మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌ | Aamir Khan responds to fatwa love jihad allegations after marrying Gauri Spratt | Sakshi
Sakshi News home page

మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌

Jul 15 2026 3:24 PM | Updated on Jul 15 2026 4:14 PM

Aamir Khan responds to fatwa love jihad allegations after marrying Gauri Spratt

బాలీవుడ్‌ హీరో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వ్యవహారంపై సోషల్‌ మీడియాలో దుమారం కొనసాగుతోంది.  జూలై 5న ముంబైలోని తన పాలి హిల్ నివాసంలో అత్యంత సాదాసీదాగా, సన్నిహితుల మధ్య చేసుకున్న గౌరి స్ప్రాట్ (Gauri Spratt)తో జరిగిన పెళ్లి వివాదాలకు దారితీసింది.  దీనిపై లవ్‌ జిహాద్ ఆరోపణలతోపాటు,  ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఒక 'ఫత్వా' జారీ  కావడంపై  ఆమీర్ ఖాన్‌ ఘాటుగా స్పందించారు. ఈ వివాహంపై రాజకీయ, మతపరమైన కోణాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో ఆమిర్ సమాధానమిచ్చారు.

తన చిరకాల స్నేహితురాల్ని  పెళ్లి చేసుకోవడంపై అనేక విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా మహారాష్ట్ర బీజేపీ మంత్రి నితేష్ రాణే ఈ పెళ్లిని "లవ్ జిహాద్" గా అభివర్ణించారు. ఇది ఇలా ఉండగానే ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తాకు చెందిన షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ ఈ పెళ్లికి వ్యతిరేకం షరియా చట్టం ప్రకారం ముస్లిం పురుషుడు ముస్లిమేతర స్త్రీని (ఆమె ఇస్లాంలోకి మారకుండా) వివాహం చేసుకోకూడదని, ఇది చెల్లదని ఆయన పేర్కొన్నారు.

ఆమిర్ ఖాన్ సమాధానం
రెడిఫ్ (Rediff) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.  తన ముగ్గురు భార్యలలో ఎవరూ ఇస్లాంలోకి మారలేదని స్పష్టం చేశారు.  తన వివాహాలన్నీ సివిల్ వివాహాలే (చట్టబద్ధమైన రిజిస్టర్ మ్యారేజ్)అని పేర్కొన్నారు. అలాగే  గౌరి అసలు హిందువు  కానేకాదని ఒక క్రిస్టియన్. పైగా ఆమె మతాచారాలను పాటించే వ్యక్తి కూడా కాదని ఆమిర్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్‌

కలిసికట్టుగా ఉండే కుటుంబం
"మాది చాలా విశాల దృక్పథం ఉన్న కుటుంబం. నా ఇద్దరు సోదరిమణులు హిందువులను వివాహం చేసుకున్నారు. నా కుమార్తె కూడా హిందువునే పెళ్లి చేసుకుంది. నా కజిన్ మన్సూర్ ఒక క్రిస్టియన్‌ను పెళ్లాడాడు" అని  వివరించారు. అంతేకాదు కాలం గడుస్తున్న కొద్దీ జీవితం మరింత హాస్యాస్పదంగా మారుతోందంటూ ఈ వివాదాలపై ఆమీర్‌  చురకలు వేశారు.

ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

కాగా ఆమీర్‌- గౌరి స్ప్రాట్‌ల వివాహానికి దాదాపు 150 మంది అతిథులు హాజరయ్యారు.ముఖ్యంగా ఆమీర్‌ ఇద్దరు భార్యలు రీనా దత్తా, కిరణ్ రావ్‌తోపాటు, పిల్లలు జునైద్, ఇరా, ఆజాద్‌లతో పాటు గౌరి కుమారుడు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 18 ఏళ్ల ఎన్‌ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement