Andhra Pradesh
-
రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా?: పేర్ని నాని
తాడేపల్లి: అమరావతి కోసం భూములిచ్చిన రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి నారాయణ సమాధానం చెప్పాలి కదా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కోసం ఏం చేశారు? అమరావతిలో అద్దాల కోసం రూ.2,500 కోట్లు కేటాయించారు. భూములు ఇచ్చిన రైతులకు మీరు ఏం చేశారు? కేంద్ర మంత్రి పెమ్మసానికి రైతుల కష్టం తెలుసా? రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పనులు జరుగుతున్నాయా? రైతుల కోసం నేను మాట్లాడితే యూట్యూబ్ నుంచి తొలగిస్తారా? చంద్రబాబుకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా చమటలు పట్టిస్తోంది. అమరావతిలో మట్టి వ్యాపారం తప్ప మరేమీ జరగటం లేదు. నిత్యం వెయ్యి టిప్పర్లలో మట్టి తరలిపోతోంది. మట్టి మీదనే టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. కానీ భూములు ఇచ్చిన రైతులు మాత్రం రోడ్డున పడ్డారు. ఆ రైతుల సమస్యలపై మాట్లాడితే నేరం అంట. అదే ఎల్లోమీడియా చర్చలు పెట్టినా, మంత్రి నారాయణ మాట్లాడితే బాగుంటుందంట. రైతుల సమస్యలు ఉన్నాయనే కదా త్రీమెన్ కమిటీ వేసింది? మాకు సమాధానం చెప్పలేక మాపై కేసులు నమోదు చేస్తున్నారు. రాజధానిపై నేను మాట్లాడిన ప్రతి వీడియోనూ తొలగించాలని యూట్యూబ్, ట్విట్టర్ లకు లేఖలు రాశారు. సచివాలయం పునాదుల దశలోనే ఉంది. కానీ, అప్పుడే అద్దాలకు టెండర్లు పిలిచారు . ఈ రెండేళ్లలో సగమైనా కట్టిన బిల్డింగ్ ఒక్కటైనా ఉందా? రైతులను విపరీతంగా వాడుకుని ఊరూరా తిప్పారు. భూములు ఇచ్చిన రైతులు మంత్రి నారాయణ చుట్టూ రైతులు తిరగటమే సరిపోయింది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తిప్పుకుంటున్నారు. ఇక కేంద్ర మంత్రి పెమ్మసానికైతే అసలు రైతుల కష్టాలే తెలియదు. ఎన్ఆర్ఐ మహిళ ఒకరు శ్రీకాళహస్తి ఆలయంలోని అవినీతి గురించి ప్రశ్నిస్తూ వీడియో పెడితే దాన్ని తొలగించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే ప్రతి వీడియోను తొలగిస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను ఎందుకు ఇవ్వలేదు? బెజవాడ, గుంటూరు చుట్టుపక్కల లేఅవుట్లకు అమరావతిలోని మట్టిని తరలిస్తున్నారు.రోజూ వెయ్యి టిప్పర్ల మట్టి బయటకు వెళ్తుంది. చంద్రబాబు మౌఖిక ఆదేశాలతో మట్టి వ్యాపారం జరుగుతోంది. దీని గురించి ప్రశ్నిస్తే తప్పా? భూములు ఇచ్చిన రైతులను గాలికి వదిలేశారు. అమరావతిలో ఎయిర్ పోర్ట్ కడితే మరి గన్నవరం ఎయిర్ పోర్ట్ సంగతేంటి? అశ్వనీ దత్, బ్రాహ్మణి, బలుసు శ్రీనివాసరావు, తదితరులకు ప్రైమ్ లొకేషన్ లో భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన రైతులకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారు. సీఆర్డీఏ ఆఫీసుకు అద్దాల ఖర్చే భారీగా ఉంది. హెరిటేజ్ సంస్థ నుంచి డబ్బు తెచ్చి అమరావతిలో పెడుతున్నారా? ప్రజా సొమ్మును ఎందుకిలా వృధా చేస్తున్నారు? ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నది మట్టి వ్యాపారమే. 29 గ్రామాల రైతులు నరకం చూస్తున్నారు.పవన్ కల్యాణ్‌కు ఈ ప్రభుత్వం కూలిపోతుందని అర్థం అయింది. అందుకే కొత్త గెటప్ లోకి వెళ్తున్నారు. అందుకే జై అమరావతి కాకుండా జై ఆంధ్రా అనమంటున్నారు. జై అమరావతి అంటే ఆ 29 గ్రామాలకే పరిమితం అవుతామన్న భయంతో పవన్ ఉన్నారు. జనసేన కార్యకర్తలను టీడీపీ వారు కొడుతుంటే మాత్రం పవన్ కు కనపడటం లేదు’’ అని అన్నారు. -
SIR ప్రక్రియ అత్యంత కీలకమైనది: సజ్జల
తాడేపల్లి : వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పరిశీలకులతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. త్వరలో రాష్ట్రంలో ఎస్ఐఆర్(SIR) ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్లమెంటరీ పరిశీలకులతో సజ్జల సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి బీఎల్ఏ(బూత్ లెవెల్ ఏజెంట్లు) లు ఎలా వ్యవహరించాలనే అంశంపై దిశా నిర్దేశం చేశారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ జూన్ 15 నుంచి ఏపీలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతోంది. ఈ సర్ ప్రక్రియ అత్యంత కీలకం. బూత్ లెవల్ ఏజెంట్లు, బీఎల్ఓల మధ్య సమన్వయం ఉండాలి.. బీఎల్ఏలకు వెంటనే శిక్షణ తరగతులు ఇవ్వాలి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలి. డ్రాఫ్ట్ స్థాయిలోనే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఉండవు. ఎన్యూమరేషన్ పత్రాలకు ముందే బీఎల్ఏలు సిద్ధంగా ఉండాలి. ఓటర్లను కూడా చైతన్యపరచాలి. ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే ఓటు ఉండదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ వరకు అన్ని టీమ్‌లు, సీనియర్ నేతలు, ఇన్ఛార్జ్లు నిరంతర పర్యవేక్షణ చేయాలి. సమర్థంగా పనిచేసే బూత్ ఏజెంట్లకు రాబోయే రోజుల్లో పార్టీ గుర్తింపు ఉంటుంది.. -
మంత్రి టీజీ భరత్‌కు సిద్ధార్థరెడ్డి కౌంటర్
కర్నూలు: తాను ఎమ్మెల్యే కావాలనే కోరిక తనకంటే మంత్రి టీజీ భరత్‌కే ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోందని వైఎస్సార్సీపీ యువజన రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుల వేధింపుల బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ తాము ధర్నాలు చేస్తే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ టీజీ కుటుంబంపై మండిపడ్డారు. టీజీ వెంకటేశ్ అంటే గౌరవం ఉండేదని.. కానీ తనపై చేసిన వ్యాఖ్యలు చూశాక, ఆయనపై గౌరవం పోయిందన్నారు. తన తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని టీడీపీ నేతలు తిట్టినా స్పందించని ఎంపీ బైరెడ్డి శబరి.. మంత్రి భరత్ గురించి తాను మాట్లాడితే పరుగెత్తుకుంటూ వచ్చి ప్రెస్మీట్లు పెట్టడం విడ్డూరంగా ఉందని సిద్ధార్థరెడ్డి అన్నారు.ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ తనపై మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారని, 43 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ చేశారని.. ఇప్పుడు ఆయన వయసు ఇప్పుడు 50 ఏళ్లు అని చెప్పారు. 'నీ వయసుకు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే అప్పుడు అడగండి' అంటూ భరత్‌కు కౌంటర్ ఇచ్చారు. ''కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు నిరసనగా, అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈనెల 14న మేము ధర్నా కార్యక్రమం నిర్వహించాం. టీడీపీ నాయకుల వేధింపుల కారణంగా కర్నూలు పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న సతీశ్ అనే కుర్రాడి కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ఆ రోజు ధర్నా చేశాం. బాలు మరో కుర్రాడిపై పోలీసులు వేధింపులు ఆగాలన్న ఉద్దేశంతోనూ ధర్నా చేపట్టాం. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాయలం దగ్గర ధర్నాకు దిగాం. ప్రభుత్వాన్ని, మంత్రి టీజీ భరత్‌కు ప్రశ్నించామని గడచిన 3 రోజులుగా టీడీపీ నేతల, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీజీ వెంకటేశ్ తదితరులు మా గురించి రకరకాలు మాట్లాడారు. వారి మాటలకు సమాధానం చెప్పాలనే మీడియా ముందుకు వచ్చాను. సతీశ్ కుటుంబానికి మంత్రి టీజీ భరత్ న్యాయం చేసివుంటే కర్నూలు టౌన్లో ఆయన స్థాయి వందశాతం పెరిగేది. ఆయన ఆ పని చేయకుండా సిద్ధార్థరెడ్డిని తిట్టినవాళ్లకు పదివేల రూపాయలు, సిద్ధార్థరెడ్డిపైనా సెల్ఫీ వీడియో చేసిన వాళ్లకు ఇరవై వేల రూపాయలు, ప్రెస్‌మీట్ పెడితే కార్పొరేటర్ సీటు, సిద్ధార్థరెడ్డి ఇంటి మీదకు పోతే స్టోర్ బియ్యం వంటివి చేయడంతో కర్నూలు టౌన్లో టీజీ భరత్ స్థాయి 500 శాతం పడిపోయింది. సతీశ్ కుటుంబానికి న్యాయం చేయమని నేను అడిగితే ఆయన ప్రెస్‌మీట్ పెట్టి.. సిద్ధార్థ నువ్వు టికెట్ తెచ్చుకో. మూడు ఎలక్షన్లు చేసినా ఏ పార్టీ కూడా నీకు టికెట్ ఇవ్వలేదని మాట్లాడారు. భరత్ వయసు ఇప్పడు 50 సంవత్సరాలు. 48 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యారు. 43 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా నిలబడ్డారు. నా వయసు 33 సంవత్సరాలు. మీ వయసు వచ్చినప్పడు నాకు టికెట్ రాకుంటే అప్పుడు అడగండి. నేను ఎమ్మెల్యే కావాలనే కోరిక నా కన్నా మీకు ఎక్కువ ఉండడమేంటి? 33 సంవత్సరాలకు నేను శాప్ చైర్మన్‌ను అయ్యాను. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిని అయ్యాను. నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్చార్జిని అయ్యాను. నా వెంట తిరిగిన ఎంతో మందిని ఎంటీసీ, జెడ్పిటీసీ, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లుగా గెలిపించుకున్నాను. రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాల్లో పార్టీ తరపున ప్రచారం చేశాను. ఎన్నో ప్రెస్మీట్లు, ర్యాలీలు, ధర్నాలు చేశాను. 33 ఏళ్లకే ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. అదే 33 సంవత్సరాలకు మీరు ఉయ్యాల ఊగుతున్నారా? సతీశ్ కుటుంబానికి న్యాయం చేయమని మేము అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతున్నార''ని సిద్ధార్థరెడ్డి ధ్వజమెత్తారు. -
ఫ్లాష్‌బ్యాక్ తిరగేస్తే!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ ప్రముఖులంతా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలపై రేట్లు భారీగా పెంచేశారు. ధరల దెబ్బకు ప్రజలు ఎలాగూ ఆయిల్ వినియోగం తగ్గించుకోక తప్పదు. అలాంటప్పుడు ప్రభుత్వాల దుబారా ఖర్చుల మాటేమిటి?.. మోదీ చెప్పిన ఎనిమిది, తొమ్మిది సూత్రాలతో పరిస్థితి మారదన్నది స్పష్టం. ఆయన బంగారం కొనవద్దన్నారు. మరి... ఈ రంగంపై ఆధారపడ్డ ఐదున్నర కోట్ల మంది జీవనోపాధి మాటేమిటి అని బంగారం పరిశ్రమ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ వెంటనే కేంద్రం బంగారం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచేసింది. దీంతో ఇది కొంత మెరుగేమోననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక పొదుపు మంత్రం పఠించారు. ప్రభుత్వపరంగా వాహనాల వాడకం తగ్గించుకోవడం ఆరంభించారు. మంచిదే. కానీ ఇప్పటివరకూ దుబారా చేసినట్టు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లు అయ్యింది. ఇక ఏపీలోనైనా ఈ వాహనాల వినియోగం అట్టహాసంగా ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేశ్‌లు హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలు వాడినట్లుగా దేశంలో మరే రాష్ట్రంలో వాడరని చెబుతున్నారు. సీఎం ఒక్కరికే ఉన్న ఈ వెసలుబాటు ఇప్పుడు డిప్యూటీలకు, మంత్రులకు కూడా ఎలా సాధ్యమవుతోందో తెలియదు. మంత్రివర్గ సమావేశంలో పొదుపుపై సూత్రాలు చెప్పిన కాసేపటికి లోకేశ్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లారట. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌లు పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర విమర్శలు గుప్పించే వారు. ఆ ధరలకు ఆనాటి ముఖ్యమంత్రి జగనే కారణమని ఆరోపించే వారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిళ్లపై ఉన్న పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంలో కర్ణాటకలోని ఒక పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి, అక్కడి ధరకు, ఏపీలో ఉన్న ధరకు తేడాను చెప్పి విమర్శలు గుప్పించారు. అది జరిగి రెండేళ్లు దాటుతున్నా, అధికారంలో ఉన్న వీరెవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధర ఏపీలోనే. పెట్రోల్ రేటు రూ.113 కాగా.. డీజిల్ ధర రూ.99 లకు చేరింది. తమిళనాడు సుమారు రూ.9, కర్ణాటక కన్నా సుమారు రూ.ఏడు ఎక్కువ. ఇప్పుడైనా రాష్ట్ర పన్నులను తగ్గించి ఆయిల్ ధరలను నియంత్రించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విషయానికి వస్తే, రెండు లేదా మూడు వాహనాలు, సీఎం కాన్వాయిలలో సరిపోతే, ఇంతకాలం ఎందుకు అన్ని వాహనాలు వాడారన్నదానికి జవాబు దొరకదు. ప్రతి శుక్రవారం ‘నో వెహికిల్ డే’ పాటించాలని, మంత్రుల విదేశీ పర్యటనలు తగ్గించాలని, ప్రత్యేక విమనాలు అదుపు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారట. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సెక్యూరిటీ పేరుతో ఎక్కువ వాహనాలను వాడడం ఫాషన్ అయిందని అన్నారు. ఈ మాట ఈ రెండేళ్లలో ఏనాడైనా అన్నారా? అధికారులకు హెచ్చరిక చేసి తన కాన్వాయిలో ఇంతకాలం వాహన శ్రేణిని తగ్గించారా అంటే అదేమీ లేదు. చంద్రబాబు చెప్పడానికి, చేయడానికి ఉన్న తేడాను పలువురు గుర్తు చేసుకున్నారు. అవసరమైతే సచివాలయానికి సైకిళ్లపై రావాలని చంద్రబాబు సూచించారట. విజయవాడ, లేదా గుంటూరు, మంగళగిరి ప్రాంతాలలో నివసిస్తున్న మంత్రులు, సిబ్బంది సైకిళ్లపై రావాలంటే ఎన్ని గంటల సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. అది అసలు ఆచరణ సాధ్యమేనా? ఏదో ప్రజల కోసం ఇలాంటి డైలాగులు చెబుతుంటారు. వర్క్ ఫ్రం హోం గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఢిల్లీ వంటి రాజధాని నగరాలలో ఇది సాధ్యమేమో కాని, గ్రామీణ ప్రాంతం అధికంగా ఉండే ఏపీలో అది ఎంత ఉపయోగమో చెప్పలేం. ఎన్నికల ప్రచారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకోసం వర్క్ ఫ్రం హోమ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల వద్దనే ఉండి పని చేసుకోవచ్చని చంద్రబాబు విపరీత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ మాటే ఆయన నుంచి వినిపించడం లేదు. కేవలం ప్రభుత్వ వాహనాల వినియోగం తగ్గించడం వల్ల ఆదా అయ్యే చమురు వ్యయం మరీ ఎక్కువేమీ కాదు. అదే ఏపీ సర్కార్ కనుక ఆయిల్ పై ఉన్న పన్నులు తగ్గిస్తే ఐదున్నర కోట్ల మంది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తారు.అలా చేయకపోతే ప్రభుత్వం చెబుతున్న పొదుపు ఒకరకంగా సముద్రంలో నీటి బొట్టు వంటిదే అనుకోవాలి. కేవలం చమురులోనే అధిక వ్యయం అవుతోందా? అంటే కాదనే చెప్పాలి. ప్రభుత్వ పరంగా సాగే ఇతర దుబారా వ్యయం ఇంతా అంతా కాదు.దాని గురించి మాత్రం ప్రభుత్వ పెద్దలు ఎవరూ మాట్లాడడం లేదు. అంతదాకా ఎందుకు ముఖ్యమంత్రి నివసిస్తున్న ఉండవల్లి నివాసానికి, ఢిల్లీలోని నివాసానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నది వార్తలు వచ్చాయి కదా!. తాజాగా ఢిల్లీలోని ఇంటి కోసం రూ.6.5 కోట్లు వ్యయం చేయడానికి జీవో ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే మంత్రులు సింగపూర్ టూర్ చేసి వచ్చారు. అదంతా వృథా వ్యయమని విపక్ష వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈ నెలాఖరున మరో మంత్రి కొల్లు రవీంద్ర విదేశీ పర్యటన పెట్టుకున్నారు. ఇక అన్నిటికి మించి అమరావతి పేరుతో జరుగుతున్న దుబారా ఉంటోందన్నది సర్వత్రా వ్యక్తం అవుతున్న అబిప్రాయం. అమరావతికి ప్రభుత్వ డబ్బు రూపాయి ఖర్చు చేయనవసరం లేదని చంద్రబాబు పదే,పదే చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వమే బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించింది. అంతేకాక సుమారు రూ.47 వేల కోట్ల అప్పులు చేశారు. వాటిలో అత్యధిక భాగం డాలర్ల రూపంలోనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థలు ఇస్తున్నాయి. వడ్డీతో సహా డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉండవచ్చు. అప్పుడు ఈ వ్యయం ఎంత అవుతుందో ఊహించుకోవచ్చు. పోనీ ఆయా కాంట్రాక్ట్ పనులనైనా పొదుపుగా చేస్తున్నారా అంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి కొత్త భవనాల కోసం మళ్లీ వేల కోట్లు వ్యయం చేయబోతున్నారు. అందరికి అందుబాటులో ఉన్న గన్నవరం వద్ద విమానాశ్రయాన్ని కాదని ఎక్కడో మారుమూల మరో 4600 ఎకరాలలో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తారట. ఇందుకోసం తొలిదశలో రూ.3400 కోట్లు ఖర్చు పెడతారట. రాజధాని పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు వెచ్చిస్తున్నారంటే ఏమనుకోవాలి? కేవలం భవనాల అద్దాల కోసం రూ.2540 కోట్లు వ్యయం చేయడమా అని అంతా నోరు వెళ్లబెడుతున్నారు. అమరావతి నిర్మాణాలలో భారీ అవినీతి ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 140 మీటర్ల వెడల్పు రోడ్డు వేస్తారట. దీనికి పాతికవేల కోట్ల వ్యయం అవుతుందని చెబుతున్నారు. రెండో దశ భూ సేకరణ అంటేనే పెద్ద స్కామ్ అని టీడీపీ మద్దతుదారైన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు.దానికి ప్రభుత్వం నుంచి సమాధానమే రావడం లేదు.ఈ నేపథ్యంలో ఏదో పబ్లిసిటీ కోసం పొదుపు చర్యలు కాకుండా కాంక్రీట్ గా అమరావతి పేరుతో సాగుతున్న దుబారాను అరికట్టే రీతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అంతా స్వాగతిస్తారు. మరి ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతుందా?అంటే అనుమానమే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మామిళ్లపల్లిలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి జోగి రమేశ్ చేపట్టిన మామిళ్లపల్లి పర్యటనకు పోలీసులు అడ్డుతగిలారు. అధికారులు సీజ్ చేసిన గోడౌన్‌ను పరిశీలించేందుకు, రైతుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో సోమవారం ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మరోసారి అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జోగి రమేశ్ కార్యకర్తలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో ఈ మధ్య కాలంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మొక్కజొన్న రైతులపై జరిగిన దాడులు, అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అక్రమ కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చింది. దీంతో సర్కార్ కూటమి కుట్రలకు దిగింది. -
నలుగుర్ని కనండి : డా.శివరంజని తీవ్ర ఆందోళన వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త జనాభా విధానంపై హైదరాబాద్‌కుచెందిన ప్రముఖ పీడియాట్రిషియన్ (పిల్లల వైద్యురాలు) డాక్టర్ శివరంజని సంతోష్ (Dr. Shivaranjani Santosh) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఏకకాల నగదు బహుమతి, పిల్లల సుదీర్ఘ భవిష్యత్తుకు భద్రతను ఇవ్వలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. నకిలీ ఓఆర్ఎస్ ఉత్పత్తులపై గళమెత్తిన డా. శివరంజని సంతోష్ ఏపీ సీఎం చంద్రబాబు నలుగురు పిల్లల విధానంపై ఘాటుగా స్పందించారు. రూ. 30, 40 వేల కోసం పిల్లల్ని కనవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ డబ్బు కేవలం కొన్ని రోజుల్లోనే ఖర్చయిపోతుందని చెప్పారు. పిల్లల పెంపకానికి ఏళ్ల తరబడి ఆర్థిక, శారీరక, మానసిక మద్దతు అవసరమని గుర్తుచేశారు. View this post on Instagram A post shared by Dr Sivaranjani Santosh (@drsivaranjanionline)ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదుఒక వైద్యురాలిగా, తల్లిగా మాట్లాడుతున్నాను తప్ప, తన ఆందోళనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేసిన ఆమె పిల్లల సంక్షేమమే ముఖ్యమని తేల్చి చెప్పారు. కుటుంబంలో పిల్లల సంఖ్య పెరిగితే వారికి సరైన పోషకాహారం, వైద్యం, నాణ్యమైన విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కావచ్చని ఆందోళన వెలిబుచ్చారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ప్రతి బిడ్డకు సమానంగా సమయం, ప్రేమ, శ్రద్ధ ఇవ్వడం సాధ్యమేనా అని ఆమె ప్రశ్నించారు. అలాగే నివాస స్థలం (ఇల్లు) కూడా సరిపోకపోవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు ఇటువంటి విధానాలు మిగిలిన రాష్ట్రాలకు కూడా పాకకూడదని ఆమె హితవు పలకడం గమనార్హం.కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మారుతున్న డెమోగ్రాఫిక్ (జనాభా సంతులనం) పరిస్థితుల దృష్ట్యా నలుగురు పిల్లల్ని కనాలని సూచించారు. ఇందుకు తమ ప్రభుత్వం మూడో బిడ్డ పుట్టిన వెంటనే రూ. 30వేలు, , నాలుగో సంతానానికి రూ.40 వేలు అందిస్తుందని ప్రకటించారు. అయితే ఇలా ఎక్కువ మంది పిల్లల్ని కనడాన్ని ప్రోత్సహించడం విమర్శలకు తావిచ్చింది. ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం -
దగ్గుపాటి రాజకీయం.. టీడీపీలో భారీ పొలిటికల్ ట్విస్ట్
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఇందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వేదికగా మారింది. గత జనవరిలో పాలకవర్గం కొలువు దీరిన నాటి నుంచి మార్కెట్ యార్డు చైర్పర్సన్ బల్లా పల్లవి, వైస్ చైర్మన్ అర్షదుల్లా మధ్య మాటలు లేవు. కొందరు డైరెక్టర్లు అటు ఇటు ఉండగా.. మరికొందరు ఇరు వర్గాలకూ దూరంగా ఉంటున్నారు.ఇదే అదనుగా మార్కెట్ యార్డు తనకే రాసిచ్చారన్నట్లుగా చైర్పర్సన్ బల్లా పల్లవి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. గత నాలుగు నెలలుగా చైర్పర్సన్ తనదైన శైలిలో వైస్ చైర్మన్, డైరెక్టర్లను కట్టడి చేసి ఏకపక్షంగా వెళుతున్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. వైస్ చైర్మన్‌గా, డైరెక్టర్లుగా తమకు పార్టీ గొప్ప అవకాశం కల్పించినట్లు సంబరపడుతూ పదవులు అనుభవిస్తామని, సంపాదించుకుంటామని అనుకున్న వారు మొదట్లో నెల రోజుల పాటు హడావుడి చేసినా ఇప్పుడు పలకరించేవారు లేక డీలా పడ్డారు. పాలకవర్గ ప్రమాణ స్వీకారం, బాధ్యతలు తీసుకున్న రోజు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో ఆర్భాటం చేసిన చైర్పర్సన్ పల్లవి.. ఆ తర్వాత ఎమ్మెల్యేకు దూరమయ్యారు.ప్రధానంగా మార్కెట్ యార్డులో వేబ్రిడ్జి (లారీ కాటా) విషయంలో చైర్పర్సన్ భర్త బల్లా సురేష్‌కు ఎమ్మెల్యే దగ్గుపాటికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అలాగే ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ సహకారంతో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటుకు నిధులు సమీకరించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు కొందరు ఇటీవల మార్కెట్ యార్డుకు వచ్చి బల్లా పల్లవిని కలిసి వెళుతుండటం జరుగుతోంది. అదే విధంగా టన్నుకు ఇంత అని చీనీ మార్కెట్, వారానికి ఇంత మొత్తం అని పశువులు, జీవాల సంతల్లో చైర్పర్సన్ పల్లవి డిమాండ్ చేస్తూ కమీషన్లు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటం, అలాగే కమీషన్లు దక్కకపోవడం లాంటి కారణాలతో ఎమ్మెల్యే దగ్గుపాటి తీవ్రంగా పరిగణించి చైర్పర్సన్ బల్లాపల్లవి వ్యవహారంపై దృష్టి సారించి వైస్ చైర్మన్, కొందరు డైరెక్టర్లను ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. -
అనంతపురం : భారమైన వేళ.. బాధతో విక్రయం! (ఫొటోలు)
-
పెట్రో ధరల పెంపుపై నిరసన జ్వాలలు
వైఎస్సార్సీపీ నిరసనల అప్డేట్స్.. రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేపట్టి.. అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు. పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్యులు, రైతులు, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ట్యాక్సులు తగ్గించి ధరలు తగ్గిస్తామని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. “లోకేష్ కాదు.. ఆయన పేరు లవ్ క్యాష్” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.విజయవాడ పశ్చిమలో వెలంపల్లి నిరసనవిజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యాధరపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ మర్చిపోయారని విమర్శించారు.విజయవాడలో దేవినేని అవినాష్ వినూత్న నిరసనఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆటో కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. ఎడ్లబండిపై బైక్‌లను ఎక్కించి నిరసన వ్యక్తం చేసిన దేవినేని అవినాష్.. ఎడ్లబండి లాగుతూ “ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి” అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, డివిజన్ స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, సోషల్ మీడియా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.కృష్ణా జిల్లాలో దేవభక్తుని చక్రవర్తి పాదయాత్రకృష్ణాజిల్లాలో దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో తాడిగడప నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు ఇంధనం వాడకం తగ్గించుకోవాలని సలహాలు ఇవ్వడం చేతకాని ప్రభుత్వ లక్షణమని విమర్శించారు.నెల్లూరులో కాకాణి, చంద్రశేఖర్ రెడ్డి రిక్షా ర్యాలీనెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిక్షాపై నిరసన ర్యాలీ నిర్వహించారు. బారకాసు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ సాగింది. “పెట్రోల్ బంక్ దగ్గర సెల్ఫీలు దిగిన లోకేష్.. ఇప్పుడు ప్రజల బాధలు చూడాలి” అంటూ కాకాణి విమర్శించారు.బొబ్బిలి, విజయనగరంలో వినతిపత్రాలువిజయనగరం జిల్లా బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అందజేశారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కైకలూరులో దూలం నాగేశ్వరరావు నిరసనఏలూరు జిల్లా కైకలూరులో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రాష్ట్ర ప్రజలపై భారీ భారం మోపుతున్నారని విమర్శించారు.తాడేపల్లిగూడెంలో వడ్డీ రఘురామ్ ఆధ్వర్యంలో ఆందోళనతాడేపల్లిగూడెంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.పెందుర్తిలో అన్నంరెడ్డి అదీప్ రాజ్ నిరసనవిశాఖ జిల్లా పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు.గుడివాడలో పోలీసుల అడ్డంకులుగుడివాడలో వైఎస్సార్సీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడి నడుము విరిగిపోయిందని నేతలు మండిపడ్డారు.అనంతపురంలో భారీ ర్యాలీఅనంతపురంలో లలిత కళాపరిషత్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలతో రాష్ట్ర ప్రజలపై ఏటా రూ.3,600 కోట్ల అదనపు భారం పడుతోందని నేతలు ఆరోపించారు.రైల్వే కోడూరులో దున్నపోతుతో నిరసనపెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి టోల్గేట్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలను ఎనుములకు కట్టేసి లాగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వామపక్ష నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కొత్తపేటలో వినూత్న నిరసనపెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేట గ్రామంలో గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతూ సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి కొత్తపేట ఆర్డీవో కార్యాలయం వరకు ఒక రిక్షాపై మోటార్ సైకిల్‌ను ఎక్కించి, స్వయంగా రిక్షా తొక్కుతూ వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాణ్యంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి నిరసనపాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లు, ఆటోలను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కాటసాని శివనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ చేపట్టారు. కల్లూరులోని కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్వగృహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్టేట్ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పెద్దపాడు శ్రీధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నంద్యాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ.. రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల నూనెపల్లి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మాజీ స్టేట్ మార్క్‌ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అమీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా తదితరులు పాల్గొన్నారు.ఉదయగిరిలో వినూత్న నిరసన పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా ఎద్దుల బండి నడుపుతూ నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ర్యాలీ అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.సైకిల్ తొక్కుతూ పేర్ని కిట్టు వినూత్న నిరసనరాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, సమన్వయకర్త పేర్ని కిట్టు ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రిక్షా తొక్కుతూ, ఎడ్ల బండిపై కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు.కాకినాడలో వైఎస్సార్సీపీ ధర్నా రాష్ట్రంలో పెంచిన ఇంధన ధరలను నిరసిస్తూ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం జంక్షన్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొన్నారు. అనంతరం సర్పవరం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. “చంద్రబాబుకు ప్రచారం తప్ప పరిపాలన చేతకాదు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారా?” అంటూ మండిపడ్డారు.ఒంగోలులో శాంతియుత నిరసన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడాన్ని నిరసిస్తూ ఒంగోలు నగరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ భవన్ వద్ద నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, వెంకటేశ్వర్లు నాయుడు, కసుకుర్తి అదెన్న, కటారి శంకర్, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.గుడివాడలో ఆర్డీఓకు వినతిపత్రంరాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుడివాడలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, మట్ట జాన్ విక్టర్, పేయ్యల ఆదాము, పొట్లూరు కృష్ణారావు, లోయ రాజేష్, తోట నాగరాజు, రేమల్లి నీలాకాంత్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, అడబాల అప్పారావు, కలపాల కిరణ్, జోషీ, చుండూరు శేఖర్, పిన్నమనేని రాఘవేందర్రావు, దేశిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గంట శీను, ఆడప హర్ష, వన్నెం రెడ్డి దినేష్ తదితరులు పాల్గొన్నారు.పెనుకొండలో నిరసన ర్యాలీపెనుకొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు.కోడుమూరులో డాక్టర్ ఆదిమూలపు సతీష్ పాదయాత్రకోడుమూరులో డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ధరలు తగ్గించకపోతే మరింత తీవ్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.కడపలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్‌బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు ఆర్డీఓ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు.పత్తికొండలో తాడుతో ఆటో లాగిన శ్రీదేవికర్నూలు జిల్లా పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తాడుతో ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. రైతులు పాత వ్యవసాయ పద్ధతులకు వెళ్లే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.బండి ఆత్మకూరులో ఎద్దుల బండ్లతో ర్యాలీనంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లపై ర్యాలీ నిర్వహించారు. మోటార్ బైక్‌లను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు.ధర్మవరం, పుట్టపర్తి, కదిరిలో నిరసనలుశ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి, కదిరి ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి ఆర్డీఓలు, తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.వాల్మీకిపురంలో చింతల రామచంద్రారెడ్డి ర్యాలీఅన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనతిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.విశాఖలో ఎడ్లబండిపై కేకే రాజువిశాఖలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఎడ్లబండిపై ప్రయాణిస్తూ తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన తెలిపారు.పులివెందులలో బొలెరోకు తాళ్లు కట్టి నిరసనపులివెందులలో వైఎస్సార్సీపీ నాయకులు బొలెరో వాహనానికి తాళ్లు కట్టి లాగుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ర్యాలీజమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ర్యాలీరాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేశారు.పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి: బొత్సచీపురుపల్లి: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను విచ్చలవిడిగా పెంచుతూ సామాన్య ప్రజలపై ప్రభుత్వం మోయలేని భారం మోపుతోందని నిరసిస్తూ చీపురుపల్లి జంక్షన్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అమలాపురంలో వైఎస్సార్సీపీ నిరసన అమలాపురం: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, అమలాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, జున్నూరి రామారావు, కటకంశెట్టి ఆదిత్య, కుడిపూడి బాబు, మట్టపర్తి నాగేంద్ర, వంగా గిరిజాకుమారి, రెడ్డి సత్య నాగేంద్రమణి, కుడిపూడి భరత్, కొనుకు బాపూజీ, ఇళ్ల శేషారావు, ఖాదర్, సత్యం కాపు, అంబికా శ్రీను, జానా గణేష్, కేత భానుతేజ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీమార్కాపురం జిల్లా: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ యర్రగొండపాలెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. రాజాంలో వినూత్న నిరసన.. విజయనగరం జిల్లా: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజేష్ తలే ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటారు వాహనాన్ని పడుకోబెట్టి దానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజాం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్మోహన్రావు, నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అద్దంకిలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసనఅద్దంకి పట్టణంలోని 20వ వార్డులో గల పెట్రోల్ బంకు వద్ద పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘గుద్దుడే గుద్దుడు’ పేరుతో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు ఆర్డీవోకు వినతిపత్రం అందజేసి, పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పలమనేరులో వైఎస్సార్సీపీ భారీ ధర్నాపెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా పలమనేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పలమనేరు సిల్క్ ఫామ్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రొద్దుటూరులో భారీ నిరసనవైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ప్రొద్దుటూరులో వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన ధరలు అధికంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వినూత్నంగా ఆటో నడుపుతూ తన నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సింగనమలలో వైఎస్సార్సీపీ భారీ నిరసనవైఎస్సార్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సింగనమల మండల కేంద్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ సూచనలతో చేపట్టిన ఈ నిరసన ర్యాలీ వైఎస్సార్ విగ్రహం వద్ద ప్రారంభమై తహశీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఎల్.ఎం. మోహన్ రెడ్డి, నాయకులు శ్రీరామ రెడ్డి, వంశీ గోకుల రెడ్డి, కొర్రపాడు గువ్వల శ్రీకాంత్ రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మండపేటలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీతూర్పుగోదావరి జిల్లా మండపేటలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. అనంతరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.మంగళగిరిలో వైఎస్సార్సీపీ భారీ నిరసనగుంటూరు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్‌రావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.జి.మాడుగులలో ఎమ్మెల్యే విశ్వేశ్వరాజు నిరసన అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజు గారి ఆధ్వర్యంలో జి.మాడుగుల మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నుర్మని మత్యకొండం నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి కుడా సురేష్ కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుబ్బడి శేఖర్, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సిర్మ పండన్న, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ విభాగాల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.తాడిపత్రిలో నిరసనతాడిపత్రి మాజీ శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా తాడిపత్రిలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తాడిపత్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గారికి వినతిపత్రం అందజేశారు.మండపేటలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై భారీ నిరసన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా మండపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. పి.గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకరమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన తెలుగు దేశం పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి దేశంలోనే అత్యధిక ధరలకు ఇంధనాన్ని విక్రయిస్తోందని విమర్శించారు. జిల్లా అధ్యక్షులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారి పిలుపుతో, పి.గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు శ్రీ చింతలపాటి శ్రీనివాసరాజు గారి సూచనల మేరకు పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.పెట్రో ధరల పెంపుపై మడకశిరలో ధర్నా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మడకశిర పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మడకశిర స్థానిక నాయకులు ఎస్.ఎల్. ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైయస్ఆర్ సర్కిల్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందజేశారు. ఉరవకొండలో..రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఉరవకొండలో నియోజకవర్గ సమన్వయకర్త& మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి వినుత్నంగా ట్రాక్టర్ లాగి నిరసన తెలియజేశారు. అనంతరం ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.రాయదుర్గం:వైఎస్సార్సీపీ రాయదుర్గం నియోజకవర్గం ఇంచార్జ్ మెట్టు గోవిందరెడ్డి గారి ఆదేశాల మేరకు...పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథరెడ్డి, ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా రాయదుర్గం పాత బస్టాండ్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తూ తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసనరాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పాల్గొన్న ఈ నిరసనలో ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్, రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర రావు సారథ్యంలో గోదావరి రైల్వే స్టేషన్ నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా తరలివెళ్లిన పార్టీ శ్రేణులు అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిళారెడ్డి, వాసంశెట్టి గంగాధర రావు, రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ, జిల్లా మహిళాధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నాయకులు మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, సప్పా ఆదినారాయణ, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, హసీనా, షేక్ నిజామ్, బూడిద శరత్‌కుమార్, అమీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. -
8 నెలల కంపెనీకి పప్పు బెల్లాలకు భూమి!
సాక్షి, అమరావతి: కంపెనీ పెట్టు – భూమి పట్టు.. జాబితాలోకి తాజాగా గ్రైడన్ ఎనర్జీ, ఎన్ఏఎన్ గ్రీన్మెట్లు వచ్చి చేరాయి. ఇప్పటికే ఉర్సా, ఇండిచిప్, స్కై స్టోరేజ్, జిన్ఫ్రా వంటి కంపెనీలు.. ఇలా కంపెనీ పెట్టగానే అలా మంత్రివర్గం సమావేశంలో భూ కేటాయింపులు చేయడం తెలిసిందే. తాజాగా గ్రైడన్ ఎనర్జీకి రూ.238 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.4.76 కోట్లకే కేటాయించింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.3,149 కోట్లతో 3 గిగావాట్ల సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఎకరం రూ.10 లక్షలు చొప్పున 47.65 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓర్వకల్లు ఇండ్రస్టియల్ మెగా హబ్‌లో ఎకరం భూమి దాదాపు రూ.5 కోట్లపైనే పలుకుతోంది.ఇంతటి విలువైన భూమిని ఉత్తరప్రదేశ్ నోయిడా కేంద్రంగా 2025 ఆగస్టులో ఏర్పాటైన గ్రైడన్కు కారు చౌకగా కేటాయించేసింది. అంతేకాకుండా పెట్టిన పెట్టుబడిలో వివిధ రాయితీల రూపంలో 69.22 శాతం తిరిగి వెనక్కు ఇవ్వనుంది. రూ.1.07 కోట్ల స్టాంప్ డ్యూటీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద రూ.920.35 కోట్లు, రూ.261 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ, రూ.261 కోట్ల విలువైన విద్యుత్ డ్యూటీ మినహాయింపు, రూ.150.88 కోట్ల విలువైన సబ్సిడీతో నీటి సరఫరా.. ఇలా టైలర్‌మేడ్ భారీ ప్రోత్సాహకాలను ఇచ్చింది. కానీ ఈ పెట్టుబడి వల్ల లభించే ఉద్యోగాలు 320 మాత్రమే. ఇలాగే రెండు నెలల క్రితం ఏర్పాటైన ఎన్ఏఎన్ గ్రీన్‌మెట్‌కు కూడా భారీ ప్రోత్సాహకాలను ఇచ్చింది.2025 నవంబర్ 10న ఏర్పాటైన ఈ కంపెనీకి 2026 ఫిబ్రవరిలో కారు చౌకగా భూములు కేటాయించగా, ఇప్పుడు అదే ప్రాజెక్టులోకి బెల్జియంకు చెందిన సిలాక్స్ వచ్చి చేరింది. భాగస్వామ్య కంపెనీగా చేరిన ఎన్ఏఎన్ సిలాక్స్ గ్రీన్‌మెట్‌కు కూడా అదే ప్రోత్సాహకాలు వర్తిస్తాయంటూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నాయుడుపేటలో రూ.కోట్లు పలుకుతున్న భూమిని ఎకరం రూ.30 లక్షల చొప్పున 21.36 ఎకరాలు కేటాయించడమే కాకుండా, రూ.1,366 కోట్ల పెట్టుబడిలో 60.38 శాతం రాయితీల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. ఇక్కడ లియాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా 340 మందికి ఉపాధి కల్పించనుంది.పలు కంపెనీలకు ప్రోత్సాహకాలురాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పాటు స్నేహ ఫామ్స్, అపోలో టైర్స్, చెట్టినాడ్ సిమెంట్స్, ఎథరల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్ , స్కైరూట్ ఎయిరోస్పేస్లకు కూడా రాయితీలను అందిస్తూ ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. తిరుపతి జిల్లా సత్యేవేడు మండలం వనలేరు, రాళ్లకుప్పం గ్రామాల్లో రాయల్ ఎన్ఫీల్డ్కు ఎకరం రూ.7 లక్షల చొప్పున 51.3 ఎకరాలు కేటాయించింది. ఈ కంపెనీ రూ.2,508 కోట్లతో 3,000 మందికి ఉపాధి కల్పించేలా యూనిట్ ఏర్పాటు చేయనుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పెట్టుబడిపై రూ.992 కోట్ల విలువైన పలు రాయితీలను ప్రకటించింది. స్కైరూట్ ఎయిరో స్పేస్‌కు తిరుపతి జిల్లా బీఎస్పురం, కొట్టపాలెం గ్రామాల్లో ఎకరం రూ.5 లక్షల చొప్పున 294.67 ఎకరాలను కేటాయించింది. -
మీ ఇంట్లో ఒక్కరు.. ప్రజలకు నలుగురా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు చెబుతున్న కొత్త జనాభా సిద్ధాంతంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఒక్క బిడ్డ చాలని ప్రచారం చేసి ఇప్పుడు యూటర్న్ తీసుకుని నలుగురు బిడ్డల్ని కనాలని చెప్పడంపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. తాను విజనరీనని దశాబ్దాలుగా ప్రచారం చేసుకుంటూ వచ్చిన ఆయన విజన్ జనాభా విషయంలో అట్టర్ ప్లాప్ అయింది. ఒకప్పుడు ఒక్క బిడ్డే చాలు, చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా ఎక్కువ మంది పిల్లల్ని కనమంటూ మూడో బిడ్డకు రూ.30 వేలు.. నాలుగో బిడ్డకు రూ.40 వేలు ఇస్తాం అంటూ గతానికి భిన్నంగా కొత్త రాగం అందుకోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఇష్టానుసారం విధానాలు మార్చుకునే విధానాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనాభా పెంచాలని కబుర్లు చెబుతున్న చంద్రబాబు తాను మాత్రం ఒక బిడ్డతోనే ఆగిపోయారు. ఆయన కుమారుడు కూడా ఒక బిడ్డనే కన్నారు. ఈ విషయంలో ఆయన ద్వంద్వ వైఖరి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగం తీవ్రతరం ప్రస్తుతం రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. విద్య, వైద్య ఖర్చులు భరించలేని స్థాయికి చేరాయి. మధ్యతరగతి, పేద కుటుంబాలు బ్రతకడానికే తీవ్రంగా పోరాడుతున్నారు. ఒక బిడ్డను పెంచడమే సామాన్య కుటుంబాలకు భారంగా మారింది. చిన్న పిల్లల స్కూలు ఫీజులు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. ఇంజినీరింగ్ చదువు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వెళ్లింది. మెడిసిన్ అయితే కోట్లు కావాలి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు.ప్రైవేటు ఉద్యోగాలు అస్థిరంగా మారాయి. మధ్యతరగతి కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు, నలుగురు పిల్లల్ని కంటె వాళ్లకు విద్య, వైద్యం, ఉద్యోగ భద్రత, జీవన భరోసా ఎవరిస్తారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చి సామాన్యులకు వైద్యాన్ని భారంగా మార్చారు. ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేద ప్రజలను నట్టేట ముంచారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య కలలు కల్లలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమందిని కన్నా తాను చూసుకుంటానని చెప్పడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలు గాలికి ఎన్నికల ముందు సూపర్ సిక్స్, బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ఎడాపెడా హామీలు ఇచ్చారు. రూ.3 వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం వంటివి ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చాక వాటి గురించి మరచిపోయారు. ఇప్పటివరకూ నిరుద్యోగ భృతి ఊసే లేదు. 20 లక్షల ఉద్యోగాలు సృష్టించకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా పీకేశారు. అసలు ఉద్యోగాలే లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు పాలనలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది. అప్పులు పెరిగిపోతున్నాయి. బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కుటుంబ నియంత్రణ మంచిదని చెప్పి ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కనకపోతే ప్రమాదమని చెబుతున్న చంద్రబాబు భవిష్యత్తులో ఇంకేమి చెబుతారోనన్న సెటైర్లూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాధ్యతారాహిత్యం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు సమాజంపై ప్రభావం చూపుతాయనే ఆలోచన లేకుండా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా మాటలు మార్చడం, గతంలో తాను చెప్పిన మాటల్ని మరిచిపోయి అందుకు విరుద్ధంగా మాట్లాడడం చంద్రబాబుకు అలవాటైన విద్యే. అదే రీతిలో ఇప్పుడు కొత్త జనాభా సిద్ధాంతంతో ప్రజలను మళ్లీ గందరగోళంలోకి నెడుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు చంద్రబాబు చెప్పే కాకమ్మ కథలు వినే స్థితిలో లేరు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కావాలి. పిల్లల చదువుకు భరోసా కావాలి. ఆరోగ్య రక్షణ కావాలి. ప్రజల జీవన వ్యయం తగ్గాలి. అవేమీ చేయకుండా బాధ్యతారాహిత్యంగా నలుగురు పిల్లల్ని కనమని చెప్పడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు మాటలు హాస్యాస్పదం ఈ రోజుల్లో ఇద్దరు పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంది. అలాంటప్పుడు చంద్రబాబు నలుగురు పిల్లల్ని కనాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన వచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థలకు రెక్కలొచ్చి విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలన్నీ భారంగా మారాయి. ఇటువంటి తరుణంలో నలుగురు పిల్లల్ని కంటే ఎలా పోషించాలి. ఇచ్చిన ఎన్నికలు హామీలు అమలు చేయకుండా జనాభాను పెంచమని చెప్పడం సరికాదు. – రాజపు మాధవి, వెల్లటూరు, జి.కొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లాకుటుంబ నియంత్రణ మీకేనా.. మాకు అవసరం లేదా? సీఎం చంద్రబాబు కుటుంబం మాత్రం కుటుంబ నియంత్రణ పాటించాలి. ఆయనకు ఒకే ఒక్క కూమారుడు. ఆయన కుమారుడికీ ఒక్కడే కుమారుడు. పేదలం, మధ్య తరగతి వారైన మేం మాత్రం ముగ్గురు, నలుగుర్ని కనాలా? అలా కంటే పోత్సాహకాలిస్తారా? అసలు మీ మాటలను నమ్మొచ్చా? ఎన్నికలకు ముందు ఎన్ని హామీలిచ్చారు.. అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటైనా సరిగా అమలు చేశారా? – సుమతి, కర్నూలు, లేబర్ కాలనీఉన్నోళ్లకే విద్య, వైద్యం సరిగా లేదు.. నలుగుర్ని కనాలా? సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలనూ రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు మూడో బిడ్డను కంటే డబ్బులిస్తామంటే ఎలా నమ్మాలి? ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. కొత్త హామీలివ్వడం హాస్యాస్పదం. పౌరులకు సరైన విద్య, వైద్యం అందించకుండా ప్రతి జంటా ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని చంద్రబాబు చెప్పడం శోచనీయం. – అంజలి, అనంతపురం అప్పుడలా.. ఇప్పుడిలా..టీడీపీ అధినేత 90వ దశకంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించారు. ఇప్పుడు ఆయన ప్రధాని చేపట్టనున్న నియోజకవర్గాల పునరి్వభజన (డీలిమిటేషన్) వల్ల ’కుటుంబ నియంత్రణ పాటించిన’ దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోతాయని గ్రహించారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది పిల్లలు పుట్టాలని కోరుతున్నారు. – ప్రియాంకా కక్కర్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన జాతీయ ప్రతినిధి లోకేశ్‌తోనే మొదలుపెడదాం ముందున్న ఆర్థిక అనిశ్చితి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, లోకేశ్‌కు ఎక్కువ మంది పిల్లలు ఉండాలని భావిద్దాం. – పూనమ్ కౌర్, నటితర్వాత సంగతేంటి? పిల్లలు పుట్టిన తర్వాత సంగతి ఏమిటి?ఆ పిల్లలకు 20 ఏళ్ల వయసులో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుందా? వారి చదువుకు ఖర్చులు భరిస్తుందా? ఆహారం, మందులు, పెంపకం ఖర్చులు ప్రభుత్వం చూసుకుంటుందా? తీవ్ర ద్రవ్యోల్బణం, అదుపు లేని నిరుద్యోగం ఉన్న ఈ కాలంలో ప్రజలకు కావాల్సింది జీవన భద్రత. పతాక శీర్షికల్లో ఎక్కే స్కీములు కాదు. – రేణుకా చౌదరి, కాంగ్రెస్ ఎంపీతప్పుదారి పట్టించే విధానం ఈ ఆఫర్ ప్రమాదకరమైన, తప్పుదారి పట్టించే విధానం. మనకు కావల్సింది... ఆరోగ్యవంతమైన అలాగే నైపుణ్యాలున్న జనాభానే కానీ.. పోషకాహార లోపంతో బాధపడేవారు, నైపుణ్యం లేని వ్యక్తులు కాదు. పోషకాహారం, పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడి పెట్టండి. – కార్తి చిదంబరం, ఎంపీ -
ఏపీలో మూడు సెకన్లకో ఓటు ఎలా సాధ్యమైంది?
