breaking news
Bollywood
-
కియారాకు సౌత్ కలిసిరావట్లేదా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీకి సౌత్ సినిమా పెద్దగా కలిసి రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అప్పట్లో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సరసన నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం మాత్రమే దక్షిణాదిలో ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత దక్షిణాదిన ఆమె సినిమా చేసిన ప్రతిసారి ఏదో తేడా కొడుతోంది.అప్పట్లో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో చేసిన ‘వినయ విధేయ రామ’, తరువాత అదే హీరోతో చేసిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు బాక్సాఫిస్ వద్ద నిరాశపరిచాయి. తాజాగా పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యశ్ సరసన నటించిన ‘టాక్సిక్’ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్ వస్తోంది. దీంతో ‘భరత్ అనే నేను’ మినహా సౌత్‌లో కియారా సినిమాలు అన్నీ వరుసగా నిరాశపరుస్తున్నాయి.ఇక త్వరలోనే కోలీవుడ్లోకి అడుగుపెట్టనుంది ఈ భామ. ఓ తమిళ సినిమాకు ఓకే చెప్పాను. త్వరలోనే దాని గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఇటీవల టాక్సిక్ సినిమా ప్రచారంలో తెలిపింది. ఇక మరోవైపు ముంబైలో సముద్రానికి ఎదురుగా ఓ కొత్త ఫ్లాట్‌ను కియారా కొనుగోలు చేసింది. దాని ఇంటీరియర్ పనుల కోసం కొంతకాలం సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
LCUని పక్కన పెట్టి.. అల్లు అర్జున్‌తో లోకేష్ ప్రయోగం ఎందుకు?
లోకేష్ కనగరాజ్ పేరు వినగానే LCU గుర్తుకు వస్తుంది. ఈ దర్శకుడు తీసిన ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ వంటి సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ఆయన ఆ సినిమాలను పక్కన పెట్టి మరీ ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. దానికి కారణం.. దాదాపు ఆరేళ్ల క్రితమే మైత్రీ మూవీ మేకర్స్ లోకేష్‌కు అడ్వాన్స్ ఇచ్చిందట. మరోవైపు అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనే ఆలోచన కూడా కొంతకాలంగా ఉందని లోకేష్ ఓ సందర్భంలో వెల్లడించాడు. ఈ రెండు కమిట్మెంట్లు ఇప్పుడు కలవడంతో AA23 పట్టాలెక్కింది.ఇక ఖైదీ 2 ఆలస్యానికి ఆ సినిమా హీరో కార్తి షెడ్యూల్స్ కూడా కారణమయ్యాయి. రజినీకాంత్–కమల్ హాసన్ కాంబినేషన్ కోసం లోకేష్ కొంతకాలం పనిచేశారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ కుదరలేదు. అదే సమయానికి కార్తి కూడా మరో సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. దీంతో లోకేష్‌కు వచ్చిన గ్యాప్‌లో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. మైత్రీ నిర్మిస్తున్న AA23 సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన అనౌన్స్మెంట్ వీడియోలో అడవి, గుర్రం, జంతువుల నేపథ్యంలో ఆసక్తికరమైన ప్రపంచాన్ని హింట్ చేశారు. అయితే ఆ సినిమా కథపై మాత్రం ఎలాంటి ఇంకా క్లారిటీ లేదు.LCUతో కనెక్షన్లు లేకుండా లోకేష్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. అల్లు అర్జున్ సినిమా తర్వాత తన తదుపరి సినిమా ఖైదీ 2నే అని లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అంటే ఇది LCUకి బ్రేక్ మాత్రమే.. ముగింపు కాదు! -
కృతి సనన్ యాడ్ వివాదం.. ప్రకటన సంస్థ కీలక నిర్ణయం
ఆదిపురుష్ భామ కృతి సనన్ చేసిన యాడ్ వివాదానికి కారణమైంది. ఓ జ్యువెలరీ సంస్థ రూపొందించిన ఈ ప్రకటనలో కృతి ధరించిన దుస్తులపై కూడా దుమారం చెలరేగింది. అంతేకాకుండా రాఖీని ఓ కుక్కకు కట్టడంతో ఇది కాస్తా ముదిరింది. హిందూ సంప్రదాయాలను కృతి అవమానించారంటూ నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందూ పండుగలంటే అంటే అంత చులకన అంటూ బాలీవుడ్ బ్యూటీని నిలదీశారు.ఆ తర్వాత తనపై వస్తున్న వివాదంపై కూడా కృతి సనన్ స్పందించింది. మన సంప్రదాయాలను గౌరవించే విధానం మన దుస్తులపై ఆధారపడి ఉందని తెలిపింది. భక్తి అనేది మహిళ ధరించే దుస్తుల్లో ఉండదని.. అది ఆమె మనసుకు సంబంధించిన విషయమని పోస్ట్ చేసింది. మహిళల దుస్తులను టార్గెట్ చేయడం ఇంకెప్పుడు ఆపుతారని ప్రశ్నించింది. కుక్క కూడా మా ఫ్యామిలీ మెంబర్ అని.. అందుకే రాఖీ కూడా కట్టానని కృతి వెల్లడించింది.తాజాగా ఈ వివాదం పెద్దఎత్తున వైరల్ కావడంతో యాడ్ రూపొందించిన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ కల్చర్, సంప్రదాయాలు, పండుగల పట్ల తమకు పూర్తి గౌరవముందని తెలిపింది. కుటుంబంతో పాటు పెంపుడు జంతువులపై ప్రేమను చూపించాలనే ఉద్దేశంతోనే ఈ యాడ్ రూపొందించామని ఆ సంస్థ వివరణ ఇచ్చింది. అయితే కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు యాడ్‌ను తొలగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. -
స్పిరిట్ Vs వారణాసి.. సందీప్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు!
వచ్చే ఏడాది వేసవిలో నెల రోజుల గ్యాప్‌లో సందీప్ రెడ్డి దర్శకత్వంలో రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు భారీ చిత్రాలు కావడంతో ఈ గ్యాప్ సరిపోతుందా? అనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతోంది.ఈ విషయంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సరదాగా స్పందించారు. స్పిరిట్ కంటే వారణాసి చాలా పెద్ద సినిమా అని చెప్పిన ఆయన.. అవసరమైతే వారణాసి చిత్రం కోసం కాస్త జరగడానికి తమకేం అభ్యంతరం లేదన్నాడు. ఈ రెండు సినిమాల విడుదల తేదీల మధ్య నెల రోజుల పైనే తేడా ఉండటంతో సాద్యమైనంతవరుకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. అయితే అదే టైమ్‌లో స్పిరిట్ మాత్రం చెప్పిన తేదీకి కచ్చితంగా వస్తుందని కూడా మరోసారి క్లారిటీ ఇచ్చాడు.రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్‌కు ఇంకా 65 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తానని సందీప్ వంగ తెలిపారు. అలాగే తన గత చిత్రాలకు వచ్చినట్టే ఈ సినిమాకు కూడా ‘A’ సర్టిఫికేట్ ఖాయమని చెప్పారు.యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
అక్షయ్-సైఫ్ యాక్షన్ మూవీ.. ఫుల్ వయొలెంట్‌గా ట్రైలర్
అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హైవాన్. ఈ మూవీని ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే నెల 11న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే హైవాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే మర్డర్స్ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సన్నివేశాలు చూస్తుంటే ఫుల్ వయొలెంట్‌గా ఉండనుందని అర్థమవుతోంది. అక్షయ్- సైఫ్ మధ్య ఫైట్ సీన్స్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియా పిల్గాంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఇంకెప్పుడు మారుతారు?.. వివాదంపై కృతి సనన్ రియాక్షన్
ఆదిపురుష్ భామ కృతి సనన్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. తాను నటించిన రక్షాబంధన్ యాడ్‌తో విమర్శల పాలైంది. ఓ కుక్కకు రాఖీ కడుతూ.. సంప్రదాయ దుస్తులు కాకుండా వెస్టర్న్ డ్రెస్‌లో కనిపించింది. ఇదే వివాదానికి కారణమైంది. హిందూ పండుగను అవమానించేలా కృతి సనన్ వ్యవహరించారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోదరుడికి ప్రేమతో కట్టే రాఖీని కుక్కకు కట్టడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.తాజాగా తనపై వస్తున్న విమర్శలపై బాలీవుడ్ భామ స్పందించారు. పండుగ అనేది భావోద్వేగాలు, సంప్రదాయాలతో కూడుకున్నదని తెలిపింది. అంతేకానీ ఒక మహిళ ధరించే దుస్తులపై ప్రభావం ఉండదని రాసుకొచ్చింది. ఈ వేడుకల్లో తన పెంపుడు జంతువును చేర్చాలనే ఆలోచన సరైందేనని.. కుక్కలు కూడా కుటుంబంలో భాగమేనని వెల్లడించింది. ఈ వివాదంపై ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.కృతి తన ఇన్‌స్టాలో రాస్తూ..' మన పండుగల సారం మనం ధరించే దుస్తుల్లో ఉండదు. అది సంప్రదాయాల పట్ల మీకు ఉండే భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. రక్షాబంధన్ అనేది ఒక రక్షణ బంధం. నేను, నా సోదరి ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాం. ఒక సోదరుడు ఎలాగైతే రక్షణగా ఉంటారో.. మేము కూడా అలాగే రక్షించుకోగలమని మాకు తెలుసు. తాను, తన సోదరి ఒకరి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయువు కోసం ప్రార్థించుకుంటాం. ఇది మా ఇంట్లో కుక్కలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అవీ కూడా మా కుటుంబంలో సభ్యులే కదా " అని పోస్ట్ చేసింది.అంతేకాకుండా మనం మహిళలు ఏమి ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతామని కృతి సనన్ ప్రశ్నించింది. ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని ఆమె దుస్తులను బట్టి అంచనా వేసే పద్ధతిని కృతి తప్పుపట్టింది. ఎథ్నిక్ ఫ్యాషన్ సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది.. కానీ ఇప్పటికీ ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని కేవలం ఆమె దుస్తులతోనే కొలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మన సంస్కృతి, సంప్రదాయాలు అనే మహిళ హృదయంలో ఉంటాయి.. అంతే కానీ ఆమె మెడలో కాదంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే కృతి ఇటీవల షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి రొమాంటిక్ కామెడీ-డ్రామా కాక్టెయిల్ -2లో కనిపించింది. గతేడాది 'తేరే ఇష్క్ మే'లో ధనుష్ సరసన కూడా హీరోయిన్గా మెప్పించింది. -
యాక్షన్ థ్రిల్లర్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న కొత్త సినిమాకు ‘సముక్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు మేకర్స్. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కనిష్క్ వర్మ దర్శకుడు. విపుల్ అమృత్లాల్ షా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం లండన్‌లో ప్రారంభమైంది. ‘‘సముక్’ సినిమా చిత్రీకరణ మొదలైంది. కొత్త జానర్లో కొత్త సవాల్‌ను స్వీకరించాను. వివాన్ అహుజాగా డ్యూటీ మొదలుపెట్టాను’’ అని ‘ఎక్స్’లో పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు అక్షయ్ కుమార్. కాగా, ఈ సినిమా మేజర్ షూటింగ్ లండన్ లో జరుగుతుందని, కొద్దిపాటి షూటింగ్ ముంబైలో జరుగుతుందని బాలీవుడ్ సమాచారం. అంతర్జాతీయ సంబంధాలు, సర్వైవల్ హారర్, గ్రహాంతరవాసులు వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు అలెక్ గిల్లిస్, స్టంట్ డైరెక్టర్ ల్యూక్ టంబర్ వంటి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. -
నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.2,000..? మరి 'టాక్సిక్'కి ఎంతో తెలుసా?
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నయనతార తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన మొదటి జీతం గురించి వెల్లడించింది. తాజాగా నయనతారను ఆమె తొలి ఉద్యోగం గురించి అడిగారు. దీనికి స్పందించిన నయనతార.. తన మొదటి పని ఓ మ్యాగజైన్ కవర్ షూట్ అని గుర్తుచేసుకుంది. ఓ ఫ్యాషన్ కార్యక్రమం కోసం తనను పిలిచారని తెలిపింది. ఆ సమయంలో తనకు వచ్చిన పారితోషికం కేవలం రూ.2,000 నుంచి రూ.3,000 వరకు మాత్రమే అని నయనతార చెప్పింది. ఆ చిన్న మొత్తంతో ప్రారంభమైన తన కెరీర్.. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగే స్థాయికి చేరుకోవడం విశేషం.నయనతార చాలా కాలంగా సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మోడలింగ్ ద్వారా సినీరంగం దృష్టిని ఆకర్షించిన ఆమె 2003లో ‘మనస్సినక్కరే’ సినిమాతో నటిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యాగజైన్లో నయనతార ఫొటోలు చూసిన దర్శకుడు సత్యన్ ఆమెకు తొలి సినిమా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ‘అయ్యా’, ‘చంద్రముఖి’ చిత్రాలతో తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది.రజనీకాంత్‌తో చేసిన చంద్రముఖి సినిమా నయనతార కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఆమె పాపులర్ అయింది. అదే టైమ్‌లో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల వైపు ఫోకస్ పెట్టింది. అవి సక్సెస్ కావడంతో తిరుగులేని లేడీ సూపర్‌స్టార్‌గా క్రేజ్ సంపాదించుకుంది. వరుస విజయాలతో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన నయనతార 2023లో షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’తో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అంటే.. కేవలం రూ.3 వేలతో మొదలైన ఆమె సినీ ప్రయాణం ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం అందుకునే స్థాయికి చేరింది. ఇక పాన్ ఇండియా స్టార్ హీరో యశ్‌తో ఆమె నటించిన టాక్సిక్ సినిమా విడుదలకు సిద్ధమైంది. -
ఒకవైపు వివాదం.. బాయ్‌ఫ్రెండ్‌తో ఆదిపురుష్ భామ చిల్..!
ఆదిపురుష్ భామ కృతిసనన్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. రక్షాబంధన్ ప్రకటనలో ధరించిన డ్రెస్‌తో పాటు కుక్కకి రాఖీ కట్టడంపై పెద్దఎత్తున విమర్శలొస్తున్నాయి. హిందూ సంప్రదాయాలను ఎందుకిలా అప్రతిష్ట పాలు చేస్తున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు. రక్షాబంధన్ వేడుకపై ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ గివా రూపొందించిన యాడ్ ఈ వివాదానికి కారణమైంది. దీంతో కృతిపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.అయితే ఈ ముద్దుగుమ్మ అవేమీ తనకు పట్టవు అన్నట్లు వ్యవహరిస్తోంది. తన ప్రకటనపై వివాదం తలెత్తినప్పటికీ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. అంతలోనే తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒకవైపు వివాదం నడుస్తుంటే.. తన ప్రియుడితో కబిర్ బహియాతో ఉన్న పిక్స్ షేర్ చేయడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. తనపై వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా తన పనిలో తాను పుల్ బిజీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. హిందూ సంప్రదాయాలపై గౌరవం లేని ఇలాంటి వారిని తగిన బుద్ధి చెప్పాలంటున్నారు. View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) -
‘కుక్కకు రాఖీనా?’.. కృతిపై ఫ్యాన్స్ ఆగ్రహం
రక్షాబంధన్ ప్రకటనలో బాలీవుడ్ నటి కృతి సనన్ లుక్ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పండుగ సంప్రదాయాన్ని అపహాస్యం చేశారంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేయగా, శునకానికి రాఖీ కట్టే సన్నివేశంపైనా నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకపై ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘గివా’ రూపొందించిన సరికొత్త ప్రకటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ యాడ్‌లో కృతి సనన్ ధరించిన దుస్తులు, ప్రదర్శించిన సన్నివేశాల కాన్సెప్ట్‌పై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారతీయ పండుగను ఆధునిక కోణంలో చూపించే ప్రయత్నమే ఇదని మరికొందరు పేర్కొంటున్నారు. ఈ ప్రకటనలో కృతి సనన్ ఆఫ్-వైట్ రంగు బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్ ధరించి కనిపించారు. సంప్రదాయ పండుగ వేళ ఇలాంటి ఆధునిక వస్త్రధారణ ఎంపిక చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.అంతేకాకుండా, పెంపుడు శునకాన్ని కుటుంబ సభ్యుడిగా చూపిస్తూ, మొరుగుతున్న శునకానికి కృతి రాఖీ కట్టే సన్నివేశం కూడా విమర్శలకు దారితీసింది. పండుగ నేపథ్యాన్ని ఆవిష్కరించేందుకు ఇతర మార్గాలున్నాయని పలువురు విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందిస్తూ, హిందూ పండుగల సమయంలోనే ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు దీనిని కేవలం ఒక క్రియేటివ్ క్యాంపెయిన్ మాత్రమేనని అనగా, వివాదం చేయాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై ఇప్పటివరకు అటు కృతి సనన్ గానీ, ఇటు ప్రకటన సంస్థ గానీ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కృతి సనన్ ఇటీవల ‘కాక్టెయిల్ 2’ చిత్రంలో షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి కనిపించగా, గతంలో ధనుష్‌తో ‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో నటించారు.ఇది కూడా చదవండి: గణేశ్ ఆగమన యాత్రలో గుడ్లతో దాడి -
మల్లికా షెరావత్ చెయ్యి పట్టుకున్న లాలూ తనయుడు తేజ్
ముంబై: ‘భోజ్‌పురి బవాల్’ రియాలిటీ షో వేదికగా ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (తేజూ భయ్యా), ప్రముఖ సినీ నటి మల్లికా షెరావత్ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మల్లికా షెరావత్‌తో తేజ్ ప్రతాప్ సరదాగా సంభాషిస్తూ ఆమె హస్తసాముద్రికం చూసి భవిష్యత్తు చెప్పారు. షో ప్రోమోలో తేజ్ ప్రతాప్ యాదవ్ మల్లిక చేతిని చూస్తూ.. ‘మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది. కానీ ఇతరుల వల్ల మీరు ఎక్కువగా బాధపడతారు’ అని పేర్కొనగా, ఆమె దానికి ఏకీభవించారు. Teju bhaiyya can do it all!#BhojpuriBawaal streaming everyday on #JioHotstar at 9pm and on #ColorsTV at 10:30pm.#BhojpuriBawaalOnJioHotstar pic.twitter.com/x2wT5DlFXr— JioHotstar Reality (@HotstarReality) August 23, 2026అనంతరం రాశి వివరాలు అడగ్గా మల్లిక ‘తులా రాశి’ అని సమాధానమిచ్చారు. వెంటనే తేజ్ ప్రతాప్ తనది కూడా అదే రాశి అని తెలపడంతో ఇద్దరూ నవ్వులు చిందించారు. ఆపై తన రాశి ప్రకారం ఏ రత్నం ధరించాలని మల్లిక అడగ్గా, తాను ధరించిన పుష్యరాగాన్ని చూపిస్తూ.. ‘ఇది మీ సూర్య బలాన్ని మరింత తేజోవంతం చేస్తుంది’ అని చెప్పారు. దీనికి మల్లిక స్పందిస్తూ.. ‘ఇంకా ఎంత తేజ్ (తేజస్సు) కావాలి తేజ్ గారు?’ అంటూ చమత్కరించడంతో తేజూ భయ్యా గట్టిగా నవ్వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మల్లికా షెరావత్ ప్రస్తుతం ‘ట్రైటర్స్ 2’ రియాలిటీ షోలో కూడా పాల్గొంటున్నారు. ‘భోజ్‌పురి బవాల్’ షో కలర్స్ ఛానల్‌తో పాటు జియో హాట్‌స్టార్ ఓటీటీ వేదికపై ప్రసారమవుతోంది.ఇది కూడా చదవండి: కటకటాల్లో ‘ఆ పాత మధురాలు’.. భావోద్వేగంలో ఖైదీలు! -
కంగనా vs తాప్సీ..ఈసారి తల్లిదండ్రుల వరకు వెళ్లిన వివాదం!
మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్లలో కంగనా రనౌత్, తాప్సీ పన్ను ముందు వరుసలో ఉంటారు. సినిమాల ఎంపిక దగ్గరి నుంచి వ్యక్తిగత అభిప్రాయాల వరకు ఏ విషయంలోనైనా ఓపెన్‌గా మాట్లాడే ఈ ఇద్దరి మధ్య గతంలో పలుమార్లు మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల తాప్సీ చేసిన వ్యాఖ్యలకు కంగనా ఘాటుగా స్పందించడంతో వీరి మధ్య వార్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. కంగనాతో తనకున్న విభేదాలపై మాట్లాడారు. వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తాను కంగనాను వ్యక్తిగతంగా కలవలేదని చెప్పారు. కంగనాపై తన అభిప్రాయం తన పెంపకం, మాట్లాడే విధానం, ఆలోచనా తీరును ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కంగనా ఎలా స్పందిస్తారనేది ఆమె పెరిగిన వాతావరణం, ఆమె విధానానికి సంబంధించిన విషయమని తాప్సీ పేర్కొన్నారు.తాప్సీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంగనా రనౌత్ స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో తాప్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన సినిమా ప్రమోషన్ల కోసం, మీడియా హెడ్‌లైన్స్‌లో నిలిచేందుకు తాప్సీ తన పేరును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు.. ఈసారి తాప్సీ తన పెంపకం, తల్లిదండ్రుల గురించి ప్రస్తావించడంతో కంగనా కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు.తాప్సీని ఉద్దేశించి కంగనా ‘చౌకబారు కాపీ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రుల గురించి మాట్లాడటం ద్వారా తాప్సీ హద్దులు దాటారని పేర్కొంటూ.. తాను మాత్రం ఎలాంటి వాదనలోనూ ఎదుటివారి తల్లిదండ్రుల గురించి మాట్లాడనని అన్నారు. అనంతరం తాప్సీ తల్లిదండ్రులను ఉద్దేశించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది.అయితే కంగనా–తాప్సీ మధ్య ఈ వివాదం ఇప్పటిది కాదు. 2019లో ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా సమయంలో కంగనా సోదరి రంగోలి చందేల్.. తాప్సీని ఉద్దేశించి ‘సస్తీ కాపీ’ (చౌకబారు కాపీ) అనే పదాన్ని ఉపయోగించడంతో తొలిసారి వీరి మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2020లో బాలీవుడ్లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కంగనా.. తాప్సీతో పాటు స్వరా భాస్కర్‌ను ‘బి-గ్రేడ్ నటీమణులు’గా అభివర్ణించడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఆ తర్వాత కూడా ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాఖ్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా తాప్సీ చేసిన వ్యాఖ్యలతో పాత వివాదం మరోసారి తెరపైకి రావడం, దానికి కంగనా మరింత ఘాటైన పదజాలంతో స్పందించడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది.ప్రస్తుతం తాప్సీ నటించిన ప్రతీకార నేపథ్య డ్రామా ‘గాంధారి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా ప్రమోషన్ల సమయంలో తాప్సీ చేసిన వ్యాఖ్యలు, వాటికి కంగనా ఇచ్చిన కౌంటర్‌తో మరోసారి ఈ ఇద్దరు నటీమణుల మధ్య వివాదం వార్తల్లో నిలిచింది. మరి ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా? లేక మరోసారి ఇద్దరి నుంచి కౌంటర్లు వస్తాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
నిజంగా ‘టాక్సిక్’ రూ.2,000 కోట్లు కొల్లగొడుతుందా?
పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఏకంగా రూ.2,000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ ప్రకటించగా, నిర్మాత దిల్ రాజు కూడా ఇదే మాటను రిపీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం నిజంగా రూ.2,000 కోట్లు సాధించాలంటే ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ వంటి భారీ పాన్ ఇండియా హిట్ చిత్రాలను మించి సినిమా ఆడాల్సి ఉంటుంది. అయితే ‘టాక్సిక్’పై ఉన్న క్రేజ్ కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమే కాదని అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో యశ్‌కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు భారీ ప్లస్‌గా మారుతోంది.అయితే ఈ రూ.2,000 కోట్ల స్టేట్మెంట్తో టాక్సిక్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరోవైపు హీరో యశ్ మాత్రం ఇలాంటి అతిశయోక్తి వ్యాఖ్యలకు దూరంగా ఉన్నాడు. అయితే ‘టాక్సిక్’తో తన టార్గెట్ ఏంటో మాత్రమే స్పష్టంగా చెబుతున్నాడు. ఇక ఈ భారీ అంచనాలను ‘టాక్సిక్’ నిజం చేస్తుందా? లేక రూ.2,000 కోట్లు కేవలం ప్రచార మాటగానే మిగిలిపోతుందా? అన్నది ఈ చిత్రం బాక్సాఫీస్ రిజల్ట్‌తోనే తేలనుంది. -
ముచ్చటగా మూడోసారి ప్రెగ్నెన్సీ.. కరీనా కపూర్ పోస్ట్ వైరల్..!
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ ఒకరు. వీరిద్దరి ప్రేమ పెళ్లి చేసుకుని ప్రస్తుతం లైఫ్‌లో బిజీగా ఉన్నారు. వీరిద్దరికీ ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తమ కెరీర్లో బిజీగా ఉన్న ఈ జంట అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. తాజాగా మరోసారి కరీనా కపూర్ హాట్ టాపిక్‌గా మారింది. ఆమె త్వరలోనే మూడో బిడ్డకు జన్మనివ్వనుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో ఉన్న బాలీవుడ్ భామ జిమ్ వీడియో ఇటీవలే నెట్టింట వైరలైంది. ఈ వీడియోలో ఆమెకు బేబీ బంప్‌తో ఉన్నట్లు కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. ఆమె మరోసారి గర్భం దాల్చిందంటూ బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రూమర్స్‌పై కరీనా కపూర్ ఆడపడచు సబా పటౌడీ స్పందించారు. ఆమె గర్భవతి అన్న ఊహాగానాలను నవ్వుతూ కొట్టిపారేశారు. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ప్రెగ్నెన్సీతో కనిపిస్తోందని పేర్కొన్నారు, కానీ అలాంటిదేం లేదని సబా స్పష్టం చేశారు.(ఇది చదవండి: స్పిరిట్ వివాదం.. దీపికా పదుకొణె స్ట్రాంగ్ రియాక్షన్)తాజాగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లపై కరీనా కపూర్ సైతం స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. కడుపు ఉబ్బినట్లుగా ఉన్న ఓ ఫోటోను పంచుకుంది. నవ్వుతున్న ఎమోజీలతో పాటు పిజ్జా ఎమోజీలు పోస్ట్ చేసింది. అంటే ఇది కేవలం ఫుడ్ ఎక్కువగా తినడం వల్లే వచ్చిన బేబీ బంప్ అంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. -
నటుడిగా ఎదిగి.. చిరంజీవిగా నిలిచి
చిరంజీవి.. ఈ పేరు వింటేనే ఓ మాస్ ఇమేజ్ కళ్లముందు కదులుతుంది. తెరపై ఆయన వేసే ఒక్క స్టెప్‌కు థియేటర్ ఊగిపోతుంది. ఆయన చెప్పే ఒక్క డైలాగ్‌కు అభిమానులు పండగ చేసుకుంటారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న సినీ ప్రస్థానంలో ఎన్నో రికార్డులు, అవార్డులు, అరుదైన ఘనతలు ఆయన ఖాతాలో చేరాయి. నటుడిగా మొదలైన ప్రయాణం మెగాస్టార్‌గా మారింది. తెరపై స్టార్డమ్తో పాటు సేవా కార్యక్రమాలతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రయాణంపై ఓ ప్రత్యేక కథనం.పోలీసు కుటుంబంలో పుట్టి..చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. పవన్ కల్యాణ్, నాగబాబు అన్నదమ్ములు. తండ్రి వెంకట్రావు పోలీసు శాఖలో పనిచేసేవారు. ఉద్యోగరీత్యా కుటుంబం పలు ప్రాంతాల్లో నివసించడంతో చిరంజీవి విద్యాభ్యాసం కూడా వివిధ ప్రాంతాల్లో సాగింది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న చిరంజీవి.. కాలేజీ రోజుల్లో నాటకాల్లో నటించేవారు. నటుడిగా మారాలన్న లక్ష్యంతో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 1976లో శిక్షణ పొందారు. అక్కడే తన నటనా ప్రతిభకు మరింత పదును పెట్టుకున్నారు.‘పునాదిరాళ్లు’తో తొలి అడుగు..సినిమా రంగంలో చిరంజీవి తొలి అడుగు ‘పునాదిరాళ్లు’తో పడింది. అయితే ఈ సినిమా కంటే ముందే ఆయన నటించిన ‘ప్రాణం ఖరీదు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1978లో విడుదలైన ఈ సినిమాతో చిరంజీవి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. తొలి రోజుల్లో విలన్, క్యారెక్టర్ తరహా పాత్రలు చేసేవారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.హీరోగా గుర్తింపు..1982లో వచ్చిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిరంజీవి కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమాతో ఆయన పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల్లో బలమైన గుర్తింపు సంపాదించారు. అదే ఏడాది వచ్చిన ‘శుభలేఖ’ ఆయనలోని నటుడికి మరో కోణాన్ని చూపించింది.అయితే 1983లో వచ్చిన ‘ఖైదీ’ చిరంజీవి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన మాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత వరుస విజయాలతో అగ్ర కథానాయకుడిగా ఎదిగి ‘మెగాస్టార్’గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.జాతీయ స్థాయిలో గుర్తింపు..చిరంజీవి తన నటనకు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పలు నంది అవార్డులు అందుకున్నారు. భారతీయ సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నారు.రాజకీయాల్లోకి ఎంట్రీసినిమాల్లో అగ్రస్థానంలో ఉన్న సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ప్రజా సమస్యలపై తనదైన ఆలోచనలతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.మళ్లీ వెండితెరపైకి..రాజకీయ ప్రస్థానం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి.. ‘ఖైదీ నంబర్ 150’ తో ఘనంగా రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’, ‘విశ్వంభర’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం యువ హీరోలతో పోటీ పడుతున్నారు.చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్..చిరంజీవి పేరు చెప్పగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం ఆయన సేవా కార్యక్రమాలు. 1998లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలను ప్రోత్సహించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసరమైన వారికి రక్తాన్ని అందించడంతో పాటు.. నేత్రదానంపై అవగాహన కల్పించారు. 2006లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఈ ట్రస్ట్‌ను సందర్శించారు.కరోనా సమయంలోనూ చిరంజీవి తన వంతు సాయం చేశారు. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించడంతో పాటు కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC) ద్వారా సినీ కార్మికులకు అండగా నిలిచారు. -
53 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'ధురంధర్' విలన్
ధురంధర్, భగవంత్ కేసరి సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన హిందీ నటుడు అర్జున్ రాంపాల్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. గత ఎనిమిదేళ్లుగా దక్షిణాఫ్రికా మోడల్, ఫ్యాషన్ డిజైనర్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌తో సహజీవనం చేస్తున్నారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఈ శుక్రవారం గోవాలోని బార్డెజ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ వివాహాన్ని అర్జున్ అధికారికంగా నమోదు చేశాడు.మధ్యప్రదేశ్‌కి చెందిన అర్జున్ రాంపాల్.. 2001 నుంచి సినిమాలు చేస్తున్నాడు. దాదాపుగా హిందీలోనే నటించాడు. బాలకృష్ణ 'భగవంత్ కేసరి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ టైంలో అయితే 'ధురంధర్' రెండు భాగాల్లో విలన్‌గా నటించి మెప్పించాడు.ఇక పెళ్లి విషయానికొస్తే.. 1998లో మోడల్, వ్యాపారవేత్త మెహర్ జెసియాని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు కూడా పుట్టారు. కానీ 2019లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇది జరగడానికి ఏడాది ముందు నుంచి మోడల్ గాబ్రియెల్లాతో డేటింగ్ మొదలుపెట్టాడు. గత ఎనిమిదేళ్లగా సహజీవనం చేస్తున్న వీళ్లు కొన్నాళ్ల క్రితం అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు 53 ఏళ్ల వయసులో అర్జున్ రాంపాల్ తమ పెళ్లిని రిజిస్టర్ చేయించాడు. దీంతో అధికారికంగా భార్యభర్తలయ్యారు. -
విడాకులు వెనక్కి.. అయినా సీక్రెట్ మ్యారేజ్ ప్లాన్?
బాలీవుడ్ నటుడు గోవింద, ఆయన భార్య సునీత అహుజా మధ్య వివాహ వివాదం మరో మలుపు తిరిగింది. 2024లో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఇటీవలే సునీత వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన సహనటి కోమల్ రాణి స్వర్ణకర్‌ను రహస్యంగా వివాహం చేసుకోబోతున్నారంటూ ఓ వార్త బాంబ్లా పేలింది. ఈ బాంబ్ పేల్చింది ఎవరో కాదు.. గోవింద సతీమణి సునీతనే!.ముంబైలో నటి రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతున్న గోవిందా భార్య సునీతతో ఫోన్ కలిపారు. ఈ సంభాషణలో తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల గురించి సునీత ప్రస్తావించారు. ఇదే సమయంలో గోవింద, కోమల్ రాణి పెళ్లి చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకున్నారని ఆమె చెప్పారు. “నేను నిన్నే విడాకుల కేసును వెనక్కి తీసుకున్నాను. అయితే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకునే ప్లాన్‌లో ఉన్నారు” అని సునీత వ్యాఖ్యానించించారు. అదే సమయంలో కోమల్ రాణిని సునీత ‘చికెన్ టిక్కా’ అంటూ సంబోధించడం కూడా చర్చనీయాంశంగా మారింది.సునీతకు రాఖీ సలహాఈ సందర్భంగా రాఖీ సావంత్ సునీతకు మద్దతుగా మాట్లాడారు. గోవిందకు సంబంధించినట్లు చెబుతున్న రూ.200 కోట్ల ఆస్తిపై దృష్టి పెట్టాలని, ఇతర విషయాలను పక్కన పెట్టి ఆస్తులను తన పేరుపై భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలకు సునీత స్పందించగా.. విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో గోవింద, కోమల్ పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని బాంబ్ పేల్చారు.కింగ్ ఆఫ్ కామెడీగా..బాలీవుడ్ నటుడు గోవిందా 90వ దశకంలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్, ప్రత్యేకమైన డ్యాన్స్ స్టైల్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ‘కూలీ నంబర్ 1’, ‘హీరో నంబర్ 1’, ‘రాజా బాబు’, ‘దుల్హే రాజా’ వంటి హిందీ చిత్రాల రీమేక్ వెర్షన్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు. 1963 డిసెంబర్ 21న జన్మించిన ఆయన అసలు పేరు గోవింద్ అరుణ్ అహూజా. ప్రస్తుతం ఆయన వయసు 62 ఏళ్లు. గోవిందా, సునీతా అహూజాలను 1987 మార్చి 11న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. కుమార్తె టీనా అహూజా, కుమారుడు యశ్వర్ధన్ అహూజా. 90లలో ‘కింగ్ ఆఫ్ కామెడీ’గా గుర్తింపు పొందిన గోవిందా.. ఇప్పటికీ బాలీవుడ్లో ప్రముఖ నటుడిగానే కొనసాగుతున్నారు.ఎయిర్‌పోర్టులో కనిపించిన తర్వాతే..గోవింద, కోమల్ రాణి మధ్య సంబంధంపై ఇటీవలే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇద్దరూ కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించిన ఫొటోలు బయటకు రావడంతో ఈ ప్రచారం మరింత పెరిగింది. ఆ తర్వాత సునీత.. గోవింద, కోమల్ మధ్య సంబంధంపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. కూతురి వయసున్న అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడని.. కోమల్‌ను గోవిందకు ‘షుగర్ డాడీ’ అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.కోమల్ రాణి స్వర్ణకర్ ఎవరంటే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోమల్ వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యానికి సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాలేదు. అయితే ఆమె బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న నటి. గోవిందా నటిస్తున్న రూపా చిత్రంలో ఆమె హీరోయిన్. అలాగే ఆయన నటిస్తున్న మరో ప్రాజెక్టు దునియాదారిలోనూ నటించబోతున్నట్లు సమాచారం. ఇటీవల గోవిందాతో కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో వీరిద్దరి మధ్య సంబంధంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే గోవిందా గానీ, కోమల్ గానీ తమ మధ్య ప్రేమ సంబంధం ఉందని అధికారికంగా ధృవీకరించలేదు.సునీతకు గోవింద కౌంటర్మరోవైపు సునీత చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలపై గోవింద కూడా స్పందించారు. సునీత తనను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని ఆపాలని ఆయన కోరారు. యువత ఆమెను ఆదర్శంగా చూస్తుందని, అందువల్ల బహిరంగంగా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సూచించారు. తల్లులు, అక్కాచెల్లెళ్ల పేర్లను అసభ్యంగా ఉపయోగించడం సరికాదని.. ఆమె నుంచి అలాంటి ప్రవర్తనను తాను ఆశించలేదని గోవింద వ్యాఖ్యానించారు.మొన్నే విడాకుల పిటిషన్ వెనక్కిగోవింద, సునీత దంపతుల వివాహ బంధంపై కొంతకాలంగా వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. సునీత 2024లో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే మొన్నీమధ్యే ఆగస్టు 19న దాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వివాహ బంధం కొనసాగుతుందనే సంకేతాలు కనిపించాయి.కానీ పిటిషన్ ఉపసంహరణ జరిగిన వెంటనే సునీత చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి గోవింద వ్యక్తిగత జీవితంపై చర్చకు దారితీశాయి. మరోవైపు నటి పూనమ్ పాండే, సోమీ అలీ కూడా ఈ వివాదంలో గోవిందకు మద్దతుగా మాట్లాడారు. ప్రస్తుతం గోవింద–సునీత మధ్యలో కోమల్ రాణి పేరు తెరపైకి రావడంతో బాలీవుడ్లో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. -
స్పిరిట్ నుంచి దీపిక తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా?
రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' సినిమా నుంచి దీపిక పదుకోన్ తప్పుకోవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. పని గంటల విషయం కారణంగానే ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా అసలు కారణం మరొకటంటూ ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.దీపిక రెమ్యూనరేషన్‌తో పాటు సినిమా నెట్ ప్రాఫిట్లో 10 శాతం వాటా కోరినట్లు ప్రణయ్ రెడ్డి వెల్లడించారు. ఈ డీల్ వర్కవుట్ కాదని భావించిన 'స్పిరిట్' చిత్రబృందం మరో హీరోయిన్ కోసం చూడాలని నిర్ణయించిందట. అదే సమయంలో కథ, పాత్రలకు సంబంధించిన వివరాలు కూడా ఆమె పీఆర్ టీమ్ ద్వారా మీడియాలోకి లీక్ కావడంపై సందీప్ తీవ్రంగా అసంతృప్తికి గురయ్యాడు. దీంతో దీపికను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని ప్రణయ్ పేర్కొన్నారు.ఇక స్పిరిట్‌లో సౌత్ కొరియా స్టార్ హీరో డాన్ లీ నటిస్తున్నారన్న వార్తలకు కూడా చెక్ పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఫ్యాన్స్ హంగామా చూసి ఒక దశలో డాన్ లీ కోసం కాస్త గట్టిగానే ఆలోచించాడట. అయితే హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలో ఆయన పాత్ర సెట్ కాకపోవడంతో ఆ ఆలోచనను సందీప్ రెడ్డి విరమించుకున్నారట. అలాగే చిరంజీవి స్పిరిట్‌లో నటిస్తున్నారన్న ప్రచారం కూడా కేవలం పుకారేనని ప్రణయ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ మాత్రం ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. వాయిస్ టీజర్లో ఆయన స్వరం వినిపించినా సినిమాలో కనిపించరట. -
ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముండే (FDA Commissioner Tukaram) రాష్ట్రంలో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలు మరియు మందుల నియంత్రణపై భారీ చర్యలు చేపడుతున్నారు. రెస్టారెంట్లు హోటళ్లు, ప్రముఖ ఫార్మా కంపెనీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పెద్ద ఎత్తున లైసెన్సులు సస్పెండ్ చేయడం , అమ్మకాలను నిలిపివేయడం, నోటీసులు జారీ లాంటి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తుకారం ముండే చర్యలపై ప్రశంసలు కురిపించారు.మరోవైపు ముండే వ్యవహారశైలిపై బాంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులివ్వకుండా తనిఖీల పేరుతో ఎఫ్‌డీఏ చేపడుతున్న దూకుడు చర్యలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన తరుణంగా తాజాగా తుకారాం ముండేకి ట్యాగా చేస్తూ నటి శ్వేతా తివారీ Shweta Tiwari) చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్అసలు ఏమైంది? శ్వేతా తివారీ ఒక క్విక్-కామర్స్ యాప్ ద్వారా ఇన్‌స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన సరుకులతో పాటు ఇంట్లోకి బొద్దింక వచ్చిందని ఆరోపించిది. ఈ యాప్ ద్వారా కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు శ్వేతా తివారీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. దీనికి మహారాష్ట్ర ఎఫ్‌డీఏ మిషనర్ తుకారాం ముండేను ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో తన ఇంట్లో తిరుగుతున్న బొద్దింకను చూపిస్తూ, ఆహార భద్రతా నిబంధనలపై చర్యలు తీసుకుంటున్న ముండేను ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు.కాగా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లు, క్యాంటీన్లపై కఠిన చర్యలు తీసుకుంటూ ముండే ఇటీవల సోషల్ మీడియాలో "అసలి సింగం"గా ప్రశంసలు అందుకుంటున్నారు. సదరు ఆర్డర్ లేదా డెలివరీ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నటి ఇంకా వెల్లడించలేదు. అలాగే ఈ ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇంకా స్పష్టత రాలేదు. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం -
దసరాకి వస్తున్న వదినమ్మ
కోడలు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆ ఇల్లంతా ఆనందంతో నిండిపోతుంది. అప్పటివరకూ అస్తవ్యస్తంగా ఉన్న ఆ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారిపోతుంది. అయితే ఆ అమ్మాయి ప్రవర్తన చూసి, ఆమె ఓ మంత్రగత్తె అని ఆమె బావ అనుమానిస్తాడు. అక్కణ్ణుంచి మిగతా కథేంటో తెలియాలంటే హిందీ చిత్రం ‘నయీ నవేలీ’ చూడాల్సిందే.కోడలి పాత్రలో యామీ గౌతమ్ నటిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్. రాయ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా అక్టోబరు 16న విడుదల చేయనున్నట్లు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. కామెడీ, హారర్, ఫాంటసీ ఇలా పలు షేడ్స్ ఉన్న బాబీ (వదిన) క్యారెక్టర్‌కి యామీ గౌతమ్ పర్ఫెక్ట్ అని ఆనంద్ ఎల్.రాయ్ పేర్కొన్నారు.Yami Gautam's Nayyi Navelli set for Dussehra Festive Release#YamiGautam #NayyiNaveli #Dussehra @yamigautam@aanandlrai @directormbalaji @divynidhisharma@gvprakash @amzmgmstudiosin @colouryellow_in pic.twitter.com/KzDmXLbG5i— Jayaraman (@JournoJRaman) August 19, 2026 -
రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్
సాక్షి, ముంబై: బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న 'ఆవారాపన్ 2' మూవీతో ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తున్న నటుడు సువిందర్ విక్కీ( Suvinder Vicky). బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఆవారాపన్ 2' లో అద్భుత నటనతో గుర్తింపు పొంది, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పదండి ఆయన బాలీవుడ్ జర్నీ ఎలాసాగింది, ఇంత సక్సెస్ ఎలా వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాం.సినీ రంగంలో రాణించాలంటే నటన మీద ఆసక్తి ఉన్నంతనే సరిపోదు. ఎన్నో కష్ట నష్టాలు, అవమానాలు భరించాల్సి ఉంటుంది. అలా ఎంతోమంది నటులు ఏళ్ల తరబడి పోరాటం తరువాత రాణించినవారే. సువిందర్ విక్కీ సక్సెస్ స్టోరీ కూడా అలాంటిదే. ఆయన వెండితెర ఎంట్రీ అంత ఆషామాషీగా జరగలేదు. ఆరంభంలో పొట్టనింపుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఇదీ చదవండి : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు బెంగాల్ కోర్టు షాక్పంజాబ్కు చెందిన సువిందర్ విక్కీ సినీ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన ప్పటికీ చిన్న వయసులోనే సినిమాలపై ఆసక్తి కలిగింది.పంజాబీ విశ్వవిద్యాలయం (పాటియాలా)నుంచి థియేటర్ మరియు టెలివిజన్‌లో ఎంఏ పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో కేవలం రూ.5,000 చేతిలో పెట్టుకుని ముంబైకి వచ్చారు. అయితే నెల రోజుల్లోనే ఆ డబ్బులు అయిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి పంజాబ్ వెళ్లాల్సి వచ్చింది. ముంబైలో ఉన్నప్పుడు కనీసం ఒక పూట భోజనానికి కూడా డబ్బు లేని క్లిష్ట పరిస్థితులను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో, పొట్టకూటి కోసం ఆయన కొంతకాలం ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా కూడా పాలసీలు విక్రయించారు. తిరిగి చాలాకాలానికి 50 ఏళ్ల వయసులో స్టార్‌డమ్‌ను సాధించారు.నటనలో అరంగేట్రంపంజాబ్కు తిరిగి వచ్చిన తర్వాత, సువిందర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం ప్రారంభించారు. 2004లో 'దేస్ హోయా పర్దేస్' అనే పంజాబీ చిత్రంతో అరంగేట్రం చేశారు. తర్వాత 'ఉడ్తా పంజాబ్', అక్షయ్ కుమార్ నటించిన 'కేసరి' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. 50 ఏళ్ల వయస్సులో నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన 'కోహ్రా' (Kohrra) వెబ్ సిరీస్‌తో ఆయనకు నటుడిగా గుర్తింపు లభించింది. ఇందులో ఆయన నటనను సినీ ప్రముఖులు ఎంతగానో ప్రశంసించారు. ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!ఆ తర్వాత ఆయన రణ్వీర్ సింగ్ చిత్రం 'ధురంధర్: ది రివేంజ్', దిల్జీత్ దోసాంజ్ చిత్రం 'సట్లజ్', మూవీల్లో నటించారు. ముఘ్యంగా 'ధురందర్: ది రివెంజ్'లో చిన్నదైనా ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇందులో ఆయన అర్జున్ రాంపాల్ పోషించిన మేజర్ ఇక్బాల్ పాత్ర తండ్రిగా నటించారు. తెరపై తక్కువ సమయం కనిపించినప్పటికీ, ఎంతో మంది సూపర్‌స్టార్స్ కనిపించిన ఈ చిత్రంలో తనదైన ముద్ర వేయగలిగారు. ప్రస్తుతం 'అవారపన్ 2' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడం సువిందర్ విక్కీ జీవితంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం -
జైల్లో ఒకరిపై ఒకరు పడుకోవాల్సిందే: శిల్పా శెట్టి భర్త
ముంబై: 2021 నాటి పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో తన అనుభవాలను వెల్లడించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తూనే, దాదాపు రెండు నెలల పాటు జైలులో గడిపిన భయానక పరిస్థితులపై ఆయన మాట్లాడారు.ఇటీవల ‘ఏబీపీ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. విచారణ కోసమే పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు భావించానని, అయితే అక్కడికి వెళ్లాకే తన అరెస్టు వార్తను ఆన్లైన్లో చూసి తెలుసుకున్నానని చెప్పారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా, ఇది కోర్టు ఆదేశమని వారు తెలిపారని గుర్తుచేసుకున్నారు.తన అరెస్టు విషయం శిల్పా శెట్టికి వార్తల ద్వారానే తెలిసిందని కుంద్రా పేర్కొన్నారు. ‘ఆమె న్యాయవాదులను సంప్రదించినప్పటికీ ఏమి చేయాలో తోచని స్థితిలో పడిపోయింది. ఆ సమయంలో భారతదేశంలో మా వ్యాపారాల్లో దాదాపు 4,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 'వీటన్నింటినీ నేనెలా నిర్వహించాలి?’ అని శిల్ప ఆందోళన చెందింది. 63 రోజుల పాటు జైలులో ఉండాల్సి వస్తుందని నాతో చెప్పారు కానీ, అసలు ఎంత సమయం పడుతుందో నాకప్పుడు తెలియదు’ అని ఆయన తెలిపారు.జైలులోని వసతుల లేమిపై స్పందిస్తూ.. ‘50 మంది మాత్రమే పడుకోవడానికి సరిపోయే ఒక చిన్న గదిలో ఏకంగా 250 మందిని ఉంచారు. ఒకరిపై ఒకరు పడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కనీసం కాలు కింద పెట్టడానికి కూడా స్థలం ఉండేది కాదు. అక్కడ ఆహారం కూడా అత్యంత దారుణంగా ఉండేది’ అని రాజ్ కుంద్రా వివరించారు.ఇది కూడా చదవండి: ఫిట్నెస్ ఈవెంట్లో కుప్పకూలిన ప్రముఖ కోచ్ -
నెలకు రూ.33 లక్షలు.. బిగ్‌బీ కొత్త లీజు ఒప్పదం!
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరో భారీ రియల్ ఎస్టేట్ ఒప్పందంతో వార్తల్లో నిలిచారు. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో ఉన్న ఓ వాణిజ్య భవనంలోని మూడు అంతస్తులను ప్రముఖ పోషకాహార సంస్థకు లీజుకు ఇచ్చారు. లింక్ రోడ్డులోని సిగ్నేచర్ భవనంలో ఉన్న సుమారు 8,428 చదరపు అడుగుల విస్తీర్ణంలోని కార్యాలయ స్థలాన్ని అమితాబ్ బచ్చన్ లీజుకు ఇచ్చినట్లు సమాచారం.అద్దె రూపంలో రూ.21.88 కోట్లు..ఈ ఒప్పందం ప్రకారం ఆయనకు నెలకు రూ.33 లక్షల అద్దె రానుందట. 2026 ఆగస్టు 15 నుంచి ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగనుందట. మొత్తం కాలానికి అద్దె రూపంలో సుమారు రూ.21.88 కోట్లు వచ్చే అవకాశం ఉందని టాక్. ప్రతి ఏడాది అద్దెను 5 శాతం పెంచేలా ఒప్పందంలో నిబంధనను చేర్చినట్లు తెలుస్తోంది.మరోసారి చర్చ..అద్దెకు తీసుకున్న సంస్థకు కార్యాలయ స్థలంతో పాటు తొమ్మిది పార్కింగ్ స్థలాలను కూడా వినియోగించుకునే హక్కు కల్పించారట. ఈ లావాదేవీలో భాగంగా రూ.1.98 కోట్ల భద్రతా డిపాజిట్‌ను చెల్లించినట్లు సమాచారం.ఇప్పటికే ముంబైలో పలు విలాసవంతమైన నివాసాలు, వాణిజ్య భవనాలను కలిగి ఉన్న అమితాబ్ బచ్చన్.. ఇటీవల అయోధ్యలోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఆయన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంపై మరోసారి చర్చ మొదలైంది.ఇదీ చదవండి: 15ఏళ్ల తరువాత ‘జిందగీ’ సీక్వెల్‌పై అప్డేట్ -
షారుక్ ఇంటి వద్ద 2 పాముల కలకలం.. ఒకటి చిక్కి, మరొకటేమో..
ముంబై: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఇంటి వద్ద పాము కలకలం రేపింది. ఇంటి ప్రాంగణంలో పాము కనిపించడంతో అక్కడున్నవారు ఆందోళనకు గురయ్యారు. దీంతో పామును సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. షారుక్ ఖాన్ ముంబై నివాసంలోని పచ్చిక ప్రదేశంలో పాము కనిపించడంతో దానిని పట్టుకునేందుకు సంబంధిత సిబ్బంది శ్రమించారు. బాంద్రా వెస్ట్‌లోని మన్నత్‌లో 2 పాములు చుట్టుకుని తిరుగుతున్నట్లు రాత్రి 8 గంటల సమయంలో స్నేక్ క్యాచర్ విక్కీ దూబేకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే దూబే అటవీ శాఖ రౌండ్ అధికారి దీపక్ దాదా గైక్వాడ్‌కు, ముంబై రేంజ్ కార్యాలయం, థానేకు కంట్రోల్ రూమ్ ద్వారా ఫోన్ చేసి ఘటన గురించి తెలియజేశారు.విషపూరిత పాము కాదుఅధికారులు అక్కడికి చేరుకున్నప్పుడు మన్నత్ బంగ్లా ప్రాంగణంలోని మెట్ల కింద విషపూరితంకాని ధామన్ పాము కనిపించింది. దీనిని ఇండియన్ ర్యాట్ స్నేక్ అని కూడా పిలుస్తారు. పాము చుట్టుకుని ఉండి భయపడినట్లు కనిపించింది.పామును సురక్షితంగా పట్టుకుని అటవీ శాఖ మార్గదర్శకాల ప్రకారం తిరిగి సహజ ఆవాసంలోకి వదిలేశారు. విషపూరితంకాని ధామన్ పాము సుమారు 8 అడుగుల పొడవు ఉంది. పామును పట్టుకున్న తర్వాత దూబే అక్కడ ఉన్న వారికి పాము గురించి వివరించి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే, చుట్టుపక్కల ప్రజలు తిరుగుతున్నట్లు గమనించిన రెండో పాము బంగ్లా ప్రాంగణం నుంచి తప్పించుకుంది. -
కూతురి కంటే చిన్నమ్మాయితో డేటింగ్.. కానీ చివరకు
సామాన్యుల సంగతేమో గానీ సెలబ్రిటీల జీవితాల్లో పెళ్లి, విడాకులు అనేది ఎప్పటికప్పుడు వినిపిస్తున్నట్లే ఉంటాయి. హిందీ ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత అయిన రాజా చౌదరి కూడా రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో తన కూతురి కంటే చిన్న వయసున్న అమ్మాయితో డేటింగ్ చేశాడు. కానీ చివరకు ఆమెతోనూ విడిపోవాల్సి వచ్చింది. ఆ సందర్భాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. ఇంతకీ అసలేమైందంటే?(ఇదీ చదవండి: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి.. ఎప్పుడు ఎక్కడంటే?)భోజ్‌పురి సినిమాలు, హిందీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న రాజా చౌదరి.. బాలీవుడ్లో పలు చిత్రాల్లో చిన్న, సహాయక పాత్రల్లో చేశాడు. 'బిగ్ బాస్ 2'లో ఫస్ట్ రన్నరప్‌గానూ నిలిచాడు. తన తోటి నటి శ్వేతా తివారిని 1998లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు పాలక్ అనే కూతురు కూడా పుట్టింది. కొన్నేళ్లకే వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడంతో 2007లో ఇద్దరూ విడిపోయారు. ఆ టైంలోనే రాజాపై శ్వేతా తివారి గృహహింస కేసు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది జరిగిన ఐదేళ్లకు అంటే 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.నాలుగేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజా చౌదరి.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2015లో శిల్పి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు, కొంతకాలం ఆమెతో డేటింగ్ చేసినట్లు చెప్పాడు. కానీ తమ మధ్య వయసు వ్యత్యాసం కారణంగా శిల్పి తన ఆలోచన మార్చుకోవడంతో విడిపోయామని వెల్లడించాడు. తన కూతురు పాలక్ కంటే తాను చిన్నదాన్నిఅని శిల్పి తరచూ ప్రస్తావించేదని తెలిపాడు.ఇక శిల్పితో విడిపోయిన కొన్నాళ్లకు రాజా చౌదరి జీవితంలోకి శ్వేతా సూద్ వచ్చింది. కార్పొరేట్ రంగంలో హెచ్ఆర్గా పనిచేసే శ్వేతని 2015లో వివాహం చేసుకోగా.. తర్వాత ఈమె నుంచి కూడా విడిపోయాడు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనే తన రెండో భార్య శ్వేతా సూద్, భరణం కోసం డిమాండ్ చేసిందని రాజా వెల్లడించాడు. రీసెంట్ టైంలో మళ్లీ ఇంటర్వ్యూలు ఇస్తూ తన మాజీ భార్య శ్వేతా తివారి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజా చౌదరి వార్తల్లో నిలుస్తున్నాడు.(ఇదీ చదవండి: రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో: హీరో యష్) -
తండ్రి కుల వ్యవస్థకు వ్యతిరేకం.. అందుకే నా ఇంటిపేరు ‘బచ్చన్’
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-18’ కార్యక్రమంలో అమితాబ్ ఇంటి పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన తండ్రి ప్రముఖ హిందీ కవి హరివంశ్రాయ్ బచ్చన్ చిన్నప్పటి నుంచే కుల వ్యవస్థను వ్యతిరేకించేవారని అందుకే కుటుంబ ఇంటిపేరుగా బచ్చన్ ఎంచుకున్నారని తెలిపారు.పాఠశాల అడ్మిషన్ సమయంలో దరఖాస్తు ఫారంలో కులానికి సంబంధించిన కోలమ్ ఉండేదని చెప్పారు. అక్కడ నింపినప్పుడు తన తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ కుల వ్యవస్థను అంగీకరించకుండా మా కులం బచ్చన్ అని నమోదు చేశారని తెలిపారు. అప్పటి నుంచి తమ కుటుంబ ఇంటిపేరుగా బచ్చన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.కాగా, అమితాబ్ బచ్చన్ అసలు పేరు అమితాబ్ శ్రీవాస్తవ. 1942లో అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్(ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్)లో జన్మించారు. ఆయన తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రముఖ కవిగా గుర్తింపు సాధించారు.ఇక అమితాబ్ సినీ ప్రయాణం ‘సాత్ హిందుస్తానీ’ చిత్రంతో ప్రారంభమైంది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్న ఆయన.. ‘జంజీర్’, ‘దీవార్’, వంటి చిత్రాలతో బాలీవుడ్లో అగ్ర నటుడిగా ఎదిగారు. ప్రస్తుతం వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. -
14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!
మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్న కేజీఎఫ్ (KGF) స్టార్, యష్ (Yash)కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట సందడిగా మారింది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల తరువాత యష్‌పై క్రేజ్ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో సౌత్ సూపర్ స్టార్ యష్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే. ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు (1.4 కోట్ల) పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే యష్ కేవలం ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతారని మీకు తెలుసా?అవును ఈ కన్నడ హీరో తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలో అయ్యేది కేవలం ఒకే ఒక్కరిని. ఇటీవల ఒకటీవీ షోలో యష్ తన రాబోయే చిత్రాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను కూడా పంచుకున్నారు. ఆ సమయంలో, ప్రేక్షకుల మధ్య కూర్చున్న ఒక అమ్మాయి యష్‌ను ఒక ప్రశ్న అడిగింది. “మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, కానీ మీరు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతారు. ఎవరా వ్యక్తి, మీ జీవితంలో వారి విలువ ఏమిటి?” అన్న ప్రశ్నకు యశ్ ఇచ్చిన సమాధానం అతని లక్షలాది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.దీనికి సమాధానంగాయష్ నవ్వుతూ, “ఆమె నా భార్య” ఎంతో ప్రేమగా బదులిచ్చారు. ఇది విన్న స్టూడియో మొత్తం చప్పట్లతో మారుమోగింది. "ఆమె నా భార్య మాత్రమే కాదు, నా జీవితంలో ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఒకవేళ నేను తనని కూడా ఫాలో అవ్వకుండా జీరో పెడితే నాకు ఇబ్బందులు తప్పవు" అని సరదాగా వ్యాఖ్యానించారు. "నిజం చెప్పాలంటే, ఆమె నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. మేమిద్దరం కలిసి ఎదిగాము. ఆమె నాకు భార్యగా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె నా జీవితానికి బలమైన ఆధారం." అంటూ చెప్పారు.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనంరెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముని పాత్రలో, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణునిగా, యశ్ రావణునిగా కనిపించనున్నారు. ఇక సన్నీ డియోల్ హనుమంతుని పాత్రను పోషిస్తున్నారు. 'రామాయణం మొదటి భాగం' విదేశాలలో నవంబర్ 6, 2026న, భారతదేశంలో నవంబర్ 8, 2026న విడుదల కానుంది. 'రామాయణం: రెండవ భాగం' 2027 దీపావళికి థియేటర్లలోకి రానుంది. 'రామాయణం'తో పాటు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో మూవీ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ చిత్రంలో యష్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. యష్‌తో పాటు, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, నయనతార మరియు రుక్మిణి వంటి కథానాయికలు కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. చివరకు, ఈ చిత్రం ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది.ఇదీ చదవండి: ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్‌కు బాబా రామ్‌దేవ్ హెచ్చరికకాగా యష్ రాధికా పండిట్ 2007లో 'నంద గోకుల' అనే కన్నడ సీరియల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారి, 2016 డిసెంబరులో వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా, యథర్వ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Coreculture (@coreculture.inn) -
ప్రళయ్ ప్రారంభం
‘ధురంధర్, ధురంధర్: ది రివెంజ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఈ సినిమాకి రణ్వీర్ సింగ్ ఓ నిర్మాత కూడా. ‘స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ’ సిరీస్ ఫేమ్ దర్శకుడు జై మెహతా ఈ సినిమాకు దర్శకుడు.ఈ చిత్రానికి ‘ప్రళయ్’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. అలాగే ఇందులోని ఓ ప్రధాన పాత్రలో కళ్యాణీ ప్రియదర్శన్ నటిస్తున్నారని తెలిసింది. -
మళ్లీ ప్రేమకథ షురూ
కార్తీక్ ఆర్యన్, శ్రీలీల వెండితెర ప్రేమకథ మళ్లీ షురూ అయింది. ఈ ఇద్దరూ జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పాటలకు మంచి ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రానికి ‘తూ మేరీ జిందగీ హై’ టైటిల్‌ని అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.తాజాగా ముంబైలో మళ్లీ ఈ ప్రేమకథా చిత్రం షూటింగ్‌ని షురూ చేశారు. శ్రీలీల పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఇక ఎలాంటి వాయిదాలు లేకుండా సినిమాని పూర్తి చేసేలా అనురాగ్ బసు ప్లాన్ చేశారని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారని టాక్. హిందీలో శ్రీలీలకి ఇదే తొలి చిత్రం. సౌత్‌లో స్టార్‌గా ఎదిగిన శ్రీలీల ఈ చిత్రంతో హిందీలోనూ దూసుకెళతారనే అంచనాలు ఉన్నాయి. -
పాన్‌మసాలా ప్రచారాలు ఆపాలంటూ స్టార్ హీరోలకు నోటీసులు
పాన్‌మసాలా ప్రకటనల్లో నటించిన బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘విమల్’ పాన్‌మసాలా ప్రకటనలకు సంబంధించిన ప్రచార కంటెంట్‌ను 15రోజుల్లో తొలగించాలని వీరికి ఆదేశించింది.ఈ నోటీసులు ఆగస్టు 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారాయ్ జారీ చేశారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆదేశాలను పాటించకపోతే 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. తప్పుడు ప్రకటనలు, ఆహార ఉత్పత్తుల ప్రచారంపై ఉన్న నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ నోటీసులు పంపించినట్లు పేర్కొంది.కాగా నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలను ఇప్పటికీ సోషల్ మీడియాతో పాటు ఇతర వేదికల్లో ప్రచారంలో ఉన్నాయి. పాన్‌మసాలా ఉత్పత్తుల ప్రకటనల్లో ప్రముఖుల భాగస్వామ్యంపై గత కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఇండస్ట్రీలో విషాదం.. 27 ఏళ్లకే చనిపోయిన నటి
7 అవర్స్ టు గో, ది ఫైనల్ ఎగ్జిట్, ఘోస్ట్ లాంటి హిందీ సినిమాలతో పాటు 'తగ్గేదే లే' అనే తెలుగు మూవీలోనూ నటించిన అనన్య రాజ్(27) చనిపోయింది. గత నెల 15న ఆమె నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఈమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనన్య ఇన్ స్టాలో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. దీంతో తోటి నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: విశ్వనాథ్ అండ్ సన్స్.. రెండో రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?)అనన్య రాజ్ గత ఏడాది కాలంగా శారీరక, మానసిక సమస్యలతో బాధపడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఇబ్బందులని అధిగమించేందుకు ఎంతో ధైర్యంగా పోరాడినట్లు రాసుకొచ్చారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నందున తమ వ్యక్తిగత గోప్యతని గౌరవించాలని అభిమానులు, మీడియాని కోరారు.'ఈ వార్తని ఎంతో బాధతో తెలియజేస్తున్నాం. జూలై 15న తెల్లవారుజామున అనన్య కన్నుమూసింది. నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచింది. గత ఏడాది కాలంగా ఆమె శారీరక, మానసిక అసౌకర్యాలతో పోరాడింది. వాటిని అధిగమించేందుకు యోధురాలిలా పోరాడింది' అని అనన్య ఇన్ స్టాలో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Ananya ✨ (@ananyaraj.official) -
అవసరమైతే కండోమ్ యాడ్ కూడా చేస్తా : యష్
కన్నడ స్టార్ హీరో యష్, బాలీవుడ్ నటి కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘తబాహీ’ పాట సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమైంది. పాటలో యష్, కియారా అద్వానీ మధ్య కనిపించిన బోల్డ్ సన్నివేశాలపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు ఈ పాటను ఏకంగా కండోమ్ ప్రకటనతో పోల్చుతూ ట్రోల్ చేశారు. తాజాగా ఈ విమర్శలపై యష్ స్పందించారు.ఓ టీవీ షోలో పాల్గొన్న యష్‌కు ‘తబాహీ’ పాటపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన తనదైన శైలిలో సరదాగా స్పందించారు. ‘అవసరమైతే కండోమ్ ప్రకటన కూడా చేస్తాను. కానీ అందుకు డబ్బులు తీసుకుని చేస్తాను. అలా ఉచితంగా చేయను’ అని యష్ వ్యాఖ్యానించారు. ఆయన సమాధానంతో కార్యక్రమంలో ఉన్న ప్రేక్షకులంతా గట్టిగా నవ్వారు. విమర్శలను సీరియస్‌గా తీసుకోకుండా హాస్యభరితంగా స్పందించడం ద్వారా యష్ ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చారు.ఇక టాక్సిక్ చిత్రంలోని బోల్డ్ కంటెంట్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా సాధారణంగా అందరికీ ఉద్దేశించిన కథ కాదని, పెద్దలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఫెయిరీ టేల్ అని ఆయన స్పష్టం చేశారు. ‘పిల్లలు ఇంట్లో ఉండాలి. ఈ చిత్రాన్ని చూడకూడదు’ అని ఆయన అన్నారు. దీంతో సినిమాలోని కంటెంట్ ఏ వర్గం ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారనే దానిపై మరింత స్పష్టత వచ్చింది.గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. -
భారత సైన్యమే మనల్ని కాపాడుతోంది
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ భారత సైనికులతో కలిసి సందడి చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని ఉరీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన సైనికులతో ముచ్చటించారు.‘ప్రపంచవ్యాపంగా జరుగుతున్న యుద్ధాల కోసం నా పిల్లలు తైమూర్, జెహ్ తరుచూ నన్ను అడుగుతుంటారు. ఆ యుద్ధాలను చూసి పిల్లలు భయపడుతుంటారు. మమ్మల్ని ఎవరు కాపాడతారు? పరిస్థితులు మరింత దిగజారుతాయా? అని అడుగుతుంటారు. అప్పుడు నేను భారత సైన్యం మనల్ని రక్షిస్తోందని చెబుతుంటాను’ అని సైఫ్ తెలిపారు.కాశ్మీర్ దేశంలోనే అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటన్నారు. తన తల్లి, ప్రముఖ నటి షర్మిలా ఠాగుర్ నటించిన తొలి చిత్రం ‘కశ్మీర్ కీ కలి’ తో పాటు అనేక చిత్రాల పాటలు కశ్మీర్‌లోనే చిత్రీకరణ జరిగిందని తెలిపారు.ఇక సినిమాల విషయానికి వస్తే.. సైఫ్ ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైవాన్’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తరువాత అక్షయ్‌కుమార్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రం సెప్టెబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'హద్దుల్లో ఉంటే మీకే మంచిది'.. గోవిందా స్ట్రాంగ్ కౌంటర్..!
బాలీవుడ్ ఇప్పుడు గోవిందా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన భార్య సునీత ఆరోపణలతో బీటౌన్ అంతా ఆయన వైపే చూస్తోంది. ఇటీవల సహ నటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో గోవిందా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఈ వివాదం మొదలైంది. కూతురు వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడని ఆయన సతీమణి సునీత అహుజా విమర్శించింది. ఇలాంటి పనులు చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలని కాస్తా ఘాటుగానే కామెంట్స్ చేసింది. తాజాగా తన భార్య చేస్తున్న కామెంట్స్‌పై నటుడు గోవిందా రియాక్ట్ అయ్యారు. మీ హద్దుల్లో మీరు ఉంటే ఇద్దరికీ మంచిదని అన్నారు. సునీత అనవసరంగా తన పనిలో జోక్యం చేసుకుంటోందని.. తనకు ప్రజల మద్దతు కోల్పోయేలా చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. నన్ను అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారని అన్నారు.సాధారణ కుటుంబాల నుంచి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించే వారిని అవమానించకూడదని గోవిందా అభిప్రాయపడ్డారు. సునీతకు పలుకుబడి, అధికారం, కీర్తి, గౌరవం, సంపద అన్ని ఉన్నాయని.. కానీ అంతమాత్రాన తక్కువ ఉన్నవారిని అవమానించడం సరికాదన్నారు. దేశంలో చాలామంది స్టార్ నటులు తమకంటే తక్కువ వయస్సు ఉన్నవారితో నటించారని గోవిందా గుర్తు చేశారు. అభిమానులు నన్ను యవ్వనంగా చూడడం మీకు ఇష్టం లేనట్లుందని అన్నారు.కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని గోవిందా ఆరోపించారు. మీకు మళ్లీ నా మద్దతు అవసరమయ్యే సమయం వస్తుందని నేను నమ్ముతున్నానని తెలిపారు. అందుకే దయచేసి నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. నన్ను బహిరంగంగా అవమానించడం ఆపాలని కోరుతున్నా.. దయచేసి మీరు మీ హద్దులు పాటించండంటూ సునీతకు స్పష్టం చేశారు. మీ నుంచి ఇలాంటి దుర్భాష తాను ఆశించడం లేదన్నారు. ప్రజలు మిమ్మల్ని స్పూర్తిగా తీసుకునేలా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. This is going worse between Govinda and her ex-Wife Sunita AhujaEarlier Sunita called out Govinda for trapping young girls of his daughter's ageNow Govinda hit out by saying:"Many superstars worked with young girls""Sunita You remain in ur limits"This Is Going UGLY🤡 pic.twitter.com/p9JTlBFLVw— Dear Men (@Dear_Men_Life) August 15, 2026 Govinda gets emotional over his wife Sunita Ahuja’s statement. 😭💔 pic.twitter.com/aMIW8Vfg5x— T-Celebs (@t_celebs) August 15, 2026 -
20 ఏళ్ల వయసు గ్యాప్.. ఆమెని దూరం పెట్టాలని ట్రై చేశా కానీ
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. దక్షిణాది ప్రేక్షకులకు కూడా తన సినిమాలతో సుపరిచతమే. రీసెంట్ టైంలో మహారాజా, డెకాయిట్ లాంటి తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పరంగా ఈయన ఎలాంటి మూవీస్ తీశారు, తీస్తున్నారు అనేది పక్కనబెడితే వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకంటే 20 ఏళ్ల చిన్నదైన అమ్మాయితో డేటింగ్ చేస్తుండటం గురించి మాట్లాడారు. ఈ మేరకు తమ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: విశాల్ సినిమాకు దారుణ పరిస్థితి.. రూ.కోటి కూడా రాలేదు!)అనురాగ్ కశ్యప్ గతంలో ఆర్తి బజాజ్ అనే ఎడిటర్ని పెళ్లి చేసుకున్నాడు. 12 ఏళ్ల పాటు సాగిన వీరి వైవాహిక జీవితం 2009లో ముగిసింది. తర్వాత నటి కల్కి కొచ్లిన్ని పెళ్లాడాడు. నాలుగేళ్లు అయ్యేసరికి వీళ్లు విడిపోయారు. అనంతరం కర్ణాటకకు చెందిన శుభ్రా శెట్టి అనే అమ్మాయితో అనురాగ్ ప్రేమలో పడ్డాడు. అలా గత 11 ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. దాదాపు పదేళ్ల క్రితం అనురాగ్ తన ఇన్ స్టాలో శుభ్రాతో కలిసి ఉన్న ఫొటోలని షేర్ చేయడంతో వీరి బంధం బహిరంగమైంది. తర్వాత కాలంలో వీళ్లు మీడియాకు దూరంగానే ఉంటూ వచ్చారు. తాజా ఇంటర్వ్యూలో తమ ప్రేమ, వయసు తేడా, రిలేషన్షిప్లో ఎదురైన సవాళ్ల గురించి ఇద్దరూ మాట్లాడారు.'తొలి రోజుల్లో మా బంధాన్ని మీడియాకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాం. మా వ్యక్తిగత జీవితంపై చర్చ జరగకూడదని అనుకున్నాం. కానీ ఓ జర్నలిస్ట్ మా రిలేషన్ గురించి ఆర్టికల్ రాయడంతో అది బయటపడింది. నాకు 20 ఏళ్ల వయసున్నప్పుడు అనురాగ్‌తో డేటింగ్ ప్రారంభించాను. అప్పటికే అనురాగ్‌కు పెళ్లయి ఓ కూతురు ఉంది. దీంతో మా సంబంధంపై నా తల్లిదండ్రులు మొదట్లో కంగారుపడ్డారు. చివరకు మా నిర్ణయాన్ని అంగీకరించారు. నా కంటే అనురాగ్‌కు జీవితానుభవం ఎక్కువ. దీంతో ఆయన నాకు స్వేచ్ఛ ఇచ్చారు. మొదట్లోనే అనురాగ్ నాపై ప్రేమ బయటపెట్టేశారు. కానీ నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేయకుండా, జీవితంపై నాకంటూ ఓ క్లారిటీ తెచ్చుకునేందుకు టైమ్ ఇచ్చారు' అని శుభ్రా చెప్పింది.'మా జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. నాకు సిగ్గుగా అనిపించలేదు కానీ ఓ దశలో వయసు తేడా కారణంగా నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. ఆమెని నా నుంచి దూరం పెట్టాలని ప్రయత్నించాను. ఆమె ముఖంలో వయసు పెద్దగా కనిపించదు. నేను వయసు పెరుగుతున్నా ఆమె మాత్రం అలాగే కనిపిస్తుండటంతో నాకు మరింత ఇబ్బందిగా అనిపించేది. ఓ దశలో శుభ్రా నాతో కలిసి షూటింగ్లో పాల్గొంది. ఆ అనుభవం మా బంధంపై నాకు మరింత క్లారిటీ వచ్చేలా చేసింది. చివరకు నాకు కావాల్సిన వ్యక్తి ఈమె అని నిర్ణయించుకున్నాను' అని అనురాగ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: వంటల ప్రోగ్రామ్‌లో సమంత.. ప్రెగ్నెన్సీతో చేస్తుందా?) -
డేటింగ్ యాప్‌లో హృతిక్ ప్రొఫైల్..!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, నటి సబా ఆజాద్‌ల బ్రేకప్‌పై ఊహాగనాలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ప్రముఖుల కోసం రూపొందించిన డేటింగ్ యాప్ ‘రాయా’లో హృతిక్ పేరుతో కనిపించిన ప్రొఫైల్ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడమే దీనికి కారణం. గతంలో పలుమార్లు వార్తలు..2022లో హృతిక్, సబా తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. అయితే గతంలో అనంత్ అంబానీ వివాహ వేడుకలకు హృతిక్ ఒంటరిగా హాజరుకావడం, మరికొన్ని కార్యక్రమాల్లో సబా కనిపిచకపోవడంతో వీరు విడిపోతున్నారనే ప్రచారం జరిగింది. తరువాత వీరి బ్రేకప్‌పై పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ.. బయట వీరిద్దరూ ముచ్చటగా కనిపిస్తూ ఆ వార్తలకు చెక్ పెట్టారు.అయితే ప్రస్తుతం ‘రాయా యాప్’లో హృతిక్‌కు సంబంధించినట్లు ఉన్న ఓ ప్రొఫైల్ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే ఈ ఖాతా నిజంగా హృతిక్దేనా? కాదా అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో నటి ఊర్వశి రౌతేలా 2024లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తాను ‘రియా యాప్’లో హృతిక్‌తో పాటు ఆదిత్య రాయ్ కపూర్ ప్రొఫైల్‌నూ చూసినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే తాను మాత్రం ఆ యాప్‌ను స్నేహితుల కోసమే ఉపయోగించానిని స్పష్టం చేశారు.కాగా హృతిక్ త్వరలో ‘క్రిష్4’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా కూడా పరిచయం కానున్నాడు. అయితే తన తండ్రి రాకేశ్ రోషన్‌తో కూడా ఓ సినిమాని చేయనున్నట్లు సమాచారం. -
'కొంచెమైనా సిగ్గుండాలి.. కూతురి వయసున్న అమ్మాయితో'
బాలీవుడ్ నటుడు గోవిందా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లు గోవిందాను వెనకేసుకొచ్చిన సునీత.. ఈ సారి మాత్రం గట్టిగానే కడిగేస్తోంది. ఇటీవల గోవిందా నటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో కనిపించడంతో సునీత ఫైరవుతోంది. తన కూతురు వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడు.. గోవిందాకు కొంచెమైనా సిగ్గుండాలని ప్రశ్నించింది.ఇటీవల ముంబయి విమానాశ్రయంలో గోవిందాతో పాటు నటి కోమల్ రాణి స్వర్ణకర్ జంటగా కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇది చూసిన కొందరు గోవిందా భార్య సునీత అహుజాను ప్రశ్నించారు. దీంతో ఆమె తనదైన శైలిలో స్పందించింది. అసలు వీళ్లిద్దరు సినిమా తీయకుండానే ప్రమోషన్స్ చేస్తున్నారా? అంటూ మండిపడింది. అతను తన కూతురి వయస్సులో ఉన్న అమ్మాయితో తిరుగుతున్నాడు... కనీసం కొంచెమైన సిగ్గుండాలి కదా సునీత నిలదీసింది.కోమల్ రాణి స్వర్ణకర్ ఎవరు?కోమల్ రాణి స్వర్ణకర్ బాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమైంది. గోవింద ఇటీవలే 'రూపా', 'దునియాదారి' చిత్రాలను ప్రకటించారు. వీటిలో 'రూపా' చిత్రంలో రాణి స్వర్ణకర్‌ను కథానాయికగా పరిచయం చేశారు. ఈ ప్రాజెక్టులను గోవిందానే నిర్మిస్తున్నారు. దీంతో గోవింద రాబోయే రెండు ప్రాజెక్టులలోనూ ఆమె భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఆరాధ్య బచ్చన్ కేసు: ‘ఇంటి పేరు ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా’
ఆన్లైన్లో తనపై తప్పుడు వార్తలు, అసత్య ప్రచారం జరుగుతోందంటూ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన ఇంటి పేరు ప్రతిష్ఠను ట్రేడ్‌మార్క్‌తో పోల్చవచ్చా? ఆ ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా? అనే అంశాలపై న్యాయస్థానం ప్రశ్నలు లేవనెత్తింది.2023లో ఆరాధ్య బచ్చన్, తన తండ్రి అభిషేక్ బచ్చన్‌తో కలిసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై యూట్యూబ్‌లో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని వీడియోల్లో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిందని, మరికొన్నింటిలో ఆరాధ్య మరణించిందని కూడా ప్రచారం చేసినట్లు ఆరోపించారు.ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ.. ఒక వ్యక్తి తన ప్రతిభ, కృషి, విజయాల ద్వారా సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠను ట్రేడ్‌మార్క్‌తో పోల్చవచ్చా? అలాంటప్పుడు ఆ పేరు ప్రతిష్ఠ తదుపరి తరాలకు బదిలీ అవుతుందా? అనే ప్రశ్నను అడిగారు.తప్పుడు ప్రచారం చేశారంటూ..ఆరాధ్య తరఫున వాదించిన న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ వివాదం కేవలం ఆరాధ్య వ్యక్తిగత ప్రతిష్ఠకు మాత్రమే సంబంధించినది కాదన్నారు. బచ్చన్ కుటుంబానికి చెందిన పేరు, ఫొటోలను ఉపయోగించి ఆమెకు క్యాన్సర్ వచ్చిందని, ఆమె మరణించిందని తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.ఈ కేసులో మూడు ప్రధాన అంశాలను పరిశీలించాలని హైకోర్టు నిర్ణయించింది. కుటుంబ పేరుకు సంబంధించిన ప్రతిష్ఠ తరతరాలకు వర్తిస్తుందా? తప్పుడు వార్తలు హక్కుల ఉల్లంఘనగా పరిగణించవచ్చా? పరువునష్టం మేధో సంపత్తి హక్కుల పరిధిలోకి వస్తుందా? అనే అంశాలపై విచారణ చేపట్టనుంది. -
రైల్వేశాఖ నిధులతో తీసిన ఏకైక సీరియల్ చూశారా?
