kasthuri raja
-
చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..!
ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్ వంటి కమర్షియల్ అంశాలతో చాలా చిత్రాలు వస్తుంటాయి. అయితే సహజత్వం కూడిన మనసును హత్తుకునే చిత్రాలు చాలా తక్కువగానే వస్తుంటాయి.తాజాగా రూపొందిన అలాంటి చిత్రం హబిబి. ఒక మధ్య తరగతికి చెందిన ఇస్లామిక్ కుటుంబం నేపధ్యంలో రూపొందిన చిత్రం ఇది. మూడు తరాలుగా చేనేత వృత్తి నమ్ముకుని అత్యంత సాధారణ జీవితాన్ని అనుభవించే ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలి, సంతోషంగా జీవించాలని భావించి, కొత్తగా పెళ్లి చేసుకుని భార్యను కూడా వదిలి దుబాయ్‌కి వెళ్తాడు. అక్కడ పలు ఏళ్లు పని చేసే సంపాదించిన డబ్బుతో సొంత ఊరికి తిరిగి వస్తాడు. అదే విధంగా తన అన్నయ్య కొడుకును కూడా దుబాయ్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అయితే చదువుకునే రోజుల్లోనే సహా విద్యార్థినిపై మనసు పడ్డ అతను ఆమెకు దూరం కావడం ఇష్టం లేక దుబాయ్ కి వెళ్లడానికి అయిష్టత వ్యక్తం చేస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రేయసికి దూరం కావలిసిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో అతను కూడా దుబాయ్ కి వెళ్తాడు. తిరిగి వచ్చిన తరువాత మరో యువతితో కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. ఆ పెళ్లి జరిగిందా ? మొదట ప్రేమించిన యువతి ఏమైయ్యింది? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో అత్యంత సహజత్వంగా రూపొందిన చిత్రం హబిబి. ఇస్లామీయ సమాజంలోని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లలను యధార్థంగా తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రానికి మీరా కదిరవన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి మాళవిక మనోజ్ మరో ముఖ్య పాత్రను పోషించారు. శ్యామ్ సి ఎస్.సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని నేశం ఎంటర్ టైన్మెంట్ ,జీకేఎస్ బ్రోస్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్ణయించాయి.కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ అధినేత రాహుల్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇలాంటి చిత్రం గత 110 ఏళ్ల సినీ చరిత్రలో రాలేదని ప్రధాన పాత్రను పోషించిన దర్శకుడు కస్తూరి రాజా పేర్కొన్నారు. -
నా కుటుంబం నుంచీ రాజకీయాల్లోకి రావచ్చు..!
‘నా కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు’ అని సీనియర్ దర్శకుడు, నటుడు ధనుష్ దర్శకుడు సెల్వరాఘవన్ తండ్రి కస్తూరి రాజా పేర్కొన్నారు. ఈయన ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా రంగం నుంచి చాలా మంది రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. పోయస్ గార్డెన్లో నివశిస్తున్న మీ కొడుకు, నటుడు ధనుష్ కూడా రాజకీయరంగప్రవేశం చేసే అవకాశం ఉందా ? అన్న విలేకరి ప్రశ్నకు దర్శకుడు కస్తూరి రాజా బదులిస్తూ “చెన్నైలో పవర్‌పుల్ స్రాంతం పోయస్‌గార్డెన్. గోపాలపురం కూడా ఆ పక్కనే ఉంది. కలైంజ్ఞర్ కరుణానిధి జీవించిన ప్రాంతం అది. వెలుగు పుట్టిన స్థలం అది. ఇళయదళపతి కూడా ఆ ప్రాంతానికి రానున్నారని అని చెబుతున్నారు. రానీయండి. మాకు రాజకీయాలు వద్దు. అయితే మా కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. వద్దని చెప్పడానికి మనమెవరం. నేను మాత్రం రాను. వయసు అయిపోయింది. నా కొడుకులు రావచ్చు, మనవళ్లు రావచ్చు. నేను తేని నుంచి చెన్నైకి రావడానికి రూ. 50 లేక కష్టపడ్డాను. 19 ఏళ్ల వయసులోనే నాకు పెళ్లి అయ్యింది. భార్య విజయలక్ష్మి ఆదరణతోనే చెన్నైకి వచ్చి కష్టపడి దర్శకుడిని అయ్యాను. తుళ్లువదో ఇళౖయె చిత్రం మా కుటుంబాన్ని మార్చేసింది. కెమికల్ ఇంజినీరింగ్ చదివిన తన పెద్ద కొడుకు సెల్వరాఘవన్ సినిమాల్లోకి వెళతానని ఆశపడితే ముందు చదువు పూర్తి చెయ్యి ,ఆ తరువాత చూద్దాం అని చెప్పాను. గోల్డ్ మెడల్ పొందిన అతను కాదల్ కొండేన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం మా కుటుంబ పరిస్థితి మార్చేసింది. ‘నా ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు చెన్నైలో ప్రముఖ డాక్టర్లుగా రాణిస్తున్నారు’ అని దర్శకుడు కస్తూరిరాజా పేర్కొన్నారు. -
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
సౌత్‌లోని స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. యాక్షన్, ఎమోషన్స్.. అన్నింటినీ ఈజీగా హ్యాండిల్ చేయగలడు. తక్కువకాలంలోనే అగ్ర హీరోగా ఎదిగాడు. అయితే అలాంటి ధనుష్ కంటే కూడా ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా గొప్ప నటుడు అంటున్నాడు తమిళ దర్శకుడు మిస్కిన్. ధనుష్ కంటే అతడు వంద రెట్లు నయమని పేర్కొన్నాడు. కస్తూరి రాజా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం హబిబి. మీరా కతిరవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను మే 17న చెన్నైలో రిలీజ్ చేశారు. ఎవరో కూడా తెలీదుఈ కార్యక్రమానికి మిస్కిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కస్తూరి రాజా చాలా బాగా నటిస్తాడు. మొదటిసారి ఓ సినిమాలో అతడిని చూసినప్పుడు ఆయన ఎవరనేది కూడా నాకు తెలీదు. కానీ, ఎక్కడో చూసినట్లుగా అనిపించేది. ఈయన ధనుష్ కంటే అద్భుతంగా నటిస్తాడు. అలా అని నాకు ధనుష్ అంటే ఇష్టం లేదనుకోకండి!నచ్చేవి కావుమొదట్లో కస్తూరి రాజా (దర్శకుడిగా) చేసిన సినిమాలు నాకస్సలు నచ్చేవి కావు. అన్నీ పనికిరాని సినిమాలే చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను తన సినిమాలకు ఎంచుకునేవాడు. నెమ్మదిగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నాడు. బాగానే డబ్బు సంపాదించాడు. కొన్నిసార్లు నేను నా ఆత్మసంతృప్తి కోసం ఏదైనా సినిమా చేసినప్పుడు నష్టాలు వచ్చేవి. అలాంటప్పుడు వెంటనే నా అప్పు తీర్చుకునేందుకు, జేబు నింపుకునేందుకు కమర్షియల్ మూవీ చేసి ఆ లోటు భర్తీ చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా కస్తూరి రాజా, ఈషా, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రలు పోషించిన హబిబి చిత్రం మే 28న విడుదల కానుంది.చదవండి: సినీ ఇండస్ట్రీలో ఖుష్బూ చిన్న కూతురు -
నయనతార- ధనుష్ వీడియో క్లిప్ వివాదం.. హీరో తండ్రి షాకింగ్ కామెంట్స్!
నయనతార సినీ, వ్యక్తిగత జీవితంపై రూపొందించిన నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, నయనతార జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’ (నేనూ రౌడీనే)లోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నయనతార సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. తాజాగా ధనుష్ తండ్రి, దర్శక–నిర్మాత కస్తూరి రాజాను ‘ఈ విషయమై మీ అభిప్రాయం ఏంటి?’ అని ఒక విలేకరి ప్రశ్నించగా – ‘‘నయనతార వ్యవహారం గురించి నాకు కాస్త ఆలస్యంగా తెలిసింది. మేం ఎప్పుడూ ముందుకు పరిగెడుతుంటాం. తరుముకు వచ్చే వారి గురించి కానీ, వెనక మాట్లాడే వారి గురించి కానీ పట్టించుకునేంత టైమ్ మాకు లేదు. అయితే ధనుష్ అనుమతి కోసం రెండేళ్లు ఎదురు చూశానని నయనతార చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. మా దృష్టంతా మేం చేసే పని మీద ఉంటుంది. ధనుష్ ‘ఇడ్లీ కడై’ చిత్రంతో బిజీగా ఉన్నారు’’ అన్నారు.– చెన్నై, ‘సాక్షి’ సినిమా ప్రతినిధి -
ధనుష్- ఐశ్వర్య కలుస్తారా? హీరో తండ్రి ఏమన్నాడంటే?
కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య విడిపోతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే! అయితే పిల్లల విషయంలో మాత్రం వారు అప్పుడప్పుడు కలుస్తూ వస్తున్నారు. దీంతో వీరు విడాకుల వ్యవహారంలో వెనక్కి తగ్గారని, త్వరలోనే మళ్లీ కలిసే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ధనుష్, ఐశ్వర్య.. ఇద్దరూ విడాకులను వాయిదా వేసుకోవాలని యోచిస్తున్నట్లు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించాడు. ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారా? అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా.. ధనుష్‌కు అతడి పిల్లల సంతోషమే ముఖ్యం అని బదులిచ్చాడు. ఇకపోతే ధనుష్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయానుకుంటున్నారు. అలాగే 1930 నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ మూవీ చేస్తున్నాడు. చదవండి: రోలెక్స్ పాత్ర చేయడం ఇష్టం లేదు, ఆయన కోసమే ఒప్పుకున్నా అమితాబ్‌కు చిరు స్పెషల్ విషెస్ -
రజనీకాంత్ వియ్యంకుడికి అరెస్ట్ వారెంట్
చెన్నై: నటుడు ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజాకు చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెన్నై షావుకారుపేటకు చెందిన ఫైనాన్షియర్ ముకున్చంద్బోద్రా వద్ద దర్శకుడు కస్తూరిరాజా 2012 సంవత్సరంలో రూ. 65లక్షలు రుణం తీసుకున్నారు. అందుకుగాను కస్తూరిరాజా రెండు చెక్కుల్ని ఇచ్చారు. చెక్కులు బ్యాంకులో బౌన్స్ అవడంతో బాద్రా చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టులో మోసం కేసు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు సోమవారం న్యాయమూర్తి కోదండరాజ్ సమక్షంలో విచారణకు వచ్చింది. విచారణకు దర్శకుడు తరపున ఎవ రూ కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి దర్శకుడు కస్తూరిరాజాకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల13కు వాయిదా వేశారు.


