ఆ ఇద్దరికీ పొగరు.. ఆ ఒక్క హీరోయిన్‌ మాత్రం! | Mamta Kulkarni, Divya Bharti were Arrogant, Says Dancer Rubina Khan | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు హీరోయిన్లకు గర్వం.. ఒకరోజు అరికాళ్లకు బొబ్బలు!

May 21 2026 10:43 AM | Updated on May 21 2026 11:51 AM

Mamta Kulkarni, Divya Bharti were Arrogant, Says Dancer Rubina Khan

సెలబ్రిటీలు సెట్‌లో ఎలా ఉంటారనేది వారితో కలిసి పనిచేసినవారికే ఎక్కువ తెలుస్తుంది. ఎంతోమంది తారలతో కలిసి పని చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌ రుబీనా ఖాన్‌.. ఆ అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. కొందరు గొప్ప స్టార్స్‌ అయినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, మరికొందరు మాత్రం పొగరు, అహంకారం చూపించేవారంటోంది.

నేలపై కూర్చుని కబుర్లు
ఆమె మాట్లాడుతూ.. 'సంజయ్‌ దత్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, జాకీ ష్రాఫ్‌, మిథున్‌ చక్రవర్తి వంటి పలువురు సెలబ్రిటీలు ఎన్నడూ తాము పెద్ద స్టార్స్‌ అని అహంకారం చూపించలేదు. డ్యాన్సర్లను ఫ్రెండ్స్‌లా చూసేవారు. మాధురి దీక్షిత్‌ అయితే మాలాంటి డ్యాన్సర్లతో నేలపై కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పేది, జోక్స్‌ వేస్తుండేది. తాను పెద్ద సూపర్‌ స్టార్‌, మేము కేవలం డ్యాన్సర్స్‌ మాత్రమే అని ఎన్నడూ అనుకోలేదు.

డ్యాన్సర్‌ రుబీనా ఖాన్‌

మొదట్లో గర్వం..
అయితే హీరోయిన్లు మమతా కులకర్ణి, దివ్య భారతి మాత్రం కెరీర్‌ ప్రారంభంలో కొంత గర్వం చూపించేవారు. అలా అని వారిని నేను తప్పుపట్టడం లేదు. డ్యాన్స్‌ చేసేటప్పుడు తోపులాటకు గురవకుండా ఉండేందుకు డ్యాన్సర్లను కాస్త దూరంగా నిలబడమని అడిగేవారు. అదే సమయంలో వాళ్లను కాస్త విసిగించాలని మేము కావాలనే తప్పులు చేస్తూ టేక్స్‌ తీసుకునేవాళ్లం. అలా కొన్నిసార్లు కావాలనే తుంటరి పని చేసేవాళ్లం.

అరికాళ్లకు బొబ్బలు
ప్రేమ్‌ సినిమా షూటింగ్‌ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. అందులోని ఓ పాటను తీవ్రమైన ఎండలో చిత్రీకరించారు. కాళ్లకు చెప్పులు లేకుండా డ్యాన్స్‌ చేయాలి. ఆ సాంగ్‌ పూర్తయ్యే సమయానికి మా డ్యాన్సర్లందరికీ కాళ్లకు బొబ్బలు వచ్చాయి. అప్పట్లో మా పారితోషికం ఎలా ఉండేదంటే.. సాధారణ దుస్తులకు ఒక రేటు, పొట్టి బట్టలకు మరో రేటు ఉండేది. 

ఏం మారలేదు
దుస్తుల సైజు చిన్నవైనప్పుడు కొన్నిసార్లు డబుల్‌ పారితోషికం ఇచ్చేవారు. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో రోజుకు రూ.175 ఇచ్చేవారు. ఈ రేటు ఏమంత మారలేదు. 25 ఏళ్ల క్రితం ఏదైనా వాణిజ్య ప్రకటనలో డ్యాన్స్‌ చేస్తే రూ.3500 ఇచ్చేవారు. ఇప్పటికీ కొన్ని నిర్మాణ సంస్థలు పైసా పెంచకుండా అంతే మొత్తాన్నిస్తున్నాయి' అని రుబీనా చెప్పుకొచ్చింది.

చదవండి: ధనుష్‌ కంటే అతడు 100 రెట్లు నయం: మిస్కిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement