రఘురామను అరెస్ట్‌ చేయాల్సిందే: సునీల్‌ కుమార్‌ డిమాండ్‌ | IPS Sunil Kumar Demand On Raghu Rama Krishna Raju Arrest | Sakshi
Sakshi News home page

రఘురామను అరెస్ట్‌ చేయాల్సిందే: సునీల్‌ కుమార్‌ డిమాండ్‌

Feb 26 2026 1:20 PM | Updated on Feb 26 2026 3:36 PM

IPS Sunil Kumar Demand On Raghu Rama Krishna Raju Arrest

సాక్షి, అమరావతి: ఐపీఎస్‌ అధికారి ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ మరో సంచలన ట్వీట్‌ చేశారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీబీఐని ట్యాగ్ చేస్తూ సునీల్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.

ఈ సందర్బంగా  ట్విట్టర్‌ వేదికగా.. ఇక, అంతకుముందు ఐపీఎస్‌ సునీల్‌ నాయక్‌.. తనను తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందిగా రఘురామ బెదిరించారని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అదే ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. బ్యాంకులను మోసం చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును వెంటనే అరెస్టు చేయాలన్నారు. సునీల్ నాయక్‌నే బెదిరించారంటే ఇక సీబీఐ కేసుల్లోని సాక్షులను కూడా రఘురామ బెదిరిస్తారని అన్నారు. అందుకు అవకాశం ఉందన్నారు.

అందుకే ఇలాంటి పరిస్థితుల్లో సాక్షులను రక్షించడానికి నిందితుడు రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేయటమే సరైన మార్గం. ఈ విషయాలపై సీబీఐ దృష్టి సారించాలని దర్యాప్తు సంస్థను కోరారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే రఘురామపై రూ.947 కోట్లు, రూ.238 కోట్లు ఎగ్గొట్టారనే రెండు కేసులపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీల్‌ కుమార్‌ వ్యాఖ్యలు చేశారు.

రఘురామను అరెస్ట్ చేయాలి.. IPS PV సునీల్ కుమార్ సంచలన ట్వీట్

Advertisement
 
Advertisement
Advertisement