సాక్షి,అనంతపురం: టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు మరోసారి వివాదాస్పద ఘటనలో చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ చేసిన ఫిర్యాదు ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చింది.
ఫిర్యాదు ప్రకారం, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు ఎగ్జిబిషన్ నిర్వహణ కోసం 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. నిర్వాహకుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, వారు మద్యం సేవించి ప్రాంగణంలో హంగామా సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హంగామా సమయంలో ఎగ్జిబిషన్ సిబ్బందిపై దాడి జరగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సిబ్బంది భయాందోళనకు గురయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిర్వాహకుడు ఫకృద్దీన్ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్ద అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం ఆయన గన్‌మెన్ షేక్షావలి బెదిరింపులు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