తిరుపతి అర్బన్: ‘ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) ద్వారా ఓ వ్యక్తి ఓటు వేయడానికి 17 సెకన్ల సమయం పడుతుంది. కానీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 3 సెకన్లకు ఒక ఓటు చొప్పున వేయడం ఎలా సాధ్యమైంది’ అని రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు. తిరుపతిలో ఆదివారం ‘భారత రాజ్యాంగం.. సవాళ్లు’ పేరిట లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్ జల్లి విల్సన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. పరకాల మాట్లాడుతూ.. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం స్వారీ చేస్తోందని.. దానినుంచి ప్రజలను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదన్నారు. కొత్తగా ‘సర్’ పేరుతో ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టనున్నారని చెప్పారు. దేశంలో 30 శాతం ఓట్లు గల్లంతైనా ఆశ్చర్యం లేదన్నారు. దేశవ్యాప్తంగా 16 కోట్ల మందికి ఓటు హక్కు తీసివేసే కుట్ర జరుగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో దేశంలో ఓట్లు ఉన్నవారు, ఓట్లు లేనివారు అనే రెండు వర్గాలు మాత్రమే మిగులుతాయన్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలి రైతు ఉద్యమనేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల ద్వారా లక్షల ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. సాంకేతికతలో మనదేశం కంటే ముందున్న దేశాల్లో సైతం బ్యాలెట్ ఓటింగ్ జరుగుతోందని చెప్పారు. మనదేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఓ యువ నాయకుడు స్మార్ట్ మీటర్లు పెడితే రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఆయనే స్మార్ట్ మీటర్లను ప్రోత్సహించడం విడ్డూరంగా ఉందన్నారు. నల్ల చట్టాలను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ కేంద్రానికి ఏజెంట్‌గా మారింది మాజీ ఎమ్మెల్సీ, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా మారిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ రిటైరయ్యే ముందు బీజేపీకి అనుకూలంగా 10 తీర్పులు ఇచ్చారని, అనంతరం బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. విభజన హామీలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పేద రైతులకు రుణాలు ఇవ్వడం లేదని, అయితే బడా నేతలు మాత్రం రుణాల పేరుతో బ్యాంకులను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. మన గ్యాస్‌ను స్థానికంగా ఇవ్వకుండా గుజరాత్‌కు తరలించడం దుర్మార్గమన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు దుర్మార్గం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీని వ్యతిరేకిస్తున్న వారిని చొరబాటుదారులుగా ముద్ర వేయడాన్ని తప్పుపట్టారు. రాజ్యాంగ వ్యవస్థల్ని రద్దుచేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. వ్యవస్థల్లో తప్పులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మనుషులపై మారణహోమం సృష్టించే మిలిటరీ ఇండ్రస్టియల్ హబ్‌లను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం తగదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. దేశంలో నిజానికి సంకెళ్లు వేసే వ్యవస్థ నడుస్తోందని, దీనిపై ప్రతి పౌరుడు చైతన్యవంతుడు కావాలని పేర్కొన్నారు. తప్పులను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడే ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం టీడీపీ పుట్టిందని, దాని మూలాలను చంద్రబాబు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు పి.అంజయ్య, సీపీఐ రాష్ట్ర నేత హరినాథ్‌రెడ్డి, వామపక్ష నేతలు కందారపు మురళి, వందాసి నాగరాజు, మురళి, సాయిలక్ష్మి, జయచంద్ర మాట్లాడారు. -
పెట్రో, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆటో కార్మీకులు ధ్వజమెత్తారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా మునగపాకలో ఆటో కార్మీకులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు.మెయిన్ రోడ్డు నుంచి రిక్షా స్టాండ్ వరకు ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోశారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇంధన ధరల ప్రభావం రవాణా రంగంపై పడి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలియం ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై.. నేడు వైఎస్సార్సీపీ నిరసనాగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం తీవ్ర ఆందోళనకర విషయమని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచి్చనప్పటికీ.. అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సజ్జల పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించి.. తక్షణమే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, తహశీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేయాలని ఆయన సూచించారు. వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆదివారం సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. బాబు, లోకేశ్ హామీని అమలు చేయాలి.. ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించకపోగా మరింతగా పెంచి సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతోంది. ఈ ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవన వ్యయం మరింతగా భారమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.ఆ హామీని ఇప్పుడు అమలు చేయాలి. వైఎస్సార్సీపీతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, అనుబంధ సంఘాలను కూడా కలుపుకుని పార్టీ నేతలు భారీ ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి. వైఎస్సార్సీపీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేలా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మీడియా క్యాంపెయిన్, సోషల్ మీడియా ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలి. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండండి.. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. బూత్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని మైక్రో లెవల్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ప్రతి బూత్‌లో సమర్థవంతమైన బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) నియామకం అత్యంత కీలకం. వీలైనంత త్వరగా వీరి నియామక ప్రక్రియను పూర్తి చేయాలి. ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో ప్రతీ ఓటు విలువైనది. ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. -
దోపిడీ విజన్.. స్కామ్‌కు డిజైన్
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) విజన్‌తో చంద్రబాబు సర్కారు కుంభకోణాలకు డిజైన్ చేస్తుందనడానికి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమే నిదర్శనమని మేధావులు, ఆర్థిక నిపుణులు, ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. 2015లో గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి భూ సమీకరణ చేసిన ఇదే చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆ విమానాశ్రయానికి బొంద పెడుతూ తాడికొండ మండలం రావెల వద్ద 4,618 ఎకరాల్లో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికి వడివడిగా అడుగులు ముందుకు వేస్తుండటం తెలిసిందే. అప్పట్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన 687 ఎకరాలను భూ సమీకరణ కింద తీసుకుని.. రాజధానిలో నివాస, వాణిజ్య ప్లాట్లతోపాటు కౌలు ఇస్తామన్న సమాచారాన్ని అస్మదీయులకు చేరవేసింది. దాంతో సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్, ఆలూరు బుజ్జిబాబు, ఆలూరు శ్రీనివాసరావు వంటి వారు తక్కువ ధరలకే గన్నవరం మండలం కీసరపల్లి, చిన్నఅవుటుపల్లి, బుద్ధవరం, అల్లాపురం, అజ్జంపూడి గ్రామాల్లో విమానాశ్రయం విస్తరణకు అవసరమైన భూములను కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. అవే భూములను భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) కింద గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అప్పగించి.. రాజ«ధానిలో అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లను వారు దక్కించుకున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి కీసరపల్లిలో 39.15 ఎకరాల భూమిని సీఎం చంద్రబాబు సన్నిహితుడు, సినిమా నిర్మాత చలసాని అశ్వనీదత్ భూ సమీకరణ కింద ఇచ్చి.. రాజధానిలో వెస్ట్రన్ బైపాస్కు సమీపంలో మూడు రోడ్ల కూడలిలో 17,580 గజాల వాణిజ్య ప్లాటు, దానికి సమీపంలోనే వెయ్యి గజాల చొప్పున 38 నివాస ప్లాట్లు, 150 గజాల మరొక నివాస ప్లాటును దక్కించుకున్నారు. అశ్వనీదత్ 17,580 గజాల వాణిజ్య ప్లాటును యూనియన్ బ్యాంకులో తనఖా పెట్టి రూ.85 కోట్లు అప్పు తీసుకోవడం గమనార్హం. తమకు మాత్రం తమ భూములను తనఖా పెట్టి అప్పు తీసుకోవడానికి సర్కార్ మోకాలడ్డిందంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమకు చెరువులు, ముంపు ప్రాంతాలు, శ్మశానాల పక్కన ప్లాట్లను లాటరీ పేరుతో అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గన్నవరం భూ సమీకరణలో మరో ఇన్సైడర్ ట్రేడింగ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేయడం కోసం కొత్త రన్ వే, కొత్త టెర్మినల్, ఫ్లై ఓవర్లు, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టేందుకు రూ.4 వేల కోట్ల వ్యయంతో 2015లో కేంద్రం సిద్ధమైంది. అందుకు అవసరమైన 687 ఎకరాలను తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ భూమిని భూ సమీకరణ కింద సమీకరించాలని అప్పటి చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. పట్టా భూమైతే ఎకరానికి.. మెట్ట, జరీబుతో సంబంధం లేకుండా వెయ్యి గజాల నివాస ప్లాటు, 450 గజాల వాణిజ్య ప్లాటుతోపాటు ఏడాదికి రూ.50 వేలు చొప్పున.. ప్రతి ఏటా రూ.5 వేలు పెంచుతూ పదేళ్లపాటు కౌలు ఇస్తామని నిర్ణయించింది. ఇదే విషయాన్ని అస్మదీయులకు ఉప్పందించింది. అదే రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇస్తే.. పట్టా భూమైతే అదీ జరీబు అయితేనే ఆ మేరకు ప్రయోజనం కలుగుతుంది. అదే మెట్ట భూమైతే ఎకరానికి వెయ్యి గజాల నివాస ప్లాటు, 250 గజాల వాణిజ్య ప్లాటు, ఏడాదికి రూ.30 వేల చొప్పున కౌలు ఇస్తారు. రాజధానిలో కంటే గన్నవరం విమానాశ్రయానికి భూ సమీకరణ కింద భూమి ఇస్తేనే అధిక ప్రయోజనం చేకూరుతుంది. దాంతో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు సమీకరించే 687 ఎకరాల్లో (గన్నవరం మండలం కీసరపల్లి, చిన్నఅవుటుపల్లి, అల్లాపురం, బుద్ధవరం, అజ్జంపూడి గ్రామాల్లో) పచ్చ గద్దలు వాలాయి. తమతో తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేస్తూ తొలుత అగ్రిమెంటు చేసుకుని, భూ సమీకరణ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని.. వాటిని ప్రభుత్వానికి అప్పగించారని రైతులు వాపోతున్నారు. సీఎం సన్నిహితుల్లో కొందరు ఇలా..⇒ సీఎం చంద్రబాబుకు బలుసు శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడు. రాజధానిలో భారీ ఎత్తున కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారు. ఈయన కీసరపల్లిలో సర్వే నెంబరు 280/4లో 1.80, 282/7లో 0.11, 282/8లో 0.84, 252/1ఏలో 1.42, బుద్ధవరంలో సర్వే నెంబరు 463/14లో 0.68, 463/12లో 0.45, 463/16లో 0.52, 463/15లో 0.39, 463/13లో 0.48 ఎకరాలు మొత్తం 6.69 ఎకరాలు కొనుగోలు చేసి విమానాశ్రయానికి ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించారు. ⇒ రాజధాని ప్రాంతంలో మందడం గ్రామానికి చెందిన బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. ఆయన, తండ్రితో కలిసి గన్నవరం మండలం కీసరపల్లిలో సర్వే నంబర్ 252/1బీలో 1.91 ఎకరాలు, 251/2లో 1.50, బుద్ధవరంలో 477/7లో 0.44, 477/12లో 0.89, 452/4ఏలో 0.76, 225/2లో 2.94, 250/26లో 2.53, 426/1లో 4.12 ఎకరాలు (బెజవాడ రమేష్ తండ్రి బెజవాడ సాంబశివరావు), 484/5లో 0.63, 484/4/బీ2లో 0.33, 476/3సీలో 0.35, 476/2సీలో 0.25, 476/3సీలో 1.15, 511/7లో 1.04, 460/1ఏ/2లో 0.64, 452/4సీలో 2.91, 479/4లో 1.29, 491/3బీలో ఎకరం, అల్లాపురంలో సర్వే నంబరు 8/3ఏలో 0.50, 8/3సీలో 0.50, 8/3డీలో 0.50, చిన్నఅవుటుపల్లిలో సర్వే నంబర్ 43/4/బీ2లో 0.32, అజ్జంపూడిలో సర్వే నంబరు 155/1లో 0.27, 40/3లో ఎకరం, 56/2లో 0.24, 56/3బీలో 0.17 వెరసి 28.18 ఎకరాలు కొనుగోలు చేసి గన్నవరం విమానాశ్రయానికి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు.⇒ రాజధానిలో మందడం గ్రామానికి చెందిన ఆలూరు బుజ్జిబాబు, ఆయన సోదరుడు ఆలూరు శ్రీనివాసరావులతో సీఎం చంద్రబాబుకు సాన్నిహిత్యం ఉంది. వీరు గన్నవరం మండలం కీసరపల్లిలో సర్వే నంబరు 251/1బీలో 1.91 ఎకరాలు, అజ్జంపూడిలో సర్వే నంబరు 142/2లో 0.93, 150/1లో 0.18, బుద్ధవరంలో సర్వే నంబరు 484/5లో 0.63, 516/4లో 1.21, చిన్నఅవుటుపల్లిలో సర్వే నంబరు 40/3లో ఎకరం.. వెరసి 5.86 ఎకరాలను ఆలూరు బుజ్జిబాబు.. గన్నవరం మండలం బుద్ధవరంలో సర్వే నెంబరు 426/2ఏ/1లో 3.96 ఎకరాలు, 426/1ఏలో 2.26, 516/4లో 1.21, 426/2ఏ/1లో 3.81.. వెరసి 11.24 ఎకరాలను కొనుగోలు చేసి గన్నవరం విమానాశ్రయానికి ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించారు. ⇒ గన్నవరం మండలం కీసరపల్లిలో చలసాని అశ్వనీదత్‌కు 39.15 ఎకరాల భూమి ఉంది. అశ్వనీదత్ భార్య వినయకుమారి సర్వే నంబరు 250/3లో 4, 250/5లో 4, 205/8లో 6.15, 250/6ఏలో ఎకరం, 250/7లో 4, 250/6బీలో ఎకరం.. మొత్తం 20.15 ఎకరాలు.. చలసాని అశ్వనీదత్ సర్వే నంబరు 250/3లో 5, 250/4లో 4, 250/9లో 10.. మొత్తం 19 ఎకరాలు వెరసి రూ.39.15 ఎకరాలు భూమిని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూ సమీకరణ కింద ఇచ్చారు.లాటరీలో వీళ్లకే జాక్‌పాట్!గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి వీరంతా సమీకరణ కింద భూములు ఇచ్చినందుకు రాజధాని ప్రాంతంలో వారికి నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించామని సీఆర్డీఏ చెబుతోంది. కానీ.. ప్రధాన ప్రాంతంలో రహదారులకు సమీపంలోనే చలసాని అశ్వనీదత్, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ తదిరుతలకు ప్లాట్లు ఎలా తగిలాయని, తమకు అలా ఎందుకు తగలలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.సినీ నిర్మాత అశ్వనీదత్‌కు రాజధానిలోని వెస్ట్రన్ బైపాస్ సమీపంలో మూడు రోడ్ల కూడలిలో కేటాయించిన 17,580 గజాల వాణిజ్య ప్లాటు ⇒ చలసాని అశ్వనీదత్, ఆయన భార్య భూ సమీకరణ కింద ఇచ్చిన 39.15 ఎకరాలకుగాను రాజధానిలో వెస్ట్రన్ బైపాస్కు పక్కనే.. డైమండ్ సర్కిల్‌కు అతి సమీపంలో ఉత్తరాన 15.6, తూర్పున 25, పశ్చిమాన 17 మీటర్ల రోడ్డు అంటే మూడు రోడ్ల కూడలిలో 17,580 గజాల విస్తీర్ణం కలిగిన వాణిజ్య ప్లాటు దక్కడం గమనార్హం. ఇక ఆ ప్లాటుకు అత్యంత సమీపంలోనే వెయ్యి గజాల విస్తీర్ణంతో కూడిన 38 ప్లాట్లు.. 150 గజాల విస్తీర్ణంతో కూడిన మరో నివాస ప్లాటు పక్కపక్కనే అశ్వనీదత్ కుటుంబానికి దక్కడం తమను విస్మయానికి గురిచేసిందని రాజధాని రైతులు వాపోతున్నారు.⇒ బలుసు శ్రీనివాసరావు గన్నవరం ఎయిర్‌పోర్టుకు భూ సమీకరణ కింద ఇచ్చిన భూమికి గాను.. రాజధానిలో అమృత యూనివర్సిటికీ సమీపంలో తూర్పున 50 మీటర్ల రోడ్డు, పశ్చిమాన 17 మీటర్ల రోడ్డుతో కూడిన 3,660 గజాల వాణిజ్య ప్లాటును లాటరీ ద్వారా సీఆర్డీఏ కేటాయించడం గమనార్హం. ఈ ప్లాటుకు సమీపంలోనే 25 మీటర్ల రోడ్డు పక్కనే 14,640 గజాల విస్తీర్ణంతో కూడిన నివాస ప్లాటును బలుసు దక్కించుకున్నారు.సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావుకు రాజధానిలో అమృత యూనివర్సిటీకి ఎదురుగా 50 మీటర్ల రహదారి పక్కనే కేటాయించిన 3,660 గజాల వాణిజ్య ప్లాటు ⇒ బెజవాడ రమేష్‌కు రాజధానిలో.. వెస్ట్రన్ బైపాస్ సమీపంలో అశ్వనీదత్‌కు చెందిన 17,580 గజాల వాణిజ్య ప్లాటుకు సమీపంలోనే తూర్పున 17 మీటర్లు, దక్షిణాన 25 మీటర్ల రోడ్డుతో కూడిన 5,940 గజాల విస్తీర్ణం కలిగిన వాణిజ్య ప్లాటును కేటాయించారు. దాని పక్కనే ఆలూరు బుజ్జికి 1,350 గజాల ప్లాటును ఇచ్చారు. వాటి సమీపంలోనే మిగతా వాణిజ్య ప్లాట్లు, నివాస ప్లాట్లను వారికి లాటరీ ద్వారా కేటాయించడం గమనార్హం.సీఎం చంద్రబాబు సన్నిహితుడైన బెజవాడ రమేష్‌కు అశ్వనీ దత్‌కు కేటాయించిన వాణిజ్య ప్లాటు సమీపంలోనే 5,940 గజాలతో కూడిన రెండు ప్లాట్లను కేటాయించిన సీఆర్డీఏ ఆ భూముల విలువ రూ.5,338 కోట్లు.. అభివృద్ధి పనులకు రూ.4 వేల కోట్లు రాజధానిలో కేటాయించిన నివాస ప్లాట్ గజం రూ.50 వేల చొప్పున ఎకరానికి వచ్చే వెయ్యి గజాలకు రూ.5 కోట్లు.. వాణిజ్య ప్లాట్ ధర రూ.2.70 కోట్లు పలుకుతుందని 2024 సెప్టెంబర్‌లో సీఆర్డీఏ వేసిన అంచనాల ఆధారంగా ప్రపంచ బ్యాంకుకు చంద్రబాబు సర్కార్ నివేదిక ఇచ్చింది. ఈ లెక్కన గన్నవరం విమానాశ్రయం కోసం తీసుకున్న 687 ఎకరాలకుగాను రాజధానిలో కేటాయించిన నివాస, వాణిజ్య ప్లాట్ల విలువ రూ.5,298 కోట్లు. ఎకరానికి పదేళ్లకు కౌలు రూ. 7.25 లక్షల చొప్పున 687 ఎకరాలకు రూ.49.80 కోట్లు. ఈ లెక్కన గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం తీసుకున్న భూమి విలువ రూ.5,347.80 కోట్లన్నమాట.ఈ ఎయిపోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ.4 వేల కోట్లు వ్యయం చేసింది. అంటే.. ఈ ఎయిర్పోర్ట్ కోసం రూ.9,338.80 కోట్ల మేర ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. 2024 వరకు గన్నవరం విమానాశ్రయాన్ని రాజ«దానిలో అంతర్భాగంగానే ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇది రాజధాని ప్రాంతానికి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ నేపథ్యంలో రాజధానికి మరో విమానాశ్రయం అవసరం ఎంతమాత్రం లేదని మేధావులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజధానిలో నివాస ప్లాటు గజం రూ.50,000.. వాణిజ్య ప్లాటు రూ.2.70 కోట్లు పలుకుతుందని 2024 సెప్టెంబర్‌లో సీఆర్డీఏ వేసిన అంచనా ఆధారంగా ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ‘డబ్బుల్’ ధమాకాకు స్కెచ్⇒ రాజధాని నిర్మాణం కోసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడికొండ, మంగళగరి మండలాల పరిధిలోని 29 గ్రామాలలో ప్రభుత్వం 2015లో 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించింది. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి కలిపి 53,748 ఎకరాల్లో (217 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించింది.⇒ ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తామంటూ అప్పట్లో సీఎం చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు.. మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు.. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చినా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని, దాన్ని అమ్మగా వచ్చే నిధులతో అమరావతి తనను తానే నిర్మించుకుంటుందని సీఎం చంద్రబాబు అనేకసార్లు సెలవిచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ గొప్పలు చెప్పారు.⇒ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 29 గ్రామాలకే రాజధాని పరిమితమైతే చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల ధరలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్‌కు భూములు లేవని చెప్పడంతో రైతులు విస్తుపోతున్నారు.⇒ వాటి కోసం 11 గ్రామాల్లో 44,676.74 ఎకరాల సమీకరణకు లీకులు ఇచ్చారు. రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని పసిగట్టి.. దాన్ని చల్లార్చేందుకు మలి విడతలో 20,484 ఎకరాలకు సమీకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదే సమయంలో తాడికొండ మండలం రావెల వద్ద 4,618 ఎకరాల్లో రూ.3,409 కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆ భూమిని సేకరించాలా? సమీకరించాలా అన్నది నిర్ణయిస్తామని ప్రభుత్వం చెబుతోంది.⇒ ఇప్పటికే రాజధానికి సమీకరించిన 53 వేల ఎకరాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.1.50 లక్షల కోట్లు అవసరం. తాజాగా సమీకరిస్తున్న 20,484 ఎకరాలతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీకరించే భూమిని కలుపుకుంటే ఆ సౌకర్యాల కోసం మరో రూ.1.50 లక్షల కోట్లు అవసరమని నిపుణులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి ఆ వ్యయం రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఆ రూ.3 లక్షల కోట్లను అప్పుగా తేవాల్సిందే.⇒ ఈ అప్పును వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అవసరమవుతాయో అంచనా వేసుకోవచ్చని, ఇలాగైతే రాజధాని రాష్ట్రానికి గుదిబండగా మారడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజధానిలో భూముల ధరలు పెంచుకోవడం.. ఎయిర్‌పోర్టు పనులను అస్మదీయునికి అప్పగించి కమీషన్లు దండుకోవడం కోసం చంద్రబాబు సర్కారు గన్నవరం ఎయిర్‌పోర్టుకు మంగళం పాడటంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నకిలీ నోట్ల ముఠా పట్టివేత
కార్వేటినగరం: రూ.10 లక్షలకు రూ.కోటి నకిలీనోట్లు ఇస్తామంటూ ఇద్దరిని మోసగించిన ఐదుగురిని చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు పోలీసులు కాగా ఒకరు టీడీపీ నాయకుడు. జీడీ నెల్లూరు మండలం బట్టుకండ్రిగ డంపింగ్ యార్డు వద్ద శనివారం అరెస్టు చేసిన నిందితుల్ని ఆదివారం చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రిమాండ్ విధించడంతో నిందితుల్ని చిత్తూరు జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సెల్వం.. మిట్టవేల్కూరు గ్రామ టీడీపీ నాయకుడు. సెల్వం కుమారుడు డిచ్ సీఎం చంద్రబాబునాయుడుతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుల్లో లోకనాథం చిత్తూరులో ట్రాఫిక్ ఏఎస్ఐగా పనిచేస్తుండగా, రవిచంద్రన్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్.ఈ కేసు వివరాలను జీడీ నెల్లూరు పోలీసులు ఆదివారం తెలిపారు. వారు తెలిపిన మేరకు.. వేలూరు జిల్లా సైదాపేటకు చెందిన ఇళంగోవన్, జీడీ నెల్లూరు మండలం మిట్టవేల్కూరు దళితవాడకు చెందిన సెల్వం, అదే గ్రామానికి చెందిన లక్ష్మణకుమార్, వేల్కూరు గ్రామానికి చెందిన రవిచంద్రన్ (రవి), పెనుమూరు మండలం గుడ్యాణంపల్లికి చెందిన లోకనాథం (లోక) ముఠాగా ఏర్పడి నకిలీనోట్లు ఇస్తామని తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మంజు, విజయ్‌లను సంప్రదించారు.రూ.10 లక్షలు ఇస్తే రూ.కోటి నకిలీనోట్లు ఇస్తామని చెప్పి బట్టుకండ్రిగ వద్దకు పిలిచారు. వారితో ముఠాలోని కొందరు సభ్యులు మాట్లాడుతుండగా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకుని బెదిరించి బాధితుల వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు లాక్కెళ్లారు. బాధితులు వెంటనే జీడీ నెల్లూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. -
ఇదేం ‘టెక్నిక్’ మహాశయా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఎంతో బాధ్యతాయుతంగా మూల్యాంకనం చేయాల్సిన పాలిటెక్నిక్ వార్షిక పరీక్షల జవాబు పత్రాలను ఇష్టానుసారం చేస్తున్నారు. ఇప్పటికే కాంట్రాక్టు లెక్చరర్లను పక్కనబెట్టి, ప్రైవేటు కాలేజీ లెక్చరర్లకు బాధ్యతలు అప్పగించిన అధికారులు.. వ్యాల్యూయేషన్ చేయాల్సిన పేపర్ల టార్గెట్లను రెట్టింపు చేస్తూ లెక్చరర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తమ పని చేసుకుపోతున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్’(ఓఎస్ఎం) విధానంతో లెక్చరర్లు ఎక్కడి నుంచైనా పేపర్లు దిద్దే వెసులుబాటు కల్పించారు. ఇందులో ఎవరు పేపర్ దిద్దుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. వ్యాల్యూయేషన్లో పాల్గొనే లెక్చరర్లకు లాగిన్ ఐడీలు ఇచ్చినా వారే దిద్దుతున్నట్టు గుర్తించే పరిస్థితి లేదు. దీంతోపాటు రోజుకు ఒక్కో లెక్చరర్ ఎన్ని పేపర్లు దిద్దాలి ? దిద్దిన పేపర్లు పరిశీలన వంటి అంశాలను పూర్తిగా గాలికొదిలేశారు. గతనెల 23న వ్యాల్యూయేషన్ ప్రారంభమైనా ఇంతవరకు లాగిన్ అవ్వని లెక్చరర్లు చాలామందే ఉన్నారంటే పర్యవేక్షణ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని దిద్దితే అన్ని పేపర్లు.. 32 పేజీలు కలిగిన స్క్రిప్టు పేపర్లు 1.20 లక్షల మంది విద్యార్థుల 7 లక్షల జవాబు పత్రాలను ఒక్కో లెక్చరర్ రోజుకు 40 మాత్రమే దిద్దాలి. కానీ సాంకేతిక విద్యశాఖ ఇంజినీరింగ్ సబ్జెక్టులు 80 పేపర్లు, జనరల్ సబ్జెక్టులైతే 100 మూల్యాంకనం చేయాలని ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఆన్లైన్లో మూల్యాంకనం చేసేటప్పుడు ప్రతి లెక్చరర్‌కు రోజుకు దిద్దాల్సిన పేపర్లు టార్గెట్ పూర్తికాగానే లాగిన్ క్లోజ్ చేయాలి. అయితే ఆరోజు మూల్యాంకనం లక్ష్యం పూర్తయిన వారికి మరికొన్ని పేపర్లు వచ్చిపడుతున్నాయి.దీంతో కొందరు లెక్చరర్లు రోజుకు 120 పేపర్లు కూడా వ్యాల్యూ చేస్తున్నట్టు సమాచారం. రోజుకు 40 పేపర్లు మాత్రమే దిద్దితే నాణ్యత ఉంటుందని, వందలాది పేపర్లు వ్యాల్యూ చేయడమంటే విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టడమేనని కొందరు సీనియర్ లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ పేపర్లను ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు దిద్దేవారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం గతేడాది ‘నో వర్క్–నో పే’ విధానం అమలు చేసి కాంట్రాక్టు లెక్చరర్లను వ్యాల్యూయేషన్‌కు దూరం చేసింది.కొరవడిన పర్యవేక్షణ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. గతంలో పేపర్ల మూల్యాంకనం అనంతరం బుక్‌లెట్‌లోని ప్రతి పేపర్‌ను సరిగా దిద్దారా లేదా అని పరిశీలించి, అనంతరం చీఫ్ ఎగ్జామినర్‌కు పంపేవారు. కానీ ప్రస్తుత విధానంలో మూల్యాంకనం చేసే ఎగ్జామినర్, ఆపైన పరీక్షల కంట్రోలర్ మాత్రమే ఉన్నారు. ఎగ్జామినర్ పేపర్లు దిద్దడం పూర్తవగానే, వారికి మరిన్ని పేపర్లు పంపడం తప్ప.. దిద్దిన పేపర్లలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని పరిశీలించేవారు లేరు.ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన పేపర్లలో ర్యాండమ్‌గా 10 పేపర్లు చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించాలి. కానీ ఇక్కడ చీఫ్ ఎగ్జామినర్ ఉన్నా పరిశీలన లేకుండానే బుక్‌లెట్‌లోని చివరి పేజీ మాత్రం చూసి ‘ఓకే’ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, దీనిపై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) కార్యదర్శిని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆన్లైన్ మూల్యాంకనంలో 24 గంటలు పేపర్లు దిద్దే వెసులుబాటు కల్పించామన్నారు. రోజుకు 60 పేపర్లు మాత్రమే వస్తాయని, అంతకు మించి మూల్యాంకనం టార్గెట్లు పెట్టలేదంటున్నారు. -
దటీజ్.. చం‘ధర’బాబు.. నాడు కోతలు.. నేడు వాతలు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమికి అధికారం కట్టబెడితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఊరూరా తిరిగి ప్రచారం చేసిన చంద్రబాబు ఆ పని చేయకపోగా ఇప్పుడు పెంచి ప్రజలను మోసం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు తనయుడు లోకేశ్ సైతం పెట్రోల్ బంకుల ఎదుట సెల్పిలు దిగిమరీ.. రాష్ట్రంలో పెట్రో ధరలను పక్క రాష్ట్రాలతో పోల్చి విమర్శలు చేశారు. ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సభల్లోను, టీడీపీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోను పెట్రోల్, డీజిల్‌పై ధరలను భారీగా తగ్గిస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయమే మరిచిపోయారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇప్పుడు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3కు పైగా పెరిగినా చోద్యం చూస్తూ సామాన్యులపై అదనపు భారాన్ని మోపారు. రాష్ట్రంలో సరికొత్త రికార్డులు ప్రస్తుతం రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.62, డీజిల్ ధర రూ.101.24 కు చేరింది. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో లీటర్ పెట్రోల్‌పై దాదాపు రూ.28 వరకు స్టేట్ సెస్ ఉంది. అధికారంలోకి రాగానే ఈ సెస్సుల్లో 50 శాతం తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ.. ఇప్పుడు ఆ 50 శాతం తగ్గింపు మాట దేవుడెరుగు.. ఉన్న ధరలపైనే అదనంగా రూ.3కు పైగా వడ్డించడంతో జనం బెంబేలెత్తుతున్నారు. జనాల జేబులకు భారీ చిల్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం రోజుకు రూ.10 కోట్లు. పెట్రోల్‌పై లీటరుకు రూ.3.29, డీజిల్‌పై లీటరుకు రూ.3.14 పెరిగింది. అంటే.. పెట్రోల్‌పై రోజుకు దాదాపు రూ.3.29 కోట్లు, డీజిల్‌పై రోజుకు దాదాపు రూ.6.71 కోట్ల అదనపు భారం రాష్ట్ర ప్రజలపై పడుతోంది. ఈ భారం నెలకు రూ.300 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.3,600 కోట్లను ప్రభుత్వం సామాన్య ప్రజల జేబుల నుంచి లాగేసుకుంటోంది. నాడు ‘బాదుడే బాదుడు‘ అంటూ రోడ్లెక్కిన టీడీపీ నాయకులు ఇప్పుడు అధికారంలో ఉండి ఇంత పెద్దమొత్తంలో ప్రజలపై భారం వేయడం ఏమిటని విపక్షాలు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.ఆటో డ్రైవర్ల కన్నీళ్లు.. నిత్యావసరాల మంటలు ఎన్నికల సభల్లో చంద్రబాబుఆటో డ్రైవర్లను ఆలింగనం చేసుకుని ‘మీ కష్టాలు నాకు తెలుసు. ఇంధన ధరలు తగ్గించి మిమ్మల్ని ఆదుకుంటా’ అని నమ్మబలికారు. కానీ.. ఇప్పుడు డీజిల్ ధర రూ.100 దాటడంతో ఆటో కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. సంపాదనంతా ఇంధనానికే సరిపోతుంటే.. కుటుంబాలను ఎలా పోషించాలని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. డీజిల్ ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా పడింది. రవాణా చార్జీలు పెరగడంతో మార్కెట్లో కూరగాయలు, పప్పులు, బియ్యం వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి.ఫలితంగా మధ్యతరగతి, పేద కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. మన రాష్ట్రంలోనే ఎందుకు ఎక్కువ ధరలు ఉన్నాయి, వీటిని ఎందుకు తగ్గించడం లేదనే దానికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు ఎన్నికలకు ముందు తాను చేసిన వాగ్దానాలు గుర్తు చేసుకుని ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల ముందు పెట్రోల్ బంకుల వద్ద డ్రామాలాడిన లోకేశ్ ఇప్పుడు ఎందుకు మౌనముద్ర దాల్చారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్దఎత్తున హడావుడి చేసి ఇప్పుడు ప్రజలపై మరింత భారాలు మోపుతుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో తక్కువ.. ఏపీలోనే ఎక్కువప్రస్తుతం ఏపీ కంటే పొరుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. మన పక్కనే ఉన్న తమిళనాడులో లీటర్ పెట్రోల్ ధర రూ.103.67 ఉంటే, కర్ణాటకలో రూ106.17 ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.110.89 ఉంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం తాజాగా పెంచిన రూ.3 వడ్డింపుతో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.113.62కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ రూ.98.96 ఉండగా, బెంగళూరులో రూ.94.10, చెన్నైలో రూ.95.25 మాత్రమే ఉంది. మన రాష్ట్రంలో మాత్రం రూ.101.24 దాటేసింది. దేశంలోనే అత్యధిక ధరలు ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ నిలిచింది. పక్క రాష్ట్రాల కంటే లీటరుకు రూ.3 నుండి రూ.10 వరకు అదనంగా బాదుతుండటంతో జనం అల్లాడుతున్నారు. -
భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య
కిర్లంపూడి: నవ వధువు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు..కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన సత్యంశెట్టి వెంకటేశులు దంపతుల మూడవ కుమార్తె వెంకటలక్ష్మి (25)కి ఏప్రిల్ 25న పిఠాపురం మండలం మర్లావకు చెందిన గాది దుర్గాకోటేశ్వరరావుతో వివాహమైంది. దుర్గాకోటేశ్వరరావు పెళ్లి జరిగిన మూడో రోజే తనకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ వీడియోలు, ఫొటోలు ఆమెకు చూపించాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి అప్పటినుంచి అన్యమనస్కంగా ఉంటోంది. ఆచారాల్లో భాగంగా మూడు సార్లు అత్తారింటికి వెళ్లి వచ్చిన ఆమె గోనేడలోని తన తల్లిదండ్రుల ఇంటివద్దే ఉంటోంది. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాల విషయాన్ని తట్టుకోలేక శనివారం రాత్రి తన గదిలోని ఫ్యానుకు చీరకట్టి ఉరి వేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు.కాగా, వెంకటలక్ష్మి తల్లిదండ్రులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహాలు కాగా, చిన్న కుమార్తె వెంకటలక్ష్మిని డిగ్రీ వరకు చదివించి గత నెలలోనే పెళ్లి చేశాడు. తమ బాధ్యతలు తీరాయని సంతోషపడేలోపే ఈ దారుణం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి సత్యంశెట్టి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త దుర్గాకోటేశ్వరరావు, అత్త నూకామణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రాంగ్ రూట్లో దూసుకొచ్చిన మృత్యువు
బంటుమిల్లి: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలోని బంటుమిల్లి–గుడివాడ రోడ్డులో పెదతుమ్మిడి మీడియం డ్రెయిన్ వంతెన వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మండలంలోని చినతుమ్మిడి గ్రామానికి చెందిన అక్కచెల్లెళ్ల కొడుకులు వేముల శివయ్య(30), కాగిత అమలేశ్వరరావు(30) ద్విచక్రవాహనంపై వేకువజామున ఆదివారం మార్కెట్‌కు బయలుదేరారు. బంటుమిల్లి వైపు వంతెన దాటిన కొద్ది అడుగుల దూరంలోనే ఎదురుగా వేగంగా వస్తున్న వ్యాన్ వీరి బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో బైక్‌పై ఉన్న శివయ్య, అమలేశ్వరరావు డ్రెయిన్‌లో పడిపోయారు.బైక్ పూర్తిగా ధ్వంసం కాగా, వ్యాన్ కూడా డ్రెయిన్‌లో పడిపోయింది. ప్రమాదంలో శివయ్య అక్కడికక్కడే మరణించగా, అమలేశ్వరరావును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దిశమర్రులో చెరువుల వద్ద మేత కట్టలు దించి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న వ్యాన్ డ్రైవరు బాలిన సుబ్బారావు మద్యం, నిద్రమత్తులో రాంగ్ రూట్లో వచ్చి బైక్‌ను ఢీకొట్టాడని స్థానికులు తెలిపారు. అక్కడే ఉన్న కొందరు ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు శివయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. చినతుమ్మిడిలో విషాదం ఈ ఘటన చినతుమ్మిడిలో విషాదం నింపింది. మృతులిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు కావడంతో రెండు కుటుంబాల వారి రోదనలు మిన్నంటాయి. డ్రెయిన్ వంతెన వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి ఆర్అండ్బీ అధికారులే బాధ్యత వహించాలని స్థానికులు ఆరోపించారు. -
బాబూ.. హామీలు ఎప్పుడు అమలు చేస్తావు?
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు వెంటనే అమలు చేయాలని బీసీ మేధోమథన సదస్సు డిమాండ్ చేసింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అధ్యక్షతన విజయవాడలో ఆదివారం ‘బీసీల మేధోమథనం’ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తమ డిమాండ్లను తీర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఆమోదించిన తీర్మానాలను ‘విజయవాడ బీసీ డిక్లరేషన్’ పేరుతో బీసీ సంఘం నేతలు ప్రకటించారు. జనగణనతోపాటు సమగ్ర కుల గణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ మస్తానమ్మ కోరారు. బీసీ రక్షణ చట్టం తెస్తామన్న హామీని రెండేళ్లు గడిచినా చంద్రబాబు అమలు చేయలేదని, తక్షణం చట్టం తేవాలని బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడా సీతా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి, బీసీ సంఘం నేతలు కన్నా మాస్టారు, బ్రహ్మానంద శర్మ, లంకా వెంకటేశ్వరరావు, అన్నవరపు నాగేశ్వరరావు, పారేపల్లి మహేష్, మూర్తి తదితరులు మాట్లాడారు.బలవంతులమని నిరూపిద్దాం బీసీలను బలహీనవర్గాలు అని పిలిచే వారిని ఉపేక్షించవద్దు. మనం బలహీనులం కాదు.బలవంతులమని నిరూపిద్దాం. ఇచి్చన హామీలను అమలు చేయాలని యాచించే స్థాయిలో మనం ఉండకూడదు. మనం శాసించే స్థాయికి ఎదగాలి. బీసీలందరూ సంఘటితమైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మన కాళ్ల దగ్గరకే వస్తారు. పల్లె పల్లెకు బీసీ ఉద్యమాన్ని విస్తరిస్తాం. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ బీసీల అడ్డాగా మారుతుంది. – జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు హామీల అమలుకు పోరాటం చేద్దాం ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పోరాటం చేద్దాం. బీసీ హక్కులు కాపాడుకునేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమ కార్యాచరణ చేపడతాం. – కేసన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐక్యంగా ఉద్యమిద్దాం ఎన్నికల ముందు బీసీల ఓట్లు కోసం వారికి ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు..తీరా అధికారం చేపట్టి రెండేళ్లయినా వాటిని అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఇప్పుడు మనం జనాభాల్లో అత్యధికంగా ఉన్నప్పటికీ పాలకులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇచ్చిన హామీలను అమలు చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తెద్దాం. ఆ మేరకు బీసీ సంఘాలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐక్యంగా ఉద్యమిద్దాం. – బీసీ రమేష్, బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ప్రత్యేక విమానాలకు పొదుపు ఆంక్షల మినహాయింపు!
సాక్షి, అమరావతి: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అస్థిరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పొదుపు చర్యల్లో ప్రత్యేక విమానాల వినియోగంపై మాత్రం ఆంక్షల్లేవు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వనరుల పరిరక్షణ, స్వావలంబన కార్యాచరణ ప్రణాళికలో ప్రత్యేక విమానాల వినియోగం గురించి అసలు ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. అంటే ఎప్పటిలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌కు ప్రత్యేక విమానాలను వినియోగిస్తారని, వీరికి వెసులు బాటులో భాగంగానే ఎటువంటి ఆంక్షలు విధించలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలకు వెళ్లినా, లేదా హైదరాబాద్ వెళ్లినా, లేక మరో రాష్ట్రానికి వెళ్లినా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, ఐటీ శాఖ మంత్రి ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా ఆమోదిస్తే తప్ప, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యనిర్వాహకులు, కన్సల్టెంట్లు, బోర్డు సభ్యుల అనవసర విదేశీ ప్రయాణాలను రాబోయే ఆరు నెలల పాటు నిలిపివేయాలని కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేశారు. ఈ ప్రణాళిక అమలును పర్యవేక్షించడానికి సీఎస్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. 15 రోజులకోసారి ఈ కమిటీ సమావేశమై సమీక్షించాలి. కార్యాచరణ ప్రణాళిక ఇలా..⇒ పీఎం ఉజ్వల యోజన ఎల్పీజీ కనెక్షన్లకు సంబంధించి అనర్హులను గుర్తించి వారి కనెక్షన్లు తొలగింపు. ఇందుకోసం ఆయిల్ మార్కెట్ కంపెనీలు, రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. తద్వారా సబ్సిడీ లీకేజీలను తగ్గించాలి. ⇒ వంట నూనె వినియోగాన్ని తగ్గించడంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అధిక నూనె వినియోగంతో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులకు గల సంబంధాన్ని తెలియజేస్తూ ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలి. అధిక వంట నూనె వినియోగాన్ని తగ్గించడం, పోషకాహార అవగాహనను మెరుగు పరచడంపై స్వయం సహాయక బృందాలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు దృష్టి సారింపు. ⇒ సహజ వ్యవసాయం, ఎరువుల తగ్గింపుపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలను జిల్లా, మండల స్థాయిల్లో చేపట్టాలి. సహజ వ్యవసాయాన్ని, ఎరువుల వినియోగాన్ని తగ్గించడంపై రైతు భరోసా కేంద్రాలు చురుకుగా ప్రోత్సహించాలి. నానో ఎరువులపై దృష్టి పెట్టాలి.⇒ మంత్రుల సిబ్బంది ఈవీలను తప్పనిసరిగా వినియోగించేలా చూడాలి. ప్రభుత్వ విభాగాలు, భద్రతకు కేటాయించని వాహనాలను, పరిపాలనా వాహన సముదాయాలను దశల వారీగా ఈవీల వైపు మళ్లించాలి. ⇒ మంత్రులు, సీనియర్ అధికారులు, ఎంపిక చేసిన ప్రజా కార్యక్రమాల కోసం ప్రజా రవాణాను వినియోగించాలి. ⇒ రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలలో అనవసరమైన కాన్వాయ్‌లు, మోటార్ ఊరేగింపులు, అలంకరణ దీపాలు, డీజిల్ జనరేటర్ల వాడకాన్ని తగ్గించాలి. ⇒ మంత్రుల కార్యాలయాలు, ప్రభుత్వ నివాసాలు, అధికారిక భవనాలలో రూఫ్‌టాప్ సోలార్‌ను తప్పనిసరిగా ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేయాలి. ⇒ అర్హులైన ఉద్యోగులు వారానికి రెండు రోజులు స్వచ్ఛందంగా ఇంటి నుండి పని చేసేలా ప్రోత్సహించడం. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు సెమినార్లు, వర్క్‌షాప్‌లు, అకడమిక్ కాన్ఫరెన్స్‌ల కోసం హైబ్రిడ్ విధానాలను అవలంబించేలా ప్రోత్సహించాలి. -
దేశద్రోహం.. మనోళ్లే వదిలేద్దాం!
‘మనోళ్లు’ అయితే దేశ ద్రోహానికి పాల్పడినా సరే సమ్మతిస్తాం అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎంతగా అంటే మావోయిస్టులకు టెలీ కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం, నగదు సరఫరా చేసిన ఓ అస్మదీయ కాంట్రాక్టరుకు వత్తాసు పలుకుతూ, ఆ కేసును నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు.. టీడీపీకి వీర విధేయుడైన ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్‌బుక్ అరాచకాలకు అండగా నిలుస్తున్నారు. సాక్షి, అమరావతి : ‘మనోళ్లు’ అయితే దేశ ద్రోహానికి పాల్పడినా సరే సమ్మతిస్తాం.. సమగ్ర విచారణ లేకుండా కనికట్టు చేస్తాం.. అని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ఎంతగా అంటే మావోయిస్టులకు టెలీ కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం, నగదు సరఫరా చేసిన అస్మదీయ కాంట్రాక్టరుకు వత్తాసు పలుకుతోంది. ఆ కేసును నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. ఆ మావోయిస్టులే గిరిజన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతోపాటు కొందరు పోలీసులను హతమార్చారని తెలిసినా సరే ఉద్దేశ పూర్వకంగా ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది.ఎందుకంటే ఆయన అధికార టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు.. టీడీపీకి వీర విధేయుడైనా ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్‌బుక్ అరాచకాలకు అండగా నిలుస్తున్నారు. ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ లేకుండా విషయాన్ని కప్పిపుచ్చేందుకే ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీని ప్రభుత్వ పెద్దలు, పోలీసు పెద్దలు కట్టడి చేస్తున్నారు. పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం కథ కమామిషు ఇలా ఉంది. ఏవోబీలో మావోయిస్టులకు కీలక పరికరాలు, నిధులు 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీకి అనుకూల బడా కాంట్రాక్టు సంస్థకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కాంట్రాక్టు పనులు కట్టబెట్టారు. ఆ సంస్థ ప్రధానంగా అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలో కాంట్రాక్టు పనులు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ యజమానికి మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. భయంతోనో, ఇతరత్రా కారణాలతోనో ఆయన మావోయిస్టులకు భారీగా నిధులు సమకూర్చడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) వర్గాలు గుర్తించాయి.ఎస్ఐబీ వర్గాలు ఇచ్చిన సమాచారంతో 2016లో అరకు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఆ కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాల్లో భారీగా టెలీ కమ్యూనికేషన్ పరికరాలు (నిఘా పరికరాలు), బంగారం, నగదు, ఇతర సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. మావోయిస్టు పార్టీ ఏవోబీ కార్యదర్శిగా ఉన్న గాజర్ల రవి బృందానికి వాటిని సరఫరా చేయడానికి తీసుకువెళుతున్నట్టు విచారణలో వెల్లడైంది.ఎన్నో ఏళ్లుగా ఆ కాంట్రాక్టు్ట సంస్థ మావోయిస్టులకు భారీగా నగదు, ఇతర పరికరాలు సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. అప్పటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి, ఆ కాంట్రాక్టు సంస్థ మేనేజర్‌ను అరెస్టు చేశారు. దేశ ద్రోహ నేరంగా యూఏపీఏ (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టం, టెలీగ్రాఫ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. దాంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి మావోయిస్టులకు ఎన్నేళ్లుగా ఆర్థిక సహయం అందిస్తోంది.. మావోయిస్టులను ఏఏ ప్రాంతాల్లో కలుస్తున్నది.. ఈవ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులెవరనేది గుర్తిస్తారని అంతా భావించారు. కుట్రతో కేసును నీరుగార్చిన అధికారి ⇒ సరిగ్గా అప్పుడే అప్పటి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు అధికారి రంగ ప్రవేశం చేశారు. టీడీపీకి వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన అవినీతి గురించి అప్పటికే కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ కేసులో బడా కాంట్రాక్టు సంస్థ యజమానితో ఆయన కుమ్మక్కు అయ్యారు. అందుకు భారీగా ముడుపులు ముట్టినట్టు సమాచారం. అందుకే దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరానికి పాల్పడినా సరే, బరితెగించి పక్కాగా కేసును నీరుగార్చేందుకు కథ నడిపారు. ⇒ నిబంధనల ప్రకారం సంఘటన స్థలంలో అరెస్టు అయిన కాంట్రాక్టు సంస్థ మేనేజర్‌నే కాకుండా నిధులు అందించిన కాంట్రాక్టు సంస్థ యజమానిని నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేయాలి. ఎందుకంటే యజమాని ఇచ్చిన నిధులు, పరికరాలనే మేనేజర్ మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకువెళుతున్నారు. కానీ ఆ ఐపీఎస్ అధికారి మాత్రం కేవలం మేనేజర్‌పైనే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టు సంస్థ యజమానిని కనీసం పిలిచి విచారించనూ లేదు. ⇒ యూఏపీఏ కేసులను డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలి. చార్జ్‌షిట్ దాఖలు చేయాలి. కానీ ఐపీఎస్ అధికారి ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసులో తాను చెప్పింది చెప్పినట్టు చేసే ఓ సీఐకి విచారణ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఆయనతో చార్జ్‌షిట్ దాఖలు చేయించారు. ⇒ యూఏపీఏ కేసులను జిల్లా కేంద్రంలోని మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం విచారించాలి. కానీ ఐపీఎస్ అధికారి ఆ కేసును అరకు న్యాయస్థానంలో విచారణకు పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా కూడా పోలీసు అధికారులు నిందితులకు అనుకూలంగా వ్యవహరించారు. ⇒ఈ నేపథ్యంలో దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరం కేసులో కూడా నిందితులను న్యాయస్థానం విడిచిపెట్టింది. పైగా అరకు న్యాయస్థానం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేయకపోవడం గమనార్హం. ఆ బడా కాంట్రాక్టర్ తమకు అస్మదీయుడు కావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు కూడా చూసీ చూడనట్టు వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమగ్ర విచారణకు ఆదేశం ⇒ 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ కేసు విషయం బయటపడింది. ఆ కాంట్రాక్టు సంస్థ సమకూర్చిన నిధులతోనే 2018లో మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి బృందం అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సోమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేశారని కూడా గుర్తించింది. ఎంతో మంది పోలీసులను హతమార్చడానికి కూడా ఆ నిధులనే వాడుకున్నారని వెల్లడైంది. దేశ ద్రోహానికి పాల్పడిన కేసులో నిందితులకు పోలీసులు అండగా నిలవడం ఏమిటని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ⇒ ఫలితంగా కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లా ఎస్పీ ఈ కేసును సమగ్రంగా విచారించాలని విశాఖపట్నంలోని ఏడీజే న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల మేరకు డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలని, కాంట్రాక్టు సంస్థ యజమానిని నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సమగ్రంగా విచారించాలని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కేసును సమగ్రంగా విచారించాలని ఆదేశించింది. ⇒ దాంతో బడా కాంట్రాక్టరు, ఐపీఎస్ అధికారి (ఆయన అప్పటికి అమరావతికి బదిలీ అయ్యారు) బెంబేలెత్తారు. కేసు సమగ్రంగా విచారిస్తే ఇద్దరి బాగోతం బయట పడుతుందని ఆందోళన చెందారు. అందుకే విశాఖపట్నం జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే మళ్లీ పాత కథే⇒ హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంతో పోలీసు శాఖ ప్రాధాన్యతలు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే బడా కాంట్రాక్టర్, అవినీతి ఐపీఎస్ అధికారి ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. ఆ బడా కాంట్రాక్టర్ టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చారు. ఇక ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్‌బుక్ అరాచకాలకు అండగా నిలుస్తూ బరితెగించి ‘అవినీతి అనకొండ’గా చెలరేగిపోతున్నారు.⇒ ఈ కేసును సమగ్రంగా విచారిస్తే వారిద్దరి బాగోతం బయట పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సమగ్రంగా విచారించాలని విశాఖపట్నం జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో తోసిపుచ్చింది. కాగా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని పోలీసు శాఖలో కొందరు సూచించారు. ⇒ హైకోర్టు తీర్పు వెలువడిన 90 రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయాలి. లేకపోతే ఆ కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడకుండానే శాశ్వతంగా మూసి వేసినట్టు అవుతుంది.. జాతీయ స్థాయిలో ఏపీ పోలీసు శాఖకు తీరని మచ్చగా మిగిలిపోతుంది.. మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు, ఇతర కుటుంబాలను అవమానించినట్టు అవుతుందని వారు స్పష్టం చేశారు. అయినా సరే ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం మాత్రం సుముఖంగా స్పందించలేదని తెలుస్తోంది.⇒ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసేందుకు ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా 90 రోజుల గడువు ముగిసేలా చేయాలన్నదే ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం, ఏఎస్ఆర్ జిల్లా పోలీసుల ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది. కేవలం అస్మదీయ కాంట్రాక్టర్, రెడ్‌బుక్ వేధింపులకు అండగా నిలుస్తున్న అవినీతి ఐపీఎస్ అధికారి కోసం ఏకంగా దేశద్రోహం కేసునే అడ్డగోలుగా మూసి వేసేందుకు బరితెగించడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. -
రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది
నూజివీడు: రైతు బాధలను పట్టించుకోని రైతు వ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని.. మామిడి, మొక్కజొన్న రైతులను గాలికి వదిలేశారని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో మామిడి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పేర్ని నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయని దుర్మార్గ ప్రభుత్వం ఉండటం రైతుల దౌర్భాగ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,400ల మద్దతు ధర ప్రకటిస్తే దళారులు కేవలం రూ.1,700లకే కొనుగోలు చేస్తున్నారని.. ఫలితంగా రైతులు రూ.700 నష్టపోతున్నారని చెప్పారు. రైతుల బాధలు, వారు సాగుచేసే పంటల గురించి తెలియని మంత్రి ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా ఉన్నాడని.. పైగా, పంటలే సాగుచేయని సింగపూర్ దేశానికి వెళ్లి శిక్షణపొంది వచ్చారని ఎద్దేవా చేశారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. మామిడికి రాజకీయ ‘మంగు’.. ప్రసిద్ధి చెందిన నూజివీడు మామిడికి గడ్డుకాలం రావడం ప్రభుత్వ వైఫల్యమే. ఇక్కడి మామిడికి రాజకీయ మంగు పట్టింది. ఇంకా మూడేళ్లు దీనిని భరించక తప్పదు. గతేడాది చిత్తూరులో మామిడి రైతులకు కిలోకు రూ.4లు ఇచ్చినప్పుడు నూజివీడు రైతులకు ఎందుకివ్వలేదు? మామిడి, మొక్కజొన్న రైతులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ నాయకులు మంత్రిని ఎందుకు నిలదీయడంలేదు? ఇక్కడి మంత్రి ఒళ్లంతా ఆముదం పూసుకుంటున్నాడు. వైఎస్ జగన్‌ను తిట్టడానికి ఉన్న ఆసక్తి నియోజకవర్గ రైతులకు మేలు చేద్దామనిలేదు.మన దేశం నుంచి యూరప్ దేశాలకు వెళ్లే పల్ప్‌పై ఆ దేశాలు షుగర్ సెస్ వేస్తుండగా.. దానిని తొలగించేలా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీల యజమానులు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు. దీనివల్ల మామిడిని కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీలు ముందుకు రావడంలేదు. రైతులను పట్టించుకోని వ్యవసాయ మంత్రి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేయడం ఎందుకు? అలాగే, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ నియోజకవర్గానికి చెందిన మంత్రికి ఏమాత్రం సత్తా ఉన్నా రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి. రాబోయేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే. రైతులకు మంచి రోజులు వస్తాయి. మామిడి చెట్లను ఎవరూ నరకొద్దు.దోచుకోవడం, దాచుకోవడమే సర్కారు పని: జోగి రమేష్మాజీమంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడమే అజెండాగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతుల బాధలు పట్టించుకునే స్థితిలో ప్రభుత్వంలేదని మండిపడ్డారు. మామిడి, మొక్కజొన్న, ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను ఆదుకోలేని అసమర్థ ప్రభుత్వం ఉండటం ప్రజల దురదృష్టకరమని విమర్శించారు.మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. నూజివీడు మామిడి కనుమరుగయ్యేలా ఉందని, ప్రభుత్వాలు పట్టించుకుని మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మొక్కజొన్న రైతులకూ చేయూతనివ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్‌కుమార్, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
రేపు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
సాక్షి,తాడేపల్లి: పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే డీజిల్, పెట్రోలు ధరలు అధికంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించకపోగా భారీగా పెంచడం దుర్మార్గం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ధరలు అధికంగా ఉన్నాయి. ఈ పెంపుతో సాధారణ ప్రజలపై భారీ భారం మోపారు’అని అన్నారు.పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడిందని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవితం మరింత భారంగా మారిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రేపు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టి, అనంతరం అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఏకాంత వీడియోలతో.. భర్త బ్లాక్ మెయిల్
సాక్షి, విజయవాడ: తన భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుని తనని చంపడానికి యత్నిస్తున్నాడని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మహిళ.. విజయవాడ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజమండ్రిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చిత్రీకరిస్తున్నాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వీడియోలు అడ్డం పెట్టుకుని మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధిత మహిళ తెలిపింది.‘‘నా భర్తను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాను. రెండేళ్లు నన్ను భాగానే చూసుకున్నాడు. పెళ్లికి ముందు నుంచి అక్రమ సంబంధాలు ఉన్నాయని నాకు తెలిసింది. వ్యాపారం పేరుతో నా దగ్గర 100 గ్రాముల బంగారం, రూ.60 లక్షలు బ్యాంకు లోన్లు, రెండు ప్లాట్స్ తీసుకున్నాడు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 50 మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ..అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోస్ తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాతో ఉన్న వీడియోలు తీసుకుని కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. మే 4 తేదీన నన్ను కొట్టాడు. నన్ను చంపుతానని బెదిరించాడు. ఆయనకు భయపడి నేను పారిపోయి వచ్చాను. నాకు నా భర్తతో ప్రాణహాని ఉంది. విజయవాడ మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లెంట్ ఇచ్చాను. న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను’’ ఆమె పేర్కొంది. -
బాబూ.. ఏపీని ఏం చేయదలచుకున్నావ్..?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీని ఉద్దరిస్తామంటూ చంద్రబాబు మోసపూరిత మాటలు చెప్పారు.. ఇప్పుడు ప్రజలపై భారీ అప్పుల భారం మోపారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేవలం 24 నెలల్లోనే ప్రజల నెత్తిన చంద్రబాబు అప్పుల బండ పెట్టారు. 3 లక్షల 50 వేల కోట్ల అప్పులు చేశారు. రాబోయే మూడేళ్లలో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు’’ అంటూ నిలదీశారు.‘‘అప్పుల్లో, నేరాల్లో నిరుద్యోగంలో దేశంలో ఏపీనే ముందు ఉంది. ఇప్పుడు ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు. ఆర్టీసీని అమ్మేయడానికి మహిళలపై నెపం పెడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చిందంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజల ఆస్తులకు ప్రమాదం పొంచి ఉంది. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యుండకపోతే అప్పుడే చంద్రబాబు ఆర్టీసీని అమ్మేసేవారు. 2014 నుంచి 2019 వరకూ జయము జయము చంద్రన్న అని ఆర్టీసీని వాడుకున్నారు. ఆర్టీసీ టిడిపి సొత్తులాగా.. ఖర్జూర నాయుడు సంపాదించిన సొత్తులాగా అప్పనంగా వాడేశారు..నయా పైసా ఆర్టీసీకి చంద్రబాబు జమ చేయలేదు. 2018లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే చంద్రబాబు కుదరదన్నారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 54 వేల మందిని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి ఆర్టీసీ ఆపరేషనల్ అప్పులు 6300 కోట్లు, ఎక్యుమలేటెడ్ అప్పు 3350 కోట్లు. 2020 జనవరిలో ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ఏడాదికి రూ.3600 కోట్లు జీతాలుగా చెల్లించారు..వైఎస్ జగన్ దిగిపోయేనాటికి ఆర్టీసీ అప్పుల భారం 2,500 కోట్లకు తగ్గింది. వైఎస్ జగన్ చొరవతో 9 వేల కోట్ల నుంచి 2500 కోట్లకు అప్పులు తగ్గాయి. ఆర్టీసీ అప్పులు తగ్గించిన ఘనత వైఎస్ జగన్‌ది. ఎలక్ట్రికల్ బస్సులు కొనడం ఆర్టీసీ వల్ల కాదని ఇప్పుడు కథలు చెబుతున్నారు. ప్రజారవాణాలో ఎలక్ట్రికల్ బస్సులు కొంటే కేంద్రం 40 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. 2014-19 లో చంద్రబాబు ఒక్క ఎలక్ట్రికల్ బస్సైనా కొన్నాడా?. 2019-24 లో వైఎస్ జగన్ ప్రభుత్వం 100 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసింది. తిరుపతిలో ఆ బస్సులను అందుబాటులోకి తెచ్చింది...తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేది ఆర్టీసీ డ్రైవర్లే. ఆర్టీసీ డ్రైవర్లకు వైఎస్ జగన్ ట్రైనింగ్ ఇప్పించారు. వైఎస్ జగన్ అప్పులు తీర్చి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించినప్పుడు మీరెందుకు చేయలేరు?. ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. మీరు ఆర్టీసీని దోచుకుతినడానికి రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర మహిళలకు ఉచిత బస్సు స్కీమ్. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం వల్లే ఆర్టీసీ కుదేలైపోయిందని చంద్రబాబు చెప్పించాడు. స్త్రీ శక్తి హామీ ఎవరిది?. ఆర్టీసీకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది. ఉచిత మహిళ పథకం ఇస్తున్నప్పుడు ఆర్టీసీకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు కట్టడం లేదు? ..ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను ప్రైవేట్ పరం చేసేస్తామంటున్నారు. మీ మనుషులు , మీ బ్రోకర్లకు ఆర్టీసీని కట్టబెట్టడమేనా మీ సంపద సృష్టి. ఆర్టీసీని సర్వనాశనం చేసి.. మహిళలపై నెపం వేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలకు పంగనామాలు పెట్టారు. వైఎస్ జగన్ మహిళలకు రూ.24 వేల కోట్లు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాల్లో సగం మహిళలకు ఇచ్చారు. ఎలక్ట్రికల్ బస్సు కిలోమీటర్‌కు 7 రూపాయలే భారం అని చెప్పడం పచ్చిమోసం. ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ పినాకిల్ అనే కంపెనీకి ఇచ్చారు. పినాకిల్ సంస్థ ఎలక్ట్రికల్ బస్సులు నడిపితే కిలోమీటర్‌కు 71 రూపాయలు బిల్ వేస్తారట. 71 రూపాయల బిల్లులో 21 మోదీ ఇస్తే మిగిలిన 50 రూపాయలు మీ బాబు ఇస్తాడా?..కరెంట్ బస్సుకు కిలోమీటర్ కు 7 రూపాయలని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. పీఎంఈబస్ స్కీమ్ కింద రాబోయే రోజుల్లో బస్సులు వస్తే పేదలు, సామాన్యులు బస్సులు ఎక్కగలరా?. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులు పీఎంఈబస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సులు మార్చేస్తామనడం కరెక్ట్ కాదు. పీఎంఈబస్ స్కీమ్ ప్రకారం 3 లక్షల పైబడి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో మాత్రమే కరెంట్ బస్సులు తిప్పాలి. రాబోయే 750 కరెంట్ బస్సులన్నీ రాజధానిలోని 29 గ్రామాల్లో తిప్పుతారా?..కోటి 70 లక్షల చొప్పున వైఎస్ జగన్ 100 బస్సులు కొన్నాడు కదా. ఒక్క ప్రైవేట్ వ్యక్తిని కూడా రాకుండా ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపిస్తున్నారు కదా.. ఈరోజుకీ ఆహా ఓహో అంటూ ఆ బస్సులపై వస్తున్న డబ్బులను మీరు తీసుకుంటున్నారు కదా. ఆడపిల్ల కనిపిస్తే చాలు సీటీపాట పాడినట్లు ఓట్లు అడుక్కున్నారు. మహిళలను మీ ప్రభుత్వం వచ్చాక ఏం ఉద్ధరించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి? రాష్ట్రంలోని సంపద అంతా చంద్రబాబు, లోకేష్, పవన్, ఎమ్మెల్యేలకే.. ఇప్పటికే ఆర్టీసీలో రిక్రూట్ మెంట్ నిలిపేశారు. ఆర్టీసీ జోలికొస్తే చూస్తూ ఊరుకోం’’ అని చంద్రబాబును పేర్ని నాని హెచ్చరించారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 17-24)
-
ఆళ్లగడ్డ: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం (50) మృతి చెందాడు. మృతుడిని చిత్తూరు జిల్లా సుగంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 30 మంది ప్రయాణికులతో జై భారత్ ట్రావెల్స్ బస్సు అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీ కొట్టింది. -
AP: రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ జిల్లా: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి తమ నిండు ప్రాణాలను బలితీసుకున్నారు. చెన్నూరు మండలం ముండ్లపల్లెకు చెందిన సుధీర్‌బాబు(35), పెంచలమ్మ(35) కొన్ని సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె వున్నారు. సు«దీర్‌బాబు కూలీ పనులకు వెళుతూ వుండేవాడు.అతని భార్య పెంచలమ్మ కొప్పర్తి ప్రాంతంలో ఓ సంస్థలో విధులు నిర్వహిస్తుండేది. గత నాలుగు రోజులుగా ఇద్దరికి వివాహేతర సంబంధాలపై ఒకరినొకరు గొడవపడ్డారు. శనివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కడప– రాయచోటి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో సుధీర్‌బాబు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనకు తట్టుకోలేక అతని భార్య పెంచలమ్మ కడప– కనుమలోపల్లె మధ్యలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలోకి వెళ్లాయి. కడప రైల్వే పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాబుది పా‘శవ’క పాలన
బీచ్‌రోడ్డు (విశాఖ): మాయమాటలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. అవ్వతాతలకు, వితంతువులకు, దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు శవపేటికలలో వృద్ధుల మృతదేహాల నమూనాలతో వినూత్న నిరసన చేపట్టారు. ‘చనిపోయిన వృద్ధుల పింఛన్లయినా కొత్త వారికి ఇప్పించండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భారీగా హాజరైన కార్యకర్తలు, నాయకుల నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది.పేదల పొట్ట కొడుతున్నారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 66 లక్షల పైచిలుకు పెన్షన్లు అందజేశారని గుర్తు చేశారు. కానీ, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా, కుంటిసాకులతో ఆరు లక్షల మందికిపైగా అవ్వతాతల పెన్షన్లు తొలగించి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు.సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా, తండ్రీకొడుకులు తెలంగాణలో పండగలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. గత రెండేళ్లలో సహజంగా చనిపోయిన వృద్ధుల స్థానంలోనూ కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపూ ఆనంద్, దక్షిణ నియోజకవర్గ పరిశీలకులు వీసాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీల ఊపిరి తీసిన టిప్పర్
కాకినాడ రూరల్: ఉదయాన్నే ఉపాధి పనికి వెళ్లిన కూలీలపైకి టిప్పర్ లారీ మృత్యువులా దూసుకొచ్చింది. నలుగురు మహిళా కూలీలను కబళించింది. ఈ ఘటన కాకినాడ రూరల్ మండలం బైపాస్ రోడ్డులోని కొవ్వూరు వంతెన వద్ద శనివారం ఉదయం 6.20 గంటలకు జరిగింది. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామానికి చెందిన 20 మంది ఉపాధి హామీ పథకం కూలీలు పంట కాలువలో పూడిక తీత పనుల కోసం వచ్చారు. వారికి ఆన్లైన్లో మస్తర్లు వేసేందుకు పని ప్రదేశంలో ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోవడంతో పక్కనే ఉన్న కాకినాడ బైపాస్ రోడ్డుపై కొవ్వూరు వంతెన వద్దకు వచ్చారు.కూలీల్లో 12 మందికి మేట్ మస్తర్ పూర్తి చేశారు. మరో 8 మంది మస్తర్ కోసం రోడ్డుపై వేచి ఉండగా, ఆకస్మికంగా టిప్పర్ లారీ వారిపైకి దూసుకొచ్చింది. ఆరుగురిని టిప్పర్ ఈడ్చుకుంటూ వెళ్లి వంతనపై ఉన్న ఇనుప గడ్డర్లను ఢీకొట్టింది. దీంతో కాదా చిట్టెమ్మ (55), వాసంశెట్టి సత్యవతి (60), పాలిక కృష్ణవేణి (41), చెల్లూరు అన్నవరం (67) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మట్టపర్తి అరుణకుమారిని కాకినాడ అపోలో ఆస్పత్రిలో, పాలిక నాగమణిని కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేరి్పంచారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు కూలీలు వంతెనపై ఉన్న ఇనుప గడ్డర్ల మీదుగా రోడ్డు పక్కకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే! ఘటనాస్థలంలో మాంసం ముద్దలుగా మారిన నలుగురు కూలీలను చూసి సహచరులు చలించిపోయారు. నలుగురి ప్రాణాలను బలిగొన్న టిప్పర్‌ను డ్రైవర్ ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించగా, కూలీలు అడ్డుకున్నారు. డ్రైవర్ నాగరాజును కూలీలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా టిప్పర్‌ను నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని కూలీలు చెబుతున్నారు. కానీ, పోలీసులు మాత్రం డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు.మృతదేహాలకు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉపాధి కూలీలు, మృతుల కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలాన్ని అడిషనల్ ఎస్పీ (ఏఆర్) ఎస్.శ్రీనివాసరావు, కాకినాడ డీఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీషి, రూరల్ సీఐ చైతన్యకృష్ణ పరిశీలించి కూలీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి: కన్నబాబు చీడిగ గ్రామానికి చెందిన ఉపాధి కూలీల మృతిపట్ల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర ది్రగ్బాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వైఎస్సార్సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఆయన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. డ్రైవర్ మద్యం తాగి టిప్పర్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కూలీలు చెబుతున్నారని, మద్యం విచ్చలవిడి అమ్మకాలు, వాహనాలపై నియంత్రణ లేకపోవడం వల్లే పేద మహిళా కూలీలు మృతిచెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
మండుటెండల్లో చల్లని కబురు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం అండమాన్‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు ఈ నెల 26 నాటికి కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా కేరళకు వచ్చిన వారం, పది రోజుల్లో ఇవి మన రాష్ట్రాన్ని తాకుతాయి కాబట్టి జూన్ మొదటి వారంలో రుతుపవనాలు ఏపీలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అండమాన్‌లో ఉన్న రుతుపవనాలు మూడు, నాలుగు రోజుల్లో అరేబియా సముద్రం, అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉంది. రెండ్రోజులు తేలికపాటి వర్షాలు కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండగా, తమిళనాడు కోస్తా ప్రాంతంలో ఉన్న మరో ఉపరితల ఆవర్తనం ఇందులో కలిసిపోయింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పెరిగిన ఎండల తీవ్రత మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం కర్నూలు జిల్లా నగరడోనలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా బెల్లంకొండలో 42.6, నంద్యాల జిల్లా పెద్ద దేవలాపురంలో 42.5, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, పశి్చమ గోదావరి జిల్లా పెనుగొండలో 41.9, వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరులో 41.6, మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 41.2, పోలవరం జిల్లా చింతూరులో 41.1, అనంతపురం జిల్లా పాతకొత్తచెరువులో 41 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 12 మండలాలు, నంద్యాల జిల్లాలో 10, కడప జిల్లాలో 6 మండలాలు కలుపుకొని మొత్తంగా 9 జిల్లాల పరిధిలోని 41 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
పొగాకు రైతులపై ఎందుకీ పగ?
మర్రిపాడు/పొదిలి/ఒంగోలు సబర్బన్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో రైతులు శనివారం ధర్నాకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాన్ని నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వేలం ప్రారంభ సమయంలో కిలో ధర రూ.250 వరకు పలికిన ధర, ఆపై రూ.235లో కొనసాగుతోందన్నారు. దీనివల్ల ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం వస్తోందన్నారు.బోర్డు అనుమతి మేరకు తీసుకొచ్చిన పొగాకును కూడా బయ్యర్లు పూర్తిగా కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు. దీంతో రవాణా ఖర్చులు, గోడౌన్ ఖర్చులు అదనంగా భారం అవుతున్నాయని వాపోయారు. సమాచారం అందుకున్న వేలం నిర్వహణాధికారి సునీల్ రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. బయ్యర్లతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పొదిలిలో వేలం నిలిపివేత మార్కాపురం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రంలో శనివారం పొగాకు వేలం నిలిచిపోయింది. నష్టం కలిగిస్తున్న వేలం అవసరం లేదంటూ వేలాన్ని రైతులు అడ్డుకున్నారు. కేజీకి గరిష్టంగా రూ.230, కనిష్టం రూ.195 మాత్రమే పలకడంతో గిట్టుబాటు ధరలు లేవని రైతులు తెలిపారు. పోరాటం ఉధృతం చేస్తాం పొగాకుకు గిట్టుబాటు ధర రాకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి మేరుగు నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు–2 వేలం కేంద్రాన్ని ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పార్టీ నేతలతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ హయాంలో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి వ్యాపారుల మధ్య పోటీ పెంచారని గుర్తు చేశారు. రూ.300 కోట్లు వెచ్చించి పొగాకు రైతులను లాభాల బాట పట్టించారని చెప్పారు. పొగాకు ధరలు ఇదేవిధంగా కొనసాగితే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
జంకుబొంకు లే‘కొండ’!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే విశాఖలోని కొండలకు గుండు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని.. అధికారపార్టీ నేతలూ ఓ సంస్థకు కూతవేటు దూరంలో కొండల కబ్జాకు కుట్రపన్నుతున్నారు. పెద్ద కొండలపై గద్దల్లా వాలేందుకు జంకుబొంకు లేకుండా సిద్ధమవుతున్నారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల పరిధిలోని శొంఠ్యాం గ్రామ పరిధిలో సర్వే నంబరు 346, 347లల్లో 469.9 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలను పెద్ద కొండలుగా స్థానికులు పిలుస్తుంటారు. ఇవి పచ్చని చెట్లతో విస్తరించి ఉండడంతో అనేక అడవి జంతువులకు స్థావరంగా ఉన్నాయి. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న ఈ కొండలపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. దీంతో ఒక కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు ఎమ్మెల్యే పీఏలు ఇద్దరు, రెవెన్యూ అధికారులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. కొండలను కేకుల్లా కట్‌చేసుకుని చేజిక్కించుకునేందుకు ఇప్పటికే డ్రోన్లతో ప్రైవేటు సర్వే చేశారు. మొత్తం 469.9 ఎకరాల్లో 150 ఎకరాల భూమికి కొద్ది మంది రైతుల సాగులో ఉన్నట్టుగా బినామీల పేర్లతో దొంగ పట్టాలు సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు స్థానిక రెవెన్యూ యంత్రాంగం సహకరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు ఎవరి పేరుతో ఎంత భూమి తీసుకోవాలనే లెక్కలు వేసుకున్నారు. బినామీ పేర్లతో తలా 20 ఎకరాల చొప్పున కాజేతకు కుట్రపన్నుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొండల్లో రాళ్లు కూడా పాతినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎకరా భూమి ధర రూ.3 కోట్ల మేర పలుకుతుంది. అంటే మొత్తం 150 ఎకరాల భూమి విలుఉవ సుమారు రూ.450 కోట్లకుపైగా విలువ చేస్తుందన్నమాట. ఈ వ్యవహారంలో స్థానిక కూటమి నేతలకు కూడా ఐదు నుంచి పది ఎకరాల చొప్పున వాటా ఇస్తున్నట్టు సమాచారం. ఇక రెవెన్యూ అధికారులకు కూడా వారి వాటాగా వారికి 10 ఎకరాలు చొప్పున పంచుకున్నట్టు తెలుస్తోంది. భూ సమీకరణ పేరుతో లబ్ధి పొందేందుకే!వాస్తవానికి ఈ కొండ దిగువన ఇప్పటికే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. అక్కడ సాగులో ఉన్న రైతులకు నిబంధనల మేరకు ఎకరాకు 900 గజాల చొప్పున లే–అవుట్ వేసి మరీ అప్పగించింది. ఈ లే–అవుట్‌కు ఆనుకునే ఈ పెద్ద కొండలు ఉన్నాయి. ఈ కొండలను కూడా త్వరలో వీఎంఆర్డీఏ ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటుందనే ప్రచారం ఉంది. ఇందుకోసం త్వరలో గ్రామ సభను నిర్వహించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమాచారం ముందస్తుగానే తెలుసుకున్న సదరు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే ఇద్దరు పీఏలు, రెవెన్యూ యంత్రాంగం ఈ కబ్జా కుంతంత్రానికి తెరలేపారు. తమ బినామీల పేర్లను జాబితాలో చూపెట్టి.. సాగులో ఉన్నట్టు తప్పుడు రికార్డులను సృష్టించి ల్యాండ్ పూలింగ్‌లో ఎకరాకు 900 గజాల స్థలాన్ని కాజేసేందుకు ఈ తతంగమంతా నడిపిస్తున్నట్టు అర్థమవుతోంది. తద్వారా సదరు కార్పొరేషన్ చైర్మన్, ఇద్దరు పీఏలతో పాటు రెవెన్యూ అధికారులు కాస్తా తమ బినామీ పేర్లతో ఏకంగా తలా 18 వేల గజాల స్థలాన్ని వీఎంఆర్డీఏ నుంచి తీసుకుని.. అనంతరం బినామీల నుంచి కొన్నట్టు చూపి తమపరం చేసుకునేందుకు పన్నాగం పన్నినట్టు స్పష్టమవుతోంది. -
ఆర్టీసీ.. ప్రై‘వేటు’!
సాక్షి, అమరావతి: ప్రగతి రథ చక్రం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రైవేటుపరం చేసే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం పదును పెడుతోందని తేటతెల్లమైంది. విద్యుత్ బస్సుల ముసుగులో తన కుతంత్రాన్ని మరింత వేగవంతం చేసింది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులతో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని దొంగదెబ్బ తీస్తోంది. మొదటగా 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. మరోవైపు ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తుండటం పట్ల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ముసుగు తొలగించి తమ పన్నాగాన్ని బహిర్గతం చేసింది. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పదని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ అసలు విషయం చల్లగా వినిపించారు. తద్వారా ఆర్టీసీ ప్రైవేటీకరణ తథ్యం అని కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొట్టేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఆయువు తీసేందుకు పావులు కదపడం మొదలు పెట్టింది. వంద శాతం విద్యుత్ బస్సుల (ఈ–బస్సులు) విధానం ముసుగులో పక్కా పన్నాగం పన్నింది. కానీ ఈ–బస్సులను ఆర్టీసీ నిర్వహించవచ్చన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని తిరస్కరించింది. కార్పొరేట్ సంస్థల ద్వారానే ఈ–బస్సులు ప్రవేశ పెట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉద్యోగుల సంఖ్యలో కోత విధించవచ్చని కూడా ప్రకటించింది. గత ఏడాది నవంబరులో సీఎం చంద్రబాబు సమక్షంలోనే నిర్వహించిన సమీక్షలో ఆ మేరకు ఆర్టీసీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఈ–బస్సుల్లో పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగులేఆర్టీసీలో ప్రస్తుతం 11,116 బస్సులు ఉన్నాయి. 2029 నాటికి ఆర్టీసీలో వంద శాతం ఈ–బస్సులే ఉండాలనే విధానానికి ప్రభుత్వం 2024 నవంబర్‌లో ఆమోదించింది. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 100 ఈ–బస్సుల్లో పూర్తిగా ప్రైవేటు ఉద్యోగులే ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో 2029 నాటికి వంద శాతం ఈ–బస్సులను ప్రవేశ పెడతామని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. అంటే ఈ–బస్సుల ముసుగులో పూర్తిగా ఆర్టీసీని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలన్నది ప్రభుత్వ పన్నాగమన్నది సుస్పష్టమవుతోంది. ఆర్టీసీ వేలుతోనే ఆ సంస్థ కన్ను పొడిచే పన్నాగాన్ని చంద్రబాబు సర్కారు అమలు చేస్తోంది. ఆర్టీసీని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఆ సంస్థ ఉన్నతాధికారుల ద్వారానే నివేదిక ఇప్పించుకోవడం గమనార్హం. 50 శాతం ఈ–బస్సులను ప్రవేశ పెట్టేందుకే అవసమైన వ్యయాన్ని భరించలేమని ఆర్టీసీ ఉన్నతాధికారులే నివేదిక ఇచ్చేలా కుట్ర పన్నింది. అనంతరం ఆ నివేదికను చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమోదించారు. ఆ నివేదిక ప్రకారం 50 శాతం ఈ–బస్సులకు అవసరమైన రూ.8,243 కోట్ల మూల ధన వ్యయంతోపాటు ప్రతి నెల రూ.336 కోట్ల నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదని తేల్చి చెప్పేశారు. కాబట్టి విద్యుత్ బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. 50 శాతం బస్సులే నిర్వహించలేమని తేల్చి చెప్పిన ప్రభుత్వం.. మరోవైపు ఆర్టీసీలో 2029 నాటికి వంద శాతం ఈ–బస్సులు ప్రవేశపెడతామని ప్రకటించింది. అంటే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటుపరం చేస్తామని తేల్చి చెప్పింది. రూ.6 వేల కోట్ల ఆస్తులు ప్రైవేటుకు..ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో 12 డిపోల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నుముక. ఆ వెన్నెముకకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలో అత్యంత విలువైన ప్రదేశాల్లో ఉన్న డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ఒక్కో డిపో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే 12 డిపోల విస్తీర్ణం దాదాపు 120 ఎకరాలు. ఆయా ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.25 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంది. సగటున ఎకరా భూమి విలువ రూ.50 కోట్లు లెక్కన వేసుకున్నా, ఆ 12 డిపోల మార్కెట్ విలువ ఏకంగా రూ.6 వేల కోట్లు! పక్కా కుతంత్రంతో ఆర్టీసీ నిర్వీర్యం⇒ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా కుతంత్రంతో పావులు కదుపుతోంది. అందుకోసం ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోంది. ‘ప్రధానమంత్రి ఈ–బస్ సేవా’ పథకం కింద ప్రవేశపెట్టే ఈ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ద్వారానే ప్రవేశపెడతామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఆర్టీసీ కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయడం లేదు. ⇒ గత ఆరు నెలల్లోనే కాలం చెల్లిన 264 బస్సులను ఇటీవల సర్వీసుల నుంచి తొలగించారు. కానీ వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టనే లేదు. మరో 2 వేల బస్సులు 15 ఏళ్ల కాల పరిమితి దాటిపోయాయి. ఆ డొక్కు బస్సులనే కొనసాగిస్తోంది. సగటున రోజుకు ఒక బస్సును సర్వీసు నుంచి తొలగిస్తోంది. కానీ కొత్తగా కొనుగోలు చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేస్తోంది. తద్వారా ఆర్టీసీలో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి, ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–బస్సులను ప్రవేశపెట్టాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేస్తోంది. ⇒ ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విస్మరిస్తోంది. ఏడాదిలో 617 మంది డ్రైవర్లు, 821 మంది కండక్టర్లు రిటైరయ్యారు. అంటే 1,438 పోస్టులు ఖాళీ అయ్యాయి. మొత్తం ఆర్టీసీలో దాదాపు 8 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా సరే ఆ పోస్టులను భర్తీ చేసే ఉద్దేశమేలేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అందుకే జాబ్ కాలండర్లో ఆర్టీసీలో ఉద్యోగాల ఊసే ఎత్త లేదు. ⇒ 2029 నాటికి ఆర్టీసీలో 50 శాతం పోస్టులు ఖాళీ అవుతాయి. దాంతో ఆర్టీసీని మూసివేయవచ్చన్నది బాబు ప్రభుత్వ కుతంత్రంగా ఉందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం బరితెగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్టీసీకి స్వర్ణ యుగంఆర్టీసీ అభివృద్ధి, ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా.. వైఎస్ జగన్ ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక కలను సాకారం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. విలీనం వద్దు అని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చినా సరే, వైఎస్ జగన్ మాత్రం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అమలులోకి వచ్చింది. ఫలితంగా ఉద్యోగులకు ప్రతి నెలా జీతాల కోసం ప్రభుత్వం రూ.360 కోట్లు కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఆర్టీసీ ఆర్థిక కష్టాలు తీరాయి. దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ఆర్టీసీ ప్రతి నెలా బ్యాంకుల నుంచి అప్పులు చేస్తూ వచ్చింది. ఆ ఆర్థిక ఇబ్బందులను వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. 2020లో ఆర్టీసీకి ఉన్న రూ.8 వేల కోట్ల అప్పుల్లో 2024 నాటికి రూ.5 వేల కోట్లు అప్పు చెల్లించింది. 220 కొత్త బస్సులు కొనుగోలు చేసింది. మరో 1,500 బస్సులను రీ–మోడలింగ్ చేసింది. దాంతో ఆర్టీసీ ప్రగతి బాట పట్టింది. ఉద్యోగుల అలవెన్సులను ప్రతి నెలా జీతాలతో పాటు చెల్లించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విధంగా అటు ఆర్టీసీ అభివృద్ధి, ఇటు ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యదిక ప్రాధాన్యం ఇచ్చిందని, అది ఆర్టీసీకి స్వర్ణ యుగమని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేసుకుంటున్నారు. -
అర్ధరాత్రి 2 గంటలు గుండెలు గుప్పిట్లో..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం జి.గొల్లపల్లెకు చెందిన జ్యోత్స్న 7వ నెలలోనే పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా అడ్మిటై, 800 గ్రాముల బరువున్న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉందని, వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. దీంతో తల్లి, బిడ్డను 12.15 సమయంలో అంబులెన్స్‌లోకి ఎక్కించారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డను అంబులెన్స్ వెంటిలేటర్‌పై ఉంచారు. మురకంబట్టు వద్దకు వెళ్లగానే అంబులెన్స్ ఆగిపోయింది. మరో 108ను 60 కి.మీ. దూరం ఉన్న పీలేరు నుంచి పిలిపించారు. వాహనం వచ్చే వరకూ 2 గంటలపాటు తల్లి, బిడ్డ నడిరోడ్డుపై నరకయాతన పడ్డారు. అనంతరం అంబులెన్స్ రావడంతో తల్లి, బిడ్డను తిరుపతికి తరలించారు. ప్రస్తుతం బిడ్డను రుయా ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంచి, వైద్యులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర దుర్మార్గం
సాక్షి నెట్వర్క్: ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుండడం దుర్మార్గమని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద నిరసన తెలిపి ధర్నా చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం డిపోలో గేట్ ధర్నాలో ఈయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎం.డి.ప్రసాద్ మాట్లాడుతూ విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికే విద్యుత్ బస్సుల ఆపరేటర్ల కోసం విద్యాధరపురం, గుంటూరు – 2, నెల్లూరు – 2 డిపోలను ఖాళీ చేయించారని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చర్యలు మానుకుని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సొంతంగా నిర్వహించాలని కోరారు. మరోవైపు స్త్రీ శక్తి పథకం కోసం మూడు వేల కొత్త బస్సులు కొనుగోలు చేయాలని కోరారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈయూ ఆధ్వర్యంలో కందుకూరు, పొదిలి, శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో, కర్నూలు – 2 డిపో ఎదుట చేసిన ధర్నాలో కొండల్, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతాడ వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శి పి.నానాజీరావు, కె.దశరథుడు, జి.త్రినాథరావు, ఈయూ రీజినల్ సెక్రటరీ ఏవీ రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నెల్లూరు డిపో–1, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నిర్వహించిన ధర్నాల్లో ఈయూ రాష్ట్ర కార్యదర్శి ఎండీఏ ఆలీ, ఈయూ జోనల్ కార్యదర్శి బాబుశామ్యూల్, లుక్సన్, పి.రాజేశ్వరరావు, ఎస్వీ రమణ, వై.వి.ఎస్.కుమార్, ఎం.వి.ఆర్.చారి కె.ఎం.రావు, ఈయూ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అస్తవ్యస్త విధానాలు, అవినీతి.. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం
సాక్షి, అమరావతి: రెండేళ్లలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అస్తవ్యస్త విధానాలు, అవినీతితో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పినట్లు సంపద సృష్టించక పోగా, రాష్ట్రాన్ని వేగంగా అప్పుల్లోకి తీసుకుపోయి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025–26 ఆర్థిక ఏడాదికి సంబంధించి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ప్రొవిజినల్ గణాంకాలను పరిశీలిస్తే కలవరపరిచే వాస్తవాలు వెల్లడయ్యాయని చెప్పారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు కట్టు కథలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సీఎం చంద్రబాబు విధానాలపై శనివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో వివరాలు ఇలా ఉన్నాయి.⇒ ప్రజల దృష్టిని మళ్లించేందుకు అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటూ, సంపద సృష్టిస్తున్నామంటూ చంద్రబాబు అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర సొంత పన్నుల రాబడి తగ్గిపోతే జీఎస్డీపీ ఏకంగా 10.75 శాతం వృద్ధి సాధించినట్లు చంద్రబాబు చెప్పడం కట్టు కథ తప్ప మరొకటి కాదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్ను రాబడి 3.22 శాతం తగ్గిపోతే జీఎస్డీపీ వృద్ధి ఎలా సాధ్యమవుతుంది?⇒ ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే అక్కడ పెట్టుబడులు, వినియోగం పెరుగుతాయి. తద్వారా రాష్ట్ర పన్ను రాబడి పెరుగుతుంది. కానీ, రాష్ట్రంలో పన్ను రాబడి 3.22 శాతం తగ్గిందంటే దీని అర్థం ఏమిటి? రాష్ట్ర పన్ను రాబడులు 9.60 శాతం పెరిగి ఉంటే జీఎస్డీపీ 10.75 శాతం వృద్ధి సాధించిందంటే నమ్ముతారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా సొంత పన్ను రాబడి 3.22 శాతం క్షీణత నెలకొంది.⇒ 2023–24లో (గత ప్రభుత్వ చివరి సంవత్సరం) రాష్ట్ర పన్ను రాబడులు రూ.85,922.23 కోట్లు ఉన్నాయి. రెండేళ్ల తర్వాత 8 శాతం సాధారణ వృద్ధిని సాధించినా కూడా, 2025–26 సంవత్సరంలో పన్ను రాబడులు రూ.1,00,219.69 కోట్లు ఉండాలి. అయితే, 2025–26లో కేవలం రూ.86,552.68 కోట్లు మాత్రమే సమకూరాయి. దీంతో ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.13,667 కోట్లు నష్టం ఉంది. చంద్రబాబు సంపద సృష్టి గురించి పదే పదే మాట్లాడుతారు.. ఇదేనా ఆయన సంపద సృష్టి?⇒ గత ఏడాది ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీతో రూ.9,000 కోట్లు అప్పు చేసినప్పటికీ ఎటువంటి ఆస్తి, సంపద సృష్టించలేదు. ఆ మొత్తాన్ని రెవెన్యూ వ్యయానికి వినియోగించారు. గత ఏడాది ఆదాయం తగ్గితే ఈ ఏడాదైనా ఆదాయం పెరిగేలా చూసుకోవాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం అçస్తవ్యస్త విధానాలు, అవినీతి చర్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాబడులు తగ్గడం అంటే టీడీపీ ప్రభుత్వ దూరదృష్టి లేని విధానాలు, అవినీతి పద్ధతులే కారణం.⇒ ఎక్సైజ్ రాబడుల విషయానికి వస్తే, టీడీపీ ప్రభుత్వం మద్యం రిటైల్ కార్యకలాపాలను ప్రైవేటీకరించింది. దుకాణాల సంఖ్యను పెంచింది. అక్రమ బెల్ట్ షాపులను ప్రోత్సహించింది. అక్రమ పర్మిట్ రూములను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ విధాన మార్పులన్నీ మద్యం వినియోగంలో భారీ పెరుగుదలకు, తద్వారా ఎక్సైజ్ రాబడులకు దారితీయాలి. అయితే, ఎలాంటి పెరుగుదల లేకపోగా 8.20 శాతం క్షీణత నమోదైంది.⇒ 2024–25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లైసెన్స్ ఫీజు ప్రభావాన్ని మినహాయించినప్పటికీ, వృద్ధి కేవలం 0.93 శాతం మాత్రమే. ఇది రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతిని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. గత రెండేళ్ల కాలంలో అమ్మకపు పన్ను వసూళ్లు ఎటువంటి వృద్ధిని కనబరచకపోగా, వాస్తవానికి తగ్గాయి. ఇది ఆందోళనకరమైన ధోరణిని సూచిస్తోంది. మొత్తంగా రాష్ట్ర సొంత పన్ను రాబడుల్లో 3.22 శాతం క్షీణత నెలకొంది. సంపద సృష్టి అంటే ఇదేనా బాబూ?⇒ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు ఆదాయ వనరులు, సంపద సృష్టి తనకే సాధ్యమని, ఇందులో తాను నిష్ణాతుడనని పదే పదే చెప్పుకున్నారు. అంతేకాదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యధికంగా అప్పులు చేసిందంటూ నిందించారు. తాను అధికారంలోకి వస్తే పథకాలు అమలు చేయడానికి అప్పులపై ఆధార పడనని, సంపద సృష్టించి అమలు చేస్తానని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రోజు వారీ ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పులపై విపరీతంగా ఆధారపడుతున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న అనేక పథకాలను నిలిపి వేయడంతో పాటు చంద్రబాబు తాను ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అటకెక్కించారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఖర్చుల కోసం అప్పులపై విపరీతంగా ఆధార పడుతోంది. గత రెండేళ్లుగా అవినీతితో ప్రభుత్వ ఖజానా దోపిడీకి పాల్పడటం తప్ప మరొకటి కనిపించడం లేదు. వేగంగా వృద్ధి అంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకే కట్టు కథలు చెప్పారు’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో పేర్కొన్నారు. -
ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. కొత్తగా బాబు మరో హామీ
నరసన్నపేట/పోలాకి/సారవకోట/టెక్కలి : రాష్ట్రంలో ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలతో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొనసాగిన పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన తరుణంలో ఆయా పథకాల బకాయిలు రూ.వేల కోట్లలో పేరుకుపోయాయి. తల్లికి వందనం పథకాన్ని కొందరికే ఇవ్వడంతో పాఠశాలల్లో పిల్లల చేరికలు తక్కువైపోయాయి.విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల బాట పట్టారు. మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు ఇచ్చే కిట్‌లో నాణ్యత కొరవడింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలన్నింటినీ నీరుగార్చేసింది. ప్రజలకు ఏ పథకాలూ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఒకరిద్దరు పిల్లల పోషణకే అష్టకష్టాలు పడుతున్నారు. ఈ తరుణంలో ముగ్గురు, నలుగురిని కనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునివ్వడం విస్తుగొలుపుతోంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు కృషి చేశామని, ఇప్పుడు పరిస్థితులు మారినందున ఎక్కువ మంది పిల్లలను కనాలని.. పిల్లల బాగోగులు తాను చూస్తానని తాజాగా సెలవిచ్చారు.స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు వచ్చారు. నరసన్నపేటలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. స్త్రీలు సృష్టికర్తలని, ఎంత మందికి వీలైతే అంతమందిని కనాలని అన్నారు. మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు ప్రభుత్వ పరంగా పురిటి మంచంçపైనే ఇస్తానని చెప్పారు. పనుల కోసం శ్రీకాకుళం వాసులు వలసలకు వెళ్లాల్సిన పని లేకుండా చేస్తానన్నారు. శ్రీకాకుళం జిల్లావాసులు లిటిగెంట్లని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.జిల్లా అభివృద్ధి కాకపోవడానికి మీరే కారణమంటూ ప్రజలపై నింద వేశారు. ప్రజలు సహకరిస్తే పలాసలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పారు. 23 నెలల్లో రూ. 24 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, వీటి ద్వారా 24 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. నెల వారీ పింఛన్, ఇతర సంక్షేమ పథకాల కోసం పన్నులు పెంచాల్సి వస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లో ప్రైవేటు పబ్లిక్ పీపుల్ పార్టనర్షిప్ (పీపీపీ) అమలు చేస్తామని, దీని ద్వారానే సంపద సృష్టిస్తామని చెప్పారు. మా భూమిని టీడీపీ ఎమ్మెల్యే వియ్యంకుడు ఆక్రమించారుసాక్షి, నెట్వర్క్: నరసన్నపేటలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వియ్యంకుడిపై నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసేందుకు ఓ మహిళ సిద్ధమైంది. అయితే సీఎంను కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆవేదనతో వెనుదిరిగారు. పోలాకి మండలం కుసుమపోలవలసకు చెందిన ఆర్మీ జవాను కొయ్యాన లక్ష్మణరావుకు చెందిన దాదాపు 60 సెంట్ల పొలం ఎమ్మెల్యే వియ్యంకుడు భైరి వెంకటరావు కబ్జా చేసి, ఇటీవల నిర్వహించిన రీసర్వేలో రికార్డులు మార్పించుకున్నారని జవాను భార్య భవానీ ఆరోపించారు.కలెక్టర్‌ను సంప్రదించినా ఫలితం లేదని, ఎమ్మెల్యే రమణమూర్తి దగ్గరకు వెళ్లి ఆయన వియ్యంకుడి తీరుపై ఫిర్యాదు చేస్తే, కోర్టుకు వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారని తెలిపారు. ఒక ఆర్మీ జవానుకు చెందిన భూమిని ఇలా లాక్కోవడంపై సీఎంకు ఫిర్యాదు చేద్దామని వస్తే దగ్గరకు వెళ్లనివ్వలేదని, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. -
ఏపీపై పెట్రో భారం రూ.3,391 కోట్లు
సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం వాహనదారులకే పరిమితం కాలేదు. ఈ ధరలు సామాన్యులకు సైతం భారంగా పరిణమించాయి. తాజాగా పెంచిన ధరలతో దేశంలోనే ఇంధన ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది. ఏపీలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ఎక్కువగా ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. తాజా పెంపుతో విజయవాడ సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరాయి.పెట్రోల్ లీటరుకు రూ.3.29 పెరిగి.. ప్రస్తుతం రూ.113.03 నుంచి రూ.113.50 వరకు ఉంది. డీజిల్ లీటరుకు రూ.3.14 పెరిగి.. రూ.101 దాటింది. పెరిగిన ధరలతో రాష్ట్రంలోని వాహదారులపై రోజుకు పెట్రోల్‌పై రూ.3.29 కోట్లు, డీజిల్‌పై రూ.6 కోట్ల చొప్పున అదనపు భారం పడుతోంది. రాష్ట్ర ప్రజలపై నెలవారీ పడే భారం చూస్తే పెట్రోల్‌పై రూ.98.7 కోట్లు, డీజిల్‌పై రూ.180 కోట్ల చొప్పున భారం పడనుంది. మొత్తంగా ఏడాదికి పెట్రోల్‌పై రూ.1,201 కోట్లు, డీజిల్‌పై రూ.2,190 కోట్లు అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజలు భరించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే పెట్రోల్, డీజిల్‌పై ఏడాదికి ఏపీ ప్రజలు రూ.3,391 కోట్లు పైమాటే. ప్రతి కుటుంబానికీ భారమే టూ వీలర్ కలిగిన మధ్యతరగతి కుటుంబంలోని సభ్యులు నెలకు సగటున 30నుంచి 50 లీటర్ల పెట్రోల్ వినియోగిస్తారు. ఈ లెక్కన మధ్యతరగతి కుటుంబంపై నెలకు సగటున రూ.150, ఏడాదికి రూ.1,800 వరకు అదనపు భారం పడుతోంది. అదే కార్లు వినియోగించే ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తదితర వర్గాలపై రోజుకు రూ.10 నుంచి రూ.12 వరకు.. నెలకు నెలవారీగా రూ.260 నుంచి రూ.360 వరకు భారం పడుతుంది. వారిపై ఏడాదికి రూ.3,100 నుంచి రూ.4,000 వరకు అదనపు భారం పడుతోంది.అదే రోజువారీ ఉపాధి కోసం ఆటో, క్యాబ్ డ్రైవర్లు రోజుకు కనీసం 5 నుంచి 10 లీటర్ల ఇంధనాన్ని వాడతారు. వారిపై రోజుకు రూ.16 నుంచి రూ.32 వరకు, నెలకు రూ.500 నుంచి రూ.1,000 వరకు, ఏడాదికి రూ.6,000 నుంచి రూ.12,000 వరకు అదనపు భారం పడుతోంది. వీటిపై ఆధారపడి బతికే వారు నికరాదాయం లేక ఇబ్బందులు పడే పరిస్థితి. రవాణా రంగంలో కీలకపాత్ర పోషించే లారీలు, హెవీ వెహికల్స్ రోజుకు 100 నుంచి 150 లీటర్ల డీజిల్ వినియోగిస్తాయి. వాటిపై రోజువారీ రూ.315 నుంచి రూ.470 వరకు, నెలకు రూ.9,500 నుంచి రూ.14,000 వరకు, ఏడాదికి రూ.1,14,000 నుంచి రూ.1,68,000 వరకు అదనపు భారం పడుతోంది. అన్ని వర్గాలపైనా తీవ్ర ప్రభావం ఇంధన ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాదు. దీని ప్రభావం గొలుసు కట్టులా సమాజంలోని అన్ని వర్గాలపై పడుతుంది. డీజిల్ ధరల పెంపుతో రవాణా చార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. దీనివల్ల కూరగాయలు, పాలు, బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకుల ధరలు 5శాతం నుంచి 10శాతం పెరుగుతాయి. ఆక్వా సాగు చేసే రైతులు చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్ కోసం ఎరియేటర్లు నడపడానికి, సాధారణ రైతులు ట్రాక్టర్లు, పంపుసెట్లకు డీజిల్‌నే నమ్ముకుంటారు. ఈ పెంపు వల్ల రైతులకు పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరగనుంది. సముద్రంలో వేటకు వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు నెలకు వేల లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది. తాజా పెంపుతో ఒక్కో బోటుపై నెలకు రూ.30వేల వరకు అదనపు భారం పడటంతో మత్స్యకారుల ఉపాధికి పెద్ద దెబ్బతగులుతుంది. -
వైఎస్సార్సీపీ నేత కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
ఏలూరు, సాక్షి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ నేత యలమర్తి రామకృష్ణ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ కాల్ ద్వారా పరామర్శించారు. దెందులూరు మండలం పెరుగు గూడెం గ్రామ వైఎస్సార్సీపీ సీనియర్ నేత యలమర్తి రామకృష్ణ గతవారం జరిగన రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఈ నేపథ్యంలో యలమర్తి రామకృష్ణ కుటుంబాన్ని శనివారం ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
ఘోర విషాదం: రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
సాక్షి, కడప: వైయస్సార్ జిల్లాలో ఘోర విషాదం విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నూరు మండలం ముళ్లపల్లెకి చెందిన సుధీర్, పెంచలమ్మ దంపతులు శనివారం రైలు కింద పడి బలవన్మరణం చెందారు.శనివారం మధ్యాహ్నం కనుమలోపల్లె రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి భర్త సుధీర్ ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అతని భార్య సాయంత్రం అదే ప్రాంతంలో మరో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తల మృతికి కారణాలపై విచారిస్తున్నట్లు రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. -
‘ఆక్వా సంక్షోభానికి చంద్రబాబే కారణం’
సాక్షి, నరసాపురం: ఆక్వా సిండికేట్ చేతుల్లో కూటమి ప్రభుత్వం బందీ అయిపోయిందని, అప్సడాతో సంబంధం లేకుండా ఫీడ్ సిండికేట్ ధరలు పెంచేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడానికి కారణం కూడా సిండికేట్ ముఠాను నడిపించేది చంద్రబాబు బంధువుల కావడం వల్లనే అని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆరోపించారు.నరసాపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన విద్యుత్, డీజిల్ ధరలతో రైతులు అల్లాడిపోతుంటే కొత్తగా ఫీడు ధరలు పెంచి, 100 కౌంట్ రొయ్యల ధరలను ఏకంగా రూ.25 తగ్గిస్తే రైతులు బతికేదెలా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ప్రతి ఎకరాకి సబ్సిడీ కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లలో ఒక్క సబ్సిడీ కనెక్సన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 100 కౌంట్ రూ.250 పలుకుతుంటే, దానికి రైతుకి రూ.350 ఖర్చవుతోందని, చంద్రబాబు చర్యల కారణంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు.సిండికేట్ ముఠాకి లబ్ధి చేకూర్చాలని ఉద్దేశపూర్వకంగానే మంత్రి అచ్చెన్నాయుడు అప్సడా సమావేశానికి డుమ్మా కొట్టాడని, మంత్రి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పెంచిన ధరలకే ఫీడు అమ్మకాలు సాగిస్తున్నారని స్పష్టం చేశారు. ఫీడు వ్యాపారులు డీలర్లకు అవసరమైన మేర ఫీడు ఇవ్వకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా రైతుపై ఒక్క రూపాయి భారం పడినా ఊరుకునేది లేదని, కాదని మొండిగా ముందుకెళితే రైతుల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...అప్సడాతో సంబంధం లేకుండా ఎలా పెంచుతారు?:కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫీడ్, సీడ్ ధరలు పెరిగిపోయి ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సిండికేట్ చేతుల్లో ఈ ప్రభుత్వం బందీ అయిపోయింది. వారే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆక్వా రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత ఫిబ్రవరిలోనే ఫీడు ధరలు టన్నుకు రూ.4 వేలు పెంచగా, ఇప్పుడు మళ్లీ మరో రూ.12 వేలు పెంచేశారు. ఫీడ్, సీడ్ రేట్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా వైఎస్సార్సీపీ హయాంలో అప్సడా ద్వారానే జరిగేది. గత ఐదేళ్ల వైయస్సార్సీపీ పాలనలో అప్సడాలో రైతులు, ఎగుమతుదారులు, ప్రభుత్వం, పీడు యాజమాన్యం సభ్యులుగా ఉండి సమిష్టి నిర్ణయం తీసుకునేవారు. కానీ నేడు సిండికేట్ ముఠా అప్సడాతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్నే తమ చెప్పుచేతల్లో పెట్టుకొంది. ఫీడు ధరల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ కరువైంది.ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం సిండికేట్ ముఠాకి పెత్తనం అప్పగించేసింది. కాబట్టే నిన్న (శుక్రవారం) జరిగిన సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు గైర్జాజరయ్యారు. ఫీడు ధరలను ప్రభుత్వం పెంచిందా, తగ్గించిందా తెలియని పరిస్థితి నెలకొంది. ఫీడ్ వ్యాపారులు మాత్రం పెంచిన ధరలకే అమ్మకాలు చేస్తున్నారు. సరిపోయినంత ఫీడు డీలర్లకు ఇవ్వకుండా కృతిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో పంట చేతికొచ్చే సమయంలో ఫీడు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.100 కౌంట్ ధర రూ.25 తగ్గించేశారు:గత వైఎస్సార్సీపీ హయాంలో వైయస్సార్సీపీ హయాంలో రూ.3,800 కోట్ల మేర ఆక్వా రైతులకు సహకారం అందించడం జరిగింది. ఫీడు ధరలు మూడుసార్లు పెంచితే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగ్గించడం జరిగింది. కానీ నేడు సీఎం చంద్రబాబు నుంచి కూటమి నాయకులు ఎవరూ రైతుల పక్షాన ఉండటం లేదు. ఫీడు వ్యాపారులే ఎగుమతుదారులుగా కూడా వ్యవహరిస్తూ మొన్నటి వరకు రూ.275 వరకు ఉన్న 100 కౌంట్ ధరను ఇప్పుడు ఏకంగా రూ.25 తగ్గించేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మరో రూ.10 తగ్గిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.ఎక్స్‌పోర్టర్స్ మీటింగ్ పెట్టుకుంటే చాలు ధరలు తగ్గిపోతాయన్న భయం ఆక్వా రైతుల్లో కనిపిస్తోంది. ఒకపక్క ఫీడు ధరలు పెంచుతూ ఇంకోపక్క కౌంట్ ధరలు తగ్గిస్తూ ఆక్వా రైతుల పొట్టకొడుతున్నారు. గతంలో ఎప్పుడైనా ఫీడు ధరలు పెరిగితే వైయస్ జగన్ లంచాలు వెళ్లాయని ప్రచారం చేసేవారు. ఇప్పుడు లోకేష్ ఎంత లంచం తీసుకున్నాడో కూటమి నాయకులు చెప్పాలి. ఫీడు యాజమాన్యాలు చంద్రబాబుకి బంధువులు కాబట్టే వారి లబ్ధి కోసం రైతులను గాలికొదిలేశారు.చంద్రబాబు బంధువులదే సిండికేట్ ముఠా:ఆక్వా ఇండస్ట్రీస్‌కి సబ్సిడీ ధరకు కరెంట్ అందిస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మోడీతో మాట్లాడి ఫిష్ మీల్ ఇతర దేశాలకు ఎగుమతులు కాకుండా స్థానికంగా ఉపయోగపడేలా ఒప్పించాలి. అంతేకానీ రైతులు నిండా మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్స్పోర్టర్కి, సీడు, ఫీడు యాజమాన్యంపై భారం పడితే అంతిమంగా ఆ నష్టం ఆక్వా రైతు మీదే పడుతోంది.సిండికేట్ నాయకులు చంద్రబాబుకి బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి వారికి కొమ్ముకాస్తూ వైయస్ జగన్ గారు ఆక్వా రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అప్సడా చట్టానికి తిలోదకాలిస్తున్నారు. ముడి సరుకు ధరలు పెరిగినప్పుడు ఫీడు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. కానీ సోయా ధర తగ్గినప్పుడు ఒక్కసారి కూడా ఫీడు ధరలు తగ్గించిన పాపానపోలేదు. మొత్తం మీద ఆక్వా సంక్షోభానికి సీఎం చంద్రబాబే కారణం అవుతున్నారు. అప్సడా ద్వారా వైయస్సార్సీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా సీడు, ఫీడు ధరలు పెంచకుండా రైతులను ఆదుకోవడం జరిగింది.కొత్తగా ఒక్క కనెక్షన్ కి సబ్సిడీ విద్యుత్ ఇవ్వలేదు:వైఎస్సార్సీపీ హయాంలో 55 వేల కనెక్షన్లకు సబ్సిడీ ధరకు కరెంట్ ఇచ్చి ఆక్వా రైతులను ప్రోత్సహించడం జరిగింది. చంద్రబాబు మాత్రం ఎన్నికల సందర్భంగా ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్‌తో సంబంధం లేకుండా అందరికీ సబ్సిడీ ధరకు కరెంట్ ఇస్తానని చెప్పి కొత్తగా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. సిండికేట్ ముఠా ప్రభుత్వానికి తెలియకుండా ఫీడు ధరలు పది రూపాయలు పెంచింది. రేపు రూ.5 లు తగ్గించి, అది కూడా ఘనతగా ప్రభుత్వం ప్రచారం చేసుకోవాలని అనుకుంటోంది. అందుకే రొయ్యల రైతులను చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని, రైతులపై ఒక్క రూపాయి భారం పడినా సహించబోమని, కాదని మొండిగా వ్యవహరిస్తే ఆక్వా రైతుల పక్షాన పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు. -
‘ఉత్తరాంధ్రలోని ప్రతి ప్రాజెక్ట్ జగన్ ఘనతే’
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలోని ప్రతీ ప్రాజెక్ట్ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనతేనన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసింది శూన్యమని అప్పలరాజు విమర్శించారు. నాలుగుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఉత్తరాంధ్రాకు ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనపై సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చెత్త సంపద కేంద్రం ప్రారంభించటానికి ముఖ్యమంత్రి జిల్లాకి రావాలా? అని ప్రశ్నించారు. ‘ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు మూడోసారి జిల్లాకు వచ్చారు. ఒకసారి ఇచ్చాపురం వచ్చిన చంద్రబాబు టీ పెట్టటం నేర్పించారు. రెండోసారి బుడగట్ల పాలెం వచ్చినప్పుడు హార్బర్ పనులు ఆపించి వెళ్ళిపోయాడు. మూడోసారి పర్యటనలోచెత్త సంపద కేంద్రం తీసుకువచ్చారు. చంద్రబాబుకు ఈ జిల్లాపై ఉన్న ప్రేమ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లం అయింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం. మీకు శ్రీకాకుళం జిల్లా అంటే ఇంత చిన్న చూపా. పిల్లలు భారం కాదు....వాళ్లే మీ సంపద అంటున్నారు. పేదలకు ఎందుకు అలాంటి సలహాలు ఇస్తున్నారు. మీ అబ్బాయికి ఆ సలహా ఇవ్వండి. మీరెందుకు ఒక్కరితో ఆగిపోయారు. ఇద్దరిని, ముగ్గురిని ఎందుకు కనలేదు. నేటి చంద్రబాబు టీడీపీకి ఒకప్పటి టీడీపీకి చాలా తేడా ఉంది. వైఎస్సార్ ఆశయ సాధన కోసం, ప్రజలకు సేవ చేయాలనే ఆవిర్భవించిన దమ్మున్న పార్టీ వైఎస్సార్సీపీ. మా పార్టీతో మీ పార్టీకి పోలికా?’ అని మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా పెట్రోల్ ధర గుంటూరులో ఉంది. ఇది మన ఏపీ ఘనత. ఆ రోజు పెట్రోల్ ధర ఎక్కువ ఉంటే జగన్ వైఫల్యం అట. ఈరోజు పెట్రోల్ ధర పెరిగితే చంద్రబాబుకు సంబంధం లేదట. పెట్రోల్ పై రాష్ట్రంలో అదనంగా రూ 4 వ్యాట్ వేసారు. దాన్ని తగ్గించండి. అమరావతి కోసం డీజిల్ తరలిస్తే ఎంతగా కొరత వచ్చిందో చూసాం...కేంద్ర అలా కుదరదని చివాట్లు పెడితే ప్రజలకు పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వచ్చింది. అమరావతిలో అంతులేని అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడరు. స్కూల్స్ కోసం దాతల నుండి విరాళాలు అడుగుతున్నారు. అతని కుమారుడే విద్యాశాఖ మంత్రి. తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు. రీ సర్వే వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. ఆ రోజు ఏం మాట్లాడారు. మీ భూములు లాక్కుంటారు, మేం వచ్చిన వెంటనే రీ సర్వే రద్దు చేస్తాం మిమ్మల్ని బెదిరించడానికే జగన్ రీ సర్వే చేస్తున్నారని చంద్రబాబు మాట్లాడటం వాస్తవం కాదా?రీ సర్వేలో అసలు మీ పాత్ర ఏంటి? ఒక్క ఎక్విప్ మెంట్ అయిన మీరు కొన్నారా?, రీ సర్వే ఘనతను వాళ్ళ ఖాతాలో చేర్చుకోవడానికి మాట్లాడుతున్నారు చంద్రబాబు. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంలో ఎవరు ఎక్కువ రోల్ చేసారు చంద్రబాబు చెప్పాలి. మీరు మాట్లాడే ఉత్తరాంధ్రలోని ప్రతి ప్రాజెక్ట్ జగన్ ఘనతే.నేరేడు బ్యారేజ్ పై ట్రిబ్యునల్ తీర్పు 2021 లో జగన్ అధికారంలో ఉండగా వచ్చింది. నేరేడు బ్యారేజ్ పై ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడిన ఘనత జగన్‌ది. అందులో మీ ఘనత ఏముంది. అందులో నీ ఘనత ఏంటి? రామ్మోహన్ నాయుడు పాత్ర ఏంటి. గెజిట్ నోటిఫికేషన్ మొన్న చేశారు. ఇది ఒక పొలిటికల్ స్టంట్. మీరు నాలుగుసార్లు సీఎంగా చేసిన సమయంలో ఉత్తరాంధ్రలో ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా.. దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి టీడీపీ నాయకులు చెప్పoడి’ అని సవాల్ చేశారు. -
అండమాన్ తీరాన్ని తాకిన రుతు పవనాలు
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ తీరాన్ని రుతు పవనాలు తాకాయి. ఈ నెల 26న కేరళను తొలకరి పలకరించనుందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో అండమాన్, నికోబార్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగానే నైరుతి గాలులు పయనిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, మొత్తం నికోబార్ దీవులు, శ్రీవిజయపురం (బ్లెయిర్ పోర్ట్) సహా అండమాన్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది.రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి కూడా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ముందే.. అంటే మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిన్న (శుక్రవారం) తెలిపిన సంగతి తెలిసిందే. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయి. ఇది భారతదేశంలో నైరుతి రుతుపవనాల కాలం (జూన్ నుండి సెప్టెంబర్) ప్రారంభాన్ని సూచిస్తుంది. అయితే, ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంతకుముందు పేర్కొంది. ఈ సీజన్లో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణం కావచ్చని.. ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో వర్షపాతం తగ్గుతుందని ఐఎండీ తెలిపింది. -
చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలోకి తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు, అవినీతి వలనే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదంటూ ట్వీట్ చేశారు. ‘‘అభివృద్దిలో దూసుకుపోతున్నామంటూ అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చటానికే అభివృద్ది, సంపద సృష్టి అంటూ ప్రచారం చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ నిలదీశారు.‘‘2025-26 ఆర్థిక సంవత్సరపు కాగ్ నివేదికలు చూస్తే పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర డీఎస్డీపీ వృద్దిరేటు 10.75శాతం నమోదయిందంటున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వపు సొంత పన్ను ఆదాయాలు 3.22 శాతం తగ్గిపోయాయి. ఏదైనా రాష్ట్రం అభివృద్ది చెందుతుందంటే అక్కడ పెట్టుబడులు, వినియోగం పెరుగుతాయి. అందువల్ల ప్రభుత్వానికి పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయి. కానీ ఏపీలో 3.22 శాతం తగ్గటం అంటే అర్థం ఏంటి?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయాలు రూ. 85,922.23 కోట్లు. ఆ తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో కనీసం 8 శాతం సాధారణ వృద్ధి నమోదై ఉంటే, ఈ ఏడాదికి రూ. 1,00,219.69 కోట్లకు చేరుకోవాలి. కానీ వాస్తవంగా వచ్చిన ఆదాయం కేవలం రూ. 86,552.68 కోట్లు మాత్రమే. మరి చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా?. గతేడాది ఏపీఎండీసీ ద్వారా సమీకరించిన రూ.9 వేల కోట్ల ద్వారా కూడా ఎలాంటి సంపద సృష్టి జరగలేదు. గతేడాది ఆదాయాలు తగ్గితే కనీసం ఈ ఏడాదైనా పెరిగేలా చూసుకోవాలి. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వపు విధానాలు, అవినీతి చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లింది. ..జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు కూడా 5 శాతం కూడా పెరగలేదు. ఎక్సైజ్ ఆదాయాలు కూడా 8.20 శాతం తగ్గాయి. కూటమి ప్రభుత్వం మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటీకరించింది. విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, పర్మిట్ రూమలను ప్రవేశ పెట్టింది. అయినప్పటికీ ఆదాయం పెరగకపోగా, తగ్గటానికి కారణం అవినీతి, అక్రమాలే. సేల్ ట్యాక్సుల ఆదాయం ఈ రెండేళ్లలో పెరగకపోగా, ఇంకా తగ్గిపోయాయి. మొత్తం మీద రాష్ట్ర స్వంత పన్ను ఆదాయాలు 3.22 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.𝟮 𝘆𝗲𝗮𝗿 𝗽𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲 𝗶𝗻𝗱𝗶𝗰𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗲𝘃𝗲𝗿𝗲 𝗳𝗶𝘀𝗰𝗮𝗹 𝘀𝘁𝗿𝗲𝘀𝘀The provisional accounts for the financial year 2025-26 have been published by the CAG, these accounts bring to light unsettling facts regarding the State.On one hand Mr. Chandrababu… pic.twitter.com/jyQe6sUJVv— YS Jagan Mohan Reddy (@ysjagan) May 16, 2026 -
పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే అధికం: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ పై చీటింగ్ కేసు పెట్టాలి.. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు చెప్పి, ఇప్పుడు మోసం చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధర ఏపీలోనే ఉందని.. ప్రజల మీద రోజుకు రూ.10 కోట్ల భారం వేయటం దుర్మార్గం అని ధ్వజమెత్తారు.ఏపీతో పోల్చితే తెలంగాణ లో 3, తమిళనాడు 10, కర్ణాటకలో 7 రూపాయలు తక్కువ. ఏపీలో మాత్రం టాక్సుల పేరుతో దోచుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. ధరలు తగ్గించకపోగా కార్లు, బైకుల మీద ప్రయాణం చేయొద్దంటూ నీతులు చెప్తారా?. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ పేరుతో చంద్రబాబు ప్రతినెలా ఈవెంట్లు చేస్తూ మరింత వృథా చేస్తున్నారు’’ అని వెల్లంపల్లి నిలదీశారు.‘‘పెట్రోలు, డీజిల్‌పై టాక్స్‌లు ఎందుకు తగ్గించటం లేదు?. చంద్రబాబు నీతి కబుర్లు ఆపి, టాక్సులు తగ్గించాలి. లీటరు పెట్రోలు మీద 28లు ప్రభుత్వానికి వస్తాయని లోకేష్ ఆనాడు చెప్పారు. అందులో సగం తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారు. ప్రజల మీద ఈ బాదుడు ఆపకపోతే పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. -
APSRTC చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ నిర్వహణ విషయంలో ఛైర్మన్ కొనకళ్ల నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రైవేటీకరణ తప్పనిసరి అని అంటున్నారాయన. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..విద్యుత్ బస్సులు కొనుగోలు, నిర్వహణ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఆర్టీసీలోని పదివేల ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకురావాల్సి ఉంది. పదివేల విద్యుత్ బస్సులు కొనాలంటే 17 వేల కోట్లు కావాలి. ఇప్పటికే స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీపై ఆర్ధిక భారం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అంత ఖర్చు చేసి బస్సులు కొనే పరిస్థితిలో ఆర్టీసీ ఇప్పుడు లేదు అని అన్నారు. ‘‘కొత్త బస్సులు కొనలేం. విద్యుత్ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా నడపడమే మేలు. మొత్తం 1050 ఎలక్ట్రికల్ బస్సులకు ప్రపోజల్స్ పెట్టాం. 750 ఎలక్ట్రికల్ బస్సులకు టెండర్లు పూర్తయ్యాయి. రెండు మూడు నెలల్లో ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. ప్రతీ రోజు కాలం చెల్లిన బస్సులు స్క్రాప్ కు వెళుతుంటాయి. కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి’’ అని కొనకళ్ల నారాయణ అన్నారు. -
తొలిసారి గెలిచి మంత్రి అయినా.. చివరి స్థానమే
సవిత... తొలిసారిగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ఎలాగోలా గట్టెక్కారు. మహిళా కోటాలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయ్యారు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా స్వప్రయోజనాల కోసం తాపత్రయ పడుతూ అధ్వాన పనితీరుతో చివరి స్థానంలో నిలిచారు. సాక్షి, పుట్టపర్తి: సీఎం చంద్రబాబు ఇటీవలమంత్రుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులకు సంబంధించి ప్రకటించిన పనితీరు జాబితాలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మంత్రి సవిత చివరన ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతుండడంతోనే ఆమె చివరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విసుగెత్తిన సొంత పార్టీ కార్యకర్తలు.. సవిత వ్యవహారాలతో సొంత పార్టీ కార్యకర్తలే విసిగిపోయినట్లు తెలిసింది. ఇటీవల పార్టీ అధిష్టానం వద్ద టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు అన్ని విషయాలను విన్నవించినట్లు తెలిసింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమార్జనే ధ్యేయంగా ఆమె అనుచరులు పెనుకొండలో రెచ్చిపోతున్నారని, వారిని నియంత్రించడంలో మంత్రి పూర్తిగా విఫలం అయ్యారని చెబుతున్నారు. సీనియర్ నాయకులను విస్మరించి మంత్రి అన్నీ తానై వ్యవహరిస్తుండటంపై పార్టీ నాయకుల్లో అసమ్మతి నెలకొంది. రొద్దం, పరిగిలో ఇసుక దందా.. మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని రొద్దం, పరిగి మండలాల్లో పెన్నా, జయమంగళి నదుల నుంచి రాత్రింబవళ్లు ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. జేసీబీలతో తవ్వేసి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా కర్ణాటక తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులను నియంత్రిస్తుండటంతో ఇసుక దోపిడీకి అదుపు లేకుండా పోతోంది. రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుక పొరుగు రాష్ట్రం చేరుతోంది. ఇసుకను అక్రమంగా తరలించే వాహనాలను పట్టుకున్న అధికారులపై మంత్రి బదిలీ వేటు వేయించారు. దీంతో మిగతా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పెనుకొండలో అన్నీ తామై.. నియోజకవర్గ కేంద్రంలో మంత్రితో పాటు అనుచరులు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. మద్యం దుకాణాల టెండర్ల నుంచి కియా కార్ల కంపెనీలో కాంట్రాక్టుల వరకు వాటా దక్కాల్సిందే. ప్రారంభోత్సవాల్లో రిబ్బన్ కటింగ్‌లకు కూడా పార్టీలోని సీనియర్లను విస్మరిస్తున్నారు. హిందూపురం పార్లమెంటు సభ్యుడు పెనుకొండ వాసి అయినప్పటికీ ప్రొటోకాల్ పాటించకుండా ఆయన్ను పక్కకు నెట్టేస్తుండడం ఇప్పటికే పలుమార్లు వివాదాస్పదమైంది. మంత్రికి తెలియకుండా ఎంపీ పార్థసారథి ఎలాంటి కార్యక్రమం నిర్వహించే పరిస్థితి లేదు. గోరంట్లలో భారీ భూ దోపిడీ.. కర్ణాటక శివారున ఉన్న గోరంట్ల మండలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా అధికార పార్టీ నాయకులు పేద రైతుల భూములను బలవంతంగా లాక్కుని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పేయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల భూ కుంభకోణం వెలుగు చూసింది. ల్యాండ్ సీలింగ్ కింద పంచిన భూములపై మంత్రి అనుచరులు కన్నేసి పంజాబ్ కంపెనీకి కొంత రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకొంత మంది రైతులు విక్రయించలేదని బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ప్రజల్లోనూ అసంతృప్తి.. మంత్రి అండతో పెనుకొండ నియోజకవర్గంలో ఆమె అనుచరులు చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసుగెత్తిపోయారు. దందాలు, దోపిడీలు, కబ్జాలు జరుగుతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో మంత్రి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులపైనా ఒత్తిళ్లు.. మాట వినని అధికారులపై మంత్రి సవిత టక్కున వేటు వేయిస్తున్నారు. తాను చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయాలని పోలీసులపై పలుమార్లు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. దీంతో విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కోలేమని చెప్పిన ముగ్గురు ఎస్ఐలను ఇప్పటికే పంపించేశారు. మరో సీఐ పైన కూడా మంత్రి కక్ష కట్టినట్లు తెలుస్తోంది. తాను చెప్పిన వారికి పనులు చేయలేదని ఓ తహసీల్దార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన అందించిన పూల బొకేను అందరూ చూస్తుండగానే విసిరేయడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. -
జగన్ చేస్తే వినాశనం.. టీడీపీ చేస్తే అభివృద్ధా?
ఎంవీపీ కాలనీ (విశాఖ): విశాఖలో పర్యావరణ విధ్వంసం పెరిగిపోయిందని జనసేన మాజీ నాయకుడు, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖలోని సింహాచలం కొండతో పాటు ముడసర్లోవ, కంబాల కొండ, పావురాల కొండల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జగన్ ప్రభుత్వం చేస్తే విధ్వంసం, టీడీపీ చేస్తే అభివృద్ధి అన్న చందంగా విశాఖలో పర్యావరణ విధ్వంసం సాగుతోందన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ కట్టడాల కోసం రుషికొండపై నిర్మాణాలు చేస్తే టీడీపీ నానాయాగి చేసిందని.. రుషికొండను బోడిగుండు చేసేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిందన్నారు. అయితే, ఇప్పుడు డేటా సెంటర్ పేరుతో శ్రీ వరాహ నృసింహస్వామి కొలువైన పవిత్ర సింహాచలం, ముడసర్లోవ కొండలతో పాటు ప్రైవేట్ రిసార్ట్స్ కోసం పావురాల కొండలను కొట్టేస్తూ అభివృద్ధి అని చెబుతోందన్నారు. విశాఖకు రక్షణ కవచాలుగా ఉన్న కొండలను విధ్వంసం చేయడం పర్యావరణానికి పెనుముప్పుగా మారిందన్నారు. కొండల తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. ఈ విధ్వంసాన్ని ఆపేందుకు అవసరమైతే నగర ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. -
విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే ఇలాంటి దారుణాలు
సాక్షి, తాడేపల్లి: మద్యం నియంత్రణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పని ప్రదేశంలో టిప్పర్ ఢీ కొట్టటంపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. ఘటనకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ ధ్వజమెత్తారు. ‘‘టిప్పర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపారన్న వార్త ఆందోళన కలిగించింది. రాష్ట్రంలో రాత్రింబవళ్లు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. మద్యం నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అక్రమ మద్యం విక్రయాలు, పర్యవేక్షణ లోపంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. .. ‘‘ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద మహిళలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. పని ప్రదేశాల వద్ద కనీస భద్రతా చర్యలు లేకపోవడం దురదృష్టకరం. మృతి చెందిన కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయం అందించాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీళ్లను చీడిగ గ్రామస్తులుగా పోలీసులు నిర్ధారించారు. -
ఏసీబీ డీఎస్పీగా శిరీష
ఒంగోలు సిటీ: ఒంగోలు ఏసీబీ డీఎస్పీగా ఎస్.శిరీష శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో అవినీతి పెరుగుతోందన్నారు. పింఛన్లు, రేషన్, భూమి సమస్యలు, మున్సిపల్ సేవలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాల్లో కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు ఇస్తే వారి పనులు తాము దగ్గరుండి రూపాయి ఖర్చు లేకుండా చేయిస్తామని తెలిపారు. అవినీతిని అరికట్టేందుకు ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు ఇవ్వాలన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లయితే వెంటనే 9440446189, 9440446187, 8333925624 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చాన్నరు. మీ వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుతారని చెప్పారు -
బెంబేలెత్తిస్తున్న క్షుద్ర పూజలు
అన్నమయ్య : రాయచోటి పట్ణణంలోని గున్నికుంట్ల రోడ్డులో సమాధులకు దగ్గరగా ఎవరో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉండటంతో తెల్లవారు జామున అటువైపు వెళ్లే పాదచారులు ( వాకింగ్) భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు అ దిశగా వెళ్లడం మానేశారు. ఇది ఇలా ఉండగా రాయచోటి పట్టణంలోని పట్టణ వైద్యారోగ్య కేంద్రం ( ఐదు పైసలు బావి) దగ్గరగా గత రాత్రి ఎవరో చేతబడి చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. తెల్లవారి ఆ దారిలో నడిచి వెళ్లే ( వాకింగ్) వారికి, క్రికెట్ ఆడకొనేందుకు వెళ్లే కుర్రాళ్లకు ఈ దృశ్యం కనిపించింది. దీంతో ఒక్క సారిగా భయంతో ఆ వైపు వెళ్లేందుకు జంకుతూ వెనుతిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టే వారిపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
‘శ్రీవాణి టికెట్ల జారీలో అడ్డంగా దొరికిన టీటీడీ’
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవాణి టికెట్ల జారీలో టీటీడీ అడ్డంగా దొరికిపోయిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి టికెట్ల జారీ విధానంలో దోపిడి కొనసాగుతోందని ఆరోపించారు. సెక్యూరిటీ అడిట్ లేని పాత సాఫ్ట్‌వేర్‌నే టీటీడీ కొనసాగిస్తోందని మండిపడ్డారు. టీటీడీ పెద్దలు బరితెగించి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను స్వయంగా శ్రీవాణి టికెట్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే లభించలేదు. ఉదయం 9 గంటలు ఒక నిమిషానికే 800 టికెట్ల జారీ పూర్తి అయినట్లు చూపిస్తోంది. ఉదయం 8.50 నుంచి టికెట్ల కోసం సిద్ధంగా ఉంటే 9.01 నిమిషాలకే టికెట్ల అమ్మకాలు పూర్తి అయినట్లు ఆన్లైన్లో చూపించింది. ఆటో ఫిల్లింగ్ ద్వారా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. దీనిపై ఏమాత్రం లెక్కలేని తనంతో టీటీడీ చైర్మన్ వ్యవహరిస్తున్నారు.ఎస్ఈడీ టికెట్ల జారీకి ఆటో ఫిల్లింగ్ విధానం లేదు. చంద్రబాబు అనుమతితో ఈ దోపిడి జరుగుతోందని అనుకోవాలి. టీటీడీ పెద్దలు బరితెగించారు, దోపిడి చేస్తున్నారు. టీటీడీ దృష్టికి తీసుకు వచ్చిన తర్వాత కూడా సరిదిద్దుకోలేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రోజుకు 40 లక్షలు రూపాయలు అవినీతి శ్రీవాణి టికెట్ల ద్వారా జరుగుతోంది. బ్లాక్‌లో టికెట్లను అమ్మే వారి ద్వారా దర్శనాలు జరుగుతున్నాయి. సామాన్యులకు దర్శనం టికెట్లు లభించడం లేదు. రూ.300 టికెట్లను మూడు వేలకు బ్లాక్‌లో అమ్ముతున్నారు.రోజుకు ఐదువేల బ్రేక్ దర్శనం టికెట్లను ఇస్తున్నారు. వీటిలో రెండు వేల టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఒక్కోటి 5 నుంచి 8వేల వరకు అమ్ముతున్నారు. త్వరలో ఆధారాలతో నిరూపిస్తాం. టీటీడీలో శ్రీవాణి టికెట్ల స్కాం ద్వారా 48 కోట్ల అవినీతి జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో ఈ దోపిడీ జరుగుతోంది. ట్రావెల్ ఏజెంట్లు ద్వారా అమ్ముతున్నారా అనే దానిపై సమగ్ర విచారణ జరపాలి. హైందవ పెద్దలు దీనిపై వెంటనే స్పందించాలి కోరుకుంటున్నా అని కోరారు. -
తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో డేంజర్ ఈదురుగాలుల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. నేడు పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం, అల్లకల్లోల వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో భారీ ఈదురుగాలులు వంటి పరిస్థితి తెలంగాణలో నెలకొనే అవకాశముందన్నారు. పలు జిల్లాల్లో 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, జనగాం, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ డేంజర్ గాలుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు. ఇక హైదరాబాద్ వాతావారణ కేంద్రం కూడా తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడా ఈ వర్షాలకు తోడు బీభత్సం సృష్టించవచ్చని పేర్కొంది. సాయంత్రం సమయంలో హైదరాబాద్‌లో చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.Today's FORECAST ⚠️⛈️ Just like yesterday, even today, INTENSE HEATWAVE conditions expected in most parts of TG mainly North TG Thereafter, during late afternoon to night, scattered INTENSE THUNDERSTORMS ahead in Nalgonda, Yadadri - Bhongir, Nagarkurnool, Rangareddy, Jangaon,…— Telangana Weatherman (@balaji25_t) May 16, 2026 ఏపీ పరిస్థితి ఇలా.. మరోవైపు.. ఏపీలో కూడా వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పలు జిల్లాలో వర్షం కురుస్తుంటే మరికొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగింది. నేడు విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో 40-42°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఇక ఆదివారం 19 మండలాల్లో తీవ్రమైన, 30 మండలాల్లో సాధారణ స్థాయితో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై ఉంటుందని, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.Dear people of Telangana We have seen what happened in Uttar Pradesh earlier due to serious windsToday, the below mentioned districts can get thunderstorms with VERY STRONG WINDS upto 70kmph due to very high instability caused by heatwave ⚠️💨Requesting to stay alert as… https://t.co/bRXfU44Z8J— Telangana Weatherman (@balaji25_t) May 16, 2026 ఇదిలా ఉండగా.. భారత వాతావరణ ఈ నెల మే 26 లోపు రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అంతకంటే ముందు ఇవి తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు సముద్రంలో ఏర్పడ్డాయి. అందుకే మే 22నే ఇవి కేరళం చేరుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేరళం చేరుకున్న నైరుతి రుతుపవనాలు రెండుమూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయి. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఎండల తీవ్రత తగ్గుతుంది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు శనివారం విజయనగరం,మన్యం,పోలవరం,పల్నాడు, మార్కాపురం,ప్రకాశం,కర్నూలు,నంద్యాల,వైఎస్సార్ కడప జిల్లాల్లో 40-42°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం.ఆదివారం 19మండలాల్లో తీవ్ర,30 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. pic.twitter.com/nMUfx2kLkf— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 15, 2026 -
కాకినాడలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఉపాధి పనుల కోసం వెళ్తున్న కూలీలను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జి వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. బ్రిడ్జి దగ్గర ఉపాధి పనుల కోసం వెళ్తున్న కూలీలపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, మృతులను సత్యవతి, కృష్ణవేణి, చిట్టెమ్మ, అన్నవరంగా గుర్తించారు. వీరంతా చీడగ గ్రామానికి చెందినట్టు సమాచారం. -
విజయనగరం : అతిథులు వచ్చేశాయోచ్... (ఫొటోలు)
-
కాన్వాయ్ తగ్గించుకుంది.. ప్రత్యేక విమానాల్లో తిరగడానికా బాబూ..?
సాక్షి, అమరావతి: ‘ప్రజా ప్రతినిధులు కాన్వాయ్‌లను కుదించుకోవాలి. ఎక్కువ వాహనాల శ్రేణితో ప్రయాణించవద్దు. విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు సాధ్యమైనంత వరకూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌ను వాడితే బాగుంటుంది. అవసరమైతే సైకిళ్లు వాడండి, పాదయాత్రగా వెళ్లండి..’ సీఎం చంద్రబాబు చెప్పిన పొదుపు సూత్రాలు ఇవి. కానీ ఇవి కేవలం ఇతరులకు చెప్పడం కోసమేగానీ, తనకు, తన కుమారుడు లోకేశ్‌కు మాత్రం వర్తించవని మరుక్షణమే నిరూపించేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనలో వీరి దుబారా మామూలుగా లేదు. విడివిడిగా ప్రత్యేక విమానాల్లో వెళ్లడమే కాకుండా, కేంద్ర మంత్రి వద్ద తమ మెహర్భానీని చూపించుకోవడం కోసం సభకు భారీగా జన సమీకరణ చేయాలని పథక రచన చేశారు. ఇందుకు ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకున్నారు. వీటి ఇంధనానికి ఎంత వృథా ఖర్చన్నది ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదేం పొదుపు సూత్రం బాబూ..అంటూ సామాజిక మాధ్యమాల్లో తండ్రీ కొడుకులపై ప్రజలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకుంటున్నామని చెబితే ఏదో అనుకున్నాం. తీరా చూస్తే ప్రత్యేక విమానాల్లో తిరుగడం కోసమని తర్వాత అర్థం అయ్యింది’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘చంద్రబాబు బంగ్లా సోకులకు రూ.6.5 కోట్లు మంజూరు చేయడం కూడా పొదుపులో భాగమేనా’ అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు పొదుపు మంత్రం పెద్ద డ్రామా అని తేలిపోయింది. -
విజయ్‌తో పోలిక.. ట్రోలింగ్‌పై స్పందించిన పవన్
సాక్షి, అమరావతి: ‘‘తమిళనాడు ఎన్నికలొచ్చి ఆయన ముఖ్యమంత్రి కావడం ఏమోగానీ అందరూ నన్ను చంపేస్తున్నారు.. ఊళ్లో పెళ్లికి ఏదో హడావుడి అన్నట్టు ఉంది. చాలా మంది ఏపీలో అలా చేసి ఉండాలని నాకు మెసేజ్ పంపిస్తున్నారు. నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టలేదు.’ అంటూ జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తూ నడుస్తున్న ట్రోలింగ్‌పై స్పందించారు. తమిళనాడు పరిస్థితులు వేరని కార్యకర్తలకు వివరించారు. 2019లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఏమైంది? రెండు చోట్ల ఓడించారు కదా అని పేర్కొన్నారు. ‘‘తమిళనాడుతో మనకు పోలికేంటి? నిజంగా నాకు పదవే ప్రాధాన్యం అనుకుంటే, 2008లో, 2014లోనే ఎంపీగా పోటీ చేసేవాడిని. ఒక పార్టీని నడపాలంటే ఎంత సత్తా ఉండాలి? అన్నీ నిర్ణయించుకుని ఒక దశాబ్దం నలుగుతానని నిలబడ్డా’ అంటూ పేర్కొన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. Contesting alone sounds easy after Vijay’s win, but I’ve already experienced how tough solo politics is in Andhra. - AP Deputy CM Pawan Kalyan pic.twitter.com/PxlKaqL2aj— South Matters (@SouthMatters) May 15, 2026ఒంటరిగా వెళ్లే చాన్స్ ఉన్నా.. ‘‘పొత్తులో సమస్యలు ఉన్నాయి. ఆయన(చంద్రబాబు)తో చాలా అంశాల్లో విభేదించొచ్చు. ఒంటరిగా వెళ్లే చాన్స్ ఉంది. కానీ ఆయనను జైల్లో పెట్టినప్పుడు ఒక కీలక పరిస్థితి. చాలా ఆలోచించే పొత్తు నిర్ణయం తీసుకున్నా. పదవులు, వీటన్నింటి కంటే ప్రజల సుస్థిరతే ముఖ్యమనుకున్నా. పొత్తులో మీకు ఉన్న ఇబ్బందులను నేను అర్థం చేసుకోగలను. వాటిని పార్టీ సరిదిద్దుతుంది. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని చేయను. మీ గౌరవానికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. ఇబ్బందులున్నా.. మనమంతా బలమైన కూటమి వెంట వెళ్లాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. కూటమి ప్రాముఖ్యాన్ని గుర్తించాలి.’ అంటూ పవన్‌కళ్యాణ్ వెల్లడించారు. నా కోసం ఎదురు దాడి చేయండి ‘సమసమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. మాట్లాడితే వంగవీటి రంగా గురించి మాట్లాడతారు. ఆ రోజు ఆయనకు ఇబ్బంది, ప్రాణహాని ఉందని అంటే ఆయన చుట్టూ దడికట్టలేకపోయారు. మనిషి బతికి ఉన్నప్పుడు రక్షించుకోలేకపోయారు. నేను ఒక కులం కోసమే పని చేసి, ఆ కులం అంతా ఓట్లు వేస్తే రెండు చోట్ల నేను ఓడిపోకూడదు కదా?. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తే ఎదురు దాడి చేయండి. నేను ఒక కులం కోసం పనిచేయడానికి రాలేదు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులతో పార్టీ పాలక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ సమావేశాల్లో నేను స్వయంగా పాల్గొంటా. తొలుత 30 నియోజకవర్గాల్లో పర్యటిస్తా. పార్టీ శ్రేణులతో మాట్లాడతా’ అంటూ పవన్ వివరించారు. -
బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఇంత అలసత్వమా..?
లబ్బీపేట (విజయవాడతూర్పు): ప్రతి రంగంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అలసత్వ విధానాలు, అసమర్థ పాలనపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రోగి నుంచి తొలగించిన కాలు నోట కరుచుకుని వీధికుక్క గురువారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో తిరిగిన వైనం తాజాగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.గతంలోనూ పాత ఆస్పత్రిలో మృతశిశువును కుక్కనోటకరుచుకుపోయింది. బయోమెడికల్ వ్యర్థాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలనే నిబంధనలు ప్రభుత్వాసుపత్రుల్లో నిర్విర్యమవుతున్నాయనడానికి తాజా ఘటన అద్దం పడుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుట్టలుగా వ్యర్థాలు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వెయ్యికిపైగా పడకలు, మూడు బ్లాకుల్లో ఆపరేషన్ థియేటర్లు ఉండటంతో బయోమెడికల్ వ్యర్థాలు ప్రతిరోజూ గుట్టలుగా వస్తుంటాయి. అన్ని వార్డులు, థియేటర్ల నుంచి బయోమెడికల్ వ్యర్థాలను వర్కర్స్ తీసుకుని వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో వాటిని ఉంచుతారు. వీటిని నిర్విర్యం చేసే సంస్థ సిబ్బంది రోజూ ఉదయం 10 గంటలకు ప్రతి 24 గంటలకు ఆసుపత్రికి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచిన బయోమెడికల్ వ్యర్థాలను వాహనంలో తీసుకువెళతారు. బయోవ్యర్థాల నిర్వహణలో వైఫల్యమే తాజా ఘటనకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేతులు కాలాక.. ప్రభుత్వాస్పత్రిలో తాజా ఘటనపై తక్షణ చర్యల్లో భాగంగా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణను చూసే సూపర్వైజర్ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు సస్పెండ్ చేశారు. ఒక టెక్నీషియన్‌ను కూడా తొలగించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణ కోసం డిప్యూటీ సూపరింటెండెంట్, న్యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ అరుణ, సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ వై పద్మావతిలతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డిని ఆదేశించారు. ఇదేం కొత్తకాదు.. ప్రభుత్వాస్పత్రిలో మానవ అవయవాలను కుక్కలు తినడం వంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. పాత ఆస్పత్రిలో 2016లో మృత శిశువును నోటితో పట్టుకుని ఆస్పత్రి ప్రాంగణంలో తిరగడం అప్పట్లో కలకలం రేపింది. అంతేకాకుండా 2018లో సిద్ధార్థ వైద్య కళాశాల అనాటమీ విభాగంలోని మానవ అవయవాలు సైతం కళాశాల ఎదుట డ్రెయిన్‌లో కనిపించాయి. ఇలాంటి ఘటనలు బయోమెడికల్ వ్యర్థాల నిర్వాహణాలోపాన్ని ఎత్తి చూపుతున్నాయి. -
మేత ధర పెంచితే ఊరుకోం
సాక్షి, అమరావతి: మేత ధరలు పెంచితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆక్వా రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు. అర్ధ రూపాయి పెంచినా సహించబోమని స్పష్టం చేశారు. అప్సడా (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ) అనుమతి లేకుండా, ఏ ఒక్కరితోనూ చర్చించకుండా ఫిబ్రవరిలో టన్నుకు రూ.4 వేలు పెంచారని, మళ్లీ ఇప్పుడు పెంచితే ఏ విధంగా బతకాలని నిలదీశారు. రొయ్య మేత ధరల పెంపు వ్యవహారంపై సచివాలయంలో శుక్రవారం అప్సడా, ఆక్వా రైతుల సలహా కమిటీ (ఏఏబీసీ) సమావేశం వాడివేడిగా జరిగింది. కీలకమైన ఈ భేటీకి మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గైర్హాజరయ్యారు. ఆక్వా రైతులు, రైతు సంఘాల ప్రతినిధులను కాదని అప్సడా, ఏఏబీసీ సభ్యులతోనే ఈ సమావేశం నిర్వహించాలని భావించారు.కానీ క్షేత్ర స్థాయిలో వచి్చన ఒత్తిళ్లతో శుక్రవారం ఉదయం ఆక్వా సాగు జిల్లా రైతు సంఘాల నేతలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరారు. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశం మత్స్యశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తొలుత ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు 30 శాతం మేర పెరిగాయని, అత్యధికంగా ఫిష్ మీల్ టన్నుకు రూ.17 వేల మేర పెరిగిందన్నారు.కిలో మేత ఉత్పత్తికి రూ.4 విద్యుత్‌కే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. దేశీయంగా 3.5 లక్షల టన్నుల ఫిష్ మీల్ ఉత్పత్తి అవుతుండగా, విదేశాలకు 2 లక్షల టన్నుల వరకు ఎగుమతి అవుతుందన్నారు. ఈ కారణంగానే దేశీయ అవసరాలకు ఫిష్ మీల్‌ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవల్సి వస్తుందని వివరించారు. సోయాబీన్ ధరలు కూడా పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టన్నుకు రూ.12 వేల నుంచి రూ.14 వేల చొప్పున పెంచేందుకు అనుమతి కోరామన్నారు. రైతులపై ఒకేసారి భారం పడకూడదని వెనామీ ఫీడ్‌పై రూ.8,430, టైగర్ ఫీడ్‌పై రూ.10,520 వరకు పెంపు ప్రతిపాదన చేశామన్నారు. కనీసం ఆక్వా రైతుల మాదిరిగానే ఫీడ్ తయారీదారులకు సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తే భారం తగ్గుతుందని చెప్పారు.‘సిబా’ అధికారులపై రైతుల మండిపాటుసిబా (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్) అధికారులు ఫీడ్ తయారీదారులకు వంత పాడుతూ ఫీడ్ తయారీ సంస్థలపై రైతులు అపోహతో ఉన్నారని, వాళ్లకో ఫీడ్ మిల్లు అప్పగిస్తే దాంట్లో సాధకబాధకాలు అర్థమవుతాయని చెప్పడంతో వారిపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల కష్ట నష్టాలు మీకేం తెలుసని, సిబా పనితీరు అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్సడా కో వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రైతులు క్రమశిక్షణా యుతంగా లేరని, నీటి నిర్వహణ సక్రమంగా నిర్వహించకుండా కలుíÙతం చేస్తున్నారని, ఈ కారణంగానే వైరస్లు సోకుతున్నాయని అన్నారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఏర్పాటు చేసుకోవాలని సూచించినా రైతులు పట్టించుకోలేదన్నారు. దీనిపై రైతు ప్రతినిధులు మండిపడ్డారు.అన్నింటికి రైతులను తప్పు పట్టడం సరికాదని రైతు నేతలు హితవు పలికారు. ముడి సరుకుల ధరలు తగ్గినప్పుడు ఫీడ్ ధరలు తగ్గించేందుకు ఒక్క ఫీడ్ కంపెనీ కూడా ముందుకు రాలేదన్నారు. ఫిష్ మీల్ ఎగుమతులను నిలిపివేస్తే, దిగుమతి చేసుకోవల్సిన అవసరం ఉండదని, సోయాబీన్ ధరలను సాకుగా చూపొద్దని అన్నారు. ఫీడ్ ధర ఒకేసారి భారీగా పెంచడం వల్ల గ్రామాల్లో తిరగలేకపోతున్నామని, రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అప్సడా ప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రైతు సంఘాలు, ఫీడ్ తయారీదారుల ప్రతిపాదనలను రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు సమక్షంలో చర్చించి, ఆమోదయోగ్యమైన నిర్ణయానికి వద్దామని ఆనం సూచించా రు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్ పాల్గొన్నారు. -
గన్నవరం ఎయిర్ పోర్టుకు సర్కారు ఉరి
సాక్షి, అమరావతి: ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ అనవసర వ్యయాలు తగ్గించుకుని పొదుపు పాటించండని పిలుపునిస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ దుబారాలో తనను మించిన వారు లేరని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రచార కండూతి కోసం రాజధానిలో విమానాశ్రయం పేరుతో రూ.7,500 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడానికి వెనుకాడటం లేదు.నిన్నటి వరకు గన్నవరం రాజధానిలో భాగమంటూ ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం రూ.4,000 కోట్లకు పైగా వ్యయం చేసి, ఇప్పడు టెర్మింనల్ పనుల టెండర్లను రద్దు చేసి ఎక్కడి పనులను అక్కడే ఆపేశారు. భూ సేకరణ, ఫ్లై ఓవర్లు, కొత్త రన్‌వే, కొత్త టెర్మింనల్ ఇలా రూ.నాలుగు వేల కోట్ల ఖర్చును గంగపాలు చేయడానికి సిద్ధమైపోయారు. ఈ క్రమంలో అమరావతిలో 4,618 ఎకరాల్లో రూ.3,409 కోట్ల పెట్టుబడితో కొత్త విమానాశ్రయం కట్టడానికి సిద్ధపడుతుండటంపై రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు. ఇప్పటిదాక విజయవాడ, గన్నవరం రాజధాని అమరావతి పరిధిలోకే వస్తాయంటూ ప్రచారం చేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. గన్నవరం విమానాశ్రయం అమరావతికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి–16కు ఆనుకొని అందరికీ అందుబాటులో ఉంది. పైగా పశ్చిమ బైపాస్ ద్వారా 30 నిమిషాల్లోనే రాజధానికి చేరుకునే వీలుంది. ఇవన్నీ లెక్కలు వేసుకునే అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు ఏకంగా 700 ఎకరాలు సేకరించారు.భూ సేకరణ సమయంలో గన్నవరం కూడా రాజధాని పరిధిలోకే వస్తుందని హామీ ఇవ్వడమే కాకుండా, విమానాశ్రయం విస్తరణకు భూమి ఇచి్చన రైతులకు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించారు. ఇప్పుడు ఈ విమానాశ్రయాన్ని అమరావతికి తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు మరింత విస్తరించాల్సింది పోయి దీన్ని మూసి వేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. 1,670 ఎకరాల్లో హీత్రూ విమానాశ్రయం దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత జనాభా 3.4 కోట్లు. ఢిల్లీలో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ 1,500 ఎకరాల లోపే. దేశ ఆర్ధిక రాజధాని ముంబై జనాభా 1.25 కోట్లు. అక్కడి ఛత్రపతి శివాజీ విమానాశ్రయం ఉన్నది 1,850 ఎకరాల్లోనే. హైదరాబాద్ జనాభా 1.10 కోట్లు. శంషాబాద్ రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు కేటాయించినా, ఇప్పటి వరకు వినియోగించుకున్నది 2 వేల ఎకరాలు మాత్రమే. అంతర్జాతీయంగా అత్యంత రద్దీగా పేరు పొందిన లండన్ హీత్రూ విమానాశ్రయం 1,670 ఎకరాల్లోనే ఉంది. ఆ విమానాశ్రయం నుంచి ఏటా 84 దేశాలకు చెందిన 214 ప్రాంతాలకు 8 కోట్ల మందికిపైగా ప్రయాణిస్తారు.అయితే మూడు లక్షల జనాభా కూడా లేని అమరావతి రాజధానిలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కోసం దాదాపు 5 వేల ఎకరాలు ఎందుకని తెలుగుదేశం పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి తొలి దశ పూర్తి కావడానికే 30 ఏళ్లకు పైగా సమయం పడుతుందని ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయని, అక్కడ ఇప్పుడు ఇంత భారీ విస్తీర్ణంలో, భారీ ఖర్చుతో కొత్త విమానాశ్రయం అవసరం ఏముందని ప్రశి్నస్తున్నారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేపట్టిన ప్రాజెక్టు తప్ప మరొకటి కాదని, అమరావతి విమానాశ్రయం ఆలోచన ఉపసంహరించుకొని గన్నవరం విమానాశ్రయాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాభవం కోల్పోనున్న విజయవాడ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పిచ్చి కారణంగా విజయవాడ నగరం ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితి వచి్చందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ తర్వాత రాష్ట్రానికి ప్రధాన నగరంగా వెలుగొందుతున్న విజయవాడ ఇకపై అనామకంగా మిగిలిపోయేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. దేశంలో ప్రధాన బస్టాండ్లలో ఒకటిగా ఉన్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ రైల్వే స్టేషన్‌ను కూడా అమరావతికి తరలించి విజయవాడను రాజధానితో అనుబంధం లేకుండా చేస్తున్నారంటూ మేధావులు వాపోతున్నారు.ఏదైనా ప్రైవేట్ సంస్థ కొత్తగా ఎయిర్‌పోర్టు నిర్మింస్తే సమీపంలో మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదని ప్రభుత్వాలతో కన్సెషన్ ఒప్పందాలు చేసుకుంటాయి. 150 కిలోమీటర్ల దూరంలో అప్పటికే ఎయిర్‌పోర్టులు ఉంటే వాటిని మూసివేయాలి. దీని ప్రకారం అమరావతిలో కొత్త ఎయిర్‌పోర్టు వస్తే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను మూసి వేయాల్సి ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం కూడా పక్కపక్కనే రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులకు అనుమతి ఇవ్వదని అధికారులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వచి్చన తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్టు మూత పడినట్లే, అమరావతి ఎయిర్పోర్ట్ వస్తే గన్నవరం విమానాశ్రయం కూడా మూసి వేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయినా అంత పెద్ద లండన్‌లోనే ఒకే విమానాశ్రయం ఉండగా, గన్నవరం సమీపంలోని అమరావతిలో మళ్లీ కొత్తగా విమానాశ్రయం నిర్మాణానికి పూనుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పొదుపు చర్యలు అంటే ఇవేనా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. -
పెట్రో ధర పెంపుపై భగ్గుమన్న జనం
సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై జనం ఒక్కసారిగా భగ్గుమన్నారు. శుక్రవారం ధరల పెంపును నిరసిస్తూ పలు చోట్ల అప్పటికప్పుడు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. సీపీఎం, సీపీఐలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడంతో అనేక ప్రాంతాల్లో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలతోపాటు పలు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ధర్నాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ (వీఏటీ) తగ్గించి సామాన్యులకు ఊరట ఇవ్వాలని, ధరల పెరుగుదల వల్ల పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు.విజయవాడ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకు వద్ద ధర్నా చేశారు. ఫ్లాట్ రిక్షాకు బైక్‌ను తాళ్లతో కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో విజయవాడ–బందరు ప్రధాన రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా రంగం కుదేలవుతుందని, నిత్యావసర సరకుల ధరలు పెరుగుతాయని, ప్రజలు, రైతాంగంపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రో ధరలు పెంచడం ప్రజలకు నమ్మకద్రోహం చేయడమేనని మండిపడ్డారు.కృష్ణా జిల్లాలో రైతుల నిరసనఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరుగుతాయని, ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నాగయలంకలో వారు నిరసనకు దిగారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో సీపీఐ శ్రేణులు రోడ్డుపై ఖాళీ గ్యాస్ సిలెండర్లు పెట్టి, తాళ్లతో ఆటోను లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వైఎస్సార్ సర్కిల్ నుండి తిలక్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏలూరులోను వామపక్ష పార్టీలు పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ధర్నాలు చేశాయి. కడపలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాకినాడలో ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ సీపీఐ శ్రేణులు నిరసన తెలిపాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో లారీకి తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపారు. నమ్మించి మోసం చేశారు..పెట్రోల్, డీజిల్‌పై రూ.3కు పైగా పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడం తగదని, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే వంట గ్యాస్ ధర పెంపుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు మూతపడి ఉపాధి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు.ఇప్పుడు చమురు ధరలు పెంచడం వల్ల రవాణా రంగంపై పెనుభారం పడనుందని, నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేజీ బేసిన్లో రాష్ట్రానికి 50 శాతం వాటా ఇచ్చేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలను పెంచడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ఈ మేరకు నేతలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. -
ఏపీలోనే అధిక బాదుడు
నాడుఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడే ఫుల్ ట్యాంక్ చేసుకుని వెళ్లండంటూ పొరుగు రాష్ట్రాల్లో బోర్డులు పెట్టారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే వాటి ధర ఎక్కువ. ఫలితంగా నిత్యావసరాల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రం వేసే పన్నే ఇందుకు కారణం. ప్రభుత్వం తొలుత ఆ పన్ను తగ్గిస్తే ధరలన్నీ తగ్గుతాయి. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌పై వేసిన పన్నును తగ్గిస్తాం. తద్వారా రాష్ట్రంలో అన్ని ధరలు తగ్గుతాయి. – ఎన్నికలకు ముందు చంద్రబాబునేడుప్రపంచ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రజలంతా పొదుపు పాటించేలా అవగాహన కల్పించాలి. పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలి. తక్కువ దూరాలకు సైకిళ్లను వినియోగించాలి. కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. వారంలో ఒకరోజు నో వెహికల్ డే గా పాటించాలి. – గురువారం కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన రేట్లు భగ్గుమంటున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఠారెత్తిస్తున్నాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. శుక్రవారం నుంచి ఏపీలో లీటరు పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెరిగింది. అత్యధికంగా పల్నాడులో లీటరు పెట్రోల్ రూ.113.62, డీజిల్ రూ.101.24కు ఎగబాకింది. ఫలితంగా రవాణా రంగంతో పాటు ఆహార, నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడనుంది. వాస్తవానికి ఏపీలో రోజుకు 9 వేల కిలో లీటర్ల పెట్రోల్, 15–20వేల కిలో లీటర్ల డీజిల్ వినియోగం ఉంది.తాజాగా ధరల పెరుగుదలతో రోజు పెట్రోల్‌పై రూ.3.29 కోట్లు, డీజిల్‌పై రూ.6 కోట్లకుపైగా ఆర్థిక భారం పడుతుంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కేరళంతో పోల్చుకుంటే రూ.3, తమిళనాడుతో పోల్చితే ఏకంగా రూ.10, కర్ణాటకతో చూసినా రూ.7 వరకు వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. గృహ వినియోగ సిలిండర్ రూ.950–980 ఉంటోంది. కమర్షియల్ గ్యాస్ రూ.3,300కుపైగా చేరింది. నెలల వ్యవధిలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పైపైకి ఎగబాకడంతో సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. పెరిగిన భారం ప్రభుత్వం భరించకుండా ఇంధనం పొదుపు చేయాలంటూ ఉచిత సలహాలు ఇస్తుండటం పట్ల మండిపడుతున్నారు.రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, అధికారంలోకి రాగానే వాటిపై రాష్ట్రం విధిస్తున్న వ్యాట్, తదితర పన్నులు తొలగిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయం గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నెటిజన్లు ఉతికారేస్తున్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించి సామాన్యులకు ఆర్థిక ఊరట కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వంట నూనెలు సహా నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇంకోవైపు ప్రభుత్వం రేషన్‌లో ఇచ్చే సబ్సిడీ కందిపప్పు, గోధుమ పిండి, చిరుధాన్యాల పంపిణీకి మంగళం పాడేసింది. రైతులకు ధాన్యం మద్దతు ధర దక్కకపోగా, బహిరంగ మార్కెట్లో బియ్యం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. -
‘ప్రజాధనాన్ని కుంగిపోయే బ్రిడ్జిలకు ఖర్చు చేస్తారా?’
