APSRTC చైర్మన్‌ సంచలన వ్యాఖ్యలు | APSRTC Chairman Sensational Comments | Sakshi
Sakshi News home page

APSRTC చైర్మన్‌ సంచలన వ్యాఖ్యలు

May 16 2026 1:57 PM | Updated on May 16 2026 3:39 PM

APSRTC Chairman Sensational Comments

సాక్షి, అమరావతి: ఆర్టీసీ నిర్వహణ విషయంలో ఛైర్మన్ కొనకళ్ల నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రైవేటీకరణ తప్పనిసరి అని అంటున్నారాయన. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

విద్యుత్ బస్సులు కొనుగోలు, నిర్వహణ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఆర్టీసీలోని పదివేల ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకురావాల్సి ఉంది. పదివేల విద్యుత్ బస్సులు కొనాలంటే 17 వేల కోట్లు కావాలి. ఇప్పటికే స్త్రీ శక్తి పథకం వల్ల  ఆర్టీసీపై ఆర్ధిక భారం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అంత ఖర్చు చేసి బస్సులు కొనే పరిస్థితిలో ఆర్టీసీ ఇప్పుడు లేదు అని అన్నారు. 

‘‘కొత్త బస్సులు కొనలేం. విద్యుత్ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా నడపడమే మేలు. మొత్తం 1050 ఎలక్ట్రికల్ బస్సులకు ప్రపోజల్స్ పెట్టాం. 750 ఎలక్ట్రికల్ బస్సులకు టెండర్లు పూర్తయ్యాయి. రెండు మూడు నెలల్లో ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. ప్రతీ రోజు కాలం చెల్లిన బస్సులు స్క్రాప్ కు వెళుతుంటాయి. కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి’’ అని కొనకళ్ల నారాయణ అన్నారు. 

స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీ కుదేలు.. ప్రైవేటీకరణ చేయాల్సిందే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement