144 ఏళ్ల క్రితం దుబాయ్‌ జనాభా 12 వేలు : ఇపుడు ఎంతో తెలుసా? | Dubai Population Jumps to 4.58 Million: AI-Powered Real-Time Tracking System | Sakshi
Sakshi News home page

144 ఏళ్ల క్రితం దుబాయ్‌ జనాభా 12 వేలు : ఇపుడు ఎంతో తెలుసా?

Jul 30 2026 4:58 PM | Updated on Jul 30 2026 6:01 PM

Dubai population jumps from 12k to 46 lakhs in 144 years

ఎడారి దేశం దుబాయ్ నివాస జనాభా రికార్డు స్థాయిలోపెరిగింది. తాజా లెక్కల ప్రకారం 45.8 లక్షలు (4.58 మిలియన్లు) దాటేసింది.నగర జనాభాను ఎప్పటి కప్పుడు ప్రత్యక్షంగా అంచనా వేసేందుకు (Real-time tracking) అధికారులు ఏఐ (AI) ఆధారిత డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

'దుబాయ్ పాపులేషన్ నౌ' (Dubai Population Now) కింద సాంప్రదాయ జనాభా లెక్కల (Census) స్థానంలో రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ ఆమోదించారు. 2025 చివరి నాటికి దుబాయ్ నివాస జనాభా 45.8 లక్షలకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఒక్క సంవత్సరంలోనే 3.32 లక్షల మంది  దాదాపు 7.5శాతం  పెరిగారు. అలాగే 144 ఏళ్ల క్రితం  12వేలుగా  ఉన్న జనాభా ఇపుడు  45.8 లక్షలను  అధిగమించింది.

దుబాయ్‌లో శాశ్వతంగా ఉండే నివాసితులు 45.8 లక్షల మంది కాగా, పగటిపూట రద్దీ వేళల్లో వ్యాపారులు, పర్యాటకులు, విద్యార్థులతో కలిపి ఈ సంఖ్య 63.92 లక్షలకు చేరుతోంది. ప్రతిరోజూ సగటున 18.12 లక్షల మంది తాత్కాలికంగా దుబాయ్‌ను సందర్శిస్తున్నారు. దీనివల్ల రవాణా, విద్యుత్, ఆరోగ్య రంగాలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. 

ఇదీ  చదవండి: 'మిషన్ మంగళ్’నటికి చేదు అనుభవం : లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

భారీ వృద్ధి రేటు
దుబాచ్‌ ఎడారి దేశం అనేది ఒకప్పటి మాట. నేడు ప్రపంచంలోనే  ఎన్నో వింతలు, ఎత్తైన భవనాలు అత్యంత ఆధునిక, ధగధగలాడే మహా నగరంగా మారింది.  రియల్‌ ఎస్టేట్‌రంగంలో పరుగులు పెడుతోంది. అరేబియా ఎడారిలో ఉన్న ఈ నగరం అద్భుతమైన భవనాలు, కృత్రిమ ద్వీపాలతో గ్లోబల్ టూరిజంలో దూసుకుపోతోంది.  2025లో దుబాయ్ జీడీపీ 5.4శాతం  వృద్ధి చెందగా, 1.96 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించారు. దుబాయ్ విమానాశ్రయం ద్వారా దాదాపు 9.6 కోట్ల మంది ప్రయాణించారు.

ఇదీ చదవండి : భార్యతో జస్ట్‌ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు

అసలేంటీ AI,  ఎలా పనిచేస్తుంది?
కొనేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా లెక్కలకు బదులుగా, ప్రభుత్వ సంస్థల అడ్మినిస్ట్రేటివ్ రికార్డులను సురక్షిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో అనుసంధానిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),  మెషిన్ లెర్నింగ్ ద్వారా నివాస గృహాలు, విద్య, వైద్యం, రవాణా అవసరాలను ముందే అంచనా వేస్తారు. GDRFA, RTA, DEWA, DHA వంటి అనేక దుబాయ్ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసి ఈ డేటాను అందిస్తాయి.

ఇదీ చదవండి: బెల్జియంలో గర్బా : పారిశ్రామిక వేత్త హర్ష్‌ గోయెంకా స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement