cricket
-
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 విజేత ఫార్చూన్ బారిషల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన ఫైనల్లో బారిషల్.. చిట్టగాంగ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చిట్టగాంగ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు ఖ్వాజా నఫే (66), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (78 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఆతర్వాత వచ్చిన గ్రహం క్లార్క్ (44) కూడా రాణించడంతో కింగ్స్ భారీ స్కోర్ చేసింది. బారిషల్ బౌలర్లలో మొహమ్మద్ అలీ, ఎబాదత్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్‌కు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (54), తౌహిద్ హృదోయ్ (320 శుభారంభాన్ని అందించారు. అనంతరం కైల్ మేయర్స్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి బారిషల్ను విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (18 నాటౌట్) రెండు సిక్సర్లు బాది బారిషల్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. మరో మూడు బంతులు మిగిలుండగానే బారిషల్ విజయతీరాలకు చేరింది. కింగ్స్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం 4 వికెట్లు తీసి బారిషల్ను భయపెట్టాడు. నయీమ్ ఇస్లాం 2, బినుర ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ఫార్చూన్ బారిషల్ టైటిల్ సాధించడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం. -
IPL 2025: IPL కప్ మనదేనా?
-
IND vs ENG: 1 టికెట్ ప్లీజ్!
భువనేశ్వర్: కటక్ బారాబటి స్టేడియంలో ఈ నెల 9న జరగనున్న భారత్, ఇంగ్లాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి టికెట్ల విక్రయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో చేరుకుని రాత్రంతా పడిగాపులు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కౌంటర్లో విక్రయించే టిక్కెట్లు కోసం అర్ధరాత్రి నుంచి జనాలు చేరడంతో ఒకానొక సమయంలో తొక్కిసలాట పరిస్థితి చోటు చేసుకుంది. 4 కౌంటర్లు.. 12 వేల టికెట్లు టిక్కెట్ల విక్రయానికి 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 12 వేల టికెట్లు విక్రయించారు. రద్దీ నియంత్రణ కోసం పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆన్లైన్లో టికెట్లు దక్కించుకోలేని క్రికెట్ అభిమానులు వాటిని ఆఫ్‌లైన్‌లో కొనాలని ఎగబాకడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. స్పెషల్ ఎన్‌క్లోజర్, ఏసీ గ్యాలరీ, న్యూ పెవిలియన్, కార్పొరేట్ బాక్స్ టిక్కెట్ల గురప్రు గేట్ ప్రాంగణంలో టికెట్లు విక్రయించారు. మిగిలిన అన్ని గ్యాలరీ టికెట్లను కిల్ఖానా లేక్‌లోని 3 కౌంటర్లలో విక్రయానికి ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా మహిళా ప్రేక్షకుల కోసం ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సులు.. బారాబటి స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్ పురస్కరించుకుని కటక్ నగరంలో పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా స్టేడియం లోపల, వెలుపల గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. కటక్ నగర పాలక సంస్థ స్టేడియం పరిసరాల్లో సుందరీకరణ, పారిశుధ్యం, ఫాగింగ్ కార్యకలాపాలను చేపడుతోంది. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశంలో మ్యాచ్ సన్నాహాలను సమీక్షించారు. కటక్ జిల్లా యంత్రాంగం, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ), ఒడిశా ఒలింపిక్ అసోసియేషన్, పోలీసు, ఆరోగ్య విభాగాలు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
టీమిండియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. జేమీ స్మిత్ భారత్‌తో ఇటీవల జరిగిన మూడో టీ20 సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను చికిత్స తీసుకుంటున్నాడు. తొలి వన్డేకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండగా.. జేమీ స్మిత్ ఇంకా కోలుకోలేదు. దీంతో అతను తొలి రెండు వన్డేలకు దూరం కానున్నాడని తెలుస్తుంది. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. భారత్‌తో వన్డే సిరీస్‌లో స్మిత్ లేకపోయినా ఇంగ్లండ్‌కు మరో రెండు వికెట్‌కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్‌లలో ఎవరో ఒకరు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే బట్లర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటివరకు వికెట్‌కీపింగ్ చేయలేదు. మరోవైపు సాల్ట్‌కు వన్డేల్లో పెద్దగా వికెట్‌కీపింగ్ చేసిన అనుభవం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి.కాగా, భారత్‌తో తాజాగా ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ 1-4 తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో పరాభవం తర్వాత ఇంగ్లండ్ కోలుకోవాలని చూస్తుంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌కు ఇదే ఆఖరి వన్డే సిరీస్. ఈ సిరీస్‌లో సత్తా చాటి ఛాంపియన్స్ ట్రోఫీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఇంగ్లండ్ వన్డే జట్టులో స్టార్ ఆటగాడు జో రూట్ చేరాడు. రూట్ చేరికతో ఇంగ్లండ్ బలం పెరుగుతుంది.ఫిబ్రవరి 6 నుంచి మొదలుభారత్తో తొలి వన్డే నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 6న జరుగనుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు కటక్, అహ్మదాబాద్ వేదికలు కానున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ -
World Cancer Day: క్యాన్సర్‌ను జయించిన క్రికెట్ యోధులు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) (ఫిబ్రవరి 4) నాడు ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడి గెలిచిన ఐదురుగు స్టార్ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. క్రికెటర్లకు సంబంధించి క్యాన్సర్ (Cancer) పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు యువరాజ్ సింగ్(Yuvraj SIngh). ఈ టీమిండియా మాజీ క్రికెటర్ 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో క్యాన్సర్‌తో బాధ పడ్డాడు.ఆ సమయంలో యువరాజ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో బరిలోకి దిగి భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. ఆ టోర్నీలో యువీ 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు.ప్రపంచ కప్ గెలిచిన వెంటనే యువరాజ్‌కు ఊపిరితిత్తులలో అరుదైన జెర్మ్ సెల్ కణితి (క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతను అమెరికాలో కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆ సమయంలో యువీ నెలల తరబడి తీవ్రమైన నొప్పి మరియు మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నాడు. 2012లో అతను క్యాన్సర్‌ను జయించి యోధుడిలా తిరిగి భారత జట్టులో చేరాడు. యువీ ప్రయాణం క్రికెట్ యొక్క గొప్ప పునరాగమన కథలలో ఒకటిగా మిగిలిపోయింది.మైఖేల్ క్లార్క్: 43 ఏళ్ల ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ చర్మ క్యాన్సర్‌పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా గొప్ప కెప్టెన్లలో ఒకరైన క్లార్క్‌కు 2006లో క్యాన్సర్ బయటపడింది. వైద్యులు అతని ముఖం, ఛాతీ, నుదిటిపై క్యాన్సర్ మచ్చలను గుర్తించారు. వీటిని తొలగించేందుకు క్లార్క్ అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. క్లార్క్ కెరీర్ ఆరంభంలోనే క్యాన్సర్‌పై విజయం సాధించి విజయవంతంగా తన కెరీర్‌ను కొనసాగించాడు. క్లార్క్ ఆసీస్ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడి 17000 పైచిలుకు పరుగులు చేశాడు.మార్టిన్ క్రో: ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ యుక్త వయసులో ఉండగానే క్యాన్సర్‌తో పోరాడాడు. అతనికి లింఫోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. క్యాన్సర్ నుంచి బయట్ట పడ్డాక క్రో తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చాడు. అయితే అతనికి రెండోసారి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు కూడా అతను ప్రాణాంతక వ్యాధితో పోరాడే ప్రయత్నం చేశాడు. అయితే 2016లో అతను విషాదకర రీతిలో మరణించాడు. మార్టిన్ క్రోకు క్లాసికల్ బ్యాటర్‌గా గుర్తింపు ఉంది. క్రో 1982-95 మధ్యలో న్యూజిలాండ్ తరఫున 77 టెస్ట్‌లు, 143 వన్డేలు ఆడి 10000 పైచిలుకు పరుగులు చేశాడు.గ్రేమ్ పొల్లాక్: ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్‌కు ఆ దేశ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాటర్‌గా పేరుంది. గ్రేమ్ పొల్లాక్ 1963-70 మధ్యలో ప్రపంచంలోనే మేటి బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున 23 టెస్ట్‌లు ఆడిన పొల్లాక్ 7 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 2256 పరుగులు చేశాడు. 2013లో పొల్లాక్కు కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ సమయంలో అతను క్యాన్సర్‌తో పోరాడి గెలిచాడు. ప్రస్తుతం పొల్లాక్ 80 ఏళ్ల వయసులో జీవనం కొనసాగిస్తున్నాడు.జెఫ్రీ బాయ్‌కాట్: ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనర్.. 1990, 2000 దశకాల్లో ప్రముఖ వ్యాఖ్యాత అయిన జెఫ్రీ బాయ్‌కాట్ గొంతు క్యాన్సర్‌పై విజయం సాధించాడు. అతను 35 కఠినమైన రేడియోథెరపీ సెషన్లు చేయించుకున్నాడు. రేడియోథెరపీ సమయంలో బాయ్‌కాట్ తీవ్రమైన నొప్పిని ఎదుర్కొన్నాడు. క్యాన్సర్‌ను జయించాక బాయ్‌కాట్ తిరిగి వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. ప్రస్తుతం బాయ్‌కాట్ వయసు 84 ఏళ్లు. -
ముంబయిలో క్రికెట్ ఆడిన బ్రిటన్ మాజీ ప్రధాని
ముంబయి:బ్రిటన్ మాజీ ప్రధాని,ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ ఆదివారం(ఫిబ్రవరి2) ముంబయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ ముంబయిలోని పార్సీ జింఖానా గ్రౌండ్లో కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ విషయమై ఆయన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడకుండా తన ముంబయి పర్యటన ఎప్పుడూ ఉండదని తెలిపారు.రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఐదు రోజులపాటు జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు రిషి సునాక్ భారత్‌కు వచ్చారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శనివారం సాయంత్రం ముంబయికి చేరుకున్నారు.ఆదివారం ఉదయం ఇక్కడి పార్సీ జింఖానా మైదానానికి వెళ్లారు.క్లబ్ వార్షికోత్సవాల నేపథ్యంలో అక్కడికి వచ్చిన వారితో కాసేపు ముచ్చటించారు. క్లబ్ సాధించిన విజయాల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం బ్యాట్ పట్టుకుని టెన్నిస్‌బాల్‌తో కాసేపు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ జట్టు ప్రకటన.. ముగ్గురిపై వేటు
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025), దానికి ముందు స్వదేశంలో జరిగే ముక్కోణపు సిరీస్ కోసం 15 మంది సభ్యుల పాకిస్తాన్ (Pakistan) జట్టును ఇవాళ (జనవరి 31) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మొహమ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan) వ్యవహరించనుండగా.. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) సల్మాన్ అలీ అఘా ఉండనున్నాడు. గతేడాది చివర్లో సౌతాఫ్రికాతో ఆడిన పాక్ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయపడిన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ సైమ్ అయూబ్ ఈ జట్టుకు ఎంపిక కాలేదు. ఫామ్‌లో లేని అబ్దుల్లా షఫీక్, మెహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సుఫియాన్ ముఖీమ్‌లపై పాక్ సెలెక్టర్లు వేటు వేశారు. పైన పేర్కొన్న నలుగురి స్థానాల్లో ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, ఖుష్దిల్ షా, సౌద్ షకీల్ జట్టులోకి వచ్చారు. ఈ జట్టులో 2017 టైటిల్ (ఛాంపియన్స్ ట్రోఫీ) విన్నింగ్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు (బాబర్ ఆజం, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్) చోటు దక్కించుకున్నారు. పాక్ జట్టు పేస్ విభాగాన్ని షాహీన్ అఫ్రిది ముందుండి నడిపించనున్నాడు. ఈ జట్టు పేస్ దళంలో మొహమ్మద్ హస్నైన్, నసీం షా, హరీస్ రౌఫ్ ఉన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 8న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ సిరీస్‌లో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన తొలి రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ పాక్, దుబాయ్ వేదికలుగా జరుగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాక్.. ఫిబ్రవరి 19న జరిగే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 20న భారత్.. బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా 2017లో జరిగింది. నాటి ఎడిషన్‌లో పాక్ విజేతగా నిలిచింది. త్వరలో ప్రారంభమయ్యే ఎడిషన్‌లో పాక్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.ముక్కోణపు సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్ జట్టు:మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది. -
