చంద్రబాబు, పవన్, లోకేశ్‌లపై కేసులు పెట్టాలి | DSP Naga Varaprasad files complaint at Tullur police station | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్, లోకేశ్‌లపై కేసులు పెట్టాలి

Mar 2 2026 2:28 AM | Updated on Mar 2 2026 2:28 AM

DSP Naga Varaprasad files complaint at Tullur police station

తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న డీఎస్పీ నాగ వరప్రసాద్‌

లడ్డూ ప్రసాదం విషయంలో అబద్ధాలు వల్లె వేస్తున్నారు 

కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు 

తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ నాగ వరప్రసాద్‌ ఫిర్యాదు

తాడికొండ: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విషయంలో అబద్ధాలు వల్లె వేస్తూ కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లపై డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. 

అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ చైర్మన్, టీవీ–5 అధినేత బీఆర్‌ నాయుడు, ఈనాడు, ఈటీవీ అధినేత చెరుకూరి కిరణ్, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ, మహా­న్యూస్‌ వంశీకృష్ణ, ప్రైమ్‌–9 అధినేత తోపాటు లడ్డూ ప్రసాదం కల్తీ అంటూ న్యూస్‌ ఛానెల్స్‌లో చర్చా కార్యక్రమాలు నిర్వహించిన యాంకర్‌లు, చర్చల్లో పాల్గొన్న వ్యక్తులు, జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. 

ఈ మేరకు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగ వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంపై బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నవారంతా దు్రష్పచారం చేస్తూ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నారు. 

సుప్రీంకోర్టు నియ­మించిన సిట్‌ చార్జ్‌షీట్‌ సైతం లడ్డూ ప్రసాదాల్లో ఏవిధమైన కొవ్వు కలవలేదని పొందుపరిచినప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. ఎస్‌వీబీసీ చానెల్‌ గౌరవానికి భంగం కలిగించిన ఎమ్మెల్యేపై సైతం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement