Hyderabad
-
దంతెవాడ–బీజాపూర్‌లో ఎన్కౌంటర్
సాక్షి, హైదరాబాద్/ సాక్షిప్రతినిధి, వరంగల్/ చర్ల: మావోయిస్టు కీలక నేతలే టార్గెట్‌గా సాయుధ పోలీసు బలగాలు తమ వేట ముమ్మరం చేశాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పట్టు సాధిస్తూ మావోయిస్టుల కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్న బలగాలు నక్సల్స్ ఏరివేతను కొనసాగిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం దంతెవాడ–బీజాపూర్ ప్రాంతంలోని గీడం పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరిహద్దు ప్రాంతాలలో నక్సల్స్ ఉన్నట్టు సమాచారం అందడంతో దంతెవాడ డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ బృందం గాలింపు జరపగా చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో డీకేఎస్జెడ్సీ (దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ) సభ్యుడిగా పనిచేస్తున్న హనుమకొండ జిల్లా మడికొండ పీఎస్ పరి«ధిలోని తరాలపల్లికి చెందిన మావోయిస్టు కీలకనేత అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధాకర్ అలియాస్ సుదీర్ అలియాస్ మురళి మృతిచెందినట్టు దంతెవాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ అధికారికంగా వెల్లడించారు. 1991లో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన సుధాకర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం జనధనసర్కార్ స్కూల్స్ ఇంచార్జిగా కొనసాగుతున్నాడు. తొలుత నర్సంపేట డివిజన్ ఇంచార్జి, తర్వాత ఖమ్మం జిల్లా పరిధిలో కొంతకాలం... తర్వాత బస్తర్‌కు సుధాకర్ వెళ్లినట్టు సమాచారం. డీకేఎస్‌జెడ్‌సీలో కీలకంగా ఉన్న సుధాకర్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు చేసిన పలు కీలక ఆపరేషన్లలోనూ సుధాకర్ పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సారయ్య అంగరక్షకులు బీజాపూర్ జిల్లా బైరాంగర్కు చెందిన పండరు అటరా, మన్ను బర్సాలు కూడా ఎన్కౌంటర్లో మృతిచెందారు. వీరిపై రెండు లక్షల రివార్డు ఉందని ఎస్పీ చెప్పారు. ఘటనాస్థలి నుంచి ఇన్సాస్ రైఫిల్, పాయింట్ 303 రైఫిల్, పేలుడు పదార్థాలు, నిత్యావసరాల వస్తువులను స్వా«దీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. తాజా ఎన్కౌంటర్ మృతులతో కలుపుకుని ఈ ఏడాదిలో ఇప్పటివరకు 116 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు వెల్లడించారు. 100 మందికిపైగా కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టులు 2025 సంవత్సరంలో ఇప్పటివరకు, బస్తర్ రేంజ్లో వివిధ ఎన్కౌంటర్లలో 100 మంది నక్సలైట్లు మృతిచెందారు. డిసెంబర్ 2, 2024లో ములుగు జిల్లా పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కురుసం మంగు, 2024 సెపె్టంబర్ మొదటివారంలో కర్కగూడెం గ్రామానికి అతి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యుడు లచ్చన్న, ఆయన భార్య తులసి అలియాస్ పునెం లక్కీ, పాల్వంచ మణుగూరు ఏరియా కమాండర్ కామ్రేడ్ రాము, పార్టీ సభ్యులు కోసి, సీనియర్ సభ్యులు గంగాల్, కామ్రేడ్ దుర్గేశ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. 2024 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేరు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు సహా మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్ మృతి చెందారు. ఇలా తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నేతల ఏరివేతలోనూ భద్రత బలగాలు రోజురోజుకూ పట్టు సాధిస్తున్నాయి. సీఆర్పీఎఫ్, డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్‌గార్డ్)కు సరిహద్దున తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్ పోలీస్ బలగాల దాడులు ముమ్మరం కావడంతో మావోయిస్టులు ఆత్మరక్షణకే పరిమితం అవుతున్నారు. -
సొరంగంలో మరో మృతదేహం లభ్యం
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ ప్రమాదంలో శిథిలాల కింద కూరుకుపోయిన వారిలో మరొకరి మృతదేహం మంగళవారం లభ్యమైంది. మృతుడిని జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్‌కుమార్ (50)గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సహాయ బృందాలు మనోజ్‌కుమార్ మృతదేహాన్ని సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చాయి. నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన కుటుంబానికి అప్పగించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ సురేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో మనోజ్‌కుమార్ స్వగ్రామం యూపీలోని ఉన్నావ్ జిల్లా బంగార్మావ్ గ్రామానికి తరలించారు. మనోజ్‌కుమార్ 2009 నుంచి జేపీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్వర్ణలత, కుమార్తె శైలజ (24), కుమారుడు ఆదర్శ్ (17) ఉన్నారు. ఎక్స్కవేటర్ ద్వారా తవ్వకాలతో మృతదేహం బయటకు.. సొరంగంలోని 14వ కి.మీ. సమీపంలో ఫిబ్రవరి 22న పైకప్పు కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లలో 8 మంది ఆచూకీ గల్లంతవడం తెలిసిందే. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఈ నెల 9 ఒక మృతదేహాన్ని (గురుప్రీత్‌సింగ్) వెలికితీయగా డీ2 ప్రాంతానికి సుమారు 190 మీటర్ల దూరంలో వెనక వైపు, కన్వేయర్ బెల్టుకు సమీపంలో మనోజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. సొరంగానికి కుడి వైపున కన్వేయర్ బెల్టు ఉండగా బెల్టు సమీపంలో ఇప్పటికే ఒకవైపు నుంచి తవ్వకాలు చేపడుతూ సహాయక బృందాలు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఎడమ వైపున మట్టి వేశాయి. ఎక్స్కవేటర్ సాయంతో అక్కడి మట్టిని తొలగిస్తుండగా మంగళవారం మృతదేహం కనిపించింది. ప్రమాదానికి ముందు లోకో ట్రైన్లో కాంక్రీట్ సెగ్మెంట్లు, సామగ్రిని తీసుకెళ్లారని, ప్రమాద సమయంలో లోకోట్రైన్తో సహా చెల్లాచెదురై వెనక్కి కొట్టుకొచ్చి ఉంటుందని సహాయక సిబ్బంది అంటున్నారు. ఇదే ప్రాంతంలో నాలుగు ఎక్స్కవేటర్ల సాయంతో ముమ్మరంగా తవ్వకాలు, మట్టి తొలగింపు చేపట్టారు. -
బీమా ధీమా లేదు
సాక్షి, హైదరాబాద్: మనదేశంలో వ్యవసాయం అంటే ప్రకృతితో జూదం ఆడినట్లే.. కష్టపడి పండించిన పంట చేతికందుతుందన్న గ్యారంటీ లేదు. అందుకే ప్రభుత్వాలు రైతుల పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తాయి. కానీ, రాష్ట్రంలో బీమా పథకాలు లేకపోవటం, కేంద్ర ప్రభుత్వ బీమా పథకంలో రాష్ట్రం చేరకపోవటంతో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయిన రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు 11,298 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖనే అధికారికంగా తేల్చింది. 13 జిల్లాలలోని 64 మండలాలలో 6,670 ఎకరాలలో వరి, 4,100 ఎకరాలలో మొక్కజొన్న, 309 ఎకరాలలో మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. నష్టంపై నివేదిక వచ్చిన తరువాత పరిహారం చెల్లిస్తామని చెప్పారు కానీ.. ఎప్పటిలోగా రైతులను ఆదుకుంటారో చెప్పలేదు. గతంలో కూడా పంట నష్టం జరిగినప్పుడు ఇలాంటి ప్రకటనలే వచ్చాయి. కానీ, రైతులకు పైసా అందలేదు. ఈ నేపథ్యంలో పంటల బీమాపై మరోసారి చర్చ మొదలైంది. పదేళ్లుగా రైతులకు నిరాశే.. రైతులకు పంటల బీమా అందించే ‘జాతీయ వ్యవసాయ బీమా పథకం’(ఎన్ఏఐఎస్).. కేంద్ర ప్రభుత్వ రా్రïÙ్టయ కృషి బీమా యోజన (ఆర్‌కేబీవై) కింద 2016 వరకు అమలులో ఉండేది. ఈ పథకాన్ని కేంద్రం 1999–2000లో ప్రవేశపెట్టింది. 2016లో కేంద్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై) తీసుకొచ్చింది. కానీ, ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం చేరలేదు. కేంద్ర బీమా పథకం ప్రీమియం ఎక్కువ, వచ్చే పరిహారం తక్కువ అని చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్.. అంతకంటే మంచి పథకాన్ని తెస్తామని చెప్పారు. 2018 నుంచి రైతుబంధు అమలు చేయటంతో ఇక బీమా జోలికి పోలేదు. ఎప్పుడైనా ప్రకృతి వైఫరీత్యాలతో రైతులు నష్టపోతే ఆయా ప్రాంతాల్లో ఎకరాకు కొంత మొత్తాన్ని పరిహారంగా ఇచ్చే పద్ధతిని ప్రభుత్వం చేపట్టింది. ఇది కూడా గత పదేళ్లలో పెద్దగా అమలైన దాఖలాలు లేవు. ప్రభుత్వం మారినప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. మాటలు మాత్రమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరనున్నట్లు తొలుత ప్రకటించింది. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కూడా నిర్వహించారు. దీంతో బీమా పథకం అమలు చేస్తారని రైతులు ఆశించారు. కానీ, చివరికి ఆ హామీ నీటిమూటగానే మిగిలింది. కేంద్ర పథకంలో చేరలేదు.. రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకం కూడా తీసుకురాలేదు. దీంతో పంటలు దెబ్బతింటే రైతులు నష్టపోవాల్సి వస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి పంటల బీమా అమలు చేస్తామని చెప్పినప్పటికీ, ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవలి అకాల వర్షాలకు 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారికంగా ప్రకటించినప్పటికీ, వాస్తవంగా అంతకు రెండింతల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఆరు కేటగిరీల్లో యువ వికాసం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆరు కేటగిరీల్లో రాయితీలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడింటికి బ్యాంకు రుణాన్ని అనుసంధానం చేస్తారు. మరో మూడింటికి ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను.. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారు నేరుగా భరించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన (ఈబీసీ) నిరుద్యోగులకు యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ పథకం పూర్తిస్థాయి మార్గదర్శకాలను మంగళవారం ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు ఈ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హతలివే.. – గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల వార్షికాదాయం, పట్టణ(మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ) ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం ఉన్నవారు అర్హులు. – దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. రేషన్‌కార్డు లేకుంటే తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం వివరాలను ఇవ్వాలి. – వ్యవసాయేతర కేటగిరీలకు దరఖాస్తుదారు వయసు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. – వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు వయసు 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. – ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అర్హత (ఐదేళ్ల సమయంలో స్వయం ఉపాధి పథకాలకు) ప్రాధాన్యతలు: మొదటిసారి ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్(ఈఎస్ఎస్)కు దరఖాస్తు చేసుకునేవారికి, మహిళలకు 25 శాతం (ఒంటరి మహిళ, వితంతువులకు ప్రాధాన్యం), వికలాంగులకు 5 శాతం, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమ కుటుంబాలకు, నైపుణ్యం గల వారికి ప్రాధాన్యం. కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెలంగాణ ఏర్పాటు తర్వాత జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా సంబంధిత యూనిట్లైతే), పట్టాదారు పాసుపుస్తకం (వ్యవసాయ అనుబంధ పథకాలకు), సదెరమ్ సర్టిఫికెట్ (వికలాంగ కేటగిరీ), పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్, అత్యంత పేదలైతే వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ (మండల స్థాయి కమిటీ). దరఖాస్తు విధానం.. తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం (ఓబీఎంఎంఎస్) వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు ఫారం భర్తీ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్తో పాటు అప్లోడ్ చేసిన ధ్రువీకరణ పత్రాలను జతచేసి సంబంధిత మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలి. మండల స్థాయిలో.. వచ్చిన దరఖాస్తులను మండలస్థాయిలో పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్/జోనల్ కమిషన్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన ప్రత్యేకాధికారి, మండల పరిధిలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ప్రతినిధులు, డీఆర్డీఏ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో... జిల్లా స్థాయిలో ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా డీఆర్డీఏ పీడీ, సభ్యులుగా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), సభ్యులుగా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు, మైనార్టీ సంక్షేమాధికారి, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, లీడ్‌బ్యాంక్ మేనేజర్ ఉంటారు. – నిర్దేశించిన తేదీల్లో మండల, జిల్లా స్థాయి కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించాల్సి ఉంటుంది. అర్హులను ఖరారు చేసిన తర్వాత ఆ జాబితాను జిల్లా ఇన్చార్జి మంత్రికి కలెక్టర్ సమర్పించాలి. – ఎంపికైన లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన సామగ్రి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రాయితీ నిధులు లబ్ధిదారుకు కాకుండా సదరు సంస్థ, ఏజెన్సీల పేరిట విడుదల చేస్తారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుకు ఇస్తారు. – స్వయం ఉపాధి శిక్షణకు జిల్లా కమిటీలు కార్యాచరణ రూపొందించుకోవాలి. – యూనిట్లు గ్రౌడింగ్ అయిన తర్వాత కూడా వాటిని విధిగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా అధికారులను నియమించుకుని తనిఖీలు చేపట్టాలి.ఎంపిక ప్రక్రియ ఇలా.. – ఆన్లైన్ రిజి్రస్టేషన్ ప్రక్రియ ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగుతుంది. – ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు మండల కమిటీలు దరఖాస్తులను పరిశీ లించి అర్హులను ఎంపిక చేసి, ఆయా జాబితాలను జిల్లా కమిటీలకు సమర్పించాలి. – మే 21 – 31 తేదీల మధ్యలో జిల్లా కమిటీలు ఆయా జాబితాలను పరిశీలించి మంజూరీలు చేపట్టాలి – జూన్ 2 నుంచి 9 తేదీల మధ్య లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించాలి. -
ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకే అందాల పోటీ
సాక్షి, హైదరాబాద్: అందాల పోటీ ద్వారా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేస్తామని, ఇందులో తప్పేముందని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చాలా దేశాలకు తెలంగాణ అంటే తెలియదని, అందుకే హైదరాబాద్‌లో ఈ పోటీ నిర్వహిస్తున్నామని చెప్పారు. దీన్ని కొంతమంది వక్రీకరించడం సరికాదన్నారు. ఎక్సైజ్, పర్యాటకశాఖ పద్దులపై శాసనసభలో మంగళవారం చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన పలు సందేహాలకు మంత్రి బదులిచ్చారు. పర్యాటకరంగం ద్వారా ఉద్యోగ ఉపాధి పెద్దఎత్తున కల్పిస్తున్నామని, పర్యాటక పాలసీ ద్వారా ఐదేళ్లలో రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.రాష్ట్రంలో ఎకోవెల్నెస్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని, యాదగిరిగుట్ట సహా 27 ప్రత్యేక టూరిజం కేంద్రాలను గుర్తించినట్టు చెప్పారు. అంతర్జాతీయ సమావేశాలకు 20 వేల మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో బెల్ట్‌షాప్‌ల నియంత్రణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 1,200 మంది కొత్త వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇవ్వబోతున్నామని, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గద్దర్ సహా పలువురు ప్రముఖ కళాకారులకు రూ. కోటి ఇవ్వనున్నట్టు చెప్పా రు. కాగా, అందాల పోటీ వల్ల ఆదాయం వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని చెప్పడం ఏం న్యాయమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. ఈ పోటీలకు రూ.54 కోట్లు వ్యయం చేస్తున్న సర్కారు, అదే ఫార్ములా వన్‌కు నిధులు వ్యయం చేయడాన్ని తప్పుపట్టడం డబుల్ స్టాండర్డ్ కాదా అని ప్రశ్నించారు. సచివాలయం ఎదుట అంబేడ్కర్ విగ్రహానికి ఎందుకు ముసుగు తొలగించలేదని అడిగారు. దీనికి మంత్రి జూపల్లి బదులిస్తూ, అంబేడ్కర్ విగ్రహం పెట్టడానికి బీఆర్ఎస్కు పదేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. పలు పద్దులు ఆమోదం సుదీర్ఘ చర్చ అనంతరం పలు పద్దులను శాసనసభ మంగళవారం ఆమోదించింది. ఇందులో పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య, క్రీడలు, యువజన సేవ లు, రోడ్లు, భవనాలు, మద్య నిషేధం, సాంస్కృతి క, పురావస్తు, దేవాదాయ, అడవులు, శాస్త్ర సాంకేతిక, పర్యావరణం సంబంధిత పద్దులు ఉన్నాయి. -
నాణ్యమైన విద్య, వైద్యం మా ప్రభుత్వ విధానం
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కుప్పకూలిన విద్యావ్యవస్థను బాగు చేసుకుంటూ ముందుకువెళుతున్నామని, పూర్తిగా సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 11 వేలకుపైగా టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా చేపట్టామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో విద్యాశాఖ, రోడ్లు భవనాలు, పర్యాటకం, ఎక్సైజ్‌శాఖ పద్దులపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ పద్దుపై సుదీర్ఘంగా ప్రసంగించారు.ప్రస్తుతం విద్యావ్యవస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఇదే సమయంలో కలుగజేసుకున్న శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. పైవిధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 79 పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించామని, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని మంత్రి వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ పోస్టును సైతం భర్తీ చేయలేదంటూ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించడంతో బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు కలుగజేసుకున్నారు. ‘మా హయాంలో 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. 8 వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా చేశాం. గురుకులాల్లో 18 వేల నియామకాలు పూర్తి చేశాం’అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,913 స్కూళ్లు మూతపడ్డాయని, 257 గ్రామపంచాయతీల్లో అసలు ప్రభుత్వ పాఠశాలలే లేవని సబిత తెలిపారు. కాళేశ్వరం అప్పుల కుప్ప: యెన్నం బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేయని పనులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. బీటెక్ చదివిన విద్యార్థులు సైతం ఎందు కూ పనికిరానివారిగా మారుతున్న దుర్భర స్థితి ప్రస్తుత విద్యావ్యస్థలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తెలుగు మీడియం ఉపాధ్యాయులనే పెట్టడంతో విద్యార్థులకు తీరని అన్యా యం జరుగుతోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, దశ దిశ లేకుండా బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికి ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల కు ప్ప చేశారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణంతో ఎన్నో మార్పులు వచ్చాయని, విద్యారంగంలోనూ విద్యారి్థనులు పోటీపడుతున్నారని వివరించారు. -
కేటీఆర్.. మీరు సీఎం అవుతారు
సాక్షి, హైదరాబాద్: ‘కేటీఆర్.. మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలో మరోసారి మేము అధికారంలోకి వస్తాం. అప్పటివరకు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి. మీకు గతంలో రెండు పర్యాయాలు అధికారం ఇచ్చారు. మాకు కూడా ప్రజలు రెండు పర్యాయాలు అధికారం ఇస్తారు’అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీఆర్ఎస్ పాత్ర ఉందని.. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ మరింత పెద్ద పాత్ర పోషించారని చెప్పారు. అందుకే తమకు కూడా ప్రజలు రెండు పర్యాయాలు అధికారం ఇస్తారని పే ర్కొన్నారు. శాసనసభలో మంగళవారం రహదారులు, భవ నాల శాఖ పద్దుపై చర్చకు ఆయన సమాధానమిచ్చారు. మీరు వదిలేస్తే.. మేం సరిదిద్దుతున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిన పనులను తాము ఇప్పుడు చక్కబెడుతున్నామని వెంకట్‌రెడ్డి తెలిపారు. ‘మీరు కొన్ని మంచి పనులు చేశారు. కొన్ని తప్పులు చేశారు. కొన్ని ప్రారంభించి వదిలేశారు. అవన్నీ మేము సరిదిద్దుకుంటూ వెళ్తున్నాం. జూన్ 2న సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తాం. అల్వాల్‌లో కూడా డిఫెన్స్ నుంచి భూమి తీసుకుని అక్కడ నిర్మాణం ప్రారంభిస్తున్నాం. ఎల్బీ నగర్లో నిర్మించే టిమ్స్‌ను 24 అంతస్తుల నుంచి 14 అంతస్తులకు కుదించి వేగంగా పనులు కొనసాగుతున్నాయి. మీరు సచివాలయాన్ని అద్భుతంగా కట్టారు. అంచనా కంటే రూ.500 కోట్లు అదనంగా ఖర్చు చేశారు. ఇప్పుడు వేలకోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉంది’అని తెలిపారు. మీరు ఫామ్‌హౌస్‌కు.. మేము ఢిల్లీకి ‘మీ అధిష్ఠానం ఫామ్‌హౌస్‌లో ఉంటే.. మా పార్టీ అధిష్ఠానం ఢిల్లీలో ఉంది. అందుకే మేము ఢిల్లీకి వెళ్తున్నాం. సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మీరు విమర్శించడం మంచిది కాదు’అని మంత్రి వెంకట్‌రెడ్డి అన్నారు. కాగా, పనులు చేసిన తరువాత బిల్లులు చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్–తాండూరు–జహీరాబాద్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కోరారు.సంగెం బ్రిడ్జిని మంజూరు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్ రామచంద్రునాయక్ కూడా మాట్లాడారు. మన్నెగూడ– అప్పా జంక్షన్ పనులు వెంటనే ప్రారంభించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సూచించారు. వికారాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన నాలుగు రోడ్లకు కూడా తుదిరూపు ఇవ్వాలని కోరారు. -
నిఘా నేత్రాలనూ వదలట్లేదు
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత భద్రత కోసం ఏర్పాటు చేసుకుంటున్న సీసీటీవీ కెమెరాలను సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. అందులోని ఫుటేజీని వాడుకొని మోసగించేందుకు..సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారని సైబర్‌భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పాయల్ మెటర్నటీ ఆస్పత్రి సీసీటీవీ కెమెరాలను సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. ఇళ్లు, కార్యాలయాల్లోని సీసీటీవీ కెమెరాలు సైతం హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదముందని, కొద్దిపాటి జాగ్రత్తలతో ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చనిసైబర్ నిపుణులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని ఎలా హ్యాక్ చేస్తారు? సీసీటీవీ కెమెరాలను ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటి ఫీడ్‌ను చూసేందుకు మనం ఏర్పాటు చేసుకునే ఖాతాకు సంబంధించిన సీసీటీవీ కెమెరాలకు డిఫాల్ట్ పాస్‌వర్డ్‌లను చాలామంది మార్చరు. దీంతో హ్యాకర్లు సులభంగా కెమెరాల్లోకి చొరబడుతున్నారు. కొన్ని సీసీటీవీ కెమెరాల సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఉండటం కూడా హ్యాకర్లకు కలిసొస్తుంది. బలహీనమైన వైఫై నెట్‌వర్క్‌లు కూడా హ్యాకర్లకు సులభమైన లక్ష్యాలుగా మారుతాయి. ఫిషింగ్ ఈ–మెయిల్లతో హ్యాకర్లు యూజర్ల పాస్వర్డ్లు, ఇతర సమాచారాన్ని సేకరించి హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. హ్యాక్ చేయడం వల్ల కలిగే నష్టాలు ⇒ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుంది. ⇒ ఇళ్లు, కార్యాలయాల్లోని ముఖ్యమైన సమాచారం దొంగిలిస్తారు. ⇒ బెదిరింపులు, బ్లాక్మెయిల్లకు గురయ్యే ప్రమాదముంది. ⇒ ఆర్థికంగా నష్టాలు కలిగే ప్రమాదం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ⇒ సీసీటీవీ కెమెరాలకు తప్పకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెట్టుకోవాలి. అవి సులువుగా ఇతరులు గుర్తించలేనట్టుగా ఉండాలి. ⇒ సీసీటీవీల సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ⇒ వైఫై నెట్‌వర్క్‌ను సురక్షితంగా పెట్టుకోవాలి. ⇒ అనుమానాస్పద లింక్‌లు, ఈ–మెయిల్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. ⇒ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సైబర్ పోలీసులు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ 1930లో ఫిర్యాదు చేయాలి. -
నిందితుడిపై అస్పష్టత!
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార యత్నం కేసులో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసు బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మార్గంలోని 12 ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు చెబుతున్న వివరాల్లో స్పష్టత లేకపోవడంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు కష్టసాధ్యమవుతోంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితురాలికి పలువురు పాతనేరస్తుల ఫొటోలు చూపించారు. ఇందులో ఒక పాత నేరస్తుడి ఫొటోతో నిందితుడికి పోలికలు ఉన్నట్టు చెప్పింది. అదుపులో అనుమానితుడు: బాధితురాలు చెప్పిన పోలికలు ఉన్న అనుమానితుడు మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేశ్‌గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతనేరస్తుడు అయిన ఏడాది క్రితమే మహేశ్‌ను భార్య వదిలేయడంతో, మాదక ద్రవ్యాల వినియోగానికి బానిసయ్యాడు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ముందుకు మహేశ్‌ను తీసుకెళ్లారు. నేరుగా అనుమానితుడిని చూశాక, నిందితుడు అతను కాదని ఆమె చెప్పినట్టు సమాచారం. అయినా, మహేశ్‌తోపాటు మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అల్వాల్ స్టేషన్ నుంచి నిందితుడు: అన్ని స్టేషన్లలో పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు...నిందితుడు అల్వా ల్ రైల్వేస్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైలు ఎక్కినట్టు «నిర్ధారించుకున్నారు. కానీ ఎక్కడ దిగిపోయాడన్న విషయంలో స్ప ష్టత రావడం లేదు. ఆర్పీఎఫ్, జీఆర్పీతోపాటు పలు విభాగాలకు చెందిన సిటీ పోలీసులు నిందితుడిని గుర్తించడానికి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.మేడ్చల్–గుండ్లపోచంపల్లి వరకు ఉన్న అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన కొనసాగుతోంది. ఎంఎంటీఎస్లలో సీసీ కెమెరాలు లేకపోయినా, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
గ్రేటర్‌లోనే పారిశ్రామిక ప్రగతి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధికంగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. నైపుణ్యం ఉన్న కార్మిమకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మొపాలిటన్ కల్చర్, మెరుగైన మౌలిక వసతులు తదితర కారణాలతో ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో ఇక్కడ కంపెనీల స్థాపనకు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని ఇటీవల రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడించింది. తెలంగాణ పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ (టీజీ–ఐపాస్) ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 24,112 సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ తరహా సంస్థలు ఏర్పాటయ్యాయి. ఆయా కంపెనీలు రూ.1,29,332 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిల్లో 6,60,428 మంది ఉపాధి పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులపై ఆర్థిక సర్వేలో పేర్కొన్న మరికొన్ని వివరాలు.. » 2016 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన టీజీ–ఐపాస్ ద్వారా రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలలో సూక్ష్మ తరహా సంస్థలే అత్యధికం. » రాష్ట్రంలో ఏర్పాటైన మొత్తం పరిశ్రమలలో సూక్ష్మ సంస్థల వాటా 67.23 శాతం ఉండగా, పెట్టుబడుల్లో కేవలం 1.70 శాతం, ఉద్యోగాల్లో 24.97 శాతం వాటా మాత్రమే ఉంది. » పరిశ్రమల ఏర్పాటులో భారీ సంస్థల వాటా 3.56 శాతం మాత్రమే ఉన్నా.. పెట్టుబడుల్లో 74.96 శాతం, ఉద్యోగ అవకాశాల్లో 35.04 శాతం వాటా కలిగి ఉన్నాయి. » చిన్న, మధ్య తరహా సంస్థల వాటా 29.21 శాతం ఉండగా.. పెట్టుబడుల్లో 23.34 శాతం, ఉదోగాల్లో 39.99 శాతం వాటా ఉంది. » 2024–25 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్రంలో రూ.9,850.23 కోట్ల పెట్టుబడులతో 1,476 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 38,598 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. » ఈ పరిశ్రమలలో మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా మేడ్చల్–మల్కాజిగిరిలో రూ.832.17 కోట్ల పెట్టుబడులతో 262 పరిశ్రమలు ఏర్పాటు కాగా.. 6,760 మంది ఉపాధి పొందారు. » సంగారెడ్డిలో రూ.543.42 కోట్ల పెట్టుబడులతో 165 యూనిట్లు ఏర్పాటు కాగా.. 5,109 మందికి ఉపాధి దొరికింది. రంగారెడ్డి జిల్లాలో రూ.5,155.35 కోట్ల పెట్టుబడులతో 130 పరిశ్రమలు ఏర్పాటు కాగా.. 8,857 మందికి ఉపాధి లభించింది. » అత్యల్పంగా హైదరాబాద్‌లో రూ.5.91 కోట్ల పెట్టుబడులతో కేవలం ఏడు యూనిట్లు ఏర్పాటు కాగా.. 515 మందికి పని దొరికింది. » ఇప్పటివరకు టీజీ–ఐపాస్ ద్వారా హైదరాబాద్‌లో రూ.190 కోట్ల పెట్టుబడులతో కేవలం 50 పరిశ్రమలు ఏర్పాటు కాగా.. 1,828 మందికి ఉపాధి లభించింది. -
‘మర్రి’కి అభయమిచ్చే వరకు విస్తరణ వద్దు
బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ శివారులోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ కూడలి వరకు నాలుగు వరుసలకు విస్తరించే రోడ్డు ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. విస్తరణలో ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) సరిగ్గా వ్యవహరించకపోవటాన్ని తప్పుపట్టిన జాతీయ హరిత ట్రిబ్యునల్.. మళ్లీ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టు (పర్యావరణంపై ప్రభావ అంచనా నివేదిక) అందించే వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించొద్దని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెల్లడించింది. – సాక్షి, హైదరాబాద్మర్రి వృక్షాలే కేంద్రంగా.. నగర శివారులోని అప్పా కూడలి నుంచి చేవెళ్ల–వికారాబాద్ రోడ్డులోని మన్నెగూడ కూడలి వరకు జాతీయ రహదారిని ఎన్హెచ్ఏఐ నాలుగు వరుసలతో 60 మీటర్లకు విస్తరించాల్సి ఉంది. ఇది కర్ణాటకలోని బీజాపూర్ వరకు విస్తరించిన రోడ్డు. ఎగువన పరిగి మీదుగా రాష్ట్ర సరిహద్దు వరకు గతంలోనే రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలోని జాతీయ రహదారుల విభాగం ఈ రోడ్డును విస్తరించింది. నగర శివారు నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. నిడివి ఎన్హెచ్ఏఐ అదీనంలో ఉంది. దాదాపు రూ.950 కోట్లతో ఈ పనులు చేపట్టాల్సి ఉంది. మన్నెగూడ వరకు రోడ్డుకిరువైపులా స్వాతంత్య్రానికి పూర్వం నాటిన 915 మర్రి వృక్షాలున్నాయి. నాలుగు వరుసలకు విస్తరించాలంటే ఈ మొత్తం చెట్లను తొలగించాల్సి వస్తుంది. చేవెళ్ల, మొయినాబాద్ పట్టణాల వద్ద రోడ్డు విస్తరణలో ఇళ్లను కూడా తొలగించాల్సి రావటంతో ఆ రెండు చోట్ల బైపాస్ రోడ్లు నిర్మించాలనుకున్నారు. దీంతో మొయినాబాద్, చేవెళ్ల పట్టణాల వద్ద ఉన్న 232 చెట్లను తొలగించాల్సిన పని లేకుండాపోయింది. ఈ వృక్షాలను కొట్టకుండా కాపాడాలంటూ బాలాంత్రపు తేజ సహా పలువురు సామాజిక కార్యకర్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పలుదఫాల విచారణ అనంతరం, ఆ వృక్షాల తొలగింపు వల్ల పర్యావరణంపై ఉండే ప్రభావాన్ని అంచనా వేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో గతేడాది జనవరిలో ఆ శాఖ అదీనంలోని నిపుణుల అంచనా కమిటీ (ఈఏసీ) అధ్యయనం చేసి ఎన్హెచ్ఏఐకి నివేదిక సమర్పించింది. కొన్ని చెట్ల పరిరక్షణకు వీలుగా సెంట్రల్ మీడియం వెడల్పు తగ్గించామని, దాని వల్ల 50 చెట్లు తొలగించాల్సిన అవసరం లేకుండా పోయిందని, బైపాస్‌ల వల్ల 232 మిగులుతున్నాయని, స్థానిక ముడిమ్యాల అటవీ ప్రాంతం వద్ద మిగిలే మరికొన్ని చెట్లు సహా మొత్తం 393 వృక్షాలు అలాగే మిగిలి ఉంటాయని, మిగతా వృక్షాలను ట్రాన్స్‌లొకేట్ పద్ధతిలో వేరే చోట నాటుతామని ట్రిబ్యునల్‌కు విన్నవించింది. ట్రిబ్యునల్ అసంతృప్తి.. ఏమన్నదంటే.. » ఎన్హెచ్ఏఐ సమర్పించిన నివేదికపై ట్రిబ్యునల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. » ప్రస్తుతమున్న అలైన్మెంట్ ప్రకారమే రోడ్డును విస్తరించాలని ఎందుకు అనుకుంటున్నారు. కొత్తగా మరో రోడ్డు నిర్మిస్తే అయ్యే నష్టమేంటన్న మాటకు ఎందుకు స్పష్టమైన సమాధానం ఇవ్వటం లేదు. » మర్రి వృక్షాలు కీలక భాగాల్లో సున్నితంగా ఉంటాయి. వాటిని ట్రాన్స్‌లొకేట్ చేసిన సందర్భంలో మనుగడ శాతం తక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అందులోనూ ఎక్కువ వయసు ఉన్న వృక్షాల మనుగడలో తీసుకునే చర్యలేమిటో శాస్త్రీయబద్ధ నివేదిక రూపంలో సమర్పించలేదు. » ట్రాన్స్‌లొకేట్ చేసిన తర్వాత వృక్షాలు మనుగడ సాగించేందుకు తీసుకునే చర్యలేమిటో ప్రాజెక్టు రిపోర్టులో చేర్చలేదు. దానికి సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో వెల్లడించలేదు. » అందుకే మరోసారి శాస్త్రీయపద్ధతిలో నిపుణుల ఆధ్వర్యంలో పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం నిర్వహించి నివేదిక సమర్పించాలి. అప్పటి వరకు రోడ్డు విస్తరణ పనులను నిలిపివేయాలి. -
చేనేతకు ‘తెలంగాణ లేబుల్’
సాక్షి, హైదరాబాద్: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ చేనేత ఉత్పత్తుల ప్రాముఖ్యతను చాటేలా వాటికి ‘ప్రత్యేక లేబుల్’(తెలంగాణ హ్యాండ్లూమ్ లేబుల్/మార్క్) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘తెలంగాణ లేబుల్’పై చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేసే నేత కార్మికులకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని చేనేత మగ్గాలను జియో ట్యాగింగ్ చేసిన ప్రభుత్వం.. వాటిపై తయారు చేసే చేనేత ఉత్పత్తులకు ‘తెలంగాణ లేబుల్’జారీ చేస్తుంది. ఈ చేనేత వ్రస్తాలు తయారు చేసే కార్మికులకు ‘తెలంగాణ నేతన్న భరోసా’పథకం కింద ప్రతినెలా రూ.2 వేలు చొప్పున ఏటా రూ.24 వేలు అదనంగా చెల్లిస్తారు. చేనేత వస్త్ర ఉత్పత్తులను మరమగ్గాల ద్వారా కాపీ కొట్టకుండా నిరోధించడంతో పాటు కొనుగోలుదారులకు నాణ్యతతో కూడిన అసలైన చేనేత వస్త్రాలు అందించడం లక్ష్యంగా ‘తెలంగాణ లేబుల్’కు రూపకల్పన చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ డిజైన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ చేనేత విభాగం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో చేనేత, పట్టు వ్రస్తాలకు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే టెక్స్టైల్ కమిటీ ‘హ్యాండ్లూమ్ మార్క్’, ‘సిల్క్ మార్క్’ను జారీ చేస్తోంది. ఈ మార్క్ కోసం టెక్స్టైల్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అయితే ఇకపై టెక్స్టైల్ కమిటీ జారీ చేసే హ్యాండ్లూమ్ మార్క్‌కు బదులుగా ప్రత్యేక తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. తద్వారా తెలంగాణ చేనేత బ్రాండ్‌ను ప్రోత్సహించడంతో పాటు పోటీ మార్కెట్లో రాష్ట్ర సాంప్రదాయ ఉత్పత్తులు, నైపుణ్యానికి గుర్తింపు దక్కేలా చేయాలని భావిస్తోంది. చేనేత కార్మికుల జీవనోపాధి, సంక్షేమానికి ‘తెలంగాణ లేబుల్’బాటలు వేస్తుందని ఆశిస్తోంది. విక్రయాలు పెంచేందుకు చేనేత బజార్లు చేనేత విక్రయాలు పెంచేందుకు తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో) సహకారంతో అంతర్ రాష్ట్ర ప్రదర్శనలు, ఉమ్మడి పది జిల్లాల్లో స్థానికంగా జరిగే పండుగలు, ఉత్సవాలు, జాతర్లలో చేనేత బజార్లు ఏర్పాటు చేయనున్నారు. పోచంపల్లి ఇక్క త్, వరంగల్ డర్రీలు, గద్వాల, నారాయణపేట చేనే త వస్త్ర ఉత్పత్తులకు గిరాకీ పెంచేందుకు ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థలతోనూ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం టెస్కోకు తెలంగాణ వెలుపలా, బయటా కలిపి 31 షోరూమ్‌లు ఉన్నాయి. కాగా వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ షోరూమ్‌ల ఆధునికీకరణపై కూడా దృష్టి సారించారు. పోచంపల్లి ఇక్కత్, వరంగల్ డర్రీల ఎగుమతులను పెంచడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆన్లైన్ మార్కెటింగ్‌పై దృష్టి టెస్కో షోరూమ్‌ల ద్వారా చేనేత వస్త్ర ఉత్పత్తుల వార్షిక టర్నోవర్ సుమారు రూ.15 కోట్ల మేర ఉంటోంది. వీటితో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు విక్రయిస్తున్న వ్రస్తోత్పత్తుల విలువ రూ.260 కోట్ల మేర ఉంది. అయితే ఆన్లైన్ విక్రయాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని చేనేత ఉత్పత్తుల కోసం ప్రత్యేక పోర్టల్‌కు రూపకల్పన జరుగుతోంది. ఈ పోర్టల్ ద్వారా తెలంగాణ మార్క్ చేనేత ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తారు. నేత కార్మికులు, మాస్టర్ వీవర్లు, చేనేత సహకార సొసైటీలను అనుసంధానం చేసే రీతిలో పోర్టల్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. -
కేబినెట్ విస్తరణ.. మూడున ముహూర్తం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల 3న జరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణతో పాటు అదేరోజు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరగనున్నాయని, ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం అందినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర పెద్దల భేటీ అనంతరం రాష్ట్ర పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశాలున్నాయి.. ఎవరి శాఖల్లో మార్పులు జరగొచ్చు.. ప్రస్తుత మంత్రుల్లో ఎవరినైనా తప్పిస్తారా? అనే అంశాలపై మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నేతల్లో విస్తృత చర్చ జరిగింది. అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాలతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చర్చోపచర్చలు సాగించారు. ఇంకా సమాచారం లేదన్న ఆ ముగ్గురూ.. మంగళవారం శాసనసభ లాబీల్లో మంత్రివర్గ విస్తరణే ప్రధాన చర్చనీయాంశం అయ్యింది. ఢిల్లీ వేదికగా జరిగిన చర్చల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ ఎమ్మెల్యేలతో హడావుడిగా కనిపించింది. పలువురు ఆశావహ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు భట్టి చాంబర్‌కు వచ్చి చర్చలు జరిపారు. అసలు ఢిల్లీలో ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి, వివేక్, శ్రీహరిలకు బెర్తులు ఖాయమయ్యాయన్న వార్తల నేపథ్యంలో అసెంబ్లీలో ఈ ముగ్గురికి అభినందనలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ సమావేశాల విధులకు హాజరైన వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, జర్నలిస్టులు కూడా ఆ ముగ్గురిని కలిసి అభినందనలు తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆ ముగ్గురూ.. మరోవైపు ఇంకా సమాచారమేమీ లేదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో సాయంత్రం వరకు సీఎం కసరత్తు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అంతకుముందు మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బయలుదేరేంతవరకు ఢిల్లీలో ఒంటరిగానే గడిపారు. ఎలాంటి అపాయింట్మెంట్లు, పార్టీ పెద్దలతో ములాఖత్‌లకు వెళ్లని రేవంత్ మంత్రివర్గ కూర్పుపై ఏకాంతంగా కసరత్తు చేశారనే చర్చ జరుగుతోంది. కొత్తగా కేబినెట్లోకి తీసుకునే మంత్రులకు శాఖలు, ప్రస్తుతమున్న మంత్రుల శాఖల్లో మార్పుల గురించి ఓ అభిప్రాయానికి వచ్చే దిశలో ఆయన కసరత్తు చేశారని, ఈ మేరకు అధిష్టానానికి సమాచారమిచ్చారని తెలుస్తోంది. ఈ కసరత్తు నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ సాయంత్రం వరకు ఢిల్లీలోనే ఉండిపోయారని చెబుతున్నారు. ఇద్దరు కీలక మంత్రుల శాఖల్లో మార్పులు! కేబినెట్లోకి కొత్తగా నలుగురు లేదా ఐదుగురిని తీసుకుంటారనే చర్చతో పాటు ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పలకవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ మహిళా మంత్రితో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిని తప్పించేందుకు కారణాలున్నాయని కొందరు చెబుతుండగా, అధిష్టానం ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోదని, ప్రస్తుతమున్న మంత్రులంతా కొనసాగుతారని, కొత్తగా కొందరు మంత్రులవుతారని టీపీసీసీ వర్గాలంటున్నాయి. శాఖల మార్పుపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక మంత్రులకు చెందిన శాఖల్లో మార్పులుంటాయని, ఓ మహిళా మంత్రికి అదనపు బాధ్యతలిస్తారనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్‌గా లంబాడా సామాజిక వర్గానికి చెందిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే ఎన్.బాలూనాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, కొత్తగా కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి పేరు కూడా చర్చలోకి వచ్చింది. డిప్యూటీ స్పీకర్‌గా ఈమెను నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు చీఫ్ విప్ పదవిలో ఎవరిని నియమిస్తారు?, విప్లలో ఎవరికైనా మంత్రిగా అవకాశమిస్తే వారి స్థానంలో ఎవరిని నియమిస్తారన్న దానిపైనా రకరకాల చర్చలు జరుగుతుండడం గమనార్హం. -
హెచ్‌సీఏకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ షాక్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు కంటోన్మెంట్ బోర్డు అధికారులు షాక్ ఇచ్చారు. బోర్డుకు ఎలాంటి లీజు చెల్లించకుండానే సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన స్థలాన్ని 30 ఏళ్లుగా ఆక్రమించడాన్ని అధికారులు సీరియస్‌గా పరిగణించారు. తక్షణమే ఆ స్థలాన్ని ఖాళీ చేయడంతోపాటు రూ.100 కోట్ల పరిహారం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే హెచ్‌సీఏ నుంచి స్థలం స్వాధీనానికి ఏర్పాట్లు చేస్తున్నామని బోర్డు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జనరల్ ల్యాండ్ రికార్డ్స్(జీఎల్ఆర్) సర్వే నెంబర్ 713లోని 23 ఎకరాల సీ కేటగిరీకి చెందిన జింఖానా మైదానం (gymkhana ground) ఉంది. 1992లో ఈ స్థలంలోని 7.9 ఎకరాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(సాప్)కు, 5.71 ఎకరాల స్థలాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు లీజు కింద కేటాయించారు. మిగిలిన 9.59 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. 1996 ఫిబ్రవరి 23న కేంద్ర ప్రభుత్వం హెచ్‌సీఏ లీజును రద్దు చేసింది. అయితే ఆ స్థలాన్ని మాత్రం కేంద్రం స్వాధీనం చేసుకోలేదు. తిరిగి 2010లో సికింద్రాబాద్ సర్కిల్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్ తన అధికార పరిధిని దాటి మరో ఏడు ఎకరాల స్థలాన్ని హెచ్‌సీఏకు లీజు కింద ఇచ్చారు. ఈ లీజు కూడా చెల్లదంటూ 2013లో రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.హెచ్‌సీఏ రక్షణ శాఖకు ఎలాంటి లీజు రుసుం చెల్లించకుండానే సుమారు 14 ఎకరాల స్థలాన్ని వినియోగించుకుంటోంది. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన కంటోన్మెంట్ అధికారులు 2021లో తొలిసారిగా పబ్లిక్ ప్రిమిసెస్ (ఎవిక్షన్ ఆఫ్ అనాథరైజ్డ్ ఆక్యుపెంట్స్) యాక్ట్, 1971 ప్రకారం హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేశారు. 5.71 ఎకరాల లీజుకు సంబంధించిన స్థలంపై తమకు అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చినట్లు హెచ్‌సీఏ స్పందించింది. అయితే మిగిలిన 9.59 ఎకరాలకు మాత్రం ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో ఆ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ కంటోన్మెంట్ అధికారులు పీపీ(ఈ) యాక్ట్ 1971, సెక్షన్ 4(1) ప్రకారం మరోసారి నోటీసు జారీ చేశారు.చదవండి: ఇక RRR వరకు హెచ్ఎండీ అనుమతులే!హెచ్‌సీఏ నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా స్వాధీనానికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. దాదాపు 30 ఏళ్లుగా హెచ్‌సీఏ తమ స్థలాన్ని కబ్జాలోకి తీసుకుని వినియోగించుకున్నందుకు రూ.100 కోట్ల పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ నోటీసు (Demand Notice) కూడా పంపారు. ఆక్రమిత స్థలంలోనే గ్రౌండ్.. లీజు ద్వారా పొందామని పేర్కొంటున్న హెచ్‌సీఏ జింఖానా మైదానంలోని 5.71 ఎకరాల స్థలాన్ని మాత్రం ఖాళీగానే ఉంచింది. మిగిలిన 9.59 ఎకరాల స్థలంలోనే హెచ్‌సీఏ (HCA) కార్యాలయ నిర్మాణంతోపాటు క్రికెట్ గ్రౌండ్, నెట్స్ వేశారు. ఈ మైదానంలోనే క్రీడాకారులు శిక్షణతోపాటు ప్రాక్టీస్ చేస్తుంటారు. -
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ఆ నలుగురికే ఛాన్స్!
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు, ప్రస్తుతం కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మరొకరికి అవకాశం కల్పించనుంది. ఇద్దరు రెడ్లు, ఒక బీసీ,ఒక ఎస్సీ సామాజిక వర్గం నేతకు అవకాశం కల్పించనుండగా.. చీప్ విప్ మాత్రం రెడ్డి సామాజిక వర్గం నేతకు కట్టబెట్టేయోచనలో అధిష్టానం నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇక ప్రస్తుతం మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు ఉన్నారు. అయితే, అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపితే వారికే మంత్రి పదవి ఖాయం. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, కేబినెట్ విస్తరణపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు సేకరించింది. ఆ వివరాల ఆధారంగా మంత్రి పదవులు కేటాయింపు ఉంటుంది. -
‘దేవుళ్లని మోసం చేసిన రేవంత్‌కు రైతులను మోసం చేయడం ఓ లెక్క’
సాక్షి,మెదక్ జిల్లా : దేవుళ్లను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం ఓ లెక్క’ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినా మొదటి రోజే రూ 2లక్షలు చేస్తామని చేతులెత్తేశారు. దేవుళ్లను మోసం చేసిన రేవంత్‌కు రైతులను మోసం చేయడం ఓ లెక్క. రైతులతో మిత్తిలు కట్టించి రుణాలు ఇవ్వలేదు. మొదటి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ సర్కార్ మోసం చేసింది. అన్ని వర్గాలను ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిందది. రూ 2లక్షల రుణమాఫీ మీద రైతులు కాంగ్రెస్ నేతలను నిలదీయండి. రైతుబందు ఎగ్గొట్టింది. కరోనా కష్ట కాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు అందించారు. కాంగ్రెస్ మాటలే తప్ప చేతలు లేవు. ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. సర్పంచులకు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా రైతుల పక్షాన నిలదీస్తాం’ అని హరీష్ రావు స్పష్టం చేశారు. -
‘నేను పేర్లు చెప్పలేను...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం’
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగిందని ఎంఐఎం ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. అది కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ అని పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) అసెంబ్లీ వేదికగా మన ఊరు మన బడి అంశానికి సంబంధించి మాట్లాడారు. ‘ మన ఊరు మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగింది. మన ఊరు మన బడి లో ఏమి పని జరగలేదు...జరిగిన దానికి నిదులు విడుదల కాలేదు. మన ఊరు మన బడి పథకంలో బెంచీల కొనుగోళ్లలో స్కాం జరిగింది. ఈ స్కాం పై ప్రశ్న వేద్దాం అనుకుంటే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. రూ. 14, రూ. 18, రూ. 20వేల ఒక్కో బెంచ్ కొన్నారు. రూ. 5వేలకు ఒక బెంచ్ వస్తది...20వేల పెట్టీ కొన్నారు. బెంచీల కొనుగోళ్ల పై ఈ ప్రభుత్వం విచారణ చేయించాలి.నేను పేర్లు చెప్పలేని...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం. నిధులను లూటీ చేశారు.. 32లక్షల బెంచీలను కొనుగోలు చేశారు. పెద్ద స్కాం చేశారు. దానికి సంబంధించి ఒకరు అప్పుడు BRS తో ఉన్నారు...ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు’ అని అక్బరుద్దీన్ విమర్శించారు. -
ప్రశాంత్‌రెడ్డి Vs కోమటిరెడ్డి.. అసెంబ్లీలో RRRపై రచ్చ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ట్రీపుల్ఆర్పై కాంగ్రెస్‌ది అసత్య ప్రచారమంటూ ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ కోసం కష్టపడింది బీఆర్ఎస్సే. 15 నెల్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. 2017లో అనుమతి వస్తే అప్పుడే ఆగిపోయిందని ప్రచారమా? అంటూ ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడుతూ.. ట్రిపుల్ ఆర్‌పై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. ‘‘మేం ఓఆర్ఆర్ కడితే మీరు అమ్ముకున్నారు. ఎన్నికల ముందు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి తెచ్చారు. 2014 నుంచి మీరు వేసిన రోడ్లకు డబ్బుకు మేం కడుతున్నామని కోమటిరెడ్డి అన్నారు.మన ఊరు-మన బడి పథకంలో భారీ స్కాం: అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగిందన్నారు. ‘మన ఊరు మన బడిలో ఏ పని జరగలేదు. జరిగిన దానికి నిధులు విడుదల కాలేదు. మన ఊరు-మన బడి పథకంలో బెంచీల కొనుగోళ్లలో స్కాం జరిగింది. ఈ స్కాం పై ప్రశ్న వేద్దాం అనుకుంటే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. 14, 18, 20 వేల ఒక్కో బెంచ్ కొన్నారు. బెంచీల కొనుగోళ్ల పై ఈ ప్రభుత్వం విచారణ చేయించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.నేను పేర్లు చెప్పలేని...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం. నిధులను లూటీ చేశారు.. 32లక్షల బెంచీలను కొనుగోలు చేశారు. ఐదు వేలకు ఒక బెంచ్ వస్తది. 20 వేల పెట్టీ కొన్నారు. పెద్ద స్కాం చేశారు...అప్పుడు బీఆర్ఎస్తో ఉన్నారు.. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు.’’ అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. -
Hyd: హిట్ అండ్ రన్ కేసు.. యువతికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: నగరంలోని బాలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐడీపీఎల్ చౌరస్తాలో హిట్ అండ్ రన్ కేసు మంగళవారం చోటు చేసుకుంది. అనిల్ అనే వ్యక్తి తన కారుతో ఓ యువతిని ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించాడు. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో నిందితుడిని పారిపోయే క్రమంలోనే అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఐడీపీఎల్ చౌరస్తా నుంచి బల్కంపేటకు అనిల్ అనే వ్యక్తి తన ఫార్చునర్ కారులో వెళుతుండగా సాయి కీర్తి(19) అనే యువతిని ఢీకొట్టాడు. అయితే ఢీకొట్టిన అనంతరం కారును ఆపకుండా అతి వేగంగా ఫతేనగర్ ఫ్లైఓవర్ దాటేందుకు యత్నించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కారును డ్రైవ్ చేస్తున్న అనిల్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన సాయి కీర్తి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
నాకైతే ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదు: రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: మంత్రి పదవి వస్తదనే అనుకుంటున్నానంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy ) ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఓ కొలిక్కి వస్తున్న వేళ.. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ‘‘కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. గతంలో భువనగిరి ఎంపీ పదవిని సమర్దవంతంగా నిర్వహించా. నాకు హోంమంత్రి అంటే ఇష్టం. అయినా ఏ పదవి వచ్చినా సమర్దవంతంగా నిర్వహిస్తా. ప్రజల పక్షాన నిలబడతా. ఢిల్లీలో సీరియస్ గానే కేబినెట్ పై చర్చ జరిగినట్లు ఉంది. నాకు ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి అయితే ఫోన్ రాలేదు’’ అని అన్నారాయన. నమస్తే మంత్రి వివేక్.. అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డి.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మధ్య సరదా సంభాషణ జరిగింది. వివేక్ వెంకటస్వామి ఎదురుపడడంతో.. నమస్తే మంత్రి అని పలకరించారు మల్లారెడ్డి. దీనికి థాంక్స్ మల్లన్న అంటూ మురిసిపోయారాయన. రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలదే హవా నడుస్తుందని మల్లారెడ్డి అనగా.. బీఆర్ఎస్ హయంలో నీ హవా నడిచిందంటూ వివేక్ కౌంటర్ ఛలోక్తి విసిరారు. -
Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లలో భరోసా లేని భద్రత
సాక్షి.హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైళ్లు, స్టేషన్లలో మహిళా ప్రయాణికుల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్‌లోని మహిళా కోచ్‌లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి ప్రయాణికురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడడం, అతడి నుంచి తప్పించుకొనేందుకు ఆమె కదులుతున్న రైలులోంచి దూకి తీవ్ర గాయాలపాలు కావడంతో ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు నడుస్తున్న కొన్ని రైళ్లలో ఆరీ్పఎఫ్ శక్తి బృందాలు, జీఆర్పీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ డివిజన్ పరిధిలో ఎంఎంటీఎస్లలో మహిళలకే కాకుండా సాధారణ ప్రయాణికుల భద్రతపైన కూడా ఆందోళన నెలకొంది. తరచూ ఏదో ఒక స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి దాడులకు పాల్పడుతున్నారు. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్, మేడ్చల్, నాంపల్లి, తదితర మార్గాల్లో నడిచే రైళ్లపైన ఎలాంటి నిఘా వ్యవస్థలు పని చేయడం లేదు. ఆర్పీఎఫ్, జీఆర్పీ భద్రత కూడా లేదు. నగరంలో సుమారు 30 ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా కేవలం 10 స్టేషన్ల మాత్రమే ఆరీ్పఎఫ్ విధులు నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ డివిజన్లో ఒక ఎస్ఐతోపాటు 16 మంది మహిళా కానిస్టేబుళ్లతో శక్తి టీమ్‌ను ఏర్పాటు చేశారు. కానీ ఈ బృందాల పనితీరు కొన్ని స్టేషన్లకు పరిమితం. అలాంటి నిఘా, భద్రతా బృందాలు హైదరాబాద్ డివిజన్లో లేకపోవడం గమనార్హం. సీసీ కెమెరాల నిఘా లేదు... ప్రస్తుతం లింగంపల్లి–ఫలక్‌నుమా, మేడ్చల్–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్–మేడ్చల్, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో ప్రతి రోజు సుమారు 75 సరీ్వసులు నడుస్తున్నాయి. ఈ సరీ్వసుల సమయ పాలన, నిర్వహణ, భద్రతను అధికారులు కొంతకాలంగా గాలికి వదిలేశారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఏ రైలుఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి ట్రైన్లో మహిళల కోసం ప్రత్యేకంగా కోచ్‌ను ఏర్పాటు చేసినా ఆయా బోగీల్లోకి పురుషులు యథేచ్చగా రాకపోకలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. మహిళలు అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోకుండా కొందరు ఆకతాయిలు ఇష్టారాజ్యంగా ఒక స్టేషన్లో ఎక్కి మరో స్టేషన్లో దిగిపోతూ మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. మగ ప్రయాణికులు ఈ బోగీల్లోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ప్రతి బోగీలో ఆరీ్పఎఫ్ మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. మరోవైపు అన్ని బోగీల్లోనూ సీసీకెమెరాలను ఏర్పాటు చేసి ఆరీ్పఎఫ్ డివిజన్ కార్యాలయాలతో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, బేగంపేట్, హైటెక్‌సిటీ, లింగంపల్లి, మల్కాజిగిరి, చర్లపల్లి, ఘట్కేసర్ వంటి ప్రధానమైన స్టేషన్లలో మినహా మిగతా స్టేషన్లలో కూడా సీసీ కెమెరాలు సరిగ్గా పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ప్రస్తుతం దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో మాత్రమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది. ఆ దిశగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.’అని ఆరీ్పఎఫ్ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. సిబ్బంది కొరత దృష్ట్యా అన్ని చోట్ల ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చునని, సీసీకెమెరాలు ఉంటే పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా నిరోధించవచ్చునని పేర్కొన్నారు.భద్రతా విభాగాల మధ్య సమన్వయం కరువు మరోవైపు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా నేరాల నియంత్రణ సవాల్‌గా మారిందనే అభిప్రాయం కూడా ఉంది. ప్రయాణికుల భద్రత తమ పరిధిలోని అంశం కాదన్నట్లుగా, రైల్వే ఆస్తుల రక్షణ మాత్రమే తమ బాధ్యత అన్నట్లుగా ఆర్పీఎఫ్ వ్యవహరిస్తుందని జీఆర్పీ పోలీసులు ఆరోపిస్తున్నారు. కానీ జీఆర్పీ నిర్వర్తించాల్సిన విధులను తామే నిర్వహిస్తున్నామని, జీఆర్పీ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆర్పీఎఫ్ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇలా ఇరువర్గాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా నేరస్తులకు అవకాశంగా మారుతోంది. -
ఎంఎంటీఎస్ ఘటన: నిందితుడి గుర్తించిన బాధితురాలు
హైదరాబాద్, సాక్షి: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్నం కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ యువకుడిగా నిర్ధారించారు. బాధితురాలు గుర్తించడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన యువకుడు.. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో గంజాయికి బానిసై నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రైల్లో వెళ్తున్న ఒంటరి యువతిపై అఘాయిత్యానికి యత్నించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు.. నిందితుడిని ఫొటో ద్వారా గుర్తు పట్టింది. ఆ తర్వాతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గంజాయి మత్తులోనే ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకుని సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్‌కు బయలుదేరింది. అయితే మహిళల కోచ్‌లో ఆమె యువతి ఒక్కతే ఉండగా నిందితుడు (25) ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని రైల్వే ఎస్పీ చందనా దీప్తి పరామర్శించారు. మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు సంకేతమంటూ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విరుకుపడుతోంది. -
మరదలి చేయి పట్టుకున్న బావపై కేసు..!
హైదరాబాద్: మహిళను వేధిస్తున్న ఆమె బావపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ హరీష్ తెలిపిన మేరకు.. బోరబండ ప్రాంతానికి చెందిన మహిళ (31) జీహెచ్ఎంసీలో ఉద్యోగం చేస్తోంది. 2020లో ఆమెకు వివాహం కాగా ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. భర్త, అత్తా మామలు, బావ సంజీవ్‌కుమార్ (39)కుటుంబంతో కలిసి ఉమ్మడిగా ఉంటున్నారు. కొంతకాలంగా సదరు మహిళను బావ సంజీవ్‌కుమార్ వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 22వ తేదీన బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా వచ్చి చేయి పట్టుకున్నాడు. దీంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రుల సహకారంతో సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు సంజీవ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్: అతి వేగం ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం ప్రగలపల్లి గ్రామానికి చెందిన బంటు రాజ్‌కుమార్(20), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన అటికెటి సిద్దార్ధ(21) ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆదివారం రాత్రి వీరు ఓయూ హాస్టల్ నుంచి బైక్‌పై విద్యానగర్ వెళుతుండగా అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
గృహిణికి అండగా ఉన్నందుకు...అంతమొందించాడు
హైదరాబాద్: లైంగిక వేధింపులకు గురవుతున్న ఓ మహిళకు అండగా ఉన్న లాయర్‌ను కక్షగట్టి దారుణంగా హత్య చేశాడు. చంపాపేటలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలి్పన వివరాల ప్రకారం..మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్ (56) నగరంలోని చంపాపేట డివిజన్ న్యూమారుతీనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. తన ఇంటి సమీపంలోనే ఓ అపార్ట్మెంట్లో ఇటీవల ఫ్లాట్‌ను కొనుగోలు చేసి..ఓ గృహిణి కుటుంబ సభ్యులకు అద్దెకు ఇచ్చాడు. అదే కాలనీ సమీపంలోని సుల్తానా అల్వా కాలనీ శ్మశాన వాటిక కాపలాదారుడుగా పని చేస్తున్న గులాం దస్తగిరి ఖాళీ సమయంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా కూడా పనిచేస్తున్నాడు.ఇజ్రాయిల్ కొనుగోలు చేసిన ఫ్లాట్‌లో దస్తగిరి విద్యుత్ మరమ్మతు పనులకు వెళ్తుండే వాడు. ఈ క్రమంలోనే ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్న గృహిణితో పరిచయం ఏర్పడింది. దీన్ని అలుసుగా తీసుకున్న దస్తగిరి తనను ప్రేమించాలని, అండగా ఉంటానని ఆమెను వేధించసాగాడు. వేధింపులు భరించలేని ఆ గృహిణి ఫ్లాట్ యజమాని ఇజ్రాయిల్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన దస్తగిరిని మందలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయించి.. దస్తగిరి వేధింపులు ఎక్కువ అవడంతో 25 రోజుల క్రితం ఇజ్రాయిల్ ఐఎస్‌సదన్ పోలీసులకు గృహిణితో ఫిర్యాదు చేయించాడు. ఆమెకు దస్తగిరి నుంచి ప్రాణహాని ఉందని హెచ్చరించాడు. ఆమెను బంధువుల ఇంటికి పంపించి వేశాడు. ఈ క్రమంలో పోలీసులు దస్తగిరిని స్టేషన్‌కు పిలిపించి..నామమాత్రంగా మందలించి, కౌన్సిలింగ్ చేసి పంపించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దస్తగిరి..ఇజ్రాయిల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. గత మూడు రోజులుగా ఇజ్రాయిల్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన దస్తగిరి సోమవారం ఉదయం 9 గంటలకు ఇజ్రాయిల్ తన స్కూటీపై ఒంటరిగా రావటాన్ని పసిగట్టి..ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.విషయం తెలసుకున్న స్థానికులు రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయిల్‌ను సమీపంలోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చేరి్పంచారు. పరీక్షించిన వైద్యులు ఇజ్రాయిల్ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా పోలీసులు గృహిణి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదని, తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాగా ఇజ్రాయిల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర మాజీ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. -
లైంగిక దాడికి యత్నం.. రైలు నుంచి దూకిన యువతి
సికింద్రాబాద్/గాంధీ ఆస్పత్రి: ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకటంతో తీవ్రంగా గాయపడింది. ఈ నెల 22న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో కోలుకుంటోంది. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ జి.సాయీశ్వర్‌గౌడ్ తెలిపారు.బోగీలో ఒంటరిగా ఉండటంతో..అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. ఆమె ఎక్కిన లేడీస్ కోచ్‌లో ఉన్న మరో ఇద్దరు మహిళలు రాత్రి 8 గంటల సమయంలో అల్వాల్ స్టేషన్లో దిగిపోవటంతో బోగీలో బాధితురాలు ఒక్కరే మిగిలింది. అది గమనించిన ఒక ఆగంతకుడు బోగీలోకి ప్రవేశించి బాధి తురాలిపై అఘాయిత్యం చేయబోయాడు. భయాందోళనకు గురైన ఆమె కొంపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో నడుస్తున్న రైలు నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితికి చేరిన యువతిని గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.రెండు స్టేట్మెంట్లుగాంధీ ఆస్పత్రిలో అదే రోజు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అయితే, తాను ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడ్డట్లు ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే పోలీసులు రికార్డు చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి వచ్చిన తన కుటుంబ సభ్యులకు తనపై అత్యాచార యత్నం జరిగిందన్న విషయాన్ని బాధితురాలు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోమారు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్న పోలీసులు అత్యాచార యత్నం కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నాలుగు బృందాలతో గాలింపుబాధితురాలిని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ఎస్పీ చందనదీప్తి సోమవారం పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. రెండు బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణలో ఉన్నాయని వివరించారు. నిందితుడిని గుర్తించడంలో పురోగతి సాధించామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.మెరుగైన వైద్యం అందించాంబాధితురాలిని 22న రాత్రి 11.30 గంటలకు గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ తెలిపారు. ఆ సమయంలో ఆమె స్పృహలోనే ఉన్నప్పటికీ మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించిందని చెప్పారు. ఆమె చేయి మణికట్టు వద్ద విరిగిందని, శరీరంపై గాయాలున్నాయని వివరించారు. బాధితురాలికి వెంటనే ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు తగిన వైద్యసేవలు అందించారని, సీటీ స్కానింగ్ చేయించామని వెల్లడించారు. కాగా, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సూచన మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. మంత్రుల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. లెఫ్ట్ ఎగనెస్ట్ మెడికల్ ఎడ్వైజ్ (లామా) ద్వారా బాధితురాలు గాంధీ ఆస్పత్రి నుంచి వెల్లిపోయినట్లు ప్రొఫెసర్ సునీల్ కుమార్ ఆ తర్వాత వెల్లడించారు. -
అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో మంగళవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారని.. ఆ 10 మందిపై అనర్హత వేటు విషయంలో తెలంగాణ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, కాబట్టి అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్(BRS) తరఫున ఈ జనవరిలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటోంది. మంగళవారం వాదనలు మొదలవ్వగానే.. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ సంగతిని స్పీకర్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో స్పీకర్‌ను ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందా? లేదంటే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? అని కోరారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫిర్యాదులపై ఏం చేస్తారో.. 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా పార్టీ మారిన వారికి స్పీకర్ నోటీసులు ఇవ్వలేదు. ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారు. 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని.. ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికి 3 వారాలైంది.. నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదు. మేము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదు’’ అని సుందరం వాదించారు. బీఆర్ఎస్ వాదనలు.. కీ పాయింట్స్ 2024 మార్చి 18న మొదట ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్ ఫిర్యాదు చేశాంమొదటి ఫిర్యాదు చేసినా నోటీసులు ఇవ్వలేదుహైకోర్టుకు వెళ్లేంత వరకు కూడా నోటీసులు ఇవ్వలేదురీజనబుల్ టైంలోనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పిందిహైకోర్టు చెప్పినా ఎలాంటి చర్యలు లేవుదానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసినా.. ఆయనకు నోటీసులు ఇవ్వలేదుదానం ఎంపీగా పోటీ చేసినా చర్యల్లేవ్‌కడియంకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా.. చర్యలు లేవ్‌అనర్హత పిటిషన్ విచారణపై షెడ్యూల్ చేయాలని.. హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చిందిస్పీకర్ 7 రోజుల సమయం ఇస్తూ నోటీసులు ఇచ్చారుముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేరకంగా సమాధానం ఇచ్చారుపార్టీ మారినవాళ్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారుముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ప్రచారం చేశారునోటీసులు ఇచ్చామని స్పీకర్ అంటున్నారు.. కానీ, ఆ కాపీలు మాకు అందజేయలేదుస్పీకర్ అధికారాలు సైతం న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటాయిన్యాయ సమీక్షకు స్పీకర్ అతీతులు కాదుఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయంపై నిర్దిష్టమైన గడువు విధించాలినాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలిఈక్రమంలో స్పందించిన జస్టిస్ గవాయ్.. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులు ఉన్నప్పటికీ.. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంపైనే స్పష్టత కొరవడిందని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది.ధర్మాసనం ఇంకా ఏమందంటే..ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది?: ధర్మాసనంఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దుఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు వచ్చి ఎంతకాలమైంది?రీజనబుల్ టైం అంటే గడువు ముగిసేవరకా?మొదటి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత టైం గడిచింది.నాలుగు వారాలైనా షెడ్యూల్ ఫిక్స్ చేయలేదా?అదృష్టవశాత్తూ.. ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదుమూడు వారాల సమయం విషయంలో మాత్రం స్పీకర్ రీజనబుల్‌గా ఉన్నారుతెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పులో డివిజన్ బెంచ్ జోక్యం సరైందో కాదో చూస్తాం?కౌంటర్ దాఖలుకు ప్రతివాదులు మరింత సమయం కోరగా.. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలి బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు.. స్పీకర్ తరఫున సోమవారం(మార్చి 24వ తేదీన) అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్లో.. ‘‘రీజనబుల్ టైం అంటే గరిష్టంగా మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. .. అనర్హత పిటిషన్ లను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్ కే ఉంది. గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే....పిటీషనర్లే దురుద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. కాబట్టి ఈ పిటిషన్లను డిస్మిస్ చేయాలి’’ అని కోరారు. 👉కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు(Supreme Court). కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే.. 👉ఈ పిటిషన్లకు సంబంధించి.. కొద్దిరోజుల క్రితం మహిపాల్‌రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్కు తాము రాజీనామా చేయలేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరలేదని.. మీడియాలో వచ్చిన వార్తలలో నిజం లేదని.. కాబట్టి ఈ అనర్హత పిటీషన్లకు విచారణ అర్హత లేదని వాటిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉన్న ఫొటోలు, పోస్టర్లను, తమ ఫొటోలతో కూడిన పార్టీ ఫ్లెక్సీల ఫొటోలనూ అఫిడవిట్లో జత చేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో తెలంగాణ స్పీకర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. గత విచారణలో.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదన్న పేర్కొంది. -
బటన్‌తో భద్రతకు భరోసా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగాలు చేసే మహిళలు రాత్రుళ్లు కూడా క్యాబ్‌లు, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో వారి భద్రత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంటోంది. త్వరలో ఈ పరిస్థితి మారిపోనుంది. మహిళలు క్యాబో.. ప్రైవేటు బస్సో ఎక్కినప్పుడు వేధింపులు ఎదురైతే అందులో ఉండే ఒక్క బటన్ నొక్కితే చాలు.. పోలీసులు క్షణాల్లో అక్కడ వాలిపోతారు. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుపై రవాణాశాఖ దృష్టి సారించింది. ప్రైవేటు ప్రజా రవాణా బస్సులు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లలో ‘వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్’లను తప్పనిసరి చేసింది. నిర్భయ చట్టం ప్రకారం కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు, పాత వాటిలోనూ ఈ పరికరాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. వీటికి అదనంగా ప్రతి వాహనంలో ‘ప్యానిక్ బటన్’ను కూడా తప్పనిసరి చేయనుంది. మహిళలకు వేధింపులు ఎదురైనప్పుడు ఆ బటన్ నొక్కితే చాలు.. వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకు సందేశం వెళ్లిపోతుంది. వాహనం లొకేషన్ ఆధారంగా పోలీసులు వాహనం వద్దకు చేరుకుంటారు. ఆర్టీసీ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ విధానం ఇప్పటికే అమలవుతోంది. త్వరలో ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుచేయాలని నిర్భయ చట్టంలోనే స్పష్టంగా ప్రతిపాదించినా అమల్లోకి రాలేదు. కొన్ని క్యాబ్ సంస్థలు వేటికి అవే స్వయంగా ఏర్పాటు చేసుకున్నా మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ క్రమంలో తాజాగా ట్రాకింగ్ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. రెండు లక్షల వాహనాల్లో.. – గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 8,000 లకు పైగా ప్రవేట్ బస్సులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య స్టేజీ క్యారేజీలుగా నడిచే బస్సులతో పాటు నేషనల్ పర్మిట్లపై టూరిస్టు్ట బస్సులుగా వివిధ రాష్ట్రాలకు మరికొన్ని రాకపోకలు సాగిస్తున్నాయి. – బస్సులకు అదనంగా 1.2 లక్షల క్యాబ్‌లు, సుమారు 30 వేల మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులు, ట్యాక్సీలు సేవలందిస్తున్నాయి. మొత్తంగా దాదాపు రెండు లక్షల ప్రైవేటు ప్రజా రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. – కొవిడ్ అనంతరం నగరంలో రకరకాల క్యాబ్ అగ్రిగేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్నిసార్లు వాహనాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకొన్న సమయంలో నమోదయ్యే వాహనం నంబర్‌కు, అందుబాటులోకి వచ్చే వాహనానికి సంబంధం ఉండడం లేదు. చివరకు ఏ క్యాబ్ వినియోగంలోకి వస్తుందో తెలియని గందరగోళం నెలకొంటోంది. – శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే క్యాబ్‌లలోనూ డ్రైవర్ల తీరుపై మహిళా ప్రయాణికులు తరచుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సుల్లో కూడా డ్రైవర్లు, సిబ్బంది తరచుగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో వెహికిల్ ట్రాకింగ్ అనివార్యంగా మారింది.ఎలా పనిచేస్తుందంటే.. -
మహోన్నత దానం మరింత వేగం!
