మా జట్లను చూస్తుంటే గర్వంగా ఉంది: రోహిత్‌ శర్మ | Rohit Sharma backs India mens and womens teams to continue title-winning streak | Sakshi
Sakshi News home page

మా జట్లను చూస్తుంటే గర్వంగా ఉంది: రోహిత్‌ శర్మ

Mar 15 2026 9:45 AM | Updated on Mar 15 2026 11:06 AM

Rohit Sharma backs India mens and womens teams to continue title-winning streak

విశ్వవేదికపై భారత పురుష‌ల, మ‌హిళ‌ల జ‌ట్లు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. వరుసగా రెండు ఐసీసీ వరల్డ్‌కప్ టైటిల్స్ గెలుచుకుని తమ సత్తాను మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాయి. గతేడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ నిలిచింది.  ముంబై వేదికగా జరిగిన జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించిన ఉమెన్ ఇన్ బ్లూ.. తొలి వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడింది.

ఈ చారిత్రత్మక విజయం భారత క్రీడారంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మరోవైపు సొంతగడ్డపై జరిగిన మెన్స్ టీ20 వరల్డ్‌కప్‌-2026 ఛాంపియన్స్‌గా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా అతరించింది.

వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో హర్మన్‌, సూర్య బృందాలపై టీమిండియా స్టార్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తమ జట్లు సాధించిన విజయాల పట్ట తనకు ఎంతో గర్వంగా ఉందని రోహిత్ అన్నాడు.

"విజ‌యాల వెనుక‌ ప్ర‌త్యేక‌మైన ర‌హ‌స్యాలు ఏమి లేవు.  కేవలం కఠోర శ్రమ మాత్రమే ఉంది. ఈ విజ‌యాల‌ను అందుకోవ‌డానికి ఎంతో శ్ర‌మించారు. మైదానంలో ఆడే ఆటగాళ్లే కాకుండా, తెర వెనుక పని చేసే ఎంతో మంది సిబ్బంది కృషి కూడా ఈ విజయాల్లో దాగి ఉంది. వారందరికీ ఈ క్రెడిట్ దక్కాలి.

గ‌త రెండేళ్ల‌లో మా జ‌ట్లు సాధించిన విజ‌యాల ప‌ట్ల చాలా గ‌ర్వంగా ఉంది. కేవ‌లం పురుష‌ల జ‌ట్టు మాత్ర‌మే కాదు ముంబైలో ఉమెన్స్ టీమ్ కూడా అద్భుతం చేసింది. ఈ విజయాల జోరును ఇలాగే కొనసాగిస్తూ.. భవిష్యత్తులో దేశం కోసం మరిన్ని మేజర్ టైటిళ్లను గెలవాలని ఆశిస్తున్నా" అని రోహిత్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: సన్‌రైజర్స్‌కు పాక్‌ ప్లేయర్‌ ఆడడం కష్టమే?
 

Advertisement
 
Advertisement
Advertisement