breaking news
Amaravati
-
ఒంగోలు బయలుదేరిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ ఒంగోలు పర్యటన అప్డేట్స్..ఒంగోలు బయలుదేరిన వైఎస్ జగన్👉వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఒంగోలుకు బయలేరారు. తాడేపల్లి నుంచి ఒంగోలుకు వైఎస్ జగన్ఈ సందర్భంగా ఇటీవల మరణించిన వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. -
బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ : వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి,తూర్పుగోదావరి : వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, బొత్స సత్యనారాయణ, విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు.ఈ సందర్భంగా రాజ్యాధికారం ఉంటేనే సమాజం ముందుకెళ్లే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారంతోనే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో బలంగా ఉండగలమని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత బీసీలను ఏ ప్రభుత్వాలు గుర్తించాయి. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనే అంశాన్ని ప్రజలు బేరీజు వేసుకోవాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను బ్యాక్వర్డ్ కాదు బ్యాక్‌బోన్ అని చెప్పిన ఏకైక నాయకుడు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రమేష్ యాదవ్ కొనియాడారు. యాదవ సమాజంలో ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని, ఉప ముఖ్యమంత్రి పదవిని బీసీ వర్గానికి కేటాయించాలని సభ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తాము కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్లమేనని పేర్కొన్న మాజీ మంత్రి విడదల రజిని.. ప్రస్తుత ప్రభుత్వంలో బీసీలకు ఎక్కడెక్కడ గుర్తింపు లోపించిందనే దానిపై అధ్యయనం జరగాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం ఇప్పటిదాకా రాలేదని, మహిళలకు అందిస్తామన్న సహాయం అందలేదని, లబ్ధిదారులకు పింఛన్లు కూడా తగ్గిపోయాయని మండిపడ్డారు. -
మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు
-
మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్
-
చంద్రబాబు అంతర్జాతీయ రాజధాని అమరావతి
-
చంద్రబాబు సర్కార్‌పై అమరావతి రైతుల ఆగ్రహం
సాక్షి, గుంటూరు: ‘‘అధికారులు వస్తారు.. పోతారు.. గ్రామ కంఠం విషయంలో తొలిరోజు నుంచి మాకు నష్టమే. బంగారం బిస్కెట్లు, డబ్బులు ఇచ్చినవారికి కిలో మీటర్ దూరం కూడా గ్రామకంఠం కిందే ఇచ్చారు. గతాన్ని తవ్వితే చాలా ఇబ్బందులు వస్తాయని పెమ్మసాని చెప్పారు. గతంలో జరిగింది అధికారుల పొరపాటు కాదు.. రాజకీయ ప్రేరేపితంతోనే ఇచ్చారు’’ అంటూ అమరావతి రైతులు మండిపడ్డారు.‘‘అసైన్డ్ భూములు, ఎండోమెంట్ భూములు, లంక భూములు , గ్రామకంఠం భూముల మీద సిట్ విచారణ జరిపించాలి. వీటన్నింటికీ మూల కారకుడు మంత్రి నారాయణ. నారాయణకు రైతు బాధలు తెలియవు. నారాయణ కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చాడు. రైతులను మభ్య పెట్టి లబ్ధి పొందడం తప్ప నారాయణ మరొకటి తెలియదు...మంత్రి నారాయణపై సిట్ విచారణ జరపాలి. సిట్ విచారణలో అధికారులను రెండో పార్ట్‌గా చేర్చాలి. సిట్ వేయడం వల్లే సాయికృష్ణ కేసులో నిజం బయటికివచ్చింది. గ్రామం కంఠాల విషయంలో చంద్రబాబు ఎందుకు జోక్యం చేసుకోడు. గ్రామ కంఠాల విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలి’’ అని అమరావతి రైతులు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: గణేష్ వేడుకల్లో కేసీఆర్ పాటలు.. కేటీఆర్ ఏమన్నారంటే? -
బాబూ.. అమరావతిలో అసలు లెక్కేంటి?
ఎవరైనా వెయ్యి రూపాయలతో అయ్యే పనికి ఐదువేలో, పది వేలో ఖర్చు చేస్తారా? అలా చేస్తామని అంటే జనం ఏమని అనుకుంటారు? అయితే చేతకాని తనమన్నా కావాలి. లేదా ఏదైనా స్వార్ధ ప్రయోజనం ఉండి ఉంటుందని అనుకోరా? సరిగ్గా ఇదే రీతిలో ఏపీ రాజధాని అమరావతి గ్రామాలలో జరుగుతోందనిపిస్తోంది.కొత్త ఎయిర్ పోర్టు కోసం ఇరవై వేల ఎకరాలు, రైల్వే లైన్, గ్రిడ్ రోడ్డు విస్తరణ వంటి కోసం 6212 ఎకరాలు తీసుకుంటారట. ఎయిర్ పోర్టుకు ఐదువేల ఎకరాలు సరిపోతుంది. కాని నాలుగురెట్లు ఎక్కువగాను, రైల్వేలైన్, తదితర అవసరాలకు 1581 ఎకరాలు చాలు. కాని నాలుగు రెట్లు అదనంగా పూలింగ్ చేస్తారట. ఇప్పటికే విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. గతంలో దాని విస్తరణకు రైతులనుంచి భూములు తీసుకున్నారు. ఆ రైతులందరికి పూర్తి స్థాయి న్యాయం జరగలేదని ఈ మధ్యనే ఎయిర్ పోర్టు వద్ద ధర్నా కూడా జరిగింది.అయితే కొంతమంది పలుకుబడి కలిగినవారు ఈ భూములకు బదులు అమరావతి ప్రాంతంలో విలువైన ప్లాట్లు పొందారని కూడా చెబుతారు. దీనిని పక్కనబెడితే కూటమి ప్రభుత్వానికి లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా, కొత్తగా మరో విమానాశ్రయం కట్టాలన్న ఆలోచన వచ్చింది. అది కూడా విజయవాడ, గుంటూరులకు సుదూరంగా ఉండే మారుమూల గ్రామాలలో కావడం విశేషం. ఇందుకోసం ఐదువేల ఎకరాలు అవసరమట. కాని 20వేల ఎకరాలు సేకరించవలసి ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పీ.నారాయణ ప్రకటించారు. అదేమిటి? నాలుగు రెట్లు అధికంగా భూములు తీసుకోవడం ఏమిటన్న సందేహం ఎవరికైనా రావచ్చు. దానికి ఆయన ఇచ్చిన జవాబు ఏమిటంటే 20వేల ఎకరాలు తీసుకుంటే ప్రభుత్వానికి ఐదువేల ఎకరాలే మిగులుతుందట. మిగిలిన భూమిలో ప్లాట్లు అభివృద్ది చేసి రైతులకు ఇవ్వవలసి ఉంటుందట. అలాగే విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇతర అవసరాలకు కేటాయించాలట. ఇదే ప్రకారం రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గ్రిడ్ రోడ్లకు కూడా తీసుకుంటారట.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కేంద్రానికి రాసిన ఒక లేఖ ప్రకారం ప్లాట్ల అభివృద్దికి ఎకరాకు రెండు కోట్లు వ్యయం అవుతుంది. అది ఇప్పుడు మరికొంత పెరిగిందేమో తెలియదు. ఈ రకంగా చూస్తే ఎయిర్ పోర్టు భూమి పోను మిగిలిన 15వేల ఎకరాలనే పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు మినిమమ్ రెండు కోట్ల చొప్పున ముప్పైవేల కోట్ల వ్యయం అవుతుందన్నమాట. ఇంత భారీ వ్యయం చేసే బదులు అవసరమైన ఐదువేల ఎకరాలకు రెండు కోట్ల చొప్పున లెక్కగట్టి ఇస్తే పదివేల కోట్లు సరిపోతుంది కదా!లేదా మూడు కోట్లు ఇచ్చినా 15వేల కోట్లు అవుతుంది.రైల్వే లైన్ తదితర అవసరాలకోసం ఈ ప్రకారం లెక్కవేస్తే ప్లాట్ల అభివృద్దికే 18వేల కోట్లు అవుతుంది. కాని కొనుగోలు చేస్తే పది, పన్నెండువేల కోట్లు మించి కాకపోవచ్చు. దీనిని వదలి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి ఎందుకు భూములు సేకరిస్తున్నట్లు? రైతులకు ప్లాట్ల అభివృద్ది జరిగే వరకు కౌలు రూపేణా, రుణాల మాఫి రూపేణా, ఇతరత్రా కోట్ల రూపాయల మెత్తాలను వెచ్చించవలసి ఉంటుంది. దీనిని బట్టి ఏం అర్దం అవుతుంది. వెయ్యి రూపాయల ఖర్చు అయ్యేదానిని మూడు, నాలుగు రెట్లకు పెంచుతున్నారనిపించదా? ప్రభుత్వం ఏదో రకంగా దీనిని సమర్ధించుకోవచ్చు. కానీ అందులో హేతుబద్దత ఎంత అన్నదే చర్చ.ఇదీ చదవండి: నాడు ప్రశంసలు.. నేడు విమర్శలు.. బాబుకు కొత్త ఆందోళన!హైదరాబాద్ శంషాబాద్ వద్ద రైతుల నుంచి భూములను ప్రభుత్వం తీసుకుని పరిహారం చెల్లించిన అనుభవం ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం పూలింగ్ వైపే వెళుతోంది. రైతుల నుంచి భూములు తీసుకోవడంతో పచ్చని పంట పొలాలను నాశనం చేయడం ఒక ఎత్తు అయితే, వారి వద్దే భూములు ఉంటే ఎప్పుడైనా తమకు నచ్చిన రేటుకు అమ్ముకునే అవకాశం ఉండడం మరో ఎత్తుగా ఉంటుంది. వీటన్నిటిని కాదని ప్రభుత్వం భూములు తీసుకోవడం, నిర్మాణాల పేరిట వేల కోట్ల రూపాయలను అప్పు తెచ్చి మరీ వ్యయం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఐఎఎస్, లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్ తదితరులు ముందుగా ఇప్పటికే తీసుకున్న భూమిని అభివృద్ది చేయకుండా కొత్తగా భూములు తీసుకోవడం ఏమిటని, పలు అనుభవాల రీత్యా చంద్రబాబునునమ్మడం ఎలా అని ప్రశ్నించారు. రెండో దశ భూ సేకరణ అంటే అవినీతికోసమేనని మరో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొంతకాలం క్రితం ఆరోపించారు. ఎవరు ఎన్ని హితోక్తులు చెప్పినా, విమర్శలు చేసినా.. ప్రభుత్వం మాత్రం తగ్గడం లేదు. ఆయా భవనాల నిర్మాణానికి పెడుతున్న వ్యయం చూస్తే ఎవరికైనా దిమ్మదిరగాల్సిందే.శాశ్వత సచివాలయ టవర్ల అద్దాలకు 2455 కోట్లు వ్యయం చేయబోతున్నారు. ఇందులో తొలుత ఉన్న అంచనా వ్యయం కన్నా 500 కోట్లు అధికంగా ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. అమరావతిలో విద్యుత్ సరఫరాను ప్రైవేటుకు అప్పగించాలన్నది మరో ఆలోచనట. దీనిపై నివేదికలు తయారు చేయడానికి టెండర్లు పిలిచారు. ఇప్పటికే వేల కోట్ల వ్యయం చేసి అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను సీఆర్డిఏ తయారు చేస్తోంది. అంతా సిద్దం అయ్యాక ప్రైవేటువారికి దీనిని అప్పగిస్తారా? లేక ముందే ప్రైవేటుకు అప్పగిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇదంతా వినియోగదారులపై భారం కాదా అన్నది కొందరి సందేహం.అమరావతి చుట్టూరా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలన్నది మరో ప్రతిపాదన. కేంద్రం దీనిపై కొన్ని అభ్యంతరాలు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. సుమారు 30వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా అయితే ఇందులో రాష్ట్రం కూడా నాలుగువేల కోట్లకు పైగా భరించాల్సి ఉంటుందట. అసెంబ్లీ కొత్త భవనాన్ని నిర్మించడంలో భాగంగా కేవలం భవన శిఖరం(డూమ్) నిర్మాణానికి 660 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారట. పార్లమెంటు కొత్త భవనం, తెలంగాణ సచివాలయంలకు పెట్టిన ఖర్చుతో పోల్చితే ఏపీ ఖర్చు గుండె బేజారెత్తిస్తుందని చెప్పాలి.కొండవీటి వాగు వరదనుంచి రక్షణ పొందడానికి కొన్నివందల కోట్లు వ్యయం చేస్తున్నారు. కృష్ణానది కుడి కరకట్ట విస్తరణకు 443 కోట్లు వెచ్చించబోతున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సెంట్రలైజ్డ్ కూలింగ్ వ్యవస్థ కోసం 415 కోట్లు పెట్టబోతున్నారు. గవర్నర్ నివాస భవన సముదాయానికే 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా అట. అమరావతిలో పెడుతున్న ఖర్చులో ఇవి కొన్నే. ఇందులో దుబారా, అవినీతిపై ఎవరైనా ప్రశ్నించినా పట్టించుకునే దశలో చంద్రబాబు సర్కార్ లేదు. మొత్తం రాష్ట్ర ప్రజలందరినుంచి వసూలు చేసే పన్నులలో నుంచే అమరావతి అప్పులను తీర్చవలసి ఉంటుంది. ఒకపక్క ఎల్ నినో కారణంగా కరువు తాండవిస్తుంటే, మరో పక్క అమరావతిలో వేల కోట్ల రూపాయలను విచ్చలవిడిగా వెచ్చించడం న్యాయమా అని సామాన్యుడు ప్రశ్నించినా వినే నాధుడు లేడు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వెయ్యితో పోయేదానికి 10 వేల కోట్లు.. ఎయిర్ పోర్ట్ కోసం 20 వేల ఎకరాలు..
-
కొండవీటి వాగు ఉదృతి.. అమరావతి అస్తవ్యస్తం..
-
మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిపై కక్ష సాధింపు
సాక్షి,విజయవాడ:కోర్టు మొట్టికాయలు వేసినా పోలీసుల తీరు మారలేదు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనకు సంబంధించి నోటీసులు ఇచ్చే పేరుతో పోలీసులు రాత్రి సమయంలో ఆమె నివాసానికి వెళ్లారు.అర్ధరాత్రి వేళ ఇళ్లకు వచ్చి తప్పుడు కేసులతో భయబ్రాంతులకు గురిచేయడంపై మాజీ మేయర్ భాగ్యలక్ష్మి దంపతులు పోలీసులను తీవ్రంగా నిలదీశారు. కోర్టు చివాట్లు పెట్టినా పోలీసుల తీరులో మార్పు రాలేదని మండిపడ్డారు. -
అన్ని ఆధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం : వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: డీఎస్సీ అక్రమాలకు పాల్పడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులపై జరిగిన దాడికి సంబంధించి ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్ జగన్ లోక్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ స్కామ్‌లో ఇవీ నాలుగు పాయింట్లు:ఇప్పుడే గవర్నర్గారిని కలవడం జరిగింది. గవర్నర్‌కు వివరంగా.. సెప్టెంబరు 21న జరిగిన ఘటనపైనే కాకుండా, ఏ విధంగా డీఎస్సీ స్కామ్‌లో యువత నష్టపోయింది అనేది వివరించాము. ఈ వ్యవస్థలో ఒక మార్పు రావాలన్నా, ఈ వ్యవస్థ మీద ప్రజలకు మళ్లీ నమ్మకం రావాలన్నా, ఈ వ్యవస్థలో లోపాలు సవరించాలన్నా డీఎస్సీ స్కామ్‌పై కచ్చితంగా సీబీఐ విచారణ జరగాలి. విద్యా శాఖ మంత్రి రాజీనామా కూడా చేయాలి. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, నాలుగు పాయింట్ల ఆధారంగా డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయి.1). మొట్టమొదట రెండు ఫంక్షన్లు ఒకే వ్యక్తి చేతికి అప్పగించడం. ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ రెండూ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు అప్పగించారు. దీంతో స్కామ్ ప్రారంభం అయింది.2). రెండోది మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారు. అలా పని చేస్తున్న నవీన్ అనే వ్యక్తికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, అతడికి ఉద్యోగం ఇవ్వలేదు. తన పేరు తొలి మెరిట్ లిస్ట్‌లో చూపి, ఆ తర్వాత లిస్ట్‌లో పేరు తొలగించారు. అతడి లాగిన్ ఐడీ బ్లాక్ చేశారు. కాల్ లెటర్ కూడా పంపలేదు. దీంతో అతడు ప్రభుత్వానికి లేఖ రాయడమే కాకుండా, కోర్టుకు కూడా వెళ్లాడు. అంటే ఒక స్కామ్‌ను కవర్ చేయడానికి ఎన్ని అగచాట్లు పడుతున్నారు. అనేది తెలియడంతో పాటు, లీకేజీ వ్యవహారం బట్టబయలైంది.3). స్పోర్ట్స్ కోటా పేరుతో అడ్డగోలుగా జీఓలు ఇచ్చారు. గతంలో ఉన్న జీఓలు రద్దు చేసి కొత్తగా.. జీఓ నెం: 4, 47 అని చెప్పి, రెండు కొత్త జీఓలు తెచ్చి, వాటి ద్వారా పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత 372 ఉద్యోగాలు ఆ జీఓల పేరుతో ఇచ్చారు. ఆ రిక్రూట్మెంట్ పూర్తి కాగానే మళ్లీ మూడు జీఓలు తెచ్చారు. జీఓ నెం: 23, 25, 56 తెచ్చారు. దాని ప్రకారం మళ్లీ పరీక్ష ఉండాలని నిబంధన పెట్టారు. మరి ఇక్కడ 372 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారన్న దానికి సమాధానం లేదు.4). ఫేక్ సర్టిఫికెట్లు. ఏరకంగా నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చాడో చూశాం. జరగని గేమ్స్ జరిగినట్లు చూపారు. అలాగే ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన ఎమ్మెల్యే కూన రవికుమార్.. దాదాపు 38 ఉద్యోగాలకు సంబంధించి, సర్టిఫికెట్లు ఇచ్చారనేది కూడా చెప్పాం. ఇంకాసాఫ్ట్బాల్ అసోసియేషన్లకు సంబంధించి కొన్ని జిల్లాలో సెక్రటరీలకు, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు అనేవి కూడా చెప్పాం.బేరసారాల ఆడియో. వీడియో:డీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి బేరసారాలపై ఆడియో, వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో క్లియర్‌గా ఫోన్ నెంబర్ కనిపిస్తున్నా, ఆ వ్యక్తి గురించి ఎఫ్ఐఆర్లో రాయలేదు. కేవలం సస్పెక్ట్ అని మాత్రమే రాశారు. అరెస్టు కూడా చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అయినా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు.శాప్ ఆఫీస్ వద్ద టీడీపీ గుండాల దాడి:సెప్టెంబరు 21న శాప్ ఆఫీస్ వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముందుగానే సమాచారం ఇచ్చారు. అనుమతి కోరుతూ లెటర్ కూడా రాశాడు. కానీ, ఆరోజు ఏం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎలా కుట్ర చేశారో చూశాం. టీచర్లు కాని టీచర్లను పిలిపించి, ప్యారలల్‌గా ధర్నా చేయించాడు. నిజానికి వారు చదువు చెప్పే గురువులు కాదు. దొంగ సర్టిఫికెట్లతో, ఏ పరీక్ష రాయకుండా ఉద్యోగాలు పొందిన వారు. అందుకే వారు టీచర్లు కానీ టీచర్లు. వారిని పిలిపించి, కావాలని శాప్ ఆఫీస్ వద్ద గొడవ చేయించారు. అంతే కాకుండా టీడీపీ గుండాలను కూడా అక్కడికి రప్పించారు. వారంతా కలిసి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై దారుణంగా దాడి చేశారు. అసలు వారంతా ఎవరో చూడండి. వీరు గతంలో సాక్షి ఆఫీస్‌పై దాడి చేసింది కూడా వీరే.(అంటూ, ఆ ఫోటోలు మీడియాకు చూపారు)పైగా రివర్స్ కేసులు:శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై ఆ విధంగా టీడీపీ గుండాలు అంత దారుణంగా దాడి చేసినా, వారిపై ఎలాంటి చర్యలు లేవు. వారిపై కేసులు నమోదు చేయలేదు. అందుకు పూర్తి భిన్నంగా, రివర్స్‌లో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై కేసు పెట్టారు.ఎంత దారుణంగా ఆ కేసులు పెట్టారంటే.. హత్యాయత్నం కేసులు. ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు పెట్టారు. ఇప్పటికే 350 మందిపై కేసులు పెట్టారు. ఆ జాబితా ఇంకా పెరుగుతోంది. ఇంకా రాత్రి వేళల్లో ఇళ్లపై బడి అరెస్టులు చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తూ.. కోర్టులు వాటిని తప్పు పడుతున్నాయి. దీని వల్ల సామాన్యులు బ్రతుకుతున్నారు. మరోవైపు మొన్నటి శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారు. వాటిపైనా కోర్టులు స్పందించాయి.శాంతియుత నిరసన వ్యక్తం చేస్తుంటే, రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేస్తారని నిలదీశాయి. మా పోరాటం కొనసాగుతుంది:తప్పు చేసింది మీరు. ప్రశ్నించే హక్కు లేదా? దాన్ని కూడా కాల రాస్తారా? ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలోనే ఉండదేమో.. మా ఈ యుద్ధం కొనసాగుతుంది. ఇందులో న్యాయం, ధర్మం తప్పకుండా గెలుస్తుంది. విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. కనీసం అప్పుడైనా మన రాష్ట్రంలో పిల్లలకు, నిరుద్యోగులకు పరీక్షల మీద విశ్వాసం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం కలుగుతుంది. ఆ దిశలో మా డిమాండ్ కొనసాగుతోంది.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..సుప్రీంకోర్టు ఆదేశం ప్రభుత్వానికి చెంపదెబ్బ:విజయవాడలో సాయికృష్ణ లాకప్‌డెత్‌కు సంబంధించిన కేసు చూస్తే.. ఏ రకంగా చంద్రబాబు ప్రభుత్వం పిల్లలను వాడుకుంటూ, వారితో గంజాయి అమ్మిస్తూ, వారితో చట్టవిరుద్ధమైన పనులు చేయించారు?. ఇందులో పోలీసులు ఎలా పని చేశారు? ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగం చేస్తోంది అనేదానికి నిదర్శనం.సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన ఆదేశాలు. అవి నిజంగా ఒక చెంపదెబ్బ చంద్రబాబు ప్రభుత్వం మీద. సుప్రీంకోర్టు గట్టిగా మందలిస్తూ.. సీపీ, డీజీపీని కూడా ఎందుకు అక్యూజ్డ్ లిస్టులో చేర్చలేదని నిలదీయడం.. నిజంగా ప్రభుత్వానికి చెంపదెబ్బ. ఒక పిల్లాడిని అరెస్టు చేసి తీసుకొస్తారు. కొట్టి చంపారు. చివరకు శవం కూడా మాయం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో, రెడ్‌బుక్ రాజ్యాంగంలో నగరం మధ్యలో ఏ విధంగా దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పడంతో పాటు, పోలీసుల అరాచకాలకు ఇవన్నీ నిదర్శనంలా నిలుస్తున్నాయని వైఎస్ జగన్ అన్నారు. -
టెక్కలి రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: టెక్కలి రైలు ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ ప్రమాదంలో విద్యార్థులు విశాఖరావు, దిలీప్‌కుమార్, శివ, శరత్‌కుమార్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. చేతికందివచ్చిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతమని, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.అలాగే, ఈ ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థి సాల్మన్‌రాజ్‌కు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి : రైలు ఢీకొని నలుగురు యువకులు మృతి -
భూమి మీ హక్కు.. ఎంతవరకైనా పోరాడాల్సిందే
-
ఇక ‘బొత్స 2.0’ చూస్తారు: అనూష
సాక్షి,అమరావతి: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. చీపురుపల్లిలో వైఎస్సార్సీపీ శ్రేణుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. ‘గౌరవంగా ఉన్న ఏ కుటుంబమూ టీడీపీలోకి వెళ్లలేదని, లాలూచీ రాజకీయాలు కాకుండా గౌరవప్రదమైన రాజకీయాలు చేయాలని హితవు పలికారు. నేను మంత్రే అయితే.. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మంత్రే అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం బొత్స సత్యనారాయణ కుమార్తె, వైఎస్సార్సీపీ నేత బొత్స అనూష మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న శీనుపై బొత్స అనూష కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి రోజు మీరు చిన్న శీను అపాయిట్మెంట్ కోసం ఎదురు చూసేవారు. ఆ ఒకరు పోయారు. ఇప్పుడు మీకు ఇద్దరు వచ్చారు. నేను తమ్ముడు ఉన్నాం. నాన్న ఉన్నారు. పార్టీ మారిన వారికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ది చెప్పాలి. ఇప్పటివరకు అందరూ బొత్స 1.0 చూశారు.. ఇక నుంచి బొత్స 2.0 చూస్తారు. చీపురుపల్లి కార్యకర్తల వల్లే మా నాన్నకు ఈ బ్రాండ్ వచ్చింది అని అన్నారు. గ్రామాల్లో ఏకగ్రీవాలు జరగకూడదని వైఎస్ జగన్ చెప్పారని, ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. -
‘గ్రూప్స్’ అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలి
సాక్షి, అమరావతి: గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పలువురు నిరుద్యోగులు వినతిపత్రం అందజేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితిని కేవలం రెండేళ్లు మాత్రమే సడలించడం వల్ల అనేక మంది అభ్యర్థులకు అవకాశం లేకుండా పోతోందని చెప్పారు. రెగ్యులర్‌గా ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వయోపరిమితిని దాటిపోయారని వివరించారు. వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకే పెంచారని.. దీనిని 47 ఏళ్లకు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచినప్పుడు.. పోటీ పరీక్షల అభ్యర్థుల వయోపరిమితిని కూడా 47 ఏళ్లకు పెంచాలని టీడీపీ నేతలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేసిన విషయా న్ని వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వయోపరిమితి అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ జగన్‌ను కోరారు. జగన్ స్పందిస్తూ.. సమస్యను పరిశీలించి అవసరమైన విధంగా ప్రస్తావిస్తామని భరోసా ఇచ్చారు. జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, నిరుద్యోగ అభ్యర్థులు ఆర్.శ్రీనివాసరావు, కిరణ్‌కుమారి, కె.రాజ్‌కోటి తదితరులున్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన నిరుద్యోగులు
సాక్షి, తాడేపల్లి: గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ పలువురు నిరుద్యోగులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. ఫేజ్-2 జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం ఇచ్చిన రెండేళ్ల వయో సడలింపు సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెగ్యులర్‌గా నోటిఫికేషన్లు రాకపోవడం వల్లే వయోపరిమితి దాటిపోయి లక్షలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఉన్న 44 ఏళ్ల వయోపరిమితిని వన్‌టైమ్ సడలింపు కింద 47 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలు, విజ్ఞప్తులపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. -
ఏపీలో మరో రిక్రూట్మెంట్లో గోల్మాల్!
అమరావతి: ఏపీలో మరో రిక్రూట్మెంట్లో గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ రిక్రూట్మెంట్పై అనుమానాలు బలపడ్డాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 24 గంటలు గడవకముందే ప్రభుత్వ నిర్ణయంలో మార్పు చేసింది. జీవో 21 జారీ చేసింది కూటమి ప్రభుత్వం. పరీక్ష లేకుండానే మెరిట్ బేసిస్‌తో నియామకాలకు నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీకి ఇచ్చిన నియామక బాధ్యతలను వెనక్కి తీసుకుంది. జీవో 22తో నియామక ప్రక్రియను ఉపసంహరణ చేసుకుంది. పశుసంవర్థక శాఖ సెలక్షన్ కమిటీకి నియామక బాధ్యతలు అప్పగించింది. 24 గంటల్లోనే జీవోలు మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఏపీపీఎస్సీ నుంచి నియామకాలను వెనక్కి తీసుకోవడం వెనుక గోల్మాల్ జరిగిందని తెలుస్తోంది. పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా వివాదాస్పద అధికారి దామోదర్‌ను కొనసాగేలా చేస్తోంది ప్రభుత్వం. టీడీపీ సానుభూతి అధికారిగా దామోదర్ నాయుడికి ముద్ర ఉంది. ఆయన చేతుల మీదుగానే ఈ ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. పరీక్ష లేకుండా మెరిట్ పేరుతో నచ్చినవారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారు. ఇదీ చదవండి: ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి -
సౌజన్య కేసు.. పోలీసుల కస్టడీలో సాధిక్ డ్రామాలు!
సాక్షి,కాకినాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు, ఆయన అల్లుడు జగదీశ్వర రెడ్డి మృతి కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సర్పవరం పోలీసులు నిందితుడు సాధిక్ ఖాన్‌ను సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. పోలీసుల కస్టడీలో సాధిక్ ఖాన్ డ్రామాలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించలేదని, పలు ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే, పోలీసులు సాంకేతిక ఆధారాలు, సైనైడ్ విక్రయించిన వ్యక్తుల సాక్ష్యాలను చూపడంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.విచారణలో పూర్తిస్థాయి వాస్తవాలు రాబట్టేందుకు, సాధిక్‌ను మరోసారి వారాల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు స్థానిక కోర్టులో మరో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏఈ నూకరాజు అల్లుడు కొవ్వురి జగదీశ్వర రెడ్డి మృతిపై ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు రాజమండ్రి టూటౌన్ పోలీస్ స్టేషన్లో సాధిక్ ఖాన్‌పై కేసు నమోదైంది.సుమారు రూ.25 కోట్ల విలువైన ఆస్తిని దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే సాధిక్ ఖాన్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జగదీశ్వర రెడ్డికి కొబ్బరి నీళ్లలో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ సైనైడ్ ఇచ్చి హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. అల్లుడు జగదీశ్వర రెడ్డి మృతి తర్వాత నూకరాజు కూతురు సౌజన్యను వేధించడం, కుటుంబంపై బెదిరింపులకు పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.ఈ ఘటనపై సర్పవరం పీఎస్‌లోనూ కేసులు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇదీ చదవండి : సాధిక్ ఖాన్ మా మమ్మీనీ కొట్టేవాడు చాలా భయం వేసేది -
విజయవాడలో భారీ పేలుడు పదార్థాల కలకలం
సాక్షి,కృష్ణా: విజయవాడలో భారీగా పేలుడు పదార్థాలు కలకలం సృష్టిస్తున్నాయి. అక్రమంగా రవాణా చేస్తున్న 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను కృష్ణలంక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీ నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించి వచ్చాడు. బస్సు దిగిన తర్వాత తన బ్యాగ్‌కు బదులుగా పొరపాటున వేరొకరి బ్యాగ్‌ను ఓపెన్ చేశాడు. ఆ బ్యాగ్‌లో జిలెటిన్ స్టిక్స్ ఉండటాన్ని గుర్తించి ఆసిఫ్ అలీ ఖంగుతిన్నాడు. వెంటనే అప్రమత్తమై బస్ స్టాండ్ అవుట్‌పోస్ట్ పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన కృష్ణలంక పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణలంక ఎస్సై గిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల వివరాలను ఆరా తీయడంతో పాటు, బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు మరియు బస్సులోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ బ్యాగ్ ఎవరిది? నరసరావుపేట నుంచి విజయవాడకు వాటిని ఎందుకు తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.పేలుడు పదార్థాల రవాణా కేసులో కృష్ణలంక పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. బస్సులో స్వాధీనం చేసుకున్న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను మైనింగ్ కోసం వాడే పేలుడు పదార్థాలుగా పోలీసులు గుర్తించారు. ‘సూపర్ శివ శక్తి కెమికల్స్’,‘సూపర్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్’పేర్లతో డిటోనేటర్లు చుట్టిన షీట్‌ను పోలీసులు గుర్తించారు.ఈ షీట్‌పై తెలంగాణలోని అంకిరెడ్డిపల్లె పేరుతో ఫ్యాక్టరీ చిరునామా ఉండటంతో, ఒక పోలీస్ బృందం అక్కడికి వెళ్లి విచారణ చేపట్టింది. ఈ పేలుడు పదార్థాలు అసలు ఎక్కడికి తరలి వెళుతున్నాయనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు కావడంతో వాటిని ఫోరెన్సిక్ నిపుణులకు పంపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేపట్టాయి.ఇదీ చదవండి : సౌజన్య కేసు.. పోలీసుల కస్టడీలో సాధిక్ ఖాన్ డ్రామాలు -
పులివెందులలో కాల్పుల కలకలం
సాక్షి,వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గణేష్ విగ్రహం వద్ద టీడీపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. టీడీపీ నేతలు పుష్పనాథ్‌రెడ్డి, విజయ్‌రెడ్డిల మధ్య స్థానిక వివాదం కారణంగా వాగ్వాదం మొదలైంది. ఈ గొడవలో విజయ్‌రెడ్డి, పుష్పనాథ్రెడ్డిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఇరువర్గాలూ పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద నిలిపి ఉంచిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఇరువర్గాలను శాంతింపజేసేందుకు హజ్ కమిటీ డైరెక్టర్ భాషా మధ్యవర్తిగా రంగంలోకి దిగారు. అయితే ఆయన అక్కడకు వెళ్లిన సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారడంతో, ఆయన గన్‌మెన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. -
టెలిగ్రామ్ ఛానెల్ ఖరీదు రూ.6 కోట్లా.. తిరుపతి యువకుడికి జాక్‌పాట్
సాక్షి,తిరుపతి : సోషల్ మీడియా టెలిగ్రామ్ ఛానెల్ అమ్మి రూ.6 కోట్లు సంపాదించాడు తిరుపతి యువకుడు.కానీ సీన్ కట్ చేస్తే.. అదే డబ్బు కోసం స్నేహితులే కిడ్నాప్ ప్లాన్ చేశారు.అసలు ఏం జరిగిందంటే?క్రికెట్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానెల్‌ను కోట్లకు విక్రయించి భారీగా డబ్బు సంపాదించిన యువకుడిని, అదే డబ్బుపై కన్నేసిన స్నేహితులే అపహరించిన సంచలన ఘటన తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండలం నాగపట్నం గ్రామానికి చెందిన సుమంత్ అనే యువకుడు ‘నాని క్రికెట్ ప్రిడిక్షన్’ పేరుతో ఒక టెలిగ్రామ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు. కాగా, ఈ ఛానెల్‌ను నార్త్ ఇండియాకు చెందిన ఒక వ్యక్తికి సుమంత్ ఏకంగా రూ.6 కోట్లకు విక్రయించాడు. ఈ భారీ మొత్తానికి సంబంధించిన డబ్బు సుమంత్ వద్ద ఉండటంతో, అతని స్నేహితులే ఆ కోట్ల రూపాయలపై కన్నేశారు.ఈ నేపథ్యంలోనే సుమంత్‌ను అతని స్నేహితులు కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాపర్ల చెర నుంచి ఒక స్నేహితురాలి సహాయంతో సుమంత్ అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే తేరుకున్న బాధితుడు ఆగస్టు 28న తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, పోలీసు కస్టడీలో వారు విస్తుపోయే నిజాలు వెల్లడించారు.నిందితులు ఇచ్చిన సమాచారంతో తాటితోపు వద్ద ఉన్న చందు ఇంట్లో దాచిపెట్టిన రూ. కోటి 10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేసిన పోలీసులు.. మోహన్, బాలాజీ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ ఉదంతంలో ప్రధాన సూత్రధారులుగా ఉన్న యశ్వంత్, మనోజ్, గౌతంలు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ మరోసారి ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల మీద విశ్వసనీయత పోతే.. నిరుద్యోగుల కలల రెక్కలు విరిగిపోతాయంటూ సోమవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘‘లక్షలాది మంది అభ్యర్థులు తమ జీవితాన్ని.. కుటుంబాల కష్టార్జితాన్ని ఉద్యోగ పరీక్షల కోసం ఖర్చు చేస్తున్నారు. వారికి కావాల్సింది ఒక్కటే.. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా.. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం. వ్యవస్థే విఫలమైతే దెబ్బతినేది కేవలం పరీక్ష ఫలితాలు కాదు.. మొత్తం నియామక ప్రక్రియపై యువత పెట్టుకున్న నమ్మకం.చంద్రబాబూ.. న్యాయం చేయడం మీకు ఒక ఆప్షన్ కాదు.. ప్రభుత్వపరంగా మీ బాధ్యత. కష్టపడి చదివిన అభ్యర్థుల శ్రమకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై లేదా?.వారి భవిష్యత్తుకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం మీకు లేదా? డీఎస్సీలో బయటపడిన స్కాంకు మీరు బాధ్యత వహిస్తారా? లేదా? నిరుద్యోగుల కలలతో ఆడుకోవడం కాదు..వారి కష్టానికి న్యాయం చేయండి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 𝗪𝗵𝗲𝗻 𝗲𝘅𝗮𝗺𝘀 𝗹𝗼𝘀𝗲 𝗰𝗿𝗲𝗱𝗶𝗯𝗶𝗹𝗶𝘁𝘆, 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝗴𝗲𝘁 𝗰𝗹𝗶𝗽𝗽𝗲𝗱!Lakhs of aspirants sacrifice prime years of their lives and their families’ hard-earned money for a fair chance. When the system fails them, it doesn’t just affect the results, it shatters… pic.twitter.com/hyYMHwsYEK— YS Jagan Mohan Reddy (@ysjagan) September 14, 2026 -
దేవుడిని అడ్డం పెట్టుకుని వ్యాపారానికి తెరతీసిన టీడీపీ నేతలు
సాక్షి,విజయవాడ: వినాయక చవితి ఉత్సవాలను అడ్డుపెట్టుకుని అధికార టీడీపీ నేతలు నిబంధనలను గాలికొదిలేశారు. ప్రజల భద్రత దృష్ట్యా మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలకు తిలోదకాలిచ్చారు. దేవుడి పేరుతో ఇష్టానుసారంగా వ్యాపారాలకు తెరతీశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.విజయవాడలోని సితార సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్స్‌లో గణపతి ఉత్సవాల మాటున ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ప్రజల భద్రత,రద్దీ నియంత్రణను పరిశీలించిన విజయవాడ మున్సిపల్ కమిషనర్.. ఆ ప్రాంతంలో ఎగ్జిబిషన్లు, ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. కేవలం వినాయక మండప ఏర్పాటుకు, పూజా కార్యక్రమాలకు మాత్రమే అనుమతిని ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఎలాంటి ఎగ్జిబిషన్లు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ పేరుతో ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడకూడదని కఠిన ఆదేశాలు జారీ చేశారు.మున్సిపల్ అధికారుల నుంచి అనుమతులు రద్దయినప్పటికీ గ్రౌండ్లో మాత్రం ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టుల ఏర్పాటు పనులు నిరాటంకంగా కొనసాగుతుండటం గమనార్హం. టీడీపీ నేత డూండీ రాకేష్ ఆధ్వర్యంలోనే ఈ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల ఆదేశాలు బేఖాతరు చేసి పనులు వేగంగా జరుగుతున్నా, స్థానిక మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దేవుడిని అడ్డం పెట్టుకుని తమ స్వార్థం కోసం ప్రజల భద్రతను గాలికి వదిలేస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘టీడీపీ నేత డూండీ రాకేష్‌కు ఒక నిబంధనా? సామాన్యులకు మరో నిబంధనా?’ అంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ పనులను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘అద్దాల’ టెండర్లలో మాయాజాలం
సాక్షి, అమరావతి: శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనుల టెండర్లలో ముఖ్యనేత మాయాజాలానికి ఇదో నిదర్శనం. బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్ (బీవోసీఈ) ఆమోదించిన ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్)ను తుంగలో తొక్కి అంచనా వ్యయాన్ని రూ.553.51 కోట్లు పెంచేసి ఐదు టవర్లకు అద్దాలను అమర్చే పనులకు ఆగస్టు 4న ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) టెండర్లు పిలిచింది. టెండర్లో జాయింట్ వెంచర్లు బిడ్లు దాఖలుకు అర్హత లేదంటూ నిబంధన పెట్టింది. కానీ.. టెండర్లో పనులు దక్కించుకున్నాక 50 శాతం పనులు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించింది. పరస్పర విరుద్ధమైన ఈ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే.. అధిక మొత్తంలో కమీషన్ ఇచ్చే సంస్థకు పనులు అప్పగించేందుకే వాటిని పెట్టారని అప్పట్లోనే నిపుణులు పేర్కొన్నారు. ఆ టెండర్లు రద్దు చేసి.. ఆ తర్వాత ఆ పనులకు ఆగస్టు 31న ఏడు రోజుల స్వల్పకాలిక వ్యవధితో రెండోసారి టెండర్లు పిలిచింది. ఆ టెండర్లను ఈ నెల 9న రద్దు చేసింది. సింగిల్ బిడ్లు దాఖలు కావడంతో తొలిసారి, రెండోసారి టెండర్లు రద్దు చేసినట్టు చెబుతున్నారు. వాటికి ముచ్చటగా మూడోసారి ఈ నెల 11న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 15 నుంచి బిడ్లు దాఖలు చేయవచ్చని పేర్కొంది. బిడ్ల దాఖలు తుది గడువు ఈ నెల 22. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థల దాఖలు చేసిన ఆర్థిక బిడ్లను తెరిచి టెండర్లు ఖరారు చేస్తామని పేర్కొంది. మొద టి, రెండోసారి సింగిల్ బిడ్ దాఖలు కావడంతో వాటిని రద్దు చేసి ఏజీఐసీఎల్ మూడోసారి సింగిల్ బిడ్ దాఖలైనా ఆమోదించేందుకు సిద్ధమైంది.ఎస్ఎస్ఆర్ తుంగలోకి..అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా శాశ్వత సచివాలయం పేరుతో ఐదు టవర్ల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. డయాగ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నిర్మీస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మీస్తున్న మరో టవర్‌కు అద్దాలను అమర్చేలా పోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ డిజైన్లు రూపొందించింది. టవర్లకు గ్లాసింగ్, క్లాడింగ్(అత్యధిక ఉష్ణోగ్రతను, శబ్ద కాలుష్యాన్ని తట్టుకునే డబుల్–గ్లేజ్డ్ అద్దాలను అమర్చడం), క్రౌన్, అట్రియం(భవనాల పైభాగంలో ఉండే శిఖరం నిర్మాణం, విశాలమైన గ్లాస్–రూఫ్ సెంట్రల్ అట్రియమ్), కానోపి, స్కైలైట్(ప్ర«దాన ప్రవేశ ద్వారాల వద్ద టెన్షన్–రాడ్ స్టీల్ కానోపిలు, సహజ వెలుతురు కోసం స్కైలైట్లు), పీవీ ప్యానెల్స్ (భవనం వెలుపల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పర్యావరణ అనుకూల ఐజీబీసీ ప్లాటినమ్ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాల ప్యానెళ్లు), బీఎమ్యూ (ఎత్తైన టవర్ల గ్లాస్‌ను శుభ్రం చేయడానికి, నిర్వహించడానికి ఉపయోగించే ఆటోమేటెడ్, రూఫ్–మౌంటెడ్ టెలిస్కోపిక్ క్రేన్ సిస్టమ్స్ ఏర్పాటు) పనులు చేయాలి. వీటి అంచనా వ్యయం రూపొందించడానికి ఇప్పటివరకు ఎస్‌ఎస్‌ఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయలేదు. దీంతో ఎస్ఎస్ఆర్ ఖరారుకు అనుభవం ఉన్న సంస్థల నుంచి సీఆర్డీఏ కొటేష న్లు ఆహ్వానించింది. ముంబైకి చెందిన ఆల్మెక్ ఫెసాడ్, హైదరాబాద్‌కు చెందిన టీమ్ వర్క్ గ్లాస్ అండ్ అల్యూమినియం, బెంగళూరుకు చెందిన ఇంటెర్ని ఇంటర్నేషనల్ సంస్థలు కొటేషన్లు ఇచ్చాయి. అందులో ఆల్మెక్ ఫెసాడ్ సంస్థ తక్కువ ధరకు కోట్ చేసినట్టు సీఆర్డీఏ పేర్కొంది. శాశ్వ త సచివాలయం ఐదు టవర్లకు డిజైన్లు రూపొందించిన పోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థే.. చైనాలో షెన్జెన్లోని మర్చంట్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ భవనాలను డిజైన్ చేసింది. ఆ భవనాలకు అద్దా లు అమర్చడానికి చేసిన వ్యయాన్ని.. ఆల్మెక్ ఫెసా డ్ కొటేషన్లో పేర్కొన్న ధరను పరిగణనలోకి తీసుకుని.. అన్ని పనులకూ జీఎస్టీతో కలిపి చదరపు అడుగుకు సగటున రూ.80,892గా బీవోసీఈ ఖరారు చేసింది. కానీ.. బీవోసీఈ ఖరారు చేసిన ఎస్‌ఎస్‌ఆర్‌ను తుంగలో తొక్కి అంచనా వ్యయా న్ని పెంచేసి ఏజీఐసీఎల్ టెండర్లు పిలిచింది.అంచనా వ్యయం రూ.553.51 కోట్లు పెంపు అద్దాలను అమర్చే పనులకు జీఏడీ టవర్‌కు రూ.522.15 కోట్లు (అంచనా వ్యయం రూ.442.06 కోట్లు+రూ.80.09 కోట్లు జీఎస్టీ రీయింబర్స్), 1, 2 టవర్లకు రూ.1,073.82 కోట్లు (అంచనా వ్యయం రూ.909.88 కోట్లు+రూ.163.94 కోట్లు జీఎస్టీ రీయింబర్స్), 3, 4 టవర్లకు రూ.859.25 కోట్లు (అంచ నా వ్యయం రూ.727.45 కోట్లు+ రూ.131.79 కోట్లు జీఎస్టీ రీయింబర్స్) వెరసి రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకున్న రోజు నుంచి 15 నెలల్లో వాటిని పూర్తిచేసి.. మరో 13 ఏళ్లు వాటిని నిర్వహించాలని ఏజీఐసీఎల్ షరతు విధించింది. ఐదు టవర్లలోనూ అన్నిరకాల అద్దాలు అమర్చే పనుల విస్తీర్ణం 2,35,092.75 చదరపు మీటర్లుగా లెక్కగట్టింది.ఈ లెక్కన ఆ పనుల అంచనా వ్యయం జీఎస్టీతో కలిపి రూ.1,901.71 కోట్లే.. కానీ రూ.2,455.22 కోట్లతో ఏజీఐసీఎల్ టెండర్లు పిలిచింది. అంటే అద్దాలు అమర్చేందుకు చదరపు మీటరు ధర రూ.1,04,436.22 కావడం గమనార్హం. అంటే.. బీవోసీఈ ఖరారు చేసిన ఎస్‌ఎస్‌ఆర్‌ను బుట్టదాఖలు చేసినట్టు స్పష్టమవుతోంది. దీన్ని బట్టి చూస్తే అంచనా వ్యయాన్ని రూ.553.51 కోట్లు పెంచేశారు. ఎంపిక చేసిన సంస్థకే అధిక ధరలకు పనులు కట్టబెట్టి పెంచేసిన అంచనా వ్యయంతోపాటు భారీగా కమీషన్లు వసూలుకే ఈ టెండర్లలో ముఖ్యనేత మాయాజాలం చేస్తున్నారంటూ ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.ఈ దోపిడీ పర్వం వల్లే సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. ఐదు టవర్ల నిర్మీత ప్రాంతం 52,20,496 చదరపు అడుగులు. అంటే.. నిర్మాణ వ్యయం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58కు చేరుకున్నట్టు స్పష్టమవుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లోనూ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. -
ఒక టీచర్ పోస్టు.. ఆరు మలుపులు!