సాక్షి, హైదరాబాద్: అవయవ దానం ఎంతో ఉదాత్తమైనది. సంకల్ప బలం ఉంటే గానీ సాధ్యమయ్యే విషయం కాదు. కొంతమంది కళ్లు, మూత్రపిండాలు ఇతర అవయవాలు దానం చేస్తారు. దాతలు చనిపోయాక వాటిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. తమవారి ప్రాణాలు కాపాడేందుకు కుటుంబసభ్యులు కిడ్నీ దానం చేయడం కూడా అడపాదడపా జరుగుతుంటుంది. గతంలో అవయవ దానం అంటే చనిపోయిన వారి కళ్లు దానం చేయడమే అనుకునేవారు. కానీ పదేళ్లలో పెరిగిన అవగాహన వల్ల కళ్లతో పాటు ఇతర అవయవాల దానం కూడా పెరిగింది. అవయవ మార్పిడితో పునర్జన్మ పొంది ప్రాణాలు కాపాడుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజాగా ‘తోటా’ అమలు తీర్మానంతో ఇది మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడింది. గత పదేళ్లలో రాష్ట్రంలో అవయవాలను దానం చేసిన వారి సంఖ్య 1,594 కాగా.. ఎవరైనా చనిపోయిన తర్వాత, బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించిన కంటి కారి్నయా, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇతర అవయవాలను ట్రాన్స్ ప్లాంట్ చేయడం ద్వారా పన్నెండేళ్లలో ఏకంగా 6 వేల మంది పునర్జన్మ పొందారు. ఇంకా 3,823 మంది అవయవ మార్పిడి కోసం రాష్ట్ర ప్రభుత్వ ‘జీవన్‌దాన్’ కార్యక్రమం కింద నమోదు చేసుకున్నారు. దీనిని బట్టే రాష్ట్రంలో అవయవ దానం, అవయవ మార్పిడిపై ప్రజల్లో అవగాహన ఎంతగా పెరుగుతోందో స్పష్టమవుతోంది.2021 నుంచి ఏటా 700 సగటుతో అవయవ మార్పిడి అవయవ మార్పిడిలో దేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ అవయవ మార్పిడి రేటు 1.9 పర్ మిలియన్ పాపులేషన్ (పీఎంపీ)గా ఉంది. ఇది జాతీయ సగటు (0.65 పీఎంపీ) కంటే చాలా ఎక్కువ. తెలంగాణలో కూడా చైతన్యం పెరగడంతో 2021 నుంచి ప్రతి ఏటా 700 సగటుతో అవయవ మార్పిడి కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఊపిరితిత్తులు, కాలేయం, కంటి కారి్నయా మార్పిడిలు ఎక్కువగా ఉండగా, బ్రెయిన్ డెడ్ అయిన వారి ద్వారా సేకరించి గుండెను మార్చే శస్త్రచికిత్సలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు నాలుగు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం ప్రజల్లో పెరిగిన చైతన్యాన్ని సూచిస్తున్నాయి. సవరించిన చట్టాన్ని అమలు చేసేలా తీర్మానం రాష్ట్రంలో 1994 నాటి అవయవ మార్పిడి చట్టం ‘టీహెచ్‌ఓఏ’ (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గన్స్ యాక్ట్)ను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గత పదకొండేళ్లుగా అమలు చేస్తూ వచ్చింది. దీంతో అవయవ మార్పిడి ఆశించిన స్థాయిలో జరగలేదు. కానీ ఇప్పుడు.. ఆ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన ‘టీహెచ్ఓటీఏ–తోటా’ (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్) చట్టాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసేలా సోమవారం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మరింత పారదర్శకంగా, మానవ అవయవాల వ్యాపారాన్ని నిరోధించి, అవసరమైన వారికి చట్టబద్ధంగా, ఎక్కువ సంఖ్యలో అవయవ మార్పిడి జరిగేందుకు అవకాశం ఏర్పడింది. ‘జీవన్‌దాన్’ ద్వారా పునర్జన్మ రాష్ట్ర ప్రభుత్వం ‘జీవన్‌దాన్’ కార్యక్రమం ద్వారా అధికారికంగా అవయవమార్పిడి ప్రక్రియను నిర్వహిస్తోంది. ఎవరికైనా వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా మూత్రపిండం (కిడ్నీ), గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె నాళాలు, కంటి కారి్నయా, క్లోమం (ప్యాంక్రియాస్) వంటి అవయవాలను మారుస్తున్నారు. 2013 నుంచి ఇప్పటివరకు 6,007 మందికి మార్చి కొత్త జీవితాన్ని అందించారు. ఈ 6,007 మందిలో అత్యధికంగా 2,394 మందికి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరగగా, కాలేయం (లివర్) మార్పిడి చికిత్సలు 1,462 మందికి జరిగాయి. 2013 నుంచి రాష్ట్రంలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా జరుగుతుండడం గమనార్హం. అప్పటినుంచి ఇప్పటివరకు 218 మందికి గుండె మార్పిడిలు జరగగా, 2017, 2022లో వరుసగా 32, 31 చొప్పున గుండె మార్పిడి చికిత్సలు జరిగాయి. ‘తోటా’తో వేగవంతం! ‘తోటా’ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా మానవ అవయవాల మార్పిడి ప్రక్రియ వేగవంతం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్రెయిన్ డెడ్ అయినవారు, మరణించిన వారినుంచి అవసరమైన అవయవాలను సేకరించి, మార్పిడి చేసేందుకు వీలుగా నిబంధనల్లో మార్పులు జరిగాయి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు.. వారి మనవళ్లు, మనవరాళ్లకు అవయవ దానం చేయడానికి ఈ చట్టం అనుమతి ఇస్తోంది. కొన్ని రకాల జన్యుపరమైన సమస్యల వల్ల పిల్లలకు కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చినప్పుడు వారి గ్రాండ్ పేరెంట్స్ కాలేయ దానం (కాలేయంలో కొంత భాగం) చేయడానికి అవకాశం కలుగుతోంది. అలాగే 1995 నాటి నిబంధనల ప్రకారం బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసే అధికారం న్యూరో సర్జన్లు, న్యూరో ఫిజీషియన్లకు మాత్రమే ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ఫిజీషియన్, సర్జన్, ఇంటెన్సివిస్ట్, అనస్థీషియన్ కూడా బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేయడానికి అర్హులు. మరోవైపు అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడి చేస్తే ఇప్పటివరకు రూ.5 వేల జరిమానా, 3 సంవత్సరాల వరకూ జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఒక కోటి రూపాయల వరకు జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఏర్పడింది. దాతల్లో 41 నుంచి 60 ఏళ్ల వారే ఎక్కువ అవయవ దాతల్లో 41 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల లోపు వారే అధికంగా ఉన్నారు. 2020 నుంచి అవయవ దానం చేసిన వారిని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఐదేళ్లలో 41 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వారు 187 మంది అవయవదానాలు చేయగా, 51 నుంచి 60 ఏళ్లలోపు వారు 190 మంది ఉన్నారు. ఇక 61 నుంచి 70 వయస్సు గల వారు 88 మంది ఉన్నారు. అవయవదానం చేసిన యువకుల్లో 21 నుంచి 30 ఏళ్ల వయస్సు వారు 149 మంది ఉండగా, 31 నుంచి 40 ఏళ్ల లోపు వారు 140 మంది ఉన్నారు. ఇక 1 నుంచి 10 ఏళ్ల వయస్సు వాళ్లు ఆరుగురు, 11 నుంచి 20 ఏళ్ల లోపు వారు 64 మంది ఉన్నారు. 71 నుంచి 78 ఏళ్ల లోపు వారు 36 మంది ఉంటే, 81 ఏళ్లు పైబడిన వారు 2020లో ఇద్దరు, 2023లో ఒక్కరు వారి అవయవాలను దానం చేశారు. కాగా 2020 నుంచి అవయవ దానం చేసిన 863 మందిలో మహిళలు 672 మంది కాగా, పురుషులు కేవలం 191 మాత్రమే కావడం గమనార్హం. అవయవాల కోసం వెయిటింగ్లో 3,823 మంది అవయవ మార్పిడి కోసం ‘జీవన్‌దాన్’ వద్ద ఇంకా 3,823 మంది నమోదు చేసుకుని ఉన్నారు. నిమ్స్, ఉస్మానియా, గాం«దీ, ఈఎస్ఐతో పాటు హైదరాబాద్‌లోని 41 ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తారు. అత్యధికంగా నిమ్స్‌లో 620కి పైగా శస్త్రచికిత్సలు జరిగాయి. – డాక్టర్ శ్రీభూషణ్ రాజు (జీవన్‌దాన్ నోడల్ ఆఫీసర్) -
భూ భారతితోపాటు భూ విలువల పెంపు
సాక్షి, హైదరాబాద్: ఉగాది తర్వాత మంచిరోజున భూ భారతి చట్టాన్ని అమల్లోకి తేవడంతో పాటు అదేరోజు భూముల విలువలను కూడా పెంచనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూముల విలువలు పెంచాలని గతంలోనే భావించినా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండడం, దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాయిదా వేశామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.5 వేల కోట్లు పెరుగుతుందని బడ్జెట్లో ఎలా చెబుతారన్న ప్రశ్నకు స్పందించారు. ‘రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడం, భూముల విలువల సవరణను అమల్లోకి తీసుకుని వస్తున్నందున ఆదాయం పెరుగుతుంది. భూముల విలువలను మార్కెట్ ధరలకు అనుగుణంగా శాస్త్రీయంగా అధ్యయనం చేసి పెంచాం. అదే సమయంలో మార్కెట్ ధర కంటే ఎక్కువ ఉన్నచోట తగ్గిస్తాం..’అని మంత్రి వివరించారు. ఐదారు వేలమందికి సర్వేయర్ లైసెన్సులిస్తాం ‘భూముల రిజిస్ట్రేషన్లకు ఇకపై సర్వే మ్యాపులను తప్పనిసరి చేయనున్నాం. భూమి విక్రయించే వారు తమ పాస్ పుస్తకంలో ఉన్న భూమి ఆధారంగా సర్వే చేయించి మ్యాపులు జోడించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయ భూములకు, ఆ తర్వాత ప్లాట్లకు అమలు చేస్తాం. సర్వేయర్ల కొరత తీర్చడానికి వెయ్యి మందిని రిక్రూట్ చేసుకుంటాం. ప్రతి మండలంలో సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్‌ని నియమిస్తాం. అలాగే రాష్ట్రంలో ఐదారు వేల మందికి శిక్షణ ఇచ్చి వారికి సర్వేయర్ లైసెన్స్‌లు మంజూరు చేస్తాం. ఏ అధికారి రిజిస్ట్రేషన్ చేస్తారో తెలియకుండా ఏర్పాట్లు రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే 15 ప్రధాన సబ్ రిజి్రస్టార్ కార్యాలయాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఆధార్ అనుసంధాన ప్రక్రియ, స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేస్తాం. క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే వాటిని పరిష్కరించిన తర్వాత దీనిని రాష్ట్ర వ్యాప్తం చేస్తాం. నాలుగైదు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఒకేచోట చేర్చి కౌంటర్లు పెడ్తాం. ఏ అధికారి రిజిస్ట్రేషన్ చేస్తారో తెలియకుండా చూస్తాం. టోకెన్ నంబర్లు ఇచ్చి.. ఏ కౌంటర్లో నంబర్ వస్తే అక్కడ రిజిస్ట్రేషన్ జరిగేలా చేస్తాం. దీనివల్ల అవినీతి తగ్గుతుంది. ఇదివరకు ప్రకటించినట్లు ధరణిపై ఫోరెన్సిక్ అడిట్ నిర్వహిస్తాం. ఆన్లైన్లో నమోదు చేసుకున్న దాదాపు 12 లక్షల సాదా బైనామాలను మాత్రమే పరిష్కరిస్తాం..’అని పొంగులేటి చెప్పారు.గ్రామ పరిపాలన అధికారులకు పరీక్ష ‘రాష్ట్రంలో 10,956 వీఆర్వో పోస్టులను మంజూరు చేశాం. ప్రస్తుతం వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వీఆర్వో, వీఆర్ఏలను ఈ పోస్టుల్లో నియమించడానికి ఇంటర్ అర్హతగా నిర్వహించే రాత పరీక్షకు 2,3 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఈ అర్హత ఉన్నవారు 6 వేల మంది వరకు ఉంటారు. వారిలో ఉత్తీర్ణత సాధించిన వారిని సర్దుబాటు చేస్తాం. మిగిలిన వారిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తాం. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌ను మార్చి 31 తరువాత పొడిగించే యోచన ప్రస్తుతానికి లేదు’అని మంత్రి తెలిపారు. -
డ్రిల్లింగ్ & బ్లాస్టింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకంతోపాటు, అందులో చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి సత్వర అనుమతులకు ప్రయత్నించాలని నీటిపారుదల శాఖను ఆదే శించింది. ఏఎంఆర్ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని 43.93 కి.మీల సొరంగ మార్గంలో తరలించి లింక్ కాల్వ ద్వారా డిండి జలాశయంలోకి పోయాల్సి ఉంది. సొరంగాన్ని రెండు టన్నెల్ బోర్ మెషీన్ల (టీబీఎం) సహాయంతో రెండు వైపులా (ఇన్లెట్, అవుట్లెట్) నుంచి తవ్వుకుంటూ పోతున్నారు. శ్రీశైలం జలాశయ ఇన్లెట్ నుంచి 13.93 కి.మీల పనులు పూర్తి కాగా,అవతలి వైపు నుంచి మరో 20.43 కి.మీల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. మధ్యలో 9.55 కి.మీల మేర సొరంగం తవ్వకాలు జరగాల్సి ఉంది. ఇకపై టీబీఎంతో రెండు వైపులా తవ్వకాలను విరమించుకొని ప్రత్యామ్నాయంగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించనున్నారు. రెండు వైపుల నుంచి సొరంగాన్ని నేరుగా అనుసంధానం చేసేందుకు ఇప్పటి వరకు తవ్వకాలు జరిగాయి. ఇకపై నేరుగా తవ్వకాలను కొనసాగించరు. రెండు వైపులా తవ్వకాలు ఆగిపోయిన చివర పక్కభాగం నుంచి డ్రిలింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు జరుపుకుంటూపోయి రెండు చివరలను అనుసంధానం చేస్తారు దీంతో కిలోమీటర్ వరకు సొరంగం పొడవు పెరిగే అవకాశముంది. రెండు టీబీఎంలను సొరంగంలో ఇప్పుడున్న ప్రాంతంలోనే సమాధి చేస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగించండి కార్మికులను వెలికితీసేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలను ఏప్రిల్ 10లోగా ముగించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎస్‌ను ఆదేశించారు. నెలరోజులుగా ప్రమాద స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని విపత్తుల నిర్వహణ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా ముఖ్యమంత్రికి వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ కళ్లకు కట్టేలా ప్రమాదం జరిగిన రోజు నుంచి, ఇప్పుడున్న పరిస్థితులపై ఫొటోలతో సహా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాదకర జోన్ ఉన్నట్టు గుర్తించామన్నారు. జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం..అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సి ఉంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. అవసరమైన అనుమతులు తీసుకోవాలి ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ ఆపద సమయంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కేంద్రం నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలడంతో ఎనిమిది మంది కార్మికులు గల్లంతు కాగా, వీరిలో గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహాన్ని మార్చి 9న వెలికితీశారు. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగించాలని, అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అవసరమైన అనుమతులు తీసుకోవాలి కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఆపద సమయంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగం కుప్ప కూలడంతో ఎనిమిది మంది కార్మికులు గల్లంతు కాగా, వారిలో గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహాన్నిమార్చి 9న వెలికితీశారు. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగించాలని, అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలని సీఎం చెప్పారు. తెలంగాణ,ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 23న హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు.. కేంద్ర ఎన్నికల సంఘం సోమ వారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ప్రభా కర్ రావు పదవీకాలం మే 1తో ముగియనుంది. తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 4న నామినేషన్లు స్వీకరిస్తారు, ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 గడువు. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 25న ఓట్ల లెకింపు, ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ తెలిపింది. -
అసెంబ్లీకి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండా తనపై విధించిన సస్పెన్షన్‌కు సంబంధించిన అధికారిక బులెటిన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం స్పీకర్ చాంబర్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను జగదీశ్‌రెడ్డి కలిశారు. తనను అన్యాయంగా, ఏకపక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని, ఇప్పటికైనా తన సస్పెన్షన్‌పై బులెటిన్ విడుదల చేయడంతోపాటు అసెంబ్లీ వెబ్సైట్లో పెట్టాలని స్పీకర్‌కు అందజేసిన లేఖలో జగదీశ్‌రెడ్డి కోరారు.కాగా అసెంబ్లీ లాబీలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష చాంబర్‌కు వచ్చిన జగదీశ్‌రెడ్డిని సభ ఆవరణ నుంచి బయటకు వెళ్లాలని చీఫ్ మార్షల్ కరుణాకర్ కోరారు. తనను సస్పెన్షన్ చేసినట్టు బులెటిన్ చూపిస్తే బయటకు వెళతానని జగదీశ్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. తాను అసెంబ్లీకి రావడంపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. సాయంత్రం మూడు గంటలకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలోనే జగదీశ్‌రెడ్డి గడిపారు. అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోంది: రాజ్యాంగ విలువ లు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోందని జగదీశ్‌రెడ్డి అ న్నారు. అసెంబ్లీ లాబీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నన్ను అసెంబ్లీ సమావేశాల నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ కారణాలు, ఆ ధారాలు చూపడం లేదు. మందబలంతో సభ నడుపుతామంటే కుదరదు.కోర్టు కు వెళతాననే భయంతోనే నా సస్పెన్షన్‌కు సంబంధించిన బులెటిన్ విడుదల చేయడం లేదు. సభ్యులు వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఏకంగా ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మంత్రులు గంట ప్రయాణానికి కూడా హెలికాప్టర్లను వాడుతున్నారు. జాన్పాడ్లో జరిగిన దావత్‌కు కూడా మాజీమంత్రి జానారెడ్డి హెలికాప్టర్లో వచ్చారు’అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తం..అయోమయం: బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా తయారైందని..అసలు ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికే స్పష్టత లేక అయోమయంలో ఉన్నట్టు కనిపిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శాసనసభలో పద్దులపై చర్చలో భాగంగా సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. అసలు రాష్ట్రం మొత్తం అప్పులెన్ని.. వాటిపై చెల్లిస్తున్న వడ్డీ ఎంత.. కొత్తగా తెస్తున్న అప్పు ఎంత ? లాంటి వివరాలేవీ తెలపటం లేదని విమర్శించారు. -
ఉగాదిలోపు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి ఉగాదిలోపు కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం పార్టీవర్గాల్లో ఊపందుకుంది. దీనికి సంబంధించి ఒకటి, రెండురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని ముఖ్యనేతలు చెబుతున్నారు. తాజాగా కేరళ పార్టీ అధ్యక్షుడిగా రాజీవ్చంద్రశేఖర్ను నియమించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. త్వరలోనే కేంద్రమంత్రి శోభకరాంద్లజే తెలంగాణకు వచ్చి అభిప్రాయసేకరణ జరుపుతారని తెలుస్తోంది. ఇది ముగిశాక ఒకనేత పేరుతో నామినేషన్ పత్రాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి.. మరుసటి రోజు అధ్యక్షుడి ప్రకటన ఉండొచ్చునని అంటున్నారు.అధ్యక్ష పదవి కోసం పార్టీలో పాత–కొత్త నేతల మధ్య ‘జాతివైరం’స్థాయిలో ఇప్పటికీ సాగుతోంది. పార్టీ సిద్ధాంతాలు, హిందుత్వ భావాలున్న పాత నాయకులకే ఈ పదవి ఇవ్వాలని కొందరు పట్టు పడుతున్నారు. పార్టీలో చేరాక, ఎంపీగా, ఎమ్మెల్యేగా లేదా మరో పదవికో ఎన్నికయ్యాక పాత–కొత్త అంటూ ఉండదని కొందరు (గత మూడు, నాలుగేళ్లలో చేరి ఆయా పదవులు పొందినవారు) వాదిస్తున్నారు. పార్టీలో కొత్తరక్తం నింపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనేక మార్పులు చేయాల్సి ఉంటుందని ఈ వర్గం సూచిస్తోంది.అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముఖ్యనేతలు, సీనియర్ నేతలు, పాత–కొత్త నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ⇒ ఈసారి బీసీ వర్గానికి చెందిన నేతకు అవకాశం దక్కొచ్చుననే ఊహాగానాలు ఎక్కువగా సాగుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరి్వంద్, బీజేఎల్పీ ఉపనేత పాయల్‌శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి తదితరులు పోటీపడుతున్నారు. ⇒ ఇక ఓసీ నాయకుల విషయానికొస్తే ఎంపీలు డీకే అరుణ, ఎం.రఘునందన్‌రావు, ఇంకా పి.మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ⇒ అధ్యక్ష పదవిని కోరుకుంటున్న వారిలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారు. అయితే కొన్నిరోజులుగా అనూహ్యంగా కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంజయ్‌ను మళ్లీ అధ్యక్షుడిగా నియమించేందుకు బీజేపీ అధినాయకత్వం మొగ్గుచూపొచ్చుననేది ఈ ప్రచార సారాంశం. అయితే అధ్యక్ష పదవి కోసం తాను పోటీలో లేనంటూ తాజాగా సంజయ్ వివరణ ఇచ్చారు. అయినా, పార్టీని ముందుండి నడిపించేందుకు ఆయన్నే అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని కొందరు నేతలు చెబుతున్నారు. బీసీ నేతకు ఇస్తే ఈటల రాజేందర్‌కు దక్కొచ్చునని గతంలోనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. పీఎం మోదీ, సీనియర్ నేతలు అమిత్ షా, నడ్డా వంటివారు ఈటలకే ఓటేస్తారనే ప్రచారం జరిగింది.నేనంటే నేను అని ప్రచారంగతంలో ఎన్నడూలేని విధంగా తనకే అధ్యక్ష పదవి వస్తుందంటూ కొందరు ముఖ్యనేతలు సైతం ప్రచారం చేసుకోవడం పట్ల రాష్ట్ర పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తాను అధ్యక్షుడిని అవుతున్నానంటూ వారు మీడియాకు, అనుచరులకు లీక్‌లు ఇచ్చుకోవడం ఇటీవల బాగా పెరిగిపోయింది. పార్టీనాయకుల్లో ఇలాంటి పోకడలు గతంలో ఎప్పుడూ లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై రాష్ట్రపార్టీలో ఏకాభిప్రాయం కుదరని కారణంగానే జాతీయ నాయకత్వం కూడా డైలమాలో పడిందని సమాచారం. ఈ పరిస్థితుల్లో అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం
సాక్షి, హైదరాబాద్/ గాంధీఆస్పత్రి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటనలో ఓ యువతి తీవ్ర గాయాలపాలవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసేలా ఆదేశించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్లే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన మొత్తం తెలంగాణ సమాజాన్ని కలిచివేసేదిలా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.హోంశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో ఈ తరహా దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో కవిత ఫోన్లో మాట్లాడి యువతిపై అత్యాచారయత్నం ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కరువైంది: సబిత, శ్రీనివాస్గౌడ్నడుస్తున్న రైలులో అత్యాచారయత్నం రాష్ట్రానికే సిగ్గుచేటని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరువైంద ని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసగౌడ్ ఆవే దన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను వారు సోమవారం పరామ ర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో షీ టీమ్ పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. -
లైంగిక దాడికి యత్నం.. రైలు నుంచి దూకిన యువతి
సికింద్రాబాద్/గాంధీ ఆస్పత్రి: ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకటంతో తీవ్రంగా గాయపడింది. ఈ నెల 22న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో కోలుకుంటోంది. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ జి.సాయీశ్వర్‌గౌడ్ తెలిపారు.బోగీలో ఒంటరిగా ఉండటంతో..అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది.ఆమె ఎక్కిన లేడీస్ కోచ్‌లో ఉన్న మరో ఇద్దరు మహిళలు రాత్రి 8 గంటల సమయంలో అల్వాల్ స్టేషన్లో దిగిపోవటంతో బోగీలో బాధితురాలు ఒక్కరే మిగిలింది. అది గమనించిన ఒక ఆగంతకుడు బోగీలోకి ప్రవేశించి బాధి తురాలిపై అఘాయిత్యం చేయబోయాడు. భయాందోళనకు గురైన ఆమె కొంపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో నడుస్తున్న రైలు నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితికి చేరిన యువతిని గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు స్టేట్మెంట్లుగాంధీ ఆస్పత్రిలో అదే రోజు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అయితే, తాను ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడ్డట్లు ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే పోలీసులు రికార్డు చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి వచ్చిన తన కుటుంబ సభ్యులకు తనపై అత్యాచార యత్నం జరిగిందన్న విషయాన్ని బాధితురాలు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోమారు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్న పోలీసులు అత్యాచార యత్నం కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నాలుగు బృందాలతో గాలింపుబాధితురాలిని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ఎస్పీ చందనదీప్తి సోమవారం పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. రెండు బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణలో ఉన్నాయని వివరించారు. నిందితుడిని గుర్తించడంలో పురోగతి సాధించామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.మెరుగైన వైద్యం అందించాంబాధితురాలిని 22న రాత్రి 11.30 గంటలకు గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ తెలిపారు. ఆ సమయంలో ఆమె స్పృహలోనే ఉన్నప్పటికీ మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించిందని చెప్పారు. ఆమె చేయి మణికట్టు వద్ద విరిగిందని, శరీరంపై గాయాలున్నాయని వివరించారు. బాధితురాలికి వెంటనే ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు తగిన వైద్యసేవలు అందించారని, సీటీ స్కానింగ్ చేయించామని వెల్లడించారు.కాగా, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సూచన మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. మంత్రుల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. లెఫ్ట్ ఎగనెస్ట్ మెడికల్ ఎడ్వైజ్ (లామా) ద్వారా బాధితురాలు గాంధీ ఆస్పత్రి నుంచి వెల్లిపోయినట్లు ప్రొఫెసర్ సునీల్ కుమార్ ఆ తర్వాత వెల్లడించారు. -
ప్లస్ టు పరీక్షల్లో కాలిక్యులేటర్‌కు అనుమతి
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే 12వ క్లాస్ పరీక్షలకు ఇకనుంచి ప్రాథమిక స్థాయి (బేసిక్) కాలిక్యులేటర్‌ను అనుమతించనున్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇది అమలులోకి వస్తుంది. సాధారణ కూడికలు, తీసివేతలు, భాగాహారాలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఉండే కాలిక్యులేటర్‌ను మాత్రమే విద్యార్థులు పరీక్షకు తీసుకెళ్ళవచ్చు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన కాలిక్యులేటర్‌ను అనుమతించరు. సీబీఎస్ఈ 140వ బోర్డ్ మీటింగ్ సోమవారం జరిగింది. ఇందులో కాలిక్యులేటర్‌కు అనుమతితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థి ఆలోచన శక్తిని సరికొత్త కోణంలో అంచనా వేయడం, సిలబస్ విధానం, మూల్యాంకనంలో మార్పులు తదితర సంస్కరణలు తీసుకొచ్చారు. ఇకనుంచి ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం ఇకనుంచి ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎంఎస్) విధానంతో డిజిటల్ మూల్యాంకనం పద్ధతిని అనుసరించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ప్రశ్నపత్రాలను స్కాన్ చేసి, సాఫ్ట్వేర్ ద్వారా మూల్యాంకనం చేస్తారు. దీనివల్ల ఫలితాలు త్వరగా వెల్లడయ్యే వీలుంది. అంతే కాకుండా మూల్యాంకనంలో తప్పులను సాఫ్ట్వేర్ గుర్తించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియను ముందుగా 10, 12 తరగతుల సైన్స్, మేథ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. సబ్జెక్టుల్లో నైపుణ్యం మేళవింపు చదువుతున్నప్పుడే నైపుణ్యం సంపాదించాలనే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తేవాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. పారిశ్రామిక భాగస్వామ్యంతో నైపుణ్యాన్ని సబ్జెక్టుల్లో మేళవించే ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. టెన్త్ స్టాండర్డ్ నుంచే దీన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. పాఠం పూర్తయిన రోజే సైన్స్, సోషల్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. లోతైన ప్రశ్నలతో కూడిన రీజనింగ్ అంశాలను విద్యార్థులకు అందిస్తారు. ఈ మేరకు బోధన ప్రణాళికకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విధానం 2026–27 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. -
'కార్లు కడిగితే రూ.10 వేలు జరిమానా'
సాక్షి, హైదరాబాద్: వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు జలమండలి పడరాని పాట్లు పడుతోంది. పదేళ్ల నాటి జనాభాకు తగ్గట్టు కేటాయింపులున్నా... వాటినే సర్దుబాటు చేసి ఎండకాలంలో గట్టెక్కేందుకు అనువైన అన్ని మార్గాలపై దృష్టి సారించింది. ఇప్పటికే నీటి సరఫరాలోని లీకేజీలను గుర్తించి చెక్ పెట్టిన జలమండలి (Water Board) తాజాగా సరఫరా చేసే నీరు తాగునీటికి మినహా ఇతర అవసరాలకు వాడకుండా కట్టడి చేసే చర్యలకు ఉపక్రమించింది. నల్లా వదిలిన సమయంలో తాగు నీటితో వాహనాలు, ఇంటి ముందు బండలు కడగడంతో పాటు గార్డెన్ ఇతర అవసరాలకు వినియోగించడాన్ని జలమండలి సీరియస్‌గా పరిగణించింది. మండుటెండలకు తాగునీటి వినియోగంతో పాటు పడిపోతున్న భూగర్భజలాలతో నీటికి డిమాండ్ పెరగుతోంది.ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటి కంటే అధికంగా సరఫరా చేసే పరిస్థితులు లేవు. దీంతో బెంగళూరు తరహాలో తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించేవారిపై జరిమానాతో కొరఢా ఝళిపిస్తోంది. తాజాగా జీహెచ్ఎంసీ (GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మీ కూడా తాగు నీటి వృథాను సీరియస్‌గా పరిగణించి రూ. 10 వేల జరిమానా విధించాలని జలమండలి యంత్రాంగానికి సూచించారు. ఇప్పటికే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఇద్దరు వినియోగదారును గుర్తించి తొలిసారిగా జరిమానాగా రూ. వెయ్యి విధించి జలమండలి నోటీసులు జారీ చేసింది. తాజాగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి క్షేత్ర స్థాయిలో నీటివృధాపై బృందాలను రంగంలోకి దింపింది. యువకుడికి ఫైన్ 15 రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నం. 78లో ఒక యువకుడు తాగు నీటితో బైక్ వాషింగ్ (Bike Washing) చేస్తుండగా గమనించి తొలిసారి తప్పుగా భావించి రూ.1000 జరిమానా విధించారు. జర్నలిస్టు కాలనీలో ఒక మహిళ తాగునీటితో వాహనం శుభ్రం చేయడం గుర్తించి ఫైన్ విధించారు. ప్రస్తుతం 547 ఎంజీడీల నీరు సరఫరాజలమండలి పరిధిలో 13.7 లక్షల నీటి కనెక్షన్లు ఉండగా ప్రతి రోజూ 547.86 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. పదేళ్ల నాటి నీటి కేటాయింపులతో రెండింతలు పెరిగిన జనాభాకు రోజువారీగా తాగు నీరు సరఫరా (Drinking Water Supply) పెద్ద సవాలుగా తయారైంది. నగరంలో తగినంత స్థాయిలో భూగర్భ జలాలు లేకపోవడం వల్ల 150–200 కిలో మీటర్ల దూరం నుంచి జలాలను తరలించి శుద్ది చేసి తాగునీరు సరఫరా చేస్తోంది. ప్రతి వెయ్యి లీటర్ నీటి సరఫరాకు రూ.48 ఖర్చు భరిస్తోంది. ఇదిలా ఉండగా జలమండలి సరఫరా చేస్తున్న నీటిలో సుమారు 20 శాతం పైగా నీరు లీకేజీలతో వధా పోతున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇక RRR వరకు హెచ్ఎండీఏ అనుమతులే..ఇప్పటికే లీకేజీలు చెక్...! ఇప్పటికే తాగు నీటి సరఫరాలో లీకేజీలను చెక్‌పెట్టింది. ప్రధాన జలాశయాల నుంచి సర్వీస్ రిజర్వాయర్ల వరకు మార్గమధ్యలో లీకేజీలను గుర్తించి మరమత్తు పనులు పూర్తి చేసింది. మరోవైపు క్షేత్ర స్థాయిలో సర్వీస్ పైప్లైన్లపై దష్టి సారించి లీకేజీలలను నివారించింది. కార్లు కడిగితే రూ.10 వేలు జరిమానా వేయండి తాగు నీటితో కొందరు నిత్యం తమ కార్లు, ఇంటి ముందున్న బండలు, రోడ్లు కడుగుతున్నారు. వారికి తాగు నీటి విలువ తెలియడం లేదు. అలా వ్యవహరిస్తున్న వారిపై రూ. 10 వేల జరిమానా విధించాలి. – గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ మేయర్తాగు నీరు వృథా చేయొద్దు తాగు నీరు అనేది విలాసవంతమైనది కాదు. అత్యవసరమైనది. నీటి వృథా (Water wastage) తగ్గించగలగితే ఇతరులకు దాహార్తి తీర్చినవారవుతారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నీటిని తరలించి శుద్ది చేసి సరఫరా చేస్తున్నాం. ఇంతటి ప్రాముఖ్యమైన నీటిని వృథా చేయకూడదు. - అశోక్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, జలమండలి -
అత్యాధునిక గుండెపోటు సంరక్షణ కేంద్రంగా అపోలో
హైదరాబాద్: అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఎ) నుండి కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ (సిఎస్ సి) సర్టిఫికేషన్‌తో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ దేశంలో స్ట్రోక్ చికిత్సకు సంబంధించి నూతన ప్రమాణాన్ని నెలకొల్పింది. ప్రత్యేక స్ట్రోక్ బృందాలు, అధునాతన ఇమేజింగ్‌తో స్ట్రోక్ డయాగ్నసిస్, క్రిటికల్ కేర్‌లో అత్యవసర ప్రతిస్పందనలతో అత్యంత కఠినమైన ప్రమాణాలను అందుకోగలదని ఏహెచ్ఎ సర్టిఫికేషన్‌తో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ విజయవంతంగా నిరూపించుకుంది. అత్యున్నత స్ట్రోక్-కేర్ సర్టిఫికేషన్‌ను పొందిన భారతదేశంలో మొట్టమొదటి సంస్థగా ఏహెచ్ఎ దీనిని గుర్తించింది. జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ 24 గంటలూ పూర్తిగా అంకితం చేయబడిన, ప్రత్యేకమైన, మల్టీడిసిప్లినరీ స్ట్రోక్ బృందాన్ని కలిగి ఉంది,ఈ బృందంలో అత్యవసర వైద్యులు, న్యూరాలజిస్టులు, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్టులు, న్యూరో సర్జన్లు, ఇంటెన్సివిస్టులు, ప్రత్యేక నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మల్టీడిసిప్లినరీ నిపుణుల బృందంలో డాక్టర్ అలోక్ రంజన్-సీనియర్ కన్సల్టెంట్ & హెచ్ఓడి న్యూరోసర్జరీ, డాక్టర్ ఇమ్రాన్ సుభాన్, సీనియర్ కన్సల్టెంట్ & హెడ్ ఎమర్జెన్సీ మెడిసిన్; డాక్టర్ కె. సుబ్బారెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్ & హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్: డాక్టర్ సురేష్ గిర్గాని, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ మరియు డాక్టర్ సి. రాజేష్ రెడ్డి, న్యూరాలజిస్ట్ ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ, "భారతదేశంలో మొట్టమొదటి ఆసుపత్రిగా ప్రతిష్టాత్మకమైన ఏహెచ్ఎ సర్టిఫికేషన్ సాధించడం, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించడంలో మా అచంచలమైన నిబద్ధతను వెల్లడిస్తుంది. సమయం, నైపుణ్యం ప్రాణాలను కాపాడుతుందని గుర్తించిన మేము మా శ్రేష్ఠత వినియోగంలో ఎలాంటి అవకాశాన్ని వదులుకోము. ఈ సర్టిఫికేషన్ రోగులకు వేగవంతమైన, అత్యంత ఖచ్చితమైన సంరక్షణ మార్గదర్శకాలకు హామీ ఇస్తుంది, సాధ్యమైనంత ఉత్తమంగా కోలుకునేలా చేస్తుంది. ఇది మా నిరంతర శ్రేష్ఠత సాధన, ప్రపంచ నాణ్యత, రోగి భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండటాన్ని ప్రతిబింబిస్తుంది" అని అన్నారు. అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ, శ్రీ వి. తేజస్వి రావు మాట్లాడుతూ "ఈ ధృవీకరణ మేము అందించే అత్యున్నత స్థాయి సంరక్షణకు గుర్తింపు, దేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మార్చాలనే మా ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.రోగ నిర్ధారణ నుండి రీహాబిలిటేషన్ వరకు స్ట్రోక్ కేర్‌కు క్రాస్-డిసిప్లినరీ విధానాన్ని అవలంబించడం ద్వారా, ప్రతి రోగికి వైకల్యాన్ని తగ్గించడానికి, కోలుకోవడాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన రీతిలో రూపొందించిన వైద్య సహాయం, క్రిటికల్-కేర్ మద్దతు లభిస్తుందని మేము నిర్ధారిస్తున్నాము. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, నిరంతర పరిశోధన కమ్యూనిటీ ఔట్రీచ్ ద్వారా, ప్రతిచోటా రోగులు అత్యున్నత ప్రమాణాల తో చికిత్సను పొందగలిగేలా మేము స్ట్రోక్ కేర్‌ను పెంచుతున్నాము" అని అన్నారు. ఈ అక్రిడిటేషన్ మైలురాయి స్ట్రోక్ లక్షణాలు కనిపించటం నుండి రీ హాబిలిటేషన్, స్ట్రోక్ తరువాత రికవరీ ద్వారా రోగులకు మద్దతు ఇవ్వడం వరకూ అపోలో హాస్పిటల్స్ తీసుకున్న సమగ్ర విధానాన్ని వెల్లడిస్తుంది. తరచుగా "బ్రెయిన్ స్ట్రోక్ " గా పిలువబడే స్ట్రోక్, మెదడుకు రక్త సరఫరా సరిగా జరగనప్పుడు సంభవిస్తుంది. సాధారణంగా మూసుకుపోయిన లేదా పగిలిన నాళం కారణంగా, రక్త ప్రవాహం సరిగా లేకపోవడం జరుగుతుంది.ఈ కారణం వల్ల మాట్లాడటం, కదలడం లేదా శరీరం ఒక వైపు ఉపయోగించగల సామర్థ్యం వంటి కొన్ని శారీరక విధులను అకస్మాత్తుగా కోల్పోవడం జరుగుతుంది. వైకల్యాన్ని తగ్గించడంలో, ప్రాణాలను కాపాడడంలో వేగవంతంగా గుర్తింపు, తక్షణ చికిత్స చాలా కీలకం. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్స్‌లో ఎమర్జెన్సీ మెడిసిన్ హెడ్ డాక్టర్ ఇమ్రాన్ సుభాన్ మాట్లాడుతూ, "తెలంగాణలో నిర్వహించిన అధ్యయనాలు వ్యవస్థీకృత మల్టీడిసిప్లినరీ బృందాలుఅందించే స్ట్రోక్ కేర్ సేవలతో అత్యవసర స్ట్రోక్ కేసులకు చికిత్స చేయడంలో నిర్మాణాత్మక క్లినికల్ నిర్వహణను అందించాల్సిన అవసరాన్ని చూపించాయి.మా అంకితమైన అత్యవసర సంబర్ 1066 తో రోడ్డుపై ఉన్నప్పుడు కూడా రోగికి చికిత్స చేయగల రీతిలో సౌకర్యాలు కలిగిన అంబులెన్స్‌లు, బాగా శిక్షణ పొందిన అత్యవసర వైద్యులు, నర్సులతో, మేము ఇప్పటికే ప్రపంచ స్థాయి స్ట్రోక్ కేర్‌ను అందిస్తున్నాము. భారతదేశంలో మొట్టమొదటి ఏహెచ్ఎ-ధృవీకృత సమగ్ర స్ట్రోక్ సెంటర్‌గా ఉండటం గర్వకారణం" అని అన్నారు. జీవనశైలి మార్పులతో భారతదేశం స్ట్రోక్ విషయంలో గణనీయమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక ప్రాంతాలలో, అవగాహన లేకపోవడం, తగినంత అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు అందుబాటులో ఉండక పోవటం చేత సమయానికి తగిన చికిత్స అందించటం కష్టమవుతుంది.ఈ కారణం చేత రోగుల నాడీ వ్యవస్థ దెబ్బతినడం లేదా మరణంతో సహా అధ్వాన్నమైన ఫలితాలకు దారితీస్తుంది. ఇప్పుడు, అపోలో హాస్పిటల్స్ వద్ద, కొత్త ఏహెచ్ఎ-సర్టిఫైడ్ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ స్ట్రోక్ కేసులను ఎలా గుర్తించవచ్చు, చికిత్స చేయవచ్చు మరియు నిర్వహించవచ్చు అనే దానిలో ఒక అద్భుతమైన మెరుగుదలను సూచిస్తుంది.అత్యాధునిక ఇమేజింగ్ పరికరాలు, ఈఎంఎస్, హాస్పిటల్ బృందాల మధ్య రియల్-టైమ్ కమ్యూనికేషన్, ఉత్తమ ప్రపంచ పద్ధతులతో సమలేఖనం చేయబడిన, స్థిరపడిన చికిత్సా ప్రోటోకాల్‌లను కలపడం ద్వారా, అపోలో హాస్పిటల్స్ లోని రోగులు ఇప్పుడు ఏకీకృత సంరక్షణ అనుభవాన్ని పొందుతున్నారు, ఇది తక్కువ సమస్యలతో కోలుకునే అవకాశాలను పెంచుతుంది. కార్డియోవాస్కులర్, హార్ట్, స్ట్రోక్ కేర్‌లో ప్రపంచ సాధికార సంస్థ అయిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ద్వారా సమగ్ర స్ట్రోక్ సెంటర్ ధృవీకరణ పొందటం అనేది ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ కేర్‌కు అత్యున్నత ప్రమాణం. ఆసుపత్రులు కఠినమైన ప్రమాణాలను అనుసరించిన మీదట మాత్రమే ఈ ధృవీకరణ అందిస్తారు. అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, ఈ అవసరాలలో ప్రతిదాన్ని తీర్చింది లేదా అధిగమించింది, భారతదేశంలో స్ట్రోక్ కేర్ కోసం అత్యుత్తమ ప్రమాణాన్ని నెలకొల్పింది. వీటిలో..* స్ట్రోక్ రోగులు ఆసుపత్రికి చేరుకోవడానికి ముందే వారిని త్వరగా గుర్తించేలా చేసే అత్యంత సమర్థవంతమైన స్ట్రోక్-అలర్ట్ వ్యవస్థతో ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ మరియు స్ట్రోక్ మార్గాలు. ఇందులో అత్యవసర వైద్య సేవలు (EMS), క్రమబద్ధీకరించబడిన ట్రయాజ్ ప్రక్రియ, తగిన సమయంలో క్లాట్-బస్టింగ్ ఔషధాల తక్షణ నిర్వహణ మధ్య సమన్వయం ఉన్నాయి. • స్ట్రోక్ రకం, తీవ్రతను ఖచ్చితంగా నిర్ధారించడానికి సిటి స్కాన్లు, ఎంఆరా లు మరియు ఇతర ప్రత్యేక న్యూరోఇమేజింగ్ వంటి సామర్థ్యాల 24/7 లభ్యత, లక్ష్య జోక్యాలను అనుమతిస్తుంది.అధునాతన ఇమేజింగ్ ఏ సమయంలోనైనా ఎండోవాస్కులర్ థ్రోంబెక్టమీ (కాథెటర్ ద్వారా క్లాట్లను తొలగించడం) వంటి అధునాతన స్ట్రోక్ చికిత్సల కోసం ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ సేవల 24/7 లభ్యత, రోగి ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. * క్రిటికల్ కేర్, స్ట్రోక్ నిర్వహణలో నిపుణులతో కూడిన ప్రత్యేక న్యూరో- ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కొనసాగుతున్న రోగి పరిశీలన, స్థిరీకరణ మరియు కోలుకోవడానికి అవసరం. వైద్య సిబ్బందికి శిక్షణతో పాటు స్ట్రోక్ కేర్‌లో నిరంతర పరిశోధన, విద్య మరియు రోగి అవగాహన కార్యక్రమాలు అత్యున్నత నిర్వహించడానికి తోడ్పడతాయి. ప్రమాణాల సాధనను భారతదేశంలో వైద్య పురోగతి పరంగా అపోలో హాస్పిటల్స్ నిరంతరం ముందంజలో ఉంది. ముఖ్యంగా, హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్, 2006లో స్ట్రోక్ నిర్వహణ కోసం యునైటెడ్ స్టేట్స్ వెలుపల వ్యాధి-నిర్దిష్ట దృవీకరణ పొందిన మొట్టమొదటి ఆసుపత్రిగా గుర్తింపు పొందింది . ఈ శ్రేష్ఠత వారసత్వం భారతదేశంలో పెరుగుతున్న స్ట్రోక్ భారాన్ని ఎదుర్కోవడానికి వినూత్న సాంకేతికతలు, బహుళ విభాగ బృంద కృషి, పరిశోధన-ఆధారిత పద్ధతులను ఉపయోగించుకునే అధునాతన కార్యక్రమాలకు పునాది వేసింది. -
ఇక RRR వరకు హెచ్ఎండీఏ అనుమతులే..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా విస్తరణకనుగుణంగా కార్యకలాపాలను సైతం విస్తరించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. ట్రిపుల్ ఆర్ వరకు పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్, ప్లానింగ్ తదితర విభాగాలను బలోపేతం చేసేందుకు దృష్టిసారించింది. హెచ్ఎండీఏ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంతో భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఆక్యుపెన్సీలు తదితర నిర్మాణ రంగానికి చెందిన అనుమతుల ప్రక్రియలు డీటీసీపీ నుంచి హెచ్ఎండీఏకు బదిలీ అయ్యాయి. అలాగే ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యకలాపాలు కూడా హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోకి వచ్చాయి. దీంతో వివిధ విభాగాల్లో అవసమైన అధికారులు, సిబ్బందిని నియమించి సంస్థాగతంగా బలోపేతం చేయవలసి ఉన్నదని హెచ్ఎండీఏ అధికారి ఒకరు వివరించారు. ఈ దిశగా దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నారు.‘ప్రస్తుతం జోనల్ అధికారులు రీజనల్ రింగ్‌రోడ్డు (Regional Ring Road) వరకు విధులు నిర్వహించడం టెక్నికల్‌గా కూడా సాధ్యం కాదు. కొత్తగా మరిన్ని జోన్లు ఏర్పాటు చేస్తే తప్ప సకాలంలో విధులు నిర్వహించడం సాధ్యం కాదు’ అని చెప్పారు. హైదరాబాద్ మహానగర పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడంతో హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. హైదరాబాద్ చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న రీజనల్‌రింగ్ రోడ్డు వరకు నిర్మాణ అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ వంటి పనులను చేపట్టివలసి ఉంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలతో పాటు కొత్తగా నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలతో కలుపుకొని మొత్తం 11 జిల్లాల పరిధిలో హెచ్ఎండీఏ కార్యకలాపాలను కొనసాగించవలసి ఉంది. ఇలా భారీగా పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా మరో 4 జోన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.గతంలో మేడ్చల్, శంకర్పల్లి, ఘట్కేసర్, శంషాబాద్ (Shamshabad) నాలుగు జోన్లు మాత్రమే ఉండగా, శంకర్పల్లి, మేడ్చల్ జోన్లలో అదనంగా ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. దీంతో హెచ్ఎండీఏ జోన్ల సంఖ్య 4 నుంచి 6 కు పెరిగింది. ఇప్పుడు తాజాగా ట్రిపుల్ ఆర్ (RRR) వరకు పరిధి పెరగడం వల్ల కొత్తగా మరో 4 జోన్లను ఏర్పాటు చేసి మొత్తం 10 జోన్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 1355 గ్రామాలు ఉన్నాయి. పరిధిని పెంచడం వల్ల 11 జిల్లాల్లోని 104 మండలాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. రీజనల్ రింగ్‌రోడ్డు తరువాత 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా నిర్ణయించారు. రీజనల్ రింగ్‌రోడ్డు తరువాత కనీసం 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలనే ప్రతిపాదన ఉంది. ఈ మేరకు జోన్ల విస్తరణ అనివార్యం అయింది.చదవండి: 111 జీవో స్థలాలను క్రమబద్ధీకరిస్తారా?ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం రావిర్యాల (Raviryal) నుంచి ఆమన్‌గల్ వరకు 41 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు తరహాలోనే రీజనల్ రింగ్‌రోడ్డుకు, ఔటర్‌రింగ్‌రోడ్డుకు సుమారు 40 చోట్ల రహదారుల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. కొత్తగా రూపొందించనున్న మాస్టర్‌ప్లాన్–2050లో రహదారులు, శాటిలైట్ టౌన్‌షిప్పులు, ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు. ‘హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్‌సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.ఈ మేరకు హెచ్ఎండీఏ కార్యాచరణను పటిష్టం చేయవలసి ఉంది’ అని ఒక అధికారి చెప్పారు. -
TG: కాంగ్రెస్ ముఖ్యనేతలకు అధిష్టానం పిలుపు.. ఎందుకంటే..?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ రోజు(సోమవారం) మధ్యాహ్న సమయంలో సీఎం రేవంత్ తో పాటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి పయనమయ్యారు.. తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ విస్తరణ, భారత్ సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి సీఎం రేవంత్, పలువురు మంత్రులను ఢిల్లీకి బయల్దేరి రమ్మని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈరోజు(సోమవారం) సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో వీరు సమావేశం కానున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది.వచ్చే నెలలో సీఎం రేవంత్ విదేశీ పర్యటనఏప్రిల్ లో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 23 వరకూ జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. అయితే ఈ లోపే డీ లిమిటేషన్ పై హైదరాబాద్ లో మీటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నారు రేవంత్. -
బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రిటీలకు ఊరట?
హైదరాబాద్, సాక్షి: ఇటు సినీ రంగ ప్రముఖులను, అటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను హడలెత్తిస్తున్న బెట్టింగ్ యాప్స్ కేసులో ఇవాళ(మార్చి 24, సోమవారం) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటిదాకా 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే వాళ్లందరికీ ఊరట కలిగించే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. తాజాగా ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ ఓనర్లను పోలీసులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా 19 మందిపై కేసులు నమోదు చేశారు. కొత్త సెక్షన్లు చేర్చి మరీ వీళ్లందరినీ కేసుల్లో నిందితులుగా మార్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మియాపూర్ పోలీసులు కోర్టులో మెమో సైతం దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ప్రముఖులను సాక్షులుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ప్రముఖులకు ఇప్పటికే చాలామంది నోటీసులు పంపించారు. కొందరిని విచారించగా.. మరికొందరిని విచారించాల్సి ఉంది. ఈ క్రమంలో యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం.. ఛార్జ్ షీట్ లో సాక్షులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ప్రమేయం లేకుండా వాటిని ప్రమోట్ చేశామని, పర్యవసనాలకు ఊహించలేదని వివరణలు ఇస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ లావాదేవీలపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) ఫోకస్ చేసినట్లు సమాచారం.బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ దశలో ఉంది. ఈ కేసులో పోలీసుల విచారణకు సహకరిస్తా. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను::పంజాగుట్ట పీఎస్‌లో విచారణ అనంతరం శ్యామల -
హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత వాన
హైదరాబాద్, సాక్షి: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం మధ్యాహ్నాం నుంచి పలు చోట్ల కుండపోత వాన కురుస్తోంది. కూకట్పల్లి, మియాపూర్, జీడిమెట్ల, చందానగర్, రాయదుర్గం, మదీనాగూడ.. తదితర ప్రాంతాల్లో భారీగా వాన పడింది. ద్రోణి ప్రభావంతో గత నాలుగు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాలో వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల వడగండ్ల వాన కురవడంతో విపరీతమైన పంట నష్టమూ వాటిల్లింది. మరోవైపు సాయంత్రంలోపు నగరంలోని మరిన్ని ప్రాంతాలకు వాన విస్తరించవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. @balaji25_t @Hyderabadrains Unexpected sudden downpour as I stepped out near Sanghamitra school Nizampet rd pic.twitter.com/rcEGHBrocH— Anupama (@Anupama97882988) March 24, 2025 -
హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలు.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాకు ఎవరు ఫిర్యాదు చేసినా అకనాల్జ్మెంట్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వంశీరాం బిల్డర్‌కు చెందిన ప్రపార్టీ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.అసెంబ్లీ లాబీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. హైడ్రాకు ఎవరు ఫిర్యాదు చేసినా అకనాల్జ్మెంట్ ఇస్తున్నాం. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి కూడా క్లారిటీ ఇచ్చాం. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాం. దీనిపై ఫిర్యాదు ఇస్తే.. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. వంశీరాం బిల్డర్‌కు చెందిన ప్రపార్టీ విషయం మా దృష్టికి తెచ్చారు. మేము దాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా చూస్తే.. అంత క్లారిటీ రావడం లేదు. సర్వే చేసి.. తేడా ఉంటే యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతం అక్కడ మట్టిని డంప్ చేసినట్లు మా దృష్టికి వచ్చింది.. తీసేయాలని ఆదేశాలు ఇచ్చాం అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు.. హైడ్రాపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల హైడ్రా అక్రమాలను ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావించారు. కబ్జాలకు పాల్పడుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోన్ లిఫ్ట్ చేయడు.. ఆయన దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదని తెలిపారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా అని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఖాజాగూడలోని కొత్తకుంటలో వంశీరాం బిల్డర్లు నిర్మాణాల విషయంలో ఇటీవల హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 23వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది.ఎన్నిక షెడ్యూల్ ఇదే..మార్చి 28న నోటిఫికేషన్ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి తేది.ఏప్రిల్ 23న పోలింగ్ఏప్రిల్ 25న ఫలితాలు. -
Film Nagar: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మార్గాల్లో క్రాస్ మసాజ్ చేస్తున్న స్పా సెంటర్‌పై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ఫిలింనగర్ రోడ్డు నెంబర్–5లో అర్బన్ రిట్రీట్ పేరుతో మసాజ్ పార్లర్ నిర్వహిస్తున్నాడు. అయితే వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు అందుకున్న ఫిలింనగర్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలువురు యువతులు మసాజ్ థెరపిస్టుల పేరుతో క్రాస్ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో స్పా యజమాని అక్షయ్ బొహ్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త స్నేహితుడని కారు ఇస్తే... వెంగళరావునగర్: భర్త స్నేహితుడని నమ్మి కారు ఇస్తే దాన్ని సదరు వ్యక్తి తాకట్టు పెట్టిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... కె.లక్ష్మి అనే మహిళ కళ్యాణ్నగర్కాలనీలోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత ఏడాది జూన్ 10వ తేదీ తన భర్త స్నేహితుడైన పరమేశ్వర్‌రెడ్డి వచ్చి తన కారును తీసుకెళ్లాడు. నాలుగు రోజుల్లో ఇస్తానని చెప్పాడు. అయితే ఎంతకీ కారును తీసుకురాలేదు. ఈ నెల 5వ తేదీనాడు చల్లా మనోహర్ యాదవ్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి పరమేశ్వర్‌రెడ్డి కారును తనకు మార్ట్గేజ్ చేశాడని తెలియజేశాడు. దాంతో ఆమె మధురానగర్ పీఎస్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ డబ్బాలతో దడ!
సాక్షి, హైదరాబాద్: పేలుడు...అది చిన్నదైనా, పెద్దదైనా పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఇటీవల కాలంలో రాజధానిలో తరచుగా చిన్నస్థాయి పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. అత్యధిక ఉదంతాల్లో క్షతగాత్రులే ఉంటుండగా కొన్ని సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ బ్లాస్ట్‌లకు ప్రధానంగా గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగించే ఆర్గానిక్ సాల్వెంట్స్ కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమ్మిళిత పదార్ధాలు కలిగి ఉన్న పెయింట్స్‌ను కొన్ని స్థితుల్లో ఇళ్లల్లో పెట్టుకోవడం ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. శనివారం కుషాయిగూడ పారిశ్రామికవాడలో పెయింట్ డబ్బా పేలి కూలీ నాగరాజు మృతిచెందిన విషయం విదితమే. పెయింట్ డబ్బాలతోనే సమస్య... నగరంలో చోటు చేసుకుంటున్న ఇలాంటి చిన్న స్థాయి పేలుళ్లకు పెయింట్ డబ్బాలే ఎక్కువగా కారణంగా మారుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రంగులు వాటిలో వాడే థిన్నర్లలో వలటైల్ ఆర్గానిక్ సాల్వెంట్స్‌గా పిలిచే ఎసిటోన్, ఈ రసాయనం కలిపిన ట్వాలిన్ , ఈథర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఓ పెయింట్ డబ్బా సీల్ తెరిచిన తర్వాత సగం వినియోగించి మిగిలిన సగాన్ని అలానే ఉంచి మూత పెట్టడం పరిపాటి. మరోసారి వినియోగించడానికి పనికి వస్తుందనే ఉద్దేశంతో దాచి పెడుతుంటారు. ఫలితంగా ఆ డబ్బాల్లో ఉండే రంగుల్లోని ఆవిరి స్వభావం కలిగిన రసాయనాలు అందులో ఉన్న గాలిలోని ఆక్సిజన్‌తో కలుస్తూ వ్యాకోచించడానికి ప్రయతి్నస్తాయి. గట్టిగా మూత పెట్టి ఉండటంతో అది సాధ్యం కాక డబ్బా లోపలి భాగంలో వాక్యూమ్ ఏర్పడుతుంది. ఈ స్థితిలో ఉన్న డబ్బా మూతలు సైతం బిగుసుకుపోతాయి. అలాంటి వాటిని తెరవడానికి రాపిడి కలిగించినా, గట్టిగా కొట్టినా చిన్నస్థాయి పేలుడు చోటు చేసుకుంటుంది. ఎక్కువగా బలవుతున్నది వారే... ఇలాంటి డబ్బాల పేలుడు వల్ల క్షతగాత్రులుగా, మృతులుగా మారుతున్న వారిలో ఎక్కువగా చెత్త ఏరుకునే వాళ్లే ఉంటున్నారు. సగం వాడిన పెయింట్ డబ్బాలను సాధారణంగా ఆ వినియోగదారులు కొన్ని రోజుల పాటే భద్రపరుస్తుంటారు. డబ్బా తుప్పు పడుతున్నప్పుడో, కదిలి్చనప్పుడు పెయింట్ శబ్ధం రాకుంటే పూర్తిగా గడ్డ కట్టేసిందనే భావనతోనో, మూత తీయడం సాధ్యం కానప్పుడో వాటిని బయటపారేస్తుంటారు. సాధారనంగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారేటప్పుడు, దుకాణాలకు మెరుగులు దిద్దే సమయాల్లోనూ ఇలా చేస్తుంటారు. ఆఖరుకు ఈ డబ్బాలు చెత్తకుప్పల్లోకి వచ్చి చేరతాయి. వీటిని కాగితాలతో పాటు ఏరుకునే చెత్త ఏరుకునేవాళ్లు తీసుకుని వాటిని తెరిచే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కలిగే రాపిడి ఫలితంగా పేలుడు జరిగి కొన్నిసార్లు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా ప్రమాదం... గతంలో పెయింట్స్‌ను ఇనుప డబ్బాల్లో విక్రయించే వారు. అయితే ఇటీవల కాలంలో దాదాపు అన్ని రకాలైన రంగుల్ని ప్లాస్టిక్ డబ్బాల్లోనే ఉంచి విక్రయిస్తున్నారు. ఇనుప వాటి కంటే ఇవి అత్యంత ప్రమాదకరమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సగం ఖాళీ అయిన ఇనుప డబ్బాలో ఉన్న రంగుకు ఆక్సిజన్ అందుబాటులోకి రాక రసాయనక్రియ జరగదు. కేవలం గడ్డ కట్టడం మాత్రమే జరుగుతుంది. అదే ప్లాస్టిక్ డబ్బాలో ఉంటే ఉన్న చిన్నపాటి సందుల నుంచి ఆక్సిజన్ వెళ్తుంది. దీంతో పాటు ఆర్గానిక్ సాల్వెంట్స్ కొన్ని రోజులకు ప్లాస్టిక్‌తో కలిసి పాలిమరైజేషన్ జరుగుతుంది. ఈ కారణంగా ఏర్పడే వేఫరైజర్ల కారణంగానూ దాన్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు పేలుడు జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి డబ్బాలు ఇంట్లో ఉన్నప్పటికీ పేలుడు ప్రమాదాలు తప్పవని నిపుణులు వివరిస్తున్నారు. ఈ తరహా పేలుళ్లకు ఉదాహరణలు ⇒ మీర్ పేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ పోష్ కాలనీలో చెత్త ఏరుకునే నిర్మల ప్లాస్టిక్ డబ్బాను తెరిచే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడ్డారు. ⇒ నాచారంలో రసాయనంతో కూడిన డబ్బా చేతిలో పేలడంతో ఓ చిన్నారికి గాయాలు అయ్యాయి. ⇒ హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో టిన్ పేలి అలీ అనే వ్యక్తి మరణించాడు. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నెం.279 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ⇒ బాలానగర్ పరిధిలోని రంగారెడ్డి నగర్లో నీలమ్మ (45) అనే పారిశుద్ధ్య కారి్మకురాలు రసాయనాల డబ్బాలతో కూడి వ్యర్థాల సంచిని శుభ్రం చేసే ప్రయత్నం చేసింది. ఆ సంచిలోని డబ్బా పేలడంతో ఆమె ఎడమ కాలి బొటనవేలు ఛిద్రమైంది. సీల్ తీస్తే వాడేయాలి ఆర్గానిక్ సాల్వెంట్స్ కలిగి ఉండే పెయింట్స్‌ను డబ్బా సీల్ తీసిన తర్వాత పూర్తిగా వాడేయడం ఉత్తమం. అలా కాకుండా కొంత మిగిలితే బయట పారబోయాలి. తర్వాత వినియోగిద్దామనే ఉద్దేశంతో దాచి పెట్టినా, కొన్నాళ్ళకు పారేసినా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇలాంటి డబ్బాలు తెరవడానికి ప్రయతి్నంచిన ప్రతిసారీ పేలిపోవాలని లేదు. పేలుడుకు చోటు చేసుకోవడానికి అవసరమైన స్థాయిలో సాల్వెంట్స్ రేష్యో తయారైతేనే అలా జరుగుతుంది. ఇలా సగం ఖాళీ అయిన డబ్బాలు ఇంట్లో ఉండి, వాటిని తెరవాల్సిన అవసరం వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాటిని వెంటనే తెరవకుండా కనీసం గంట సేపు చల్లని నీటిలో ఉంచాలి. ఫ్రిజ్ వాటర్‌ను బక్కెట్లో పోసి అందులో ఈ డబ్బాలను వేయాలి. ఇలా చేస్తే అందులో ఉన్న ఆవిరి చల్లబడి మళ్లీ పెయింట్‌గా మారుతుంది. అప్పుడు రాపిడి కలిగిస్తూ తెరిచినా ఎలాంటి ప్రమాదం ఉండదు. – ఫోరెన్సిక్ నిపుణులు -
భర్తను చంపేందుకు తార్ కార్‌తో ఢీకొట్టి..
మునిపల్లి(అందోల్): కట్టుకున్న భర్తను కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి భార్య కుట్ర చేసిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన భర్త తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ కథనం ప్రకారం... పెద్దగోపులారం గ్రామానికి చెందిన కొమిశెట్టిపల్లి రవి ఝరాసంగం మండలంలోని దేవరాంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఈ నెల 22న బైక్‌పై వెళ్లి విధులు నిర్వహించుకొని బుదేరా నుంచి గోపులారానికి వస్తున్న క్రమంలో నల్ల రంగు తార్ కార్‌తో రవిబైక్ను ఢీకొట్టి వెళ్లిపోయారు. బైక్‌పై నుంచి కిందడిన రవి అప్రమత్తమై తప్పించుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్రాక్ డిటేల్స్ ద్వారా నేరస్తులను గుర్తించారు. హత్య చేయడానికి గల ముఖ్య కారణం రవి భార్య హరితనే తేల్చారు. హరిత సంగారెడ్డికి చెందిన మిర్దొడ్డి సాయి ప్రదీప్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకొని ప్రియుడుతో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. దీంతో ఏ1గా హరిత, ఏ2 మిరుదొడ్డి సాయి ప్రదీప్, ఏ3 దాసోజీ సాయికిరణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. అక్కడి నుంచి జైలుకు పంపించారు. చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్ఐ ఎం. రాజేశ్ నాయక్, కానిస్టేబుల్స్ పాండు, తుకారాం, హనీఫ్, సునీల్‌లను కొండాపూర్ సీఐ వెంకటేశం అభినందించారు. -
అమీర్‌పేట్‌లో పేలుడు.. పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అమీర్‌పేట్‌లోని రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో సిలిండర్ పేలిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కేఫ్‌లో పనిచేసే ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వినియోగదారులు ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
Hyderabad: కారుతో ఢీ కొట్టి.. గొడ్డళ్లతో నరికి
నాగోలు: పాత కక్షల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని కారుతో ఢీ కొట్టి అతడు కింద పడిన తర్వాత గొడ్డళ్లు, వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన బోడ్డు మహేష్(31) పాత నేరస్తుడు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో అతడిపై కేసులు నమోదై ఉన్నాయి. గతంలో అదే ప్రాంతంలో ఉన్న పగిళ్ల పురుషోత్తం మహేష్‌కు స్నేహితుడు. రెండేళ్ల క్రితం హయత్‌నగర్‌లో పెళ్లి ఊరేగింపులో జరిగిన గొడవలో మహేష్ పురుషోత్తంపై బీరు బాటిల్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పురుషోత్తం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే స్నేహితులు వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ఒప్పించారు. రాజీ పడేందుకు మహేష్ గత డిసెంబర్ 20న హయత్‌నగర్ కోర్టుకు రావాల్సి ఉంది. అయితే అతను కోర్టు హాజరుకాకుండా తాను సూర్యాపేటలో ఉన్నానంటూ కోర్టు కానిస్టేబుల్‌కు చెప్పి పురుషోత్తంను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. అదే రోజు కొత్తపేట– నాగోలు రోడ్డులో అమరావతి వైన్స్ వద్ద పురుషోత్తం ఉన్నట్లు సమాచారం అందడంతో మహేష్ తన స్నేహితులైన బెల్లి భరత్, దాసరి సురేందర్‌తో కలిసి అతడిపై వేట కొడవలితో దాడికి ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. ఈ సంఘటనలో పురుషోత్తం స్నేహితులైన గడ్డమోయిన రాము, పాశం నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. పురుషోత్తం ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు దాడికి పాల్పడిన మహేష్, బెల్లి భరత్, దాసరి సురేందర్, సుమన్, గౌతమ్‌కుమార్, పరుశురాంలను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఇటీవలే మహేష్ అతని స్నేహితులు జైలు నుండి బయటికి వచ్చారు. అయితే మహే‹Ùపై కక్ష పెంచుకున్న పురుషోత్తం అతని స్నేహితులు అతడిని హత్య చేయాలని పథకం వేశారు. మాటు వేసి..దాడి చేసి.. శనివారం రాత్రి మహేష్ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ఎల్బీనగర్ శివగంగ కాలనీ నుంచి ఇంటికి వస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసి నిందితులు కారుతో మహేష్ బైక్‌ను ఢీ కొట్టారు. కింద పడిన అతను పారిపోయేందుకు ప్రయత్నించగా వారు తమ వెంట తెచ్చుకున్న గొడ్డళ్ల, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుండి పారిపోయారు. మహేష్ వెంట ఉన్న స్నేహితుడు వారి బారి నుంచి తప్పించుకుని ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించాడు. తీవ్రంగా గాయపడిన మహేష్‌ను కామినేని హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మహేష్ తలపై నిందితులు గొడ్డలితో నరకడంతో గొడ్డలి తలలోనే ఇరుక్కు పోయింది. పోలీసులు మృతదేహాన్ని ఆదివారం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కృష్ణయ్య, ఇన్స్పెక్టర్ వినోద్‌కుమార్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. పోలీసుల అదుపులో నిందితులు... మహేష్ ను హత్య చేసిన నిందితులు పురుషోత్తం, భరత్‌నగర్‌కు చెందిన సందీప్, నాగార్జున, రాములను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు ఈ హత్యలో ఎంత మంది ఉన్నారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విహారయాత్రలో విషాదం
మోతీనగర్: విహారయాత్రలో విషాదం నెలకొన్న సంఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ వీ రామారావునగర్‌లో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు, యాత్రికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్పల్లి నియోజకవర్గం, అల్లాపూర్ డివిజన్ వీ రామారావు నగర్‌కు చెందిన 12 మంది యాత్రికులు ఈ నెల 16న కాశీ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న బస్సు మధ్యప్రదేశ్ రాష్ట్రం పియోలి జిల్లాలోని ఘాట్‌రోడ్డులో లోయలో పడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా మరో 11 మందికి గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు నాగుల సత్యం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే నాగపూర్ అధికారులు, పోలీసులతో మాట్లాడి నగరానికి మృతదేహాన్ని నగరానికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స నిర్వహించారు. -
వస్తారా ? వాదిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, మీడియా చానల్ అధినేత శ్రవణ్‌రావులు ఇండియాకు వస్తారా? లేకపోతే వారు ఉంటున్న దేశాల్లోని కోర్టులను ఆశ్రయిస్తారా? అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న హైదరాబాద్ పోలీసులు ఆ ఇద్దరూ ఆయా దేశాల్లోని కోర్టులను ఆశ్రయించే అవకాశముందని భావిస్తున్నారు. అదే జరిగితే అంతర్జాతీయ వేదికపై కూడా న్యాయపోరాటం చేయడానికి నగర పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిపై ఓ ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో (ఎంఈఏ) సమావేశమవుతారు. గత ఏడాది మార్చిలో పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అక్రమ ఫోన్‌ట్యాపింగ్‌పై కేసు నమోదైంది. ఆ వెంటనే ప్రభాకర్‌రావు, ఆపై శ్రవణ్‌రావు విదేశాలకు పారిపోయారు. ప్రభాకర్‌రావు మెడికల్ గ్రౌండ్స్‌పై అమెరికాలో, శ్రవణ్‌రావు కెనడాలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని వెనక్కి రప్పించడానికి చేసిన అన్ని ప్రయత్నాలను తమ న్యాయవాదుల ద్వారా అడ్డుకుంటూనే వచ్చారు. అరెస్టు వారెంట్లకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, వద్దంటూ కౌంటర్లు వేశారు. ఇద్దరి పాస్పోర్టుల్నీ నగర పోలీసులు తొలుత తాత్కాలిక రద్దు (ఇంపౌండ్) చేయించారు. ఆపై శాశ్వత రద్దు (క్యాన్సిల్) చేయాలని కోరుతూ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయానికి లేఖ రాశారు. అయితే అప్పటికే ఈ ద్వయం తమ లాయర్ల ద్వారా పాస్‌పోర్టులు ఇంపౌండ్ చేయడాన్ని ఢిల్లీలో ఉన్న చీఫ్ పాస్‌పోర్టు ఆఫీసర్ వద్ద సవాల్ చేశారు. ఈ పిటిషన్ ఓ కొలిక్కి వస్తే తప్ప.. పాస్‌పోర్టుల రద్దు వ్యవహారం తేలదు. తాజాగా హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయించారు. వీటిని జారీ చేసినట్టు ఆ విభాగం సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి సమాచారం ఇచ్చింది. అయితే తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరచడంతోపాటు సభ్య దేశాలకు పంపిస్తూ పబ్లిష్ చేయాల్సి ఉంది. ఈలోపు ప్రభాకర్‌రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ శనివారం పిటిషన్ దాఖలు చేశారు. రెడ్‌కార్నర్ నోటీసులను ఎంఈఏ ఆయా దేశాల్లో ఉన్న ఏజెన్సీలకు అధికారికంగా పంపించాలి. ఈ రెడ్‌కార్నర్ జారీ అయిన వెంటనే ఇంటర్‌పోల్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుల ఆచూకీ కనిపెట్టి, తక్షణం డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) చేయడానికి ఆస్కారం లేదు. అక్కడి కోర్టులను ఆశ్రయిస్తే... నిందితులు తాము ఉంటున్న దేశాల్లోనే ఉన్నత న్యాయస్థానాల్లో రెడ్‌కార్నర్ నోటీసులను చాలెంజ్ చేసే అవకాశం ఉంది. కేవలం రాజకీయ కారణాలతోనే కేసులు పెట్టి వేధిస్తున్నారని, అనారోగ్య కారణాలు చెబుతూ తమ డిపోర్టేషన్‌ను ఆపాలని నిందితులు కోరతారని పోలీసులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఆయా కోర్టుల్లో అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేసే న్యాయవాదులు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానాలు తీసుకునే తుది నిర్ణయంపైనే డిపోర్టేషన్ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఈ పరిణామాలను, నిందితుల వ్యవహారశైలిని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు సమగ్ర విధానం రూపొందిస్తున్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మొదలైన నాటి నుంచి ఇక్కడ ఉన్న ఆయా కోర్టుల్లో నిందితులు దాఖలు చేసిన పిటిషన్లు, వాటికి పోలీసులు ఇచ్చిన కౌంటర్లను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలన్నీ ఎంఈఏ ద్వారా ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాలకు పంపనున్నారు. ఫలితంగా అక్కడి కోర్టుల్లో వాదనలు బలంగా వినిపించడమే కాకుండా డిపోర్టేషన్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికోసం త్వరలో ఓ ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లనుంది. అక్కడి ఎంఈఏ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలిసింది. -
ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం!
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ నెల కోటా కింద అదే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే ఉగాది సందర్భంగా ఈ నెల 30న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలుత సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ప్రారంభించాలని భావించినప్పటికీ, తర్వాత హుజూర్‌నగర్‌ను ఖరారు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాగా బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ గోడౌన్ (స్టేజ్–1 స్టాక్ పాయింట్)ల నుంచి మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు సన్న బియ్యం తరలించే ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని రేషన్ దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డులు కలిగిన వారికి ఒక్కో యూనిట్‌కు (ఒక్కరికి) 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తారు. ఏటా 24 ఎల్ఎంటీల బియ్యం అవసరం రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ పరిధిలోని రేషన్ దుకాణాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇప్పటివరకు దొడ్డు బియ్యమే అందుతు న్నాయి. రాష్ట్రంలో 90 లక్షల వరకు ఆహార భద్రతా కార్డులు ఉండగా, ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం ఇచ్చిన కార్డులు (ఐఎఫ్ఎస్సీ) 54.48 లక్షలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జారీ అయిన కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్న యోజన కింద 5.62 లక్షల కార్డులు ఉండగా, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు ఉన్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 90.14 లక్షల కార్డుల్లోని 2.83 కోట్ల యూనిట్లకు (మందికి) ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఏప్రిల్ 1 నుంచి 90.14 లక్షల కార్డులకు సన్న బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. వీటికి తోడు ఇప్పటికే అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, విద్యా సంస్థలకు కేటాయిస్తున్న బియ్యం కూడా కలిపి నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) చొప్పున సన్నబియ్యం అవసరం ఉంది. అంటే సంవత్సరానికి 24 ఎల్ఎంటీలు అవసరమన్నమాట. వానాకాలం సీఎంఆర్ సిద్ధం వానాకాలంలో సేకరించిన సుమారు 55 ఎల్ఎంటీల ధాన్యంలో 24 ఎల్ఎంటీల మేర సన్న ధాన్యం ఉంది. ఈ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు పంపిన ప్రభుత్వం గత నవంబర్ నెలాఖరు నుంచే సన్న బియ్యాన్ని సేకరించే పనిలో ఉంది. తొలుత జనవరి (సంక్రాంతి) నుంచే సన్న బియ్యం ఇవ్వాలని భావించినప్పటికీ, కొత్తగా వచ్చిన బియ్యాన్ని పంపిణీ చేస్తే అన్నం ముద్దగా అవడం, అడుగంటడం వంటి పరిణామాలు ఉంటాయనే భావనతో రెండు మూడు నెలలు మాగపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మిల్లింగ్ అయిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లలో భద్రపరుస్తూ కొత్త బియ్యం పాతబడేలా చూశారు. ఈ నేపథ్యంలో జనవరి వరకు మిల్లింగ్ చేసి సేకరించిన సుమారు 5 ఎల్ఎంటీల బియ్యాన్ని ఉగాది నుంచి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ కోటా కింద సన్న బియ్యం మాత్రమే ఇవ్వాలని పేర్కొంటూ మంత్రి ఉత్తమ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బియ్యం అక్రమ దందాకు కళ్లెం! రేషన్ షాపుల ద్వారా ఇప్పటివరకు అందుకుంటున్న దొడ్డు బియ్యంలో 60 నుంచి 70 శాతం వరకు దురి్వనియోగం అవుతున్నట్లు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని ఉచితంగా తీసుకుంటూ రూ.10కి కిలో చొప్పున రేషన్‌షాపుల్లోనే విక్రయించే పద్ధతి దాదాపుగా అన్ని జిల్లాల్లో ఉంది. ఇక ఇంటికి తీసుకెళ్లినా వంటకు వినియోగించకుండా దళారులకు కిలో రూ.10 నుంచి రూ.13 చొప్పున విక్రయించడం, దాన్ని దళారులు రాష్ట్రాలు దాటించడమో లేక రీసైక్లింగ్ కోసం రైస్ మిల్లులకు విక్రయించడమో చేయడం పరిపాటిగా మారింది. అయితే పేదలకు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా దీనికి చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. -
'దోస్త్'కు కటీఫ్!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏకీకృత ఆన్లైన్ వ్యవస్థ ‘దోస్త్’(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ)ను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైందా? ఇంటర్ పరీక్షలు పూర్తయినా ఇంతవరకూ దోస్త్ కన్వినర్ నియామకం చేపట్టకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ కళాశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చేలా ప్రవేశపెట్టిన ‘దోస్త్’పై మొదట్నుంచీ ఉన్నత విద్యా మండలిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని కొందరు ఉన్నతాధికారులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొన్నిరోజులు ఇందులో మార్పులు తేవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల అసలీ విధానం ఎత్తివేస్తే బాగుంటుందనే వాదనలూ బలపడ్డాయి. దీనిపై మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కన్వినర్ నియామకంపై వివరణ కోరగా.. ‘కొన్ని మార్పులు అవసరమని, ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరిస్తాం’అని చెప్పారు. అడ్మిషన్ల విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి నాన్ ‘దోస్త్’కాలేజీలతో పాటు పలు ప్రైవేటు కాలేజీలు చేస్తున్న ఒత్తిడే ‘దోస్త్’కొనసాగింపుపై పునరాలోచనకు కారణమనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఏమిటీ ‘దోస్త్’? ‘దోస్త్’ను 2016–17లో తీసుకొచ్చారు. ఈ విధానంలో ఒకే ఒక్క దరఖాస్తుతో రాష్ట్రంలోని ఏ కాలేజీలోనైనా మెరిట్ ప్రకారం డిగ్రీలో ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. గతంలో ప్రతి కాలేజీకి విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. దరఖాస్తు ఫీజు కూడా విడివిడిగా చెల్లించాలి. కానీ ‘దోస్త్’అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం రూ. 200 ఫీజుతో అన్ని కాలేజీలకు అప్లై చేసుకునే వెసులుబాటు లభించింది. ఆన్‌లైన్‌తో పాటు మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి రావడంతో విద్యార్థులు సులభంగా, తక్కువ ఖర్చుతో డిగ్రీ ప్రవేశాలు పొందే అవకాశం చిక్కింది. మరేమిటి ఇబ్బంది? ఆన్లైన్ వ్యవస్థ మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులను గందరగోళ పరుస్తోందనే విమర్శలున్నాయి. అవగాహన లేమివల్ల దరఖాస్తులు నింపడంలో పొరపాట్లు దొర్లుతున్నాయి. మరోవైపు మెరిట్ ప్రకారం సీట్ల కేటాయింపు వల్ల విద్యార్థికి కొన్నిసార్లు దూరంగా ఉన్న కాలేజీల్లో సీట్లు వస్తున్నాయి. ఫలితంగా సీటు వచ్చినా విద్యార్థి చేరడం లేదు. ఇంకోవైపు ప్రైవేటు కాలేజీలు ముందే విద్యార్థుల చేత తమ కాలేజీలో చేరేలా ప్రాధాన్యత ఆప్షన్లు పెట్టిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల వ్యవహారం, విద్యార్థులు కేటాయించిన కాలేజీల్లో చేరకపోవడం వల్ల ‘దోస్త్’ప్రవేశాల ప్రక్రియను పలు దఫాలుగా నిర్వహించాల్సి వస్తోంది. దీంతో అకడమిక్ సంవత్సరం ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. అసలు వాస్తవాలేంటి? రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 3.90 లక్షల మంది ఇంటర్ పాసవుతున్నారు. వీరిలో 45 శాతం మంది మాత్రమే డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. కానీ రాష్ట్రంలో 1,055 కాలేజీల్లో 4.62 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులంతా డిగ్రీలో చేరినా ఇంకా 70 వేలకుపైగా సీట్లు మిగిలిపోక తప్పని పరిస్థితి. 416 గ్రామీణ కాలేజీల్లో ప్రవేశాలు 30 శాతం మించడం లేదు. వంద కాలేజీల్లో కొన్ని బ్రాంచీల్లో జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి రాజధానికి ఆనుకుని ఉన్న కాలేజీల్లో మాత్రం ప్రవేశాలు 70 శాతం ఉంటున్నాయి. ‘దోస్త్’జాబితాలో ఉన్న కాలేజీల్లో డిగ్రీకి రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు ఫీజులున్నాయి. కానీ అందులో లేని 60 కాలేజీల్లో (‘దోస్త్’పై కోర్టును ఆశ్రయించిన కాలేజీలు) నాణ్యత, వసతులు పేరిట రూ.1.25 లక్షల వరకు ఫీజు ఉంటోంది. ఈ నేపథ్యంలోనే నాణ్యత లేని కాలేజీల్లో గత ఏడాది లక్షకుపైగా సీట్లు తగ్గించారు.ఇదే క్రమంలో అసలు ‘దోస్త్’ఎత్తివేయాలని, ఫీజులు, ప్రవేశాలపై తమకు స్వేచ్ఛ ఇవ్వాలని ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. అంతేకాకుండా ఈ దిశగా ఈసారి బలమైన లాబీయింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా ‘దోస్త్’ఎత్తివేతకు రంగం సిద్ధమైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆన్లైన్ విధానం కొనసాగించినా అవసరమైన మార్పులు చేయాలని మండలి భావిస్తున్నట్లు సమాచారం.అందరికీ ఒకే విధానం ఉండాలి ‘దోస్త్’పరిధిలో ఉన్న కాలేజీలకు ఫీజులపై నియంత్రణ ఉంది. మిగతా కాలేజీలు మాత్రం ఇష్టానుసారంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఇలా భిన్నమైన విధానాలు ఎందుకు? అందరికీ ఆమోదయోగ్యమైన ఒకే విధానం అమలు చేయాలి. – గౌరి సతీష్ (ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)బలహీనవర్గాలకు అన్యాయం జరగొద్దు ఆన్లైన్ విధానంలో లోపాలుంటే సరిచేయాలి. ఫీజులు, ప్రవేశాలపై అధాకారాన్ని కార్పొరేట్ కాలేజీలకు అప్పగించ కూడదు. వారి ఒత్తిళ్లకు లొంగి బడుగు, బలహీనవర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలి. – టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) అందరి ఆమోదం మేరకే మార్పులు చేయాలి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే చర్యలు సరికాదు. దోస్త్‌లో లోపాలుంటే వాటిని ముందుగా విద్యార్థి, మేధావి వర్గానికి వివరించాలి. అందరి ఆమోదం మేరకు మార్పులు చేయాలి. – మాచర్ల రాంబాబు (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) -
సొ‘రంగం’ వదిలేస్తారా?
సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం సరిగ్గా ఎక్కడ కుప్పకూలిందో అక్కడ తవ్వకాలు జరిపేందుకు అవకాశాలు లేవా?.. సహాయక చర్యల్లో పాల్గొంటున్న కొందరు అధికారులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు. ఇప్పటివరకు సొరంగం పైకప్పు కూలిన ప్రాంతం నుంచి పక్కకు కొట్టుకువచ్చిన బండరాళ్లు, మట్టి, బురద, తుక్కును తొలగించారు. ఇక సొరంగం ఎక్కడైతే కూలిందో అక్కడ శిథిలాలను తొలగించాల్సి ఉండగా, అక్కడ తవ్వకాలు జరిపితే మళ్లీ సొరంగం కుప్పకూలి సహాయక సిబ్బందికి ప్రమాదం వాటిల్లవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు కొనసాగించాలా? లేక నిలుపుదల చేయాలా? అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. మొత్తం 12 ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, వారికి తోడుగా రాడార్లు, డ్రోన్లు, రోబోలు, ఎక్సవేటర్లను వాడినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షలో సహాయక చర్యల కొనసాగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెలరోజులు గడిచినా.. ఎమ్మార్పి–ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట (ఇన్లెట్) వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపలి వరకు సొరంగం–1 తవ్వకాలు పూర్తయ్యాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం)తో తవ్వకాలను అక్కడి నుంచి ముందుకు కొనసాగిస్తుండగా గత నెల 22న సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు/ఉద్యోగులు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి నెల రోజులు గడిచిపోగా ఇప్పటివరకు ఒక కార్మికుడి మృత దేహాన్ని మాత్రమే వెలికితీయగలిగారు. భూగర్భంలో 400 మీటర్ల దిగువన సొరంగాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పైకప్పు కూలినప్పుడు భారీ పరిమాణంలో బండరాళ్లు, మట్టి, శిథిలాలు ప్రమాద స్థలానికి రెండువైపులా గుట్టల్లా ఏర్పడ్డాయి. బయటికి వెళ్లే మార్గం వైపు పేరుకుపోయిన శిథిలాల తొలగింపు పనులు మాత్రమే చేపట్టగా, శనివారం నాటికి కార్మికుల ఆచూకీకి సంబంధించి డీ1 నుంచి డీ2గా గుర్తించిన ప్రాంతాల వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. దీంతో ఆదివారం కన్వేయర్ బెల్ట్ నుంచి డీ2 ప్రాంతం దిశగా తవ్వకాలు ప్రారంభించారు. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు కొంత ప్రమాదకరమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుని సింగరేణి రెస్క్యూ బృందాలు సాహసించి పనులు కొనసాగిస్తున్నాయి. కూలిన చోట శిథిలాల కిందే మిగతా కార్మికులు! కేరళ నుంచి రప్పించిన కడావర్ డాగ్స్ పసిగట్టిన ప్రాంతాలన్నింటిలో తవ్వకాలు పూర్తి చేయగా, డీ2 ప్రాంతంలో ఓ మృతదేహం లభ్యమైంది. మిగిలిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినా ఇతర కార్మికుల జాడ తెలియరాలేదు. దీంతో గల్లంతైన మిగతా కార్మికులు కచ్చితంగా సొరంగం కూలిన ప్రాంతంలో భారీ బండరాళ్లు, బురద, మట్టి శిథిలాల కిందే ఉండవచ్చని సహాయ చర్యల్లో పాల్గొంటున్న అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అక్కడ తవ్వకాలు జరిపితే సొరంగానికి పైన 400 మీటర్ల వరకు ఉన్న బండరాళ్లు, మట్టి మళ్లీ కూలి పడతాయా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సొరంగానికి రక్షణలో భాగంగా కాంక్రీట్ సెగ్మెంట్లతో లైనింగ్ చేశారు. అయితే డీ1 ప్రాంతం నుంచి ఆవలి వైపు ఏర్పాటు చేసిన ఓ కాంక్రీట్ సెగ్మెంట్‌కి పగుళ్లు వచ్చాయి. రెండు వైపులా పేరుకుపోయిన ఉక్కు, ఇతర శిథిలాలు సపోర్టుగా ఉండడంతో ప్రస్తుతానికి ఆ సెగ్మెంట్ కూలిపోకుండా ఉంది. ఒక వేళ శిథిలాలను తొలగిస్తే వెంటనే దానితో పాటు సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉంటుందని, సహాయక సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సహాయక చర్యలు ఒకట్రెండు రోజులు నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషిoచాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఎన్జీఆర్ఐ నివేదిక కోసం నిరీక్షణ సొరంగం కూలిన ప్రాంతంలో ఉపతరితల భాగం ఎంత మేర పటిష్టంగా ఉంది? ఎక్కడ బలహీనంగా ఉంది? తవ్వకాలను ముందుకు కొనసాగించవచ్చా? అనే అంశాలపై స్పష్టత వస్తేనే సహాయక చర్యలు ముందుకు కొనసాగనున్నాయి. దీనిపై ఇప్పటికే ఉపగ్రహ సహాయంతో అధ్యయనాలు నిర్వహించిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిపుణులు ఈ నెల 25 లేదా 26న నివేదిక ఇస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.కాగా ప్రత్యామ్నాయంగా సొరంగానికి ఉపరితలం నుంచి బోర్ హోల్ చేసి గల్లంతైన కార్మికులను బయటకి తెచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్జీఆర్ఐ ఇవ్వనున్న నివేదికపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంది. సోమవారం నాటి సమీక్షకు ఎన్జీఆర్ఐ నిపుణులను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రమాదం నుంచి రక్షణ కోసం ఫెన్సింగ్ సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో సొరంగంలో పేరుకుపోయిన బురద, మట్టి శిథిలాలు ఒక్కసారిగా కొట్టుకువచ్చి సిబ్బందిని ముంచెత్తే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే తప్పించుకోవడానికి బురదకు ఫెన్సింగ్ చేస్తున్నారు. బురద లోపల ఒత్తిడి పెరిగినప్పుడు ఫెన్సింగ్ ఉబ్బినట్టు అవుతుంది. దీనిని సంకేతంగా భావించి సహాయక సిబ్బంది అక్కడినుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫెన్సింగ్ వల్ల బురద ఒక్కసారిగా జారిపడకుండా సిబ్బందికి కొంత సమయం లభిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం డీ2 ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. -
పల్లెల్లో పడకేసిన పాలన
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం ముగియడంతో గతేడాది ఫిబ్రవరి నుంచి అంటే దాదాపు 14 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో పంచాయతీలపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు. పైగా కేంద్ర, రాష్ట్రాల నిధులు ఆగిపోయాయి. దీనితో మెజారిటీ పల్లెల్లో పాలన పడకేసింది. మొత్తం 12,754 గ్రామ పంచాయతీల్లో 30శాతం వరకు జనాభాపరంగా పెద్ద పంచాయతీలు. వాటిలో పన్నుల వసూలు, ఇతర రూపాల్లో కొంత ఆదాయ వనరులు ఉండటంతో.. నెలవారీ ఖర్చులు కొంతవరకు వెళ్లదీసుకోగలిగే స్థితిలో ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణ వంటివి చేపట్టగలుగుతున్నాయి. మిగతా 70శాతం పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఆదాయం సరిపోక పంచాయతీ సెక్రెటరీలు, ఇతర అధికారులు అప్పోసప్పో చేసి బండి లాగాల్సి వస్తోంది. అదీ రోజువా రీ నిర్వహణ కోసమే ఇబ్బంది ఎదురవుతోంది. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయి. అప్పులు చేసి నడిపించిన సర్పంచులు.. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చెత్త సేకరణ, ఇతర అవసరాల కోసం ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండాలనే నిబంధన అమలుచేశారు. దానితో బ్యాంకు రుణాలతో ట్రాక్టర్లు కొన్నారు. ఇప్పుడు వాటి వాయిదాలు చెల్లించలేక, డీజిల్, డ్రైవర్ జీతం, ఇతర నిర్వహణ ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది ఎదురవుతోంది. సర్పంచులు ఉన్నప్పుడు తమ సొంత నిధులు ఉపయోగించి, తమ పరప తితో అప్పులు తీసుకుని వచ్చి పారిశుధ్యం, ఇతర పనులు నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి క్రమం తప్పకుండా నిధులు అందేవి. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వచి్చనా, రాకపోయినా గ్రామాల్లో నెలవారీ ఖర్చులతోపాటు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేవి. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిశాక ఎన్నికలు జరగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సుమారు రూ.1,600 కోట్లు ఆగిపోయాయి. దీనితో సొంత ఆదాయ వనరులు లేని గ్రామాల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులూ అందక.. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి కొన్ని నెలలతోపాటు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు సరిగా విడుదల కావడం లేదు. పంచాయతీలకు ప్రతినెలా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల చేస్తామని గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రతినెలా కేంద్రం ఇచ్చే రూ.220 కోట్లకు మ్యాచింగ్‌గా రూ.220 కోట్లను కొన్నినెలల పాటు ఇచి్చంది. క్రమంగా రాష్ట్ర సర్కారు ఇచ్చే మొత్తం రూ.150 కోట్లకు తగ్గించింది. ఆ తర్వాత మొత్తంగా నిలిచిపోయింది. పంచాయతీలకు ఇవ్వాల్సిన మొత్తం సుమారు రూ.వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని అంచనా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ సందర్భాల్లో గ్రామ పంచాయతీలకు రూ.700 కోట్ల దాకా విడుదల అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనితోపాటు పంచాయతీ సిబ్బంది వేతనాలను గ్రీన్‌చానెల్‌లో చెల్లించేలా చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీంతో పంచాయతీలపై కొంతమేర అయినా ఆర్థిక భారం తగ్గొచ్చునని భావిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల పాట్లు గ్రామాల్లో సర్పంచులు లేకపోవడం, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంటుండటంతో.. పూర్తి బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. దాదాపు 14 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులేమీ రాకపోవడంతో.. పంచాయతీ పరిధిలో సమకూరే అరకొర ఆదాయంతోనే నెట్టుకొస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సిబ్బందికి జీతాలు, గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ, మొక్కలకు నీళ్లు పోయడం, తాగునీటి పైపులైన్ల లీకేజీ మరమ్మతులకు, మోటార్లు పాడైతే మరమ్మతులు చేయించడం, ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులు చేయించడానికి కూడా ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి. గ్రామాల్లోని వీధుల్లో చెత్తాచెదారాన్ని తీసుకెళ్లి ఊరవతల ఇష్టమొచి్చనట్టుగా పడేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అప్పులు తెచ్చి నడిపిస్తున్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పైసా కూడా అందక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. రోజువారీ నిర్వహణ కోసం కూడా ఇబ్బంది ఎదురవుతుండటంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల ఆధ్వర్యంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పులు తెచ్చి గ్రామాలను నడుపుతున్నామని, పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కార్యదర్శులు కోరగా.. పరిశీలిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు జరగడం లేదు ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామంలో అభివృద్ధి పనులు జరగడం లేదు. సర్పంచులు ఉన్నప్పుడే పనులు ఎంతో కొంత జరిగేవి. ఇప్పుడు ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తోంది. రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. అధికారులను అడిగితే నిధులు లేవని చెబుతున్నారు. – పాలకూరి దుర్గేష్, రెగట్టే గ్రామస్తుడు, కనగల్ మండలం, నల్లగొండ జిల్లా రూ.7లక్షలు అప్పు తెచ్చి పెట్టిన.. ప్రస్తుతం గ్రామాల్లో పాలకవర్గాలు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. ఏడాదిన్నరగా ప్రజల సమస్యలను తీర్చేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఏడు లక్షల రూపాయలు అప్పుగా తెచ్చి వివిధ పనులకు ఖర్చు చేశాను. – సోమయ్య, అనంతారం గ్రామ కార్యదర్శి జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో 1,500 జనాభా ఉన్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి పంచాయతీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. తాగునీటి మోటార్ల మరమ్మతులు, బ్లీచింగ్ కొనుగోలు, వీధి దీపాల నిర్వహణ, చెత్త తరలింపు, ట్రాక్టర్ కిస్తీ, డీజిల్ ఖర్చులకు కూడా ఇబ్బంది ఎదురవుతోంది. ఇప్పటివరకు లక్షకుపైగా అప్పులు తెచి్చ, రోజువారీ నిర్వహణను నెట్టుకొస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి చెబుతున్నారు. వీధి లైట్లు వెలగక.. ఇబ్బందిగా.. హనుమకొండ జిల్లా కమలాపూర్ ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల నుంచి ఎస్సీ హాస్టల్ మీదుగా కాసీంపల్లికి వెళ్లే మార్గంలో సుమారు 20 రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. లైట్లు పెట్టించాలని పంచాయతీ అధికారులకు చెబితే.. నిధుల కొరతతో ఇబ్బంది ఉందంటూ జాప్యం చేస్తున్నారు. చీకటి పడిందంటే చాలు ఆ మార్గంలో వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని స్థానికుడు శనిగరపు రంజిత్ పేర్కొన్నారు. రోడ్ల నిండా మురుగు పారుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వలిగొండ మండల కేంద్రంలో పారిశుధ్యం దుస్థితి ఇది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు నిండిపోయి, మోరీల పైపులు పగిలిపోయి రోడ్లపైన మురుగు పారుతోందని ప్రజలు ఫిర్యాదు చేసినా.. నిధులు లేక ఏమీ చేయలేకపోతున్నామంటూ పంచాయతీ అధికారులు చేతులెత్తేస్తున్న పరిస్థితి ఉంది. గ్రామంలో సుమారు 50 వీధి దీపాలు పని చేయడం లేదని, రాత్రయితే వీధులన్నీ చీకటేనని స్థానికులు చెబుతున్నారు. ‘‘సర్పంచులు పోయినప్పటి నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్లపై మురుగు పారుతున్నా, వీధి దీపాలు వెలగకున్నా.. నిధులు వచ్చాక పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు ఇచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలి’’ అని గ్రామానికి చెందిన నానచర్ల రమేష్ డిమాండ్ చేస్తున్నారు. ఊరంతా కంపు కొడుతోంది మేజర్ గ్రామపంచాయతీ అయిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయింది. మురుగు కాల్వలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. పాలక వర్గాలు లేక, నిధులు లేక అధికారులు పనులేవీ చేయించడం లేదు. ఇక నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లి గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. డ్రైనేజీలకు మరమ్మతులు చేయించలేని దుస్థితి నెలకొంది. గ్రామస్తులు ఇదేమిటని నిలదీస్తే.. రోజువారీ నిర్వహణ కోసమే అప్పులు చేయాల్సి వస్తోందని గ్రామ కార్యదర్శి తలపట్టుకుంటున్నారు. పంచాయతీ కోసం నియమించిన స్పెషలాఫీసర్ ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెత్త చెదారం నిండి, డ్రెయినేజీలు పూడుకుపోయి గ్రామంతా కంపు కొడుతోందని వాపోతున్నారు. నాలుగైదు లక్షల చొప్పున అప్పులు తెచ్చి పెట్టాం ‘‘గ్రామ పంచాయతీలకు రెండేళ్లుగా నిధులు రాకపోవడంతో ఒక్కో పంచాయతీ నిర్వహణ కోసం ఇప్పటివరకు రూ. నాలుగైదు లక్షలు అప్పులు తెచ్చి పెట్టాం. ట్రాక్టర్ డీజిల్, తాగునీటి ఎద్దడి నివారణకు మోటార్లు, పైపులైన్ల రిపేర్లకు అప్పులు తెచ్చి పెడుతున్నాం. నిధులు లేక సక్రమంగా నిర్వహణ చేయలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వమైనా గ్రాంటు విడుదల చేసి సమస్యను పరిష్కరించాలి. – బానోత్ రమేశ్‌నాయక్, పంచాయతీ కార్యదర్శుల సంఘం గార్ల మండల అధ్యక్షుడు, మహబూబాబాద్ జిల్లా -
మాకూ సైబర్ ముప్పుంది
సాక్షి, హైదరాబాద్: సైబర్ ముప్పునకు గురవుతున్న వారిలో అన్ని రంగాల్లోని ప్రముఖులు సైతం ఉంటున్నారు. సాధారణ వ్యక్తులను టార్గెట్ చేయడం కంటే పెద్ద కంపెనీల్లోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు కొట్టేయొచ్చన్న ధోరణిలో ఆన్లైన్ మోసగాళ్లు ఉంటున్నారు. దీంతో తమకూ ఆర్థిక నేరాల ముప్పు (ఫైనాన్షియల్ క్రైం రిస్క్) తప్పదన్న ఆందోళనలో భారతీయ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు ఉంటున్నారు.క్రోల్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 96 శాతం మంది భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు ఈ ఏడాది ఫైనాన్షియల్ క్రైం రిస్క్ తప్పదన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ తరహా దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఏఐ ఆధారిత దాడులకు తాము లక్ష్యంగా ఉన్నామని భారత్‌లోని 76 శాతం మంది, ప్రపంచవ్యాప్తంగా 68 శాతం మంది పేర్కొన్నారు.భారతీయ ఎగ్జిక్యూటివ్‌లలో 36 శాతం మంది తమ కంపెనీలు సైబర్ దాడులను ఎదుర్కొనే పటిష్ట వ్యవస్థలు కలిగి ఉన్నట్టు తెలిపారు. కంపెనీల వద్ద సరైన సాంకేతికత లేకపోవడం సైబర్ దాడుల ముప్పు పెరిగేందుకు కారణమని 36 శాతం మంది వెల్లడించారు. అయితే, ఏఐ, మెషీన్ లెర్నింగ్‌తో సానుకూల ప్రభావం ఉంటుందని 32 శాతం మంది.. వీటితో ముప్పు పెరిగిందని 52 శాతం మంది చెప్పారు. కంపెనీలు సైబర్ భద్రత ముప్పును తప్పించుకునే పటిష్ట వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సర్వేలో పాల్గొన్న 59 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
ఆర్టీసీ నెత్తిన ‘రాయితీ’ బండ
సాక్షి, హైదరాబాద్: రాయితీ బస్‌పాస్.. విద్యార్థులు, నాన్ గెజిటెట్ ఉద్యోగులు, వికలాంగులు, పాత్రికేయులు వంటి వారికి ఆర్టీసీ తక్కువ మొత్తానికి జారీచేసే కార్డు. కొంతమందికి ఉచితంగా కూడా ఇస్తోంది. ఈ బస్‌పాస్‌లు ఇకపై ఉంటాయో ఉండవో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఈ పాస్‌ల ద్వారా ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయాన్ని ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి చెల్లిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ భారాన్ని ప్రభుత్వం వదిలించుకున్నట్టు కనిపిస్తోంది.ఫలితంగా దాన్ని ఆర్టీసీ మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది పెద్ద భారమే కాబోతోంది. తాజా బడ్జెట్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.4,305.48 కోట్లు కేటాయించింది. ఇందులో నేరుగా రూ.3,082.53 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ నుంచి రూ.852.09 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా రూ.370.86 కోట్లు ప్రతిపాదించింది. రాయితీ బస్‌పాస్‌లకు తిరిగి చెల్లించే (రీయింబర్స్మెంట్) మొత్తంపై ప్రస్తావనే లేదు. అన్నింటికీ మహాలక్ష్మి నిధులే.. రీయింబర్స్మెంట్ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖ వద్ద వాకబు చేస్తే, మహాలక్ష్మి పథకానికి కేటాయించిన నిధుల నుంచే వాడుకోవాలని సూచించినట్టు తెలిసింది. బడ్జెట్లో కేటాయించిన మొత్తాన్ని బట్టి నెలకు రూ.358 కోట్లు ఆర్టీసీకి అందుతున్నట్లు లెక్క. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయం సగటున నెలకు రూ.350 కోట్లు ఉంటోంది.అంటే ప్రభుత్వం ఇచ్చే మొత్తం దానికే సరిపోతుంది. కానీ, రాయితీ బస్‌పాస్‌ల ద్వారా ఏటా ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయం దాదాపు రూ.400 కోట్లు. గతంలో ఈ మొత్తం రూ.680 కోట్ల వరకు ఉండేది. మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక వారికి బస్‌పాస్‌లు అవసరం లేకుండా పోయాయి. దీంతో ఆమేర తగ్గింది. గతంలో బస్‌పాస్‌ల రాయితీ మొత్తంతోపాటు కొత్త బస్సుల కొనుగోలుకు కొద్దిగా గ్రాంటు కూడా బడ్జెట్లో కేటాయించే పద్ధతి ఉండేది. ఇప్పుడు ఆ గ్రాంటు కూడా మాయమైంది. నిధులు పెరిగినా కష్టాలే..గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీకి బడ్జెట్లో కేటాయించిన నిధులతో పోలిస్తే ప్రస్తుతం మూడు రెట్లు పెరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తన చివరి రెండు బడ్జెట్లలో రూ.1,500 కోట్ల చొప్పున కేటాయించింది. ఇప్పుడు నిధులు భారీగా పెరిగినా.. అదనంగా ఉపయోగపడే వీలు లేకుండా పోయింది. గతంలో ఆర్టీసీ 15 లక్షల వరకు రాయితీ బస్‌పాస్‌లు జారీ చేసేది. మహాలక్ష్మి పథకంతో వాటి సంఖ్య 10 లక్షలకు తగ్గినట్టు అంచనా. పాస్‌లు కొనేవారు బస్‌పాస్ ధరలో 40% చెల్లిస్తుండగా, ఆర్టీసీ 60 శాతం భరిస్తోంది.ఇప్పుడు ఆ 60 శాతం ప్రభుత్వం నుంచి రాకపోతే ఆర్టీసీనే భరించాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.400 కోట్లు ఆర్టీసీకి అదనపు భారంగా మారబోతోంది. దీన్ని తప్పించుకోవాలంటే సంస్థ రాయితీ వాటాను తగ్గించటమో, క్రమంగా బస్‌పాస్‌లను ఉపసంహరించటమో చేయాల్సి ఉంటుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై ఇలా భారం మోపటం సరికాదని, బస్‌పాస్ రాయితీ ప్రభుత్వ మే భరించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు. -
ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికి రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకున్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. 25,35,964 మంది రైతులకు సంబంధించిన రూ.20,616.89 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.వివిధ కారణాల వల్ల రుణమాఫీకి నోచుకోని అర్హులైన రైతులను ఈ పథకం కిందకి తీసుకొచ్చే విధంగా 3 నెలల పాటు అధికారులు ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించి, చివరి విడతగా 3,13,896 మంది రైతులకు రూ. 2,747.67 కోట్లు రుణమాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రెండుసార్లు రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన తీరును తెలంగాణ సమాజం గుర్తించిందని పేర్కొన్నారు.2014లో రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, అందుకోసం నాలుగు సంవత్సరాల సమయం తీసుకున్న చరిత్ర బీఆర్ఎస్దని అన్నారు. విడతల వారీగా రుణమాఫీ చేయడం వల్ల రైతులపై రూ. 2,630 కోట్ల అధిక వడ్డీ భారం పడిందని గుర్తు చేశారు. గ్రామాలవారీ పంట నష్టం వివరాలివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో సంభవించిన వడగండ్ల వాన, ఈదురుగాలుల కారణంగా జరిగిన పంటనష్టంపై వివరాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వెంటనే గ్రామాలవారీ పంట నష్టంపై సర్వే చేసి వివరాలు అందజేయాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, ప్రస్తుతానికి అందిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. తుమ్మల తాజా ఆదేశాలతో పూర్తి స్థాయి పంటనష్టం వివరాలు సేకరించే పనిలో వ్యవసాయ శాఖ యంత్రాంగం నిమగ్నం కానుంది. -
రూ.1,500 కోట్లే చివరి రుణం
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి రుణాన్ని ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం సేకరించుకోనుంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఈ అప్పును సమకూర్చుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం 27 సంవత్సరాల కాలపరిమితితో రూ.1000 కోట్లు, 30 సంవత్సరాల కాలపరిమితితో మరో రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. కాగా, ఈ రూ.1500 కోట్ల రుణంతో బహిరంగ మార్కెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.55,800 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకున్నట్టు అవుతుంది.2024–25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా గత ఏడాది జూలై నెలలో రూ.8 వేల కోట్లు, ఆగస్టులో రూ.6 వేల కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ.5,800 కోట్లు ఆర్బీఐ ద్వారా రుణంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, మార్చి నెలలో ఇప్పటికే రూ. 5 వేల కోట్లను సమకూర్చుకుంది. ఈనెల 4న రూ.2 వేల కోట్లు, 11న రూ.3 వేల కోట్లు తీసుకున్న ప్రభుత్వం.. ఈనెల 25న మరో రూ.1,500 కోట్లు తీసుకోనుంది. షెడ్యూల్లో సగమే! అయితే, తొలి మూడు త్రైమాసికాల్లో రూ. 40వేల కోట్లకు పైగా రుణాన్ని ఆర్బీఐ ద్వారా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. చివరి త్రైమాసికంలో మరో రూ.30 వేల కోట్లు తీసుకోవాలని భావించింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్లోనే ఆర్బీఐకి షెడ్యూల్ ఇచ్చింది. కానీ, చివరి మూడు నెలల్లో కేవలం రూ.15,300 కోట్ల రుణాలకు మాత్రమే పరిమితమైంది. అదే షెడ్యూల్ మేరకు రుణాలు తీసుకొని ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై మరో రూ.14,700 కోట్ల రుణభారం పడేది.కానీ, ప్రభుత్వం మాత్రం ఆ మేరకు రుణ సేకరణ జరపలేదు. ఈ విషయమై ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘చివరి మూడు నెలల అవసరాలను బట్టి రూ.30 వేల కోట్లు అప్పులు అనివార్యమనే ఉద్దేశంతో ఆర్బీఐకి షెడ్యూల్ ఇచ్చాం. కానీ అనివార్యం కాకపోవడంతో తీసుకోలేదు. షెడ్యూల్లో పెట్టినా అవసరమైనప్పుడు మాత్రమే బిడ్డింగ్‌కు వెళ్లే వెసులుబాటు ఆర్బీఐ కలి్పస్తుంది.’అని వెల్లడించారు. -
పది పద్దులు... రెండు బిల్లులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఎనిమిదోరోజు సోమవారం 2025–26 వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగనుంది. పురపాలక, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమం, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా,శిశు సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పద్దులపై సభ్యులు చర్చించనున్నారు. ఈ పద్దులపై చర్చతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది.మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన రెండు బిల్లుల్లో సవరణలను ప్రతిపాదించనుంది. దీంతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్టు తెలుస్తోంది. మరో 25 ఏళ్ల వరకు పాత పద్ధతినే కొనసాగించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెడతారని, దీనిపై చర్చ అనంతరం ఆమోదించి కేంద్రానికి పంపుతామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
రోజుకు 10 గ్రాములు చాలు!
సాక్షి, స్పెషల్ డెస్క్: అమ్మ చేతి గోరు ముద్దను నెయ్యి కమ్మదనం లేకుండా ఊహించలేం. నేతి రుచి తగలకపోతే భోజనమైనా, అల్పాహారమైనా, పిండి వంటలైనా సంతృప్తికరం, సంపూర్ణమూ కావంటే అతిశయోక్తి కాదు. వివిధ రకాల పచ్చళ్లు, పొడులకు కాస్త నెయ్యి జోడించి తింటే ఆ మజాయే వేరు. 3 వేల ఏళ్ల క్రితం నుంచే నెయ్యి వాడకం ఉందని చరిత్ర చెబుతోంది. అయితే నెయ్యి వినియోగంపై భిన్నాభిప్రాయాలున్నాయి.మంచిదని కొందరంటుంటే, మితిమీరి వాడితే రక్తనాళాల్లో అవరోధాలేర్పడతాయని కొందరంటున్నారు. ఇంతకీ నిపుణులేమంటున్నారు? భారతీయులు సగటున రోజుకు 10 గ్రాముల వరకు నెయ్యి/వెన్న తీసుకోవచ్చని హైదరాబాద్‌లోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అనుబంధ సంస్థ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో లిపిడ్ కెమిస్ట్రీ డివిజన్ సైంటిస్ట్ (జి)గా ఉన్న డాక్టర్ అహ్మద్ ఇబ్రహీం (Dr. Ahmed Ibrahim) తెలిపారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే..ఔషధ విలువలపై పరిశోధనలు జరగలేదు.. నెయ్యిలో ఎక్కువ వరకు కొవ్వు పదార్థాలే ఉంటాయి. విటమిన్ ఎ, ఇ, కె కూడా కొంతవరకు ఉంటాయి కానీ, అవి పరిగణనలోకి తీసుకోదగినంత ఎక్కువగా ఉండవు. అందుకని ఈ విటమిన్లను పొందటం కోసం నెయ్యిని వనరుగా చూడకూడదు. ఆవు నెయ్యిలో గేదె నెయ్యి కంటే తక్కువ శాతం కొవ్వు ఉంటుంది.మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థం ఆవు నెయ్యిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది.. అంతే తేడా. నెయ్యిలో ఔషధ విలువల గురించి ఎన్ఐఎన్లో పరిశోధనలేమీ చెయ్యలేదు. అలాగే వేసవిలో ఎంత నెయ్యి తీసుకోవాలి? అనే విషయంపై కూడా పరిశోధనలేమీ జరగలేదు. అయితే నెయ్యిని నిర్దేశిత మోతాదుకు మించకుండా తీసుకోవాలి. నెయ్యిలో పోషకాలు (100 గ్రాములకు) ⇒ శక్తి – 870 కిలోకేలరీలు ⇒ పిండి పదార్థం– 0 గ్రా. ⇒ కొవ్వు – 99.5 గ్రా. ⇒ శాచ్యురేటెడ్ ఫ్యాట్ – 61.9 గ్రా. ⇒ మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్ – 28.7 గ్రా. ⇒ పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ – 3.69 గ్రా. ⇒ మాంసకృత్తులు – 0.3 గ్రా. ⇒ కొలెస్ట్రాల్ – 256 మిల్లీ గ్రాములు ⇒ కాల్షియం – 4 మిల్లీ గ్రాములు వేర్వేరు వంట నూనెలు మంచిది ఒకరు సగటున రోజుకు సుమారు 2,000 కిలో కేలరీల ఆహారం తీసుకోవాలి. అందులో 30% కేలరీల మేరకు కొవ్వు పదార్థాలు ఉండాలి. అందులో ‘ఇన్విజిబుల్ ఫ్యాట్’సగం, ‘విజిబుల్ ఫ్యాట్’సగం ఉండాలి. మనం రోజూ తినే అనేక ఆహార పదార్థాల్లో అంతర్లీనంగా కలిసి ఉండే కొవ్వు పదార్థాలనే ‘ఇన్విజిబుల్ ఫ్యాట్’అంటున్నాం. 2,000 కిలో కేలరీల ఆహారం తీసుకునే వ్యక్తి రోజుకు సుమారు 30 గ్రాముల ‘విజిబుల్ ఫ్యాట్’అంటే.. వంట నూనెలు, నెయ్యి/వెన్న వంటివి తీసుకోవచ్చు.వీటిలో మూడింట ఒక వంతు మాత్రమే నెయ్యి/వెన్న ఉండాలి. వంట నూనెలు ఒకే రకం కాకుండా అనేక రకాలను తీసుకోవటం చాలా మంచిది. ఒక్కో నూనెలో ఒక్కో రకం ఫ్యాటీ యాసిడ్ పాళ్లు అధికంగా ఉంటాయి. అందుకే అనేక రకాల నూనెలను రోజుకు 20 గ్రాముల వరకు తీసుకోవచ్చు. 10 గ్రాములకు మించకుండా నెయ్యి / వెన్న వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవచ్చు. అయితే, 30 గ్రాముల వరకు నూనెలు తీసుకునే వారు కూడా నెయ్యి తప్పకుండా తీసుకోవాలనేమీ లేదు. మొత్తం కలిపి కొవ్వు పదార్థాలు రోజుకు 30 గ్రాములకు మించకుండా తీసుకోవాలి. దీన్ని ఎన్ఐఎన్ విడుదల చేసిన ‘భారతీయులకు ఆహార సంబంధ మార్గదర్శక సూత్రాలు’లోనూ పొందుపరిచాం.పిల్లలు ఇలా తీసుకోవాలి పిల్లలు వారి వయసు, బరువు ఆధారంగా ఎన్ని కేలరీలను రోజువారీ ఆహారం తీసుకోవాలో ఎన్ఐఎన్ నిర్దేశించింది.⇒10–12 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 2,200 కేలరీల ఆహారం తినాలి. వీరు 24 గ్రాముల నూనెలు, 12 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 10–12 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,000 కేలరీల ఆహారం తినాలి. 22 గ్రాముల నూనెలు, 11 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 13–15 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 2,800 కేలరీల ఆహారం తినాలి. వీరు 30 గ్రాముల నూనెలు, 15 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 13–15 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,400 కేలరీల ఆహారం తినాలి. 27 గ్రాముల నూనెలు, 13 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 16–18 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 3,300 కేలరీల ఆహారం తినాలి. వీరు 37 గ్రాముల నూనెలు, 18 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 16–18 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,500 కేలరీల ఆహారం తినాలి. వీరు 28 గ్రాముల నూనెలు, 13 గ్రాముల నెయ్యి వాడొచ్చు.వ్యాయామం చేసే వారికి నెయ్యితో మేలు! నెయ్యి మన శరీరంలో ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. మెదడును శక్తిమంతం చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుంది. వాతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని సమస్థితిలో ఉంచుతుంది. చర్మానికి కాంతినిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. నేతిలోని బుటిరేట్ జఠరాగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. విష దోషాల్ని, పేగుల్లో పుళ్లు, వాపుల్ని, గడ్డల్ని నివారిస్తుంది. నెయ్యి తినే అలవాటున్న వారిలో పేగు కేన్సర్ తక్కువ. భారతీయ గోసంతతి విదేశీ గోసంతతి కన్నా భిన్నమైనది. మన ఆవుల వెన్నలో అపకారక ఎల్డీఎల్ కొవ్వు కన్నా ఉపకారక హెచ్‌డీఎల్ కొవ్వు ఎక్కువగా ఉంటుంది. బాగా వ్యాయామం చేసే వారికి నెయ్యి మేలే చేస్తుంది. – డా. జీవీ పూర్ణచందు ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు -
చార్మినార్‌కు వెళుతున్నారా.. పార్కింగ్ ప్రాంతాలు ఇవే..
చార్మినార్: రంజాన్ మాసం చివరి దశకు చేరుకోవడంతో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీలో ముందస్తు చర్యలు చేపట్టారు. మార్కెట్లకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో వాహనదారులకు ఇబ్బందుల్లేకుండా చార్మినార్ (Charminar) యునానీ ఆసుపత్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మొత్తం 7 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. నగరం నుంచే కాకుండా శివారు జిల్లాల ప్రజలు కూడా పాతబస్తీలోని మార్కెట్లకు వస్తుండడంతో క్రమంగా వాహనాల రద్దీ పెరుగుతోంది.వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మండలం ట్రాఫిక్ పోలీసులు చార్మినార్ పరిసరాల్లో వాహనదారులకు పార్కింగ్ (Parking) సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు మక్కా మసీదులో నమాజ్‌లకు ముస్లింలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వారి వాహనాలు పార్క్ చేసేందుకు పంచమొహల్లాలో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. అలాగే కూలగొట్టిన చార్మినార్ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని శుభ్రం చేసి అందుబాటులోకి తెచ్చారు. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు రంజాన్ నేపథ్యంలో పాతబస్తీకి సందర్శకులతో పాటు వినియోగదారుల సందడి అధికంగా ఉంటోంది. దీంతో వాహనదారుల సౌకర్యార్థ్యం పంచమొహాల్లాలో అతి పెద్ద ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం ఏర్పాటు చేశాం. అలాగే ఖిల్వత్ గ్రౌండ్, కుడా స్టేడియం, చౌక్‌మైదాన్ ఖాన్‌లోని ముఫిదుల్లా నాం ఖాళీ స్థలాలతో పాటు యునానీ ఆసుపత్రి ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా అక్రమంగా పార్కింగ్‌ల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఆర్.వెంకటేశ్వర్లు, నగర ట్రాఫిక్ డీసీపీ–3చదవండి: ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు! -
ఫోర్త్ సిటీ.. దక్షిణ హైదరాబాద్‌కి రియల్ బూమ్!
నీరు ఎత్తు నుంచి పల్లం వైపునకు పారినట్లే.. రియల్ ఎస్టేట్ అవకాశాలు, అభివృద్ధి కూడా మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ప్రాంతం వైపే విస్తరిన్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో మొదలైన స్థిరాస్తి అభివృద్ధి ఐటీ హబ్ రాకతో గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాల వైపు పరుగులు పెట్టింది. కొత్త ప్రాంతంలో అభివృద్ధి విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ హైదరాబాద్ వైపు దృష్టిసారించింది. విద్య, వైద్యంతో పాటు ఏఐ సిటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లతో కూడిన నాల్గో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనుంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితం కానున్న ఈ కొత్త నగరంతో స్థిరాస్తి అవకాశాలు పశ్చిమం నుంచి దక్షిణ హైదరాబాద్ వైపు మళ్లనుంది. – సాక్షి, సిటీబ్యూరోమన దేశంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, దక్షిణ కొరియాలో ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ సక్సెస్‌లను స్ఫూర్తిగా తీసుకొని.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. నగరం సమీపంలోని మీర్ఖాన్పేట, బేగరికంచె, ముచ్చర్ల గ్రామాల పరిధుల్లో 814 చదరపు కిలో మీటర్లు, 2,01,318 ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీ విస్తరించి ఉంటుంది. కడ్తాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల్, యాచారం, ఆమన్‌గల్ 7 మండలాల్లోని 56 గ్రామాలు ఫోర్త్ సిటీ పరిధిలోకి వస్తాయి. ఈ నగరం సాకారమైతే 30–35 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 60–70 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ విస్తరణ ప్రణాళిక హైదరాబాద్ రియల్ రంగానికి ఊతంగా నిలవనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేలలో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు మరింత మెరుగవుతాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక స్థలాలకు డిమాండ్ ఏర్పడనుంది. ప్రాపర్టీ విలువలు గణనీయంగా పెరుగుతాయి. నెట్‌జీరో సిటీగా నిర్మితం కానున్న ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ స్వరూపమిదీఎలక్ట్రానిక్స్ అండ్ సాధారణ పరిశ్రమలు: 4,774 ఎకరాలు లైఫ్ సైన్స్ హబ్: 4,207 ఎకరాలు నివాస, మిశ్రమ భవనాలు: 1,317 ఎకరాలు నివాస భవనాల జోన్: 1,013 ఎకరాలు స్పోర్ట్స్ హబ్: 761 ఎకరాలు ఎడ్యుకేషనల్ అండ్ వర్సిటీ జోన్: 454 ఎకరాలు ఎంటర్టైన్మెంట్: 470 ఎకరాలు హెల్త్ సిటీ: 370 ఎకరాలు ఫర్నీచర్ పార్క్: 309 ఎకరాలు ఏఐ సిటీ: 297 ఎకరాలునెట్జీరో సిటీగా.. చుట్టూ పచ్చదనం, విశాలమైన రహదారులు, ప్రణాళికబద్ధంగా నివాస ప్రాంతాలు, వాణిజ్య క్లస్టర్లు, ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు ఒక చోట వీటన్నింటికీ దూరంగా పరిశ్రమలు, ఇలా పర్యావరణహితంగా కాలుష్యరహితంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. నెట్‌జీరో సిటీగా ఏర్పాటుకానున్న ఈ నగరానికి సంబంధించి ప్రభుత్వం వేర్వేరు ప్రణాళికలను తయారు చేసింది. వచ్చే యాభైఏళ్లలో అక్కడ మారనున్న పరిస్థితులను అనువుగా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించారు.వ్యర్థాల నిర్వహణ.. పర్యావరణాన్ని కాపాడేందుకు నెట్‌జీరో సిటీలో 33 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. చెట్లు, వాణిజ్య పంటలు, రహదారుల వెంట నీడనిచ్చే వృక్షాలు ఉంటాయి. వీటి ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కంటే ఇక్కడ 2–3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇళ్లు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేకమైన వ్యవస్థను రూపకల్పన చేస్తున్నారు. వ్యర్థ జలాలను శుద్ధీకరించి మళ్లీ వినియోగించేందుకు వీలుగా మారుస్తారు. దీంతో పాటు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణకు ఇంధనం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సౌర విద్యుత్ వాడేలా చూస్తారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలు, నివాసాలు నిర్మించేటప్పుడు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కాలుష్యరహిత వస్తువులను వినియోగించేలా చూస్తారు.ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్స్‌కు ప్రాధాన్యం..ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ రెండు రంగాలకే ఏకంగా 64 శాతం భూమిని కేటాయించారు. ఎలక్ట్రానిక్స్, సాధారణ పరిశ్రమలకు 4,774 ఎకరాలు, లైఫ్‌సైన్స్ హబ్‌కు 4,207 ఎకరాలను కేటాయించారు. కొంగరకలాన్‌లో యాపిల్ ఫోన్ విడిభాగాలను తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ జోన్లో తన శాఖలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. లైఫ్‌సైన్ జోన్లో ప్రాణాధార మందుల తయారీ, పరిశోధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థలు వాటి విస్తరణ ప్రాజెక్ట్‌లను ఇక్కడ ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.రోడ్డు, రైలు, విమానం.. అన్నీ.. » ఫ్యూచర్ సిటీకి రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానించేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించనున్నారు. » ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్‌కు, అలాగే ఔటర్ నుంచి ప్రతిపాదిత ప్రాంతాలు బేగరికంచె, మీర్ఖాన్పేట్, ముచ్చర్ల వరకూ 330 అడుగుల వెడల్పు రహదారులు, ఇతర అంతర్గత రహదారులను నిర్మించనున్నారు. » రావిర్యాల ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట మీదుగా ముచ్చర్ల, ఆమన్‌గల్ మండలంలోని ఆకుతోటపల్లె వద్ద రీజినల్ రింగ్ రోడ్‌ను కలుపుతూ 40 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. » దీంతో పాటు రాజేంద్రనగర్‌లో రానున్న కొత్త హైకోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. -
కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనతోనే రైతులకు కష్టాలు: హరీష్‌రావు
సాక్షి, సిద్దిపేట: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో నిన్న(శనివారం) రాత్రి కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు.అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రైతు బంధు రూపంలో కేసీఆర్ రైతులకు నేరుగా సాయం చేశారు. వానా కాలం యాసంగి రైతుబంధు రూ. 15 వేలు వెంటనే విడుదల చేయాలి. పంటల బీమా ఉండే రైతులకు ఇంత నష్టం ఉండేది కాదు. రైతులకు మూడు పంటల బీమా రాలేదు. రుణమాఫీ చేయలేదు ఇచ్చామని.. అబద్ధాలు ఆడుతున్నారు’’ అని కాంగ్రెస్‌పై హరీష్‌రావు మండిపడ్డారు.‘‘రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఎండల వల్ల పంటలు ఎండటం లేదు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆర్థిక సాయం చేసి అందుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లోనూ గ్రీన్ బిల్డింగ్స్..
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ అనుకూలమైన హరిత భవనాలకు ఆదరణ పెరుగుతోంది. అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలే కాదు ప్రభుత్వం నిర్మించిన సచివాలయం, పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా కలెక్టరేట్లు, ఇతరత్రా ఆఫీసు భవనాలు సైతం పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తుండటమే ఇందుకు ఉదాహరణ.. స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావడంతో పాటు సహజ వనరులను వినియోగించుకోవడం, విద్యుత్, నీటి పొదుపు, సౌరశక్తి వినియోగం, గృహోపకరణాలు సైతం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) అనుగుణంగా ఉండటమే హరిత భవనాల ప్రత్యేకత. గ్రీన్ బిల్డింగ్స్‌లో 60 శాతం వరకు నీటి వృథాను అరికట్టవచ్చు. నిత్యావసరాలకు వినియోగించే నీరు బయటకు పంపకుండా వాటిని రీసైకిల్ చేసి తిరిగి మొక్కలు, బాత్రూమ్ అవసరాలకు వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్‌లో నిర్మాణ వ్యయం 8–10 శాతం అధికంగా ఉంటుంది. కానీ.. ఈ భవనాలలో నీరు, విద్యుత్ పొదుపు అవుతున్న కారణంగా ఇంటి నిర్మాణం కోసం అదనంగా వెచ్చించిన వ్యయం 2–3 ఏళ్లలో తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్ మెటీరియల్స్‌ను ఉపయోగించడం గ్రీన్ బిల్డింగ్స్ మరొక ప్రత్యేకత. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే నిర్మాణంలో వాడుతుంటారు. ఇటుకల నుంచి టైల్స్ వరకు గ్రీన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 720కి పైగా గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ వద్ద రిజిస్టర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 11 వేల నిర్మాణాలు ఉన్నాయని ఐజీబీసీ ప్రతినిధులు చెబుతున్నారు. -
ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్, తేడా వస్తే తాటతీస్తాం.. బుకీలకు పోలీసుల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్-18 మ్యాచ్ కోసం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ముస్తాబైంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుండడంతో ఉప్పల్ స్టేడియం వద్ద సందడి షురూ అయ్యింది.ఈ తరుణంలో హైదరాబాద్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం 2700 మంది పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. 450 సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఐపీఎల్ సీజన్లో మొత్తం 10 జట్లు.. మొత్తం 73 మ్యాచ్‌లు ఆడనున్నాయి. మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో గతంతో పోలిస్తే ఈసారి భారీ బెట్టింగ్స్ బుకీలు ప్లాన్ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్స్,రిసార్ట్స్, రెస్టారెంట్స్ క్లబ్స్పై ఓ కన్నేశారు. ఏమాత్రం తేడా వచ్చినా బెట్టింగ్ రాయుళ్ల తాటతీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు39వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియం కావడంతో.. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మ్యాచ్ అనంతరం ప్రేక్షకులు తిరిగి వెళ్లేందుకు మెట్రో సేవలనూ అర్ధరాత్రి వరకూ పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా..సన్‌రైజర్స్ సత్తా చాటుతుందా ఇదిలా ఉంటే ఉప్పల్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మొదలు కానుంది. దీంతో హైదరాబాద్ గట్టుపై బోణీ కొట్టేదెవరని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజస్థాన్ రఫ్ఫాడిస్తుందా..ఈ సారి కూడా సన్‌రైజర్స్ సత్తా చాటుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పట్టిష్టంగా ఇరు జట్లుసన్ రైజర్స్ హైదరాబాద్ టీం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీతో హైదరాబాద్ టీమ్ పటిష్టంగా కనిపిస్తుండగా..ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలం కావడంతో..హెడ్, అభిషేక్, క్లాసెన్‌లు ఉగ్రరూపం చూపించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తక్కువ లేదు. యశస్వి జైశ్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్మేయర్ రూపంలో ఆ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడగా…అందులో ఎస్ఆర్హెచ్ 11 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ 9 మ్యాచ్‌లలో విజయం సాధించింది. -
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనారోగ్య రిత్యా తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఫోన్ ట్యాపింగ్కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లయి చేశారు. వైద్యం కోసం అమెరికాకు వెళ్లినట్లు నాంప్లలి కోర్టులో ఇప్పటికే మెమో దాఖలు చేశారు. కేసు దర్యాప్తు కోసం పూర్తిగా సహకరిస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి పోలీసులు ఛార్జిషీట్ ఫైల్ చేసినందున తనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ఇంకెవ్వరికీ ఇలా జరగొద్దు
మోపాల్ (నిజామాబాద్ రూరల్): ‘మా కుటుంబం తరపున అందరికీ ఒక విన్నపం.. ప్లీజ్.. మా చెల్లికి జరిగినట్లు ఇంకెవ్వరికీ జరగకుండా చూడాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాం. దయచేసి మీ ఇంట్లో వారికి ఏ చిన్న జ్వరం వచ్చినా ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోండి దయచేసి..’అంటూ నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి గ్రామంలో ఒక కుటుంబం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆలోచింపజేస్తున్నాయి. వివరాలివి. నర్సింగ్‌పల్లికి చెందిన ఎల్లుల్ల స్ఫూర్తి (21)తోపాటు ఆమె తల్లి స్వప్న ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వారిని కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. స్వప్న కోలుకుంది. స్ఫూర్తికి మాత్రం డెంగీ కారణంగా రోజురోజుకూ ప్లేట్లెట్స్ పడిపోయి పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. స్ఫూర్తి శనివారం కన్నుమూసింది. తమ కుటుంబానికి కలిగిన విషాదం ఇంకెవ్వరికీ రావొద్దని కోరుతూ.. స్ఫూర్తి కుటుంబ సభ్యులు గ్రామంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. -
పరీక్ష రాసి వస్తూ.. పైలోకాలకు..
హైదరాబాద్: గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదో తరగతి పరీక్ష రాసి సోదరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టడంతో విద్యారి్థని మృతి చెందింది. ఆమె సోదరుడు గాయాల పాలయ్యాడు. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో ఉంటున్న పెనుదాస్ చత్రియా, సబితా చత్రియా దంపతులకు కుమారుడు సుమన్ చత్రియా, కుమార్తె ప్రభాతి చత్రియా (16) ఉన్నారు. ప్రభాతి చత్రియా రాయదుర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ«శాలలో ఆమె పదో తరగతి పరీక్షలు రాస్తోంది. శనివారం ఆమె పరీక్ష రాసిన అనంతరం సోదరుడు సుమన్ ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది. మార్గంమధ్యలో గచ్చిబౌలి ప్లైఓవర్‌పైకి రాగానే వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సుమన్ ఎడమ వైపు పడిపోగా ప్రభాతి కుడివైపు పడిపోయింది. బస్సు వెనుక చక్రం ప్రభాతి పైనుంచి వెళ్ళడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.సుమన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రభాతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో పదో తరగతి పరీక్షలు రాస్తున్న తమ కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో ప్రభాతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. -
ఈబీసీలకూ ‘రాజీవ్ యువ వికాసం’
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నిరుద్యోగులకు కూడా రాజీవ్ యువ వికాసం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఆది లేదా సోమవారాల్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. శనివారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈబీసీలకు రాయితీ రుణాలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.ఇప్పటికే రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజీవ్ వికాసం పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈబీసీ రాయితీ రుణాలకు సంబంధించిన అంశం పెండింగ్‌లో ఉండటంతో మార్గదర్శకాల జారీలో ఆలస్యమైనట్లు సమాచారం.ఈ పథకం మార్గదర్శకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచాయి. వీటిని ఆమోదించి, ఉత్తర్వులు జారీ చేసిన మరుక్షణమే ఈబీసీల దరఖాస్తులను ఓబీఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్లో తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రి పొన్నం, ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ కె. రామకృష్ణారావు -
బీఆర్ఎస్ నేతలకు మెంటలెక్కింది
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ నేతలకు మెంటలెక్కింది. మైండ్ పనిచేయడంలేదు. వారిని ఎర్రగడ్డ హాస్పిటల్‌కు పంపించాలి’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పదేళ్లలో కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు అసలు శిక్షలే సరిపోవు. కేసీఆర్ పదిలక్షల అబద్ధాలు ఆడారు. ఆయన మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలి. దళితుడిని సీఎం చేయకపోతే తల తీసుకుంటా అన్నారు. కేసీఆర్‌ను తలతీసి ఇవ్వమని అడగాలి.లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోమని చెప్పాలి’అని కోమటిరెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సభలో హరీశ్‌రావు వేసిన ప్రశ్నే తప్పని, ఏడేళ్లపాటు నారపల్లి బ్రిడ్జి కట్టలేక పోయిన బీఆర్ఎస్ నేతలా తనపై విమర్శలు చేసేది అని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నా పవర్ లేని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. ‘నల్లగొండలో రోడ్లు అభివృద్ధి చేశామన్న ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలు తప్పు.మా ప్రభుత్వంలో చేసిన పనులు బీఆర్ఎస్ వాళ్లు తమ ప్రభుత్వంలో చేసినట్టు చెప్పుకుంటున్నారు’అని కోమటిరెడ్డి అన్నారు. ‘మామ చాటు అల్లుడు హరీశ్‌రావు. తండ్రి పేరు చెప్పి కేటీఆర్ వచ్చారు. మేము కష్టపడి వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాము. నేను స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా పనిచేశాను. 1987లో నేను ఎన్ఎస్యూఐ లీడర్‌ను’అని పేర్కొన్నారు. ‘బీఆర్ఎస్ వాళ్లు హౌలాగాళ్లు.. వాళ్లకు ధరణితో దోచుకుతినడం తప్ప ఏమీ తెల్వదు’అని మండిపడ్డారు. -
వెన్ను విరిచిన వర్షం
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా/ మహబూబ్‌నగర్ వ్యవసాయం: ఒకపక్క బోర్లలో నీళ్లు అడుగంటి ఎండిపోతున్న పంటలు.. మరోపక్క మిగిలిన కొద్దిపాటి పంటలను ముంచెత్తిన అకాల వర్షం.. దిక్కుతోచని స్థితిలో రైతన్న కంటక‘న్నీళ్లు’.. అకాల వర్షాలు అన్నదాతను తీవ్రంగా దెబ్బతీశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షంతో వరి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరంగల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వడగళ్ల వాన పంటలను దెబ్బతీసింది. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో భారీ వర్షానికి తోడు ఈదురు గాలుల కారణంగా వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. పొగాకు పంట కూడా దెబ్బతిన్నట్లు రైతులు చెపుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో మిరప, మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల రూరల్, ధర్మపురి మండలాల్లో వడగళ్ల వాన కారణంగా సుమారు 1500 ఎకరాల్లో మామిడి రాలిపోగా, మరో 1500 ఎకరాల మేర మొక్కజొన్న పంట నేలకొరిగినట్లు ప్రాథమిక అంచనా. నువ్వులు, పసుపు తడిచిపోయిందని రైతులు వాపోతున్నారు. మొత్తం 5,350 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, ఎల్లారెడ్డిపేట మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట నీటిపాలైంది. పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. మామిడి కాయలు రాలిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో సిరికొండ, ఇందల్వాయి, దర్పల్లి మండలాల్లో వడగళ్లతోపాటు పిడుగులు కూడా పడ్డాయి. దర్పల్లి మండలంలోని వాడి, లింగంపల్లి, పోతాయిపల్లి గ్రామాల్లో పిడుగుపాటుకు రెండు గేదెలు, మూడు గొర్రెలు మృతిచెందాయి. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్, మహమ్మద్ షాపూర్, సూరంపల్లి, దొమ్మాట, ముబారస్ పూర్ తదితర గ్రామాల్లో దాదాపు 175 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. అకాల వర్షం వల్ల చేతికొచి్చన పంట నేల రాలటంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘మా కష్టం అంతా వృథా అయ్యింది. ప్రభుత్వం తక్షణం పరిహారం అందించాలి’అని వరంగల్‌కు చెందిన ఓ రైతు వాపోయారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని మోమిన్‌పేట, మర్పల్లి, నవాబుపేటలో కూరగాయ పంటలు, పూల తోటలకు నష్టం వాటిల్లింది. కందుకూరు, చేవెళ్ల, మోమిన్‌పేట, షాద్‌నగర్ మండలాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. హన్వాడ, మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్ అర్బన్, జడ్చర్ల, మూసాపేట, అడ్డాకులు, భూత్పూర్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవటంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీచేశారు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. సూత్తుండగానే మక్కలు కొట్టుకుపోయాయి రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. రూ.30 వేల వరకు ఖర్చు చేసిన. కరువు రావడంతో దిగుబడి 36 బస్తాలకు పడిపోయింది. మక్కలను అమ్ముకునేందుకు మూడు రోజుల క్రితం జనగామ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చా. తేమ ఉందని తక్కువ ధరకు అడగడంతో కాటన్ యార్డులో ఆరబోసుకున్నా. ఈరోజు అమ్ము కుందామని ఆశపడ్డ. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో మక్కల రాసి వద్ద వరద చేరి మొత్తం తడిసిపోయాయి. సూత్తుండగానే గింజలు కొట్టుకుపోయాయి. దిగుబడి తగ్గి ఒక రకంగా నష్టపోతే, అకాల వర్షం మరింత కుంగదీసింది. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి. -విజయ, కొండాపురం, పాలకుర్తి, జనగామ జిల్లా -
మంత్రి కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ బీఆర్ఎస్ శాసనసభా పక్షం, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఈ మేరకు శనివారం స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ఆయన చాంబర్లో కలసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ నోటీసు అందజేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమటిరెడ్డి సభకు అవాస్తవాలతో కూడిన సమాధానం చెప్పారని నోటీసులో పేర్కొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఆర్ఎఫ్ నిధులు రాలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఎస్క్రో ఖాతా తెరవలేదని అబద్ధాలు చెప్పారన్నారు. అలాగే నల్లగొండ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి కూ డా ఖర్చు చేయలేదని అసత్యాలతో సభను తప్పుదోవ పట్టించారన్నారు. ఈ 3 అంశాలకు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చి, సభా గౌరవాన్ని తగ్గించారని ఆరోపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని సభా గౌరవం కాపాడాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌ను కోరారు. -
మీ ప్రాథమ్యాలు యజ్ఞయాగాలే!
సాక్షి, హైదరాబాద్: ‘అప్పుడు మీ ప్రాథమ్యాలు కాళేశ్వరం సహా ఎత్తిపోతల పథకాలు, కొత్త సచివాలయం, పెద్ద భవనాలు, బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయాలు, పోలీసులకు ఏసీ వాహనాలు, చండీయాగాలు, ప్రగతి భవన్లో య జ్ఞాలు, యాగాలే.. ప్రజలకు మంచి రోడ్లు ఉండాలని మా త్రం కాదు. నాకు యాగాలు, యజ్ఞాలు లేవు. రోడ్లు, బ్రిడ్జీలు కట్టాలని ఉంది’అని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రధాన ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వివాదం రాజేశాయి.రోడ్ల నిర్మాణంపై శనివారం ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి కోమటిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. యాగాలు చేశామని, సచివాలయం కట్టామని తమను అవమానించారని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను యాగాలు చేస్తానని, తనకు దేవుడిపై భక్తి ఉందన్నారు. ‘నేను వాటర్ నీళ్లు అనను... ఎక్కడంటే అక్కడ చేపల పులుసు తినను’అని కోమటిరెడ్డి తీరును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులంతా నిష్క్రమించారు.దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు స్పందిస్తూ యాగాలు చేయడం తప్పని కోమటిరెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ ప్రాథమ్యాల గురించే మాట్లాడారని.. దీనికే వారు సభ నుంచి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తన కుటుంబం లెక్కలేనన్ని గుడులు కట్టించిందని వివరణ ఇచ్చారు. తన సమాధానాలకు దిమ్మ తిరిగే వారు వెళ్లిపోయారని విమర్శించారు.రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై కోమటిరెడ్డి వర్సెస్ ప్రశాంత్‌రెడ్డి అంతకుముందు రోడ్ల మరమ్మతు లు, నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి, బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంత్‌రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్ర భుత్వం రోడ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయ డం లేదని.. ఫలితంగా తమ హయాంలో ప్రారంభమైన పనులు సైతం ఆగిపోయాయని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. గత 10 ఏళ్లలో తాము రోడ్ల నిర్మాణానికి రూ. 22 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. కోమటిరెడ్డి నియోజకవర్గ కేంద్రం నల్లగొండలో రూ. 200 కోట్లతో రోడ్లు వేశామన్నారు.అయితే ఈ వాదనను కోమటిరెడ్డి తోసిపుచ్చారు. బీఆర్ఎస్ పాలనలో రూ. 8,112 కోట్లతో 6,668 కి.మీ. రోడ్లకు మాత్రమే మరమ్మతులు చేశారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో వేసిన రోడ్లు ఎక్కడున్నాయో చూపిస్తే ప్రశాంత్‌రెడ్డికి కొబ్బరికాయ కొట్టి సన్మానం చేస్తానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. తనపై కక్షతో నియోజకవర్గంలో రోడ్లకు నాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 7 కి.మీ. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ను బీఆర్ఎస్ పాలనలో కట్టలేకపోయారని కోమటిరెడ్డి ఆరోపించగా అది ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు అని ప్రశాంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. -
అడుగంటిన జలం.. అందని భూగర్భ జలాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నీళ్లందక ‘బోరు’మంటున్న పొలాలు.. చేతికందిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. అప్పులు చేసి, బోర్లు వేయించి అయినా పంటలను కాపాడుకుందామంటే.. నీళ్లు పడక కన్నీళ్లు పెడుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. వేసవి మరింత ముదురుతుండటం, భూగర్భ జలాలు మరింతగా తగ్గిపోతుండటంతో మరింతగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. వేలకొద్దీ బోర్లు వేస్తున్నా... వేసవి తీవ్రత పెరుగుతుండటం, భూగర్భ జలాలు తగ్గి బోర్లు వట్టిపోతుండటంతో.. పంటలను కాపాడుకునేందుకు రైతులు పెద్ద సంఖ్యలో బోర్లు వేయిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ, యాదాద్రి, సిద్ధిపేట, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బోర్లు వేయిస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కో ఉమ్మడి జిల్లా పరిధిలో గత రెండు నెలల్లో.. కనీసం వెయ్యి వరకు బోర్లు వేయించినట్టు అంచనా. పెరుగుతున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో కొంత మంది కాలువల కింద సాగు చేస్తుండగా.. ఎక్కువ మంది కొత్తగా బోర్లు వేసి పంటలు కాపాడుకునేందుకు ప్రయతి్నస్తున్నవారే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత రెండున్నర నెలల్లో 1,969 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకోగా.. మహబూబ్‌నగర్‌లో 1,334 కనెక్షన్లు, వరంగల్ జిల్లాలో 1,706 కనెక్షన్లు, ఖమ్మం జిల్లాలో 850 కనెక్షన్లు తీసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అప్పుల ఊబిలోకి రైతులు పంటను కాపాడుకునేందుకు పెద్ద సంఖ్యలో బోర్లు వేయిస్తున్న రైతులు.. ఇందుకోసం లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారు. అటు బోర్లలో నీరూ పడక, ఇటు అప్పులూ పెరిగిపోయి తలపట్టుకుంటున్నారు. – యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం ఉప్పలపహడ్ గ్రామానికి చెందిన సైరెడ్డి చంద్రారెడ్డి బావి ఎండిపోవడంతో రెండు నెలల కిందట బోరు వేశారు. నీళ్లు పడలేదు. వారం కింద మరో బోరు 450 ఫీట్లు వేయించగా.. అదీ ఫెయిల్ అయింది. వాటికోసం చేసిన అప్పు రూ.లక్షన్నర, పంట పెట్టుబడి రూ.లక్ష మొత్తం రూ.2.5 లక్షల అప్పులపాలయ్యారు. – నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డకు చెందిన గుర్రం శ్రీనివాస్ 4 ఎకరాల్లో వరి సాగు చేశారు. మూడెకరాల్లో పంట ఎండిపోతుండటంతో పది రోజుల కింద 3 బోర్లు వేశారు. వాటిల్లో చుక్క నీరు కూడా పడలేదు. చేసేదేమీ లేక పొలాన్ని పశువుల మేతకు వదిలేశారు. బోర్లు వేసేందుకు చేసిన రూ. 2 లక్షల అప్పు భారంగా మారింది. – కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కన్నాపూర్ తండాకు చెందిన కాట్రోత్ రవినాయక్ నాలుగెకరాల్లో వరి సాగు చేశారు. పంట ఎండిపోతుండటంతో మూడు బోర్లు వేయించినా.. ఒక్కదానిలోనూ నీళ్లు పడలేదు. రూ.3.5 లక్షలు అప్పు మీదపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లికి చెందిన చింతాకుల రవి రెండెకరాల్లో వరి వేశారు. బోరు ఎండిపోవడంతో.. 20 రోజుల కింద 600 ఫీట్ల వరకు మరో బోరు వేసినా నీరు పడలేదు. రూ.లక్షన్నర అప్పు అయిందని వాపోతున్నారు. మూడు బోర్లు ఫెయిల్ అయ్యాయి..ఈ చిత్రంలోని రైతు పేరు గోగు హరిప్రసాద్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన ఈయన ఆరు ఎకరాల్లో వరి సాగు చేశారు. అందుకోసం రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రసాద్‌కు మూడు బోర్లు ఉండగా, భూగర్భ జలాలు అడుగంటి రెండు ఎండిపోయాయి. పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరో మూడు బోర్లు వేయించారు. ఒక్కదాంట్లోనూ నీరు పడలేదు. లక్షన్నర రూపాయల వరకు ఖర్చయినా.. పంటకు చుక్క నీరు అందలేదు. కళ్లెదుటే పంట ఎండిపోతోందని వాపోతున్నారు. అప్పులు తీర్చేదెలా? ఐదెకరాల్లో వరి సాగు చేశా. భూగర్భ జలాలు తగ్గి బోరు ఎత్తిపోయింది. పంటను కాపాడుకునేందుకు రూ.1.5 లక్షలు అప్పు చేసి రెండు బోర్లు వేయించినా చుక్క నీరు రాలేదు. పొట్టదశలో ఉన్న వరి ఎండిపోతోంది. ఏం చేయాలో, అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. – పెరుగు కొమురయ్య, ఆరేపల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా 600 ఫీట్లు వేసినా నీళ్లు పడలే.. నాకు ఆరెకరాలు పొలం ఉంది. భూగర్భ జలాలు అడుగంటడంతో రెండు బోర్లు 600 ఫీట్ల వరకు వేయించా. అయినా నీళ్లు పడలేదు. రూ. లక్ష ఖర్చయింది. మళ్లీ బోరు వేయాలంటే భయంగా ఉంది. – బుర్ర వినయ్‌కుమార్, లక్ష్మిపూర్, తంగళ్లపల్లి, సిరిసిల్ల ఈయన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్చర్లకు చెందిన రైతు మల్గ బీరయ్య. ఒకటిన్నర ఎకరాల్లో మామిడి తోట వేశారు. పదెకరాల్లో వరి సాగు చేశారు. భూగర్భ జలాలు పడిపోవడంతో ఉన్న మూడు బోర్లు వట్టిపోయాయి. పొట్ట దశలో ఉన్న వరిని కాపాడుకునేందుకు వారం రోజుల్లో ఏడు బోర్లు వేశారు. ఒక్కొక్కటి 600 ఫీట్ల లోతు వరకు వేసినా చుక్క నీరు కూడా పడలేదు. సుమారు రూ.4.50 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని, 8 ఎకరాల వరి పూర్తిగా ఎండిపోయిందని ఆయన వాపోతున్నారు. సాగునీరు లేక పాడి గేదెలకు తాగునీరు అందించలేక మూడు పశువులను అమ్మేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కర్నాల్ తండాకు చెందిన ఈ రైతుపేరు మహిపాల్. భూగర్భ జలాలు అడుగంటి పొలంలోని బోరు వట్టిపోయింది. ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు మరో బోరు వేయించారు. 800 ఫీట్ల లోతు వేసినా నీళ్లు పడలేదు. రూ.1.60 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేదని ఆయన వాపోయారు. ఈ చిత్రంలోని రైతు యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం రాగిబావికి చెందిన ఏలకంటి సత్తిరెడ్డి. 4 ఎకరాల్లో వరి సాగు చేశారు. పాత బోర్లు వట్టిపోవడంతో.. 20 రోజుల కింద వరుసగా నాలుగు బోర్లు వేయించారు. దేనిలోనూ నీళ్లు పడలేదు. రూ.3 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయిందని, పొలమంతా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఒక్క మందు.. ఊబకాయం, షుగర్ ఔట్!
