టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane Retirement) కీలక నిర్ణయం తీసుకున్నాడు. 38 ఏళ్ల రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఈ ముంబై క్రికెటర్ గురువారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
రహానే భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై 2-1తో తేడాతో ఓడించి భారత్‌కు ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(2020-21) అందించిన ఘనత అతడిది.
రహానే తన 15 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరపున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 8414 పరుగులు చేశాడు.
Photo Credit : Ajinkya Rahane (facebook)