సాక్షి, అమరావతి: ఒక ఉపాధ్యాయ పోస్టు నియామకంపై అధికారుల వివరణలు మారుతున్నాయని, ప్రతి కొత్త వివరణ టీచర్ అభ్యర్థుల్లో మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆ పోస్టుకు సంబంధించిన టెట్ మార్కులు, ఏడు దశల అర్హత పరిశీలన, డీఈవో ప్రకటన, అభ్యర్థి మళ్లీ టెట్ రాయడం వంటి అంశాలను వరుసగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం వైఎస్ జగన్ పోస్టు చేశారు.తొలి మలుపు: 65 మార్కులతో ఏడు దశల పరిశీలన అభ్యర్థికి 65 టెట్ మార్కులు ఉన్నట్లు చూపించి, ఏడు దశల పరిశీలన అనంతరం ఉపాధ్యాయ పోస్టు ఇచ్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అన్ని దశలు పూర్తయిన తర్వాతే నియామకం జరిగిందని చెబుతున్నప్పుడు, ఆ పరిశీలనలో అభ్యర్థి అర్హతను ఎలా నిర్ధారించారో వెల్లడించాలని ప్రశ్నించారు. రెండో మలుపు: అనర్హుడని డీఈవో ప్రకటన అదే అభ్యర్థి అనర్హుడని డీఈవో నిర్ధారించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. అర్హత లేకపోతే ఏడు దశల పరిశీలనలో ఆ విషయం ఎందుకు బయటపడలేదని నిలదీశారు. ‘‘ఆ ఏడు దశల్లో అసలు ఏం వెరిఫై చేశారు?’’ అన్నది టీచర్ అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అని పేర్కొన్నారు.మూడో మలుపు: ఉద్యోగం ఎలా వచ్చిందో అభ్యర్థికే తెలియదా? తనకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలియదని సదరు అభ్యర్థే చెప్పినట్లు వైఎస్ జగన్ ప్రస్తావించారు. నియామకం పొందిన అభ్యర్థి నుంచి కూడా అలాంటి సమాధానం వచ్చిందంటే, పోస్టు భర్తీ ప్రక్రియపై తలెత్తిన సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.నాలుగో మలుపు: తెరపైకి 2018 టెట్ 77 మార్కులు తాజాగా అధికారులు మరో వివరణ ఇచ్చారని, అభ్యర్థి 2018లో రాసిన టెట్‌లో 77 మార్కులు సాధించినట్లు ధ్రువీకరించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆ మార్కులు అప్పటి నుంచే రికార్డుల్లో ఉంటే నియామక సమయంలో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. 77 మార్కులతో అర్హత ఉందని ఇప్పుడు చెబుతున్నప్పుడు ముందుగా అనర్హుడని డీఈవో ఎందుకు ప్రకటించారని అడిగారు. ఈ వివరణ ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఐదో మలుపు: ఎస్జీటీ పోస్టుకు ‘రాంగ్ పేపర్’? 77 మార్కులు పేపర్ 2బీలో వచ్చినవిగా చెబుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అది స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పేపర్ కాగా, ఎస్ జీటీ పోస్టుకు పేపర్–1ఏ అవసరమని గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో అభ్యర్థి ఏడు దశల అర్హత పరిశీలనను ఎలా దాటారని ప్రశ్నించారు.ఆరో మలుపు: ఉద్యోగం వచ్చాక మళ్లీ టెట్ ఎందుకు? ఉద్యోగం పొందిన తర్వాత కూడా అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాసినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. 2018లో సాధించిన 77 మార్కులే ఎస్జీటీ పోస్టుకు అర్హత కల్పించాయని అధికారులు చెబుతున్నట్లయితే, అభ్యర్థి మరోసారి టెట్‌కు హాజరు కావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు సమాధానం చెప్పాలి ఒకే పోస్టుపై వరుసగా వస్తున్న ఈ వివరణల మధ్య నియామక ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగిందని ఎలా చెప్పగలరని సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం డీఎస్సీ కుంభకోణానికి దారితీయలేదా అని నిలదీస్తూ, దీనికి నైతిక బాధ్యత వహించరా అని నిలదీశారు. అభ్యర్థుల సందేహాలను తీర్చేలా మార్కులు, వర్తించే టెట్ పేపర్, అర్హత పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. అసలు చంద్రబాబు ఇచ్చే వివరణలే మరిన్ని ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు వైఎస్ జగన్. డీఎస్సీలో అక్రమాల ట్విస్టులను వివరిస్తూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ట్విస్ట్ 1: 65 మార్కులు → 7 దశల వెరిఫికేషన్..65 మార్కులు టెట్‌లో వచ్చినా టీచరు పోస్టు ఇచ్చారు.అంతకుముందు ఆ అభ్యర్థి 7 దశల వెరిఫికేషన్ ఎలా పూర్తి చేశాడు?ట్విస్ట్ 2: ఆ అభ్యర్థి అనర్హుడని డీఈవో తేల్చారుమరి ఆ 7 దశల్లో అసలు ఏం వెరిఫై చేసినట్టు?ట్విస్ట్ 3: ఉద్యోగం వచ్చింది... కానీ ఎలా వచ్చిందో అతనికే తెలియదు!మరి ఏడుసార్లు చేసిన వెరిఫికేషన్‌లో ఏం తేల్చారు?ట్విస్ట్ 4: సడన్‌గా తెరపైకి వచ్చిన 77 మార్కులు2018లో రాసిన టెట్‌లో అతనికి 77 మార్కులు వచ్చాయని అధికారులు నిర్ధారించారు.ఆ 77 మార్కులు అప్పటికే రికార్డుల్లో ఉంటే..అంతకుముందే వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?డీఈవో అతన్ని అనర్హుడిగా ఎందుకు ప్రకటించారు?ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఈ వివరణ ఎందుకు బయటకు వచ్చింది?ట్విస్ట్ 5: “రాంగ్ పేపర్” ట్విస్ట్77 మార్కులు వచ్చినట్లు చెబుతున్నది పేపర్ 2లోకానీ SGT పోస్టుకు అవసరమైన టెట్ కేటగిరీ Paper-I-A.మరి అవేమీ చూడకుండానే అతను 7 దశల వెరిఫికేషన్‌ను ఎలా దాటాడు?ట్విస్ట్ 6: ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ టెట్ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాశాడు.2018లో వచ్చిన 77 మార్కులతోనే అతనికి అర్హత ఉంటే..మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రశ్నలు:ఇదేనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ?ఇలాంటి వ్యవహారాలే డీఎస్సీ స్కామ్‌కు అవకాశం కల్పించలేదా?చంద్రబాబూ.. ఇప్పటికైనా ఈ స్కాంలకు మీరు నైతిక బాధ్యత వహిస్తారా? లేదా? 𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!@ncbn Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants.𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄… pic.twitter.com/MP38UWEkxD— YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2026 -
‘డీఎస్సీ అక్రమాలకు సీఎంగా బాబు నైతిక బాధ్యత వహించరా?’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబూ.. డీఎస్సీ నియామకాలను నిజంగా నిష్పక్షపాతంగా..పారదర్శకంగా నిర్వహించాలన్నదే మీ ఉద్దేశమైతే అర్హత పరీక్ష అవసరం లేకుండా జీవోలు ఎందుకు జారీ చేశారు?. క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు?.డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు?. డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానం.. దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు?అర్హత పరీక్ష నిబంధనను తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా?.నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించిన దానిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా?’అంటూ ధ్వజమెత్తారు. .@ncbn Garu, if your intention was to conduct a fair and transparent recruitment, why were GOs issued dispensing with the requirement of a qualifying examination? And after the DSC process was completed, why were the policies amended in a manner that restored the old… pic.twitter.com/vzDTCvOwGE— YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2026ఇదీ చదవండి : ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్ -
చంద్రబాబుది టెన్షనా.. ఫ్రస్టేషనా?
బహుశా దేశంలో ఎక్కడా ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితి ఉండదేమో! గొడ్డలి పార్టీ, వెన్నుపోటు పార్టీ అంటూ విమర్శలు చేసుకునే రాజకీయం ఏపీలో సాగుతోంది. దీనికి 50 ఏళ్ల రాజకీయ చరిత్రతో , సుదీర్గకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధాన కారణం కావడం అత్యంత శోచనీయం. అంతేకాదు.. తనది పొలిటికల్ గవర్నెన్స్, అంటే రాజకీయ పాలన అని బహిరంగంగా చెబుతున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా ఈయనే కావచ్చు. ఆయనే చంద్రబాబు నాయుడు. వయసు రీత్యా కూడా ఆయన ఏపీలో ఉన్న రాజకీయవేత్తలలోకల్లా పెద్దవారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఈ సమయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విన్యాసాలు ఏపీ సమాజానికి ఎంత ప్రయోజనం అన్న ప్రశ్న వస్తుంది. పోనీ ఆయన చెప్పే విషయాలలో నిజాలు ఉంటే అదో రకం. సత్యాసత్యాలతో నిమిత్తం లేకుండా ఆయన మాట్లాడేస్తుంటారు. దీనిని బట్టి ఆయన ఏదో టెన్షన్ లోనో, లేక ఫ్రస్టేషన్ లోనో ఉన్నారేమో అన్న భావన పలువురిలో కలుగుతుంది.పైకి అభివృద్దిలో ప్రజాప్రతినిధుల పాత్ర, విజన్ అంటూ మాటలు చెబుతూ, ఆచరణలో ప్రత్యర్ధి పార్టీల మద్దతుదారులకు వారికి అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం చేయకపోవడం రాజకీయ పాలన అన్నమాట. అలాగే ఎమ్మెల్యేలు, ఇతర అధికార పార్టీ నేతలు వ్యవస్థలపై పెత్తనం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడినా ఎవరూ నోరెత్తకపోవడం అన్నమాట. ఇది సరైన విధానమేనా అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు అరాచకాలు చేసిన సంగతి ప్రజలు మర్చిపోతారా? ఈ సారి పేరు మార్చి పొలిటికల్ గవర్నెన్స్ అని ప్రజలను పీడిస్తుంటే గమనించలేరా!వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికి పదిహేనేళ్లుగా రాజకీయాలలో ఉంది. ఐదేళ్లు అధికారంలో ఉంది. ఆ పార్టీ ఇప్పుడు సడన్ గా గొడ్డలి పార్టీ ఎలా అయింది.అదేమిటంటే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఉదహరిస్తారు. దానిని జగన్‌కు ఆపాదించాలని విశ్వయత్నం చేస్తుంటారు. ఇందులో నిజం ఏమిటి? అసలు జగన్‌కు ఆ కేసుతో సంబంధం లేదని సీబీఐ విచారణలో నిర్ధారణ అయిన తర్వాత కూడా చంద్రబాబు ఆరోపణలు చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారో అర్ధం కాదు.ఈ కేసులో స్వయంగా గొడ్డలితో నరికానని చెప్పిన ఒక నిందితుడికి పరోక్షంగా టీడీపీ ఎందుకు మద్దతు ఇస్తోంది? అంటే అప్పుడు గొడ్డలి పార్టీ అని దేనిని అనాలి? అతనికి టీడీపీ తరపున వాదించే లాయర్ ఎందుకు పనిచేస్తున్నారు? అలాగే వివేకా కుమార్తె సునీత ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా రకరకాల పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? ఆమెకు కూడా టీడీపీ సహకారం ఎందుకు ఇస్తోంది? పైగా వివేకా హత్య కేసు జరిగింది 2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కదా! అప్పటి పోలీసు అధికారులు ఎందుకు జగన్‌పై అభియోగాలు మోపలేకపోయారు? అప్పటి సిట్ నివేదిక ఏమి చెబుతోంది?ఇవన్ని పట్టించుకోకుండా చంద్రబాబు ఐదేళ్ల తర్వాత గొడ్డలి పార్టీ అని మాట్లాడడం ద్వారా తన స్థాయిని తాను తగ్గించుకున్నట్లు అనిపించదా! పోనీ మరికొన్ని ఇతర హత్య కేసులు చూస్తే ఎందరు టీడీపీవారు అందులో భాగస్వాములుగా ఉన్నరన్న అభియోగాలు ఎన్ని ఉన్నాయి? ఉదాహరణకు వంగవీటి రంగా హత్య కేసులో నిందితులు టీడీపీ వారా, కారా? వారిలో కొందరు ఎమ్మెల్యేలు ఎలా అయ్యారు? స్వయంగా రంగా కుమారుడు గతంలో ఏ ఆరోపణ చేసింది గుర్తు లేదా? అంతెందుకు కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యలు ఎన్ని? ఉదాహరణకు వినుకొండలో రషీద్ హత్య, పల్నాడులో సాల్మన్ హత్య.. ఇలా పలు ఘటనలలో నిందితులు టీడీపీవారే కదా! మరి టీడీపీ గొడ్డలి పార్టీ లేక కత్తుల పార్టీ అవుతుందా?కొన్నాళ్లపాటు వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోలేదు. కొన్నిసార్లు మాత్రం జవాబు ఇచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీని బూడిద పార్టీ అని అంటే, మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ తడిగుడ్డలతో గొంతు కోసే పార్టీ అని అన్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయికృష్ణ అనే నిందితుడిని చిత్రహింసలు పెట్టడంతో చనిపోయాడు. తదుపరి అతని బూడిద కూడా లేకుండా చేసిన ఘటనను దృష్టిలో పెట్టుకుని వారు ఈ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత టిడిపికి వెన్నుపోటు పార్టీ అని నామకరణం చేసి అలాగే పిలవడం ఆరంభించారు. జగన్ కూడా మీడియా సమావేశాలలో అదే పేరుతో సంబోధిస్తున్నారు.వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అనడానికి ఆధారాలు లేవు కాని, టీడీపీని వెన్నుపోటు పార్టీ అనడానికి అవసరమైన అన్ని ప్రాతిపదికలు ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్వయంగా చంద్రబాబును ఆయన మామగారైన ఎన్.టి.రామారావే ఏ వ్యాఖ్యలు చేసింది వారు ప్రస్తావిస్తున్నారు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన ఘట్టాన్ని ఉదహరిస్తున్నారు. ఆయా ఎన్నికలలో ఎన్నిరకాల హామీలు ఇచ్చి, వాటిని ఎగవేయడం ద్వారా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్న విమర్శలు కూడా చేస్తున్నారు. 2014 లో ఇచ్చిన హామీలనే కాకుండా, 2024 లో ఇచ్చిన హామీలను కూడా గుర్తు చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు 1500 రూపాయల ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే నిరుద్యోగులకు మూడువేల రూపాయల భృతి ఇస్తామని తెలిపారు. బీసీలతో సహా బలహీనవర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీ ఇచ్చారు.ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి, వాటిని ఎగవేయడం ఆయా వర్గాలను వెన్నుపోటు పొడిచినట్లేనని వైఎస్సార్సీపీ నేతల విమర్శ. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి టీడీపీలో ఉండదు. కాకపోతే తమ మీడియా బలంతో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమింప చేసే యత్నం జరగవచ్చు. కాని వాటిని ఎల్లవేళలా నమ్మరు కదా! ఇంతకుముందు వైఎస్సార్‌సీపీవారు తెలుగుదేశం పార్టీని పేరు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శలు చేసేవారేమో! కాని చంద్రబాబు వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని పిలుస్తుండడంతో, జగన్ తో సహా పార్టీ నేతలంతా టీడీపీని వెన్నుపోటు పార్టీ అని పిలుస్తున్నారు. చిత్రమేమిటంటే చంద్రబాబు తాము క్రిమినల్స్‌తో పోరాటం చేస్తున్నామని వైఎస్సార్సీపీని ఉద్దేశించి మీడియా సమావేశాలలో అంటారు. తీరా చూస్తే ఏపీలో అత్యధికంగా 79 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్స్ కేసులు ఉన్నాయి. కూటమి ఎమ్మెల్యేలే 164 మంది ఉన్నారు కదా! అంతేకాదు.. చంద్రబాబుపైనే 19 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది.జగన్ వల్ల అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారట. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించిన తర్వాత కేసులు వచ్చాయే తప్ప ముందు కాదు కదా! ఆ కేసులు పెట్టడానికి కాంగ్రెస్‌తో కలిసింది తెలుగుదేశం పార్టీనే కదా ! పారిశ్రామికవేత్త జిందాల్‌పై కేసు పెట్టాలని యత్నించి కూటమి సర్కార్ ఎందుకు వెనక్కి తగ్గింది. నటి జత్వాని కేసులో ఐపీఎస్‌లపై తప్పుడు కేసులు పెట్టినట్లు సర్కారే అంగీకరించింది కదా! మరి స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుతో పాటు కొందరు అధికారులు అరెస్టు అయ్యారు కదా! దాని గురించి ఏమి చెబుతారు! అనవసరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే టీడీపీ కార్యకర్తలు నమ్మినట్లు నటిస్తారేమో కాని, వారికి కూడా అసలు విషయాలు తెలియకుండా ఉంటాయా? ఏది ఏమైనా చంద్రబాబు తన హోదాకు తగిన రీతిలో హుందాగా వ్యవహరించి, సరైన పద్దతిలో ప్రసంగాలు చేయకపోతే ఆంధ్ర సమాజానికి తీరని నష్టం చేసిన వారవుతారేమో!కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీ డీఎస్సీ స్కామ్‌లో సంచలన పరిణామం
సాక్షి,విశాఖ: ఏపీ డీఎస్సీ స్కామ్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో టీచర్ ఉద్యోగాలు పొందిన చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఫేక్ అని తేలడంతో చర్చాంశనీయమైంది. ఈ వ్యవహారంపై ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ సెక్రెటరీ మేకల సీతారామిరెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) అధికారులకు సంచలన లేఖ రాశారు.ఈ ఫేక్ సర్టిఫికేట్ల బండారాన్ని సాక్షి టీవీ తొలుత బయటపెట్టగా, తాజాగా ఖోఖో అసోసియేషన్ అధికారిక లేఖతో విషయం మరింత స్పష్టమైంది. శాప్‌కు రాసిన లేఖలో‘చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలకు సర్టిఫికేట్లు మేం ఇవ్వలేదు.శాప్ నుండి వీళ్ల అభ్యర్థిత్వంపై ఎలాంటి సమాచారం మాకు అందలేదు. వీళ్లు ఇద్దరికి మేం ఎలాంటి మెరిట్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. మా టోర్నమెంట్ల జాబితాల్లో ఎక్కడా వీరి పేర్లు లేవు. శాప్‌కి మేం పూర్తి వివరాలు అందిస్తున్నాం. వీళ్లు పొందుపర్చిన సర్టిఫికేట్లు చెల్లవు.నకిలీ, ఫోర్జరీ సర్టిఫికేట్లపై విచారణ జరపాలి. ఆ సర్టిఫికేట్లపై చర్యలు తీసుకోవాలి. శాప్‌కి మేం పూర్తి సహకారాన్ని అందిస్తాం’అని ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ సెక్రెటరీ మేకల సీతారామిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
అవసరం 1,581 ఎకరాలు.. సమీకరణ 6,212 ఎకరాలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో 6,212.50 ఎకరాల సమీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూసమీకరణ పథకం (ఎల్పీఎస్) కింద గుంటూరు జిల్లాలో కంతేరులో 974, తాడికొండలో 5,238.50 ఎకరాల సమీకరణకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వే లైన్, ఐఆర్ఆర్, గ్రిడ్ రోడ్ విస్తరణ కోసం ఈ భూ సమీకరణ చేయనున్నారు. ఎర్రుపాలెం–నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం (ఇరు వైపులా 50 మీటర్లు బఫర్ జోన్), ఇంటర్నల్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), గ్రిడ్ రోడ్‌ను ఐఆర్ఆర్ వరకూ విస్తరించే పనులకు కంతేరు, తాడికొండలో భూసమీకరణకు ఆగస్టు 28న సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదించింది. అయితే ఇందుకు 1,581.34 ఎకరాలు సరిపోతుందని అంచనావేస్తుండగా, దీనికి భిన్నంగా 6,212.50 ఎకరాల సమీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం గమనార్హం. సమీకరణల తీరిది.. ⇒ కంతేరులో పట్టా భూమి (దేవాదాయ.. వక్ఫ్ భూమితోపాటు) 3,299.66 ఎకరాలు, అటవీ–ప్రభుత్వ భూమి 304.78 ఎకరాలు, అసైన్డు భూమి 67.97 ఎకరాలు మొత్తం 3,672.41 ఎకరాలు ఉంది. అయితే రైల్వే లైన్ కోసం 148.30, ఐఆర్ఆర్ కోసం 58.03, ఐఆర్ఆర్ వరకూ గ్రిడ్ రోడ్ విస్తరణ కోసం 35.65 మొత్తం 241.98 ఎకరాలు అవసరం కాగా.. 974 ఎకరాలను సమీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. ⇒ తాడికొండలో పట్టా భూమి(దేవాదాయ.. వక్ఫ్ భూమితోపాటు) 11,216.12 ఎకరాలు, అటవీ–ప్రభుత్వ భూమి 1,445.47 ఎకరాలు, అసైన్డు భూమి 135 ఎకరాలు మొత్తం 12,796.59 ఎకరాలు ఉంది. ఇక్కడ రైల్వే లైన్ కోసం 701.26, ఐఆర్ఆర్ కోసం 167.79, ఐఆర్ఆర్ వరకూ గ్రిడ్ రోడ్ విస్తరణ కోసం 470.31 మొత్తం 1,339.36 ఎకరాలు అవసరం కాగా.. 5,238.50 ఎకరాలను సమీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. -
‘‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా లోకేశే.. రాజీనామా చేయాల్సిందే’’
సాక్షి,తాడేపల్లి: కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అమ్మకానికి పెట్టారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీఎస్సీ స్కామ్ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న డీఎస్సీ స్కామ్ అక్రమాలపై సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.డీఎస్సీ అక్రమాలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. అడ్డ దారిలో ఉద్యోగాలు పొందినవారి వివరాలు ప్రతిరోజూ బయటకు వస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?.ఇద్దరు మహిళా అధికారులతో మాట్లాడించారు. డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో లోకేష్ రాజీనామా చేయాలి. ఏపీలో అమ్మకానికి టీచర్ పోస్టులు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఆమాటకొస్తే రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టారు. టీచర్ పోస్టుల అమ్మకం వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నారా లోకేషే.కుంభకోణం చిన్నది కాదు, చేయించింది చిన్నవారు కాదు. మొదట డీఎస్సీలో అక్రమాలు జరగలేదన్నారు.ఇప్పుడేమో అక్కడక్కడా తప్పులు జరిగాయేమో అంటున్నారు. మా దృష్టికి వస్తే విచారణ జరుపుతామని చెప్తున్నారు.ఈ తప్పులు చేసిందీ, చేయించింది చిన్న వ్యక్తులు కాదు. దీనంతటి వెనుక ఉన్నది నారా లోకేషేనని తేలిపోయింది. డీఎస్సీ అక్రమాలు జరిగినందునే సాక్షితోపాటు మిగతా మీడియా సంస్థలు వార్తల్ని ప్రసారం చేస్తున్నాయి. అక్రమాలపై విచారణ జరపమనే మేమూ కోరుతున్నాం. అయితే లోకేష్‌కు వ్యతిరేకంగా విచారణ జరుగుతుందని ఎలా నమ్మాలి?.స్కాం జరిగినప్పుడు ఎవరు చేశారు? ఎలా చేశారో బయటకు తీయాలి. ఏదైనా తప్పులను చూపిస్తే దాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.మీడియా విచారణ చేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాను సెన్సార్ షిప్ చేయటం దుర్మార్గం. ఏపీలో అప్రకటిత ఎమర్జన్సీ అమలవుతోంది.స్పోర్ట్స్ కోటాలో అధికభాగం టీచర్ పోస్టులను అమ్మేసుకున్నారు.బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు పోస్టు ఎందుకు రాలేదు?. నవీన్ అనే టాపర్ పేరు లిస్టులో పెట్టి, తర్వాత ఎందుకు తీసేశారు?. దీనిపై నవీన్ హైకోర్టుకు వెళ్లడంతో అక్రమాల డొంక కదిలింది. నవీన్ ఇష్యూపై అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ వేర్వేరు ప్రకటనలు చేశారు.డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీలో నవీన్ పాల్గొన్నాడు.పేపర్ లీక్ అయింది. ప్రశ్నలను అమ్ముకున్నారు.120 ప్రశ్నలను రూ.3 లక్షల చొప్పున అమ్ముకున్నారు. అనేక అంశాలపై ఆధారాలు ఉన్నాయి. క్రీడా సంఘాల నుండి ఫేక్ సర్టిఫికేట్ తెచ్చి టీచర్ పోస్టులు అమ్మేసుకున్నారు. ఫేక్ టీచర్లు విద్యార్థులకు ఏం చదువులు చెప్తారు?.అర్హులకు అన్యాయం చేస్తే వారి జీవితాలు ఏం కావాలి?.డీఎస్సీలో అక్రమాలు చేసిన వారు జైల్లో ఉండాలి. బాధ్యత కలిగిన మంత్రి లోకేష్ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవాలు మాట్లాడకుండా నోరు పారేసుకుంటున్నారు. సవాల్ చేసే లోకేష్ శాసనమండలికి వచ్చి ఎందుకు సమాధానం చెప్పలేదు?. జూడో సర్టిఫికేట్లను ఫోర్జరీ చేసిన నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారు.వారు ఇచ్చిన సర్టిఫికేట్లు ఫోర్జరీ అని తెలిసినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?. దొంగల ముఠాలాగా వ్యవహరిస్తున్నారు.రేపు విచారణ జరిగితే అధికారులు కూడా తప్పించుకోలేరు. తప్పు జరిగినా బరితెగించి మాట్లాడుతున్నారు.మేము బయట పెట్టిన కేస్ స్టడీస్‌కు మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో తప్పులు చేసిన వారు జైలు పాలయ్యారు. హర్యానాలో అప్పటి సీఎం, ఆయన కుమారుడు జైలు పాలయ్యారు. చంద్రబాబు, లోకేష్ డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని చెప్తున్నారు.మరి తప్పులు జరిగాయని అధికారులు ఎలా చెప్పారు?. చంద్రబాబు తన కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే మాకు అందించవచ్చు. లోకేష్ రాజీనామా చేయాల్సిందే సీబీఐతో విచారణ జరపాల్సిందే.కేంద్రంలో కూడా వారి ప్రభుత్వమే ఉన్నప్పుడు లోకేష్, చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?’అని ప్రశ్నించారు.👉ఇదీ చదవండి : టోరీ జరగలేదు... సర్టిఫికెట్ వచ్చింది! -
అక్రమాలు చేయడం చంద్రబాబు నైజం
సాక్షి,వైఎస్సార్: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అక్రమాలు చేయడమనేది చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌కు నైజంగా మారిందన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అబద్ధాలు అక్రమాలతో కూటమి ప్రభుత్వం నడుస్తోందని ఏపీలో టెట్ రాయకపోయినా టీచర్ ఉద్యోగం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటలు ఆడకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేశారని చంద్రబాబు మెుసలి కన్నీరు కారుస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి’అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. -
డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం అంగీకారం!
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో బయటపడుతున్న అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం అంగీకరించింది జూడో సర్టిఫికెట్లపై విజిలెన్స్ విచారణ చేపడుతున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్ - SAAP) ప్రకటించింది.ఈ వివాదంపై శాప్ వైస్ చైర్మన్ భరణి స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. ‘స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పూర్తి స్థాయి పరిశీలన మా పరిధిలో సాధ్యం కాదు. స్పోర్ట్స్ అసోసియేషన్లు జారీ చేసే సర్టిఫికెట్లను మేము ప్రాథమికంగా ఒరిజినల్‌గానే భావిస్తాము’ అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, అక్రమాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్యలు వేగవంతం చేశామని తెలిపారు. కర్నూలుకు చెందిన ఉపాధ్యాయుడు ప్రభాకర్‌పై వస్తున్న ఆరోపణలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. మరోవైపు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అన్సారియా ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామని, ఆ నివేదిక రాగానే తగిన నిర్ణయం తీసుకుంటామని శాప్ వైస్ చైర్మన్ భరణి వెల్లడించారు. -
మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్
-
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,కాకినాడ: తాళ్ళరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మట్లపాలెం గ్రామం వద్ద వేగంగా వస్తున్న ఆటో, బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సమాచారం మేరకు.. కృష్ణ, మణికంఠ, తమ్మి అనే ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై కాకినాడ నుండి యానం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాళ్ళరేవు మండలం మట్లపాలెం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటో వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద తీవ్రతకు తీవ్ర గాయాలపాలైన కృష్ణ, మణికంఠ ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలతో ఉన్న మరో యువకుడు తంబిని స్థానికులు తక్షణమే కాకినాడ జిజిహెచ్ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అతను కన్నుమూశాడు. ఒకే ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
42 ఉద్యోగ సంఘాలకు లేఖ రాసిన ఏపీ JAC అమరావతి
-
కూటమి సర్కార్‌పై మా పోరాటం ఆగదు: బొప్పరాజు
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని.. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను మరోమారు గుర్తుచేసిన ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ సదస్సు.. ఎన్నికల సమయంలోనూ, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోను ప్రదర్శించారు.ప్రభుత్వం బెదిరింపులకు ఏపీ జేఏసీ అమరావతి భయపడదు. మా డబ్బును కూడా ప్రభుత్వం వాడుకుంది. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తున్నారు.. ఇక్కడ ఎందుకు ఇవ్వరు. ఇతర రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తున్నారు. మా ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలనే మేం అడుగుతున్నాం. మాకు రావాల్సిన హక్కులనే మేం ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వలేదు. ఇలా జరగడం చరిత్రలో తొలిసారి’’ అంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘స్మార్ట్ హెల్త్ కార్డులు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అసలు హెల్త్ కార్డులు ఎలా ఉంటాయో కూడా మాకు తెలియదు. కళ్లద్దాలకు కూడా బిల్లులు పెట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్‌లు తీసుకుంటున్నారు. కానీ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి సదుపాయం లేదు. 60 రోజుల్లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సమస్య పరిష్కారం కావాలని గత ఏడాది చంద్రబాబు జీవో ఇచ్చారు. ఈ రోజుకీ జీవో అమలు కాలేదు’’ అంటూ బొప్పరాజు మండిపడ్డారు.ఇదీ చదవండి: జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్ -
అమరావతిలో మరో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్
విజయవాడ: అమరావతిలో మరో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. మోతడక భూ సమీకరణకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ద్వారా 1,654 ఎకరాలు రైతుల నుంచి సమీకరిస్తారు. ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం -
బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి?
ఏపీలో ప్రస్తుత సచివాలయంలో సుమారు మూడువేల మంది పనిచేస్తుంటారు. పోనీ ఏ రకంగా చూసినా ఐదువేల మంది మించి ఉండరు. కాని అమరావతి రాజధానిలో సచివాలయం కోసం చేపట్టిన భారీ టవర్లలో 16వేలమంది పని చేయవచ్చట. అంత పెద్ద టవర్లు ఏం చేస్తారు? ఈ సందేహం ఏ సామాన్యుడికైనా వస్తుంది? కాని అంతర్జాతీయ మీడియాగా పేరొందిన న్యూయార్క్ టైమ్స్‌కు రాకపోవడమే విచిత్రం అనిపిస్తుంది.ఈ మీడియా అమరావతిపై ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. దానిని తెలుగుదేశం పత్రికలు ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చాయి. ఆంధ్రజ్యోతి అయితే అమరావతి.. అనితర సాధ్యం అన్న శీర్షికన ఈ వ్యాస కథనాన్ని అందించింది. ఒక అంతర్జాతీయ మీడియా అమరావతికి సంబంధించి మంచి, చెడు లేదా లాభ, నష్టాలు రెండూ ఇస్తే ఎవరూ తప్పు పట్టనక్కర్లేదు. కానీ, ఆ వ్యాసం చదివితే ఇంత పెద్ద మీడియా సంస్థలు కూడా ఏకపక్షంగా కథనాలు ఇస్తాయా? అమెరికాలో కూడా పత్రికా ప్రమాణాలు దిగజారి ఉంటాయా అన్న సందేహం కలుగుతుంది.మోస్ట్ లివబుల్ సిటీ అమరావతి అని ఈ వ్యాసానికి శీర్షిక పెట్టారు. వినడానికి ఎంత బాగుంది. అమరావతిలో నివసిస్తే ఓ పాతికేళ్లు అధికంగా బతకవచ్చని చంద్రబాబు తన ఉపన్యాసాలలో చెబుతున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషిస్తారు. కానీ, ఈ వ్యాసం వచ్చిన కొద్ది రోజులకే, చంద్రబాబు స్పీచ్ ఇచ్చిన కొన్నాళ్లకే జరిగిన శాసనసభ సమావేశాలలో ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే టీడీపీ ఎమ్మెల్యే శ్రావణకుమార్ ఏమి చెప్పారో తెలుసా! అమరావతిలో గ్రామాల ప్రజలు నానా పాట్లు పడుతున్నారని, సరైన రోడ్లు లేవని, ఇతర వసతులు లేవని, రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండడం లేదని ఆయన వాపోయారని వార్తలు వచ్చాయి. మంత్రులు నిధులు కేటాయించినా పనులు జరగడం లేదని ఆయన వాపోయారు.న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రతినిధులు నిజంగా ఈ ప్రాంతాన్ని సందర్శించే రాశారా? లేక ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా రాసిచ్చిన దానిని ముద్రించారా అన్నదానిపై కొందరికి డౌట్లు ఉన్నాయి. కారణం ఏమిటంటే ఏ వ్యాసం రాసినా పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. కానీ, ఇందులో పూర్తిగా ఏకపక్షంగా పాజిటివ్ వ్యాఖ్యలే కనిపిస్తాయి. ఇది పెయిడ్ ఆర్టికిల్ వంటిదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దానిని కూడా పట్టించుకోనవసరం లేదు. అయితే ఈ వ్యాసకర్తలు అనుసరించాల్సిన ప్రమాణిక సూత్రాలు పాటించినట్లు కనిపించకపోవడమే అసలు సమస్య.న్యూయార్క్ టైమ్స్ విలేకరులు అమరావతి సందర్శించడం చంద్రబాబుకు లేదా మంత్రి నారాయణకు తెలియకుండా జరుగుతుందా? పైగా అంతర్జాతీయ మీడియా వారు వస్తుంటే చంద్రబాబు కలవకపోవడమన్నది నిజంగా జరిగితే ఆశ్చర్యమే. ఎందుకంటే మామూలు స్థానిక మీడియాకే విశేష ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి అంతర్జాతీయ మీడియా వస్తుంటే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటారా! అమరావతిని ఫలానా పెద్ద మీడియా వారు చూసి వెళ్లారన్న వార్తనే హడావుడి చేసి ఉండేవారు కదా! వారు మంత్రి లోకేష్‌తో మాత్రమే ఎందుకు మాట్లాడారో తెలియదు. సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను సంప్రదించలేదా? నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నంత వరకు ఆక్షేపణ లేదు. కానీ, వారు అమరావతి గురించి మరీ అతిగా పొగిడారా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.ఏపీకి రాజధాని నిర్మాణాన్ని ఎవరూ కాదనడం లేదు. అవసరమైన భవనాలు కట్టుకోవచ్చు. కాని ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు?వారికి ఎంత విస్తీర్ణంలో భవనాలు కావాలి? ఎంత నిర్మిస్తున్నారు? అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుంది కదా! అలా కాకుండా అవసరాన్ని మించి నాలుగైదు రెట్ల అదనంగా నిర్మాణం చేపట్టిన తీరును ప్రశ్నించాలి కదా! అమెరికాలోని కాపిటల్ హిల్స్, ఇతర ప్రభుత్వ భవనాలు ఉన్న విస్తీర్ణం గురించి గూగుల్‌లో అడిగితే వచ్చిన సమాధానం ఇది.. Capitol Hill is a historic residential neighborhood and the legislative center of the United States government in Washington, D.C., covering just under 2 square miles (5 square kilometers).ఇవి కూడా చదవండి: రేవంత్ టూర్‌కు ‘నో’ పర్మిషన్.. కేంద్రం మరో కోణం ఇదేనా?కాపిటల్ హిల్ అనేది వాషింగ్టన్, డీ.సీ.లోని ఒక ప్రాంతం, ఇది ఈశాన్య మరియు ఆగ్నేయ చతుర్భుజాలలో విస్తరించి ఉంది. బహుశా అన్ని ప్రభుత్వ ఆఫీస్‌లు ఇందులో ఉన్నాయో లేదో తెలియదు. కాని అంత పెద్ద రాజధానిలో కేవలం 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఈ భవనాలు ఉంటే, భారత్‌లో ఒక చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోంది.మరో ఉదాహరణ చూద్దాం. అమెరికాలో అతి పెద్దదైన రాష్ట్రాలలో ఒకటైన కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటో అనే చోట ఉంది. అక్కడ కేవలం 39 ఎకరాలలో పది బ్లాక్‌లలో ఆఫీస్‌లు ఉన్నాయట. అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ ఆఫీస్‌లు అన్నీ కలిపి 4,72,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని గూగుల్ చెబుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అన్ని ఆఫీస్‌లు కలిపి 300 ఎకరాలలోనే ఉన్నాయన్నది ఒక అంచనా. అమరావతిలో ఏభై లక్షలు, అరవై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారు? ఈ విషయాలేవీ న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులకు తెలియవా? అంటే ఏమి చెబుతాం. అమరావతిలో కేవలం సచివాలయానికే, పరిపాలన కార్యాలయాలకు ఐదు టవర్లు, అతి పెద్ద టవర్‌పై అంతస్తులో సీఎం ఆఫీస్, ఆ పైన హెలిపాడ్ ఉంటాయట.అప్పుల కుప్పగా ఉన్న ఏపీకి ఇంత ఆర్భాటం, అట్టహాసం అవసరమా? దానివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వేశారో, లేదో తెలియదు. క్వాంటమ్ వ్యాలీ గురించి, ఇతరత్రా చంద్రబాబు చేస్తున్న కృషి గురించి వివరించారు. యధా ప్రకారం లోకేష్ విభజన సమయంలో కట్టుబట్టలతో ఏపీకి తరలివచ్చేశామని కూడా వారికి చెప్పేశారట. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదలి ఎందుకు అలా చేయవలసి వచ్చిందన్న ప్రశ్న సహజంగా జర్నలిస్టులకు వస్తుంది. మరి వీరికి ఎందుకు రాలేదో అర్థం కాదు.ఈ అమరావతి భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? ఏభై వేల కోట్ల అప్పు ఎందుకు సమీకరించారు. ఇంకా మరో 1.75 లక్షల ఎకరాల భూమి సేకరణ అవసరం ఏమిటి? ఆ భూములలో మౌలిక వసతుల కల్పనకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి? ఈ అప్పులు ప్రజలపై భారం కాదా? భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఎప్పటికి ఇస్తారు? వారికి అవసరమైన మౌలిక వసతులకు అయ్యే వ్యయం ఎంత? పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులను వేధించారన్నది నిజమా? కాదా? రైతుల గోడును విన్నారా? లేదా? మూడు పంటలు పండే భూములను ఇలా చేయడం పర్యావరణ విధ్వంసం అవుతుందా? కాదా? వరదపీడిత ప్రాంతంలో రాజధాని ఎలా కడుతున్నారు? ఆ వరదను ఎత్తిపోయడానికి లిఫ్ట్‌లు కట్టడమేమిటి? ఇలాంటి అనేక సందేహాలను వారు ముఖ్యమంత్రి లేదా కీలక మంత్రితో మాట్లాడి నివృత్తి చేసుకుని అన్ని విశేషాలతో వ్యాసం రాసి ఉంటే దానికి విలువ వచ్చేది కదా!అలాకాకపోతే తెలుగుదేశం మీడియాకు, ఈ అంతర్జాతీయ మీడియాకు తేడా ఏముంటుందని కొందరు ఢిల్లీ జర్నలిస్టులు తమ కామెంట్లలో ప్రశ్నించారట. అది న్యాయార్క్ టైమ్స్ మీడియాకు శోభనిస్తుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇవి కూడా చదవండి: మార్గదర్శి కేసు: తప్పు.. తప్పు కాకుండా పోతుందా? -
పోలీసులే ఇలా ఉంటే ప్రజలు ఇంక ఎవరిని నమ్మాలి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో ఓ వైపు తప్పుడు కేసులు, వేధింపులు కొనసాగుతుంటే.. మరోవైపు రకరకాల మాఫియాలు నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో యథేచ్ఛగా నడుస్తున్న దందాల గురించి మాట్లాడారు.రాష్ట్రంలో అంతా మాఫియానే కనిపిస్తోంది. అమరావతి పేరుతో బిల్డింగ్‌ల స్కామ్ నడుస్తోంది. విలువైన భూములను కొల్లగొడుతున్నారు. వీటికి తోడు విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు అందునా కల్తీ మద్యం రాష్ట్రంలో ప్రతీ చోటా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన మరీ దారుణమని వైఎస్ జగన్ అన్నారు. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోంది.ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో వాటాదారులుగా మారిపోతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో.. మత్తులో పోలీసులే యాక్సిడెంట్ చేసి ప్రజలకు పట్టుబడ్డారు. కారులో గంజాయి, లిక్కర్, ఖాకీ యూనిఫాం దొరికాయి. డ్రైవర్‌తో సహా మరో ఇద్దరూ పోలీసులు మత్తులోనే ఉన్నారు. సీఐ వచ్చి వీడియోలు తీసే జనాల్ని తీయొద్దని బెదిరించారు. అలాంటప్పుడు ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలని, ప్రజలు ఎవరిని నమ్మాలి? అని వైఎస్ జగన్ నిలదీశారు.పైగా అద్దంకి ఘటనను కవర్అప్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. పోలీసు అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రకటనలు చేశారు. వాళ్ల మాటలకు ఎఫ్ఐఆర్కు పొంతనే లేదు(ఈ సందర్భంగా దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ప్రకాశం ఎస్పీ హర్షవర్ధనరాజుల వేర్వేరు స్టేట్మెంట్ల వీడియోలను ప్రదర్శించారు). ఇలాంటి పోలీసులను జైలుకు పంపకుండా.. తప్పుడు సాక్ష్యాలతో కాపాడాలని చూస్తున్నారు. కూటమి పాలనలో అద్దంకి ఘటనే కాదు.. కృష్ణలంక సాయికృష్ణ, విజయవాడ క్రాంతికుమార్ కేసులు ఈ వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో చెబుతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో గంజాయిని కట్టడి చేశాం. గంజాయి కేసుల్లో 13,210 మంది అరెస్ట్ చేశాం. 11 వేల ఎకరాల్లో గంజాయి పంటల్ని ధ్వంసం చేశాం.ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గిరిజనులను గంజాయి సాగుకి దూరం చేశాం. ప్రత్యేకంగా ఎస్ఐబీని ఏర్పాటు చేశాం అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు.. చంద్రబాబు పాలనలో సర్వం దోపిడీ మయం.. గంజాయి మయం. కూటమి పాలనలో అందరూ కలిసి దందాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చినబాబు.. పెదబాబుకి ఇంత అని వాటేలేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఒకే ఒక పంటకు గిట్టుబాటు ధర లభిస్తోంది.. అది గంజాయే అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే! -
సెల్ఫ్ ఫైనాన్స్ ముసుగులో లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్
-
‘సాధిఖ్ ఖాన్ మమ్మీని కొట్టేవాడు చాలా భయం వేసేది’
సాక్షి,కాకినాడ: తన కుటుంబాన్ని నాశనం చేసి.. తనను అనాథను చేసిన సాధిక్ ఖాన్‌కు కఠిన శిక్ష విధించాలని ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి డిమాండ్ చేశాడు. ‘రైఫిల్ షూటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాను. మూడో తరగతి నుంచి సాధిక్తో పరిచయం ఉంది. గతంలో మా స్కూల్లో పనిచేసేవాడు. స్కూల్ నుంచి తీసేసారని తన అకాడమీకి రమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అక్కడే అమ్మకి పరిచయం అయ్యాడు. మమ్మీని కొట్టేవాడు చాలా భయం వేసేది. ఎవరికైనా చెప్తే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని చెప్పాడు. ఇప్పటికీ నాకు భయంగా ఉంది. సాధిక్కి పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి’అని ఆవేదన వ్యక్తం చేశాడు. 👉ఇదీ చదవండి: బ్లాక్మెయిల్ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు: లేఖలో సౌజన్య -
రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమకాలీన రాజకీయ పరిణామాలు, పలు కీలక అంశాలపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. -
సెల్ఫ్ ఫైనాన్స్ అబద్ధం!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ అబద్ధాలే అనేందుకు ఇది మరో తార్కాణం!! 2026–27 బడ్జెట్లో రాజధాని నిర్మాణ పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించిన టీడీపీ కూటమి ప్రభుత్వం, అందులో రెండో త్రైమాసికానికి రూ.1,200 కోట్లను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనులకు బడ్జెట్ నుంచి ఒక్క పైసా కేటాయించడం లేదని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.. రాజధాని కోసం చేస్తున్న అప్పులను అమరావతిలో ప్రభుత్వానికి మిగిలే భూమి అమ్మి తీర్చుతామని.. పైసా భారం కూడా ప్రజలపై పడదని.. అమరావతి ‘సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు’ అని ఆయన తరచూ చెబుతుంటారు. కానీ, అది పచ్చి అబద్ధమని తేలిపోయింది. రాజధాని కోసం 2014–19 మధ్య హడ్కో నుంచి రూ.1,151.60 కోట్లు, బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,862 కోట్లు, అమరావతి బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు.. వెరసి– రూ.5,013.60 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పును తీర్చేందుకు 2026–27 బడ్జెట్లో రూ.836.26 కోట్లు కేటాయించి, ఇప్పటికే రూ.421.99 కోట్లను చెల్లించారు. అంటే రాజధాని నిర్మాణ పనుల కోసం చేస్తున్న అప్పులను తీర్చేందుకు రాష్ట్ర ఖజానా నుంచే నిధులు విడుదల చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే కౌలు, పెన్షన్లకు రూ.3,077.63 కోట్లు రాష్ట్ర విభజన తర్వాత 2014లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాలను రాజధానిగా చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. రాజధాని నిర్మాణం కోసం 53,748 ఎకరాలు (217.23 చదరపు కిలోమీటర్లు)ను ల్యాండ్ పూలింగ్(భూసమీకరణ) కింద సమీకరించింది. ఇందులో 29,892 మంది రైతుల నుంచి 35,351 ఎకరాలను సమీకరించింది. పదేళ్లపాటు కౌలు చెల్లించడంతోపాటు పదేళ్లలోగా అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక 2024లో చంద్రబాబు సర్కార్ మళ్లీ అధికారంలోకి రాగానే కౌలు చెల్లింపును మరో ఐదేళ్లపాటు పొడిగించింది. గత 12 ఏళ్లుగా 29,892 మంది రైతులకు రూ.2,214.12 కోట్లను రాష్ట్ర ఖజానా నుంచే కౌలు రూపంలో చెల్లించారు. 2015లో రాజధాని రైతులకు రుణ మాఫీ రూపంలో రూ.85.19 కోట్లు, 17,525 మంది వ్యవసాయ కూలీలకు జూలై వరకూ రూ.778.31 కోట్లను పెన్షన్ రూపంలో చెల్లించింది. వెరసి ఇప్పటికే కౌలు, పెన్షన్, రుణ మాఫీ రూపంలో రాజధాని రైతులు, రైతు కూలీలకు రాష్ట్ర ఖజానా నుంచే రూ.3,077.63 కోట్లు వ్యయం చేసింది.అప్పులు.. స్కాములు.. ఆర్థిక సంక్షోభం2.29 లక్షల ఎకరాలు.. 4.58 లక్షల కోట్ల అప్పు + వడ్డీలు.. వందల ఏళ్లు.. ఇదీ చంద్రబాబుగారి కలల రాజధాని పరిస్థితి. ఇదంతా కలల్లోనే.. నిజానికి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడానికి చంద్రబాబుగారు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది.. రాజధాని నిర్మాణం కోసం 2024, జూన్ 12 నుంచి ఇప్పటివరకూ ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ.. హడ్కో వంటి జాతీయ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల వద్ద ఇప్పటికే రూ.47,687 కోట్లు అప్పు చేసింది. ఇక రాజధాని కోసం 2015లో 53,748 ఎకరాలు(217.23 చదరపు కిలోమీటర్లు) సమీకరించిన సర్కార్.. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో 20,494 ఎకరాల(82.9 చకిమీలు) సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ ప్రక్రియను ప్రారంభించింది. తాజాగా రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో 2,344.12 ఎకరాల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతటితో ఈ భూసమీకరణ ప్రక్రియ ఆగదని ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. కొత్తగా సమీకరిస్తున్న మోతడకతోపాటు.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల కోసం గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, ఎడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాల (626.67 చదరపు కిలోమీటర్లు) మేర రాజధాని విస్తరణకు అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే బాధ్యతను సింగపూర్‌కు చెందిన సుర్బానా–జురాంగ్ సంస్థకు రూ.45.14 కోట్లకు అప్పగించింది. అంటే.. మొత్తం 2,29,095 ఎకరాలలో(926.8 చ.కి.మీ.లు) రాజధాని నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నిజానికి 29 గ్రామాల్లో 53,748 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికే వందేళ్ల సమయం పడుతుందని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఇటీవల ప్రభుత్వమే చెప్పింది. ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికి ఇంకెన్ని శతాబ్దాలు పడుతుందన్నది అంచనా వేయలేని పరిస్థితి. ఇక చంద్రబాబు సర్కార్ కేంద్రానికి సమరి్పంచిన డీపీఆర్‌ల ప్రకారమే రాజధాని నిర్మాణంలో రోడ్లు, విద్యుత్, డ్రెయినేజీ, తాగునీటి సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్లు వ్యయమవుతుందని పేర్కొంది. ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి రూ.4.58 లక్షల కోట్ల అవసరం అవుతాయి. ఆ అప్పు, వడ్డీతో కలిసి ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుందో!? ఈ అప్పును వడ్డీతోసహా రాష్ట్ర ఖజానా నుంచే అంటే ప్రజలు చెల్లించే పన్నుల నుంచి చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. దీన్ని బట్టి చూస్తే స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాదు.. రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి సీఎం చంద్రబాబు నెడుతున్నారంటూ విద్యార్థులు, ఆర్థికవేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రేపు YSRCP ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత ప్రజా సమస్యలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రజాపోరాటాలపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీలు హాజరుకానున్నారు. -
అమరావతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నవజాత శిశువులు మృతి
ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అమరావతిలోని జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం ఘటన జరిగింది. ఈ ప్రమాదం కారణంగా ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందారు. మరికొందరు శిశువుల పరిస్థితిపై ఆందోళన కొనసాగుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ మహిళా ఆసుపత్రి మూడో అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. వెంటిలేటర్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమై NICUలో ఉన్న శిశువులను బయటకు తరలించారు.ఇది కూడా చదవండి: హెచ్1ఎన్1 టెన్షన్.. ఒక్కరోజే 114 పాజిటివ్ కేసులుఆ సమయంలో NICUలో 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సిబ్బంది సకాలంలో స్పందించి పలువురు శిశువులను సురక్షితంగా బయటకు తరలించారు. తీవ్ర వైద్య సంరక్షణ అవసరమైన ఆరుగురు శిశువులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితిపై ఆందోళన కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఆగస్టు 22న మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లా ఆసుపత్రిలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. NICUలోని వార్మర్ యంత్రం నుంచి మంటలు చెలరేగడంతో ఓ నవజాత శిశువు మృతి చెందగా, మరో ఇద్దరు శిశువులు గాయపడ్డారు.Amravati, Maharashtra: Three newborns died after a fire broke out in the Neonatal Intensive Care Unit (NICU) of Amravati District Women's Hospital at around 3:30 AM. The fire reportedly started following an explosion in a ventilator on the hospital's third floor, where 39… pic.twitter.com/Yde1uEk3W6— IANS (@ians_india) August 24, 2026 -
అమరావతి దేశంలోనే అతిపెద్ద దోపిడీ.. ప్రొ. యోగేంద్ర యాదవ్ సంచలన కామెంట్స్
-
విద్యార్థిని ఫోన్ మాయం.. మాజీ సీఎం ట్వీట్, పరుగులు తీసిన కలెక్టర్, ఎస్పీ!
సాక్షి,కాకినాడ: ఓ కాలేజీ హాస్టల్లో విద్యార్థిని ఫోన్ మాయమైంది. అంతే సదరు హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు మధ్య మధ్య మాట మాట పెరిగింది. చేతికి అందిన బకెట్లు,కర్రలు,చెప్పులు ఏది దొరికితే ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఫలితంగా విద్యార్థునుల సమస్యను పరిష్కరించాలని మాజీ సీఎం ట్వీట్ చేశారు. జిల్లా ఐఏఎస్, ఎస్పీ వంటి ఉన్నత స్థాయి పోలీస్ శాఖ అధికారులు హుటాహుటీన పరుగులు పెట్టారు.పోలీసుల వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని ఓ మహిళా నర్సింగ్ కాలేజీ హాస్టల్లో మొబైల్ ఫోన్ మాయమవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆగస్టు 21న హాస్టల్లో ఉంటున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ విద్యార్థినికి సంబంధించిన ఫోన్ కనిపించకుండాపోవడంతో ఈ వివాదం ప్రారంభమైంది.ఘర్షణకు దారితీసిన పరిస్థితులు ఫోన్ పోవడానికి స్థానిక విద్యార్థులే కారణమనే అనుమానంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చి, తెలుగు విద్యార్థినులకు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులకు మధ్య వాగ్వాదానికి, ఘర్షణకు దారితీసింది. హాస్టల్ క్యాంపస్‌లో చేతికి ఏది దొరికితేదాన్ని విసురుకుంటూ పరస్పరం దాడులకు దిగడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో కొందరు విద్యార్థినులు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.👉ఇదీ చదవండి: సాధిక్ మామూలోడు కాదుఉన్నతాధికారుల జోక్యం ఘటన తీవ్రత పెరగడంతో మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ సైతం స్పందించి, విద్యార్థినుల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని ట్విట్టర్ వేదికగా కోరారు. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉండటంతో జిల్లా కలెక్టర్ (ఐఏఎస్) పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) తక్షణమే రంగంలోకి దిగారు.సమస్య పరిష్కారం జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు హుటాహుటీన హాస్టల్‌ను సందర్శించి, ఇరు వర్గాల విద్యార్థినులతో మాట్లాడి శాంతియుతంగా సమస్యను పరిష్కరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా, భద్రతా చర్యల్లో భాగంగా ఈశాన్య ప్రాంత విద్యార్థినులకు ప్రత్యేక వసతిని కల్పించారు. BREAKING ⚡ 🚨NORTHEAST STUDENTS ATTACKED BY MOB AT SK COLLEGE OF NURSING, ANDHRA PRADESH @AndhraPradeshCM 22 August 2026📍Valasapakala, Kakinada—A scuffle reportedly broke out between Northeast and local girl students following allegations of stolen mobile phones… pic.twitter.com/HN8X6ZfRsW— 📍SHANGH CHE🚭 (@JosephNaga1986) August 22, 2026 -
స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గత 2024 సార్వత్రిక ఎన్నికల ఫార్ములా వర్తించదని ఆయన స్పష్టం చేశారు. ఆనాటి సీట్ల సర్దుబాటు, రాజకీయ వ్యూహం కేవలం సార్వత్రిక ఎన్నికల వరకే పరిమితమని పవన్ కల్యాణ్ వివరించారు.స్థానిక ఎన్నికలకు మాత్రం ప్రాంతాల వారీగా వ్యూహాలుంటాయి. ఎక్కడ బలం ఉంటే అక్కడ నుంచి పోటీ చేస్తాం. జనసేన ఎమ్మెల్యేలు లేనిచోట కూటమి ధర్మానికి భిన్నంగా పార్టీ శ్రేణులకు అన్యాయం జరుగుతుందన్న పవన్.. జనసేన శ్రేణుల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తాం. స్థానిక ఎన్నికల సంసిద్ధతకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు తుమాటి మాధవరావు నామినేషన్
అమరావతి: ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స, వైసీపీ ఎమ్మెల్సీలు కూడా అక్కడే ఉన్నారు.మరోవైపు, శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎల్‌నినోపై చర్చ అసెంబ్లీలో అవసరం లేదా అని, మండలిలోనే కావాల్సి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. రైతాంగం ఎరువులు దొరక్క గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పిందే తామని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులు పొడిగించాలని చెప్పారు. -
అమరావతిలో సదుపాయాలు లేవు.. కూటమి పార్టీ MLA షాకింగ్ కామెంట్స్
-
పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకటంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి: పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పాలన ఏ స్థాయిలో కుప్పకూలిందో ఈ ఘటనే నిదర్శనం అంటూ ఫైరయ్యారు. చంద్రబాబూ… అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ ప్రశ్నించిన జగన్.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి?. ఎవరికి ఫిర్యాదు చేయాలి?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు వైఎస్ జగన్ సోమవారం (ఆగస్టు 17) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘హే రామ్…! గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి?చంద్రబాబు.. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని ఏదో ఒక్క ఘటనగా కొట్టిపారేయలేం. రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజలకోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, మీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి, వాడుకున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోంది.ఈనేపథ్యంలో, ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు, తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ ఒక ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్నవాళ్లు తీవ్రంగా గాయపడ్డం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును చుట్టుముట్టడం, ఆ కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కార్ డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫాం దొరకడం, చివరకు అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారి, జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే, “వీడియోలు తీయొద్దు, కేసులు పెడతాం” అని అక్కడకు చేరుకున్న మరో సీఐ, బెదిరిస్తున్నారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. నిజాన్ని బయటపెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్పా?ఈ ఇద్దరు పోలీసు అధికారులు ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, మద్యం, గంజాయి అక్కడ వాడారని, ఆ పార్టీలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారన్న సమాచారం మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న ఆ ఇద్దరు పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు తప్పించారన్న ఆరోపణలు కూడా అత్యంత తీవ్రమైనవి. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థతో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు ఎంత లోతుకు వెళ్లిందో ఈ ఘటన బయటపెడుతోంది. అలాంటప్పుడు రాష్ట్రంలో పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా?చంద్రబాబుగారూ… రోజూ గంటలకొద్దీ పైకి నీతి కబుర్లు చెబుతూ, లోపల రాజకీయ కుట్రలు, కక్షసాధింపులతో వ్యవస్థలను విషపూరితం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం మీద చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలపై, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టండి.ఈ ఘటనను కూడా మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి. డైవర్ట్ చేయకండి. నిష్పక్షపాత విచారణ జరిపించి, తప్పుచేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోండి. ఘటనను నిలదీసిన ప్రజలపై మళ్లీ రెడ్‌బుక్ ప్రయోగించకుండా, వీడియోలు తీసిన వారిని వేధించకుండా నిజాయితీగా వ్యవహరించండి’ అని సూచించారు. హే రామ్…!గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి?@ncbn గారూ… అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ… pic.twitter.com/g3iR1sx5uj— YS Jagan Mohan Reddy (@ysjagan) August 17, 2026 -
రాజధాని రోడ్డే ఇలా.. ప్రపంచస్థాయి అంట!
ఇదిగో రాజధానిలో ప్రపంచస్థాయి వసతులు, రహదారులు నిర్మిస్తున్నామని పాలకులు చెబుతున్న మాటలన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. గుంటూరు నుంచి రాజధాని అమరావతికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. తాడికొండ అడ్డరోడ్డు నుంచి పెదపరిమి వరకు ఉన్న కీలక మార్గం పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాడికొండ సెంటర్లో టిప్పర్ల కారణంగా ట్రాఫిక్ జామ్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని నిర్మాణ పనుల పేరుతో భారీ సంఖ్యలో మట్టి, ఇసుక టిప్పర్లు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు వందలాది భారీ వాహనాలు పరిమితికి మించిన లోడుతో దూసుకుపోతుండటంతో రహదారి మరింత దెబ్బతింటోందని స్థానికులు చెబుతున్నారు. భారీ వాహనాల నిరంతర రాకపోకల కారణంగా రహదారి పైపొర పూర్తిగా దెబ్బతిని కంకర తేలిపోయింది. కొద్దిరోజుల క్రితం వరకు ప్రయాణానికి అనుకూలంగా ఉన్న మార్గం ఇప్పుడు అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు గోతుల్లో పడి లేస్తూ సాగాల్సిందే.. విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం రాజధాని పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్, ఇతర ప్రైవేట్ కళాశాలలకు వెళ్లే వందలాది బస్సులు ప్రతిరోజూ ఇదే మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి. గుంతల్లోకి దిగిన బస్సులు ఒక్కసారిగా ఊగిపోతుండటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం కళాశాల సమయాల్లో ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రహదారి పరిస్థితి కారణంగా బస్సులు నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఏ గుంతలో వాహనం అదుపుతప్పుతుందో, ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొంది. ప్రమాదకరంగా పరిస్థితి... పట్టించుకునే వారే కరువు ఈ మార్గంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సైతం నిత్యం రాకపోకలు సాగిస్తున్నప్పటికీ రహదారి దుస్థితిపై శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న పాలకులు, అదే రాజధానికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రహదారి అధ్వానంగా మారడంతో వాహనాల మరమ్మతుల ఖర్చులు పెరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించే క్రమంలో అదుపుతప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాద ముప్పు మరింత ఎక్కువగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. సామాన్య ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులను అధికారులు పట్టించుకోకుండా మౌనం వహించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తుపల్లాలు... నిత్యం కష్టాలు: తాడికొండ అడ్డరోడ్డు – పెదపరిమి మార్గంలో గుంతలమయమైన రోడ్డుపై వాహనదారుల అవస్థలు వెంటనే మరమ్మతులు చేపట్టాలి తాడికొండ అడ్డరోడ్డు–పెదపరిమి మార్గం రాజధాని ప్రాంతానికి అత్యంత కీలకమైన రహదారి కావడంతో దాని నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు, పరిమితికి మించిన లోడుతో ప్రయాణించే టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రహదారిపై ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చి, అవసరమైన చోట పూర్తిస్థాయి పునరి్నర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
బాబుకు బిగ్ షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే.. అమరావతిపై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: అమరావతి రాజధాని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. దీంతో, రాజధాని గ్రామాల దుస్థితి బయటకు వచ్చింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కూటమి నేతలు చెబుతున్న అమరావతి అభివృద్ధి ఎలా ఉందో స్పష్టమవుతోంది.ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. అమరావతి గ్రామాల్లో ప్రజలు కనీస రహదారి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మూడు, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీరు వస్తోందని అసెంబ్లీలో ప్రశ్నించారు. రాజధాని గ్రామాలకు సరైన ట్రంక్ రోడ్లు, కనెక్టివిటీ లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. అసెంబ్లీ, సచివాలయం ఉన్న వెంకటపాలెం ప్రాంతానికి కూడా సరైన కనెక్టివిటీ లేదని తెలిపారు.పూలింగ్‌లో భూములు ఇచ్చిన కాలనీలకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కానీ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు మాత్రం అవసరమైన సదుపాయాలు అందడం లేదని ఆరోపించారు. రాజధాని గ్రామాలకు మెరుగైన రహదారులు, తాగునీరు, కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితులు ఉండటం సరికాదని అసెంబ్లీ వేదికగా శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. -
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
-
ఆ వంకర ఎవరికోసం?
-
‘రాను బొంబాయికి రాను’.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపచారం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వివాదాస్పదమయ్యాయి. దేశమంతా ఘనంగా జెండా పండుగ జరుపుకుంటున్న వేళ, బాధ్యతాయుతమైన ప్రభుత్వ శాఖ సిబ్బంది చేసినపని తీవ్ర విమర్శలకు దారితీసింది.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ గీతాలు, దేశభక్తి గేయాలు వినిపించాల్సిందిపోయి.. ‘రాను బొంబాయికి రాను’ వంటి సినిమా, ఫోక్ సాంగ్స్ పెట్టి సిబ్బంది చిందులు వేశారు. జాతీయ వేడుకల పవిత్రతను విస్మరించి, ఇలా సినిమా పాటలకు డ్యాన్సులు చేయడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో అధికారికంగా జరుపుకోవాల్సిన వేడుకలను ఇలా చులకన చేయడంపై ప్రజలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని అవహేళన చేసేలా ప్రవర్తించిన ఏపీఎఫ్డీసీ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తామని తెలిపింది. రైతులకు అన్యాయం జరిగితే ఎట్టిపరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొంది. భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పక్షానే అత్యున్నత ధర్మాసనం ఉంటుందని స్పష్టం చేసింది. ల్యాండ్ పూలింగ్ చట్టాలపై అభ్యంతరాలుంటే రైతులు కోర్టులను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. -
అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: అమరావతి పేరిట అడ్డగోలు నిర్మాణాలు.. వాటిపై వ్యయాలు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రకటనలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో భారీగా ఖర్చు చూపిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా, అప్పులు సైతం చేస్తున్నారని చేస్తున్నారన్నారు. శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఏడేళ్లలో అమరావతికి చంద్రబాబు చేసిందేమీ లేదని అంబటి రాంబాబు అన్నారు. ఇప్పుడు అద్భుత నగరం నిర్మిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. ఇది మార్కెటింగ్ తప్ప మరొకటి కాదన్నారు. అమరావతి అనేది ఎప్పటికీ పూర్తి కాదన్నారు. మరోవైపు ఖర్చులను భారీగా పెంచుతున్నారని మండిపడ్డారు. ‘‘అమరావతి అంటే అద్భుత నగరం కాదు.. అవినీతి, దోపిడీకి కేంద్రం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రోడ్ల నిర్మాణంపై ప్రశ్నలుఅమరావతిలో రోడ్ల నిర్మాణ వ్యయాలపై అంబటి రాంబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. కిలోమీటర్ రోడ్డుకు రూ.180 కోట్ల వరకు ఖర్చు చూపిస్తున్నారన్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ఏ దేశంలోనూ రోడ్ల కోసం ఇంత భారీగా ఖర్చు చేయరని అన్నారు. 21.77 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,519 కోట్లు చంద్రబాబు ఖర్చు చేస్తున్నారని.. రూ.100 కోట్లలో పూర్తయ్యే పనులను అంచనాలు పెంచి రూ.356 కోట్లకు తీసుకెళ్లారని విమర్శించారు. చదరపు మీటర్ రోడ్డుకు రూ.10 లక్షలు ఖర్చు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రైతుల పరిస్థితిపై ప్రశ్నలురాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల పరిస్థితిపైనా అంబటి ప్రశ్నలు లేవనెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లే అవుట్లు అందించారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొలాలు ఇచ్చినందుకు రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.‘‘అద్దాల భవనాల పేరుతో వేల కోట్లు’’అమరావతిలో అద్దాల భవనాలు, భారీ నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంబటి అన్నారు. తాత్కాలిక స్టీల్ బ్రిడ్జి కోసం రూ.80 కోట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. అమరావతిలో చదరపు అడుగు ధర రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు పెరిగిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.‘‘బాబు, లోకేశ్‌లకు చెప్పే ధైర్యం ఉందా?’’అమరావతిలో జరుగుతున్న వ్యయాలపై ప్రజలు, మేధావులు ఆలోచించాలని అంబటి రాంబాబు కోరారు. అప్పులు తీసుకువచ్చి వాటిలోనూ కమీషన్లు దండుకుంటున్నారంటూ చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. -
బాబు రాయబారం ఫెయిల్.. ఝలక్ ఇచ్చిన పవన్!
సాక్షి, అమరావతి: అమరావతి కార్యక్రమాలను కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్న కీలక కార్యక్రమానికి పవన్ కావాలనే దూరంగా ఉన్నారంటూ అధికార, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.గురువారం అమరావతిలో స్టీల్ బ్రిడ్జి, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే అదే సమయంలో పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఏనుగుల కార్యక్రమం ఉందంటూ ఉదయమే ఆయన విశాఖకు వెళ్లినట్లు తెలుస్తోంది. అదీ షెడ్యూల్లో హడావిడిగా చేర్చుకుని మరీ.. ప్రభుత్వ వర్గాలకు సరైన సమాధానం ఇవ్వకుండానే!.నారాయణ రాయబారం విఫలం!పవన్ కల్యాణ్ కార్యక్రమానికి హాజరయ్యేలా చేయడానికి అమరావతి పనుల్ని చూసుకుంటున్న మంత్రి నారాయణను చంద్రబాబు రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే నిన్న పవన్‌తో నారాయణ భేటీ అయినట్లు సమాచారం. ఎలాగైనా అమరావతి కార్యక్రమానికి రావాలని ఆయన కోరినప్పటికీ.. చివరకు పవన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్న చర్చ సాగుతోంది. విశాఖ పర్యటనకు వెళ్లడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.చంద్రబాబుపై తగ్గిన పవన్ స్పందనలుగత కొంతకాలంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వ వ్యవహారాలపై పవన్ కల్యాణ్ స్పందనలు తగ్గడం కూడా రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తిన పవన్.. ఈ మధ్యకాలంలో అలాంటి స్టేట్మెంట్లకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు పాలనాపరమైన అంశాలు, పార్టీ వ్యవహారాల్లోనూ తన దారి తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బాబును పొగడాల్సి వస్తుందనే అమరావతి వంటి కీలక కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారా? అని చర్చించుకుంటున్నారు.ఎమ్మెల్యేల క్వార్టర్ల అంశమే కారణమా?పవన్ కల్యాణ్ అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉండటానికి ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలే కారణమన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నిర్మాణ వ్యయాల పెంపు, అంచనాల మార్పులపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఖర్చుల విషయంలో మరింత పారదర్శకత అవసరమని పవన్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపై పవన్ గతంలోనూ అధికార యంత్రాంగానికి కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉన్నారా? అనే దానిపై జనసేన స్పందించాల్సి ఉంది.వరుస గైర్హాజరులతో పెరుగుతున్న చర్చఇటీవల జరిగిన కొన్ని కీలక సమావేశాలకు కూడా పవన్ కల్యాణ్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే పలు కేబినెట్ సమావేశాలకు(మూడు సార్లు) ఆయన దూరంగా ఉన్నారు. అయితే ఈమధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరైన భోగాపురం ఎయిర్‌పోర్టు కార్యక్రమానికి మాత్రం పవన్ హాజరయ్యారు. ఆ వేదికపై కూడా చంద్రబాబు కంటే ప్రధాని మోదీనే ప్రసన్నం చేసుకునేందుకు పవన్ ఎక్కువ తాపత్రయపడ్డారన్న రాజకీయ వ్యాఖ్యలు వినిపించాయి.నాదెండ్ల ప్రకటనతో మరింత ఆసక్తిమరోవైపు పవన్ గైర్హాజరుపై టీడీపీ–జనసేన కూటమి నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. బహిరంగంగా ఎలాంటి విభేదాలను ప్రస్తావించకపోయినా.. ఈ పరిణామాలపై మౌనం పాటిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి కార్యక్రమానికి పవన్ దూరంగా ఉండగా.. జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో అమరావతిపై ఒక మొక్కుబడి ప్రకటన ఇప్పించడం కూడా చర్చకు దారితీసింది.అసలు పవన్ దూరం వెనుక కారణం ఏమిటి? నిజంగానే కూటమిలోని కొన్ని అంశాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. -
అమరావతి క్వార్టర్లలో అడ్డగోలు దోపిడీ
సాక్షి, అమరావతి: రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులకు క్వార్టర్స్ కోసం ఎస్+12 పద్ధతిలో 18 టవర్లలో 432 ప్లాట్లు (యూనిట్లు) నిర్మాణ పనులు 2019 నాటికే 72 శాతం పూర్తయ్యాయి.. ఆ పనులకు రూ.363.68 కోట్లు బిల్లులు చెల్లించారు. మిగిలిన 28 శాతం పనుల వ్యయం రూ.272.22 కోట్లు. కానీ... ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేసి 2017లో వాటిని అప్పగించిన ఎన్సీసీ సంస్థకే మళ్లీ ఇప్పుడు కట్టబెట్టారు. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.252.48 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. 2018–19 నాటితో పోల్చితే ఇప్పుడు స్టీలు, సిమెంటు, పెట్రోల్, డీజిల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 92.75 శాతం పెంచేయడంపై ఇంజినీర్లు నివ్వెరపోతున్నారు. పెంచేసిన అంచనా వ్యయం మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్లిందన్నది బిగ్‌బాస్‌కే ఎరుక. రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీకి ఇది మరో నిదర్శనమని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేల కోసం 6 టవర్లు, ఎమ్మెల్సీల కోసం 3 టవర్లలో పూర్తయిన 207 ప్లాట్లను నేడు (గురువారం) సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. 2017లో రూ.635.90 కోట్లకు అప్పగింత.. రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ కోసం ఎస్+12 పద్ధతిలో 18 టవర్లలో 432 ప్లాట్ల నిర్మాణ పనులకు 2017లో రూ.608 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ టెండరు పిలిచింది. 4.59 శాతం అధిక ధరలకు కోట్ చేసి రూ.635.90 కోట్లకు ఆ పనులను ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. వాటిని ఎన్సీసీకి అప్పగిస్తూ 2017, నవంబర్ 13న సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఈ పనులు 2019, ఫిబ్రవరి 12 నాటికి పూర్తి కావాలి. ఆ పనులు 2019 నాటికి 72 శాతం పూర్తయినట్లు.. వాటికి రూ.363.68 కోట్ల వ్యయం చేసినట్లు 2023లో కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తేల్చింది. అంటే.. మిగిలిన 28 శాతం పనుల అంచనా వ్యయం రూ.272.22 కోట్లు.రద్దు చేసి.. అంచనా వ్యయాన్ని పెంచేసి..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేశారు. మిగిలిన 28 శాతం పనుల అంచనా వ్యయాన్ని రూ.272.22 కోట్ల నుంచి రూ.524.70 కోట్లకు పెంచేసి మళ్లీ టెండర్లు పిలిచి.. ఎన్సీసీ సంస్థకే అప్పగించారు. అంటే.. నాడూ నేడూ వాటిని టెండర్ ద్వారా ఒకే కాంట్రాక్టు సంస్థకు అప్పగించారన్నది స్పష్టమవుతోంది. సాంకేతికంగా చూస్తే.. 2017లో ఆ పనులను దక్కించుకున్న సంస్థే 2025లో వాటిని మళ్లీ దక్కించుకోవడం సాధ్యం కాదు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయక ముందే సిండికేట్ కాంట్రాక్టర్లకు బిగ్‌బాస్ దిశానిర్దేశం చేసి.. సీఆర్డీఏ అధికారులకు కనుసైగ చేయడం వల్లే పెంచిన అంచనా వ్యయంతో చేపట్టిన పనులను మళ్లీ ఎన్‌సీసీకే కట్టబెట్టారని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న క్వార్టర్ల పనులు 2019 నాటికి రూ.363.68 కోట్లతో 72 శాతం పూర్తయినట్లు తేల్చిన కాగ్ నివేదిక మిగిలిన 28 శాతం పనుల అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేస్తూ గత ఏడాది జూలై 13న చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు పరిపాలన అనుమతి లేకుండానే..అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేస్తూ చేపట్టిన పనులను పరిపాలన అనుమతి లేకుండానే సీఆర్డీఏ అధికారులు గతేడాది ఏప్రిల్ 28న ఎన్సీసీ సంస్థకు కట్టబెట్టేస్తూ ఒప్పందం చేసుకున్నారు. కాంట్రాక్టు అగ్రిమెంట్ విలువలో పది శాతం (ఐదు శాతం మెషినరీ, ఐదు శాతం లేబర్) మొబిలైజేషన్ అడ్వాన్సు కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మేరకు ఎన్సీసీ సంస్థకు మెషినరీ విభాగం కింద 5 శాతం అంటే రూ.26.68 కోట్లను చెల్లించాలని సీఎఫ్ఎంస్ (కాంప్రహెన్షివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) ద్వారా పీఏవో (పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్)కు సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదన పంపారు. పరిపాలన అనుమతి లేకుండా ఆ పనిని చేపట్టిన నేపథ్యంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించలేమంటూ పీఏవో దానిని సీఆర్డీఏ అధికారులకు తిప్పి పంపారు. దాంతో సీఆర్డీఏ అధికారులు చేసుకున్న ఒప్పందాన్ని కేబినెట్లో ఆమోదింపజేసి.. గతేడాది జూలై 13న ఆ పనులకు పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయించడం గమనార్హం. రూ.456.38 కోట్లకుపైగా దోపిడీ..రాజధానిలో ప్రభుత్వం సీఆర్డీఏ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులకు నిర్మిస్తున్న తరహాలోనే హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతంలో ఇటాలియన్ మార్బుల్స్‌తో అత్యాధునిక హంగులతో నిర్మించిన ప్లాట్ల ధర ఒక్కొక్కటి రూ.కోటికి మించదని ఇంజినీర్లు, రియల్టర్లు, బిల్డర్లు గుర్తు చేస్తున్నారు. అది కూడా భూమి విలువతో కలిపి. కానీ.. సీఆర్డీఏ పరిధిలో భూమి ఉచితం.. ఇసుక ఉచితం.. అయినా సరే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ కోసం నిర్మిస్తున్న 432 ప్లాట్ల అంచనా వ్యయం రూ.888.38 కోట్లు(2019 నాటికి చేసిన వ్యయం రూ.363.68 కోట్లు+ఇప్పుడు అప్పగించిన మిగిలిన పనుల వ్యయం రూ.524.70 ఓట్లు)కు చేరుకుంది. అంటే.. ఒక్కో ప్లాట్ నిర్మాణ వ్యయం రూ.2.06 కోట్లు. అంటే.. ఒక్కో ప్లాట్‌పై రూ.1.06 కోట్ల చొప్పున అధికంగా వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వీటిని బట్టి చూస్తే ఈ ప్లాట్ల నిర్మాణంలో రూ.456.38 కోట్లకుపైగా దోపిడీ చేస్తున్నారని ఇంజినీరింగ్ నిపుణులు, బిల్డర్లు చెబుతున్నారు. -
ఏపీ ప్రభుత్వానికి ‘సోషల్ మీడియా ఫోబియా’
విజయవాడ: కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియా ఫోబియా’ పట్టుకుంది. మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై మరిన్ని కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,200 పోలీస్ స్టేషన్లకు చెందిన దాదాపు 1,650 మంది ఎస్హెచ్ఓలు, సీఐ స్థాయి అధికారులతో సీఎం నేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.సాధారణంగా ఉన్నతాధికారులతోనే జరిగే సమీక్షలకు భిన్నంగా, ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయి సీఐలు, ఎస్హెచ్ఓలతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు ఇవ్వడంపై పోలీస్ అధికారులు సైతం విస్తుపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకునేందుకే ఈ తరహా ఆదేశాలు ఇచ్చారని, భావప్రకటన స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు కాకి లెక్కలు.. ఆ భయంతోనేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణాంకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఒప్పుకోవాలి. కొందరు వాటిని కాకి లెక్కలు అనవచ్చు. మరికొందరు భలే లెక్కలు అనవచ్చు. కాని వాటిని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ప్రజలు వాటిని ఎంతవరకు నమ్ముతారో తెలియదు. ఆయన మాత్రం ఏకధాటిగా మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో ఇచ్చిన ప్రజెంటేషన్ రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఏపీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉందన్న భయం. మరోపక్క లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రాంతి.. ఈ రెండు విషయాలు ఆయనే చెప్పగలరు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు బాండ్ పత్రాలు ఇచ్చారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందో తెలిపారు. వీరిద్దరూ త్రికరణ శుద్దిగా ప్రమాణం చేసి బాండ్లు ఇస్తున్నామని అన్నారు. బాగానే ఉంది. త్రికరణ శుద్ది ఉంటే ఏమి చేసి ఉండాలి. నిజంగానే ఆయా కుటుంబాలకు ఈ రెండేళ్లలో ఎంతెంత ఇచ్చింది మళ్లీ లెక్కలు ఇవ్వాలి కదా! ఆ పని చేయకుండా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నామని, అప్పులు చేసి సంక్షేమ స్కీములు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.గతంలో అప్పులు చేసేవారికి సంక్షేమ స్కీములు అమలు చేసే అర్హత ఉందా అని ఆయనే ప్రశ్నించేవారు. డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. సీమాంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్దే లక్ష్యమని ఆయన చెప్పారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇచ్చిన లెక్కలు చూస్తే మతి పోవల్సిందే. ఈ మూడు ప్రాంతాలలో కలిపి ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సుమారు 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అందులో 2032 లోపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. బహుశా 1956 నుంచి ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో, లేదో తెలియదు. కాని విభజిత ఏపీలో మాత్రం అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే నమ్మగలమా? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అని ప్రచారం చేశారు. శ్వేతపత్రంలో వాటిని డబుల్ చేసేశారన్నమాట.ఒకవైపు ప్రపంచం అంతటా సంక్షోభం, ఎల్‌నినోలో ప్రభావం వంటివాటితో ఉపాధి సమస్యలు వస్తుంటే ఏపీలో మాత్రం ఈ రకంగా లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. నిజంగా అలా చేయగలిగితే గొప్పపేరే వస్తుంది. దానిని అంతా స్వాగతిస్తారు. కాని కేవలం ప్రజలను మభ్య పెట్టేరీతిలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే మాత్రం ఏపీకి తీరని అన్యాయం చేసినట్లవుతుందని గ్రహించాలి. చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారం అమరావతి ఆర్థిక రీజియన్‌ను టెక్నాలజీ, పరిశ్రమలు మౌలిక వసతులు, ఇంధనం విభిన్న ఆర్థిక వ్యవస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దుతారట. ఇక్కడ మొత్తం 6-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమిక అంచనా అట. వీటి ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో 49 ప్రాజెక్టులతో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. ఈ పెట్టుబడుల ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లబ్ధిస్తుందని ఆయన అంటున్నారు. 2032 నాటికి పది లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందట. ఇక తిరుపతి ఆర్థిక రీజియన్‌లో 11-12 లక్షల కోట్ల పెట్టటుబడులు ఆకర్షించడం ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం అని ఆయన తెలిపారు. ఏపీ ఆదాయంలో 40 శాతం రాయలసీమ నుంచే వచ్చేలా తయారు చేస్తారట. లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక పక్క మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో చీని తోటలు ఎండిపోతున్నాయని, టాంకర్లు తెచ్చి నీరు పెట్టుకోవల్సి వస్తోందని ఈ మధ్య ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. మరో వైపు చంద్రబాబు మాత్రం లక్ష కోట్ల ఉద్యానవన హబ్ అని ఊదరగొడుతున్నారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇవ్వాలట. ఇవన్ని ఎప్పటికి జరిగేనో ఎవరు చెప్పగలరు? మరో విషయం ఏమిటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.విశేషం ఏమిటంటే విశాఖ, తిరుపతి రీజియన్లకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టుబడి పెడతారన్నది క్లారిటీ లేదు కాని, అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతులకోసం ఇంతవరకు 40887 కోట్ల మొత్తాన్ని సమీకరించామని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీలో ఒక అసంతృప్తి ఏర్పడింది. ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసి మొత్తం అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తోందని మిగిలిన ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా విశాఖ, తిరుపతి రీజియన్లలో పెట్టుబడులు రాబోతున్నాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకాలని ఆశిస్తున్నట్లుగా ఉంది. ఇవన్ని చదువుతుంటే ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా 2002 ప్రాంతంలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అందులో కూడా ఏవేవో లెక్కలు రాస్తే అంతా చూసి నవ్వుకున్నారు. తదుపరి టీడీపీ 2004 ఎన్నికలలో ఓటమిపాలైంది. తిరిగి 2014లో విభజిత ఏపీలో టీడీపీ మళ్లీ పవర్లోకి వచ్చింది. ఆ టరమ్‌లో ఒక్కసారి కూడా విజన్ 2020 ఊసు ఎత్తినట్లు కనిపించలేదు. అప్పట్లో స్వర్ణాంధ్ర, 2029నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ అంటూ కొత్త నినాదాలతో కాలం గడిచిపోయింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. తిరిగి ఈ టరమ్‌లో 2047 విజన్‌తో పాటు డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అని కొత్త పదాలు అందుకున్నారు. అంటే ఒక్కో టరమ్‌లో ఒక్కో నినాదంతో కథ నడిపేయడం, ప్రజలు వాటిని వినీ.. విని విసుగుచెంది ఓడించడం జరుగుతోందని అనుకోవాలా? మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దోపిడీకి నిలువుటద్దం!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనులకు ఏకంగా రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడం విస్తుగొలుపుతోంది. కేవలం ఐదు బిల్డింగ్‌ల అద్దాల కోసం ఇంత భారీగా ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారంటే కేవలం ప్రభుత్వ పెద్దలు దండుకునేందుకేనని స్పష్టమవుతోంది. తొలుత అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లు కాగా, దానిని ఏకంగా రూ.2,455.22 కోట్లకు పెంచడం వెనుక ముఖ్య నేత కమీషన్ల బాగోతమేనని ఇంజనీరింగ్ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంచనా వ్యయంలోనే రూ.553.51 కోట్లు కొట్టేసే స్కెచ్ కనిపిస్తుండగా, మొత్తం వ్యయంలో నుంచి ఇంకెంత నొక్కేస్తారోనని సర్వత్రా చర్చ సాగుతోంది. సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులు అందించిన సమాచారం ఆధారంగా జీఎస్టీ వంటి అన్ని పన్నులతో కలిపి అద్దాలు అమర్చే పనులకు చదరపు మీటరుకు రూ.80,892గా ధరను బీవోసీఈ (బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్) ఖరారు చేసింది. ఐదు టవర్లకు 2,35,092.75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అద్దాలు బిగించాలి.ఈ లెక్కన వాటి అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లే. కానీ.. ఆ పనులకు రూ.2,455.22 కోట్ల వ్యయంతో మూడు ప్యాకేజీల కింద ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టి, పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్‌గా వసూలు చేసుకోవడానికి ముఖ్య నేత ఎత్తు వేశారని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. 15 నెలల్లో పూర్తి చేయాలని షరతు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా శాశ్వత సచివాలయం పేరుతో ఐదు టవర్ల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. డయా గ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నిర్మిస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మిస్తున్న మరో టవర్‌కు అద్దాలను అమర్చడం (గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్ క్లాడింగ్, స్కైలైట్), ఫొటో వోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్ (బీఎంయూ)లు ఏర్పాటు చేసే పనులకు ఏజీఐసీఎల్ ద్వారా మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచింది.ఈ పనులకు జీఏడీ టవర్‌కు రూ.522.15 కోట్లు (అంచనా వ్యయం రూ.442.06 కోట్లు+రూ.80.09 కోట్లు జీఎస్టీ రీయింబర్స్).. 1, 2 టవర్లకు రూ.1073.82 కోట్లు (అంచనా వ్యయం రూ.909.88 కోట్లు+రూ.163.94 కోట్లు జీఎస్టీ రీయింబర్స్).. 3, 4 టవర్లకు రూ.859.25 కోట్లు (అంచనా వ్యయం రూ.727.45 కోట్లు+ రూ.131.79 కోట్లు జీఎస్టీ రీయింబర్స్) వెరసి రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలుకు ఈనెల 26 తుది గడువు. అదే రోజున సాంకేతిక బిడ్, ఆ తర్వాత ఆరి్థక బిడ్‌ను తెరిచి.. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనుంది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 15 నెలల్లో వాటిని పూర్తి చేసి.. మరో 13 ఏళ్లు వాటిని నిర్వహించాలని ఏజీఐసీఎల్ షరతు విధించింది. ఎస్ఎస్ఆర్ బుట్టదాఖలు ళీ శాశ్వత సచివాలయం ఐదు టవర్లను డయాగ్రిడ్ వి«ధానంలో నిర్మిస్తున్నారు. ఈ టవర్లకు నలువైపులా అద్దాలు అమర్చుతారు. అందులో భాగంగా టవర్లకు గ్లాసింగ్, క్లాడింగ్ (అత్యధిక ఉష్ణోగ్రతను, శబ్ద కాలుష్యాన్ని తట్టుకునే డబుల్–గ్లేజ్డ్ అద్దాలను అమర్చడం).. క్రౌన్, అట్రియం (భవ నాల పైభాగంలో ఉండే శిఖరం నిర్మాణం, విశాలమైన గ్లాస్–రూఫ్ సెంట్రల్ అట్రియమ్)..కానోపి, స్కైలైట్ (ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద టెన్షన్–రాడ్ స్టీల్ కానోపిలు, సహజ వెలుతురు కోసం స్కై లైట్లు).. పీవీ ప్యానెల్స్ (భవనం వెలుపల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పర్యావరణ అనుకూల ఐజీబీసీ ప్లాటినమ్ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాల ప్యానెళ్లు), బీఎమ్యూ (ఎత్తైన టవర్ల గ్లాస్‌ను శుభ్రం చేయడానికి, నిర్వహించడానికి ఉపయోగించే ఆటోమేటెడ్, రూఫ్–మౌంటెడ్ టెలిస్కోపిక్ క్రేన్ సిస్టమ్స్ ఏర్పాటు) పనులు చేయాలి. ⇒ ఈ పనులకు అంచనా వ్యయం రూపొందించడానికి ఇప్పటిదాకా ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు)ను ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ పనులకు ఎస్‌ఎస్‌ఆర్‌ను ఖరారు చేయడంలో భాగంగా సీఆర్డీఏ.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న సంస్థల నుంచి కొటేషన్లు ఆహా్వనించింది. ముంబైకి చెందిన ఆల్మెక్ ఫెసాడ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన టీమ్ వర్క్ గ్లా్లస్ అండ్ అల్యూమినియమ్, బెంగళూరుకు చెందిన ఇంటెర్ని ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సీఆర్డీఏకు కొటేషన్లు ఇచ్చాయి. ⇒ అందులో ఆల్మెక్ ఫెసాడ్ సంస్థ తక్కువ ధరకు కోట్ చేసినట్లు సీఆర్డీఏ పేర్కొంది. శాశ్వత సచివాలయం ఐదు టవర్లకు డిజైన్లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థే.. చైనాలో షెన్జెన్లోని మర్చంట్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ భవనాలను డిజైన్ చేసింది. ఆ భవనాలకు అద్దాలు అమర్చడానికి చేసిన వ్యయాన్ని.. ఆల్మెక్ ఫెసాడ్ కొటేషన్లో పేర్కొన్న ధరను పరిగణలోకి తీసుకుని.. గ్లాసింగ్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కానోపి, స్కైలైట్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ వంటి పనులకూ జీఎస్టీతో కలిపి చదరపు అడుగుకు సగటున రూ.80,892గా బీవోసీఈ ఖరారు చేసింది. ⇒ ఐదు టవర్లలోనూ అన్ని రకాల అద్దాలు అమర్చే పనుల విస్తీర్ణం 2,35,092.75 చదరపు మీటర్లుగా లెక్కకట్టింది. పనుల అంచనా వ్యయం జీఎస్టీతో కలిపి రూ.1,901.71 కోట్లే.. కానీ రూ.2,455.22 కోట్ల వ్యయంతో ఏజీఐసీఎల్ టెండర్లు పిలిచింది. అంటే అద్దాలు అమర్చేందుకు చ.మీ. ధర రూ.1,04,436.22 కావడం గమనార్హం. అంటే.. బీవోసీఈ ఖరారు చేసిన ఎస్‌ఎస్‌ఆర్‌ను బుట్టదాఖలు చేసినట్లు స్పష్టమవుతోంది. చదరపు అడుగు రూ.20,439.58 ⇒ టవర్ల డిజైన్ల పనులను రూ.401.54 కోట్లకు ఫోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్‌కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేఅవుట్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల పనులను రూ.1,057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన నిర్మాణ వ్యయం ఇప్పటికే చ.అ. రూ. 20,439.58కు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. ⇒ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్‌తో నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా, నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదంటున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ వ్యయం తగ్గుతుందని చెబుతున్నారు. అయినా శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం నానాటికీ పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ వెంచర్లకు నో.. సబ్ కాంట్రాక్టుకు 50 శాతం ఇచ్చుకోవచ్చట!⇒ సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనుల టెండర్లలో బిడ్లు దాఖలు చేసేందుకు ఏజీఐసీఎల్ పెట్టిన నిబంధనలు చూసి ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ వెంచర్లు బిడ్లు దాఖలుకు అర్హతలేదని నిబంధన పెట్టింది. ⇒ కానీ.. టెండర్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఏజీఐసీఎల్ చీఫ్ ఇంజినీర్ అనుమతితో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్‌కు ఇచ్చుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. పరస్పర విరుద్ధమైన ఈ నిబంధనల వెనుక లోగుట్టు ముఖ్యనేతకే ఎరుక. ఎవరు ఎక్కువ కమీషన్ ఇస్తే, వారికి పనులు అప్పగించడానికే ఇలాంటి నిబంధనలు పెట్టారంటూ నిపుణులు ఆరోపిస్తున్నారు. ⇒ జాయింట్ వెంచర్లకు టెండర్లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తే.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న రెండు మూడు సంస్థలు కలిసి జట్టుగా ఏర్పడి బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అధిక సంస్థలు పోటీపడితే.. అంచనా విలువ కంటే తక్కువ ధరకే కోట్ చేస్తూ బిడ్లు దాఖలవుతాయి. అదే జరిగితే తమకు అధికంగా కమీషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంస్థకు ఆ పనులు దక్కే అవకాశం ఉండదు. అందుకే ముఖ్యనేత సూచన మేరకు పరస్పర విరుద్ధమైన నిబంధనలు పెట్టారంటున్నారు. -
అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో రచ్చ
సాక్షి, గుంటూరు: అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో రగడ చోటుచేసుకుంది. స్టాల్స్‌ను తిలకించడానికి వచ్చిన మంత్రి దుర్గేష్‌ను డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు గన్‌మెన్ అడ్డుకున్నారు. జనసేన నేతలను రఘురామకృష్ణరాజు గన్‌మెన్ పక్కకు నెట్టేశారు. దీంతో రఘురామకృష్ణ రాజు గన్‌మెన్‌తో జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. అరుపులు, కేకలతో ప్రాంగణం దద్దరిల్లింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముందే గొడవ జరిగింది. -
డిజైన్.. ఫీజు దిమ్మతిరిగెన్..
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వ్యయమే కాకుండా, వాటి ఆర్కిటెక్చర్ డిజైన్లను రూపొందించే ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ (యూకే) సంస్థకు చెల్లించే మొత్తాన్ని రూ.136.90 కోట్ల నుంచి రూ.206.59 కోట్లకు ప్రభుత్వం పెంచేసింది. హైకోర్టు భవనం నిర్మిత ప్రాంతం పెరగడం, అత్యాధునిక డిజైన్ల కోసం అదనపు నిపుణులను నియమించాల్సి రావడం, డిజైన్లను వేగంగా సమర్పించడం, బ్రిటీష్ పౌండ్ మారకపు విలువ పెరగడం.. వాటికి జీఎస్టీ కలపడం వల్ల ఫీజు వ్యయం పెరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు డిజైనర్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్కు అదనంగా చెల్లించేందుకు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం ఇప్పటికి రూ.3,975.12 కోట్లు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే.. వాటి నిర్మాణ వ్యయంలో 5.20 శాతాన్ని డిజైన్ల కోసం చెల్లిస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా నిలిచే భవనానికే డిజైన్ల వ్యయం దాని నిర్మాణ వ్యయంలో ఒకటి లేదా 1.5 శాతం లోపే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో బ్రిటీష్ పౌండ్ మారకపు విలువ పెరిగితే మళ్లీ డిజైనర్‌కు చెల్లించే మొత్తం పెరుగుతుందన్నది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో చెప్పకనే చెప్పింది. రాజధానిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించే ప్రాంతాన్ని అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) అని ప్రభుత్వం నామకరణం చేసింది. ఏజీసీ మాస్టర్ ప్లాన్‌తోపాటు కొత్త సచివాలయం టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్లను 2016లోనే ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ రూపొందించింది. ఇందుకు ఆ సంస్థకు రూ.67.86 కోట్లు అప్పట్లోనే చెల్లించారు. ఇప్పుడు కేవలం హైకోర్టు, అసెంబ్లీ భవనాల సమగ్ర డిజైన్ల కోసం ఏకంగా రూ.206.59 కోట్లు చెల్లిస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. హైకోర్టు శాశ్వత భవనం వ్యయం రూ.2,027.76 కోట్లు » హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి, మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786.05 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్లో సీఆర్డీఏ పేర్కొంది. ఈ లెక్కన హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్నమాట. » ఈ భవనానికి హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ (హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ (సీసీ టీవీ, ఫైర్ అలారమ్‌తో కూడిన భద్రత వ్యవస్థ) పనులు చేపట్టడానికి మరో రూ.556 కోట్లను మంజూరు చేస్తూ ఫిబ్రవరి 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » హైకోర్టు శాశ్వత భవనం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టేందుకు జూన్ 5న రూ.547.07 కోట్లు మంజూరు చేసింది. దాంతో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది. ఈ భవనాన్ని ఏజీసీలో ‘ఎఫ్’ బ్లాక్‌లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులు (బీ+జీ+7)లో 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. ఈ లెక్కన చదరపు అడుగుకు రూ.9,978లు చొప్పున ఖర్చు చేస్తోంది. » రాజధాని అమరావతిలో ఇప్పటికే రూ.173 కోట్ల వ్యయంతో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2017–18లో ప్రభుత్వం నిర్మించింది. కొత్త భవనం పూర్తయితే తాత్కాలిక భవనం కోసం చేసిన వ్యయం రూ.173 కోట్లు వృథా అవనుంది. అసెంబ్లీ భవనం నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.17,356.54 » అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్‌లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 3 అంతస్తుల్లో (బీ+జీ+3) 11,21,975 చదరపు అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్‌ను కూడా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థే రూపొందించింది. » ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617.33 కోట్లకు కోట్ చేసిన ఎల్ అండ్ టీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. » ఇటీవల ఈ భవనంలో ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ పనులు చేపట్టేందుకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. » అసెంబ్లీ భవనంలో స్పైర్, పార్కింగ్ రింగ్, రింగ్ రూఫ్ వంటి సివిల్ స్ట్రక్చర్ పనులు చేపట్టడానికి మరో రూ.798 కోట్లు మంజూరు చేసింది. దాంతో అసెంబ్లీ భవన నిర్మాణ వ్యయం రూ.1,947.36 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగు రూ.17,356.54 కోట్లకు చేరుకుంది. రెండున్నరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.971 కోట్లతోనే అత్యాధునిక వసతులతో భారత మణిహారంలో కలికితురాయిగా నిలిచేలా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడం గమనార్హం. -
అంతులేని ‘పూలింగ్’
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు భూసమీకరణకు అంతే లేకుండా పోతోంది. అమరావతి రాజధానిలో రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం తాడికొండ మండలం మోతడకలో 2,344.12 ఎకరాల సమీకరణకు కేబినెట్ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే అందుకు తార్కాణం. ఇప్పటికే 2015లో 53,748 ఎకరాలు(217.23 చదరపు కిలోమీటర్లు) సమీకరించిన బాబు సర్కార్.. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో 20,494 ఎకరాల (82.9 చ.కి.మీ.) సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసి ఆ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడు రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో 2,344.12 ఎకరాల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతటితో ఈ భూసమీకరణ ప్రక్రియ ఆగదని ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. కొత్తగా సమీకరిస్తున్న మోతడక ప్రాంతంతోపాటు.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల కోసం గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరణకు అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే బాధ్యతను సింగపూర్‌కు చెందిన సుర్బానా–జురాంగ్ సంస్థకు రూ.45.14 కోట్లకు అప్పగించింది. అంటే.. మొత్తం 2,29,095 ఎకరాలలో (926.8 చ.కి.మీ.) రాజధాని నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. స్కాముల కోసం..!నిజానికి 29 గ్రామాల్లో 53,748 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికే వందేళ్ల సమయం పడుతుందని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఇటీవల చంద్రబాబు సర్కారు తేల్చి చెప్పింది. ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికి ఇంకెన్ని శతాబ్దాలు పడుతుందన్నది అంచనా వేయలేని పరిస్థితి. ఇక చంద్రబాబు సర్కార్ కేంద్రానికి సమర్పించిన డీపీఆర్‌ల ప్రకారమే రాజధాని నిర్మాణంలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఒక ఎకరానికి సగటున రూ.2 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొంది.ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి రూ.4.58 లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఆ అప్పు, వడ్డీతో కలిసి ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుందో..! దీన్ని బట్టి చూస్తే స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా సీఎం చంద్రబాబు చేస్తున్నారంటూ విద్యార్థులు, ఆర్థికవేత్తలు, మేధావులు మండిపడుతున్నారు. -
అవినీతి ‘సేతు’లతో అనవసర సంతకం
సీతానగరం–కనకదుర్గ ఫ్లైఓవర్‌ను అనుసంధానిస్తూ 1.1 కి.మీ.ల పొడవున నిర్మాణానికి డీపీఆర్ తయారీకి టెండర్లుఅమరావతి–విజయవాడ మధ్య ట్రాఫిక్ సమస్య పరిష్కారం లక్ష్యమంటూ ప్రభుత్వం అబద్ధాలు!ఇప్పటికే వెస్ట్రన్ బైపాస్‌లో ప్రకాశం బ్యారేజీకి ఎగువన నాలుగు వరుసల బ్రిడ్జి నిర్మాణందానికి ఎగువన అమరావతితో హైదరాబాద్ రహదారిని అనుసంధానిస్తూ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికీ డీపీఆర్ తయారీకోల్కత–చెన్నై రహదారిని రాజధానిని అనుసంధానిస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణఇక సిగ్నేచర్ బ్రిడ్జి అవసరమేముందని ప్రశ్నిస్తున్న నిపుణులుప్రకాశం బ్యారేజీ దిగువన ఇప్పటికే 1.5 కిమీల పరిధిలో 3 రైల్వే బ్రిడ్జిలు, రెండు రోడ్డు బ్రిడ్జిలుఆరో బ్రిడ్జిగా సిగ్నేచర్ బ్రిడ్జి నిరి్మస్తే ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వదిలే వరద ప్రవాహానికి అడ్డంకేనంటున్న నిపుణులుగరిష్ట స్థాయిలో వరద వస్తే.. వెనక్కి ఎగదన్ని బ్యారేజీ భద్రతకే ముప్పు అంటూ హెచ్చరికఅధిక వడ్డీలకు అప్పు తెచ్చి సిగ్నేచర్ బ్రిడ్జి నిరి్మంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నిలదీతఅస్మదీయులకు పనులు కట్టబెట్టి కమీషన్ల వసూలుకే సిగ్నేచర్ బ్రిడ్జికి రూపకల్పన చేస్తున్నారంటూ విమర్శలుసాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదిపై సీతానగరం(కుడి గట్టు)–కనకదుర్గ ఫ్లైఓవర్(ఎడమ గట్టు)ను అనుసంధానిస్తూ సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీకి ఏజీఐసీఎల్(అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) ద్వారా ప్రభుత్వం టెండర్లు పిలిచింది. బిడ్లు దాఖలు చేయడానికి తుది గడువు ఈనెల 26వ తేది. అదే రోజున సాంకేతిక బిడ్, 27న ఆరి్థక బిడ్ తెరిచి, డీపీఆర్ తయారీ పనులు కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించనుంది. ఆ డీపీఆర్ తయారీకి మూడు నెలలు గడువు విధించింది. ఆ డీపీఆర్ ఆధారంగా సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణ పనులకుటెండర్లు పిలిచి.. కాంట్రాక్టర్‌కు అప్పగించనుంది. అమరావతి–విజయవాడ మధ్య ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఈ సిగ్నేచర్ బ్రిడ్జిని నిరి్మంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం చెబుతోండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతిని కోల్‌కత్–చెన్నై జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16)ను అనుసంధానిస్తూ.. సీడ్ యాక్సిస్ రోడ్డును కనకదుర్గ వారధి వరకూ విస్తరించే పనులు ఇప్పటికే చేపట్టింది. ఇటు ప్రకాశం బ్యారేజీ మీదుగా అమరావతికి రాకపోకలు సాగించడానికి వీలుగా కరకట్ట రోడ్డు(ఈ–1)ను రెండు వరుసల రహదారిగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సిగ్నేచర్ బ్రిడ్జిని నిరి్మంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇంజినీరింగ్ నిపుణులు ప్రశి్నస్తున్నారు. అస్మదీయులకు పనులు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికే సిగ్నేచర్ బ్రిడ్జికి రూపకల్పన చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.అమరావతికి ఎన్‌హెచ్–65తోనూ ఇప్పటికే అనుసంధానం విజయవాడ వెస్ట్రన్ బైపాస్‌ను రాజధాని అమరావతి మీదుగానే ఎన్హెచ్ఏఐ నిర్మించింది. ఈ బైపాస్‌లో అంతర్భాగంగా కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన రెండు రెండు వరుసల బ్రిడ్జిలను నిరి్మంచింది. వెస్ట్రన్ బైపాస్ ద్వారా అటు ఎన్‌హెచ్–16.. ఇటు ఎన్‌హెచ్–65(విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి)కి చేరుకోవచ్చు. ఇక రాజధాని అమరావతిని.. ఎన్‌హెచ్ 65ను అనుసంధానిస్తూ.. రాజధానిలో ఎన్–13 రోడ్డును మూలపాడు వద్ద ఎన్‌హెచ్–65తో కలుపుతూ కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికే ఇప్పటికే రూ.4.81 కోట్లు చెల్లించి నిప్పాన్ కోయి సంస్థ ద్వారా డీపీఆర్‌ను ఏజీఐసీఎల్ తయారు చేయించింది. ఆ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్‌హెచ్–65ను రాజధాని అమరావతితో అనుసంధానిస్తూ కొత్తగా కృష్ణా నదిపై ఎలాంటి బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం లేదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ.. రాజధాని అమరావతిని ఇటు విజయవాడతోనూ అటు ఎన్‌హెచ్–65తోనూ అనుసంధానం చేయడానికి సిగ్నేచర్ బ్రిడ్జి నిరి్మంచడానికి ప్రభుత్వం సిద్ధమవడం గమనార్హం. ప్రకాశం బ్యారేజీ భద్రతకే ముప్పు ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదిపై బ్రిటిషు సర్కార్ హయాంలో నిరి్మంచిన రైల్వే బ్రిడ్జి ఒకటి ఉంది. అది వాడుకలో లేకపోయినా ఆ బ్రిడ్జి స్తంభాలు(పియర్స్) ఇప్పటికీ ఉన్నాయి. రెండు రైల్వే బ్రిడ్జిలను రైల్వే శాఖ నిర్మించింది. వాటికి కొంత దూరంలోనే ఎన్‌హెచ్–16లో అంతర్భాగంగా కృష్ణా నదిపై రెండు రోడ్డు బ్రిడ్జిలను ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిరి్మంచింది. ఈ ఐదు బ్రిడ్జిలు ప్రకాశం బ్యారేజీ దిగువన 1.5 కిమీల దూరంలోనే విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపాదించిన సిగ్నేచర్ బ్రిడ్జి ఆరోది. కృష్ణా నదికి గరిష్ట స్థాయి వరద వచి్చనప్పుడు అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తారు. ఆ వరద ఉద్ధృతికి బ్రిడ్జిల స్తంభాలు అడ్డంకిగా మారుతాయని.. దీని వల్ల ప్రకాశం బ్యారేజీ దిగువన నీటి మట్టం పెరిగి.. వరద వెనక్కి ఎగదన్నే ప్రమాదం ఉంటుందని.. ఇది ప్రకాశం బ్యారేజీ భద్రతకే ముప్పుగా మారుతుందని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పులుల సంరక్షణపై ‘గోళ్లు’ గిల్లుకుంటున్న సర్కార్
సాక్షి, అమరావతి: పెద్ద పులుల సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందా, పులుల వరుస మరణాలను పట్టించుకోవడం లేదా అనే ప్రశ్నలకు సమకాలీన పరిస్థితుల నుంచి అవును అనే సమాధానమే వస్తోంది. దేశంలోనే పెద్ద పులుల అభయారణ్యాల్లో ఒకటైన నాగార్జునసాగర్ – శ్రీశైలం పరిధిలో పులుల దుస్థితి ఆందోళన కలిగిస్తోంది. గత నెల 29న నంద్యాల జిల్లా నందికొట్కూరు రక్షిత అటవీ ప్రాంతంలో తొమ్మిదేళ్ల ఆడ పులి కళేబరం లభించగా, రెండు రోజుల వ్యవధిలో మార్కాపురం జిల్లా గుండ్లకమ్మ పరిధిలో మరో పులి మృతదేహం బయటపడడం వాటి దుస్థితిని, ప్రభుత్వ నిర్లకాŠష్య్న్ని బయటపెట్టినట్టయింది. గుండ్లకమ్మ పరిధిలో మృత్యువాతకు గురైన పులి కాళ్లు తెగిపోయి ఉండడం, గోళ్లు మాయం కావడాన్ని పరిశీలిస్తే వేటగాళ్లు పన్నిన ఉచ్చు అని అర్థం కాని అంశమేమీ కాదు.పొంతన లేని పవన్ కళ్యాణ్ ప్రకటన...ఇక అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా గత నెల 29వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాగార్జునసాగర్ – శ్రీశైలం, శేషాచలంలో కలిపి 68 పులులు, 11 పిల్లలు ఉన్నాయని, ఆరోగ్యకరంగా పెరుగుతున్నాయని తెలిపారు. పులుల వేటను నివారించేందుకు శిబిరాలను 150కి పెంచుతున్నామని డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లు, ఇతర టెక్నాలజీతో నిఘా పటిష్టం చేశామని గొప్పగా ప్రకటించారు. ఈ ప్రకటనకు మరుసటి రోజు నందికొట్కూరు పరిధిలో పులి కళేబరం బయటపడటం గమనార్హం.గతంలో జరిగిన మరో ఘటనలో... నల్లమల ప్రాంతంలో ఏడాది వయసు ఉన్న సఖి అనే పులి పిల్లను చంపి చర్మం తీసుకెళ్లారు. వేటగాళ్లు పులులను చంపడానికి ఉచ్చులు పన్నుతున్నారని అప్పట్లోనే గుర్తించారు. దీని వెనుక పులుల గోళ్లు, చర్మాల స్మగ్లింగ్ రాకెట్ ఉందని తెలిసినా ప్రభుత్వం మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిచ్చింది.శాఖను సరిదిద్దిన పరిస్థితులు ఏవి...వరుసగా రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి హడావుడిగా విచారణకు ఆదేశించారు. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని, ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని ఉత్తర్వులు ఇచ్చారు తప్ప ముందస్తు నివారణ చర్యలు ఫలితమివ్వలేదని ఒప్పుకున్న దాఖలాలు లేవు.. శాఖను సరిదిద్దిన పరిస్థితులు లేవు.వేట నిరోధక శిబిరాలు, డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లు క్షేత్రస్థాయిలో అమలుపై సందేహాలు లేకపోలేదు. బీట్ ఆఫీసర్లు, వాచర్ల కొరత అటవీ శాఖను పట్టిపీడిస్తోంది.రెండు నెలల్లో దీర్ఘకాలిక ప్రణాళిక ఇవ్వాలని కమిటీకి గడువు పెట్టి సర్కారు చేతులు దులుపుకుంది. ఐదు రోజుల కిందట గొప్పగా ప్రకటించిన సంరక్షణ మోడల్, మూడు రోజుల్లోనే ఉత్తిదేనని తేలిపోయింది. దీంతో పులుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. -
చంద్రబాబు ఉత్తరాంధ్ర జపం అంతా ఉత్తదే
విశాఖ విద్య: ‘చంద్రబాబు నిత్యం ఉత్తరాంధ్ర పేరును జపించడం అంతా ఉత్తదే. వాస్తవానికి ఆయన ఆలోచలన్నీ అమరావతిని అభివృద్ధి చేయడంపైనే ఉన్నాయి. దక్షిణ కోస్తా జోన్‌కు సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును అమరావతిలో ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి చంద్రబాబు లేఖ రాయడమే ఇందుకు నిదర్శనం’ అని విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు ధ్వజమెత్తారు. లోక్‌సత్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ రైల్వే జోన్ ఎక్కడ ఉంటే అక్కడే ఆర్ఆర్బీ ఉండాలని, అలాకాకుండా ఆర్ఆర్బీని అమరావతిలో ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి లేఖ రాయడం దుర్మార్గమని మండిపడ్డారు.కొందరికి మాత్రమే ఉపయోగపడే భోగాపురం విమానాశ్రయాన్ని చూపించి లక్షలాది మంది ఉత్తరాంధ్రకు చెందిన నిరుద్యోగులకు ఉపయోగపడే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును అమరావతికి ఎత్తుకుపోవడమేనా చంద్రబాబు తెలివితేటలు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో రైల్వే ఉద్యోగాల పరీక్షల కోసం ఒడిశాకు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు ఉత్తరాంధ్ర యువతకు తెలుసని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల పోరాటాల ఫలితంగానే రైల్వే జోన్ వచి్చందని, ఇప్పుడు ఆర్ఆర్బీ కోసం మరో ఉద్యమం అవసరమని స్పష్టంచేశారు.విశాఖలో ఆర్ఆర్బీ ఏర్పాటు కోసం సంతకాల సేకరణ చేపట్టాలని, ఉత్తరాంధ్రకు చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు అయ్యేలా కృషి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, సీపీఐ నాయకుడు జేవీ సత్యనారాయణమూర్తి, పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. -
పెమ్మసానిపై అంబటి రాంబాబు ఆగ్రహం
సాక్షి, గుంటూరు: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైఖరిపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పే అభివృద్ధి ఏంటో ప్రజలు గమనించాలి. అర్ధరాత్రి వేళల్లో మహిళలు ఉన్న ఇళ్లలోకి చొరబడి, తలుపులు పగులగొట్టి పోలీసులు తనిఖీలు చేయడమేనా ఆయన తెచ్చే అభివృద్ధి? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.గుంటూరు జిల్లాలో హోం డిపార్ట్మెంట్ పూర్తిగా పెమ్మసాని జేబులోనే ఉందని, ఆయన కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం నడుస్తోందని ఆరోపించారు.నా ఇంటిపై దాడి చేయించారు. గతంలో తన ఇంటిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ అంబటి భావోద్వేగానికి గురయ్యారు. "నా ఇంటిపై దాడి చేసే సమయంలో 24 గంటల్లో సినిమా చూపిస్తా అని పెమ్మసాని ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయనకు తప్పు చేశాననే భావన ఉంది.. ఎందుకంటే ఆయన ఒక నేరస్థుడు అని మండిపడ్డారు.తాను నల్లపాడు పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఉన్న సమయంలో జరిగిన ఒక అంతర్గత విషయాన్ని అంబటి బయటపెట్టారు. నేను నల్లపాడు స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడి ఇద్దరు సీఐలకు పెమ్మసాని స్వయంగా ఫోన్ చేశారా లేదా? ఒకవేళ ఆయన పోలీసులకు ఫోన్ చేయలేదని నిరూపిస్తే, నేను ఆయన కాళ్లకు దండం పెడతా అంటూ సవాల్ విసిరారు. పెమ్మసాని మీద తనకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదని, కానీ తన ఇంటిపై దాడి చేయించి క్రూరత్వానికి పాల్పడినందుకే తాను తీవ్రమైన కడుపుమంటతో మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. నా ఇంటిపై దాడి చేసిన వారిలో ఇంతవరకు పోలీసులు ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? అని నిలదీశారు. -
అమరావతిని గ్రేటర్ కమ్యూనిటీగా మార్చేస్తున్నారు.. ఆ రోజు జగన్ ను నేను కలిసినప్పుడు నాతో అన్న మాట
-
రఘురామతో నాకు ప్రాణహాని ఉంది: శ్రీనివాస్
సాక్షి,అమరావతి: గుంటూరులో కిడ్నాప్ కలకలం రేపుతోంది. వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వర్గం కిడ్నాప్‌కు యత్నించింది. ఈ క్రమంలో వ్యాపారవేత్త శ్రీనివాస్ పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.శుక్రవారం సాయంత్రం మా ఇంటికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. నన్ను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. స్వయంగా రఘురామకృష్ణరాజే నాకు ఫోన్ చేశారు. తాను పంపిన వాళ్లతో రావాలని బెదిరించారు. రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీలను బ్యాంక్ ఆక్షన్‌లో కొనుగోలు చేశా. రఘురామకృష్ణరాజుతో నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరా’అని వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్ తెలిపారు. -
ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ఏపీలో సమ్మరీ ఇన్ఫర్మేషన్ రివిజన్ (SIR) ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్ల ఎన్యుమరేషన్ పూర్తి చేసినట్లు ఈసీ వెల్లడించింది. అంటే రాష్ట్ర మొత్తం ఓటర్లలో 89.22 శాతం మంది ఫారాలు ఇచ్చినట్లయ్యింది. జాబితా ప్రక్షాళనలో భాగంగా 7.37 లక్షల మంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. 15.22 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్టు ప్రకటించగా, 22.30 లక్షల మంది షిఫ్ట్, గైర్హాజరైనట్లు తెలిపింది.అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 44,89,512 మంది ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించాల్సి ఉందని, ప్రస్తుతానికి వారి నుంచి ఫారాలు తీసుకోలేదని ఈసీ స్పష్టం చేసింది.కాగా, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం సిబ్బంది (BLOలు) ప్రతి ఇంటికీ తిరిగి, అక్కడ నివసిస్తున్న ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్లు లాక్కోడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎలాంటి పరిహారం చెల్లించకుండా రైతుల భూములను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దౌర్జన్యపూరితంగా, బలవంతంగా, చట్టవిరుద్ధంగా లాక్కుంటున్న నేపథ్యంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏ వ్యక్తి ఆస్తిని లాక్కోడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తన భూమిని సేకరించే విషయంలో ముందుకెళ్లకుండా అధికారులను నిరోధించాలంటూ చోడిశెట్టి నిర్మలత అనే రైతు దాఖలు చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.ఇందుకు సంబంధించి పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరిపి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన వారంలోపు తగిన నిర్ణయం వెలువరించాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. అప్పటి వరకూ ఈ భూమి విషయంలో గతంలో ఇచ్చిన ‘యథాతథస్థితి’ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, న్యాయమూర్తి జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ దౌర్జన్యంపై హైకోర్టులో పిటిషన్...అమరావతి రాజధాని ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం పెనుమాక రైతుల భూములను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా దౌర్జన్యపూరితంగా, బలవంతంగా లాక్కుంటున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలో తన భూమిని సైతం ఎలాంటి పరిహారం చెల్లించకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంటుండటంతో ప్రభుత్వ చర్యలను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన చోడిశెట్టి నిర్మలత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలోని సర్వే నెంబర్ 39–2లో ఉన్న 65 సెంట్ల భూమికి సంబంధించిన భూ సేకరణ నోటిఫికేషన్‌తో పాటు తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ చల్లా గుణరంజన్, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ భూ సేకరణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ నిర్మలత ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ఇటీవల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తిల్హరీ «నేతృత్వంలోని ధర్మాసనం, నిర్మలత భూమి స్వాధీనం విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఈ అప్పీల్ విచారణకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి కీలక నిర్దేశాలు ఇచ్చింది. ప్రభుత్వానికి ధర్మాసనం సూచనలు» ఆస్తిలో అతి చిన్న భాగాన్ని సేకరించాలన్నా కూడా, అది చట్టానికి లోబడి జరగాల్సిందే. » 2013 భూసేకరణ చట్టం కింద భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే ఆ సేకరణ చట్ట నిబంధనల ప్రకారమే జరిగి తీరాలి. » భూ సేకరణలో తీసుకుంటున్న భూమి విస్తీర్ణం చాలా తక్కువే అయినప్పటికీ, ఆస్తి హక్కు అనేది ఆ భూమి విస్తీర్ణంపై ఆధారపడి ఉండదు. » విస్తృత ప్రజాప్రయోజనానికి, ఒక వ్యక్తి ప్రయోజనానికి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు, విస్తృత ప్రజా ప్రయోజనమే నిలబడుతుంది. » ఇతరుల దృష్టిలో ఆ ఆస్తి నష్టం ఎంత చిన్నదైనప్పటికీ, చట్ట నిబంధనల ప్రకారం ఆ ఆస్తిని మినహాయించడానికి వీల్లేదు. » ’చట్ట ప్రకారం’ అంటే కేవలం చట్టపరమైన అధికారం ఉండటం మాత్రమే కాదు. చట్టం నిర్దేశించిన విధి విధానాలను ఖచ్చితంగా అనుసరించడం కూడా. » ప్రస్తుత కేసులో చట్ట నిబంధనలు, నిర్దేశిత విధి విధానాలను పాటించలేదని బాధిత వ్యక్తుల తరఫు న్యాయవాది చేసిన వాదనను ఎలాంటి ప్రాధాన్యత, విలువ లేనిదిగా ఈ దశలో చూడలేము. » చట్ట విధి విధానాలను పాటించారా లేదా దాని ప్రభావం ఏంటన్నది బాధితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లో తేల్చాల్సిన అంశం. » ఈ నేపథ్యంలో అప్పీలుదారు ప్రయోజనాలను కాపాడటం సమంజమైన చర్య. -
రాజధాని అప్పులు రాష్ట్ర ప్రజల పైనే!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు భారం రాష్ట్ర ప్రజలపై పడదని సీఎం చంద్రబాబు, ఇతర కూటమి నేతలు పదే పదే చెబుతూ వచ్చారు. కేంద్రం ఇప్పించిన రుణాల భారమూ రాష్ట్రంపై పడదని నమ్మబలికారు. తీరా చూస్తే అప్పులను మెల్లగా రాష్ట్ర ఖజానా నుంచే చెల్లించడం ప్రారంభించారు. రాజధాని పేరుతో చేసిన అప్పులు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర బడ్జెట్ నుంచి చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ప్రారంభించింది. ఈ ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో చెల్లించాల్సిన అప్పుల కోసం బడ్జెట్ నుంచి రూ.231.40 కోట్లను విడుదల చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గడువు తీరుతున్న అప్పుల చెల్లింపునకే ఈ నిధులను వినియోగించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఆర్డీఏ కమిషనర్ వినతి మేరకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ గొప్పలు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరి రాజధాని పేరుతో చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు బడ్జెట్ నుంచి నిధులు ఎందుకు విడుదల చేస్తున్నారో చెప్పాల్సి ఉందని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ, ఎన్ఏబీఎఫ్ఐడీ, ఏపీపీఎఫ్సీఎల్, నాబార్డు నుంచి రూ.47,387 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే. అప్పులు చేసినా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయినందున అప్పులను ఆ ప్రాజెక్టే తీరుస్తుందనే రీతిలో సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. తీరా ఇప్పుడు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో గడువు తీరుతున్న అప్పులను తిరిగి చెల్లించేందుకు రూ.231.40 కోట్లను బడ్జెట్ నుంచి విడుదల చేయడం గమనార్హం. ఈ నిధులు విడుదలతో పాటు షరతులను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధులను సీఆర్డీఏ ప్రతిపాదనల్లో సూచించిన రుణ బాధ్యతల చెల్లింపునకు మాత్రమే ఉపయోగించాలని, మరే ఇతర ప్రయోజనానికి వినియోగించరాదని షరతు విధించారు. అన్ని తిరిగి చెల్లింపులు రుణ ఒప్పందాలు, గడవు తేదీల ప్రకారం కచ్చితంగా జరగాలని, వాటిని నిర్ధారించాలని చెప్పారు. నిధుల వినియోగం జరిగిన వెంటనే, రుణాల వారీగా చెల్లింపుల వివరాలతో పాటు వినియోగ ధ్రువీకరణ పత్రాన్ని పరిపాలన, ఆర్థిక విభాగాలకు సమర్పించాలని, సంబంధిత శాఖ తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
జగన్ ట్రాక్‌లోకి చంద్రబాబు.. మార్గాని భరత్ మాస్ ర్యాగింగ్
-
జనసేన నేత అనుమానాస్పద మృతి
సాక్షి,తిరుపతి: జనసేన పార్టీ రాజంపేట సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శివకుమార్ (48) తిరుపతిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనడీ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నూనెవారిపల్లికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.శివకుమార్ ఈనెల 26న తన ఇంటి నుండి బయలుదేరి తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించారు. అనంతరం తిరుపతి కెనడీ నగర్లో ఉంటున్న తన బంధువు చింతల రమణమూర్తి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇంటి బాత్రూంలో శివకుమార్ ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు మృతుడి భార్య కళ్యాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఈస్ట్ ఎస్ఐ రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.మృతిపై ముసురుతున్న అనుమానాలు శివకుమార్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు పర్యటనలో ఉన్న సమయంలో పెరియపాలెంలో ద్విచక్ర వాహనాన్ని వదిలేశారని, అక్కడే ఇద్దరు వ్యక్తులు తమ సిమ్ కార్డులను పారేసినట్లు శివకుమార్ బంధువు పవన్ తెలిపారు. నిన్న తిరుపతిలోని రమణమూర్తి ఇంటికి శివకుమార్, పవన్ కలిసి వచ్చారు. ఈరోజు ఉదయం వైఫై కనెక్ట్ అవ్వడంతో, వాట్సాప్ కాల్ ద్వారా పవన్‌తో శివకుమార్ భార్య కళ్యాణి మాట్లాడారు. ఆ మాట్లాడిన కొద్దిసేపటికే శివకుమార్ బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. -
భూ దందాకు బరితెగింపు!
ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉన్న 22ఏ వ్యవస్థను బలహీన పరిచి.. లక్షల ఎకరాల విలువైన భూములు ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదానికి చంద్రబాబు సర్కారు తలుపులు తెరిచింది. ఇది ప్రమాదం అని తెలిసినా ఎందుకిలా చేస్తోందంటే దండుకోవడమే లక్ష్యమని ఇట్టే తెలుస్తోంది. ఎన్నో లొసుగులతో కూడిన జీవో 444 ఇందుకు నిదర్శనం. ఇది సంస్కరణ పేరు చెప్పి విలువైన ప్రభుత్వ భూములు, దేవదాయ–వక్ఫ్ ఆస్తులు, తీర ప్రాంత భూములను నచ్చిన వారికి కట్టబెట్టే ఎత్తుగడ. భూ పరిపాలనలో రాజకీయ జోక్యాన్ని పెంచి అందినకాడికి వెనకేసుకోవడమే ఇందులో మర్మమని రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి, అమరావతి: నిషేధిత ఆస్తుల జాబితాపై చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన 444 నంబర్ జీవో లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యేందుకు దోహదం చేసేలా ఉందని రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైకి ఇది ఒక సంస్కరణలా కనిపిస్తున్నా, లోతుగా పరిశీలిస్తే ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తులకు ముప్పు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. గతంలో తెచ్చిన 22ఏ రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఈ జీవోలో పకడ్బందీగా ఏర్పాట్లు జరిగినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ), ఏపీ మారిటైమ్ బోర్డు భూములకు వెబ్‌ల్యాండ్‌లో కొత్త వర్గీకరణ చేస్తామనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ఆ సంస్థలు ఆన్ౖలెన్లో అభ్యర్థన పెడితే చాలు సీసీఎల్ఏ ఆమోదంతో ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి వెబ్‌ల్యాండ్‌లో పట్టాగా మార్చే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఆ భూముల ఇష్టానుసారం అమ్మకాలు, బదిలీలు, రిజిస్ట్రేషన్లకు తలుపులు బార్లా తెరిచినట్లే. ఈ మార్పునకు గెజిట్ నోటిఫికేషన్, అసెంబ్లీ ఆమోదమే కాదు కనీసం కేబినెట్ సమ్మతం కూడా అవసరం లేదు. ఒక ఆన్లైన్ వినతితో కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీలకు మేలు చేయడం కోసం ఇంత పెద్ద మార్పు వెంటనే జరిగిపోతుంది.దీనివల్ల ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న లక్షలాది ఎకరాలు ఆ కంపెనీల పరమయ్యేందుకు ఆస్కారం కల్పించినట్లే. మరోవైపు రామాయపట్నం పోర్టు నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే పీపీపీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా అదే మారిటైమ్ బోర్డు భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టాలుగా మార్చే వెసులుబాటు కల్పించడం గమనార్హం. పోర్టుల చుట్టూ భవిష్యత్తులో బంగారం కానున్న ఈ తీర ప్రాంత భూముల్ని ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడం చాలా సులువు అవుతుంది.విలువైన భూములు అమరావతి పెద్దల చేతుల్లోకి..ఇప్పటి వరకు 22ఏ జాబితాలో చేర్పులు, తొలగింపులు క్షేత్ర స్థాయి రికార్డుల ఆధారంగా ఆర్డీవో, సబ్ కలెక్టర్ స్థాయిలో జరిగేవి. ఇకపై వ్యవసాయ భూమి ఎకరం దాటినా, వ్యవసాయేతర స్థలం వెయ్యి చదరపు గజాలు దాటినా 22ఏ జాబితాలో చేర్చే తుది నిర్ణయం ప్రభుత్వానిదే. దీనర్థం చిన్న చిన్న భూములపై నిర్ణయం అధికారుల స్థాయిలో తేలిపోతుంది. అమరావతి, విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగర శివార్లలో రూ.కోట్ల విలువ చేసే ఎకరాలకు ఎకరాల భూముల ఫైళ్లు మాత్రం పెద్దల వద్దకు వెళ్లాల్సిందే.అలాగే సీసీఎల్ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్) వద్ద పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లు, రివిజన్లు, రివ్యూలు అన్నింటినీ ప్రభుత్వానికి బదిలీ చేసుకున్నారు. రివిజన్ అధికారం ప్రభుత్వానిదే.. స్టే ఇచ్చే అధికారం ప్రభుత్వానిదే.. ఏ అధికారి ఉత్తర్వునైనా సుమోటోగా తిరగదోడే అధికారం కూడా ప్రభుత్వానిదే. రికార్డుల ఆధారంగా నడవాల్సిన క్వాసీ జ్యుడీషియల్ వ్యవస్థను రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టడంపై రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై సామాన్యులు తహశీల్దార్, కలెక్టరేట్ల చుట్టూ తిరగడమే భారమైతే ఇప్పుడు ఏకంగా అమరావతి పెద్దల చుట్టూ తిరగడం వారికి సాధ్యమవుతుందా.. అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ కొత్త ఏర్పాటు అధికార పార్టీ నేతల కోసమేనని స్పష్టమవుతోంది.దేవుడి భూములకూ ఎసరువేలంలో అమ్మిన దేవదాయ, వక్ఫ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలనే నిర్ణయం వివాదాస్పదమే. గతంలో వివాదాస్పదంగా, నామమాత్రపు ధరలకు, బినామీల పట్టుతో జరిగిన వేలాలకూ రక్షణ కల్పించేందుకే ఈ లొసుగు పెట్టుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కోర్టు కేసులు, ‘ఇతరాలు’ కేటగిరీల ఎంట్రీలపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల్లో కోర్టు ఉత్తర్వు, గెజిట్ నోటిఫికేషన్ స్కాన్డ్ కాపీలు అప్లోడ్ చేయకపోతే ఆ ఎంట్రీలన్నీ మూకుమ్మడిగా తొలగిపోతాయి. దశాబ్దాల నాటి కేసుల రికార్డులను, తాలూకా ఆఫీసుల్లో మురిగిపోతున్న ఫైళ్లను మూడు నెలల్లో వెతకడం అసా«ద్యమని అధికారులే అంటున్నారు. వివాదాల్లో ఉన్న భూములు, కోర్టుల్లో నలుగుతున్న ఆస్తులను 22ఏ జాబితా నుంచి తప్పించి కమీషన్లు, వాటాలు దండుకునేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లు అర్థమవుతోంది. -
సీఎం చంద్రబాబుకి ఝలక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఝలక్ ఇచ్చారు. కేబినెట్ సమావేశం సమయంలో పవన్ కళ్యాణ్ వేరే సమీక్ష నిర్వహించారు. సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్‌కి పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. మంగళగిరిలోనే ఉన్నా కేబినెట్‌కు హాజరు కాలేదు. అదే సమయంలో అటవీ శాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు కేబినెట్ని పవన్ కళ్యాణ్ లెక్కచేయరు. గత కేబినెట్ సమావేశానికి హాజరుకాని పవన్ కళ్యాణ్.. గతంలో సీఎం చంద్రబాబు సమీక్షలకు కూడా వెళ్లలేదు.దీంతో సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం వైనంపై అధికార వర్గాల్లో చర్చ కొనసాగుతోంది -
హనుమాన్ విగ్రహం చోరీ.. మాయం చేసింది టీడీపీ నేతనే!
సాక్షి,తిరుపతి: తిరుమల కొండపై కలకలం రేపిన అంజనేయస్వామి విగ్రహం చోరీ కేసు దర్యాప్తులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఉన్న హనుమాన్ చిన్న విగ్రహాన్ని అపహరించిన వ్యక్తిని రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.తిరుమలలో అపచారానికి పాల్పడి విగ్రహాన్ని చోరీ చేసిన నిందితుడు విశాఖపట్నం జిల్లా, భీమిలి నియోజకవర్గం, టి. నగరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేత పొట్నూరు యశ్వంత్గా దర్యాప్తులో తేలింది. నిందితుడు యశ్వంత్‌కు టీడీపీలోని కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్,గంటా శ్రీనివాసరావు సహా పలువురు పార్టీ ముఖ్య నేతలతో యశ్వంత్ దిగిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. -
అమరావతి ఓఆర్ఆర్ 500 మీటర్ల వెడల్పా!?
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): అమరావతి ఔటర్ రింగ్‌రోడ్ 140 మీటర్ల నుంచి 500 మీటర్ల వరకు వెడల్పుతో నిర్మించేందుకు వీలుగా భూసేకరణ చేయడం పట్ల ఐదు జిల్లాల అమరావతి రింగ్‌రోడ్డు బాధిత రైతుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణ వెడల్పు 140 మీటర్లు, కూడళ్ల వద్ద 250 నుంచి 500 మీటర్ల మేర రోడ్డు నిరి్మంచాలని ప్రతిపాదించడం అర్ధరహితమని పేర్కొంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెడల్పు 70 మీటర్లకు మించి లేదని గుర్తుచేసింది. ఏపీ రైతుసంఘం రాష్ట్ర నాయకుడు పి.వి ఆంజనేయులు అధ్యక్షతన విజయవాడలో మంగళవారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లకు గోడలు, ఇనుప కంచెలు వేస్తే రోడ్డు వెంబడి సరిహద్దు పొలాలకు ఏ మాత్రం విలువ పెరగదని చెప్పారు. రింగ్‌రోడ్డు పోయే గ్రామాల ప్రజలను సంప్రదించకపోవడం దారుణమన్నారు. వెంటనే గ్రామసభలు పెట్టి ఈ ప్రాజెక్టుపై వాస్తవాలను రైతులకు వివరించాలని డిమాండ్ చేశారు. పారదర్శకత లేని అప్రజాస్వామిక పద్ధతులను ప్రభుత్వం, అధికారులు విడనాడాలని కోరారు. ఐదుజిల్లాల్లోంచి వెళుతున్న అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆ జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీచేసి ఆరునెలలవుతోందన్నారు.రైతులకు వ్యక్తిగతంగా ఎంత పొలం పోతుంది? ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందనే దానిపై ఒక్క రైతుకు కూడా నోటీసు రాలేదని, ఒక్కచోట కూడా గ్రామసభ నిర్వహించలేదని చెప్పారు. డీపీఆర్ గురించి సీఆర్డీఏ అధికారులను, కలెక్టర్లను, రెవెన్యూ మంత్రిని ఎవరినడిగినా సమాధానం లేదన్నారు. ఈ ప్రాజెక్టు విషయాన్ని అంత సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సామాజిక అధ్యయనం రిపోర్టుగానీ, డీపీఆర్గానీ రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం గ్రామసభలు పెట్టి రైతులకు వాస్తవాలు చెప్పి వారి అనుమానాలను తీర్చకపోతే బాధిత రైతుల తరఫున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. -
ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు
సాక్షి,కృష్ణా : ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో ఏడు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26కు చేరింది.కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, బాపట్ల జిల్లాలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కారణంగా 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో తొమ్మిది మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు ముగ్గురు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. -
బాబూ.. రైతు కన్నీటితో అమరావతా?
కర్షకులకు, భూమికి ఉండే అవినాభావ సంబంధం మాటలకు అందనిది. ఆ భూమిని నమ్ముకుని రైతు జీవనం సాగిస్తాడు. పంటలు వేసుకుని పసిపిల్లాడిని సాకుతున్నట్లుగా చూసుకుంటాడు. అలాంటి పంటపొలం నాశనం అవుతుంటే విలవిలలాడిపోతాడు. ఏపీ రాజధాని అమరావతిలోని కొన్ని గ్రామాలలో రైతులు పడుతున్న ఆవేదన, వారికి ఎదురైన దారుణమైన అనుభవం చూసేవారి కంట నీరు తెప్పిస్తుంది. సడన్‌గా ప్రభుత్వ అధికారులు, పోలీసులు వచ్చి పంటలను వారి కళ్లెదుటే ధ్వంసం చేస్తుంటే ఆ రైతులు, రైతు మహిళలు ఎవరికి చెప్పుకోవాలి. తమను రక్షించవలసిన ప్రభుత్వమే క్రూరంగా వ్యవహరిస్తుంటే రోదనలు, వేదనలు తప్ప ఏమి మిగులుతాయి!కొద్దిరోజుల క్రితం ఉండవల్లి గ్రామంలో కొన్ని భూములను సేకరించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అనుసరించిన పద్దతి ఏ మాత్రం నాగరికంగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. బుల్ డోజర్లు, జేసీబీలు తెచ్చి పచ్చని పంటలను దున్నేస్తుంటే, అక్కడ ఉన్న మహిళల ఆక్రందనలు ఆకాశానికి అంటాయి. అక్కడికి సమీపంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంది. ఈ రైతుల ఆక్రందనలు ఆయనకు వినిపంచలేదా అంటే ఏమి చెబుదాం. ఇదే తరహాలో ఎక్కడైనా గత వైఎస్సార్సీపీ పాలనలో జరిగి ఉంటే అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్ని ఆరోపణలు చేసేవారో చెప్పలేం. ఎల్లో మీడియా అయితే నానా రభస సృష్టించేవి.కృష్ణానది గర్భంలో పర్యావరణానికి విరుద్దంగా, అనుమతులు లేకుండా 2014 టరమ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజావేదిక పేరుతో ఒక నిర్మాణం చేసింది. ప్రభుత్వమే ఇలా నిబంధనలకు విరుద్దంగా నిర్మించడం ఏమిటని, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూల్చివేసింది. దానిని విధ్వంసంగా అభివర్ణిస్తూ చంద్రబాబుతో పాటు, ఇతర పార్టీల నేతలు నానా రచ్చ చేశారు. ఐదేళ్లపాటు అదే ప్రచారం చేశారు. ఆ వేదిక కూల్చడం వల్ల ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతం వెళ్లింది. ఎవరూ చట్టాన్ని అతిక్రమించరాదన్న విషయాన్ని తెలియచేసినట్లయింది. అయినా అలా చేయడాన్ని తప్పు అని చెప్పిన టీడీపీ ఇప్పుడు ఏకంగా రైతుల జీవితాలు ధ్వంసం అయ్యేలా పంట పొలాలను నాశనం చేయడం ధర్మమేనా అని అడిగితే బదులు ఇచ్చేవారు లేరు. పైగా ఎల్లో మీడియా అలాంటి అకృత్యాలకు అండగా నిలబడి ఆ వార్తలను కప్పిపుచ్చే యత్నం చేసింది.కొన్నాళ్ల క్రితం ఒంగోలు సమీపంలోని కరేడు వద్ద కూడా బలవంతపు భూ సేకరణకు ప్రయత్నిస్తే రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉండవల్లి, పెనుమాక, తదితర కొన్ని గ్రామాల రైతులు రాజధాని అవసరాలకు పొలాలు ఇవ్వకపోలేదు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు కావల్సిన భూమి తీసుకుని, మిగిలినది తమకే వదలివేయాలని వారు కోరారు. ఆ భూమి ఇవ్వడానికి వీరు ఇష్టపడలేదు. అయినా ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి, వారు కోరిన విధంగా పరిహారం ఇచ్చి భూములు తీసుకోవచ్చు. అలాకాకుండా మార్కెట్ రేట్ కన్నా తక్కువ మొత్తాన్ని ఏకపక్షంగా వారి ఖాతాలలో జమచేసి భూములు లాక్కోవడం సమంజసమేనా? అందులోను రెండు, మూడునెలల్లో పంటలు వచ్చేవరకు ఆగకుండా వాటిని పాడు చేయడం ద్వారా ప్రభుత్వం ఏమి సాధిస్తుంది? రైతులను ఏడిపించడం తప్ప.కొందరు మహిళలు కూటమి ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టిన తీరును అంతా గమనించారు. గత కొన్ని నెలలుగా ఈ గ్రామాల రైతులను రకరకాల రూపాలలో ప్రభుత్వం వేధించింది. లాండ్ పూలింగ్‌కు ఈ రైతులు భూములు ఇవ్వలేదు. అయినా వీరి భూములను ఎల్పీఎస్ కింద వేరే వారికి ప్లాట్లు కేటాయించింది. ఈ అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని అడిగితే ఎవరూ జవాబు ఇవ్వలేదు. రైతుల పంటపొలాల చుట్టూ గోతులు తవ్వడం, స్తంభాలు కూల్చి కరెంటు ఆపేయడం, మోటార్లు, పైపులు మాయం చేయడం వంటివి చేశారు. ఎవరైనా ఇతరులు ఇలా చేస్తే రౌడీయిజం అని, దౌర్జన్యం అని విమర్శిస్తారు. ఏకంగా ప్రభుత్వ అధికారులే ఈ దుశ్చర్యలకు పాల్పడితే, పోలీసుల అండ చూసుకుని పంటలను దున్నించివేస్తే ఏమనాలి? ఆ బాధ తట్టుకోలేక, తన భూమిని అమ్ముకోనివ్వలేదన్న ఆవేదనతో పద్మనాభ రెడ్డి అనే రైతు గుండెపోటుకు గురై మరణించారన్న సమాచారం మరింత ఆవేదన కలిగిస్తుంది. ఇది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ మంగళగిరి ఇన్చార్జీ దొంతిరెడ్డి వేమారెడ్డి విమర్శించారు.ఇక ప్రభుత్వ అనుకూల వ్యక్తులు, శక్తులు రాజధానిలో భూములు ఇవ్వని వారిని ఆన్లైన్లో అసభ్యకరంగా ట్రోలింగ్ చేశారట. ఇలాంటివాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పైగా సోషల్ మీడియాపై నిత్యం చంద్రబాబు, తదితరులు నీతులు చెబుతుంటారు. ఈ రైతులు ఎవరూ కోర్టుకు వెళ్లకుండా సెలవు దినాలలో ఈ పనికి తెగబడ్డారు. ఇప్పటికే కోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయట. ఇక్కడ సాగు చేసుకుంటున్నవారిలో మెజార్టీ చిన్న, సన్నకారు వారే. ఏభై వేల ఎకరాల భూమి అందుబాటులో ఉన్నా, అక్కడ నిర్మాణాలు ఇంకా కొలిక్కి రాకపోయినా, బలవంతంగా తక్కువ పరిహరం ఇచ్చి తమ భూములు లాక్కున్నారని కొందరు వాపోతున్నారు.ఉండవల్లి, పెనుమాక వంటి గ్రామాలలో రాజధానితో సంబంధం లేకుండానే భూముల విలువ కోట్లలో ఉంది. ఆ సంగతి అందరికి తెలుసు. ఒక రైతును ఏడిపించి భూమిని తీసుకున్నా, తాను అంగీకరించబోనని గతంలో బీకర ప్రతిజ్ఞలు చేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం వీరికి సానుభూతి కూడా తెలిపినట్లు కనిపించలేదు. ముఖ్యమంత్రికి ఈ దౌర్జన్యాలు సరికాదని చెప్పలేకపోయారు. కొన్నాళ్ల క్రితం ఉండవల్లి రైతుల బాధలు వినడానికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడిచేసి అడ్డుకున్నారు. ఈ పరిస్థితి బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఉండదేమో!ఒకప్పుడు ఢిల్లీ సమీపంలో భూ సేకరణపై జరిగిన రగడ దేశవ్యప్తంగా సంచలనం అయింది. కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం తదితర పక్షాలన్నీ కలిసి కొత్త భూ సేకరణ చట్టాన్ని తెచ్చి, మారర్కెట్ రేటుకు మూడు రెట్లు అధికంగా రైతులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు అవే పార్టీలు ఆ చట్టంతో సంబంధం లేకుండా లాండ్ పూలింగ్ అనే విధానాన్ని కనిపెట్టి రైతులను మభ్యపెట్టి భూములు తీసుకుంటున్నాయి. దీనివల్ల ఎక్కడైనా కొద్దిమందికి ప్రయోజనం కలిగిందేమో తెలియదు. కాని ఎక్కువమంది నష్టపోతున్నారు. దానికి అమరావతి భూ సమీకరణే ఉదాహరణ కావచ్చు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం రైతులపట్ల, మహిళలపట్ల కనికరం లేకుండా ప్రవర్తించడం మాత్రం అత్యంత బాధాకరం అని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ ఉదారతకు ఏపీ ఎంఆర్పీఎస్ కృతజ్ఞతలు
సాక్షి, అమరాతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారతకు ఏపీ ఎంఆర్పీఎస్ కృతజ్ఞతలు తెలిపింది. ఆదివారం ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు మాట్లాడుతూ.. విజయవాడ కృష్ణలంక సీఐ అరాచకానికి, వేధింపులకు బలై నిండు ప్రాణాన్ని కోల్పోయిన దళిత యువకుడు పేరు పోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. క్రాంతి కుమార్ కుమారుడి కాలు ఆపరేషన్‌కు అయ్యే మొత్తం వైద్య ఖర్చులను భరిస్తూ, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచినందుకు వారికి ఏపీ ఎంఆర్పీఎస్ రుణపడి ఉంటుందన్నారు. -
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి,విశాఖ: అనకాపల్లి - ఆనందపురం జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఆదివారం తెల్లవారు జామున జాతీయ రహదారిలో గండిగుండం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. బాధితులు టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘కూటమి ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తోంది.. మోసం చేస్తోంది’
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది సైతం తల్లికి వందనంలో కోత విధించడంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. మీరు చెప్పిన మాటలకు బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులకు ఏమైనా సంబంధం ఉందా?.బడ్జెట్లో కేటాయింపులకు ఎంత మార్చారు. ఎంత రిలీజ్ చేశారో దేవుడికే తెలియాలి. కూటమి ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తోంది.. మోసం చేస్తోంది. తొలి ఏడాదిలోనే అమ్మకు వందనం డబ్బులు ఎగ్గొట్టారు. ప్రభుత్వం తమ తప్పులను సరిదిద్ధుకుంటుందనే చెబుతున్నాం. విద్యార్థుల తల్లులు చెప్పిన మాటలనే మేం మాట్లాడుతున్నాం’అని అన్నారు. -
చంద్రబాబు కాన్వాయ్ వాహనాలకు భారీ ఖర్చు
సాక్షి,అమరావతి: చంద్రబాబు కాన్వాయ్ వాహనాల కోసం కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది. సరికొత్త వాహనాల కొనుగోలుకు రూ.18.66 కోట్లు కేటాయిస్తూ కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు జీవోలను జారీ చేసింది. మూడు జామర్ వాహనాల కొనుగోలుకు అత్యధికంగా రూ.12.28 కోట్లు, మరో మూడు జామర్ వాహనాల కోసం రూ.3.74 కోట్లు కేటాయించారు. వీటితో పాటు భద్రతా కోసం ఆరు సరికొత్త ఫార్చూనర్ లగ్జరీ వాహనాల కొనుగోలుకు రూ.2.64 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.గత నెలలోనూ కాన్వాయ్ వాహనాల నిమిత్తం ప్రభుత్వం రూ.9.60 కోట్లు విడుదల చేసింది. అంతకుముందు జూన్ నెలలోనూ రెండు జామర్ వాహనాల కొనుగోలుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఈ లెక్కన కేవలం నెల రోజుల వ్యవధిలోనే సీఎం కాన్వాయ్ మరియు భద్రతా వాహనాల కోసం ఏకంగా రూ.28.30 కోట్లను కూటమి ప్రభుత్వం ప్రజాధనం నుండి విడుదల చేయడం గమనార్హం.ప్రధాని నరేంద్ర మోదీ తరహాలోనే సీఎం చంద్రబాబు కూడా తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను భారీగా తగ్గించుకున్నారంటూ గత కొద్ది రోజులుగా అధికారిక వర్గాలు విస్తృతంగా ప్రచారం చేసుకున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కఠిన పొదుపు చర్యలు పాటిస్తామని ప్రకటించిన రెండు నెలల్లోనే.. తెరవెనుక ఈ స్థాయిలో కోట్ల రూపాయలను కొత్త వాహనాలకు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పొదుపు నీతులు చెబుతూనే, మరోవైపు కేవలం నెల రోజుల్లో వాహనాల కోసమే రూ.28.30 కోట్లు విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
మీడియాకు ముద్రగడ కుమారుల లేఖ
సాక్షి,కీర్లంపూడి: కాపు ఉద్యమ నేత, దివంగత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమారులు బాలు, గిరిబాబులు మీడియాకు లేఖ రాశారు. ‘వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి ముద్రగడ నిలువుటద్దం. ఆయన మరణాంతరం ఏం చేయాలనే దానిపై.. ఆయన మాకు చాలా స్పష్టంగా చెప్పారు. ముద్రగడ నిర్ణయం మేరకే అంత్యక్రియల ప్రక్రియ నడిచింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు వద్దని చెప్పారు.ఆయన నిర్ణయం మేరకు అధికారిక లాంఛనాలను తిరస్కరించాం. ఈ విషాద సమయంలో మాకు అండగా ఉండి.. ముద్రగడపై అపార గౌరవాన్ని చాటిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.‘మాకు, బార్లపూడి క్రాంతి కుటుంబానికి మధ్య.. కొన్నేళ్లుగా సంబంధాలు, రాకపోకలు లేవు. ఆమె కడచూపుకు రాకూడదన్న నిర్ణయం ముద్రగడదే. మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేసే కథనాలు.. ప్రసారం చేయొద్దని మీడియాను వేడుకుంటున్నాం’అని లేఖలో పేర్కొన్నారు. -
తల్లికి వందనంలో భారీ కోతలు
సాక్షి,అమరావతి: రాష్ట్ర విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. తల్లికి వందనం పథకంలో భారీగా కోతలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15,000 ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కారు. ఈ ఏడాది కూడా తల్లుల ఖాతాల్లో కేవలం రూ.13,000 మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్ నిర్వహణ (మెయింటెనెన్స్ ఫండ్) పేరుతో ప్రతి విద్యార్థి డబ్బుల నుండి రూ.2,000 ముందస్తు కోత విధించింది. గతేడాదికూడా ఇలాగే రూ.2,000 కోత పెట్టి, ఆ నిధులను స్కూళ్లకు కేటాయించని ప్రభుత్వం.. ఈ ఏడాది మళ్లీ అదే దారిలో పయనిస్తూ రూ.2,000 కోత పెట్టడం గమనార్హం. ఇలా మొత్తంగా మూడేళ్ల కాలంలో ఒక్కో విద్యార్థికి ఏకంగా రూ.19,000 లబ్ధిని ప్రభుత్వం ఎగనామం పెట్టింది.ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తామని చంద్రబాబు హామీలు గుప్పించారు. కానీ, ఇప్పుడు క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఏకంగా 14 రకాల కఠినమైన షరతులు, నిబంధనలను తెరపైకి తెచ్చారు. ఈ కొరడా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది.ఈ ఆంక్షలన్నింటినీ దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా కేవలం 67,47,190 మంది విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా తేలడంతో, ఆ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
పవన్‌కు బిగ్ షాకిచ్చిన బొలిశెట్టి సత్యనారాయణ
సాక్షి, విశాఖ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ. గతంలో అమరావతిలో బలవంతపు భూసేకరణను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారని సత్యనారాయణ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే మాటకి పవన్ కల్యాణ్ కట్టుబడి ఉండాలన్నారు. కూటమిలో ఉన్నాము కదా రైతులను ఉరితీసిన పరవాలేదు అనుకుంటే కుదరదు అంటూ హితవు పలికారు.జనసేన బహిష్కృత నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. అమరావతిలో బలవంతపు భూసేకరణపై ప్రజలకు పవన్ కల్యాణ్ వైఖరి చెప్పాలి. గతంలో చంద్రబాబు చేసింది తప్పు అయితే.. నేడు చేసేది కూడా తప్పే అవుతుంది కదా?. గతంలో కంటే నేడు దారుణంగా బలవంతపు భూసేకరణ జరుపుతున్నారు. అమరావతికి 33 వేల ఎకరాలు భూమి సరిపోతుందన్నారు. నేడు లక్ష 75 వేల ఎకరాలు భూమి సేకరిస్తున్నారు. ఈ భూమి అంతా ఎవరి ప్రయోజనాల కోసం? అని ప్రశ్నించారు.🚨అమరావతిలో రాజధాని అంటూ బలవంతపు భూసేకరణ చేస్తే...అక్కడ ఎవరు ఉన్నా...అడ్డుకొని తీరుతాం..!- జనసేన బహిష్కృత నేత బోలిశెట్టి సత్యనారాయణ గారు#APCapital Source: Media and Press Meet of #BolisettySatyanarayana Janasena Ex. Leader pic.twitter.com/4ERTGYjKQJ— UttarandhraNow (@UttarandhraNow) July 16, 2026ఇదే సమయంలో త్వరలోనే బలవంతపు భూసేకరణ పై సమావేశం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే, ఈ సమావేశానికి పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానిస్తానని చెప్పుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు ఉన్నది చట్టాలను గౌరవించడానికి... అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేస్తే కుదరదు. మొదటి విడత భూసేకరణలో 13వేల ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట రాదని ఎన్జీటీ తీర్పునిచ్చింది. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ జరుపుతున్నారు. రాత్రికి రాత్రి జీవోలు విడుదల చేస్తున్నారు’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
చంద్రబాబు మాట లెక్క చేయని టీడీపీ ఎమ్మెల్యేలు
-
ప్రాణాపాయ స్థితిలో బాధితుడు.. చోద్యం చూస్తున్న పోలీసులు
సాక్షి,నెల్లూరు: జిల్లా పోలీస్ శాఖలో బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య ధోరణి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కావలి మండలంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఒక ఘోర దాడి ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై స్థానికులు, బాధితుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కావలి మండలానికి చెందిన వాసు అనే యువకుడిపై నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వాసు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో నెల్లూరు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు.తమ కుమారుడిపై అన్యాయంగా దాడి జరిగిందని, నిందితులను శిక్షించాలని కోరుతూ బాధితుడి తల్లి, బంధువులు కావలి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే, బాధితుల పట్ల బాధ్యతగా నడుచుకోవాల్సిన పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించడం గమనార్హం. గత నాలుగు రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి స్వయంగా పోలీసుల ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధపడినా, కావలి రూరల్ పోలీసులు ఆ సాక్ష్యాన్ని సైతం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కావాలనే నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలు బాధితుడి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబుకు తెలియని నిజం, అమరావతికి లక్ష ఎకరాలు!
-
అమరావతిలో ఎక్కువగా నష్టపోతున్నది చిన్న, సన్నకారు రైతులే ఇదిగో ప్రూఫ్స్
-
కూటమి వల్ల రైతు గుండె ఆగింది
-
చంద్రన్న బోడిగుండు పథకం!
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ ఉద్యోగుల కోసం చంద్రన్న బోడిగుండు పథకాన్ని అమలు చేస్తున్నారు’ అని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కే వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారికి రెగ్యులర్‌గా రావాల్సిన డీఏలు, ఐఆర్, పీఆర్సీ వంటివి కూడా ఇవ్వకుండా ఉద్యోగులు అందరికీ నున్నగా క్షవరం చేసే కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు బోడిగుండు పథకం అమలు చేస్తున్నారంటూ వెంకట్రామిరెడ్డి సహా మరో ఇద్దరు నేతలు అందరిముందర గుండ్లు చేయించుకున్నారు. ఉద్యోగులు కోల్పోయింది రూ. 37 వేల కోట్లకు పైమాటే..ప్రతినెలా ఉద్యోగులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్న క్షవరం విలువ అక్షరాలా రూ.1500 కోట్లని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో ఉద్యోగులకు చేసిన మొత్తం క్షవరం విలువ సుమారు రూ.37 వేల కోట్లని చెప్పారు. ఇవి తాను ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం చెప్పడంలేదని, పూర్తి లెక్కలు ఇస్తున్నానని చెప్పి ఆ వివరాలు విడుదల చేశారు. ఈ రూ.37 వేల కోట్లు కేవలం కూటమి రెండు సంవత్సరాల పాలనకు సంబంధించిన బకాయిలు, ఎగవేతలు మాత్రమేనన్నారు. ఉద్యోగులను ఈ స్థాయిలో ముంచిన ఘనత గతంలో ఎవరికీ లేదన్నారు. అమరావతికి సోకులు.. తుగ్లక్ పాలనకు నిదర్శనం..ఉద్యోగులకు రూ.37 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా అమరావతిలోని భవనాల సోకులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుడుతున్నారని తెలిపారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల ముందు పక్క బిగించే అద్దాల కోసం రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోందని, చదరపు అడుగుకు అద్దాల కోసం రూ.5 వేలు ఖర్చు పెడుతోందన్నారు. ఈ భవనాల నిర్మాణం సోకులు, అన్నీ కలిపి చదరపు అడుగుకి రూ.20 వేల ఖర్చు పెడుతున్నారని తెలిపారు. ఒక పక్క ఉద్యోగులకు వేల కోట్ల రూపాయిలు బకాయిలు పెట్టి, అమరావతిలో సోకులకు రూ.వేల కోట్లు ఖర్చు బెట్టడం తుగ్లక్ పాలన కాదా అని ప్రశ్నించారు. ఆర్థికేతర అంశాల్లో ప్రభుత్వం ఉద్యోగులపై సానుకూలంగా లేదన్నారు. ఆత్మహత్యలే మేలనుకుంటున్నారు..ప్రభుత్వం పెట్టే టార్చర్ భరించలేక గత జూన్ నెలలో 10 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు, గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. మరో ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేయలేమంటూ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వారు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు.ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి రాజరికపు కాలం నాటి బానిసల కంటే హీనంగా ఉందని, వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేవని అయినా అడిగే దిక్కు లేదన్నారు. గత ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు పెట్టి ఉద్యోగుల సమస్యలు వినేదని, ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు వినే వారు కూడా లేరన్నారు. ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు సరిగా స్పందించడం లేదన్నారు. -
స్వలాభం కోసమే రాయలసీమ లిఫ్ట్ తాకట్టు.. చంద్రబాబుపై సజ్జల ఫైర్
సాక్షి,నెల్లూరు: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో నెల్లూరులో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడంతో పాటు, దాని కోసం పోరాటాన్ని బలోపేతం చేయడానికే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన స్వలాభం కోసం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ డీల్‌గా మార్చారని వ్యాఖ్యానించారు.రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిలిపివేత వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని సజ్జల అన్నారు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై చేసిన పోరాటం కంటే మరింత తీవ్రంగా ఈ అంశంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే చంద్రబాబు ప్రభుత్వ విధానాల అసలు స్వరూపం అర్థమవుతుందని ఆయన అన్నారు. రాయలసీమ అభివృద్ధి, ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాధాన్యంపై మేధావులు, విద్యావంతుల మధ్య విస్తృత చర్చ జరగాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
అమరావతిలో దోమలు ఉండవట..! మరి వేల కోట్ల ఖర్చు ఎందుకు?
ఏపీ రాజధాని అమరావతిలో దోమలు ఉండవట.. ఇదినిజంగా మంత్రి నారాయణ చెప్పిన మాట. తెలుగుదేశం పత్రిక ఈనాడులో రాసిన వార్తే. అందువల్ల ఇక్కడ భవనాల నిర్మాణానికి అయ్యే వ్యయంతో ఇతర చోట్ల నిర్మాణాలతో పోల్చరాదట. వినేవ్యక్తి వెర్రివాడు అయితే చెప్పేవ్యక్తి ఏపీ మంత్రి నారాయణ అనుకోవాలి. విద్యా సంస్థలను పెద్ద ఎత్తున నిర్వహించే నారాయణ ఇలాంటి మాటలు చెబుతుంటే కనీసం ఆయన విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్ధులైనా నమ్ముతారా? ఇంతకీ విషయం ఏమిటి?ఇంతకాలం అమరావతిలో జరిగే నిర్మాణాల వ్యయంపై తీవ్ర విమర్శలు వస్తున్నా, వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు సాగింది. కాని కేంద్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో నిర్మించదలచిన భవనాల సముదాయం నిమిత్తం చదరపు అడుగుకు సుమారు ఐదువేల రూపాయల నుంచి ఆరువేల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అంచనా వేసింది. ఇదే చంద్రబాబు సర్కార్ గొంతులో వెలక్కాయిపడినట్లు చేసింది. కేంద్రంతో పోల్చితే నాలుగురెట్లు అధికంగా వ్యయం చేస్తుండడంపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చెలరేగాయి. చదరపు అడుగుకు రాష్ట్రం సుమారు చదరపు అడుగుకు 17వేల రూపాయల నుంచి 20వేల రూపాయల వరకు వెచ్చిస్తుండడంలో అవినీతి భారీగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి ప్రభుత్వం బదులు ఇవ్వలేకపోయింది.ఈ నేపథ్యంలో ఎలాగోలా తాము చేస్తున్న అధిక వ్యయాన్ని సమర్థించుకోవడానికి నారాయణ గత కొన్నాళ్లుగా రకరకాలుగా తంటాలు పడుతున్నారు. అమరావతిలో ఇలా వేల కోట్ల వ్యయం చేయడంపై ప్రజలలో కూడా అసహనం పెరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా జగన్ మావిగన్ అనే ప్రతిపాదనను తీసుకురావడం మరింత సమస్య అయింది. దాంతో జగన్ పైన, వైఎస్సార్సీపీపైన ఏవేవో ఆరోపణలు చేయడం, అమరావతి ఖర్చును సమర్ధించుకోవడానికి నానా పాట్లు పడడం టీడీపీ వంతు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మావిగన్ అన్న పదంతో తొట్రుపాటుకు గురవుతున్నట్లు కనిపిస్తుంది.అమరావతిని ఎవరూ ఆపలేరని, మావిగన్ అని, విజయవాడ అని ఇలా రోజుకొకటి మాట్లాడుతున్నారని, మావిగన్ అంటే వాటికన్ కావాలంటారని అంటూ దీనిని ఒక మతపరమైన వివాదంగా మార్చడానికి చంద్రబాబు యత్నించిన తీరే ఇందుకు ఉదాహరణ అవుతుంది. ఎక్కడైనా రాజధానిలో ప్రజలు ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం దేవతల రాజధాని సెంటిమెంట్ డైలాగు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంటారు. అమరావతి దేవతల రాజధాని అయితే మిగిలిన రాష్ట్రం అంతా ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు ఏకంగా వాటికన్ ప్రస్తావన తెచ్చి తన అసహనాన్ని బయటపెట్టుకున్నారు.చంద్రబాబుకు నిజంగానే మావిగన్ అంటే భయం ఏర్పడకపోతే, జగన్ చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియా ప్లాట్ ఫారంలపై లేకుండా పోలీసుల ద్వారా ఎందుకు చేశారో చెప్పాలి. వచ్చే ఎన్నికలలో మావిగన్ VS అమరావతి ఒక అంశం అవుతుందని, మావిగన్ కావాలి అనేవారు వైఎస్సార్సీపీకి, అమరావతి కావాలనేవారు టీడీపీకి ఓటేస్తారు అన్న జగన్ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని చంద్రబాబు లేదా టీడీపీ నేతలు ఎందుకు అనలేకపోతున్నారు? మావిగన్ అంటూ ఏదో ఎద్దేవ చేసేలా మాట్లాడుతున్న కూటమి నేతలు అమరావతిలో అయ్యే వ్యయంపై, వేల కోట్ల అప్పులపై మాత్రం నోరు మెదపలేకపోతున్నారు.ఒకప్పుడు ప్రభుత్వ ధనం రూపాయి అవసరం లేదని అదే సొంతంగా సంపాదించుకుని నిర్మాణాలు చేసుకుంటుందని చంద్రబాబు చెప్పేవారు కదా! మరి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వ బడ్జెట్ నుంచి వేల కోట్ల నిధులే కాకుండా నలభైఏడువేల కోట్లను ఎందుకు అప్పు చేశారంటే జవాబు ఇవ్వలేకపోతున్నారు. ప్రజలలో కూడా రాజధాని పేరుతో లక్షల కోట్ల వ్యయం ఏమిటన్న చర్చ జరుగుతోంది. పైగా నిర్మాణ వ్యయంపై కేంద్ర ప్రకటన ద్వారా ఏపీలో కూటమి ప్రభుత్వం బాగా ఎక్స్ పోజ్ అయిపోయింది. రాష్ట్రం నాలుగు భవనాల అద్దాలకు చేసే ఖర్చు 2500 కోట్లుగా ఉంది. అంతే మొత్తంతో కేంద్రం తన భవనాలన్నిటిని నిర్మించుకుంటోంది. అది కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో జరుగుతుందని ఎల్లో మీడియానే రాసింది. అలాంటప్పుడు ఇంతకన్నా స్టాండర్డ్ ఏమి ఉంటుందన్న ప్రశ్న వచ్చింది. దీంతో నారాయణ సాధారణ నిర్మాణాలకు ఐకానిక్ భవనాలతో పోలికా అంటూ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చే యత్నం చేశారు. ఈ వ్యాఖ్య అర్ధరహితంగా కనిపిస్తుంది.డిల్లీలో పార్లమెంటు భవనానికి 16,910 రూపాయలు చదరపు అడుగుకు ఖర్చు అయిందని, తెలంగాణ సచివాలయానికి అడుగుకు 13,762 రూపాయలు అయిందంటూ ఏవో కాకి లెక్కలు చెప్పడం ఆరంభించారు. అది నిజమే అయితే అంతా కలిపి పార్లమెంటు భవనానికి సుమారు 1100 కోట్లు, తెలంగాణ సచివాలయానికి వెయ్యి కోట్ల లోపు మాత్రమే ఎందుకు ఖర్చు అయింది? ఏపీలో మాత్రం సచివాలయ భవనాలకు వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారన్నదానికి సమాధానం దొరకదు. దీనిపై ఎందుకు శ్వేతపత్రం ఇవ్వలేకపోతున్నారు.ఇక రాజధాని రహదారుల నిర్మాణం అంటే కేవలం రోడ్లు వేయడం కాదట. తాగునీరు, మురుగునీరు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, విద్యుత్, గ్యాస్, టెలికమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాలను రోడ్ల వెంటే ఏర్పాటు చేయాల్సి ఉంటుందట. అంటే ఇవేవి తెలంగాణలో, ఢిల్లీలో ఏర్పాటు చేయకుండానే నిర్మాణాలు చేశారా? ఎన్ని చెప్పినా జాతీయ రహదారులకు కిలోమీటర్‌కు 23 కోట్లు ఎందుకు అవుతుంది? ఏపీలో రాజధాని రహదారికి సుమారు ఏభై కోట్లు ఎందుకు అవుతోందో అర్ధం కాదు.అంతేకాక అమరావతి రాజధానిని దోమల్లేని నగరంగా చేస్తున్నారట. దీనిని ఎవరైనా నమ్ముతారా? ఇప్పటికే అమరావతికి సంబంధించి చంద్రబాబు చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేశారు. ఉదాహరణకు అమరావతిలో పది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అదికారులను చంద్రబాబు కిందటి టరమ్‌లోనే ఆదేశించారు. గతంలో నవ నగరాలు, అంతర్జాతీయ నగరం అన్నారు. ఏ దేశం వెళితే ఆ దేశ రాజధాని మాదిరి అమరావతి అవుతుందంటూ కథలు చెబుతూ వచ్చారు. సింగపూర్ కబుర్లు సరేసరి. మొదట సేకరించిన ఏభైవేల ఎకరాలు ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ నగరం ఎలా అయింది? రెండేళ్ల నుంచి అదే ప్రాంతం మున్సిపాల్టీగా ఎలా మారిపోయింది? అందుకే మళ్లీ లక్షన్నర ఎకరాలను సేకరిస్తాం అంటూ ఎందుకు బయల్దేరారు? కొండవీటి వాగు, పాలవాగులపై 69 వంతెనలు నిర్మాణం చేస్తామని నారాయణ ఎందుకు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఏ దేశంలో అయినా ఉంటుందా?పైగా ఎప్పటికప్పుడు వర్షం నీరు ఎత్తిపోసుకునే నగరం ఇంకేదైనా ఉందా? ఇలా పర్యావరణానికి విరుద్దంగా నగర నిర్మాణం చేయడం సరైనదేనా? దోమల సంగతి దేవుడెరుగు. రక్తాన్ని పీల్చే దోమల మాదిరి, అమరావతి అప్పుల పేరుతో ప్రజలపై భారం వేయకుండా ఉంటే అదే పదివేలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నిరసన మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే అసంతృప్తితో.. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. సోమవారం నగరంలో ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.రెండేళ్లు దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఫెడరేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి గుండు చేయించుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు కూడా ఇదే తరహాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా.. బాబు సర్కార్‌పై వాళ్లు ఆగ్రహం వ్యకక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని ఫెడరేషన్ ఆరోపించింది. పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఐఆర్ విషయంలోనూ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసిందని నేతలు విమర్శించారు. సరెండర్ లీవ్‌లకు సంబంధించిన చెల్లింపులు కూడా నిలిచిపోయాయని ఆరోపించారు.నెలకు రూ.1500 కోట్లు క్షవరం.. ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఫెడరేషన్ నేతలు మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1500 కోట్ల మేర ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలు ఉద్యోగులకు కూడా పూర్తిగా తెలియకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని(క్షవరం చేస్తోందని) విమర్శించారు.వలంటీర్ల హామీలపైనా ప్రశ్నలుఉద్యోగులతో పాటు వలంటీర్లకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఫెడరేషన్ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో నిర్వహించిన ఈ నిరసన రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఏపీలో రేపే చివరి రోజు.. 'సర్'లో తీవ్ర గందరగోళం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న వేళ.. మరోసారి వివాదాలు తెరపైకి వచ్చాయి. మంగళవారంతో ఈ ప్రక్రియ ముగియనున్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదని తెలుస్తోంది.ఒకవైపు సాంకేతిక సమస్యలు, మరోవైపు రాజకీయ జోక్యం కారణంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు కావడం, తప్పులను సరిదిద్దడం ఆలస్యమవుతోందని తెలుస్తోంది. చివరి దశకు వచ్చినా ప్రక్రియ పూర్తిగా కొలిక్కి రాకపోవడం ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.అంతేకాదు.. బూత్ లెవల్ అధికారులు (BLOలు) రాజకీయ ఒత్తిళ్ల మధ్య పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార టీడీపీ నేతలు బీఎల్వోలపై ఒత్తిడి తెస్తూ.. తమకు అనుకూలంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీకి మద్దతుగా భావిస్తున్న ఓటర్ల పేర్లు తొలగించాలని బెదిరిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఇటు ఎన్నికల సంఘం విధుల్లో అధికార పార్టీ జోక్యం పెరిగిందని కూడా వైఎస్సార్సీపీ అంటోంది. ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రియను అధికార పార్టీ ప్రభావితం చేస్తోందని, దీంతో రాజ్యాంగబద్ధ సంస్థ స్వతంత్రత దెబ్బతింటోందని పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో పూర్తిస్థాయి తటస్థత కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.మరోవైపు 'మై టీడీపీ' యాప్‌లో ఓటర్ల వివరాలు అందుబాటులో ఉండటంపై కూడా వైఎస్సార్సీపీ ప్రశ్నలు లేవనెత్తింది. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన సమాచారం అధికార పార్టీ యాప్‌లోకి ఎలా వెళ్లిందని నిలదీసింది. దీనిపై పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపిస్తోంది.రేపటితో SIR ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం, ఓటర్ల జాబితా ఖచ్చితత్వం, రాజకీయ జోక్యంపై వచ్చిన ఆరోపణలకు ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వివాదాల మధ్య తుది ఓటర్ల జాబితా ఎంత పారదర్శకంగా సిద్ధమవుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
అమ్మాయిలతో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల గలీజు పనులు
సాక్షి,మచిలీపట్నం: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు కొందరు యువతులతో కలిసి అశ్లీల నృత్యాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. మచిలీపట్నంలోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాపులో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరులు కొందరు గుట్టుచప్పుడు కాకుండా ఒక ప్రైవేట్ విందును ఏర్పాటు చేసుకున్నారు. ఈ వేడుకకు కొంతమంది యువతులను సైతం రప్పించారు. మద్యం మత్తులో సదరు యువతులతో కలిసి వీరు అసభ్యకర రీతిలో, అశ్లీల నృత్యాలు చేస్తూ చిందులేశారు.అశ్లీల నృత్యాల్లో పాల్గొని అడ్డంగా దొరికిపోయిన వారిలో సామాన్యులు లేరు. నేరుగా మంత్రి కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తూ, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే ముఖ్య అనుచరులుగా వీరిని గుర్తించారు.సైదారావు, హితేష్, ఆంజనేయులు ఉన్నారు. సదరు జ్యువెలరీ షాపులో వీరు యువతులతో కలిసి చేసిన అశ్లీల డ్యాన్స్‌ల దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ అశ్లీల నృత్యాల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి. -
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
-
భూమి ఇవ్వకపోతే ఉరి తీస్తారా... నీ చేతులతోనే ఇవ్వు ఆ 30 రూపాయలు...
-
అమరావతితో ఆర్థిక భారమే! MAVIGUN మాస్టర్ విజన్
-
ఉండవల్లిలో ఉద్రిక్తత.. బాబు సర్కార్ విధ్వంసకాండ!
సాక్షి, గుంటూరు: ఉండవల్లిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరావతి ప్రాంతంలో బాబు సర్కార్ విధ్వంసకాండ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రాజధాని పేరుతో అధికారులు బలవంతపు భూసేకరణకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా పచ్చటి పంటలను ధ్వంసం చేశారు. వివరాల మేరకు.. శనివారం ఉదయం సీఆర్డీఏ సిబ్బంది.. జేసీబీల సాయంతో తమ పంటలను ధ్వంసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. రైతులను బలవంతంగా లాక్కెళ్లారు. మహిళా రైతులు అని కూడా చూడకుండా.. పోలీసులు వారిని ఈడ్చుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ భూములను అన్యాయంగా లాక్కుంటున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. ఇక, అంతకుముందు.. సీఆర్డీఏ అధికారులు భూసేకరణ పేరుతో రైతుల ఇంటికే వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్లడం గమనార్హం. బలవంతంగా రైతులను తరిమేశారు: దొంతిరెడ్డిఉండవల్లిలో బలవంతపు భూసేకరణ అన్యాయమని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. చిన్నచిన్న రైతులనూ వదలకుండా వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుపమ అనే చిన్న మహిళా రైతు మీద కూడా దౌర్జన్యం చేసి భూమి లాక్కున్నారని ఆరోపించారు.''సీడ్ యాక్సెస్ రోడ్‌కు అవసరమైతే రైతులతో మాట్లాడాలి, అలా చేయకుండా వీధిరౌడీల్లాగా అధికారులు, పోలీసులు వెళ్లారు. చిన్నచిన్న రైతుల బాధలు ఈ ప్రభుత్వానికి పట్టవా? శని, ఆదివారం కోర్టులు ఉండవని ఈరోజు వచ్చి బలవంతంగా రైతులను తరిమేశారు. రాజధాని రానప్పుడే ఎకరం ఐదు కోట్లు పలికిన భూమి ఇది. అలాంటి రైతులతో మాట్లాడి సరైన న్యాయం చేయాలి. రైతులను మోసం చేసే ప్రభుత్వం ఇది. రైతుల గొంతు నులుముతోంది. ముందుగా భూములు తీసుకున్న వారికి ఏం న్యాయం చేశారు?'' అని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రశ్నించారు. -
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులే
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మరిన్ని కేసులు పెట్టాలని నిర్ణయించింది. సోషల్ మీడియాపై డీజీపీ, ఉన్నతాధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం, టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ కేబినెట్ తీర్మానించింది. -
నోరు జారిన నారాయణ... అమరావతి వద్దు మావిగాన్ ముద్దు
-
చిన్నాను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి,విశాఖ: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్ కారె చిన్నాను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాతో మాట్లాడిన వైఎస్ జగన్, జరిగిన ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆ రాత్రి సముద్రంలో ఏం జరిగింది? ప్రమాదం తర్వాత తాము ఎలా బయటపడేందుకు ప్రయత్నించారు? తానొక్కడే అంత దూరం ఎలా ఈదుకుంటూ వచ్చారు? చివరకు తనను ఎవరు రక్షించారు? వంటి వివరాలను మత్స్యకారుడు చిన్నా వైఎస్ జగన్‌కు వివరించారు.చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో చిన్నా ఒక్కరే ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదంపై సమాచారం అందినప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం జరిగిందని మత్స్యకార కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అధికారుల స్పందనపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మొత్తం అప్పు చేసి పడవను కొనుగోలు చేశామని, ప్రస్తుతం జీవనాధారం కోల్పోయామని చిన్నా వైఎస్ జగన్‌కు వివరించారు. తమను ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్, చిన్నాకు ధైర్యం చెప్పారు. అవసరమైతే స్వయంగా విశాఖకు వచ్చి పరామర్శిస్తానని తెలిపారు. పడవ కోల్పోతే మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుందని వైఎస్ జగన్ పేర్కొంటూ, ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.కాగా, ఈ ప్రమాదంలో మత్స్యకారులు మరణించారని ప్రకటించిన ప్రభుత్వం ఆ ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించింది. కానీ,ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాను మాత్రం పట్టించుకోలేదు. కనీసం ఏ అధికారి కూడా వచ్చి పలకరించలేదు. తనను ఏ విధంగా కూడా ఆదుకోకపోగా, దాదాపు రూ.50 లక్షల విలువైన పడవ సముద్రంలో మునిగిపోయిందని, అందుకని ఎలాగైనా ఆదుకోవాలని చిన్నా వైఎస్ జగన్‌ను వేడుకున్నారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్, ఈ విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అవసరం అయితే తాను కూడా స్వయంగా విశాఖకు వస్తానని వైఎస్ జగన్, మత్స్యకారుడు చిన్నాకు ధైర్యం చెప్పారు. -
అమరావతిలో తవ్వేకొద్దీ అక్రమాలు
-
విజయవాడలో NIA సోదాలు
సాక్షి,కృష్ణ: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు విజయవాడలో మెరుపు సోదాలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సోహైల్ బేగ్,మహమ్మద్ రహమతుల్లా అనే ముగ్గురు యువకులను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఆన్లైన్ ద్వారా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడం, జిహాదీ కార్యకలాపాలకు ప్రణాళికలు వేయడం లాంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఈ ముగ్గురి ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం సోదాలు చేస్తున్నారుమొదట విజయవాడ వన్‌టౌన్ కొత్తపేట పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో వేర్వేరు రాష్ట్రాల లింకులు బయటపడటంతో, దీని తీవ్రతను బట్టి ఇటీవలే ఈ కేసును అధికారికంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఈ ఆన్లైన్ నెట్‌వర్క్‌పై అధికారులు నిఘా పెట్టారు.ఇప్పటికే అరెస్టయిన ఈ ముగ్గురు నిందితులకు నగరంలో లేదా ఇతర ప్రాంతాలలో మరికొందరితో ఏమైనా రహస్య సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. డిజిటల్ పరికరాలు, సోషల్ మీడియా ఖాతాలు మరియు ఏవైనా అనుమానాస్పద పత్రాలు దొరుకుతాయేమోనని ఇళ్లలో ప్రతి అంగుళాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. -
సీఐ అరాచకం.. వేధింపులు తాళలేక బాధితుడు ఆత్మహత్యాయత్నం
కర్నూలు: జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. కేసు విచారణ పేరుతో పోలీసులు సాగించిన వేధింపులు ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చాయి. సీఐ టార్చర్ తట్టుకోలేక ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది.బాధితుల కథనం ప్రకారం.. ఒక కేసు విషయమై విచారణ కోసమంటూ హనుమంతు రెడ్డిని సీఐ శ్రీనివాస్ నాయక్ ఆస్పరి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే విచారణ సమయంలో సీఐ శ్రీనివాస్ నాయక్ తనను తీవ్రంగా మానసిక, శారీరక వేధింపులకు గురిచేశాడని బాధితుడు ఆరోపించారు. సీఐ వేధింపులను భరించలేక, తీవ్ర మనస్తాపానికి గురైన హనుమంతు రెడ్డి అందరూ చూస్తుండగానే పోలీస్ స్టేషన్ లోపలే పురుగుల మందు తాగాడు.దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన పోలీసులు, అతని పరిస్థితి విషమించడంతో వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
నిజం ఒప్పుకున్న చంద్రబాబు 2029 లో జగనే సీఎం..!
-
ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ అరాచకాలు
సాక్షి,నంద్యాల: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల అరాచకాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో దేవస్థానానికి సంబంధించిన తలనీలాల టెండర్ల ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే అఖిలప్రియ ముఖ్య అనుచరులు కొందరు టెండర్ దారులను బహిరంగంగానే బెదిరింపులకు గురిచేయడం నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది.ప్రాణం మీద ఆశ ఉంటే వెనక్కి పోండిఅహోబిలం పుణ్యక్షేత్రంలో తలనీలాల సేకరించే హక్కుల కోసం దొరై కంపెనీ యజమాని నిబంధనల ప్రకారం టెండర్ దాఖలు చేశారు. అయితే, ఈ టెండర్ తమ వర్గానికి కాకుండా ఇతరులకు ఎలా దక్కుతుందంటూ ఎమ్మెల్యే అనుచరులు సదరు కాంట్రాక్టర్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ‘నీకు ప్రాణం మీద ఆశ ఉంటే వెంటనే అహోబిలం తలనీలాల టెండర్‌ను రద్దు చేసుకోవాలి..లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అంటూ ఫోన్ చేసి బెదిరించాడు. కాంట్రాక్టర్‌ను బెదిరిస్తూ భూమా అఖిలప్రియ ప్రధాన అనుచరులు మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రాణ భయంతో ఉన్న కాంట్రాక్టర్ ఈ ఆడియోను బయటపెట్టడంతో ఎమ్మెల్యే వర్గీయుల సెటిల్మెంట్లు, బెదిరింపుల వ్యవహారం బహిర్గతమైంది. అధికార బలంతో స్థానిక వ్యాపారులను, టెండర్ దారులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఆళ్లగడ్డ మండలాన్ని అరాచకాలకు అడ్డాగా మారుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
దొరకని నిధి
సాక్షి, రాజమహేంద్రవరం : బూటకపు హామీలతో ఓటర్లను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు తీరని అన్యాయం చేసింది. ఆడబిడ్డ నిధి పేరిట 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఒక్కొక్కరికి నెలకు రూ.1,500 చొప్పున అందిస్తామంటూ ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టి రెండేళ్లయినా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా జిల్లాలోని అర్హులైన 5.3 లక్షల మంది మహిళలు గత రెండేళ్లలో సుమారు రూ.1,908 కోట్లు నష్టపోయారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని పీ 4 (ప్రజా భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన) కార్యక్రమానికి అనుసంధానం చేస్తామంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేస్తున్నారే తప్ప, మహిళలకు న్యాయం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించడం లేదు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 73,927 బంగారు కుటుంబాలను గుర్తించినప్పటికీ వారి దత్తత ప్రక్రియ కూడా ముందుకు సాగలేదు. పీ4 పేరుతో కాలయాపనప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, రాజానగరం, మండపేట, అనపర్తి, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో 133 స్వర్ణ వార్డు, 455 స్వర్ణ గ్రామ సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో 73,927 బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరిని దత్తత తీసుకునేందుకు జిల్లాలో 4,868 మంది మార్గదర్శులు ముందుకొచ్చారని, ఇప్పటికే 30,696 కుటుంబాలను దత్తత తీసుకున్నారని, మిగిలిన కుటుంబాల దత్తత ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో బంగారు కుటుంబాలుగా గుర్తించిన వాటిలో ఏ ఒక్క కుటుంబాన్నీ ఎవరూ దత్తత తీసుకోలేదు. పీ4 సర్వే పేరుతోనే చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలన గడిచిపోయింది. అనంతరం వారిని దత్తత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లా అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి పెంచారు. దాతలను గుర్తించి, ఒప్పించే బాధ్యత అధికారులదే అని పాలకులు తేల్చేయడంతో వారు కొన్నాళ్లపాటు వ్యాపారులను ఒప్పించేందుకు ప్రయతి్నంచారు. దత్తత తీసుకోవాలని బలవంతం చేసినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం పీ4 ను మరిచిపోయారు. 5.3 లక్షల మందికి అన్యాయం జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో 4,81,940 మంది పేద, దిగువ మధ్య తరగతి మహిళలు ఉన్నారు. వివిధ కారణాలతో డ్వాక్రా గ్రూపుల్లో చేరని పేద మహిళలు సుమారు 48 వేల మంది ఉన్నారు. మొత్తంగా 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారు 5.3 లక్షల మందికి పైనే ఉన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి రెండేళ్లు (24 నెలలు) గడిచిపోయాయి. ఈ లెక్కన ఒక్కో మహిళకు నెలకు రూ.1500 చొప్పున 24 నెలలకు కలిపి రూ.36 వేలు ఇప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని అర్హులైన 5.3 లక్షల మహిళలందరికీ కలిపితే సుమారుగా రూ.1,908 కోట్లు చెల్లించాలి. ఎన్నికల వేళ అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేస్తామని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ ఉదరగొట్టారు. పోనీ ప్రభుత్వం గుర్తించిన 73,927 బంగారు కుటుంబాలనే ప్రాతిపదికగా తీసుకుని... ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరికి అయినా ఆడబిడ్డ నిధి అందించేందుకు చంద్రబాబు సర్కార్ ముందుకు రావడం లేదు.మహిళలకు వెన్నుపోటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ నిధి పేరిట ఆర్థిక సాయం అందించకుండా రాష్ట్రంలోని మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఓట్లు దండుకునేందుకు సూపర్ సిక్స్ పేరిట అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలనూ ఆదుకున్నారు. కాపు నేస్తం, బీసీ నేస్తం పేరిట ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. – తానేటి వనిత, మాజీ హోం మంత్రి, గోపాలపురం -
బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్సీపీ
సాక్షి,విశాఖ: కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘బీచ్ షాక్స్’ విధానానికి వ్యతిరేకంగా విశాఖలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో వైజాగ్‌తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహిళలందరూ చేతుల్లో నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు. బీచ్ రోడ్ అంతటా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ప్రదర్శనకు పార్టీ అగ్రశ్రేణి నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ర్యాలీలో వరుదు కళ్యాణి, బొత్స ఝాన్సీ లక్ష్మి, గొల్ల బాబురావు, పార్టీ నేత కేకే రాజు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు స్వయంగా పాల్గొని మహిళలకు అండగా నిలిచారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ.. గోవా తరహా సంస్కృతిని ఏపీలోకి తీసుకువచ్చి, పవిత్రమైన విశాఖ తీరాన్ని మందుబాబుల అడ్డాగా మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్‌లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తే, ఇకపై ఇక్కడికి కుటుంబాలు, విద్యార్థులు, మహిళలు ధైర్యంగా వచ్చే వాతావరణం ఉంటుందా? అని ప్రశ్నించారు. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో మహిళల భద్రతను, ప్రజల శాంతిని పణంగా పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. -
గేటెడ్ కమ్యూనిటీ.. గ్రేటర్ రాజధాని! అమరావతిలో అసలు జరుగుతుంది ఇదే.!
-
మత్స్యకారుల గల్లంతు.. కూటమి ప్రభుత్వంపై బాధితుల ఆగ్రహం
సాక్షివిశాఖ: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. రాకాసి అలల తాకిడికి బోటు బోల్తా పడటంతో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి కారె చిన్న అనే మత్స్యకారుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రస్తుతం కారె చిన్నకు కోస్ట్ గార్డ్ నౌకలోనే అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన మిగిలిన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఈ ప్రమాద సమాచారం తెలిసినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి సరైన స్పందన లేకపోవడంతో మత్స్యకార కుటుంబాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇంత పెద్ద కష్టం వస్తే ప్రభుత్వం నుంచి కనీసం ఒక్కరంటే ఒక్క ప్రజాప్రతినిధి గానీ, ఉన్నతాధికారి గానీ మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు. మా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. సముద్రంలో చిక్కుకున్న మా వారు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో తెలియక మేము ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతుంటే అధికారులకు కనీస చలనం లేదు’అంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. సహాయక చర్యల్లో జాప్యాన్ని నిరసిస్తూ మత్స్యకారులు, బాధితుల బంధువులు భారీ సంఖ్యలో ఫిషరీస్ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ముందు బైటాయించి అధికారులను నిలదీశారు. బోటు ప్రమాదానికి గురవుతోందని ముందే సమాచారం అందినప్పటికీ అధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదని, ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరని మత్స్యకార సంఘాల నేతలు నిలదీశారు. గల్లంతైన వారిని కాపాడటానికి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని, తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని కార్యాలయం ఎదుట రోడ్డుపైనే భీష్మించుకు కూర్చున్నారు. -
ఇంకో 50 వేల ఎకరాలు కావాలా..? సిగ్గులేదా అడగడానికి...?
-
అమరావతికి వెళ్తాం.. తగ్గేది లేదు.. భయపడేది లేదు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: అమరావతిని అప్పుల కుప్పగా తయారు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు తీరని మోసం చేశారని అన్నారు. మీరు కట్టే ఆఫీసులకే రూ.50వేల కోట్లు అయితే.. రైతులకు ఏం ఇస్తారు? అంటూ ప్రశ్నించారు. అలాగే, రెండేళ్ల పాలనలో కులాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారు?. యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేసి వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి పేర్ని నాని తాడిపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాజధాని ఎప్పుడు పూర్తి అవుతుందని అడిగితే సమాధానం చెప్పడం లేదు. అప్పు ఎంత అవుతుందో అన్న దానికి సమాధానం చెప్పరు. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దూషిస్తున్నారు. మంత్రులు తిట్లు, శాపనార్థాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి రూ.50వేల కోట్లు అప్పులు తెచ్చారు. మీరు కట్టే ఆఫీసులకే రూ.50వేల కోట్లు అయితే.. రైతులకు ఏం ఇస్తారు?. వైఎస్ జగన్ ప్రశ్నకు ఒక్కరూ సమాధానం చెప్పరు. మంత్రులు తమ శాఖ పనితీరు గురించి ఒక్కరూ మాట్లాడరు. ఆసుపత్రిలో సౌకర్యాలు లేవంటే మాట్లాడరు. రోగులు ఇబ్బందులు పడుతుంటే మాట్లాడరు. వైఎస్ జగన్‌ను తిట్టేందుకు మాత్రం మంత్రులు పరిగెత్తుకుంటూ వస్తారు.మావిగన్ అంటే భయం..మావిగన్ అంటే కూటమి నేతలు భయపడుతున్నారు. అమరావతి నిర్మాణానికి ఎన్ని ఏళ్లు పడుతుంది. సింగపూర్ మించి రాజధాని నిర్మాణం చేస్తామని అన్నారు. చివరకు అమరావతిని ఓ మున్సిపాలిటీగా చేస్తున్నారు. అమరావతి పేరుతో అంతులేని అవినీతి, మోయలేని అప్పులు చేస్తున్నారు. అమరావతి దోపిడీ ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా కనబడుతోంది. రైతుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుతున్నారు. రాజధానిలో పేదలకు జగన్ ఇచ్చిన 50వేల ఇళ్ల పట్టాలు రద్దు చేశారు. ఇళ్ల పట్టాలు రద్దు చేశాక అమరావతిలో ఎవరు ఉంటారు?? జనం లేని రాజధాని ఎందుకు?. అమరావతిలో స్టార్ హోటల్స్ కట్టి ఏం చేస్తారు??అమరావతి రైతులను కలిసేందుకు వెళ్తే దాడులు చేస్తారు. కూటమి నేతలు నీచపు రాజకీయాలు చేస్తున్నారు. రైతుల కష్టాలు చూసేందుకు మళ్తీ రైతుల వద్దకు వెళ్తాం. అమరావతికి వెళ్తాం.. తగ్గేది లేదు.. భయపడేది లేదు. పోలీసుల సహకారంతో దాడులు చేస్తున్నారు. మావిగన్ అనే పేరు చెబితే చంద్రబాబు అల్లాడిపోతున్నారు. అమరావతిలో అవినీతి జరగడం లేదని నిరూపించండి. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పే సాహసం ఉందా?. లంచం ఇస్తే కానీ, ఈ ప్రభుత్వంలో ఏ పని అవదు. ప్రశ్నిస్తే వేధింపులా?ఎప్పుడూ కులాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారు?. ఈ రెండేళ్ల కాలంలో దళితులకు ఏం చేశారు?. యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. జనసేన రౌడీలు పోలీసు స్టేషన్ గోడ దూకి దాడి చేసేందుకు వెళ్తున్నారు. పీఎస్ గోడలు దూకిన వారిపై కేసులు నమోదు చేశారా?. ప్రశ్నించే సోషల్ మీడియా మీద దాడులు చేస్తున్నారు. రావణ్ విషయంలో పోలీసులు చట్ట విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు. సాయికృష్ణ మృతదేహం పోలీసు స్టేషన్ టెర్రస్‌పై కాల్చి బూడిద చేశారా?. స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజీ ఎందుకు బయటపెట్టరు?’ అంటూ మండిపడ్డారు.రాజధానిలో ఇళ్లు కట్టుకున్న చంద్రబాబు, మంత్రి నారాయణ వివరాలను ఎందుకు బ్లాక్ చేశారు?. చెప్పే దమ్ము, ధైర్యం మంత్రులకు ఉందా?. కాపులకు కూటమి ప్రభుత్వం మీద విసుగెత్తింది. కాపు నేతలమంతా లంచ్ మీటింగుకి వెళ్తే మమ్మల్ని తిట్టిస్తున్నారు. జనసేన బలహీన పడి, కాపులంతా పక్కకు వెళ్తున్నారు. దీంతో కాపులను తిట్టించి మళ్ళీ జనసేన దగ్గరకు చేరేలా చేస్తున్నారు. ప్రశ్న రావణ్‌ను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ, జనసేన మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాపులు ఎక్కువగా ఉన్న చోటే రావణ్‌పై కేసులు పెట్టి వేధిస్తున్నారు. పవన్‌కి మోటివేటెడ్ డిజార్డర్స్ ఉంది. అప్పటికప్పుడు కావాలని వేషం మార్చుతాడు. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు హరిప్రసాద్‌కు బందరులో ఏం పని?. కాపులను పవన్ కళ్యాణ్ బకరాలను చేసి వాడుకుంటున్నారు. పోలీసు అధికారులకు దమ్ముంటే ఇప్పటికే కేసు పెట్టేవారు అని ఎద్దేవా చేశారు. -
అమరావతిని ఇక ఆపేయండి..! మీ మంచికే చెప్తున్నా... పేర్ని నాని హెచ్చరిక!
-
కంభం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కంభం పట్టణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సహా నలుగురు మృతి చెందడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పెళ్లి వేడుకకు హాజరై ఆలయానికి వెళ్లిన వారు ఈ విధంగా ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. వివాహ వేడుకల ఆనందం నిండిన కుటుంబంలో ఇలాంటి పెను విషాదం నెలకొనడం హృదయ విదారకమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తీవ్రంగా గాయపడినవారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించాలని, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.కాగా, మార్కాపురం జిల్లా కంభం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో కూడిన ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విషాదం నింపింది. మృతి చెందిన వారిలో అలకనంద (19), అంకాలు (20), నగేశ్ (17) , నాగేశ్వరి (2) గిద్దలూరు నల్లబండ బజారు వాసులుగా గుర్తించారు. కాగా పెళ్లి కూతురు వీరక్కకు తీవ్ర గాయాలయ్యాయి. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఐటీయూ ధర్నా
సాక్షి,విజయవాడ:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ, కార్మికుల హక్కుల రక్షణే ధ్యేయంగా విజయవాడలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్. నర్సింగరావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరంచేసే కుట్రలో భాగంగానే అక్కడ భద్రతను గాలికొదిలేశారని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్. నర్సింగరావు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత నెలలో జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారని గుర్తుచేశారు. ఈ వరుస ప్రమాదాలకు ప్రభుత్వ విధానాలే కారణమని, దీనికి పూర్తి బాధ్యత స్టీల్ సెక్రటరీదేనని ఆయన స్పష్టం చేశారు.ప్రమాదాలపై తక్షణమే ఉన్నత స్థాయి న్యాయవిచారణ జరిపించాలని, స్టీల్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ప్లాంట్‌లో కార్మికులను పొమ్మనలేక పొగబెడుతున్నారని నర్సింగరావు విమర్శించారు. ఇప్పటికే 12 వేల మంది కార్మికులను అక్రమంగా తొలగించారని, భద్రతా విభాగంలో 50 మంది పనిచేయాల్సిన చోట ప్రస్తుతం కేవలం 18 మంది మాత్రమే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో ప్రతి డిపార్ట్మెంట్కు ఒక భద్రతా అధికారి ఉండేవారని, కానీ ఇప్పుడు మూడు షిఫ్ట్‌లకు కలిపి ముగ్గురే ఉన్నారని తెలిపారు. నాణ్యత లేని ముడిసరుకు వాడటం, ఆపరేటింగ్ ప్రొసీజర్‌లో సరైన సమయం పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జూన్ 5వ తేదీ నుంచి ఇన్ స్ట్రుమెంటేషన్ విభాగం పనిచేయడం లేదని, ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియని దారుణ పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించారని నర్సింగరావు గుర్తుచేశారు. మరి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మృతులకు చంద్రబాబు ప్రభుత్వం కేవలం 25 లక్షల రూపాయలే ఎందుకు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. వివక్ష చూపకుండా స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు కూడా కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్‌లో భద్రత విషయంలో రాజీపడటమంటే దేశద్రోహంతో సమానమని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే వరకు తమ పోరాటం ఆగేది లేదని సిఐటియు నేతలు హెచ్చరించారు. -
బాబు అమరావతి VS వైఎస్ జగన్ MAVIGUN.. ఏది నష్టం, ఏది ప్రయోజనం
-
‘రావణ్ ఒంటిపై ఒక్క దెబ్బైనా పడాల్సిందే’
సాక్షి,కృష్ణ : మచిలీపట్నం ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యూట్యూబర్ రావణ్‌ను ఎలాగైనా సరే వదిలిపెట్టేది లేదంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వ్యూహాలు పన్నుతున్నాయి. ‘రావణ్ ఒంటిపై ఒక్క దెబ్బైనా పడాల్సిందే..’ అంటూ జనసేన అంతర్గత వాట్సాప్ గ్రూపుల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మెసేజ్‌లు పంపుకుంటున్నారు. దీనికి సంబంధించిన జనసేన కీలక నేతల ఆడియో సంభాషణలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. పోలీసు కస్టడీలో ఉన్న రావణ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన నేతలు ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా రెక్కీ నిర్వహించారు. పోలీసులు రావణ్‌ను బయటకు తీసుకువచ్చే సమయంలోనే అతనిపై భౌతిక దాడికి పాల్పడాలనే లక్ష్యంతో జనసేన కార్యకర్తలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సార్పవరం పీఎస్, కాకినాడ కోర్టు వద్ద గురువారం జరిగిన ఉదంతాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈసారి మరింత అప్రమత్తమయ్యారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు రావణ్‌పై దాడి జరగకుండా ఇనగుదురు పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పీఎస్ ప్రధాన గేట్లను సైతం మూసివేసి ఆంక్షలు విధించారు.ప్రస్తుతం ఇనగుదురు పోలీస్ స్టేషన్ ఆవరణ, చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. -
జంగిల్ రాజ్‌తో డిఫెన్స్‌లో చంద్రబాబు!
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టారు. జగన్‌కు బౌలింగ్ ఎలా వేయాలో అర్థం కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిలగిలలాడినట్లు అనిపిస్తుంది. జగన్ చేసిన విమర్శలకు నేరుగా జవాబు ఇవ్వలేక చంద్రబాబు అసందర్భ వ్యాఖ్యలకే పరిమితం అయ్యారా! అన్న భావన కలుగుతుంది. ఒకసారి జగన్ కొట్టిన రాజకీయ సిక్సర్లు ఏమిటో చూద్దాం..హే రామ్.. సేవ్ ఆంధ్ర! రాష్ట్రంలో జంగిల్ పాలన, 18 నెలల సీసీ టీవీ పుటేజి తీసివేశారంటే ఎందరిని పోలీసులు చంపారో! జీవించి ఉంటే ఎన్టీఆర్‌పై కూడా రౌడీ షీట్ పెట్టేవారేమో!, రాజకీయ స్వార్ధంతో పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్తులో వారికి పథకాలు ఎలా వస్తాయి? మీ పార్టీ నాయకులు దళితులను కించపరుస్తుంటే మీరేం చేస్తున్నారు? దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లపై చంద్రబాబు వైఖరి ఏమిటి? అమరావతిలో అవినీతికి వ్యతిరేకం, మావిగన్‌కు కట్టుబడి ఉంటాం.. ఎన్నికల మానిఫెస్టోలో పెడతాం! బాబు పాలన అంటే మోసం గ్యారంటీ!... ఇలా ఆయా సబ్జెక్టులపై ఒక స్పష్టతతో, ఆధారాలతో జగన్ పంచ్ డైలాగులు విసిరారు.హే రామ్.. అన్నది జాతిపిత మహాత్మా గాంధీ వాడిన మాట. ఏపీని రాముడే రక్షించాలని జగన్ వ్యాఖ్యానించారన్న మాట. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతోందని సోదాహరణంగా వివరించారు. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయిన తీరు, పోలీసుల వ్యవహార శైలి, సీసీ టీవీ ఫుటేజీ గల్లంతైన వైనం, రైతుల కష్టాలు పరిశీలించడానికి అమరావతి వెళ్లబోయిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేయడం, ఆ క్రమంలో ఒక కానిస్టేబుల్‌ను టీడీపీ కార్యకర్త ఒకరు రాయితో గాయపరచడం వంటి అంశాలను డిటైల్డ్‌గా ప్రస్తావించారు.చట్టాన్ని పోలీసు వ్యవస్థ చేతిలోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తోందని చెబుతూ సాయికృష్ణ మృతి కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు ఆదారంగా ఆరోపణలు చేశారు. సాయికృష్ణను చంపి, దహనం చేసి, బూడిదను కూడా ఇవ్వకుండా 46 రోజుల పాటు కేసును కప్పిపెట్టేశారని ఆయన అన్నారు. తాను వెళ్లి సాయికృష్ణ తల్లిని పరామర్శించిన తర్వాత కానీ ప్రభుత్వం కదలలేదని, తదుపరే బాధ్యుడైన సర్కిల్ ఇన్ స్పెక్టర్పై చర్య తీసుకోవడం ఆరంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 18 నెలల సీసీ టీవీ ఫుటేజీ పోలీస్ స్టేషన్లో మిస్ అయితే కమాండ్ కంట్రోల్ రూమ్‌లో, డీజీపీ ఆఫీస్‌లో బ్యాకప్ ఉండదా అని ప్రశ్నించారు.పోలీస్ కమిషనర్‌ను రక్షించడానికి డీజీపీ, ఈయనను రక్షించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. ఈ అంశాలపై చంద్రబాబు నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు. చనిపోయిన వ్యక్తి కాపు, పోలీసు కాపు అని అంటూ, కుల రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అంతటితో ఆగకుండా ఒక్కోసారి రౌడీల ప్రవర్తనతో పోలీసులకు ఫ్రస్టేషన్ వస్తుందని అని అన్నారు. ఇది పోలీసులు లాకప్ డెత్ ఘాతుకాలకు పాల్పడితే సమర్థించడం అవ్వదా! ఒక సీఎం ఇలా వ్యవస్థ నేరాలను ప్రోత్సహించవచ్చా? ఇక్కడే ఆయన బలహీనత కనిపిస్తుంది. సీసీటీవి ఫుటేజీ మాయం, రౌడీషీటర్ అయినంత మాత్రాన పోలీసులకు చంపే హక్కు ఉంటుందా? అంటూ జగన్ వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు.ఇద్దరి వాదనలు విన్న తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులో తప్పు చేసినట్లు పరోక్షంగా అంగీకరించినట్లే అనుకోవచ్చనిపిస్తుంది. జగన్ ఆ రకంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారని అనుకోవచ్చు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సెంటిమెంట్ డైలాగులు వాడే యత్నం చేశారు. చివరికి పవన్ కళ్యాణ్‌ను, ఆయన కుమార్తెను సోషల్ మీడియాలో దూషిస్తున్నారని అంటూ సంబంధం లేని వ్యాఖ్య చేశారు. నిజానికి అలా ఎవరైనా చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు. మధ్యలో పవన్ కళ్యాణ్ కుమార్తెను కూడా ఈ రాజకీయ రొంపిలోకి తీసుకురావడం చంద్రబాబు వంటి సీనియర్‌కు తగునా అన్న ప్రశ్న వస్తుంది.జగన్‌ను తాను అనుకుంటే ఒక్క నిమిషంలో అరెస్టు చేయవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించడం అర్దవంతంగా లేదని చెప్పాలి. ఒక టీడీపీ ఎమ్మెల్యే దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు నిలువరించడం లేదని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. సమాజంలో విద్వేషాలు పెంచుతుంటే చర్య తీసుకోలేకపోతున్నారని జగన్ విమర్శించారు. డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించకుండా కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో ఒక సామాజికవర్గం వారితో గొడవజరుగుతున్న తీరును జగన్ వివరించారు. ఈ అంశంలో చంద్రబాబు ఇంతవరకు నోరు మెదిపినట్లు కనిపించలేదు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో టీడీపీ వైఖరి ఏమిటని కూడా జగన్ అడిగారు. దానికి టీడీపీ వైపు నుంచి జవాబు లేదు.అమరావతిలోని కొన్ని గ్రామాల రైతులు ప్రభుత్వం వేదిస్తున్న తీరుపై జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి పరిశీలించడానికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీకి చెందిన వారు గూండాయిజం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. వైఎస్సార్సీపీ నేతల కార్లు ధ్వంసం చేశారు. ఇంత చేసిన టీడీపీ వారిపై కాకుండా వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడం మీద జగన్ మండిపడ్డారు. బాదితులపైనే కేసులు పెడతారా అని నిలదీశారు. అమరావతిలో అవినీతిని, దోపిడీని ప్రశ్నించే గొంతులను చంద్రబాబు నొక్కేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.అలాగే అమరావతిలో జరుగుతున్న అవినీతిని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం తన భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు నాలుగైదు వేల రూపాయలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తన భవనాల నిర్మాణానికి రూ.20,439 రూపాయలు ఎలా ఖర్చు పెడుతోందని ప్రశ్నించారు. ఇదంతా అవినీతి కాదా? అని ఆయన అడిగారు. అమరావతికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలు అక్కడికి రాకూడదని ముఖ్యమంత్రి, ఇతర టీడీపీ నేతలు అనడాన్ని ఆయన తప్పు పట్టారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ అవినీతికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. బాధితులపైనే కేసులు పెట్టడం ఒక అలవాటుగా ప్రభుత్వం మార్చుకుందని, ఇది జంగిల్ రాజ్‌గా మారిందని ఆయన అన్నారు.ఎన్టీ.రామారావు బతికి ఉంటే, గతంలో చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆయనపై కూడా చంద్రబాబు సర్కార్ రౌడీ షీట్ పెట్టి ఉండేదేమోనని జగన్ ఎద్దేవ చేశారు. నిజంగానే ఈ రెండేళ్లలో విపక్ష వైఎస్సార్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన, సోషల్ మీడియా వారిపైన, జర్నలిస్టులపైన, ఎవరు ప్రశ్నిస్తే వారిపై రెడ్ బుక్ అంటూ అరాచకంగా కేసులు పెడుతున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా మార్చిందన్న విమర్శలు జనం నుంచి కూడా వస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అక్రమాలను కూడా జగన్ ప్రస్తావించి ఓట్లు కోల్పోతే పేదలకు స్కీముల పరిస్థితి ఏమిటని అన్నారు. దీని గురించి టీడీపీ ఎటూ మాట్లాడదు.అమరావతి విషయంలో జగన్ విస్పష్టమైన ప్రకటన చేసి చంద్రబాబుకు సవాల్ చేయడం కూడా సరికొత్త పరిణామంగా భావించాలి. అవినీతికి ఆస్కారం లేకుండా రెడీమేడ్‌గా ఉన్న మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని ప్రకటన చేశారు. నిజానికి ఇలా చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. దీనికి ముఖ్యమంత్రి అమరావతిలో అవినీతి లేదని గట్టిగా జవాబు ఇవ్వలేకపోయారు. కేంద్ర నిర్మాణ వ్యయానికి, రాష్ట్ర నిర్మాణ వ్యయానికి ఇన్ని రెట్ల తేడా ఎందుకు ఉందో, అదంతా అవినీతి అవుతుందా? అవ్వదా అన్నదానిపై వివరణ ఇవ్వలేకపోయారు.నాడు మూడు ముక్కలు, ఇప్పుడేమో మావిగన్ అని కామెంట్ చేస్తూ మావవిగన్ అంటే అర్థం ఉందా అని మాత్రమే ఆయన అన్నారు. అమరావతికి, మావిగన్‌కు ఉన్న తేడా ఏమిటో జగన్ చెబుతుంటే, చంద్రబాబు మాత్రం ఆ కోణంలో చెప్పలేకపోతున్నారు. తొలుత ఏభై వేల ఎకరాలు సేకరించడం, మళ్లీ మరో ఏభై వేల ఎకరాలు రెండో దశ కింద సేకరించే యత్నం, లక్ష కోట్ల పైగా ఖర్చు పెట్టడానికి సిద్దం అవడం, ఇప్పటికే సుమారు ఏభైవేల కోట్ల అప్పు చేయడం, ఇతర హామీలను అమలు చేయకపోవడం వంటివాటిపై ప్రజలకు సమాధానం చెప్పగలిగి ఉంటే చంద్రబాబుకు కొంతైనా విశ్వసనీయత వచ్చేది. ఆయన ఆ పని చేయలేకపోతున్నారు. దానికి కారణం ఒకే చోట లక్షల కోట్ల ఖర్చు పెడుతున్న వైనంపై ఏపీ ప్రజలలో వ్యతిరేకత వస్తుండడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యల నేపథ్యంలో జగన్ హే రామ్.. సేవ్ ఆంధ్ర అని వ్యాఖ్యానించారు. అందులో తప్పేముంది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అమరావతి నిర్మాణంలో కీలక అధికారి రాజీనామా
సాక్షి,విజయవాడ: రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన అధికారి, ఏజీఐసీఎల్ (AGICL) మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వీ రత్న శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు పాలనపై, ప్రభుత్వ తీరుపై అసంతృప్తితోనే ఈ అధికారి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ముంబై మెట్రో, ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టుల్లో అపార అనుభవం ఉన్న మాజీ ఐఏఎస్ రత్న శ్రీనివాస్‌ను అమరావతి పనుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ ‘ఏజీఐసీఎల్’ కు ప్రభుత్వం ఎండీగా నియమించింది.అయితే నియమించిన కొద్ది నెలలకే ప్రభుత్వం తీరుపై ఆయనకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లకే ఆయన విసిగిపోయి వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రభుత్వం తీరుపై గతంలోనే అసంతృప్తితో ఈ ఎండీ సెలవు పెట్టారు. అయితే సెలవుపై వెళ్లిన వ్యక్తిని చంద్రబాబు స్వయంగా బుజ్జగించి మళ్లీ రప్పించారు. కానీ మళ్లీ కొద్ది నెలలకే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు.ప్రస్తుతం ఏజీఐసీఎల్ ఎండీకి, ఎంఏయూడీ శాఖకు మధ్య ఉన్న విభేదాలే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమరావతి నిర్మాణాలపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, రత్న శ్రీనివాస్ వంటి కీలక అధికారి రాజీనామా చేయడం ప్రభుత్వంలో తీవ్ర కలవరం రేపుతోంది. ఏజీఐసీఎల్ ఎండీ రాజీనామాతో అసలు అమరావతిలో ఏం జరుగుతోందంటూ ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలైంది. -
పోలీస్ వాహనంలో రావణ్ తరలింపు.. కోడిగుడ్లతో జనసేన శ్రేణుల దాడి!
సాక్షి,కాకినాడ: స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. రావణ్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని జనసేన శ్రేణులు ఒక్కసారిగా అడ్డుకున్నారు.పోలీసుల వాహనం ముందుకు కదలకుండా అడ్డుకోవడమే కాకుండా, ఆగ్రహంతో ఆ వాహనంపై కోడిగుడ్లతో దాడికి దిగారు. దీంతో సర్పవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ముళ్ల కంపలు.. నీళ్ళు తోడుకోవడం తప్ప అమరావతిలో ఏ ఒక్క పనైనా చేశావా?
-
అమరావతికి అసలు ఎవరు రమ్మన్నారు?
అమరావతికి వాళ్లను ఎవరు వెళ్లమన్నారు? వారు కుట్రలు చేస్తున్నారు.. అందుకే రైతులు తిరగబడ్డారు.. ఇది వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన. అంటే దీని అర్థం రైతుల ముసుగులో టీడీపీ వారు దాడి చేసినట్లు అంగీకరించినట్లే అవుతుందా? లేదా?..'మేమే రమ్మన్నాం.. ప్రభుత్వం తమను వేధిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు తెలియచేస్తే ఆయన ఒక కమిటీని వేశారు. వాస్తవ పరిస్థితులను గమనించడానికి తమ కోరిక మేరకు ఆ వైఎస్సార్సీపీ కమిటీ నేతలు వస్తుంటే టీడీపీ వారు అడ్డుకుని రభస సృష్టించారు. ఇది దారుణంగా ఉంది..' అని ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు కొందరు ఇచ్చిన జవాబు.'అమరావతి ఏమైనా పాకిస్తానా? తాము ఎందుకు వెళ్లకూడదు..' అని మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలు, ఇతరత్రా ఆలోచనపరుల ప్రశ్న.'వైఎస్సార్సీపీ నేతలను తరిమిన రాజధాని రైతులు.. ఇది ఎల్లో మీడియాగా పేరొందిన తెలుగుదేశం పత్రిక ఈనాడు' పేపర్లో పెట్టిన హెడ్డింగ్.. ఇది మెయిన్ పేజీలో వచ్చిన శీర్షిక అయితే జిల్లా పత్రికలో మరో కథనం ఇచ్చారు. దానికి 'ఈసడించినోళ్లను ఈడ్చి కొట్టారు' అన్న శీర్షికను పెట్టి మరో స్టోరీ రాశారు. అందులో ఏమి రాశారో తెలుసా!.. శనివారం రాజధాని పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను చేతికి దొరికిన కర్రలతో వెంబడిస్తూ, కోడిగుడ్లు విసురుతూ తీవ్ర పరాభవం చేశారు అని ఈనాడులో పేర్కొన్నారు. అదే టైమ్‌లో 'రాళ్లు, కోడిగుడ్లతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి' అని ఈనాడు మొదటి పేజీలో అందుకు విరుద్ధంగా తెలిపారు.'వైఎస్సార్‌సీపీవారిని గంట సేపు అడ్డగించారని, రెచ్చగొట్టేలా వైఎస్సార్సీపీ చేష్టలు' అని కూడా రాశారు. అంటే దీని అర్దం ఎక్కడా వైఎస్సార్‌సీపీవారు దాడులు చేయలేదని పరోక్షంగా తెలియచేసినట్లే కదా! అక్కడ అరాచకం చేసింది టీడీపీ గూండాలని తెలుసు.. ప్రశాంతంగా తమ దారిన తాము వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్నది వారేనని తెలుసు. అయినా తెలుగుదేశంపై విధేయతతో అడ్డగోలు కథనాలు రాశారు. మరో టీడీపీ మీడియా అయితే 'మళ్లీ అమరావతి వైపు వైఎస్సార్సీపీ వాళ్లు కన్నెత్తి చూడకుండా చేయాలని' వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ప్లేట్ మార్చి 'వైఎస్సార్సీపీ నేతలే అమరావతిపై దండయాత్ర చేశారని' పచ్చి అబద్దాన్ని ప్రచారం చేసిది. దీనిని బట్టి ఎంత నిస్సిగ్గుగా ఈ ఎల్లో మీడియా పనిచేస్తున్నది అర్థం చేసుకోవచ్చు.ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అతనిపై రాయి విసిరిన వ్యక్తి టీడీపీ వాడని తెలిసినా పోలీసులు మాత్రం అతని పేరు కేసులో చేర్చలేదట. కొద్ది రోజుల క్రితం కీలక మంత్రి లోకేష్ ప్రకటించినట్లు టీడీపీ కార్యకర్తలు తప్పులు చేసినా కేసులు పెడితే ఊరుకోనని, అవసరమైతే డీజీపీని పంపిస్తానని బెదిరించిన నేపథ్యంలోనే పోలీసులు ఇలా వ్యవహరించారన్న అభిప్రాయం కలుగుతుంది.అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విపక్షానికి చెందిన రాజకీయ పార్టీని అమరావతి ప్రాంతానికి వెళ్లరాదని అనడం సరైనదేనా? అంటే అమరావతిలో జరగకూడనివి జరుగుతున్నాయని అంగీకరించినట్లే కదా అని పెనుమాక రైతు ఒకరు వ్యాఖ్యానించారు. నిజంగా ఈ నాలుగైదు గ్రామాల రైతుల పట్ల ప్రభుత్వం ఇంత క్రూరంగా ప్రవర్తించడం దారుణంగా ఉంది. వారు రాజధానిలో రోడ్డుకు అవసరమైన భూమి ఇచ్చినా, వారికి ఉన్న భూములు మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబట్టి భయపెడుతోంది. వారు తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. సమస్యలను తెలుసుకోవలసిన ప్రభుత్వ పెద్దలే తమ పొలాలలో తాము పనిచేసుకోనివ్వకుండా రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారని రైతులు వాపోతున్నారు.వీరి పొలాల్లో మట్టి తవ్వుకుని టీడీపీ మాఫియా గాంగ్ అమ్ముకుందట. ఆ పొలాలను చెరువుల మాదిరి కొందరు అధికారులు పాడు చేశారు. ఆరుగాలం కష్టపడే రైతులను రకరకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారు. వేధిస్తున్నారు. అయినా రైతులు తమ పోరాటం కొనసాగించడం టీడీపీ ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది.కొద్ది రోజుల క్రితం జగన్‌ను కలిసిన రైతులు ఆయన సామాజికవర్గానికి చెందినవారని ఒక ఎల్లో మీడియా పత్రిక రాసింది. ఇప్పుడు ఆ కారణంతోనే రైతులను ఇలా హింసిస్తున్నారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. నిజానికి ఆ గ్రామాలలో అన్ని సామాజికవర్గాల రైతులు ఈ భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైన భూమి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం ఒక ఎత్తు అయితే, వైఎస్సార్సీపీ నేతలు వారితో మాట్లాడడానికి వెళుతున్నప్పుడు ఉండవల్లి వద్ద ప్లాన్ ప్రకారం అడ్డుకుని టీడీపీ గూండాలు నానా గందరగోళం సృష్టించడం మరో ఎత్తుగా ఉంది. పైగా దాడులు చేసినవారిపై కాకుండా, బాధితులపైన కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం ఒక ట్రెండ్ గా మార్చింది.చంద్రబాబు సర్కార్ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు తెరదీయడం అత్యంత శోచనీయం. ఇది భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా పాటించే ప్రమాదం ఉంటుందన్న సంగతిని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ విస్మరిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం తెలంగాణలో ఒక సభ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ అనుమతి కోరితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాకుండా, మరో రోజు పెట్టుకోవచ్చని ఆ ప్రభుత్వం చెబితే ఇదేమైనా మీ అయ్య జాగిరా అని ప్రశ్నించారు. పవన్‌కు చంద్రబాబు సైతం మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రశ్నను వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాము అమరావతి రాజధాని గ్రామాలకు ఎందుకు వెళ్లకూడదని అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎక్కడకు వెళ్లి, ఎవరిని రెచ్చగొట్టినా అప్పటి ప్రభుత్వం ఏమీ మాట్లాడకూడదనేవారు. అనపర్తికి ఆయన ఒకసారి వెళ్లినప్పుడు శాంతిభద్రతల సమస్య వస్తోందని, టూర్ వద్దని పోలీసులు చెబితే ఆయన ఒప్పుకోకుండా కాలి నడకన వెళతానని అంటూ పట్టుబట్టి వెళ్లారు. అయినా పోలీసులు ఆయనపై కేసు పెట్టకుండా రక్షణ కల్పించారు. పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్న పరిస్థితిలో పోలీసుల మాట ఖాతరు చేయకుండా ఆయన టూర్ చేశారు.గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో కొందరు తెలంగాణవాదులు అడ్డుకోవడానికి యత్నించేవారు. అప్పట్లో మంద కృష్ణ మాదిగ తన అనుచరులతో యాత్రకు సహకరించారు. అయినా కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడేది. వరంగల్ జిల్లాలో ఒకసారి తెలంగాణవాదులు గట్టిగా అడ్డుపడితే అప్పట్లో పవర్‌ఫుల్‌గా ఉన్న ఒక టీడీపీ నేత తన మనుషులతో వారిపై దాడి చేయించారు. వారిని ఉరికించి కొట్టామని ఆయనే స్వయంగా చెప్పారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లవచ్చు కాని, తను అధికారంలో ఉంటే మాత్రం విపక్షం ఎక్కడకు కదలకూడదా అన్న ప్రశ్న వస్తుంది.గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిని గేటెడ్ కమ్యూనిటిగా మార్చుతున్నారని విమర్శించేవారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు సరసన చేరి మద్దతు ఇస్తుండవచ్చు. కాని ఆయన చెప్పిన గేటెడ్ కమ్యూనిటీ మాట ప్రస్తుతం నిజం అవుతుందేమో అన్న సందేహం వస్తోంది. అమరావతిలో ఎలాంటి తప్పులు జరగకపోతే, వేల కోట్ల అప్పులు తెచ్చి జరుపుతున్న నిర్మాణాలలో అవినీతి లేకపోతే, రైతులంతా స్వచ్చందంగా భూములు ఇస్తున్నట్లయితే వైఎస్సార్సీపీ నేతల పర్యటనను అడ్డుకోవలసిన అవసరం ఏమి ఉంటుంది.అమరావతిలో ఒక భయానక వాతావరణం సృష్టించి ఎవరూ అందులోని లోటుపాట్లను ఎత్తి చూపరాదన్న లక్ష్యమా? లేక సాయికృష్ణ లాకప్ డెత్ కేసును డైవర్ట్ చేయడానికి దీనిని వాడుకున్నారా అన్నది తెలియదు. చిత్రం ఏమిటంటే దాడులకు గురైన వైఎస్సార్సీపీ నేతలపై ఎస్సీ.ఎస్టీ చట్టం కింద కూడా ఒక మహిళతో ఫిర్యాదు చేయించడం, వెంటనే కేసు నమోదు చేయడం జరిగిపోయాయట. దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీవారిపై మాత్రం నామమాత్రపు కేసులు పెట్టారట. దీనిని బట్టి ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది.. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అరాచకంగా మారింది అర్థం అవుతోంది కదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మూడేళ్ల ముందే జగన్ ఎలక్షన్ అజెండా.. MAVIGUN Vs అమరావతి
-
కర్నూలు జీజీహెచ్.. బాధిత కార్మికులకు అండగా ఉంటాం : వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో (జీజీహెచ్) అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమను కొత్త కాంట్రాక్టర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు జీజీహెచ్‌లో శానిటేషన్ పనుల కాంట్రాక్ట్‌ను పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీకి అప్పగించిన అనంతరం, ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించారని కార్మికులు తెలిపారు. దీంతో తమ కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ, తమకు న్యాయం చేయాలని వైయస్ జగన్‌ను కోరారు.వారి సమస్యలను ఓపికగా విన్న వైయస్ జగన్, ఉద్యోగాలు కోల్పోయిన పారిశుధ్య కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వారి ఉద్యోగాల పరిరక్షణ కోసం అవసరమైన న్యాయపరమైన సహాయాన్ని పార్టీ లీగల్ సెల్ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ అన్ని విధాలా తోడుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
ఏపీ హైకోర్టులో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట
ఏపీ హైకోర్టులో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట దక్కింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.కాగా, వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై ఇటీవల పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌తో పాటు డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పానుగంటి చైతన్య, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి నవరత్నాల మూర్తి, తదితరులపై కేసు నమోదైంది. -
AP EAPCET ఫలితాలు విడుదల
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను బుధవారం (నేడు) మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర విద్యశాఖ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలతో పాటు అభ్యర్థుల ర్యాంకులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్‌లో 1,82,317 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 63,546 మంది క్వాలిఫై అయ్యారు. ఏపీ ఎప్‌సెట్ పలితాలను జేఎన్టీయూ వీసీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ లో 71.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌లో తొలి ర్యాంక్ గుంటూరుకు చెందిన రోషన్ మణి దీప్ రెడ్డి( 95.69),శ్రీ కాకుకుళానికి చెందిన శ్రావ్య (95.59)కు రెండో ర్యాంక్ దక్కింది. ఇంజనీరింగ్‌లో టాప్ 10 మందిలో 9 మంది అబ్బాయిలే ఉన్నాయి.అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో మొదటి ర్యాంక్ విజయనగరానికి చెందిన జశ్వంత్ నాయుడు(92.53),రెండో ర్యాంక్ హైదరాబాద్ కి చెందిన వెంకట్ రెడ్డి(91.84) ఉన్నారు. టాప్ 10లో ఐదుగురు అమ్మాయిలు,ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. అగ్రికల్చర్ లో 89.59 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జేఎన్టీయూ వీసీ ప్రసాద్ తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, డేటాఫ్‌బర్త్ , క్యాప్చా కోడ్ నమోదు చేసి చూసుకోవచ్చు. స్కోర్కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, తల్లిదండ్రుల వివరాలు, కేటగిరీ, సబ్జెక్టులవారీగా మార్కులు, మొత్తం మార్కులు వంటి సమాచారం ఉంటుంది. స్కోర్కార్డులో ఏవైనా పొరపాట్లు కనిపిస్తే వెంటనే APSCHE అధికారులను సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ ఈ ఏడాది ఏపీఎప్‌సెట్ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలు మే 12 నుంచి మే 20, 2026 వరకు వివిధ కేంద్రాల్లో జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. -
చంద్రబాబు సభలో ఘోరం.. తండ్రిని ఈడ్చుకెళ్లిన పోలీసులు!
సాక్షి,నెల్లూరు: నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న ప్రజావేదిక సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల ఓ ప్రైవేట్ పాఠశాలలో తౌశిక్ అనే విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తన కుమారుడి మరణానికి న్యాయం చేయాలంటూ సీఎం సభ వద్దకు చేరుకోవడంతో ఈ కలకలం రేగింది. చంద్రబాబుకు వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన బాధిత తండ్రి పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.నెల్లూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో ఇటీవల తౌశిక్ అనే విద్యార్థి మరణించాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం,అనుమానాస్పద పరిస్థితులే తన కుమారుడి మృతికి కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అతని తండ్రి కోరుతున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు తన గోడును వెళ్లబోసుకుని, వినతిపత్రం సమర్పిస్తే న్యాయం జరుగుతుందనే ఆశతో ఆయన సభా ప్రాంగణానికి వచ్చారు.సీఎం చంద్రబాబుకు కేవలం వినతిపత్రం మాత్రమే ఇస్తానని, దయచేసి అనుమతించాలని బాధిత తండ్రి అక్కడున్న పోలీసులను వేడుకున్నారు. అయితే, భద్రతా కారణాల నెపంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను సభా ప్రాంగణం నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో అక్కడి నుండి తరలించారు.కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై సభకు వచ్చిన పార్టీ కార్యకర్తలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
వచ్చే ఎన్నికలు మావిగన్ Vs అమరావతి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. మావిగన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్‌కు మేము కట్టుబడి ఉన్నాం. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి. ప్రజల మద్దతు ఎవరికి ఉందో అందరికీ తెలుస్తుంది. అవినీతి జరగకుండా మావిగన్ రాజధాని వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘నేను అమరావతి వెళ్తే.. జగన్ అమరావతికి వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి నేను వ్యతిరేకం. అక్కడ ఉన్న రైతుల ఆవేదనను నేను చెబుతున్నాను. చంద్రబాబు అమరావతిలో చేస్తున్న స్కాంలను ప్రశ్నిస్తున్నా. అవినీతి లేని రాజధాని కావాలనేదే చెబుతున్నా. మావిగన్‌కు మద్దతు ఇచ్చే వారు వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్‌ను వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో చేరుస్తాం. ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో స్పష్టమవుతుంది. రైతులు తరఫున నేను ప్రశ్నస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
భూమి కోసం న్యాయపోరాటం
తాడేపల్లి రూరల్: భూమిని కాపాడుకోవడం కోసం కలసికట్టుగా న్యాయపోరాటం చేస్తామని ఉండవల్లి, పెనమాక రైతులు స్పష్టంచేశారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. న్యాయపోరాటంతోపాటు కలసివచ్చే రాజకీయ పార్టీలతో కలసి పోరాటం చేస్తామని రైతులు తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్లోని ఓ రైస్‌మిల్లులో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులు, భూసేకరణకు నోటీసులు వచ్చిన రైతులు సమావేశం నిర్వహించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. దేశ రక్షణకు సైనికులు ఎంత అవసరమో దేశంలో ప్రజల ఆకలి తీర్చడానికి రైతులు కూడా అంతే అవసరమని వారు పేర్కొన్నారు.బాధల్లో ఉన్నప్పుడు తమను ఓదార్చే వారిని తప్పనిసరిగా కులాలు, మతాలతో సంబంధం లేకుండా కలుస్తామని, దానిలో భాగంగానే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశామని రైతులు వివరించారు. సీఆర్డీఏ పరిధిలో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని తమ కష్టాలను వివరించామని, దానికి స్పందించిన ఆయన న్యాయ సలహా కమిటీ, సీఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారని, ఆ కమిటీ క్షేత్రస్థాయిలో రైతుల బాధలను తెలుసుకోవడానికి వస్తున్న సమయంలో ఉండవల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో దాడులు జరగడం చాలా దురదృష్టకరమని ఉండవల్లి రైతులు పేర్కొన్నారు. సీఆర్డీఏ అధికారులు, టీడీపీ పెద్దలు రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వాలని కోరినప్పుడు 95 శాతం మంది భూములు ఇచ్చారని తెలిపారు. మిగిలిన భూమిని వదిలివేస్తామని వారు హామీ ఇచ్చారని రైతులు వివరించారు. అయితే ఆ తర్వాత ఆ మాట తప్పి భూ సేకరణకు మూడు దఫాలుగా నోటీసులు అందజేశారని తెలిపారు. రోడ్లకు, కొండవీటి వాగుకు భూములు తీసుకుని మిగిలినవి వదిలివేస్తారా అని అధికారులను అడుగుతున్నా తమకు తెలియదంటున్నారని రైతులు పేర్కొన్నారు. ‘9.3 ఒప్పందం పత్రం ఇచ్చేదాకా ఒకలాగా మాట్లాడారు. ఇచ్చిన తరువాత మరోలా మాట్లాడుతున్నారు’ అని రైతులు వివరించారు. గతంలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలు సేకరణలో లేవని, భూములు ఇవ్వడం ఇష్టంలేనివారు 9.2 పత్రాలు ఇవ్వాలని అధికారులు చెప్పారని, 9.2 ఇచ్చిన తరువాత భూ సేకరణ నోటీసులు ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు రైతులు ఏమన్నారంటే...ఈ ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదుకిసాన్ రైతు సంఘం గతంలో రాజధాని నిర్మాణానికి 5 వేల ఎకరాలు సరిపోతుందని స్పష్టం చేసింది. అలాంటిది ప్రభుత్వం 50 వేల ఎకరాలు సేకరించింది. నేను కూడా ఒక రైతునే. ఉండవల్లిలో అనేక రకాల పంటలు పండిస్తాం. 365 రోజులు పూలు, కూరగాయలు పండించి ఎవరిమీద ఆధారపడకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇలాంటి భూములను కాంక్రీట్ జంగిల్‌గా ఎలా చేస్తారు? రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం పూలింగ్, నాన్ పూలింగ్ అని ఇచ్చారు. ఇవ్వని వాళ్లు 9.2 ఫారం ఇవ్వాలని అధికారులు కోరారు. రైతులందరం ఇచ్చాం. ఇప్పుడేమో భూములు ఇవ్వని రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఉండవల్లి గ్రామాల్లో దాడిచేసే కల్చర్ ఎప్పుడూ లేదు. రైతులతో గొడవకు దిగిన ఏ ప్రభుత్వం నిలవబడదు. ఈ ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన 9.3ని కూడా వెనక్కి తీసుకోవాలా, ఇవ్వాలా అని ఆలోచిస్తాం. – కొర్రప్రోలు ఈశ్వరరెడ్డి, కిసాన్ రైతు సంఘం అధ్యక్షులుమేం ఆహ్వానిస్తేనే రైతు పరిరక్షణ కమిటీ వచ్చిందిరైతుల సమస్యలపై మాత్రమే జగన్‌ను కలిశాం. ఆయన్ను కలవకముందే అనేక రైతు సమస్యలపై సమావేశం నిర్వహించాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసినపుడు రహదారులకు భూములు ఇవ్వాలని చెప్పారు. మిగిలిన భూమిని వదిలేసే వరకు పార్టీ తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మా కోరిక మేరకే రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటి పరిశీలనకు వస్తున్న సమయంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం. ఒక రైతుగా ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. –దంటు బాలాజీరెడ్డిఆ ప్లాట్లు ఎక్కడో రైతులకు తెలియదు..తొలి విడత పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు నేటికీ ప్లాట్లు కేటాయించలేదు. పేపర్ల మీద ఇచ్చినట్లు చూపిస్తున్నారు కానీ ఆ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో రైతులకు తెలియదు. మేము నష్టపోయినా, భూములు ఇచ్చిన రైతులు నష్టపోయినా ఒకటే. సీఆర్డీఏ అధికారులు భూములు ఇవ్వని రైతులపై ఒత్తిడి తీసుకువచ్చే ముందు భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు మా ఊర్లోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. 2012కి ముందే మా గ్రామంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడే జరగడం లేదు. రిజిస్ట్రేషన్లు కూడా కావడం లేదు. –మేకా శ్రీధర్రెడ్డిమా భూములు కాపాడుకునేందుకు ఎవరినైనా కలుస్తాంగ్రామాల్లో ఎన్ని పార్టీలు ఉన్నా, రైతులకు ఆ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు. కులమత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా ఉంటున్నాం. దయచేసి గొడవలు పెట్టవద్దు. మా భూములు కాపాడుకునేందుకు ఎవరినైనా కలుస్తాం. అధికారులు ఇచ్చిన మాట తప్పి రైతులను మోసం చేస్తున్నారు. దానికి ఉదాహరణ నేనే. నాకు సీఆర్డీఏ అధికారులు ప్లాట్లు కేటాయించే దాకా నా పొలంలో అడుగు పెట్టడానికి వీలులేదంటూ, నా పొలం చదును చేయడానికి వీలులేదంటూ ఒప్పందం కుదుర్చుకున్నాను. 9.3 ఒప్పంద పత్రం ఇవ్వగానే ఉండవల్లిలో గ్రామసభ జరుగుతుండగా రోడ్డు కాంట్రాక్టర్ వచ్చి మోటారు పీకేందుకు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. ఇప్పటి వరకు ఏమీ ప్రయోజనం లేదు. పొలానికి రెండు వైపులా 5 అడుగుల మెరక తోలారు. వర్షం వస్తే పంట మునిగిపోతుంది. నా పరిస్థితి ఏమిటి? –అనంత శివరావుప్రభుత్వమే మోసం చేస్తే ఎలా..?నాకు ఉండవల్లిలో లే అవుట్లో 7.5 సెంట్లు భూమి ఉంది. ల్యాండ్ ఫూలింగ్‌లో నా పేరు లేదు. భూమి అమ్మిన వారి పేరే ఉంది. ఇదేంటంటూ కమిషనర్‌ను కలిశాను. ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ భూ సేకరణ కింద పెట్టారు. నోటీసు రాకుండా అభ్యంతరాలను ఎలా చెప్పాలి? కలెక్టర్ ఆఫీసుకు వెళితే మా పేరు ఉందని నా అబ్జెక్షన్‌ను తీసుకున్నారు. ప్రభుత్వమే ఇలా మోసం చేస్తే రాజకీయ నాయకులను ఆశ్రయించడంలో తప్పేముంది? ఇలాంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరం. –వీరారెడ్డి, ప్రభుత్వ ఉద్యోగిపూలింగ్కు ఇచ్చాను, నాకు ప్లాట్ ఇవ్వలేదునేను మొదటి విడతలోనే పూలింగ్‌కు నా భూమి ఇచ్చాను. నేను 30 సెంట్ల భూమి ఇవ్వగా టీడీఆర్ బాండ్ ఇచ్చారు. మిగిలిన భూమి ఎక్కడ ఇచ్చారనేది చూపించడం లేదు. నేను ప్లాట్లు అడిగితే గుంటూరు వెళ్లమంటున్నారు. అక్కడకు వెళితే సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లమంటున్నారు. 821 మంది రైతులకు 5 విడతలుగా నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేదు. కొత్తగా భూములు తీసుకుని ఏం చేస్తారు? సీఎం నివాసం పక్కనే ఉన్నా మాకు మౌలిక సదుపాయాల విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. కొంతమందికి పెన్షన్లు నిలిపివేశారు. మా ప్రాంతంలో రోడ్లు, లైట్లు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. –కనకం కోటేశ్వరరావు -
నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. -
చంద్రబాబు ‘ఈ మంగళవారం’ అప్పు రూ.2,600 కోట్లు
సాక్షి,అమరావతి: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం రోజురోజుకూ అప్పులమయంగా మారుతోంది. ఇప్పటికే అప్పులతో దివాళా తీసిన రాష్ట్ర స్థితిగతులను మరింత దిగజార్చుతూ కూటమి సర్కార్ తాజాగా మంగళవారం మరో భారీ అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సెక్యూరిటీల వేలం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మరో రూ. 2,600 కోట్ల అప్పును తీసుకుంది. ఈ తాజా రుణంతో కలిపి, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన 25 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రం చేసిన మొత్తం అప్పుల విలువ ఏకంగా రూ. 3,55,000 కోట్లకు చేరింది. దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం ఇప్పుడు ఆర్థిక రంగాన్ని, రాజకీయ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం కేవలం అధికారిక బడ్జెట్ ద్వారానే కాకుండా, వివిధ కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బడ్జెట్ వెలుపల కూడా భారీగా నిధులను సమీకరిస్తోందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.చంద్రబాబు పాలనలో జరిగిన అప్పుల అంతర్గత వివరాలు పరిశీలిస్తే.. బడ్జెటరీ అప్పులు రూ. 1,97,000 కోట్లు కాగా, బడ్జెట్ వెలుపలి అప్పులు రూ. 1,12,504 కోట్లుగా ఉన్నాయి. వీటికి తోడు అమరావతి పేరిట మరో రూ. 47,387 కోట్ల మేర రుణాలను సేకరించారు. -
‘వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైతే.. కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లే’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మొహన్ రెడ్డి పాదయాత్ర మొదలైతే..కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లేనని మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ స్పష్టం చేశారు. మేకప్ మంత్రి అంటూ తాను చేసిన కామెంట్స్‌కు మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. మంగళవారం మహిళా కమిషన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.నేను మహిళలను అవమానించానని టీడీపీ నాపై తప్పుడు ప్రచారం చేసింది. నేను చేసిన కామెంట్ పొలిటికల్ సెటైర్ మాత్రమే. హోంమంత్రి అనిత మా పార్టీ నేతలపై అనేకసార్లు ఇష్టానుసారం మాట్లాడారు. వ్యవస్థలపై గౌరవంతోనే విచారణకు హాజరయ్యాను. నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని మహిళా కమిషన్‌కు చెప్పాను.టీడీపీ, కూటమి నేతలు ఊహించున్నవాటికి సమధానం చెప్పాల్సిన అవసరం లేదు.రాజకీయంగా మీరు వంద అంటున్నారు.. మేం ఒక్కటంటే బాధ వచ్చిందా..?. రాష్ట్రంలో మహిళలు,చిన్నారులపై హత్యలు, అత్యాచారాలపై హోంశాఖ ఎందుకు మాట్లాడటం లేదు.సాయికృష్ణ తల్లి బూడిద కోసం బాధపడుతుంటే ఎందుకు స్పందించరు. ఉప్పాల హారికపై దాడి జరిగితే ఎందుకు స్పందించరు?. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దారుణాలపై ఎందుకు మాట్లాడరు..?.డిప్యూటీ స్పీకర్ మాటలు చూస్తుంటే ఇప్పుడున్న హోంమంత్రి పనికి రారా అనిపిస్తోంది. మహిళలపై దాడులు జరుగుతుంటే స్పందించని హోంమంత్రి పదవి ఉంటే ఎంత?.. ఊడితే ఎంత..? అని మండిపడ్డారు.మహిళలపై నాకు అపారమైన గౌరవం ఉంది. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైతే.. కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లే.కూటమి నేతలకు మహిళలంటే గౌరవం లేదన్నారు. -
విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని బీబీ గూడెం వద్ద విజయవాడ పశ్చిమ బైపాస్‌పై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల కుమారుడు సహా తల్లి, మరో వ్యక్తి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పెంచికలపర్రు గ్రామానికి చెందిన జయమంగళ వెంకటవిజయ్కుమార్, వెంకటరాజు సోదరులు పొక్లెయిన్లు నడుపుతుంటారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి తల్లి రమాదేవి చూసేందుకు కుటుంబ సభ్యులతో కారులో వచ్చారు.వెంకరాజు భార్య, పిల్లలు ఆస్పత్రి వద్ద ఆగిపోగా, మిగిలిన వారు కైకలూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారి పశ్చిమ బైపాస్‌పై బీబీ గూడెం సమీపంలోకి రాగనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ముందు టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు వెళ్తున్న ట్యాంకర్ లారీతో పాటు వీరి కారును ఢీకొట్టి కొంత దూరం పాటు ఈడ్చుకువెళ్లింది.ఈ ప్రమాదంలో కంటైనర్, ట్యాంకర్ మధ్య కారు ఇరుక్కుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో వెనుక సీటులో కూర్చోన్న వెంకటవిజయ్కుమార్ భార్య బాలవెంకటనాగదుర్గ (28), కుమారుడు కారుణ్య నాగసాయి(4) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలోనే ట్యాంకర్ లారీ ఢీకొని స్కూటీపై వెళ్తున్న విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన హోటల్ కార్మికుడు దాసరి వెంకటేశ్వరరావు (49)కు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు.కారు నడుపుతున్న వెంకటరాజు, ముందు సీట్లో కూర్చున్న వెంకటవిజయ్కుమార్ గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంకటేశ్వరరావుతో పాటు కారులో ఇరుక్కుపోయిన తల్లి, కుమారుడి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో పశ్చిమ బైపాస్‌పై గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు, హైవే సిబ్బంది పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
మేము దాడులు చేయలేదు.. ఉండవల్లి రైతుల కీలక వ్యాఖ్యలు
-
భారీ స్కామ్‌లకు కూటమి సర్కార్ స్కెచ్
అమరావతి: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధిని నిబంధనలకు విరుద్ధంగా కుదిస్తూ కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపింది. ప్రైవేటు వ్యక్తులకు, అధికార టీడీపీ బినామీలకు తీరప్రాంతాన్ని ధారాదత్తం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. రేషనలైజేషన్ పేరుతో పోర్టుల పరిధిని నామమాత్రంగా తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వం జీవోలను కూడా జారీ చేసింది.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సముద్ర తీర రక్షణ, పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం పోర్ట్‌కు 64 కిలోమీటర్ల పరిధిని కేటాయించారు. అయితే, ప్రస్తుత చంద్రబాబు సర్కార్ దానిని ఏకంగా 15 కిలోమీటర్లకు కుదించివేసింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో 51 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రామాయపట్నం పోర్టు పరిధిని సైతం ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 15 కిలోమీటర్లకే పరిమితం చేస్తూ బరితెగించింది.పోర్టుల పరిధిని ఈ స్థాయిలో తగ్గించడం వెనుక టీడీపీ బినామీల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోర్ట్ సమీపంలోని అత్యంత విలువైన తీర ప్రాంతంపై కన్నేసిన టీడీపీ బినామీలకు ఆ భూములను రాసిచ్చేందుకే పరిధిని భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసమే రేషనలైజేషన్ ముసుగులో ఈ భారీ స్కామ్‌కు పాల్పడ్డారని, దీనివల్ల పోర్టుల అభివృద్ధి దెబ్బతినడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల పరం కానున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ సర్వీస్ నుంచి రిలీవ్
సాక్షి,విజయవాడ: సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీయస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సర్వీస్ నుంచి రిలీవ్ చేసింది. జూన్ 30న సూపర్ యాన్యువేషన్తో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే,సస్పెన్షన్‌లో ఉండగానే పీవీ సునీల్ పదవీ కాలం ముగిసిపోవడం గమనార్హం.గత రెండేళ్లుగా పీవీ సునీల్‌పై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర కక్ష సాధింపునకు పాల్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండేళ్ల కాలంలో ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనబెట్టి చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది. చివరికి సస్పెన్షన్ కాలంలోనే ఆయన పదవీ కాలం కూడా ముగిసిపోయింది. పీవీ సునీల్ కుమార్ సర్వీస్ నుండి రిలీవ్ అయినప్పటికీ, ఆయనపై పెండింగ్‌లో ఉన్న వివిధ శాఖాపరమైన, క్రిమినల్ విచారణలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
దోపిడీతో అడ్డంగా దొరికిపోయారు.. అయ్యో ఇప్పుడెలా
-
అమరావతిపై నేను చేసిన వీడియోలు అన్ని డిలీట్ అయిపోయాయి..
-
కూటమికి మరో కొత్త చిక్కు.. ఎల్లో మీడియా బొక్కబోర్లా!
రాజకీయాలలో కొన్నిసార్లు మనం ఏదైతే పాజిటివ్ అనుకుంటామో, అదే నెగిటివ్ అవుతుండవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అలాంటి ఒక చిక్కునే ఇప్పుడు ఎదుర్కుంటున్నది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వం తన కార్యాలయాల కాంప్లెక్స్‌లు నిర్మించడానికిగాను 2534 కోట్లు మంజూరు చేసింది. ఇది మంచిదే. దీనిని వరంగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది.అమరావతిలోనే కేంద్రం ఈ భవనాలు నిర్మించబోతోందని, దానికి గాను డబ్బు కూడా వస్తుందని ఆ మీడియా ఎగిరి గంతేసింది. దానికి అభ్యంతరం లేదు. అయితే కేంద్రం నిర్మాణ వ్యయానికి, రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాలయాల నిర్మాణానికి వెచ్చిస్తున్న ఖర్చుకు మధ్య హస్తిమశకం అంత అంటే దాదాపు నాలుగురెట్ల తేడా ఉండడంతో కూటమి పెద్దలకు తల బొప్పి కట్టినంత పని అవుతోంది. గుక్క తిప్పుకోలేని పరిస్థితిగా మారింది. దీనిపై వివరణ ఇవ్వలేక ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది.నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో తన కార్యాలయాలకోసం భవనాలు నిర్మించుకుంటుంది. ఉమ్మడి ఏపీలో రాజధాని హైదరాబాద్‌లో కేంద్రం ఎప్పుడో సెంట్రల్ కాంప్లెక్స్‌లు నిర్మాణం చేసుకుంది. అలాగే ఆర్బీఐ శాఖను, ఇతర ముఖ్యమైన ఆఫీస్‌లను ఏర్పాటు చేసుకుంది. అదేమీ కొత్త విషయం కాదు. అమరావతిలో సైతం ఇలాగే బిల్డింగ్‌ల నిర్మాణానికి 2018లోనే సుమారు 25 ఎకరాల భూమిని కేంద్రం తీసుకుంది. దానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేయగా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే కేవలం పాతిక ఎకరాల విస్తీర్ణంలో సుమారు 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలను కేంద్రం చేపడితే, రాష్ట్ర ప్రభుత్వం 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టింది.కేంద్ర ప్రభుత్వం తన ఆఫీస్‌లను ఐదున్నర ఎకరాలలో నిర్మిస్తోంది. ఇందుకోసం 1299 కోట్లు ఖర్చు అని అంచనా వేసింది. అంటే చదరపు అడుగుకు 5567 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. అలాగే సిబ్బంది నివాసాలకుగాను 17 ఎకరాలలో 1234 కోట్లే వెచ్చించబోతున్నారట. చదరపు అడుగుకు 3945 రూపాయలు అవుతుందన్నమాట. కేవలం పాతిక ఎకరాలలోనే కేంద్రం ఇంత భారీ భవంతులు నిర్మిస్తున్నప్పుడు ఏపీ ప్రభుత్వం వేల ఎకరాలలో నిర్మాణాలు అంటూ హడావుడి ఎందుకు చేస్తోంది? రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాల భూములు సేకరించడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది? అన్నది ఒక పాయింట్ అయితే చదరపు అడుగుకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇరవైవేల రూపాయలకు పైగా వ్యయం చేయబోతున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది.మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని అంగీకరించారు. తమవి ఐకాన్ భవనాలు కనుక అంత వ్యయం అని ఆయన సమర్థించుకునే యత్నం చేశారు. హాపీ నెస్ట్, గెజిటెడ్ అధికారుల భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు నాలుగువేల రూపాయల లోపే ఖర్చు అవుతోంందని అంటున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సచివాలయ భవనాలను నిర్మిస్తున్నందున వ్యయం ఎక్కువగా కనిపిస్తోందని, నాణ్యత, ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు. అంటే తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న ఇతర భవనాలు అంత నాణ్యత ఉండవని ఆయన అంటున్నారా? ఎంత ఐకానిక్ భవనాలు అయినా చదరపు అడుగుకు 20వేల రూపాయల స్థాయిలో ఖర్చు అవసరమా? అంటే ఎవరు జవాబు ఇవ్వాలి.ఏపీ ప్రభుత్వం సచివాలయ భవనాల అద్దాలకు పెట్టే 2500 కోట్లతో కేంద్రం మొత్తం బిల్డింగ్ లనే పూర్తి చేస్తుందన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా వ్యయం చేస్తోందన్న విషయం అందరికి తెలిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం బిల్డింగ్లు కట్టడం తమకు పాజిటివ్ అవుతుందని, గొప్పగా ప్రచారం చేసుకోవచ్చని అనుకుంటే, అది కాస్త చంద్రబాబు ప్రభుత్వానికి నెగిటివ్‌గా, తమ గుట్టు మొత్తం బయటపెట్టేదిగా మారిందన్న అభిప్రాయం ఏర్పడింది. దీనిని కవర్ చేయడానికి ఎల్లో మీడియా నానా పాట్లు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఖర్చు తేడాపై ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయారు.ఎనిమిదివేల మంది ఉద్యోగులకుగాను కేవలం రెండు టవర్లు కేంద్రం నిర్మించాలని తలపెట్టింది. ఏపీ సచివాలయానికి సంబంధించి మూడువేల మంది సిబ్బంది ఉంటారేమో! ఇతరత్రా శాఖల హెడ్ ఆఫ్స్ డిపార్ట్మెంట్ల సిబ్బంది సంఖ్యను తీసకున్నా మరో నాలుగైదువేల మంది ఉంటారేమో తెలియదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో సిబ్బంది అంతా ఒకే చోట ఉండవలసిన అవసరం లేదు. పైగా వర్క్ ఫ్రం హోమ్ వంటివాటిని ప్రవేశపెట్టాలని కూడా గతంలో ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ పరిస్థితిలో 39 అంతస్తుల టవర్లను నాలుగింటిని, 49 అంతస్తుల టవర్ ఒకదానిని 1500 ఎకరాలలో అమరావతిలో ఎందుకు నిర్మిస్తున్నట్లో ఎవరికి అంతుపట్టదు.అలాగే అసెంబ్లీ భవనం కూడా పార్లమెంటు కన్నా పెద్దదిగా ఉంటుందేమో తెలియదు కాని, ఖర్చు మాత్రం పార్లమెంటు భవన వ్యయాన్ని మించి పోతుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే రాష్ట్రం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోందని కేంద్రమే పరోక్షంగా చెప్పినట్లు అనిపించడం లేదా! అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం, హామీలు అమలు చేయలేక చేతులెత్తేసే స్థితిలో ఉన్న రాష్ట్రం ఈ రకంగా భారీగా ధన దుర్వినియోగం చేయడం కరెక్టేనా అన్న ప్రశ్న వస్తుంది. ఒక్క సచివాలయ భవనాలకే కాదు.. అసెంబ్లీ, హైకోర్టు, ఉన్నతాధికారుల నివాసాలు ఇలా ఏవి చూసుకున్నా ఖర్చు తడిసి మోపెడు అవుతోందన్నమాట.హైకోర్టు ప్రాంగణంలో సదుపాయలకోసం 500 కోట్లు, సచివాలయాల మౌలిక సదుపాయాలకు 2900 కోట్లు.. ఇలా రకరకాల రూపాలలో ఖర్చు చేయడం అవసరమా? విశేషం ఏమిటంటే కేంద్రం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతిలో తన భవన నిర్మాణాలు చేపడుతోందని ఎల్లో మీడియానే రాసింది. అలాంటప్పుడు రాష్ట్రం నిర్మించే భవనాల ప్రత్యేకత ఏమి ఉంటుంది? మరో సంగతి చెప్పాలి. తెలిసి, తెలిసి ఎవరైనా వరదలు వచ్చే ప్రదేశాలలో నిర్మాణాలు చేపడతారా? భూమి స్వభావం భారీ భవంతులకు అంత అనువు కాదని నిపుణులు చెబుతున్నా మొండిగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.అంతా కలిపి ఏభై కిలోమీటర్ల దూరం ఉంటుందో, ఉండదో కాని, ఇక్కడ వాగులపై 69 వంతెనలు నిర్మిస్తామని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారు. ఒకప్పుడు ఇది వరద ప్రాంతం అని, ఇక్కడ రాజధాని నిర్మాణాలు వద్దని ప్రపంచ బ్యాంకు కూడా చెప్పిందని గతంలో ఒకసారి ఈయనే వెల్లడించారు. అప్పట్లో ప్రపంచ బ్యాంక్ పలు సందేహాలు వ్యక్తం చేసినా, ఈ టరమ్‌లో మాత్రం కేంద్రంలోని ప్రభుత్వ ప్రభావంతో అదే బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. వివిధ ఆర్థిక సంస్థలు అన్నీ కలిపి ఇప్పటికే 47వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణం అంతా రాష్ట్ర ప్రజలంతా భరించాల్సిందే. ఈ వ్యయ ప్రయోజనం మాత్రం 30 గ్రామలవారికే అధికంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రజలలో నెలకొంది.ఇది ఇలా ఉండగా, ఏపీ కూటమి సర్కార్ కనీస నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. తాము అడిగినట్లు భూములు ఇవ్వాల్సిందేనంటూ ఉండవల్లి, పెనుమాక తదితర కొన్ని గ్రామాల రైతులను ప్రభుత్వం వేదిస్తోంది. ఉండవల్లి ప్రాంత రైతులు సభలు పెట్టుకుని ఈ అంశంపై పోరాడుతున్నారు. వారు ప్రపంచ బ్యాంకుకు ఒక ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం భూముల విలువకు సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చే సమయంలో తక్కువ చేసి చూపుతున్నారని, అప్పులు పొందడానికి మాత్రం పలు రెట్ల మేర అధికంగా చూపిస్తున్నారని వారు వివరించారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ అధికారులు సీ.ఆర్.డీ.ఏ ని కోరుతూ లేఖ రాశారట.ప్రపంచ బ్యాంక్‌కు ఇచ్చిన నివేదికలో గజం నలభైవేల నుంచి ఏభైవేల రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంటే ఎకరం ఏకంగా 25 కోట్ల రూపాయలుగా నిర్ధారించారని, కాని తమకు భూ సేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వడానికి ఎకరా విలువ 25 లక్షల రూపాయలుగా చెబుతున్నారని ఆ రైతులు ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. నిజానికి 2014 టైమ్ నాటికే ఉండవల్లిలో భూముల విలువ రెండున్నర కోట్లు ఉండగా, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పది కోట్ల నుంచి 30 కోట్లు ధర పలుకుతోందని రైతులు తెలిపారు.దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. అప్పులు తీసుకోవడానికి అధిక విలువ చూపించే ప్రభుత్వం రైతులకు పరిహారం విషయంలో మాత్రం అతి తక్కువ రేటు చూపుతోందనే కదా! ప్రభుత్వం కనీస నిజాయితీగా లేదనే కదా రైతుల ఆరోపణ. తమ పంతం నెరవేర్చుకునేందుకు రైతులను ఇలా నష్టపరుస్తారా? ఒకవైపు కేంద్రం నిర్మాణ ధరలకన్నా నాలుగు రెట్లు ఎక్కువ వ్యయం చేయడం, మరో వైపు దారుణమైన రీతిలో తక్కువ ధరకు రైతుల భూములు కొట్టేయాలని చూడడం ఏ పాటి ధర్మం అవుతుంది?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘మేఘా’కు 300 ఎకరాలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి అత్యంత చేరువలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద జయంతిపురంలో రూ.కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని మేఘా గ్రూపునకు కారుచౌకగా కట్టబెడుతూ చంద్రబాబు సర్కారు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) గ్రూపునకు చెందిన ఐకామ్ టెలీ లిమిటెడ్ రూ.895 కోట్లతో నెలకొల్పే రక్షణ రంగ ఉత్పత్తుల యూనిట్‌కు చౌకగా భూములతో పాటు కీలక మౌలిక వసతులను కల్పించనుంది. సీఆర్డీఏ పరిధిలో ఉండే ఈ భూములను ఎకరం రూ.10 లక్షలు చొప్పున 300 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.నాలుగు కోట్ల పైనే పలుకుతోంది. సుమారు రూ.1,200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.30 కోట్లకే కట్టబెట్టడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. ఆ స్థలానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా రహదారి మార్గం కల్పించడంతోపాటు జగ్గయ్యపేట మున్సిపల్ వాటర్ స్కీం నుంచి 425 కేఎల్డీ నీటి సరఫరా, 4.25 ఎంవీఏ సామర్థ్యంతో విద్యుత్ సరఫరా సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చనుంది. ఇక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దత్తులూరు వద్ద మిసైల్ తయారీ, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు 300 ఎకరాలు కేటాయిస్తూ మరో ఉత్తర్వు జారీ అయింది. విజయనగరంలో పతంజలి గ్రూపు ఏర్పాటు చేస్తున్న హెర్బల్ పార్కుకు ఎకరం రూ.3 లక్షల చొప్పున 70 ఎకరాలు కేటాయిస్తూ మరో ఉత్తర్వు వెలువడింది. తొలి దశ పూర్తయితే మరో 100 ఎకరాలు ఇస్తారు.రియల్ ఎస్టేట్ వ్యాపారానికీ ప్రోత్సాహకాలు!మరోవైపు ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గృహ సముదాయాన్ని 6.11 ఎకరాల్లో ఏర్పాటుచేయనుంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.95 కోట్లతో మౌలిక వసతులు కల్పించనుంది. అలాగే బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సరళ ఏవియేషన్‌కు అనంతపురం జిల్లా తిమ్మసముద్రం వద్ద 150 ఎకరాలు, నెల్లూరు దత్తులూరు వద్ద ఆండ్రోన్ సిస్టమ్స్‌కు 349.95 ఎకరాలు, అనంతపురం తిమ్మసముద్రం వద్ద స్పేస్ఫీల్డ్ సంస్థకు 120.76 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడి అప్రజాస్వామికం
తాడేపల్లి రూరల్: పొలాలకు దారులు మూసేయడం, రిజర్వాయర్ల పేరిట 30 నుంచి 40 అడుగుల లోతున గోతులు తవ్వి పంటలను ముంచేయడం వంటి ప్రభుత్వ అరాచకాలను చూపించడానికి తామే వైఎస్సార్సీపీ ప్రతినిధులను పెనుమాక గ్రామానికి ఆహ్వానించామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. అవసరమైతే వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. తమ సమస్యలు దేశానికే కాదు, ప్రపంచానికి తెలియాలంటే ఇలాంటి వారి సహకారం అవసరమని చెప్పారు.అమరావతిలో ప్రభుత్వ అరాచకానికి గురవుతున్న రైతుల పొలాలను పరిశీలించడానికి బాధిత రైతుల ఆహ్వానం మేరకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులను శనివారం ఉండవల్లి సెంటర్లో టీడీపీ గూండాలు అడ్డుకుని దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, చంద్రబాబు ప్రభుత్వం తమను ఏ విధంగా వేధిస్తోందో వివరించారు. రైతులకు రాజకీయాలతో సంబంధం లేదని, తమకు న్యాయం చేసే ఏ పార్టీ వారినైనా కలుస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కమిటీని అధికార పార్టీ అడ్డుకుని దాడులకు తెగబడటం అమానుషం, అప్రజాస్వామికమని మండిపడ్డారు. అమరావతిలో జరుగుతున్న దారుణాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందన్నారు. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం ల్యాండ్ పూలింగ్ చట్టం గడువు 2015 ఫిబ్రవరి 28 నాటికే ముగిసిందని, ఆ తర్వాత భూ సేకరణ మాత్రమే చేయాలని తెలిపారు. కానీ, చట్టవిరుద్ధంగా ఇప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ కిందే భూములు లాక్కుంటామని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పరిహారం రూ.5 లక్షలు, రూ.10 లక్షలే వస్తుందని భయపెడుతున్నారని, భూములు ఇవ్వని రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని తెలిపారు.రిజిస్ట్రేషన్లు ఆపేశారని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు ఏవీ అందకుండా చేసి రైతులను ఆర్థికంగా, సామాజికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి ప్రభుత్వ సాయం లేకపోయినా 60 ఏళ్లుగా మూడు పంటలు పండించే అద్భుతమైన భూమిని ధ్వంసం చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా, అలైన్మెంట్లు మార్చినా తగ్గేదే లేదని, ప్రభుత్వ చట్టవిరుద్ధ విధానాలపై పోరాడతామని గట్టిగా చెప్పారు. వైఎస్సార్సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీని మళ్లీ ఇక్కడికి రప్పించి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అమరావతి రైతులు హెచ్చరించారు. రైతులు ఇంకా ఏం మాట్లాడారంటే.. రోడ్ల అలైన్మెంట్లు మారుస్తూ కుట్రలు రోడ్ల అలైన్మెంట్లు మా పొలాల మీదుగా మార్చేస్తూ కుట్రలు చేస్తున్నారు. ఒక వ్యక్తి పొలం ఇవ్వగానే దాన్లో రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డును పక్క భూమిలోకి జరిపేస్తున్నారు. ఆ రైతును బెదిరించి పొలం తీసుకోగానే, దాని పక్కన ఎవరైతే భూమి ఇవ్వలేదో వారి పొలంలోకి వెళ్తున్నారు. ఇలా రైతుల భూమి ఇవ్వక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. వందల ఏళ్ల నాటి పాత రోడ్లను మూసేశారు. కరెంట్ స్తంభాలు పడగొట్టారు. అమరావతిలో ఏదో జరుగుతోందని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగేది రెండే రెండు... ఒకటి కంప చెట్లు కొట్టడం, రెండోది నీళ్లు ఎత్తి పోయడం. వేరే ఏమీ లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటూ ఇటూ తప్ప లోపల ఎక్కడా ఎటువంటి అభివృద్ధీ లేదు.అంతా మోసపూరితం ప్రభుత్వం తీరు అంతా మోసపూరితమే. పొలాలు ఇవ్వమని అడుగుతున్నారు కానీ ప్లాట్లు ఎక్కడిస్తారో క్షేత్రస్థాయిలో చూపించరు. అంతా కాగితాల మీదే. పైగా ల్యాండ్ పూలింగ్ నిబంధనల్లో ‘అవసరమైతే ఈ ఇచ్చిన భూమిని కూడా మళ్లీ గవర్నమెంటే తీసుకుంటుంది‘ అని ఉంది. అంటే 70 శాతం ఉచితంగా తీసుకుని, మిగిలిన 30 శాతం కూడా ఇవ్వకుండా లాగేసుకుంటారా? ఈ విషయాన్ని నిబంధనల్లో ఎందుకు స్పష్టంగా పెట్టలేదు? గ్రామసభలు పెడితే అవి భూములు ఇవ్వని రైతుల కోసమా, ఇచ్చిన వారి కోసమా అనే క్లారిటీ అధికారులకే లేదు.సాయంత్రం 6 గంటలకు నోటీసు ఇచ్చి, మరుసటి రోజే మీటింగ్ అంటే అభ్యంతరాలు ఎలా చెప్పగలుగుతారు? ఏదైనా సమస్య వస్తే డిప్యూటీ కలెక్టర్‌ను అడిగితే ఆయనకేం తెలియదని, పొలం ఇస్తే తీసుకుంటామని అంటారు. కమిషనర్‌ను అడిగితే ఆయనకేమీ తెలియదని అంటారు. ఏమీ తెలియని కమిషనర్ ఇక్కడికి వచ్చి రైతులకు ఏం చెబుతారు? పార్లమెంట్ ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇష్టం వచ్చినట్లు భూములు లాక్కోవడానికి వీల్లేదు. ఆ చట్టాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించి, మమ్మల్ని వేధింపులకు గురిచేస్తోంది. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన భూములే తీసుకుంటానని, ఇవ్వని వారి జోలికి పోనని చంద్రబాబు ప్రమాణం చేశారు. మరి ఇప్పుడు అధికారులు ఆయనకు తెలియకుండానే నోటీసులు ఇస్తున్నారా? వీటిపై పాలకులు, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. – కొండమడుగుల రాఘవరెడ్డి, పెనుమాకక్షేత్రస్థాయిలో మా సమస్యలు చూపించాలని రమ్మన్నాం ఉండవల్లి, పెనుమాక, ఎర్రపాలెం, నిడమర్రు గ్రామాల రైతులమంతా కలిసి 25 రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మా సమస్యలన్నీ వివరించాం. అండగా నిలవాలని అభ్యర్థించాం. మాకు అండగా ఉండటానికి లీడర్లు, లాయర్లతో ఒక టీమ్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ 2024లోనే రోడ్లకి క్లియర్ చేసి మా పొలం మాకు విడిచిపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా పొలాల్లోకి మమ్మల్ని వెళ్లనీయడంలేదు. పొలాల చుట్టూ చెరువు తీస్తోంది. ఈ దారుణాలన్నీ చూపించాలనే మేము వైఎస్సార్సీపీ బృందాన్ని రమ్మన్నాం. కానీ వైఎస్సార్సీపీ నాయకులను అమరావతి రాకుండా అధికార పార్టీ అడ్డుకున్నదంటే ఇక్కడ జరుగుతున్న తప్పులు బయటపడకుండా, వాటిని కప్పిపుచ్చుకోవడానికే రానివ్వట్లేదని అర్థం. – మేకా వెంకటరెడ్డి, పెనుమాక కోర్టు ఆదేశానుసారం పరిహారం ఇవ్వకపోగా, నోటీసులిచ్చారు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2015 ఫిబ్రవరి 28తో ముగిసిపోయినా, ఇప్పటికీ పూలింగ్‌లోనే తీసుకుంటాం అంటున్నారు. భూములు ఇవ్వని వాళ్లను వేధిస్తున్నారు. ప్రభుత్వం కోర్టులో కేసు ఉపసంహరించుకొనే సమయంలో 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లుగా రిజి్రస్టేషన్లు ఆపేసి, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా నష్ట పరిచినందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్‌కి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఆ పరిహారం ఇవ్వకపోగా మళ్లీ భూ సేకరణ నోటీసులు ఇచ్చారు. అసలు మొదటి డీపీఆర్ ప్రకారం ఉండవల్లి, పెనుమాక అమరావతి పరిధిలోనే లేవు. చివర్లో యాడ్ చేసి మా భూములను లాక్కుంటున్నారు. సీఆర్డీఏ అధికారులు అక్విజిషన్ గురించి చెప్పకుండా, మళ్లీ పూలింగ్ గురించే మాట్లాడుతున్నారు. –నవీన్, పెనుమాక మా గొంతు నొక్కాలని చూస్తే భయపడంమా పొలాల పక్కన రిజర్వాయర్ల పేరుతో 40 అడుగుల లోతున గుంతలు తవ్వేస్తున్నారు, రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీములు అందకపోయినా, ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వ్యవసాయం చేస్తున్నాం. కేవలం 10 అడుగుల్లోనే భూగర్భ జలాలు ఉన్న అత్యంత సారవంతమైన భూమి ఇది. 60 ఏళ్లుగా ఇక్కడ మూడు పంటలు పండిస్తూ అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పటికే రాజధాని కోసం 50 వేల ఎకరాలు తీసుకున్నారు. అక్కడ రాజధాని కట్టుకోండి. అంతేకానీ, సారవంతమైన భూములను ధ్వంసం చేయొద్దు. మా గొంతు నొక్కాలని చూసినా భయపడం. పోరాడుతూనే ఉంటాం. –శ్రీకాంత్, పెనుమాక