తాడేపల్లి: ఉండవల్లి స్టీల్ బ్రిడ్జిను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జిను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, శైలజానాథ్‌లు పరిశీలించారు. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్‌కు అనుసంధానంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణ సమయంలో స్టీల్ బ్రిడ్జ్ గర్డర్ ఒరిగింది. దీన్ని పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు.. రాజధాని పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకం అనడానికి ఇదొక నిదర్శమన్నారు. పూటకో మాట చెప్తున్నారు..బ్రిడ్జి నిర్మాణంలో అధికారులు పూటకో మాట చెప్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఉదయం తప్పులేదన్నారు, సాయంత్రానికి తప్పు జరిగినట్టు ప్రకటించారన్నారు. ‘రైతుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అమరావతి పేరుతో విజయవాడను ఓల్డ్ సిటీగా మార్చేశారు. అప్పులు తెచ్చి అమరావతి అవసరమా?, అప్పులు ఆపండి, చిన్న బ్రిడ్జి నిర్మాణంలోనే ఇన్ని లోపాలు ఉంటే ఇక అమరావతి ఎప్పటికి అవుతుంది?, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు’ అని ధ్వజమెత్తారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ ఆర్నెళ్ల క్రితం ప్రారంభించిన బ్రిడ్జి ఇంకా పూర్తవలేదు. ఈలోపు కొంత కుంగిపోయింది. పనులు ఆపేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వారధి దగ్గర కలుపుతామన్నారు. మరి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేస్తున్నట్టు?, అంటే ప్లానింగ్ లోపం ఉన్నట్టా?, కొండవీటి వాగు మీద బ్రిడ్జి పూర్తి కాకుండానే బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేస్తున్నారు?, కమీషన్ల కక్కుర్తితో హడావుడిగా పనులు చేయటం వలనే బ్రిడ్జి కుంగింది. బకింగ్‌హామ్ కెనాల్ జలరవాణాకు సంబంధించినది. దానిమీద బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే చాలా పర్మిషన్ లు కావాలి. ఏం పర్మిషన్ లు తీసుకుని బ్రిడ్జి కడుతున్నారు?, అధికారం ఉందని ఇష్టానుసారం బ్రిడ్జిలు కడతారా?, చంద్రబాబు, లోకేష్, మంత్రి నారాయణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజాధనాన్ని కుంగిపోయే బ్రిడ్జిలకు ఖర్చు చేస్తారా?’ అని ప్రశ్నించారు. -
‘చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవ్వరు’
సాక్షి, విశాఖపట్నం: ‘‘చంద్రబాబు ఖర్చులు తగ్గించుకొని డబ్బు ఆదా చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు మాటలు నిజమేనని ప్రజలు నమ్మారు. చంద్రబాబు ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే చంద్రబాబు, లోకేష్ వేర్వేరు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తి వెళ్ళారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడానికి రెండేళ్లలో రూ.120 కోట్లు ఖర్చు చేశారు. లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవరు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు ప్రతి ఒక్కరూ ముగ్గురు నలుగురు పిల్లలను కనాలని చెప్పారు. ఆ సూత్రం లోకేష్‌కు ఎందుకు వర్తింపు చేయలేదు. పబ్లిసిటీ మీద ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారు. చంద్రబాబు రూల్స్ పెట్టి.. అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు ఇంటి మరమ్మత్తుల కోసం రూ.6.50 కోట్లు కేటాయించారు. రెండేళ్లలో 3 లక్షల 70 వేల కోట్లు అప్పు ఈ రెండేళ్లలో చంద్రబాబు సాధించారు.టీడీపీ వైఎస్సార్సీపీ బోథ్ ఆర్ నాట్ సేమ్ లోకేష్. వైఎస్సార్సీపీ వైఎస్ ఆశయాల నుంచి పుట్టింది. టీడీపీ వైస్రాయ్ హోటల్ నుంచి పుట్టింది. టీడీపీది బీరు బారు పార్టీ.. వైఎస్సార్సీపీది విద్యా వైద్య విధానం పార్టీ. వైఎస్ జగన్‌ను చూస్తే నరనరాన భయం చంద్రబాబు లోకేష్‌లో కనిపిస్తుంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర మొత్తానికి గుండు కొట్టిస్తున్నారు. ఎక్కడ ఏ కొండ కనిపించిన గుండు కొడుతున్నారు. కూటమి భూ అక్రమాలు మీద వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అవసమైతే వైఎస్ జగన్ ఈ పోరాటంలో పాల్గొంటారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచితే ఆ భారం ప్రజలు మీద పడకుండా వైఎస్సార్ నిర్ణయం తీసుకున్నారు’’ అని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. -
ఎంపీ గురుమూర్తి వినతి.. రైతులకు కేంద్రం తీపి కబురు
సాక్షి, తిరుపతి: తిరుపతి ఎంపీ గురుమూర్తి వినతిపై రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రం సానుకూల స్పందించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడంతో పాటు ఆధునీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఎంపీ గురుమూర్తి తీసుకెళ్లారు.ఈ అంశంపై స్పందించిన కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ), షుగర్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) సహకారంతో ఈ కర్మాగార పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా మూతపడిన సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ లేఖలో పేర్కొన్నారు. -
దుర్గ గుడిలో ప్రమాదం.. పెచ్చులూడి బాలిక తలకు తీవ్ర గాయాలు
విజయవాడ: కనక దుర్గమ్మ ఆలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. మెట్ల పూజ చేస్తుండగా భక్తులపై స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. బాలిక తలకు తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ప్రమాదం సమయంలో దుర్గగుడి వైద్యులు అందుబాటులో లేరు. దీంతో అధికారుల నిర్లక్క్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. -
అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయి. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24 గంటల్లో దక్షిణ అండమాన్‌ను రుతు పవనాలు తాకనున్నాయి. 60 శాతం స్టేషన్లలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం ఆధారంగా నైరుతి ఆగమనాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాలకు సహకరిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.కాగా, భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ఐదు రోజులు ముందే.. అంటే మే 26నే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలానికి ఇదే ఆరంభం. అంతకుముందు నిన్న (మంగళవారం) వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తూ.. ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొంది.సాధారణంగా మే 20 ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులను తాకే రుతుపవనాలు, ఆ తర్వాత పశ్చిమ దిశగా భారత ప్రధాన భూభాగం వైపు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది రుతు పవనాల సీజన్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు 'ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణం కావచ్చని పేర్కొంది. ఐఎండీ ప్రకారం... ఈ ఏడాది భారతదేశంలో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. -
గేదె పాలతో ఆవు నెయ్యి ఎలా వస్తుందో?
సాక్షి, గుంటూరు: ముప్పై ఏళ్లపాటు జెండా మోసి గెలిపించిన కాపులపై దాడులు చేయించడానికి.. తప్పుడు కేసులు పెట్టించడానికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌కు మనసెలా వచ్చిందో అర్థం కావడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మామిళ్లపల్లి ఘటనను ప్రస్తావిస్తూ శుక్రవారం గుంటూరులో మాట్లాడుతూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిళ్ళపల్లిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మనుషుల్ని పంపి ధూళిపాళ్ల నరేంద్ర మామిళ్ళపల్లి పంపి మొక్కజొన్న రైతులపై దాడులు చేయించారు. ఆడా మగా తేడా లేకుండా ఆ రైతులపై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టం పేరిట తప్పుడు కేసులు పెట్టించారు. ఇది చూసి.. కూటమి ప్రభుత్వంలో కొందరు పోలీసులు కూడా ‘అరే మనం ఇంత దిగజారి పనిచేస్తున్నామా?’ బాధపడుతున్నారు. టీటీడీకి నకిలీ నెయ్యా?ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు, కృష్ణాజిల్లాలో గేదే పాలు సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి అమ్ముకుంటున్నారు. గేదె పాలతో ఆవు నెయ్యి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు?. సంగం డెయిరీ.. వైష్ణవి డెయిరీ ఈ రెండూ ఒకటి కాదా?. వైష్ణవి డెయిరీ తప్పు చేసిందని సాక్షాత్తు సీబీఐనే చెప్పింది కదా అని పేర్ని నాని అన్నారు. ధూళిపాళ్ల నరేంద్రకు సంగం డెయిరీ అంటే ఎంత ప్రాణమంటే.. ఆ డెయిరీ చైర్మన్ పదవికి రాజీనామా చేయించడం చంద్రబాబు వల్ల కూడా కాలేదు. ‘నీకు మంత్రి పదవి కావాలా? సంగం డెయిరీ కావాలా?’ అని చంద్రబాబు అడిగితే.. మరో మాటే లేకుండా పాల డెయిరీనే ధూళిపాళ్ల ఎన్నుకున్నారు. తన అనుచరులతో క్వింటా మొక్కజొన్న రూ.1600 కొని.. సంగం డెయిరీలో రూ.2100 కొంటున్నట్లు ఆయన రాయించుకుంటున్నారు. కాపులు ఉంది అందుకేనా?.. ముప్ఫై ఏళ్లు నీకు జండా మోసిన కాపులపై దాడి చేయిస్తావా? అంటూ ధూళిపాళ్లపై పేర్ని నాని ఫైరయ్యారు. అదే సమయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరుపైనా మండిపడ్డారు. ‘‘పవన్ కళ్యాణ్‌ను చూసి కాపులంతా కూటమికి ఓటేశారు. ఇప్పుడేమో కాపులపై అక్రమ కేసులు బనాయిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. కాపులను ఇంత చావబాదుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించరు. పైగా కూటమి ప్రభుత్వంలో ఉన్న రెండున్నరేళ్లు సీఎం అవుతారని కాపులు ఆశిస్తే.. ఆయనేమో మరొక 15 సంవత్సరాలు చంద్రబాబును మోయాలి అని కాపులకు పిలుపు ఇస్తున్నాడు అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. కాపుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమన్న పేర్ని నాని.. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాపు రైతులపై పెట్టిన అక్రమ ఎస్సీ ఎస్టీ కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. -
అంతర్జాతీయ నగరమని ఊదరగొట్టి.. మున్సిపాలిటీతో సరిపెట్టి..
వెనకటికి ఒక సామెత ఉంది. ఏమి చేస్తున్నావురా అని అంటే పారబోసి, ఎత్తుకుంటున్నానని చెప్పాడట. ఇప్పుడు అమరావతి రాజధానిలో టీడీపీ,జనసేన, కూటమి సర్కార్ తీరు అలాగే ఉంది. చేసిన పనులే మళ్లీ చేయడం,ఇప్పటికే ఉన్న నిర్మాణాలనే మళ్లీ చేపట్టడం, కోట్లు వ్యయం చేసి కంప కొట్టిస్తుండడం, వరద వస్తే నీళ్లు తోడుతుండడం..ఇలాంటి వైనం అందరిని విస్తుపోయేలా చేస్తోంది. ఫలానా ప్రాంతం వరద వస్తే మునిగిపోతుందని తెలిస్తే ఎవరైనా అక్కడ ఇల్లు కట్టుకుంటారా? కాని ఏపి ప్రభుత్వం మాత్రం వరద వచ్చినా ఫర్వాలేదు..వేల కోట్లు వ్యయం అయినా ఫర్వాలేదు..తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. తొలుత 34వేల ఎకరాలు భూముల నుంచి సమీకరించి అంతర్జాతీయ రాజధాని నగరం అవుతుందని ఊదరగొట్టారు. ఇప్పుడు అది కేవలం మున్సిపాల్టీగానే ఉంటుందని, ఇంకా మరో లక్షన్నర ఎకరాలు తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.అందులో భాగంగా ఏభైవేల ఎకరాలకు టెండరుపెట్టారు. ఒకప్పుడు చంద్రబాబుకు, టీడీపీకి వీర మద్దతుదారులుగా ఉన్న పలువురు రైతులు, ఆ ప్రాంత గ్రామాలవారు ఈ పరిస్థితిపై మండిపడుతున్నారు.తాము భూములు ఇవ్వబోమని కరాఖండిగా చెబుతున్నారు. టీడీపీ మద్దతుదారు అయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంటివారే రెండో దశ భూమి సమీకరణ ఒక పెద్ద స్కామ్ అని అన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు. వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు నెత్తి,నోరు మొత్తుకుని ఇదంతా భూ దందానే అని,ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా ఉందని వాపోతున్నారు. అయినా వీటన్నిటిని పెడచెవిన పెట్టి కూటమి సర్కార్ వేల కోట్ల వ్యయం చేసే పనిలో పడింది. కొద్ది రోజుల క్రితం అమరావతి గ్రామాలకు ప్రపంచ బ్యాంక్ బృందం ఒకటి వచ్చింది. అక్కడ వరద నియంత్రణకు జరుగుతున్న పనులను పరిశీలించిందట. అమరావతి అభివృద్ది సంస్థ చైర్ పర్సన్ లక్ష్మీ పార్దసారధి వారికి వరద నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.కొండవీటి వాగు 24 కిలోమీటర్లు, పాలవాగు 17 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతాన్ని సుందరమైన ఎవెన్యూ ప్లాంటేషన్ తో అభివృద్ది చేస్తామని చెప్పారట.పెనుమాక, శాఖమూరు, నీరుకొండ, లలో కొత్తగా నాలుగు రిజర్వాయిర్లు కడుతున్నామని తెలిపారట.దీనికి మళ్లీ ఈకో టూరిజం అని కలరింగ్ ఇచ్చే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. ఇక్కడే ఎవరికైనా సందేహం రావాలి!అసలు వరద ప్రాంతంలో భారీ నిర్మాణాలు ఎందుకు కడుతున్నట్లు? ఆ నీటిని మళ్లించడానికి వేల కోట్లు ఎందుకు వ్యయం చేస్తున్నట్లు? ఈ ప్రశ్నను ప్రపంచ బ్యాంక్ బృందం వేయలేదు. ఎందుకంటే వారి వ్యాపారం వారిది. ఇదంతా ఏపీ ప్రజలపై పడే భారమే కదా!అంతేకాదు..కృష్ణ పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడ నేల స్వభావం బహుళ అంతస్థుల భవనాలకు అంత అనువైనవి కావని నిపుణులు మొత్తుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏ రాజధాని నగరంలో ఇలా వరద ఎత్తిపోయడానికి లిఫ్ట్ లు ,రిజర్వాయర్ల నిర్మాణం జరగలేదని అర్బన్ వ్యవహారాల నిపుణుడు రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.ఇక్కడ 84 శాతం సాగు,పర్యావరణ భూములు ఉన్నాయని, మూడు పంటలు పండే భూములను నాశనం చేసి పర్యావరణాన్ని దెబ్బ తీశారని మాజీ జనసేన నేత, పర్యావరణవేత్త అయిన బొలిశెట్టి సత్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత పదేళ్లలో పలువురు పర్యావరణవేత్తలు సైతం ఇదంతా పర్యావరణ విధ్వంసం అని హెచ్చరించారు. కేంద్రం గతంలో నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ పంట భూములలో రాజధాని వద్దని స్పష్టంగా చెప్పినా, చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు.ఇటు రేగడి భూములలో కాకుండా,నాగార్జున యూనివర్శిటీ చెంత ఉన్న ప్రభుత్వానికి చెందిన గట్టి భూములలో అవసరమైన నిర్మాణాలు చేసుకుంటే సరిపోతుందని ఎంతోమంది చెప్పినా, చంద్రబాబు వినిపించుకోలేదు. లక్షల కోట్లు ఒకే చోట కుమ్మరించడానికి రెడీ అయిపోయారు.అందులో భాగంగా ఇప్పటికే 47 వేల కోట్ల రూపాయల అప్పు చేశారు.వేల కోట్ల రూపాయలతో రిజర్వాయిర్లు నిర్మిస్తూ ,వరద ప్రాంతంలో లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం రెండేళ్ల క్రితం వచ్చిన బుడమేరు వరద కారణంగా పడిన గండ్లనే ఇప్పటికీ పూడ్చలేదట. విజయవాడ మునిగిపోకుండా 35 కోట్ల రూపాయలతో 500 మీటర్ల రక్షణ గోడ కడతామని గతంలో హామీ ఇచ్చారు.దానికే దిక్కులేదట.అమరావతిలో మాత్రం అంతర్జాతీయ టూరిజం ఏర్పాటు చేస్తారట.చిత్రమేమిటంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటినే కాదు.. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ లు వంటివాటిని మళ్లీ కొత్త డిజైన్ లతో నిర్మిస్తారట.ఏపీ ఆర్దికంగా అంత పటిష్టంగా ఉంటే ఏమి చేసుకున్నా ఎవరూ కాదనరు,కాని ఒక పక్క చెప్పిన హామీలకు డబ్బులు లేవని పదే,పదే వాపోయే ప్రభుత్వం, అనేక వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరిపై లక్షల కోట్ల అప్పు భారాన్ని మోపడం సరైనదేనా అన్నది చర్చ. మొదటి దశ లో సమీకరించిన భూములకు సంబందించి రైతులకు ప్లాట్లు ఇంతవరకు అభివృద్ది చేసి ఇవ్వలేదు.దానికి ఎన్నివేల కోట్ల వ్యయం అవుతుందో ఎవరూ చెస్పలేరు.ఎప్పటికి ఇస్తారో తెలియదు.దేశంలో ఎక్కడా లేని విధంగా 140 మీటర్ల వెడల్పుతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారట. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.దీనికోసం తమ భూములను గుంజుకుంటున్నారని వారు నిరసన తెలుపుతున్నారు. దేశంలో ఎక్కడా 70 మీటర్లు మించి అవుటర్ రింగ్ రోడ్లు లేవు.కానీ జనమే పెద్దగా లేని ఇక్కడ మాత్రం ఈ స్థాయిలో రింగ్ రోడ్డు వేసి ఏమి సాధిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందుకే రెండో దశ భూముల సమీకరణను రైతులు అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండో దశ భూ సమీకరణకు వ్యతిరేకమని ఆ పార్టీ నేత,మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.ఆ ప్రాంత ప్రజలు కూటమి నేతల తీరుపై మండిపడుతూ తమకు మద్దతు ఇచ్చే వారివైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇవన్ని ఒక ఎత్తు అయితే తొలిదశలో ప్లాట్ల కేటాయింపు తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పలుకుబడి కలిగిన ఎల్లో మీడియా పెద్దలకు, ముఖ్యమంత్రి సన్నిహితులకు జగన్ టైమ్ లో దాదాపు పూర్తి అయిన వెస్ట్ బైపాస్ రోడ్డు పక్కన,లేదా ఇతర కూడలి ప్రదేశాలలో వారు కోరుకున్నచోట ప్లాట్లు వస్తున్నాయట.అదే సామాన్య రైతులకు మాత్రం మారుమూల,చివరికి స్మశానాలలో ,వాగులలో ప్లాట్లు ఇస్తున్నారట.దీని గురించి ఆందోళన చెందిన ఒక రైతు కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే.ఇవన్ని ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఐదెకరాల విస్తీర్ణంలో గృహాన్ని ఎలా నిర్మించుకోగలుగుతుందని, అంత పెద్ద ప్లాట్లు ఎలా కొనుగోలు చేయగలిగారని మీడియాలో ప్రశ్నలు వచ్చాయి.ఎకరా 20 కోట్లు ఉందని ఆయన ప్రచారం చేస్తున్నారు కాని, తన వరకు వచ్చేసరికి 3.6 కోట్లకే ఎలా కొనుగోలు చేశారన్న మరో సందేహానికి ఆయన వైపు నుంచి సమాధానం రావడం లేదు. ఆయన ఇంటి పరిసరాలలో మరొకరికి ప్లాట్ రాకుండా దక్షిణవైపు గ్రీన్ జోన్ అని ప్రకటించేశారట.ధనికులు, పలుకుబడి కలిగిన పెద్దలకు ఇదంతా టూరిజంగా కనిపించవచ్చేమో కాని, సామాన్యుడికి మాత్రం కన్నీటి సుడులు సృష్టిస్తుందా అన్న భయం వెంటాడుతోంది.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వేసవి సెలవులు.. పిన్ని ఇంటికి వెళ్లడమే శాపమైంది..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు కూతురైన మైనర్‌పై బాబాయ్ అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడిని తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామమూర్తిగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు తిరుపతి పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. వేసవి సెలవులు కావడంతో తిరుపతి లక్ష్మీపురంలో ఉంటున్న పిన్ని ఇంటికి ఆమె ఇటీవలే వచ్చింది. ఈ క్రమంలో మైనర్‌కు సంబంధించిన నగ్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని రామమూర్తి బెదిరింపులకు దిగాడు. అనంతరం, మైనర్‌ను లొంగదీసుకున్నాడు. అనంతరం, ఇంటికి తిరిగి వచ్చిన మైనర్ ప్రవర్తనలో మార్పులను గుర్తించిన పేరెంట్స్.. అసలు విషయం తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు.దీంతో, మైనర్ పేరెంట్స్ వెంటనే జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 28వ తేదీన జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అనంతరం, తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఎఫ్ఐఆర్ను బదిలీ చేశారు. ఈ క్రమంలో తిరుపతి పోలీసులు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ను గుర్తించడంతో ఈనెల 13వ తేదీన క్రైమ్ నెంబర్ 236/2026 పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం, విచారణ చేపట్టినట్టు తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
చంద్రబాబుకు షాక్.. సీఎం ఆఫీసు ముట్టడికి ఉద్యోగుల పిలుపు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. సమగ్ర శిక్ష, కేజీబీవీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నేడు చలో సీఎం క్యాంపు కార్యాలయానికి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలి వచ్చారు. దీంతో, క్యాంపు ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.కాగా, సమగ్ర శిక్ష, కేజీబీవీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మె సందర్బంగా రాసుకున్న మినిట్స్ అమలు చర్యలని కూడా నినాదాలు చేస్తున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28000 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండగా.. 10 డిమాండ్లతో క్యాంపు ఆఫీసు ముట్టడికి కదిలారు. ఈ సందర్భంగా వీఎంసీ నుంచి చంద్రబాబు ఇంటి వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే, వీరి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, వీఎంసీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
సర్ ఆర్థర్ కాటన్‌కు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సర్ ఆర్థర్ కాటన్‌కు నివాళి అర్పించారు. ఈ క్రమంలో వ్యవసాయ, నీటిపారుదల రంగానికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేమని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘గోదావరి జిల్లాలు నేడు పచ్చని పంట పొలాలతో అలరారుతున్నాయంటే అందుకు కారణం సర్ ఆర్థర్ కాటన్. సముద్రంలో కలిసిపోతున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి రాజమహేంద్రవరం సమీపంలో ధవళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించిన మహనీయుడు. వ్యవసాయ, నీటిపారుదల రంగానికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేం అని’ పోస్టు చేశారు. గోదావరి జిల్లాలు నేడు పచ్చని పంట పొలాలతో అలరారుతున్నాయంటే అందుకు కారణం సర్ ఆర్థర్ కాటన్ గారు. సముద్రంలో కలిసిపోతున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి రాజమహేంద్రవరం సమీపంలో ధవళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించిన మహనీయుడు ఆయన. వ్యవసాయ, నీటిపారుదల… pic.twitter.com/0qGZb5fLKH— YS Jagan Mohan Reddy (@ysjagan) May 15, 2026 -
మీరు కొట్టకపోతే.. గాయాలు ఎలా అవుతాయి?
సాక్షి, అమరావతి: ఓ కేసులో కొడుకు నిందితుడిగా ఉంటే పోలీసులు అతని తండ్రిని స్టేషన్‌కు తీసుకెళ్లి హింసించి తీవ్రంగా కొట్టిన ఘటనపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని నెల్లూరు జిల్లా ఎస్పీ వేజెండ్ల అజితతో పాటు గూడూరు గ్రామీణ పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో ఈ ఘటనపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా కోర్టు ముందు హాజరైన నెల్లూరు జిల్లా ఎస్పీ, గూడూరు గ్రామీణ పోలీసులను నిలదీసింది. నిందితుడైన కొడుకును పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాలేదన్న కారణంతో తండ్రిని ఎలా కొడతారని ప్రశి్నంచింది. కొట్టలేదని కోర్టు హాలులో ఉన్న పోలీసులు చెప్పగా, మీరు కొట్టకుంటే ఆయనకు తీవ్ర గాయాలు ఎలా అవుతాయని కోర్టు నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్‌కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి మెడమల్లి బాలాజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.హింసించి, వేధించి కొట్టారనేందుకు ఆధారాలున్నాయన్న హైకోర్టు నెల్లూరు జిల్లా మంగళపూరు గ్రామానికి చెందిన రోజూ వారీ కూలీ, దళితుడు అయిన గడుతోటి పోలయ్య కుమారుడు ఓ కేసులో నిందితుడు. అయితే గూడూరు గ్రామీణ పోలీసులు పోలయ్యను తీసుకెళ్లి హింసించి, వేధించి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనిపై పోలయ్య హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులపై చర్యలకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు, పోలీసుల దెబ్బల వల్ల పోలయ్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారని, వైద్య నివేదికలు, ఫొటోలు ఆయనపై దాడిని దృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది.ఈ దాష్టీకంపై వివరణ ఇచ్చేందుకు ఎస్పీ అజితతో సహా, గూడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, కానిస్టేబుళ్లు దాస్, చిన్నాల వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచి్చంది. కోర్టు ఆదేశాల మేరకు వీరు వ్యక్తిగతంగా గురువారం కోర్టు ముందు హాజరయ్యారు.పిటిషనర్ తరఫు న్యాయవాది వీ.సురేంద్రరెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎస్పీని హైకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. -
అమరావతి నిర్మాణ పనుల్లో భారీ లోపం..
తాడేపల్లి రూరల్: అమరావతి నిర్మాణ పనుల్లో డొల్లతనం బయటపడింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణలోపం కారణంగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయి. 20 రోజులుగా ఈ బ్రిడ్జి పూర్తిగా పడిపోకుండా అధికారులు క్రేన్‌ను అడ్డంపెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజధానికి అతి ముఖ్యమైన సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా బకింగ్‌హామ్ కాలువ–కొండవీటి వాగుపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్లుగా చెబుతున్న స్టీలు బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు తలెత్తాయి.స్టీలు బ్రిడ్జి ఏర్పాటు చేసే సమయంలో రెండు పిల్లర్ల మధ్య నిర్మించిన గడ్డర్లు ఒక పక్కకు వాలిపోయాయి. అవి పడిపోకుండా క్రేను అడ్డంపెట్టిన అధికారులు.. గురువారం వాటిని తొలగించే పనులు చేపట్టారు. రాజధానికి, 16వ నంబరు జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డును ఉండవల్లి వరకు నిర్మించారు. ఇక్కడి నుంచి ఉండవల్లి సెంటర్ బకింగ్‌హామ్ కెనాల్ మీదుగా తాడేపల్లి కృష్ణాకెనాల్ రైల్వే బ్రిడ్జిని దాటిస్తూ మణిపాల్ ఆస్పత్రి వరకు బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఆ బ్రిడ్జి నిర్మాణం వ్యయంతో కూడుకున్నది కావడంతో సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వ పెద్దలు మంగళగిరి – ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ కొండవీటి వాగు, బకింగ్‌హామ్ కెనాల్‌ను దాటిస్తూ అనుమతులు లేకపోయినా తాత్కాలికంగా రూ.68 కోట్లతో స్టీలు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.బకింగ్‌హామ్ కెనాల్లో నీటి ప్రవాహానికి అడ్డురాకుండా ఆ చివర, ఈ చివర నాలుగు పిల్లర్లు ఏర్పాటు చేసి మధ్యలో సుమారు 40 అడుగుల మేర ఈ ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జికి.. ప్రకాశం బ్యారేజ్‌కి దక్షిణం వైపు బిగించిన స్టీలు గడ్డర్లు వంకర పోయి ఒరిగిపోయినట్లు సీఆర్డీఏ, ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. గతనెల 20వ తేదీన స్టీలు బ్రిడ్జిపై కాంక్రీట్ వేసే సమయంలో ఈ లోపాన్ని గమనించారు. అప్పటి నుంచి బ్రిడ్జి మరింత ఒరగకుండా భారీ క్రేన్‌తో గడ్డర్‌ను నిలబెట్టారు. ఇంజినీర్లు పరిశీలించి.. ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించడంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా గడ్డర్లు తొలగింపు చేపట్టారు. ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన సమయంలో మంత్రి నారాయణ దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో చేపడుతున్నామని చెప్పారు. కానీ, రాజధాని పనులు ఎంత నిర్లక్ష్యంగా జరుగుతున్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
కావేరి ట్రావెల్స్‌లో మంటలు.. 36 మంది ప్రయాణికులు..
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.ఈ ఘటనకు సంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు బస్సు నుంచి పొగలు వచ్చాయి. బస్సు ఇంజిన్ నుంచి వస్తున్న పొగలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కనే బస్సును నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దింపేశాడు. దీంతో, ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. -
పెళ్లింట పెను విషాదం
అగనంపూడి: పెళ్లి ముచ్చట్లు తీరకముందే, నూరేళ్ల బంధానికి పునాది పడకముందే నవవధువు అనంత లోకాలకు చేరుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పుట్టింటికి వస్తున్న తరుణంలో.. మృత్యువు కారు రూపంలో ఆమెను కబలించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లికుమార్తె తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ హృదయవిదారక ఘటన విశాఖ జిల్లా అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో గురువారం జరిగింది. పరవాడ మండలం వాడచీపురుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఈరుగుల సన్యాసమ్మ కుమారుడు నరసింగరావు (43) వాడచీపురుపల్లి పంచాయతీలో క్లాప్ వ్యాన్ డ్రైవర్.ఆయనకు అగనంపూడి నిర్వాసితకాలనీ కొండయ్యవలసకు చెందిన నడుపూరు పెంటారావు, కనకమహాలక్ష్మిల కుమార్తె రామేశ్వరి (31)తో బుధవారం రాత్రి వివాహం జరిగింది. తిరుగుమరుగుళ్లలో భాగంగా గురువారం నవ వధువు రామేశ్వరి ఇంటికి వెళ్లేందుకు ఆమె భర్త నరసింగరావు, ఆమె తల్లి కనకమహాలక్ష్మి, సోదరి కలిసి కారులో వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి బయల్దేరారు. ఆ కారును నర్సింగరావే నడుపుతున్నాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరిపోతారనుకున్న సమయంలో అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నరసింగరావుకు కళ్లు మూతలు పడడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వీధిలైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లి కనకమహాలక్ష్మి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించింది. సోదరి వరలక్ష్మి, నర్సింగరావు తీవ్రంగా గాయపడ్డారు. రామేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. -
రాష్ట్రంలో జూన్ 15 నుంచి ఎస్ఐఆర్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ)లో జూన్ 15వ తేదీ నుంచి ఎస్ఐఆర్ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం ప్రకటించింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియకు వినియోగిస్తున్న సిబ్బందితోనే ఎస్ఐఆర్ కూడా నిర్వహించేలా తేదీలను ఖరారు చేసినట్లు వెల్లడించింది. 5 నుంచి సిబ్బందికి శిక్షణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై జూన్ 5 నుంచి 14 వరకు సిబ్బంది, అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు 46,397 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వో)లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపడతారని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్ఏ)ను నియమించుకోవాలని సూచించారు.ఈ ఎస్ఐఆర్కు అర్హత తేదీని 2026, జూలై 1గా నిర్ణయించారని తెలిపారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, వారంతా ఈ ఎస్ఐఆర్ పరిధిలోకి వస్తారని వెల్లడించారు. జూలై 14 నాటికి రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలన్నింటి హేతుబదీ్ధకరణ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను సమర్థంగా నిర్వహించడానికి వీలుగా 2001లో జరిగిన ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నామని, ఇప్పటికే 64 శాతం మ్యాపింగ్ పూర్తయినట్లు వివరించారు. సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాపై జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,16,16,061 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో 46,397 మంది బీఎల్వోలు, 68,868 మంది బీఎల్ఏలు పాల్గొంటారు. సుమారు నాలుగున్నర నెలలపాటు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగనుంది.తెలంగాణలో జూన్ 25 నుంచి ఎస్ఐఆర్ తెలంగాణలో ఎస్ఐఆర్ అర్హత తేదీని 2026 అక్టోబర్ 1గా నిర్ణయించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓల ఇంటింటి సర్వే ఉంటుంది. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అభ్యంతరాల పరిష్కారం తర్వాత అక్టోబర్ 1న తుది జాబితా విడుదల చేస్తారు. తెలంగాణలో ప్రస్తుతం 3,39,20,705 మంది ఓటర్లు ఉన్నారు. -
ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి బాబూ!?
సాక్షి, అమరావతి/పొన్నూరు: రైతులపై దాడి చేసి, తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక పంట నిల్వ చేసుకున్న రైతుల గోడౌన్‌పై దాడి దుర్మార్గపు చర్య అని, పైగా బాధిత రైతులపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో రైతులకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, బాధిత రైతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మాజీ సీఎం వైఎస్ జగన్‌ని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి రైతులు కలిశారు. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ అరాచకాలు, దాడులను, వారు పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న కేసులను వివరించారు. అంతేకాకుండా మొక్కజొన్నకు ధర లేకపోవడంతో రైతులుగా తాము పంట నిల్వ చేసుకున్న గోడౌన్‌పై టీడీపీ గూండాలు దాడి చేయడం, రాడ్లతో గోడౌన్ తాళాలు పగలగొట్టి అరాచకానికి పాల్పడటం, అడ్డుకున్న తమపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్‌కు రైతులు వివరించారు.పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రోద్బలంతో 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గూండాలు మామిళ్లపల్లిలో చేసిన విధ్వంసం ఫొటోలు, వీడియోలు వైఎస్ జగన్‌కు గోడౌన్ యజమాని సోదా సముద్రయ్య, పొన్నూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి అంబటి మురళీకృష్ణ, ఇతర రైతులు చూపించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని, లీగల్ సెల్ న్యాయ సహాయం అందిస్తుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
వైఎస్సార్సీపీలో చేరిన ‘మోపిదేవి’
సాక్షి, అమరావతి : ‘ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఎస్ఏడీఏ–అప్సడా)కి తెలీకుండా, దాని అంగీకారం లేకుండా ఆక్వా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయని మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి?’ అంటూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబును నిలదీశారు. ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీవాళ్లు కాబట్టే కదా? అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీపడ్డారన్నది నిజం కాదా? అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు మౌనంగా ఉన్నారంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు.. పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ వైఎస్ జగన్ గురువారం తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. వైఎస్ జగన్ ఆ పోస్టులో ఏమన్నారంటే..కమీషన్ల కోసం లాలూచీ కాదా?..‘‘చంద్రబాబుగారూ.. మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదు. చివరకు ఆక్వా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకుతింటున్నారు. మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటినీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే అప్సడాకు తెలీకుండా, దాని అంగీకారం లేకుండా కంపెనీలు రేట్లు పెంచాయని, మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి? ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీ వాళ్లు కాబట్టే కదా? ఆక్వా ఫీడ్ కంపెనీలు మీ పార్టీ సానుభూతిపరులవేనన్నది అక్షర సత్యం కాదా? కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీపడ్డారన్నది నిజం కాదా? అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు సైలెంటుగా ఉన్నారు. చంద్రబాబు గారూ.. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఆక్వా రైతులు కూడా చితికిపోయారు. సిండికేట్ అవుతున్న కంపెనీల నుంచి, దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకొచ్చి, ఏకంగా ముఖ్యమంత్రి చైర్మన్‌గా అప్సడా అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటుచేస్తే మీరు వచ్చాక ఉద్దేశపూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేశారు. సీడ్, ఫీడ్ క్వాలిటీ ప్రమాణాలు సహా, వాటి రేట్ల నియంత్రణ దగ్గర నుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా, యూనిట్ కరెంటును కేవలం రూ.1.5తో వారికి అందిస్తూ అన్నిరకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యంచేసి ఆ రైతులను రోడ్డున పడేశారు. మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా మీనమేషాలు లెక్కించారే తప్ప, వారిని ఆదుకోవాలన్న బాధ్యతను విస్మరించారు. ఇప్పుడు ఫీడ్ రేట్లు పెంచి చేస్తున్న దోపిడీకి వత్తాసు పలుకుతున్నారు. ఇది రైతులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా? చంద్రబాబు గారూ.. ఆక్వా ఫీడ్ రేట్ల పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలి కన్నీళ్లు కార్చడం కాదు. పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపజేయాలి. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం’’. -
ఏసీబీకి చిక్కిన ఎస్సై
తాడేపల్లిగూడెం అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై పి.నాగరాజు రూ.70 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతానికి చెందిన ఓ ప్రేమజంట (మేజర్లు) గత నెలలో వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా... యువతి తల్లిదండ్రులు అడ్డుకుని తమ కుమార్తెను మోసగించి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని పట్టణ పోలీస్ స్టేషన్లో యువకుడిపై ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై పి.నాగరాజు యువకుడు అభిలాష్, అతడి తల్లిదండ్రులను ఈ నెల 6న పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అభిలాష్‌పై రౌడీషీట్ వేయిస్తానని, అత్యాచారం కేసు నమోదు చేస్తానని బెదిరించారు. రూ.2 లక్షలు ఇస్తే అభిలాష్‌ను వదిలేస్తామని చెప్పగా.. అంత ఇవ్వలేమని రూ.70 వేలు ఇస్తామనడంతో ఎస్సై నాగరాజు అంగీకరించారు.అనంతరం యువకుడి తల్లి నీలాపు కుమారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన ట్రాపింగ్ నోట్లు తీసుకుని గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై నాగరాజుకు రూ.70 వేలు ఇస్తుండగా పక్కన ఉన్న బాలసుబ్రహ్మణ్యం అనే కానిస్టేబుల్‌కు ఇవ్వమని ఎస్సై చెప్పారు. దీంతో కానిస్టేబుల్ బాలసుబ్రహ్మణ్యం రూ.70 వేలు తీసుకుంటుండగా ఏలూరు నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు పేరుతో భారీగా అక్రమ సొమ్ములు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎస్సై నాగరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తుల వివరాలపై విచారణ చేస్తున్నట్టు సమాచారం. -
భూ సమస్యలపై ‘రెవెన్యూ’ రాబందులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మా భూమి రెవెన్యూ రికార్డులో ఇబ్బందులున్నాయి. నాకు ఎప్పుడో పట్టా ఇచ్చారు. అయితే ఆన్లైన్లో ప్రభుత్వ భూమి అని ఉంది. పరిష్కరించండి.. అంటూ విశాఖ మధురవాడకు చెందిన ఒక వ్యక్తి విశాఖ కలెక్టరేట్లో అర్జీ ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకు ఫలానా మంత్రి పేషీ నుంచి అంటూ అతడికి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఓ మంత్రి సోదరుడు, ఓఎస్డీ అంటూ కొందరు ఫోన్‌చేసి ఏకంగా అతడి ఇంటికి వెళ్లారు. మీ భూమి సమస్యలను మేం పరిష్కరిస్తాం.. సగం ధరకే మాకివ్వండి.. అంటూ బేరసారాలాడారు. తనకు ఈ సమస్య ఉందని ఏకంగా అమరావతిలోని మంత్రికి ఎలా తెలిసిందో అర్థంగాక ఆ వ్యక్తి ఆశ్చర్యపోయారు. ఆనందపురం, సబ్బవరం, భీమిలిలో డీ–పట్టాలు ఉన్న పలువురు రైతులతోను ఇదే తరహాలో ఓ మంత్రి సోదరుడు, పీఏ అంటూ చర్చలు జరుపుతున్నారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం త్వరలో రెగ్యులరైజ్ చేస్తుందని, మీ భూములను మేం చూసుకుంటామంటూ బేరసారాలు ఆడుతున్నారు. అడ్డకు పావుసేరు ధరకే బేరసారాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం. లేదంటే భూసమీకరణ కింద మీ భూములు తీసుకుంటారంటూ బెదిరింపులకు దిగుతున్నారు.ఇవే కాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో భూమి ధరలు బాగా ఉన్న ప్రాంతాల్లో మంత్రి సోదరుడు, ఓఎస్డీ, పీఏలు రంగంలోకి దిగుతున్నారు. ప్రధానంగా మధురవాడ, ఆనందపురం, సబ్బవరం, భోగాపురం, అచ్యుతాపురం ప్రాంతాల్లోని విలువైన భూముల విషయంలో తలదూరుస్తున్నట్లు తెలుస్తోంది. విలువైన భూమికి సంబంధించి ఎవరైనా తమకు సమస్య ఉందంటూ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే సదరు మంత్రి అనుచరగణం వాలిపోతోంది. నేరుగా ఫిర్యాదులో పేర్కొన్న నంబరుకు ఫోన్‌చేసి ‘మీ సమస్య మాకు తెలుసు. మేం విశాఖకు వచ్చి మీతో మాట్లాడతాం’ అంటూ మంత్రి పీఏ పేరుతో కాల్స్ చేస్తున్నారు. ఇక డీ–పట్టా భూముల విషయంలోను మీ భూమి భూసేకరణలో పోతుందంటూ భయాందోళనకు గురిచేసి, తక్కువ ధరకే తమ పేరులతో ఒప్పందం రాయించేసుకుంటున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఒక అధికారి ఈ వ్యవహారంలో మొన్నటివరకు వారికి సహకరించారు. ఫిర్యాదు కాపీ ఎలా వెళుతోంది?వాస్తవానికి కలెక్టరేట్లోనో, తహశీల్దారు కార్యాలయంలోనే సోమవారం బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత.. ఫోన్ నంబర్లతో సహా ఆ వివరాలు మంత్రి పేషీకి వెంటనే చేరిపోతున్నాయి. ఈ వ్యవహారంలో ఉద్యోగ విరమణ చేసిన ఓ అధికారితో పాటు స్థానిక రెవెన్యూ యంత్రాంగం సహకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆ రిటైర్డ్ అధికారికి స్థానిక రెవెన్యూ అధికారులతో ఉన్న సంబంధాలతోనే మంత్రి పేషీకి సమాచారం చేరుతున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద భూముల విషయాలతో పాటు ఏయే పనులు అవుతాయనేది కూడా స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా సమాచారం ఉండటంతో పక్కాగా మంత్రి అనుచరులు రంగంలోకి దిగి భూదందాలు సాగిస్తున్నట్టు అర్థమవుతోంది.ఓఎస్డీదే పైచేయి వాస్తవానికి ఆ రిటైర్డ్ అధికారిని భూలావాదేవీల వ్యవహారాలు పరిశీలించేందుకు మంత్రి ప్రత్యేకంగా నియమించుకున్నారు. అధికారికంగా నియామకపత్రం లేకుండానే ఆ రిటైర్డ్ అధికారి గత మూడునెలలు సేవలందించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ వివాదాస్పద భూములున్నాయి? ఏయే అంశాల్లో రికార్డులను మార్చి వ్యవహారం నడిపించవచ్చనే విషయాలపై మంత్రికి సలహాలిచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారాల విషయంలో మంత్రి ఓఎస్డీకి, ఆ రిటైర్డ్ అధికారికి మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. వారం రోజుల కిందట ఆ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో.. రిటైర్డ్ అధికారిని ఇంటికి సాగనంపారు. రిటైర్డ్ అధికారి ఇచ్చిన సలహాలు, సూచనలతోనే విశాఖలోని భారీ విలువ చేసే భూముల వ్యవహారంలో మంత్రి తమ్ముడు, ఓఎస్డీ, పీఏలు భారీగా దందాలు కొనసాగించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మంత్రి చెబితేనే చేస్తా..!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో పేదల ఇంటి నిర్మాణ బిల్లులు మంజూరులోనూ కమీషన్ల కోసం పాకులాడుతున్నారు. ఇందుకు గృహ నిర్మాణ శాఖలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.180 కోట్లు రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో ఉన్నా.. కమీషన్ల కోసం ఒక అమాత్యుడు బిల్లులు ప్రాసెస్ చేయకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సంస్థ ఫైనాన్స్ విభాగంలోని ఒక కీలక అధికారిణి.. మంత్రి చెబితేనే బిల్లులు ప్రాసెస్ చేస్తానని భీష్మించుకుని కూర్చోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.ప్రస్తుతం క్షేత్ర స్థాయి నుంచి గృహనిర్మాణ సంస్థ వరకు వివిధ దశల్లో రూ.30 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. వీటిలో రూ.20 కోట్లకుపైనే ఆప్షన్–3 ఇళ్ల బిల్లులున్నట్లు తెలుస్తోంది. రూ.180 కోట్లు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు మంజూరు చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం అమాత్యుడి ఆదేశాలేనన్న విమర్శలున్నాయి. కమీషన్ల కోసం ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణ ఏజెన్సీల నిర్వాహకులను తన దగ్గరకు వచ్చేలా చేసుకోవడం కోసం బిల్లులు చెల్లించవద్దని అమాత్యుడు హుకుం జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘రూ.180 కోట్ల నిధులు అమాత్యుడు కేంద్రానికి తిరిగి ఇచ్చేయమన్నారు.ఎవరు చెప్పినా నేను బిల్లులు ప్రాసెస్ చేయను. పెండింగ్ బిల్లులు ప్రాసెస్ చేయాలంటే నాకు అమాత్యుడి నుంచి ఆదేశాలు రావాలి’ అని సదరు అధికారిణి తేల్చి చెబుతున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సిఫార్సులు లేకుండా పారదర్శకంగా సాగాల్సిన బిల్లుల చెల్లింపులను చంద్రబాబు సర్కార్ ఏర్పాటయ్యాక గందరగోళం చేసేశారు. తనను కలిసిన ఆప్షన్–3 ఏజెన్సీలకు ప్రాధాన్యత క్రమంలో బిల్లులు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశిస్తూ అమాత్యుడు ఆదేశాలు ఇచ్చిన లేఖలు గతంలో వెలుగుచూశాయి. ఉన్నతాధికారులు పూచికపుల్లతో సమానంకేంద్రం గృహనిర్మాణ పథకాన్ని సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) విధానం నుంచి స్పర్‡్షలోకి మారుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రం దగ్గర ఉన్న రూ.180 కోట్ల నిధులు కేంద్రానికి ఇచ్చేస్తే పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి రూ.180 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో రిజర్వ్ చేసి ఇళ్ల నిర్మాణ దశల ఆధారంగా బిల్లులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇలా చేస్తే పేదలకు మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని కాదని చంద్రబాబు సర్కార్ రూ.180 కోట్లు కేంద్రానికి తిరిగి ఇచ్చేయడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. దీంతో నిధులు వెనక్కిచ్చే వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లిద్దామని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సైతం ఫైనాన్స్ విభాగం అధికారిణి బేఖాతరు చేస్తున్నారు. అమాత్యుడి అండతో ఉన్నతాధికారులను సైతం పూచికపుల్లతో సమానంగా తీసి పారేస్తుండటం ఇప్పుడు గృహనిర్మాణ శాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది. -
‘పొదుపు’ పబ్లిసిటీకే..
సాక్షి, అమరావతి : ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా ఉంది మంత్రి లోకేశ్ తీరు. పొదుపు మంత్రం ఎదుటి వారికే తప్ప తనకు కాదని ఆయన నిరూపించారు. తన వాహన కాన్వాయ్ తగ్గించుకుంటున్నానని గురువారం మీడియాలో తెగ పబ్లిసిటీ చేసుకున్న కొద్దిసేపటికే ఆయన ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లడం గమనార్హం. ఒకవైపు సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించుకోవాలని.. డీజిల్, పెట్రోల్ వాహనాల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని హడావుడి చేసి ఆయన మాత్రం అత్యంత ఖర్చుతో ప్రత్యేక విమానాన్ని వినియోగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం చెప్పిన కొద్దిసేపటికే.. వెలగపూడిలో గురువారం ఉదయం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలు పొదుపు పాటించాలని, ఉద్యోగులు సైకిళ్లపై రావాలని చంద్రబాబు సూచించారు. కానీ, లోకేశ్ బయటకొచ్చి ప్రత్యేక విమానాన్ని ఉపయోగించడం ఏమిటని పార్టీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత తాను వినియోగిస్తున్న ప్రత్యేక విమానం (వీటీ–సీవీబీ)లో లోకేశ్ బయల్దేరి పుట్టపర్తి విమానాశ్రయంలో దిగారు. అక్కడి పర్యటనలో నేతలు భారీగా వాహనాలు ఉపయోగించి హడావుడి చేశారు. ఆ తర్వాత పుట్టపర్తి నుంచి భారీ సంఖ్యలో వాహనాలతో ధర్మవరం వెళ్లారు. 23 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో దుబారా.. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో 23 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాధనం దుబారా జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం, డిప్యూటీ సీఎం, సీఎం తనయుడు ప్రత్యేక విమానాల్లో తరచూ విదేశీ పర్యటనలు చేయడం, అమరావతి నుంచి హైదరాబాద్‌కి విడివిడిగా నిత్యం వెళ్లడం సర్వసాధారణమైంది. మంత్రులు కూడా అదేబాటలో పయనిస్తూ జిల్లాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారు. ఇటీవలే తొమ్మిది మంది మంత్రులు, పదుల సంఖ్యలో అధికారులు సింగపూర్ వెళ్లిన విషయం తెలిసిందే. మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు సైతం అనధికారికంగా ఎస్కార్ట్ వాహనాలు వినియోగిస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు పొదుపు చర్యలు ప్రకటించినా ఆచరణలో మాత్రం విచ్చలవిడిగా దుబారా జరుగుతోంది. లోకేశ్ సింగపూర్ ప్రయాణ ఖర్చు రూ.7.82 లక్షలు ఈ నెల 11న జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశానికి సింగపూర్ వెళ్లిన ఐటీ శాఖ మంత్రి లోకేశ్ విదేశీ ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ.7.82 లక్షలకు పరిపాలన అనుమతిస్తూ ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఢిల్లీలోని ఏపీ భవన్లో సీఎం నివాస బంగ్లాకు రూ.6.50 కోట్లతో ఆధునిక హంగులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
అప్పన్న కొండకు గుండు!
ఈ ఫొటోలో కనిపించేది సింహాచలం కొండ. సింహాద్రి అప్పన్న దేవస్థానానికి చెందిన ఈ కొండను డేటా సెంటర్ పేరుతో భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వే స్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ కొండ కనుమరుగు కానుంది. నరసింహస్వామి కొలువైన కొండకు చంద్రబాబు ప్రభుత్వం ఎసరు పెట్టడం తీవ్ర అపచారమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొండ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ‘చప్టా’ కూడా మూసుకుపోవడంతో ముడసర్లోవకూ నీటి ఎద్దడి ఏర్పడనుంది.భీమిలిలోని పావురాల కొండపై క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి బౌద్ధం ఆనవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రైవేట్ రిసార్టుకు భూమి కేటాయించడంతో భారీ యంత్రాలతో కొండలన్నీ పిండి పిండి చేస్తున్నారు. దీంతో బౌద్దం ఆనవాళ్లు కానరాకుండా పోవడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అప్పన్న కొండపై అపచారం..! నరసింహస్వామి కొలువుదీరిన క్షేత్రానికే ఎసరు..! అందమైన విశాఖ నగరంలో కొండలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం పిండి చేస్తోంది. భారీ యంత్రాలతో పెద్ద పెద్ద కొండలను సైతం తవ్వుతూ నేలమట్టం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు పెట్టగా.. ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వెళ్లే రోడ్డు వెంట ఉన్న కొండలతో పాటు సింహాచలం కొండలనూ వదలడం లేదు. ప్రైవేట్ రిసార్టులు, డేటా సెంటర్ పేరుతో కొండలన్నీ నుజ్జు నుజ్జు చేస్తున్నారు. మరికొద్ది నెలల్లో కొండలన్నీ నేలమట్టమై ప్రైవేటు రిసార్టులు దర్శనమివ్వనున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా విపత్తుల నుంచి విశాఖను కాపాడుతున్న కొండలన్నీ కనుమరుగు కానున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముడసర్లోవకు నీటి ముప్పు...!సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని (సింహాచలం కొండ) డేటా సెంటర్ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. ఇప్పుడు ఈ కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న ఈ కొండపైనే నరసింహస్వామి కొలువై ఉన్నారు. అప్పన్న కొలువై ఉన్న కొండను తవ్వేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇది తీవ్ర అపచారమని హెచ్చరిస్తున్నారు. దీన్ని లెక్క చేయకుండా తవ్వకాలు భారీ స్థాయిలో సాగిస్తున్నారు. సింహాచలం కొండ నుంచి వర్షపు నీరు నేరుగా ముడసర్లోవలోకి వస్తుంది. కొండ నుంచి వచ్చే నీరు ముడసర్లోవలోకి చేరేందుకు వీలుగా ప్రత్యేకంగా మూడు ప్రాంతాల్లో సపటలను ఏర్పాటు చేశారు. మధ్యలో ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు కింద నీరు వెళ్లేందుకు వీలుగా వీటి నిర్మాణం జరిగింది. భీమిలిలోని పావురాల కొండను తవ్వేస్తున్నారిలా.. తాజాగా జరుగుతున్న తవ్వకాలతో ఈ నీటి ప్రవాహం నిలిచిపోనుంది. ముడసర్లోవరకు ప్రవాహం ఆగిపోతే చుట్టుపక్కల ఉన్న నివాసిత కాలనీలకు కూడా నీటి గండం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ వేసవి కాలంలో పీక్ సీజన్లోనూ ఈ కాలనీలకు నీటి ఎద్దడి సమస్య లేదు. కేవలం 60–70 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొండను పూర్తిగా తవ్వేస్తుండటంతో ముడసర్లోవలోకి నీరు వెళ్లే అవకాశం లేదు. ఫలితంగా ముడసర్లోవ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఇక్కడ ఏర్పాటు చేసిన 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లకు కూడా సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ రిసార్టుల కోసం పావురాల కొండ...!బీచ్ రోడ్డులో భీమిలికి వెళ్లే మార్గంలో కొత్తవలస వద్ద క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి బౌద్ధం ఆనవాళ్లు ఉన్న పావురాల కొండ ఉంది. ఇది ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాచీన బౌద్ధ నిధిగా వ్యవహరిస్తుంటారు. ఈ కొండను ఇప్పుడు ప్రైవేట్ రిసార్టుల కోసం కేటాయించారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి బౌద్ధ నిధి ఆనవాళ్లను చంద్రబాబు ప్రభుత్వం భారీ యంత్రాలతో తొలిచే యత్నం చేస్తోంది. పావురాల కొండ ఉన్న కొత్తవలస రెవెన్యూ పరిధిలో 15 ఎకరాలను ప్రైవేటు రిసార్టు కోసం ధారాదత్తం చేశారు. ఈ మేరకు 2025 అక్టోబరులో చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నెం 39) జారీ చేసింది. 66 ఏళ్ల లీజుతో పాటు మరో 33 ఏళ్లు పొడిగించే వెసులుబాటుతో మొత్తం 99 ఏళ్లకు మైరా బే వ్యూ రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సంస్థకు కట్టబెట్టింది. దీని కోసం పావురాల కొండను అడ్డంగా తవ్వేస్తున్నారు. ప్రైవేటు రిసార్టుల కోసం పావురాలకొండలోని 15 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు ప్రభుత్వం ప్రాచీన బౌద్ధమత ఆనవాళ్లు లేకుండా చేస్తోంది. అంతేకాదు.. పక్కనే మిగతా కొండలను కూడా 99 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టి పిండి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు ఇప్పటికే ఎండాడలో రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తమ బంధువైన గీతం యజమాని, విశాఖ ఎంపీ భరత్‌కు అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వ పెద్దలు మరోవైపు కొండలన్నింటినీ ప్రైవేట్ రిసార్టుల కోసం తమ అనుయాయులకు కట్టబెడుతున్నారు. -
‘మందు’ మార్బలానికే!
సాక్షి, అమరావతి : టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ స్పీడ్ పెంచాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం టీడీపీ మద్యం సిండికేట్ నిర్వహిస్తున్న మొత్తం 3,736 మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా రెండేళ్లపాటు పొడిగించేందుకు ఎత్తుగడ వేసింది. తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా లైసెన్సులు కేటాయించే ప్రక్రియను పక్కనపెట్టాలన్నది ప్రభుత్వ పెద్దల ఉద్దేశం. అందుకోసం ముఖ్య నేత ఆదేశాలతోనే ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతోంది. సిండికేట్‌కే మరో రెండేళ్లపాటు రెన్యూవల్...! 2024 నుంచి చేస్తున్న మద్యం దోపిడీని కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందుకే ప్రస్తుతం టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉన్న రాష్ట్రంలోని మొత్తం 3,736 మద్యం దుకాణాల లైసెన్సులను రెన్యూవల్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాలకు అనుమతించిన రెండేళ్ల లైసెన్సు గడువు ఈ ఏడాది అక్టోబరు మొదటివారంతో ముగుస్తోంది. సెపె్టంబరులో నోటిఫికేషన్ జారీ చేసి తాజాగా లైసెన్సులు కేటాయించాలి. ఆసక్తి ఉన్నవారు అందరూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించాలి. ఈ పారదర్శక విధానాన్ని విస్మరించి ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు లైసెన్సులు కేటాయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ప్రభుత్వ ముఖ్యనేత స్థాయిలోనే సూత్రపాయంగా నిర్ణయించారు.ఎందుకంటే రాష్ట్రంలో మద్యం దుకాణాలన్నీ టీడీపీ కూటమి సిండికేట్ గుప్పిట్లోనే ఉన్నాయి. అందుకే ఆ సిండికేట్‌కే మరో రెండేళ్లపాటు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయించాలని భావిస్తున్నారు. అందుకు ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. కాగా 2024లో లైసెన్సుల కోసం దరఖాస్తుల ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చింది. లైసెన్సు ఫీజు రూపంలో వచ్చిన ఆదాయానికి ఇది అదనం. ప్రస్తుతం మద్యం దుకాణాల లైసెన్సులను రెన్యూవల్ చేస్తే.. లైసెన్సు ఫీజు వస్తుంది. కానీ 2024లో దరఖాస్తు ఫీజుల రూపంలో వచ్చిన రూ.1,800 కోట్లను కూడా సర్దుబాటు చేసేందుకు అవకాశం ఉందా అన్న విషయాన్ని పరిశీలించాలని ఎక్సైజ్ శాఖకు సూచించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకుని టీడీపీ మద్యం సిండికేట్‌కే మరో రెండేళ్లపాటు లైసెన్సులు ఏకపక్షంగా పొడిగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. గతంలోనూ లాటరీ ముసుగులో టీడీపీ సిండికేట్‌కు...2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం విధానం ముసుగులో దోపిడీకి తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ఆ స్థానంలో మొత్తం 3,736 ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు 2024 అక్టోబరులో నోటిఫికేషన్ జారీ చేసింది. లాటరీ విధానం ముసుగులో టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా లైసెన్సులు కట్టబెట్టింది. సిండికేట్ సభ్యులకు కాకుండా ఇతరులు ఎవరూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేయకుండా పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో బెదిరించారు.ఇక ఆ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏకంగా 75వేల బెల్ట్ దుకాణాలను నిర్వహిస్తూ మద్యం ఏరులై పారిస్తున్నారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు విక్రయిస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. 2014–19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో మద్యం దోపిడీ విధానం ముసుగులో రూ.25వేల కోట్ల దోపిడీ పాల్పడిన టీడీపీ సిండికేట్... ప్రస్తుతం 2024–29 కూటమి ప్రభుత్వ హయాంలో అంతకు రెట్టింపు దోపిడీకి గురి పెట్టింది. అందుకోసమే టీడీపీ సిండికేట్‌కే మద్యం దుకాణాల లైసెన్సులను మరో రెండేళ్లపాటు పొడిగించాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ మద్యం పాలసీ ముసుగులో మంత్రి మండలిలో ఆమోదించి ఈ దోపిడీ విధానానికి రాజముద్ర ముద్ర వేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. అదీ సంగతి. -
ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లు, చేతులు కట్టేసి.. హత్య చేసి..
విశాఖ: అక్కయ్యపాలెంలో ఓ మహిళ హత్య కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దారుణానికి తెగబడ్డారు. పార్వతి (50) అనే మహిళ కాళ్లు, చేతులు కట్టేసి, హత్య చేశారు. ఆమె ఇంట్లోని లాకర్‌ను బద్దలుకొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు.ఈ ఘటన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కయ్యపాలెం శ్రీనివాస్‌నగర్, పుట్ట బంగారమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. బంగారం కోసమే ఈ హత్య జరిగి ఉంటుందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. -
‘నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’
కడప: తనపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్‌రెడ్డి. ఎల్లో మీడియా చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. ఏ తప్పు చేయని తనపై బురదజల్లారని విమర్శించారు. తాము అధికారంలో లేకపోయినా తమ జపమే చేస్తున్నారని, తాను ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోలేదన్నారు. తాను ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మరి నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి విరమిస్తారా? అని సవాల్ చేశారు. టీడీపీ నేతలు ఎకరాలు ఆక్రమించుకుంటున్నా ఎల్లో మీడియా మాత్రం వాటిపై స్పందించదని ఈ సందర్భంగా చురకలంటించారు రవీంద్రనాథ్‌రెడ్డి. ‘టీడీపీ వారు వందల ఎకరాలు ఆక్రమించుకుంటే దాని గురించి రాయరు. ఏ తప్పు చేయని మాపై మాత్రం బురద జల్లుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దోచుకుంటుంటే దాని గురించి పచ్చ పత్రికలు రాయడం లేదు. నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేకపోతే మీరు రాజకీయాలకు స్వస్తి పలుకుతారా?’ అని సవాల్ చేశారు. -
ఆక్వా ఫీడు ధర పెంచడంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఆక్వా ఫీడు రేట్లు పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు.. పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలి. లేకపోతే రైతులతో కలిపి ఆందోళనలు చేస్తాం’అని హెచ్చరించారు ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తన ట్వీట్లో.. ‘మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటీనీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉండే APSADAకు తెలియకుండా..దాని అంగీకారం లేకుండా కంపెనీలు రేట్లు పెంచాయని, మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి?.ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీవాళ్లు కాబట్టే కదా? ఆక్వా ఫీడ్ కంపెనీలు మీ పార్టీ సానుభూతి పరులవేనన్నవి అక్షర సత్యం కాదా?. కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీ పడ్డారన్నది నిజం కాదా?. అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు సైలెంటుగా ఉన్నారు.చంద్రబాబూ.. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఆక్వా రైతులు కూడా చితికిపోయారుసిండికేట్ అవుతున్న కంపెనీల నుంచి..దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకు వచ్చి.. ఏకంగా ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా APSADA అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేస్తే మీరు వచ్చాక ఉద్దేశ పూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేశారు. సీడ్, ఫీడ్ క్వాలిటీ ప్రమాణాలు సహా.. వాటి రేట్ల నియంత్రణ దగ్గరనుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా..యూనిట్ కరెంటును కేవలం రూ.1.5౦కే వారికి అందిస్తూ అన్నిరకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటే..మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ రైతులను రోడ్డున పడేశారు.మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా మీనమేషాలు లెక్కించారే తప్ప..వారిని ఆదుకోవాలన్న బాధ్యతను విస్మరించారు. ఇప్పుడు ఫీడు రేట్లు పెంచి చేస్తున్న దోపిడీకి వత్తాసు పలుకుతున్నారు. ఇది రైతులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా?. చంద్రబాబూ.. ఆక్వా ఫీడు రేట్లు పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు.. పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలి. లేకపోతే రైతులతో కలిపి ఆందోళనలు చేస్తాం’అని వైఎస్ జగన్ హెచ్చరికలు జారీ చేశారు. .@ncbn గారూ.. మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదు. చివరకు ఆక్వా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకుతింటున్నారు. మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటీనీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2026 -
కాళ్ల పారాణి ఆరకముందే కానరాని లోకాలకు నవవధువు
సాక్షి,విశాఖ: వారు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని బంగారు జీవితం గడపాలని కలలు కన్నారు. కానీ ఆ దంపతుల ఆశలు అడియాసలయ్యాయి. నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఆమెను కబళించింది. వరుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వధువు, వరుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి.పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వధువు రామేశ్వరి మృతి చెందగా, వరుడు నర్సింగరావు తీవ్ర గాయాలపాలయ్యాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.బుధవారం రాత్రి 1.58 గంటలకు వాడచీపురు పల్లిలో రామేశ్వరి - నర్సింగరావు వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వివాహం జరిగిన కొన్ని గంటలకే గురువారం అత్తగారిల్లైన అగనంపూడికి బయల్దేరారు. మార్గం మధ్యలో కారు ప్రమాదానికి గురైంది. రాత్రి పెళ్లి, మరుసటి రోజు ప్రమాదంలో వధువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఘనంగా పెళ్లి చేసి కుమార్తెను సంతోషంగా అత్తగారింటికి సాగనంపిన తల్లిదండ్రులు, ఆమె మృతదేహాన్ని చూసి గుండెలవేసిలా రోదిస్తున్నారు. ఈ దృశ్యం స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది. -
వైఎస్సార్సీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు
తాడేపల్లి: రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శ్రీనివాసరావు పార్టీలో చేరారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో శ్రీనివాసరావుకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. మోపిదేవితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. అందర్నీ ఆహ్వానించి పార్టీ కోసం పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. చేరికల సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యాలయం కార్యకర్తలతో కిటకిటలాడింది. దీనిలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. నా మీద నమ్మకం ఉంచి పార్టీలోకి వచ్చారు. శ్రీనుకి అన్ని రకాలుగా న్యాయం చేస్తాను. రేపల్లె నియోజకవర్గం ఇన్‌ఛార్జి మోహన్ కృష్టకు మీ మద్దతు ఇవ్వాలి. మోహన్ కృష్ణ గెలుపు బాధ్యతలు తీసుకుని గెలిపించాలి. మోపిదేవి శ్రీను చేసే మంచిని జగన్ ఎన్నటికీ మరువడు. అదే చట్ట సభలో కుర్చీ వేసి కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తా. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎక్కువ మంది కార్యకర్తలను పరిచయం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయండి. అందరికీ హృదయపూర్వక అభినందనలు* అని పేర్కొన్నారు. -
నైరుతి రుతుపవనాలపై ఐఎండీ గుడ్‌న్యూస్
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. రుతుపవనాల ముందస్తు రాకకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొంది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు.. అండమాన్‌ను తాకనున్నాయని.. ఈ నెలాఖరులోపే కేరళంలోకి రుతు పవనాలు ప్రవేశించనుందని వెల్లడించింది. మే 16, 17 తేదీల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలుపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలో నైరుతి రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. సాధారణంగా నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు మే 15 నాటికి ప్రవేశిస్తాయి.. అలాగే మే 20 నాటికి అండమాన్ సముద్రం అంతటా విస్తరిస్తాయి. ఈ ఏడాది రుతుపవనాల రాక ఈ కాలక్రమానికి అనుగుణంగానే ఉండబోతోందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంపై రుతుపవనాల రాక దాదాపు షెడ్యూల్ ప్రకారమే ఉన్నట్లు కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు.గతేడాది నైరుతి రుతుపవనాలు సాధారణ షెడ్యూల్ కంటే ముందే.. అంటే మే 13 నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులకు చేరుకున్నాయి. వాతావరణ రికార్డుల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు మే 20 నాటికి అండమాన్ సముద్రాన్ని కవర్ చేసి.. జూన్ 1 నాటికి కేరళం తీరాన్ని తాకుతాయి. అయితే, 2026 నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని ఐఎండీ ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి. -
చంద్రబాబు సర్కార్ దారుణ నిర్ణయం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుంది. నాడు-నేడు స్కూళ్ల కోసం విరాళాలు వసూలు చేయాలని నిర్ణయించింది. విరాళాలు వస్తేనే స్కూళ్లు అభివృద్ధి చేయాలని.. విరాళాలు కోసం ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. విరాళాల సేకరణకి ప్రత్యేక డోనార్ పోర్టల్ ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలకు ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఇక దాతల దయపైనే పేద పిల్లల పాఠశాలల భవిష్యత్ ఆధారపడి ఉంది.మరోవైపు, రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి దిగజారిపోతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో అడ్మిషన్లు తగ్గిపోవడంతో పాటు, బడి బయటి పిల్లలను సైతం పట్టించుకోక పోవడంతో డ్రాప్ అవుట్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ప్రైవేటు స్కూళ్లల్లో అడ్మిషన్లు పెరగడం గమనార్హం. విద్యా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంస్కరణలను చంద్రబాబు సర్కార్ ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. నిర్వీర్యం చేస్తూ వస్తోంది.రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్లు 15.50 శాతం, యూపీ స్కూళ్లల్లో 3.70 శాతం, ప్రాథమిక పాఠశాలల్లో 1.4 శాతం పెరిగింది. ఇదే క్రమంలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) నమోదు కూడా దిగజారినట్టు యూడైస్ ప్లస్ నివేదికలు చెబుతున్నాయి. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26)లో ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని అనేక సంస్కరణలను అమలు చేసింది. వేల కోట్ల నిధులను వెచ్చింది. వేల ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేలా ప్రణాళికను అమలు చేసింది. సర్కారు బడుల నిర్వహణలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి, చంద్రబాబు సర్కార్‌కి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. -
కూటమి ప్రభుత్వం దుబారా ఖర్చులు.. ప్రజలకు మాత్రం పొదుపు పాఠాలు
సాక్షి,అమరావతి: ఏపీ కేబినెట్లో చంద్రబాబు కొత్త ప్రచారం ప్రారంభించారు. విచిత్రమేమిటంటే, పర్యటనల పేరుతో, ఢిల్లీలో తన ఇంటి కోసం చేస్తున్న దుబారా ఖర్చులను మరిచిపోయిన చంద్రబాబు సర్కార్ ప్రజలకు పొదుపు పాఠాలు చెబుతోంది. కానీ సీఎం, మంత్రుల ప్రత్యేక విమానాల ఖర్చులపై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ‘నాదేశం -నా బాధ్యత’ అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారు చంద్రబాబు. జిల్లా పర్యటనల్లో ఖర్చు తగ్గింపు చర్యలు చేపడుతున్నామని చెబుతున్న చంద్రబాబు సర్కార్, వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’ అని ప్రకటించింది.విచిత్రం ఏంటంటే కేబినెట్ నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ పట్టించుకోలేదు. దుబారా తగ్గించాలంటూ కేబినెట్ మీటింగ్‌లో చంద్రబాబు నీతులు చెప్పారు. ఆ తర్వాత మంత్రి పార్ధసారధి సైతం ఇకపై ప్రత్యేక విమానల్లో ప్రయాణాలుండవని తెలిపారు. అలా మంత్రి పార్ధసాధి చెప్పారో లేదో కొద్ది సేపటికే నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్‌లో చక్కెర్లు కొట్టారు. సత్యసాయి జిల్లా పర్యటనకు వీటీ- సీవీబీ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లారు. -
శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం: భూమన
సాక్షి, తిరుపతి: టీటీడీలో శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం జరిగిందని, నాలుగు నెలలుగా ఒక్క రోజు కూడా కనీసం 8 టికెట్లు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో ఐటీ, విజిలెన్స్, దళారులు, ట్రావెల్ ఏజెంట్స్ కుమ్మక్కై ఒక్కో శ్రీవాణి టికెట్ రూ.15 వేలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.దీన్ని నెలన్నర క్రితమే తాము బయటపెట్టినా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆక్షేపించారు. పదే పదే తాము ప్రశ్నిస్తుంటే చివరికి ఏఐ, ఆటో ఫిల్లింగ్ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. శ్రీవాణి టికెట్ల స్కాంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. భూమన ఇంకా ఏం మాట్లాడారంటే..:నిరంతరాయంగా శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ దోపిడీ:శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ దోపిడీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఉదయం 9 గం,కు మొత్తం 800 శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో ఓపెన్ చేస్తే కేవలం ఒకటిన్నర నిమిషంలో మొత్తం టికెట్లు అమ్ముడు పోయినట్లు వస్తోంది. ఇదెలా సాధ్యం! దీని వెనుక మతలబు ఉంది. పెద్ద అవినీతి దాగి ఉంది. ఇంకా కుట్ర కూడా ఉందని మేం చెబుతున్నాం. దీని మీద టీటీడీ ఓ ప్రకటన ఇచ్చింది. ఇందులో సాఫ్ట్వేర్ మీద నిరంతర నిఘా పెట్టామని, ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ లాంటి పద్దతులతో వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లు పొందే అనుమానాస్పద కార్యక్రమాల మీద డేగ కన్ను వేశామని చెబుతోంది. అలాగే అక్రమ పద్దతుల్లో బుక్ చేస్తున్న ఐడీల్ని నిరోధించి దళారుల ఎత్తుగడల్ని తిప్పికొట్టేలా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నట్లు చెబుతోంది. కాబట్టి మధ్యవర్తుల్ని నమ్మి మోసపోవద్దని టీటీడీ కోరుతోంది.టీటీడీ ద్వంద్వ వైఖరి:ఇంకా 2024 జూన్ నుంచి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించామని, బుకింగ్ సైట్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ చొరబడటం సాధ్యం కాదంటున్నారు. మరోవైపు మళ్లీ కొంతమంది దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ, ఏఐ ఆధారిత ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల్లో టికెట్లు బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.నాలుగు నెలలుగా రోజుకు 8 టికెట్లూ ఇవ్వలేదు!:టీటీడీని నేను ఓ ప్రశ్న వేస్తున్నా. 2024లో అధికారంలోకి వచ్చాక శ్రీవాణి టికెట్ల విధానాన్ని అత్యంత పటిష్టం చేశామని చెబుతున్న మీరు.. ఆటో ఫిల్లింగ్ పద్దతుల ద్వారా దళారులు చొరబడుతున్నారని ఒప్పుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 9న ఆన్ లైన్ విధానం ప్రవేశపెడితే, అప్పటి నుంచి ఇవాళ్టి వరకూ ప్రతీ రోజూ ఇచ్చే 800 శ్రీవాణి టికెట్లలో ఒక్కటి కూడా అర్హులకు అందలేదు. నాలుగు నెలలుగా ఈ విషయం మీరు గుర్తించనే లేదా? లేక నిద్రపోయారా? లేక నిద్ర నటిస్తున్నారా? లేదా మా విమర్శలకు భయపడి ఈ వివరణ ఇచ్చారా? అనేది చెప్పాలి.దళారులు, ట్రావెల్ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్లైన్లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల చేతుల్లో టికెట్లు కనిపిస్తున్నాయి. దీనిపై మేం లోతైన పరిశీలన చేస్తే టీటీడీ ఐటీ జీఎంగా ఓ ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ అర్హత కూడా లేని వ్యక్తిని నియమించారని తేలింది. ఈ వ్యక్తిని గతంలో విదేశాల్లో కళ్యాణోత్సవాలు జరపమని పంపిస్తే దాదాపు రూ.30 లక్షలు తినేశాడని పట్టుకుని ఆ మొత్తం రికవరీ కూడా చేశాం. అలాంటి వ్యక్తిని జీఎంగా నియమించారు. పెద్దలు తమకు తాబేదారుగా ఉంటాడని అతన్ని ఈ పోస్టులో నియమించారు.నిజానికి టీసీఎస్ నుంచి కొత్త సాఫ్ట్వేర్ వచ్చాకే ఈ దోపిడీ మొదలైంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అతనికి అనుంగు శిష్యుడైన మరో బోర్డు సభ్యుడు, స్ధానికుడు కూడా అయిన వ్యక్తి కలిసి రోజుకు రూ.40 లక్షల ఆదాయం శ్రీవాణి టికెట్ల ద్వారా పంచుకుంటున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో దాదాపు రూ.48 కోట్లు అలా దండుకున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి చెందాల్సిన రూ.48 కోట్లను వీరు అక్రమంగా దోచుకున్నారు.సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే రోజుకు 800 టికెట్ల జారీ!:మేం కొత్త సాఫ్ట్ వేర్ తెచ్చినప్పుడు శ్రీవాణి టికెట్లను మూడు నెలలకోసారి సెక్యూరిటీ ఆడిట్ చేసి కేటాయించే వాళ్లం. కానీ ఇప్పుడు టీసీఎస్ ఎలాంటి సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే రోజుకు 800 టికెట్లను రిలీజ్ చేస్తోంది. ఆటో ఫిల్లింగ్ ద్వారా ఎవరో దళారులు, ట్రావెల్ ఏజెంట్లు దూరుతున్నారని చెప్తున్న టీటీడీ.. మేం తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ సిస్టమ్ లో మూడు నెలలకోసారి ఇచ్చే రూ.300 ఎస్ఈడీ టికెట్ల ఫ్రీ బుకింగ్ కానీ, కళ్యాణోత్సవం టికెట్లు కానీ, సేవా టికెట్ల డిప్లు కానీ, వసతి టికెట్లు కానీ, మూడు నెలలకు ఇచ్చే శ్రీవాణి కోటాలో ఎందుకు ఆటోఫిల్లింగ్ జరగడం లేదో సమాధానం చెప్పాలి. కొత్తగా ఆ సాఫ్ట్వేర్ రూపొందించామని చెప్తున్న టీటీడీ.. ఈ 800 టికెట్లకే ఎందుకు ఆటోఫిల్లింగ్ జరుగుతోందో చెప్పాలి.అంటే అందరూ కూడబలుక్కుని దోపిడీ చేస్తున్నారు. విజిలెన్స్, ఐటీ రంగం పూర్తిగా నిర్వీర్యం కావడమే కాకుండా నిస్సత్తువతో మిలాఖత్ అయ్యాయి. అటు పెద్దలు, ఇటు దళారులు, ఐటీ, విజిలెన్స్ కలిసే ఈ తతంగం నడుపుతున్నారు. ఒక్క రోజులో కనుక్కోవాల్సిన విషయాన్ని మేం పదే పదే చెప్తుంటే, విమర్శల జడివాన పెరిగాక ఇలా జరుగుతోందని, డేగ కన్ను వేశామని కబుర్లు చెప్తున్నారు. కన్ను తెరిచారే తప్ప అది పని చేయడం లేదు.సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే:శ్రీవాణి టికెట్ల స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఏకంగా రూ.48 కోట్ల స్కామ్ జరిగింది. మేం శ్రీవాణి టికెట్లు ఆ‹ లైన్లో ఇచ్చినప్పుడు రోజుకు 1000 వరకు ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వం దాన్ని మూసేసి ఆన్ లైన్ విధానం తీసుకొచ్చింది. ఈ నాలుగు నెలల కాలంలో రోజుకు కనీసం 8 మందికి కూడా టికెట్లు దొరకలేదు. దళారులంతా టీటీడీ వెబ్ సైట్ ద్వారానే టికెట్లు కొంటున్నారు. ఎలా అంటే మీ ఐటీ, విజిలెన్స్ విభాగాలు, పాలక మండలి పెద్దలు కుమ్ముక్కు కావడం వల్లే. అలా అంతా ఒక్కౖటై ఒక్కో బ్రేక్ దర్శనం టికెట్ రూ.4 వేలకు అమ్ముతున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన మామిళ్లపల్లి రైతులు
సాక్షి,తాడేపల్లి: రైతులపై దాడి చేసి, తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.పొన్నూరు మండలం మామిళ్లపల్లి రైతులు పండించిన మొక్కజొన్న పంటను వారి షెడ్డులో దాచుకుంటే, దానిపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన రైతులపై కూడా దాడులు జరిపారు. ఈ దాడిలో మామిళ్లపల్లి రైతులు గాయపడ్డారు. తర్వాత తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. టీడీపీ గూండాల దాడి ఘటనను బాధిత రైతులు వైఎస్ జగన్‌కు వివరించారు. ‘దాడి చేసి తిరిగి మా పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదుగురు మహిళా రైతులపై కూడా అట్రాసిటీ కేసులు పెట్టారని వాపోయారు. ఈ సందర్భంగా బాధిత రైతులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ‘రైతుల గోడౌన్‌పై దాడి దుర్మార్గపు చర్య. తిరిగి బాధిత రైతులపైనే అట్రాసిటీ కేసులు పెడతారా?. బాధిత రైతులకు అండగా ఉంటా. లీగల్ సెల్ ద్వారా అవసరమైన న్యాయపోరాటం చేద్దాం’ అని హామీ ఇచ్చారు. -
‘జగన్ అంటే.. బాబు సర్కార్‌కు ఎందుకంత భయం?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అరెస్టు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అమరావతి అద్దాలకు రూ.2500 కోట్లు అని ఈనాడులో వచ్చిన వార్త గురించి ప్రస్తావించినా కేసులు, బీఆర్ నాయుడు రాసలీలలు గురించి ప్రశ్నిస్తే కేసులు, కర్నూలు బస్సు దహనం గురించి మాట్లాడినా కేసులే, శాంతిభద్రతల కోసం పని చేయాల్సిన పోలీసులను ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు’’ అంటూ మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అధికారాన్ని ఉపయోగించి రూల్స్‌కు విరుద్దంగా పని చేస్తున్నారు. ఏకంగా సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారు. కోర్టులు చేయాల్సిన పనులను కూడా పోలీసులే చేస్తారా?. అసభ్యకరమైన పోస్టులు ఉంటే ఆ పోస్టులను తొలగించాలి. కానీ ఏకంగా ఖాతాలనే తొలగించమనే హక్కు ఎవరిచ్చారు?. వైఎస్సార్సీపీకి చెందిన జగనన్న కనెక్ట్స్‌ను తొలగించాలని ఆదేశాలిచ్చారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రూల్స్‌కు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారు?. చట్టానికి వ్యతిరేకంగా పోలీసులు పని చేయటం దుర్మార్గం.‘‘ప్రజా సమస్యలను ప్రశ్నించినా ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. వైఎస్సార్సీపీ ఇన్స్ట్రాగ్రామ్ని పోలీసుల ద్వారా తొలగించారు. 27,443 హింసాత్మక నేరాలు ఏపీలో జరగడం దారుణం. రాష్ట్రంలో శాంతిభద్రతల పూర్తిగా కొరవడ్డాయి. వైఎస్ జగన్‌ని చూసి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?. సరైన పరిపాలన చేస్తే ఆ భయం ఉండదు. తాము చేస్తున్న దోపిడీ, అవినీతిలను బయటపెడుతున్నందునే ప్రభుత్వానికి భయం. కేసులు ఎదుర్కోవటం మాకు కొత్త కాదు. కొంతమంది కార్యకర్తలను హత్యలు చేశారు. మా వారిపై దాడులు చేసి, మళ్ళీ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. చట్టవ్యతిరేకంగా పని చేస్తున్న అధికారులందరి పేర్లూ డిజిటల్ బుక్‌లో నమోదు చేశాం. వారిపై కచ్చితంగా చట్టపరంగా పోరాటం చేస్తాం’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. -
సౌదీలో పునబాక మహిళ ఆత్మహత్య
తిరుపతి: మండలంలోని పునబాక గ్రామానికి చెందిన ఉయ్యాల భాస్కరయ్య, తయారమ్మ దంపతుల కుమార్తె కోనేటి మమత(36) బుధవారం సౌదీలోని జుబేల్ ప్రాంతంలో ఉంటూ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో తిరుపతికి చెందిన కోనేటి చెంగయ్య (విశ్రాంత ఎస్ఐ) చిన్న కుమారుడు కోనేటి కృష్ణకి మమతను ఇచ్చి వివాహం చేశారు. వీరు శ్రీకాళహస్తిలోని ఇందిరానగర్‌లో నివాసం ఉండేవారు.వీరికి కోనేటి రూపేష్ కోనేటి లోహిత్ కుమారులు ఉన్నారు. 2012లో కృష్ణకి సౌదీలోని సాట్రాప్ పెట్రో కెమికల్ కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం రావడంతో భార్యభర్తలిద్దరు సౌదీలో నివాసం ఉంటున్నారు. తిరుపతిలో ఉన్న కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి వివాదం నెలకొనడంతో మమత మనస్తాపానికి గురై భర్త ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అయితే మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చి తమకు అప్పగించేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
వైఎస్ జగన్ ప్రభంజనానికి 15 ఏళ్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భారతదేశ ఎన్నికల చరిత్రలో 5.45 లక్షల భారీ మెజార్టీతో ప్రభంజనం సృష్టించి బుధవారంతో 15 ఏళ్లు పూర్తయింది. 2011లో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి, కడప ఎంపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ స్థాపించిన రెండు నెలల్లోనే నిర్వహించిన ఉప ఎన్నికల్లో భారీ విజయంతో చరిత్ర సృష్టించారు. దేశ రాజకీయాల్లో సంచలనంగా నిలిచారు. ఆ ఎన్నికల ఫలితాలు 2011 మే 13న వెలువడ్డాయి. కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కనీవినీ ఎరుగని రీతిలో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్ జగన్ విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 2011 నాటికి లోక్‌సభ చరిత్రలో భారీ మెజార్టీ సాధించిన రెండో నాయకుడిగా దేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించారు. 1991లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలో మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 5.8 లక్షల ఓట్ల మెజార్టీతో మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో వైఎస్ జగన్ నిలిచారు. ఆ తర్వాత ఎదురైన రాజకీయ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల్లోనే ఉన్నారు. 2014–19 మధ్య రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యల పట్ల నిరంతర పోరు సాగించారు. 2019 ఎన్నికలకు ముందు 3,648 కిలోమీటర్ల మేర ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’చేపట్టి నాటి చంద్రబాబు రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించేలా ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి మరోమారు దేశ రాజకీయాలను షేక్ చేశారు. 2019–24 మధ్య నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుతో పాటు, నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా బలమైన అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో వైఎస్ జగన్ సంచలన గెలుపునకు 15 ఏళ్లు పూర్తవ్వడంతో బుధవారం సోషల్ మీడియా మారుమోగిపోయింది. వైఎస్ జగన్ అభిమానులు రికార్డు విజయాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు హోరెత్తించారు. వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. -
ఆరు నూరైనా భూములిచ్చేదే లేదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో సాగిస్తున్న భూ దందాకు సహకరించే ప్రసక్తి లేదని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెబుతున్నారు. రాజధాని కోసం అవసరమైనంత భూమిని తొలి దశలోనే సమీకరణ కింద తీసుకున్నప్పటికీ, మళ్లీ రెండో దశలో బలవంతపు సమీకరణకు పూనుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమీకరణకు ఒప్పుకోకపోతే భూసేకరణ చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తుండటంపై మండిపడుతున్నారు. అసలు మొదటి దశలో ఇచ్చిన భూమి ఎందుకు సరిపోదని నిలదీస్తున్నారు. విజయవాడ నగరానికి ఆనుకుని ఉండే ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల్లో భూముల ధరలు మొదటి నుంచి ఎక్కువే. 2014కు ముందే అక్కడ ఎకరం రూ.2–3 కోట్లు పలికేది. అదే సమయంలో ఇదే రాజధాని ప్రాంతంలోని మరికొన్ని గ్రామాల్లో ఎకరం ధర రూ.లక్షల్లోనే ఉండేది. ప్రభుత్వ భూములు తీసుకోవడానికి అన్ని చోట్లా ఒకే ప్యాకేజి ప్రకటించడం అత్యధిక శాతం రైతులకు నచ్చలేదు. అయితే కొండవీటి వాగు వరద నివారణ, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి వాటికి రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. రాజధాని వస్తుందని నమ్మి సమీకరణకు భూములు ఇచ్చేశారు. ఆ సమయంలో అవసరమైన మేరకే భూములు తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి బఫర్‌జోన్ ఏర్పాటు పేరుతో మిగిలిన భూములు కూడా తీసుకోవడానికి రైతులకు నోటీసులు ఇస్తోంది. పూలింగ్‌కు ఇవ్వని భూముల్లో కూడా లేఅవుట్లు వేశారు. ఇప్పుడు వాటిని భూసేకరణ కింద పెట్టారు. గ్రామస్తులకు కనీస సమాచారం ఇవ్వకుండానే, వారిని సంప్రదించకుండానే నోటీసులు ఇస్తున్నారు. రైతుల గోడు వినడానికి సీఆర్డీఏ కమిషనర్, మంత్రి నారాయణ ఏమాత్రం ఇష్టపడటం లేదు. రైతులు కూటమి పార్టీల నేతలతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అపాయింట్మెంట్ కోసం విఫలయత్నం చేశారు. ఈ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి.. ఎంత భూమి అవసరం.. ఏ రైతుకు ఎంత భూమి పోతుందన్న వివరాలు ఇవ్వకుండానే బలవంతంగా భూములు లాక్కొవడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి ఆంగ్ల దినపత్రికలకు, సర్క్యులేషన్ లేని పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంతో అధికారులు నోటీసులు ఇచ్చేవరకు ఎవరికీ సమాచారం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు అవసరానికి మించి ప్రభుత్వానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. మాకు ఎప్పుడు లబ్ధి కలుగుతుంది? నాకు ఎకరం 40 సెంట్లు ఉంది. ఆ మొత్తం భూమి సేకరణ కోసం నోటీసులు ఇచ్చారు. నాకు రెండేళ్ల కిందట బైపాస్ ఆపరేషన్ జరిగింది. రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకోవాలి. గతంలో పూలింగ్ సమయంలో విద్య, వైద్యం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ తీరు వల్ల మాకు ఎప్పటికి లబ్ధి కలుగుతుంది? మేం భూములు ఇస్తే ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవాలి? మేం రాజధానికి వ్యతిరేకం కాదు. మా బ్రతుకులు పణంగా పెట్టి భూములు ఇవ్వలేమని చెబుతున్నాం. – పద్మారెడ్డి, రైతు, ఉండవల్లిఇది చాలా అన్యాయం ప్రభుత్వం చెబుతున్న రాజధానిలో ప్రస్తుతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఉంది. విజయవాడకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ధర ఉంది. పైగా కమర్షియల్ ఏరియా కావడం వల్ల వ్యాపారాలు బాగుంటాయి. అందువల్ల ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ల వల్ల రైతులకు నష్టం వస్తుంది. విజయవాడకు పక్కనే ఉన్న మాకూ ఒకే పద్ధతి, ఎక్కడో దూరంగా ఉన్న వారికి కూడా అదే పద్ధతా? ఈ విషయమై గతంలో మేము కోర్టులో వేసినప్పుడు స్టే వచ్చింది. తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూమి ఇవ్వండని మొదలుపెట్టి ఇప్పుడు అన్ని భూములు కావాలంటున్నారు. మాతో మాట్లాడకుండానే మాకు నోటీసులు ఇస్తుండటంపై అందరం సమావేశమయ్యాం. రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పే చంద్రబాబునాయుడు ఏటా మూడు పంటలు పండే పొలాలను అవసరానికి మించి తీసుకోవడం అన్యాయం. – ఈశ్వరరెడ్డి, రాజధాని రైతు సంఘం అధ్యక్షుడుప్రాణం పోయినా భూమి ఇవ్వం మాది ఉండవల్లి. 248 సర్వే నెంబర్లో మా కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఉంది. ఇది చంద్రబాబు నాయుడు నివాసానికి తూర్పు పక్కన ఎదురుగా ఉన్న భూమి. దీన్ని 1960లో మా తాత కొనుక్కున్నాడు. అప్పటి నుంచి మేము సాగు చేస్తున్నాం. ఇప్పుడు ఈ భూమి తీసుకుంటామంటున్నారు. బదులుగా మాకు వర్షం పడితే నాలుగు అడుగులు నీళ్లు నిలిచే మాలపల్లి చర్చి వద్ద ప్లాటు ఇస్తామంటున్నారు. బంగారం లాంటి మా భూమిని తీసుకుని ఎక్కడో గుంటలో ఇస్తామంటే ఎలా? రేపు నేను భూమి ఇచ్చినా నాకు ప్లాట్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో ఏ ఒక్క రైతు అయినా ఇల్లు కట్టుకున్నాడా? కమర్షియల్ ప్లాట్స్ అంటున్నారు. అక్కడ జనం ఉంటే కదా మా వ్యాపారాలు సాగడానికి? మా బతుకుల్ని కొట్టబాకండి. రాజధాని రాకముందే ఈ ప్రాంతం అంతా రెసిడెన్షియల్ జోన్లో ఉంది. మేం రాజధానికి వ్యతిరేకం కాదు. అయితే ప్రాణాలు పోయినా మా భూములు ఇవ్వం. – రఘునాథ్, రైతు, ఉండవల్లిఇలాగైతే నా అప్పు తీరేదెలా? ఉండవల్లిలో నాకు ఎకరం భూమి ఉంది. ఆ భూమిలో నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు కోసం నా భూమిని తీసుకుని ప్లాట్ ఇస్తామంటున్నారు. ఎక్కడ ఇస్తారో మాత్రం చెప్పడం లేదు. ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఏవీ డెవలప్ కాలేదు. గతంలో గజం రూ.70 వేల నుంచి 80 వేలకు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ రూ.20 వేలకు పడిపోయింది. ఇప్పుడు అది కూడా కొనేవారు లేరు. రోడ్డుకు ఎంత కావాలో అంత ఇస్తామని.. మిగిలిన భూమి అమ్ముకోవడానికి అనుమతి అడిగితే స్పందించడం లేదు. మా అమ్మాయికి ఎనిమిదేళ్ల క్రితం అప్పు చేసి పెళ్లి చేశా. ఆ అప్పు ఇంత వరకూ తీరలేదు. ఇప్పుడు పొలం అమ్ముకోవడానికి కూడా లేకుండా పోయింది. – బుర్రా శ్రీనివాసరావు, రైతు, ఉండవల్లికోర్టును ఆశ్రయిస్తాం మావి విలువగల భూములు. చిన్న సన్నకారు రైతులం అని చెప్పాం. రాజధానికి సహకరించాలన్న ఉద్దేశంతో రోడ్లకు, వాగుకు సహకారం అందించాం. ఇంతటితో ఆగాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మిగతా భూమిని వదిలేస్తే మేమే అభివృద్ధి చేసుకుంటాం. ఇంకో పది సంవత్సరాల తర్వాత అయినా మా భూములను ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేం. ఎందుకంటే మీరు ఇచ్చే గజాలు మాకు చాలవు. మాకు ఇక్కడ ఏ ప్రాజెక్టులూ లేవు. మా గోడు వినిపించుకోకుండా భూసేకరణకు పూనుకుంటే కోర్టును ఆశ్రయిస్తాం. – నరేష్‌రెడ్డి, రైతు,ఉండవల్లి -
ఇంటర్ రీ కౌంటింగ్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్మిడియట్ పబ్లిక్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. మొత్తం 2,432 మంది విద్యార్థులు రీ–కౌంటింగ్‌కు, 11,883 మంది విద్యార్థులు రీ–వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలను bie.ap.gov.inలో చూడవచ్చని ఇంటర్ విద్యా కార్యదర్శి రంజిత్ బాషా బుధవారం తెలిపారు. ఫలితాల్లో ఏమైనా తేడా వస్తే ఇంటర్ విద్య మండలి పోర్టల్ లేదా 93929 11819 నంబర్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
సంక్షేమం.. ఇక సంక్షోభమే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు సంక్షేమంలో భారీగా కోతలు విధించడానికి ఫ్యామిలీ ప్రయోజనం (బెనిఫిట్) కార్డును అస్త్రంగా ప్రయోగిస్తోంది. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకాన్ని నిలువునా మోసం చేసిందే కాక, ఇప్పుడు అర్హులైన లబ్ధిదారులను అనర్హుల పేరుతో జాబితాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ పథకాలకు కొత్త నిబంధనలను రూపొందించింది. అంతే కాకుండా పథకాల ద్వారా లబ్ధి కలిగే ప్రయోజనాలకు సీలింగ్ విధించింది. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే సాకుతో పథకాలకు ఎగనామం పెట్టేందుకు కుటుంబాల విభజనకు స్వస్తి పలకనుంది. సూపర్ సిక్స్‌తో పాటు వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తామని ఎన్నికలప్పుడు ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల లబ్ధిదారులను సైతం అనర్హులుగా తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు జారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఫ్యామిలీ బెనిఫిట్ నిర్వహణ వ్యవస్థ బిల్లుకు రూపకల్పన చేసి చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాల డేటా (సమాచారం) ఆధారంగా సంక్షేమ పథకాలకు అర్హులెవరు.. అనర్హులెవరు.. అనే వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తద్వారా రాష్ట్రంలో కేవలం 10.2 లక్షల కుటుంబాలు మాత్రమే అర్హమైనవిగా గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 7.4 లక్షల కుటుంబాలుండగా, మిగతా కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నవిగా తేల్చారు. ఈ 10.2 లక్షల కుటుంబాల నుంచి కూడా అత్యంత పేద కుటుంబాల జాబితాను తయారు చేయనున్నారు. ఇందుకు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టనున్నారు. అంటే తొలి దశలోనే 94 శాతం కుటుంబాలకు అర్హతే లేదని నిర్ధారించారు. ప్రస్తుత లబ్ధిదారుల ఏరివేతప్రస్తుతం అనర్హులు చాలా మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌తో పాటు వివిధ రకాల ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కొత్త నిబంధనల మేరకు ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి వారి పేర్లను తొలగించనుంది. వివిధ ప్రభుత్వ పథకాల నుంచి ఏడాదికి 48 వేల రూపాయలకన్నా ఎక్కువ ప్రయోజనం పొందకుండా సీలింగ్ విధించాలని నిర్ణయించింది. అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా ఏడాదికి 48 వేల రూపాయలు ప్రయోజనం పొందితే ఇక ఆ కుటుంబానికి మరే ఇతర పథకాల ప్రయోజనాలను అందించరు. అంటే పెన్షన్ వస్తే మిగతా ఏ పథకాలు ఆ కుటుంబానికి వర్తింప చేయరు.రాష్ట్రంలోని 1.7 కోట్ల కుటుంబాల్లో అర్హత కలిగిన కుటుంబాలు 10.2 లక్షలే అని స్పష్టం చేస్తున్న ప్రభుత్వ డాక్యుమెంట్.. ఈ డాక్యుమెంట్లో ఉన్న అంశాల్లో ఏ ఒక్కటి వర్తించినా వారు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాదని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రజెంటేషన్ డేటా అనుసంధానం పూర్తివిద్యుత్ వినియోగం ఆధారంగా అనర్హత వేటు వేసేందుకు ఇప్పటికే నివాసి ఆధార్ నెంబర్‌తో విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్‌ను అనుసంధానించడాన్ని డిస్కమ్స్ నూటికి నూరు శాతం పూర్తి చేశాయి. పట్టణాల్లో దాదాపు 40 లక్షల పట్టణ ఆస్తి రికార్డుల్లో యజమాని ఆధార్‌తో ఆస్తి ఐడీ అనుసంధానాన్ని ధ్రువీకరించడానికి క్షేత్రస్థాయి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఏకీకృత కుటుంబ సర్వే పూర్తయ్యింది. పౌరుల జనాభా వివరాలకు సంబంధించిన వ్యత్యాసాలను ధ్రువీకరించడం కూడా పూర్తయింది. మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం వివిధ పథకాల కోసం అనర్హుల ఏరివేతకు 15 అంశాలను ప్రామాణికంగా ఎంపిక చేసింది. ఈ 15 అంశాల్లో ఏ ఒక్కటి ఉన్నా అర్హుల జాబితా నుంచి ఆ కుటుంబాలను తొలగిస్తారు. మంత్రుల కమిటీ సిఫారసులివీ..⇒ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, రాష్ట్ర పథకాల కోసం ‘కుటుంబం’ నిర్వచనం సిఫార్సు.⇒ కుటుంబాలు పొందగలిగే మొత్తం ప్రయోజనాలపై గరిష్ట పరిమితి కోసం ఒక విధానం సిఫార్సు (సమర్థవంతంగా ప్రభుత్వ నిధుల వినియోగాన్ని నిర్ధారించడం)⇒ పథకాల కోసం సవరించిన ఆర్థిక అర్హత ప్రమాణాల సిఫార్సు. (అర్హత లేని లబ్ధిదారులను మినహాయించి, అవసరమైన లబ్ధిదారులను చేర్చడం. ఉదా: ఎన్టీఆర్ భరోసా పెన్షన్). ⇒ కుటుంబ డేటాబేస్, కుటుంబ కార్డు వినియోగాన్ని అధికారికం చేయడానికి ఫ్యామిలీ బెనిఫిట్ నిర్వహణ వ్యవస్థ బిల్లు రూపకల్పన (డేటాబేస్‌ను నియంత్రించడానికి, ప్రతిపాదిత కుటుంబ కార్డు వినియోగానికి అథారిటీని నియమించడం).⇒ ప్రయోజన పథకాల రూపకల్పనలో సంస్కరణల సిఫార్సు. (పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడానికి, డేటాబేస్‌లో కృత్రిమ కుటుంబ విభజనను నివారించడం).⇒ ఫ్యామిలీ కార్డ్‌ను అమలు చేయడానికి ‘కుటుంబం’కు అధికారిక నిర్వచనం, ఫ్యామిలీ డేటాబేస్ అండ్ కార్డ్‌కు చట్టపరమైన మద్దతు. -
తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు.ఫోన్ సంభాషణలో సీఎం విజయ్‌తో.. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. సమర్థవంతమైన, పారదర్శకమైన.. ప్రజాపాలన అందించాలి. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలి. తమిళనాడు ప్రజలు మీ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి, సమగ్ర పాలన, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడిపించాలి. మీ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలి. భారత సమగ్ర ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలవాలని కోరుకుంటున్నాని వైఎస్ జగన్ ఆకాంక్షించారు A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi.…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026 అంతకు ముందు మే4న తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సమయంలో విజయ్‌కు వైఎస్ జగన్ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. సోదరుడు విజయ్‌కు అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్‌కు మరింత మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. తాజాగా, ఇవాళ వైఎస్ జగన్ విజయ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
వైఎస్ జగన్‌ని కలిసిన పూడి శ్రీహరి
సాక్షి,తాడేపల్లి: ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ, అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో వైఎస్ జగన్‌తో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి కలిశారు. అక్రమ కేసుల్లో పోలీసుల విచారణను ఎదుర్కొన్న శ్రీహరి, విచారణ పేరుతో పోలీసులు వ్యవహరించిన తీరు, తప్పుడు కేసుల వివరాలను వైఎస్ జగన్‌కు తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీహరికి అండగా నిలిచిన వైఎస్ జగన్.. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. చట్టపరంగా వాటిని ఎదుర్కొందామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
బాలు ఆత్మహత్యాయత్నం.. NHRCకి ఎంపీ గురుమూర్తి లేఖ
సాక్షి,తిరుపతి: కర్నూలు త్రీ టౌన్ పోలీసుల దారుణ వేధింపులు తాళలేక బాలు అనే యువకుడు ఆత్మహత్యా యత్నం చేశారని, ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకుని స్వతంత్య్ర విచారణ జరిపాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని (ఎన్హెచ్ఆర్సీ) కోరారు. ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాసిన ఎంపీ గురుమూర్తి, రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘణ యథేచ్ఛగా సాగుతోందని వెల్లడించారు.ఎన్హెచ్ఆర్సీకి రాసిన లేఖలో ఎంపీ గురుమూర్తి ఇంకా ఏం ప్రస్తావించారంటే..బాలు ఏ నేరం చేయకపోయినా, ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, ఒక కేసులో విచారణ అంటూ ఆయన్ను పదే పదే స్టేషన్‌కు పిలిపించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు దారుణంగా వేధించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన బాలు, చేయి కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. అధికార పక్షానికి చెందిన కొందరు నాయకుల ఒత్తిడితోనే పోలీసులు ఆ విధంగా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా మద్యం, మాదకద్రవ్యాల కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు బాలు తెలిపారు. తన నిర్దోషిత్వం గురించి, ఎంత చెప్పినా పట్టించుకోని పోలీసులు, ఆయన్ను మానసికంగానే కాకుండా, శారీరకంగా కూడా వేధించడంతో, అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడు.కర్నూలు త్రీ టౌన్ పోలీసుల తీరు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద కల్పించిన సమానత్వ హక్కు, జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవప్రదమైన జీవన హక్కులకు పూర్తి విరుద్ధంగా ఉంది. అలాగే, మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993లోని సెక్షన్ 12(ఎ), 12(సి), 12(జె) ప్రకారం కూడా ఉల్లంఘనే. కాబట్టి దీనిపై విచారించే హక్కు ఎన్హెచ్ఆర్సీకి ఉంది.అందువల్ల కర్నూలు త్రీటౌన్ పోలీసుల చర్యలపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణకు ఆదేశాలు ఇవ్వాలని, జిల్లా పోలీసు అధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరాలని, బాధితుడు బాలుతో పాటు, అతడి కుటుంబానికి రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఆ లేఖలో ఎన్హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. అలాగే, చట్ట విరుద్ధంగా వ్యవహరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై శాఖాపరంగా తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. -
ఆ లెక్కలు బయటపెట్టాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుబారా ఖర్చులతో రాష్ట్రం అతలాకుతలమవుతుందని.. దీనిపై చర్చించాలంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిలో సాధారణ ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు.‘‘పార్లమెంటు భవనం, తెలంగాణ సెక్రటేరియట్‌కు కూడా కాని ఖర్చు అమరావతిలో చేస్తున్నారు. అడుగుకు రూ.16 వేలు ఖర్చు చేయటం దుబారా కాదా?. రూ.20 కోట్లతో అయ్యే రోడ్డును వంద కోట్లకు చేయటం చంద్రబాబుకే చెల్లు. అమరావతిలో పెడుతున్న ఖర్చులు చూసి రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి అద్దాలకే రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోయటానికే రూ.800 కోట్లు ఖర్చు చేస్తారా?. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దుబారాని వెంటనే ఆపాలి..కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా తాత్కాలికంగా ఆపారు. అమరావతి నిర్మాణాలపై నిర్ణయం తీసుకోండి. ముందుగా మొక్కజొన్న రైతులకు ఆ డబ్బు చెల్లించండి. చంద్రబాబు తన దుబారా ఖర్చులను రైతులకు ఉపయోగించాలి. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల ప్రయాణాన్ని ఆపాలి. అధికారులు, మంత్రులు కూడా దబారా ఖర్చులు తగ్గించాలి. రాజధాని పేరుతో వసూలు చేసిన బంగారం, డబ్బు లెక్కలు బయట పెట్టాలి. జనం నుండి వసూలు చేసిన ఆ డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయి?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా వెంటనే ఇవ్వాలి. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈవెంట్ లాగా చేస్తూ దుబారా ఖర్చులు పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులను మళ్లీ మళ్లీ ప్రారంభించటం దుబారా కాదా?. ప్రధాని రెండు వాహనాల్లో వెళ్లినందున చంద్రబాబు ఒక్క ఆరులో వెళ్లి పబ్లిసిటీ చేసుకుంటారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది కరోనా టైంలో వచ్చింది. చివరికి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో చెట్లు నాటించింది తానేనని చెప్పుకున్నారు. శ్రీకాకుళం నుండి రాయలసీమకు వర్షపు నీరు పంపుతారట. ఇలాంటి డైలాగులు, అబద్దపు ప్రచారాలు ఆపాలి’’ అని సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
ఆగని చంద్రబాబు దుబారా ఖర్చులు
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు దుబారా ఖర్చులు కొనసాగుతున్నాయి. సీఎం ఢిల్లీ ఇంటికి హంగులు కోసం రూ.67 లక్షల మంజూరుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీటింగ్ హాల్, మైనర్ రిపేర్ల కోసం రూ.67 లక్షలు ఖర్చు పెట్టనుంది.గతంలో ఇదే ఢిల్లీ ఇంటికి సౌకర్యాలు, హంగులు కోసం 95 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. మళ్ళీ ఇప్పుడు రూ. 67 లక్షలు మంజూరు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కలిపి.. సీఎం చంద్రబాబు ఢిల్లీ నివాసంలో విలాసవంతమైన సదుపాయలకు ఖర్చు 1.62 కోట్లకు చేరుకుంది.కాగా, అసెంబ్లీ నిర్మాణ వ్యయం చంద్రబాబు సర్కార్ పెంచేసిన విషయం తెలిసిందే. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే. -
నరేంద్ర.. రైతులపై దౌర్జన్యం చేస్తారా?: అంబటి ఫైర్
సాక్షి, గుంటూరు: ఏపీలో రైతులపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మామిళ్లపల్లి ఘటనపై సిగ్గుపడాలి అని ఘాటు విమర్శలు చేశారు. రైతుల కాలి ధూళికి ధూళిపాళ్ల ఓడిపోతారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు.మొక్కజొన్న రైతులకు అండగా వైఎస్సార్సీపీ చలో మామిళ్లపల్లి పిలుపు నిలిచింది. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే ధూళిపాళ్ల రైతుల గోడౌన్లు, ఇళ్లపై దాడులు చేయిస్తున్నారు. రైతులు దాచుకున్న మొక్కజొన్న గోడౌన్‌పై ధూళ్ళిపాళ్ల అనుచరులు దాడిచేశారు. మామిళ్ళపల్లి దాడితో సిగ్గు పడాలి. ప్రశ్నించే వారే లేరని దాడులు చేస్తున్నారా?. మా కుటుంబంపై, మా కులంపై, మా పార్టీపై కక్ష కట్టారా?. ఎన్నాళ్ళు మీకు అధికారం ఉంటుంది. అంతకుముందు ఓడిపోలేదా?.మూడేళ్ళ ముందే చెబుతాను రాసుకోండి.. వచ్చే ఎన్నికల్లో ధూళ్ళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం. గోడౌన్లు, ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేస్తున్నారు. గుంటూరు ఐజి త్రిపాఠీ ఖాకీ డ్రెస్స్ వేసుకోవడం లేదు. పచ్చ డ్రెస్స్ వేసుకుంటున్నాడు. లోకేష్, పెమ్మసాని ఏది చెబితే అది చేస్తున్నాడు. అదే చేస్తున్నాడు. మీరు భయపడితే వంగవీటి మోహన్ రంగాలా చంపేస్తారు. తప్పు చేస్తే ఎంత పెద్ద అధికారి అయినా చట్ట ప్రకారం బట్టలు ఊడదీస్తాం. త్రిపాఠికి చెబుతున్నా.. తప్పుడు కేసు తొలగించాలి. అరెస్ట్ చేస్తే జైలు కొచ్చి కూర్చొంటాం. గోడౌన్లో ఉన్న మొక్కజొన్న వెంటనే రిలీజ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
భర్త ఫ్రెండ్‌తో వివాహేతర సంబంధం..!
