విజయవాడ: ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీల అంశానికి సంబంధించి మండలి చైర్మన్ మోషేన్ రాజు విచారణ చేపట్టారు. ఏపీ శాసనమండలిలో చైర్మన్‌తో ఇద్దరు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. చైర్మన్‌తో ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌లు సమావేశమయ్యారు.
గతవారం ఫిరాయింపు ఎమ్మెల్సీలకు ఏపీ మండలి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25, 26న విచారణకు హాజరవ్యాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
ప్రలోభాలకులోనై ఫిరాయించారనే వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు నేపధ్యంలో విచారణకు రావాలని మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. బల్లి కల్యాణ చక్రవర్తి, జయ మంగళ వెంకట రమణ, మర్రి రాజశేఖర్, పద్మ శ్రీ, సునీతలకు నోటీసులు జారీ అయ్యాయి. వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, కానీ రాజీనామాలు చేసి టీడీపీలో చేరారు. దీనిపై మండలి చైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేయగా, వారికి నోటీసులు జారీ చేసిన అనంతరం విచారణ చేపట్టారు.