భారత టెలివిజన్ చరిత్రలో 1980వ దశకం ఒక సువర్ణ అధ్యాయం. ఆ కాలంలో దూరదర్శన్‌లో ప్రసారమైన పలు కార్యక్రమాలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. అప్పట్లో కేవలం వినోదం మాత్రమే కాకుండా, దేశ సంస్కృతిని, వైవిధ్యాన్ని ప్రతిబింబించే అద్భుతమైన కార్యక్రమాలు టీవీ స్క్రీన్లపై కనిపించేవి. నాటి సమయంలో అంటే 40 ఏళ్ల క్రితం రైల్వే శాఖ స్పాన్సర్‌షిప్‌తో తెరకెక్కిన ఒక అరుదైన సీరియల్ ‘యాత్ర’. ఆ సీరియల్ దేశప్రజలను అమితంగా ఆకట్టుకుంది.రైలు ప్రయాణాల మధుర జ్ఞాపకాలురైలు ప్రయాణం అంటేనే ఒక ప్రత్యేకమైన అనుభూతి. దేశంలోని నలుమూలలకు చెందిన వ్యక్తులు ఒకే చోట కలుసుకోవడం కొత్త అనుభూతినిస్తుంది. సినిమాల్లోని ఐకానిక్ రైలు సన్నివేశాలు మొదలు దేశ విభజన నాటి కదిలించే ఘట్టాల వరకు రైళ్లు ఎన్నో భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచాయి. రైలు ప్రయాణాల నేపథ్యంలో రైల్వేశాఖ స్వయంగా స్పాన్సర్ చేసిన ఒక అద్భుతమైన టెలివిజన్ సీరియల్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.శ్యామ్ బెనెగల్ అద్భుత సృష్టి 'యాత్ర'ప్రముఖ దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆ 15 ఎపిసోడ్ల సీరియల్ ‘యాత్ర’. 1986లో సంచలనం సృష్టించింది. రైలు ప్రయాణాలలో ప్రజల దైనందిన జీవితాలు, వారిలోని ప్రత్యేక క్షణాలు, భావోద్వేగాల కథాంశంతో ఈ సీరియల్‌ను అత్యంత సహజంగా తెరకెక్కించారు. నాటి కాలంలో ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసిన అరుదైన ప్రయోగాత్మక సీరియల్ అది.ఓం పురి, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో ..ఈ 15 ఎపిసోడ్ల ప్రయాణంలో భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ఎంతోమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఓం పురి, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించగా.. ఎలా అరుణ్, మోహన్ గోఖలే, రవి ఝాంకల్, రాజేంద్ర గుప్తా, నిఖిల్ భగత్, ఇషితా అరుణ్, హరీష్ పటేల్ వంటి ప్రతిభావంతులైన తారలు ఇందులో తమ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.దేశాన్ని చుట్టబెట్టిన హిమ్సాగర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, 1986లో వచ్చిన ‘యాత్ర’ సీరియల్లోని ఎపిసోడ్లను హిమ్సాగర్ ఎక్స్‌ప్రెస్, త్రిపుర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చిత్రీకరించారు. కన్యాకుమారి నుండి జమ్ము తావి వరకు, అలాగే జైసల్మేర్ నుండి డూమ్ డూమా వరకు ఉన్న దూర ప్రాంతాలను, అక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఈ సీరియల్ ద్వారా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.భారతీయ రైల్వేల సహకారందర్శకుడు శ్యామ్ బెనెగల్ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ బృహత్ ప్రాజెక్టుకు భారతీయ రైల్వే శాఖ పూర్తి నిధులు సమకూర్చడమే కాకుండా అడుగడుగునా సహకరించింది. దేశంలోని సాధ్యమైనంత సుదీర్ఘమైన రెండు రైలు ప్రయాణాలను ఎంచుకుని ఈ షూటింగ్ పూర్తి చేశారు. అనేక రైల్వే స్టేషన్లలో యూనిట్ కోసం ప్రత్యేకంగా రైళ్లను నడిపించడం, మార్గం సుగమం చేయడం వంటి ఏర్పాట్లు రైల్వే శాఖ చేయడం విశేషం.రాజస్థాన్ వెన్నెల రాత్రులు.. సాహసాలుఈ సీరియల్ షూటింగ్ సమయంలో చిత్ర బృందం ఎన్నో అద్భుతమైన అనుభవాలను చవిచూసింది. రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో రాత్రి సమయంలో అద్భుతమైన వెన్నెల దృశ్యాలను చిత్రీకరించారు. అక్కడ కల్బేలియా జానపద నృత్య బృందం ప్రదర్శన ఇవ్వడం యూనిట్‌కు మరువలేని అనుభూతిని మిగిల్చింది. మధ్యప్రదేశ్‌లోని అడవుల్లో పౌర్ణమి రాత్రి బస చేసినప్పుడు ఎదురైన చిన్నపాటి ఉత్కంఠభరిత క్షణాలు ఊహించడం కూడా కష్టమే అంటారు అలనాటి నటులు. ఇది కూడా చదవండి: హీరోయిన్లతో ‘గోవిందా’ లీలలు.. బజారుకీడుస్తున్న సునీత! -
పదిహేడేళ్ల తర్వాత కలిసి నటిస్తున్న స్టార్ హీరోలు!
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ పదిహేడేళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం ‘హైవాన్’. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్ ఇతర పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ బ్యానర్స్‌పై వెంకట్ కె. నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ నిర్మించిన ఈ మూవీ సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. బుధవారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్లో సైఫ్ అలీఖాన్ని దివ్యాంగుడి పాత్రలో చూపించారు. అక్షయ్ కుమార్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించారు. ‘‘సరికొత్త థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హైవాన్’. ప్రియదర్శన్ తన మార్క్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. వెంకట్ కె. నారాయణ, శైలజా దేశాయ్ హై క్వాలిటీ ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మించారు. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్లో నటించారు అక్షయ్ కుమార్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ΄ోస్టర్‌కి ΄ాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన లభించింది. ఇప్పుడు టీజర్‌కి కూడా మంచి స్పందన వస్తోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: దివాకర్ మణి, సంగీతం: ప్రీతమ్ చక్రవర్తి. -
హీరోయిన్లతో ‘గోవిందా’ లీలలు.. బజారుకీడుస్తున్న సునీత!
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాలలోనూ హాట్ టాపిక్‌గా మారింది. భార్య సునీతా అహుజాతో బెడిసికొడుతున్న సంబంధం, రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ కోమల్ రాణితో నడుస్తున్న ప్రచారం నేపథ్యంలో, గోవిందా గతంలో పలువురు హీరోయిన్లతో నడిపిన రిలేషన్ షిప్ వార్తలు వైరల్ అవుతున్నాయి. గోవిందా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఆసక్తికరమైన చిట్టా ఇదే..నీలం కోఠారితో పెళ్లిపీటల దాకా వెళ్లిన వైనం90వ దశకంలో బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందిన నీలం కోఠారితో గోవిందా ప్రేమాయణం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆమెతో పెళ్లి కోసం అప్పటికే జరిగిన సునీతా అహుజాతో నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకోవాలని గోవిందా నిర్ణయించుకున్నట్లు బహిరంగంగానే వార్తలు వచ్చాయి. అయితే విధి మరోలా ఉండటంతో వీరిద్దరి దారులు వేరయ్యాయి.దివ్య భారతిపై మనసు పారేసుకున్న హీరో80వ దశకంలో అత్యంత అందమైన నటిగా పేరొందిన దివ్య భారతి పక్కన కూడా గోవిందా పేరు గట్టిగానే వినిపించింది. ‘షోరాలా ఔర్ షబ్నమ్’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటికే గోవిందా వివాహితుడైనప్పటికీ, దివ్య భారతి అందానికి ఆకర్షితుడైనట్లు ఆయనే ఒక సందర్భంలో తెలిపారు. అయితే వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్‌కు సంబంధించి వచ్చిన వార్తలు కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి.రాణీ ముఖర్జీతో తీవ్ర వివాదాలు2000 ప్రారంభంలో రాణీ ముఖర్జీ, గోవిందా మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. ‘హద్ కర్ ది ఆప్నే’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆన్ స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లో కూడా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఈ విషయం సునీతా అహుజాకు తెలియడంతో వారి కాపురం దాదాపు విడాకుల అంచుదాకా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.మాధురి దీక్షిత్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలుమాధురి దీక్షిత్‌తో గోవిందాకు ఎలాంటి ప్రేమ సంబంధం లేనప్పటికీ, వీరిద్దరి జంట గురించిన చర్చలు మాత్రం తరచూ జరిగేవి. ఒక ఇంటర్వ్యూలో గోవిందా మాట్లాడుతూ, తన జీవితంలో సునీతా గనుక లేకపోతే కచ్చితంగా మాధురి దీక్షిత్ వెంటపడేవాడినని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే నిజ జీవితంలో వీరి మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉంది.రవీనా టండన్‌తో సరదా జోకులుఅక్షయ్ కుమార్, రవీనా టండన్ల ప్రేమకథ బాలీవుడ్ లో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. అయితే రవీనా పేరు గోవిందాతో కూడా ముడిపడింది. వీరిద్దరూ స్వల్పకాలం పాటు డేటింగ్ చేసినట్లు గుసగుసలు వినిపించాయి. అంతేకాకుండా, ‘ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని’ అని రవీనా తనతో సరదాగా అనేదని సునీతా అహుజా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.ప్రస్తుత వివాదానికి అసలు కారణంప్రస్తుతం 63 ఏళ్ల వయసులో ఉన్న గోవిందా, తన భార్య సునీతా అహుజాతో విభేదాలు, కోమల్ రాణి స్వర్ణకార్‌తో విమానాశ్రయంలో కనిపించడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. గోవిందా లవ్ లైఫ్‌పై వస్తున్న ఈ తాజా ప్రచారాలు ఆయన అభిమానులను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇండస్ట్రీలో ఆయన గత ప్రేమాయణాల చరిత్రను మరోసారి తెరపైకి తెచ్చాయి.భార్య సునీతాతో బహిరంగ విమర్శలుకొద్దికాలంగా గోవిందా, ఆయన భార్య సునీతా అహుజాల మధ్య మనస్పర్థలు బహిరంగంగానే చర్చకు వస్తున్నాయి. భార్య తనను తరచూ కోపగించుకుంటుందని, మాటల తూటాలు పేలుస్తున్నదని గోవిందా ఇటీవలి కాలంలో పలు ఇంటర్వ్యూలలో పేర్కొనడం గమనార్హం. అయినప్పటికీ వీరిద్దరి సంసార జీవితం ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.నిత్యం వార్తల్లో నిలిచే హీరో నంబర్ వన్గోవిందా తన అద్భుతమైన డాన్స్, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగా అలరించారో, వ్యక్తిగత వివాదాలతోనూ అంతే స్థాయిలో వార్తల్లో నిలిచారు. ఎనభై, తొంబై దశకాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ హీరో లవ్ లైఫ్ ఎప్పుడూ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నేటికీ ఆయన వ్యక్తిగత జీవితం మీడియాలో టాప్‌లో నిలుస్తుండటం గమనార్హం. -
టాలీవుడ్‌కు శ్రీలీల దూరమవుతోందా? అసలు కారణం ఇదేనా!
ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీగా ఉన్న శ్రీలీల ప్రస్తుతం తెలుగు ప్రాజెక్టుల విషయంలో కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త తెలుగు సినిమా ఏదీ లేకపోవడంతో, టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయా అనే చర్చ మొదలైంది.దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందD’తో గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, ఆ తర్వాత చాలా మంది అగ్ర హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది. అయితే ‘రాబిన్‌హుడ్’, ‘మాస్ జాతర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే శ్రీలీల పూర్తిగా టాలీవుడ్‌కు దూరమవుతున్నారని చెప్పడం తొందరపాటే. ప్రస్తుతం ఆమె తమిళం, హిందీ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. తమిళ నటుడు ధనుష్‌తో ఓ తమిళ సినిమాలో నటిస్తుండగా, బాలీవుడ్‌లోనూ కార్తీక్ ఆర్యన్, ఇబ్రహీం అలీ ఖాన్ వంటి హీరోలతో ప్రాజెక్టులు చేస్తోంది.తెలుగులో వరుసగా సినిమాలు చేసిన తర్వాత శ్రీలీల ప్రస్తుతం ప్రాజెక్టుల సంఖ్య కంటే విభిన్నమైన కథలు, మంచి పాత్రల కోసం ఇతర భాషల్లో అవకాశాలపై దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. చాలా కాలంగా వరుసగా కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా శ్రీలీల కనిపించింది. ఇప్పుడు ఇతర పరిశ్రమల్లో తన పరిధిని విస్తరించుకోవడం ద్వారా కొత్త ఇమేజ్ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఓటీటీకి రష్మిక మందన్నా లేటేస్ట్ మూవీ.. అఫీషియల్ ప్రకటన
రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది.అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై అఫీషియల్‌గా ప్రకటన వచ్చేసింది. ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. గతంలో దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 📢 Official Announcement ▶️#CockTail2 (Hindi) Streaming from August 14 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/jpeSMvWDvR— OTT Trackers (@OTT_Trackers) August 12, 2026 -
నిషేధం ఓకే.. మరి అభిమానులు వద్దా? : జాన్వీని ప్రశ్నించిన హైకోర్టు
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె పేరుతో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న అశ్లీల, అభ్యంతరకర, డీప్‌ఫేక్, ఏఐ ఆధారిత కంటెంట్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసినప్పటికీ.. సోషల్ మీడియాలోని అన్ని ఫ్యాన్ క్లబ్‌లు, అభిమానుల పేజీలను ఒకేసారి తొలగించాలన్న అభ్యర్థనకు మాత్రం అంగీకరించలేదు.ప్రతి ఫ్యాన్ పేజీని నిషేధించలేంజాన్వీ కపూర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. ఆమె పేరు, ఫొటోలు, రూపాన్ని ఉపయోగించి అభ్యంతరకర వ్యాఖ్యలు, ఆన్లైన్ దూషణలు, మార్ఫింగ్ చేసిన చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలు, ఏఐ ద్వారా రూపొందించిన అశ్లీల కంటెంట్ వివిధ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం అవుతున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వేలాది వెబ్ లింకులను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 5,000 ఆన్లైన్ పేజీలకు సంబంధించిన అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించే దిశగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.అయితే ఇదే సమయంలో జాన్వీ కపూర్‌కు సంబంధించిన ప్రతి ఫ్యాన్ పేజీని చట్టవిరుద్ధమైనదిగా పరిగణించడం సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. అభిమానుల కోసం, వారి అభిమానం వ్యక్తం చేయడానికి మాత్రమే కొన్ని పేజీలు నిర్వహిస్తుండొచ్చని పేర్కొంది. అందువల్ల అన్ని ఫ్యాన్ క్లబ్‌లు, అభిమానుల పేజీలపై నిషేధం విధించడం సరికాదని స్పష్టం చేసింది.అభిమానులు వద్దా?విచారణ సందర్భంగా కోర్టు.. ‘మీకు అభిమానులు వద్దా?’ అని ప్రశ్నించింది. ఒక వ్యక్తిపై విమర్శలు చేయడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అభిమానంతో ఫ్యాన్ పేజీ నిర్వహించడం వంటి అంశాలను నేరుగా వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనగా చూడలేమని కోర్టు అభిప్రాయపడింది. అయితే అదే పేరుతో అశ్లీల లేదా తీవ్రంగా అభ్యంతరకరమైన కంటెంట్‌ను రూపొందించి ప్రచారం చేస్తే మాత్రం దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.ఈ సందర్భంగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే విమర్శలు, ఆన్లైన్ వ్యాఖ్యల విషయంలోనూ కోర్టు విస్తృత దృక్పథాన్ని ప్రస్తావించింది. వ్యక్తిత్వ హక్కుల పేరుతో ఇంటర్నెట్లోని ప్రతి విమర్శనాత్మక పోస్టును తొలగించడం సాధ్యం కాదనే అంశాన్ని కోర్టు స్పష్టం చేసింది. -
పెదాలపై అభిమాని ముద్దు.. స్పందించిన నటి
అవార్డు షోలో జరిగిన అనుకోని సంఘటనపై బాలీవుడ్ నటి నిఖితా రావల్ స్పందించింది. ఇటీవల జరిగిన రెడ్ కార్పెట్ కార్యక్రమంలో నిఖితా రావల్‌ను ఒక మహిళా అభిమాని ఆకస్మికంగా పెదవులపై ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనతో నిఖిత కొంతమేర అసౌకర్యానికి గురైంది. ఈ ముద్దు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు.తాజాగా నిఖిత ఈ సంఘటనపై స్పందించారు.సోషల్ మీడియాలో తనకు మద్దతుగా పంపిన అభిమానుల సందేశాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. మీ అందరి ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు దాచుకోవాల్సినదేమీ లేదు. నేను ఎల్లప్పుడూ సత్యం పక్షాన ఉంటాను’ అని రాసుకొచ్చింది.నిఖితా రావల్ బాలీవుడ్‌తో పాటు దక్షిణ భారతీయ చిత్రాల్లోనూ నటించారు. ఆమె నటించిన 'బ్లాక్ అండ్ వైట్', 'మిస్టర్ హాట్ మిస్టర్ కూల్', 'ది హీరో – అభిమన్యు', 'అమ్మా కి బోలి', 'గరం మసాలా', 'క్యూట్ కమీనా' చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం అర్షద్ వార్సీ, చంకీ పాండేలతో కలిసి 'రోటి కప్డా అండ్ రొమాన్స్' అనే చిత్రంలో నటిస్తున్నారు.SHOCKING 😲 😱😭😲#NikitaRawal Forcefully Kissesd by her Female FAN . Or just a PR Gimmick ? pic.twitter.com/WJF8uuC4y5— Manoz Kumar (@ManozTalks) August 9, 2026 -
విలన్‌గా స్టార్ హీరో.. టీజర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో విలన్‌గా నటిస్తోన్న లేటేస్ట్ ముూవీ హైవాన్. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో హైవాన్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, సయామీ ఖేర్, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకట్ కె నారాయణ, శైలజ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ స్టార్ హీరోకు నాపై క్రష్ ఉంది: బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్ సీజన్ 2’లో పాల్గొన్న ఆమె.. టామ్ క్రూజ్‌కు తనపై క్రష్ ఉందని, తనకు వీడియోలు కూడా పంపిస్తుంటారని తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘మీకు ఎప్పుడైనా ఎవరిపైనైనా క్రష్ కలిగిందా..?లేక మీపై ఎవరికైనా క్రష్ ఉందా..?’ అని కామెడీయన్ ఆదిత్య కులశ్రేష్ఠ(కుల్లు) మల్లికను అడిగారు. ‘అందరికీ నాపైనే క్రష్ కలుగుతుంది. ప్రస్తుతం టామ్ క్రూజ్‌కు కూడా నాపై క్రష్ ఉంది. మేమిద్దరం కలిసి పార్టీ చేసుకున్న సమయంలో తీసిన వీడియోలు క్రూజ్ నాకు పంపించినప్పుడు ఇతర కంటెస్టెంట్లకూ వాటిని చూపించేదానిని’ అని పేర్కొన్నారు. పెళ్లిపై మల్లికా ఏమన్నారం..మల్లికా గతంలో ఫ్రెంచ్ వ్యాపారవేత్త సిరిల్ ఆక్సెన్ఫ్యాన్స్తో రిలేషన్లో ఉండేవారట. 2024 నుంచి తాను సింగిల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. పెళ్లికోసం మాట్లాడుతూ.. ‘పెళ్లికి అనుకూలంగా లేను. అలా అని దానికి వ్యతిరేకం కూడా కాదు. ఇద్దరు వ్యక్తులు ఏం కోరుకుంటున్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది. అని తెలిపారు. కాగా కరణ్ జోహర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్ సీజన్ 2’ షో ఆగస్టు 13 నుంచి ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. శ్వేతా తివారీ, మునావర్ ఫారూఖీ, క్రిస్టల్ డిసౌజా, రణ్వీర్ బ్రార్, ఇక్కా, పారుల్ గులాటి, అభిషేక్, తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్
రంగీలా, గాయం, సత్య, భూత్ లాంటి సినిమాలతో అప్పట్లో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఊర్మిళా మతోండ్కర్.. ప్రస్తుతం నటనకు పూర్తిగా దూరమైంది. ఎనిమిదేళ్ల క్రితం ఓ మూవీ చేయగా, నాలుగేళ్ల క్రితం ఓ షోలో కనిపించింది. కొన్నాళ్ల క్రితం రాజకీయాల్లోకి కూడా వచ్చింది గానీ ఇందులోనూ ఎక్కువనాళ్లు ఉండలేదు. అలాంటి ఈమె ఉన్నఫలంగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఈమె మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్)ఊర్మిళా..2018లో నటుడు మొహ్సిన్ అక్తర్ మీర్ని పెళ్లి చేసుకుంది. కానీ వీళ్లిద్దరూ 2024లో విడాకులు తీసుకున్నారు. రీసెంట్గా మొహ్సిన్ మరో వివాహం చేసుకున్నాడు. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఇవి బయటకు రావడానికి కొన్ని గంటల ముందే ఉర్మిళ తన ఇన్ స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది.'ప్రేమ, సమయం, విధేయత లాంటి ఖరీదైన విషయాలే నాకు నచ్చుతాయి' అని ఊర్మిళా ఓ కోట్ షేర్ చేసింది. అయితే ఈమె తన మాజీ భర్తని ఉద్దేశించే పెట్టిందా అని పలువురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మొహ్సిన్ పేరు ప్రస్తావించనప్పటికీ అతడికి కౌంటర్ ఇచ్చేలా ఊర్మిళ తన భావాన్ని బయటపెట్టిందని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'డిసి' హీరోయిన్ వామికా ఖరీదైన 'ఐఫోన్' గిఫ్ట్) -
నసీరుద్దీన్ షా ఒక గుంటనక్క: కంగనా ఫైర్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనలపై బాలీవుడ్ నటీనటులు మౌనంగా ఉండటంపై షా ఇటీవల విమర్శలు చేశారు. ‘నోటిలో ఎముక ఉన్న కుక్క మొరగలేదు’ అని వ్యాఖ్యానిస్తూ, సెలబ్రిటీల మౌనాన్ని ఆయన ఎద్దేవా చేశారు.ఈ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జార్ఖండ్‌లో జరుగుతున్న నిరసనల గురించి నసీరుద్దీన్ షా ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, సీనియర్ నటుడిని ‘లొమ్డి’ (నక్క) అని అభివర్ణించారు. ‘ఇక్కడ నిజం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి వద్ద పని చేస్తున్నారు. కానీ, ఏ దేశపు రొట్టె తింటున్నానో, ఆ దేశాన్ని రక్షించడం, దాని కోసం పోరాడటం నాకు గర్వకారణం. నసీరుద్దీన్ షా తిన్నది ఈ దేశపు అన్నమే అయినా, పక్క దేశం కోసం వాదిస్తున్నారు’ అని కంగనా ఘాటుగా విమర్శించారు.కుక్కను ‘లొమ్డి’తో పోలుస్తూ, ‘నేటి కాలంలో విశ్వసనీయత చాలా అరుదు. అందుకే నసీరుద్దీన్ షా లాంటివారు నక్కగా ఉండటం కంటే, కుక్కగా ఉండటమే మేలు’ అని ఆమె పేర్కొన్నారు. గతంలో నసీరుద్దీన్ షా .. బాలీవుడ్ నటుల మౌనంపై అసహనం వ్యక్తం చేశారు. వారి మనస్సాక్షికి తగిన సమయం వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా స్పందిస్తారని, అయితే ప్రస్తుతం వారు ఎముక నోట్లో పెట్టుకున్న కుక్కల్లా ఉన్నారని చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.ఇది కూడా చదవండి: Time Travel: 1977 నుంచి 4413కు వెళ్లాక .. ఏం జరిగిదంటే.. -
డిసెంబరులో ఈఠా
మహారాష్ట్రకు చెందిన జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘ఈఠా’. మహారాష్ట్రకు చెందిన సంప్రదాయ కళలు ‘లవానీ’, ‘తమాషా’లో అత్యంత ప్రావీణ్యురాలైన విఠాబాయిగా వెండితెరపై శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. రణదీప్ హూడా ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ‘ఛావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దినేష్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మా శర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు మేకర్స్. అయితే ఆ తేదీకి విడుదల చేయడం లేదని, ఈ ఏడాది డిసెంబరు 4న రిలీజ్ చేయనున్నామని మంగళవారం నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. -
సినిమాగా మీర్జాపూర్ సిరీస్.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ఓటీటీలో ఆడియన్స్ క్రేజ్ దక్కించుకున్న సూపర్ సిరీస్ ‘మీర్జాపూర్’. ఇప్పుడు ఇగే వెబ్ సిరీస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్‌గా అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు తమ ఐకానిక్ రోల్స్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక జితేంద్ర కుమార్ ఎంట్రీ ఇచ్చి 'బబ్లూ పండిట్' పాత్రను పోషించడం కథలో అతిపెద్ద ట్విస్ట్‌గా మారబోతోంది. వీరితో పాటు భోజ్‌పురి స్టార్ రవి కిషన్ ఒక పవర్ఫుల్ రోల్లో మెరవనున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ చూస్తుంటే హిట్ ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమా వెబ్ సిరీస్‌లకు ప్రీక్వెల్‌గా సినిమా ఉంటుందని గతంలోనే టీమ్ తెలిపింది. సిరీస్ మూడు పార్ట్‌లలో చనిపోయినవారంతా తెరపై కనిపిస్తారని వెల్లడించింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గుర్మీట్ సింగ్ దర్శకత్వం వహించగా.. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. -
అగ్నివీర్‌గా స్టార్ నటుడి కుమార్తె.. ఎవరో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలోకి సినీ స్టార్స్ ఫ్యామిలీ నుంచి చాలామంది ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తుంటాం. మన పిల్లలు కూడా తల్లిదండ్రులను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చేవారు దాదాపు సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వస్తుంటారు. అది మన టాలీవుడ్లో కాస్తా ఎక్కువగానే ఉంటుంది.కానీ అందుకు భిన్నంగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది స్టార్ నటుడి కుమార్తె. ఆమె మరెవరో కాదు.. రేసుగుర్రంలో విలన్‌గా మెప్పించిన రవికిషన్ కూతురు. బాలీవుడ్ నటుడు రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఇండస్ట్రీని కాదని విభిన్నమైన కెరీర్ ఎంచుకుంది. అగ్నివీర్‌గా రక్షణ దళంలో చేరారు. తండ్రిలా కాకుండా డిఫరెంట్ కెరీర్‌ను ఎంచుకుంది.రవి కిషన్ కుమార్తె అయిన ఇషితా శుక్లాకు చిన్న వయసులోనే ఆర్మీలో పని చేయాలన్న ఆసక్తి పెరిగింది. బాలీవుడ్‌కు వెళ్లకుండా.. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)లో చేరారు. ఆ తర్వాత సైనిక శిక్షణ పొంది రక్షణ రంగంలో పనిచేసేందుకు సిద్ధమైంది. ఇషిత ఢిల్లీ డైరెక్టరేట్‌కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్‌లో పనిచేశారు. కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం కూడా శిక్షణ తీసుకున్నారు. కాగా.. ఇషిత శుక్లా 2023లో అగ్నివీర్‌గా చేరినట్లు తెలుస్తోంది. దీంతో దేశానికి సేవ చేయాలన్న ఇషిత నిర్ణయాన్ని అనుపమ్ ఖేర్‌తో సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
ముక్కుపుడక మింగేసిన హీరోయిన్.. వీడియో వైరల్
షూటింగ్ సెట్లో చిన్న చిన్న ప్రమాదాలు జరగడం సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. నటీనటులు సన్నివేశాలను సహజంగా చూపించేందుకు చేసే ప్రయత్నాల్లో అనుకోని ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా ప్రముఖ నటి, గాయని షెహ్నాజ్ గిల్‌కు కూడా ఇలాంటి ఊహించని అనుభవమే ఎదురైంది. ఓ సన్నివేశం కోసం వేగంగా పరుగెత్తుతున్న సమయంలో ఆమె ముక్కుపుడక అనుకోకుండా ఊడి నోట్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.షెహ్నాజ్ గిల్ నటిస్తున్న తాజా పంజాబీ చిత్రం ‘ఇష్క్నామా’. అరవింద్ ఖైర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ సీన్ కోసం ఆమె వేగంగా పరుగెత్తుతుండగా.. ముక్కుకు ఉన్న పుడక అనుకోకుండా ఊడి నోట్లోకి జారిపోయింది.ఈ ఘటనతో షెహ్నాజ్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. తీవ్రంగా దగ్గుతూ ఇబ్బంది పడుతున్న ఆమెకు పక్కనే ఉన్న సహనటుడు సౌరభ్ సచ్‌దేవా వెంటనే స్పందించారు. ఆమె వీపుపై తడుతూ సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షెహ్నాజ్ గిల్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియో చూసిన అభిమానులు షెహ్నాజ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. నటన పట్ల ఆమె చూపిస్తున్న అంకితభావాన్ని ప్రశంసిస్తూనే.. షూటింగ్ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సన్నివేశాలను పర్ఫెక్ట్గా చేయాలనే ప్రయత్నంలో నటీనటులు ఎదుర్కొనే ఇలాంటి అనుకోని ప్రమాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.ఇక ‘ఇష్క్నామా’ విషయానికి వస్తే.. భారత్‌లోని పంజాబ్‌కు చెందిన నిమ్మ అనే సిక్కు కవి, పాకిస్తాన్ పంజాబ్‌కు చెందిన నసీమ్ అనే ముస్లిం యువతి మధ్య సాగే సరిహద్దుల అతీతమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో షెహ్నాజ్ గిల్, జై రంధావా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సౌరభ్ సచ్‌దేవా, అంజుమ్ బత్రా, మహన్బీర్ భుల్లర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) -
మాతృత్వం ఓవైపు.. సినిమా మరోవైపు
సినీ తారలు అనుకున్నది సాధించేందుకు ఎంతటి కష్టాన్నైనా లెక్కచేయరు అనడానికి ఈ బాలీవుడ్ బ్యూటీ చక్కటి ఉదాహరణ. మాతృత్వం వంటి కీలక దశలోనూ తన వృత్తిపట్ల నిబద్ధతను చాటుకుంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భంతో ఉంది. అయినప్పటికీ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకుండా ‘రాకా’లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసేందుకు కష్టపడుతోందట. సంబంధించిన విషయాలు వైరల్ కావడంతో ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.షూటింగ్లో మళ్లీ బన్నీ..అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం ‘రాకా’. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కాస్త విరామం తీసుకున్న బన్నీ.. మళ్లీ షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు దీపికాకు సెప్టెంబర్‌లో డెలివరీ ఉండటంతో.. అంతకంటే ముందే తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ఆమె పట్టుదలతో పనిచేస్తోందట. షూటింగ్ షెడ్యూల్ రాత్రివేళ వరకు కొనసాగుతున్నా సెట్లోనే ఉంటూ తన సన్నివేశాలను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె అంకితభావాన్ని చూసి చిత్రబృందం సైతం ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం.గతంలోనూ వైరల్..దీపికా దాదాపు ఏడు నెలల గర్భంతో ఉన్న సమయంలోనూ ‘రాకా’ కోసం రోజూ షూటింగ్లో పాల్గొన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండటంతో ఆమె పాత్ర సవాల్‌తో కూడుకున్నదని తెలుస్తోంది. అయితే ఆమె పరిస్థితికి అనుగుణంగా చిత్రబృందం షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ మాస్ టేకింగ్‌కు అల్లు అర్జున్ క్రేజ్ తోడవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్. -
విడుదల తేదీ ఖరారు
బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ , సంజయ్‌దత్ నటించిన అంతర్జాతీయ చిత్రం ‘7 డాగ్స్’ ఇండియాలో రిలీజ్ కానుంది. ఈజిప్ట్ సూపర్‌స్టార్స్ అహ్మద్ ఎజ్, కరీమ్ అబ్దెల్ అజీజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటర్నేషనల్ మూవీ ‘7 డాగ్స్’. ‘బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్’, ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’ చిత్రాల ఫేమ్ దర్శక–ద్వయం ఆదిల్ ఎల్ అర్బీ, బిలాల్ ఫల్లా తెరకెక్కించారు. ఇటాలియన్ నటి మోనికా బెల్లూసి, అమెరికన్ యాక్టర్ గియాన్ కర్లో అలెశ్శాండ్రో కీలక పాత్రల్లో నటించారు. సెలా స్టూడియోస్, జనరల్ ఎంటర్టైన్ మెంట్ అథారిటీ, రియాద్ సీజన్ నిర్మించిన ఈ చిత్రం మిడిల్ ఈస్ట్‌లో ఈ ఏడాది మే 27న అరబిక్, ఇంగ్లిష్ భాషల్లో విడుదలై హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాను ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ నెల 21న భారత్‌లో రిలీజ్ చేయనున్నట్లు సోమవారం ప్రకటించి, ఓ వీడియో విడుదల చేశారు. -
‘వారణాసి’లో హనుమంతుడిగా రామ్ చరణ్?
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కథ త్రేతాయుగం నేపథ్యంలో జరిగే సన్నివేశాల కోసం మహేశ్ బాబును శ్రీరాముడిగా చూపించనున్నట్లు ఇప్పటికే రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘట్టానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఇందులో హనుమంతుడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.మొదట్లో ఈ పాత్ర కోసం ప్రముఖ నటుడు మాధవన్ పేరు వినిపించింది. అయితే ఆ పాత్రకు అవసరమైన ఇంటెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ దృష్ట్యా రామ్ చరణ్ అయితే హనుమాన్ పాత్ర తెరపై మరింత ప్రభావవంతంగా ఉంటుందని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జక్కన్న 'మగధీర' ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలను చరణ్‌తో చేశాడు. ఆ చిత్రాల అనుభవం కూడా ఈ కాంబినేషన్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. అయితే రామ్ చరణ్ ‘వారణాసి’లో హనుమంతుడిగా నటిస్తున్నారనే వార్తపై 'వారణాసి' చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం. -
అమితాబ్‌తో నటించాలనే కోరిక.. కోమాలో పాత్ర
బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, నటనలతో అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 18వ సీజన్ తొలి ఎపిసోడ్లో అమిర్‌ఖాన్, సన్నీడియోల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బచ్చన్ కుటుంబంతో కలిసి పనిచేసిన జ్ఞాపకాల్లో తనకు అత్యంత ఇష్టమైనది ఏంటని ప్రీతిని అడగ్గా.. ఓ సరదా సంఘటన గుర్తుచేసుకుంది.‘బచ్చన్ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తా, గౌరవిస్తా. అమిత్జీతో కలిసి నటించాలని చాలా రోజులుగా ఎదురుచూశాను. అందుకోసం చాలా ప్రయత్నించాను. చివరకు 2003లో వచ్చిన ‘అర్మాన్’లో ఆయనతో నటించే అవకాశం వచ్చింది. దర్శకురాలు హనీ ఇరానీతో ఈ సినిమాలో అమిత్జీతో నాకు ఒక్క సీన్ అయినా ఉండాలని అడిగాను. అందుకు హనీ ఇరానీ సరదాగా.. ‘‘అమిత్జీతో నటించాలని అంతగా కోరుకుంటున్నావా? అయితే ఆ సీన్లో నువ్వు చనిపోవాల్సిందే’’ అన్నారు. దీంతో మూవీ నా పాత్రని కోమాలో ఉండేలా పెట్టారు. నేను కోమాలో ఉన్నట్లు నటించాలి. అమిత్జీ నా దగ్గరకు వచ్చారు. ఆయన ఎదురుగా ఉండటంతో తెగ భయపడిపోయాను. చనిపోయినట్లు నటించడం ఎంత కష్టమో అప్పుడే తెలిసింది. నేను కదులుతుండటంతో.. ‘ప్రీతి సీన్ పాడుచేస్తున్నారు.. మీరు కదులుతున్నారు’ అని టీమ్ వాళ్లు నాపై కోపంగా అరిచేవాళ్లు’ అని ప్రీతి జింటా చెప్పుకొచ్చింది.2003లో రిలీజైన ‘అర్మాన్’లో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, ప్రీతి జింటా ప్రధాన పాత్రలు చేశారు. ప్రీతి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. వెంకటేశ్ సరసన ‘ ప్రేమంటే ఇదేరా’, మహేశ్ రాజకుమారుడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
బాలీవుడ్ నుండి సౌత్ సినిమా వరకు.. ‘ప్లాగరిజం’ వివాదాలు!
సాహిత్యంలో నవలలు, నాన్-ఫిక్షన్, వ్యాసాలు, పీహెచ్డీ థీసిస్‌ల విషయంలో ‘ప్లాగరిజం’ (సాహిత్య చోరీ లేదా భావజాల దొంగతనం) అనే పదం సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే నాటకాలు, లలిత కళలు, సినిమా వంటి ఇతర సాంస్కృతిక, సృజనాత్మక రంగాలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ‘ప్లాగరిజం’ నిబంధనలను అత్యధికంగా ఉల్లంఘిస్తున్న రంగం బహుశా సినిమానే అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే 1970లలో లేదా మరెప్పుడో ప్రపంచంలో ఎక్కడో తీసిన ఒక సినిమాను కాపీ కొట్టడం లేదా దాదాపుగా దానినే పోలిన చిత్రాన్ని రూపొందిండం, దానికి ఆధునిక పాత్రలను అద్దడం, కథలో చిన్న మార్పులు చేయడం, కథనంలో మాత్రం స్వల్ప పోలికలను ఉంచుకుని దానిని తమ సొంత సృష్టిగా ప్రచారం చేసుకోవడం చిత్రనిర్మాతలకు సులభం కావడంతో ఇది అత్యంత సాధారణంగా జరుగుతుంటుంది.‘ప్లాగరిజం’ అంటే..ఒకరి ఆలోచనలు, సమాచారం, భాష లేదా రచనను అసలు మూలాన్ని తగిన విధంగా గుర్తించకుండా (క్రెడిట్స్ ఇవ్వకుండా) ఉపయోగించడాన్ని ‘ప్లాగరిజం’ అంటారు. అసలైనదిగా నమ్మించే ప్రయత్నంలో ఒక రకమైన అనైతికత ఉండటం దీనిలోని ప్రధానాంశం. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు జరిగే కాపీరైట్ ఉల్లంఘనకు, ‘ప్లాగరిజం’నకు ఎప్పుడూ ఒకే అర్థం ఉండదు. బౌద్ధిక ఆస్తి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) రంగానికి చెందిన చాలా పదాల మాదిరిగానే, ‘ప్లాగరిజం’ కూడా ఆధునిక యుగానికి చెందిన భావనగా పరిణమించింది. భారతీయ లేదా అంతర్జాతీయ చలనచిత్రాల నుంచి కథలు, పాత్రలు, థీమ్‌లు, కథనాలను ‘అరువు తెచ్చుకోవడం’, ‘స్ఫూర్తి పొందడం’, ‘ప్రేరణ పొందడం’ లేదా ‘అడాప్ట్ చేసుకోవడం’ వంటివి హిందీ చలనచిత్ర పరిశ్రమలో కోకొల్లలుగా ఉన్నాయి.చార్లీ చాప్లిన్ సినిమా సినిమాతో..ఈ కోవలో ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం రాజ్ కపూర్ నిర్మించిన ‘శ్రీ 420’. చార్లీ చాప్లిన్ సినిమా ‘ట్రాంప్’ (అవసరాల కోసం తిరిగే వ్యక్తి) ఇమేజ్ను స్ఫూర్తిగా తీసుకున్నారనే విమర్శలను ఈ చిత్రం ఎదుర్కొంది. రాజ్ కపూర్, నర్గిస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చోరీ చోరీ’ (1956) చిత్రం, క్లార్క్ గేబుల్, క్లాడియా కోల్బర్ట్ నటించిన హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఇట్ హ్యాపెండ్ వన్ నైట్’ (1934)కి కాపీయే. ‘ఫిర్ సుభా హోగి’ (1958) చిత్రంలో రాజ్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఇది దోస్తోవ్స్కీ రాసిన సామాజిక దృక్పథం కలిగిన ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవల ఆధారంగా రూపుదిద్దుకుంది. క్వెంటిన్ టరాంటినో చిత్రం ‘రిజర్వాయర్ డాగ్స్’కి రీమేక్‌గా వచ్చిన ‘కాంటే’ చిత్రంలో బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో బాలీవుడ్ పాటలు, నృత్యాలను జోడించారు.నైతికపరమైన ఉల్లంఘన 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో, ఆయన కూతురు పూజా భట్, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో అదే (కాంటే) సినిమాకు ఆధునికత, గ్లామరస్ జోడించి ‘దిల్ హై కి మాన్తా నహీ’ వచ్చింది. కాపీకి మూలమైన చిత్రం లేదా దర్శకుడి పేరును టైటిల్స్‌లో పేర్కొంటే ‘ప్లాగరిజం’ చేసినట్లు కాదు. కానీ చాలా సందర్భాలలో ఇది జరగదు. అయినా వారు నైతికపరమైన నిజాయితీని ఉల్లంఘించినవారవుతారు (చట్టపరంగా కాకపోయినా). జాన్ అబ్రహాం, నానా పటేకర్ నటించిన ‘టాక్సీ నంబర్ 9211’ (2006) చిత్రం, బెన్ అఫ్లెక్, శామ్యూల్ జాక్సన్ నటించిన ‘చేంజింగ్ లేన్స్’ (2002) ఆధారంగా తెరకెక్కిందని చెబుతారు.మోహన్‌లాల్.. ‘నేరు’పెద్ద దర్శకులు, భారీ బడ్జెట్ సినిమాలు ‘ప్లాగరిజం’ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటుంటాయి. స్క్రిప్ట్‌లు, సన్నివేశాలు లేదా పాటలను కాపీ చేశారనే ఆరోపణలపై అనేక చిత్రాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అయితే విదేశీ నిర్మాతలు, బ్యానర్లు వీటిని పట్టించుకోరు. దక్షిణాది రాష్ట్రాల సినిమాలు దీనికి మినహాయింపు కాదు. మలయాళ చిత్రం ‘నేరు’ (2023) విషయంలో, పిటిషనర్ దీపక్ ఉన్ని కేరళ హైకోర్టును ఆశ్రయించారు. జీతూ జోసఫ్, మోహన్‌లాల్ తెరకెక్కించిన ఈ కోర్టు రూమ్ డ్రామాలో తాను ఇదివరకే వారికి చెప్పిన స్క్రిప్ట్ లోని ఆలోచనలను ఉపయోగించారని ఆయన ఆరోపించారు. జీతూ జోసఫ్ దర్శకత్వం వహించిన ‘నేరు’ విడుదలపై కేరళ హైకోర్టు స్టే నిరాకరించింది. ఇక్కడ చిత్రంలో మోహన్‌లాల్ పెద్ద స్టార్‌గా ఉండటమే కారణం కావచ్చని అంటారు.కమల్ హాసన్.. ‘పాపనాశం’కమల్ హాసన్ కూడా తన కొన్ని సినిమాల్లో ‘ప్లాగరిజం’ ఆరోపణలను ఎదుర్కొన్నారు. దీనికి ఒక ఉదాహరణ ‘పాపనాశం’. ‘ఒరు మజక్కాలతు’ నవల కాపీరైట్లను ఉల్లంఘించారంటూ సతీష్ పాల్ నిర్మాతలు, దర్శకుడు జీతూ జోసఫ్‌పై దావా వేశారు. అయితే చిత్ర నిర్మాతలు, కమల్ హాసన్ మద్దతుతో దర్శకుడు జీతూ జోసఫ్ ఆ కేసును విజయవంతంగా ఎదుర్కొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, సోనాక్షి సిన్హా నటించిన తమిళ చిత్రం ‘లింగా’పై మధురైకి చెందిన చిత్రనిర్మాత కె.వి. రవి రత్నం ఇది తన అసలు కథ అని ఆరోపించారు. అయితే ‘లింగా’ దర్శకుడు కె.ఎస్. రవికుమార్, రజనీకాంత్ స్వయంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ, ‘లింగా’ పొన్కుమరన్ రాసిన కథ ఆధారంగా తెరకెక్కిందని తెలిపారు.ముంబై ఫిలింమేకర్స్ మాట ఇదే..జాతీయ అవార్డు గెలుచుకున్న కన్నడ చిత్రం ‘బ్యారి’ చట్టపరమైన పోరాటాన్ని ఎదుర్కొంది. చివరకు రచయిత్రి సారా అబూబక్కర్ నవలను అనధికారికంగా అడాప్ట్ చేసుకున్నందుకు ఆమెకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అలాగే మ్యూజికల్ సిమిలారిటీకి సంబంధించి కాపీరైట్ క్లెయిమ్‌ల కారణంగా ‘కాంతారా’ చిత్రం హిట్ ట్రాక్ ‘వరాహ రూపం’ చట్టపరమైన ఆంక్షలు ఎదుర్కొంది. లక్ష్మణ్ దర్శకత్వం వహించి జయం రవి, అరవింద్ స్వామి నటించిన ‘బోగన్’ చిత్రం 2017లో ‘ప్లాగరిజం’ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ భారతీయ చలనచిత్ర విశ్లేషకుడు ఎంకే రాఘవేంద్ర రాసిన ‘ప్లాగిరిజంగ్ ఫర్ బాలీవుడ్’ అనే పత్రం ప్రకారం ‘పాపులర్ ఇండియన్ సినిమా హాలీవుడ్‌ను అనుకరిస్తుందని భావిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో పశ్చిమ దేశాల సినిమాలతో పోలిస్తే తమ చిత్రాల కంటెంట్, ఫార్మాట్ భిన్నంగా ఉంటాయని ముంబై ఫిలింమేకర్స్ చెబుతున్నారు. భారతీయ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడంలో నిర్దిష్టమైన పద్ధతి ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే హాలీవుడ్ ‘కాపీ’ చిత్రాలు విజయవంతం కావాలంటే ఆ చిత్రాల్లో భారతీయుల తీరు తెన్నులను, ఇక్కడి సంస్కృతిని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. అయితే ఇతరుల భావాలు, కాన్సెప్ట్‌ల ద్వారా ‘స్ఫూర్తి’ పొందడాన్ని, వాటికి భాష, సాంస్కృతిక కోణాలు, భారతీయతను జోడించి సినిమాలు తీయడాన్ని రాఘవేంద్ర సైద్ధాంతికంగా వ్యతిరేకించ లేదు. ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్‌కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్? -
బ్రో... రిలాక్స్!
