ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మరోసారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. 2021లో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, తిరిగి 2023 యాషెస్ సిరీస్ కోసం బరిలోకి దిగిన అతను.. తాజాగా తన దేశవాలీ రిటైర్మెంట్ విషయంలో యూ టర్న్ తీసుకున్నాడు.
2025లో ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్ నుంచి తప్పుకున్న మొయిన్.. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, దేశవాలీ క్రికెట్‌లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే తన పాత జట్టును కాదని కొత్త జట్టుతో (యార్క్‌షైర్) ఒప్పందం చేసుకొని టీ20 బ్లాస్ట్, ద హండ్రెడ్ లీగ్‌ల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు.
మిగతా దేశాల ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు మొయిన్ అప్పట్లో దేశవాలీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తాజాగా ఆ రూల్స్ సవరించబడటంతో, దేశవాలీ టీ20 ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.
మొయిన్ రిటైర్మెంట్ యూటర్న్ నేపథ్యంలో గతంలో చోటు చేసుకున్న ఇలాంటి ఉదంతాలపై ఓ లుక్కేద్దాం. క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, అనేక మంది రిటైర్మెంట్ ప్రకటించి, తిరిగి మైదానంలోకి వచ్చారు. కొందరు అంతర్జాతీయ కెరీర్‌లలో ఇలా చేస్తే, మరికొందరు ప్రైవేట్ లీగ్‌ల్లో పాల్గొనేందుకు రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకున్నారు. ఇలాంటి వారిలో టాప్-10 ఆటగాళ్లను పరిశీలిద్దాం.
ముందుగా అంతర్జాతీయ రిటైర్మెంట్ యూటర్న్‌ను తీసుకుంటే.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆ జట్టు వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 1987లో రిటైర్మెంట్ ప్రకటించి, ఆ దేశ ప్రభుత్వం అభ్యర్థన మేరకు 1988లో దాన్ని ఉపసంహరించుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత ప్రభావవంతమైన యూటర్న్. ఎందుకంటే ఇమ్రాన్ రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకొని పాక్‌ను వన్డే ప్రపంచకప్ గెలిపించాడు.
ఆతర్వాత అదే దేశానికి చెందిన జావిద్ మియాందాద్ 1993లో ఆటకు వీడ్కోలు పలికి, మూడేళ్ల తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నాడు. 1996 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు అతను ఈ పని చేశాడు. రిటైర్మెంట్ ఉపసంహరించుకొని ఆ ప్రపంచకప్ బరిలోకి దిగినా మియాందాద్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
కార్ల్ హూపర్ (వెస్టిండీస్)
రిటైర్మెంట్: 1999
ఉపసంహరణ: 2001, రీఎంట్రీలో కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు
ప్రభావం: హూపర్ రీఎంట్రీతో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌లో సిర్థరత్వం వచ్చింది.
షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్)
రిటైర్మెంట్: అనేకసార్లు (2010, 2011, 2016)
ఉపసంహరణ: మూడు సార్లు
బ్రెండన్ టేలర్ (జింబాబ్వే)
రిటైర్మెంట్: 2015
ఉపసంహరణ: 2017
మొహమ్మద్ ఆమీర్ (పాకిస్తాన్)
రిటైర్మెంట్: 2020
ఉపసంహరణ: 2024
మొయిన్ అలీ (ఇంగ్లండ్)
రిటైర్మెంట్: 2021 (టెస్ట్ క్రికెట్)
రీఎంట్రీ: 2023 యాషెస్ సిరీస్
తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)
రిటైర్మెంట్: 2023
ఉపసంహరణ: దేశ ప్రధాని జోక్యంతో మరుసటి రోజే
ఇమాద్ వసీమ్ (పాకిస్తాన్)
రిటైర్మెంట్: 2023
రీఎంట్రీ: 2024
క్రికెట్‌కు ఓవరాల్‌గా రిటైర్మెంట్ ప్రకటించి ప్రైవేట్ టీ20ల్లో ఆడిన ఆటగాళ్లు..
ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)
రిటైర్మెంట్: 2018
ఐపీఎల్‌లో రీఎంట్రీ
కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్)
రిటైర్మెంట్: 2012
ఐపీఎల్, కౌంటీ క్రికెట్‌లోకి రీఎంట్రీ
బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్)
రిటైర్మెంట్: 2016
ఐపీఎల్ సహా మిగతా టీ20 లీగ్‌ల్లో రీఎంట్రీ
వీరే కాక ప్రొఫెషనల్ క్రికెట్ మొత్తానికి రిటైర్మెంట్ ప్రకటించి ప్రైవేట్ టీ20 లీగ్‌ల్లో, దేశవాలీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు.


