుమార్లు చెప్పారని గుర్తు చేసింది. మరి అలాంటప్పుడు కల్తీ జరిగిందని దేని ఆధారంగా చెబుతున్నారని ప్రశ్నించింది. ఆ రెండు తేదీల్లో వచ్చిన ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉందని లూథ్రా పేర్కొనగా.. అలాంటప్పుడు కల్తీ నెయ్యిని కొండపైకి ఎందుకు అనుమతించారని సిబల్ ప్రశ్నించారు. అప్పుడు అధికారంలో ఉన్నది తాము కాదని, మీరేనని ఆయన లూథ్రాకు గుర్తు చేశారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ స్వతంత్ర దర్యాప్తు అవసరమని, తద్వారా కోట్ల మంది భక్తుల్లో విశ్వాసం కలిగించినట్లు అవుతుందని తెలిపింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను పక్కనబెట్టి తామే ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేస్తూ ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. రాజకీయ పోరాటాలకు వేదికగా చేసుకునేందుకు అనుమతించం... ‘మేం ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి వెళ్లడం లేదు. ఇక్కడ మేం ఓ విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాం. కోర్టును రాజకీయ పోరాటాలకు వేదికగా వాడుకునేందుకు అనుమతించం. కోట్ల మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటూ.. వారికి ఉపశమనం కలిగించేందుకు వీలుగా సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన స్వతంత్ర సిట్‌ను దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రత్యేక సిట్ దర్యాప్తు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ స్థానంలో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీబీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్పర్సన్ సిఫారసు చేసిన ఓ అధికారి ప్రత్యేక సిట్‌లో ఉంటారు’ ధర్మాసనం ఉత్తర్వుల సారాంశం ఇదీ..‘జూలై 6, 12వ తేదీల్లో రెండు ట్యాంకర్లలో సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లోని ఆరోపణల ప్రకారం కల్తీ అయిన నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వినియోగించినట్లు చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనసులను గాయపరిచినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నెయ్యి కల్తీపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా? లేక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా? అనే విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదించి ఏ విషయం మాకు చెప్పాలని గత విచారణ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లోని సభ్యులు సీనియర్ అధికారులని, వారికి మంచి పేరు ఉందని మెహతా ఈ రోజు మాకు చెప్పారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా దర్యాప్తును కొనసాగించాలని, అయితే ఆ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన మాకు నివేదించారు’ -
సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు
అవనిగడ్డ: తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత మాధవీలతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఏడో వార్డుకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్ అవనిగడ్డ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమది హిందూ కుటుంబమని, తరచూ తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తామని చెప్పారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు లడ్డూలో పందికొవ్వు కలిసిందని ఆరోపించడం తగదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగించారని, హోంమంత్రి వంగలపూడి అనిత, తెలంగాణ బీజేపీ నేత మాధవీలత లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని మీడియో ముందు మాట్లాడారని, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లడ్డూలో కల్తీ జరిగిందని దేవాలయాల్లో పూజలు చేయించారని చెప్పారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంతో పాటు చట్టవ్యతిరేక విధానాలు అవలంబించిన వీరందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు గౌతమ్ చెప్పారు. -
అది ముమ్మాటికీ చెంప దెబ్బే!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత దేశ ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరు పతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ధర్మం నాలుగు పాదాల నడుస్తు న్నదని చెప్పడానికి నిదర్శ నంగా నిలిచాయి. సుప్రీం వ్యాఖ్యలు ముమ్మాటికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటివే. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలంటే కుదరదని సుప్రీం వ్యాఖ్యలు రుజువు చేశాయి. ఇక ప్రాయశ్చిత్త దీక్ష నాటకాలు అన్నీ వట్టివేనని కుండబద్దలు కొట్టినట్లయింది. కల్తీ నెయ్యి జరిగినట్లు సాక్ష్యాలు లేవన్న సుప్రీం... సిట్ విచారణ ఎందుకంటూ నిలదీసింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై వేసిన నిందారోపణలన్నీ అసత్యాలని ప్రజలకు అర్థమైంది. ఒక వ్యక్తిని రాజకీయంగా హత్య చేసేందుకు పరమ పవిత్రమైన ఏడు కొండల వాడిని వాడుకున్న నీచ రాజకీయం ‘చంద్రబాబు అండ్ కో’దని అందరికీ అర్థమైంది.సెప్టెంబరు 18న ఏపీ సీఎం చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు రోజుకో మలుపు తిరుగుతూ వస్తున్నాయి. నిజంగా జంతువుల కొవ్వు కలిపి ఉంటే∙ప్రసాదం నిల్వ ఉండదనీ, వెంటనే పాడైపోవడం, వాసన రావడం... ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు పదే పదే చెబుతూ వచ్చారు. అదీకాకుండా అసలు ఈ తతంగమంతా చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టాకే జరిగింది. దానిని వదిలేసి అదేదో జగన్ హయాంలో జరిగిందంటూ మసిపూసి మారేడుకాయను చేసే ప్రక్రియను తలకెత్తుకున్న చంద్రబాబు తలదించుకొనేలా సుప్రీం వ్యాఖ్యలు చేసింది. అసలు కల్తీ జరిగింది అనడానికి ఆధారా లెక్కడున్నాయంటూ ప్రశ్నించింది. ఇప్పుడు దీనికి చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి.ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రపంచ దేశాల్లో భక్తులు కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానంపైన, ఆల య ప్రతిష్ఠపైన, లడ్డూ ప్రసాదం చరిత్రపైన మాయని మచ్చ వేయగలిగారు. ఆయన వ్యాఖ్యలు నిజమా, కాదా అని తెలుసుకోకుండా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో హడావిడి చేశారు. జనాన్ని నమ్మించేందుకు దుర్గమ్మ గుడికి వెళ్లి మెట్లపూజ చేశారు. చంద్రబాబు రాజకీయ వ్యూహంలో బలైపోయారు. వాస్తవానికి జనసేనాని ఈ వ్యాఖ్యలు చేయలేదు. చేసింది చంద్రబాబు. కానీ, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించ డానికి కారకులైంది పవన్. ఇప్పుడు పవన్ ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఏం చేయా లన్నదానిపై మల్లగుల్లాలు పడాల్సిన దుఃస్థితి నెలకొంది. ఇప్పటికైనా పవన్ తొందరపడకుండా నింపాదిగా రాజకీయాలు చేస్తేనే చంద్రబాబు వ్యూహాల నుండి తప్పించుకుని తనదైన శైలిలో తన అభిమానుల మనసులో ముద్ర వేసుకో గలుగుతారు. ఇక బీజేపీ పెద్దలు అచ్చంగా చంద్ర బాబు మౌత్ పీస్‌లుగా మారినట్లు కనిపించింది.ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంపై స్పందించిన తీరు ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందంటూ చెబుతూనే, లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందంటూ వ్యాఖ్యానించారు. దీనికి ఆ పార్టీ నేతలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవడం అనేది ఏ విధంగానూ జరిగే అవకాశం లేదు. పాలకులు ఎవరున్నా అంతటి నీచ పరిస్థితికి దిగజారే అవకాశాలు ఉండవు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన దాఖలాలు ఉన్నాయి కదా! కేవలం 2014–19 మధ్యే ఆయన హయాంలో 14 సార్లు వెనక్కు పంపారు కదా! అంతమాత్రం చేత చంద్రబాబు హయాంలో జంతు కొవ్వు కలిపిన లడ్డూలు తయారైనట్లు భావించాలా? ఇది ఏమాత్రం సహేతుకం?ముస్లింలకు 4 శాతం ఉన్న రిజర్వేషన్లు రద్దుచేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకుకు పూర్తిగా దూరమైనట్లు చంద్రబాబు గ్రహించి ఈ కుట్రకు తెరలేపినట్లు కనిపిస్తోంది. దీనివల్ల హిందువుల ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవచ్చని ఆయన భావించి ఉంటారని అనుకోవాల్సి వస్తోంది. లేకపోతే ఆ నివేదికను ఒక రాజకీయ వేదిక మీద ఎందుకు చంద్రబాబు చదువుతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.తమ ఇలవేల్పు అయిన వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది అంటే ఎవరికైనా ఇట్టే ఆగ్రహావేశాలు వస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ, జగన్ ప్రధానికి లేఖ రాయడం, సీజేఐకి కూడా రాస్తానని చెప్పడం, నేషనల్ మీడియాకు వాస్తవాలు వివరించడం, సుబ్బారెడ్డి లాంటి వారు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం, కరుణాకర్ రెడ్డి లాంటి వారు ప్రమాణాలు చేయడం ఇలా అనేకానేక కార్య క్రమాల నేపథ్యంలో సామాన్య మానవుల్లో ఆలో చన రేకెత్తింది. కల్తీ జరిగిందని తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. ఏది ఏమైనప్పటికీ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు సామన్య జనాల్లో పెద్ద ఎత్తున చర్చ నీయాంశంగా మారాయి. నిజానిజాలు నిగ్గు తేల్చేలా సీబీఐతో విచారణ చేయించాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే ప్రజలు స్వాగతిస్తారు. దేశ ప్రధాని కూడా ఈ అంశం మీద నోరు విప్పాలి. ప్రజల్లో దెబ్బతిన్న మనోభావాలను తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలి.పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త ఏపీ అధ్యక్షులు,వైయస్సార్ టీయూసీ -
దీని అర్థం ఏంటి బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాజకీయ దుర్బుద్ధితో పరమ పవిత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై పచ్చి అబద్ధాలు వల్లె వేసి అపవిత్రం చేస్తూ.. తన తిరుమల పర్యటనపై అవాస్తవాలు చెబుతూ దబాయిస్తున్న సీఎం చంద్రబాబు తీరును ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘నీకు నోటీసు ఇచ్చారా? తిరుమలకు పోవద్దాన్నారా? వేంకటేశ్వరస్వామి గుడికి పోనివ్వబోమని ఎవరైనా చెప్పారా...’ అంటూ శుక్రవారం సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను వల్లె వేశారు. మాజీ సీఎం జగన్ తిరుపతి, తిరుమల పర్యటనకు అనుమతి లేదని.. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వైఎస్సార్సీపీ నేతలకు శుక్రవారం నోటీసులు ఇచ్చారు. శుక్రవారం సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోనూ.. వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు జారీ చేసిన నోటీసులను జత చేస్తూ ‘దీని అర్థం ఏంటి బాబూ?.. దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే’ అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తావా? పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదంటూ సాక్ష్యాధారాలతో సహా మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. జూలై 23న టీటీడీ ఈవో.. సెప్టెంబరు 18న సీఎం చంద్రబాబు.. సెప్టెంబరు 20న టీటీడీ ఈవో.. సెప్టెంబరు 22న సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను.. సెప్టెంబరు 27న తాను మీడియాతో మాట్లాడిన మాటల వీడియోలను జత చేసి.. దీని అర్థం ఏంటి బాబూ? దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే అంటూ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. వనస్పతి కలిసింది.. ట్యాంకర్లు రిజెక్ట్ చేశాం శాంపిళ్లలో కల్తీ జరిగిందని తేలింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కలిసిందని తేలింది. ఆ సప్లయిర్‌ను బ్లాక్ లిస్ట్ చేసేందుకు షోకాజ్ నోటీసు ఇచ్చాం. రెండు ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం – జూలై 23న టీటీడీ ఈవో శ్యామలరావు కల్తీ బాబు సృష్టి.. శ్రీ వేంకటేశ్వరస్వామి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ముడిసరుకులు వాడారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు. – సెప్టెంబరు 18న సీఎం చంద్రబాబు నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపాం కల్తీ నెయ్యి అని రిపోర్టులో తేలడంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ చేశాం. నాలుగు ల్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ సంస్థ నుంచి సరఫరాను నిలిపేశాం. – సెప్టెంబరు 20న టీటీడీ ఈవో శ్యామలరావు బాబు నోట మళ్లీ అవే కల్తీ మాటలు నాలుగు ట్యాంకర్లు అప్పటికే వచ్చేశాయి. వాటిలోని కల్తీ నెయ్యిని వాడారు. – సెప్టెంబరు 22న సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లె వేసి తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రతిష్టను సీఎం చంద్రబాబు అబాసుపాలు చేశారు. పరమ పవిత్రమైన లడ్డూ విశిష్టతకు దెబ్బతీశారు. శ్రీవారి ప్రసాదం బాగాలేదని, తింటే మంచిది కాదని భక్తుల్లో అనుమానపు బీజాలు నాటారు. తాను చెబుతున్నది పచ్చి అబద్ధమని తెలిసి కూడా చంద్రబాబు పదే పదే అవాస్తవాలు చెబుతున్నారు. – సెప్టెంబరు 27న మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ – విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్ధించారు. ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని పిటిషన్లో విన్నవించారు. నిరాధారమైన తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించారు. ఎస్వోపీ ప్రకారం పరీక్షల్లో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నెయ్యిని మాత్రమే తిరుమల ప్రసాదానికి వినియోగించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఏదో ఒక చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు అభ్యర్ధించారు. -
దేవదేవుడి మీదే కుట్రలు చేసిన నీచుడిగా చరిత్రకెక్కిన చంబాసురుడు
-
ఆత్మరక్షణలో చంద్రబాబు
సాక్షి, అమరావతి: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడానికి విఫలయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరగని కల్తీని జరిగిందని చెబుతూ పెద్ద కుట్రకు తెరతీసి చివరికి ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక తప్పు నుంచి బయట పడేందుకు మరో తప్పు చేస్తూ ఆయన వివాదాల ఊబిలో చిక్కుకుపోయారు. ఇప్పుడు బయటపడడానికి నానాతంటాలు పడుతున్నారు. విజయవాడ వరద విపత్తును ఎదుర్కోవడంలో ఘోర వైఫల్యం చెందడం, తన వంద రోజుల పాలనా వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు ఆయన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే దారుణమైన అబద్ధాన్ని తెరపైకి తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని ఈనెల 18న ఆరోపించి ఆ దేవదేవుడినే తన కుట్రలోకి లాగారు. కానీ, జగన్మోహన్రెడ్డి ఆధారసహితంగా వాస్తవాలన్నీ వెల్లడిస్తుండడంతో చంద్రబాబు ఇరుకునపడ్డారు. పదిరోజులుగా జరిపిన డైవర్షన్ పాలిటిక్స్ చెల్లుబాటు కాకపోవడంతో చంద్రబాబు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు.సమాధానం చెప్పలేక చేతులెత్తేసిన బాబు» స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో శుక్రవారం మాజీ సీఎం జగన్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు సీఎం హోదాలో చంద్రబాబు సమాధానాలు చెప్పలేక చేతులెత్తేశారు.» ‘చంద్రబాబు హయాంలో 2015లో ఆవు నెయ్యి కిలో రూ. 276కు. 2019 జనవరిలో రూ. 324కు కొన్నారు. మరి ఇప్పుడు రూ. 320కు కొంటే తప్పేంటి? టెండర్లలో ఎల్1 కింద ఎవరొస్తే వారికి కాంట్రాక్టు ఇచ్చారు. ఇది గతంలోనూ జరిగిందే’ అని మాజీ సీఎం జగన్ నిలదీస్తే.. సీఎం చంద్రబాబు మాత్రం ఎక్కువ మంది వ్యాపారులు వచ్చేలా టెండర్ల నిబంధనలు మార్చేశారని, అందుకే తక్కువ రేటుకు కొంటున్నారని చెప్పుకొచ్చారు.» ‘లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారం మొత్తం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగింది కదా? వచ్చిన ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్లు ల్యాబ్ రిపోర్టులో పాస్ అయ్యాయి. మరో నాలుగు రిజెక్ట్ కావడంతో వెనక్కి పంపించేశారు. అసలు వాడని నెయ్యితో.. లడ్డూ ఎలా తయారైంది’ అన్న జగన్ ప్రశ్నకు చంద్రబాబు దగ్గర సరైన సమాధానం లేదు.» ‘ప్రశాంతంగా ఉన్న తిరుమలలో ఘర్షణలను ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారు. నేను దర్శనానికి వెళ్తుంటే పోలీసులను ఎందుకు మోహరించడం’ అని ప్రశ్నిస్తే.. తిరుమలకు వెళ్లొద్దని ఎవ్వరూ చెప్పట్లే, ర్యాలీలు, జన సమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పామంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు.తిరుమలలో అకస్మాత్తుగా డిక్లరేషన్ ఫ్లెక్సీలు!» వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడటంతో తొలగింపు » కూటమి నేతల సూచనతో టీటీడీ ఇలా చేయడం సరికాదంటున్న భక్తులు » రాజకీయాల్లో టీటీడీ పావుగా మారకూడదని సూచనతిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలను టీటీడీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తోంది. రాజకీయ నాయకులు చెప్పిందల్లా చేస్తూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారని తెలుసుకొని టీటీడీ హుటాహుటిన శుక్రవారం మధ్యాహ్నం తిరుమలలో హైందవేతరుల ఆలయ ప్రవేశానికి సంబంధించిన డిక్లరేషన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడటంతో కొద్ది సేపటికే ఆ ఫ్లెక్సీలు తొలగించింది. వాటిని చూసిన భక్తులు.. రాజకీయాల కోసం తిరుమలను కూడా వాడుకుంటున్నారా అని ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులు లేని డిక్లరేషన్ సూచిక బోర్డులు అకస్మాత్తుగా ప్రత్యక్షమవడంతో వైఎస్ జగన్ పర్యటన వల్లే ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఇలా ఒక్కరి కోసం ప్రత్యేకంగా ఫ్లెక్సీలు పెట్టడం సరికాదని మండిపడుతున్నారు. టీటీడీ అధికారులు కూడా రాజకీయాల్లో పావులుగా మారడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కూటమి నేతల సూచన మేరకే టీటీడీ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద, ఏటీసీ కూడలి వద్ద రాత్రికి రాత్రి తయారు చేయించి డిక్లరేషన్ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. మతం పేరుతో టీటీడీని సైతం కూటమి నాయకులు రాజకీయంగా వాడుకోవడం కూడా సరికాదని భక్తులు విమర్శిస్తున్నారు. హిందుత్వం ముసుగులో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కూటమి పార్టీల నాయకులు, కొందరు స్వామీజీలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. -
వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’గోల
సాక్షి, అమరావతి: తన వంద రోజుల పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో ఆ వ్యవహారం నుంచి వారి దృష్టి మళ్లించడానికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కల్తీ అయిందని చంద్రబాబు చెబుతున్న నెయ్యిని అసలు వాడనప్పుడు లడ్డూ ఏ విధంగా కల్తీ అవుతుందని.. ఈ లెక్కన ఏ విధంగా అపచారం జరిగిందన్న ప్రశ్నకు చంద్రబాబు అండ్ గ్యాంగ్ నుంచి సమాధానం లేదు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ మూలాలున్నాయని గుర్తించిన వెంటనే.. ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించామని, ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమక్షంలో స్పష్టంగా ప్రకటించారు. ఆ ట్యాంకర్లు కనీసం టీటీడీ గోడౌన్ వరకు కూడా రాలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ తలకెక్కించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేయడం ద్వారా లబ్ధి పొందాలని కుట్ర పన్నారు. ఆ వెంటనే తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయిందని నింపాదిగా ప్రకటించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పచ్చిగా అబద్ధం చెప్పారు. ఇందుకు కారణం గత ప్రభుత్వమేనని నింద మోపుతూ దుష్ప్రచారం ప్రారంభించారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఎల్లో గ్యాంగ్ ఇదే పాటను అందుకున్నారు. అసలు కల్తీ నెయ్యిని వాడనే లేదని సాక్షాత్తు ఈవోనే చెబుతున్నప్పుడు.. కల్తీ అయిన నెయ్యితో లడ్డూ తయారు చేశారని ఎలా చెబుతారంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, కోట్లాది మంది భక్తులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్డు సిటింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానికి లేఖ రాసిన వైఎస్ జగన్ పచ్చి అబద్ధాలు చెప్పే అలవాటున్న సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బ తీసే స్థాయికి దిగజారారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేశారు. జరగని తప్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ అయిన నెయ్యిని ఉపయోగించనప్పుడు తప్పు జరిగే అవకాశమే లేదని చెప్పారు. చంద్రబాబు చర్యలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీని, ఆ సంస్థ అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బ తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలను, టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్న చంద్రబాబును గట్టిగా మందలించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆదివారం లేఖ రాశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం 100 రోజుల్లో ఇచి్చన హామీలు నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారన్నది స్పష్టమైంది. కల్తీ జరిగిందనే ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. దశాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. అలా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు. తద్వారా కోట్ల మంది తిరుమల భక్తుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. వాస్తవానికి ఆలయంలోనికి వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్ నుండి మూడు నమూనాలు తీసుకుని పరీక్షిస్తారు. ఈ మూడు శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్‌ను తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. ఇలాంటి అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందు వల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. గతంలో కూడా ఈ వ్యవస్థ ఉంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించారు. వాస్తవంగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ నెయ్యి సరఫరా ప్రారంభించింది జూన్ 12 నుంచి అని టీటీడీ ఈవోనే చెబుతున్నారు. నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన రెండు నెలల తర్వాత చంద్రబాబు ఆ విషయం గురించి రాద్ధాంతం చేయడాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారు. ఆ ల్యాబ్ నివేదికను టీడీపీ కార్యాలయం నుంచి విడుదల చేయడాన్ని బట్టి ముమ్మాటికీ ఇది రాజకీయం కుట్రేనని స్పష్టమవుతోంది. మరో వైపు కల్తీకి ఆస్కారమే లేదని ఆహార రంగ నిపుణులు సైతం తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సీఎం తన జేబులోని అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. -
బాబు కుట్రకు పోలీసు వత్తాసు
సాక్షి, అమరావతి: తిరుపతి లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారం బెడిసికొట్టడంతో సీఎం చంద్రబాబు కొత్త కుట్రకు తెర తీశారు. అవాస్తవ ఆరోపణల కుతంత్రం తన మెడకే చుట్టుకుంటుండడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోవడంతో ఆ వివాదమంతా టీడీపీ ప్రభుత్వ సృష్టేనని జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ అంశంపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటే తన కుట్ర బట్టబయలవుతుందని బెంబేలెత్తుతున్నారు. దీంతో తాను సృష్టించిన వివాదాన్ని తనకు అనుకూలంగా ముగించేందుకు చంద్రబాబు దారులు వెతుకుతున్నారు. అందులో భాగంగానే టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ‘సిట్’ ఏర్పాటు చేసినప్పటికీ ఆయన స్థిమితపడలేకపోతున్నారు. అందుకే లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ అధికారులతో బుధవారం ఫిర్యాదు చేయించారు. పోలీసు వేధింపులతో బెంబేలెత్తించి తిమ్మిని బమ్మి చేసే కుతంత్రానికి పదును పెడుతున్నారు.రాత్రికి రాత్రే సీఐ అవుట్తిరుపతి ఈస్ట్ పోలీసులకు టీటీడీ బుధవారం ఫిర్యాదు చేసింది. అయితే ఆ ముందు రోజే అంటే మంగళవారం రాత్రే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ మహేశ్వర్‌రెడ్డిని ప్రభుత్వం హఠాత్తుగా వీఆర్‌కు పంపించింది. ఆయన స్థానంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఉన్న తమకు విధేయుడైన ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించింది. లడ్డూ అంశంపై అక్రమ కేసు నమోదు చేసేందుకు మహేశ్వర్‌రెడ్డి సుముఖత చూపలేదని సమాచారం. దాంతో ఆయన్ని తప్పించి తమకు విధేయుడైన అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో నమోదు చేసే ఫిర్యాదులపై విచారణ నిర్వహించాల్సిన బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌దే. టీడీపీ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగా దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడే అధికారిని నియమించుకునేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది.మరి.. నాడు బాబు హయాంలోనూ కల్తీ జరిగిందా?నెయ్యి కల్తీ జరిగినట్లు ప్రాథమిక ఆధారంగా టీటీడీ ఆ ఫిర్యాదులో ప్రస్తావించిన అంశం విడ్డూరంగా ఉంది. కేజీ నెయ్యి రూ.319.80 చొప్పున సరఫరా చేసేందుకు ఏఆర్ డెయిరీ అంగీకరించడమే కల్తీ చేశారనేందుకు ప్రాథమిక ఆధారం అని పేర్కొనడం గమనార్హం. మరి కేజీ రూ.319.80 చొప్పున సరఫరా చేయడమే కల్తీ చేసినట్టుగా భావించాలంటే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో కేజీ రూ.276 చొప్పున, 2018లో రూ.320 చొప్పునే టీటీడీ నెయ్యి కొనుగోలు చేసింది. ఇక అప్పుడు కూడా కల్తీ చేసినట్లే భావించాలి కదా...? నాడు టీడీపీ హయాంలో నెయ్యి సరఫరా చేసిన డెయిరీలపై కూడా ఫిర్యాదు చేయాలి కదా? అని నిపుణులు నిలదీస్తున్నారు.పక్కా పన్నాగంతోనే పోలీసులకు ఫిర్యాదులడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధ పడింది. కల్తీ నెయ్యి సరఫరా చేశారని గుర్తించామని చెబుతున్న రెండు నెలల తరువాత టీటీడీ తీరిగ్గా తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో తాజాగా ఫిర్యాదు చేయడం గమనార్హం. తమిళనాడుకు చెందిన నెయ్యి సరఫరాదారు ఏఆర్ డెయిరీపై టీటీడీ జనరల్ మేనేజర్ (స్టోర్స్) పి.మురళీకృష్ణ ద్వారా ప్రభుత్వం ఫిర్యాదు చేయించింది. నెయ్యి కల్తీ జరిగిందని జూలై 23నే టీటీడీకి నివేదిక వచ్చిందన్న చంద్రబాబు సెప్టెంబరు 20న తొలిసారిగా వెల్లడించి దుష్ప్రచారానికి తెరతీశారు. మరి కల్తీ జరిగిందని తెలిసిన జూలై 23నే ఆహార భద్రతా చట్టం కింద టీటీడీ ఎందుకు కేసు నమోదు చేయలేదన్న న్యాయ నిపుణుల ప్రశ్నకు ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేకపోయింది. టీటీడీ ఈవో శ్యామలరావు మొదట ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని... అయితే ఆ నెయ్యి వాడలేదని.. తిప్పి పంపామని వెల్లడించారు. అంతేగానీ జంతువుల కొవ్వు కలిసిందని ఆయన చెప్పలేదు. జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ నివేదికలో కూడా వెల్లడించలేదు. కానీ తరువాత ఈ నెల 20న సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే దుష్ప్రచారం మొదలు పెట్టడంతో శ్యామలరావు కూడా మాట మార్చక తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలోని డొల్లతనంపై నిపుణులు సూటిగా ప్రశ్నలు సంధిస్తుండటంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. దాంతో తమను ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు పోలీసు అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని పతాకస్థాయికి చేర్చిన చంద్రబాబు బృందం తాజాగా తిరుపతి పోలీసులకు ఫిర్యాదు ముసుగులో వేధింపుల కుట్రకు తెరతీసింది.విచారణ పేరిట వేధింపుల కుట్ర..రాజకీయ ప్రత్యర్థులు, డెయిరీల యాజమాన్యం, ఎంపిక చేసుకున్న అధికారులు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడాలన్నదే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర. అక్రమ కేసుల్లో ఇరికించి అనంతరం కొందర్ని అప్రూవర్‌గా మార్చుకుని తమ కుట్ర వాదనను వారితో ఒప్పించాలనే కుతంత్రం పన్నింది. సిట్ పూర్తి స్వరూపాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. నివేదికతో సరిపెట్టాలా? అంతకుమించి అధికార పరిధి కల్పిస్తారా? అనేది స్పష్టం చేయలేదు. మరోవైపు తిరుపతి పోలీసులు కేసు విచారణ పేరిట వేధింపులకు గురి చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం డైరెక్షన్ మేరకే తిరుపతి పోలీసుల విచారణ హైడ్రామా కొనసాగనుంది. ఎవరెవరిని విచారణకు పిలవాలి? ఎలా భయపెట్టాలి? ఎలా వేధించాలన్నది అంతా టీడీపీ పర్యవేక్షణలోనే సాగనుందన్నది సుస్పష్టం. లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారానికి వత్తాసు పలకాలని.. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని... లేదంటే కేసుల్లో ఇరికించి అరెస్టులతో వేధిస్తామని పోలీసు అస్త్రాన్ని ప్రయోగించాలన్నది చంద్రబాబు కుతంత్రం అని స్పష్టమవుతోంది.సిట్ వేశాక పోలీసులకు ఫిర్యాదా!లడ్డూ ప్రసాదం అంశంపై ప్రభుత్వం మంగళవారం తమకు వీర విధేయులైన పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు కొమ్ముకాసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సిట్‌లో సభ్యుడిగా నియమించిన విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అల్లుడు. రిటైరైన తరువాత హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా పని చేసిన కృష్ణయ్య అనంతరం 2014–19లో టీడీపీ హయాంలో ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన్ని కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా నియమించింది. ఆయన అల్లుడు గోపీనాథ్ జెట్టీని సిట్ సభ్యుడిగా నియమించడం ద్వారా చంద్రబాబు కుతంత్రం బహిర్గతమవుతోంది. అయినా సరే చంద్రబాబులో ఆందోళన తగ్గలేదు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని జాతీయ స్థాయిలో పార్టీలు, నిపుణులు, న్యాయవేత్తలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో చంద్రబాబులో ఆందోళన మరింత తీవ్రమైంది. సుప్రీంకోర్టు విచారణకు ఆదేశిస్తే టీడీపీ సర్కారు కుట్ర మొత్తం బయటపడుతుందన్నది ఆయనకు తెలుసు. తమ కుట్రను కప్పిపుచ్చేందుకు సిట్‌తో సరిపెట్టలేమని భావించారు. అందుకే పోలీసు వేధింపులతో బెంబేలెత్తించి తనకు అనుకూలంగా లొంగదీసుకునే కుతంత్రానికి తెరతీశారు. తాజాగా తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించడం ద్వారా మరోవైపు నుంచి కూడా విచారణ పేరిట రాద్దాంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. -
బాబు తెచ్చిన నెయ్యే
సాక్షి, అమరావతి: జరగని తప్పు జరిగిందంటూ పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిచ్చి ప్రేలాపనలు పేలుతూ ఘోర అపచారానికి ఒడిగట్టారు. లడ్డూల తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ నిరాధారమైన, దారుణ ఆరోపణలు చేశారు. ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) కాల్ఫ్ (సెంటర్ ఫర్ ఎనాలసిస్ అండ్ లెర్నింగ్ లైవ్ స్టాక్, ఫుడ్) టెస్ట్ రిపోర్ట్‌లను సీఎం చంద్రబాబు ఆధారంగా చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో పాల ఉత్పత్తులు, ఆహార నాణ్యత సంస్థలలో పనిచేస్తూ విశేష అనుభవం గడించిన పలువురు నిపుణులను ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్టుపై ‘సాక్షి’ సంప్రదించింది. జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఆ నెయ్యిలో లేవని వారంతా ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ⇒ నాలుగు శాంపిళ్లను పరీక్షించి ఎన్డీడీబీ కాల్ఫ్ ఇచ్చిన నాలుగు టెస్ట్ రిపోర్టులలో మిల్క్ ఫ్యాట్ వరుసగా 99.584, 99.610, 99.618, 99.677 శాతం ఉందని.. మిగిలిన 0.416, 0.390, 0.382, 0.323 శాతం మాయిశ్చర్ (తేమ), ఇతరాలు (విటమిన్స్, కెరటిన్, మినరల్స్ తదితరాలు) ఉంటాయని నిపుణులు విశ్లేషించారు. ⇒ కేజీ నెయ్యిలో ఏ సరఫరా సంస్థైనా 20 నుంచి 30 గ్రాముల వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు కలిపే స్థాయికి దిగజారదని స్పష్టం చేశారు. ⇒ కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఎన్డీడీబీ కాల్ఫ్ టెస్ట్ రిపోర్టుల ఆధారంగా ఎందుకు బ్లాక్ లిస్ట్‌లో పెట్టకూడదో చెప్పాలంటూ ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ పి.మురళీకృష్ణ జూలై 27న జారీ చేసిన షోకాజ్ నోటీసులోనూ.. దానికి ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ఇచ్చిన జవాబును తిరస్కరిస్తూ జూలై 28న ఇచ్చిన రిజాయిండర్ షోకాజ్ నోటీసులోనూ జంతువుల కొవ్వు ఆ నెయ్యిలో కలిసిందని ఎక్కడా స్పష్టంగా తేలి్చచెప్పకపోవడాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వెజిటబుల్ ఆయిల్‌తో పాటు ఫారిన్ ఫ్యాట్స్ కలిసి ఉండొచ్చునంటూ అనుమానం మాత్రమే వ్యక్తం చేశారని పేర్కొంటున్నారు. ⇒ సీఎం చంద్రబాబు మాత్రం టీటీడీ వెనక్కి పంపేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, దాన్ని శ్రీవారి లడ్డూల తయారీలో వాడారని.. వాటిని భక్తులకు పంపిణీ చేశారని.. భక్తులు వాటిని తినేశారంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తుండటంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ⇒ దీన్ని బట్టి చూస్తే.. సున్నితమైన అంశంపై ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న స్వార్థంతోనే పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు అపవిత్రం చేసి ఘోర అపరాధం చేశారన్నది స్పష్టమవుతోంది. ⇒ స్వార్థ రాజకీయాల కోసం శ్రీ వేంకటేశ్వరస్వామి వారితో ఆటలాడుకోవడం... భూలోక వైకుంఠం తిరుమలను అపవిత్రం చేసే దుస్సాహసానికి ఒడిగట్టడం నారా చంద్రబాబు నాయుడికి ఇదేమీ కొత్తేమీ కాదని టీటీడీ అధికారులు, అధ్యాత్మీక వేత్తలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు ప్రభుత్వంలోనే కల్తీ నెయ్యి సరఫరా.. ⇒ స్పెషల్ గ్రేడ్ ఆగ్ మార్క్ ఆవు నెయ్యి కోసం 2024 మార్చి 12న టీటీడీ ఈ–టెండర్లు పిలిచింది. అయితే ఎన్నికల సంఘం మార్చి 16న సాధారణ ఎన్నికల షెడ్యూలును విడుదల చేయడంతో అదే రోజు నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దాంతో ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయాధికారం ఉండదు. ⇒ ఈ టెండర్లు 2024 మే 8న టెండర్లు ఖరారయ్యాయి. కేజీ రూ.319.80 చొప్పున పది లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ దక్కించుకుంది. టీటీడీకి నెయ్యి సరఫరాను జూన్ 12 నుంచి ఆ సంస్థ ప్రారంభించింది. అదేరోజు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. దీన్ని బట్టి ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేజీ కాదు కదా కనీసం ఒక గ్రాము నెయ్యిని కూడా టీటీడీకి సరఫరా చేయలేదన్నది స్పష్టమవుతోంది. ⇒ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జూన్ 12, 21, 25, జూలై 4వ తేదీలలో ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో ఒక్కో ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్లను తీసుకుని తిరుమలలోని టీటీడీ ల్యా»ొరేటరీకి టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు పంపారు. టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు ఆ నెయ్యి ఉందని తేల్చడంతో ఆ నాలుగు ట్యాంకర్లను టీటీడీ అధికారులు గోదాములోకి అనుమతించి నెయ్యిని ఆన్లోడ్ చేసుకున్నారు. ⇒ ఈ క్రమంలో జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 15న రెండు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీకి ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పంపింది. ఆ ట్యాంకర్ల నెయ్యి శాంపిళ్లను పరీక్షించిన టీటీడీ ల్యా»ొరేటరీ టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు లేదని తిరస్కరించింది. ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ అధికారులు వెనక్కి పంపేశారు. అంటే.. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు వాడలేదన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు మాత్రం శ్రీవారి లడ్డూల తయారీలో జంతుకొవ్వు కలిసిన నెయ్యిని వాడారంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తుండటం గమనార్హం.సీఎంకు ఇచ్చిన నివేదికలో ఒకలా.. షోకాజ్ నోటీసుల్లో మరోలా కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు గత ఆదివారం సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరాను జూన్ 12 నుంచి ప్రారంభించిందని.. ఎనిమిది ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసిందని నివేదికలో పేర్కొన్నారు. ఇందులో నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యంగా ఉందని టీటీడీ ల్యాబొరేటరీ తేల్చిందని వెల్లడించారు. జూలై 6, 15న సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యంగా లేదని.. ఆ నెయ్యి శాంపిళ్లను ఎన్డీడీబీ కాల్ఫ్కు పరీక్షల నిమిత్తం పంపామని వివరించారు. ఎన్డీడీబీ జూలై 23న టెస్ట్ రిపోర్టులు ఇచ్చిందని.. ఆ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్‌తోపాటు జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేసిందన్నారు. దాంతో నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపేశామని.. సరఫరాను ఆపేశామని.. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ జూలై 27న షోకాజ్ నోటీసులు జారీ చేశామని నివేదికలో పేర్కొన్నారు. కానీ.. ఇదే అంశంపై ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టులు ఇచ్చిన రోజు అంటే జూలై 23న తిరుమలలో ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు ట్యాంకర్లలో నెయ్యి కల్తీ అయినట్లు నివేదికలో తేలిందని.. వనస్పతి డాల్డా లాంటి వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉండొచ్చునని చెప్పారు. ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు జూలై 27న ఇచ్చిన షోకాజ్ నోటీసులోనూ.. 28న ఇచ్చిన రిజాయిండర్ షోకాజ్ నోటీసులోనూ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని, ఫారిన్ ప్యాట్ కలిసి ఉండే అవకాశం ఉండొచ్చునని టీటీడీ పేర్కొంది. కానీ.. రెండు నెలల తర్వాత సీఎంకు ఇచ్చిన నివేదికలో టీటీడీ ఈవో శ్యామలరావు మాట మార్చడం గమనార్హం. సీఎంవో నుంచి తీవ్ర స్థాయిలో వచ్చిన ఒత్తిడికి తలొగ్గే ఈవో శ్యామలరావు జూలై 23న మీడియాతో ఒకలా మాట్లాడి.. ఈనెల 22న సీఎంకు మరోలా నివేదిక ఇచ్చారనే అభిప్రాయం టీటీడీ అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. -
నందిని నెయ్యి వద్దన్నది బాబే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచార కుట్ర కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు పూటకో కట్టు కథ, రోజుకో అవాస్తవ ఆరోపణలతో కుతంత్రానికి పదును పెడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశి్నస్తుండటం ఈ కుట్ర కథలో తాజా అంకం. వాస్తవం ఏమిటంటే.. దశాబ్ద కాలంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న నందిని డెయిరీని 2015లో తొలిసారిగా పక్కకు తప్పించింది టీడీపీ ప్రభుత్వమే. చంద్రబాబు ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసేందుకు యతి్నస్తుండటం గమనార్హం. నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబే... కర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలంపాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ ప్రక్రియను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. నాడు టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచి్చంది. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ అప్పట్లో ఓ టీవీ చానల్లో రిపోర్టర్‌గా ఉన్న సమయంలో నందినీ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ వార్తలు కూడా ప్రసారం చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వచి్చనా చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నందినీ డెయిరీని కాదని గోవింద్ డెయిరీకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టింది. నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో టెండర్లలో పాల్గొనని నందిని ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొనలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వనందున టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనబోమని పేర్కొంది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఎల్ 1గా నిలిచిన ఏఆర్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. ఇదీ అసలు విషయం. అయినా సరే ఎందుకు ఇవ్వలేదంటూ..ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ హయాంలో నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎందుకు ఇవ్వలేదని ప్రశి్నంచడం విస్మయం కలిగిస్తోంది. అసలు వైఎస్సార్సీపీ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారు? ఈ విషయం తెలిసినా సీఎం చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 2015లో టీడీపీ హయాంలో టెండరు ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వనిది చంద్రబాబే అన్నది పచ్చి నిజం. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం వెనుక చంద్రబాబు రాజకీయ కుతంత్రం ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
శ్రీవారి లడ్డూపై పుట్టెడు అబద్ధాలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం కుతంత్రం పన్ని మహాపచారం చేశారు! పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారు. లడ్డూ తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ నిరాధారమైన దారుణ ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు. నెయ్యి ట్యాంకర్లలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసి కల్తీ అయ్యిందని నిర్ధారణ కాగానే వాటిని వెనక్కి పంపేశామని టీటీడీ ఈవో పదే పదే స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడలేదని తేల్చిచెప్పారు. అయినా సరే సీఎం చంద్రబాబు తీరు మార్చుకోలేదు. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేశారంటూ పచ్చి అబద్ధాలు పదేపదే వల్లె వేస్తూ మహాపచారం చేస్తున్నారు.ఈ ప్రశ్నలకు జవాబుందా బాబూ?1. తాను టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించక ముందే సీఎం చంద్రబాబును కలిశానని.. తిరుమల ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న ముడిసరుకుల్లో నాణ్యత లేదని, జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యితో లడ్డూలు తయారు చేస్తున్నారని.. ఈనెల 20న మీడియాతో శ్యామలరావు చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని మీరు కూడా ధ్రువీకరించారు. దీన్ని బట్టి స్వార్థ రాజకీయాల కోసమే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ఫ్రచారం చేయడానికి జూన్ 14నే మహాకుతంత్రం పన్నారన్నది స్పష్టమవు తోంది కదా?2. ఈనెల 18న కూటమి శాసనసభాపక్ష సమావేశం వేదికగా కోట్లాది భక్తుల విశ్వాసాలను.. టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ మీరు దారుణమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ మహాకుతంత్రంలో భాగం కాదా బాబూ?3. ఏఆర్ డైయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూలై 6న, జూలై 15న సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిశాయని జూలై 23న ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని అదే రోజు టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. కానీ.. రెండు నెలల తర్వాత ఎన్డీడీబీ నివేదికను టీడీపీ ఆఫీసులో విడుదల చేయడం వెనుక మీ కుట్రపూరిత ఆలోచన బహిర్గతమవుతోంది కదా?4. కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని, కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేయలేదని ఈవో శ్యామలరావు స్పష్టం చేసినప్పటికీ.. లడ్డూల తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయంగా లబ్ధి పొందాలన్న మీ కుతంత్రం బట్టబయలైంది కదా?5. మీ ప్రభుత్వ హయాంలో అక్టోబరు 2015 నుంచి మే 2019 వరకూ నందిని బ్రాండ్ నెయ్యిని టీటీడీకి కేఎంఎఫ్(కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) సరఫరా చేయలేదు. కానీ.. కేఎంఎఫ్‌కు ఉద్దేశపూర్వకంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇవ్వలేదంటూ మీరు పచ్చి అబద్ధాలు వల్లె వేయడంలో ఆంతర్యమేంటి?6. కేజీ నెయ్యి రూ.319కే వస్తుందా? అని మీరు అంటున్నారు. తక్కువ ధరకు అప్పగించడం వల్లే కల్తీ నెయ్యిని సరఫరా చేశారంటున్నారు. మరి 2015 జూన్‌లో మీరు నిర్వహించిన టెండర్లలో రూ.324లకు కేజీ నందిని నెయ్యి సరఫరా చేస్తామని కోట్ చేసిన కేఎంఎఫ్‌ను కాదని.. రూ.276కే సరఫరా చేస్తామని గోవిందా గోవిందా మిల్క్ అండ్ మిల్క్ ప్రాడక్ట్ లిమిటెడ్ (మహారాష్ట్ర)కు నెయ్యి సరఫరా బాధ్యత ఎలా ఇచ్చారు? రూ.276కే ఇచ్చినప్పుడే కల్తీ జరగనప్పుడు రూ.319కి కొన్నప్పుడు కల్తీ ఎలా జరుగుతుంది? ఇంత చిన్న లాజిక్‌ను ఎలా మర్చిపోయి.. కళ్లార్పకుండా కమిట్మెంట్తో అబద్ధాలు చెప్పగలుగుతున్నారు?7. టెండర్ల వ్యవస్థను నీరుగార్చి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం ద్వారా 2015–19 మధ్య ప్రభుత్వ ఖజానా నుంచి రూ.20 వేల కోట్లు మీరు దోచుకున్నారు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో మీ అక్రమాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యింది. రివర్స్ టెండరింగ్ వల్లే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక ఆంతర్యం మీ అక్రమాలను రివర్స్ టెండరింగ్ రట్టు చేసిందనే కడుపుమంటే కదా?8. స్వార్థ రాజకీయాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి మహాప్రసాదం లడ్డూపై మీరు చేసిన వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేల్చి.. టీటీడీ ఔన్నత్యాన్ని, భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాస్తే మీకు అంత ఉలుకెందుకు? ప్రధాని మోదీకి లేఖ రాసేందుకు వైఎస్ జగన్‌కు ఎంత ధైర్యమని వ్యాఖ్యానిస్తారా? కేంద్రం జోక్యం చేసుకుని దర్యాప్తు చేయిస్తే మీ రాజకీయ కుతంత్రం బహిర్గతమవుతుందనే భయమే కదా? అందుకే కదా ‘సిట్’ వేసింది?9. టీటీడీ చైర్మన్‌గా వ్యవమరించిన వైవీ సుబ్బారెడ్డి నిఖార్సైన హిందువు. 43 సార్లు అయ్యప్ప మాల ధరించారు. వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత హిందువు. రోజూ ఉదయం గో పూజతోనే ఆమె దినచర్య ప్రారంభమవుతుంది. అలాంటి మహిళ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారని.. అన్యమతస్థులను టీటీడీ చైర్మన్‌గా నియమించారని మీరు వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం సున్నితమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న కుట్రే కదా?10. టీటీడీ నిర్వహించే మూడు పరీక్షల్లో కల్తీ అయ్యిందని తేలితే నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేస్తారు. 2014–19 మధ్య 14–15 సార్లు.. 2019–24 మధ్య 18 సార్లు ఇలా వెనక్కి పంపేశారు. కల్తీ నెయ్యితో లడ్డూలు ఎన్నడూ తయారు చేయలేదని టీటీడీ ఈవో స్పష్టంగా చెబుతుంటే.. ఆలయంలో శాంతి హోమం నిర్వహించాలని మీరు ఆదేశించడంలో ఆంతర్యమేంటి? ఇదంతా మీరు నిరాధారమైన, దారుణమైన ఆరోపణలతో పరమ పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడంలో భాగమే కదా?11. నిర్దిష్ట ప్రమాణాల మేరకు లేనందున తమిళనాడు డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపేశామని, ఆ నెయ్యిని అసలు వాడలేదని ఈవో నివేదిక ఇవ్వలేదా?12. తిరుమలలో రివర్స్ టెండర్లు ఏమిటీ? అక్కడ కూడా రివర్స్ టెండర్లు నిర్వహిస్తారా? అని ప్రశ్నించిన మీరు నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండర్లు పిలిచి నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థ 65 శాతం, నందిని డెయిరీ 35 శాతం సరఫరా చేసేలా ఈ ఏడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక మతలబు ఏమిటీ?ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే కుట్ర..ఎన్నికల్లో కూటమి గెలుపొందటంతో జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 14న టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించక ముందే సీఎంను శ్యామలరావు కలిశారు. ఈ సమావేశంలోనే మహాకుట్రకు సీఎం చంద్రబాబు బీజం వేస్తూ.. తిరుమల ప్రసాదాల తయారీలో నాసిరకం ముడిసరుకులు వాడుతున్నారని, ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడుతున్నారని.. దాన్ని ప్రక్షాళన చేయాలని ఈవోను ఆదేశించారు. దీన్ని ఈవో శ్యామలరావు, సీఎం చంద్రబాబు మీడియా సాక్షిగా అంగీకరించారు. అంటే జూన్ 14నే మహాకుతంత్రానికి బీజం పడినట్లు స్పష్టమవుతోంది. -
చంద్రబాబు మార్కు ‘కుట్ర’ తప్పు జరిగితే కేసు ఎందుకు పెట్టలేదు?
నేరం జరిగిందని తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మరి ఎంతో ప్రాశస్త్యమైన చరిత్ర కలిగిన, పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నేయిలో జంతువుల కొవ్వు కలిపితే ఏం చేయాలి? వెంటనే కల్తీ నేయి సరఫరా చేసిన కంపెనీపై ఫిర్యాదు చేయాలి. కేసు పెట్టాలి. ఆధారాలతో సహా నిరూపించాలి. దోషులకు శిక్షపడేట్టు చేయాలి. ఆహార భద్రతా చట్టం అందుకు అవకాశం కల్పిస్తోంది కూడా. కానీ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు మాత్రం అవేవీ పట్టడం లేదు. ఊకదంపుడు నిరాధార రాజకీయ ఆరోపణలతో లబ్ధి పొందడానికే యతి్నస్తున్నారు. సాక్షి, అమరావతి: టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని తమకు జూలై 23నే తెలిసిందని చెబుతున్న చంద్రబాబు.. మరి ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పక పోవడం విస్తుగొలుపుతోంది. నెయ్యిలో కల్తీ జరిగిందని నిరాధార ఆరోపణలతో రాద్ధాంతం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే కుట్రకే ప్రాధాన్యమిస్తున్నారు. తద్వారా అడ్డదారిలో రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతానని మరోసారి నిరూపించారు.లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సరఫరా చేసిన ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని గుజరాత్‌లోని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక వెల్లడించినట్టు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో దు్రష్పచారాన్ని తెరపైకి తెచి్చంది. జూలై 23న నివేదిక వచ్చిందని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. మరి నెయ్యి కల్తీ జరిగినట్టు జూలై 23నే తెలిస్తే.. రాష్ట్ర ప్రభుత్వంగానీ టీటీడీగానీ ఏం చేయాలి? చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థపై కేసు నమోదు చేయాలి. ఎందుకంటే టెండరు నిబంధనలను ఉల్లంíœుంచి కల్తీ నెయ్యి సరఫరా చేయడం నేరం.అందులోనూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత దెబ్బతినేలా కల్తీ నెయ్యి సరఫరా చేయడం మహాపరాధం. జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేయడమే నిజమైతే.. ఆ కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేయడమే నిజమైతే.. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక వచ్చి 2 నెలలైనా సరే చంద్రబాబు ప్రభుత్వం ఆ కంపెనీపై కేసు పెట్టనే లేదు. కల్తీ చేస్తే 6 నెలల నుంచి 3 ఏళ్ల జైలు శిక్ష కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఆహార భద్రత చట్టం అవకాశం కలి్పస్తోంది. ఆ చట్టంలోని సెక్షన్ 15ఏ ప్రకారం.. ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడిన వారిపై, కల్తీ ఆహార పదార్థాలు సరఫరా చేసిన సంస్థపై భారీ జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కలి్పస్తోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేశారని నిరూపితమైతే సరఫరా సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ సంస్థపై కేసు నమోదు చేయనే లేదు. ఎందుకంటే కేసు నమోదు చేస్తే.. నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతుంది.నెయ్యి సరఫరా చేసిన సంస్థ తాము కల్తీ చేయలేదని ఘంటాపథంగా వాదిస్తోంది. తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని సవాల్ విసురుతోంది. దాంతో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. కానీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఆ సంస్థపై కేసు నమోదు చేయలేదన్నది అసలు లోగుట్టు. అయినా సరే చంద్రబాబు నిస్సిగ్గుగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. పవన్, లోకేశ్ తదితరులు నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు. -
దుష్ప్రచారంలో దిట్ట
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మతాన్ని, దేవుడిని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడంలో సీఎం చంద్రబాబు ఆయన భజన బృందం దిట్ట. తన ఆరోపణలకు సంబంధించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఆయన ఏనాడూ ఉన్నతస్థాయి విచారణకు ముందుకురాలేదు. ఈ విషయంలో ఆయనపై మొదట నుంచీ విమర్శలున్నాయి. అలాగే, చంద్రబాబు హయాంలోనే అనేక అపచారాలూ చోటుచేసుకున్నాయని భక్తులు గుర్తుచేస్తున్నారు. ఉదా.. » తాజాగా.. చంద్రబాబు పాలనలోనే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనెయ్యి అంశం వెలుగుచూసింది. కానీ, ఆయన సిగ్గూఎగ్గూ లేకుండా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి అంటగడుతూ వివాదానికి తెరలేపారు. » రెండేళ్ల క్రితం జగన్ సీఎంగా కొనసాగుతున్న సమయంలో టీడీపీ, ఆ పార్టీ శ్రేణులు తిరుమల కొండపై శిలువ అంటూ సామాజిక మాధ్యమాల్లో నానా రభస సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో టీటీడీ ఈ అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు బాధ్యులపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఆ దు్రష్పచారానికి తెరపడింది. » అలాగే, గత ఏడాది ఆగస్టులో కూడా తిరుమల కాలిబాటలో పులుల సంచారం వెలుగులోకి వస్తే భక్తుల భద్రతకోసం ప్రతి 250 మెట్లకు ఒక గార్డు చొప్పన 70 మందిని భక్తులకు కాపలా ఉంచేందుకు నిర్ణయించడంతో పాటు అత్యవసర సమయంలో ఉపయోగకరంగా ఉంటుందని భక్తులకు ఉచితంగా కర్రలను అందించాలని టీటీడీ సంకల్చిచింది. దీనినీ పచ్చ బ్యాచ్ వక్రీకరిస్తూ కర్రకు పది రూపాయలు రుసుం పెట్టి, టీటీడీ కర్రల వ్యాపారం చేసిందని పెద్దఎత్తున దు్రష్పచారం చేస్తే, అప్పట్లో టీడీపీయే దానిని ఖండించుకుంది. » ఇక అదే నెలలో తిరుపతి గోవిందస్వామి రాజస్వామి ఆలయ గోపురం అంశంలోనూ దు్రష్పచారమే చేశారు. » ఇలా తిరుమల ఆలయానికి మాత్రమే పరిమితం కాకుండా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించి ఇదే తరహా దు్రష్పచారాలకు పచ్చమూకలు తెగబడ్డాయి. » గత ఏడాది ఆగస్టులో కాణిపాకం ఆలయంలో పంచామృత అభిõÙకం టికెట్ ధర రూ.700 నుంచి రూ.5,000లకు పెంచకుండానే పెంచారంటూ దు్రష్పచారం చేశాయి.బాబు హయాంలోనే దుర్గగుడిలో క్షుద్ర పూజలు..ఇక పవిత్ర పూజా కార్యక్రమాల్లో బూట్లు వేసుకుని తరచూ పూజల్లో పాల్గొనే చంద్రబాబు గత కృష్ణా పుష్కరాల సమయంలో ఆయన విజయవాడలో దాదాపు 30 గుళ్లను నేలమట్టం చేశారు. ఆ విగ్రహాలను చెత్త ట్రాక్టర్లలో తరలించి భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే విజయవాడ దుర్గగుడిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. దీనికి సంబంధించి ఆలయ గర్భగుడిలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరించినట్లు వీడియోలు కూడా బయటకొచ్చాయి. » అంతేకాదు.. 1995–2004 మధ్య 1472 సంవత్సరం నాటి తిరుమల వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేసిన ఘటన కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే జరిగింది. -
లడ్డూ ప్రసాదం స్వచ్ఛం, శుద్ధం, పవిత్రం
సాక్షి, అమరావతి : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం స్వచ్ఛం..శుద్ధం అని ఆహార శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఏనాడూ తయారు చేయనేలేదని స్పష్టం చేశారు. భారత ఆహార భద్రత– ప్రమాణాల సాధికారిక సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఐ) అధ్యయనాన్ని ఉటంకిస్తూ శాస్త్రీయమైన ఆధారాలతో సహా నిగ్గు తేల్చారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆహార పరిశోధన రంగం శాస్త్రవేత్తలు రుచి శ్రీవాస్తవ, నేహా దీపక్ షాలు ఈ మేరకు సాధికారికంగా వెల్లడించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేనని తేల్చి చెప్పారు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే ఆహార పదార్థాలు విపరీతమైన దుర్వాసన వస్తుందని వారు స్పష్టం చేశారు. ఎటువంటి ప్రత్యామ్నాయ దినుసులు వాడినప్పటికీ ఆ దుర్వాసనను తొలగించలేమని చెప్పారు. అత్తరు, ఇతరత్రా సుగంధ ద్రవ్యాలు కుమ్మరించినా సరే ఆ దుర్వాసన పోదు. ఇక జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలు గుండ్రంగా ఉండలా ఉండవు. లడ్డూ బూందీ విడిపోతుంది. ఆ నెయ్యి లడ్డూ బూందీని కలిపి ఉంచ లేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదంపై అటువంటి ఆరోపణలుగానీ ఫిర్యాదులుగానీ రానే లేదు. ఎప్పటి మాదిరిగానే ఆ ఐదేళ్లలో కూడా రోజూ వేలాది మంది భక్తులు లక్షలాది లడ్డూలు భక్తితో తిన్నారు. ఆ అయిదేళ్లలో తిరుమల దర్శనం చేసుకున్న కోట్లాది మంది భక్తుల్లో ఒక్కరు కూడా లడ్డూ ప్రసాదంపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. దుర్వాసన వచ్చినట్టు ఆరోపించనే లేదు. అంతెందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కూడా పలుమార్లు తిరుమల వెళ్లారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తిన్నారు. ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడుతోపాటు బీజేపీ అగ్రనేతలు అందరూ తిరుమల లడ్డూ ప్రసాదం స్వీకరించిన వారే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తిరుమల వెళ్లారు. లడ్డూ ప్రసాదం తిన్నారు. కానీ వారిలో ఒక్కరు కూడా లడ్డూ ప్రసాదం నాణ్యత బాగోలేదని గానీ దుర్వాసన వస్తోందని గానీ ఆరోపించనే లేదన్నది అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం కుట్ర పూరితంగానే తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నది సుస్పష్టం. ఎలా కల్తీ జరిగిందో ఎన్డీడీబీ చెప్పలేదు నెయ్యి కల్తీ జరిగిందని మాత్రమే ఎన్డీడీబీ నివేదిక వెల్లడించగలదు. కానీ, జంతువుల కొవ్వు కలపడం వల్ల ఆ కల్తీ జరిగిందని నిరూపించే అవకాశమే లేదని ఆహార శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సోయాబీన్, పొద్దు తిరుగుడు పువ్వు, రేపీడ్స్, గోధుమ జెర్మ్, మొక్క జొన్న జెర్మ్, పత్తి విత్తనాలు, కొబ్బరి, పామ్ ఆయిల్ ద్వారా కూడా కల్తీ చేసే అవకాశాలున్నాయి.నెయ్యిలో కల్తీ చేయాలంటే వ్యాపారులు సాధారణంగా పాల్పడే అక్రమ విధానం ఏమిటంటే.. పామాయిల్, హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వును కలుపుతూ ఉంటారని ఆహార శాస్త్రవేత్తలు చెప్పారు. ఎందుకంటే అవి అయితేనే తక్కువ వ్యయంతో కల్తీ చేయవచ్చన్నారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి కల్తీ చేశారన్నది ఎన్డీడీబీ నివేదికలో స్పష్టం చేయనే లేదు. కానీ చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు జంతువుల కొవ్వు కలిపారని రాద్ధాంతం చేయడం రాజకీయ కుట్రేనన్నది సుస్పష్టం.జంతువుల కొవ్వు కలిసిందని నివేదికలో లేదుటీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక వెల్లడించ లేదు. ఆ నివేదిక కల్తీని సూచిస్తుందని తప్ప.. ఎటువంటి కల్తీనో చెప్ప లేదు. కల్తీ చేయాలనుకునే వ్యాపార సంస్థలు సాధారణంగా పామాయిల్ మరియు హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వు కలుపుతారు.అంతేగానీ జంతువుల కొవ్వును కలపరు. ఎందుకంటే జంతువుల కొవ్వు కలిపితే వ్యయం పెరుగుతుంది. వారికి లాభం ఉండదు. తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందేందుకే ఎవరైనా కల్తీ చేస్తారు. కానీ తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరు. – నేహా దీపక్ షా, ఆహార శాస్త్రవేత్తఆ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదుజంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలుగానీ ఇతర ఆహార పదార్థాల నుంచిగానీ విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఎటువంటి సువాసన ద్రవ్యం వేసినా సరే ఆ దుర్వాసన పోదు. దుర్వాసన వచ్చే లడ్డూలుగానీ ఆహార పదార్థాలు గానీ ఎవరూ తయారు చేయరు. తయారు చేసినా ఎవరూ స్వీకరించరు. తిరుమల లడ్డూ ప్రసాదంపై గత ఐదేళ్లలో అటువంటి ఫిర్యాదు రాలేదన్నది గుర్తుంచుకోవాలి. లడ్డూలో కల్తీ లేదని నేను కచ్చితంగా చెప్పగలను. – రుచి శ్రీవాస్తవ, ఆహార పరిశోధకురాలు -
నిజాల నిగ్గు తేల్చాలి
సాక్షి, అమరావతి : ‘వందల కోట్ల మందికి శ్రీవారు ఆరాధ్య దైవం. తిరుమల ప్రసాదానికి అత్యంత పవిత్రత ఉంది. అలాంటి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారన్న అనుమానాలు రేకెత్తించింది ముఖ్యమంత్రి చంద్రబాబే కాబట్టి.. వాటి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా ఆయనదే. అసలు కల్తీ నెయ్యిని వాడనప్పుడు.. అపచారానికి తావే లేదు. ఈ విషయంలో పూర్తి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన చంద్రబాబు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలపై దెబ్బకొట్టారు.దాన్ని సవరించాల్సిన బాధ్యతను విస్మరించి సంప్రోక్షణ అంటూ ఇంకా డ్రామాలు చేస్తున్నారు’ అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు దేవుణ్ని వాడుకోవడం దారుణం అన్నారు. ‘నిజానికి నెయ్యిని అలా కల్తీ చేయడం సాధ్యమా? ఎవరైనా ఆ పని చేస్తారా? ఒకవేళ చేస్తే దేశ ద్రోహులు మాత్రమే ఆ పని చేయాలి. టెర్రరిస్టులో లేక మత విద్వేషం ఉన్న వారో చేయాలి. ఒకవేళ నెయ్యిలో నాణ్యత లేకపోతే, దాన్ని లోపలికి కూడా పోనివ్వరు. అలాంటప్పుడు నాణ్యత లేని నెయ్యిని వాడే అవకాశమే లేదు. కానీ, చంద్రబాబు ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రధానికి, సీజేఐకి లేఖ రాస్తానని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారించాలని కోరారు. వాస్తవాలు తేల్చాలని, భక్తుల మనోభావాలు నిలబెట్టాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. చంద్రబాబు కుట్ర కోణం మూడు రోజులుగా జరుగుతున్న తతంగం చూస్తే, అసలు దాన్ని విపరీతంగా ప్రస్తావించింది, ప్రచారం చేసింది సీఎం చంద్రబాబేనని సజ్జల చెప్పారు. నెయ్యిలో కల్తీ కాదు.. ఏకంగా జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యి వాడుతున్నారని పచ్చిగా నింద మోపుతూ, చాలా నింపాదిగా మాట్లాడటం స్పష్టంగా కనిపించిందన్నారు. బాబు మాటలను బట్టి ఇదంతా కుట్ర అని స్పష్టమవుతోందన్నారు. ‘జూలై 23న నెయ్యి పరీక్ష రిపోర్ట్ వస్తే.. ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? ఆ రిపోర్ట్ అంత సీరియస్‌గా ఉంటే టీటీడీ ఈవో కానీ, సీఎం కానీ తక్షణ చర్యలకు ఎందుకు దిగలేదు? నెయ్యిలో ఏవో వెజిటబుల్ ఫ్యాట్ (వనస్పతి) గుర్తించామని, తగిన చర్యలు తీసుకుంటున్నామని తొలుత ఈవో చెప్పారు. ఇప్పుడు రెండు నెలల తర్వాత మాట మార్చి చెబుతున్నారు. అందుకే ఇది కుట్ర అని అనుమానాలు వస్తున్నాయి. అదుపులో లేని వ్యాధితో బాధ పడుతున్న వారు లేదా.. స్వార్థం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నా ఫరవాలేదనుకునే శాడిస్ట్‌లే ఇలాంటి పని చేస్తారు’ అని ధ్వజమెత్తారు. ‘ఏదైతే ఫీడ్ (ఆహారం) ఇస్తారో.. అంటే పామాయిల్ కేక్ వంటివి.. ఆ ఆవుల పాలలో అది కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు చంటి పిల్లల తల్లులు తీసుకునే ఆహారం వల్ల వారి పాలల్లో కూడా వాటి లక్షణాలు ఉంటాయి. సరిగ్గా.. ఇక్కడ కూడా ఆ పశువులకు ఇచ్చే దాణాలో ఉండే పదార్థ లక్షణాలు వాటి పాలలో కనిపిస్తాయి. ఇది సహజం. అంత మాత్రాన జంతువుల కొవ్వు ఉందని చెప్పడం దుర్మార్గం’ అన్నారు. ‘అమెజాన్‌లో కొట్టి చూడండి. నెయ్యి కేజీ బ్రాండ్‌ను బట్టి రూ.450 నుంచి రూ.550 వరకు ఉంటుంది. టీడీపీ హయాంలో కూడా నెయ్యి కిలో రూ.350కే సరఫరా చేశారు. మరి అప్పుడు నాణ్యత లేని, కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లా? నెయ్యిలో కల్తీ చేస్తే చెడు వాసన వస్తుంది. సొంత డెయిరీ ఉన్న చంద్రబాబుకు ఈ విషయాలు తెలీవా?’ అని సజ్జల మండిపడ్డారు. -
ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు
తిరుపతి సిటీ : టీటీడీ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో గతంలో కల్తీ ఎక్కువగా ఉందని ఎన్డీడీబీ తేల్చిందని, అందుకోసం ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పులు తీసుకొచ్చామని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ఆదివారం రాత్రి తిరుపతి పద్మావతి గెస్ట్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం స్వచ్ఛమైన ఆవు నెయ్యినే ప్రసాదంలో వినియోగిస్తున్నామని చెప్పారు. నందిని, ఆల్ఫా మిల్క్ వంటి పేరొందిన సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో రూ.475తో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న నెయ్యిని ఎన్డీడీబీ పరీక్షలు చేసి స్వచ్ఛమైనదిగా తేల్చిందన్నారు. క్రమం తప్పకుండా ఎన్ఏబీఎస్ అక్రిడిటేషన్ ల్యాబ్‌కు శ్యాంపిల్స్‌ను పంపించే ప్రక్రియను కొనసాగిస్తామన్నారు. మొదటి సారిగా ఆవు నెయ్యి స్వచ్ఛతపై పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం మైసూరు సీఎఫ్టీఆర్ఐలో ట్రైనింగ్ పొంది ల్యాబ్‌లో పని చేసిన 18 మందిని సెన్సరీ ప్యానెల్‌గా ఏర్పాటు చేశామన్నారు. వీరు నెయ్యి స్వచ్ఛతతోపాటు, రంగు, రుచి, వాసన కనుక్కునే విధానంలో నిపుణులని చెప్పారు. ఎన్డీడీబీ సంస్థ సహకారంతో డిసెంబర్‌లోపు రూ.75 లక్షల విలువగల నెయ్యి పరీక్షా పరికరాలు టీటీడీకి సమకూరుతాయని తెలిపారు. లడ్డూ పోటులో సంప్రోక్షణ పూర్తిఆలయంలోని అన్న ప్రసాదాలు, లడ్డూ పోటులలో సంప్రోక్షణ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశామని ఈవో చెప్పారు. భక్తులలో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే, వారి సంతోషం కోసం శాంతి హోమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్దజియ్యర్, ఆగమశాస్త్ర పండితుల సలహా మేరకు సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయంలోని బంగారు బావి వద్ద గల యాగ శాలల్లో మూడు హోమ గుండాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా, కల్తీ నెయ్యిపై మైసూరు టెస్టింగ్ సంస్థ రిపోర్ట్‌లను ఎందుకు బహిర్గతం చేయలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈవో స్పందించ లేదు. తాను ఏమీ మాట్లాడలేనని చేతులెత్తేశారు. 2014–19లో, 2019–24 మధ్య కాలంలో ప్రమాణాలు పాటించని ఎన్ని సంస్థలను బ్లాక్‌లో పెట్టారు.. ఎన్ని ట్యాంకర్లను వెనక్కి పంపారన్న ప్రశ్నకూ సమాధానం దాటవేశారు. చంద్రబాబు హయాంలో సైతం అతి తక్కువ ధరతో నెయ్యిని కొనుగోలు చేశారని.. ఆ సమయంలో నెయ్యి స్వచ్ఛంగానే ఉందా.. అన్న ప్రశ్నకు సైతం తన వద్ద సమాధానం లేదన్నట్టు వ్యవహరించారు. అన్ని విషయాలు సీఎం చంద్రబాబు ప్రెస్మీట్లో చెప్పారంటూ తప్పించుకున్నారు. కాగా, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను ఈవో చదవడం తప్పు మరేమీ చెప్పడం లేదన్న వ్యాఖ్యలు మీడియా ప్రతినిధుల నుంచి వినిపించాయి. -
తిరుమల లడ్డూపై మరో మారు చంద్రబాబు అబద్ధాలు
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా కమిట్మెంట్తో అబద్ధాలు ఆడడంలో దిట్ట.. చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా చెప్పడంలో నేర్పరి అయిన సీఎం చంద్రబాబు శనివారం మళ్లీ తిరుమల శ్రీవారి పవిత్రతకు అపచారం తలపెట్టారు. తన రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా తెగించే ఆయన తిరుమల లడ్డూ విషయంలో బ్రహ్మాండం బద్దలైపోయినట్లు భక్తుల మనోభావాల్ని, వారి విశ్వాసాలను కాలరాస్తున్నారు. ఎందుకంటే.. కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూ తయారైందని ఆరోపించిన ఆయన.. వాస్తవానికి అసలు ఆ నెయ్యితో లడ్డూయే తయారుకాలేదన్న విషయాన్ని.. కల్తీనెయ్యి కల్తీనెయ్యి అంటూ గుండెలు బాదుకుంటున్న ఆయన ఆ నెయ్యిని వాడలేదన్న విషయాన్నీ మరుగునపర్చి అనవసర రాద్ధాంతానికి తెరలేపి భక్తుల్లో విషబీజాలు నాటుతున్నారు. ఏడుకొండల వాడే తనతో ఈ లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమోనని వ్యాఖ్యానించే స్థితికి ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారిపోయారు. ఆ దేవుడే తన నోటినుంచి నిజాలు చెప్పించాడేమోనని, మనం నిమిత్తమాత్రులమని దేవుడే అన్నీ చేయిస్తాడని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. దేవాలయాల పవిత్రత, భక్తుల సెంటిమెంట్‌ను కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ.. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయని అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ పదేపదే అపచారాలకు పాల్పడుతున్నారు. పైగా ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకున్నారని, ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదని ఆయనన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు నేరాలు చేసి ఎదురుదాడి చేస్తున్నారన్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా బుకాయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రూ.320కి కిలో ఆవు నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నించారు. శ్రీవారికి నైవేద్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏమిటన్నారు. తప్పు చేసింది కాక డైవర్షన్ పాలిటిక్స్ అని సిగ్గులేకుండా చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం మారిన వెంటనే తిరుమల ప్రక్షాళన చేయాలని కొత్త ఈఓకు చెప్పానన్నారు.పండితులతో చర్చించి సంప్రోక్షణపై నిర్ణయం..ఇక టీటీడీ విషయంలో తర్వాత ఏంచేయాలనే దానిపై చర్చిస్తున్నామని.. జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చించి సంప్రోక్షణ ఎలా ఉండాలో నిర్ణయిస్తామన్నారు. తిరుమల సెట్‌ను ఇంట్లో వేసుకున్న వాడిని ఏమనాలని ప్రశ్నించారు. ఇక అమరావతితో రూ.250 కోట్లతో శ్రీవారి గుడి కడదామనుకుంటే దాన్ని కుదించారని, మళ్లీ ఇప్పుడు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యాతా పరీక్షలు, అవసరమైన సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరించారు. -
ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి అస్సలు వాడలేదు: శ్యామలరావు
అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, టీటీడీకి అపవిత్రం జరిగిపోయిందని చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా బోగస్ అని తేలిపోయింది. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు దుష్ప్రచారం వల్లే టీటీడీ పవిత్రత మంటగలుస్తోందని మరోసారి స్పష్టమైపోయింది. బాబు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో ఈ విషయం బట్టబయలైంది. శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్‌తో శ్యామలరావు మాట్లాడుతూ ‘‘తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన 10 ఆవునెయ్యి ట్యాంకర్లలో నాలుగింటిలో నాణ్యత తగ్గినట్లు టీటీడీ నిపుణులు నిర్ధారించారు. జులై 6న వచ్చిన రెండు ట్యాంకర్లలో, జులై 12న వచ్చిన మిగిలిన ట్యాంకర్లలోని శ్యాంపుల్స్ను సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్‌కు పంపించాం. ఆ నెయ్యిని 100శాతం ఉపయోగించలేదు.’’ అని శ్యామలరావు చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్ట్‌లో జంతుసంబంధమైన, వెజిటబుల్ ఫ్యాట్లకు సంబంధించిన కల్తీ జరిగినట్లు తేలడంతో ఆ నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టి ఏఆర్డైరీకి తిప్పి పంపించామని శ్యామలరావు చెప్పారు. అసమయంలో టీటీడీకి ఐదు ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని, అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలోనే నెయ్యి తక్కువ నాణ్యత ఉన్నట్లు తేలిందని ఆయన తెలిపారు. కల్తీ అయిన నెయ్యిని ప్రసాదాల తయారీకి అస్సలు వాడలేదంటూ శ్యామలరావు చెప్పినట్లు ది ప్రింట్లో వచ్చిన కథనం లడ్డూలలో కల్తీ ఎక్కడుంది? : ఐవైఆర్ కృష్ణారావు ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం తిరస్కరించిన కల్తీనెయ్యి గురించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆరోపణలు చేస్తుంటే ఇక తిరుపతి లడ్డూలలో కల్తీ ఎక్కడుంది? ’’ అని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. ఆయన ది ప్రింట్ ప్రతినిధితో మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు దన్నుగా మరేదైనా గట్టి ఆధారం లేకపోతే ఇది కచ్చితంగా చంద్రబాబుకు, టీడీపీకి బూమరాంగ్ వంటిదేనని వ్యాఖ్యానించారు. చర్యతీసుకోవడం మానేసి రాజకీయమా? ‘‘టీటీడీలో ఒక సిస్టమ్‌ను అనుసరిస్తాం. సాంకేతిక, ఆర్థిక అర్హతల ఆధారంగానే సరఫరాదారును ఎంపిక చేస్తారు. ఎంపికైన ఏజెన్సీ కల్తీ వంటి ఏదైనా తప్పు చేస్తే దానిని గుర్తించి చర్య తీసుకోవడం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత. అది మానేసి దీనిని రాజకీయంచేయడం ఎంత వరకు సబబు?’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని టీటీడీ అధికారి ఒకరు ది ప్రింట్ ప్రతినిధికి చెప్పారు. వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ! టీటీడీకి ఈ ఏడాది జూలై 6, జూలై 12వ తేదీల్లో ఓ సరఫరా సంస్థ రెండేసి ట్యాంకర్లు చొప్పున ఆవు నెయ్యిని సరఫరా చేసింది. టీటీడీ మార్కెటింగ్ అధికారి, సంస్థ ప్రతినిధి సమక్షంలో ట్యాంకర్ సీల్ తొలగించి నెయ్యిని కలియతిప్పి.. ఒక్కో ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్ల చొప్పున సేకరించి అదే రోజు తిరుమలలో టీటీడీ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్‌లో వేర్వేరుగా పరీక్షలు చేసిన ముగ్గురు టెక్నీషియన్లు టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యి నాణ్యత లేదని తేల్చుతూ జూలై 8, 14న నివేదిక ఇచ్చారు. దాంతో తిరుపతిలో టీటీడీ గోడౌన్ బయట నుంచే ఆ రెండు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ అధికారులు వెనక్కి పంపేశారు. కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డులో వినియోగించడం కాదు కదా కనీసం తిరుపతిలోని టీటీడీ గోడౌన్‌లోకి కూడా అనుమతించడం లేదన్నది దీనిద్వారా స్పష్టమవుతోంది. -
ఏఆర్ డెయిరీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు
సాక్షి, చెన్నై: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని దిండుగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో శనివారం సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. తిరుమలకు సరఫరా అయింది ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నెయ్యేనన్న సమాచారంతో దిండుగల్‌లోని ఆ ఉత్పత్తి కేంద్రంపై అందరి దృష్టి పడింది. దీంతో శుక్రవారం రాత్రి తమిళనాడు ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనిత ఆ పరిశ్రమలో తనిఖీలు చేసి, వ్యర్థ జలాలను పరిశీలనకు తీసుకెళ్లారు.అదే సమయంలో శనివారం సెంట్రల్ ఫుడ్ సేప్టీ అధికారి ఒకరితో పాటు మరి కొందరు సిబ్బంది ఆ పరిశ్రమలో సోదాలు చేశారు. ఏఆర్ డెయిరీకి చెందిన పాలు, నెయ్యి, పనీర్, వెన్న, పెరుగు, మజ్జిగ, స్వీట్లు తదితర ఉత్పత్తులను 2 గంటలకుపైగా పరిశోధించారు. వీటి శాంపిల్స్‌ను తీసుకెళ్లారు. అదే సమయంలో ఏఆర్ డెయిరీ కంపెనీ తరఫున క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు లెని, కన్నన్ మీడియా ముందుకు వచ్చారు. తమ ఉత్పత్తులలో కల్తీకి ఆస్కారం లేదని, ఎవ్వరైనా సరే ఏ సమయంలోనైనా ఉత్పత్తులను తనిఖీ చేసుకోవచ్చని సూచించారు.తిరుపతి దేవస్థానానికి నెయ్యి పంపించే ముందు పరిశీలించి, అందుకు సంబంధించిన సర్టీఫికెట్లను సిద్ధం చేస్తామని వివరించారు. జూన్, జూలై నెలల్లో పంపించామని, ఇప్పుడు అక్కడకు సరఫరా చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ సంస్థ పేరు బహిరంగంగా చెప్పనప్పటికీ, జరుగుతున్న పరిణామాలను చూసి వివరణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తమ ఉత్పత్తులు అన్ని చోట్ల ఉన్నాయని, ఏ సమయంలోనైనా సరే తనిఖీలు చేసుకోవచ్చునని సూచించారు. 16 వేల టన్నులను ఆ రెండు నెలలు నిరంతరాయంగా పంపిణీ చేశామని, ఇందుకు సంబంధించిన అన్ని రకాల తనిఖీ, పరిశీలన సర్టిఫికెట్లు తమ వద్ద ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. -
హెరిటేజ్ లాభాల కోసమా!
సాక్షి, అమరావతి: తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీపై చెలరేగిన వివాదంపై తృణమోల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే స్పందించారు. ఇది నిజమా.. లేక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణా.. అని ‘ఎక్స్’లో అనుమానం వ్యక్తం చేశారు. ‘తిరుపతి లడ్డూల కథ వాస్తవమా లేక చంద్రబాబు హెరిటేజ్ సంస్థ లాభాలను పెంచుకోవడానికి, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ సహాయంతో అల్లిన కట్టుకథా? జంతువుల కొవ్వు, పంది కొవ్వుతో తిరుపతి ప్రసాద లడ్డూలు చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ల్యాబ్ రిపోర్టు చూపించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆయన పార్టీ పేర్కొంది.ఇందులో ఆసక్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు, అతని భార్య నెయ్యి తయారు చేసే హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ నడుపుతున్నారు. లోక్‌సభ ఫలితాలప్పుడు బీజేపీ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోణలున్నాయి. అదే సమయంలో చంద్రబాబుకు చెందిన కంపెనీ షేర్లు గాలివాటంగా అమాంతం పెరిగిపోయి ఆయన కుటుంబానికి రూ.1,200 కోట్లు లాభాలు తెచి్చపెట్టాయి.ఇప్పుడు తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిపై ఆరోపణలు రావడం.. గుజరాత్ నుంచి వచ్చిన ‘ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్’ ఆధారంగా నెయ్యి, పాల సామ్రాజ్యాన్ని నియంత్రించే ఓ కుటుంబం ఆరోపణలు చేయడం యాదృచి్చకం’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు చంద్రబాబును ట్యాగ్ చేయడంతో పాటు హెరిటేజ్ సంస్థ ఉత్పత్తుల చిత్రాలను సైతం జత చేశారు. పోస్ట్ ప్రారంభంలో ‘ఇంపార్టెంట్’ అని మొదలుపెట్టారు. -
సంచలనంగా మార్చొద్దు
సాక్షి, హైదరాబాద్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న అంశాన్ని సంచలనాత్మకంగా మార్చొద్దని రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మాన్ని, హిందూ ధార్మిక విశ్వాసాలను దెబ్బతీసే కుట్రలు గతంలోనూ జరిగిన నేపథ్యంలో వాటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులను శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలతో భక్తుల నమ్మకం, విశ్వాసం సడలే ప్రమాదం ఉందని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంలో పార్టీలు, ధార్మిక సంస్థలు బాధ్యతతో వ్యవహరించి సంయమనం పాటించాలని ఓ ప్రకటనలో సూచించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిత్యం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు.. వారి మనోభావాలను పరిరక్షించేందుకు కృషి చేయాలని కిషన్ రెడ్డి కోరారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని పేర్కొన్నారు. హిందువులు ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం క్షమార్హం కాదన్నారు.కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన నేరస్తులకు తగిన శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దిశగా పోలీసు యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్తున్నాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి దురాగతానికి బాధ్యులైన వారందరినీ గుర్తించి తగిన శిక్ష పడేలా చేయాలని కోరారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలేవీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కిషన్‌రెడ్డి సూచించారు. -
న్యాయ విచారణ చేపట్టాలి
సాక్షి, విశాఖపట్నం: తిశ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై న్యాయ విచారణ చేపట్టాలని, అవసరమైతే సీబీఐకి అప్పగించాలని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ప్రజల మనోభావాలతో రాజకీయాలు చేయడం çసరి కాదని స్పష్టం చేశారు. విశాఖ లాసన్స్‌బే కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.చట్టాల్లో లొసుగులు ఆసరాగా చేసుకుని చట్టానికి అతీతంగా ప్రవర్తించినట్లు.. దేవుడితో అలాంటి రాజకీయాలు చేస్తే కచి్చతంగా ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా పత్రికలు, పారీ్టలు ఈ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. ప్రసాదాలకు వాడే పదార్థాల నాణ్యతను పరీక్షించిన తర్వాతే అనుమతిస్తారని, లేదంటే తిరస్కరించడం టీటీడీ ఆనవాయితీ అని గుర్తుచేశారు. అలా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 18 ట్యాంకర్లు, అంతకు ముందు చంద్రబాబు హయాంలో 14 ట్యాంకర్లను వెనక్కు పంపారని తెలిపారు. ఐవైఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా.. టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి అవకాశం లేదన్న మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాటలతో తాను ఏకీభవిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని.. కల్తీ జరిగినట్లు విచారణలో తేలితే నిందితులను శిక్షించాలన్నారు. లేని పక్షంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ 100 రోజుల పాలనలో ఏం చేశామో చెప్పలేక గత ప్రభుత్వంపై బురద చల్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.సూపర్ సిక్స్ హామీల అమలు సంగతి ఏంటి? కనీసం గతంలో అమలైన అమ్మఒడి, రైతుభరోసా లాంటి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినా ఇవ్వాలి కదా అని నిలదీశారు. ప్రసాదంపై ఈవో ఒకటి చెపుతుండగా, చంద్రబాబు మరొకటి మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. విజయవాడ వరదల్లో ప్రభుత్వ వైఫల్యం గురించి అడిగితే.. బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర చేశారని అబద్ధాలతో ఎదురు దాడి చేయడం శోచనీయమని అన్నారు. ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, పండుల రవీంద్ర, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర పాల్గొన్నారు. -
చంద్రబాబు ఆరోపణల్లో గుట్టు బట్టబయలు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ అయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన నిరాధార ఆరోపణల్లోని గుట్టును వైఎస్ జగన్ పూర్తిగా బట్టబయలు చేశారని వైఎస్సార్సీపీ పేర్కొంది. లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సేకరించడంలో ఉండే కఠిన, పారదర్శక విధానాలను విస్పష్టంగా వివరించారని తెలిపింది. నెయ్యి ఉపయోగం కోసం అంగీకరించే ముందు సమగ్ర నాణ్యత తనిఖీలు ఏ విధంగా చేస్తారో విపులంగా చెప్పారని, ఈ దృష్ట్యా పవిత్ర ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగే అవకాశం లేదని స్పష్టంగా తెలియజెప్పారని వివరించింది.తనిఖీ రిపోర్టులో పేర్కొన్న తేదీల్లోని కీలకమైన అసమానతలను ఎత్తిచూపుతూ.. ఎల్లో మీడియా ప్రసారం చేసిన తప్పుడు నివేదికలను ఎత్తిచూపారని చెప్పింది. ఈ మేరకు శనివారం ఆ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సమగ్ర అభివృద్ధికి, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడానికి గత ప్రభుత్వంలో తీసుకున్న చర్యల గురించి కూడా వైఎస్ జగన్ చక్కగా వివరించారని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాలు నిరంతరం మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగు పరుస్తాయని చెప్పింది.చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీస్తాయని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలో వైఫల్యాల నుండి దృష్టిని మరల్చడానికే బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు మతపరమైన, భావోద్వేగపరమైన సున్నితత్వాన్ని పణంగా పెట్టి రాజకీయ లబ్ధి పొందడం తప్ప మరే ఇతర ప్రయోజనానికి ఉపయోగపడవని జగన్ స్పష్టం చేశారంది. చంద్రబాబు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలపై న్యాయ వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా లేఖ రాస్తానని కూడా వైఎస్ జగన్ ప్రకటించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. -
దైవంతో జూదమా?
శ్రీ వేంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా హిందూ భక్తులు ఆరాధిస్తారు. వారి దృష్టిలో తిరుమల క్షేత్రం సాక్షాత్తూ కలియుగ వైకుంఠమే. ‘‘భావింప సకల సంపదరూప మదివో... పావనములకెల్ల పావనమయము’’ అంటూ ఆ శ్రీహరివాసాన్నిఅన్నమయ్య కాలం నుంచీ భజిస్తూనే ఉన్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవునిగా కోట్లాదిమంది చేత నిత్య పూజలందుకునే వేంకటనాథుని ఆలయ ప్రసాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ప్రతి పక్షంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆలయ ప్రతిష్ఠను, ఔన్నత్యాన్ని ఆయన పణంగా పెట్టారు.కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగా విజయవాడ వరదల పాలు కావడం, ‘సూపర్ సిక్స్’ పేరుతో చేసిన ఎన్నికల బాసలను ఒక్కటి కూడా అమలు చేయకపోవడం, కనీసం ఎప్పుడు చేస్తారనే షెడ్యూల్‌ను కూడా విడుదల చేయలేకపోవడం వంటి కారణాలు ఈ తాజా కుట్రకు నేపథ్యం. తమ కూటమి పరిపాలనకు వంద రోజులు పూర్తయిన సంద ర్భంగా ఏర్పాటు చేసుకున్న శాసనసభా పక్షాల ఉమ్మడి సమావేశంలో ఆ కుట్రను అమలు చేయడం ప్రారంభించారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి జంతువుల కొవ్వుతో తయారైందని, ఇది వైసీపీ పాలనలో జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.రాజకీయాల్లో ఇక ఇంతకంటే దిగజారుడు సాధ్యం కాదనుకున్న ప్రతిసారీ చంద్రబాబు షాక్ ఇస్తూనే ఉంటారు. ఏడుకొండలవాడి పవిత్ర ప్రసాదంపై అనుమాన పంకిలం చల్లడానికి ఆయన ఏడు పాతాళ లోకాలను దాటి కిందకు దిగజారారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద కోట్ల పైచిలుకు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు.లడ్డూ ప్రసాదం తయారీకి, అందులో వినియోగించే సరుకుల కొనుగోలుకు ఒక పటిష్ఠమైన వ్యవస్థ తిరుమలలో గత కొన్ని దశాబ్దాలుగా అమలవుతున్నది. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఈ వ్యవస్థలో మార్పు ఉండదు. తిరుమలలో గత వంద సంవత్సరాలుగా లడ్డూ ప్రసాదం అమల్లో ఉంది. మహంతుల అజమాయిషీలో నడిచే తిరుమల పాలనా వ్యవహారాలను తొంభయ్యేళ్ల కింద బ్రిటిష్ వాళ్లు స్వాధీనం చేసుకొని టీటీడీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంగా తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తున్నది. అందుకు అనుగుణంగానే లడ్డూ ప్రసాదానికీ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఈ డిమాండ్‌ను అందుకోవడానికి లడ్డూల తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచుతూ వస్తున్నారు.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి లడ్డూలు తయారుచేసే పోటు సామర్థ్యం రోజుకు 45 వేలు మాత్రమే. పోటు సామర్థ్యాన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ ఆయన హయాంలో ఆధునిక వసతులను సమకూర్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పోటును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆగమ సలహా మండలి సంప్రదింపులతో విస్తరించారు. మూడున్నర లక్షల లడ్డూల తయారీ సామర్థ్యం ఇప్పు డున్నది. అవసరమైతే ఆరు లక్షల వరకు తయారు చేసుకోవ డానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు కూడా చేశారు.తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా తిరుమల పవిత్రతను కాపాడటానికి లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతను పెంచడం కోసం ల్యాబ్ వ్యవస్థను పటిష్ఠం చేయడం కూడా వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది. నవనీత సేవకోసం అవసరమైన స్వచ్ఛమైన వెన్నను తయారు చేయడానికి తిరుమలలోనే ఒక ప్రత్యేక గోశాల కూడా ఆయన హయాంలోనే ఏర్పాటయింది. ఏడుకొండలపై ఆధ్యాత్మిక శోభ వెల్లి విరియాలన్న సంకల్పంతో మఠాధిపతులతో కూడిన విద్వత్ సభ కూడా అప్పట్లో జరిగింది. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రయినప్పటికీ ఈ తరహా కార్యక్రమాలను అమలు చేసిన దాఖలాలు లేవు.ఇక చంద్రబాబు ఆరోపణలకు సంబంధించిన నెయ్యి కొనుగోలు వ్యవహారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ వ్యవహారం కొన్ని దశాబ్దాలుగా ఒకే పద్ధతిలో జరుగుతున్నది. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉండేవారిలో కొందరితో కలిసి కొనుగోలుకు సంబంధించిన సబ్–కమిటీ ఉంటుంది. ఆరు నెలలకోసారి ఆన్లైన్లో టెండర్లు పిలిచి ఎల్–వన్‌గా నిలిచిన వారిని ఎంపిక చేస్తారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు ఉన్న ప్లాంట్‌ను పరిశీలించి, అందులో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలను ఈ సబ్‌కమిటీ బేరీజు వేసుకుంటుంది. అనంతరం కాంట్రాక్టుకు సంబంధించిన అభ్యంతరాలు గానీ, సూచనలు గానీ వుంటే సబ్‌కమిటీ బోర్డుకు నివేదిస్తుంది.టెండర్ ఖరారు చేయడానికీ లేదా రద్దు చేయడానికీ కూడా సబ్ కమిటీకి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేబినేట్లో ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి, కేంద ప్రభుత్వానికి సన్నిహితుడైన వైద్యనాథన్ కృష్ణమూర్తి కూడా ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.నెయ్యి సరఫరా దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రతి ట్యాంక ర్తో పాటు నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని కూడా వెంట తెచ్చు కోవాలి. ఎన్ఏబీఎల్ గుర్తించిన ల్యాబుల్లో ఈ ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకోవచ్చు. ట్యాంకర్ తిరుపతికి చేరుకున్న అనంతరం అక్కడ వున్న మార్కెటింగ్ కార్యాలయంలో మూడు శాంపిళ్లను తీసి వేరువేరుగా పరిశీలిస్తారు. ఈ మూడు శాంపిళ్ల పరీక్షలోనూ నాణ్యత నిర్ధారణ అయితేనే ట్యాంకర్ తిరుమలకు చేరుకుంటుంది. లేకుంటే వచ్చిన దారిన వెనక్కు వెళ్తుంది. పరీక్షలో విఫలమై ట్యాంకర్లు వెనక్కు వెళ్లడం ఈ ఇరవై ఏళ్లలో వందలసార్లు జరిగినట్టు సమాచారం. అదేవిధంగా చంద్రబాబు ఆరోపించిన ఏఆర్ డెయిరీ వారి కంటెయినర్ కూడా వెనక్కు వెళ్లింది. అది కొండెక్కిందీ లేదు. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడిందీ లేదు. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు ఆరగించిందీ లేదు. తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థ కల్తీ సరుకులను ప్రసా దాల్లోకి అనుమతించదు.తిరస్కరించిన ఈ ట్యాంకర్‌లోని శాంపిల్‌ను తీసుకున్నది జూలై 12వ తేదీన! అప్పటికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆ శాంపిల్‌ను జూలై 17న గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్‌కు పంపించారు. 23న ఆ ల్యాబ్ రిపోర్టు పంపించింది. టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిట బుల్ ఫ్యాట్స్ కలిశాయని నివేదిక ఆధారంగా చెప్పారు. విశ్వస నీయ సమాచారం మేరకు ఎన్డీడీబీతో పాటే మైసూర్‌లోని మరో కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌కు కూడా ఈ శాంపిల్స్ పంపించారట. వారి రిపోర్టు గురించి మాత్రం ఎటువంటి సమాచా రాన్ని టీటీడీ ఇవ్వడం లేదు.ఈ వ్యవహారం పూర్తయి రెండు నెలలు గడిచాయి. కూటమి సర్కార్‌కు వందరోజులు నిండిన నేపథ్యంలో జరిగిన రాజకీయ సమావేశంలో చంద్రబాబు ఎన్డీడీబీ నివేదికను విడుదల చేశారు. జంతువుల ఫ్యాట్ కలిసిందనే ఆరోపణ అక్కడే చేశారు. టీటీడీ విడుదల చేయవలసిన నివేదికను పొలిటికల్ మీటింగ్‌లో విడుదల చేయడంపై పలు సందేహాలు ఏర్పడుతున్నాయి. అంతకుముందు వెజిటబుల్ ఫ్యాట్స్ కల్తీ జరిగిందని చెప్పిన ఈఓ ఈ సమావేశం తర్వాత స్క్రిప్టు మార్చి చంద్రబాబు ప్రసంగాన్ని అనుసరించారు.స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే తిరుమల ప్రసాదానికి అపవిత్రతను ఆపాదిస్తూ మాట్లాడడంతో ఇది జాతీయ స్థాయిలో పెద్ద సమస్యగా మారిపోయింది. తిరుమలకు ఉన్న విశిష్టత అటువంటిది. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసి, తద్వారా రాష్ట్ర ఇమేజ్‌కు మసిపూసి చంద్రబాబు ఏం సాధించదలుచుకున్నారు? కల్తీ సరుకును కనిపెట్టి వెనక్కు తిప్పి పంపే వ్యవస్థాగత బలం టీటీడీకి ఉన్నది. పలు సంద ర్భాల్లో అలా జరిగింది. మొన్నటి కల్తీ సరుకు వచ్చింది టీడీపీ సర్కార్ జమానాలోనే. దాన్ని గుర్తించిన టీటీడీ వ్యవస్థ వెనక్కు పంపింది కూడా! మరి ఏ విధంగా ఈ వ్యవహారాన్ని జగన్ సర్కార్ మెడకు చుట్టాలని చంద్రబాబు భావించారు? తనకు అనుకూలంగా అరవై నాలుగు నోళ్లు లేస్తాయన్న ధీమాతోనే కదా అభాండాలు వేయడం!తమ జీవితాలను వరదల్లో ముంచేసినందుకు మూడు లక్షల కుటుంబాలు విజయవాడలో బాబు సర్కారు మీద భగ్గుమంటున్నాయి. సర్కార్ బడుల్లో వసతులపై కోత పెట్టడం, సీబీఎస్ఈ సిలబస్ రద్దు చేయడం, ఇంగ్లీష్ మీడి యాన్ని నిరుత్సాహపరచడంతో రెండున్నర లక్షల మంది విద్యార్థులు మళ్లీ ప్రైవేట్ బాట పట్టారు. కేంద్ర సర్కార్‌లో టీడీపీ భాగస్వామిగా ఉండి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ యత్నాలను అడ్డుకోవడం లేదని కార్మికులు మండి పడుతున్నారు.ఉద్యోగాల కల్పన ఊసేలేదు, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. వంచనకు గురయ్యామని మహిళలు మథనపడుతున్నారు. సర్కార్ మేనిఫెస్టోలపై సోషల్ మీడి యాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వీడియోల నిండా వెట కారం ప్రవహిస్తున్నది.వంద రోజుల్లోనే విశ్వరూపం దాల్చిన వ్యతిరేకతను దారి మళ్లించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండవచ్చు. కానీ ఆ దారి మళ్లింపు ఇలా ఉండకూడదు. నిస్సందేహంగా బాబు చేసింది మహాపచారం. ఆయన చేసిన పనివల్ల తిరుమల ప్రతిష్ఠకు జాతీయ స్థాయిలో భంగం వాటిల్లింది. కూటమి సర్కార్ అందజేసిన సమాచారాన్నే కళ్లకద్దుకొని జాతీయ మీడియా గుడ్డిగా వ్యవహరిస్తున్నది. ఈ మీడియా ప్రచారం వల్ల జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్ఠే దెబ్బతింటుందని చంద్రబాబు భావిస్తుండవచ్చు. కానీ చంద్రబాబు జమానాలోనే కల్తీ సరుకు వచ్చిన విషయం నేడు కాకపోతే రేపైనా జాతీయ మీడియాకు తెలుస్తుంది. అక్కడ అమలవుతున్న కట్టుదిట్టమైన వ్యవస్థపై అవగాహన కలుగుతుంది. కానీ, తిరుమల పవిత్రతకు చంద్రబాబు వల్ల తగిలిన గాయం ఎప్పుడు మానాలి? రాజకీయ జూదం కోసం పుణ్యక్షేత్రాలను పణంగా పెట్టేవారికి ఆ ఏడు కొండలవాడే బుద్ధి చెప్పాలి. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చంద్రబాబుకు దేవుడే బుద్ధి చెబుతాడు: సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షాత్తు దేవుడిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఆయన శనివారం మందసలోని వాసుదేవా పెరుమాళ్ళ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు త్వరలోనే బుద్ధి చెప్పాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుని ప్రతిష్టను బజారుకు ఈడ్చే విధంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుపతి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు తప్పుగా మాట్లాడడం సమాజసం కాదు. ప్రతి పదార్థానికి పరీక్షలు చేసిన తర్వాతే టీటీడీ ప్రసాదంలో వాటిని వినియోగిస్తారు. ఇదే విషయాన్ని టీటీడీ ఈవో సైతం చెప్పారు’’ అని అన్నారు.ఇది కూడా చదవండి: శ్రీవారి లడ్డూపై వివాదం.. బాబు పక్కా స్కెచ్‌తోనే.. -
NDDB పరీక్ష నివేదికను వక్రీకరించబోయి అడ్డంగా దొరికిన టీడీపీ
-
ఆవు నెయ్యి.. టీడీపీకి గొయ్యి!
సాక్షి, అమరావతి : తిరుమల శ్రీవారి మహా ప్రసాదమైన లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిపై ఉన్మాద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించారంటూ దుర్మార్గపు ఆరోపణలు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా భక్తులు భగ్గుమన్నారు. వైఎస్సార్సీపీపై దుష్ఫ్రచారం చేసి, రాజకీయంగా లబ్ధి పొందడానికి తిరుమల శ్రీవారిని వాడుకుంటారా.. అంటూ హిందువులు నిప్పులు చెరిగారు. దాంతో తాను చేసిన ఆరోపణలను సమర్థించుకోవడానికి గురువారం ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) పరీక్ష నివేదికను వక్రీకరించి.. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిపారంటూ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ మూకలతో హోరెత్తించారు. కానీ.. ఆ పరీక్ష నివేదికను పరిశీలిస్తే.. ఆవు నెయ్యిని పరీక్షల కోసం 2024 జూలై 12న టీటీడీ పంపగా, అది తమకు జూలై 17న చేరిందని.. పరీక్షించి జూలై 23న నివేదిక ఇచ్చినట్లు అందులో స్పష్టంగా ఉంది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే. దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు ప్రభుత్వమే.అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. టీటీడీ ఈవోగా జె.శ్యామలరావును జూన్ 14న చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఎన్డీడీబీ పరీక్ష నివేదిక టీటీడీకి ఇచ్చిన రోజు అంటే.. జూలై 23న టీటీడీ ఈవో జె.శ్యామలరావు తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఆవు నెయ్యి ట్యాంకర్లో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్లు కల్తీ అయినట్లు ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఆవు నెయ్యి కల్తీ చేసి సరఫరా చేసిన సంస్థను బ్లాక్ లిస్ట్‌లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు ఇచ్చామని చెప్పారు. మరో ట్యాంకర్ ఆవు నెయ్యిలోనూ వెజిటబుల్ ఫ్యాట్ కలిపినట్లు తేలిందని, దాన్ని సరఫరా చేసిన సంస్థకు షోకాజ్ నోటీసు ఇచ్చామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. ఎన్డీడీబీ జూలై 23న రెండు ట్యాంకర్ల ఆవు నెయ్యిపై ఇచ్చిన పరీక్షల నివేదికలను విశ్లేషిస్తే.. అందులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు ఉందే తప్ప, ఎక్కడా జంతువుల కొవ్వు కలిసినట్లు లేదని టీడీపీ అధికార వర్గాలతోపాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తేల్చి చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించారంటూ చంద్రబాబు చేసిన ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టమవుతోంది.ఈ ప్రశ్నలకు బదులేది1 2024 జూలై 23న ఎన్డీడీబీ నివేదిక వచ్చిన వెంటనే టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్‌మీట్ పెట్టి ఆవు నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్లు కల్తీ అయ్యాయని చెప్పారా లేదా?2 దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీటింగ్‌లో ‘‘నెయ్యికి బదులు’’ జంతువుల కొవ్వు వాడుతున్నారు అని చెప్పడం దురుద్దేశం కాక మరేమిటి?. ఈ రెండు నెలల ఎందుకు మౌనంగా ఉన్నారు. బుధవారం సడెన్‌గా రాజకీయ వేదికపై ఎందుకు మాట్లాడారు.?3 టీటీడీ ఈవో మాట్లాడిన దానికి భిన్నంగా చంద్రబాబు అండ్ కో రాజకీయ విమర్శలు చేయడంలో ఆంతర్యం ఏమిటి.? 4 తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టును రిలీజ్ చేయడం వెనుక మీకున్న కుట్రపూరిత ఆలోచన బహిర్గతం అవుతోంది కదా? 5 నీ హయాంలోనే ఎన్డీడీబీకి టెస్ట్‌కు పంపించావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రిపోర్టు వచ్చింది. దానికి ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పాల్సిన నువ్వే.. చెప్పకుండా, పైగా అరుస్తావెందుకు?టెండర్ల ద్వారా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుగోలు శ్రీవారి నైవేద్యాలు, లడ్డూల తయారీ కోసం రోజుకు 15 టన్నుల నెయ్యిని టీటీడీ వినియోగిస్తోంది. ఈ నెయ్యిని ఈ – ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తుంది. తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థలకు ఆవు నెయ్యి సరఫరా బాధ్యతలను అప్పగిస్తుంది. టెండర్లలో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యిని సరఫరా సంస్థలు ట్యాంకర్లలో టీటీడీకి సరఫరా చేయాలి. ప్రతి ట్యాంకర్ నెయ్యిని టీటీడీ అధికారులు తనిఖీ చేయిస్తారు. పరీక్షల్లో టెండర్లలో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యి ఉంటేనే తీసుకుంటారు. లేదంటే.. సరఫరా సంస్థకు వెనక్కు పంపుతారు. కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు బ్లాక్ లిస్ట్‌లో ఎందుకు పెట్టకూడదో వివరణ ఇవ్వాలంటూ సంబంధిత సరఫరా సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. టీటీడీ చరిత్రలో ఇప్పుడే కాదు.. ఎప్పుడూ జంతవుల కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని సరఫరా సంస్థలు సరఫరా చేసిన దాఖలాలు లేవని.. అప్పుడప్పుడు వెజిటబుల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని సరఫరా చేస్తే.. దానిని వెనక్కు పంపుతున్నామని.. నెయ్యి కొనుగోలులో కీలక భూమిక పోషిస్తున్న టీటీడీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.దొంగల్లా దొరికినా రుబాబే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీకీ ఆ సంస్థ సరఫరా చేసిన రెండు ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు మాత్రమే ఎన్డీడీబీ పరీక్ష నివేదిక ఇచ్చింది. జంతువుల కొవ్వు కలిసిన దాఖలాలే లేవని ఆ నివేదిక స్పష్టం చేయడం.. అప్పుడు అధికారంలో ఉన్నది తామే కావడంతో సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికపోయారు. అయినా సరే.. తాను చేసిన ఆరోపణలు నిజమని చాటిచెప్పేందుకు యథేచ్ఛగా గురువారం కూడా అబద్ధాలతో రుబాబు చేశారు. సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేశ్ మరో అడుగు ముందుకేసి అవాస్తవాలు వల్లె వేస్తూ.. హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ వైఎస్సార్సీపీపై రంకెలు వేయడం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారంటూ చంద్రబాబు, లోకేశ్‌పై శ్రీవారి భక్తులు, టీటీడీ అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.నాడు.. నేడు సరఫరా సంస్థలు ఒక్కటే» టీటీడీకి 2013 అక్టోబరు నుంచి 2019 మార్చి వరకు బరేలికి చెందిన ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 33 లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరా చేసింది. అప్పట్లో ఐదేళ్లు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.» 2016 మార్చి నుంచి ఆర్నెళ్లపాటు ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకే పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా బాధ్యతలను టీటీడీ అప్పగించింది. 2016 సెప్టెంబరులో నిర్వహించిన టెండర్లలోనూ మరో ఆర్నెళ్లపాటు నెయ్యి సరఫరా బాధ్యతలను టీటీడీ అదే సంస్థకు అప్పగించింది. అప్పట్లో అధికారంలో ఉంది చంద్రబాబు ప్రభుత్వమే. » 2017 ఏప్రిల్‌లో ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకే 8.35 లక్షల కేజీల ఆవు నెయ్యిని సరఫరా చేసే బాధ్యతలను టెండర్ల ద్వారా టీటీడీ అప్పగించింది. 2017 అక్టోబర్‌లో 8,58,216 కేజీలు, 2018 జనవరిలో 23.30 లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరా చేసే బాధ్యతలను ఇదే సంస్థకే అప్పగించింది. 2018 జూన్ 29.. 2018 అక్టోబర్ 10న నిర్వహించిన టెండర్లలోనూ ఇదే సంస్థకే నెయ్యి సరఫరా బాధ్యతలను టీటీడీ అప్పగించింది. అప్పుడంతా అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే.» వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు పలు సంస్థలకు టెండర్ల ద్వారా ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు టీటీడీ అప్పగించింది. ఈ ఏడాది జూలై 12న ఎన్డీడీబీకి టీటీడీ పంపిన ఆవు నెయ్యి శాంపుల్ ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ సరఫరా చేసిందే. » చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే.. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రీమియర్ ఆగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. జంతువుల కొవ్వు కలిసిన ఆవు నెయ్యినే టీటీడీకి సరఫరా చేసిందనుకోవాలని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ.. టీటీడీ చరిత్రలో ఎన్నడూ అలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని తేల్చి చెబుతున్నాయి. -
దుర్మార్గం.. మహాపచారం
సాక్షి, అమరావతి: ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు తిరుమల మహా ప్రసాదమైన లడ్డూపై చేసిన ఉన్మాద వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల భక్తులు విస్తుపోతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినే రీతిలో విస్మయకరమైన వ్యాఖ్యలు నిరాధారంగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జంతువుల నూనెలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారని ఒక హిందువుగా చంద్రబాబు నోటి వెంట అలాంటి మాటలు ఎలా వచ్చాయని నివ్వెరపోతున్నారు. అత్యంత సున్నితమైన అంశాన్ని కావాలని వివాదంగా మార్చి, రాజకీయంగా లబ్ధి పొందాలనే దుగ్ధకు తిరుమలను వాడుకోవడం దారుణం, దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ ఇంత దారుణంగా మాట్లాడరని, రాజకీయాల కోసం దేవదేవుడినీ వదలక పోవడం పెద్ద పాపమని చెబుతున్నారు. కొంత కాలంగా చంద్రబాబు మానసిక పరిస్థితి పలు సందేహాలకు తావిస్తోందంటున్నారు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల తేకపోగా, వచ్చిన సీట్లను కూడా వద్దని కాలదన్నడం.. వరదల్లో అమరావతి మునగడం ప్రత్యక్షంగా అందరి కళ్లకు కనిపిస్తున్నా, ఆ మాటంటే నోటికి తాళమేస్తానని హెచ్చరించడం.. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమవ్వడం.. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా తిరుమల ప్రసాదాన్ని వివాదం చేశారని స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏమాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని, ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదని మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రంగా మార్చి లబ్ధి పొందాలనుకుంటే సర్వనాశం అవుతారని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు నిప్పులు చెరిగారు. పరాకాష్టకు బాబు బురద రాజకీయాలు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం భగవంతుడ్ని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవాడ్ని భగవంతుడు క్షమించడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి దుష్టశిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కనుక ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడు. రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరుమీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి. దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే చేస్తున్నాడు. వాస్తవం ఏంటంటే, తిరుమలలో అన్న ప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే ఆయన బురద రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు అన్నీ ఇన్నీకావు. చివరకు ఏమీ దొరక్క పోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. – భూమన కరణాకర్‌రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ చంద్రబాబు పెద్ద పాపమే చేశాడుదివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బ తీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపించుకున్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? – వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ -
లడ్డు ఫర్ సేల్.. రూట్ మార్చిన టీటీడీ
-
లడ్డూ ప్రసాదం.. భక్తులకు టీటీడీ షాక్
-
భద్రాద్రి: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. భక్తుల కౌంటర్ నిరసన
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మరోసారి బూజు పట్టిన లడ్డూల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసిన కొందరు భక్తులకు షాక్ తగిలింది. లడ్డూలు వాసన వస్తుండడంతో సిబ్బందిని నిలదీశారు భక్తులు. బూజు పట్టిన లడ్డూలు ఎలా విక్రయిస్తారని కౌంటర్ సిబ్బందిని నిలదీశారు భక్తులు.ఈ క్రమంలో.. ‘ఇచ్చట బూజు పట్టిన ప్రసాదం లడ్డూలు ఇస్తారు’’ అని పేపర్ మీద రాసి లడ్డూ కౌంటర్‌కి అతికించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో లడ్డూలు మాయం కావడంపై తీవ్ర దుమారం రేగి.. చర్చ నడిచి దర్యాప్తు దాకా వెళ్లింది. తాజా ఘటనతో.. లడ్డూల నాణ్యత వ్యవహారంపై చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై సిబ్బంది స్పందించాల్సి ఉంది. -
యాదాద్రిలో లడ్డూ ప్రసాదం కోసం తోపులాట..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తులకు లడ్డూ ప్రసాదం సరిగ్గా అందక ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రసాద కౌంటర్ల వద్ద లడ్డూలు అయిపోవడంతో భక్తులు ఒక్కసారిగా ప్రసాద విక్రయశాలలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. సిబ్బంది తలుపులు మూసేయడంతో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపైన లడ్డూ తయారీ మెషీన్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పాతగుట్టలో లడ్డూ తయారు చేయిస్తున్నామని.. అక్కడి నుంచి మూడవ ఘాట్ రోడ్డు మీదుగా లడ్డూ ప్రసాదం తీసుకురావడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులు అధికంగా రావడం, భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్పారు. కాగా, యాదాద్రి కొండపై, ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. చాల మంది కాలినడకన కొండపైకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన వాహనాలను సరిగా పార్కింగ్ చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. యాదాద్రికి పోటెత్తిన భక్తులు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. 40వేల మందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి దర్మదర్శనా నికి 4గంటల సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. -
టీటీడీలో ‘క్లీన్ కుకింగ్’ లడ్డూ!
సాక్షి, అమరావతి: ‘క్లీన్ కుకింగ్’ విధానంలో తిరుమల లడ్డూ మహా ప్రసాదం తయారు చేయటానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందజేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం)కు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తాజాగా ఓ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2030 నాటికి 6.68 టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీవోఈ) ఇంధన ఆదాకు అవకాశం ఉందని, దేశ వ్యాప్తంగా బొగ్గు, విద్యుత్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో భవిష్యత్ విద్యుత్ అవసరాల కోసం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఆ లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. టీటీడీకి బీఈఈ సహకారం ► తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పవిత్ర లడ్డూ మహా ప్రసాదం తయారు చేయటానికి క్లీన్ కుకింగ్ విధానం ఉపయోగించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గించవచ్చు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని బీఈఈ అందిస్తుంది. ► టీటీడీ సహకారంతో ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను ఏపీఎస్ఈసీఎం పంపించాలి. ఈ విధానంలో ప్రసాదం తయారీకి కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే గ్యాస్‌కు బదులు ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఉపయోగిస్తారు. ► కొద్ది రోజుల క్రితం మేము తిరుమలలో పర్యటించాం. ఆ సందర్భంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ కుకింగ్, ఆస్పత్రులు, భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యల అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ జవహర్‌రెడ్డికి సూచించాం. ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల స్థానంలో విద్యుత్ ఆదా చేసే ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లను అమర్చాలని చెప్పాము. ఇందుకోసం ఇప్పటికే ఏపీఎస్ఈసీఎం టెండర్లు ఆహ్వానించింది. విద్యుత్ బిల్లులు ఆదా ► టీటీడీలో ఏపీఎస్ఈసీఎం ద్వారా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్‌ను బీఈఈ నిర్వహించింది. ఇక్కడ ఏటా 68 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా, 30% పునరుత్పాదక ఇంధనం, 70% సంప్రదాయ విద్యుత్ ఉంది. ► విద్యుత్ బిల్లుల కోసం టీటీడీ ఏటా రూ.40 కోట్లు వెచ్చిస్తోంది. ఇంధన సామర్థ్య చర్యల ద్వారా ఇందులో రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 213 నీటి పంపుసెట్లలో 118 ఇంధన సామర్థ్య పంపుసెట్లను అమర్చడం వల్ల ఏటా 4.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయవచ్చని అధ్యయనంలో తేలింది. ► టీటీడీలో ఇదివరకు రోజుకు 34 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తుండగా, ఇప్పుడు అది 44 లక్షల గ్యాలన్లకు చేరింది. ఈ దృష్ట్యా జల వనరుల సమర్థ నిర్వహణకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. పెట్టుబడుల సద్వినియోగం ► దేశంలో 2031 నాటికి రూ.10.02 లక్షల కోట్ల మేర ఇంధన సామర్థ్య పెట్టుబడులకు అవకాశముంది. ఏపీ ఇప్పటికే ఎనర్జీ ఎఫిషియెన్సీ రంగంలో దేశంలో ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. అందువల్ల ఇంధన సామర్థ్య పెట్టుబడులను ఆహ్వానించడంలోనూ క్రీయాశీలకంగా వ్యవహరించాలి. ► దీని వల్ల పరిశ్రమలు, రవాణా, విద్యుత్, భవన నిర్మాణం వంటి కీలక రంగాలలో ఇంధన వినియోగ సామర్థ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పనను మెరుగు పరచవచ్చు. ► కేంద్ర ప్రభుత్వం నేషనల్ కార్బన్ మార్కెట్ల(ఎన్సీఎం) అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై బీఈఈ ఒక నమూనా కార్యాచరణ తయారు చేసింది. దీనిపై ఏపీ తరుఫున అభిప్రాయాలు, సూచనలు తెలపాల్సిందిగా ఏపీఎస్‌ఈసీఎంకి సూచించాం. -
యాదాద్రి ప్రసాదానికి యంత్రాంగం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని సందర్శిం చే భక్తులందరికీ దేశంలోనే తొలిసారిగా ఆధునిక యంత్రాలతో మానవప్రమేయం లేకుండా తయారు చేసే లడ్డూ, పులిహోర ప్రసాదం అందనుంది. మార్చి 28న లక్ష్మీనరసింహసింహ స్వామి దర్శనమివ్వనున్న నేపథ్యంలో ప్రసాదం తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాల బిగింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రోజుకు 70వేలకు పైగా లడ్డూలు, రోజుకు నాలుగుసార్లు ఒకేసారి 1,000 కిలోల పులిహోర తయారు చేసేలా రూ.13.08 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక యంత్రాలను బిగించారు.పులిహోరను ప్యాకింగ్ చేసేందుకు సుమారు రూ.5కోట్ల వ్యయంతో ఆధునిక యంత్రాలను తీసుకువచ్చారు. ప్రత్యేక మెషీన్లు..: ప్రసాదం కాంప్లెక్స్‌లో మూడు అంతస్తుల్లో మిషన్ల ద్వారానే ప్రసాదం తయారు చేసి లిఫ్టులు, మెషీన్ ద్వారానే కౌంటర్ల దగ్గరకు తీసుకొచ్చే విధంగా పనులు పూర్తిచేస్తున్నారు. ప్రసాదం తీసుకువచ్చే ట్రేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా భారీ మెషీన్‌ను బిగించారు. అక్కడి నుంచి ప్రసాదాన్ని ట్రేలలో వేసుకుని కౌంటర్ల వద్దకు తీసుకెళ్లేందుకు ఎస్కలేటర్ మాదిరిగా 12 మోటర్లతో బెల్ట్‌ను బిగించారు. ట్రేలలో ప్రసాదం అయిపోయిన వెంటనే తిరిగి ట్రేలను శుభ్రం చేసే మెషీన్ వద్దకు తీసుకువెళ్లేందుకు బెల్ట్‌ను బిగించారు. భక్తులకు ప్రసాదం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా 13 కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. యాదాద్రీశుడి ప్రసాదాన్ని అధికారులు హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులకు అప్పగించగా..గతేడాది సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ప్రసాదం నాణ్యత,రుచిని పరిశీలించారు. మంగళవారం మూడోసారి ట్రయల్ రన్ చేశారు. ప్రస్తుతం దేవస్థానానికి చెందిన ఉద్యోగులకు ప్రసాదం తయారీలో శిక్షణనిస్తున్నారు. -
Yadagirigutta: భారీగా పెరిగిన యాదాద్రి రాబడి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కైంకర్యాల ధరలు పెంచిన తొలి రోజైన శుక్రవారం వివిధ పూజలతో నిత్య రాబడి రూ.18,93,248 సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టిక్కెట్ ధరలు పెరిగిన తొలి రోజు భక్తులు కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించారు. శాశ్వత పూజలతో రూ.9,12,120 లడ్డూ, పులిహోర, వడ వంటి ప్రసాదం విక్రయాలతో రూ.4,21,460 సువర్ణ పుష్పార్చనతో రూ.1,02,720తో పాటు ప్రధాన బుకింగ్‌తో రూ.1,37,198 దర్శనం రూ.100 టిక్కెట్‌తో రూ.40,000 కైంకర్యాలతో రూ.2,600 ప్రచార శాఖతో రూ.8,300 క్యారీ బ్యాగులతో రూ.7,700 శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.85,500 కల్యాణ కట్టతో రూ.18,800 వాహన పూజలతో రూ.10,800 టోల్ గేట్‌తో రూ.1,340 అన్నదాన విరాళంతో రూ.13,358 వేద ఆశీర్వచనంతో రూ.5,232 యాదరుషి నిలయంతో రూ.58,180 పాతగుట్ట ఆలయంతో రూ.30,920 గో పూజతో రూ.500 ఇతర పూజలతో రూ.35,720 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. (చదవండి: ‘యాదాద్రి’లో కైంకర్యాల ధరలు పెంపు) -
Vemulawada: కక్కుర్తిపడ్డ ఉద్యోగి.. భోళా శంకరునికే బురిడీ..
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): ఆలయ ఉద్యోగులే భోళాశంకరున్ని బురిడీ కొట్టిస్తున్నారు. ప్రతీనెలా వేతనాలు పొందుతూనే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలోని ప్రసాదాల విక్రయ కేంద్రంలో రికార్డు అసిస్టెంట్ వెంకటేశ్ ఖాళీ డబ్బాల ఆధారంగా రికార్డులు తారుమారు చేశారు. సుమారు 2.25లక్షల లడ్డూలు విక్రయించి రూ.45లక్షలు సొంతానికి వినియోగించారు. ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి రావడంతో ఆలయ అధికారులు రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు. బాధ్యుడిపై బదిలీ వేటు వేశారు. మార్చి 13 నుంచి లడ్డూల విక్రయాలు.. మహాశివరాత్రి సందర్భంగా లడ్డూప్రసాదాల క్రయ, విక్రయాల బాధ్యతను తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు అప్పగించారు. మార్చి 12 వరకు లడ్డూ ప్రసాదాలు విక్రయించి, మిగిలిన లడ్డూల నిల్వలను ఆలయ అధికారులకు అప్పగించారు. మార్చి 13 నుంచి రికార్డు అసిస్టెంట్ వెంకటేశ్ ప్రణాళిక ప్రకారం లడ్డూలు విక్రయించిన రికార్డుల్లో చూపిస్తూ వచ్చారు. స్టాక్ దాచిపెట్టారు. ఆ తర్వాత 2.25 లక్షల లడ్డూలు విక్రయించారు. లడ్డూలను భద్రపర్చే ఖాళీ డబ్బాలను ఆధారంగా చేసుకుని రూ.45లక్షలు కాజేశారు. కక్కుర్తిపడ్డ ఉద్యోగి.. కక్కించిన అధికారులు రాజన్న దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేయడం భక్తుల ఆనవాయితీ. ఈక్రమంలో ఒక్కో లడ్డూ రూ.20 చొప్పున కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. అయితే, కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈనెల18 – 22వ తేదీ వరకు ఆలయం మూసివేశారు. ఈ క్రమంలో ప్రసాదాల తయారీ విభాగం సూపరింటెండెంట్ తిరుపతిరావు ప్రసాదాల క్రయ, విక్రయాల తీరు, రికార్డులు తనిఖీ చేశారు. రికార్డుల ఆధారంగా డబ్బాలు పరిశీలించగా ఖాళీగా కనిపించాయి. లడ్డూలు ఏమయ్యాయని వెంకటేశ్‌ను ప్రశ్నించి విచారణ చేపట్టారు. దీంతో 2.25 లక్షల లడ్డూలు విక్రయించినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన సొమ్మును సొంతానికి వినియోగించినట్లు తెలిసిపోయింది. దీంతో బాధ్యుడి నుంచి రూ.45లక్షలు స్వాధీనం చేసుకుని రాజన్న ఖాతాకు జమ చేయించారు. -
బాబు బాటలోనే అచ్చెన్న.. నీకు తగునా?
