హెర్నియా ఆపరేషన్‌కి రూ. 11 లక్షలా? నెటిజన్లు గగ్గోలు | Rs 11 lakh for a hernia surgery? Patients Mumbai hospital bill leaves netizens stunned | Sakshi
Sakshi News home page

హెర్నియా ఆపరేషన్‌కి రూ. 11 లక్షలా? నెటిజన్లు గగ్గోలు

Jul 17 2026 11:47 AM | Updated on Jul 17 2026 12:08 PM

Rs 11 lakh for a hernia surgery? Patients Mumbai hospital bill leaves netizens stunned

సాక్షి,ముంబై: ఇప్పటిదాకామనం అమెరికా వైద్య ఖర్చులు గురించిన కథనాలు చదివాం. ఇపుడు మన దేశంలోనే ఒక మామూలు ఆపరేషన్‌ కోసం ఏకంగా రూ. 11.04 లక్షల బిల్లు గురించి తెలుసుకుంటూ ఔరా అనాల్సిందే.  భారతదేశంలోని మెట్రో నగరాల్లో సామాన్యుడికి వైద్యం ఎంత భారంగా మారుతుందో, అలాగే మెడికల్ బిల్లింగ్ విధానంలో పారదర్శకత ఎంత అవసరమో స్పష్టం చేస్తోంది. 

ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో సాధారణ హెర్నియా శస్త్రచికిత్స (Hernia Surgery) చేయించుకున్న ఒక రోగికి ఏకంగా రూ. 11.04 లక్షల బిల్లు రావడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 'నిఖిల్ ఝా' అనే ఎక్స్  యూజర్  షేర్‌ చేసిన వివరాల ప్రకారం  ఫాలోవర్ ఒకరు ముంబైలో 'ఇంగువినల్ హెర్నియా' సర్జరీ చేయించుకున్నారని అంటూ దానికి సంబంధించిన ఇన్సూరెన్స్‌  క్లెయిమ్‌ ఇతర  వివరాలను పంచుకున్నారు.  కేవలం నాలుగు రోజులు(జూలై 6  నుంచి 10 వరకు)ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉన్నారు. ఈ ఆపరేషన్‌ కోసం ఆసుపత్రి బిల్లు అక్షరాలా రూ. 11,04,100. ఇందులో ఇన్సూరెన్స్ సెటిల్‌మెంట్: రూ. 4,64,000 మాత్రమే క్లెయిమ్  వచ్చింది. దీంతో అవాక్కవ్వడం వారి వంతైంది.

ఒక చిన్న హెర్నియా సర్జరీకే ఇంత ఖర్చయితే, పెద్ద పెద్ద సర్జరీల పరిస్థితి ఏంటి? ముంబైలో ఆసుపత్రిలో చేరడం నేరమా? అంటూ ప్రశ్నించారు. నాణ్యమైన వైద్యం కేవలం ధనవంతులకు మాత్రమేనా? అటూ  నిఖిల్ ఝా  సోషల్‌ మీడియా వేదికగా  ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌


 

నెటిజన్లు ఏమన్నారంటే? 
ఈ పోస్ట్‌పై నెటిజన్లు, వైద్యులు రకరకాలుగా స్పందించారను. ఒక వైద్యుడు స్పందిస్తూ, "హెర్నియా సర్జరీకి రూ. 11 లక్షలా? ఇందులో ఏమైనా హెలికాప్టర్ పికప్ అండ్ డ్రాప్ సౌకర్యం కూడా ఉందా?" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సూరత్‌లో రూ. 1.5 లక్షలకే అయ్యే ఈ సర్జరీకి, ముంబైలో రూ. 11 లక్షలు వసూలు చేయడంపై ఒకరు మండిపడ్డారు. మెట్రో నగరాల్లో పెరిగిపోతున్న వైద్య ఖర్చుల వల్ల అందరి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కేవలం ఈ ఒక్క మెసేజ్ చూసి నిర్ధారణకు రాలేమని, రోగికి ఏ రకమైన రూమ్ కేటగిరీ ఇచ్చారు? ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి ఐసీయూలో ఉంచారా? వంటి వివరాలు 'డిశ్చార్జ్ సమ్మరీ' ,'ఆపరేషన్ నోట్స్' చూస్తేనే క్లారిటీ వస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: 18 ఏళ్ల ఎన్‌ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement