వివాహ వేడుకలో వైఎస్‌ జగన్‌.. కొత్త జంటకు ఆశీర్వాదం | YS Jagan Nellore Visit Updates | Sakshi
Sakshi News home page

వివాహ వేడుకలో వైఎస్‌ జగన్‌.. కొత్త జంటకు ఆశీర్వాదం

Feb 26 2026 9:30 AM | Updated on Feb 26 2026 3:25 PM

YS Jagan Nellore Visit Updates

సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మాజీ ఛైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నేత కొండూరు అజయ్‌ రెడ్డి (రైల్వే కోడూరు) కుమారుడి  వివాహ వేడుకకు వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు సిద్దు సుష్మా, ప్రతుల్య రెడ్డిలను వైఎస్‌ జగన్‌ ఆశీర్వదించారు. వారిద్దరికీ  వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

ఇక, అంతకుముందు.. వైఎస్‌ జగన్‌ నెల్లూరుకు చేరుకున్న సందర్బంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. దీంతో, భారీ జనసందోహానికి అభివాదం చేస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు.  

Nellore: కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement