సాక్షి, తాడేపల్లి: గతంలో వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారని.. అధికార దుర్వినియోగంతో ఇప్పుడు ఆ కేసులన్నీ మాఫీ చేయించుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
చంద్రబాబు అవినీతి, అక్రమాలతో వేల కోట్లు దోచుకున్నారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఆధారాలతో సహా సీఐడీ కేసులు నమోదు చేసింది. అలాంటి కేసులన్నింటినీ ఇప్పుడు చంద్రబాబు మాఫీ చేసుకుంటున్నారు. అధికారులను బెదిరించి కేసులను విత్ డ్రా చేయిస్తున్నారు. లిక్కర్ కేసులో ప్రివిలేజ్ ఫీజు విషయంలో వేల కోట్లు ఖజానాకు రాకుండా చేశారు. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి
👉ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చేసి తమవారి భూములు పోకుండా జాగ్రత్త పడ్డారు. ఫైబర్ నెట్ లో రూ.350 కోట్లు అవకతవకలు చేశారు. సీఐడీ కూడా ఆధారాలతో పట్టుకుంది. అసైన్డ్ భూముల కుంభకోణంతో పేదల పొట్ట కొట్టారు. రూ.4,239 కోట్ల విలువైన భూమిని టీడీపీ నేతలు కొట్టేశారు. రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కూడా కొట్టేసినట్టు సీఐడీ గుర్తించింది..
👉.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబే 13 చోట్ల నోట్ ఫైల్ మీద సంతకాలు పెట్టారు. రూ.372 కోట్లు కొట్టేసినట్టు సీఐడీ గుర్తించింది. ఈ కేసులో అరెస్టు అయి బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సీఎం హోదాలో బెదిరించి అధికారులను బెదిరించి కేసులు విత్ డ్రా చేయిస్తున్నారు
👉ప్రశ్నిస్తానన్న పవన్ ఈ కేసులపై ఎందుకు ప్రశ్నించటం లేదు?. పవన్ వలన దమ్మిడి లాభం లేనప్పుడు విమానాల్లో తిరగటం ఎందుకు?. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు పెట్టించుకోవటం ఎందుకు?. అవినీతి, అరాచకాలను ప్రశ్నించలేనప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు పవన్?
👉తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ హిందువుల మనోభావాలను చంద్రబాబు తీశారు. వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు అద్భుతంగా పని చేసింది. అలాంటి వ్యక్తిని విచారణ పేరుతో సీఐడీ వేధిస్తోంది.
👉ఏవీఎస్వో సతీష్ అనుమానాస్పదంగా చనిపోతే మా పార్టీ వారి మీద దారుణమైన ఆరోపణలు చేశారు
👉రాజధానిలో దారుణమైన అవినీతి జరుగుతోంది. వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. నేషనల్ హైవేల కంటే ఎక్కువ ధరకు రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు

పశ్చిమ ప్రకాశంలో తాగు, సాగు నీరు లేక జనం అల్లాడిపోతుంటే చంద్రబాబుకు కనపడటం లేదు. వైఎస్సార్ ఫ్యామిలీ వెలిగొండ ప్రాజెక్టును తీసుకువస్తే దాన్ని కూడా చంద్రబాబు ముందుకు పోనివ్వటం లేదు. టెండర్లలో భారీ అవినీతికి పాల్పడుతున్నారు. నీళ్లు ఇస్తామంటూ నిధులు తోడుకుంటున్నారు. రూ.17 కోట్లు దోచుకున్నారు. ఇలాంటివి ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఏపీ పోలీసు వ్యవస్థ దేశంలో నే అట్టడుగున ఉంది. దాన్నిబట్టే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారాయన.