నెల్లూరు జిల్లా: దగదర్తి మండలం సున్నపుబట్టి గ్రామంలో మైపాటి మాధవి అనే మహిళను హత్య చేసిన కేసులో ఆమె కోడలు పద్మశ్రీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కావలి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ రమణకుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పద్మశ్రీకి అదే గ్రామానికి చెందిన తన భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో అత్త మాధవి ఇలాంటి పనులు మానుకోవాలని కోడలు పద్మశ్రీకి చెప్పింది.అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో కులపెద్దల వద్ద పంచాయితీ జరిగింది. వారు కూడా ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు. ఈక్రమంలో కోపోద్రిక్తురాలైన పద్మశ్రీ తన అత్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. మే 8వ తేదీ తన తల్లి పుచ్చలపల్లి మాధవి సహాయంతో ఇంట్లో నిద్రిస్తున్న అత్తపై దిండుపెట్టి గొంతు నులిమి హత్య చేసింది. యూట్యూబ్‌లో సీరియల్స్ చూసి ప్రజలు పక్కదోవ పడుతున్నారని, నేరాలు చేసిన వారు తప్పించుకునే అవకాశం లేదన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దన్నారు. రూరల్ సీఐ శివశంకర్, ఎస్సై జంపాని కుమార్, సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డులివ్వాలని ఉన్నతాధికారులకు సిఫార్స్ చేశారు. -
జగనే రైట్ అన్నది కూటమి కూడా గుర్తిస్తోంది!
ఎన్టీ రామారావు నటించిన ఓ సినిమాలో ‘‘కోర్టు కోర్టుకు ఒక తీర్పు...’’ అంటూ ఓ పాటుంది. అప్పట్లో సూపర్‌హిట్ ఈ పాట. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు గమనిస్తే... ఈ పాట మరోసారి గుర్తుకురాక మానదు. విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం అంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించడం ఇందుకు కారణమవుతోంది. 2019-2024 మధ్యకాలంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషును ప్రవేశపెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే... తెలుగుదేశం, జనసేన, బీజేపీ తదితర పార్టీలు నానా యాగీ చేశాయి. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. ఆంగ్ల మీడియం వల్లనే ఆంధ్ర పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని చెబుతూనే వారికి కావాల్సిన మాధ్యమంలో చదువుకునే వెసలుబాటూ కల్పించారు. ఇందుకోసం ఆంగ్లం, తెలుగు భాషలు రెండింటిలోనూ పాఠాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియంను తీసుకురావడాన్ని ఎద్దేవ చేస్తూ శ్రీకాకుళంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వంటివారు తెలుగు భాషకు ఛాంపియన్ల మాదిరి వాదించారు. కాకినాడ జిల్లా బెండపూడికి చెందిన విద్యార్థులు ఇంగ్లీషు అద్భుతంగా మాట్లాడితే అవమానించిన టీడీపీ పెద్దలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ప్రజలలో మాత్రం ఆంగ్ల మీడియంపైనే ఆసక్తి ఉందన్న విషయం అనేక సర్వేలలో వెల్లడైంది. ప్రైవేటు స్కూళ్లలో ఆంగ్ల మీడియం ఉంటే అభ్యంతర పెట్టని ఈ నేతలు, ప్రభుత్వ స్కూళ్లలో చేరే పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ వద్దని ఎలా అంటారో అర్థం అయ్యేది కాదు. చిత్రంగా తెలుగు మీడియం అంటూ గొంతు చించుకుని మాట్లాడే ప్రముఖులెవ్వరి పిల్లలు, లేదా మనుమళ్లు ఆ మీడియంలో చదవడం లేదు. అంతా పెద్దపెద్ద కార్పొరేట్ స్కూళ్లలోనే ఆంగ్లంలోనే విద్యనభ్యసిస్తుంటారు.ఈ విషయాలన్ని బహిరంగంగానే ప్రజలు మాట్లాడుకునేవారు. అయినా జగన్ ప్రభుత్వం ఆ సంస్కరణ తెచ్చిందన్న ఆక్రోశంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దానిని వ్యతిరేకించారనిపిస్తుంది. రాజకీయ దురుద్దేశాలతో కొందరు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కోర్టుకెక్కారు. అప్పట్లో విచారణ చేసిన హైకోర్టు కూడా ఆంగ్ల మీడియం వైపు మొగ్గు చూపలేదు. కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజలలో చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో లను రద్దు చేసింది. జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.అక్కడ వాదోపవాదాలు చాలాకాలం సాగాయి.అది ఎటూ తేలలేదు. ఈలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది.దాంతో దానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం యధావిధిగా, ఆంగ్ల మీడియం విషయంలోను యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో బోధన భాషగా ఆంగ్లం ఉంటుందని గత నెల 16న ఒక ఆదేశం జారీ చేసింది. దీనిపై ఫ్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ అనే ఆయన హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేసిన ఛీప్ జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్యల బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్ధులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి అని, లేకపోతే పిల్లలు ఆయా రంగాలలో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని అభిప్రాయపడింది. ఇంగ్లీష్ అందరిని ఏకం చేసే ఒక అంశమని కూడా వ్యాఖ్యానించింది. పిల్లలకు తెలుగుతో పాటు ఆంగ్లంలో చదువుకోవడానికి అవకాశం కల్పించడం ద్వారా వారు ఇంతర రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. మంచి పరిణామమంటూ వ్యాఖ్యానించింది. అయితే పిటిషనర్ తరపున న్యాయవాది మాట్లాడుతూ ఇదే అంశంపై గతంలో హైకోర్టు జీవోలను కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా ప్రస్తుత ప్రభుత్వం ఇంగ్లీష్ బోధన భాషగా ప్రొసీడింగ్స్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. ఆంగ్లభాషను పొరపాటున బోధన భాషగా పేర్కొన్నామని, ఆ ప్రొసీడింగ్స్‌ను సవరించామని నివేదించారు. ప్రభుత్వ స్కూళ్లలో ద్విభాష విధానం అమలలో ఉంటుందని తెలిపారు. దాంతో హైకోర్టు ఈ వ్యాజ్యం నిరర్థకమని తేల్చేసింది. జగన్ ప్రభుత్వం ఇదే విధానం అమలు చేసినప్పుడు ఇదే హైకోర్టులో హోరాహోరీగా వాదోపవాదాలు జరిగాయి. ఆంగ్లంతో పాటు తెలుగు ఉంటుందని ఆనాటి ప్రభుత్వం తెలిపినా న్యాయ వ్యవస్థ కూడా పలు సందేహాలు వెలిబుచ్చింది. అంతేకాక సంబంధిత జీవోను కూడా కొట్టివేసింది. దాంతో అప్పటి ప్రభుత్వం సుప్రింకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినా ద్విభాష విధానాన్నే ఇప్పుడు తెలుగు దేశం ప్రభుత్వం కూడా అమలు చేయక తప్పలేదు. అంటే దీని అర్థం చంద్రబాబు సర్కార్ ఇంగ్లీషులో చదువుకునే అవకాశం లేకుండా చేస్తోందని, తద్వారా పేద పిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్న అభిప్రాయం బలపడుతుండడంతో వెనక్కి తగ్గిందని అనుకోవాలి. అంతేకాక అప్పట్లో రాజకీయంగా వైఎస్సార్సీపీని ఆయా వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టడం, ప్రజలలో ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీయడం వంటి లక్ష్యాలతో టీడీపీ పనిచేసింది. అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకువచ్చిన అనేక సంస్కరణలను, పాలన వ్యవస్థలను కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఒప్పుకోక తప్పడంలేదు. జగన్ టైమ్ లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కూటమి పాలనలో ఇదే అంశంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించకుండా ఉంటారా? జగన్ సీఎంగా ఉంటే ప్రతిదానిని రాజకీయం చేసి,ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విషం చిమ్మిన సంగతి ఒకటికి ,పదిసార్లు నిర్ధారణ అవుతోంది. ఆంగ్ల భాషను మీడియం గా ఉంచడం ద్వారా జగన్ తన విజన్ ను చూపితే, అప్పట్లో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ తదితరలు సంకుచితంగా వ్యవహరించారు.ఇప్పుడు జనాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
పెళ్లికి ముఖ్యమైంది ముహూర్తం. పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుంచి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తాం. అలాంటి ముహూర్తాలకు 36 రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వివాహాలు భారీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటయ్యాయి. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి) కావడంతో వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో ఈనెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. అందుకు ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధి వేదిక కానుంది. మళ్లీ జూన్ 19 నుంచి వివాహాధి శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. 36 రోజులు ఖాళీ వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, పచ్చిపూల మండపాలు నిర్మించే వారు, డెకరేషన్ చేసేవారు, షామియానా పందిళ్లు వేసేవారు, వాయిద్యకారులు, క్యాటరింగ్ వ్యాపారులు, లైటింగ్ ఏర్పాటు చేసే వారికి 36 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జూన్ 19 నుంచి బిజీ కానున్నారు. ఈ ఏడాది ముహూర్తాలు ఇవే వివాహాలకు ఈ ఏడాది జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28, జులై 1, 2, 3, 4, 5, 8, 9, ఆగస్టు 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, సెపె్టంబర్ 1, 3, 4, 5, అక్టోబర్ 11, 14, 29, 30, నవంబర్ 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26, డిసెంబర్ 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలున్నాయి. ఈ మాసమంతా ఆగాల్సిందేఈ నెల 14 నుంచి శుభకార్యాలకు విరామం ఏర్పడనుంది. మే 18 నుంచి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠమాసం కారణంగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు ప్రారంభోత్సవాలు వంటి ఏవిధమైన శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ 36 రోజులు ఆగాల్సిందే. – గోవింద వఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల -
శివ అంకుల్ నా చావుకు కారణం.. ఏటీఎంలా వాడుకున్నాడు..!
విజయనగరం జిల్లా: ‘శివ అంకుల్ నా చావుకు కారణం.. నన్ను ఒక ఏటీఎంలా వాడుకున్నారు.. తీయని మాటలతో నమ్మించి, హోటళ్లకు తీసుకెళ్లి సర్వస్వం దోచుకున్నారు.. 2019 నుంచి తన బాధ్యత, పిల్లల బాధ్యత చూస్తానని నమ్మించి భర్తలా కాపురం చేశాడు... ఆయన స్వార్థానికి నన్ను బలిచేశాడు.. ఆర్థికంగానూ దోచుకున్నాడు. నేను ఏ తప్పూచేయలేదు. నన్ను నీవు నమ్మితే చాలు అంటూ తన కుమారుడికి మెంటాడ మండలానికి చెందిన మహిళా నేత రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చివరి కోరికగా తన భర్తగా చలామణి అయిన శివకేశవనాయుడే తనకు తలకొరివి పెట్టాలని ఆ నోట్లో పేర్కొంది. విశాఖపట్నంలో మంగళవారం వేకువజామున పురుగులు మందు సేవించిన బాధితురాలు ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్‌లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మెంటాడకు చెందిన ‘పచ్చ’ పత్రిక విలేకరి శివకేశవనాయుడు తనను దోచుకున్న తీరు, మోసం చేసిన తీరును బాధితురాలు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అయితే, దీనిపై ఇప్పటివరకు స్థానికంగా ఎలాంటి కేసు నమోదుకాకపోవడం గమనార్హం. ఆ విలేకరి ఓ మంత్రికి అత్యంత ఆప్తుడు కావడమే దీనికి కారణమని స్థానికంగా చర్చ నడుస్తోంది. కేసు నమోదు విషయాన్ని మెంటాడ ఎస్ఐ కె.సీతారాము వద్ద ప్రస్తావించగా ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఘటనగా పేర్కొన్నారు. -
యువతితో ఎస్ఐ వివాహేతర సంబంధం..!
కర్నూలు: కర్నూలు నగరంలో ట్రాఫిక్ ఎస్ఐగా పని చేస్తున్న హరిప్రసాద్‌ను డిస్మిస్ చేస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐకి వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు హరిప్రసాద్‌ను విధుల నుంచి తొలగించారు. వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలేనికి చెందిన హరిప్రసాద్ 2013లో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించారు. పది రోజుల క్రితం నంద్యాల జిల్లా నుంచి కర్నూలు ట్రాఫిక్ విభాగానికి బదిలీపై వచ్చారు. హరిప్రసాద్‌కు యువతితో వివాహేతర సంబంధం విషయంలో రెండు నెలలుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. చివరకు యువతి కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అంతర్గత విచారణ జరిపించి డిస్మిస్ చేశారు.కాగా, హరిప్రసాద్ ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐగా పనిచేసే సమయంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా చాగలమర్రి టోల్‌ప్లాజా వద్ద పట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఎస్ఐ హరిప్రసాద్‌ను వీఆర్‌కు పంపారు. -
AP: కుమార్తెకు తండ్రి ఆస్తిలో సమానహక్కు
సాక్షి, అమరావతి: హిందూ వారసత్వ సవరణ చట్టం–2005 ప్రకారం కుమార్తె పుట్టుకతోనే కుమారుడితో సమానంగా ఆస్తి హక్కు కలిగి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కుమార్తె ఈ సమాన వాటా పొందేందుకు 2005లో సవరణ చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి జీవించి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆస్తిలో సమాన హక్కు పొందేందుకు సవరణ చట్టం వచ్చిన 2005 సెప్టెంబర్ 9 నాటికి కుమార్తె జీవించి ఉంటే సరిపోతుందని చెప్పింది. విభజన దావా (పార్టిషన్ సూట్)లో ప్రాథమిక తీర్పు (ప్రిలిమినరీ డిక్రీ) ద్వారా వాటాల నిర్ణయం జరిగి, తుది తీర్పు (ఫైనల్ డిక్రీ) పెండింగ్ ఉంటే, ఆ తరువాతి కాలంలో చట్టపరమైన, వాస్తవిక మార్పులు జరిగితే కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది. ‘విభజన దావాలో ఆస్తి వాటాలను నిర్ణయించిన తర్వాత, తుది తీర్పు రాకముందే కుటుంబంలో మార్పులు సంభవిస్తే వాటాలు మారతాయి. ఒక వాటాదారు మరణిస్తే, వారి వాటా మిగిలిన వారసులకు చెందుతుంది. దీనివల్ల ఇతరుల వాటా శాతం పెరుగుతుంది. కొత్తగా వారసుడు జన్మిస్తే, అతడికి/ఆమెకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఇతరుల వాటా తగ్గుతుంది. ఇటువంటి సందర్భాల్లో మారిన వాటాలను ఖరారు చేస్తూ కోర్టు మరో ప్రాథమిక తీర్పు ఇవ్వవచ్చు’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. 2005 చట్ట సవరణ నేపథ్యంలో తుది తీర్పు వెలువడకముందటి ప్రాథమిక తీర్పును సవరించి కుమార్తెలకు సమానవాటా ఇవ్వవచ్చని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా వీరమ్మ అనే మహిళకు తండ్రి మారెప్ప నుంచి సంక్రమించే ఆస్తి వాటాను హైకోర్టు సవరించింది. 2003లో వీరమ్మకు తండ్రి ఆస్తిలో 1/6 వాటా రాగా, 2005 సవరణ చట్టం నేపథ్యంలో మారెప్ప కుమారుడితో సమానంగా వీరమ్మ వాటాను సగానికి పెంచింది. సవరించిన వాటాను పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా తుది తీర్పు వెలువరించాలని కింది కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ మెడమల్లి బాలాజీ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఆస్తిలో వాటా కోసం న్యాయ పోరాటం కర్నూలు జిల్లాకు చెందిన వి.మారెప్పకు భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, కుమారుడు బుసప్ప ఉన్నారు. మారెప్ప ఆస్తిలో వాటా కోసం వీరమ్మ 1988లో కోర్టులో దావా వేశారు. ఆ తరువాత ఈ వివాదం హైకోర్టుకు చేరింది. విచారణ జరిపిన హైకోర్టు.. మారెప్ప ఆస్తిలో భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, బుసప్పకు వాటానిస్తూ 2003లో తీర్పు ఇచ్చింది. 2005లో హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కుమార్తెకు సైతం సమాన హక్కు కల్పించడంతో వీరమ్మకు ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు ధర్మాస నం.. ఆమెకు తండ్రి ఆస్తిలో సగం ఆస్తిని వాటాగా ఇస్తూ తీర్పు వెలువరించింది. -
ఫెయిలైతే టీచర్ల బాధ్యత.. పాసైతే ప్రిన్సిపాల్స్ ఘనత..
సాక్షి, అమరావతి: విద్యార్థులకు మార్కులు తగ్గితే టీచర్లకు షోకాజ్ నోటీసులు.. అదే ఉత్తీర్ణత శాతం పెరిగితే ప్రిన్సిపాల్స్‌కు సత్కారాలు.. చంద్రబాబు సర్కారుకు ఇదేం ద్వంద్వనీతి అంటూ బీసీ గురుకులాల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ పరి«ధిలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో ఉత్తీర్ణతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతోపాటు ప్రిన్సిపాల్స్‌ను మంగళవారం విజయవాడలో సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి సత్కరించడం వరకు సరే.. ప్రిన్సిపాల్స్‌ను, జిల్లా బీసీ సంక్షేమ అధికారులను జ్ఞాపికలతో అభినందించడాన్ని బీసీ గురుకుల టీచర్లు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు ముందు ప్రభుత్వం చేసిన హడావుడిని వారు గుర్తుచేస్తున్నారు.బీసీ గురుకులాల్లో విద్యార్థులకు మార్కులు తగ్గితే సంబంధిత టీచర్లకు షోకాజ్ నోటీçసులు ఇస్తామని, ఉత్తీర్ణత శాతం తగ్గితే విధుల నుంచి తొలగిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత నుంచి గురుకులాల కార్యదర్శి మాధవీలత వరకు సమీక్ష సమావేశాల్లో హెచ్చరించారు. పరీక్ష ఫలితాలు వచ్చాక ఉత్తీర్ణత తక్కువ నమోదైన గురుకులాల్లో సంబంధిత సబ్జెక్ట్ టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తక్కువ ఉత్తీర్ణత ఉన్న గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీలను విధుల నుంచి తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఉత్తీర్ణత బాగున్న గురుకులాల్లో మాత్రం సంబంధిత టీచర్లను గుర్తించి అభినందించకపోగా.. ఆ మొత్తం ఘనత ప్రిన్సిపాల్స్‌దే అన్నట్లు వారిని సత్కరించడాన్ని టీచర్లు తప్పుబడుతున్నారు.రాష్ట్రంలోని 105 బీసీ గురుకులాలకుగాను 32 గురుకులాల్లో మాత్రమే నూరుశాతం ఉత్తీర్ణత వచ్చింది. ఆ 32 గురుకులాల ప్రిన్సిపాల్స్‌ను పిలిచి అభినందించిన కార్యక్రమానికి తమను కూడా పిలిచి తమ కృషిని గుర్తించి ఉంటే బాగుండేదని టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు మార్కులు తగ్గినా, ఉత్తీర్ణత లేకపోయినా టీచర్ బాధ్యుడని, మంచి ఫలితాలు సాధిస్తే ప్రిన్సిపాల్ ఘనత అని ప్రభుత్వం ద్వంద్వనీతిని ప్రదర్శించడం సరికాదని గురుకులాల్లో పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్, గెస్ట్ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. -
కొడుకు నిందితుడైతే..తండ్రిని హింసిస్తారా?
సాక్షి, అమరావతి : ఓ కేసులో కొడుకు నిందితుడిగా ఉంటే అతని తండ్రిని తీసుకెళ్లి పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చెన్నూరు మండలం మంగళపూరు గ్రామానికి చెందిన రోజూవారి కూలీ గడుతోటి పోలయ్య కొడుకు ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో పోలీసులు గత నెల 18న పోలయ్యను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ హింసించి, తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ పోలయ్య హైకోర్టును ఆశ్రయించారు.పోలీసులు తన హక్కులను హరించారని, బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పోలయ్య తరఫున న్యాయవాది వి.సురేంద్రరెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల దాడి వల్ల పోలయ్యకు అయిన గాయాల తాలుకా వైద్య రికార్డులను, ఘటనపై స్థానిక పత్రికల్లో వచి్చన కథనాలను కూడా కోర్టు ముందుంచారు. అలాగే వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 18న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని భద్రపరచేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టుకు విన్నవించారు. పక్కా ఆధారాలు ఉన్నాయి.. పిటిషనర్ పోలయ్యను హింసించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పోలీసుల దెబ్బల వల్ల తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారని, ఇందుకు సంబంధించిన వైద్య నివేదికలు, ఫొటోలు ఆయనపై జరిగిన దాడిని ధ్రువీకరిస్తున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దాషీ్టకానికి పాల్పడి, పిటిషనర్ మానవ హక్కులను హరించినందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ సహా, గూడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, కానిస్టేబుళ్లు దాస్, చిన్నా ఈ నెల 14న స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే బాధ్యులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.పోలీసులకు చెంపపెట్టు లాంటిదిఅధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే పోలీసులకు హైకోర్టు ఆదేశాలు చెంపపెట్టు. దళితులను, రైతులను అమానుషంగా స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసే పోలీసులను న్యాయస్థానం మెట్లెక్కించే వరకు న్యాయపోరాటం చేస్తాం. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఉదాసీనంగా ఉంటే వారు కూడా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడం. ప్రతి ఒక్కరిపై ప్రైవేట్ కేసులు వేసి న్యాయస్థానంలో నిలబెడతాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పచ్చచొక్కాలు తొడిగిన పోలీసులపై క్రిమినల్ చర్యలు తప్పవు. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి -
తిరువూరులో ఎనీ టైం కిక్కు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో మద్యం మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గుడి, బడి..ప్రార్థనా మందిరాలు వంటి వాటి పక్కన పెట్టకూడదనే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి బార్ అండ్ రెస్టారెంట్లు వెలిశాయి. దీంతోపాటు గ్రామాల్లో ప్రజలకు తాగునీరు దొరకడం లేదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. వీధికో బెల్ట్‌షాపు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎనీ టైం మద్యం మాత్రం లభిస్తోంది. ఎక్సైజ్ అధికారులు సైతం మామూళ్ల మత్తులో జోగుతూ, తూతూమంత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో మద్యం మాఫియా బరితెగిస్తోంది. బెల్ట్‌షాపుల్లో నకిలీ కిక్కు గుప్పుమంటోంది.తిరువూరు నియోజకవర్గవ్యాప్తంగా 20 షాపులు ఉండగా, వీటికి అనుబంధంగా 640 బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి. ఈ షాపుల నిర్వహణ వెనుక టీడీపీకి చెందిన పార్లమెంటు ముఖ్యనేత హస్తం ఉండడంతో, మద్యం మాఫియా మరింత రెచ్చిపోతోంది. సదరు నేతకు ప్రతి మద్యం షాపు నుంచి నెలకు రూ.లక్ష చొప్పున అంటే నెలకు రూ.20 లక్షలు చొప్పున ఏడాదికి రూ.2.40 కోట్లు దండుకుంటున్నారు. బెల్ట్ షాపు పెట్టుకునేందుకు మొదట్లో గుడ్‌విల్ కింద రూ.50 వేలు చొప్పున 640 బెల్ట్‌షాపులకు రూ.3.20 కోట్లు ముక్కు పిండి వసూలు చేశారు.దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు, బెల్ట్‌షాపులు 24 గంటలు బార్లా తెరుచుకునే ఉంటున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు మద్యం బారిన పడి నాశనమవుతున్నాయి. పలు కుటుంబాలు చితికిపోయి వీధిన పడుతున్నాయి. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే పెడుతున్న స్టేటస్లు చంద్రబాబు సర్కారులో మద్యం, పేకాట వంటి అవినీతి అక్రమాలకు అద్దం పడుతున్నాయి. పేకాట, క్యాసినోలు.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా గంపలగూడెం మండలం ఊటుకూరు, విసన్నపేటలో పేకాట, క్యాసినో ఏర్పాటు చేశారు. ఆ మూడు రోజుల్లోనే ఏకంగా రూ.3 కోట్లకు పైగా దండుకున్నారని, దీని వెనుక పార్లమెంటు ముఖ్యనేత హస్తం ఉన్నట్లు టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. గతంలోనూ కొలికపూడి ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి.? పేకాట క్లబ్‌కా?, కొండ పర్వగట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్, పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్..’’ అంటూ స్టేటస్ పెట్టడంతో అప్పుడు కూడా సంచలనంగా మారింది.సంచలనంగా ఎమ్మెల్యే కొలికపూడి స్టేటస్..తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన స్టేటస్, అక్కడ మద్యం మాఫియా దందాకు అద్దం పడుతోంది. ‘‘తిరువూరులో అయ్యప్ప స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు, అంబేడ్కర్ గురుకులం ఎదురుగా బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు. తియ్యమని చెప్పాను. బేరం మొదలు పెట్టారు. నెలకి లక్షన్నర.. బహుశా కల్తీ మద్యం అమ్ముతున్నారేమో’’ అంటూ ఎమ్మెల్యే పెట్టిన స్టేటస్ సంచలనంగా మారింది. పార్లమెంటు ముఖ్యనేత ప్రోద్బలంతో ఎక్సైజ్ అధికారులు సైతం రూ.5.లక్షలు తీసుకుని, నిబంధనలను తుంగలో తొక్కి బార్‌కు లైసెన్సు ఇచ్చినట్లు అక్కడ చర్చ సాగుతోంది. గతంలో సైతం బస్టాండు సమీపంలో, దేవాలయాలకు దగ్గర మద్యం షాపులున్నాయని ఎమ్మెల్యే ధర్నా చేశారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ఇష్టారీతిన మద్యం షాపులు పెట్టారనేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే స్టేటస్‌లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
రైల్వే సిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసే యత్నం
తెనాలిరూరల్/పొన్నూరు: రైల్వేసిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసి రైలులో దోపిడీ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. దీన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. దీంతో వారిపై దుండగులు రాళ్లు రువ్వారు. పోలీసులు పది రౌండ్లు కాల్పులు జరపగా, దుండగులు పరారయ్యారు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి గుంటూరు జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు మంగళవారం విలేకరులకు వివరించారు. నరసరావుపేట జీఆర్పీ ఎస్ఐ రాజమోహనరావు, కానిస్టేబుళ్లు సదా, ఆంజనేయులు సోమవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున సిగ్నల్ టాంపరింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అనుమానితులు తారసపడ్డారు.వారిని ఆపి ప్రశ్నించే ప్రయత్నం చేయబోగా వారు రాళ్లు రువ్వారు. వెంటనే ఎస్ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కాల్పులు జరిపారు. వారు తప్పించుకొని సమీపంలోని పొలాల వైపు పారిపోయారు. ఘటన అనంతరం జీఆర్పీ, ఆర్పీఎఫ్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని డీఎస్పీ అక్కేశ్వరరావు, గుంటూరు ఎస్హెచ్ఓ అంజిబాబు, ఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు పరిశీలించారు. ఘటనా స్థలంలో అనుమానితులు వదిలివెళ్లిన వైర్ కట్టర్ (స్లీవ్ కట్టర్), టెస్టర్, జత గ్లౌజులు స్వా«దీనం చేసుకున్నారు.ఘటనపై తెనాలి రైల్వే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. తమ సిబ్బందికి కనిపించిన ఇద్దరు దుండగులతోపాటు మరికొంత మంది ఉంటారని, అందరి ఆచూకీ గుర్తించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు చెప్పారు. సిగ్నల్ టాంపర్ చేసి రైలు నిలిచిపోగానే దోపిడీకి పాల్పడాలన్నదే దుండగుల ముఖ్యోద్దేశంగా కనిపిస్తున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల కిందట ఇక్కడే దొంగల బీభత్సం ఏప్రిల్ 19న బెంగళూరు–నరసాపురం(07154) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నాలుగు కోచ్‌లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి 11 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాపట్ల–అప్పికట్ల మధ్య ఈ ఘటన జరిగింది. అప్పికట్లలో రైలు ఆపి వారు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. -
జగనన్న హయాంలోనే ‘గండి’ అభివృద్ధి
చక్రాయపేట: వైఎస్ జగన్ హయాంలోనే గండి క్షేత్రం అభివృద్ధి చెందడం సంతోషకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆలయ మహాకుంభాభిషేకం, హనుమజ్జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్, చైర్మన్ వెంకటస్వామి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు.అనంతరం కుంబాభిషేకంలో భాగంగా ఆలయ ఆవరణలో నిర్వహించే పలు పూజా కార్యక్రమాల్లో, గర్భాలయం పైభాగాన కలశ ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో రూ.28.5 కోట్లతో గండి ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఆలయం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రారంభోత్సవానికి నోచుకోలేదన్నారు. ఆలయంతో పాటు రాజగోపురాలు కూడా అత్యంత సుందరంగా తయారయ్యాయని చెప్పారు. పూర్ణాహుతి అనంతరం బుధవారం నుంచి భక్తులకు ఆంజనేయస్వామి మూలవిరాట్ దర్శనం ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా గంగాధర్ అనే భక్తుడు తనకు అనుమతులు ఇప్పిస్తే గండిలో తన సొంత నిధులతో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మిస్తానని కోరగా, దీనికి స్పందించిన ఆయన కలెక్టర్, కమిషనర్‌తో మాట్లాడతానని చెప్పారు. హనుమజ్జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి భక్తులందరికీ ఎంపీ శుభాకాంక్షలు తెలియజేశారు. చక్రాయపేటలోని శ్రీవేంకటేశ్వర రాచరాయస్వామి ఆలయాలకు అనుసంధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన టూరిజం భవనానికి మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. -
పోక్సో కేసులో మహిళా అధికారికి ఐదేళ్ల జైలు శిక్ష
ఒంగోలు: పోక్సో కేసులో ఓ మహిళా ప్రత్యేక అధికారికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు అందించిన వివరాల మేరకు.. 2018 జూన్ 26న ఓ విద్యార్థిని పట్ల అదే విద్యాలయంలో మహిళా ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహిళ అసభ్యకరంగా ప్రవర్తించారు.ఈ ఘటనపై అప్పటి మర్రిపూడి ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషిటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం మహిళా ప్రత్యేక అధికారికి 5 సంవత్సరాల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధించారు. బాధిత విద్యార్థినికి రూ.22 వేలు పరిహారం అందించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
భారీగా తగ్గిన.. విమాన సర్వీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విమాన సర్వీసులు భారీగా తగ్గిపోయాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025–26లో రాష్ట్రంలో విమాన సర్వీసుల సంఖ్య 898 తగ్గినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. 2024–25లో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 63,775 సర్వీసులు నడవగా.. 2025–26లో 62,877కే పరిమితమైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన టీడీపీ నేత కె.రామ్మోహనాయుడు ఉన్నా.. విమాన సర్వీసులు తగ్గిపోవడం గమనార్హం. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు అత్యధికంగా నడిచే విశాఖ, విజయవాడల్లో సర్వీసులు తగ్గిపోయాయి.విశాఖలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ఏకంగా 931 నుంచి 772కు పడిపోగా.. మొత్తంగా 22,210 నుంచి 21,711కు తగ్గిపోయాయి. విజయవాడలో దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు సంఖ్య 18,558 నుంచి 17,112కు, రాజమండ్రిలో 8,441 నుంచి 8,047కు పడిపోయాయి. మరోవైపు ప్రయాణికుల సంఖ్యలో మాత్రం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రం నుంచి 62.28 లక్షల మంది వివిధ ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 5.54 శాతం అధికం.ఈ వృద్ధి కోస్తాంధ్రలో తక్కువగా ఉంటే.. రాయలసీమలో ఎక్కువగా ఉంది. 2024–25లో కడప నుంచి 52,745 మంది ప్రయాణించగా.. ఆ సంఖ్య 2025–26లో 70,450కి పెరిగింది. అలాగే తిరుపతిలో ప్రయాణికుల సంఖ్య 9,95,640 నుంచి 11,96,176కు చేరింది. రాష్ట్రంలో ముఖ్యమైన విశాఖపట్నం విమానాశ్రయం వృద్ధి 0.4 శాతానికి పరిమితమయ్యింది. విశాఖ నుంచి ప్రయాణించిన వారి సంఖ్య 29.55 లక్షల నుంచి 29.67 లక్షలకు మాత్రమే పెరగ్గా, విజయవాడలో ప్రయాణికుల సంఖ్య 13.88 లక్షల నుంచి 14.11 లక్షలకు పెరిగింది. -
బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణ్యం
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) పరిధిలో గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని చిన్న తరహా కాంట్రాక్టర్లు మంగళవారం విజయవాడ ధర్నా చౌక్‌లో ఆందోళన చేశారు. మొదట పనులు చేసిన వారికి మొదట బిల్లులు చెల్లించే విధానం అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. పనులు మొదలు పెట్టక ముందే బడా కార్పొరేట్ సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో దోచిపెడుతున్న సర్కారు తమకు మాత్రం పనులు పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణం బిల్లులు చెల్లించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.మార్చిలో ధర్నా చేస్తే ఏప్రిల్ పదికల్లా చెల్లిస్తామన్నారు..దాదాపు 750 మంది చిన్న తరహా కాంట్రాక్టర్లకు రూ.1,050 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా సర్కారు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం విడుదల చేసిన రూ.707 కోట్లలో మొబిలైజేషన్ అడ్వాన్స్‌లతో కలిపి రూ. 562 కోట్లు కార్పొరేట్ సంస్థలకే ప్రభుత్వం చెల్లించిందని దుయ్యబట్టారు. చిన్న తరహా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల్లో పది శాతం కూడా చెల్లించలేదన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం తాము మార్చి 25 నుంచి 31 మధ్య ఆరు రోజుల పాటు ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టినప్పుడు ఏప్రిల్ 10 కల్లా డబ్బులు విడుదల చేయనున్నట్టు అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.బిల్లుల చెల్లింపు ఆలస్యంతో సమస్య జఠిలంబిల్లుల చెల్లింపులో సర్కారు ఆలస్యం చేయడంతో జలజీవన్ మిషన్ 2.0 మార్గదర్శకాలు మారిపోయి, తమ సమస్య మరింత జఠిలంగా మారిందని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. జలజీవన్ మిషన్ తాజా మార్గదర్శకాల ప్రకారం బిల్లుల చెల్లింపులు జరగాలంటే.. పాత బిల్లులను మళ్లీ కొత్త పద్దతిలో అప్లోడ్ చేయాలంటున్నారని, దానికి సంబంధించిన విధివిధానాలూ తమకు తెలియదని అధికారులు సమాధానమిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన చేశారు. తమ బిల్లుల చెల్లింపు పూర్తయ్యే వరకు కొత్త బిల్లులు ప్రాసెస్ వద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నాలో నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోనేరు శ్రీనివాస్ ప్రసాద్, అసోషియేషన్ అధ్యక్షులు రామలింగరాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శులు శేషగిరిరావు, రాజు, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.జనసేన కార్యాలయం వద్ద కాంట్రాక్టర్ల ఆందోళన ’కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న జలజీవన్ మిషన్ (జేజేఎం) బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పలువురు అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఆస్తులు కుదవబెట్టి పనులు చేశామని, బిల్లులు రావడం లేదని ఆవేదన చెందారు. మంత్రి పవన్‌కళ్యాణ్‌ను కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. తక్షణం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 16న మంత్రి అందుబాటులోకి వస్తారని, అప్పుడు కలిసే అవకాశం కల్పిస్తామని పార్టీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. -
తెలంగాణకు 23 ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో కనీస నిల్వమట్టానికి (ఎండీడీఎల్) ఎగువన మిగిలి ఉన్న 5.27 టీఎంసీల జలాలను పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. నాగార్జునసాగర్ జలాశయంలో ఎండీడీఎల్‌కి ఎగువన 28.21 టీఎంసీల నిల్వలు మిగిలి ఉండగా, ఏపీ తాగునీటి అవసరాలకు కుడి కాల్వ ద్వారా 10 టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించింది. మిగిలిన 18.21 టీఎంసీలను సాగర్ ఎడమ కాల్వ ద్వారా తెలంగాణకు విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 23.48 టీఎంసీల జలాలను త్రిసభ్య కమిటీ కేటాయించింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కంబోజ్ అధ్యక్షతన మంగళవారం జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. వేసవి తాగునీటి అసవరాల కోసం ఇరు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులపై ఈ భేటీలో చర్చించారు. వేసవి అవసరాలకు విన్నపాలు: మే 31 నాటికి ఉండనున్న తమ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి కాల్వకు 10 టీఎంసీల జలాలను విడుదల చేయాలని గతంలో కృష్ణా బోర్డుకు ఏపీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు, హైదరాబాద్ నగరం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 13 టీఎంసీలు.. మొత్తంగా 18 టీఎంసీల జలాలను జూలై చివరి నాటికి వాడుకుంటామని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కాగా ఏపీ విజ్ఞప్తిపై మంగళవారం నాటి భేటీలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో 1112.66 టీఎంసీల కృష్ణా జలాలు లభ్యతలోకి ఉండగా, ఏపీ ఇప్పటికే ఏకంగా 771.25 టీఎంసీలు (74.23శాతం) వాడుకుందని కమిటీ దృష్టికి తెచ్చింది. అయితే వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ పరస్పరం సహకరించుకోవాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సూచించడంతో ఈ మేరకు కేటాయింపులకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. -
పోలీసులు వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్యాయత్నం
కర్నూలు: పోలీసుల వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు బాలాంజనేయులు అలియాస్ బాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పాత ఆర్టీఓ కార్యాలయం పక్కనున్న కమలానగర్లో నివాసం ఉంటున్న బాలు ఇంటికి మంగళవారం మధ్యాహ్నం కర్నూలు మూడో పట్టణ క్రైం పార్టీ పోలీసులు వెళ్లి సీఐ పిలుస్తున్నాడు.. రావాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో బాలాంజనేయులు ఇంట్లో ఉన్న కత్తితో చేయి కోసుకున్నాడు. భారీగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.గత ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో ఈయనపై మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల ఓ చికెన్ సెంటర్ మహిళతో గొడవకు సంబంధించి పోలీసులు బాలును స్టేషన్‌కు రావాలంటూ బెదిరిస్తున్నారు. దీంతో తాను ఎలాంటి తప్పు చేయకపోయినా టీడీపీ నాయకుల ఒత్తిడితోనే వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్రమంగా సారా, డ్రగ్స్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఎస్వీ మోహన్‌రెడ్డి పరామర్శ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి బాధితుడు బాలాంజనేయులును పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినప్పటికీ పోలీసులు వేధిస్తున్నారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని, పోలీసుల వైఖరిని ఎండగడతామని ఎస్వీ మోహన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. -
భగ్గుమన్న ఆక్వా రైతులు
సాక్షి, అమరావతి/పాలకొల్లు సెంట్రల్/ఒంగోలు సబర్బన్: ఆక్వా ఫీడ్ కంపెనీలు భారీగా ధరలను పెంచడంపై ఆక్వా రైతులు భగ్గుమన్నారు. ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన గళం విప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మేత బస్తాలకు నిప్పుపెట్టారు. ధరల పెంపు అమల్లోకి వచ్చాక అడ్డుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డారు. ప్రభుత్వానికి తెలియకుండా కంపెనీలు ఏకపక్షంగా ఫీడ్ ధరలు ఏ విధంగా పెంచుతాయని నిలదీశారు. మేత బస్తాలకు నిప్పుపెట్టి.. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అనుమతి లేకుండానే ఫీడ్ కంపెనీలు మేత ధరలను టన్నుకు రూ.8,420 నుంచి రూ,10,530 వరకు పెంచడాన్ని నిరసించారు. మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు ఫీడ్ ధరలు పెంచిన కంపెనీల ఏకపక్ష ధోరణిపై కన్నెర్రజేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. పెంచిన ఫీడ్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవడంతో పాటు కనీస గిట్టుబాటు ధరలు కల్పించకపోతే సాగు సమ్మెకు దిగుతామని నరసాపురం, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాలకు చెందిన రైతులు అల్టిమేటం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. మేత బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఎదుట రొయ్య రైతులు ధర్నా చేశారు. ఫీడ్ కంపెనీలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీడ్ తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు పెరగలేదని.. సోయా మీల్ ధర కిలోకు రూ.100 నుంచి రూ.35కు తగ్గాయని చెప్పారు. వేట నిషేధ వేళలో ఏటా పెరిగే ఫిష్‌మీల్ ధరలను సాకుగా చూపి ధరలు పెంచడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఫీడ్ కంపెనీలన్నీ టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వానికి చెప్పకుండా, పెద్దల అనుమతి లేకుండా ఏ విధంగా ఫీడ్ ధరలు పెంచుతాయని సంఘం నేతలు ప్రశ్చించారు. తక్షణం పెంచిన ఫీడ్ ధరలను ఉపసంహరించుకోవాలని, అప్సడా అనుమతి లేకుండా ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఇలాగైతే క్రాప్ హాలిడే ప్రకటిస్తాం ఆక్వా ఫీడ్ ధరలను కంపెనీలు ఏకపక్షంగా పెంచడాన్ని నిరసిస్తూ ఆగస్టు 1 నుంచి సెపె్టంబర్ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా క్రాప్ హాలిడే ప్రకటించాలని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నిర్ణయించింది. మంగళవారం పాలకొల్లులో నిర్వహించిన అత్యవసర సమావేశంలో సంఘాధ్యక్షుడు గొట్టుముక్కల గాం«దీభగవాన్రాజు మాట్లాడుతూ.. వనామీ రొయ్య ఫీడ్‌పై కేజీకి రూ.8, టైగర్ రొయ్య ఫీడ్‌పై రూ.10 పెంచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముడిసరుకు ధరలు తగ్గినప్పుడు ధరలు తగ్గించని కంపెనీలకు, ఇప్పుడు పెంచాలనే ఆతృత ఎందుకని ప్రశ్చించారు. ప్రభుత్వం కూడా రైతుల కంటే కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కంపెనీలతోపాటు ప్రభుత్వంతోనూ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తొలుత ధరలు పెంచిన కంపెనీలను బహిష్కరించాలని, ఫ్యాక్టరీల వద్ద ధర్నాలు చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆక్వా సంఘం కార్యదర్శి బోణం చినబాబు, రంగయ్య నాయుడు, జాన్‌రాజు పాల్గొన్నారు. నేడు ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలతో భేటీ ఆక్వా రైతుల ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పందించారు. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సాగు వ్యయాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ధరల పెంపు మరింత భారంగా మారుతుందన్నారు. అప్సడా చట్టం ప్రకారం రైతు సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా పెంచేశాయని ఆరోపించారు. పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ అంశంపై రైతు సంఘాలు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో బుధవారం సమావేశమై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మేత ధరల పెంపును అడ్డుకోవాలి మేత ధరల పెంపును అడ్డుకోవాలని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టైగర్ రొయ్యల మేతపై టన్నుకు రూ.10,530, వెనామీ రొయ్యల మేత ధర రూ.8,420 చొప్పున పెంచడంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందన్నారు. ఇప్పటికే వైరస్‌లతో దిగుబడులు రాక, కౌంట్ ధరలు పతనమై అల్లాడుతున్న ఆక్వా రైతులకు ఈ ధరల పెంపు అశనిపాతంగా మారిందన్నారు. తక్షణమే అప్సడా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మేత ధరలను పూర్తిస్థాయిలో ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఆక్వా రైతులతో సంప్రదించకుండా మేత ధరలు పెంచడాన్ని ఏపీæ కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు బి.బలరామ్, కార్యదర్శి ఎం.హరిబాబు తప్పుబట్టారు. మూడు నెలల్లో రెండోసారి ధరలు పెంచడం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్లుగా రొయ్య రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పెంచిన ఫీడ్ ధరలతో పాటు ఫిబ్రవరిలో పెంచిన ధరలను కూడా పూర్తిగా ఉపసంహరింప చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
అభిమానం.. అనంతం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్ర, అనంతపురం జిల్లా పామిడికి చెందిన వైఎస్సార్సీపీ నేత వీరాంజనేయులు కుమార్తె, ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్పర్సన్ లిఖితలకు ఇటీవల వివాహమైంది. మంగళవారం పామిడిలో నిర్వహించిన వీరి రిసెప్షన్‌కు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేశారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కడికి భారీగా చేరుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. అంతకు ముందు వేదిక ప్రాంతానికి వస్తుండగా దారిపొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. వారందరికీ వైఎస్ జగన్ చిరునవ్వుతో అభివాదం చేశారు. యువతతో కరచాలనం చేస్తూ, చిన్నారులను ముద్దాడుతూ ముందుకు సాగారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డితో పాటు పార్టీ నేతలు పలువురు వధూవరులను ఆశీర్వదించారు. -
అమరావతిలో భూదందా
ఇల్లెందు: ‘ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతుందన్నట్టు..’ గా అమరావతి రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం తీరు అలా ఉందని రైతు ఉద్యమనేత వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరుగుతున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం (మాస్‌లైన్ అనుబంధం) జాతీయ మహాసభలు మంగళవారం రెండోరోజుకు చేరాయి. ఈ సభలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రాజధాని పేరిట ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి సేకరించిందని తెలిపారు.ఆ భూమిలో రాజధాని నిర్మాణం చేపట్టకపోగా మరో 20 వేల ఎకరాలు ఇస్తే రాజధానిని నిర్మిస్తామని చెబుతుండడంపై ఎవరూ నమ్మలేని పరిస్థితి నెలకొందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం కాబోతోందన్నారు. దీన్ని కాపాడుతామని ఎన్నికల ముందు చెప్పిన నేతలు.. ఇప్పుడు మోదీ సర్కార్‌కు తలొగ్గి ఇష్టారాజ్యంగా కార్పొరేట్ సంస్ధలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కాగా, అమరావతిలో మరోమారు భూములు తీసుకునేందుకు సాగుతున్న యత్నాలపై తమతోపాటు కలిసి వచ్చే శక్తులతో పోరాటం సాగించనున్నట్టు శోభనాద్రీశ్వరరావు తెలిపారు.తొలుత అఖిల భారత ఐక్య రైతు సంఘం సభల్లో ఆయన మాట్లాడుతూ దేశంలో మోదీ నేతృత్వాన ఫాసిస్టు పాలన సాగుతోందని, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లోని కారి్మకుల మాదిరిగా రైతాంగం ఐక్యతను ప్రదర్శించకపోవడం వల్లే హక్కులు సాధించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. దేశంలోని రైతాంగాన్ని ఐక్యం చేసి బలమైన ఉద్యమాలు నిరి్మంచాలని ఆయన సూచించారు. -
ఆక్వా మేత ధరల వెనుక భారీ కుంభకోణం
సాక్షి, అమరావతి: ఆక్వారంగ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మేత ధరలు పెంచడం దారుణమని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీదిరి అప్పలరాజు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఏకపక్షంగా ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం ఉందని స్పష్టం చేశారు. ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ముడుపులు అందుకుంటూ.. ‘ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారు. ఆక్వా రైతులను దోచుకుతింటున్నారు. ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఫీడ్ కంపెనీల నుంచి ముడుపులు అందుతున్నాయి. అందుకే ధరలను ఏకపక్షంగా పెంచినా అడ్డుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించినా ధరలను ఆ మేరకు తగ్గించలేదు. కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత ఆక్వా ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచారు. ముడిసరుకుల ధరలు తగ్గినా మేత ధరలు తగ్గించలేదు. ఆక్వా ఫీడ్ కంపెనీల మాఫియాకు ప్రభుత్వ పెద్దలు దన్నుగా నిలుస్తున్నారు. ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముడుపులు అందుతున్నాయి. ఆక్వా రైతుల కష్టం టీడీపీ దోపిడీ పాలవుతోంది. ప్రభుత్వానికి తెలియకుండా ధరలు పెంచుతారా? వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆక్వా రైతుల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆక్వా సిండికేట్ ముడుపుల్లో మంత్రి అచ్చెన్నాయుడు వాటా ఎంతో చెప్పాలి. ఇప్పటికే కరెంట్ లేక, డీజిల్ ఇవ్వక ఆక్వా రైతులు కుదేలయ్యారు. వారిపై ఫీడ్ ధరల పెంపు మరో పిడుగుపాటుగా పరిణమించింది. ధరలను తక్షణం తగ్గించకపోతే ఆక్వా రైతుల తరఫున ఉద్యమిస్తాం’ అని కన్నబాబు, కాకాణి, అప్పలరాజు హెచ్చరించారు. -
రేపు ‘చలో మామిళ్లపల్లి’కి వైఎస్సార్సీపీ పిలుపు
సాక్షి, తాడేపల్లి: మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ స్పందించింది. మొక్కజొన్న రైతులకు అండగా నిలిచేందుకు రేపు(మే 13, బుధవారం) చలో మామిళ్ళపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర దళారీలకే గ్యాంగ్‌స్టర్‌గా మారారంటూ మండిపడ్డారు.‘‘మొక్కజొన్న రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. పంటను దాచుకున్న రైతులపై దాడులు చేయించారు. మామిళ్ళపల్లిలో రైతుల గోదాముపై దాడి చేయటం దారుణం. మొక్కజొన్నకు కేంద్రం రూ.2,400 మద్దతు ధర ప్రకటిస్తే నరేంద్ర మాత్రం రూ.1,652కే కొనుగోలు చేస్తున్నారు. తన సంగం డెయిరీకి అనుబంధ సంస్థల కోసం అతి తక్కువకే కొంటూ రైతులను మోసం చేస్తున్నారు. తనకు మొక్కజొన్న అమ్మకపోతే దాడులు చేయిస్తారా?. టీడీపీ మండల స్థాయి నేతలే ఈ దాడుల్లో పాల్గొన్నారు. అది నా గోదామని ధూళిపాళ్ళ అబద్దాలు చెప్తే అధికారులే నమ్మలేదు. దాడులు చేసిన 31 మంది టీడీపీ నేతలపై కేసులు కూడా పెట్టారు. దీంతో ఎమ్మెల్యే నరేంద్ర మైండ్ బ్లాంక్ అయింది..అధికారుల మీద ఒత్తిడి చేసి ప్రతీకారంగా మా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. మొక్కజొన్న దాచుకున్న ఐదుగురు రైతులు సహా మొత్తం 15 మంది రైతులపై కేసులు పెట్టించారు. కర్ణాటక, తెలంగాణలో మొక్కజొన్నకు రూ.2400 కొంటుంటే ఏపీలో ఎందుకు కొనటం లేదు?. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని తీసుకురావద్దు. అక్రమంగా నిల్వలు ఉంచిన ధూళిపాళ్ళపై డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించడం లేదు?. అప్పట్లో సీజ్ ద షిప్ అన్నట్టుగా ఇప్పుడు సీజ్ ద సంగం డెయిరీ అని ఎందుకు అనటం లేదు?’’ అంటూ అంబటి మురళీకృష్ణ దుయ్యబట్టారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం
సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది.ఇవాళ (మంగళవారం) పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. -
మా నాన్న టీడీపీ ఎమ్మెల్యే.. నీ భర్తను నాకిచ్చేయ్!