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఎవరి మనోభావాలు పట్టవు. ఒక్క ‘రాజగురువు’ వద్ద తప్ప.. మరెక్కడా పాదరక్షలు విడవరన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారు. సోమవారం తిరుపతి కపిలతీర్థం వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన తీరే ఇందుకు నిదర్శనం. ఈ వేడుకల్లో శ్రీవారి లడ్డూను, వడలను కింద పెట్టి.. వాటి చుట్టూ అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు బూటు కాళ్లతో తిరగడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను కించపరిచినట్లుగా టీడీపీ నేతలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలైన పెద్ద లడ్డు, వడలు భక్తులకు అత్యంత పవిత్రమైనవి. అలాంటి ప్రసాదాన్ని అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు అవమానపర్చిన ఘటన భక్తులను కలచివేస్తోంది. -
హైదరాబాద్‌లో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం
-
కరోనా: శ్రీవారి ప్రసాదాల తయారీ కుదింపు
సాక్షి, తిరుమల : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తిరుమలపైనా ప్రభావం చూపింది. భక్తుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు గత నెల 20వ తేదీ నుంచి టీటీడీ శ్రీవారి దర్శనాన్ని నిలిపేసింది. శ్రీవారికి మాత్రం వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతినిత్యమూ శా్రస్తోక్తంగా పూజాది కైంకర్యాలను అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. భక్తులను అనుమతించకపోవడంతో తాజాగా టీటీడీ అధికారులు ప్రసాదాల తయారీని కుదించేశారు. మూలవిరాట్టుకు నివేదించే ప్రసాదాలను యథావిధిగా తయారు చేస్తూ భక్తుల కోసం అదనంగా చేసే అన్నప్రసాదాలు, లడ్డూల తయారీని తగ్గించేసింది. గతంలో ప్రతి నిత్యమూ 60నుంచి 90 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. వారు కోరినన్ని ఇచ్చేందుకు టీటీడీ ప్రతినిత్యమూ 3 నుంచి 4లక్షల లడ్డూలను తయారు చేసి, విక్రయించేది. 18 రోజులుగా శ్రీవారి దర్శనాన్ని నిలిపేయడంతో దిట్టం ప్రకారం చేయాల్సిన మోతాదులో ప్రసాదాలను తయారు చేసి, స్వామి వారికి నివేదిస్తున్నారు. ప్రోక్తం మేరకు లడ్డూల తయారీ శ్రీవారికి ఉదయాత్పూర్వం నివేదించేందుకు దిట్టం ప్రకారం లడ్డూ, వడతో పాటు అన్నప్రసాదాలను ఆలయం లోపల ఉన్న వకుళమాత పోటులో తయారు చేసి స్వామి వారికి నివేదిస్తున్నారు. అటు తర్వాత రెండో గంట(మధ్యాహ్న ఆరాధన)లో కేవలం అన్నప్రసాదాలను తయారు చేసి మూలవిరాట్టుకు నివేదిస్తున్నారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఏకాంతంగా జరిగే కల్యాణోత్సవ సేవ సమయంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి నివేదించేందుకు ప్రోక్తం ప్రకారం 51పెద్ద లడ్డూలు, 51వడలను నివేదిస్తున్నారు. రాత్రి మూడో గంట సమయంలో (సాయంకాల ఆరాధన) లడ్డూ, వడతో పాటు అన్నప్రసాదాలు తయారు చేసి స్వామి వారికి నివేదిస్తున్నారు. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీవారికి మూడు పూటలా దిట్టం ప్రకారం ప్రసాదాలను తయారు చేసి, మూలవిరాట్టుకు నివేదిస్తున్నారు. స్వామి వారికి నివేదించిన ప్రసాదాలను నివేదన పూర్తయిన తర్వాత ఆలయం వెలుపలకు తరలించి తిరుమలలో విధుల్లో ఉన్న ఉద్యోగులకు పంపిణీ చేస్తున్నారు. -
భక్తులు లేక మిగిలిపోయిన 2 లక్షల లడ్డూలు
-
లడ్డూ ప్రసాదంలో పురుగుల ఘటనపై అధికారుల ఆరా
-
విదేశాలకూ దైవ ప్రసాదం
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో ఉంటున్న నాగేందర్ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి. ఏటా తన పుట్టిన రోజున స్వామిని అర్చించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలనేది ఆయన కోరిక. కానీ వివిధ కారణాల వల్ల ఆయనకు యాదాద్రి వచ్చి దైవ దర్శనం చేసుకునేందుకు కుదరట్లేదు. దీంతో పుట్టిన రోజున ఏదో వెలితి ఆయనను వెంటాడుతోంది. ఇలాంటి ఎందరో ప్రవాస తెలుగువారు వేదన పడుతున్నారు. ఇకపై భక్తుల చింత తీరనుంది. కొద్దిరోజుల్లోనే వారి ఇలవేల్పు దేవాలయం నుంచి ఆయా దేశాల్లోని భక్తు ల చెంతకు స్వామివారి ప్రసాదం, అక్షింతలు, పసుపు–కుంకుమ చేరనున్నాయి. ప్రత్యేక సందర్భాల్లో వారు కోరిన రోజున ఆలయంలో వారి పేరుతో పూ జాదికాలు నిర్వహించి ప్రసాదాన్ని వారికి పంపుతా రు. దేవాదాయశాఖ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతోంది. యాదగిరిగుట్టతో మొదలు.... విదేశాల్లోని భక్తులకు మానసిక సంతోషాన్ని కలిగించేలా వారి ఇష్టదైవం కొలువైన కోవెల నుంచి ప్రసాదం ఎందుకు వారికి చేరకూడదన్న ఉద్దేశంతో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో చర్చించి దీనికి అనుమతి తీసుకున్న ఆయన... విదేశాలకు స్వామి ప్రసాదం చేరవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఐటీ శాఖను కోరారు. దీనికి సంబంధించిన అనుమతులు తీసుకోవడం నుంచి విధివిధానాలను ఖరారు చేయడం వరకు ఆ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల నుంచి ప్రారంభించే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా తొలుత యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంతో మొదలుపెట్టాలని నిర్ణయించారు. వీలైతే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి కూడా ఈ సేవ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇటీవలే బెల్లం ప్రసాదాల వితరణ ప్రారంభించి భక్తుల అభిమానాన్ని చూరగొన్న దేవాదాయశాఖ అదే ఉత్సాహంతో దేవాలయాల్లో నిర్వహించే ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు తదితరాల బుకింగ్‌ను ఆన్లైన్ చేసింది. ఇప్పుడు విదేశీ భక్తులకు ప్రసాదం అందజేసే కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు. మరిన్ని దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు.... దేవాలయానికి వెళ్లేలోపే ఆర్జిత సేవలు, గదులను బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ సేవలకు ఇటీవలే దేవాదాయశాఖ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో యాదాద్రి భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆన్లైన్ సేవలను మొదలుపెట్టింది. తొలుత యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, బాసర, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ సేవలను మొదలుపెట్టారు. జూలై 6వ తేదీ నుంచి వరంగల్‌లోని భద్రకాళి దేవాలయం, ధర్మపురి, కొండగ ట్టు, కొమురవెల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, సికింద్రాబాద్ గణపతి దేవాలయాల్లో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దశలవారీగా మిగతా ప్ర ధాన ఆలయాల్లో మొదలుపెడతారు. విరాళాలను కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు. నిల్వ ఎలా? రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో పులిహోర, లడ్డూ ప్రధాన ప్రసాదంగా ఉంది. పులిహోరను ఒక రోజుకు మించి నిల్వ చేసే అవకాశం లేనందున దాన్ని విదేశాలకు పంపరు. ఇక లడ్డూ కూడా రెండు మూడు రోజులే నిల్వ ఉంటుంది. దాన్ని గాలి చొరబడని ప్యాకింగ్‌లో ఉంచితే ఒక రోజుకు మించి నిల్వ ఉండదు. లడ్డూ నిల్వ ఉండాలంటే తిరుమల ప్రసాదం తరహాలో తేమ లేకుండా ఉండాలి. దీంతో ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రసాదంగా స్వామి పసుపు–కుంకుమ, అక్షింతలు, ఇతర పూజా వస్తువులను పంపాలని నిర్ణయించారు. తేమ లేని లడ్డూ తయారీ, రవ్వతో చేసే పొడి ప్రసాదం తదితరాల విషయంలో తుది నిర్ణయం తీసుకొని దాన్ని అందించనున్నారు. -
‘మహా’ జాతరకు రాజన్న ప్రసాదం
వేములవాడ: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలువబడుతున్న ఎములాడ రాజన్నను దర్శించుకునే భక్తులు రాజన్న ప్రసాదాలపై అంతే మక్కువ చూపుతారు. మార్చి 3 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మూడు నుంచి నాలుగు లక్షల మంది వస్తారన్న అంచనాలో అధికార యంత్రాంగం ఉంది. భక్తులకు రాజన్న లడ్డూ ప్రసాదం అందించేందుకు ఆలయ ప్రసాదాల గోదాం ఇన్చార్జీలు రెండురోజులుగా పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం ఉన్న లేబర్‌కు తోడు మరింత మందిని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గోదాంలోని ఓ గది నిండా ట్రేలలో తయారు చేసిన లడ్డూలు సిద్ధం చేశారు. వచ్చేనెల 2 వరకు నాలుగు లక్షల లడ్డూలు సిద్ధం చేసి ఉంచుతామని, 3, 4, 5 తేదీల్లోనూ భక్తుల రద్దీని బట్టి మరో లక్ష లడ్డూల వరకు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత శివరాత్రి జాతరలో 3.23 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు తెలిపారు. జాతరకు ప్రత్యేక కౌంటర్లు రాజన్న లడ్డూ ప్రసాదం రుచిగా ఉండేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ అందుకు అనుగుణంగా దిక్టం (ప్రసాదాల్లో వాడే వస్తువుల కొలతలు) రూపొందించింది. దీని ప్రకారం స్వచ్ఛమైన నెయ్యి, నాణ్యమైన శనగపప్పు, కాజు, మిష్రి, కిస్మిస్, బాదాం, యాలకులతో పాటు సుగంధ ద్రవ్యాలను సైతం ఇందులో పొందుపరుస్తుండటంతో రాజన్న లడ్డూ తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. మార్కెట్లో చక్కెర ధర అధికంగా ఉన్నా భక్తులకు తక్కువ ధరకే లడ్డూ ప్రసాదం అందించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర దేవాదాయశాఖ రూ.15కు ఒక లడ్డూ చొప్పున విక్రయించాలని ఆదేశించింది. ఆమేరకు స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో ప్రసాదాల విక్రయాల కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదం అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మొన్నటి వరకు కొనసాగిన ఆంధ్రాబ్యాంకు భవనంలో ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో రాజన్నను దర్శించుకుని దక్షిణ ద్వారం గుండా బయటకు వెళ్లే భక్తులు నేరుగా ప్రసాదాల కౌంటర్‌కు చేరుకుని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. రాజన్న హుండీ ఆదాయం రూ. కోటిన్నర వేములవాడ రాజన్నను దర్శించుకునే భక్తులు హుండీలలో వేసిన కానుకలను ఆలయ అధికారులు బుధవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో లెక్కించారు. 22 రోజుల్లో రాజన్నకు రూ. 1,50,29,406 నగదు, 652 గ్రాముల బంగారం, 13 కిలోల 900 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. నాలుగేళ్లుగా వస్తున్న ఆదాయం ఇలా.. 2014–15 రూ. 7.30 కోట్లు 2015–16 రూ. 8.89 కోట్లు 2016–17 రూ. 8.38 కోట్లు 2017–18 (అక్టోబర్ వరకు) రూ. 5.63 కోట్లు 2017–18 నవంబర్‌లో –రూ. 90 లక్షలు 2017–18 డిసెంబర్లో– రూ. 1.35 కోట్లు 2018–19 జనవరిలో – రూ.1.40 కోట్లు మూడులక్షల లడ్డూలు సిద్ధం చేస్తాం జాతరకు వచ్చే భక్తులకు రాజన్న ప్రసాదం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఈసారి 5 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచాలని ఈవో ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు సిబ్బందిని రప్పించి లడ్డూ ప్రసాదాలు త యారు చేయిస్తున్నాం. ఇప్పటికే 2 లక్షల లడ్డులు సిద్ధం చేశాం. జాతర సందర్భంగా మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న భక్తులకు ప్రసాదాలను అందుబాటులో ఉంచేం దుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. – వరి నర్సయ్య, గోదాం ఇన్చార్జి -
దొరికితే మహా ప్రసాదం
తిరుమలలో ప్రసాదమంటే భక్తులందరికీ ఎంతో ప్రీతి. దీనిని అపురూపంగా భావిస్తారు. దర్శనానంతరం ఇచ్చే లడ్డూ లేదా అన్నప్రసాదం స్వీకరించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాంటి ప్రసాదం రానురాను చిక్కిపోతోంది. కౌంటర్లో దానిని అందుకోవడమే మహా ప్రసాదంగా భావించే పరిస్థితి వచ్చింది. అన్నప్రసాదాల తయారీ నానాటికీ తగ్గించివేయడమే ఇందుకు కారణం. సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి లడ్డూతో పాటు మరెన్నో రకాల అన్నప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. లడ్డూలు ఎంత రుచిగా ఉంటాయో... స్వామికి సమర్పించే అన్న ప్రసాదాలు కూడా అంతే రుచిగా ఉంటాయి. అటువంటి అన్న ప్రసాదాలు ఇటీవల కాలంలో దొరకడమే అరుదైపోతోంది. రకరకాల సాకులతో ప్రసాదాల తయారీని టీటీడీ అంతకంతకూ తగ్గించివేస్తోంది. దీంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. శ్రీవారికి లడ్డూ మాత్రమే కాదు ఎన్నో రకాల అన్నప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. స్వామికి పెట్టే చక్కెర పొంగలి, దద్దోజనం, సీరా, కదంబం, పులిహోర, మలిహోర, పాయసం, పోలీ, సుగీ, జిలేబీ ఇవన్నీ అంతకు మించి రుచిగా ఉంటాయి. నెయ్యి కారుతూ... జీడిపప్పు తేలుతూ ఉండే శ్రీవారి అన్నప్రసాదం కొద్దిగానైనా రుచిచూసే భాగ్యం కలగాలని భక్తులు ఆశపడతారు. అటువంటి అన్న ప్రసాదాలు ప్రస్తుతం కరువయ్యాయి. ప్రసాదాల తయారీని అంతకంతకూ తగ్గించేస్తున్నారు. అత్యంత నిష్టతో ప్రసాదాల తయారీ.. సాధారణ రోజుల్లో రోజుకు 900 కిలోలు (200 గంగాళాలు), వారంతాల్లో రోజుకు 1,200 కిలోలు (250 గంగాళాలు) ప్రసాదాలు తయారు చేసేవారు. ఈ ప్రసాదాలను వకుళామాత పోటు, పాకశాల, అవ్వపోటుగా పిలిచే వంటశాలలోనే వెయ్యేళ్లుగా తయారుచేస్తున్నారు. తయారయ్యాక వీటిని శ్రీవారి గర్భాలయంలోకి తీసుకెళ్లి స్వామికి ఆరగింపుచేస్తారు. దర్శనానంతరం బయటకు వచ్చే భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ ప్రసాదాలను వైఖానస వైష్ణవులు అత్యంత నిష్టతో తయారు చేస్తారు. చిన్న లడ్డు రోజులో ఒకటి రెండు గంట లు సమయం మాత్రమే భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. మిగతా సమయంలో అన్న ప్రసాదాలనే పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు. ఉదయం నైవేద్యం అయిన తరువాత మధ్యాహ్నం 12 గంటల కల్లా అన్న ప్రసాదాలు ఖాళీ అవుతున్నాయి. మళ్లీ అన్న ప్రసాదం దొరకాలంటే అర్ధరాత్రి గంటదాకా ఆగాల్సిందే. ప్రసాదాల తయారీ సిబ్బందిని తగ్గించారా? అన్న ప్రసాదాల పోటులో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోందని టీటీడీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరుగా రిటైరవుతున్నారు. ఆ స్థానంలో ఇంకొకరిని నియమించడం లేదు. సీనియర్లుండగానే కొత్తవారిని నియమించి, వారికి శిక్షణ ఇప్పిస్తే ప్రసాదాల తయారీ నేర్చుకుంటారు. ఎంతో అనుభవం ఉంటే గానీ వీటిని తయారు చేయలేరు. అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో అన్న ప్రసాదాల పోటులో 120 నుంచి 150 మంది పనిచేసేవారు. ప్రస్తుతం 60 మంది మాత్రమే ఉన్నారు. వీరు కూడా ఒక్కో బ్యాచ్‌లో 30 మంది చొప్పున పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రసాదాలు తయారు చేయడమే కాకుండా... సిబ్బంది గంగాళాలను నైవేద్యం కోసం గర్భగుడిలోకి తరలించాలి. ఆరగింపు తరువాత ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసే స్థలానికి తీసుకెళ్లాలి. పనిభారం వల్ల ప్రసాదాల పరిమాణమే కాదు... తయారయ్యే రకాలు తగ్గిపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు. మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితుల ఆరోపణల్లో ప్రధానమైంది స్వామి వారిని పస్తులు పెడుతున్నారన్నది కూడా ఉంది. స్వామివారికి నివేదించే ప్రసాదాలు తగ్గిపోతున్నాయని ఆయన ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. లడ్డూలు ఇస్తున్నామంటూ టీటీడీ అ«ధికారుల నుంచి సమాధానం వినిపిస్తోంది. శ్రీవారి నైవేద్యాలు ఎందుకు తగ్గించారు? ఒకప్పుడు శ్రీవారికి అనేక రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించేవారు. ఈ ప్రసాదాల గంగాళాలతో ఆలయం నిండిపోయేది. ప్రస్తుతం 12 గంగాళాలలో మాత్రమే ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం కల్పించాలంటూ నైవేద్యాల పరిమాణాన్ని తగ్గించేశారనే ప్రచారం జరుగుతోంది. నైవేద్యం గంగాళాలతో లోనికి తీసుకెళ్లడం, బయటకు తరలించడానికి అరగంటకు పైగా పడుతోంది. ఆ సమయంలో మూడువేల మంది దర్శనం చేసుకునే అవకాశం కోల్పోతారని నైవేద్యం గంగాళాలను తగ్గించారని టీటీడీ అధికారులు చెబుతున్నారు. దర్శనం పేరుతో ఆలయ సంప్రదాయాలకు, కైంకర్యాలపై పరిమితులు విధించడం సంప్రదాయ విరుద్ధమని భక్తులంటున్నారు. భక్తులకు అన్నప్రసాదాలనుదూరం చేయకండి.. కొంతకాలంగా అన్న ప్రసాదాలు కరువయ్యా యి. అయినదానికి కానిదానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్న టీటీడీ అన్న ప్రసాదాల విషయంలో కక్కుర్తిని ప్రదర్శించడం తగదు. ఇది సంప్రదాయం కాదు. భక్తులకు అన్ని రకాల అన్న ప్రసాదాలు అందుబాటులోకి తీసుకురావాలి. – నవీన్‌కుమార్ రెడ్డి,శ్రీవారి భక్తుడు, తిరుపతి -
శ్రీవారి అదనపు లడ్డూ ధరలు పెంపు
-
శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్..
సాక్షి, తిరుమల : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. స్వామివారి ప్రసాదం ధరలను టీటీడీ భారీగా పెంచేసింది. 25 రూపాయలున్న సాధారణ లడ్డు ధర ... రూ.50 లకు, వంద వున్న కళ్యాణం లడ్డు ధర, రెండు వందల రూపాయలకు, అదనంగా కేటాయించే లడ్డులపై వంద శాతం ధరను టీటీడీ పెంచేసింది. అదే విధంగా 25 రూపాయలున్న వడ ధరను వందకు పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు సమాచారం లేకుండా.... పెంచిన ధరలను అధికారులు నేటి నుంచి అమలు చేసేశారు. -
శ్రీవారి లడ్డు ప్రసాదానికి కొత్త లైసెన్స్
-
శ్రీవారి లడ్డు ప్రసాదానికి కొత్త లైసెన్స్
సాక్షి, తిరుమల : తిరుమల వెంకన్న ప్రసాదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది లడ్డునే. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శ్రీవారి లడ్డు ప్రసాదానికి కొత్త లైసెన్స్ లభించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లైసెన్స్ పొందింది. గతంలో లైసెన్స్ అవసరం లేదని టీడీపీ అధికారులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి గతంలో లడ్డు నాణ్యతపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రసాదం రూపంలో తయారు చేస్తున్న లడ్డులో నాణ్యత లేదని, అక్కడ లడ్డూలు తయారు చేస్తున్న వారు ఎఫ్ఎస్ఎస్ఏఐ నియమాలను పాటించడం లేదని ఆరోపిస్తూ అతను లేఖలో ఫిర్యాదు చేశారు. దీనిపై టీటీడీ వివరణ ఇచ్చినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంతృప్తి చెందలేదు. తక్షణమే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఏ నిబంధనల ప్రకారం లడ్డు తయారు చేయాలంటూ టీటీడీతో పాటు ఏపీ సర్కార్‌కు సూచనలు చేసింది. దీంతో టీడీపీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలను పాటించడంతో లడ్డు ప్రసాదానికి లైసెన్స్ వచ్చింది. -
లడ్డూల దందా.. సొమ్ము గోవింద!
► వెంకన్న సన్నిధిలో మితిమీరిన లడ్డూల అక్రమ విక్రయాలు ► దళారులు, వైకుంఠం కౌంటర్ సిబ్బంది, ట్రే లిఫ్టర్లు మిలాఖత్ ► దళారులకు ఇంటి దొంగల సహకారం ► రోజూ రూ.5 నుండి రూ.10 లక్షల వరకు చేతులు మారుతున్న వైనం ► చోద్యం చూస్తున్న టీటీడీ విజిలెన్స్ విభాగం సాక్షి, తిరుమల: ఇంటి దొంగలు దళారులతో చేతులు కలపడంతో భక్తులు ప్రీతిపాత్రంగా స్వీకరించే శ్రీవారి లడ్డూల అక్రమ విక్రయాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లడ్డూ అక్రమ విక్రయాల ద్వారా రోజూ రూ.5 నుండి రూ.10 లక్షల వరకు చేతులు మారున్నట్టు ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతుంటే టీటీడీ విజిలెన్స్ విభాగం చోద్యం చూస్తుండ టం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం కోసం ఎంత ఖర్చు చేయడానికికైనా వెనుకంజ వేయరు. భక్తుల్లో ఉన్న ఈ భావనే అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. భక్తుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు మాఫియాలా రింగ్ అయ్యారు. ప్రధానంగా దళారులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో లడ్డూ టోకెన్లు ఇచ్చే సిబ్బంది, స్కానింగ్ చేసే సిబ్బంది, లడ్డూ కౌంటర్ సిబ్బంది, లడ్డూల ట్రే లిఫ్టర్లు.. ఇలా వరుసగా మిలాఖత్ అయ్యారు. అందరూ కలసికట్టుగా శ్రీవారి లడ్డూలను నల్లబజారులోకి తరలిస్తూ అక్రమార్జనలో పడ్డారు. అక్రమార్కుల చేతుల్లో లడ్డూ టోకెన్లు భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే ఒక లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి ప్రస్తుతం రూ.30 దాకా ఖర్చు అవుతోంది. ధర్మప్రచారం, సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కాలిబాటల్లో నడిచి వచ్చిన భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తోంది. సర్వదర్శనం భక్తులకు సబ్సిడీ ధరతో రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తున్నారు. అలాగే, రూ.25 చొప్పున రూ.50కి మరో రెండు లడ్డూలు ఇస్తుంటారు. అంటే కాలిబాటలో వచ్చిన భక్తులకు ఒకరికి ఉచిత లడ్డూతో కలిపి 5 లడ్డూ టోకెన్లు, సర్వదర్శనం భక్తులకు 4 లడ్డూల టోకెన్లు పొందే అవకాశం ఉంది. వీటిలో దాదాపు 20 శాతం వరకు నల్ల బజారుకు తరలిపోతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఇచ్చే టోకెన్లకు ఒక లడ్డూ ఉచితంగా పొందవచ్చు. అలాంటి టోకెన్లను కొందరు సిబ్బంది దొడ్డిదారిన దళారులకు అందజేస్తుంటారు. వాటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కొందరు స్కానింగ్ సిబ్బందితో ఒప్పుందం కుదుర్చుకుని పద్దతి ప్రకారం స్కానింగ్ చేస్తారు. అనంతరం వాటిని వెలుపల ట్రేలిఫ్టర్లు, దళారులకు అందజేస్తారు. కాలిబాట భక్తులకు రూ.20 రెండు లడ్డూల సబ్సిడీ టోకెన్లు కూడా అదే పద్దతి ప్రకారమే వెలుపుల దళారులకు అందజేస్తారు. వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. విజిలెన్స్ విభాగం ఏం చేస్తోంది? శ్రీవారి లడ్డూ అక్రమ విక్రయాల్లో సింహభాగం ఇంటిదొంగలదే. కౌంటర్ సిబ్బంది నుండి ట్రే లిఫ్టర్ల వరకు ఎక్కువ మంది వాటాదారులే. చాలా సందర్బాల్లో వీరే నేరుగా భక్తులకు లడ్డూలు విక్రయిస్తుంటారు. మరికొందరు దళారులతో ఈ అక్రమ దందా నడిపిస్తున్నారు. ఇలా ఆలయం సమీప ప్రాంతాల్లో సుమారు 300మందికిపైగా లడ్డూ దళారులు అక్రమ విక్రయాల్లో తలమునకలయ్యారు. ఈ దందాలో అక్రమార్కుల భరతం పట్టిన టీటీడీ విజిలెన్స్ విభాగంలో ఏమాత్రం స్పందన కనిపించడం లేదు. ఏడాది కాలంగా ఒక్క దళారీ.. ఒక్క ఇంటి దొంగైనైనా పట్టుకున్న దాఖలాలు లేవు. 2016లో 2.66 కోట్ల మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. అంటే సరాసరి రోజూ 72 వేల మంది తిరుమల సందర్శిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరి కోసం టీటీడీ రోజూ 3 లక్షల లడ్డూలు విక్రయిస్తోంది. ఇందులో సర్వదర్శనం భక్తులు ఒక్కొక్కరికి 4 (రూ.25 చొప్పున రెండు, రూ.10 చొప్పున 2), కాలిబాట భక్తులు ఒక్కొక్కరికి 5 (ఒకటి ఉచితం, రూ.25 చొప్పున రెండు, రూ.10 చొప్పున 2), రూ.300 టికెట్ల భక్తులు ఒక్కొక్కరికి 2, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల భక్తులకు ఒకరికి 2, వివిధ దర్శన టికెట్లతోపాటు అదనపు లడ్డూల కోసం నగదు చెల్లించిన వారికి 2 నుండి 6 లడ్డూలు పొందవచ్చు. -
లడ్డూల నష్టానికి బాధ్యులు ఎవరు?
ఎవరి తప్పులేదంటున్న ఈవో సూర్యకుమారి విచారణలు, చర్యలు లేనట్టేనా? సాక్షి, విజయవాడ: ‘ఎదురుగా ఈగల్ని పోనివ్వరు... వెనుక నుంచి ఏనుగులు పోతాయి’ అన్నట్టు ఉంది ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారుల పనితీరు. దేవస్థానానికి ఆదాయం పెంచడం కోసం భక్తుల దర్శనం టికెట్లు, పూజా టికెట్లు పెంచేసిన ఈవో సూర్యకుమారి వెనుకవైపు దేవస్థానానికి లక్షల్లో వస్తున్న నష్టాల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో రూ.100 ఉన్న దర్శనం టికెట్ ఇప్పుడు రూ.300, రూ.500కు పెంచేశారు. దీనివల్ల భక్తులు అమ్మవారికి దూరం అవుతున్నారే తప్ప దేవస్థానానికి పెద్దగా ఒరుగుతున్నది ఏమీ లేదు. అలాగే కుంకుమ పూజా టికెట్లు, చండీహోమం టికెట్ల రేట్లను పెంచేశారు. దీనివల్ల దేవస్థానానికి లక్షల్లో ఆదాయం వచ్చిందా అంటే..అదీ లేదు. ఇక వరలక్ష్మి వత్రం లాంటి పూజలకు టికెట్లు పెట్టి పేద, మధ్యతరగతి వర్గాల మహిళా భక్తుల్ని అమ్మవారి సన్నిధికి రాకుండా దూరం చేశారు. ఒక్క లడ్డూల్లోనే రూ.4లక్షలు నష్టం దుర్గగుడిలో సుమారు 41వేల లడ్డూలు పాడైపోవడంతో వాటిని విక్రయించకుండా పక్కన పెట్టేయాలని దేవస్థానం కార్యనిర్వహణధికారి సూర్యకుమారి నిర్ణయించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే లడ్డూలు పాడైపోయాయని, అందువల్ల దీనికి ఎవరూ బాధ్యులు కారని ఈవో తేల్చి చెప్పారు. దీనివల్ల దేవస్థానానికి ఏకంగా రూ.4లక్షల వరకు నష్టం వస్తోంది. ఒకవైపు భక్తుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తూ.. మరోకవైపు ఈ విధంగా వృథా చేయడాన్ని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏం జరిగిందంటే.... గతంలో భక్తుల దర్శనం టిక్కెట్లు పెంచాలంటే ఈవోలు ఆచితూచి నిర్ణయాలు తీసుకునేవారు. అయితే లడ్డూలు పాడైపోవడం వంటి సంఘటనలు జరిగితే మాత్రం కఠినంగా వుండేవారు. గతంలో 100 లడ్డూలు పాడైపోయాయని ఒక ఉద్యోగిని సస్పెండ్‌చేశారు. మరొక సందర్భంగా 900 లడ్డూలు పాడైపోయాయని విజిలెన్స్ అధికారులు సూమోటోగా విచారణ చేసి నివేదిక ఇచ్చారు. చివరకు ఈ లడ్డూలు పాడైందుకు కారణమైన సూపరింటెండెంట్, గుమస్తాలు ఆ తప్పుకు బాధ్యత వహిస్తూ నష్టాన్ని వారు జీతాల నుంచి చెల్లించారు. ఇప్పుడు ఏకంగా 41వేల లడ్డూలు పాడైపోతే కనీసం ఆవిభాగానికి చెందిన సిబ్బంది వివరణ తీసుకుంటామని కూడా ఈవో చెప్పకపోవడం విశేషం. దేవస్థానంలో ఒక ఏపీఓ స్థాయి అధికారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ప్రసాదాలను ఇబ్బడి ముబ్బడిగా తయారు చేయించడం వల్లనే పాడైపోయాయనే విమర్శలు వినవస్తున్నాయి. -
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో పురుగులు
-
మేడారం.. అందరికీ ఉచితమే..
రూ. 100 ప్రత్యేక దర్శనం రద్దు సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం అధికార యంత్రాంగం పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ.. దర్శనం, ఎత్తు బంగారం, క్యూలైన్ల ఏర్పాట్లను చేస్తున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మేడారం మహాజాతర జరుగనుంది. రెం డేళ్లకోసారి నిర్వహించే ఈ జాతరకు సగటున కోటి మంది భక్తులు వస్తారు. ప్రస్తుత జాతరకు 1.10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వన దేవతల దర్శనం గత జాతర వరకు రెండు రకాలుగా ఉండేవి. సామాన్య భక్తులకు ఉచిత దర్శనంతోపాటు రూ.100 టికెట్‌తో ప్రత్యేక దర్శనం ఉండేది. ప్రస్తుత జాతరలో ప్రత్యేకదర్శనం సేవలను రద్దు చేశారు. ఐదు క్యూ లైన్లలో మూడింటిని ఉచిత, రెండింటిని ప్రత్యేక దర్శనం కోసం కేటాయించేవారు. ఇప్పుడు అన్ని క్యూలైన్లు ఉచిత దర్శనం కోసమే వినియోగించనున్నారు. మరోవైపు భక్తులు మొక్కుల రూపంలో బెల్లం(బంగారం) సమర్పించే ప్రక్రియ కూడా ఈసారి పూర్తి ఉచితంగానే ఉండనుంది. గతంలో దేవతలకు బెల్లం మొక్కు సమర్పించేందుకు రూ.1,116 రుసుముతో టికెట్ ఉండేది. తాజా జాతరలో ఈ ప్రక్రియనూ ఉచితంగా మార్చారు. మేడారం జాతరలో గతంలో లడ్డూ ప్రసాదం ఉండేది. వచ్చే జాతరలో ఇదీ ఉండడం లేదు. ప్రసాదం కోసం భక్తుల తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉండడంతో లడ్డూ ప్రసాదంను అధికారులు తొలగించారు. సౌకర్యాలకే ప్రాధాన్యం మేడారం జాతర కోసం ప్రభుత్వపరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేక దర్శనం, బంగారం మొక్కులు, లడ్డూ ప్రసాదం టికెట్ల రూపంలో గతంలో కోటి రూపాయలకుపైగా ఆదాయం వచ్చేది. భక్తులకు సౌకర్యం కల్పించాలని ఈ రెండు ప్రక్రియలను పూర్తి ఉచితంగా మార్చాం. ఈసారి కోడె మొక్కులను కొంచెం దూరంలో పెడుతున్నాం. - తాళ్లూరి రమేశ్‌బాబు, మేడారం ఈవో -
హైదరాబాద్‌లో తిరుమల లడ్డూల విక్రయం
కాచిగూడ: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాలను హైదరాబాద్‌లో విక్రయించనున్నారు. ఈనెల 8వ తేదీన హిమాయత్‌నగర్ లిబర్టీ వద్ద ఉన్న టీటీడీ తిరునిలయంలో విక్రయిస్తామని హైదరాబాద్ శాఖ జేఈవో రమేష్ శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విక్రయించనున్నారు. ప్రతి నెల రెండో ఆదివారం లడ్డూల అమ్మకం ఉంటుందని ఆయన తెలిపారు. -
ఇదో రకం దోపిడీ!
-
ఇదో రకం దోపిడీ!
హైదరాబాద్: లంబోదరుడి లడ్డూకు ఎంత కష్టం వచ్చింది. ఖైరతాబాద్ భారీ గణనాథుడి చేతిలో ఠీవిగా కొలువై పూజలందుకున్న లడ్డూ నేడు దోపిడీదారుల చేతుల్లో పడి చిన్నాభిన్నమైంది. సర్వం దోచుకుతింటున్న లూటీదారులు చివరకు వినాయకుడి లడ్డూను వదల్లేదు. ఖైరతాబాద్ గణేశుడి లడ్డూను భక్తులకు పంపిణీ చేయలేక నిర్వాహకులు చేతులెత్తేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు ప్రసాదం కోసం ఎగబడడంతో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పాడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. చేసేదీ లేక లడ్డూ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. తయారీదారులకే దీన్ని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు. భారీ లడ్డూను లారీలో తాపేశ్వరంకు పంపారు. లడ్డూ ఉన్న లారీని హయత్ నగర్ లో ఆపేసి దోపిడీదారులు తమకు అలవాటైన విద్యను ప్రదర్శించారు. దేవుడి ప్రసాదాన్ని డబ్బులకు అమ్ముతూ సరికొత్త దోపిడీకి తెరతీశారు. వీరి లూటి వ్యవహారం మీడియా కంటపడడంతో దుండగులు జారుకున్నారు. -
ఖైరతాబాద్ లో భక్తులపై లాఠీచార్జి
-
ఖైరతాబాద్ లో భక్తులపై లాఠీచార్జి
హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు ఎగబడడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ప్రసాదం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నగరంలోని వారే కాకుండా జిల్లాల నుంచి భక్తులు రావడంతో శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ కిక్కిరిసింది. ఈ తెల్లావారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వారంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంత మంది తమకు తెలిసిన వారికే ప్రసాదం పంచిపెట్టారు. దీంతో వరుసలో నించున్న భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ప్రసాదం తమకు దక్కదేమోనన్న ఆందోళనతో భక్తులు ముందుకు తోసుకువచ్చారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి పరిస్థితి అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఒక భక్తుడి తలకు తీవ్ర గాయమయినట్టు తెలుస్తోంది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కొంతసేపు ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. సరైన ఏర్పాట్లు చేయని నిర్వాహకులపై భక్తులు మండిపడుతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రసాదం పంపిణీ పూర్తయింది. -
తిరుమలలో లడ్డూ సరఫరాలో అంతరాయం
తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తులకు లడ్డూ ప్రసాదం సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడింది. లడ్డూల కోసం కేటాయించిన టోకెన్లు స్కాన్ అవ్వకపోవడంతో అధికారులు భక్తులకు లడ్డూలను ఇవ్వకుండా ఆపేశారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని సర్వ దర్శనం భక్తులు అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు క్యూలైన్లో ఉన్న భక్తులందరికీ లడ్డూలు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో భక్తులు ఆందోళన విరమించారు. -
రామయ్య లడ్డూలో తలనీలాలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి లడ్డూ ప్రసాదంలో తలనీలాలు ప్రత్యక్షమయ్యాయి. శనివారం ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు లడ్డూ ప్రసాదంలో తలనీలాలు కనిపించడంతో అవాక్కయ్యారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన డి.అర్జున్‌తో పాటు మరో ఐదుగురు మిత్రృబందం శనివారం ఆలయానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ప్రసాదాల కౌంటర్ వద్ద లడ్డూలను కొనుగోలు చేశారు. అందులో తలనీలాలు కనిపించడంతో అర్జున్ అవాక్కయ్యాడు. మరో లడ్డూ కొనుగోలు చేయగా అందులోనూ తలనీలాలు దర్శనమిచ్చాయి. తీవ్ర ఆవేదనకు లోనైన అర్జున్ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోక పోవడంతో ‘సాక్షి’ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. స్వామివారి ప్రసాదాల విషయంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. -
యాదగిరిగుట్ట లడ్డు ప్రసాదంలో తరుగు
హైదరాబాద్: నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం లడ్డూ ప్రసాదం విక్రయ కేంద్రంలో శుక్రవారం తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టారు. లడ్డు ప్రసాదంలో 50 గ్రాములు తరుగు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో కాంట్రాక్టర్, సెక్షన్ ఆఫీసర్, మరో ఏడుగురు అధికారులపై కేసు నమోదు చేశారు. -
దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!
దేశ వ్యాప్తంగా మహా గణపతిగా పేరుగాంచిన ఖైరతాబాద్ గణపతి చేతిలో పెట్టే లడ్డూ ప్రసాదం తయారీ ఎంతో ప్రత్యేకమే కాదు.. పవిత్రం కూడా. ఈ లడ్డూ తయారీకి ఓ చిన్నారి కారణం కావడం విశేషం. ఈ మహా ప్రసాదాన్ని సమర్పించడం 2010 నుంచే ప్రారంభమైంది. అంతకు ముందు గణనాథుడి చేతిలో కృత్రిమంగా చేసిన ప్రసాదం ఉండేది. అయితే, తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పి.వి.వి.ఎస్.మల్లికార్జురావు (మల్లిబాబు) 2009లో కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చారు. అప్పుడు ఆయన మూడేళ్ల కూతురు మనస్వి దేవుడి చేతిలో మట్టి లడ్డూను చూసి ‘దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!’ అని ప్రశ్నించింది. ఇది మల్లిబాబులో బలంగా ముద్రపడింది. దీంతో దేవుడికి నిజమైన లడ్డూనే ప్రసాదంగా సమర్పించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్, శిల్పి రాజేంద్రన్‌ను కలిసి తన ఆలోచనను వివరించారు. వారి అనుమతితో మరుసటి ఏడు 2010లో 600 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. అదే విధంగా 2011లో 2400 కిలోలు, 2012లో 3500 కిలోలు, 2013లో 4200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు. ఇదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది 5000 కిలోలు (ఐదు టన్నులు) లడ్డూను సమర్పించనున్నారు. ఈ ప్రసాదం తయారీని ఓ బృందం ఎంతో పవిత్రంగా చేపడతారు. అది ఎలాగంటే.. ప్రసాదం తయారీ ఇలా... యేటా మహా గణపతికి లడ్డూను ప్రసాదం తయారీకి చవితికి పది రోజుల ముందు నుంచే పనులు చేపడతారు. ముహూర్తం చేసుకుని తాపేశ్వరంలోని సురిచి ఫుడ్స్ ఆవరణలో ప్రత్యేక కుటీరాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రసాదం తయారీలో పాల్గొనే సిబ్బందితో పాటు యజమాని మల్లిబాబు కూడా వినాయక మాల ధరించి.. మిఠాయితో విఘ్న నాయకుడి విగ్రహాన్ని తయారు చేసి మండపంలో ప్రతిష్టిస్తారు. అనంతరం పప్పు దినుసులను శుభ్రం చేసి పనులు చేపడతారు. ఇలా ప్రతి సంవత్సరం చీఫ్ కుక్ మల్లి, బెంగాలీ కుక్ ఒప్పితో పాటు 11 మంది సిబ్బంది పాలు పంచుకుంటారు. వీరంతా చవితికి నాలుగు రోజుల ముందు పొయ్యి వెలిగించి తొలుత బూంది తయారు చేస్తారు. లడ్డూకు కావాల్సిన పంచదార, నెయ్యి, జీడిపప్పు, యాలకులు పచ్చ కర్పూరం సిద్ధం చేసి 9 కళాయిల్లో బూంది తీస్తుండగా.. మరో పక్క లడ్డూ చుట్టడం ప్రారంభిస్తారు. సహజ రంగులు, జీడిపప్పు పేస్టుతో లడ్డూపై వినాయకుడి ప్రతిమలను, ఇతర దేవతామూర్తులను రూపొందించి అలంకరిస్తారు. ఈ లడ్డూ సాధారణ వాతావరణంలో ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. ప్రాణమున్నంత వరకు సమర్పిస్తా.. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామంలో 1939లో మా నాన్న సత్తిరాజు కాజా తయారీ ప్రారంభించారు. దాన్ని వారసత్వంగా నేను సురుచి ఫుడ్స్ ద్వారా అందజేస్తున్నాను. నేను జీవించి ఉన్నంత కాలం మహా గణపతికి లడ్డూను సమర్పించుకుంటానని ఉత్సవ కమిటీకి మాటిచ్చాను. భగవంతుడికి, భక్తుడికి మధ్య ప్రాంతీయ బేధాలు ఉండవు. ఈ సంవత్సరం మహా లడ్డూను నవరాత్రుల తర్వాత భక్తులకు పంచాలని తీసుకున్న నిర్ణయం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. - మల్లికార్జునరావు, సురుచి ఫుడ్స్ ఈ ఏడాది లడ్డూ కోసం వాడిన పదార్థాలు.. శెనగపప్పు 1450 కిలోలు నెయ్యి 1000 కిలోలు పంచదార 2250 కిలోలు బాదం పప్పు 90 కిలోలు యాలకులు 30 కిలోలు పచ్చ కర్పూరం 10 కిలోలు లడ్డూ తయారీ పనులు ఈ నెల 24న ప్రారంభించారు. ఈ లడ్డూ ఐదు టన్నుల బరువు, 6.5 అడుగుల వ్యాసం, 7.5 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిని 28వ తేదీన ప్రత్యేక వాహనంలో నగరానికి తరలించి 29న వినాయక చవితికి మహా గణపతికి ప్రసాదంగా సమర్పిస్తారు. -
లడ్డూ వద్దు నాయనా !
దేవుడి ప్రసాదమనగానే కళ్ల కద్దుకుని... కళ్లు మూసుకుని భక్తిభావంతో ఆరగిస్తాం. ఇది తరతరాలుగా, యుగయుగాలుగా వస్తున్న ఆచారం. కానీ కాలం మారుతోంది. భక్తి భావంతో కళ్లు మూసుకొని ప్రసాదం తిన్నామో ... అంతే సంగతులు. పవిత్రమైన ప్రసాదాల్లో ఈమధ్య పనికిమాలిన పదార్థాలు దర్శనమిస్తున్నాయి. భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నాయి. పవిత్రంగా భావించే వెంకన్న లడ్డూ వద్దు నాయనపై అనుకునేలా మారింది. తిరుమల పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది లడ్డూ. ఈ లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతే కాదు జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (జిఐ మార్కు) పేటెంటూ ఉంది. తిరుమల వెళ్లే భక్తులు మహాప్రసాదం కోసం కౌంటర్ల ముందు బారులుదీరుతారు. ఇంటిల్లిపాదితో పాటు బంధువులకూ లడ్డూ ప్రసాదాన్ని పంచిపెట్టి మహాభాగ్యంగా మురిసిపోతారు భక్తులు . అసలు ఎవరైనా తిరుమల వెళ్లారంటే చాలు ... లడ్డూ ఏదీ అని టక్కున అడుగుతారు. అంతటి పరమపవిత్ర ప్రసాదం తయారీలో అనునిత్యం ఏదో ఓ పొరపాటు దొర్లుతూనే ఉంది. ఒకసారి తోలు, వెదురుపుల్ల, మరోసారి బోల్టు, ఇంకోసారి రబ్బరు దర్శనమిచ్చి పవిత్రమైన లడ్డూను అపవిత్రంగా మార్చుతున్నాయి. ఓసారి ఏకంగా లడ్డూలో గుట్కా ప్యాకెట్టు కనిపించి భక్తులను వెక్కిరించాయి. మరికొద్దిరోజుల్లో బ్రహ్మోత్సవాలు జరగనున్నా .. ఇంకా అధికారుల్లో టేక్ ఇట్ ఈజీ పాలసీ మాత్రం పోవట్లేదు. ప్రసాదాలపై ఎన్నిసార్లు, ఎంతమంది ఫిర్యాదులు చేసినా ... వారు మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా మరోసారి ప్రసాదాల నాణ్యతపై దుమారం రేగింది. భక్తులు అత్యంత ప్రీతి పాత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులో ఇనుప ముక్క కనిపించింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ రాజేంద్రనగర్- శివరాంపల్లికి చెందిన బాబూరావు తిరుమల నుంచి లడ్డూ ప్రసాదం తీసుకువచ్చాడు. ఇంటికొచ్చి లడ్డూ తీస్తే ... అందులో ఇనుప ముక్క కనిపించింది. దీంతో అతడికి మైండ్ బ్లాంక్ అయ్యింది. దేవుని దర్శనం అనంతరం లడ్డు కొనుగోలు చేశాడు. అనంతరం హైదరాబాద్ చేరుకున్నాడు. దేవుని ప్రసాదాన్ని బంధువులకు పంచే క్రమంలో లడ్డులో ఇనుప ముక్కను గుర్తించాడు. దాంతో శ్రీవారి ప్రసాదం తయారీలో టీటీడీ నిర్లక్ష్యం పట్ల భక్తుడు ఆగ్రహాం వ్యక్తం చేశాడు. లడ్డులోని ఇనుపముక్క ఉన్న విషయాన్ని మీడియాకి తెలియజేశాడు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది ఎవరు? ఆ దేవుడికే తెలియాలి.


