ధనుష్‌ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు | Mysskin: Kasthuri Raja Acted better than Dhanush | Sakshi
Sakshi News home page

ధనుష్‌ కంటే బెటర్‌ యాక్టర్‌.. మొదట్లో పనికిరాని సినిమాలు!

May 21 2026 9:47 AM | Updated on May 21 2026 11:53 AM

Mysskin: Kasthuri Raja Acted better than Dhanush

సౌత్‌లోని స్టార్‌ హీరోల్లో ధనుష్‌ ఒకరు. యాక్షన్‌, ఎమోషన్స్‌.. అన్నింటినీ ఈజీగా హ్యాండిల్‌ చేయగలడు. తక్కువకాలంలోనే అగ్ర హీరోగా ఎదిగాడు. అయితే అలాంటి ధనుష్‌ కంటే కూడా ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా గొప్ప నటుడు అంటున్నాడు తమిళ దర్శకుడు మిస్కిన్‌. ధనుష్‌ కంటే అతడు వంద రెట్లు నయమని పేర్కొన్నాడు. కస్తూరి రాజా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం హబిబి. మీరా కతిరవన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను మే 17న చెన్నైలో రిలీజ్‌ చేశారు. 

ఎవరో కూడా తెలీదు
ఈ కార్యక్రమానికి మిస్కిన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కస్తూరి రాజా చాలా బాగా నటిస్తాడు. మొదటిసారి ఓ సినిమాలో అతడిని చూసినప్పుడు ఆయన ఎవరనేది కూడా నాకు తెలీదు. కానీ, ఎక్కడో చూసినట్లుగా అనిపించేది. ఈయన ధనుష్‌ కంటే అద్భుతంగా నటిస్తాడు. అలా అని నాకు ధనుష్‌ అంటే ఇష్టం లేదనుకోకండి!

నచ్చేవి కావు
మొదట్లో కస్తూరి రాజా (దర్శకుడిగా) చేసిన సినిమాలు నాకస్సలు నచ్చేవి కావు. అన్నీ పనికిరాని సినిమాలే చేశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజాను తన సినిమాలకు ఎంచుకునేవాడు. నెమ్మదిగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నాడు. బాగానే డబ్బు సంపాదించాడు. కొన్నిసార్లు నేను నా ఆత్మసంతృప్తి కోసం ఏదైనా సినిమా చేసినప్పుడు నష్టాలు వచ్చేవి. అలాంటప్పుడు వెంటనే నా అప్పు తీర్చుకునేందుకు, జేబు నింపుకునేందుకు కమర్షియల్‌ మూవీ చేసి ఆ లోటు భర్తీ చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా కస్తూరి రాజా, ఈషా, మాళవిక మనోజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన హబిబి చిత్రం మే 28న విడుదల కానుంది.

చదవండి: సినీ ఇండస్ట్రీలో ఖుష్బూ చిన్న కూతురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement