గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్‌.. | Iran Attacks: High Alert On Gulf Countries | Sakshi
Sakshi News home page

గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్‌..

Jul 9 2026 7:28 AM | Updated on Jul 9 2026 8:55 AM

Iran Attacks: High Alert On Gulf Countries

దుబాయ్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. హార్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల అనంతరం అమెరికా ఇరాన్‌పై మరోసారి భారీ వైమానిక దాడులు చేపట్టింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతమంతా హై అలర్ట్‌లోకి వెళ్లింది. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో పలుచోట్ల సైరన్లు మోగాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్ దేశాల్లో హెచ్చరిక సైరన్లు మోగించగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఒమాన్ దేశాలు కూడా తమ వైమానిక రక్షణ వ్యవస్థలను పూర్తి అప్రమత్త స్థితిలో ఉంచాయి.

ఇదిలా ఉండగా అమెరికా దాడుల్లో ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, చాబహార్, జాస్క్, సిరిక్, అబూ మూసా దీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఆగ్నేయ ఇరాన్‌లోని ఇరాన్‌షహర్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఓ అగ్నిమాపక సిబ్బంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ (IRNA) వెల్లడించింది. ఈ ఘటనలో విమానాశ్రయ భవనాలు దెబ్బతిన్నాయి.

ఇక, ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే విధుల్లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది ఖాలెద్ ఖాదేరీ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇక అమల్లో లేదని ప్రకటించారు. ఇరాన్‌పై భీకర దాడులతో అమెరికా సైన్యం విరుచుకుపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement