ఆ్రస్టేలియా జాతీయ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడమంటే అంత ఆషామాషీ విషయం కాదనేది జగమెరిగిన సత్యం. విపరీతమైన పోటీని తట్టుకొని ఆ అవకాశం పొందడంతో పాటు పుష్కర కాలం జట్టుతో కొనసాగడం అంటే మామూలు మాటలా! అందులోనూ పాకిస్తాన్‌లో పుట్టి అక్కడి నుంచి వలస వచి్చన ముస్లిం ప్లేయర్‌కు ఇది సాధ్యమా అంటే ముమ్మాటికీ అసాధ్యం అనే చెప్పవచ్చు...
ఇలాంటి అసాధ్యాన్ని ఉస్మాన్ తారిఖ్ ఖ్వాజా సుసాధ్యం చేసి చూపాడు. చక్కటి టెక్నిక్, సొగసైన స్ట్రోక్ ప్లే, సుదీర్ఘ సమయం పాటు క్రీజులో నిలవగల సహనంతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఖ్వాజా... ఆ్రస్టేలియా క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం
సంపాదించుకున్నాడు. అతడి కెరీర్‌ను ఓసారి పరిశీలిస్తే...
సిడ్నీలోనే మొదలు...
ఐదేళ్ల ప్రాయంలోనే పాకిస్తాన్ నుంచి కుటుంబంతో సహా ఆస్ట్రేలియాకు వలస వచి్చన ఉస్మాన్ ఖ్వాజా... ఉపఖండంలో అందరు పిల్లల్లాగే చిన్నప్పటి నుంచి క్రికెట్‌ను ఎంతగానో ఆరాధించేవాడు. ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లాలనే కోరిక ఉన్నా... ఆరి్థక పరిస్థితులు సహకరించకపోవడంతో... మైదానం బయటే ఉండిపోయిన ఖ్వాజా...ఆటపై తనకున్న మక్కువతో అద్భుతం చేసిచూపాడు. 2011 ‘యాషెస్’సిరీస్‌లో భాగంగా సిడ్నీ టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు... ఆ్రస్టేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి ముస్లిం ప్లేయర్‌గా నిలిచాడు. అది మొదలు కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఈ ఎడమ చేతి బ్యాటర్... సుదీర్ఘ ఫార్మాట్‌లో తన టెక్నిక్‌తో పాటు... ఉపఖండ పిచ్‌లపై సులువుగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యంతో ఆసీస్ జట్టులో కొనసాగాడు. కెరీర్ ఇక ముగిసినట్లే అనుకున్న ప్రతిసారి... అలుపెరగని కెరటంలా పైకెగిసిన ఖ్వాజా... ఆ్రస్టేలియా తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 15వ స్థానంతో కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించాడు.
మేటి ఇన్నింగ్స్‌లు... 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మరపురాని
ఇన్నింగ్స్‌లు ఆడిన ఉస్మాన్ ఖ్వాజా... 2023 సంవత్సరానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కించుకున్నాడు. 2015 బ్రిస్బేన్ టెస్టులో న్యూజిలాండ్‌పై చేసిన 174 పరుగులు... 2016 అడిలైడ్ టెస్టులో దక్షిణాఫ్రికాపై ఆడిన 145 పరుగుల ఇన్నింగ్స్... 2018 దుబాయ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై చేసిన 141 పరుగులు... 2022 సిడ్నీ టెస్టులో ఇంగ్లండ్‌పై ఆడిన 137 పరుగుల ఇన్నింగ్స్... పాకిస్తాన్‌పై కరాచీ టెస్టులో కొట్టిన 160 పరుగులు... ఇలా చెప్పుకుంటూ పోతే ఖ్వాజా కెరీర్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలెన్నో. టెక్నిక్‌తో పాటు సహనానికి మారుపేరుగా నిలిచిన అతడు... టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు క్రీజులో దర్శనమిచి్చన అతికొద్ది మంది క్రికెటర్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇంగ్లండ్‌తో 2023 బరి్మంగ్‌హామ్ టెస్టు మ్యాచ్‌లో... ఆట ఐదు రోజుల పాటు ఏదో ఒక దశలో బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 321 బంతులు ఎదుర్కొని 141 పరుగులు చేసిన అతడు... రెండో ఇన్నింగ్స్‌లో 197 బంతులు ఎదుర్కొని 65 పరుగులతో జట్టుకు విజయం అందించడం విశేషం. శ్రీలంకపై గాలేలో తన కెరీర్‌లో ఏకైక డబుల్ సెంచరీ (232)ని సాధించి జట్టును గెలిపించాడు.
వన్డేల్లో ఇలా...
సుదీర్ఘ ఫార్మాట్‌లో మంచి ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఖ్వాజా 2013లో శ్రీలంకపై వన్డే అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన అతడు... ఆ తర్వాత కొన్ని మెరుగైన ప్రదర్శనలతో కెరీర్‌లో 42.00 సగటుతో 1554 పరుగులు చేశాడు. ఆ్రస్టేలియా వన్డే జట్టులో ఉన్న విపరీతమైన పోటీ కారణంగా సుదీర్ఘ కాలం జట్టులో కొనసాగలేకపోయాడు. ఇక స్వల్ప టి20 కెరీర్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున 6 మ్యాచ్‌లు ఆడాడు. జాతీయ జట్టుకు దూరమైనా... బిగ్ బాష్ లీగ్‌తో పాటు విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగనున్నట్లు వెల్లడించాడు. స్పిన్‌ను ఎదుర్కోవడంలో మంచి పేరున్న ఖ్వాజాకు... భారత్‌పై మాత్రం చెప్పుకోదగ్గ రికార్డు లేదు. టీమిండియాతో 14 టెస్టు మ్యాచ్‌లాడిన అతడు 29.12 సగటుతో 728 పరుగులు చేశాడు.