‘‘మా నాన్న అధికార పార్టీ ఎమ్మెల్యే.. పోలీసులు నా మనషులే.. ఏమనుకుంటున్నావ్.. నేను తల్చుకుంటే నిన్ను, నీ భర్తను ఏమైనా చేయగలను’’ అంటూ అంటూ టీడీపీ మహిళా నేత ఒకరు బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు.. తన కాపురం చెడగొట్టద్దని వేడుకంటే చంపేస్తానని బెదిరిస్తోందని వాపోతోందామె. సాక్షి, పల్నాడు జిల్లా: నరసరావుపేట పట్టణానికి చెందిన కర్లకుంట కృష్ణదీప్తి తాజాగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్)ను ఆశ్రయించింది. టీడీపీకి చెందిన మల్లవరపు అభినయ సింధూర తన కాపురంలో నిప్పులు పోసిందని.. గట్టిగా నిలదీస్తే తెలుగు దేశం పెద్దలు పేర్లు చెబుతోందని చెబుతోంది. ‘‘నా భర్త కాళీ.. ముగ్గురు సంతానంతో సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యేగారి కూతురునంటూ 10 నెలల కిందట మల్లవరపు అభినయ సింధూర నా భర్తకు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె మోజులో పడి నా భర్త ఇంటికి కూడా రాలేదు. ఆయన్ని వదిలేయాలని బతిమాలితే.. ‘నేను ఎమ్మెల్యే గారి అమ్మాయిని. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మా మావయ్య’ అని బెదిరిస్తోంది. నా భర్తకు విడాకులివ్వాలని నాపై ఒత్తిడి చేస్తోంది. మాట వినకపోతే నా భర్తను అక్రమ కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తోంది. నన్ను, నా బిడ్డలను చంపేస్తానంటోంది.. .. హానీ ట్రాప్ లేడీలా వ్యవహరిస్తున్న సింధుర మీద టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ ప్రభాకర్ కౌన్సెలింగ్ నిర్వహించి నా భర్తను కూడా మందలించారు. మనసు మార్చుకున్న నా భర్త.. మా కోసం దిగివచ్చాడు. దీంతో రేప్ కేసు పెడతానంటూ సింధూర నా భర్తపై బెదిరింపులకు దిగింది. నీ భార్యను వదిలి రాకపోతే ఆత్మహాత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తోంది. అయినా వినకుంటే నన్ను హత్య చేయిస్తానని నా భర్తకు నరకం చూపిస్తోంది. ఇప్పటికే మేం ఆర్థికంగా దెబ్బతిని.. అప్పులలో కూరుకుపోయామని ఉన్నాం. మా బతుకు మమ్మల్ని బతుకనీయండి అని వేడుకున్నా సింధూర కనికరించడం లేదు. అధికార పార్టీ నేతల అండ దండలు చూసి ఆమె రెచ్చిపోతోంది. ఆమె నుంచి మాకు ప్రాణహని ఉంది. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అని ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో బాధితురాలు కృష్ణదీప్తి పేర్కొంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
బెంగళూరుకు క్యూ కడుతున్న ఏపీ ప్రజలు.. కారణం ఇదే
నంద్యాల జిల్లా: అధికారంలో ఉన్నామని, తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. పేదలకు ఉపాధిహామీ పథకాన్ని దూరం చేస్తూ కరువు శాసనం రాశారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వీరి వెంట చిన్నారులు, వృద్ధులు వస్తున్నారు. డోన్ మండలం జగదుర్తి గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 1,200 మంది ఉండగా వీరిలో అత్యధికమంది పేదలు. వేసవి కాలంలో వీరికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అండగా నిలిచాయి. ఈ పథకం లక్ష్యం నీరుగార్చేందుకు టీడీపీ నాయకులు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం మేటీ, ఫీల్డ్ అసిస్టెంట్ పదవుల కోసం పోట్లాడుతూ పేదలకు పనులు కల్పించకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో జగదుర్తి గ్రామస్తులు చాలా మంది పనుల కోసం ఆదివారం గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్తేందుకు డోన్ రైల్వేషన్కు వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, దొంగ మస్టర్లతో కూలీల డబ్బులు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు వలస వెళ్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏపీఎం సుకూర్‌ను ప్రశ్నించగా జగదుర్తి పంచాయతీ పరిధిలో ఉపాధి హామీపనులు ఇంతవరకు జరగని మాట వాస్తవమని పేర్కొన్నారు. గ్రామ పెద్దలతో చర్చించి కూలీలు పనుల కోసం వలస వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. -
బాబూ.. అది పుష్పక విమానం కాదు..
విశాఖపట్నం: సాగర తీరంలో ఈ యువకుల ప్రయాణం చూస్తుంటే.. అది బైకులా కాకుండా అందరూ ఇట్టే ఇమిడిపోయే ‘పుష్పక విమానం’లా కనిపిస్తున్నట్టుంది. నిబంధనల ప్రకారం ఇద్దరికే చోటున్నా, ఏకంగా నలుగురు ఎక్కి ‘చతుర్ముఖ’ ప్రయాణంతో ట్రాఫిక్ రూల్స్‌ను నడిరోడ్డుపై గాలికొదిలేశారు. అటు హెల్మెట్ లేదు.. ఇటు భద్రతా లేదు.. కేవలం సరదా కోసం ప్రాణాలను పణంగా పెడుతూ చేస్తున్న ఈ సాహసం ఏ మాత్రం అదుపు తప్పినా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుంది. -
మద్యం మానిపిస్తే ఆత్మహత్య చేసుకుంటా..
విశాఖపట్నం జిల్లా: మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ వ్యక్తి, పునరావాస కేంద్రానికి తరలిస్తుండగా నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. బలవంతంగా మద్యం మానిపిస్తే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని అలజడి సృష్టించాడు. రిహాబిలిటేషన్ కేంద్రానికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ద్విచక్ర వాహనం పైనుంచి దిగిపోయి, ఆర్టీసీ బస్సు కింద పడుకుని నానా యాగీ చేశాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం సమీపంలోని బాజీ జంక్షన్‌కు చెందిన భార్గవ్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో అతడికి మద్యం మానిపించేందుకు చినముషిడివాడలోని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. అయితే సుజాతనగర్ బీఆర్టీఎస్ రహదారిపై ఒక్కసారిగా వాహనం దిగిపోయిన భార్గవ్.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపేశాడు. వెంటనే బస్సు కింద పడుకుని, తనను కేంద్రానికి తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని భీష్మించాడు. దీంతో ప్రయాణికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి, అతడికి మెరుగైన మానసిక చికిత్స అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. -
ఎదుటివారికి చెప్పేటందుకేనా ప్రధాని నీతులు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికి అంతా ఊహిస్తున్న సందేశం ఇచ్చేశారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత మోదీ కొన్ని చర్యలు చేపడతారని ,అవి ప్రజలపై భారం మోపేవిగా ఉండక తప్పదని భావించారు. హైదరాబాద్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ఆయన పలు అంశాలు ప్రస్తావించి అసలు సమస్య కూడా చెప్పేశారు. ఆయన చెప్పినవి సూచనలుగా తీసుకుంటారా? లేక జరగబోయే పరిణామాలుగా తీసుకుంటారా అన్నది ప్రజల ఇష్టం.ఒక ఏడాదిపాటు బంగారం కొనవద్దని చెప్పడం నిజంగా సంచలనమైన సంగతే. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పడం అసాధారణమేమీ కాకపోయినా, భవిష్యత్తులో వీటి ధరలు పెంచుతారన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, యూరియా వాడకం నియంత్రించాలని ఇలా తొమ్మిది పాయింట్లపై ప్రజలకు సలహాలు ఇచ్చారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం ఈ చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.వీటన్నిటిని దేశ భక్తితో ముడిపెట్టడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ప్రజలకు వివరించడం తప్పు కాదు. కాని ఆయన కూడా సాధారణ రాజకీయ నేత మాదిరే వ్యవహరిస్తున్నారన్నదే బాధ. ఇంతకాలంగా ప్రధానమంత్రిగా ఉంటూ దేశ ప్రజల అభిమానం చూరగొంటున్న నేతగా ఆయన రాజనీతిజ్ఞుడుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. కాని ఆలా చేయలేకపోతున్నారే అన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడుతోంది.దాదాపు మూడు నెలలుగా గల్ఫ్ లో యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు, ఇరాన్ కు మద్య సాగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచం అంతటా పడుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని మూసివేయడం, ఇతరత్రా అంతర్జాయతీయ పరిణామాలు అందరిని కలవరపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కమర్షియల్ వంట గ్యాస్ ధరను అమాంతం పెంచాల్సి వచ్చింది. అప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని ఊహించారు.కాని శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు ఆ ఊసు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. కేంద్రం తరపున అధికారులు ఎప్పటికప్పుడు ఆయిల్ ధరలు పెరగవని చెబుతూ వచ్చారు. కానీ.. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెల్లడైన వారం రోజులకే అసలు రంగు బయటపడింది. ప్రధాన మంత్రే ఆర్థిక సంక్షోభం గురించి స్వయంగా వివరించారు. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగవచ్చన్నది ఎక్కువ మంది అంచనాగా ఉంది.ఇక ఈ పొదుపు సూత్రాలు చెప్పడానికి ఆయన ఎంపిక చేసుకున్న వేదిక సరైనదేనా అన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. పెట్రోల్ ,డీజిల్ వాడకం తగ్గించుకోండని, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని చెప్పారు. సొంత వాహనాలను వదలి మెట్రో,బస్ లను వాడాలని చెప్పారు. ఆక్షేపణ లేదు. ఈ సమస్య గురించి ఆయనకు ముందుగానే తెలుసు కదా! అలాంటప్పుడు ఇంత భారీ సభను నిర్వహించడం ఎంతవరకు సరి? లక్షల మందిని సమీకరించి, వారందరిని వాహనాలలో తీసుకురావడానికి ఎంత పెట్రోల్, డీజిల్ అవసరం అవుతాయో ఆయనకు తెలియదా?ప్రజలకు పొదుపు మంత్రం చెప్పి, తామేమో ఇలా జనాన్ని పోగు చేయడానికి చమురును వాడవచ్చా! రెండున్నరేళ్ల తర్వాత జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలకోసమో, లేక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కోసమో ఈ సభ పెట్టినట్లు లేదా? అలాగే తెలంగాణలో ఆయన పలు శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు. అది కూడా హైదరాబాద్ నుంచి రిమోట్ ద్వారానే జరిపారు. ఆ పని ఢిల్లీ నుంచి కూడా చేసి ఉండవచ్చు కదా అన్న సందేహానికి అవకాశం ఇచ్చారు. దేశంలోని ఆయా నగరాలలో ప్రజా రవాణా అంత మెరుగ్గా లేదన్న సంగతి ఆయనకు తెలుసు కదా!ముందుగా దానిని మెరుగు చేయకుండా బస్సుల్లో వెళ్లండి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది. మోదీ చెప్పిన సూత్రాలలో బంగారం కొనుగోలు చేయవద్దని చాలా ముఖ్యమైన ప్రకటనగా కనిపిస్తుంది. ఇది మహిళల సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రత్యేకించి హిందూమతం అంటూ నిత్యం జపం చేసే బీజేపీ ఈ ప్రతిపాదన చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. దీని ప్రభావం దేశ వ్యాప్తంగా బంగారం షాపులపై ఉంటుంది. నిజంగానే ప్రజలు బంగారం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం మానివేస్తే దాని విపరిణామాలు కూడా గణనీయంగానే ఉంటాయి. కొన్నివేల గోల్డ్ షాపులు దెబ్బతింటాయి.వేలాది మంది ఉద్యోగాలకు గండం ఏర్పడుతుంది. ఇన్నేళ్లుగా ఆత్మనిర్భర్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న విధానాలు పెద్దగా ఫలించడం లేదని ఆయన చెప్పినట్లుగా ఉంది. గోల్డ్ బాండ్ల పేరుతో ప్రజల నుంచి నిధుల సేకరణ కూడా ఫలితం ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలని అన్నారు. బాగానే ఉంది. కాని తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో ఎన్నివేల కోట్ల అప్పు చేస్తున్నది మోదీకి తెలియదా? అక్కడ నిర్మాణాల కోసం ఈ మధ్య కొన్ని కోట్ల లీటర్ల డీజిల్ ను మళ్లించే యత్నం చేయడంపై కేంద్రం అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టి, పొదుపుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పి ఉంటే బాగుండేది కదా!హైదరాబాద్‌లో స్వయంగా చంద్రబాబు ఇంటికి ప్రధాని వెళ్లారు కదా! ఆ సందర్భంగా ఏపీలో జరుగుతున్న దుబారా గురించి కూడా సలహా ఇచ్చి ఉంటే బాగుండేదేమో! చదరపు అడుగుకు రూ.18 వేల వరకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వంగా ఏపీ రికార్డు సాధిస్తోంది.ఈ నిర్మాణాలలో ఎన్ని రకాల సరుకులను విదేశాల నుంచి తెప్పిస్తోందో తెలియదు. ఒక్క అద్దాలకే రూ.2540 కోట్లు వెచ్చించబోతున్నారే. అవన్ని ఇండియాలో తయారయ్యేవా? లేక దిగుమతి చేసుకోవల్సి ఉంటుందా? వంట నూనెలు తగ్గించుకోవాలని కూడా మోడీ సలహా ఇచ్చారు.ఇన్నేళ్ల పాలనలో వంట నూనెల విషయంలో కూడా దేశం స్వయం సమృద్ధి సాధించలేకపోవడం అవమానమే. రైతులు యూరియా వాడకం తగ్గించాలని అన్నారు. ఉక్రెయిన్,రష్యా యుద్దం మూడేళ్లుగా జరుగుతోంది. త్వరలో ముగుస్తుందని చెబుతున్నారు. ఈ దశలో యూరియా గురించి మోడీ జాగ్రత్తలు చెబుతున్నారు. సేంద్రీయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువులు అందుబాటులో ఉంటే రైతులు తప్పనిసరిగా మార్చుతారు. అది చేయకుండా యూరియా వాడవద్దంటే, పంటలు సరిగా పండకపోతే రైతులకు కలిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ప్రజలు విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు. ఇదేదో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి ఉండాల్సింది. ఈ మధ్య కాలంలో చిత్రమైన శిక్షణల పేరుతో మంత్రులు, అధికారులను బృందాలుగా సింగపూర్ పంపుతున్నారు. దీనివల్ల ఏపీకి కలిసి వచ్చేది ఏమి ఉందో ఎవరికి తెలియడం లేదు.ప్రభుత్వ ఖజానా పై కోట్ల భారం పడుతోంది.వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగుల గురించి కూడా ప్రధాని సూచన చేశారు. ఇప్పటికే అలాంటివి జరుగుతున్నాయి. కాని వాటివల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మామూలు రోజుల్లో ప్రధాని ప్రజలకు ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటే తప్పక చిత్తశుద్ది అర్ధం అవుతుంది.కాని ఎన్నికల సమయంలో ఒక రకంగా ,ఆ తర్వాత మరో రకంగా వ్యవహరిస్తుండడమే విమర్శలకు దారి తీస్తుంది.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు డాలర్‌తో రూపాయి విలువను పోల్చి విమర్శలు చేసిన మోడీ, అప్పటికన్నా విలువ దాదాపు రెండు రెట్లు తగ్గినా ఇంతవరకు మాట్లాడలేదు.ప్రధాని చెప్పిన నవ సూత్రాలపై లోక్ సభ లో విపక్ష నేత రాహోల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం అని, ప్రధాని అయిన 12 ఏళ్లకు ఈ స్థితికి దేశాన్ని దిగజార్చారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ యుద్దం, కరువు పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు వారానికి ఒక పూట ఉపవాసం చేయాలని విజ్ఞప్తి చేశారు. దానిని ఆయన తొలుత తన కుటుంబం నుంచే ఆచరించి చూపారు.తద్వారా దేశభక్తి అంటే ఏమిటో తెలియచేశారు. అలాగే ముందుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు దేశభక్తిని నిజమైన రీతిలో ఆచరించి,అప్పుడు ప్రజలకు చెబితే ఆదర్శవంతంగా ఉంటుంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గుంటూరు: నిడబ్రోలులో కాల్పుల కలకలం
సాక్షి, గుంటూరు: నిడబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. రైల్వే సిగ్నల్ దగ్గర దుండగులు కాల్పులు జరిపారు. సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో జీఆర్పీఎఫ్ పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. నిడుబ్రోలు సమీపంలో రైల్వే సిగ్నల్స్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గస్తీ కాస్తున్న జిఆర్పీ పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు.ఈ క్రమంలో పోలీసులు.. పది రౌండ్లు కాల్పులు జరిపారు. సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ పాల్పడితే కాల్పులు జరుపుతామని గతంలో జీఆర్పీఎఫ్ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇదే మార్గంలో నెల రోజుల క్రితం రైలు ఆపిన దొంగలు.. దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో జీఆర్పీఎఫ్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. -
బీ‘టెక్’ చోరుడు!
చిత్తూరు అర్బన్: మహేష్ బాబు బీటెక్. వయసు 22. బెట్టింగుల వ్యసనం అతడిని చోర శిఖామణిగా మార్చేసింది. పగలంతా కళాశాలకు వెళ్లి చదువుకోవడం.. రాత్రివేళ చోరీలు చేయడం అలవాటుగా మార్చుకున్న అతగాడు చివరకు పోలీసులకు చిక్కాడు. చిత్తూరు ఎస్పీ తుషార్‌డూడీ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్ పురం మండలం కన్యకాపురానికి చెందిన మహేష్ బాబు తిరుపతిలో ఉంటూ అక్కడే ఓ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగుల ఉచ్చులో చిక్కుకున్న అతడు తెలిసినవాళ్లు, స్నేహితుల నుంచి అప్పులు తీసుకుని మరీ రూ.లక్షలు పోగొట్టుకున్నాడు.అయినా ఆ వ్యసనం నుంచి బయటకు రాలేకపోయాడు. పందేలు కాయడానికి డబ్బులు లేకపోవడంతో చివరకు దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో చోరీలు చేస్తే పెద్దగా పట్టించుకునే వ్యవస్థ లేదని గ్రహించి.. గ్రామ, వార్డు సచివాలయాల్లో చోరీలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నాడు. రాత్రివేళ సచివాలయాల్లోకి ప్రవేశించి ప్రింటర్లు, ఎల్రక్టానిక్ వస్తువులు చోరీ చేసేవాడు. ఇలా ఎస్ఆర్ పురంలో 5, వెదురుకుప్పంలో 3, గుడిపాలలో 2, జీడీ నెల్లూరులో 2, తిరుపతి జిల్లాలో 5, అన్నమయ్య జిల్లాలో ఒక కేసులో మొత్తం కలిపి 18 కేసుల్లో మహేష్ కుమార్‌ను నిందితుడిగా గుర్తించారు. చోరీ చేసిన వస్తువులను ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు అమ్మేసేవాడు. వేలిముద్రలే పట్టించాయి చోరీలకు పాల్పడిన ప్రాంతాల్లో నిందితుడి వేలిముద్రలను సేకరించిన పోలీసులు ఆధార్ కార్డు నమోదైన వేలి ముద్రలతో సరిపోల్చి నిందితుడిని గుర్తించారు. సోమవారం చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై మఠం క్రాస్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహేష్ బాబును అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.8.10 లక్షల విలువ చేసే ప్రింటర్లు, ద్విచక్ర వాహనం, ఇనుప తలుపులు కత్తిరించే భారీ కట్టర్, ల్యాప్‌టాప్‌లను స్వాదీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపించిన కార్వేటి నగరం సీఐ హనుమంతప్ప, ఎస్ఆర్ పురం ఎస్ఐ సుమన్, సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డు అందచేశారు. ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ తరుణ్ పహ్వా, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, నగరి ఇన్చార్జి పోలీసు అధికారి రాంబాబు, ఎస్బీ సీఐ మురళి ఉన్నారు. -
రూ.10 కోట్లు విలువైన పార్క్ స్థలం కబ్జా..!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గుడి, బడి, ప్రభుత్వ స్థలాలు.. ఇలా దేన్నీ వదలకుండా ఆక్రమించేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి రూరల్ మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామ పంచాయతీకి కేటాయించిన రూ.10 కోట్ల విలువజేసే 1.57 ఎకరాల పార్క్ స్థలాన్ని ఓ టీడీపీ నాయకుడు ఆక్రమించి పట్టపగలే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్క్ స్థలం కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టిస్తున్న వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేకి సమీప బంధువునని చెబుతుండడం వల్ల సదరు ఎమ్మెల్యే స్పందించి నిర్మాణ పనులను నిలిపివేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పుదిపట్ల గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 558లో ఉన్న దరఖాస్తు పట్టా భూమిని గతంలో ఓ ప్రైవేట్ వెంచర్ సంస్థ అభివృద్ధి చేసి పార్క్‌కు కేటాయించినట్టు సమాచారం. ఆ స్థలంపై చాలాకాలం నుంచి కన్నేసిన స్థానిక టీడీపీ నేత ఇప్పుడు అధికార బలంతో స్వా«దీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు తిరుపతి కోర్టును ఆశ్రయించగా, అది పార్కు స్థలమేనని కోర్టు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా రికార్డులు మార్చి ఆక్రమణదారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని, ఆ స్థలంపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తున్నందున కింది కోర్టు ఆదేశాలు ధిక్కరణ కింద చర్యలు కోరతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. -
ఈవీ.. రయ్ రయ్!
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. 2025లో వీటి అమ్మకాలు 23 లక్షలకు పైగా జరిగాయి. మొత్తం కొత్త వాహనాల విక్రయాల్లో ఇది సుమారు 8 శాతం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, కాలుష్యంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కొత్త కంపెనీల ప్రవేశం వంటి కారణాలతో భారత ఈవీ రంగం భారీ మార్పు దిశగా సాగుతోంది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగంలో ఈవీలకు ప్రత్యేక స్థానం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటోలు ఈ మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. భారత్‌లో ఈవీ మార్కెట్‌కు ప్రధాన బలం ఎలక్ట్రిక్ టూ వీలర్లు. మొత్తం ఈవీ అమ్మకాల్లో సగానికి పైగా వాటా వీటిదే. తక్కువ నిర్వహణ ఖర్చు, ఇంధన వ్యయం తగ్గడం, నగర ప్రయాణాలకు అనుకూలత వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలూ గణనీయంగా పెరిగాయి. కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. మధ్యతరగతి వినియోగదారులూ ఇప్పుడు ఈవీలపై ఆసక్తి చూపుతున్నారు. 2025లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 70 శాతానికి పైగా పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. విదేశీ కంపెనీలు కూడా భారత్ మార్కెట్‌పై దృష్టి పెడుతున్నాయి. చార్జింగ్ స్టేషన్లే సమస్య విద్యుత్ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నా చార్జింగ్ స్టేషన్ల విషయంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రస్తుతం దేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు మాత్రమే చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ముందంజలో ఉండగా, ఏపీతో సహా మిగతా రాష్ట్రాల్లో చార్జింగ్ స్టేషన్ల కొరత వేధిస్తోంది. చైనా నుంచి దిగుమతయ్యే బ్యాటరీ ముడి పదార్థాలపై ఆధారపడటం కూడా పరిశ్రమకు పెద్ద సవాల్‌గా మారింది. 2030 నాటికి ద్విచక్ర వాహనాల్లో 80 శాతం, కార్లలో 30 శాతం, బస్సుల్లో 40 శాతం ఈవీలుంటాయని అంచనా. ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులుండగా, 2030 నాటికి భారత ఈవీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే 50 లక్షల వరకు కొత్త ఉద్యోగాలు వస్తాయని నివేదికల్లో వెల్లడైంది. -
బాబు బినామీలకు ‘ప్రైమ్ ప్లాట్లు’ రైతులకు పాట్లు: మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో సామాన్య రైతులకు ఒక నీతి.. చంద్రబాబు బినామీలకు మరో నీతి అమలు చేస్తూ వ్యవస్థీకృత వివక్షకు తెర తీశారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. అమరావతిలో భూములిచ్చిన సామాన్య రైతులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఇస్తే.. చంద్రబాబు అనుచరులకు మాత్రం సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో భూములు కేటాయించారన్నారు. చంద్రబాబు తన ఇంటి పక్కన రైతులు ఎవరూ ఉండకూడదని 3,800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే గ్రీన్ బెల్ట్‌గా మార్చేశారన్నారు.కోర్ క్యాపిటల్ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో తన ప్యాలెస్‌ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు రాజధానిలో అద్దాల పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించిన ఆచరణ సాధ్యమైన ‘మావిగన్’ ప్రతిపాదనను పక్కనపెట్టి చంద్రబాబు కేవలం క్విడ్ ప్రో కో కోసమే అమరావతి తంతు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని మీడియాతో మాట్లాడారు.సామాన్యులకు ఒక నీతి... బాబుకు ఒక నీతి..‘సీఆర్డీఏ నిబంధనలు సామాన్య రైతులకు సంకెళ్లులా మారాయి. రైతులు తమ ప్లాట్లను వారసులకు ఇవ్వటానికి కూడా వీల్లేకుండా నిబంధనలు రాసిన చంద్రబాబు తన బినామీలకు మాత్రం అన్ని రూల్స్ పక్కనపెట్టి మేలు చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏ స్థాయిలో చంద్రబాబు దోచుకుంటున్నారో చెప్పేందుకు ఆయన కడుతున్న ప్యాలెసే నిదర్శనం. నక్కపల్లిలో రూ. 600 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ పొందిన అట్లూరు శ్రీనివాసే చంద్రబాబు ఇల్లు కడుతున్నారు. ఇది క్విడ్ ప్రో కో కాదా? ఏడాదిలోనే బాబు ఇంటి సివిల్ పనులు పూర్తయ్యాయి కానీ రాజధాని భవనాలు మాత్రం అతీగతీ లేవు. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసేందుకు ప్రధానమంత్రి పక్క రాష్ట్రంలో ఉన్న వారి ఇళ్లకు వెళ్లడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం’ అని పేర్ని అన్నారు. రెండో విడత పూలింగ్‌కు వ్యతిరేకం..‘అమరావతి పేరుతో ఇప్పటికే రూ.50 వేల కోట్లు అప్పు చేశారు. 8 నుంచి 10 శాతం వడ్డీకి ఇంకా అప్పు తెస్తున్నారు. కేవలం అద్దాల కోసమే రూ.2,500 కోట్లు ఖర్చు చేయడం ఏ రకమైన అభివృద్ధి? అమరావతిని రాష్ట్రానికి ఒక గుదిబండలా తయారు చేస్తున్నారు. అమరావతిలో రెండో దశ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రైతులు భయపడాల్సిన పనిలేదు. జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆ భూములను నిషే ధిత జాబితా నుంచి తొలగిస్తారు. కేంద్ర మంత్రి పెమ్మ సాని రైతులను గెటవుట్ అని అవమానించడం సిగ్గు చేటు. రూ.వందల కోట్లు పెట్టి మంత్రి పదవి తెచ్చు కున్నంత మాత్రాన రైతులను అవమానించే హక్కు లేదు. రైతుల కళ్లల్లో నీరు రాష్ట్రానికి అరిష్టం. రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో వారిని వేధిస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు’ అని పేర్ని స్పష్టం చేశారు. -
బలవర్ధక బియ్యం లేనట్టే
⇒ పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గత ప్రభుత్వం విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, ఐరన్ కలిపిన బియ్యం పంపిణీ చేసింది. ⇒ ఇది క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిచ్చింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను తగ్గించడంలో కీలక భూమిక పోషించింది. ⇒ తలసేమియా, సికిల్ సెల్, రక్తహీనత వంటి హిమోగ్లోబిన్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారితో సహా ప్రజలందరికీ ఈ బలవర్ధకమైన బియ్యం సురక్షితమని శాస్త్రీయ ఆధారాలతో నిరూపితమైంది. ⇒ ఫోలిక్ యాసిడ్ బాలింతల ఆరోగ్య రక్షణకు ఎంతగానో తోడ్పడింది. చిన్నారుల మెదడు, వెన్నెముక పెరుగుదలకు తోడ్పుతున్నట్టు తేలింది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలకు అందించే సబ్సిడీ రేషన్‌కు చంద్రబాబు సర్కార్ మంగళం పాడేస్తోంది. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే సామాన్యులను ఆదుకోకుండా వేడుక చూస్తోంది. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు మిల్లెట్లు పంపిణీ చేయాలని ఉచిత ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు.. తన జమానాలో చౌకదుకాణాల ద్వారా సరఫరా చేసే బలవర్ధక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్‌ను) నిలిపేస్తుండటం విస్తుగొలుపుతోంది. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గత ప్రభుత్వం విటమిన్లు, ఫోలిక్‌యాసిడ్, ఐరన్ కలిపిన బియ్యం పంపిణీ చేసింది.ఇది క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిచ్చింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను తగ్గించడంలో కీలక భూమిక పోషించింది. అయితే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను (పోషకాహార పదార్థాలతో చేసిన బియ్యం గింజలను) ఎక్కువకాలం నిల్వ ఉంచడం ద్వారా వాటిలోని పోషక ప్రయోజనాలు తగ్గిపోవడం, తయారీదారులు నిబంధనల్ని సక్రమంగా పాటించకపోవడంతో ఆ బియ్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంలేదు. దీనిని సాకుగా చూపి రబీ సీజన్ తర్వాత వచ్చే సీఎంఆర్‌లో సాధారణ బియ్యాన్నే పేదలకు పంపిణీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రేషన్ అక్రమ రవాణాను మరింత సులభతరం చేసి తమ అనుయాయుకుల లబ్ధి చేకూర్చనుంది.సార్టెక్స్‌కు తోడు ఫోర్టిఫైడ్ వైఎస్ జగన్ ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే సంకల్పంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, దేశం ఆశ్చర్యపోయేలా ‘సార్టెక్స్’ చేసిన బియ్యాన్ని ఎండీయూ వాహనాలు పెట్టి మరీ ఇంటింటికీ పంపిణీ చేశారు. అంతకుముందు చంద్రబాబు ఏలుబడిలో చౌకదుకాణాల్లో ఇచ్చే బియ్యం ముక్కిపోయి, పురుగుపట్టి, మట్టి, చెత్తాచెదారాలతో ఉండేవి. లబ్ధిదారులు వాటిని శుభ్రం చేసుకోవడానికి ఒకరోజు కేటాయించాల్సి వచ్చేది.ఆ దుస్థితి నుంచి పేదలకు ఊరటనిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని.. ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిపి అందించడం ప్రారంభించింది. బియ్యం సార్టెక్స్‌కు కిలోకి రూపాయి వెచ్చించి మరీ పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యాన్ని సరఫరా చేసింది. తద్వారా రేషన్ అక్రమ రవాణా చాలావరకు తగ్గిపోయి పేదలు నాణ్యమైన బియ్యాన్ని తినడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు బాబు ప్రభుత్వంలో సార్టెక్స్ నాణ్యత దెబ్బతినడంతో పాటు ఫోర్టిఫైడ్ కలపడాన్ని నిలిపేసి పేదలకు సాధారణ బియ్యాన్ని ఇచ్చేస్తున్నారు. రేషన్ అక్రమ రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా లేకపోతే రేషన్ అక్రమ రవాణాకు అడ్డూఅదుపు ఉండదు. గతంలో సాధారణ బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలపడం ద్వారా సులభంగా రేషన్ బియ్యాన్ని గుర్తించేందుకు వీలుండేది. తద్వారా రేషన్ అక్రమార్కులు తాము సేకరించిన చౌక బియ్యంలోని ఫోర్టిఫైడ్ కెర్నల్స్‌ను తొలగించేందుకు అవస్థలు పడేవారు. ఇప్పుడు సాధారణ బియ్యాన్ని ఇస్తే అక్రమార్కుల దందాకు ఇబ్బందులు ఉండవు. సులభంగా బియ్యాన్ని పాలిష్ పట్టి ఫైన్ వెరైటీస్‌లో కలిపేసి మార్కెట్లో సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వమే అక్రమార్కులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.ప్రపంచం అనుసరిస్తున్న ఫోర్టిఫికేషన్..ప్రస్తుతం రాష్ట్రంలో 1.47 కోట్ల రైస్ కార్డులున్నాయి. ఏటా 25 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలి. ఇక్కడ కేంద్రం బియ్యాన్ని ఉచితంగా ఇస్తుండటంతో చంద్రబాబు సర్కార్ ఆ బియ్యాన్ని మాత్రమే ఇస్తోంది. గతంలో కిలో రూ.67కు అందించే కందిపప్పును నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150కి పైగా పలుకుతుంటే కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. ఇక కిలో రూ.16కే ఫోర్టిఫైడ్ (విటమిన్లు కలిపిన) గోధుమ పిండిని అందిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కిలో రూ.20కి పెంచి అరకొరగా సాధారణ గో«ధుమ పిండి ఇస్తూ ప్రజలను నిలువునా ముంచేసింది. రాగులు, జొన్నల పంపిణీని పూర్తిగా అటకెక్కించి పౌష్టికాహారంపై ఉచిత ఉపన్యాసాలు ఇస్తూ కాలం గడుపుతోంది.ఇలా ఒక్కొక్కటిగా రేషన్ సబ్సిడీలను ఎత్తేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి మంగళం పాడేస్తోంది. అంటే నాణ్యత లేని సాధారణ బియ్యాన్ని మాత్రమే పేదలకు ఇవ్వనుంది. వాస్తవానికి బియ్యం ఫోర్టిíœకేషన్ విధానానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. గ్లోబల్ ఫోర్టిఫికేషన్ డేటా ఎక్సే్ఛంజ్ ప్రకారం 18 దేశాలు బియ్యం ఫోర్టిఫికేషన్‌ను అనుసరిస్తున్నాయి. 147 దేశాలు ఉప్పును ఫోర్టిఫికేషన్ చేస్తుండగా 105 దేశాలు గోధుమ పిండిని, 43 దేశాలు నూనెలను, 21 దేశాలు మొక్కజొన్న పిండిని ఫోర్టిఫికేషన్ చేస్తున్నాయి. -
ఆక్వా గొంతు నులి‘మేత’
సాక్షి, అమరావతి: టీడీపీ ‘మేత’ వన్నె పులులు ‘రొయ్య’ రైతులను దోచుకునేందుకు తెగబడ్డాయి. మీకింత మాకింత అనే ధోరణిలో ధరల పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకుంటున్నాయి. ఆక్వా గొంతు నులిమేస్తున్నాయి. ఆక్వా రంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫీడ్ ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని మండిపడుతున్నారు. తక్షణమే పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెత్తనమంతా..‘టీడీపీ’ ఫీడ్ కంపెనీలదే రొయ్యల సాగులో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుండగా, వెనామి రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర, టైగర్ రొయ్యలకు రెండున్నర చొప్పున సగటున ఏటా 15 లక్షల టన్నుల మేత వినియోగిస్తారు. ఈ లెక్కన ఏటా రూ.15వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. దీంట్లో 50 శాతానికి పైగా వాటా అవంతి ఫీడ్స్‌దే. ఆ తర్వాత 20 శాతం దేవీ ఫీడ్స్‌ది కాగా, మిగిలిన వాటా బీఎంఆర్ (టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు), సంధ్య, సీపీ, ఫెడోరో, ఫాల్కన్ వంటి ఇతర సంస్థలది. వీటిలో మెజార్టీ తయారీ సంస్థలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవే. ఈ కారణంగా వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. పైగా మంత్రులతోపాటు ప్రభుత్వంలోని కీలక నేతలకు నెలవారీగా వాటాల మూటలు వెళ్తుండడంతో ప్రభుత్వంలో ఏ ఒక్కరూ నోరుమెదపలేని దుస్థితి నెలకొందని సమాచారం. రైతులతో చర్చించకుండానే ధరల పెంపు.. వాస్తవంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా) చట్టం ప్రకారం ఫీడ్, సీడ్ కంపెనీలే కాదు.. ఆక్వారంగంలో ఉన్నవారెవరైనా సరే ధరలు పెంచాలంటే అప్సడా అనుమతి తీసుకోవాలి. ధరల పెంపు అనివార్యమైనప్పుడు తొలుత అప్సడా స్టేక్ హోల్డర్స్ (ఆక్వా రైతులు, సంఘాల నేతలు)తో సమావేశమై, వారి అంగీకారంతోనే పెంచాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టాన్ని నిరీ్వర్యం చేసింది. దీంతో కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయి. ఫీడ్ తయారీలో వాడే ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని గతేడాది కేంద్రం 30 శాతం నుంచి 5–15 శాతానికి తగ్గించగా, కొన్ని ఉత్పత్తులకు పూర్తిగా మినహాయించింది. ఈ లెక్కన ఫీడ్ ధరలు టన్నుకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు తగ్గించాలి. కానీ ఆ దిశగా కంపెనీలు ఆలోచన చేసిన పాపాన పోలేదు. ధరలు తగ్గించేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు. నాడు కంటి తుడుపు చర్యగా టన్నుకు ఎమ్మారీ్పపై రూ.4వేలు తగ్గించిన కంపెనీలు ఈ ఏడాది ఫిబ్రవరిలో చెప్పా పెట్టకుండా టన్నుకు మళ్లీ రూ.4వేల చొప్పున పెంచేశాయి. తాజాగా ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో వెనామీ ఫీడ్‌పై రూ.12వేలు, టైగర్ ఫీడ్‌పై రూ.14వేలు పెంపునకు అనుమతినివ్వాలంటూ గతనెల 30న మత్స్యశాఖ కమిషనర్‌కు రొయ్య మేత తయారీ దారుల సంఘం లేఖ రాసింది. స్టేక్ హోల్డర్లతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుందామని కమిషనర్ బదులిచ్చారు. కానీ స్టేక్ హోల్డర్లతో సమావేశం, చర్చలు జరపకుండానే ఏకపక్షంగా ధరలు పెంచాయి. మేత వ్యాపారంలో 50 శాతం వాటా కలిగిన అవంతి ఫీడ్స్ టన్నుకు వెనమి ఫీడ్‌పై రూ.8,420, టైగర్ ఫీడ్ పై రూ. 10,530 పెంచగా.. మిగిలిన కంపెనీలు వెనమి ఫీడ్‌పై రూ.8 వేలు, టైగర్ ఫీడ్‌పై రూ.10 వేలు చొప్పున పెంచాయి. పెట్టుబడిలో సగానికిపైగా మేతకే.. రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా లీజు ధరలను బట్టి టన్ను ఉత్పత్తికి వెనామీ రొయ్యలకు రూ.2.60 లక్షలు, టైగర్ రొయ్యలకు రూ.3.50 లక్షలు, చేపలకు రూ.1.10 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. రొయ్యల సాగులో రూ.1.50 లక్షలు, చేపల సాగులో రూ.75 వేల వరకు మేతకే రైతులు ఖర్చు చేస్తుంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72వేలు ఉండగా, ప్రస్తుతం రూ.లక్షకు పైగా ఉంది. తాజా పెంపుతో మేతధ రలు పన్నులతో కలిపి రూ.1.15లక్షలకుపైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం కాస్తా వెనామీ రొయ్యలపై రూ.2.75 లక్షలకు, టైగర్ రొయ్యలపై రూ.3.75 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2019–24 మధ్యలో కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు సర్కారూ ధరల తగ్గింపునకు కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సిండికేట్‌గా మారి దోచేస్తున్నారు. ఏపీ అప్సడా చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచడానికి లేదు. కంపెనీలన్నీ సిండికేట్‌గా మారి ధరలు ఒక్కసారిగా పెంచాయి. తక్షణమే ఈ పెంచిన ధరలను తగ్గించాలి. –దుగ్గినేని గోపినాథ్, అధ్యక్షుడు, రొయ్య రైతుల సంఘం ప్రకాశం జిల్లా కంపెనీలు ఏకపక్ష ధోరణి తగదు ఫీడ్ తయారీ కంపెనీలకు ఏటా లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏటా పెట్టుబడి ధరలు పెరుగుతున్నాయే తప్ప రైతులకు ఆదాయం మాత్రం పెరగడం లేదు. కేంద్రం ద్వారా వివిధ రకాల రాయితీలు పొందుతున్న కంపెనీలు ఇష్టమొచ్చినట్టుగా ఫీడ్ ధరలు పెంచేస్తూ రైతులను దోచుకుంటున్నాయి. ఇది తగదు. – టి.నాగభూషణం, అధ్యక్షుడు, కోనసీమ రొయ్య రైతుల సంఘం -
మంత్రుల సింగపూర్ పర్యటనకు రూ.95.19 లక్షలు
సాక్షి, అమరావతి: సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం, దేశాధ్యక్ష నాయకత్వంపై శిక్షణ కోసం ఏడుగురు రాష్ట్ర మంత్రులు గతనెల 21 నుంచి 27 వరకు వారం రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. మంత్రుల సింగపూర్ పర్యటన కోసం రూ.95.19 లక్షల అదనపు బడ్జెట్‌ను విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రెజరీ నియంత్రణను సడలించి నిధులు మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
‘శ్రీవాణి’ సొమ్ములు పచ్చముఠాల పాలు!
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి సొమ్ముతో అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. శ్రీవాణి ట్రస్టుకు చెందిన దాదాపు రూ.750 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన 5,000 ఆలయాలు, భజన మందిరాల పనులను టెండర్‌తో సంబంధం లేకుండా టీడీపీ నేతలకు పంచి పెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఏప్రిల్ 16న దేవదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఐదు వేల ఆలయాలు, భజన మందిరాల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు పైబడిన ప్రతి పనిని టెండరు విధానంలో చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం నెల రోజుల క్రితమే ముగిసిన నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికార పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టడమంటే అధికార యంత్రాంగాన్ని ప్రేక్షక పాత్రకు పరిమితం చేయడమేనని దేవదాయ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత ప్రభుత్వం ఆమోదించిన ఆలయాల నిర్మాణాలను రద్దు చేసి.. శ్రీవాణి ట్రస్టు నిధులతో మత్య్సకార, బలహీన వర్గాల కాలనీల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 4,111 ఆలయాల నిర్మాణాలకు పారదర్శకంగా టెండర్లు పిలిచి అనుమతులు మంజూరు చేయగా 622 గుడుల నిర్మాణం అప్పట్లోనే పూర్తయింది. 1,765 ఆలయాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మిగిలిన 1,724 ఆలయాల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. నిర్మాణాలు మొదలు కాని అన్ని ఆలయాల అనుమతులు రద్దు చేయాలని 2024 ఆగస్టు 27న దేవదాయశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈమేరకు 2024 సెపె్టంబరులో దేవదాయ శాఖ అన్ని జిల్లాలకు సమాచారం ఇచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి బోర్డు ఇటీవల ఆమోదం తెలుపగా టెండర్ల విధానంలో కాకుండా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టాలన్న నిర్ణయంపై దేవదాయ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలయాల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో గుడికి వేర్వేరుగా టెండర్లు పిలిచి పూర్తి పారదర్శకంగా అర్హులకు పనులను అప్పగించిందని గుర్తు చేస్తున్నారు.చందాలు పక్కదారి పట్టే ప్రమాదం.. ఆలయాల నిర్మాణ పనులకు స్థానిక అధికార పార్టీ నేతలకు అప్పగించడం అక్రమాలకు దారి తీస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి పెద్ద మొత్తంలో చందాలు ఇచ్చేందుకు భక్తులు, స్థానికులు ముందుకు వస్తుంటారు. అధికార పార్టీ నేతల పర్యవేక్షణలో పనులు చేపడితే చందాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. -
అనంత రైతన్న ఆక్రందన
అనంతపురం: తీవ్ర కరువుబారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని అనంతపురం జిల్లా రైతులు పోరుబాట పట్టారు. వరి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు చీనీ పంటకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం అనంతపురం కలెక్టరేట్‌ను దిగ్బంధించారు. మొక్కజొన్న, వరి పంటలను, ఎండిన చీనీ చెట్లను తోపుడు బండ్లపై పెట్టుకుని నిరసన తెలిపారు.రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎండిపోయిన చీనీ చెట్లే నిదర్శనమని చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులను ఆదుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
కాలేయం కొవ్వెక్కుతోంది
సాక్షి, అమరావతి: మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్లు, జీవనశైలి వంటి కారణాలతో కాలేయ సంబంధిత వ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. మద్యపానం చేసే వారితోపాటు ఆ అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాల్లో ఫ్యాటీ లివర్/మెటబాలిక్ డిస్ఫంక్షన్–అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్డీ) బాధితుల సంఖ్య 143 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, హెపటాలజీపై ఇటీవల ‘ది లాన్సెట్’ ప్రచురించిన అధ్యయనం బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలతో ఫ్యాటీ లివర్ సమస్యలు పెరుగుతున్నట్టు వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం భారత్‌లో 1990లో సగటున లక్ష మందిలో ఫ్యాటీ లివర్ కేసులు 10,191 ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 12,555కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 1990 నుంచి 2023 మధ్య ఫ్యాటీ లివర్ బాధితుల సంఖ్య 143 శాతం పెరిగినట్టు స్పష్టమైంది. దాదాపు ప్రతి ఆరుగురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో సతమతమవుతున్నట్టు తేల్చారు. జీవనశైలి జబ్బులే ప్రధాన కారణం భారత్‌లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతుండడానికి బీపీ, షుగర్, ఊబకాయం వంటి జీవనశైలి జబ్బులే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పట్టణీకరణ పెరిగి, శారీరక శ్రమలేని జీవనశైలి, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం అధికమవడంతో పట్టణాల్లో 32 శాతానికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు నిపుణులు అభిప్రాయడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి అత్యంత వేగంగా పెరుగుతుండటంతో 2050 నాటికి దాదాపు 200 కోట్ల మంది బాధితులు ఉంటారని అంచనా వేశారు.1990–2023 మధ్య 30 ఏళ్లలో చోటుచేసుకున్న వృద్ధి కంటే రెట్టింపు ఉండవచ్చని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం దేశంలో 11 శాతానికిపైగా జనాభా షుగర్, 35 శాతం బీపీ సమస్యతో బాధపడుతున్నారు. రాష్ట్ర వైద్య శాఖ ఎన్సీడీ సర్వేలో గుర్తించిన బీపీ, షుగర్ బాధితులు 60 లక్షల మందికి పైగానే ఉంటున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను చూపదని.. ఈ దృష్ట్యా బీపీ, షుగర్, ఊబకాయ బాధితులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహారమే ఔషధందేశంలోని పెద్దల్లో 40 శాతం మంది, ఊబకాయం గల పిల్లల్లో 60 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. క్రమరహిత ఆహార అలవాట్లు, నిద్ర, శారీరక శ్రమ లేమి వంటి కారణాలు మద్యపానం అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్‌కు దారితీస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జీవనశైలి, ఆహార అలవాట్ల మీద శ్రద్ధ పెట్టాలి. ఆహారాన్ని ఔషధంగా చూడాలి. తినే ఆహారంపై నియంత్రణ ఉంటే జబ్బుల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్‌ను పూర్తిగా విడనాడాలి. మనిషి కి రోజుకు 1,600–1,800 క్యాలరీలు అవసరం. అంతకంటే ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. వారానికి 150–180 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి. రన్నింగ్, వాకింగ్, యోగా, జిమ్‌లో వ్యాయామం ఇలా ఏదో ఒక శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. – డాక్టర్ కె.జగదీశ్వర్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఒంగోలు -
నేడు అనంతపురం జిల్లా పామిడికి వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించనున్నారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. -
ఎమ్మెల్యే బూచేపల్లిపై రెడ్‌బుక్ కుట్రలు
సాక్షి టాస్క్ ఫోర్స్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బందులు పెట్టేలా చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్సీపీ దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీలపై మైన్స్ అధికారులతో ఆకస్మిక దాడులకు పూనుకుంది. సోమవారం మైన్స్ డీడీ రాజశేఖర్ ఆధ్వర్యంలో అధికారులు రెండు బృందాలుగా చీమకుర్తి మండలం రామతీర్థం పరిధిలో ఉన్న సూర్య గ్రానైట్స్ క్వారీల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైటెక్ సర్వే కెమెరాలను తీసుకొచ్చి క్వారీల్లోని నలుమూలల కొలతలు సేకరించారు.అమ్మకాలు ఎంత? ఉత్పత్తి ఎంత? అంటూ అక్కడి కార్యాలయంలోని రికార్డుల్లో వివరాలను మైన్స్ అధికారులు సేకరించారు. రామతీర్థం కేంద్రంగా వైఎస్సార్సీపీతో పాటు టీడీపీకి చెందిన వారికి, ఆ పార్టీ సానుభూతిపరులుగా ఉన్న పలువురికి గ్రానైట్ క్వారీలున్నాయి. చీమకుర్తి పరిసరాల్లో ఉన్న వందలాది క్వారీల వైపు ఏనాడూ తొంగి చూడని మైన్స్ అధికారులు కేవలం బూచేపల్లికి చెందిన సూర్య గ్రానైట్స్‌పై మాత్రమే దాడులు నిర్వహించటం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. 2014–19లో కూడా అప్పటి అధికార టీడీపీకి అనుకూలంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డిని మలచుకునేందుకు ఎన్నో ఒత్తిళ్లు చేశారు. సూర్య గ్రానైట్ క్వారీని రెండేళ్లు మూసేసి ఆర్థికంగా దెబ్బతీశారు.