డేవిడ్ మలాన్ ఊచకోత.. 39 బంతుల్లోనే ముగిసిన మ్యాచ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో ఇవాళ (జనవరి 29) ఓ వన్ సైడెడ్ మ్యాచ్ జరిగింది. ఢాకా క్యాపిటల్స్‌పై ఫార్చూన్ బారిషల్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 22 ఓవర్లలో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ 15.3 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌటైంది. బారిషల్ బౌలర్లు మొహమ్మద్ నబీ (4-0-9-3), తన్వీర్ ఇస్లామ్ (2-1-2-3), ఫహీమ్ అష్రాఫ్ (2.3-0-15-3) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు పోటీపడి వికెట్లు తీశారు. ముగ్గురూ తలో మూడు వికెట్లు తీశారు. జేమ్స్ ఫుల్లర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. లిటన్ దాస్, రోన్స్ఫర్డ్ బీటన్ తలో 10 పరుగులు చేయగా.. కెప్టెన్ తిసార పెరీరా అత్యధికంగా 15 పరుగులు సాధించాడు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో (11) వచ్చాయి. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు, ఓ సిక్సర్ మాత్రమే నమోదయ్యాయి.మలాన్ ఊచకోత74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్.. డేవిడ్ మలాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడటంతో 6.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది (వికెట్ కోల్పోయి). మలాన్‌కు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కూడా తోడవ్వడంతో మ్యాచ్ తొందరగా ముగిసింది. తమీమ్ 14 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బారిషల్ ఇన్నింగ్స్‌లో తౌహిద్ హృదోయ్ 9 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. తౌహిద్ వికెట్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు దక్కింది. ఈ గెలుపుతో బారిషల్ రంగ్పైర్ రైడర్స్‌ను వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. క్యాపిటల్స్ 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు డేవిడ్ మలాన్ బీపీఎల్ ఫ్రాంచైజీలను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. మీ దగ్గర డబ్బుంటేనే ఫ్రాంచైజీలను తీసుకోండి. లేదంటే ఊరకనే ఉండండంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత బీపీఎల్ సీజన్లో కొన్ని ఫ్రాంచైజీలు విదేశీ ఆటగాళ్లకు రెమ్యూనరేషన్ చెల్లించడంలో జాప్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మలాన్ ఈ కామెంట్స్ చేశాడు. కొద్ది రోజుల కిందట దర్బార్ రాజ్‌షాహీ ఫ్రాంచైజీకి చెందిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులు చెల్లించని కారణంగా ఓ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశాయి. ఆ మ్యాచ్‌లో రాజ్‌షాహీ ఫ్రాంచైజీ స్వదేశీ ఆటగాళ్లను మాత్రమే బరిలోకి దించింది. -
క్రికెట్ చరిత్రలో అసాధారణ రనౌట్
క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన రనౌట్ నమోదైంది. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అండర్-19 జట్టు ఆటగాడు ఆర్యన్ సావంత్ అసాధారణ రీతిలో రనౌటయ్యాడు. మ్యాచ్ 3వ రోజు సావంత్ 11 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ జేసన్ రౌల్స్ వేసిన బంతిని స్లాగ్-స్వీప్ చేశాడు. అయితే బంతి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జోరిచ్ వాన్ షాల్క్విక్ హెల్మెట్‌ను బలంగా తాకి, స్టంప్స్‌పైకి తిరిగి వచ్చింది. ఆ సమయంలో సావంత్ క్రీజ్ బయట ఉన్నాడు. సెకెన్ల వ్యవధిలో జరిగిపోయిన ఈ తంతు చూసి కొందరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రనౌట్‌కు అప్పీల్ చేయగా.. మరికొందరు బంతి హెల్మెట్‌కు తాకి గాయపడిన జోరిచ్ను పరామర్శించే పనిలో పడ్డారు. The first and last time you'll see a run out like this... @collinsadam pic.twitter.com/ZIEFI8s1Te— Brent W (@brentsw3) January 28, 2025దక్షిణాఫ్రికా ఫీల్డర్ల అప్పీల్‌తో ఔటయ్యానన్న విషయాన్ని గ్రహించిన సావంత్ మెల్లగా పెవిలియన్ బాట పట్టగా.. బంతి బలంగా తాకడంతో జోరిచ్ మైదానంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గాయపడిన జోరిచ్ను హుటాహుటిన అసుపత్రికి తరలించారు. జోరిచ్కు ఎలాంటి అపాయం కలగలేదని తదనంతరం దక్షిణాఫ్రికా మేనేజ్మెంట్ వెల్లడించింది. సావంత్ అసాధారణ రీతిలో రనౌటైన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.కాగా, ఈ మ్యాచ్‌లో సావంత్ ఔటయ్యే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ను కొనసాగించిన ఇంగ్లండ్, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే 20 పరుగులు వెనుకపడ్డ ఇంగ్లండ్ ప్రస్తుతం 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో థామస్ ర్యూ (71) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఫర్హాన్ అహ్మద్, జాక్ హోమ్ అర్ద సెంచరీలతో రాణించారు. బదులుగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తరఫున ముహమ్మద్ బుల్బులియా, జేసన్ రౌల్స్ అర్ద సెంచరీలు చేశారు. -
స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత.. 10000 పరుగుల క్లబ్లో చేరిక
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో 10000 పరుగుల క్లబ్లో చేరాడు. గాలే వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 29) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో స్టీవ్ ఈ ఘనత సాధించాడు. 9999 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టీవ్.. తొలి బంతికే 10000 పరుగుల మార్కును అందుకున్నాడు. స్టీవ్ ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. స్టీవ్‌కు ముందు రికీ పాంటింగ్ (13378), అలెన్ బోర్డర్ (11174), స్టీవ్ వా (10927) ఈ ఘనత సాధించారు. 10000 పరుగుల మార్కును తన 205వ ఇన్నింగ్స్‌లో అధిగమించిన స్టీవ్.. బ్రియాన్ లారా (195), సచిన్ టెండూల్కర్ (195), కుమార సంగక్కర (195), రికీ పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) ఈ ఫీట్‌ను సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.There it is!Steve Smith is the fourth Australian to reach 10,000 Test runs 🙌#SLvAUS pic.twitter.com/06FLk8iqMI— 7Cricket (@7Cricket) January 29, 2025టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (12972) తర్వాత స్టీవ్ స్మిత్ ఒక్కడే 10000 పరుగుల క్లబ్లో చేరాడు. స్టీవ్ సమకాలీకులు కేన్ విలియమ్సన్ (9276), విరాట్ కోహ్లి (9230) ఇంకా 9000 పరుగుల క్లబ్‌లోనే ఉన్నారు. రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ (Kane Williamson), విరాట్ కోహ్లిలను (Virat Kohli) ఈ జమానా ఫాబ్ ఫోర్‌గా కీర్తిస్తారు. స్టీవ్ తన 115 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 205 ఇన్నింగ్స్‌లు ఆడి 56.18 సగటున 10056* పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు, 34 సెంచరీలు, 42 అర్ద సెంచరీలు ఉన్నాయి.శ్రీలంకతో మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ 74 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 51 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (102 నాటౌట్) చాలాకాలం తర్వాత సెంచరీతో మెరువగా, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్ అర్ద సెంచరీలతో రాణించారు. హెడ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి 40 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా తన సెంచరీలో 8 బౌండరీలు, ఓ సిక్సర్ కొట్టాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్యకు హెడ్ వికెట్ దక్కగా.. జెఫ్రీ వాండర్సేకు లబూషేన్ (20) వికెట్ దక్కింది.కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (రెండు వన్డేలు కూడా) కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్ ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. జూన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్.. సౌతాఫ్రికాతో ఆమీతుమీ తేల్చుకోనుంది.శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా కమిన్స్ ఈ సిరీస్‌లో పాల్గొనడం లేదు. ఈ కారణంగా స్టీవ్ స్మిత్ ఆసీస్‌కు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఈ సిరీస్‌లో ట్రవిస్ హెడ్‌కు ప్రమోషన్ లభించింది. మిడిలార్డర్ బ్యాటింగ్‌కు దిగే హెడ్.. తొలి టెస్ట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే హెడ్ ఓపెనింగ్ స్థానంలో తనదైన మార్కును చూపించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగే హెడ్.. ఇక్కడ కూడా అదే తరహా చెలరేగిపోయాడు. -
2024 ఐసీసీ అవార్డుల విజేతలు వీరే..!
2024 ఐసీసీ అవార్డుల ప్రకటన ప్రక్రియ జనవరి 24న మొదలై, ఇవాల్టితో (జనవరి 28) ముగిసింది. మూడు ఫార్మాట్లలో పురుషులు, మహిళల విభాగాల్లో వ్యక్తిగత అవార్డులతో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను రివీల్ చేశారు. గతేడాదికి సంబంధించి మొత్తం 12 వ్యక్తిగత అవార్డులు, 5 ఐదు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ప్రకటించబడ్డాయి.వ్యక్తిగత విభాగాల్లో ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)-జస్ప్రీత్ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, జో రూట్)ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (రేచల్ హెహోయ్ ఫ్లింట్ ట్రోఫీ)-మేలీ కెర్ (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, లారా వోల్వార్డ్ట్)ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జో రూట్)ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధన (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, లారా వోల్వార్డ్ట్)ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ (నామినీలు- వనిందు హసరంగ, కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్)ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ (నామినీలు-సస్కియా హోర్లీ, శ్రేయాంక పాటిల్, ఫ్రేయా సర్జెంట్)ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ (నామినీలు-సైమ్ అయూబ్, గస్ అట్కిన్సన్, షమార్ జోసఫ్)ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ (నామినీలు-బాబర్ ఆజమ్, ట్రవిస్ హెడ్, సికందర్ రజా)ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ (నామినీలు- చమారీ ఆటపట్టు, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, లారా వోల్వార్డ్ట్)ఫార్మాట్ల వారీగా టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు..ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగ, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్. -
సెంచరీతో రికార్డ్ సాధించిన భద్రాచలం యువతి త్రిష
-
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా
-
PAK VS WI 2nd Test: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఏకంగా 20 వికెట్లు పడ్డాయి. ఆసియా ఖండంలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. గతంలో ఎన్నడూ ఆసియా పిచ్‌లపై తొలి రోజే 20 వికెట్లు పడలేదు. తొలి రోజు పడిన వికెట్లలో 16 స్సిన్నర్లకు దక్కగా.. 4 పేస్ బౌలర్లు పడగొట్టారు.ఈ మ్యాచ్ తొలి రోజు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 163 పరుగులకు ఆలౌటైంది. నౌమన్ అలీ హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డి విరిచాడు. సాజిద్ ఖాన్ 2, అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు గడకేశ్ మోటీ (55), కీమర్ రోచ్ (25), గోమెల్ వార్రికన్ (36 నాటౌట్), కవెమ్ హాడ్జ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. గోమెల్ వార్రికన్ 4, గుడకేశ్ మోటీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌద్ షకీల్ 32 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 15, ముహమ్మద్ హురైరా 9, బాబర్ ఆజమ్ 1, కమ్రాన్ గులామ్ 16, సల్మాన్ అఘా 9, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 16 (నాటౌట్), అబ్రార్ అహ్మద్ 2, కషిఫ్ అలీ డకౌటయ్యారు.9 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బ్రాత్‌వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురైరా (2), కమ్రాన్ గులామ్ (19) నిరాశపరచగా.. బాబర్ ఆజమ్ (31) మరోసారి లభించిన శుభారంభాన్ని భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు.సౌద్ షకీల్ (13)తో పాటు కషిఫ్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే మరో 178 పరుగులు చేయాలి. విండీస్ బౌలర్లలో కెవిన్ సింక్లెయిర్ రెండు వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రికన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి టెస్ట్‌లో 127 పరుగుల తేడాతో నెగ్గింది. -
విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..?
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 20 ఏళ్ల తన వైవాహిక బంధానికి స్వస్తి పలుకనున్నట్లు తెలుస్తుంది. సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్‌తో విడాకులు తీసుకోనున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వార్త నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. సెహ్వాగ్, ఆర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తుంది. గత దీపావళి రోజున సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫోటోలు షేర్ చేయడం.. సెహ్వాగ్ ఒంటరిగానే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం విడాకుల ప్రచారానికి బలం చేకూరుస్తుంది. కొడుకులు ఇద్దరూ క్రికెట్లో రాణిస్తున్నారుసెహ్వాగ్కు 2004లో ఆర్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. ఆర్యవీర్, వేదాంత్. వీరిద్దరూ తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు.అర్యవీర్.. గతేడాది నవంబర్‌లో జరిగిన అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించే ఆర్యవీర్.. మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 229 బంతుల్లోనే 34 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 200 పరుగులు చేశాడు.రెండో కుమారుడు వేదాంత్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. వేదాంత్.. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తూ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ సీజన్లో వేదాంత్ 24 వికెట్లు పడగొట్టి.. ఢిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇందులో రెండు 5 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.ఆర్తి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసిందిఆర్తి.. సెహ్వాగ్ కంటే రెండేళ్లు చిన్నది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసింది. ఆర్తి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది. ఆర్తి భారతీయ విద్యా భవన్లో చదువుకుంది. సెహ్వాగ్-ఆర్తిల వివాహం దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇంట్లో జరిగింది. విడాకుల ప్రచారంపై సెహ్వాగ్ కాని, ఆర్తి కాని ఇప్పటివరకు స్పందించలేదు.భారత క్రికెట్ సర్కిల్స్‌లో వరుస విడాకుల వార్తలుకాగా, ఇటీవలికాలంలో భారత క్రికెట్ సర్కిల్లో విడాకుల వార్తలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. విడాకుల ప్రచారాన్ని చహల్, ధనశ్రీ ఖండించకపోవడంతో ఈ వార్త నిజమేనని తెలుస్తుంది. మరో భారత క్రికెటర్ మనీశ్ పాండే కూడా తన భార్య అశ్రిత షెట్టి నుంచి విడిపోబోతున్నాడని తెలుస్తుంది. మనీశ్, అశ్రిత్ సైతం సెహ్వాగ్-ఆర్తి, చహల్-ధనశ్రీ తరహాలో సోషల్‌మీడియాలో ఒకరినొకరు అన్ఫాల్లో చేసుకున్నారు. వీరిద్దరికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఇదే డ్రామా నడిచింది. అయితే హార్దిక్, అతని భార్య నటాషా ఒకరినొకరు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హార్దిక్‌కు ముందు షమీ, శిఖర్ ధవన్ కూడా తమతమ భార్యలతో విడాకులు తీసుకున్నారు.సెహ్వాగ్ క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. సెహ్వాగ్‌ను క్రికెట్ సర్కిల్స్‌లో ముద్దుగా నజఫ్ఘడ్ నవాబ్, వీరూ అని పిలుస్తారు. వీరూ 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేసి 2013లో రిటైరయ్యాడు. సెహ్వాగ్ తన కెరీర్లో 104 టెస్ట్‌లు, 251 వన్డేలు, 19 టీ20 ఆడి 17000కు పైగా పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన సెహ్వాగ్ భారత్ తరఫున 136 వికెట్లు తీశాడు. సెహ్వాగ్ కెరీర్లో 23 టెస్ట్ సెంచరీలు, 15 వన్డే సెంచరీలు ఉన్నాయి. సెహ్వాగ్ టెస్ట్‌ల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ చేశాడు. -
చరిత్ర సృష్టించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ లయన్స్ (అండర్-19 జట్టు) తరఫున సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. రాకీ 16 ఏళ్ల 291 రోజుల వయసులో లయన్స్ తరఫున సెంచరీ చేశాడు. 16 YEARS OLD ROCKY FLINTOFF SMASHED A BRILLIANT HUNDRED..!!!!! ⭐Andrew Flintoff's son Rocky Flintoff is 16 years old and he smashed a magnificent Hundred for England Lions vs Cricket Australia XI.- ROCKY, A STAR IS BORN..!!!! pic.twitter.com/UB0STrNET8— Tanuj Singh (@ImTanujSingh) January 23, 2025ఇక్కడ మరో విశేషమేమిటంటే.. రాకీ స్వయానా తన తండ్రి రికార్డునే బద్దలు కొట్టాడు. రాకీకి ముందు లయన్స్ తరఫున అతి చిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు ఆండ్రూ ఫ్లింటాఫ్ పేరిట ఉండేది. ఆండ్రూ ఫ్లింటాఫ్ 20 ఏళ్ల 28 రోజుల వయసులో లయన్స్ తరఫున సెంచరీ చేశాడు.క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాకీ సెంచరీ చేశాడు. రాకీకి లయన్స్ తరఫున ఇదే తొలి సెంచరీ. ఈ మ్యాచ్‌లో రాకీ తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగి కష్టాల్లో ఉన్న తన జట్టును (161/7) గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో) రాకీ 127 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు.🚨 ANDREW FLINTOFF SON ROCKY FLINTOFF CREATED HISTORY 🚨 - Rocky Flintoff becomes the youngest player to score a Maiden for England Lions (16 Year age). 🤯pic.twitter.com/1oL1QpoGO8— Tanuj Singh (@ImTanujSingh) January 23, 2025రాకీ సెంచరీతో సత్తా చాటడంతో లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఆస్ట్రేలియా ఎలెవెన్ 214 పరుగులకే చాపచుట్టేసింది. రాకీ హీరోయిక్ ఇన్నింగ్స్ కారణంగా లయన్స్‌కు 102 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.కాగా, ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో మూడు నాలుగు రోజుల మ్యాచ్‌ల సిరీస్ కోసం లయన్స్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో లయన్స్ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఆ మ్యాచ్‌లో రాకీ తొలి ఇన్నింగ్స్‌లో 19, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో లయన్స్‌కు రాకీ తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్ హెడ్ కోచ్ కావడం గమనార్హం. ఈ సిరీస్‌లో లయన్స్ తరఫున ఐదుగురు ఇంగ్లండ్ సీనియర్ జట్టు ఆటగాళ్లు (షోయబ్ బషీర్, పాట్ బ్రౌన్, టామ్ హార్ట్లీ, జోష్ టంగ్, జాన్ టర్నర్ ఆడుతున్నారు. -
రంజీ బాట పట్టిన మరో టీమిండియా స్టార్ ప్లేయర్
టీమిండియా స్టార్ ప్లేయర్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ (ముంబై), యశస్వి జైస్వాల్ (ముంబై), శుభ్‌మన్ గిల్ (పంజాబ్), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), శ్రేయస్ అయ్యర్ (ముంబై) తమతమ జట్ల తరఫున బరిలోకి దిగారు. జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌లో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (ఢిల్లీ) కూడా బరిలోకి దిగుతానని ప్రకటించాడు. తాజాగా మరో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. రాహుల్ కర్ణాటక తరఫున బరిలోకి దిగుతాడు. కర్ణాటక జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహిస్తాడు. ఈనెల 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కర్ణాటక.. హర్యానాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కర్ణాటక హోం గ్రౌండ్ అయిన చిన్న స్వామి స్టేడియంలో జరుగుతుంది.కాగా, రాహుల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన తన సహచరులు రోహిత్, యశస్వి, గిల్, పంత్, జడేజాలతో పాటు రంజీ బరిలో దిగాల్సి ఉండింది. అయితే మోచేతి గాయం కారణంగా అతను ఇవాళ (జనవరి 23) ప్రారంభమైన మ్యాచ్‌కు దూరమయ్యాడు. విరాట్ కోహ్లి సైతం గాయం కారణంగానే ఇవాళ మొదలైన మ్యాచ్‌కు అందుబాటులో లేడు.ఇదిలా ఉంటే, ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పకుండా ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన విషయం తెలిసిందే. రంజీల్లో ఆడటం తప్పనిసరి చేసిన నేపథ్యంలో గత్యంతరం లేక భారత ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు. టీమిండియా స్టార్లంతా విఫలం.. ఒక్క జడేజా తప్ప..!రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్లంతా దారుణంగా విఫలమయ్యారు. వేర్వేరు జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ ఆటగాళ్లలో ఒక్క రవీంద్ర జడేజా మాత్రమే సత్తా చాటాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.రంజీల మాట అటుంచితే, ప్రస్తుతం భారత టీ20 జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 22) జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జోస్ బట్లర్ (68) ఒక్కడే రాణించాడు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి (4-0-23-3), అర్షదీప్ సింగ్ (4-0-17-2), అక్షర్ పటేల్ (4-1-22-2), హార్దిక్ పాండ్యా (4-0-42-2) అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు సంజూ శాంసన్ (26), అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) నిరాశపరిచినా తిలక్ వర్మ (19), హార్దిక్ పాండ్యా (3) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. కేవలం 12.5 ఓవర్లలోనే (3 వికెట్లు) భారత్ గెలుపు తీరాలు తాకింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తదుపరి టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరుగనుంది. -
IND VS ENG 1st T20: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. అర్షదీప్ ఇవాళ (జనవరి 22) ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20లో ఐదు వికెట్లు తీస్తే.. పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. అర్షదీప్ ఇప్పటివరకు 60 మ్యాచ్‌లు ఆడి 2 నాలుగు వికెట్ల ఘనతల సాయంతో 95 వికెట్లు తీశాడు. వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అర్షదీప్ కంటే ఓ వికెట్ అధికంగా తీసి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. చహల్ 80 మ్యాచ్‌ల్లో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత సాయంతో 96 వికెట్లు తీశాడు.టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (టాప్-10)..యుజ్వేంద్ర చహల్-96అర్షదీప్ సింగ్-95భువనేశ్వర్ కుమార్-90జస్ప్రీత్ బుమ్రా-89హార్దిక్ పాండ్యా-89అశ్విన్-72కుల్దీప్ యాదవ్-69అక్షర్ పటేల్-65రవి బిష్ణోయ్-56రవీంద్ర జడేజా-54కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకు 24 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో భారత్ 13 మ్యాచ్‌ల్లో నెగ్గగా.. ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. భారత్ వేదికగా ఇరు జట్లు 11 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 6, ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తొలి టీ20కు వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ ఇప్పటివరకు 7 టీ20లు ఆడింది. ఇందులో భారత్ ఆరింట విజయాలు సాధించింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమిని ఎదుర్కొంది. ఆ ఒక్క ఓటమి భారత్ ఇంగ్లండ్ చేతుల్లోనే (2011) ఎదుర్కోవడం గమనార్హం.జట్ల బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో పాటు మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు ఉన్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు సహకరించనున్న నేపథ్యంలో తొలి టీ20లో పరుగుల వరద పారడం ఖాయం.భీకర ఫామ్‌లో తిలక్, సంజూటీమిండియా టాపార్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ, సంజూ శాంసన్ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో వీరిద్దరూ చెలరేగిపోయారు. తిలక్ చివరి రెండు టీ20ల్లో మెరుపు సెంచరీలు చేయగా.. సంజూ మొదటి, నాలుగు మ్యాచ్‌ల్లో శతక్కొట్టాడు. సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సంజూ సెంచరీ చేశాడు. సంజూ గత ఐదు టీ20ల్లో మూడు సెంచరీలు చేశాడు.ఇప్పటికే జట్టును ప్రకటించిన ఇంగ్లండ్తొలి టీ20 కోసం ఇంగ్లండ్ జట్టును నిన్ననే ప్రకటించారు. ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. కెప్టెన్ జోస్ బట్లర్‌తో పాటు ఫిల్ సాల్ట్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. యువ ఆటగాడు జేకబ్ బేతెల్ తొలిసారి భారత్‌తో తలపడనున్నాడు.ఇంగ్లండ్ తుది జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత తుది జట్టు (అంచనా): సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి -
బిగ్‌బాష్ లీగ్ ఫైనల్లో హరికేన్స్
బిగ్‌బాష్ లీగ్ 2025 ఎడిషన్ ఫైనల్లోకి హోబర్ట్ హరికేన్స్ ప్రవేశించింది. నిన్న (జనవరి 21) జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హరికేన్స్ సిడ్నీ సిక్సర్స్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (15 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కాలెబ్ జువెల్ (41 బంతుల్లో 40; 2 ఫోర్లు), బెన్ మెక్‌డెర్మాట్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. మథ్యూ వేడ్ 7 బంతుల్లో 4, నిఖిల్ చౌదరీ 11 బంతుల్లో 14, క్రిస్ జోర్డన్ 3 బంతుల్లో 2 (నాటౌట్), కెప్టెన్ నాథన్ ఇల్లిస్ 2 బంతుల్లో ఒక్క పరుగు చేశారు. సిక్సర్స్ బౌలర్లలో జాఫర్ చోహాన్, బెన్ డ్వార్షుయిస్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జాక్ ఎడ్వర్డ్స్, మిచెల్ పెర్రీ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సిక్సర్స్ 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సిక్సర్స్‌ను కర్టిస్ ప్యాటర్సన్ (33 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జోర్డన్ సిల్క్ (44 బంతుల్లో 57; 5 ఫోర్లు), లాచ్లన్ షా (25 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే హరికేన్స్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో వీరి ప్రయత్నం వృధా అయ్యింది. రిలే మెరిడిత్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గానన్ 3 ఓవర్లలో 10 పరుగులకు 2 వికెట్లు తీశాడు. నాథన్ ఇల్లిస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. సిక్సర్స్ బ్యాటర్లు జోష్ ఫిలిప్ (0), జాక్ ఎడ్వర్డ్ (0), కెప్టెన్ మోసస్ హెన్రిక్స్ (1) దారుణంగా విఫలమయ్యారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓడినా సిక్సర్స్‌కు మరో అవకాశం ఉంది. జనవరి 24న జరిగే ఛాలెంజర్‌లో నాకౌట్ విజేతతో తలపడుతుంది. ఇవాళ (జనవరి 22) జరుగబోయే నాకౌట్ మ్యాచ్‌లో సిడ్నీ థండర్, మెల్బోర్న్ స్టార్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో మెగా ఫైనల్ జనవరి 27న జరుగనుంది. ఛాలెంజర్ విజేతతో హరికేన్స్ ఫైనల్లో తలపడుతుంది. -
2032 ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌ను కొనసాగించాలి..!
లూసానే: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా మంగళవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్‌తో భేటీ అయ్యారు. త్వరలో లూసానేలోనే ఐఓసీ ఉన్నతస్థాయి అధికారులు పాల్గొనే అసాధారణ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మేటి క్రీడా కమిటీల చీఫ్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలాఖరున (30వ తేదీ) జరిగే ఈ కీలకమైన సమావేశంలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో కొనసాగించే అంశంపై చర్చ జరుగనుంది. దీంతో ఈ చర్చ కంటే ముందుగా జై షా, థామస్ బాచ్లు అ అంశంపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఐసీసీ సోషల్ మీడియాలో ఇద్దరి ఫొటోను పోస్ట్ చేసింది. ‘లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో టి20 ఫార్మాట్లో క్రికెట్ ఈవెంట్ జరగనుంది. అయితే 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటుందా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. దాంతో తదుపరి విశ్వక్రీడల్లోనూ క్రికెట్ క్రీడను కొనసాగించే విషయంపై ప్రాథమిక దశ సంప్రదింపులు మొదలయ్యాయి. ఐసీసీ చైర్మన్ జై షా ఈ అంశమై ఐఓసీ చీఫ్ బాచ్‌తో సమావేశమయ్యారు’ అని ఐసీసీ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. -
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం
భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. శ్రీలంకలో జరిగిన ఫైనల్లో భారత్ ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 118 పరుగులకే ఆలౌటైంది.The Celebrations of Team India after winning Physical Disabled Champions Trophy 2025. 🇮🇳- A WHOLESOME VIDEO..!!!! 🥹❤️pic.twitter.com/HJ9Ic38RgT— Tanuj Singh (@ImTanujSingh) January 21, 2025భారత దివ్యాంగ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన విషయాన్ని భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఎక్స్ వేదికగా ప్రకటించింది. కృషి, దృఢ సంకల్పం మరియు నైపుణ్యం యొక్క అసాధారణ ప్రదర్శన అంటూ కామెంట్ చేసింది.మెగా టోర్నీలో విక్రాంత్ కేనీ భారత జట్టును ముందుండి నడిపించాడు (కెప్టెన్‌గా). అద్భుతమైన జట్టును విజయపథంలో నడిపించడం నా కెరీర్‌కు గర్వకారణమని కేనీ అన్నాడు. ప్లేఆఫ్‌లో ప్రయాణం తమ జట్టులోని ప్రతిభ మరియు పోరాట స్ఫూర్తిని చూపిస్తుందని తెలిపాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఈ చారిత్రాత్మక విజయానికి దోహదపడ్డాడని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం భారతదేశం తరపున క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడికి చెందుతుందని అని DCCI విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉటంకించారు.యోగేంద్ర భదోరియా విధ్వంసంఫైనల్లో భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 40 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఐదు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. రాధికా ప్రసాద్ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కెప్టెన్ విక్రాంత్ కేనీ 3 ఓవర్లలో 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర సంటే 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాన్ని జట్టు ప్రధాన కోచ్ రోహిత్ జలానీ కొనియాడాడు. తన జట్టు అసాధారణ ప్రదర్శన మరియు సన్నద్ధతను ప్రశంసించాడు. టోర్నీ ఆధ్యాంతం తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని ఆకాశానికెత్తాడు. విభిన్న పరిస్థితుల్లో ఎదురైన ప్రతి సవాలును తమ ఆటగాళ్లు అధిగమించారని అన్నాడు. -
ఆ జట్టులో నితీశ్ రెడ్డి లేడు కారణం అదేనా
-
రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి.. అఫీషియల్ అప్డేట్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ (లోక్‌సభ) ప్రియా సరోజ్ పెళ్లాడబోతున్నారు. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ ధృవీకరించారు. రింకూ, ప్రియాల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తూఫానీ సరోజ్ తెలిపారు. ప్రస్తుతం ప్రియా తిరువనంతపురంలో జరుగుతున్న పార్లమెంటరీ కమిటీ మీటింగ్‌తో బిజీగా ఉందని తూఫానీ పేర్కొన్నారు. రింకూ కూడా త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే టీ20 సిరీస్ సన్నాహకాల్లో నిమగ్నమయ్యాడని అన్నారు. రింకూ, ప్రియాల నిశ్చితార్థం జరిగిందని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అనంతరం రింకూ, ప్రియా ఎంగేజ్మెంట్, పెళ్లి తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. లక్నోలో ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతుందని స్పష్టం చేశారు.కాగా, రింకూ సింగ్, ప్రియా సరోజ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని వారు డిసైడయ్యారు. తాజాగా ఇరువురి కుటుంబాలు పెళ్లికి అంగీకరించినట్లు ప్రియా తండ్రి వెల్లడించారు. స్నేహితురాలి తండ్రి ద్వారా ప్రియాకు రింకూతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది.27 ఏళ్ల రింకూ భారత్ తరఫున 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. 26 ఏళ్ల ప్రియా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచ్లిషెహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 జనరల్ ఎలెక్షన్స్‌లో ప్రియా సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీపీ సరోజ్‌పై 35000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ప్రియాకు ఇవే తొలి ఎన్నికలు. వారణాసికి చెందిన ప్రియా పాలిటిక్స్‌లోకి రాక ముందు 'లా'లో బ్యాచ్‌లర్ డిగ్రీ పొందింది. ప్రియా తన ఉన్నత చదువులను ఢిల్లీలో పూర్తి చేసింది. ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం అతను జౌన్పూర్ జిల్లాలోని కేరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రింకూ సింగ్ పాల్గొననున్నాడు. ఇందు కోసం అతను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. -
శతక్కొట్టిన టామ్ బాంటన్.. ముంబై ఇండియన్స్ తరఫున తొలి సెంచరీ
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2025 ఎడిషన్‌లో రెండో సెంచరీ నమోదైంది. షార్జా వైపర్స్‌తో నిన్న (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ ఆటగాడు టామ్ బాంటన్ శతక్కొట్టాడు. ఐఎల్టీ20 (ILT20) చరిత్రలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తరఫున ఇదే తొలి సెంచరీ. బాంటన్‌కు ముందు ఐఎల్టీ20లో కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీలు చేశారు. లీగ్ చరిత్రలో తొలి సెంచరీని టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (షార్జా వారియర్స్) చేయగా.. రెండో సెంచరీని అలెక్స్ హేల్స్ (డెజర్ట్ వైపర్స్) చేశాడు. లీగ్‌లో మూడో సెంచరీ ఇదే సీజన్లో నమోదైంది. సీజన్ నాలుగో మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌పై షాయ్ హోప్ (దుబాయ్ క్యాపిటల్స్) శతక్కొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. షార్జా వారియర్స్‌పై ఎంఐ ఎమిరేట్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్స్, ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ (42 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ అవిష్క ఫెర్నాండో (17 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. లూక్ వెల్స్ (18), కరీమ్ జనత్ (18), ఎథన్ డిసౌజా (11) రెండంకెల స్కోర్లు చేశారు. జేసన్ రాయ్ (1), రోహన్ ముస్తఫా (6), కీమో పాల్ (4), కెప్టెన్ సౌథీ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ రెండు, రొమారియో షెపర్డ్, వకార్ సలామ్కిల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన ఎంఐ ఎమిరేట్స్ 17.4 ఓవర్లలో ఆడుతూపాడుతూ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎమిరేట్స్ ఆదిలోనే ముహమ్మద్ వసీం (12) వికెట్ కోల్పోయినా, టామ్ బాంటన్ (55 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ కుసాల్ పెరీరా (42 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయమైన 157 పరుగులు జోడించారు. ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్ తరఫున ఇదే అత్యధిక భాగస్వామ్యం. లీగ్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఐఎల్టీ20లో డెసర్ట్ వైపర్స్ ఆటగాళ్లు కొలిన్ మున్రో, అలెక్స్ హేల్స్ నెలకొల్పిన 164 పరుగుల భాగస్వామ్యం ఏ వికెట్‌కైనా అత్యధికం. 2023 సీజన్లో మున్రో, హేల్స్ ఈ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ గెలుపుతో ఎమిరేట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. -
స్టార్ క్రికెటర్‌పై అరెస్టు వారెంట్
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై అరెస్టు వారెంట్ జారీ అయింది. అవామీ లీగ్ ఎంపీగానూ వ్యవహరించిన షకీబ్‌పై చెక్ బౌన్స్‌కు సంబంధించిన కేసులో ఢాకా న్యాయస్థానం చర్యలు తీసుకుంది. ‘అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జైదుర్ రహమాన్.. షకీబ్ అల్ హసన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేశారు. మార్చి 24 నాటి ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశించారు’ అని కోర్టు వర్గాలు వెల్లడించాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా గతేడాది బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగగా... ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వీడారు. ఆ సమయంలో జరిగిన గొడవల్లో షకీబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కాగా... అప్పటి నుంచి షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరిగి రాకుండా విదేశాల్లో ఉంటున్నాడు. స్వదేశంలో చివరి టెస్టు ఆడాలని షకీబ్ ఆశించినా... భద్రత ఏర్పాట్ల విషయంలో హామీ లభించకపోవడంతో అతడు వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్ ఎదుర్కొంటున్న షకీబ్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాంపియన్స్ ట్రోఫీకి పరిగణించలేదు.