తిట్టకుండా తిట్టినట్లు కౌంటర్ ఇచ్చారు మృణాల్ ఠాకూర్. అసలేం జరిగిందంటే... తన కన్నా వయసులో పదేళ్లు చిన్న అయిన స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో మృణాల్ డేటింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త గురించి ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. ‘‘బ్రో... రిలాక్స్. మేమిద్దరం ఎక్కడైనా జంటగా కనిపించామా? మీరు చూపించండి. చదువుకున్న మీలాంటివాళ్లు ఇలాంటి వదంతులు నిజం అని ఎలా నమ్ముతారు? దేశంలో ఎంతో జరుగుతోంది. జెన్ జీ నుంచి నేర్చుకుని, సరైన టాపిక్స్ మీద వీడియోలు చేయండి... అప్పుడు మీకు కావల్సినన్ని వ్యూస్ వస్తాయి’’ అని సోషల్ మీడియా వేదికగా మృణాల్ ఠాకూర్ స్పందించారు. ఇక ముంబైలోని ఓ కేఫ్ నుంచి మృణాల్, యశస్వి జైస్వాల్ విడి విడిగా వచ్చిన ఓ వీడియోను ఉద్దేశించి... ఈ ఇద్దరూ డేటింగ్ అనే వార్తను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తాజాగా మృణాల్ చేసిన కామెంట్‌కి నెటిజన్లు ఆమెకు మద్దతుగా ‘అబద్ధపు వార్తను ఎలా ప్రచారం చేస్తున్నారో? అసలు ఇద్దరు వ్యక్తులు ఒకే రోజు ఒకే రెస్టారెంట్‌కి వెళ్లకూడదా?’ అంటూ వదంతులు ప్రచారం చేస్తున్నవారిని ఉద్దేశించి కామెంట్ చేశారు. -
ఆమిర్‌తో అట్లీ?
ఆమిర్ ఖాన్ హీరోగా నటించనున్న కొత్త చిత్రంపై పూర్తి స్థాయిలో ఇంకా సరైన స్పష్టత రావడం లేదు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్, ‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ఓ సూపర్ హీరో మూవీ, అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ మూవీ అంటూ ఆమిర్ నెక్ట్స్ చిత్రాలపై వార్తలు వినిపిం చాయి. కానీ ఇప్పటివరకు ఏ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు.తమిళ దర్శకుడు అట్లీ ఇటీవల ఆమిర్ ఖాన్‌కు ఓ స్టోరీ లైన్ చె ప్పారట. ఈ కథ నచ్చి, ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట ఆమిర్. అయితే ఫైనల్ నరేషన్ జరగాల్సి ఉందట. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో చేస్తున్న ‘రాకా’ చిత్రీకరణతో అట్లీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఆమిర్–అట్లీ కాంబినేషన్ సినిమా గురించి మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. మరి... వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా? వేచి చూడాల్సిందే. -
హాలీవుడ్లో యానిమేషన్ మూవీ
బాలీవుడ్ దర్శకురాలు నిత్య మెహ్రా ఓ యానిమేషన్ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ హాలీవుడ్ యానిమేషన్ సినిమాను పారామౌంట్ పిక్చర్స్, జొనాథన్ గోల్డ్‌స్టైన్, జాన్ ఫ్రాన్సిస్ డేలీ, కునాల్ నయ్యర్ కలిసి నిర్మించనున్నారట. న్యూజెర్సీకి చెందిన ఇండో–అమెరికన్ టీనేజ్ అమ్మాయి అనుకోకుండా బాలీవుడ్ మ్యూజికల్ ప్రపంచంలోకి వెళ్లినప్పుడు, ఈ యంగ్ అమ్మాయికి ఎదరైన సవాళ్లు? పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని హాలీవుడ్ టాక్.‘బార్ బార్ దేఖో’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన నిత్య ఆ తర్వాత ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్‌తో పాపులర్ అయ్యారు. ఇప్పుడు హాలీవుడ్లో చేయనున్న యానిమేషన్ మూవీపై ఫోకస్ పెట్టారు. -
నటికి చేదు అనుభవం.. లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం
హిందీలో మూడు నాలుగు సినిమాలు చేసిన నటి నిఖితా రావల్‌కి ఊహించని అనుభవం ఎదురైంది. తాజాగా ఓ కార్యక్రమంలోనే ఈమె ఫొటోలకు పోజులిస్తుండగా ఓ మహిళా అభిమాని వచ్చి సెల్ఫీ అడిగింది. ఈ క్రమంలోనే అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, బ్లాక్ అండ్ వైట్, హీరో తదితర సినిమాల్లో నటించిన నిఖితా రావల్ మంచి డ్యాన్సర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అయితే కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు. ఇప్పుడు అభిమాని ఈమెకు లిప్ కిస్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే బాలీవుడ్లో ఇలాంటివి నిజంగా జరగడం కంటే ఎక్కువగా పీఆర్ స్టంట్స్‌గా చేస్తుంటారు. తమ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎలాంటి మూవీ ఛాన్సులు రాకపోతే ఏదో ఒకలా వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. మరి నిఖితా రావల్ కూడా ఇలాంటి స్టంట్ ఏమైనా చేసిందా? లేదంటే నిజంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా)SHOCKING 😲 😱😭😲#NikitaRawal Forcefully Kissesd by her Female FAN . Or just a PR Gimmick ? pic.twitter.com/WJF8uuC4y5— Manoz Kumar (@ManozTalks) August 9, 2026 -
ముందుగా విదేశాల్లోనే...
‘రామాయణ’ సినిమా విడుదల విషయంలో చిన్న మార్పు ఉన్నట్లు ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబె, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ పతాకంపై నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.కాగా, ‘రామాయణ పార్ట్ 1’ ఈ ఏడాది దీపావళికి, ‘రామాయణ పార్ట్ 2’ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్నాయి. అయితే తొలి భాగం ఇండియాలో కంటే ముందుగా విదేశాల్లోనే విడుదల కానుంది. ‘‘విదేశీ మార్కెట్లలో సినిమాల విడుదల సాధారణంగా శుక్రవారం నుంచే ప్రారంభం అవుతుంది. అందుకే అక్కడ నవంబరు 6న ‘రామాయణ పార్ట్ 1’ని రిలీజ్ చేస్తాం. ఇండియాలో మాత్రం దీపావళి పండగ రోజునే అంటే... నవంబరు 8నే రిలీజ్ చేస్తాం’’ అని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నమిత్ మల్హోత్రా. -
భారత క్రికెటర్ జైస్వాల్‌తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్
సినిమా సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అలా రీసెంట్ టైంలో హీరోయిన్ మృణాల్ ఠాకుర్ గురించి ఒకటి బయటకొచ్చింది. భారత యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో డేటింగ్లో ఉందని అన్నారు. ముంబైలోని ఓ కాఫీ షాప్‌లో జంటగా కనిపించారని పుకార్లు తెగ అల్లేశారు. ఇప్పుడు దీనిపై స్వయంగా మృణాల్ స్పందించింది. కామెంట్ పెట్టి క్లాస్ పీకింది.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)తను-జైస్వాల్ వైరల్ వీడియోకు సంబంధించి ఓ ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ కనిపించగా.. దానికి మృణాల్ కామెంట్ పెట్టింది. ఒకేచోట కనిపించినంత మాత్రాన ఇద్దరి మధ్య సంబంధం ఉందని ఎలా భావిస్తారు? అలా ఎలా అనుకుంటారు? అని ప్రశ్నించింది.'బ్రో రిలాక్స్.. మేమిద్దరం కలిసి ఎక్కడ కనిపించాం? మీరు ఇంత చదువుకున్నవాళ్లు కానీ ఇలాంటి పుకార్లను నిజమని ఎలా నమ్ముతున్నారు? దేశంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. జెన్-జీ నుంచి కొంత నేర్చుకోండి. సరైన సమస్యలపై వీడియోలు చేయండి. అప్పుడు మరిన్ని వ్యూస్ వస్తాయి' అని మృణాల్ కామెంట్ చేసినట్లు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది రూమర్‌కి స్పందించినట్లు లేదు. చిన్నపాటి క్లాస్ పీకినట్లు ఉంది.అయితే మృణాల్‌పై డేటింగ్ రూమర్స్ ఇదేం కొత్త కాదు. తమిళ హీరో ధనుష్‌తో డేటింగ్లో ఉందని, వాలంటైన్స్ డే నాడు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెగ మాట్లాడుకున్నారు. తీరా చూస్తే అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని తేలిపోయింది. ఈ బ్యూటీ కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది ఈమె నుంచి మూడు సినిమాలొచ్చాయి. వాటిలో 'డెకాయిట్' అనే తెలుగు మూవీ ఉంది. త్వరలో 'పూజా మేరీ జాన్' అనే ఓటీటీ చిత్రంలో కనిపించనుంది.(ఇదీ చదవండి: లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ) -
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
బాలీవుడ్ లెజెండరీ నటుడు, ‘డిస్కో కింగ్’, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి అనారోగ్యంతో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ కానున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలోని పలు అంశాలు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. మిథున్ చక్రవర్తి సినీ ప్రయాణం అద్భుతంగా సాగినా, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అనేక వివాదాలు, విషాదాలు, నాటకీయ పరిణామాలతో నిండిపోయింది. పరిశ్రమలోని పలువురు ప్రముఖ నటీమణులతో ఆయన సాగించిన ప్రేమాయణాలు, రహస్య వివాహాలు నాడు సంచలనం సృష్టించాయి.కమల్ హాసన్ మాజీ భార్యతో..1970లలో మిథున్ చక్రవర్తి వరుస హిట్లతో సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. ఆ సమయంలో ‘హమారా సంసార్’ చిత్రంలో కమల్ హాసన్ మాజీ భార్య సారికతో ఆయన కలిసి నటించారు. అప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారింది. అయితే కొద్ది నెలలకే ఈ బంధం అర్ధాంతరంగా ముగిసిపోయిందంటారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సారికనే స్వయంగా మిథున్‌కు దూరమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.మోడల్,నటి హెలెనా లూక్‌తో వివాహంసారికతో బ్రేకప్ తర్వాత మానసికంగా కుంగిపోయిన మిథున్, మోడల్ కమ్ నటి హెలెనా లూక్‌కు దగ్గరయ్యారు. జావేద్ ఖాన్‌తో ఐదేళ్ల రిలేషన్షిప్ ముగిసిన హెలెనా కూడా ఆ సమయంలో ఒంటరిగానే ఉన్నారు. ఇద్దరి పరిస్థితులు ఒకేలా ఉండటంతో 1979లో వారు వివాహం చేసుకున్నారు. కానీ ఈ బంధం కేవలం నాలుగు నెలలు మాత్రమే నిలిచింది. మిథున్ ప్రవర్తన కారణంగా హెలెనా విడాకులు తీసుకున్నారని అంటారు.హెలెనా బయటపెట్టిన మిథున్ టాక్సిక్ నేచర్విడాకుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హెలెనా లూక్, మిథున్‌తో తన అనుభవాన్ని ఒక పీడకలగా అభివర్ణించారు. మిథున్ తనను మానసికంగా ఎంతో వేధించారని, తన మాజీ ప్రియుడితో సంబంధం ఉందని నిత్యం అనుమానించే వారని ఆమె వెల్లడించారు. మిథున్‌కు అప్పట్లోనే వేరే మహిళలతో సంబంధాలు ఉండటం వల్లే, తనపై లేనిపోని అభూతకల్పనలు ఆపాదించేవారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. విడాకుల అనంతరం హెలెనా బాలీవుడ్‌కు పూర్తిగా దూరమై న్యూయార్క్‌లో స్థిరపడ్డారు.కిశోర్ కుమార్ మాజీ భార్య యోగితా బాలితో పెళ్లిహెలెనాతో విడాకుల అనంతరం మిథున్ జీవితంలోకి సింగర్ కిశోర్ కుమార్ మాజీ భార్య యోగితా బాలి ప్రవేశించారు. కిశోర్ కుమార్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత, యోగితా 1979లో మిథున్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్‌ను పూర్తిగా పక్కన పెట్టి, సంసారమే సర్వస్వంగా బతుకుతానని ఆమె ప్రకటించారు. ఈ దంపతులకు మహాక్షయ్ (మిమోహ్), ఉష్మే, నామాషి అనే ముగ్గురు కుమారులు జన్మించడంతో పాటు దిశాని అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.శ్రీదేవి ఎంట్రీతో వైవాహిక జీవితంలో తుఫాన్అంతా సజావుగా సాగుతున్న సమయంలో 1985లో మిథున్ జీవితంలోకి దివంగత నటి శ్రీదేవి అడుగుపెట్టారు. ‘జాగ్ ఉతా ఇన్సాన్’ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. అప్పటికే పెళ్లయినప్పటికీ మిథున్.. శ్రీదేవితో ప్రేమలో పడిపోయారు. మీడియా కథనాల ప్రకారం, వీరిద్దరూ 1985లో అత్యంత రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. ఈ సీక్రెట్ మ్యారేజ్ బాలీవుడ్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది.భార్య యోగితా బాలి ఆత్మహత్యాయత్నంమిథున్, శ్రీదేవిల రహస్య వివాహం, వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న యోగితా బాలి తీవ్రంగా కుంగిపోయారు. భర్త మోసాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తరువాత ఆమె, తన పిల్లలతో కలిసి మిథున్ నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఈ పరిణామం మిథున్, నిర్మాత బోనీ కపూర్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని కూడా శాశ్వతంగా దెబ్బతీసింది.శ్రీదేవితో పెళ్లి రద్దు.. యోగితా బాలితో తిరిగి..మిథున్ తన మొదటి భార్య యోగితాకు విడాకులు ఇవ్వలేడని, ఆమెను పూర్తిగా వదిలించుకోలేడని గ్రహించిన శ్రీదేవి కీలక నిర్ణయం తీసుకున్నారు. 1988లో మిథున్‌తో జరిగిన వివాహాన్ని ఆమె చట్టబద్ధంగా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీదేవి బోనీ కపూర్‌ను వివాహం చేసుకోగా, మిథున్ తిరిగి తన మొదటి భార్య యోగితా బాలి వద్దకు చేరారు. యోగితను ఒప్పించి ఆమెను ఇంటికి రప్పించుకున్న మిథున్, ఆ తర్వాత తమ మూడో సంతానాన్ని స్వాగతించారు. ఎన్నో వివాదాలు, కష్టాలను ఎదుర్కొన్న మిథున్ చక్రవర్తి ప్రస్తుతం తన భార్య యోగితా బాలి, పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారి కుమారులు మిమోహ్, ఉష్మే, నామాషి, కూతురు దిశాని కూడా సినీరంగంలో రాణిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘రక్త సంబంధం’.. ఇది సీరియల్ కాదు.. సినిమా కానే కాదు! -
ఆస్పత్రిలో సీనియర్ నటుడు.. సీఎం పోస్ట్‌తో వెలుగులోకి..
కోల్‌కతా: సీనియర్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారు. కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొంతున్నారు. గురువారం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని భావిస్తున్నారు. మిథున్ చక్రవర్తిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి శుక్రవారం పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేయడంతో మిథున్ అనారోగ్యం గురించి బయట ప్రపంచానికి తెలిసింది.''ప్రముఖ సినీ నటుడు, బీజేపీ కేంద్ర కమిటీ సభ్యులలో ఒకరైన మిథున్ చక్రవర్తి అనారోగ్య కారణాలతో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నేను ఈరోజు ఆయన్ను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లాను. ఆయనతో మాట్లాడి, ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను'' అని సువేందు అధికారి ఫేస్బుక్లో పేర్కొన్నారు.మిథున్‌ను పరామర్శించిన తర్వాత ఆస్పత్రి వెలుపల సీఎం సువేందు మీడియాతోనూ మాట్లాడారు. గురువారం రాత్రి ఆయనకు చిన్న శస్త్రచికిత్స జరిగిందని వెల్లడించారు. తాను ఆస్పత్రిలో చేరిన విషయం బహిరంగపరచకూడదని మిథున్ అనుకున్నారని చెప్పారు. కాగా, మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకుని ఆయన అభిమానులు, శ్రేయాభిలాషులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మిథున్ చక్రవర్తి త్వరగా కోలుకోవాలి: శత్రుఘ్న సిన్హా పట్నా: మిథున్ చక్రవర్తి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని టీఎంసీ ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా ఆకాంక్షించారు. పట్నాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. మిథున్ తనకు మంచి మిత్రుడని, ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు.చదవండి: ఫడ్నవీస్ ప్రభుత్వంపై మరాఠా ఉద్యమ నేత ఫైర్''మిథున్ ఆసుపత్రిలో ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయం విని చాలా బాధపడ్డాను. మిథున్ చక్రవర్తి నాకు మంచి స్నేహితుడు.. చాలా మంచి కళాకారుడు, గొప్ప స్టార్. ఆయన ఒక అద్భుతమైన మానవతావాది కూడా. ఆయనకు జంతువులంటే చాలా ఇష్టం. తన వద్ద ఉన్న పెంపుడు కుక్కలు, పిల్లులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఆయనకు ప్రజల పట్ల, ముఖ్యంగా పేదల పట్ల కూడా ప్రగాఢమైన శ్రద్ధ ఉంది. నాకు మిథున్ పట్ల ఎంతో గౌరవం ఉంది. ఆయన నాకు చాలా ప్రియమైన , ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయన్ను పరామర్శించడానికి వెళ్లారు, ఆయన సరైన పనే చేశారు. మిథున్‌కు ప్రజలందరి ప్రేమ, మద్దతు, ఆశీస్సులు దక్కాల''ని శత్రుఘ్న సిన్హా అన్నారు. -
'చిన్న వయసులోనే పెళ్లిచూపులు.. నేను తప్పించుకున్నా'
ప్రముఖ బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ బీటౌన్‌లో సుపరిచితమైన పేరు. ఇటీవలే ఆమె ఇష్క్నామా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షెహనాజ్.. ప్రేమ అంటే ముఖ్యమైన వ్యక్తులకు సమయం, స్వేచ్ఛ ఇవ్వడమేనని అన్నారు. అయితే పెళ్లిళ్లకు తాను దూరంగా ఉండేదాన్ని అని వెల్లడించారు.ప్రేమ, పెళ్లి సంబంధాలపై తన అభిప్రాయాలను షెహనాజ్ గిల్ వెల్లడించారు. మా కుటుంబంలో పెళ్లి చూపులు చిన్న వయసులోనే చూసేవారని తెలిపింది. అమ్మాయిలకు చాలా చిన్న వయసు నుంచే త్వరలో పెళ్లి అవుతుందని చెప్పేవారని గుర్తు చేసుకుంది. అలా వరుడి కోసం అన్వేషణ చాలా ముందుగానే మొదలవుతుందని పేర్కొంది. మా బంధువుల్లో ఒకరు నాకు పెళ్లి చేయాలని చూసింది.. కానీ నేను మాత్రం అస్సలు ఒప్పుకోలేదని తెలిపింది. పెళ్లిళ్లకు వెళ్తే సంబంధాలు కుదర్చడానికి ప్రయత్నిస్తారని షెహనాజ్ వెల్లడించింది. అందుకే నేను ఎక్కువగా పెళ్లిళ్లకు వెళ్లడం కూడా మానేసేదాన్ని అని తన అనుభవాన్ని పంచుకుంది. ఇప్పుడు నా కెరీర్ పరంగా సక్సెస్ అయ్యానని.. ఇప్పుడు అందరూ నా వెంట పడుతున్నారని నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా.. షెహనాజ్ గిల్ నటించిన 'ఇష్క్నామా' చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదలైంది. -
ఓటీటీలో రికార్డ్.. ఆ జాబితాలో మొదటి చిత్రంగా దురంధర్
ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాల్లో దురంధర్ ముందు వరుసలో ఉంటుంది. దంగల్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల సరసన చేరింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్వీర్ సింగ్ హీరోగా మెప్పించారు. సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది.తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న దురంధర్ అరుదైన రికార్డ్ సాధించింది. ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. కాగా.. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ధురందర్ పార్ట్-1 డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ రిలీజైంది. -
ఆయన నన్ను ఆటపట్టిస్తున్నారని అనుకున్నా: ఐశ్వర్యరాయ్
సినిమాల్లోకి రాకముందే ఐశ్వర్యరాయ్ యాడ్ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్‌తో కలిసి పలు ప్రకటనల్లో పనిచేశారు. ఆ సమయంలోనే దర్శకుడు మణిరత్నం తన సినిమాలో ఐశ్వర్యని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు. అదే సంగతి రాజీవ్ మీనన్ ఐష్‌కి చెప్పారు. దీంతో తనని ఆటపట్టిస్తున్నారని ఈమె అనుకుంది. అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.'రాజీవ్ మీనన్‌తో నేను ఎన్నో యాడ్ ఫిల్మ్స్‌లో పనిచేశా. అప్పటికే నేను మణిరత్నంకు అభిమానిని అనే విషయం ఆయనకు తెలుసు. షూటింగ్ టైంలో మణిరత్నం సినిమాల్లోని పాటలని రోజూ వినిపించేవారు. ఓ రోజు మణిరత్నం తన సినిమాలో నన్ను తీసుకోవాలని భావిస్తున్నట్లు రాజీవ్ చెప్పారు. కానీ ఆయన నన్ను ఆటపట్టిస్తున్నారని అనుకున్నాను. ఆ తర్వాత మణిరత్నంను కలిసినప్పుడు.. ‘ఇరువర్’( తెలుగులో ఇద్దరు )నటించడానికి ఆసక్తి ఉందా? అని ఎంతో సున్నితంగా అడిగారు' అని ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం మణిరత్నం.. విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా ఓ సినిమా తీస్తున్నారు. రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్. కాగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఐశ్వర్య విషయానికొస్తే.. ‘ఇరువర్,( తెలుగులో ఇద్దరు) తర్వాత ‘గురు’, ‘రావణ్’ చిత్రాల్లోనూ మణిరత్నంతో కలిసి పనిచేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. ప్రస్తుతం ఐష్ కొత్తగా మూవీస్ చేయట్లేదు. -
హీరోయిన్‌తో తెలుగు హీరో డేటింగ్?
రాజమండ్రిలో పుట్టి తెలుగులోనే వరస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయిన హర్షవర్ధన్ రాణే.. తర్వాత హిందీలోనే హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఫిదా, అవును, అవును 2, ప్రేమ ఇష్క్ కాదల్ తదితర చిత్రాల్లో నటించాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం బాలీవుడ్లోనే వరస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఓ హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నాడనే రూమర్స్ మళ్లీ వినిపించాయి. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ పోస్ట్ చేసిన ఫొటోలే దీనికి కారణం.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ)హర్షవర్ధన్ రాణే, హీరోయిన్ సంజీదా షేక్ కలిసి పుణె సమీపంలోని పాన్షెట్లో వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్లో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ ఒకే చోట ఉన్నప్పటికీ ఫొటోలను వేర్వేరు యాంగిల్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ కలిసే ట్రిప్‌కు వెళ్లారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.వీళ్లిద్దరి గురించి డేటింగ్ వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2023లో గిర్ అటవీ ప్రాంతంలో ఇద్దరూ ఒకేచోట ఉన్నట్లుగా అనిపించే ఫొటోలను షేర్ చేయడంతో ఇదంతా మొదలైంది. 2020లో రిలీజైన 'తైష్' మూవీలో కలిసి నటించారు. 2021లో వచ్చిన థ్రిల్లర్ మూవీ 'కున్ ఫయా కున్'లో మరోసారి జంటగా కనిపించారు. హర్షవర్ధన్ ఇప్పటికే సింగిలే కానీ సంజీదా షేక్ మాత్రం ఆమిర్ అలీని పెళ్లి చేసుకుని 2021లో విడాకులు తీసుకుంది. ఓ కూతురు ఉండగా.. ఆమె ఇప్పుడు సంజీదా దగ్గరే ఉంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా) View this post on Instagram A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda) View this post on Instagram A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) -
రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా
1987 నుంచి హిందీ సినిమాల్లో నటిస్తున్న సుస్మితా ముఖర్జీ తన జీవితంలోని చాలా కష్టమైన కాలం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. రూ.కోటి అప్పు తీర్చడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మహిళలని అవమానించే సి-గ్రేడ్ చిత్రాలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఇన్ స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)గోల్ మాల్, రక్తచరిత్ర, జర హట్కే జర భచ్కే తదితర సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించిన ఈమె.. చివరగా గతేడాది వచ్చిన 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే తనని 'మేడమ్.. మీరు ఎందుకు అలాంటి చెత్త సినిమాల్లో నటించారు?' అని ఒకరు ప్రశ్నించారని, ఆ ప్రశ్న తన జీవితంలోని బాధాకరమైన రోజుల్ని గుర్తు చేసిందని సుస్మితా చెప్పింది.'అవి మహిళలని అవమానించే సి-గ్రేడ్ సినిమాలు. అవి పూర్తిగా నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలే. నేను నా మనసుని అమ్ముకున్నానా? అవును.. అమ్ముకున్నాను. అప్పట్లో నాకు ఆ పని నచ్చలేదు ఇప్పటికీ నచ్చదు. కానీ ఏం చేయలేని పరిస్థితి. 2002లో నా భర్తతో కలిసి ప్రారంభించిన ప్రయాస్ ప్రొడక్షన్ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. రూ.కోటి అప్పు మిగిలింది. అదే టైంలో టెక్నాలజీ కారణంగా మా సంస్థతో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు దివాలా తీశాయి''అప్పు ఇచ్చినవాళ్లు తరచూ మా ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేసేవారు. దీంతో మళ్లీ నటిగా పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది. నేను సంపాదించిన ప్రతి రూపాయి అప్పు తీర్చడానికే వెళ్లేది. ఆ రూ.కోటి తీర్చేందుకు నేను, నా భర్త ఎన్నో సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. నా కెరీర్లో విమర్శలు ఎదుర్కొన్న ఆ సినిమాల వెనుక ఉన్న అసలు కారణం ఇదే. ఆ నిర్ణయాలు వ్యక్తిగత ఇష్టంతో కాదు. పరిస్థితుల ఒత్తిడిలో తీసుకోవాల్సి వచ్చింది' అని సుస్మితా ముఖర్జీ స్పష్టం చేసింది.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ) View this post on Instagram A post shared by Susmita Mukherjee (@susmita_mukherjeeofficial) -
‘రామాయణ’ డేట్ ఫిక్స్
రామాయణం ఆధారంగా హిందీలో రూపొందిన చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. కాగా, ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబరు 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు.ఇప్పటికే ‘రామాయణ’ తొలి భాగం ట్రైలర్‌ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తాజాగా ఇంగ్లిష్ ట్రైలర్‌ను రిలీజ్ చేసి, ‘రామాయణ పార్ట్ 1’ను నవంబరు 6న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ‘రామాయణ’ ఇంగ్లిష్ ట్రైలర్లో సంభాషణలు ‘బ్రహ్మ ఏఐ’ అనే కృత్రిమ మేధ సాయంతో పాత్రల లిప్ సింక్‌కు తగ్గట్లు రెడీ చేశారనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రాన్ని ఇండియాలో ధర్మా ప్రోడక్షన్స్ రిలీజ్ చేస్తుండగా, ఓవర్సీస్లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేయనుంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాకు యశ్ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ‘రామాయణ పార్ట్ 2’ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
100 కోట్ల వ్యూస్.. భారతీయ సినీ చరిత్రలో అరుదైన ఘనత
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ: పార్ట్-1' ట్రైలర్ అన్ని భాషలు, డిజిటల్ వేదికలు కలిపి 100 కోట్ల (1 బిలియన్) వ్యూస్ సాధించి భారతీయ సినీ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా ట్రైలర్ ఈ ఘనత సాధించలేదు. హిందీ ట్రైలర్ ఒక్కటే 'వరల్డ్ ఆఫ్ రామాయణ' ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 588 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర వేదికల్లో కూడా భారీ స్పందన లభించింది.ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్, హాన్స్ జిమ్మర్–ఏ.ఆర్. రెహమాన్ సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రబృందం ఇంగ్లిష్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఏఐ ఆధారిత సరికొత్త లిప్-సింక్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వెర్షన్‌ను రూపొందించారు. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ విడుదల చేయనుండటం విశేషం. -
19 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ట్రైలర్ రిలీజ్
ఒక సినిమాకు సీక్వెల్ తీయాలంటే రెండు నుంచి మూడేళ్లు టైమ్ పడుతుంది. అలా పుష్ప రిలీజైన మూడేళ్లకు సీక్వెల్‌గా పుష్ప-2 కూడా వచ్చేసింది. కానీ ఓ మూవీ సీక్వెల్ దాదాపు రెండు దశాబ్దాల వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అదే చేశారు మేకర్స్. ఎప్పుడో 2007లో వచ్చిన చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించారు.2007లో విడుదలైన క్లాసిక్ యాక్షన్ డ్రామా ఆవారపన్. ఇమ్రాన్ హష్మీ, దిశాపటానీ నటించారు. ఈ సినిమాకు దాదాపు 19 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా ఆవారపన్ - 2 తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో శివమ్ పండిట్ పాత్రలో ఇమ్రాన్ తిరిగి వస్తున్నాడంటూ వీడియోను పంచుకున్నారు. ఈ మూవీకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించారు. -
రామాయణలో రియా కపూర్ ఎవరో తెలుసా..?
నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి.. ట్రైలర్లో తమ తమ పాత్రలతో హత్తుకున్న రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్‌తో పాటుగా మరో ముఖం కూడా ప్రేక్షకుల దుష్టిని ఆకర్షించింది. ఆమెనే రియా కపూర్ . సీత పక్కన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ నటి ఎవరని తెలుసుకోడానికి సోషల్ మీడియాకు పనిచెప్తున్నారు సినీ ప్రియులు. మరి ఆమె ఎవరో ఒకసారి చూద్దామా..?రియా కపూర్ ఎవరంటే..టెలివిజన్, ప్రాంతీయ సినిమాలు, మ్యూజిక్ విడియోల ద్వారా నటిగా గుర్తింపు పొందింది రియా కపూర్. ఈమె గతంలో సంపూర్ణ అనే సీరియల్లో నటించి బుల్లితెరలో, మిస్టేరియస్ అనే తెలుగు చిత్రంలో కనువిందు చేసింది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పలు మార్లు ఆడిషన్స్ ,లుక్ టెస్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఈ భారీ బడ్జేట్ సినిమాలో మాండవి పాత్రకు ఎంపిక చేశారట. హిందూ పురాణాల ప్రకారం.. మాండవి కుశధ్వజ మహారాజు, చంద్రభాగ రాణిల కుమార్తె. సీతకు మేనకోడలు ( కజిన్) అవుతుంది. అనంతరం శ్రీరాముడి తమ్ముడు భరతుడిని వివాహం చేసుకుని అయెధ్య లో కీలక సభ్యురాలిగా మారుతుందట. ఇటీవల రిలీజైన రామాయణ ట్రైలర్లో రెప్పపాటు కాలం పాటు కనిపించినప్పటికీ రెండు భాగాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉండనుందని తెలుస్తోంది. కాగా చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా వెండి తెరను పలకరించనున్నారు. సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్ , రకుల్ ప్రీత్ సింగ్ వంటి నటులు కూడా ఉన్నారు. -
‘బిగ్ బీ’ రికార్డు: 83 ఏళ్ల వయసులో 24 గంటల షిఫ్ట్!
న్యూఢిల్లీ: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ) 18వ సీజన్ కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అంకితభావం మరోసారి చాటుకున్నారు. షో ప్రసార తేదీ సమీపిస్తున్న తరుణంలో ఆయన ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా పనిచేశారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. గడువులోగా పని పూర్తి చేయకపోతే తన ఉద్యోగమే పోయేదని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.83 ఏళ్ల వయసులోనూ అమితాబ్ బచ్చన్ కనబరుస్తున్న ఈ వృత్తిపరమైన నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆయన పని, మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు నిర్విరామంగా సాగింది. ఆ సమయానికి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంతో కీలకమని, అందుకే దానిని విజయవంతంగా పూర్తి చేశానని ఆయన తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.కేబీసీ మొదటి ప్రసార తేదీ ఇప్పటికే ఖరారైందని, ఆ గడువును కోల్పోతే తన స్థానంలో మరొకరిని తీసుకునేవారని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఈ క్విజ్ షో ప్రారంభమైనప్పటి నుంచి మూడో సీజన్ మినహా ప్రతి సీజన్‌కు ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వయసురీత్యా వస్తున్న ఆరోగ్య సవాళ్లను లెక్కచేయకుండా ఆయన ప్రతి పనిని అత్యంత బాధ్యతతో నిర్వర్తిస్తున్నారు.ఇది కూడా చదవండి: నిర్లక్ష్యం వీడని ‘ఎన్టీఏ’.. ఈసారి ‘కీ’లో జాప్యం! -
'రామాయణ'లో మహేశ్ బాబునే అనుకున్నారా?.. అసలు నిజం ఇదే..
'రామాయణ'.. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రకటన వచ్చిన తొలి రోజుల్లో ఇందులో హీరోగా ఎవరు నటిస్తారనే అంశంపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు పేరు బలంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ ప్రచారానికి ఎట్టకేలకు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీ ఫుల్స్టాప్ పెట్టారు. మొదటి నుంచి తమ మనసులో ఉన్న ఏకైక పేరు రణ్‌బీర్ కపూర్ మాత్రమేనని స్పష్టం చేశారు.ఓ మీడియా సమావేశంలో నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘స్క్రిప్ట్ పూర్తయ్యాక శ్రీరాముడి పాత్రకు రణ్‌బీర్ కపూర్‌నే ఊహించుకున్నాం . ఆప్షన్-ఏ, ఆప్షన్-బీ, ఆప్షన్-సీ అంటూ ఏమీ లేదు. రణ్‌బీర్ మాత్రమే మా తొలి ఎంపిక. ముందుగా ఆయనను సంప్రదించాలని నిర్ణయించుకున్నాం. ఒకవేళ ఆయన తిరస్కరిస్తేనే మరో హీరో గురించి ఆలోచించేవాళ్లం" అని వెల్లడించారు.ఈ సందర్భంగా దర్శకుడు నితేశ్ తివారీ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. రణ్‌బీర్‌కు ప్రత్యామ్నాయంగా మరో హీరో పేరును అసలు పరిశీలించలేదన్నారు. దీనిపై స్పందించిన రణ్‌బీర్ కపూర్.. ‘అంటే ఇప్పుడు వీళ్లకు ఇంకో ఆప్షన్ కూడా లేదు కదా!’ అంటూ సరదాగా వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు.ఇక రావణుడి పాత్రకు యశ్ ఎలా ఎంపికయ్యారనే విషయంపైనా నమిత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'కేజీఎఫ్: ఛాప్టర్-2' తర్వాత యశ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిందని, ఆ సమయంలో లాస్ ఏంజెల్స్‌లో ఆయనను కలిసి 'రామాయణ' విజన్‌ను వివరించామని చెప్పారు. కథ, పాత్ర నచ్చడంతో యశ్ రావణుడిగా నటించడమే కాకుండా నిర్మాతగానూ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని తెలిపారు.భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. అలాగే రవీ దూబే, సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
యాక్షన్‌కి సై
యాక్షన్ సీక్వెన్స్‌కు సిద్ధం అవుతున్నారట సల్మాన్ ఖాన్. ఆయన హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో మాధవన్ నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఈ వారంలో ముంబైలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రెడీ చేయిస్తున్నారని, ఈ సెట్లోనే సల్మాన్ ఖాన్–నయనతార పాల్గొనగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తీసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలిసింది. యాక్షన్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలనూ తెరకెక్కించనున్నారట. ఇక ఈ చిత్రం కోసం దాదాపు 16 కేజీల బరువు తగ్గారట సల్మాన్ ఖాన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరోవైపు సల్మాన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘మాతృభూమి’ విడుదలకు సిద్ధం అవుతోంది. -
ప్రియుడితో హీరోయిన్ ఎంగేజ్మెంట్.. పోస్ట్ వైరల్
ప్రముఖ నటి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్ భామ జియా శంకర్ తన కాబోయే భర్తను పరిచయం చేసింది. ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రియుడు కరణ్‌తో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ శుభవార్త విన్న అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.కాగా.. అభిషేక్ మల్హన్‌తో డేటింగ్ రూమర్స్ ఖండించిన కొన్ని నెలలకే ఎంగేజ్మెంట్ చేసుకోవడం విశేషం. జియా, అభిషేక్‌లు గతంలో బిగ్ బాస్ ఓటీటీ -2 సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక మ్యూజిక్ వీడియోలో కలిసి పనిచేశారు. దీంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ఈ వార్తలను జియా కొట్టిపారేసింది.జియా శంకర్ బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా బిగ్‌బాస్‌తో పాటు చాలా రియాలిటీ షోలలో మెరిసింది. తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. ఎంత అందంగా ఉన్నావే మూవీలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్ నటించిన హైదరాబాద్ లవ్ స్టోరీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఈ భామ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. View this post on Instagram A post shared by Jiyaa Shankar (@jiyaashankarofficial) -
మళ్లీ లవ్ అండ్ వార్
కొంత విరామం తర్వాత ముంబైలో మళ్లీ ‘లవ్ అండ్ వార్’ మొదలు పెట్టారట రణ్‌బీర్ కపూర్. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ నటిస్తున్న సినిమా ‘లవ్ అండ్ వార్’. ఈ పీరియాడికల్ ట్రయాంగిల్ యాక్షన్ లవ్‌స్టోరీ చిత్రంలో రణ్‌బీర్, విక్కీ భారత సైనికుల పాత్రలు చేస్తున్నారని సమాచారం. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలోని రాయల్ పామ్స్ లొకేషన్స్‌లో ప్రారంభమైందని తెలిసింది.ఈ సినిమాకు ఇదే ఫైనల్ షెడ్యూల్ అని, ఈ షూట్లో రెండు భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరించేలా భన్సాలీ ప్లాన్ చేశారని టాక్. వార్ సీక్వెన్స్ చిత్రీకరణలో దాదాపు 50 మంది ఫైటర్స్, దాదాపు 300 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారట.ఈ సినిమాను ఆగస్టు కల్లా పూర్తి చేయాలని భన్సాలీ టార్గెట్‌గా పెట్టుకున్నారట. నిజానికి ఈ చిత్రాన్ని గత ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ సజావుగా సాగక పోవడం, మరోవైపు ‘రామాయణ’ చిత్రంతో రణ్‌బీర్ బిజీగా ఉండటంతో ‘లవ్ అండ్ వార్’ ఆలస్యమైందని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 21న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. -
బిగ్‌బాస్ రియాలిటీ షో.. ముహుర్తం ఫిక్స్
బుల్లితెరపై ఫుల్ క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఏ భాషలోనైనా ఈ షోకు ఆడియన్స్ ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి బుల్లితెర ప్రియులను అలరించేందుకు రియాలిటీ షో వచ్చేస్తోంది. హిందీలో ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ఈ షో 19 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్- 20కి కౌంట్‌డౌన్ మొదలైంది. రాబోయే సీజన్‌కు సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సారి కూడాహోస్ట్గా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.ఈ తాజా సీజన్ సెప్టెంబర్ 6 నుంచి మొదలు కానుందని మేకర్స్ రివీల్ చేశారు. ఈ టీజర్లో గుర్రంతో పాటు సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. టీజర్ చూస్తుంటే ఈ సారి సరికొత్తగా సీజన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టీజర్లో కంటెస్టెంట్ల వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. ఈ సీజన్లో కొత్త ట్విస్ట్‌లను ప్రేక్షకులను పరిచయం చేస్తుందని..అంతే కాకుండా సీజన్-20 మధ్యలో ఒక మిస్టరీ ఉంటుందని సల్మాన్ ఖాన్ టీజర్లో ప్రస్తావించారు. ఈ టీజర్ కేవలం ఆరంభం మాత్రమేనన్నారు.బిగ్ బాస్-20 స్ట్రీమింగ్ ఎక్కడంటే?ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్- 20 సెప్టెంబర్ 6న ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ రియాలిటీ షో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా కలర్స్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ఈ ఏడాది అన్ని భాషల్లోనూ ఓకేసారి ఈ షో ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అదే జరిగితే తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ అదో రోజు నుంచే షో మొదలు కానుంది. View this post on Instagram A post shared by JioHotstar (@jiohotstar) -
స్టార్ హీరోయిన్‌తో ఆర్జీవీ సీక్రెట్ పెళ్లి.. చిరంజీవినే చెప్పాడు
ప్రముఖ సీనీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ) పర్సనల్ గురించి గత మూడు, నాలుగు రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ స్టార్ హీరోయిన్ని ఆయన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడట. ఈ విషయాన్ని అప్పట్లో చిరంజీవినే మీడియాకు లీకు చేశాడని బాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేశ్ చెప్పారు. తాజాగా ఆయన ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఆర్జీవీ సీక్రెట్ పెళ్లి గురించి చిరంజీవినే తనతో చెప్పాడని అన్నారు.‘ఓ రోజు చిరంజీవి దగ్గరకు వెళ్తే.. 'హేయ్ జ్యోతి... ఊర్మిళను రామ్ గోపాల్ వర్మ పెళ్లి చేసుకుంది రాయలేదని చిరంజీవి నాతో అన్నారు. వారికి పెళ్లి ఎప్పుడు జరిగింది? అని నేను ఆయన్ను అడిగాను. ఆంధ్రప్రదేశ్‌ో ఓ ప్రముఖ ఆలయంలో ఊర్మిళను తీసుకెళ్లి ఆర్జీవీ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. మీ దగ్గర ప్రూఫ్ ఏంటని అడిగాను. వారి పెళ్లి చేసిన పూజారి ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారు. నేను ఆర్టికల్ రాయడానికి ముందే ఊర్మిళకు ఫోన్ చేశా. ఆమె ఏడుస్తూ.. ‘ నా గురించి మీరు అలా ఎలా రాస్తారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నా గురించి మీకు తెలుసు కదా’ అని అన్నారు. ఇదే విషయం ఆర్జీవీకి కాల్ చేస్తే 'నో కామెంట్' అని అన్నారు. దీంతో ఇద్దరి సైడ్ నుంచి స్టోరీ రాశాను’ అని జ్యోతి వెంకటేశ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే సీక్రెట్ పెళ్లిపై అటు ఊర్మిళా కనీ, ఇటు ఆర్జీవి కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.ఆర్జీవీతో పెళ్లి జరిగిందో లేదో తెలియదు కానీ.. 2016 లో మోహ్సిన్ అక్తర్ మీర్ ని ఊర్మిళ వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. 2024లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఊర్మిళ సింగిల్ గానే ఉంటుంది. అప్పట్లో ఆర్జీవీ, ఊర్మిళ కాంబో ఓ సంచలనం. వీరిద్దరి కాంబోలో వచ్చిన గాయం, రంగీలా, సత్య, అంతం, దౌడ్ వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. Jyothi Venkatesh spills tea on SECRET marriage of Ramgopal verma with urmila mamdodkat🤯They married in Temple, Chiranjevii leaked temple priest's direct phone number to expose the secret wedding👀When asked Urmila, she started crying & Ram Gopal Varma replied "no comments" pic.twitter.com/xxeGrfMudP— Chota Don (@choga_don) July 30, 2026 -
డిలీట్ చేయకపోతే కేసు పెడతా: మృణాల్ ఠాకుర్
ఏఐ కల్చర్ పెరిగిపోయిన తర్వాత దానిని మంచి కోసం ఎంతమంది ఉపయోగిస్తున్నారో అనే సంగతి పక్కనబెడితే సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టేందుకు విరివిగా వినియోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి అవన్నీ నిజమనే భ్రమ కల్పిస్తున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితుల బారిన స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకుర్ పడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: త్రిష.. రాజకీయాల్లోకి రావాలి)'నా డీప్ ఫేక్ ఫొటోలని సృష్టించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం చట్టవిరుద్ధం. ఇలాంటి పనులు ఏ మాత్రం కరెక్ట్ కాదు. వెంటనే డిలీట్ చేయండి లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని మృణాల్ హెచ్చరించింది.మృణాల్ ఇప్పుడు కోప్పడటం కాదు గానీ గతంలో రష్మిక తదితర హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడ్డారు. పలువురు నిందితుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా సరే ఇలాంటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం హీరోయిన్లని ఇబ్బందులకు గురిచేస్తోంది. మృణాల్ కెరీర్ విషయానికొస్తే..రీసెంట్గా ఓ హిందీ మూవీ చేసింది గానీ సరిగా ఆడలేదు.(ఇదీ చదవండి: 200 రోజులు కష్టపడితే ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే బ్లాక్‌బస్టర్: హీరో సూర్య) -
బాంబే హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ శృతిహాసన్
విశ్వనటుడు కమల్ హాసన్ తనయ, ప్రముఖ నటి శృతిహాసన్ తన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights), ప్రచార హక్కుల (Publicity Rights) పరిరక్షణ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో రూపొందించిన కంటెంట్, మార్ఫింగ్ చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలతో తన పేరు, ఫొటోలను ఉపయోగించి అనధికారికంగా వస్తువుల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యంలో పలు భారతీయ, విదేశీ సంస్థలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రముఖ సోషల్ మీడియా వేదికలతో పాటు కొందరు గుర్తుతెలియని వ్యక్తులను కూడా ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ప్రతివాదుల్లో ఒకటైన ఓ క్రాఫ్ట్ వర్క్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వేదికలో శృతిహాసన్ పేరు, ఫొటోలతో కూడిన పోస్టర్లను ఆమె అనుమతి లేకుండానే విక్రయిస్తున్నట్లు పిటిషన్లో ఆరోపించారు.అదేవిధంగా గూగుల్, మెటా, ఎక్స్, పింట్రెస్ట్ వంటి డిజిటల్ వేదికల్లో తనను ఇతర నటులతో అనుచితంగా అనుసంధానించే ఏఐ వీడియోలు, అసభ్యకరమైన డీప్‌ఫేక్ చిత్రాలు ప్రసారం చేస్తున్నారు. ఈ కంటెంట్ తన ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.తన పేరు, ఫొటోలు, వ్యక్తిత్వాన్ని ఎవరూ అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వినియోగించకుండా శాశ్వత ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేయాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని, జరిగిన నష్టానికి తగిన నష్టపరిహారం కూడా చెల్లించాలని వారు కోర్టును విజ్ఞప్తి చేశారు. శృతిహాసన్ దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు
హిందీ సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న నటి అదితి శర్మ.. భర్త అభినీత్ కౌశిక్, అత్తింటి వారిపై గృహహింస కేసు పెట్టింది. ముంబైలోని గోరేగావ్ పోలీస్ స్టేషన్లో మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. భర్త తనని శారీరకంగా మానసికంగా వేధించాడని, వ్యక్తిత్వంపై అనుమానాలు వ్యక్తం చేసేవాడని, తన నగలు కూడా ఇవ్వట్లేదని ఆరోపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)అదితి శర్మ చెప్పినదాని ప్రకారం.. 2021 జూన్‌లో ఆన్లైన్ యాక్టింగ్ క్లాసుల ద్వారా అభినీత్ కౌశిక్‌తో పరిచయం ఏర్పడింది. 2024 సెప్టెంబర్ నుంచి ఇద్దరూ కలిసి బతకడం మొదలుపెట్టారు. అదే ఏడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన కొద్దిరోజులకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని చిన్న చిన్న విషయాలకే తమ మధ్య తరచూ గొడవలు జరిగేవని, నా డ్రస్సింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసేవాడని, తన దగ్గర నుంచే డబ్బులు తీసుకునేవాడని ఆరోపించింది.2025 జనవరిలో కాఫీ విషయంలో జరిగిన ఓ గొడవ పెద్దది కావడంతో తనను దారుణంగా తిట్టారని, వివాహేతర సంబంధం కూడా అంటగట్టారని అదితీ తన ఫిర్యాదులో రాసుకొచ్చింది. తన మొబైల్ తరచూ చెక్ చేయడం, తల్లిదండ్రులతో మాట్లాడకుండా అడ్డుకోవడం లాంటివి కూడా అత్తింటివాళ్లు చేశారని తెలిపింది. తన మంగళసూత్రం, బంగారు గొలుసులు, ఉంగరాలు, డైమండ్ రింగ్, గాజులు తదితర వివాహ ఆభరణాలని అడిగినా తనకు ఇవ్వట్లేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: భార్యతో విడాకులు.. తల్లితండ్రులని కలిసిన హీరో)ఈ ఏడాది మార్చిలో అదితీ భర్త అభినీత్, అతడి తరఫు న్యాయవాది ఈమెపై పలు ఆరోపణలు చేశారు.'అపోల్లెనా' సీరియల్ సహనటుడు సమర్థ్య గుప్తాతో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను గుర్తించడంతోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని చెప్పాడు. అదితి తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని, ఇండస్ట్రీలో ఇది బయటపడకూడదనే ఉద్దేశంతో తమ పెళ్లిని రహస్యంగా ఉంచాలని కోరిందని అభినీత్ పేర్కొన్నాడు. కుటుంబాల మధ్య రాజీ చర్చల సందర్భంగా రూ.25 లక్షలు, విడాకులు కోరినట్లు కూడా ఆయన ఆరోపించాడు.భర్త ఆరోపణలపై స్పందించిన అదితి.. పెళ్లైన నెల రోజుల నుంచే తనని చాలా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విషయాలు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున పూర్తి వివరాలు మాట్లాడలేనని చెప్పింది. గృహహింస తన వైపు నుంచి జరగలేదని స్పష్టం చేసిన ఈమె.. తన భర్త తనని, తన కుటుంబాన్ని పలుమార్లు అవమానించారని, అందుకే విడాకులు కోరినట్లు పేర్కొంది. తమ పెళ్లిని రహస్యంగా ఉంచాలనే నిర్ణయం ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓటీటీలోకి రష్మిక కొత్త సినిమా...స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కాక్టెయిల్ 2’.హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్‌లో విడుదలై..మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఆగస్ట్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.కాక్ టెయిల్ 2 కథేంటంటే..కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. ఓ సారి కునాల్, దియా ఫారిన్లో వెకేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ దియా బెస్ట్‌ఫ్రెండ్ యాలీతో కునాల్‌కి పరిచయం ఏర్పడుతుంది. అయితే కునాల్‌పై యాలీ క్రష్ పెంచుకోవడమే కాకుండా ఓ సమయంలో అతడితో శారీరకంగా కలుస్తారు. ఈ విషయం దియాకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? కునాల్, దియా మధ్యకు యాలీ ఎలా వచ్చింది? దియాతో డేటింగ్ చేస్తున్నప్పటికీ.. యాలీ ఎలా దగ్గరైంది? చివరకు కునాల్ ఎవరినీ పెళ్లి చేసుకొన్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
రోడ్డుపై, కాలేజీ గోడలపై అలా రాశాడు.. భయపడిపోయా: నటి
కాలేజీ రోజుల్లో తనకు ఎదురైన ఓ భయంకరమైన సంఘటన గురించి బుల్లితెర నటి శుభాంగి ఆత్రే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆమె ఇంటర్ చదవుతున్న రోజుల్లో ఓ వ్యక్తి రోజు బైక్‌పై ఫాలో అయ్యేవాడని.. అతని చర్యలు చూసి భయపడిపోయానని శుభాంగి చెప్పింది.‘నేను ఇండోర్‌లో 10-11వ తరగతి చదవుతున్నప్పుడు ఓ వ్యక్తి రోజు బైక్‌పై మమ్మల్ని ఫాలో అయ్యేవాడు. కాలేజీ గోడలపై, రోడ్డుపై నా పేరు, తన పేరు కలిపి రాసేశాడు. మా ఇంటికి ఎదురుగా ఉన్న గోడపై కూడా అలానే రాశాడు. నేను అతనితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ మా వెనకే తిరిగేవాడు. ఓ సారి మా అక్క అతనితో మాట్లాడింది. ‘ఇలా తిరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ఏదైనా సాధించి రా.. అప్పుడు మనం మాట్లాడుకుందాం’అని చెప్పింది. కొన్నాళ్ల తర్వాత అతను కనిపించకుండా పోయాడు. ఇలాంటి వేధింపులు ఆడపిల్లలను చాలా భయానికి గురి చేస్తాయి. బయటకు కూడా రాలేరు. ఇంట్లో వాళ్లు కూడా భయపడతారు. వేధింపులపై మహిళలు, యువతులు మౌనంగా ఉండకూడదు. ధైర్యంగా ఎదురు తిరగాలి. నేటి తరం అమ్మాయిలు తమ రక్షణ విషయంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించడం మంచి పరిణామం’ అని శుభాంగి అన్నారు.‘కసౌతీ జిందగీ కే' అనే సిరియల్‌తో సీనీ కెరీర్‌ని ప్రారంభించిన శుభాంగి ఆత్రే.. 2007లో వచ్చిన 'కస్తూరి' అనే ధారవాహికతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత 'భాబీజీ ఘర్ పర్ హై!'లో అంగూరి భాభీ పాత్ర పోషించి బాగా పేరు సంపాదించింది. చిడియా ఘర్, అధురి కహానీ హుమారీ, హవన్, దో హాన్సన్ కా జోడా వంటి షోలలో కూడా నటించింది. -
‘రేసుగుర్రం’ విలన్ చేతికి ఖరీదైన వాచ్.. ధర ఎంతో తెలుసా?
తెలుగులో ‘రేసుగుర్రం’ సినిమాలో ‘మద్దాలి శివారెడ్డి’ పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఆయన ‘హర్ హర్ భోళే నమహ శివాయ’ అనే భక్తి గీతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో పాడుతున్న వీడియో ఒకటి నెట్టింట తీవ్రంగా వైరల్ అయ్యింది. ఆయన భక్తి పారవశ్యానికి అభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా, ఆ వీడియోలో రవి కిషన్ చేతికి మెరుస్తున్న ఒక లగ్జరీ గడియారం ప్రతి ఒక్కరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఆ గడియారం ప్రత్యేకం ఏమిటంటే?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం రవి కిషన్ ధరించిన ఆ గడియారం ప్రముఖ స్విస్ లగ్జరీ వాచ్ బ్రాండ్ ‘హ్యూబ్లో’ (Hublot) కి చెందిన ‘బిగ్ బ్యాంగ్ మెకా-10’ మోడల్. ఈ వాచ్ ఓపెన్-వర్క్డ్ (స్కెలిటన్) డయల్‌ను కలిగి ఉంటుంది. అంటే వాచ్ లోపల మెకానికల్ మూవ్మెంట్ ఎలా పనిచేస్తుందో బయటికే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మాన్యువల్-వైండింగ్ వాచ్. ఒక్కసారి వైండింగ్ చేస్తే ఏకంగా 10 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. గ్లాస్‌పై కాంతి పడి పరావర్తనం చెందకుండా ఉండేలా యాంటీ-రెఫ్లెక్టివ్ ట్రీట్మెంట్తో కూడిన సఫైర్ క్రిస్టల్‌ను ఇందులో ఉపయోగించారు. ధర ఎంతంటే..ఈ లగ్జరీ వాచ్ మార్కెట్ విలువ దాదాపు రూ. 35 లక్షలు ఉంటుందని అంచనా. గతంలో కూడా రవి కిషన్ దాదాపు రూ. 2.7 కోట్ల విలువైన లగ్జరీ వాచ్‌తో కనిపించి వార్తల్లో నిలిచారు. తాజాగా మరోసారి రూ. 35 లక్షల ఖరీదైన గడియారంతో మెరవడంతో ఆయన వాచ్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Urban NXT | Luxury Platform (@urban.nxt) -
రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తగ్గించుకున్న స్టార్ హీరో!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తెలుగు దర్శకుడ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. SVC63 పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఒక్కో మూవీకి రూ.120 కోట్ల వరకు రెమ్యనరేషన్ తీసుకుంటాడనే టాక్ ఉన్న సల్మాన్.. దీని కోసం మాత్రం రూ.70 కోట్లే తీసుకుంటున్నాడని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏంటి కారణం?(ఇదీ చదవండి: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)వచ్చే ఈద్ టార్గెట్‌గా తీస్తున్న ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ పారితోషికం తగ్గింపు నిర్ణయం తీసుకోవడం వెనక ఆయన సన్నిహిత మిత్రుడు రఫీ కాజీ అనే కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ సెట్ కావడంలో ఈయన కీలక పాత్ర పోషించాడని, నిర్మాతల్లో ఒకరిగా కూడా ఉన్నాడని సమాచారం. స్నేహితుడి కోసమే సల్మాన్ తన సాధారణ పారితోషికంతో పోలిస్తే భారీగా తగ్గించాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.అయితే అడ్వాన్స్ మొత్తంతో పాటు సినిమా లాభాల్లోనూ వాటాని సల్మాన్ తీసుకుంటున్నారా లేదా అనే విషయపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే సల్మాన్ ఖాన్ తన సినిమాల్లో లాభాల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా 2010లో రిలీజైన 'దబాంగ్' తర్వాత ఆయన కుటుంబ సభ్యులు లేదా సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ (SKF) బ్యానర్ ఎక్కువ శాతం చిత్రాలని నిర్మించింది. 'బాడీగార్డ్'ని ఆయన సోదరి అల్విరా ఖాన్ నిర్మించగా, 'దబాంగ్'ని సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మించాడు.ఇకపోతే సల్మాన్ ఖాన్ మరోవైపు 'మాతృభూమి' అనే వార్బ్యాక్ డ్రాప్ మూవీ చేశాడు. గాల్వాన్ లోయ ఘర్షణ నేపథ్యం కావడంతో ప్రస్తుతానికి దీన్ని హోల్డ్‌లో పెట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇదెప్పుడు థియేటర్లలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి.(ఇదీ చదవండి: ఓటీటీలో ఇంటెన్స్ హిందీ ప్రేమకథా సినిమా.. అధికారిక ప్రకటన) -
ముఖేశ్ ఖన్నాకు ఇచ్చిపడేసిన సీజేపీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేశ్ ఖన్నా తమపై చేసిన వ్యాఖ్యలకు కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చింది. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలకు నిరసన తెలిపిన వారికి మద్దతు ఇచ్చిన యువతపై బెదిరింపులకు దిగడాన్ని తిప్పికొట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న యువతకు ఉద్యోగాలు రావని, ప్రభుత్వం సాయం అందని ముకేశ్ ఖన్నా హెచ్చరించారు. అంతేకాదు వారిని మురికి కాలువలోని పురుగులుగా ఆయన వర్ణించారు. సీజేపీ ట్రాప్‌లో పడొద్దని పిల్లలకు సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కూడా షేర్ చేశారు.''ఇంట్లోకి బొద్దింకలు వస్తే, మనం ఏం చేస్తాం?? వాటిని వెతికి పట్టుకుంటాం, పైకి ఎత్తి బయట పడేస్తాం. వీరితో కూడా అలాగే చేయండి. కొంత మంది పిల్లలు ప్రలోభాలకు లొంగిపోయి, ఆవేశంలో అన్ని రకాల తప్పుడు, నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. వారికి ఇదే నా హెచ్చరిక.. మీ మాటలు చరిత్రలో లిఖించబడ్డాయి. వారితో తిరగడం ద్వారా, మీరు మిమ్మల్ని మీరే ఒక మురికి కాలువలోని పురుగులుగా మార్చుకున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది!!ఏ పోలీసులూ మీకు సహాయం చేయరు. చాలామంది మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి సంకోచిస్తారు. ప్రభుత్వ సహాయం నిలిపివేయబడుతుంది. మీకు కొన్ని వీసాలు కూడా రాకపోవచ్చు!! మీరు ఇప్పటికే మీ కుటుంబం దృష్టిలో పడిపోయారు! అందుకే, మీరు వారి బారి నుండి ఎంత త్వరగా తప్పించుకుంటే అంత మంచిది. నాకు మీ గురించి ఆందోళనగా ఉంద''ని ఎక్స్‌లో పేర్కొన్నారు.మాకు మీరు తెలియదుముఖేశ్ ఖన్నా వ్యాఖ్యలను సీజేపీ తిప్పికొట్టింది. తాము జెనజీ తరానికి చెందిన వాళ్లమని మీ గురించి మాకు తెలియదు అనే అర్ధం వచ్చేలా కౌంటర్ ఇచ్చింది. ''క్షమించండి, మేము జెన్‌జీ. మేము స్పైడర్మాన్, బాట్మాన్, మార్వెల్స్ చూశాం. మీ గురించి మాకు తెలియదు. కాబట్టి మీ జ్ఞానాన్ని మీ జేబులోనే ఉంచుకోవాల''ని ఎక్స్‌లో సీజేపీ జవాబిచ్చింది. కాగా, శక్తిమాన్ పాత్రతో ముఖేశ్ ఖన్నా సినిమా రంగంలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు అదే తరహాలో సీజేపీ కౌంటర్ ఇచ్చింది.Sorry , but we are Gen-z हम spiderman, batman, Marvels देखते हैं Animes देखते हैं ! हम आपको नहीं जानते ! So please keep your knowledge in your pocket. https://t.co/OdQp0Pe25M— Cockroach Janta Party (@shah34516) August 1, 2026చదవండి: ఈ20 ఇథనాల్ పెట్రోల్ స్కామ్‌ను బయటపెడతా -
అభిమానులకు క్షమాపణలు చెప్పిన ప్రియాంక.. నెటిజన్స్ ప్రశంసలు
సాధారణంగా సినిమా తారలు కనిపిస్తే వాళ్లతో ఫోటోలు దిగడానికి జనాలు ఎగబడతారు. అయితే కొంతమంది హీరోహీరోయిన్లు మాత్రం.. సెల్ఫీలు అడిగితే చిరాకుగా వెళ్లిపోతుంటారు. మరికొంతమంది అయితే దగ్గరకు వచ్చిన అభిమానులను తోసేస్తారు. సెల్ఫీలు ఇవ్వడం ఇష్టంలేకుంటే..ఫ్యాన్స్ వైపు చూడకుండా సైలెంట్‌గా వెళ్లిపోతారు. కానీ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మాత్రం.. సెల్ఫీలు ఇవ్వలేకపోయినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పింది. తన పరిస్థితిని మర్యాదగా వివరించి.. సెల్ఫీలు ఇవ్వకుండా వెళ్లిపోయింది.అసలేం జరిగింది?ఎక్కడి వెళ్తుందో తెలియదు కానీ.. తాజాగా ప్రియాంక చోప్రా ముంబై ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లింది. కూతురుని చేతుల్లో ఎత్తుకొని.. ఎయిర్పోర్ట్లోపలికి వెళ్తుండగా.. ఆమెను గుర్తుపట్టి కొంతమంది సెల్ఫీలు అడిగారు. అయితే ప్రియాంక చేతిలో పాప ఉండడంతో సెల్ఫీలు ఇవ్వలేకపోయింది. అలా అని వారిని పట్టించుకోకుండా వెళ్లలేదు. ఒక క్షణం ఆగి.. ‘క్షమించండి..నేను పాపతో ఉన్నాను’ అని చెప్పింది. ఆమె అలా చిరునవ్వుతో మర్యాదగా చెప్పడం అభిమానులను విపరీతంగా హత్తుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. అంతర్జాతీయంగా కీర్తి గడించినప్పటికీ ఒదిగి ఉండడమే కాదు..గౌరవంగా ప్రవర్తించారని నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.మహేశ్‌కి జోడీగా.. ప్రియాంక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న వారణాసి చిత్రంలో మహేశ్‌కు జోడీగా నటిస్తోంది. ఇందులో అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ చేసినట్లు ఆమె చెప్పారు. ఇక ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Bollywood Society (@bollywoodsocietyy) -
సన్‌గ్లాసెస్‌తో గుడిలో హీరోయిన్ పూజలు.. నెటిజన్స్ ఫైర్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్..తన ఇన్‌స్టా ఖాతాలో తాజాగా పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు..ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ భూమి పెడ్నేకర్ పోస్ట్ చేసిన వీడియో ఏంటి? అసలు ఏం జరిగింది?విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకునే బాలీవుడ్ నటి భూమి..తాజాగా శివాలయానికి వెళ్లింది. పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శివలింగానికి ప్రత్యేక పూజలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియాలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఈ శ్రావణ మాసంలో నా జీవితం సులభంగా మారిపోవాలని కోరుకోవడం లేదు. ఎలాంటి కష్టాలు, సవాళ్లు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమని ఆ మహాదేవుడిని ప్రార్థిస్తున్నాను. హర్ హర్ మహాదేవ్’అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.అయితే ఈ వీడియోలో భూమి కనిపించిన విధానంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బ్లాక్ టీషర్ట్, జీన్స్ ధరించి ఆమె గుడిలోకి వెళ్లారు. అంతేకాదు కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకొని శివలింగానికి అభిషేకం చేసింది. పవిత్రమైన ఆలయంలోకి వెళ్లినప్పుడు కనీసం కళ్లజోడు అయినా తీసేయాలనే సంస్కారం లేదా అని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. ‘పూజ చేస్తున్నారా లేదా ఫోటో షూట్‌కి పోజులు ఇస్తున్నారా?’, ‘సన్ గ్లాసెస్ పెట్టుకొని పూజ చేసినవాళ్లను ఇంతవరకు చూడలేదు’, ‘దయచేసి ఆ కళ్లజోడులో నుంచి దేవుడివైపు చూడకండి.. సంప్రదాయాలకు కనీస గౌరవం ఇవ్వండి’ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Bhumi Satish Pednekkar (@bhumisatishpednekkar) -
‘రాకా’లో షారుక్.. రూ. 1000 కోట్ల బడ్జెట్.. అట్లీ ప్లాన్ అదుర్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘రాకా’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా మరో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ కోసం అంతర్జాతీయ స్టూడియోలతో కలిసి చిత్ర బృందం పనిచేస్తోందని సమాచారం.షారుక్ ఖాన్ కామియో?ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆయన కామియోకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. విదేశాల్లో నిర్వహించే ప్రత్యేక షూటింగ్ షెడ్యూల్లో షారుక్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందట. అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.రెండు కాలాల్లో సాగే కథ'రాకా' కథ రెండు విభిన్న కాలాల్లో సాగనున్నట్లు సమాచారం. ఒక భాగం పురాణ–వేద కాలంలోని గిరిజన నేపథ్యంలో ఉండగా, మరో భాగం ఆధునిక కాలంలో కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ ప్రత్యేక కథన నిర్మాణమే సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆధునిక కాలానికి సంబంధించిన కథలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చారిత్రక భాగంలో దీపికా పదుకొణె కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే జాన్వీ కపూర్, రష్మిక మందన్న కూడా అదే టైమ్‌లైన్‌లో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర నటీనటుల్లో చెంబన్ వినోద్ జోస్, యోగి బాబు, ఫెమినా జార్జ్ కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతారనే ప్రచారం ఉన్నప్పటికీ, అల్లు అర్జున్, దీపికా పదుకొణె పేర్లను మినహాయించి పూర్తి తారాగణాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.రిలీజ్ ఎప్పుడంటే..?'రాకా' విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ కావడంతో.. ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే బ్రేక్ ఈవెన్‌లో ఇబ్బందులొస్తాయని.. అట్లీ భావిస్తున్నాడట. పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ చేస్తే కేజీయఫ్, పుష్ప, బాహుబలిలా ఈ చిత్రం కూడా ఎక్కువ వసూళ్లను సాధిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్లో పార్ట్ 1 రిలీజ్ చేసి.. మరుసటి ఏడాదిలో పార్ట్ 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. -
బాబుషాన్ బర్త్‌డే స్పెషల్..ఆకట్టుకుంటున్న‘అంతర్యామి' పోస్టర్
ఒడియా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్‌స్టార్ బాబుషాన్ మొహంతి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'అంతర్యామి' చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ విడుదల చేసిన బర్త్‌డే పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అమ్రిత్ ప్రెజెంట్స్, శివ సత్యం ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాబుషాన్ మొహంతి కథానాయకుడిగా నటిస్తుండగా, వేద్విక సోని హీరోయిన్గా కనిపించనుంది. సీనియర్ నటీమణులు ఆమని, కస్తూరి, శ్రీతం దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శివ సత్యం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్స్ అమ్రిత్ నిషాద్ జ్ఞానరంజన్ సాహు, నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను చిత్రబృందం వెల్లడించనుంది. -
రణ్‌బీర్ కపూర్ రామాయణ.. విజువల్ వండర్లా ట్రైలర్
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్.. రాముడు, సీత, రావణుడిగా నటించిన చిత్రం 'రామాయణ'. ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మొదట ఈనెల 24న యూట్యూబ్‌లోనే విడుదల చేస్తామని తెలిపారు. కానీ అలా కుదరలేదు. ముందుగా ప్రకటించినట్లుగానే తాజాగా రామాయణ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ ఉదయం 4 గంటల 15 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే రామాయణ మరో రేంజ్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ నితీశ్ తివారీ రామాయణం విజువల్ వండర్లా కనిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముల పాత్రల్లో సరికొత్తగా కనిపించారు. రావణుడితో యుద్ధం సీన్స్ ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది దీపావళికి ప్రపంచవ్యాప్తంగా రామాయణ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్లా ఉన్న ట్రైలర్ మీరు కూడా చూసేయండి. -
గురుపౌర్ణమి నాడు బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి
హిందీ ప్రముఖ సీరియల్ నటి కరిష్మా తన్నా శుభవార్త చెప్పేసింది. గురుపౌర్ణమి రోజున తనకు పండంటి మగబిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ క్రమంలోనే తోటి నటీనటులు.. కరిష్మా దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈమె బయటపెట్టగా.. ఇప్పుడు బిడ్డ పుట్టాడు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు?)కరిష్మా తన్నా.. 2022లో ముంబైకి చెందిన బిజినెస్‌మ్యాన్ వరుణ్ బంగేరాని పెళ్లి చేసుకుంది. అంతకు ముందు కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట అనంతరం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కరిష్మా.. 2001 నుంచి హిందీలో సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ', 'కుసుమ్' తదితర సీరియల్స్‌తో పాటు 'బిగ్ బాస్', 'నచ్ బలియే', 'జరా నచ్కే దిఖా' లాంటి రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఐదారేళ్లలో అయితే 'స్కూప్' లాంటి ఓటీటీ సిరీస్‌లతో ప్రశంసలు అందుకుంది. ఈమె 'సంజు', 'సూరజ్ పే మంగళ్ భారి' లాంటి సినిమాలు కూడా చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Karishma K Tanna (@karishmaktanna) -
సొంత మేనమామే బలవంతం చేశాడు.. నటి సంచలన వ్యాఖ్యలు
బుల్లితెర నటి, ‘బాలికా వధు 2’ సీరియల్ ఫేం శివాంగి జోషి చిన్నప్పుడు తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వివరిస్తూ ఎమోషనల్ అయింది. తాజాగా ‘లాకప్ 2’ రియాల్టీ షోలో పాల్గొన్న ఆమె.. చిన్నప్పుడు సొంత మేనమామనే తనతో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు.‘మా అమ్మకు సోదరుడైన ఓ వ్యక్తిని నేను చాలా నమ్మేదాన్ని. ముద్దుగా మామాజీ అని పిలిచేదాన్ని. నన్ను రోజు స్కూల్ నుంచి తీసుకొచ్చేవాడు. మా అమ్మ అతన్ని ఎంతగానో నమ్మేది. అదే ఆసరాగా చేసుకొని నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నేను సినిమాల్లోకి వెళ్లాలంటే ముందుగా డ్రైవింగ్ నేర్చుకోవాలని చెబుతూ..ఒల్లో కూర్చోబెట్టుకొని ఏదోదో చెప్పేవాడు. ఆయన ఏం చెబుతున్నాడో.. ఆయన ఉద్దేశాలు ఏంటో అర్థం కాలేదు. కానీ నాకు నచ్చలేదు. నేను డ్రైవింగ్ నేర్చుకోనని చెప్పి.. పక్కకు వచ్చేశా. ఓ రోజు మా అమ్మనాన్నలు బయటకు వెళ్లారని తెలుసుకొని.. ఇంట్లోకి వచ్చాడు. హీరోయిన్‌వి కావాలంటే రకరకాల సీన్లలో నటించాలంటూ.. నా నుదుటిపై, చెంపలపై ముద్దు పెట్టాడు. నా పెదాలపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా..తోసేశాను. దీంతో అతనికి కోపం వచ్చి నన్ను కింద పడేశాడు. అదృష్టంకొద్ది అప్పుడే అమ్మనాన్నలు ఇంట్లోకి వచ్చారు. నా అరుపులు విని గదిలోకి వచ్చి చూశారు. ఏం జరిగిందో తెలుసకొని..అతన్ని కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశారు’ అని చెబుతూ శివాంగీ ఎమోషనల్ అయింది. -
‘దమ్ముంటే ఒంటరిగా రా’.. కంగనాపై రాఖీ తిరుగుబాటు
జంతర్‌మంతర్ వద్ద జరిగిన జెన్ జెడ్ విద్యార్థుల నిరసనలపై ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నటి రాఖీ సావంత్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులకు, దేశ యువతకు మద్దతుగా నిలిచిన ఆమె, కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కంగనా రనౌత్ జెన్ జెడ్ వారిని ‘జనరేషన్ గట్టర్’ అని అభివర్ణించడంతో పాటు, నిరసనల్లో పాల్గొన్న యువతులపై వివాదాస్పద కామెంట్లు చేశారు.దీనిపై రాఖీ సావంత్ తీవ్రంగా స్పందిస్తూ, దేశంలోని యువతులు, విద్యార్థినుల గురించి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసిన రాఖీ సావంత్, కంగనా రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీగా ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ‘మీకు ధైర్యం ఉంటే సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా బయటకు తిరగండి. అప్పుడే దేశంలోని యువత శక్తి ఏంటో మీకు తెలుస్తుంది’ అని సవాలు విసిరారు.పార్లమెంట్లో కూర్చుని ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బాలీవుడ్లో కంగనా గత వివాదాలను గుర్తుచేస్తూ, ఆమె భాషపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. మరోవైపు, కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో జెన్ జెడ్ నిరసనల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిరసనల్లోని రీల్స్ చూసి తాను దిగ్భ్రాంతి చెందానని, కొద్దిరోజులు డిజిటల్ డిటాక్స్లోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. సాంప్రదాయ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరిపై ఆమె మండిపడ్డారు. ఈ పరిణామాలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
దిగ్గజ నటి రేఖ సినిమాకు మరో అరుదైన గౌరవం
బాలీవుడ్ దిగ్గజ నటి రేఖ నటించిన అద్భుత చలనచిత్రం ‘ఉమ్రావ్ జాన్’. 1981లో విడుదలైన ఈ చిత్రం నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలను కైవసం చేసుకుంది. ఇందులో అద్భుత అభినయం ప్రదర్శించిన రేఖ 'ఉత్తమ నటి'గా జాతీయ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రేఖ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘ఉమ్రావ్ జాన్’ చిత్రం త్వరలో మరో అరుదైన గౌరవాన్ని అందుకోనుంది.వచ్చే నెలలో జరుగనున్న ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ (ఐఎఫ్ఎఫ్ఎం) వేదికపై ఈ క్లాసిక్ మూవీ ప్రదర్శితం కానుంది. ఈ నేపథ్యంలో ఉమ్రావ్ జాన్ పాత్ర దశాబ్దాలుగా తనతోపాటే సజీవంగా ఉందంటూ రేఖ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ.. ‘ఉమ్రావ్ జాన్ నా జ్ఞాపకాల్లో, నా నిశ్శబ్దంలో, దశాబ్దాలుగా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా ఉంది. ప్రపంచ వేదికపై ఈ చిత్రానికి దక్కుతున్న గౌరవం చూసి నా మనస్సు ఆనందంతో నిండిపోతోంది’ అని పేర్కొన్నారు.ఆగస్టు 13 నుండి 23 వరకు జరుగనున్న ఈ చలనచిత్రోత్సవంలో రేఖ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. భారతీయ సినిమాకు ఆమె అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ వేదికపై ప్రతిష్టాత్మక ‘ఎక్స్‌లెన్స్ ఇన్ సినిమా అవార్డు’తో ఆమెను సత్కరించనున్నారు. ఈ పురస్కారాన్ని కృతజ్ఞతా భావంతో స్వీకరించనున్నట్లు రేఖ తెలిపారు. ఇది కేవలం తన నటనకు దక్కిన గుర్తింపు మాత్రమే కాదని, తన జీవితాన్ని, నటనను తీర్చిదిద్దిన చిత్రనిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, కళాకారులందరికీ అంకితమని ఆమె పేర్కొన్నారు. -
కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలపై, నేటి యువతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జెన్ జీ వర్గం అనుచిత భాషను వాడిందని, వారి ప్రవర్తన బాగోలేదని ఆమె ఆరోపించారు. కాగా కంగనా వ్యాఖ్యలపై ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, సింగర్ విశాల్ దద్లానీ తీవ్ర స్థాయిలో స్పందించారు.ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జీలు, హింసాత్మక ఘటనలను ఆయన గుర్తు చేశారు. ‘చెడు భాష గురించా? మీరు రోడ్లపై పిల్లలను కొట్టారు, వారిపై రాళ్లు రువ్వారు, పైగా వారినే నిందిస్తున్నారు! వారిపై కాల్పులు జరుపుతున్నారు, బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. వారి ముఖాలపై పెల్లెట్ గన్లు వాడుతున్నారు. మీ పెయిడ్ గూండాలు ఇప్పటికీ తిరుగుతూ, వారిని బెదిరిస్తున్నారు, కొడుతున్నారు! ఈ తిట్లను మీరే స్వయంగా సంపాదించుకున్నారు.. మై ఫ్రెండ్’ అంటూ విశాల్ దద్లానీ మండిపడ్డారు.ఈ పోస్ట్ క్యాప్షన్‌లో.. ‘పెయిడ్ స్టోరీలు, ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు నిర్వహించడం వల్ల మీ దిగజారుడుతనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విశాల్ దద్లానీ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. మరోవైపు, కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో నిరసనలకు సంబంధించిన ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ తీవ్ర పదజాలం వాడారు. ‘నా జీవితంలో ఇంతటి అసహ్యకరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. జెన్ జీ నిరసనల రీల్స్ చూస్తే వాంతి వస్తోంది. వారు మాట్లాడే తీరు, వాడే భాష అత్యంత హేయంగా ఉన్నాయి’ అని ఆమె పేర్కొన్నారు. ఈ నిరసనకారులను ‘జనరేషన్ గటర్’ అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదువుసంధ్యలు లేని వీరు వ్యవస్థకు ఏమాత్రం ఉపయోగపడరని, కనీసం ఇంటిని కూడా చక్కదిద్దలేరని ఆమె విమర్శించారు. కాగా, ఈ వివాదం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ సునీల్ ఆనంద్ మరణించారు. లండన్‌లో ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని సునీల్ ఆనంద్ మేనకోడలు గీనా నారంగ్ ధృవీకరించారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి ప్రైవసీ కల్పించాలని ఆమె కోరారు.కాగా.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో దేవ్ ఆనంద్, నటి కల్పనా కార్తీక్‌లకు సునీల్ ఆనంద్ జన్మించారు. ఆ తర్వాత అమెరికాలో తన చదువు పూర్తి చేసుకున్నారు. 1984లో తన తండ్రితో కలిసి 'ఆనంద్ ఔర్ ఆనంద్' చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. దేవ్ ఆనంద్ కూడా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆ తర్వాత సునీల్ 'కార్ థీఫ్', 'మై తేరే లియే' అనే మరో రెండు చిత్రాల్లో నటించారు. రెండో చిత్రంలో ఆయన మీనాక్షి శేషాద్రి సరసన నటించారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా అంతగా మెప్పించలేకపోయాయి. -
రణ్‌బీర్ కపూర్ రామాయణ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ రామాయణ. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు.అయితే ఈ మూవీ ట్రైలర్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. రామాయణ ట్రైలర్ టైమ్ అండ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనెల 24 రిలీజ్ చేస్తామని వాయిదా వేసిన మేకర్స్ తాజాగా డేట్‌తో టైమ్ ప్రకటించారు. ఈ నెల 30 తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు విడుదల చేస్తామని వెల్లడించారు. ఎంతో పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో ఈ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు.🕉️...Reposted from @malhotra_namit 's Instagram 🕉️ pic.twitter.com/PpnlFJKD32— The World Of Ramayana (@WorldOfRamayana) July 28, 2026 -
తండ్రి మరణించిన ఆస్పత్రిలోనే హీరో కన్నుమూత
బాలీవుడ్ దిగ్గజ నటుడు దేవ్ ఆనంద్ కుమారుడు.. నటుడు, దర్శకుడు అయిన సునీల్ ఆనంద్ (70) చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన మేనకోడలు జీనా నారంగ్.. కుటుంబ సభ్యుల తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.(ఇదీ చదవండి: రామ్ చరణ్‌కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)అమెరికా నుంచి భారత్‌కి తిరిగొస్తుండగా లండన్‌లో సునీల్ ఆనంద్కి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షల తర్వాత స్టెంట్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుండగా.. సర్జరీకి ముందే ఈయనకు మరోసారి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తుదిశ్వాస విడిచారు. గతంలో తండ్రి దేవ్ ఆనంద్ ఏ ఆస్పత్రిలో అయితే చనిపోయారో అదే చోట ఇప్పుడు కొడుకు సునీల్ ఆనంద్ కూడా మరణించారు.1984లో తండ్రి దేవ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'ఆనంద్ ఔర్ ఆనంద్' సినిమాతో సునీల్ ఆనంద్.. హీరోగా కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత 'కార్ థీఫ్', 'మైన్ తేరే లియే', 'మాస్టర్' తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. అయితే 2023లో తన తండ్రి 100వ జయంతి వేడుకల్లో మాట్లాడిన సునీల్ ఆనంద్.. నా జీవితంలో 40 ఏళ్లకు పైగా తండ్రి ఆరోగ్యం, షూటింగ్ షెడ్యూల్స్, కుటుంబ నిర్మాణ సంస్థ నవకేతన్ ఫిలిమ్స్ వ్యవహారాలని చూసుకున్నానని చెప్పారు. తన తండ్రి జీవితానికి అంకితమిచ్చేలా ఓ భారీ సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఇప్పుడు సునీల్ ఆనంద్ తుదిశ్వాస విడిచారు.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్) -
నా తండ్రి చావుకు నేనే సాయం చేశా: ప్రముఖ నటుడు
ముంబై: ‘లాక్ అప్ 2’ రియాలిటీ షోకు చెందిన ప్రముఖ నటుడు రామ్ కపూర్ తన జీవితంలోని అత్యంత భావోద్వేగమైన క్షణాలను మీడియాతో పంచుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన తండ్రి తుదిశ్వాస విడిచే సమయంలో తాను ఆయన వెంటే ఉన్నానని, తండ్రి కోరిక మేరకు ఆయన అంతిమ క్షణాల్లో సహకరించానని రామ్ కపూర్ కంటతడి పెట్టుకుంటూ వెల్లడించారు. ఈ నిర్ణయం తన కుటుంబంతో ఉన్న సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన తెలిపారు.రామ్ కపూర్ తండ్రికి 63 ఏళ్ల వయసులో క్యాన్సర్ సోకగా, శస్త్రచికిత్స అసాధ్యం కావడంతో 18 సార్లు కీమోథెరపీ నిర్వహించారు. దాంతో కొంతకాలం వ్యాధి అదుపులో ఉన్నప్పటికీ, ఆయనకు 73 ఏళ్ల వయసులో క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది. తండ్రితో వ్యాపారంలో చేరకుండా, రామ్ కపూర్ తన సొంత దారిని ఎంచుకున్నారు. కుటుంబ వ్యాపారానికి దూరంగా ఉంటూ వినోద రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన భావించారు.కొవిడ్ మహమ్మారి సమయంలో సింగపూర్‌లో ఉన్న రామ్‌తో ఆయన తండ్రి మాట్లాడుతూ ‘నువ్వు నాకు చనిపోవడానికి సహాయం చేస్తావా?’ అని అభ్యర్థించారు. ఇకపై తీవ్ర అనారోగ్యంతో జీవించలేనని, తన చివరి క్షణాల్లో తన కొడుకు తన పక్కనే ఉండాలని ఆయన కోరుకున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా వచ్చి, ఐసీయూలో తండ్రి చెయ్యి పట్టుకుని ఆయన చివరి క్షణాల్లో రామ్ తోడుగా నిలిచారు. తండ్రి అంత్యక్రియల సమయంలో ఎవరూ ఏడవకూడదని, అదే రోజు దహన సంస్కారాలు చేయాలని ఆయన కోరారు. ఒక కొడుకుగా తండ్రి కోసం తాను చేసిన గొప్ప పని అదేనని, మరణాన్ని అంత దగ్గర నుంచి చూసిన అనుభవం తన జీవిత దృక్పథాన్నే పూర్తిగా మార్చివేసిందని రామ్ కపూర్ పేర్కొన్నారు. -
భర్తను ఎదిరించి మరీ రాజకీయాల్లోకి..
బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, మథుర బీజేపీ ఎంపీ హేమా మాలిని రాజకీయ ప్రవేశం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ఆమె రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రముఖ నటుడు, భర్త ధర్మేంద్ర తీవ్రంగా వ్యతిరేకించారట. భారీ జనసందోహం, ఎన్నికల ప్రచారంలో ఎదురయ్యే భద్రతా సమస్యల గురించి ఆయన ఎంతో ఆందోళన చెందేవారు. అయితే తల్లి ఇచ్చిన ఒక సలహా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. హేమా మాలిని రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారు? ఆమె పెట్టిన ఆ ఒక్క షరతు ఏంటో ఈ ఈ కథనంలో తెలుసుకుందాం.రాజకీయాలపై ధర్మేంద్ర వ్యతిరేకతబాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర, తన భార్య హేమా మాలిని రాజకీయాల్లోకి అడుగుపెట్టడాన్ని మొదట్లో అస్సలు అంగీకరించలేదు. ఆమె భద్రత గురించి ఆయన నిత్యం భయపడేవారు. రాజకీయాల్లోకి వెళ్లడం అవసరమా? అని ఆయన తరచూ ప్రశ్నించేవారట.భారీ జనసందోహం చూసి భయంబీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడ భారీ జనసందోహం తరలివచ్చేది. ఆ విపరీతమైన రద్దీని చూసి ధర్మేంద్ర తీవ్ర ఆందోళనకు గురయ్యేవారు. ‘నువ్వు అంత పెద్ద జనం మధ్యలోకి వెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండు’ అంటూ ఆయన ఆమెను హెచ్చరిస్తూ ఉండేవారని హేమా మాలిని వెల్లడించారు.హెలికాప్టర్ ప్రయాణాలపై ఆందోళనఎన్నికల ప్రచార సమయంలో హేమా మాలిని తరచూ హెలికాప్టర్లలో ప్రయాణించాల్సి వచ్చేది. ఈ వైమానిక ప్రయాణాల గురించి కూడా ధర్మేంద్ర తీవ్రంగా కలత చెందేవారు. ‘ఇవన్నీ చేయడం నిజంగా అవసరమా?’ అని ఆయన ఆమెను పదే పదే ప్రశ్నించేవారని తెలిపారు.వినోద్ ఖన్నా ప్రచారంతో మలుపు1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నటుడు వినోద్ ఖన్నా కోసం హేమా మాలిని ప్రచారం చేశారు. ఆ సమయంలోనే ఆమెకు తనకున్న ప్రజాదరణ ఏంటో పూర్తిగా అర్థమైంది. అంత పెద్ద ఎత్తున జనం తనను చూసేందుకు రావడం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ప్రజల నుంచి వచ్చిన ఆదరణ ఆమెకు రాజకీయాలపై ఆసక్తిని కలిగించింది.తల్లి ఇచ్చిన స్ఫూర్తిదాయక సలహామొదట్లో రాజకీయాల్లోకి రావడానికి హేమా మాలిని నిరాకరించినప్పటికీ, ఆమె తల్లి చేసిన బోధ ఆమెను మార్చేసింది. అటల్ బిహారీ వాజ్‌పేయి, అద్వానీ వంటి దిగ్గజాలున్న బీజేపీ గొప్ప పార్టీ అని తల్లి ఆమెకు నచ్చజెప్పారు. ‘నువ్వు ఇప్పటివరకు ప్రజలను ఎంతగానో అలరించావు, ఇక దేశం కోసం కూడా ఏదో ఒకటి చేయి’ అని తల్లి ఇచ్చిన సలహా ఆమెను ఆలోచనలో పడేసింది.ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒకే ఒక్క షరతుబీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడానికి హేమా మాలిని పార్టీ ముందు ఒక ప్రధాన షరతు పెట్టారు. తాను కేవలం మథుర నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. శ్రీకృష్ణుడిపై ఆమెకున్న గాఢమైన భక్తే ఇందుకు ప్రధాన కారణం. ఆ సమయంలో సీనియర్ నాయకులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తనకు ఎంతో అండగా నిలిచారని ఆమె గుర్తు చేసుకున్నారు.విజయవంతంగా రాజకీయ ప్రయాణంషోలే, సీతా ఔర్ గీతా, డ్రీమ్ గర్ల్ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలతో బాలీవుడ్లో తిరుగులేని క్వీన్‌గా నిలిచిన హేమా మాలిని, ప్రస్తుతం రాజకీయాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ధర్మేంద్ర ఆందోళనలను అధిగమించి, తల్లి మాటలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె, ప్రస్తుతం మథుర ప్రజల అభిమాన ఎంపీగా విజయవంతంగా కొనసాగుతున్నారు. ఆమె భర్త ధర్మేంద్ర ఇటీవలే కన్నుమూశారు.ఇది కూడా చదవండి: వీడని బిగ్ మిస్టరీ: 23 ఏళ్లుగా ప్రముఖ నటుడు అదృశ్యం! -
అందవిహీనమైన మహిళ నువ్వే.. ఒక్క మాటతో మారిన నటి జీవితం
'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' అనే హిందీ సీరియల్లో సవితా విరాణి పాత్రలో నటించి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటి అపారా మెహతా తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారిగా ఎమోషనల్ అయ్యారు. నటుడు దర్శన్ జరివాలాతో తన వైవాహిక జీవితంలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడుతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)1982లో అపారా మెహతా, దర్శన్ జరివాలా పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ కూతురు ఉంది. అయితే 2003 నుంచి ఇద్దరూ విడివిడిగానే జీవిస్తున్నారు. కానీ అధికారికంగా అయితే విడాకులు తీసుకోలేదు.'అప్పట్లో ఓసారి షోలు చేసేందుకు అమెరికా వెళ్లాను. ఆ టైంలో మా పెళ్లిరోజు వచ్చింది. దీంతో దర్శన్‌కు ఫోన్ చేశాను. 'మనిద్దరం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి' అని ఆయన అన్నారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత దర్శన్ నాతో విడిపోవాలని కోరారు. 'నేను నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు నాకు నచ్చడం లేదు. నా జీవితంలో చూసిన అత్యంత అందవిహీనమైన మహిళ నువ్వే' అని నాతో చెప్పారు. ఆ మాటలు విన్న వెంటనే షూటింగ్‌కు వెళ్లిపోయాను. ఆ రోజు వరసగా సీన్స్ ఉండేసరికి జరిగిన విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. తర్వాత ఆలోచించినప్పుడు ఆయన నిజంగానే అలా చెప్పారా అని నాకు అనిపించిందని.తర్వాత ఒకరోజు దర్శన్ ఇల్లు విడిచి వెళ్లిపోయారు. అయినప్పటికీ మా మధ్య ఇప్పటికీ మంచి రిలేషన్ కొనసాగుతోంది. అది ఇప్పటికీ మా ఇల్లే. ఆయన తిరిగి రావాలనుకుంటే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అయితే ఆయన తిరిగి రాకపోవచ్చని నాకు తెలుసు. ఆయనలాంటి వ్యక్తి నాకు మళ్లీ దొరకరు. నాలాంటి వ్యక్తి కూడా ఆయనకు దొరకరు. విడివిడిగా ఉంటున్నప్పటికీ ఇప్పటికీ మేమిద్దరం ఒకరి మాటను మరొకరం పూర్తిగా అర్థం చేసుకునేంత అవగాహనతో ఉన్నాం' అని అపారా మెహతా అన్నారు. 'గాంధీ మై ఫాదర్', 'గురు', 'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ' తదితర చిత్రాల్లో నటించిన దర్శన్ జరివాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.(ఇదీ చదవండి: ఎన్నిసార్లు విడాకులు అడిగినా ఆమె ఇవ్వలేదు) -
ఎన్నిసార్లు విడాకులు అడిగినా ఆమె ఇవ్వలేదు
బాలీవుడ్ తొలితరం సూపర్‌స్టార్ రాజేశ్ ఖన్నా.. 2012లో చనిపోయారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం రాజేశ్ మాజీ భాగస్వామి అనితా అద్వానీ. కొన్నాళ్ల క్రితం తమ సహజీవనానికి చట్టబద్ధ గుర్తింపు కోరుతూ బాంబే హైకోర్టులో ఈమె పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని న్యాయస్థానం కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనిత.. రాజేశ్ ఖన్నా, ఆయన భార్య డింపుల్ కపాడియా గురించి సంచలన కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)1973లో తనకంటే చాలా చిన్న వయసున్న డింపుల్ కపాడియాని రాజేష్ ఖన్నా పెళ్లి చేసుకున్నారు. వీరికి ట్వింకిల్ ఖన్నా(హీరో అక్షయ్ కుమార్ భార్య), రింకీ ఖన్నా అనే కూతుళ్లు ఉన్నారు. 1982లో డింపుల్, రాజేష్ ఖన్నా ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా బతికారు గానీ అధికారికంగా విడాకులు తీసుకోలేదు. అయితే డింపుల్ దూరమైన తర్వాత రాజేశ్ ఖన్నా.. 2012లో మరణించే వరకు అనితా అద్వానీ అనే మహిళతో కలిసున్నారు. ఈ క్రమంలోనే తమ బంధానికి చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలని అనిత.. బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 1న ఈమె అప్పీల్‌ని హైకోర్టు కొట్టివేసింది. ఇది లివ్-ఇన్ రిలేషన్షిప్ మాత్రమేనని, హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే పెళ్లిగా పరిగణించలేదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనితా అద్వానీ.. నా కేసుని హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద విచారించడం సరైనది కాదు. నన్ను భార్యగా గుర్తించలేమని కోర్టు పేర్కొంది. చెప్పాలంటే రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాని ఎన్నోసార్లు విడాకులు అడిగారు. కానీ ఆమె అంగీకరించలేదు. విడాకులు ఇవ్వాలంటే ఆస్తులన్నీ తమ పేరు మీద బదిలీ చేయాలని షరతు విధించింది. రాజేష్ ఖన్నా, డింపుల్ చాలా ఏళ్లుగా కలిసి జీవించలేదు. అయితే వాళ్లు విడాకులు కూడా తీసుకోకపోవడం వల్ల నాలాంటి వ్యక్తికి ఎలాంటి చట్టపరమైన హక్కులు లేకుండా పోయాయి. ఒక వ్యక్తి జీవితంలో కొత్తగా వచ్చిన వ్యక్తికి చట్టపరమైన రక్షణ లభించకపోవడం బాధాకరం అని అనితా అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమె చేసిన వ్యాఖ్యలపై డింపుల్ కపాడియా లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేదు.(ఇదీ చదవండి: 'నీట్' వైరల్ గర్ల్.. ఇన్ స్టాతో రూ.10 లక్షల సంపాదనా?) -
'నీట్' వైరల్ గర్ల్.. ఇన్ స్టాతో రూ.10 లక్షల సంపాదనా?
నీట్ పేపర్ లీకేజీ విషయమై కొన్నిరోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా ఎంతలా విద్యార్థి నిరసనలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ ప్రధాన్ రాజీనామా చేయడంతో అంతా సద్దుమణిగింది. అయితే గత బుధవారం ముంబైలో నిరసన జరుగుతున్న టైంలో పోలీస్ వ్యాన్ని అడ్డుకుని ఓ అమ్మాయి తెగ వైరల్ అయిపోయింది. ఆమెనే రియా యాదవ్. ఈమె నటి, మోడల్ అయిన ఈమె వైరల్ ఫొటోని సెలబ్రిటీలు కూడా షేర్ చేశాడు. అయితే తనకొచ్చిన ఫేమ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇన్‌స్టాలో సబ్స్క్రిప్షన్ మొదలుపెట్టిందని, ఏకంగా రూ.10 లక్షల వరకు సంపాదించేసిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె చెవినపడేసరికి ఘాటుగా స్పందించింది.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)'ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ద్వారా నేను ఎలాంటి ఆదాయం పొందలేదు. చెప్పాలంటే ఇప్పటికే వచ్చిన ఆదాయాన్ని స్వీకరించేందుకు నా బ్యాంక్ ఖాతాని కూడా ఇన్ స్టాకి కనెక్ట్ చేయలేదు. నిజాలు తెలుసుకోకుండా నాపై విమర్శలు చేస్తున్నవారు.. జీవితంలో ఏదైనా సాధించకుండా ఇతరులపై ఆరోపణలు చేయడం సులభమే. నాపై విమర్శలు చేస్తున్న వారిలో ఒక్కరూ నాతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఎలాంటి పరిచయం కూడా లేదు''ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాపై లేదా మరెవరిపైనా నెగిటివ్, సైబర్ వేధింపులకు సంబంధించిన పోస్టులు కనిపిస్తే వాటిని రిపోర్ట్ చేయండి. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఓ అభిప్రాయం ఏర్పరుచుకోండి. పౌరుల హక్కుల కోసం నిలబడటంతో పాటు తోటి పౌరుల పట్ల బాధ్యతతో వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. నేను తీసుకున్న వైఖరి ఉద్దేశం అదే. సత్యమేవ జయతే' అని రియా యాదవ్ పోస్ట్ పెట్టింది.రియా యాదవ్ ఎవరు?రియా యాదవ్ నిరసనకారిణి మాత్రమే కాదు. నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించింది. చేతితో తయారు చేసే దుస్తుల కోసం 'రిహియాసత్' పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్ కూడా నిర్వహిస్తోంది. మొన్నటివరకు రూ.140 నెలవారీ రుసుముతో సబ్స్క్రిప్షన్ ఉంచిన ఈమె.. ఇప్పుడు విమర్శలు రావడంతో దానిని పూర్తిగా తొలగించింది.(ఇదీ చదవండి: చెన్నైలో 'జన నాయగన్' షోలకు బ్రేక్.. కారణమేంటంటే?) View this post on Instagram A post shared by ʀʜɪʏᴀ ʏᴀᴅᴀᴠ (@rhiyaahir) -
వీడని బిగ్ మిస్టరీ: 23 ఏళ్లుగా ప్రముఖ నటుడు అదృశ్యం!
బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత కనిపించకుండా పోయిన ప్రముఖ నటుడు రాజ్ కిరణ్ అదృశ్యమై రెండు దశాబ్దాలకు పైగా గడిచినా, అతని ఆచూకీ తెలియకపోవడం పెద్ద మిస్టరీగా మారింది. ‘కరాజ్’, ‘అర్థ్’, ‘బసేరా’ తదితర చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన, 2003 నుంచి తన కుటుంబ సభ్యులకు కనిపించకుండా పోయారు. మానసిక అనారోగ్య సమస్యలు, కెరీర్లో ఎదురుదెబ్బల కారణంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పలుమార్లు వార్తలు వచ్చాయి.అమెరికాలోని అట్లాంటాలో గల ఒక సంస్థలో ఆయన ఉన్నట్లు దివంగత నటుడు రిషి కపూర్ గతంలో తెలిపారు. అయితే, రాజ్ కిరణ్ కూతురు రిషిక ఆ వాదనను ఖండించారు. తన తండ్రి అట్లాంటాలో లేరని, ఆయనను వెతికేందుకు తాము ప్రైవేట్ డిటెక్టివ్‌లను, న్యూయార్క్ పోలీసులను కూడా ఆశ్రయించామని ఆమె తెలిపారు. మరోవైపు ఆయన న్యూయార్క్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారనే వదంతులు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనికి ఎలాంటి అధికారిక ఆధారాలు లభించలేదు.దివంగత రిషి కపూర్‌కు ఇచ్చిన మాటిను నిలబెట్టుకునేందుకు ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త సోమీ అలీ సుమారు 20 ఏళ్లుగా అమెరికా అంతటా ఆయన కోసం అన్వేషిస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన సమాచారం లభించలేదు. రాజ్ కిరణ్ స్వచ్ఛందంగా తన పాత జీవితాన్ని వదిలేశారా? లేక అనారోగ్యం కారణంగా ఒంటరిగా మిగిలిపోయారా? అనే ప్రశ్నలకు ఏళ్లు గడుస్తున్నా సమాధానం దొరకలేదు. -
కాంబినేషన్ సెట్?
‘‘ఇలాంటి సినిమాలో నువ్వు నటించాలి’’ అని తన కుమార్తె జాన్వీ కపూర్‌తో గతంలో శ్రీదేవి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో జాన్వీయే తెలిపారు. అది ఏ సినిమా అంటే... నాగరాజ్ ముంజలే దర్శకత్వం వహించిన మరాఠీ మూవీ ‘సైరత్’ (2016). శ్రీదేవి ఆకాంక్ష నెరవేరి, సరిగ్గా ఈ చిత్రం హిందీ రీమేక్ ‘ధడక్’లో నటించే చాన్స్ జాన్వీకి దక్కింది. ఈ చిత్రానికి శశాంక్ ఖేతన్ దర్శకత్వం వహించారు. అయితే తెర మీద ఈ సినిమాని చూడకుండానే 2018లో ఫిబ్రవరిలో శ్రీదేవి మరణించారు. ‘ధడక్’ 2018 జూలై 20న విడుదల కావడం, మరాఠీలోలానే హిందీలో సూపర్ హిట్ కావడం జరిగింది. ఇప్పుడీ సినిమా ప్రస్తావన ఎందుకంటే... ‘సైరత్’ రీమేక్ ద్వారా కథానాయికగా పరిచయమైన జాన్వీ ఆ చిత్రదర్శకుడు నాగరాజ్ మంజులేతో సినిమా చేయనున్నారట. ఈ ఇద్దరి మధ్య తమ కాంబినేషన్ సినిమాకి సంబంధించిన కథాచర్చలు జరిగాయని టాక్. అన్నీ కుదిరితే త్వరలో ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారని సమాచారం. -
'ఆదిపురుష్'.. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు
'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో రిలీజైనప్పుడే కాదు ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉంటుంది. విజువల్స్ ఎఫెక్ట్స్ టాపిక్ వచ్చిన ప్రతిసారి నెటిజన్లు ఓం రౌత్‌ని ఇష్టమొచ్చినట్లు తిడుతూనే ఉంటారు. అయితే ఈ చిత్రానికి పనిచేసిన పాటల రచయిత, జాతీయ అవార్డ్ గ్రహీత మనోజ్ ముంతాశిర్.. అప్పట్లో మూవీ టీమ్‌కి అండగా మాట్లాడాడు. ఇప్పుడు మాత్రం జనాలకు సారీ చెబుతూ, ఈ మూవీ చేయడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'మొదట్లో వచ్చిన విమర్శలని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండు రోజుల్లోనే ప్రజల ఆవేదన అర్థమైంది. 'ఆదిపురుష్' నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఆ సినిమాని విడుదల తర్వాత సమర్థించడం అంతకంటే పెద్ద తప్పు. ఆ సినిమా చుట్టూ జరిగిన పరిణామాలన్నింటికీ చాలా సిగ్గుపడుతున్నా. జరిగిన దానికి దేశ ప్రజలందరినీ క్షమాపణలు కోరుతున్నా'సినిమాలోని సంభాషణలపై వచ్చిన విమర్శలని గుర్తు చేసుకున్న ఈయన.. 'ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ డైలాగ్స్ నేను ఎలా రాశానో నాకు కూడా అర్థం కావడం లేదు. వాటిని రాసినందుకు చాలా సిగ్గుగా ఉంది. అలాగే శ్రీరాముడు, హనుమంతుడు లాంటి పవిత్ర పాత్రలకు నేను ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాను. ఆ టైంలో నేను మాట్లాడిన మాటలు, ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించిన వ్యాఖ్యలని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు'(ఇదీ చదవండి: నా కొడుకుతో 'సిసింద్రీ 2' సినిమా చేస్తా: అఖిల్)''ఆదిపురుష్'కు మద్దతుగా మాట్లాడొద్దని నా భార్య ముందుగానే హెచ్చరించింది. సినిమా విడుదలకు దాదాపు ఆరునెలల ముందే సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. సినిమా తీయడంపై ప్రేక్షకుల్లో చాలా సందేహాలు వచ్చాయి. అలాంటి టైంలో నేను మూవీని సమర్థిస్తే మొత్తం వ్యతిరేకత నాపై పడుతుందని నా భార్య చెప్పింది' అని పాటల రచయిత మనోజ్ ముంతాశిర్ చెప్పుకొచ్చాడు.2023 జూన్‌లో 'ఆదిపురుష్' రిలీజైంది. రామాయణం ఆధారంగా ఈ సినిమా తీశారు. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. వీరిలో రాముడు, రావణుడి పాత్రలపై వచ్చిన ట్రోల్స్ అన్నిఇన్నీ కావు. అయినా సరే రూ.400 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు టెక్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) -
డ్రగ్స్ కోసం ప్రత్యేక బడ్జెట్.. బుల్లితెర నటి సంచలన వ్యాఖలు
చిత్ర పరిశ్రమలో చీకటి కోణాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటాయి. క్యాస్టింగ్ కౌచ్ మాత్రమే డ్రగ్స్ పార్టీలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీని కలవరం పెడుతున్నాయి. నైట్ పార్టీల్లో డ్రగ్స్ వాడుతూ దొరికిపోయిన సంఘటనలు ఎన్నో మనం వార్తల్లో చూస్తున్నాం. అయితే ఈ పాడు కల్చర్ కేవలం వెండితెరకు మాత్రమే కాదు బుల్లితెరపై కూడా ఉంది అంటుంది ప్రముఖ నటి నారాయణి శాస్త్రి.‘క్యుంకి సాస్ భీ కభీ బహు థీ', 'సంజీవని', 'కోయి అప్నా సా', 'కుసుమ్', 'పియా కా ఘర్', 'నయన్‌తార' వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు పొందిన ఈ బుల్లితెర నటి..తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.పార్టీలో డ్రగ్స్ బడ్జెట్..‘ఒకప్పుడు పార్టీలలో మద్యం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించేవారు. కానీ ఇప్పుడు కొన్ని పార్టీల్లో ఏకంగా అక్రమ మాదక ద్రవ్యాల(డ్రగ్స్) కోసం బడ్జెట్లు కేటాయిస్తున్నారు. ఇది చూసి నేను షాకయ్యా. అందుకే చాలా ఏళ్ల క్రితమే నేను పార్టీలకు వెళ్లడం మానేశాను. ఇప్పటి పార్టీలు డాన్స్, సరదాల గురించి కాకుండా పూర్తిగా వేరే వైపు దారితీశాయి.పెద్ద ఈవెంట్లలో డ్రగ్స్ ఉండాల్సిందే..చిన్నచిన్న సమావేశాల్లో డ్రగ్స్ వాడకంపై బహిరంగ చర్చలు జరుగుతాయని, అయితే పెద్ద ఈవెంట్లలో దీనిని చాలా రహస్యంగా నిర్వహిస్తారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక డ్రగ్స్ తీసుకుంటారనే విషయం అందరికీ తెలుసు. డ్రగ్స్ వాడేవారితో నాకు వ్యక్తిగత పరిచయాలు లేకపోయినా, వారు కోకైన్, ఎండీఎంఏ(MDMA) వంటి పదార్థాలు వినియోగించడాన్ని నేను స్వయంగా చూశాను. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కొందరు నటులు కనీసం నిలబడలేని స్థితికి చేరుకుంటారు’ అని నారాయణి శాస్త్రి చెప్పుకొచ్చారు.ఇక తన వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడుతూ.., ఎవరైనా డ్రింక్స్‌లో ఏదైనా కలిపితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి గతంలో ఒకసారి ఆల్కహాల్‌ను రుచి చూశానని చెప్పారు. అంతేకాకుండా కేవలం ప్రయోగాత్మకంగా, కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి గతంలో కొన్నిసార్లు డ్రగ్స్ పరీక్షించి చూశానని, అయితే వాటికి ఎప్పుడూ బానిస కాలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ అలవాటు వ్యక్తిగత జీవితాలనే కాకుండా వృత్తిపరమైన బాధ్యతలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
సినిమాలకు గుడ్‌బై.. సీరియల్స్‌లోకి హీరోయిన్.. ఎందుకిలా?
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. హిట్ వచ్చిన వెంటనే వరుస అవకాశాలు వస్తాయి. వాటిల్లో ఒకటి, రెండు ఫ్లాపులొస్తే.. వెంటనే దూరం పెట్టేస్తారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువ జరుగుతుంది. వరుస హిట్స్ ఇచ్చి.. ఒక ఫ్లాప్ వస్తే చాలు ఆమెను దూరం పెట్టి..కొత్త వాళ్లను పరిచయం చేస్తుంటారు. అందుకే హీరోయిన్లు.. అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలు చేసేసి.. త్వరగానే కెరీర్‌కి గుడ్‌బై చెప్పేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం అవకాశాలు ఉన్నా..పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తారు. మరికొంతమంది మాత్రం పెళ్లి అయిన తర్వాత అవకాశాలు రాకపోవడంతో మెల్లి మెల్లిగా వెండితెరకు కనుమరుగు అవుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించి.. హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరించిన అవికా గోర్.. ఇప్పుడు సినిమాలకు గుడ్‌బై చెప్పింది. పెళ్లి తర్వాత అవకాశాలు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే నటనను మాత్రం కొనసాగించబోతుంది. మళ్లీ సీరియల్స్‌కి రాబోతున్నట్లు తెలుస్తోంది.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్. ఆ తర్వాత తెలుగు సినిమా ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు,హిందీ, కన్నడ చిత్రాల్లోనూ వరుస సినిమాలు చేసింది. అయితే ఆమె కెరీర్ మొత్తంలో మిడియం రేంజ్ హీరోలతో నటించే అవకాశాలు మాత్రమే వచ్చాయి. ఇప్పటి వరకు స్టార్ హీరోతో నటించలేదు. 2025లో ప్రియుడు నటుడు, వ్యాపారవేత్త మిళింద్ చద్వానీని పెళ్లి చేసుకొని..ఇటీవల బ్యాంకాక్‌లో స్థిరపడింది. అయితే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని చెప్పింది. కానీ అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో మళ్లీ ఈ బ్యూటీ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమే అన్నట్లుగా ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.‘మన ప్రయాణం ఎక్కడ మొదలైయిందో మళ్లీ అక్కడికే చేరుకోవడం అందమైన విషయం. దీని గురించి ఎక్కువ చెప్పదల్చుకోలేదు. మనం కొత్త దారుల్లో వెళ్లినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ జీవితం అప్పుడప్పుడు మన మూలాల దగ్గరకు తీసుకెళ్తుంది. అలాఅని అది వెనక్కి తగ్టినట్లు కాదు. ఒక కొత్త కోణంలో అర్థం చేసుకునేంతగా మనం ఎదిగామాని అర్థం’ అని ఆమె ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.కాగా, అవికా గోర్ ఇటీవల ‘ఎస్జే స్టూడియోస్’కి వెళ్లింది. అప్పటినుంచే ఆమె కొత్త టీవీ ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నారన్న ప్రచారం మొదలైంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్‌తో అది నిజమే అన్నట్లుగా తెలిసిపోతుంది. -
ఏఐతో నటి అశ్లీల వీడియో, 11 ఏళ్ల కూతురిని కూడా వదల్లేదు!
టెక్నాలజీ అనేది మనిషి ఎదుగుదలకు తోడ్పడాలి కానీ , వికృత చేష్టలకు వేదిక కాకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) దుర్వినియోగం చేస్తున్నారు. అశ్లీల ఫోటోలు, వీడియోలు సృష్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ముఖ్యంగా సినీ తారలకు ఏఐతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారిపై ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా భోజ్‌పురి నటి అంజానా సింగ్ కూడా డిజిటల్ వేధింపులకు గురైంది. తనతో పాటు తన 11 ఏళ్ల కుమార్తె కూడా అసభ్యకర వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. ఏఐతో ఫేక్ వీడియోలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లక్నోలోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.తాజాగా ఆమె ఓ నేషనల్ వార్త సంస్థతో మాట్లాడుతూ..గత కొన్ని రోజులుగా తానూ, తన చిన్నారి తీవ్ర మానసిక వేధింపులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత కొన్ని రోజులుగా నాతో పాటు నా 11 ఏళ్ల కుమార్తెకు సంబంధించిన అసభ్యకరమైన ఏఐ ఫోటోలు, వీడియోలు ఆన్లైన్లో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తూ, నన్ను బెదిరిస్తున్నారు. అంతేకాకుండా లక్నోకు రాకూడదని కూడా హెచ్చరికలు వస్తున్నాయి’అని ఆరోపించారు. ఈ ఘటన వెనుక బోజ్‌పురి స్టార్ ఖేసారి లాల్ యాదవ్ టీమ్ ప్రమేయం ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఖేసారి లాల్ మేనేజర్ అఖిలేష్ కాశ్యప్ ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై నటుడు ఖేసారి లాల్ యాదవ్ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. -
చివరి నిమిషంలో షాకిచ్చిన 'రామాయణ' మేకర్స్
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్.. రాముడు, సీత, రావణుడిగా నటించిన సినిమా 'రామాయణ'. ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ట్రైలర్ లాంచ్ చేశారు. అయితే దీనిని ఈ రోజు(జూలై 24) యూట్యూబ్‌లో విడుదల చేస్తామని కొన్నిరోజుల ముందే ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఇప్పుడు వాయిదా వేసినట్లు ప్రకటించారు. అందుకు గల కారణాన్ని కూడా నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు.(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ)నా సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే నా కల ఇప్పుడు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో నిజమైంది. అందువల్ల ట్రైలర్ విడుదలని ముందుగా అనుకున్నట్లు కాకుండా వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీన గ్లోబల్ లాంచ్ చేయనున్నాం. భారతీయ సినీ చరిత్రలో 100 ఏళ్లకు పైగా ఇది ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలుస్తుంది. అంతర్జాతీయంగా రిలీజ్ చేయడంతో 'రామాయణ' ప్రపంచ ప్రేక్షకులకు చేరువవుతుంది.ఈ సినిమాతో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు అని నమిత్ మల్హోత్రా ఓ నోట్ రిలీజ్ చేశారు.ఇప్పటివరకు సినిమాలని థియేటర్లలోకి తీసుకొచ్చే క్రమంలోనే వాయిదాల మీద వాయిదాలు పడటం చూస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్స్‌ని కూడా వాయిదా వేస్తే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరగడం బదులు నెగిటివిటీ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన 'రామాయణ' గ్లింప్స్‌కి ఏమంత పాజిటివ్ టాక్ రాలేదు. ట్రైలర్ అయినా బాగుంటే పర్లేదు లేదంటే మాత్రం మూవీ హైప్‌పై ఇది ప్రభావం చూపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా) -
‘రా ఎన్టీఆర్’ వివాదం.. అభిమానులకు జూ. ఎన్టీఆర్ స్పష్టమైన సందేశం
జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలపై ఇటీవల వెలుగులోకి వచ్చిన వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. అభిమానుల పేరుతో ఏర్పడిన ‘రా ఎన్టీఆర్’ సంఘం చేసిన చర్యలు హీరోకు అసౌకర్యం కలిగించాయి.ఈ సంఘం ఊరూవాడ అనే కార్యక్రమం పెట్టారు. వంద కోట్ల రూపాయల ఫండ్ సేకరణ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చింది. నిజానికి ఈ సంఘం వారికి నిజంగానే ఎన్టీఆర్ అంటే అభిమానం. అప్పటికే వీళ్లు పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు. తమ హీరోను మరింత ఎలివేట్ చేయాలనుకున్నారు. కానీ అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై లీకులు రావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ పరిణామాలపై ఎన్టీఆర్ స్వయంగా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ లేఖ తర్వాత ‘రా ఎన్టీఆర్’ సంస్థ ప్రెస్ మీట్ పెట్టింది. ఎన్టీఆర్ కోటరీ చుట్టూ పలు విమర్శలు చేసింది. కలసి మాట్లాడతాం తమకు ఎపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా కోరింది. కానీ తెరవెనక ఒత్తిడి పెరగడంతో చివరికి సేవా కార్యక్రమాలను నిలిపివేస్తున్నామని ‘రా ఎన్టీఆర్’ సంస్థ స్వయంగా ప్రకటించింది. దీంతో కొంతమంది ఆపన్నులకు అందాల్సిన సాయం ఆగిపోయింది. ఈ ఘటన ద్వారా ఎన్టీఆర్ అభిమానులకు స్పష్టమైన సందేశం వెళ్లింది. అభిమాన సంఘాలు హీరో పేరుతో చేసే పనులు పరిమితి లోపల ఉండాలి. సేవా కార్యక్రమాల వరకు ఓకే, కానీ.. రాజకీయాలు లేదా పెద్ద ఫండ్ సేకరణలు చేసే ముందు హీరో అనుమతి లేకుండా చేయరాదు. -
మౌత్ టాక్‌తోనే 'మెయిన్ వాపస్ ఆవుంగా' హిట్ అయింది : దర్శకుడు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇమ్తియాజ్ అలీ తెరకెక్కించిన తాజా చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినప్పటికీ, భారీ వసూళ్లతో ఈ సినిమా తన విజయపరంపరను కొనసాగిస్తోంది.సినిమాకు లభిస్తున్న అద్భుత ఆదరణ నేపథ్యంలో దర్శకుడు ఇమ్తియాజ్ అలీ హైదరాబాద్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో అభిమానులు, ప్రేక్షకులను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మొదట నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, ప్రేక్షకుల మౌత్ టాక్‌తో ఈ చిత్రం ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన సానుకూల స్పందన వల్లే థియేటర్లలో షోల సంఖ్య గణనీయంగా పెరిగింది’ అని ఇమ్తియాజ్ అలీ అన్నారు.హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, ప్రస్తుతం భారత్‌లో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 59 దేశాల్లో, 804 స్క్రీన్లపై ఈ చిత్రాన్ని విడుదల చేశారు. -
దురదృష్టమని వదిలేస్తే.. అదే ఇప్పుడు రూ.450 కోట్లు అయ్యింది!
ఒకప్పుడు సొంత ఇల్లు కొనడం ఓ కల మాత్రమే. చిన్న గదిలో కుటుంబంతో కలిసి జీవించిన ఓ యువ నటుడు.. ఆ తర్వాత నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంగ్లా కొనుగోలు చేశాడు. కానీ ఆ కలల ఇల్లు కొన్నాళ్లకే అతడికి ఆందోళనకు కారణమైంది. వరుస పరాజయాలతో ఆ బంగ్లా తనకు కలిసి రావడం లేదని భావించి వదిలేశాడు. అయితే కాలం గడిచాక అదే ఆస్తి అతడి జీవితంలోనే అతిపెద్ద పెట్టుబడిగా మారింది. ఆ కథ ప్రముఖ నటుడు జీతేంద్రది.ముంబైలోని చాల్ జీవితం నుంచి స్టార్డమ్ వరకు ఎదిగిన జీతేంద్ర.. తన కెరీర్ ప్రారంభ దశలోనే ఓ పెద్ద కల నెరవేర్చుకున్నారు. అప్పట్లో ప్రముఖ నటుడు భరత్ భూషణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. పాలి హిల్‌లోని తన బంగ్లాను విక్రయించేందుకు ముందుకొచ్చారు. జీతేంద్ర తండ్రితో చర్చించిన తర్వాత ఆ బంగ్లాను కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆ ఆస్తి ధర కేవలం రూ.4.25 లక్షలు మాత్రమే. 3,450 చదరపు అడుగుల స్థలంతో ఉన్న ఆ బంగ్లా అప్పట్లోనే ఎంతో విలువైన ఆస్తి.కొన్నాకే మొదలైన కష్టాలు..బంగ్లాలోకి మారిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదని జీతేంద్ర గుర్తు చేసుకున్నారు. వరుసగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఆ ఇంటి వల్లే తనకు దురదృష్టం వెంటాడుతోందని ఆయన భావించారు. “భరత్ భూషణ్ ఈ ఇంటిని వదిలేశారు.. ఇప్పుడు నా వంతు వచ్చినట్లు అనిపించింది. ఇలాగే కొనసాగితే నా కెరీర్ మొదలయ్యేలోపే ముగిసిపోతుందేమో అనుకున్నాను” అని జీతేంద్ర గతాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బంగ్లాను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అన్‌లక్కీ అనుకున్నదే అదృష్టంగా మారిందిఏళ్లు గడిచిన తర్వాత అదే ఆస్తి విలువ ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ బంగ్లాను పునర్నిర్మించాలని నిర్ణయించిన సమయంలో ఆసక్తికర విషయం బయటపడింది. పాత భవనాన్ని కూల్చినప్పుడు అందులో ఉపయోగించిన బర్మా టీక్ కలపకే రూ.11.5 లక్షలు వచ్చాయని జీతేంద్ర తెలిపారు. అంటే.. మొత్తం బంగ్లాను కొనుగోలు చేసిన ధర కంటే కలప ద్వారా వచ్చిన మొత్తం ఎక్కువ కావడం విశేషం.రూ.85కు అమ్మిన ఫ్లాట్లు.. ఇప్పుడు రూ.85 వేల ధరతర్వాత ఆ స్థలంలో జీతేంద్ర గౌతమ్ అపార్ట్మెంట్స్ నిర్మించారు. అయితే అప్పటి పరిస్థితుల్లో భవిష్యత్తుపై సందేహంతో ఫ్లాట్లను చదరపు అడుగుకు కేవలం రూ.85 చొప్పున విక్రయించారు. కానీ అదే ప్రాంతంలో ఇప్పుడు చదరపు అడుగు ధర దాదాపు రూ.85 వేల వరకు చేరిందని ఆయన కుమారుడు తుషార్ కపూర్ వెల్లడించారు.రూ.4.25 లక్షల ఆస్తి.. రూ.450 కోట్ల విలువఒకప్పుడు దురదృష్టానికి కారణమని భావించిన ఆ బంగ్లా.. ఇప్పుడు జీతేంద్ర జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా మారింది. ప్రస్తుతం ఆ భవనం ఉన్న స్థలం విలువ దాదాపు రూ.450 కోట్ల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఓ ఆస్తిని చూసే దృష్టి కాలంతో ఎలా మారిపోతుందో జీతేంద్ర బంగ్లా కథ చెబుతోంది. అప్పట్లో భయంతో వదిలేసిన ఇల్లు.. ఇప్పుడు కోట్ల విలువైన సంపదగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.సినీ తారలకు రియల్ ఎస్టేట్ కలిసి వచ్చిన ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. తెలుగు సినీ దిగ్గజం శోభన్‌బాబు కూడా సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టి భారీ సంపదను సృష్టించారు. అప్పట్లో భూములపై ముందుచూపుతో పెట్టిన పెట్టుబడులు.. తర్వాత కాలంలో కోట్ల విలువైన ఆస్తులుగా మారాయి. జీతేంద్ర బంగ్లా కథ కూడా ఇలాంటి దూరదృష్టికి మరో ఉదాహరణగా నిలుస్తోంది. -
ఓటీటీల్లో అశ్లీల కంటెంట్.. ఏకంగా 50 ఫ్లాట్‌ఫామ్స్..!
ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. గత రెండేళ్లలో ఏకంగా 50 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను రద్దు చేసింది. ఆ ఓటీటీల్లో అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శించడం, 1986 వంటి పలు చట్టాలను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. సదరు ఓటీటీలు అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. డిజిటల్ న్యూస్, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చే ఫిర్యాదులను ఐటీ రూల్స్- 2021 కింద పరిష్కరిస్తారని డాక్టర్ మురుగన్ తెలిపారు. ఓటీటీల్లో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించమని మధ్యవర్తులను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఓటీటీలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా.. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభుత్వం క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. -
'నిన్ను పొరపాటున తీసుకున్నారు'.. రాజమౌళి హీరోయిన్ ఆవేదన
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇండియన్ మూవీలో నటిస్తోంది. మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసిలో హీరోయిన్గా కనిపించనుంది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. పలువురు స్టార్ హీరోల సరసన మెప్పించింది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ముద్దుగుమ్మ తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కేవలం ఒక్క క్షణంలోనే సినిమా చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమందిని మెప్పించలేకపోయాననే కారణంతో తనను సినిమా నుంచి తొలగించిన సందర్భాలు చాలా ఉన్నాయని ప్రియాంక తెలిపింది.ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..'నేను వాళ్లతో ఏకీభవించలేదని.. నన్ను సినిమాల నుంచి తీసేశారు. 2007లో ఓ సినిమాకు నన్ను ఎంపిక చేశారు. సలామ్-ఎ-ఇష్క్ షూటింగ్ సమయంలో మరో సినిమాలో నటించాల్సి ఉంది. ఆ సమయంలో హీరో ఒకరోజు నా సెట్‌కు వచ్చారు. తర్వాత నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసి నాకు మద్దతుగా వచ్చాడని అనుకున్నా. కానీ ఆయన ఊహించని మాట చెప్పారు. దర్శకుడు పొరపాటున నిన్ను సెలెక్ట్ చేశారు. నిజానికి ఈ రోల్ మరో హీరోయిన్ చేయాల్సింది. మనం భవిష్యత్తులో మరో సినిమా చేద్దాం. ఈ విషయం నీకు చెప్పాలనే వచ్చా’ అని చెప్పారని గుర్తు చేసుకుంది. అంతేకాకుండా కొందరు అగ్ర హీరోలు నన్ను ఉద్దేశపూర్వకంగా సినిమాల నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. -
‘బిగ్‌బాస్’ లోకి సౌరభ్ గంగూలీ.. రెమ్యునరేషన్ ఎంతంటే..?
ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్ రియాలటీ షో 'బిగ్ బాస్'. తెలుగు, హిందీ మాత్రమే కాదు అన్ని భాషల్లోనూ ఈ రియాల్టీ షోకి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో అయితే ఇప్పటికే 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే పదో సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికి వరకు అన్ని భాషల్లో ఈ రియాల్టీ షోకి సినిమా తారలే హోస్ట్‌గా వ్యవహరించారు. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, నాని, కన్నడలో కిచ్చా సుదీప్, తమిళ్లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి హోస్ట్‌లుగా వ్యవరించారు. అయితే బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి సినిమా నటుడు కాదని ఓ క్రికెటర్ హోస్ట్‌గా వ్యవరించబోతున్నాడు. ఆయన ఎవరో కాదు.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.బిగ్‌బాస్ బెంగాలీకి హోస్ట్‌గా.. ఇప్పటి వరకు భాషల వారిగా వేర్వేరు సమయాల్లో బిగ్‌బాస్ షో ప్రారంభం అయ్యేది. కానీ ఈ సారి మాత్రం ఒకేసారి ఆరు భాషల్లో బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ నెలలో ఈ రియాల్టీ షో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. అయితే బిగ్‌బాస్ బెంగాలీ షోకి గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ మేరకు జియోహాట్ స్టార్ ఓ ప్రత్యేక వీడియో ద్వారా అధికారిక ప్రకటన వెల్లడించింది. హిందీ బిగ్‌బాస్‌కు సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్ వ్యవహరించబోతున్నారు.భారీ పారితోషికం.. బిగ్‌బాస్ బెంగాలీ షో కోసం గంగూలీ రూ. 125 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం. దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బిగ్‌బాస్ బెంగాలీ సీజన్ 3 రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు గంగూలీని రంగంలోకి దించారు నిర్వాహకులు. గతంలో జీ బెంగాలీలో వచ్చిన 'దాదాగిరి అన్లిమిటెడ్' క్విజ్ షోతో బుల్లితెరపై హోస్ట్‌గా గంగూలీ సంచలన విజయం సాధించారు. ఇప్పుడు బెంగాలీ బిగ్‌బాస్‌ను మరింత గ్రాండ్‌గా రీ-లాంచ్ చేసేందుకు రెడీ అయ్యాడు. మరి కెప్టెన్‌గా క్రికెట్ గ్రౌండ్లో ఆకట్టుకున్న గంగూలీ.. హోస్ట్‌గా బుల్లితెరపై ఎలా అలరిస్తాడో చూడాలి. View this post on Instagram A post shared by Star Jalsha (@starjalsha) -
సీజేపీ ఆందోళన.. కత్రినా కైఫ్ మీద ఈ విమర్శలేంటి?
ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో గత కొన్నిరోజుల నుంచి విద్యార్థి నిరసనలు జరుగుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ విషయమై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యార్థులే పోరాడుతుండగా తాజాగా ప్రతిపక్షాలు కూడా వీళ్లతో కలిసి చేరాయి. ఈ విద్యార్థి ఉద్యమానికి బాలీవుడ్ నటీనటులు షబానా ఆజ్మీ, ప్రీతి జింటా, రితేష్ దేశ్ ముఖ్, సోనూసూద్, సోనాక్షి సిన్హా తదితరులు తమ సంఘీభావం తెలిపారు. అయితే దీనికి ఏ మాత్రం సంబంధం లేని కత్రినా కైఫ్ మీద ఇప్పుడు పలువురు విమర్శలు చేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్‌తో కత్రినా.. సందీప్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడు?)కత్రినా కైఫ్ అభిమాని ఒకరు 'కేథలిక్ ఫ్యాన్స్' అని ఓ ఫ్యాన్ పేజీ రన్ చేస్తున్నాడు. దీనికి దాదాపు 70 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ పేజీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు సదరు పేజీ అడ్మిన్ ప్రకటించాడు. చిన్నప్పటి నుంచి కత్రినాకు అభిమానినని, అలాంటిది భారతీయ విద్యార్థులకు సంబంధించిన కీలక అంశంపై ఆమె స్పందించకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని సదరు అడ్మిన్ వెల్లడించాడు.మేము మీకు కష్టకాలంలో అండగా నిలిచాం. కానీ భారతీయుల కోసం ముఖ్యంగా విద్యార్థుల కోసం ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మీకు లేదు. అందుకే మిమ్మల్ని అన్‌ఫాలో చేస్తున్నా. ఈ ఫ్యాన్పేజీని కూడా మూసివేస్తున్నా అని సదరు అడ్మిన్ పేర్కొన్నాడు. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు సదరు పేజీ అడ్మిన్‌కి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం కత్రినాకు మద్దతిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉన్నట్లే, స్పందించకపోయే హక్కు కూడా ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ప్రతి సామాజిక, రాజకీయ అంశంపై సెలబ్రిటీలు తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు.(ఇదీ చదవండి: రూ.251 ఫోన్ స్కామ్ గుర్తుందా? ఈ కాన్సెప్ట్‌తో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ తెలుగు సిరీస్) -
ఆ నిర్మాత ఒంటరిగా హోటల్‌కి రమ్మన్నాడు : నటి
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తోంది. కానీ గతంలో దీని గురించి బహిరంగంగా మాట్లాడేందుకు నటీనటులు భయపడేవాళ్లు. అవకాశాలు రావనో..లేదంటే వేరేలా అనుకుంటారేమోననని భయంతో బయటకు చెప్పేందుకు నిరాకరించేవాళ్లు. ఈ మధ్య మాత్రం మార్పు వచ్చింది. తమను వేధింపులకు గురి చేస్తే.. వెంటనే మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ.. కొత్తగా వచ్చే వాళ్లు అలాంటి వేధింపులను ఎలా ఎదుర్కోవాలో సలహా ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలు, లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి సింపుల్ కౌల్ కూడా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను, వాటిని ఎలా ఎదుర్కొన్నారో వివరించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోని వ్యక్తులను ఎప్పుడు , ఎక్కడ, ఎలా కలవాలనే విషయంలో నాకు స్పష్టత ఉండేది. కెరీర్ ప్రారంభం నుంచే ముక్కు సూటిగా ఉండేదాన్ని. ఎవరైన హద్దులు దాటి వ్యవహరిస్తే సహించేదాన్ని కాదు. అందుకే క్యాస్టింగ్ కౌచ్ నాకు ఎదురవ్వలేదు’ అని అన్నారు.నిర్మాత హోటల్‌కి రమ్మన్నాడు.. ఇదే ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ సంఘటన గురించి సింపుల్ కౌల్ వివరించారు. ‘ఓ సినిమా కోసం నిర్మాత కాల్ చేశాడు. సాయంత్రం ఒంటరిగా హోటల్‌కి రమ్మని చెప్పాడు. నేను స్నేహితులతో కలిసి వెళ్లా. ఈ విషయం హోటల్‌కి వెళ్లాక ఆయనకు చెప్పాను. నన్ను ఒంటరిగా గదిలోకి రమ్మని ఆహ్వానించాడు. నేను రానని చెప్పా. కలవాలనుకుంటే హోటల్ లాబీలోనే కలుసుకోవచ్చు అని అతని చెప్పా. అంతే కానీ అవకాశం వస్తుంది కదా అని అతను చెప్పినట్లుగా వెళ్లలేదు.టాలెంట్‌ని నమ్ముకోండి..నా ఇన్నేళ్ల సినీ కెరీర్లో అనౌకర్యంగా అనిపించే సీన్లో ఎప్పుడూ నటించలేదు. చర్చల కోసం ఆహ్వానించినా.. ఒంటరిగా వెళ్లేదాన్ని కాదు. చిత్రబృందం సమక్షంలోనే కథను వినేదాన్ని. కొత్తగా వచ్చే వాళ్లకు నా సలహా ఏంటంటే.. ‘అసౌకర్యంగా అనిపించే ఏ పనినైనా చేయకండి. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా.. అంతరాత్మ చెప్పిందే వినండి. రాజీ పడితేనే అవకాశాలు వస్తాయని అనుకోకండి. నైపుణ్యాన్ని పెంచుకోండి. వృత్తిపరమైన సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టండి’అని సింపుల్ కౌల్ సలహా ఇచ్చారు. 2002లో ఏక్తా కపూర్ నిర్మించిన ' కుసుమ్' సీరియల్‌తో నటనారంగంలోకి అడుగుపెట్టారు సింపుల్ కౌల్. ఆ తర్వాత 'షరారత్' , 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా' వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పెందారు . -
విజేతను కూడా ఓటమి పలకరిస్తుంది
ఎప్పటికప్పుడు తన అనుభవాలను, అభిప్రాయాలను అమితాబ్ బచ్చన్ బ్లాగ్‌లో షేర్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ పోస్ట్ అభిమానులను కలవరపెట్టింది. ‘‘శస్త్రచికిత్స, ఐసీయూలో నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది సంరక్షణ, ఆ తర్వాత డిశ్చార్జ్, ఇంటికి చేరుకోవడం’’ అంటూ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు అమితాబ్. ఈ పోస్ట్‌తో ఆయనకు శస్త్రచికిత్స జరిగిందన్న విషయం స్పష్టమైంది.కానీ అమితాబ్‌కు ఎందుకు శస్త్రచికిత్స జరిగింది? ఎప్పుడు, ఎక్కడ జరిగింది? అనే విషయాలపై స్పష్టత లేదు. అలాగే ఈ బ్లాగ్ పోస్ట్‌లోనే భావోద్వేగంగా స్పందించారు అమితాబ్. ‘‘డిశ్చార్జ్ అయి, తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత ఎదురయ్యే సవాళ్లు కఠినమైనవి. శారీరకంగానే కాదు... మానసికంగానూ ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరెంతటి గొప్ప విజేత అయినా ఏదో ఒక రోజు ఓటమి మిమ్మల్ని పలకరిస్తుంది. కొందరు ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటారు... మరికొందరు లొంగిపోతారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి’’ అంటూ అమితాబ్ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అమితాబ్ కోలుకోవాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు షేర్ చేశారు. -
ఆపరేషన్ సఫేద్ సాగర్.. ఆమె మాటలకు సిద్ధార్థ్ ఎమోషనల్
కార్గిల్ యుద్ధ నేపథ్యంలోనే వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ఆపరేషన్ సఫేద్ సాగర్. 1999లో జరిగిన కార్గిల్ వార్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు ఓని సేన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న సిరీస్ కావడంతో వైమానికి విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక ముంబయిలో నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ ఎమోషనలయ్యారు. దివంగత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా భార్య అల్కా అహుజా ట్రైలర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్కా అహుజాను వేదికపైకి ఆహ్వానించారు. అదే సమయంలో ప్రేక్షకులంతా ఆమెకు గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. తన భర్త కథను తెరపైకి తీసుకువచ్చినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాటలు స్పష్టంగా సిద్ధార్థ్‌ను కదిలించాయి.. దీంతో ఆయన వేదికపై కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.ఈ సిరీస్‌పై నమ్మకం ఉంచినందుకు సిద్ధార్థ్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. నిజ జీవిత యుద్ధ వీరుడి పాత్రను పోషించడానికి తాను మొదట్లో సంకోచించానని సిద్ధార్థ్ తెలిపారు. ప్రస్తుతం మన మధ్య లేని వారి పాత్రను.. ముఖ్యంగా ఒక అమరవీరుడి పాత్రను పోషించినప్పుడు మనపై చాలా పెద్ద బాధ్యత ఉంటుందని అన్నారు. హీరోలు ఎప్పుడూ హీరోల్లా కనిపించరు. వారు తమ చర్యల వల్లే హీరోలవుతారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ అంగీకరించే ముందు తాను ఈ సిరీస్ నిర్మాతలతో చాలాసార్లు చర్చించానని వెల్లడించారు. ఆయన భార్య అల్కా అహుజా అనుమతించారా?' అదే నాకు అత్యంత ముఖ్యమని మేకర్స్‌తో చెప్పానని గుర్తు చేసుకున్నారు. కాగా.. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రస్తుత, పదవీ విరమణ పొందిన భారత వైమానిక దళ అధికారులు కూడా హాజరయ్యారు.అజయ్ అహుజా ఎవరంటే..స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన ఒక భారత వైమానిక దళ అధికారి. కూలిపోయిన విమానంలో తోటి పైలట్‌ను గుర్తించే మిషన్‌లో ఉండగా ఆయన విమానం కూల్చివేశారు. అహుజాకు ఆయన ధైర్యసాహసాలకు, సేవకు గాను మరణానంతరం వీరచక్ర పురస్కారం లభించింది. ఆయనను ఆపరేషన్ సఫేద్ సాగర్‌లోని కీలక వ్యక్తులలో ఒకరిగా గుర్తుంచుకుంటారు. ఈ సిరీస్ కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం పోషించిన పాత్ర ఆధారంగా రూపొందించారు. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో అభయ్ వర్మ, దియా మీర్జా, ప్రాజక్త కోలి, ఆదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా, తారుక్ రైనా కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పోర్నోగ్రఫితో గ్లోబల్ వార్మింగ్.. నటుడి వ్యాఖ్యలు వైరల్
టెలివిజన్ ప్రముఖ నటుడు అభినవ్ శుక్లా వాతావరణ మార్పులపై చేసిన వినూత్న వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. పోర్న్ వీడియోలు చూడటం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య రుబినా దిలైక్, ప్రముఖ నటి హినా ఖాన్, ఆమె భాగస్వామి రాకీ జైస్వాల్‌లతో కలిసి నిర్వహిస్తున్న 'ది4పీవోవీ' (the4POV) పొడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోడ్కాస్ట్లో అసలు ఏం జరిగింది?పోడ్కాస్ట్ సంభాషణలో భాగంగా నటి దియా మీర్జా గతంలో పర్యావరణ మార్పులపై చేసిన వ్యాఖ్యల గురించి చర్చిస్తున్న సమయంలో అభినవ్ ఈ విషయాన్ని లేవనెత్తారు. గ్లోబల్ వార్మింగ్‌కు ఉన్న అనేక కారణాల్లో పోర్న్ చూడటం కూడా ఒక ప్రధాన కారణం. అడల్ట్ కంటెంట్‌ను భారీ స్థాయిలో ప్రొడక్షన్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఆన్లైన్ డేటా, సర్వర్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడానికి భారీ ఎత్తున విద్యుత్ శక్తి ఖర్చవుతుందని, ఇది పెద్ద మొత్తంలో కార్బన్ ఫుట్‌ప్రింట్ కు దారితీస్తుందని ఆయన వివరించారు.ఆయన వ్యాఖ్యలకు పొడ్‌కాస్ట్‌లో ఉన్న రుబినా దిలైక్‌తో పాటు, హినా ఖాన్, రాకీ జైస్వాల్ షాకయ్యారు.చాలా ప్రమాదకరం..కేవలం వాతావరణ ప్రభావమే కాకుండా, పోర్నోగ్రఫీ వల్ల కలిగే ఇతర దుష్ప్రభావాలపైనా అభినవ్ స్పందించారు. ‘పోర్న్ చూడటం చాలా ప్రమాదకరం. ఇది వాస్తవ జీవితంపై అవాస్తవికమైన అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా పురుషులలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. సమయాన్ని వృథా చేస్తుంది’ అని అభినవ్ అన్నారు. డిజిటల్ వినియోగం-వాతావరణ మార్పుల మధ్య ఉన్న సంబంధంపై అభినవ్ చేసిన ఈ విచిత్రమైన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. కొంతమంది నెటిజన్స్ అభినవ్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తుంటే..మరికొంతమంది ఆయన వాదనను తోసిపుచ్చుతూన్నారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ ఏదైనా డేటా వినియోగిస్తుందని, కేవలం ఒకే రకమైన కంటెంట్‌ను లక్ష్యంగా చేసుకుని గ్లోబల్ వార్మింగ్‌కు ముడిపెట్టడం విచిత్రంగా ఉందంటూ మరికొందరు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. డేటా సెంటర్లు, డిజిటల్ స్ట్రీమింగ్ వల్ల విద్యుత్ వినియోగం పెరిగి కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయనే సాంకేతిక కోణాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Kuch zyada hi dark hogaya 🌚 #HinaKhan #RubinaDilaik #AbhinavShukla pic.twitter.com/Gsi8LGri25— Hina_khanfc (@Hinakhanfc24) July 18, 2026 -
రూ. 84 కోట్లు పెట్టి ఇల్లు కొన్న స్టార్ హీరో
సినిమా హీరోలు తమ డబ్బులకు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతుంటారు. పారితోషికంగా సంపాదించిన డబ్బులతో బంగ్లాలు కొనుగోలు చేసి.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం రూ. 84 కోట్లతో విలాసవంతమైన బంగ్లాను ఆయన కొనుగోలు చేశాడు. రియల్ ఎస్టేట్ రికార్డుల ప్రకారం, ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 14న పూర్తయింది. ఈ కొనుగోలుకు గాను ఆయన సుమారు రూ. 5.04 కోట్ల రూపాయలను స్టాంప్ డ్యూటీ రూపంలో చెల్లించినట్లు సమాచారం.ఈ ఆస్తి మొత్తం 1,017.60 చదరపు మీటర్ల ఫ్లాట్‌లో విస్తరించి ఉంది. ఇందులో 193.12 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతం కలిగిన బంగ్లాతో పాటు 31.50 చదరపు మీటర్ల అవుట్‌హౌస్ కూడా ఉంది. ముంబైలో ప్రముఖ సినీ తారలు - విఐపిలు నివసించే ప్రైమ్ లొకేషన్లలో బాంద్రా వెస్ట్ ఒకటి. ఇక్కడ స్వంత స్థలంతో ఉన్న బంగ్లాలు దొరకడం అత్యంత అరుదు కావడం వల్ల జాన్ చేసిన ఈ రూ. 84 కోట్ల బిగ్ డీల్ ప్రస్తుతం సినీ, బిజినెస్ వర్గాల్లో వైరల్‌గా మారింది.జాన్ అబ్రహం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. డిసెంబర్ 2023లో కూడా ముంబైలోని ఖార్ ఏరియాలో రూ. 70.83 కోట్ల విలువైన బంగ్లాను ఆయన సొంతం చేసుకున్నారు.ఇక సినీ కెరీర్ విషాయానికొస్తే.. ఇటీవల 'ది డిప్లొమాట్', 'తెహ్రాన్' వంటి వైవిధ్యమైన యాక్షన్- పొలిటికల్ థ్రిల్లర్లతో అలరించాడు. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బయోపిక్‌తో పాటు తన కెరీర్లో సూపర్ హిట్ అయిన యాక్షన్ ఫ్రాంచైజ్ 'ఫోర్స్' మూడో భాగం -ఫోర్స్ 3 లో నటిస్తున్నాడు. ఈ రెండింటిలోనూ జాన్ అబ్రహం పోలీసులు ఆఫీసర్‌గా అలరించబోతున్నాడు. -
ఓటీటీకి ఆపరేషన్ సఫేద్ సాగర్.. ట్రైలర్ అదుర్స్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. తాజాగా మరో ఆసక్తికర కథనంతో వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆపరేషన్ సఫేద్ సాగర్ సిరీస్ తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు.కార్గిల్ యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న ఆపరేషన్ సఫేద్ సాగర్ ట్రైలర్లో యుద్ధ సన్నివేశాలు, వైమానిక దాడులు ఆకట్టుకునేలా ఉన్నాయి. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ పేరే సఫేద్ సాగర్. పాకిస్తాన్‌పై వైమానిక దాడులతో మంచు కొండలపై భారత్ విరుచుకుపడినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో ది గోల్డెన్ యారోస్ కీలక పాత్ర పోషించింది.కాగా.. ఈ సిరీస్‌లో సిద్దార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా కనిపించనున్నారు. -
‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
కండలవీరుడు, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో కనిపించిన ఆయన తాజా లుక్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడూ ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించే సల్మాన్.. ఈసారి కాస్త సన్నగా, ముఖం మొత్తం పాలిపోయి కనిపించడంతో పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.ముంబైలోని స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. అక్కడ ఆధునిక డేటా కలెక్షన్, వెరిఫికేషన్ సపోర్ట్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సల్మాన్ ఆరోగ్యంపై అభిమానుల మధ్య చర్చ మొదలైంది. కొందరు ఆయన బాగా సన్నబడ్డారని, అలసటగా కనిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరేమో వయసు పైబడడం వల్లేనేమో అని చర్చించుకున్నారు.Is everything ok with Salman Khan and his health ..? 😳😳 pic.twitter.com/dSSPmz0OCX— Yo Yo Funny Singh (@moronhumor) July 19, 2026సల్మాన్ ఖాన్(60) గతంలో ట్రైజెమినల్ న్యూరాల్జియా (Trigeminal Neuralgia) అనే నరాల సంబంధిత సమస్యతో బాధపడినట్లు వెల్లడించారు. తీవ్రమైన ముఖ నొప్పిని కలిగించే ఈ వ్యాధిని సాధారణంగా సూసైడ్ డిసీజ్ “Suicide Disease” అని కూడా పిలుస్తారు. ఈ సమస్య కారణంగా తాను ఒక దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. విదేశాల్లో చికిత్స సైతం తీసుకున్నానని ఆయన సల్మాన్ గతంలో తెలిపారు. అలాగే మెడకు సంబంధించిన సమస్యలు, నొప్పుల కారణంగా కూడా ఆయన గతంలో చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆయన తాజా లుక్కు ఈ ఆరోగ్య సమస్యలే కారణమా? అనే చర్చా జోరందుకుంది. అయితే సల్మాన్ ఖాన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. “Aap logon ki tabiyat kaisi hai?” (మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది?) అంటూ ఆయన అభిమానులను పలకరించారు. తాజాగా కనిపించిన లుక్‌తోనే ఆయన బ్లాక్ అండ్ వైట్‌లో స్టైలిష్ ఫొటో షూట్ ఫొటోలను పోస్ట్ చేసి మరీ ఆ ప్రశ్న వేశారాయన. దీంతో కొందరు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు అభిమానులు కూడా స్పందిస్తూ.. “ముందుగా మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి భాయ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.Aap logon ki tabiyat kaisi hai ? pic.twitter.com/sFWklGKo8K— Salman Khan (@BeingSalmanKhan) July 19, 2026ప్రస్తుతం సల్మాన్ ఆరోగ్యంపై అధికారికంగా ఆయన బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆయన కూడా నేరుగా స్పందించలేదు. అయితే ఆయన తాజా లుక్, ఆ తర్వాత చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. “భాయ్ జాగ్రత్తగా ఉండండి”, “మీ ఆరోగ్యం ముఖ్యం” అంటూ సందేశాలు పంపుతున్నారు. మరికొందరు మాత్రం వయసు పెరుగుతున్నా సహజంగా కనిపించడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ అనే సినిమాలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన భారత సైన్యానికి చెందిన కల్నల్ పాత్రలో కనిపించనున్నారు. చిత్తరంగదా సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు ఈద్ 2027 సందర్భంగా నయనతారతో ఓ కొత్త ప్రాజెక్ట్‌లోనూ సల్మాన్ కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. -
శ్రీరాముడు పాత్ర చేయడం నా అదృష్టం: రణ్‌బీర్ కపూర్
రామాయణం ఆధారంగా రూపొందిన తాజా హిందీ సినిమా ‘రామాయణ’. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్ 1’, వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్ 2’ విడుదల కానున్నాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటించారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు. తొలి భాగం ట్రైలర్ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా, ఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరిట వేడుక నిర్వహంచి, ఈ సినిమా హిందీ 3డీ ట్రైలర్‌ను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి యోగా గురువు రామ్‌దేవ్ బాబా అతిథిగా హాజరై, ట్రైలర్ నచ్చిందని చెప్పి, ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో రణ్‌బీర్ మాట్లాడుతూ– ‘‘రామానంద్ సాగర్‌గారు తీసిన ‘రామాయణం’ (సీరియల్)లో శ్రీరాముడిగా అరుణ్ గోవిల్గారు అత్యద్భుతంగా నటించారు. తరాలుగా శ్రీరాముడి పాత్రలో అరుణ్గారిని చూసి, ప్రేక్షకులు స్ఫూర్తి పొందారు. నేను చిన్నప్పట్నుంచి శ్రీ రాముడి కథలు వింటూ, ఆయన నామస్మరణ, ఆశీస్సులతో పెరిగాను. అలాంటి శ్రీరాములవారి పాత్రను పోషించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘సీతమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం. ఆ సీతమ్మే నాతో ఆమె పాత్ర చేయిస్తుందని, సీతమ్మకు కావాల్సినట్లుగా నా చేత నటింపజేసుకుంటుందని నమ్మి నేను ఈ రోల్ చేశాను. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించాను’’ అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘మన శ్రీరాముడి కథను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ‘రామాయణ’ చేశాం’’ అని అన్నారు.‘‘మన గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన ‘రామాయణం’ని ప్రపంచంతో పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం’’ అని తెలిపారు నమిత్ మల్హోత్రా. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు రామాయణంలోని భావోద్వేగం, మానవత్వం, వేల సంవత్సరాలుగా దాన్ని చిరస్థాయిగా నిలబెట్టిన ఆత్మను కూడా అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు నితీష్ తివారి. ఈ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్, శోభన, అజింక్య, కునాల్ కపూర్, రకుల్ ప్రీత్ తదితరులు పాల్గొన్నారు. -
సల్మాన్ ఖాన్‌కి ఏమైంది? ఇలా మారిపోయాడేంటి?
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా లుక్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా ముంబైలో ఓ ఐటీ సర్వర్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలే ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ డియోలో సల్మాన్ ఖాన్ మునుపటి కంటే చాలా బరువు తగ్గి, కాస్త సన్నగా కనిపించారు.ఆయన కళ్లలో తీవ్రమైన అలసట కనిపించడం, ముఖంలో గ్లో తగ్గడం, నడిచేటప్పుడు కూడా కాస్త నీరసంగా ఉండటంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. ‘కండల వీరుడు ఇలా అయిపోయాడేంటి?’, ‘ఆయనకు ఏమైనా అనారోగ్య సమస్య ఉందా?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం సినిమా కొత్త సినిమా కోసం ఇలా మేకోవర్ అయ్యాడేమో అని కామెంట్స్ పెడుతున్నారు. Salman khan’s latest video😳Bhai ye kaisa majdoor sa lag rha h….Waqt kabhi nahi rukta, aur ise bhi ab apne apko hero ke role dena band karna chahiye 💯 pic.twitter.com/mYwJ2r1VOV— Sharma Ji (@Hsharma2712) July 19, 2026 -
నడుముపై చేయి వేసి.. స్టేజ్‌పై హీరోయిన్‌కి చేదు అనుభవం!
సినీ తారలు బయటకు వచ్చినప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే..కొంతమంది వల్ల వారికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. పబ్లిక్ వేదికగా వారితో దురుసుగా ప్రవర్తిన్నారు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ వారిని అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్లో హీరోయిన్ రష్మిక భుజాలపై బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ చేతులు వేయడంతో ఆమె అసౌకర్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ఇక తాజాగా ఇలాంటి ఘటననే నటి అనన్య పాండేకి ఎదురైంది.తాజాగా ఆమె ముంబైలో ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా నిర్వహించిన ఫ్యాషన్ షోకి షోస్టాపర్‌గా వెళ్లి..ర్యాంప్ వాక్ చేసి అలరించింది. షో ముగిసిన తర్వాత ఆమె గౌరవ్ గుప్తాతో కలిసి వేదికపైకి వచ్చి ఫోటోలకు పోజులిచ్చింది. అయితే, ఈ సమయంలో అతను ఆ నటితో కాస్త చనువుగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించాడు. అతను అనన్య నడుముపై చేతులు వేసి..గిల్లాడు కూడా. అతను అలా చేయడంతో అనన్య అసౌకర్యానికి గురైంది. అయితే స్టేజ్‌పై ఉండడంతో నవ్వుతూ..పక్కకు తప్పుకొని గౌరవ్‌ని అభినందించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్స్ గౌరవ్ వ్యవహరించిన తీరుని తప్పుపడుతూ అనన్యకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది అయితే.. గౌరవ్ సరదాగా అలా చేశాడని.. వారిద్ధరి మధ్య మంచి స్నేహబంధం ఉందని అభిప్రాయపడుతున్నారు.Bro, what's going on with Ananya Panday? Is it flirting or harassment? pic.twitter.com/hePI7vZtYt— Aditya (@Warlock_Aditya) July 18, 2026 -
విదేశీయుడిని పెళ్లి చేసుకున్న సీరియల్ నటి
మన దేశంలో సినిమాల కంటే సీరియల్స్‌కే క్రేజ్ ఎక్కువ. అందుకు తగ్గట్లే వాటిలో నటించేవాళ్లు మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. అలా భారతీయ టీవీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్లలో హిందీ నటి జెన్నిఫర్ వింగెట్ ఒకరు. 'కసౌటీ జిందగీ కే', 'సరస్వతీ చంద్ర', 'బేహద్', 'బేపన్నా', 'కోడ్ ఎం' తదితర సీరియల్స్‌తో ఈమెకు మంచి ఫేమ్ వచ్చింది. ఇప్పుడీమె రెండో పెళ్లి చేసుకుని అభిమానులని సర్ప్రైజ్ చేసింది.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)జెన్నిఫర్ గతంలో 'దిల్ మిల్ గయే' సీరియల్ చేసింది. ఇందులో నటిస్తున్న టైంలోనే సహ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ని ప్రేమించింది. 2012లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థలతో రెండేళ్లకే అంటే 2014లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న జెన్నిఫర్ గురించి కొన్నాళ్ల ముందు మళ్లీపెళ్లి రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై ఈమె స్పందించలేదు. దీంతో అవి పుకార్లు మాత్రమేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు అధికారికంగా తన వివాహం గురించి ప్రకటన చేసింది.గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్స్‌కి చెక్ పెడుతూ జెన్నిఫర్ వింగెట్.. తన పెళ్లి వీడియోని షేర్ చేసింది. సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త విలియమ్ ఇస్మాయిల్ని తన భర్తగా పరిచయం చేస్తూ వివాహం సంగతి అధికారికంగా ప్రకటించింది. యూకేలోని ఓ చర్చిలో సన్నిహితుల సమక్షంలో ఈ శుభకార్యం జరిగింది.నూతన దంపతులుగా మొదటిసారి కలిసి నడవడం, ఉంగరాలు మార్చుకోవడం, తొలి ముద్దు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలను ఆస్వాదించడం లాంటి మధుర క్షణాలని ఈ వీడియోలో పంచుకుంది. ఇక జెన్నిఫర్ పెళ్లి గురించి పోస్ట్ పెట్టడంతో సహ నటీనటులు కొత్తజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి) View this post on Instagram A post shared by Jennifer Winget (@jenniferwinget1) -
ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ హెచ్చరిక
ముంబై: ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు ఆర్జూ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ‘లవ్ జిహాద్’ అంశంపై ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు, అభిప్రాయాలు భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొంటూ ఆయనను ఆర్జూ బిష్ణోయ్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్, ఆడియో క్లిప్ వైరల్‌గా మారాయి.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఆర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ పేరుతో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ‘లవ్ జిహాద్ పేరుతో సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించే ఆమీర్ ఖాన్ వంటి వారిని సహించేది లేదు. ఆయన చేసిన పనులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ బుద్ధి చెబుతాం’ అని ఆడియో క్లిప్‌లో సదరు వ్యక్తి పేర్కొన్నాడు.సోషల్ మీడియా పోస్ట్‌లో కూడా అదే తరహా హెచ్చరికలు జారీ చేశారు. శ్రీగంగానగర్‌లో జరిగిన ఒక ఘటనలో నిందితులకు రాజకీయ నేతలు అండగా ఉండటంపై కూడా ఆర్జూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్, సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రామాణికతను ధృవీకరించలేమని ‘ఇండియా టుడే’ పేర్కొంది. ఏదేమైనా ఈ పరిణామం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఇది కూడా చదవండి: ‘కంటే కూతుర్నే కనాలి’.. ఆస్పత్రిలో తండ్రి సందడి -
ప్రపంచం మెచ్చిన పాట.. సింగర్‌కు దక్కింది ఇంతేనా?
సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు ఊహించని విజయాలను సాధించి బాక్సాఫీస్ లెక్కలనే తలకిందులు చేస్తుంటాయి. 1975లో ‘షోలే’ వంటి బ్రహ్మాండమైన చిత్రం విడుదలైనప్పుడు, అదే సమయంలో వచ్చిన ఒక చిన్న బడ్జెట్ భక్తి చిత్రం సంచలనం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ సినిమా పేరు ‘జై సంతోషి మా’. ఈ చిత్రం సాధించిన విజయం, అందులోని ఒక పాట సృష్టించిన రికార్డులు నేటికీ సినీ పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అయితే, ఈ భారీ విజయం వెనుక ఒక గాయని పడిన వేదన, ఆమెకు అన్యాయం జరిగిన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.‘షోలే’ను దాటేసిన ‘జై సంతోషి మా’1975లో వచ్చిన ‘జై సంతోషి మా’ ఒక సినిమాగా మాత్రమే కాకుండా, ఒక భావోద్వేగంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేసింది. భారీ తారాగణం, భారీ సెట్టింగ్స్ లేకపోయినా, ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అప్పట్లో రికార్డులు సృష్టించిన ‘షోలే’ చిత్రానికి సైతం గట్టి పోటీనిచ్చి, కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ దక్కింది.గడప గడపకూ చేరిన భక్తి గీతంఈ సినిమా విజయానికి ప్రధాన కారణం అందులోని పాటలు.. ముఖ్యంగా ‘మైతో ఆరతీ ఉతారూ రే సంతోషి మాతా కీ...’. ఈ పాట దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ మారుమోగింది. ఈ పాటను తన మధురమైన గాత్రంతో పండించారు ప్రముఖ గాయని, లతా మంగేష్కర్ సోదరి ఉషా మంగేష్కర్. ఆ కాలంలో ఈ పాట ఒక ట్రెండ్‌ను సెట్ చేసింది. సినిమాతో పాటు ఈ పాట కూడా ఒక చరిత్రను సృష్టించింది.కేవలం రూ. 400 పారితోషికంఅయితే సినిమా ఇంత పెద్ద విజయాన్ని నమోదు చేసినప్పటికీ, ఆ విజయంలో భాగస్వామి అయిన ఉషా మంగేష్కర్‌కు దక్కిన పారితోషికం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె ఈ చిత్రంలో మూడు పాటలు పాడారు. ఆ మూడు పాటలకు గానూ ఆమెకు మొత్తం 1200 రూపాయలు చెల్లించారు. అంటే ఒక పాటకు ఆమెకు ముట్టింది కేవలం 400 రూపాయలు మాత్రమే. నాటి పరిస్థితుల రీత్యా ఇది చాలా తక్కువ మొత్తం అని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.రికార్డుల మీద రికార్డులుఉషా మంగేష్కర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన ప్రకారం ఈ సినిమా గత 100 ఏళ్ల సినీ చరిత్రలో అనేక రికార్డులను బద్దలు కొట్టింది. భారీ లాభాలను గడించినప్పటికీ, నిర్మాతలు ఆమెకు ఎటువంటి అదనపు పారితోషికం అందించలేదు. సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన తర్వాత కూడా, కనీసం కృతజ్ఞతగానైనా అదనంగా చెల్లించాలనే కనీస బాధ్యతను కూడా మేకర్స్ విస్మరించడం గమనార్హం.సంగీత దర్శకుడికి ఫ్రిజ్, గాయనికి మొండి చెయ్యినిర్మాతల తీరుపై ఉన్న అసంతృప్తిని ఉషా మంగేష్కర్ బయటపెట్టారు. సినిమాకు సంగీతం అందించిన సి. అర్జున్‌కు గుర్తింపుగా ఒక ఫ్రిజ్ బహుకరించారు. అయితే అద్భుతమైన గాత్రంతో పాటలకు ప్రాణం పోసిన గాయనికి మాత్రం అటువంటి చిన్న గుర్తింపు కూడా దక్కలేదు. అప్పట్లో ఉన్న చిత్ర పరిశ్రమలోని వివక్షకు, కళాకారుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు.ఆ అన్యాయంపై మౌనంగానే..ఎంతో కష్టపడి పాడి, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించినా, క్రెడిట్ విషయంలో కూడా ఆమెకు సరైన గుర్తింపు లభించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఏ రకమైన ప్రశంసలు లేకపోగా, ఆర్థికంగా తీవ్ర అన్యాయం జరిగిందని ఆమె వాపోయారు. అయినా ఉషా మంగేష్కర్ ఆ నాటి పరిస్థితులపై ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా, తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగిపోయారు.నేటికీ ఒక చేదు జ్ఞాపకంగా..‘జై సంతోషి మా’ సినిమా సాధించిన రికార్డులు, ఆ సినిమా వెనుక దాగి ఉన్న ఉషా మంగేష్కర్ కన్నీటి గాథ ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కమర్షియల్ సక్సెస్ కంటే కళాకారుల శ్రమకు విలువ ఇవ్వాల్సిన బాధ్యతను ఈ సంఘటన ఎత్తిచూపుతుంది. నేటికీ ఈ పాట విన్నప్పుడు ఎంతో భక్తిభావం కలుగుతుంది. కానీ ఆ పాట వెనుక ఒక సింగర్‌కు జరిగిన అన్యాయం చూస్తే ఎవరికైనా ఆవేదన కలుగుతుంది.ఇది కూడా చదవండి: రథయాత్ర వేళ.. భక్తిభావంలో ముంచెత్తే అద్భుత చిత్రాలు -
ప్రెగ్నెన్సీలోనూ యాక్షన్‌కి సై
సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. అయితే దీపికా పదుకోన్ మాత్రం ప్రెగ్నెన్సీ టైమ్‌లోనూ రిస్క్ చేస్తున్నారు. ‘రాకా’ సినిమా కోసం యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారామె. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకా’. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారట దీపిక. ఇదిలా ఉంటే... హీరో రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ 2018 నవంబరు 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు దువా అనే కుమార్తె ఉంది. తాను రెండోసారి తల్లి కానున్నట్లు దీపిక ఈ మధ్య ప్రకటించారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి. అయినప్పటికీ ‘రాకా’ కోసం రాత్రిపూట కూడా పని చేస్తూ, రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ, నటనపై తనకున్న నిబద్ధతను చాటుకుంటున్నారామె. ప్రసూతి సెలవులకు వెళ్లేలోపే ‘రాకా’లోని తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేయాలనే పట్టుదలతో దీపిక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆ మధ్య ఎనిమిది గంటల పని నిబంధనను తెరపైకి తీసుకొచ్చిన దీపిక ‘రాకా’ కోసం ఎలాంటి నిబంధనలు లేకుండా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. -
సన్నీడియోల్ ‘ఇక్కా’ మూవీ రివ్యూ
ఉన్నావాడికైనా, లేనివాడికైనా , ఎవ్వరికైనాసరే ఉండేది స్వార్ధం. ఈ సమాజంలో జరుగుతున్న వందశాతం నేరాలు స్వార్ధంతో చేసేవే. అటువంటి నేరాలకు కొమ్ము కాస్తూ అన్యాయంగా న్యాయాన్ని తమ స్వార్ధానికి వాడుకుంటున్న వారికి సరైన పద్ధతిలో బుద్ధి చెప్పిన ఆటే ఈ ఇక్కా. తెలుగులో ఇక్కా అంటే పేకాటలో వచ్చే ఆసు ముక్క అని అర్ధం. పేకాటలో ఆసు ముక్కకు ఎంత యుక్తి శక్తి ఉందో అంతకంటే వందలరెట్లు తెలివిగలవాడు ఈ సినిమా హీరో. ఈ సినిమాలో వచ్చే పాత్రలు, చేసే పనులన్నీ చూసే ప్రేక్షకుడికి వినోదంతో పాటు కాస్త విజ్ఞానాన్ని కూడా అందిస్తుదనడంలో సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే ఇక్కా సినిమా ప్రేక్షకులకు కనువిందుతో పాటు కనువిప్పు కూడా కలిగిస్తుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం.సోమా మిట్టల్ అనే యువతి ప్రముఖ వ్యాపారవేత్త శౌర్యమాన్ గౌర్ కారు నుండి విసిరివేయబడి దారుణ హత్యకు గురవుతుంది. అక్కడ నుండే ఈ సినిమా మొదలవుతుంది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు శౌర్యమాన్ గౌర్ ను అరెస్ట్ చేస్తారు. శౌర్యమాన్ తండ్రి పెద్ద రాజకీయనాయకుడు కావడం వల్ల నగరంలోని ప్రముఖ లాయర్ అయిన అర్జున్ మెహరాను ఈ కేసు తీసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తారు. కాని న్యాయానికి కట్టుబడ్డ అర్జున్ మెహరా ముందు ఈ కేసును తీసుకోనని ససేమిరా తిరస్కరిస్తాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల కేసును అర్జున్ మెహరా శౌర్యమాన్ తరపున వాదించడానికి ఒప్పుకుంటాడు. తన జీవిత కాలంలో న్యాయనికి కట్టుబడ్డ అర్జున్ మెహరా మొట్టమొదటిసారిగా అన్యాయం తరపున వకాల్తా పుచ్చుకోవడం మొత్తం కోర్టు సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. అన్యాయం వైపు నిలబడ్డ అర్జున్ మెహరా న్యాయం కోసం తన ఆసు ముక్కని ఎలా ఆడతాడో ఇక్కా సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ఓ మండి డ్రమెటిక్ థ్రిల్లర్.అల్తియా కౌశల్ అందించిన ఇక్కా కథను ప్రముఖ దర్శకుడు సిద్ధార్ధ మల్హోత్రా తెరకెక్కించారు. ప్రముఖ నటులు సన్నీడియోల్, అక్షయ్ ఖన్నా తో పాటు దియా మర్జా వంటి వర్ధమాన తారలు ఈ ఇక్కా సినిమాలో తమ పాత్రలకు పక్కా న్యాయం చేశారు.విశేషంగా సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను మంచి థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి. ఈ ఇక్కా సినిమా మాతృక హిందీ అయినా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోను లభ్యమవుతోంది. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. ప్లే జాయ్ ఫుల్లీ విత్ యువర్ ఇక్కా.-హరికృష్ణ ఇంటూరు -
మౌనీ రాయ్‌తో డేటింగ్ వార్తలు.. నటుడు స్ట్రాంగ్ రియాక్షన్
ఇటీవలే విడాకుల ప్రకటనతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్. నాగిని సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసింది. ఈ ఏడాది మే నెలలో తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. తన భర్త సూరజ్ నంబియార్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే విడాకుల ప్రకటించిన రెండు నెలల్లోనే మౌనీ రాయ్‌పై రూమర్స్ మొదలయ్యాయి. నటుడు అర్జున్ బిజ్లానీతో ఆమె డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. వీరిద్దరు జంటగా ఓ హోటల్ నుంచి బయటికి వస్తున్న వీడియో వైరలైంది. దీంతో మౌనీ రాయ్, అర్జున్ రిలేషన్లో ఉన్నారంటూ బాలీవుడ్లో టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై నటుడు అర్జున్ బిజ్లానీ స్పందించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు రాస్తోన్న వారిని విమర్శించారు. ఇలాంటి కథనాలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ఆయన మీడియా సంస్థలను కోరారు. మా మధ్య 15 ఏళ్లకు పైగా ఉన్న స్నేహాన్ని ప్రేమగా చిత్రీకరించడం నిరాశపరిచిందన్నారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న నా స్నేహితురాలికి అండగా నిలబడినప్పుడు ఇలా జరగడం మరింత బాధాకరమని అర్జున్ అన్నారు. మా ఇద్దరి చుట్టూ అల్లుతున్న కథనాలు అవాస్తవమని అర్జున్ వెల్లడించారు. ఈ విషయంపై ఓ ప్రత్యేక నోట్ విడుదల చేశారు. అర్జున్ తన నోట్లో రాస్తూ..' "ప్రియమైన క్లిక్‌బైట్ మిత్రులారా.. 15 ఏళ్లకు పైగా స్నేహంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక గాసిప్ పేజీ శీర్షికలో వచ్చినంచ మాత్రాన ఒక్కసారిగా జంటగా మారిపోరు. కొన్నిసార్లు మన స్నేహితుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలబడతారు. మీ వ్యూస్ కోసం ప్రతి స్నేహాన్ని ప్రేమ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ప్రచురించే ముందు వాస్తవాలను సరిచూసుకోవడం మంచింది. మనం సృష్టించే కథనాల విషయంలో బాధ్యతగా ఉందాం." అంటూ రాసుకొచ్చారు.ప్రజల వ్యక్తిగత జీవితాలకు నష్టం కలిగించేలా సంచలనాత్మక శీర్షికలను వాడకూడదని మీడియాకు విజ్ఞప్తి చేశాడు. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి అనవసరంగా చొరబడి.. గందరగోళం సృష్టించే తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేసే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని మీడియాను కోరారు. బాధ్యతాయుతమైన జర్నలిజం విశ్వసనీయతను పెంచుతుందని.. క్లిక్‌బైట్ పెంచదని సూచించారు. అర్జున్, మౌని ప్రేమలో ఉన్నారన్న వార్తలను క్రిస్టల్ డిసౌజా కూడా ఖండించింది. ఇదేం పిచ్చి. కేవలం వ్యూస్ కోసం ఏమైనా పోస్ట్ చేస్తారా అని ప్రశ్నించింది.కాగా.. నటుడు అర్జున్, మౌనీ రాయ్ 15 ఏళ్లకు పైగా స్నేహితులుగా ఉన్నారు. 2015లో, ఏక్తా కపూర్ నిర్మించిన 'నాగిన్' సీరియల్లో వారు రితిక్, శివన్య పాత్రలలో నటించారు. వీరి జోడీ అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో ఒకటిగా నిలిచింది. గతంలో జనవరి 27, 2022న సూరజ్‌ను పెళ్లాడిన మౌనీ రాయ్.. ఈ ఏడాది మే 14న విడిపోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది.ఇక కెరీర్ విషయానికొస్తే మౌని రాయ్ ఇటీవల 'ది భూత్నీ','సలాకార్' చిత్రాలలో కనిపించారు. ఆమె అబ్ హోగా హిసాబ్ వెబ్ సిరీస్, హై జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రంలో కూడా నటించారు. అర్జున్ బిజ్లానీ ఇటీవల అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో 'రైజ్ అండ్ ఫాల్' గెలుచుకున్నారు. అతను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కామెడీ డ్రామాతో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నారు. -
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి
యే కాళీ కాళీ ఆంఖేన్, ఉందేఖి వెబ్ సిరీస్‌ల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆంచల్ సింగ్.. గత కొన్నేళ్లుగా మోహిత్ చావ్లా అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. తాజాగా వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఢిల్లీలో పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలని ఆంచల్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన తెలుగు సీరియల్ జోడీ)కొన్నేళ్లు కలిసి జర్నీ చేసిన తర్వాత జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండాలనే నిర్ణయం సహజంగా వస్తుంది. మా ప్రపోజల్ కూడా ఎంతో అందంగా జరిగింది. కానీ అది నన్ను ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే మా బంధంలో ప్రతి చిన్న అనుభవం, ప్రతి జ్ఞాపకాన్ని దాటుకుని ఈ దశ వరకు వచ్చాం. అదే నాకు గొప్ప సర్ప్రైజ్ కంటే ఎక్కువ రొమాంటిక్‌గా అనిపించింది అని ఆంచల్ చెప్పింది. ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని ఆంచల్ చెప్పింది.పంజాబీ నటి అయిన ఆంచల్.. 2012 నుంచి ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతోంది. తొలుత ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించిన ఈమె.. 2013లో వచ్చిన ఓ సింహళ మూవీతో నటిగా మారింది. ఆపై రామయ్య వస్తావయ్యా, హాలీడే, జాక్సన్ దురై, దిళ్లుకు దుడ్డు, పుంజ్ ఖాబ్, బాంబ్ జిగ్రా, జక్మీ లాంటి హిందీ, తమిళ, పంజాబీ సినిమాలు చేసింది. కానీ ఓటీటీలో చేసిన యే కాళీ కాళీ ఆంఖేన్, ఉందేఖి వెబ్ సిరీస్‌లు ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. మరోవైపు సమంతకు సీమంతం) -
సోనమ్ వాంగ్చుక్కు '3 ఇడియట్స్'తో సంబంధం లేదు
కాక్రోచ్ జనతా పార్టీ గత కొన్నిరోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తోంది. వీళ్లతో మద్ధతిచ్చిన ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. ఏకంగా 9 కిలోలకు పైగా బరువు తగ్గిపోవడంతో ఈయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అయితే చాలామందికి వాంగ్ చుక్ పేరు చెప్పగానే 'త్రీ ఇడియట్స్' సినిమా గుర్తొస్తుంది. ఈయన జీవితం ఆధారంగానే ఆమిర్ పోషించిన పాత్రని తెరకెక్కించారని ఇన్నాళ్లు అంతా అనుకున్నారు. కానీ వాంగ్ చుక్కి ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆమిర్ ఖాన్ ఇప్పుడు చెప్పారు.(ఇదీ చదవండి: విజయ్‌కు త్రిష.. నాకేమో నవ్వు!)బ్రిటన్‌లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఆమిర్ ఖాన్.. సోనమ్ వాంగ్ చుక్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆయన సురక్షితంగా దీక్ష విరమించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇకపోతే కొన్నిరోజుల క్రితం త్రీ ఇడియట్స్' మూవీలో నటించిన ఓమి వైద్య.. సోనంకు మద్ధతు ప్రకటిస్తూ.. పున్సుఖ్ వాంగ్డూ పాత్ర ఈయన జీవితం ఆధారంగా తీశారని అన్నాడు.ఇప్పుడీ విషయం పైనా స్పందించిన ఆమిర్ ఖాన్.. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ గానీ, రచయిత అభిజిత్ జోషి గానీ సినిమా తీసే టైంలో సోనం వాంగ్ చుక్ గురించి వ్యక్తిగతంగా ఏం తెలుసుకోలేదు. ఈ మూవీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఆరోగ్యం పట్ల అందరం ఆందోళన చెందుతున్నాం. త్వరగా దీక్ష విరమించి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు.సోనం వాంగ్‌చుక్ గతంలో ఇదే విషయమై ఓసారి స్పందిస్తూ, తన జీవితం ఆధారంగా ఆ పాత్ర తీయలేదని అనుకుంటున్నట్లు చెప్పారు. తన పనితీరు, ఆలోచనల నుంచి కొంతమేర ప్రేరణ పొంది ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్‌కి లక్కీ ఛాన్స్)🚨 REPORTER : Your film was inspired by Sonam Wangchuk. He is on fast. AAMIR KHAN 🔥🔥 : No, the character in 3 Idiots had nothing to do with Sonam Wangchuk. We didn't even know about him when we were shooting the film.Aamir stuns CJP 😭😂🔥pic.twitter.com/QaLS5AIf6p— News Algebra (@NewsAlgebraIND) July 16, 2026 -
పదిహేడేళ్ల తర్వాత...
అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్న చిత్రం ‘హైవాన్’. ప్రియదర్శన్ దర్శకత్వంలో వెంకట్ కె.నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 11న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం ‘హైవాన్’. ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ నెగెటివ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్.ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని ఒక డార్క్, థ్రిల్లింగ్ వరల్డ్‌లోకి తీసుకెళ్లనున్నారు ప్రియదర్శన్. ఈ ఏడాది ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘హైవాన్’ ముందు వరుసలో ఉంటుంది. అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత ‘హైవాన్’ మూవీలో కలిసి నటిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
యాక్షన్ ఓ హైలైట్
‘‘వారణాసి’ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు ప్రియాంకా చోప్రా . మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజీ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా , కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ప్రియాంకా చోప్రా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘‘వారణాసి’ కోసం 14 నెలలుగా నిరంతరాయంగా పని చేస్తున్నాను. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. అలాగే ఈ సినిమాకి ఓ హైలైట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రం కోసం కొన్ని స్లో మోషన్ జంప్స్‌తో కూడిన సన్నివేశాల్లో నటించాను’’ అని ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ‘వారణాసి’ సినిమా గురించిన విశేషాలను చెప్పారు ప్రియాంకా చోప్రా . కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
జూ.ఎన్టీఆర్ తరహాలో రూమర్లపై బన్నీ వ్యవహరిస్తాడా?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి సినీ రంగానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు వస్తారనే ఊహాగానాలు ఇటీవల పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ రూమర్లు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇక్కడ పొలిటికల్ ఎంట్రీ రూమర్లు ఎన్టీఆర్ పై రావడం కొత్తేం కాదు. ఇప్పటికే అతడిపై చాలా ఏళ్లుగా ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న ప్రతి ఊహాగానాన్ని ఎన్టీఆర్ ఖండిస్తూ వచ్చాడు. తాజాగా వచ్చిన రూమర్లపై కూడా తన టీమ్ స్పందించింది. తాజాగా అల్లు అర్జున్ పై కూడా అలాంటి ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఈ విషయంపై బన్నీ నుంచి ఎలాంటి స్పందన లేదు. తన టీమ్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. మొన్నటికిమొన్న తనపై వస్తున్న పొలిటికల్ ఎంట్రీ పుకార్లపై ఎన్టీఆర్ టీమ్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. ‘రా ఎన్టీఆర్’ అనే సంస్థతో కానీ అది చేసే పనులతో తారక్‌కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈనెల 18న ‘రా ఎన్టీఆర్’ చేయబోయే ఛారిటీతో కూడా ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీమ్ ప్రకటించింది. ఈ మద్య వచ్చిన రూమర్లలో ఎన్టీఆర్ కంటే ముందే బన్నీ పొలిటికల్ ఎంట్రీ అంటూ పుకార్లు వచ్చాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో అవి అలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అతడిపై వస్తున్న ఊహాగానాలకు ప్రజల్లో చర్చ కూడా జరుగుతోంది.ఇంత జరుగుతుంటే..అల్లు అర్జున్ మాత్రం తనపై వస్తున్న పుకార్లపై ఏమాత్రం స్పందించలేదు. ఆయన స్పందన కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ తన సినిమాల షూటింగ్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. పుకార్లపై ఎన్టీఆర్ టీమ్ స్పష్టత ఇచ్చినప్పటికీ, అల్లు అర్జున్ నుంచి మాత్రం మౌనం కొనసాగుతుండటంతో ప్రజల్లో చర్చ మరింత పెరిగింది. ఆయన ఈ పుకార్లను ఓపెన్‌గా ఖండిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
ఓటీటీలో సరికొత్త యానిమేషన్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు వినూత్నమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్ ఓటీటీ ప్రియుల ముందుకు రానుంది. తాజాగా సరికొత్త యానిమేటెడ్ సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ పిల్లల పుస్తకం ‘ ది వెరీ ఎక్స్ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ జూలై 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.మన అందరికీ తెలిసిన పౌరాణిక ప్రపంచాన్ని ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా స్క్రీన్‌పై సరికొత్తగా అందించనున్నారు. కథ విషయానికి వస్తే.. కుండక్క, మండక్క అనే ఇద్దరు అల్లరి అసుర జంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ల అల్లరి పనులు ధైర్యం, స్నేహం, తమను తాము తెలుసుకునే ఒక అద్భుతమైన అడ్వెంచర్‌లోకి తీసుకెళ్తాయి. రామాయణం, మహాభారతం వంటి తెలిసిన కథలకే పరిమితం కాకుండా, ఈ సిరీస్ భారతీయ పౌరాణిక సంపదలోని కొత్త పాత్రలు, ఇంకా అన్వేషించని లోకాలు, మాయాజాలంతో నిండిన అడ్వెంచర్లను పిల్లలకు, కుటుంబాలకు పరిచయం చేయనుంది.వినోదం, యాక్షన్, ఆకర్షణీయమైన యానిమేషన్ కలయికతో రూపొందించిన ఈ సిరీస్ నేటి పిల్లల కోసం పౌరాణిక కథలను సరికొత్తగా ఆవిష్కరించనుంది. హీరో అనే పదం ఓ వ్యక్తి తను తీసుకునే నిర్ణయాలతో నిర్ణయించబడుతాడనే అభిప్రాయాన్ని అందంగా అందరికీ తెలియజేస్తుంది. ఇదొక పెద్ద యూనివర్స్‌కు ఆరంభం మాత్రమే. ‘శివలోక్ కె కుండక్క మండక్క’ భవిష్యత్తులో కొత్త పాత్రలు, కొత్త అడ్వెంచర్లు, మరిన్ని కథలతో విస్తరించనుంది. పిల్లలు భారతీయ పౌరాణిక కథలను వినోదాత్మకంగా, కొత్త కోణంలో ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ కతలో ఇద్దరు అల్లరి అసుర పాత్రలను పెట్టడం ద్వారా, అల్లరి పిల్లలకు విలువలు లేదా క్రమశిక్షణ ఉండవనే అభిప్రాయాన్ని ప్రశ్నిస్తుంది. కుండక్క, మండక్క చేసే సాహసాల ద్వారా ఆసక్తి, అల్లరి కూడా దయ, ధైర్యం, అనుభూతితో కలిసి ఉంటుందని మనకు అవగతమవుతుంది. ఈ సిరీస్ సిరీస్ హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుంది.రైటర్ ఆనంద్ నీలకంఠన్ మాట్లాడుతూ..'నా పుస్తకం ‘ ది వెరీ, ఎక్స్ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్’ ను ‘శివలోక్ కె కుండక్క మండక్క’ రూపంలో కిడ్స్ జెడ్ జీవం పోసి కొత్త తరం పిల్లలకు పరిచయం చేయడం చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. భారతీయ పౌరాణిక సంపదలో నాటుకుపోయిన కథలను పిల్లలకు ఆకట్టుకునే విధంగా మళ్లీ ఆవిష్కరించడం..వాటిని జీ5 వంటి పెద్ద స్థాయి ప్లాట్‌ఫామ్స్ రూపొందించటం అనందంగా ఉంది. నేను ఈ పాత్రలను సృష్టించినప్పుడు ఎంత ఆనందించానో, కుండక్క, మండక్కల అడ్వెంచర్లను స్క్రీన్‌పై చూస్తూ చిన్నారులు కూడా అంతే ఆనందిస్తారని ఆశిస్తున్నా. ఈ అల్లరి పాత్రలు వారి ప్రపంచం యానిమేషన్ రూపంలో కొత్త జీవం పొందడం నిజంగా ఆనందించదగ్గ విషయం' అని అన్నారు -
విడాకులు తీసుకున్న రామాయణ నటుడు
ప్రముఖ బాలీవుడ్ జంట తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసుకుంది. మరాఠీ నటుడు, దర్శకుడు అదినాత్ కొఠారి, ఆయన భార్య నటి ఊర్మిళ కనేత్కర్ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. స్నేహపూర్వకంగా భాగస్వాములుగా విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ సమయంలో తమ గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిమానులను కోరారు. తమ వివాహ బంధం ముగిసినప్పటికీ తమ కుమార్తె జిజా పట్ల ఇద్దరం బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. తనను ఇద్దరం కలిసికట్టుగా పెంచడానికి తాము అంకితభావంతో ఉన్నామని తెలిపారు.కొఠారే తన ఇన్‌స్టాలో రాస్తూ.. "మా స్నేహితులకు, మీడియాకు, శ్రేయోభిలాషులకు మా విజ్ఞప్తి. చాలా సార్లు ఆలోచించిన తర్వాత నేను, ఊర్మిళ పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వకంగా భాగస్వాములుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఒక జంటగా మా ప్రయాణం ముగిసింది. కానీ మా కుమార్తె జిజా పట్ల మా నిబద్ధత ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆమె మాకు అత్యంత ప్రాధాన్యత. ఆమె ప్రేమ, భద్రత, మద్దతుతో పెరిగేలా చూసేందుకు మేము చాలా సంతోషంగా, అంకితభావంతో కలిసి పెంచుతాము. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని అదే విధంగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం" అని రాసుకొచ్చారు.ఈ సమయంలో మీడియా మిత్రులు, ప్రజలు మా గోప్యతను గౌరవిస్తారని మేము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక సిని కెరీర్ విషయానికొస్తే కొఠారే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ది రాయల్స్'లో కనిపించారు. ఈ షోలో ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, జీనత్ అమన్, విహాన్ సమత్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 83లో క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ పాత్ర పోషించారు. కాగా.. కొఠారే ప్రస్తుతం రణబీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తోన్న 'రామాయణంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రవీ దూబే, యశ్, సన్నీ డియోల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. -
డెటాల్ బాటిల్లో మద్యం.. భర్త చేతిలో నిత్యం నరకం
బాలీవుడ్ తెరపై ‘ట్రాజెడీ క్వీన్’గా పేరొందిన మీనా కుమారి తన నిజ జీవితంలో లెక్కలేనన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. అడుగడుగునా అవమానాలు, ఆప్యాయతకు అల్లంత దూరంలో సాగిన ఆమె జీవితం వెండితెరపై మెరిసినా, తెరవెనుక మాత్రం చిమ్మచీకటిగానే గడిచింది.పుట్టుకతోనే మొదలైన చీకటి ప్రయాణంమీనా కుమారి జననం అపశకునంగా భావించిన తండ్రి, ఆమె పుట్టిన గంటల వ్యవధిలోనే అనాథాశ్రమం పాలు చేశాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని ఇంటికి తెచ్చినా, ప్రేమకు బదులుగా ఆమెను ఒక ‘ఆర్థిక వనరు’గా మాత్రమే చూశాడు. కేవలం నాలుగు సంవత్సరాల ప్రాయంలోనే ఆమెను సినిమాల్లోకి నెట్టి, కుటుంబ పోషణ బాధ్యతను ఆ చిన్నారి భుజాలపై మోపాడు.బాల్యం నుండి బానిసత్వం వైపుబాల్యం అంటే ఆటపాటలు అనుకునే వయసులో, మీనా సెట్స్‌లో కష్టపడటం మొదలుపెట్టారు. 1939లో ‘లెదర్ ఫేస్’ సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం, 13 ఏళ్లకే హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే, తన కష్టార్జితం అంతా తండ్రి జేబులోకి వెళ్తుండటంతో, తను సంపాదిస్తున్నా ఆర్థికంగా మాత్రం బానిసగానే మిగిలిపోయారు.కమల్ అమ్రోహితో ప్రేమ, తండ్రి నిర్బంధంకెరీర్ సాగుతుండగా దర్శకుడు కమల్ అమ్రోహితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఒక ప్రమాదం తర్వాత, తన కంటే 15 ఏళ్లు పెద్దవారైన కమల్ ఆమెను చూసుకోవడం, ఆపై వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడం జరిగాయి. అయితే, ఈ బంధాన్ని అంగీకరించని ఆమె తండ్రి కఠినంగా వ్యవహరించారు. ఫలితంగా, తండ్రిని ఎదిరించి ఆమె కమల్ అమ్రోహి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది.షరతులతో కూడిన వైవాహిక జీవితంకమల్ అమ్రోహితో జీవనం ఆమెకు స్వర్గధామం కాలేదు. తనతో ఉండాలంటే ఇతర దర్శకులతో పనిచేయకూడదని, సాయంత్రం 6 గంటలకే ఇంటికి రావాలని, మగవారు మేకప్ రూమ్‌లోకి రాకూడదని కమల్ విధించిన షరతులకు ఆమె తలొగ్గారు. ఆ బంధంలో ప్రేమ కంటే నియంత్రణే ఎక్కువగా ఉండటంతో, అది మెల్లగా కారాగారంగా మారింది.గృహహింసకు సాక్ష్యంగా నిలిచిన స్నేహితులుషరతులతో కూడిన బంధం చివరకు రోజూవారీ గొడవలకు, శారీరక హింసకు దారితీసింది. వారి మధ్య గొడవలకు నటి నర్గీస్ లాంటి వారు కూడా సాక్ష్యంగా నిలిచారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆత్మాభిమానం గాయపడటంతో చివరికి వారి బంధం విడాకులతో ముగిసింది.మద్యం సాక్షిగా మరణం వైపు ప్రయాణంజీవితంలో ఎదురైన ఒంటరితనం, మానసిక క్షోభ నుండి బయటపడటానికి మీనా కుమారి మద్యాన్ని ఆశ్రయించారు. అది అలవాటుగా మారి, చివరకు డెటాల్ బాటిళ్లలో కూడా మద్యం దాచుకుని తాగే స్థాయికి వెళ్లారు. 1968లో ఆమెకు ‘లివర్ సిరోసిస్’ ఉన్నట్లు తేలింది. చికిత్స కోసం విదేశాలకు వెళ్లినా, ఆమె పూర్తిగా కోలుకోలేదు.అనాథగా కన్నుమూసిన అద్భుత నటి1972లో ఆమె నటించిన మాస్టర్ పీస్ ‘పాకీజా’ విడుదలైన కొద్ది రోజులకే ఆమె మరణించారు. దీనికి మూడు రోజుల ముందు నుండే ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. చివరి సమయంలో ఆమె పక్కన ఆత్మీయులు ఎవరూ లేరు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఆ సినిమా ఘనవిజయాన్ని కూడా చూడకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.ఇది కూడా చదవండి: 16 నుంచి జగన్నాథ రథయాత్ర.. 10 ఆసక్తికర విషయాలు! -
హీరో సూర్యతో రాజమౌళి కొత్త సినిమా?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి చిత్రం తర్వాత జక్కన్న ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. గతంలో రాజమౌళి తర్వాత చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఉండబోతుందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే దీనిపై అల్లు అర్జున్ నుంచి కానీ, రాజమౌళి టీం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే తాజాగా రాజమౌళి వారణాసి తర్వాత చిత్రం తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో ఉండబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. సినీ ఇండస్ట్రీలో కూడా సూర్యతో సినిమా చేయడానికి రాజమౌళి సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఇది ఒకటిగా నిలవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సూర్య-రాజమౌళి కాంబినేషన్‌పై ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. వీరి కాంబినేషన్లో సినిమా రానుందంటూ గతంలో కూడా పలు వార్తలు తెగ హల్చల్ చేశాయి. అప్పట్లో రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో హీరోగా ముందు సూర్య పేరును పరిశీలించినట్లు జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అనంతరం కూడా పలుమార్లు వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, అవి అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. సూర్యతో మూవీ చేసే అవకాశాన్ని తాను మిస్ అయ్యానని అప్పట్లోనే రాజమౌళి చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సూర్య తన 50వ సినిమా రాజమౌళి దర్శకత్వంలోనే ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో ఓ భారీ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దాంతో సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై రాజమౌళి నుంచి కానీ సూర్య నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది కరుప్పుతో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది. అనంతరం భారీ చిత్రాలు నిర్మించే హోంబలే ఫిల్మ్స్‌తో జతకట్టారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కు జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. -
మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమారం కొనసాగుతోంది. జూలై 5న ముంబైలోని తన పాలి హిల్ నివాసంలో అత్యంత సాదాసీదాగా, సన్నిహితుల మధ్య చేసుకున్న గౌరి స్ప్రాట్ (Gauri Spratt)తో జరిగిన పెళ్లి వివాదాలకు దారితీసింది. దీనిపై లవ్ జిహాద్ ఆరోపణలతోపాటు, ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఒక 'ఫత్వా' జారీ కావడంపై ఆమీర్ ఖాన్ ఘాటుగా స్పందించారు. ఈ వివాహంపై రాజకీయ, మతపరమైన కోణాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో ఆమిర్ సమాధానమిచ్చారు.తన చిరకాల స్నేహితురాల్ని పెళ్లి చేసుకోవడంపై అనేక విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా మహారాష్ట్ర బీజేపీ మంత్రి నితేష్ రాణే ఈ పెళ్లిని "లవ్ జిహాద్" గా అభివర్ణించారు. ఇది ఇలా ఉండగానే ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తాకు చెందిన షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ ఈ పెళ్లికి వ్యతిరేకం షరియా చట్టం ప్రకారం ముస్లిం పురుషుడు ముస్లిమేతర స్త్రీని (ఆమె ఇస్లాంలోకి మారకుండా) వివాహం చేసుకోకూడదని, ఇది చెల్లదని ఆయన పేర్కొన్నారు.ఆమిర్ ఖాన్ సమాధానంరెడిఫ్ (Rediff) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. తన ముగ్గురు భార్యలలో ఎవరూ ఇస్లాంలోకి మారలేదని స్పష్టం చేశారు. తన వివాహాలన్నీ సివిల్ వివాహాలే (చట్టబద్ధమైన రిజిస్టర్ మ్యారేజ్)అని పేర్కొన్నారు. అలాగే గౌరి అసలు హిందువు కానేకాదని ఒక క్రిస్టియన్. పైగా ఆమె మతాచారాలను పాటించే వ్యక్తి కూడా కాదని ఆమిర్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్కలిసికట్టుగా ఉండే కుటుంబం"మాది చాలా విశాల దృక్పథం ఉన్న కుటుంబం. నా ఇద్దరు సోదరిమణులు హిందువులను వివాహం చేసుకున్నారు. నా కుమార్తె కూడా హిందువునే పెళ్లి చేసుకుంది. నా కజిన్ మన్సూర్ ఒక క్రిస్టియన్‌ను పెళ్లాడాడు" అని వివరించారు. అంతేకాదు కాలం గడుస్తున్న కొద్దీ జీవితం మరింత హాస్యాస్పదంగా మారుతోందంటూ ఈ వివాదాలపై ఆమీర్ చురకలు వేశారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందికాగా ఆమీర్- గౌరి స్ప్రాట్‌ల వివాహానికి దాదాపు 150 మంది అతిథులు హాజరయ్యారు.ముఖ్యంగా ఆమీర్ ఇద్దరు భార్యలు రీనా దత్తా, కిరణ్ రావ్‌తోపాటు, పిల్లలు జునైద్, ఇరా, ఆజాద్‌లతో పాటు గౌరి కుమారుడు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఇదీ చదవండి: 18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్ -
మృణాల్.. టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్?
తెలుగులో మూడు నాలుగు సినిమాలే చేసినప్పటికీ హీరోయిన్ మృణాల్ ఠాకుర్‌ని ఇక్కడి ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యూత్ బాగానే ఓన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఏదోలా మృణాల్ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కొన్నిరోజుల క్రితం హీరో ధనుష్‌తో డేటింగ్, పెళ్లి అని తెగ మాట్లాడుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్ పంత్‌తో డేటింగ్లో ఉందంటున్నారు. దానికి కారణాలు కూడా చెబుతున్నారు.(ఇదీ చదవండి: మా ఆయన చెంప పగలగొట్టాలనిపించింది: రాధిక)మృణాల్ ప్రస్తుతం హిందీలో వరసగా సినిమాలు చేస్తోంది. కొన్నిరోజుల క్రితం హీరో ధనుష్‌తో ఈమె రిలేషన్లో ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ వీటిని మృణాల్ కొట్టిపారేసింది. రీసెంట్గా రిషభ్ పంత్, ఈమె ఒకరినొకరు ఇన్ స్టాలో ఫాలో చేసుకోవడంతో వీళ్లిద్దరూ ఏమైనా డేటింగ్ చేస్తున్నారా అని బాలీవుడ్ మీడియా గుసగుసలాడుకుంటోంది.అయితే పంత్ గురించి ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేం కాదు. చాన్నాళ్ల క్రితం బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాతో రిలేషన్ అంటూ పుకార్లు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తర్వాత క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో హడావుడి తప్పితే నిజంగా అలాంటిదేమైనా ఉందా? లేదా అనేది మృణాల్, పంత్ చెప్పాలి. అప్పటివరకు ఈ గోల తప్పదు.(ఇదీ చదవండి: క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి?) -
ఇండియన్ సినిమాతో పాక్ థియేటర్లకు కాసుల పంట!
భారతదేశం, పాకిస్తాన్ మధ్య రాజకీయంగా, భౌగోళికంగా ఎన్ని సరిహద్దు రేఖలు ఉన్నప్పటికీ, ఈ రెండు దేశాల ప్రజల హృదయాలను కలిపే ఒక అద్భుతమైన వంతెన ఉంది. అదే హిందీ చలనచిత్ర పరిశ్రమ.. బాలీవుడ్. దశాబ్దాల సెంటిమెంట్, ఉమ్మడి సంస్కృతి, భాషా సామీప్యతతో బాలీవుడ్ సినిమాలు పాకిస్తాన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కేవలం వినోద సాధనంగానే కాకుండా, రెండు దేశాల మధ్య సాంస్కృతిక అవగాహనను, శాంతిని పెంపొందించే ఒక సున్నితమైన సాధనంగా ఇవి ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం.పాకిస్తాన్లో బాలీవుడ్ హవాపాకిస్తానీయులకు బాలీవుడ్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్. దీనికి ప్రధాన కారణం ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి సాంస్కృతిక పునాది. భారతదేశం, పాకిస్తాన్ రెండింటికీ ఒకే విధమైన చారిత్రక నేపథ్యం, సంప్రదాయాలు, సంగీతం, నృత్య రీతులు ఉన్నాయి. పాకిస్తాన్‌లోని మెజారిటీ ప్రజలకు హిందీ, ఉర్దూ భాషలు సులభంగా అర్థమవుతాయి. అందువల్ల, వారు హిందీ సినిమాలలోని డైలాగులను, కథలను బాగా ఆస్వాదిస్తారు. భారీ నిర్మాణ విలువలు, ఆకట్టకునే విజువల్స్, నటీనటుల గ్లామర్ పాక్ ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేస్తున్నాయి.విభజన గాయాలు - సినిమా చరిత్రభారత్-పాక్ సినిమా బంధాన్ని అర్థం చేసుకోవాలంటే 1947 నాటి దేశ విభజన కాలానికి వెళ్లాలి. విభజనకు ముందు, ఈ ప్రాంతంలో చిత్ర పరిశ్రమ ఉమ్మడిగా ఉండేది. నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి పనిచేసేవారు. అప్పట్లో లాహోర్ ఒక ప్రధాన సినిమా హబ్‌గా ఉండేది. కానీ విభజన తర్వాత, చిత్ర పరిశ్రమ కూడా విడిపోయింది. చాలా మంది ప్రతిభావంతులు ముంబై (నాటి బాంబే) కి తరలి రావడంతో బాలీవుడ్ బలమైన పరిశ్రమగా ఎదిగింది. పాకిస్తాన్ తన చిత్ర పరిశ్రమను మొదటి నుండి నిర్మించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, నాటి విభజన గాయాలు, అనుబంధాల నేపథ్యంలో వచ్చే సినిమాలు ఇప్పటికీ ఇరు దేశాల ప్రజలను భావోద్వేగానికి గురిచేస్తుంటాయి.పాక్ ప్రేక్షకులను కదిలించే ప్రధానాంశాలుపాకిస్తాన్ ప్రజలు బాలీవుడ్ సినిమాల్లో కొన్ని నిర్దిష్టమైన అంశాలకు బాగా కనెక్ట్ అవుతారు. వాటిలో మొదటిది ‘కుటుంబ విలువలు’. ఇరు దేశాల్లోనూ కుటుంబ బంధాలకు ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువ. అలాగే, సమాజం, కట్టుబాట్లను ఎదిరించి గెలిచే 'ప్రేమకథలు' విశ్వవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటాయి. అవినీతి, పేదరికం, లింగ అసమానత వంటి ‘సామాజిక సమస్యల’ పై తీసే సినిమాలు అక్కడ చర్చకు దారితీస్తాయి. వీటికి తోడు భావోద్వేగాలతో కూడిన డ్రామా, దేశభక్తి వంటి అంశాలు పాక్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి.వివాదాలు - సెన్సార్షిప్ సవాళ్లుభారతీయ సినిమాలకు పాకిస్తాన్లో ఆదరణ ఉన్నప్పటికీ, ఈ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగడం లేదు. పాక్ అధికారులు సినిమాల విడుదలకు ముందు కఠినమైన సెన్సార్షిప్ విధిస్తుంటారు. రాజకీయాలు, మతపరమైన అంశాలు లేదా వారి సంస్కృతికి భిన్నంగా ఉండే సీన్లు, డైలాగులను తొలగిస్తారు. దీనికి తోడు, ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు హిందీ సినిమాల దిగుమతి, ప్రదర్శనలపై పాక్ ప్రభుత్వం నిషేధం విధిస్తుంది. ఇది అక్కడి థియేటర్ల ఆదాయాన్ని దెబ్బతీస్తుంది.పైరసీ.. ఆర్థిక నష్టాలుపాకిస్తాన్లో బాలీవుడ్ చిత్రాలకు ఉన్న మరో పెద్ద ముప్పు పైరసీ. అధికారికంగా సినిమాలు విడుదల కాకపోయినా లేదా ఆలస్యమైనా, అక్రమ మార్గాల్లో సినిమాలు కాపీ అయి ప్రజల్లోకి వెళ్లిపోతాయి. దీనివల్ల చిత్ర నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. అయితే, ఈ సవాళ్లు, ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ, దొంగచాటుగానైనా సరే భారతీయ సినిమాలను చూడాలనే పాక్ ప్రజల ఆరాటం మాత్రం తగ్గడం లేదు.డిజిటల్ యుగంలో బాలీవుడ్ భవిష్యత్తుప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీ ప్లాట్‌ఫారాలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటివి సరిహద్దుల గోడలను బద్దలు కొడుతున్నాయి. థియేటర్ల ఆంక్షలు, సెన్సార్షిప్లతో సంబంధం లేకుండా పాక్ ప్రజలు నేరుగా హిందీ సినిమాలను వీక్షిస్తున్నారు. భవిష్యత్తులో భారత్-పాక్ చిత్ర పరిశ్రమల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు, నటీనటుల మార్పిడి వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాలు ఏవైనా, వెండితెర అందించే వినోదం, మానవ సంబంధాల కథలు ఇరు దేశాల ప్రజలను ఎప్పటికీ కలుపుతూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇది కూడా చదవండి: అమరనాథ్ యాత్రలో అద్భుతం