భారత్‌లో ఏటేటా ఊబకాయుల శాతం పెరిగిపోతోంది. తద్వారా మధుమేహం బారినపడుతున్నవారూ ఎక్కువగానే ఉంటున్నారు. దేశంలో సుమారు 10 కోట్ల మంది వరకు మధుమేహ బాధితులు ఉన్నట్టు అంచనా. అదే సమయంలో జనాభాలో 6.5 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో సగం మందికిపైగా ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని పలు అధ్యయనాలు తేల్చాయి కూడా. సరైన ఔషధాలు అందుబాటులో లేకపోవడం, అవగాహన లేమి వంటివి కారణమవుతున్నాయి.ఇలాంటి నేపథ్యంలో మన దేశంలోకి ‘మవుంజారో (టైర్జెపటైడ్)’ పేరిట స్థూలకాయాన్ని, మధుమేహాన్ని నియంత్రించే ఔషధం అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఎలీ లిల్లీ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో గుర్తింపు పొందిన ఈ ఔషధాన్ని తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఊబకాయంతోపాటు మధుమేహాన్నీ ఏకకాలంలో నియంత్రించగల ఈ ఔషధం అనేక మంది బాధితులకు ఆశారేఖ కాగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి స్పెషల్ డెస్క్ఎలా పని చేస్తుంది?వారానికి ఒక ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే.. అటు బరువు తగ్గడంతోపాటు ఇటు మధుమేహాన్ని అదుపులో ఉంచే ఔషధాల్లో మొట్టమొదటిది ‘మవుంజారో’. ఇది ‘గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రాపిక్ పాలీపెప్టైడ్ (జీఐపీ)’, ‘గ్లూకగాన్ లైక్ పెప్టైడ్–1 (జీఎల్పీ–1)’ హార్మోన్ రెసెప్టార్లను ప్రేరేపించడం ద్వారా బరువునూ, చక్కెర మోతాదులను నియంత్రిస్తుంది’’ అని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ మందు విషయంలో భారత్‌లో ఏ స్థానిక కంపెనీతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకోలేదని తెలిపింది.క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 72 వారాల పాటు.. ఎంపిక చేసిన వ్యక్తులకు తగిన ఆహారం, వ్యాయామాలతోపాటు ఈ ‘మవుంజారో’ ఔషధాన్ని ఇచ్చి పరిశీలించామని వెల్లడించింది. ఈ మందు 15 ఎంజీ మోతాదులో ఇచ్చినవారు 21.8 కిలోలు బరువు తగ్గారని.. 5 ఎంజీ మోతాదు ఇచ్చినవారు 15.4 కిలోల బరువు తగ్గారని తెలిపింది.‘‘భారతీయుల్లో స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్తో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువే. వారందరికీ ప్రయోజనం కలిగేలా భారతీయ ప్రభుత్వ వర్గాలతో, ఇక్కడి కంపెనీల సహకారంతో ఈ మందుపై అవగాహన కలిగించేందుకు మేం ప్రయత్నిస్తాం’’ అని ఎలీ లిల్లీ ఇండియా ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ విన్సెలోవ్ టక్కర్ పేర్కొన్నారు.నెలకు రూ.17,500 వరకు ఖర్చుతో..‘మవుంజారో’ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో వారానికి ఒక మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో ఔషధాలు, కాస్మెటిక్స్ నియంత్రణ సంస్థ అయిన ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)’ ఆమోదంతో దీని ధరను 2.5 ఎంజీకి రూ.3,500గా, 5 ఎంజీ రూ.4,375 గా నిర్ణయించారు. అంటే ఒక నెలకు రూ.14,000 నుంచి రూ.17,500 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తుల బరువు, ఆరోగ్య స్థితి, ఇతర అంశాల ఆధారంగా ఎంత మోతాదులో ఇవ్వాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు.అందుకు అనుగుణంగా నెలవారీ ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి. నిజానికి ఈ ఔషధాన్ని మనదేశంలో తక్కువ ధరకే తెచ్చారు. యూఎస్ఏలో దీనికి నెలకు 1,000 – 1,200 డాలర్లు ఖర్చవుతుంది. అంటే మన కరెన్సీలో రూ.86,000 నుంచి రూ.లక్ష అన్నమాట. భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా బాధితులపై పెద్దగా భారం పడకుండా, విలువకు తగిన ప్రయోజనం చేకూరేలా ధరను నిర్ణయించామని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది.మరికొన్ని మందులున్నా..బరువు తగ్గించే కొన్ని రకాల మందులు ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నోవో నార్డిక్స్ కంపెనీకి చెందిన ‘రైబెల్సస్’ ఔషధం మూడేళ్ల కింద అంటే.. 2022 జనవరి నుంచే ఇక్కడ వినియోగంలో ఉంది. ఇది ఇప్పటికే యాంటీ–ఒబేసిటీ మందుల మార్కెట్లో 65 శాతాన్ని చేజిక్కించుకుంది.డ్యూలాగ్లూటైడ్, ఆర్లిస్టాట్, లిరాగ్లూటైడ్ వంటి బ్రాండ్లు కూడా వినియోగంలో ఉన్నాయి. మరోవైపు ఇదే తరహాకు చెందిన ‘సెమాగ్లూటైడ్’ ఔషధం పేటెంట్ కాలవ్యవధి వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. అప్పుడు దాని జనరిక్ మందును తయారు చేసేందుకు ప్రముఖ భారతీయ ఔషధ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. అది తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.వందల కోట్ల మార్కెట్..ఫార్మాట్రాక్ వంటి మార్కెట్ రీసెర్చ్ సంస్థల అంచనా ప్రకారం.. భారత్‌లో యాంటీ ఒబేసిటీ మందులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ తరహా మందుల మార్కెట్ 2020లో రూ.137 కోట్లుగా ఉండగా.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరింది. ఇది మరింతగా పెరుగుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.టైప్–1 డయాబెటిస్ వారికి ఉపయోగపడదుమవుంజారో వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సిన మందు. స్థూలకాయంతోపాటు టైప్–2 డయాబెటిస్ ఉన్నవారు వాడాల్సిన ఔషధం. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 కంటే ఎక్కువగా ఉండి, డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది. కిడ్నీ, గాల్ బ్లాడర్, సివియర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు ఉన్నవారు వాడకపోవడమే మంచిది.టైప్–1 డయాబెటిస్‌కు పనిచేయదు. కొంతమంది సెలెక్టెడ్ పాపులేషన్‌కు మాత్రమే ఉపకరించే ఔషధం. వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనల మేరకు మాత్రమే దీనిని వాడాలి. – డాక్టర్ శివరాజు, సీనియర్ ఫిజీషియన్మంచిదే కానీ.. ఇదే మ్యాజిక్ డ్రగ్ కాదు..భారత్‌లో మధుమేహం, స్థూలకాయం సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మవుంజారో మందు ఆశాజనకంగా కనిపిస్తోంది. షుగర్‌ను తగ్గించడంలోనే కాదు బరువు నియంత్రించడంలో కూడా మంచి ఫలితాలను చూపుతోంది. అయితే ఇదొక్కటే ‘మ్యాజిక్ పిల్’ అని పరిగణించడం తప్పుడు భావన. దీర్ఘకాలికంగా ఈ మందు ఎలా పనిచేస్తుందో ఇంకా పూర్తి సమాచారం లేదు.దీనికి తోడు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు. అందుకే ఈ మందును ఎవరైనా వాడాలనుకుంటే.. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాలి. జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటివి కూడా ఈ మందుతోపాటు తప్పనిసరిగా కొనసాగాలి. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. – డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి..మవుంజారో మందును కేవలం డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి ఇవ్వాల్సిన మోతాదు, డయాబెటిస్ నియంత్రణకు ఇచ్చే మోతాదు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వాడాల్సిన మందు అన్నది గుర్తుంచుకోవాలి. బరువు తగ్గించే మందులతోపాటు డయాబెటిస్‌ను నియంత్రించే ఈ తరహా మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఈ ‘మవుంజారో’ ఔషధం ప్రపంచవ్యాప్తంగా కాస్తంత గుర్తింపు పొందింది.స్థూలకాయం, అధిక బరువు కారణంగా మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల అరుగుదలతోపాటు డయాబెటిస్, హైపర్‌టెన్షన్, స్లీప్ ఆప్నియా వంటి 200 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉన్న మందులకు తోడు మరో రెప్యూటెడ్ బ్రాండ్ కావడంతో ఎలీ లిల్లీ వాళ్ల ఔషధం మరో ప్రత్యామ్నాయం అవుతుంది. – డాక్టర్ గురవారెడ్డి, సీనియర్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ఈ ఔషధం చాలావరకు సురక్షితమే.. కానీ..: – డాక్టర్ అమర్ వెన్నపూస, సీనియర్ బేరియాట్రిక్ సర్జన్మవుంజారోను ఇప్పుడు అధికారికంగా భారత్‌లో ప్రవేశపెట్టారుగానీ ఇప్పటికే విదేశాల నుంచి తెప్పించుకుని వాడినవాళ్లు ఉన్నారు. ఇందులో బరువు తగ్గడమనేది జీఐపీ, జీఎల్పీ–1 హార్మోన్ల ఆధారంగా జరుగుతుంటుంది. బేరియాట్రిక్ సర్జరీలో దాదాపు 200కుపైగా బరువును నియంత్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి. అందులో ముఖ్యమైనవి జీఎల్పీ–1, జీఐపీ. సాధారణంగా ఇన్సులిన్ ఆధారితంగా చక్కెరను నియంత్రించినప్పుడు బరువు పెరగడం జరుగుతుంది.కానీ ఈ ఔషధంతో ఇటు చక్కెరను అదుపులో ఉంచడం, అటు బరువును తగ్గించడం ఈ రెండూ జరుగుతాయి. ఇది చాలావరకు సురక్షితమైనదే. కొందరిలో మాత్రం.. వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు, ఆకలి తగ్గడం, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలతోపాటు అరుదుగా కళ్లు మసకబారడం, కిడ్నీ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, పాంక్రియాటైటిస్, థైరాయిడ్ కేన్సర్, సివియర్ అలర్జిక్ రియాక్షన్ వంటివీ రావచ్చు. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మోతాదులో వాడాలి. నిజానికి బరువు తగ్గదలచిన కొందరు తమ జీవనశైలి మార్పులతో, ఆహార నియంత్రణతో బరువు తగ్గుతారు.ప్రాణాంతకమైన మార్బిడ్ ఒబేసిటీ ఉన్నవారికి బేరియాట్రిక్ చికిత్స తప్పదు. కానీ కొందరిలో అటు మార్బిడ్ ఒబేసిటీ కాకుండా, ఇటు జీవనశైలి మార్పులతో బరువు తగ్గకుండా ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఔషధం మంచిదే. ఇక బేరియాట్రిక్ చికిత్స తర్వాత కూడా బరువు పెరుగుతున్నప్పుడు ఈ మెడిసిన్ వాడవచ్చు. బరువు తగ్గడం, చక్కెర నియంత్రణ రెండూ జరుగుతాయి కదా అంటూ ఎవరు పడితే వారు వాడటం సరికాదు.లైఫ్‌స్టైల్ మార్పులతో బరువు తగ్గడమనేది ఎప్పటికైనా మంచిది. జీవనశైలి మార్పులతో ఫలితాలు కనిపించనప్పుడు దీన్ని ఒక ఉత్ప్రేరకంగా (కిక్ స్టార్లా) వాడవచ్చు. తగ్గిన బరువును అలాగే కొనసాగించడానికి జీవనశైలి మార్పులను అనుసరించడమే ఆరోగ్యకరం. -
రూ. 2 లక్షలపైన రుణమాఫీ లేదు: తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం రూ. 2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ. రూ. 2 లక్షలపైన మాఫీ లేదు. కుటుంబానికి రూ. 2 లక్షలలోపు రుణం ఉన్న వాటిని మాఫీ చేస్తామన్నాం. ఇలాంటి కుటుంబాలు 25 లక్షలు ఉన్నట్లు మాకు వివరాలు అందాయి. ఆయా కుటుంబాలకు రూ. 20,616 కోట్లు జమ చేశాం. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు గందరగోళపడి రైతులను గందరగోళం చేయొద్దు’అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పశుసంవర్థక శాఖ పద్దులపై శనివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఆది శ్రీనివాస్ మహేశ్వర్‌రెడ్డి సహా మొత్తం 13 మంది సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతులపై రుణభారం ఉండొద్దన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రుణమాఫీని ప్రధానాంశంగా తీసుకుందన్నారు. అలాగే రైతు భరోసా కోసం రూ. 7,625 కోట్లు విడుదల చేశామని.. ఈ పంటకు కూడా రైతు భరోసా నిధులు ఇస్తామన్నారు. ప్రభుత్వంపై భారం పడినా రైతులకు ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతులను ప్రోత్సహించడంతోపాటు కౌలు రైతులకు మేలు చేసేందుకే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నామన్నారు. సన్నాలకు ఇప్పటివరకు రూ. 1,200 కోట్ల మేర బోనస్ ఇచ్చినట్లు తుమ్మల వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో సన్నాల సాగు 25 శాతం నుంచి 45 శాతానికి పెరిగిందన్నారు. ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. పంట నష్టపరిహారం ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నామని.. రైతులు నష్టపోయిన పూర్తి పంటకు కూడా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. భవిష్యత్తులో బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, రైతు రుణమాఫీపై ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ మోసం బట్టబయలు: హరీశ్‌రావు రైతు రుణమాఫీపై కాంగ్రెస్ మోసం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘రూ. 2 లక్షలు పైబడిన రైతు రుణాలను మాఫీ చేయలేమని వ్యవసాయ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడం సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలకు.. చేతలకు పొంతన లేదని రుజువు చేసింది. సీఎం మాటలు నమ్మి రూ. 2 లక్షలు పైబడిన రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లించిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలోకి నెట్టింది. అలాగే రూ. 2 లక్షలలోపు తీసుకున్న రుణం ఇంకా మాఫీ కాక చాలా మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఖాతాల్లోని లోపాలను సవరించకుండా రైతులపైనే నెపం నెట్టి రుణమాఫీ నుంచి ప్రభుత్వం తప్పించుకుంది. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని అసెంబ్లీ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. బడ్జెట్లో పెట్టిన విధంగా రూ. 31 వేల కోట్ల మేర రుణమాఫీ చేయాలి’అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఆర్మీలో నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
లక్డీకాపూల్ (హైదరాబాద్): ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల్లో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ , అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేజర్ పీ.సీ.రాయ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు 10వ తరగతి, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు 8వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు తమ అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అలాగే ఐటీఐ, డిప్లొమా, ఎన్సీసీ అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్ మార్కులుంటాయని, 13 భాషలలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆన్లైన్లో జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు www.joinindianarmy. nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు జూన్‌లో సంబంధిత సైట్ నుంచి అడ్మిట్ కార్డు పొందవచ్చని, అప్డేట్స్, ఈ–మెయిల్ ఐడీని వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. సలహాలు, సూచనలకు రిక్రూటింగ్ కార్యాలయం సికింద్రాబాద్ 040–27740205 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చని రాయ్ పేర్కొన్నారు. -
’శాటిలైట్ ఇంటర్నెట్ ’ గేమ్ చేంజరే!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ విప్లవం నడుస్తున్న మనదేశంలో ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ అనేది నిత్యావసరంగా మారిపోయింది. కానీ, కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల విస్తరణ ఇప్పటికీ దుర్లభంగానే ఉన్నది. అయితే, దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభమైతే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సేవలు వెంటనే అందుబాటులోకి రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. స్టార్‌లింక్ ప్రత్యేకతలు » అంతరిక్షంలోని ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ నేరుగా భూమిపై ఉన్న వివిధ డివైజ్‌లకు చేరుతుంది. » ఈ కనెక్షన్‌కు చందా కేబుల్ సర్వీస్ డైరెక్ట్ టు హోం (డీటీహెచ్)కు కట్టిన మాదిరిగా ఉంటుంది. » ఇంటర్నెట్ కోసం ఈ కంపెనీ పోర్టబుల్ శాటిలైట్ డిష్ కిట్‌ను అందజేస్తుంది. దీనిని ఇంటిపై శాశ్వత పద్ధతిలో బిగించవచ్చు. » ముందుగా ఇళ్లలో వైఫై రూటర్ ఆధారిత వైర్ కనెక్షన్ కలిగి ఉండాలి. దీనిని ఆ తర్వాత వైర్లెస్ పద్ధతిలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నె ట్ ఆఫ్ థింగ్స్ గాడ్జెస్‌కు జతచేయొచ్చు. » ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సర్వీస్ అందించగలదు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. స్టార్‌లింక్‌తో జట్టుదేశంలోని రెండు పెద్ద టెలికం సంస్థలు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో.. భారత్‌లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల కోసం అమెరికన్ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్టార్‌లింక్’తో ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించాయి. 2021లో అమెరికా, కెనడాల్లో ఈ సేవలను ప్రారంభించిన స్టార్‌లింక్.. ప్రస్తుతం వందకు పైగా దేశాలకు విస్తరించింది. 2022లోనే భారత్‌లోనూ 99 యూఎస్ డాలర్లకు ప్రీ ఆర్డర్‌ను (అప్పట్లో ఫారెక్స్ ధరను బట్టి రూ.7,201) ప్రారంభించింది. అయితే, టెలికం నియంత్రణ ఏజెన్సీల నుంచి తగిన అనుమతులు పొందలేకపోవడంతో స్టార్‌లింక్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. లోకల్ సర్కిల్స్ సర్వేలోని ముఖ్యాంశాలు » శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపై లోకల్ సర్కిల్స్ సంస్థ 323 జిల్లాల్లో 22,000 మంది అభిప్రాయాలు తీసుకుంది. వీరిలో 42 శాతం మంది ప్రథమ శ్రేణి నగరాల నుంచి, 30 శాతం ద్వితీయ శ్రేణి నగరాల నుంచి, మిగిలిన 28 శాతం టైర్–3, టైర్–4 గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నారు. » సర్వేలో పాల్గొన్నవారిలో 91 శాతం మంది ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వస్తే.. కనెక్టివిటీ పెరిగి మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ డిజిటల్ విప్లవం సాధ్యమవుతందని విశ్వాసం వ్యక్తంచేశారు. » 50 శాతం మంది ప్రైవేట్ కంపెనీలు నేరుగా వినియోగదారులకు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందించాలని అభిప్రాయపడ్డారు. 39 శాతం మంది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా లేదా తక్కువ ధరకు ఈ సేవలను అందించాలని సూచించారు. » స్టార్‌లింక్ రాకతో హైస్పీడ్, తక్కువ జాప్యంతో (లో లాటెన్సీ) ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని నమ్ముతున్నారు. » ఉపగ్రహ ఇంటర్నెట్ను అవసరమైన మౌలిక సదుపాయంగా గుర్తిస్తే, ఇది డిజిటల్ ఇండియాకు దన్నుగా నిలిచి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. » పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న డిజిటల్ అంతరాలను ఇది తగ్గిస్తుందని తెలిపారు. » ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి ముందుకు వస్తే కనెక్టివిటీ విస్తరణలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. » అయితే భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో డీటీహెచ్ మాదిరిగానే ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడవచ్చని కొందరు అనుమానం వ్యక్తంచేశారు. » స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ల విషయంలో వినియోగదారుల వ్యక్తిగత గోప్యతపై స్పష్టత లేదని కొందరు తెలిపారు. 2030 నాటికి మన వాటి 1.9 బిలియన్ డాలర్లు ప్రపంచ ఉపగ్రహ ఇంటర్నెట్ మార్కెట్ పరిమాణం 2022లో 3 బిలియన్ డాలర్లు. ఇందులో భారత్ వాటా 3 శాతం మాత్రమేనని గతంలో విడుదలైన డెలాయిట్ ఇండియా నివేదిక తెలిపింది. 2030 నాటికి భారత ఉపగ్రహ బ్రాడ్‌బాండ్ మార్కెట్ 1.9 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముందని అంచనా వేసింది. -
సమృద్ధిగా పశు సంపద
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పశు సంపద సమృద్ధిగా ఉందని సామాజిక, ఆర్థిక సర్వే 2024–25లో ప్రభుత్వం వెల్లడించింది. 2012 నుంచి రాష్ట్రంలో పశు సంపద 22 శాతం పెరిగిందని తెలిపింది. సర్వే ప్రకారం రాష్ట్రంలో 3.26 కోట్ల పశువులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేశంలోని మొత్తం గొర్రెల్లో 25 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండడానికి వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాలైన పాల ఉత్పత్తి, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకం వల్ల వస్తున్న ఆదాయమే కారణమని సర్వే స్పష్టం చేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలపై సర్వేలోని కీలక విషయాలు» రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పాలలో 62 శాతం వ్యవసాయ భూమి లేని రైతుల నుంచే వస్తున్నాయి. » 70 శాతం రైతులు పశు సంపదను కలిగి ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.26 కోట్ల పశువులు ఉన్నాయి. » 2012 నుంచి పశు సంపద 22 శాతం పెరిగింది. » ఈ రంగంలో 2023–24 ఆర్థిక సంవత్సరం తుది సవరించిన అంచనాల ప్రకారం ‘జోడించిన రాష్ట్ర స్థూల విలువ’(జీఎస్వీఏ) రూ.96,908 కోట్లు ఉంటే.. 2024–25 ముందస్తు అంచనాల ప్రకారం రూ.1,02,835 కోట్లకు పెరిగింది. » 2024–25లో చేపల ఉత్పత్తి లక్ష్యం 4,81,421 టన్నులు కాగా.. ఈ ఏడాది జనవరి నాటికి 3,69,489 టన్నులు ఉత్పత్తి అయ్యింది. మంచినీటి రోయ్యల ఉత్పత్తి లక్ష్యం 18,366 టన్నులు కాగా.. జనవరి నాటికి 11,845 టన్నులు వచ్చింది. – చేపల పెంపకంలో కృషికిగాను రాష్ట్రానికి కేంద్రం ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్‌ల్యాండ్ స్టేట్ ఇన్ ఫిషరీస్ సెక్టార్’అవార్డు ప్రకటించింది. -
తెలంగాణ సంపదపై గుంట నక్కల్లా కన్నేశారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సంపద మీద గుంట నక్కల మాదిరిగా అందరూ కన్నేశారు. ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా పని చేస్తలేరట.. మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నా యి. కూటమి కట్టకుండా చంద్రబాబు అక్కడ (ఏపీలో) మళ్లీ అధికారంలోకి వచ్చేవాడా? అలాంటి వారిని ఏవో అద్భుత శక్తులు ఉన్నవారిగా మనకు చూపే కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణను ఆగం చేసేందుకు కొందరు ఎప్పుడూ రెడీగా ఉంటారు. వీరిపట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి. ఒక పొరపాటు జరిగినా జీవితకాలం దుఃఖం తప్పదు’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ‘గోదావరి కన్నీటి గోస’పేరిట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో రామగుండం నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు ఈ నెల 17న ప్రారంభమైన 180 కిలోమీటర్ల పాదయాత్ర శనివారం ముగిసింది. ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ సమావేశమై మాట్లాడారు. ‘తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున ఎనిమిదేసి మంది ఎంపీలను గెలిపించినా ఏకాణా పని జరగడం లేదు. బీఆర్ఎస్ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే కొట్లాడి మన హక్కులు సాధించుకునేవాళ్లం. ఈ దిశగా ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి’అని సూచించారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదు ‘తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసింది. ఆ ఆవేదనతోనే వాళ్లను ఉద్యమ కాలంలో దద్దమ్మలు, సన్నాసులు అని తెలంగాణ సమాజం తరఫున అన్నాను. అంతేతప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుంది? రామగుండం ఎమ్మెల్యేకు నీటి గోసపై మాట్లాడే అవకాశమున్నా మౌనంగా ఉంటే ఏమనాలి? బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుతో అలుగు పారితే ఇప్పడు చెరువులు, కుంటలు అడుగంటాయి. కొట్లాడి సాధించిన తెలంగాణను ఎంతో జాగ్రత్తగా నిలబెట్టినా ప్రజలు కొత్త ప్రభుత్వానికి తెచ్చుకున్నారు. అది వాళ్లిష్టం అయినా ఫలితాన్ని లోకం చూస్తోంది. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడడం ఒక అవలక్షణంగా మార్చుకున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు చెన్నై వంటి నగరాల్లోనూ ఎంతో ఖర్చుతో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుంటున్నారు. తెలంగాణలోనూ ఖర్చుకు వెనుకాడకుండా తాగు, సాగునీరు అందించాల్సిందే’అని కేసీఆర్ స్పష్టం చేశారు. పేదల ఇండ్లను కూల్చుతున్నారు ‘పల్లెల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వచ్చిన పేదలకు మనం అండగా నిలిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం వారి ఇండ్లను కూల్చివేస్తోంది. హైడ్రా కూల్చివేతలతో ఆవేదన చెందుతున్న ప్రజలు.. ‘కేసీఆర్ అన్నా.. ఎక్కడున్నవు.. రావే’అని పిలుస్తున్నారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా? పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, ఆందోళనలు మొదలయ్యాయి. తెలంగాణలో సమస్యలకు నాటి ప్రధాని నెహ్రూ మొదలుకొని సోనియాగాంధీ వరకు ప్రధాన శతృవు కాంగ్రెస్ పార్టీయే. రాష్ట్రంలో మళ్లీ సాగు, తాగునీరు, విద్యుత్ కష్టాలు ఎందుకు వస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు తరాలను బాగుచేసే దిశగా ఆలోచించాలి. ప్రధాని మోదీ నా మెడపై కత్తి పెట్టినా నేను ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బెల్లం ఉన్న దగ్గరకు ఈగలు వస్తాయి. అధికారం పోగానే కొందరు పార్టీకి దూరమవుతారు. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్ పార్టీదే. సింగిల్‌గా అధికారంలోకి వస్తాం. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. ప్రతీ కార్యకర్త కేసీఆర్‌లా తయారై తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేసీఆర్‌కు పార్టీ నేత బొడ్డు రవీందర్ నాగలి బహూకరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, పుట్ట మధు, పార్టీ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, నారాయణదాస్, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
ఆవు పాల ధర తగ్గింపు.. గేదె పాల ధర పెంపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీ రైతుల నుంచి సేకరిస్తున్న ఆవు పాల ధరను తగ్గించాలని యోచిస్తోంది. అదే సమయంలో గేదె పాల ధరను లీటర్‌కు రూ.4 వరకు పెంచడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. గేదె పాల ధరను రూ.3 వరకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు అమలులోకి రాలేదు. అప్పుల భారం పైపైకి విజయ డెయిరీ సంస్థకు దాదాపు రూ.1,000 కోట్ల టర్నోవర్ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం దాదాపు రూ.250 కోట్ల నష్టాల్లో ఉంది. ప్రతినెలా రూ.13కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు తెలిసింది. రైతులకు నెలనెలా చెల్లించాల్సిన పాల బకాయిలు కూడా ఇవ్వలేని దుస్థితిలోకి సంస్థ వెళ్లినట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం మూడునాలుగు బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆవుపాల సేకరణ ధర అధికంగా ఉండడమే అందుకు కారణమని చెబుతున్నారు. ప్రైవేటు కంటే రూ.10 అదనం విజయ డెయిరీ ప్రతీరోజు 4.5 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. అందులో 85 శాతం మేరకు ఆవు పాలే ఉంటున్నాయి. ప్రైవేట్ డెయిరీ సంస్థలు ఆవు పాలు లీటర్‌కు రూ.32 నుంచి రూ.33 చెల్లించి సేకరిస్తుండగా.. విజయ డెయిరీ మాత్రం రూ.42 ఇస్తోంది. గేదె పాలు లీటర్‌కు రూ.48 చెల్లిస్తోంది. ఆవుపాల సేకరణతో సంస్థకు ఆదాయం కంటే నష్టమే ఎక్కువగా వస్తోందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వాపోయారు. మరోవైపు సంస్థలో టన్నుల కొద్దీ పాలపొడి నిల్వలు పేరుకుపోయినట్లు సమాచారం. మార్కెటింగ్‌లో బలహీనంరాష్ట్రంలో గేదె పాలకంటే ఆవు పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. ఆవు పాలకు ప్రైవేట్ సంస్థలకంటే విజయ డెయిరీ అధిక ధర ఇస్తుండటంతో రైతులు ఆవు పాలు ఈ సంస్థకు పోస్తూ.. గేదె పాలను స్థానికంగా అధిక ధరకు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. ప్రైవేట్ డెయిరీలు డీలర్లకు లీటర్‌పై దాదాపు రూ.10 వరకు మార్జిన్ ఇస్తుండగా, విజయ డెయిరీ రూ.5–6 మాత్రమే ఇస్తోంది. దీంతో డీలర్లు ఈ సంస్థ పాలు, పాల ఉత్పత్తులు అమ్మేందుకు ముందుకు రావటంలేదని సమాచారం. తన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడంలోనూ సంస్థ విఫలమవుతోందన్న విమర్శలు కూడా ఉంది. దీంతో ప్రైవేట్ సంస్థలతో పోటీని తట్టుకోవడంలో విజయ డెయిరీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంగన్వాడీలకు ప్రస్తుతం లక్ష లీటర్ల పాలను విక్రయిస్తున్నట్లు, అలాగే గురుకులాలకు కూడా పాలను సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని దేవాలయాలకు ఈ సంస్థ నెయ్యిని సరఫరా చేస్తోంది. -
టెన్త్ పేపర్ లీకేజీపై ముమ్మర దర్యాప్తు
నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం ఓ యువకుడు పరీక్ష రాస్తున్న ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ప్రశ్నపత్రం ఫొటో తీసి శాలిగౌరారం మండలంలోని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన విషయం విదితమే. ఈ లీకేజీ వ్యవహారాన్ని ఎస్పీ సీరియస్‌గా తీసుకుని ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించారు. లీకేజీపై నకిరేకల్ ఎంఈవో మేకల నాగయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నకిరేకల్, శాలిగౌరారం సీఐలు రాజశేఖర్, కొండల్‌రెడ్డితో పాటు మరో సీఐ కూడా రంగంలోకి దిగారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో మకాంవేసి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ పోతుల గోపాల్, డిపార్ట్మెంటల్ అధికారి రామ్మోహన్‌రెడ్డిని విచారించి వారి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. సదరు విద్యార్థిని తండ్రిని పిలిపించి విచారించారు. ప్రశ్నపత్రం ఫొటో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వారి ఫోన్ నంబర్ల ఆధారంగా శాలిగౌరారం, నకిరేకల్ మండలాలకు చెందిన 15 మంది యవకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ రాజశేఖర్‌ను ప్రశ్నించగా కేసు పురోగతిలో ఉందని, ఇంకా విచారణ పూర్తి కాలేదని తెలిపారు. పరీక్ష రాయకుండానే ఇంటికి.. నకిరేకల్ ఎస్సీ గురుకుల పాఠశాల సెంటర్లో రెండో రోజు హిందీ పరీక్ష రాసేందుకు వచ్చిన ఆ ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఝాన్సీ పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది. ఝాన్సీని శుక్రవారమే డిబార్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు ప్రకటించారు. శనివారం సెంటర్‌కు వచ్చిన ఆ విద్యార్థిని నుంచి డిబార్, పేపర్ లీకేజీకి సంబంధించి అధికారులు సంతకాలు తీసుకున్నారు. తర్వాత ఆమెను పోలీసుల సహకారంతో శాలిగౌరారం మండలం కేంద్రంలోని ఇంటి వద్ద కుటుంబ సభ్యులకు అప్పగించారు. నా ప్రమేయం లేదు..: విద్యార్థిని ఝాన్సీ ‘నేను నర్సరీ నుంచి పదో తరగతి వరకు నకిరేకల్ కృష్ణవేణి స్కూల్లోనే చదివాను. చిన్నప్పటి నుంచి అన్ని క్లాసుల్లో కూడా 70కి పైగా మార్కులు సాధించి క్లాసు టాపర్‌గా ఉంటున్నాను. నేను పదో తరగతి పరీక్షలు రాస్తున్న క్రమంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కిటికీ దగ్గర పేపర్ చూపించమని ఒత్తిడి తెచ్చి ఫొటో తీసుకొని వెళ్లాడు. ఈ విషయంలో పోలీసులు ఏం చేస్తున్నారు. ఇన్విజిలేటర్‌కు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇందులో నా ప్రమేయం ఏముంది. నన్నెందుకు డిబార్ చేస్తారు. శనివారం పరీక్ష రాసేందుకు వస్తే ప్రశ్నపత్రం ఫొటో తీసేందుకు సహకరించానని, నాతో బలవంతంగా సంతకం పెట్టించుకొని పరీక్ష రాయనివ్వకుండా చేసి.. డిబార్ చేశాం వెళ్లిపొమ్మని చెప్పారు. నాకు కాపీ కొట్టి రాయాల్సిన పరిస్థితి లేదు. నాకు పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలి. సప్లిమెంటరీ అనేది ఉండొద్దు. ఈ పరీక్షల్లోనే నాకు అవకాశం కల్పించి న్యాయం చేయాలి’. – ‘సాక్షి’తో విద్యార్థిని ఝాన్సీ -
న్యాయం జరిగే వరకు… ధర్మం గెలిచే వరకు: సీఎం రేవంత్ కవితాత్మక ట్వీట్
హైదరాబాద్: డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ అంశంలో మౌనంగా ఉండలేమంటూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ఈరోజు(శనివారం) తమిళనాడులోని చెన్నై వేదికగా డీలిమిటేషన్ అంశంపై జరిగిన సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. దీనికి సీఎం రేవంత్ కూడా హాజరయ్యారు. అయితే అనంతరం ఒక ట్వీట్ చేశారు రేవంత్.ఈ పుణ్యభూమి …తూర్పు నుండి పడమర వరకు…ఈ ధన్యభూమి …ఉత్తరం నుండి దక్షిణం వరకు… అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని… సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది.ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను…కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో…రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో… డీ లిమిటేషన్ ను అస్త్రంగా ప్రయోగించి…విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం.ఉత్తరాదిని గౌరవిస్తాం… దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం. అది డీ లిమిటేషన్ ఐనా… విద్యా వ్యవస్థపై పెత్తనమైనా… అంగీకరించేది లేదు…ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది… ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది… న్యాయం జరిగే వరకు… ధర్మం గెలిచే వరకు’ అంటూ ట్వీట్ చేశారు రేవంత్.ఈ పుణ్యభూమి …తూర్పు నుండి పడమర వరకు…ఈ ధన్యభూమి …ఉత్తరం నుండి దక్షిణం వరకు… అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని… సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను…కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో…రాజకీయ ప్రయోజన…— Revanth Reddy (@revanth_anumula) March 22, 2025 -
ఆలు లేదు.. చూలు లేదు.. డీలిమిటేషన్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్‌కు విధి విధానాలు ఇంకా ఖరారే కాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కొందరు తీరు ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్లుగా ఉందంటూ చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంపై ఆయన వ్యాఖ్యానించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాదికి అన్యాయం అంటూ అపోహలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే అపోహలు సృష్టిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీపై విషం కక్కడమే వారి అజెండా అని.. దక్షిణాదిపై మోదీకి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగదని కిషన్‌రెడ్డి అన్నారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నా పార్టీ బీజేపీ. దక్షిణాది అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దక్షిణ భారతదేశానికి సంబంధించి వీళ్ల సర్టిఫికెట్ అవసరం లేదు’’ అంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు.‘‘అన్ని ప్రాంతాలకు బీజేపీ సమ న్యాయం చేస్తోంది. స్టాలిన్‌కు దురద పుడితే రేవంత్, కేటీఆర్ వెళ్లి గోకుతున్నారు. డీలిమిటేషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే లేని పోని హడావుడి చేస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం మీద బురద చల్లుతున్నారు’’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
‘తమ్ముడూ.. నీ లైఫ్ స్టైల్ వేరు.. నా లైఫ్ స్టైల్ వేరు’
హైదరాబాద్: సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటిరిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీతక్క ఖండించారు. ‘ తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు. నియోజకవర్గంలో నేను తిరిగినట్లు నువ్వు తిరగలేవు. ప్రజలకు ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారో తేల్చుకుందాం. హైదరాబాద్ లో తిరిగే వాల్లకు రైతులకు బోనస్ వస్తుందో లేదో తెలుస్తుందా?,రైతులతో సంబందం లేకుండా హైదరాబాద్ లో తిరుగుతున్నట్లు ఉంది. బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేసింది మీరు. వరి వేస్తే ఉరి అన్నది మీరు. ప్రజా ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 1200 కోట్లు బోనస్ ఇచ్చింది. ఇంకా ఎవరికన్నా రాకపోతే అవి కూడా ఇస్తాం. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. భూమి లేని వాల్లకే కూలీ భరోసా ఇస్తున్నాం. కొంత భూమి ఉన్న కూలీలకు ఇవ్వాలనే అంశం పరిశీలనలో ఉంది’అని సీతక్క పేర్కొన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా ఇంటికి వచ్చి చూడండి..‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా ఇంటికి వచ్చి చూడండి. మీరు మా ఇంటికి రావాలని ఆహ్వానం పలుకుతున్న. ప్రభుత్వం వసతి కల్పించిన క్వార్టర్స్ లోనే నేను నివసిస్తున్నాను. వైఎస్ భవనంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నారు. అది మా ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనమే. ఆ భనంలోనే ఉంటున్నాను. మీలాగా ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో నివసించడం లేదు. మా ఇంటికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. మీ అందరిని భోజనానికి ఆహ్వానిస్తున్న... మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆహ్వానించలేదు. నాది నిరాడంబర జీవితం. నా కుమారుడు కూడా హన్మకొండ లోనే ఉంటాడు’ అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. -
ఇళ్లకు జీఎస్టీ.. ఎవరు కట్టాలి?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు.ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్‌నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్‌లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూయజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూయజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు.కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూయజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిల్డర్లు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపర్ చెల్లించాలని భూయజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది.భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్‌కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్‌దే. కాకపోతే భూయజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. -
బాలయ్య దంచుడుపై మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీలో మీడియాతో చిట్‌ఛాట్ సందర్భంగా.. సినిమాటోగ్రఫీ శాఖ, రోడ్లు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Bala Krishna)ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన రోజుకొకరినీ కొడతారంట కదా అని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ రోజుకొకరిని కొడతారంట కదా. ఆయన సినిమాలు ఎవరు చూస్తారు? బాలయ్య కంటే రోజూ తనతోనే ఎక్కువమంది ఫొటోలు దిగుతారన్న కోమటిరెడ్డి.. అయినా ఆయన సినిమాలకు కలెక్షన్స్ వస్తాయట అంటూ మంత్రి కోమటిరెడ్డి చమత్కరించారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన పలు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ వాళ్లకు ధరణితో దోచుకుతినడం తప్పా ఏమి తెల్వదు. వాళ్లకు మాటలతోనే బతకడం అలవాటైంది. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు. హరీష్ రావు మామ చాటు అల్లుడు. వాళ్లు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కారు. అలాంటప్పుడు మేం వాళ్లతో ఏం మాట్లాడతాం?. వేముల ప్రశాంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆయన కేబినెట్లోనూ డమ్మీ మంత్రి ఉండే. ఆయనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కనీసం గుర్తు కూడా పట్టరు అని కోమటిరెడ్డి అన్నారు. ఉప్పల్..నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ఇప్పటికే తాను కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడినట్లు తెలిపిన కోమటిరెడ్డి.. త్వరలో ఉస్మానియా ఆస్పత్రికి టెండర్లు కూడా పిలుస్తామని తెలిపారు.యాగాల కామెంట్.. బీఆర్ఎస్ వాకౌట్అంతకు ముందు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జాప్యం విషయమై మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు.. ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాగాలు చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యం రహదారుల అభివృద్ధికి కేటాయించలేదన్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోండికోమటిరెడ్డి వ్యవహారంపై శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయాలని హరీష్‌రావు నేతృత్వంలోని బృందం స్పీకర్‌ను కోరింది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండి అన్ని అబద్ధాలే చెబుతూ సభను తప్పు దోవ పట్టిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ కోరింది. -
‘డీలిమిటేషన్ మీటింగ్.. కోడిగుడ్డుపై ఈకలు పీకడం అంటే ఇదే’
సాక్షి, ఢిల్లీ: తమిళనాడు ఎన్నికలలో డీఎంకే పార్టీ ఓడిపోబోతుందని.. అందుకే డీలిమిటేషన్‌పై ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన దక్షిణ భారత దేశం వెనుకబడి పోతుందంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ వలన తమిళనాడుకు కొద్దీమేర మాత్రమే నష్టం జరుగుతుంది. తమిళనాడు మినహా దేశంలో, ఏ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదు’’ అని అరవింద్ పేర్కొన్నారు.‘‘తమిళనాడు రాష్ట్ర అంశాన్ని మాత్రమే బూచిగా చూపి దక్షిణాదికేదో జరుగుతున్నట్టు స్టాలిన్ ప్రచారం చేస్తున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటారు. 1971 దేశ జనాభా 41 కోట్లు ఉంటే, ఇప్పుడు సుమారు 140 కోట్లకు పెరిగింది. దేశంలో ముస్లిం జనాభా ఏడువందల శాతం పెరిగింది. హిందువుల జనాభా 300 శాతం పెరిగింది, అసలు సమస్య ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు కాదు.. దేశంలో ముస్లింల సంఖ్య పెరగడమే’’ అంటూ అరవింద్ వ్యాఖ్యానించారు.‘‘ఈ సమస్యను పరిష్కరించేందుకు కామన్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీకి సపోర్ట్ చేస్తారా?. స్టాలిన్, ఉదయ్ నిధి స్టాలిన్ లాంటి దుర్మార్గులు ఏ కమ్యూనిటిలో ఉండకూడదు. తెలంగాణలో 80 శాతం మైనార్టీలను బీసీల్లో కలిపారు. మేం అధికారంలోకి వచ్చాక బీసీల నుంచి మైనారిటీలను తొలగిస్తాం. మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయం’’ అని అరవింద్ చెప్పారు. -
హైదరాబాద్ రియల్ఎస్టేట్.. రైజింగ్!
కొత్త ప్రభుత్వం, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల భారం, హైడ్రా దూకుడు కారణాలేవైనా ఏడాదిన్నర కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది. ప్రభుత్వ స్థిరమైన విధానాలు, కార్యాచరణ, స్థిరపడిన ధరలు తదితర కారణాలతో జనవరి నుంచి నగర స్థిరాస్తి రంగం కోలుకుంటోంది. –సాక్షి, సిటీబ్యూరోగత నెలలో గ్రేటర్లో రూ.3,925 కోట్లు విలువ చేసే 5,900 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. జనవరిలో రూ.3,293 కోట్ల విలువైన 5,464 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. నెల రోజుల్లో విలువల్లో 13 శాతం, యూనిట్ల రిజిస్ట్రేషన్లలో 10 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. నగరవాసులు లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. విశాలమైన ఇళ్ల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో రూ.50 లక్షలలోపు ధర ఉన్న గృహాలు 59 శాతం విక్రయించగా.. గత నెలకొచ్చేసరికి వీటి వాటా 56 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: చారిత్రక ‘లక్ష్మీ నివాస్’ బంగ్లా అమ్మకం..వీటి స్థానంలో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీల వాటా గతేడాది ఫ్రిబవరిలో 15 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 18 శాతానికి పెరిగింది. అలాగే 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 2024 ఫిబ్రవరిలో 13 శాతంగా ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 1,000–2,000 చ.అ. మధ్య ఉన్న ప్రాపర్టీల వాటా 71 శాతం నుంచి 67 శాతానికి తగ్గింది. -
హైదరాబాద్ వేదికగా ‘ఢీ’లిమిటేషన్
చెన్నై: జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజక వర్గాల పునర్విభజన (Delimitation) జరపబోతోందన్న ప్రచారం దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఒక్కటిగా తొలి అడుగు వేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో చెన్నైలో శనివారంనాడు దక్షిణాది రాష్ట్రాల పార్టీల సమావేశం జరిగింది. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్‌ను తాము వ్యతిరేకించడం లేదని.. అది న్యాయంగా ఉండాలన్నదే తమ అభిమతమని అని అక్కడ హాజరైన ప్రతినిధుల తరఫున స్టాలిన్ ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకం అయ్యాయని, ఈ ఘనత స్టాలిన్‌కే దక్కుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టాలని ఆయన ప్రతిపాదించారు.ఆ ప్రతిపాదనకు స్టాలిన్ అంగీకారం తెలిపారు. చెన్నై మీటింగ్‌కు కొనసాగింపుగా తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్(Hyderabad Delimitation Meeting)లో ఉండనుందని స్టాలిన్ ప్రకటించారు. సమావేశంతో పాటు బహిరంగ సభ కూడా ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.ఇక.. చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్రిక్తత.. బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించిన మహిళా కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయాన్ని మహిళా కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళా కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. -
గచ్చిబౌలి: ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి చెందింది. టెన్త్ పరీక్ష రాయించి చెల్లిని అన్న బైక్‌పై తీసుకెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో అన్నకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీకి చెందిన విద్యార్థిని టెలికాం నగర్లో 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. నిన్నటి (శుక్రవారం) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవ్వగా, ఇవాళ రెండో రోజైన శనివారం తన అన్న బైక్ పై పరీక్షకు వెళ్లింది. పరీక్ష రాసిన అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద వారు ప్రయాణిస్తున్న బైక్ ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడింది. ఈ ఘటనలో బైక్‌పై వెనుక కూర్చున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా.. అన్న తీవ్రంగా గాయపడ్డారు. -
యూట్యూబర్ సన్నీయాదవ్‌పై లుకౌట్ నోటీసులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పోలీసులు పట్టు బిగిస్తున్నారు. యూట్యూబర్ సన్నీయాదవ్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సన్నీ యాదవ్‌పై నూతనకల్ పీఎస్‌లో కేసు నమోదైంది. యూట్యూబ్ వీడియోలతో బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేస్తున్న సన్నీయాదవ్‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ సోషల్ మీడియా ఖాతాకు ట్యాగ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు.. సన్నీ యాదవ్ కోసం గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన సన్నీ యాదవ్ సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. అయితే, లండన్‌లో ఉన్న అతనిపై సూర్యాపేట జిల్లా సైబర్ క్రైం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. -
IPL మ్యాచ్ టికెట్ల దందా.. ఉప్పల్ మెట్రో వద్ద బ్లాక్‌లో అమ్మకం
సాక్షి, ఉప్పల్: నేటి నుంచి ఐపీఎల్ సీజన్-18 ప్రారంభం కానుంది. ఇక, రేపు హైదరాబాద్ వేదికగా రాజస్థాన్, SRH మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో అమ్మడం కలకలం రేపింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను అమ్ముతున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ఐపీఎల్ సందడి వేళ ఉప్పల్‌లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు తిలకించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. మ్యాచ్ టికెట్స్ కోసం ఎగబడతారు. కానీ, కొందరు మాత్రం మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అమ్మడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రేపు జరగబోయే RR Vs SRH మ్యాచ్ టికెట్లను ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఓ వ్యక్తి అమ్మడం కలకలం రేపింది. మెట్రో స్టేషన్ వద్ద భరద్వాజ్ అనే వ్యక్తి టికెట్లను అమ్మడం కొందరు గుర్తించారు. దీంతో, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఓటీ పోలీసులు అక్కడిని చేరుకుని భరద్వాజ్‌కు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, అతడి వద్ద ఉన్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. -
SLBC: సొరంగంలో సరిగ్గా నెల కిందట..
నాగర్ కర్నూల్, సాక్షి: దాదాపు ఐదేళ్లపాటు నిలిచిపోయిన సొరంగం పనులు మళ్లీ మొదలయ్యాయి. ఆ పనుల సన్నాహాకాల కోసం కార్మికులు, ఇంజినీర్ సిబ్బంది ఉత్సాహంగా లోపలికి వెళ్లారు. బోర్ టన్నెల్ మిషన్‌ను ఆన్ చేశారు. అంతే.. భూకంపం వచ్చినట్లుగా టన్నెల్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. పై నుంచి మట్టి.. బరద ముంచెత్తడంతో లోపల ఉన్నవాళ్లంతా కాళ్లకు బలం కూడదీసుకుని బయటకు పరుగులు తీశారు. కట్ చేస్తే.. టన్నెల్ ట్రాజెడీ జరిగి నెలకావస్తున్నా ఇంకా ఏడుగురి మృతదేహాల ఆనవాళ్లను కూడా బయటకు తీసుకురాలేకపోయారు... ఫిబ్రవరి 22వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట శివారులో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఉదయం 8.30గం. ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఒక్కొక్కరిగా మొత్తం 42 మందిని సురక్షితంగా మధ్యాహ్నాంలోపు బయటకు తీసుకొచ్చారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన.. ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే ఇటు సింగరేణి నుంచి అటు సైన్యం దాకా పలు రాష్ట్రాల నుంచి ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా చర్యలు చేపట్టాయి. దేశంలోనే అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు వెయ్యి మందితో మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పని చేస్తున్నాయి. అయినా పురోగతి కనిపించడం లేదు.మానవ అవశేషాలను గుర్తించడంలో దిట్ట అయిన కేరళ ప్రత్యేక జాగిలాలు రంగంలోకి దిగినా.. ప్రయోజనం లేకుండా పోయింది!మార్చి 9వ తేదీన ఒక్క మృతదేహాం మాత్రమే దొరికింది. అది గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహంగా నిర్ధారించారు. ఎస్ఎల్బీసీలో అనుమానిత ప్రాంతాలుగా D1-D2 మార్క్ చేసి.. విస్త్రతంగా తవ్వకాలు జరుపుతున్నారుమిగతా ఏడుగురి జాడ గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తుమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నా పురోగతి కనిపించట్లేదు. ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. భారీగా వస్తున్న ఊటనీరు,బురదతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సొరంగంలో 13.85వ కి.మీ. వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్లు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీబీఎం శిథిలాలన్నీ సొరంగంలో 11వ కి.మీ. నుంచి 13.85 కి.మీ. వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండటం, పైకప్పు బలహీనంగా ఉండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సాంకేతికంగా చూసుకుంటే.. లోకో ట్రైన్స్, కన్వేయర్ బెల్టులు, హైకెపాసిటీ పంపులతో నీరు, బురదను బయటకు పంపిస్తున్నా లాభం కనిపించడం లేదు. అడ్వాన్స్డ్ సెంట్ డిటెక్షన్, టన్నెల్ బోరింగ్ మెషిన్.. భారీ ట్రాన్స్ఫార్మర్లను కత్తిరించేందుకు అల్ట్రా థర్మల్ కట్టర్లను ఉపయోగిస్తున్నారు. అయితే రోబో సహయక చర్యలు ప్రారంభం కాలేదు. తమవారు సురక్షితంగా బయటకు వస్తారని ఎదరు చూసిన కుటుంబ సభ్యులకు, బంధువులకు.. గుర్ప్రీత్ సింగ్ మృతదేహాం చూశాక ఆ ఆశలు ఆవిరైపోయాయి. నెల రోజుల తర్వాత కూడా మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు టన్నెల్ వద్దే ఎదురుచూపులు చూస్తున్నాయి. -
నీ భర్తను వదిలేసి నాతో రా... దుబాయ్‌కి వెళ్ళిపోదాం
హైదరాబాద్: దుబాయ్‌లో ఓ పబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తున్న హైదరాబాదీ యువతికి అక్కడే పరిచయయమైన యువకుడు మానసిక వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమె భర్త, కుటుంబ సభ్యులకు వ్యక్తిగత వీడియోలు షేర్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత డ్యాన్సర్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దుబాయ్‌కు చెందిన నౌషాద్ అబూ బాకర్‌పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌లో నివసించే యువతి (38) 2018 అక్టోబర్ 6వ తేదీన ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లింది.దుబాయ్‌లోని సౌత్ ఇండియా పబ్‌లో డ్యాన్సర్‌గా చేరింది. పబ్ సూపర్వైజర్ ఆమెకు ఏదైనా పని ఉంటే నౌషాద్ అబూబాకర్‌ను సంప్రదించాలని నెంబర్ ఇచ్చాడు. అప్పటి నుంచి తరచూ నౌషాద్ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు. అయితే వీడియోలు తీసుకుని కొంతకాలంగా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు. 2020లో ఆమె హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. ఆ సమయంలోనే అబూబాకర్ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ తిరిగి దుబాయ్ పబ్‌కు రావాలని, లేకపోతే వీడియోలు, ఫోటోలు కుటుంబసభ్యులకు షేర్ చేస్తానంటూ బెదిరించడంతో ఆమె తిరిగి దుబాయ్‌కు వెళ్లింది. ఇద్దరి మధ్య వీడియోల విషయంలో గొడవ జరిగింది. ఫోన్లో నుంచి వీడియోలు, ఫోటోలు డిలీట్ చేయాలని సూచించి తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. ఆరు నెలల తర్వాత అబూబాకర్ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆమెకు ఫోన్ చేశాడు. ఇంటి నుంచి బయటకు రావాలని లేకపోతే భర్తతో పాటు కుటుంబ సభ్యులకు వీడియోలు పంపిస్తానని బెదిరించాడు. అయినా ఆమె వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. ఇదే అదునుగా నిందితుడు ఆమె ఫోటోలు, వీడియోలను భర్తకు, కుటుంబ సభ్యులకు పంపించాడు. తాను ఆమెను పెళ్లి చేసుకున్నానని, వదిలిపెట్టాలంటూ భర్తను హెచ్చరించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక, అబూబాకర్ బ్లాక్మెయింలింగ్ భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో పలుచోట్ల వడగళ్లతో భారీ వర్షం పడింది. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇక, హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి వేళ వర్షం మొదలైంది. పటాన్ చెరు, లింగంపల్లి, మాదాపూర్, చందానగర్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వడగాళ్ల వాన కురిసింది. దీంతో పలు కాలనీల్లో వరద నీరు చేరుకుంది.తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో సహా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. అంతేకాకుండా… ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం రావటంతో పంట నష్టం వాటిల్లింది. అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేసింది. గాలి వానకు మామిడికాయలు రాలిపోయాయి చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరి పంట నేలవాలింది. అకాల వర్షంతో అన్నదాతలు ఆందోళన చెందారు. మరో రెండు రోజులపాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో పంటలు చేతి కందుతాయో లేదోనని ఆవేదన చెందుతున్నారు.This is How #HyderabadRains Make Noise When Ever it Rains It Rains Big😃⛈️❤️Perfect Relief From Heat Wave of Last 10 Days.🤝 pic.twitter.com/cqPWWJ8dLx— Hyderabad Rains (@Hyderabadrains) March 21, 2025శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పటాన్ చెరు, లింగంపల్లి, మాదాపూర్, చందానగర్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వడగాళ్ల వాన కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఇక, తెలంగాణలోని కొన్నిచోట్ల నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.#Hyderabad : Intense Rain Occurred in Various Parts of Hyderabad City. #Begumpet, #BabaNagar, #Azampura, #Charminar. #TelanganaRains #HyderabadRains #OldCity pic.twitter.com/8kqg1wP4jB— Amir Shareef (@ImAmirShareef) March 21, 2025మెదక్ పట్టణంలోని జంబికుంట వీధిలో ఓ ఇంటిపై పిడుగు పడింది. దీంతో సిద్ధయ్య అనే వ్యక్తి ఇంట్లో సామగ్రి ధ్వంసమైంది. ఆ సమయంలో మనుషులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కరీంనగర్‌లోని చొప్పదండి మార్కెట్లో మొక్కజొన్న తడిసిపోయింది. మెదక్ పట్టణం, మెదక్, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి మామిడికాయలు నేలారాలాయి. సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక, మిర్దొడ్డి, తొగుట మండలాల్లో వర్షం కురిసింది.Yesterday Night it was a Big Rains⛈️⛈️ across Hyderabad & the Highest Rainfall is recorded at— University of Hyderabad : 5.45 cms#HyderabadRains #SummerRains Image Credits — tgdps pic.twitter.com/5KC7zQLBed— Weatherman Karthikk (@telangana_rains) March 21, 2025మరోవైపు.. ఏపీలో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు ఉరుములతో కూడిన జల్లులు ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అనంతరం, రెండు రోజుల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. #TelanganaRains : #Kondapur Roads Flooded After Massive #Thunderstorms, Hailstorms. pic.twitter.com/9ZiC5uSbeM— Amir Shareef (@ImAmirShareef) March 21, 2025 -
హైదరాబాద్‌లో విషాదం.. మార్నింగ్ వాక్కు వెళ్లి అడిషనల్ ఎస్పీ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ టీఎం. నందీశ్వర బాబ్జీ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అడిషనల్ ఎస్పీ టీఎం. నందీశ్వర బాబ్జీ రోడ్డు దాటుతున్న సమయంలో అతడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందీశ్వర బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఈ క్రమంలో ఇంకో మూడు రోజుల్లో డీజీపీ ఆఫీసుల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. -
పేపర్లు తారుమారు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, నెట్వర్క్: పదోతరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు విద్యార్థులు భాషా పరీక్ష రాశారు. టెన్త్ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా, తొలి పరీక్షకు 4.95 లక్షల మంది హాజరయ్యారు. హాజరుశాతం 99.67గా నమోదైంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఆ సెంటర్లో విద్యార్థులు పరీక్ష ముగిశాక కూడా 45 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టిన విషయమై పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ గందరగోళం సృష్టించడానికే వదంతులు ప్రచారం చేశారన్నారు. వికారాబాద్, తాండూర్లలో సంస్కృతం పేపర్‌కు బదులుగా తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. అయితే దీనిని ఆలస్యంగా గుర్తించి అధికారులు మళ్లీ సంస్కృతం పేపర్ ఇచ్చి పరీక్ష రాయించారు. మంచిర్యాలలోనూ తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. దీంతో విద్యార్థులు రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష రాయాల్సి వచ్చింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని, ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. నకిరేకల్ నుంచి లీక్ అయ్యిందా ! పదోతరగతి పరీక్ష ప్రారంభమైన 20 నిమిషాలకే నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని యువకుల వాట్సాప్‌లలో టెన్త్ తెలుగు ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టింది. అందులోని ప్రశ్నలకు అనుగుణంగా టెస్ట్ పేపర్లలోని జవాబు పత్రాలతో యువకులు హల్చల్ చేశారు. జవాబులన్నీ ఒకే పేపర్లో వచ్చేవిధంగా జిరాక్స్‌లు తీసి స్థానిక పరీక్ష కేంద్రాల్లోకి పంపించేందుకు హల్చల్ చేశారు. అయితే బందోబస్తులో ఉన్న పోలీసులు విషయం తెలియక పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు అనుగుణంగా జిరాక్స్ తీసిన జవాబుల ప్రతులు ఆ సమయంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు చేరాయా? లేదా? ప్రశ్నపత్రం వాట్సాప్‌లో ఎక్కడెక్కడికి వెళ్లిందన్నది తేలాల్సి ఉంది. ప్రశ్నపత్రం లీకేజీ విషయంపై అధికారులు శాలిగౌరారం, నకిరేకల్ పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం గోప్యంగా విచారణ జరిపారు. బయటకు వచ్చిన ఆ ప్రశ్నపత్రం నకిరేకల్‌లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి లీక్ అయినట్టు తెలిసింది. దీనికి బాధ్యుడైన వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. 45 నిమిషాల పాటు పరీక్ష కేంద్రాల్లోనే విద్యార్థులు ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో విద్యార్థులను పరీక్ష ముగింపు సమయం గడిచినా, 45 నిమిషాల వరకు శాలిగౌరారంలోని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించలేదు. లీకైన పేపర్ ఫొటోతో పరీక్ష కేంద్రాల్లోని విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రాలతో సరిపోల్చి చూశారు. లీకైన పేపర్ సీరియల్ నంబరుతో మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లోని పేపర్ సీరియల్ నంబర్లతో పోల్చి చూశారు. లీకైన టెన్త్ తెలుగు ప్రశ్నపత్రం సీరియల్ నంబరు 1495550గా అధికారులు గుర్తించారు. విచారణ తర్వాత మధ్యాహ్నం 1:15 గంటలకు ఉన్నతాధికారుల ఆదేశంతో విద్యార్థులను బయటకు పంపిచారు. సీరియల్ నంబరు వేరుగా ఉన్నా, అందులోని ప్రశ్నలకు, విద్యార్థులకు అందజేసిన ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలకు మధ్య తేడా ఏమీ లేదని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. లీకేజీ ఘటనలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్‌లో నివాసముంటున్న ఆ ఉపాధ్యాయుడు తన కుమార్తె కోసమే ఈ చర్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపామని నల్లగొండ డీఈవో భిక్షపతి పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రామ్మోహన్‌రెడ్డిలను పరీక్ష విధుల నుంచి తొలగించారు. ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పదో తరగతి తెలుగు పేపరు లీకేజీ ఘటనలోనే వారిపై చర్యలు చేపట్టినట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. సంస్కృతం బదులు తెలుగు పేపర్ వికారాబాద్ జిల్లా తాండూరులోని టీజీఎస్ఆర్ బాలికల గురుకులానికి చెందిన టెన్త్ విద్యార్థి నాగలక్షి్మతోపాటు మరో విద్యార్థి పట్టణంలోని శివసాగర్ కేంద్రంలో పరీక్ష రాసేందుకు వెళ్లారు. అయితే తమకు సంస్కృతం ప్రశ్నపత్రానికి బదులు తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారని చెప్పినా, ఇదే మీ పేపర్ అంటూ ఆ విద్యార్థులతో బలవంతంగా పరీక్ష రాయించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు తమ తప్పిదాన్ని గుర్తించిన ఇని్వజిలేటర్లు ఆ ఇద్దరు విద్యార్థులతో 3 గంటల వరకు సంస్కృతం పేపర్ రాయించారు. తాండూరులోని ఫ్రంట్‌లైన్ ఎగ్జామ్ సెంటర్లోనూ తెలంగాణ గురుకుల పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి అంకితతో సంస్కృతం బదులు తెలుగు పేపర్ రాయించారు. గంట తర్వాత అసలు విషయం తెలుసుకొని సంస్కృతం పేపర్ అందజేశారు. తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలోకి మొదటిరోజు ప్రశ్నపత్రం బదులు.. రెండోరోజు ప్రశ్నపత్రాలు రావడంతో గందరగోళం నెలకొంది. అధికారుల తప్పిదంతో విద్యార్థులు రెండు గంటల ఆలస్యంగా పరీక్ష రాశారు. తొలిరోజు తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రాలు ఉన్నట్టు గుర్తించి, మళ్లీ 20 బాక్సులను వెతికి తెలుగు ప్రశ్నపత్రం తీసుకొచ్చేలోపు సమయం వృథా అయ్యింది. ఈ ఘటనపై కలెక్టర్ కుమార్ దీపక్ వివరణ ఇస్తూ. ట్రంకు బాక్సులో రెండో రోజు ప్రశ్నపత్రాలు ఉన్నట్టు, ప్రశ్నపత్రాల కవర్ తెరవకుండానే గుర్తించామని, మొదటి రోజు ప్రశ్నపత్రం ఏ బాక్సులో ఉందో వెతికేందుకు గంటన్నర సమయం పట్టిందని, విద్యార్థులు ఆ సమయం నష్టపోకుండా పరీక్షకు 3 గంటలు యథావిధిగా కల్పించామన్నారు. రెండో రోజు పరీక్ష పత్రం లీక్ కాలేదని, పోలీసుస్టేషన్లో భద్రంగా ఉందన్నారు. పరీక్ష సజావుగా నిర్వహించని కారణంగా పరీక్ష కేంద్రం చీప్ సూపరింటెండెంట్ సప్థర్ అలీఖాన్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ పద్మజలను సస్పెండ్ చేసి, వీరిస్థానంలో మరొకరికి బాధ్యతలు ఇచ్చామన్నారు. కేంద్రాలకు వెళ్లడమూ ఓ పరీక్షే సాక్షి, నాగర్‌కర్నూల్/కన్నాయిగూడెం: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు రోజూ పరీక్షలు రాసేందుకు 25 కి.మీ దూరంలోని దోమలపెంటకు రావాల్సి వస్తోంది. అటవీమార్గం గుండా ఉన్న రహదారిపై ఆర్టీసీ బస్సులో వెళ్లేందుకు గంటన్నర, తిరిగి వచ్చేందుకు గంటన్నర సమయం పడుతోంది. దీంతో ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, 6.30 గంటలకే వటవర్లపల్లి వద్ద బయలుదేరి, రానూపోనూ కలపి మొత్తం 50 కి.మీ. ప్రయాణించి పరీక్షలు రాస్తున్నారు. కన్నీటి పరీక్ష మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ముత్తపూర్ గ్రామానికి చెందిన మంచర్ల మల్లయ్య గురువారం రాత్రి అనారోగ్యంతో చనిపోయాడు. శుక్రవారం ఉదయం ఓ వైపు అంతిమ సంస్కారాలు జరుగుతుండగానే ఆయన కూతురు శ్రీలత పరీక్షకు హాజరైంది. – నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాల్ గ్రామానికి చెందిన పాలెం అంజన్న శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ బాధతోనూ ఆయన కూతురు అంజలి పరీక్ష రాశారు. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కల్తిరామయ్యగుంపు గ్రామానికి చెందిన కనపటి వీరస్వామి(45) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ఇద్దరు కుమార్తెలు హర్షిత, ప్రియ రొంపేడులోని బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. తండ్రి చనిపోయిన విషయం పరీక్ష రాశాక కూతుళ్లకు చెప్పారు. ఇంటికి చేరుకున్నాక ‘నాన్నా.. లే.. నాన్నా..’అంటూ వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అనారోగ్యాన్ని లెక్క చేయకుండా... సిద్దిపేట/రామగుండం – సిద్దిపేటకు చెందిన శ్వేత కేజీబీవీ మిట్టపల్లిలో 10వ తరగతిలో చదువుతోంది. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కింద పడటంతో కాలు విరిగింది. శుక్రవారం ఉదయం రంగధాంపల్లి పరీక్ష కేంధ్రానికి వద్దకు శ్వేత అంబులెన్స్‌లో వచ్చింది. స్ట్రెచర్ పైనే బంధువుల సాయంతో పరీక్ష రాసింది. – పెద్దపల్లి జిల్లా అంతర్గాం టీటీఎస్ జెడ్పీ హైసూ్కల్లో శుక్రవారం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థి నందన్‌వర్మ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ప్రథమ చికిత్స అందించిన తర్వాత ఆయన పర్యవేక్షణలో విద్యార్థి పరీక్ష రాశాడు. పరీక్ష పూర్తయ్యాక 108 అంబులెన్స్‌లో అదే పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించారు. బాలుడు కోలుకున్నట్టు డాక్టర్ తెలిపారు. -
ఏజెంట్లపై ఆర్టీఏ 'ఐ'!
సాక్షి, హైదరాబాద్: ఏజెంట్లు, దళారుల ఆట కట్టించేందుకు రవాణాశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అస్త్రాన్ని ప్రయోగించింది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ నిఘా కెమెరాలు క్లిక్‌మనిపించే ప్రతి వ్యక్తికి ఒక కోడ్ నమోదవుతుంది. ఆ కోడ్ ఆధారంగా సదరు వ్యక్తి ఒక రోజులో ఎన్నిసార్లు ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు? ఏ పని కోసం వచ్చాడనేది ఇట్టే తెలిసిపోతుంది. సాధారణంగా ఏజెంట్లు, దళారులు మాత్రమే ఆర్టీఏ కార్యాలయాల వద్ద తిష్ట వేస్తారు. నిఘా కెమెరాల్లో వాళ్లకు సంబంధించిన కోడ్ నంబర్లు పదేపదే నమోదవుతాయి. ఒక రోజులో, ఒకవారంలో ఒక కోడ్ ఎన్నిసార్లు కనిపించింది అనే విశ్లేషణ ఆధారంగా దళారులను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కేంద్ర కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సీసీ కెమెరాలు విజయవంతంగా పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థను దశలవారీగా రాష్ట్రంలోని అన్ని రవాణా కార్యాలయాలకు విస్తరించనున్నారు. చెక్‌పోస్టుల్లోనూ వీటిని ఏర్పాటుచేసి రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అధికారి చెప్పారు. వారంలోనే 45 మందిని పసిగట్టిన ఏఐ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐ కెమెరాలు వారం రోజుల్లో 45 మంది పదేపదే ఆఫీసుకు వచ్చినట్లు పసిగట్టాయి. ఆర్టీఏ ప్రాంగణంలోనే ఉన్నఈ సేవా కేంద్రంలో పనిచేసే కొందరు ఉద్యోగులు మినహాయించి మిగతావాళ్లంతా ఏజెంట్లుగా తేలింది. దీంతో ఏజెంట్లను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఆర్టీఏ సేవల కోసం వచ్చేవాళ్లు మినహా ఇతరులు లోపలికి ప్రవేశించకుండా పోలీసులతో ఆంక్షలు విధించారు. ఆ తరువాత రెండు వారాల్లోనే దళారుల రాకపోకలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ నిఘా వ్యవస్థను త్వరలో సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి చెప్పారు. ఆ తర్వాత మెహిదీపట్నం, ఉప్పల్, బండ్లగూడ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, మణికొండ, కూకట్పల్లి, మలక్‌పేట, నాగోల్ తదితర ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు, డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లకు విస్తరించనున్నారు. ఆ తదుపరి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఏజెంట్లదే హవాకొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సహాయంతో అన్ని రకాల పౌరసేవల్లో హవా కొనసాగిస్తున్నారు. క్లర్క్‌లు, అసిస్టెంట్లుగా పనులు చక్కబెడుతున్నారు. వీరు అధికారుల వద్ద కీలకంగా మారటంతో డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్లు, తదితర పనుల కోసం వచ్చేవారు ఈ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల కార్యాలయాల వెలుపల బాహాటంగానే దుకాణాలు తెరుచుకొని పని చేస్తున్నారు. డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు కూడా ఏజెంట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో పౌరసేవలపై ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే రెండు రెట్లు అధికంగా సమరి్పంచుకోవలసి వస్తోంది. ఏజెంట్లను అరికట్టేందుకు ఇప్పటివరకు 17 రకాల సేవలను ఆన్‌లైన్‌లోకి మార్చారు. కానీ తరచూ సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అవి పారదర్శకంగా అమలు కావడం లేదు. చెక్‌పోస్టుల్లో ఏఐ నిఘా రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ చెక్‌పోస్టులకు కూడా ఏఐ నిఘా వ్యవస్థను విస్తరించనున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేసేందుకు భైంసా, కామారెడ్డి, జహీరాబాద్, అలంపూర్, క్రిష్ణా, విష్ణుపురం, నాగార్జునసాగర్, కోదాడ, మద్దునూరు, సాలూరు, వాంకిడి, కల్లూరు, అశ్వారావుపేట, పాల్వంచలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నిజానికి దేశవ్యాప్తంగా నేషనల్ పరి్మట్ విధానం, జీఎస్టీ అమల్లోకి వచి్చన తరువాత ఈ చెక్‌పోస్టుల అవసరం లేకుండా పోయింది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో చెక్‌పోస్టులను ఎత్తేసినా తెలంగాణలో మాత్రం కొనసాగుతున్నాయి. -
14 వేల మంది అధ్యాపకులు.. 60 లక్షల పేపర్లు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల భవితవ్యం తేల్చే.. జవాబుపత్రాల మూల్యాంకనం శనివారం నుంచి ప్రారంభమవుతోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియ కోసం ఇంటర్‌బోర్డు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. క్షుణ్నంగా, ఎలాంటి లోపాలు లేకుండా, పలు స్థాయిల్లో పరిశీలనతో మూల్యాంకనం ప్రక్రియ చేపట్టనున్నారు. మార్కుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఫలితాలను విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.. సుమారు 60 లక్షల జవాబుపత్రాలను దిద్దాల్సి ఉంటుందని వెల్లడించారు. మూల్యాంకనంలో వివిధ స్థాయిలు.. సమాధాన పత్రాలను అనేక స్థాయిల్లో పరిశీలిస్తారు. తర్వాతే మార్కులను ఖరారు చేస్తారు. రోజు కు ఒక్కో అధ్యాపకుడు 40 సమాధాన పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. వారిని అసిస్టెంట్ ఎగ్జామినర్ అంటారు. పరీక్షలో ఇచి్చన ప్రశ్నలకు తగిన సమాధానాలను నిపుణులు మూల్యాంకన ప్రక్రియ కోసం పంపుతారు. వీటి ఆధారంగా అసిస్టెంట్ ఎగ్జామినర్ జవాబుపత్రాలను పరిశీలించి మార్కులు వేస్తారు. కొన్ని పరిమితుల మేరకు విచక్షణాధికారంతో మార్కులు వేయవచ్చు. తర్వాత ఆ జవాబుపత్రం చీఫ్ ఎగ్జామినర్‌కు వెళ్తుంది. వారు మార్కులను, మూల్యాంకన తీరును పరిశీలిస్తారు. తర్వాతి దశలో జవాబుపత్రం సబ్జెక్టు నిపుణుల వద్దకు వెళ్తుంది. ఎక్కడైనా పొరపాటు ఉంటే నిపుణులు సరిచేస్తారు. ప్రతీ ప్రక్రియ, ప్రతీ మార్పును చీఫ్ ఎగ్జామినర్ రికార్డు చేస్తారు. ఇన్ని దశలు దాటిన తర్వాత మార్కులు బోర్డుకు చేరతాయి. మూల్యాంకన సమయంలో ఇచ్చిన కోడ్‌ను ఇంటర్ బోర్డ్‌లో డీకోడ్ చేస్తారు. ఆ విద్యార్థి మార్కులను ఆన్లైన్లో నమోదు చేస్తా రు. సాఫ్ట్‌వేర్‌పై ట్రయల్ రన్ కూడా చేస్తారు. కొందరు విద్యార్థుల మార్కులను నమోదు చేసి, సాంకేతిక లోపాలేమైనా ఉన్నాయా? అని మానవ వనరుల ద్వారా పరిశీలిస్తారు. ఇలా 4 రౌండ్లు ట్రయల్ జరుపుతారు. ఎలాంటి సమస్య లేనిపక్షంలో తుది దశ ఫలితాలను పొందుపరుస్తారు. నెలరోజులపాటు మూల్యాంకనం.. ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం శనివారం మొదలై సుమారు నెల రోజుల పాటు కొనసాగుతుంది. మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. మూల్యాంకనం ప్రక్రియను ఈసారి ఆధునిక పద్ధతుల్లో చేపట్టబోతున్నారు. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయానికి ప్రతీ కేంద్రాన్ని అనుసంధానం చేస్తున్నారు. ఈసారి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మూల్యాంకనం చేసే అధ్యాపకులు ఏ సమయంలో వస్తున్నారు? ఎప్పుడు కేంద్రం నుంచి వెళ్తున్నారనే వివరాలను రికార్డు చేస్తారు. ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేని అధ్యాపకులనే మూల్యాంకనం కోసం ఎంపిక చేయాలని జిల్లా అధికారులకు బోర్డ్ ఆదేశాలిచ్చింది.మొత్తం60 లక్షల పేపర్లు ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వీరందరి అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు 60 లక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సిఉంది. ఈ ప్రక్రియ కోసం 14 వేల మంది లెక్చరర్లను ఎంపిక చేశారు.శాస్త్రీయ విధానంలో మూల్యాంకనం స్పాట్ వ్యాల్యుయేషన్ జరిగే19 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. ఈసారి బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తున్నాం. మరింత శాస్త్రీయ పద్ధతిలో ఈసారి మూల్యాంకనం ఉండబోతోంది. ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – జయప్రద బాయి, ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి -
ముందు దర్యాప్తు.. ఆపై విచారణ!
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలపై సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై నమోదైన కేసుల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలుత ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలని, వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా బాధ్యులకు నోటీసులు జారీ చేసి విచారించాలని భావిస్తున్నారు. దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నేరం కాకపోవడం, మరికొన్ని అంశాల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని ఆలోచనకు వచ్చారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీసుస్టేషన్లో 25 మంది నటీనటులు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 2017 నుంచే నిషేధం అమలు.. తెలంగాణలో కొన్నేళ్లుగా పేకాటపై నిషేధం ఉంది. దీనితో పేకాట క్లబ్బులన్నీ మూతపడ్డాయి. కానీ చాలా మంది ఆన్లైన్ రమ్మీ, పేకాటకు అల వాటు పడ్డారు. దీనికోసం తొలినాళ్లలో ప్రత్యేక వెబ్సైట్లు, యాప్‌లు వచ్చా యి. వాటి సర్వర్లను రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం.. గేమింగ్ యాక్ట్‌కు సవరణలు చేసి, రాష్ట్ర పరిధిలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌పైనా నిషేధం విధించింది. 2017లో ఇది అమల్లోకి వచ్చింది. ఇంటర్నెట్ సేవలను అందించే సంస్థలకు లేఖలు రాయడం ద్వారా పోలీసులు రాష్ట్రంలో గ్యాంబ్లింగ్ సైట్లు/యాప్‌లు ఓపెన్ కాకుండా చర్యలు తీసుకున్నారు. కానీ ఆన్లైన్ గేమింగ్‌కు బానిసలుగా మారినవారు నకిలీ జీపీఎస్, లొకేషన్ యాప్స్, వీపీఎన్ల సాయంతో ఆయా సైట్లు, యాప్స్‌ను వినియోగిస్తున్నారు. పలువురు నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకుని ఆ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు, యాప్స్‌కు ప్రమోట్ చేశారు. ఈ క్రమంలోనే వారిపై చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. నాటి ప్రకటనలే అని చెబుతూ.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై కేసులు నమోదవడంతో చాలా మంది ప్రముఖులు స్పందించారు. ఆ ప్రకటనలన్నీ గేమింగ్ చట్ట సవరణకు ముందే 2016–17 సమయంలో చేసినవని, తర్వాత ఆ ఒప్పందాలు రద్దు చేసుకున్నామని కొందరు చెప్తున్నారు. మరికొందరు తెలుగు రాష్ట్రాల బయట మాత్రమే ఆ ప్రమోషనల్ వీడియోలను వినియోగించుకోవడానికి అంగీకరించామని అంటున్నారు. దీంతో సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లతో బెట్టింగ్ కంపెనీలకు జరిగిన ఒప్పందాలను సేకరించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. వాటిని అధ్యయనం చేయడం ద్వారా ఎవరు? ఎప్పుడు? ఏఏ యాప్స్‌తో ఒప్పందాలు చేసు కున్నారు? ఏయే ప్రాంతాల్లో ప్రచారం చేసేలా నిబంధనలు ఉ న్నాయి? తదితర అంశాలను పరిశీలించనున్నారు. ఇక ఇన్ఫ్లుయెన్సర్లకు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు మధ్య కొందరు ఈవెంట్ మేనేజర్లు దళారులుగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. వారి వివరాలు సైతం ఆరా తీసి, నిందితులుగా చేర్చాలని యోచిస్తున్నారు. న్యాయ నిపుణుల సల హాలు తీసుకున్న తర్వాతే నిందితులకు నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. -
పొంచి ఉన్న ‘ట్రూఅప్’ భారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భవిష్యత్తులో ట్రూఅప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఎస్ఏ) ముప్పు పొంచి ఉందని విద్యుత్ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాలరావు ఆందోళన వ్యక్తంచేశారు. రెండు డిస్కంలకు రూ.20,151 కోట్ల ఆదాయ లోటు ఉంటుందని అంచనా వేయగా, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీల కింద బడ్జెట్లో రూ.11,500 కోట్లు మాత్రమే కేటాయించిందని గుర్తు చేశారు. మిగతా లోటును పూడ్చుకునేందుకు ట్రూఅప్ చార్జీలు విధించాల్సి వస్తుందని తెలిపారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సమర్పించిన 2025–26 వార్షిక ఆదాయ అవశ్యకత(ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన తన వాదన వినిపించారు. డిస్కంల ఆర్థిక నష్టాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల బకాయిల కలిపి రూ.98,053 కోట్లకు ఎగబాకాయని ఆందోళన వ్యక్తంచేశారు. గరిష్ట డిమాండ్ ఉండే సమయంలో పునరుత్పాదక విద్యుత్ అందుబాటులో ఉండదని, అందువల్ల తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన కనీస మొత్తం కంటే అధికంగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనటం ఏమాత్రం సరికాదని అన్నారు. అలా చేస్తే గరిష్ట డిమాండ్‌ను తీర్చడానికి బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు అనవసర ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. పునరుత్పాదక ఇంధన కొనుగోళ్లకు అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకుంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించడానికి బ్యాకింగ్ డౌన్ చేసి నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చే ఏడాది ఏకంగా 28,504 మిలియన్ యూనిట్ల (ఎంయూ) మిగులు విద్యుత్ ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయని, అవసరం లేని ఈ విద్యుత్‌కు చెల్లించే ఫిక్స్డ్ చార్జీల భారం వినియోగదారులపై పడుతుందని అన్నారు. సమ్మతి తెలిపిన వినియోగదారులకే ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని సూచించారు. టైమ్ ఆఫ్ డే పేరుతో రాత్రి పూట విద్యుత్ వినియోగించే హెచ్‌టీ వినియోగదారులకు ఇస్తున్న రాయితీలను ఎత్తివేయాలని కోరారు. బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ ఏర్పాటు చేస్తే విద్యుత్ ధర యూనిట్‌కు రూ.11కి పెరిగిపోతుందని చెప్పారు. వినతులు, ఫిర్యాదులు.. » రైల్వే ట్రాక్షన్ విద్యుత్ చార్జీలను హైదరాబాద్ మెట్రో రైలు కేటగిరీతో సమానంగా తగ్గించాలని దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆర్.మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు. » విద్యుత్ బిల్లులను నెల పూర్తికాక ముందే జారీ చేసిన సందర్భాల్లో సగటున 30 రోజుల వాడకాన్ని అంచనా వేసి టారిఫ్ శ్లాబులను వర్తింపజేస్తుండటంతో బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయని కిరణ్‌కుమార్ అనే వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. » విద్యుత్ ప్రమాదాల్లో మరణించి వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ ప్రశ్నించారు. దరఖాస్తులు చేసుకోవడానికి నిర్దేశిత గడువు ఏమీ లేనప్పుడు గడువు పేరుతో దరఖాస్తులు ఎందుకు తిరస్కరిస్తున్నారని నిలదీశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో సంజీవరెడ్డి అనే వ్యక్తి 2019లో విద్యుదాఘాతంతో మరణిస్తే ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని అతడి భార్య సరిత ఫిర్యాదు చేయటంతో అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేíÙయా చెక్కును ఇప్పించారు. » కొత్త వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలతోపాటు లంచాలు ఇచ్చినా సకాలంలో జారీ చేయడం లేదని పలువురు రైతులు ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై జస్టిస్ దేవరాజు నాగార్జున్ అక్కడికక్కడే టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీని వివరణ కోరారు. లైన్లు, టవర్ల ఏర్పాటులోనిబంధనలు పాటించాలిపంట పొలాల్లో విద్యుత్ లైన్లు, టవర్ల ఏర్పాటు విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఈఆర్సీ చైర్మన్ ఆదేశించారు. నోటిసులు ఇవ్వకుండా, తమ సమ్మతి లేకుండా పొలాల్లో లైన్లు వేస్తున్నారన్న రైతుల ఫిర్యాదులపై వివరణ కోరారు. టవర్ ఏర్పాటు చేస్తే స్థలం మార్కెట్ విలువ తో పోల్చితే 200 శాతాన్ని, లైన్లు వేస్తే 30 శాతాన్ని పరిహారంగా ఇవ్వాలని జీవో ఉందని ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి వచ్చే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్షేత్ర స్థాయిలోని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని ఫారూఖీ హామీ ఇచ్చారు. -
ఇది హామీలకు పాతరేసే బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు పాతరేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం శాసనసభలో జరిగిన సాధారణ చర్చలో మహేశ్వర్‌రెడ్డి బడ్టెట్ తీరుతెన్నులను ఎండగట్టారు. ఇది కమీషన్ల ప్రభుత్వమంటూ తీవ్ర విమర్శలు చేశారు. ‘తెలంగాణలో ప్రజల బతుకులు బాగుపడతాయని భావిస్తే అప్పుల కుప్పగా చేశారు. గత పాలకుల అవినీతిని కక్కిస్తామని హడావుడి చేసి 14 నెలలుగా ఎవరిపైనా కేసులు, రికవరీలు లేవు. ఆరు గ్యారంటీలకు నిధుల కేటాయింపు అసమగ్రంగా ఉంది.అనేక పథకాలకు వరుసగా రెండో బడ్జెట్లోనూ ఎలాంటి కేటాయింపులు లేవు. కేవలం ఏడాదిన్నరలోపే రూ.1.63 లక్షల కోట్లు అప్పు తెచ్చి పురోగతి ఎలా సాధ్యమో చెప్పాలి. రుణమాఫీకి రూ.42వేల కోట్లు అవసరం కాగా, రేవంత్ కటింగ్ మాస్టర్ అవతారం ఎత్తి రూ.29వేల కోట్లు ఎగవేశారు. మూసీ ప్రక్షాళనపై డీపీఆర్‌లో అంచనాలు పెంచుతూ జేబు నింపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూ భారతి మార్గదర్శకాలు విడుదల చేయడంతోపాటు ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి.రూ.2.50 లక్షల కోట్ల విలువ చేసే అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్టు గతంలో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ వివరాలు బయట పెట్టాలి. రాజీవ్ యువ వికాసం కింద 35 లక్షల మంది యువత ఉంటే 10 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారు. పదిశాతం జనాభా ఉన్న మైనారిటీ బీసీలకు రూ.3,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందూ బీసీలకు రూ.11వేల కోట్లు మాత్రమే కేటాయించి మోసం చేస్తోంది’అని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న తనను స్పీకర్‌కు సమాచారం ఇవ్వకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మహేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. నిర్మల్ నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీతో ఎస్ఆర్ఎస్పీ ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు.ప్రధానమంత్రి దగ్గరకు తీసుకెళ్లండి.. కలిసివస్తాం : ఏలేటికి మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి నిధుల సాధనకు చర్చించేందుకు పీఎం నరేంద్రమోదీ దగ్గరకు తీసుకెళ్లాలని, తాము ఎలాంటి భేషజాలు లేకుండా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావుకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. హామీల అమలు పక్కన పెట్టి..మూసీ ప్రాజెక్టు ఎందుకు ముందు వేసుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని పెద్దలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
బడ్జెట్ పై 'సభ'భగలు
⇒ ఆర్థిక మాంద్యం కాదు.. మీ బుద్ధి మాంద్యం: మాజీ మంత్రి హరీశ్‌రావు ⇒ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం⇒ అంతా తనకే తెలుసనుకునే సీఎం ⇒అజ్ఞానంతో ఆదాయం దిగజారింది⇒పాలన చేతకాక నెగెటివ్ రిజల్ట్.. బడ్జెట్ అంకెలు, లెక్కలన్నీ ఉత్తవే ⇒ఆరు గ్యారంటీలకు దిక్కులేదు గానీ.. అందాల పోటీలా? ⇒అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే.. సీఎం రేవంత్‌రెడ్డికే వస్తుందిసాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యంతో ఆదాయం తగ్గిందని ప్రభుత్వం చెబుతోందని.. కానీ ఇది పాలకుల బుద్ధి మాంద్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘ఇచ్చిన హామీలను అమలు చేసే దిక్కులేదు, వాటికి సరిపడా ఆదాయం లేదని ప్రభుత్వమే చెప్తోంది. ఆదాయం ఎందుకు లేదంటే ఆర్థిక మాంద్యం అంటోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం తెలంగాణలోనే ఎందుకు ఉంటుంది? ఇది ఆర్థిక మాంద్యం కాదు..పాలకుల బుద్ధిమాంద్యం. అంతా తనకే తెలుసు అనుకునే సీఎం అజ్ఞానం, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం దిగజారింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం మాటెత్తుకున్నారు..’’అని పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా శుక్రవారం ఆయన బీఆర్ఎస్ పక్షాన శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. వివరాలు హరీశ్‌రావు మాటల్లోనే... ఇది దిగజారుడు రాజకీయం రాష్ట్ర ఆదాయం తగ్గిపోవటంతో భూములను తెగనమ్మి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కొన్ని భూములమ్మితేనే గగ్గోలు పెట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు రూ.50 వేల కోట్లు లక్ష్యంగా ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇది దిగజారుడు రాజకీయం కాదా? పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రైజింగ్ తెలంగాణ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు గానీ, అందాల పోటీలు నిర్వహిస్తారట. రాష్ట్రంలో అన్ని వ్యవస్థల విధ్వంసం.. రాష్ట్రంలో వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. హైడ్రా విధ్వంసం వల్ల పేద, మధ్య తరగతి జనం గుండె ఆగి చనిపోతున్నారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరైన తిండి లేక హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మా హయాంలో గురుకులాల సంఖ్యను 289 నుంచి 1,020కి పెంచి బలోపేతం చేస్తే.. ఇప్పుడు వాటి లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తెచ్చారు. దీనితో క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అన్ని వర్గాలను మోసం చేశారు గతేడాది రూ.2,91,159 కోట్లుగా గొప్పగా చెప్పుకున్న బడ్జెట్ వాస్తవిక బడ్జెట్ కాదని నేను అప్పుడే చెప్పాను. రివైజ్డ్ బడ్జెట్ అంకెల్లో రూ.27 వేల కోట్లు తక్కువ చేసి చూపటం ద్వారా అదే నిజమని తేలింది. ఎన్నికలకు ముందు నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు పేదల రక్తమాంసాలు పిండి ఎల్ఆర్ఎస్ వసూలుకు సిద్ధమయ్యారు. ఫార్మాసిటీకి మేం భూములు సేకరిస్తుంటే తప్పుపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో ఫ్యూచర్ సిటీ పేరుతో అదనంగా మరో 14 వేల ఎకరాలు లాక్కుంటున్నారు. గత బడ్జెట్ ప్రసంగంలో రైతులతోపాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా, రైతు బీమా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. సభకు క్షమాపణ చెప్పండి.. గత బడ్జెజ్లో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పి ఈ 16 నెలల్లో నాలుగు ఇళ్లు కూడా నిర్మించలేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష అదనంగా ఇస్తామని.. ఇప్పుడు ఆ మాటే ఎత్తలేదు. ఇది దళిత, గిరిజనులను మోసం చేయడం కాదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ కేలండర్ అమలుచేస్తామని చెప్పి జాబ్‌లెస్ కేలండర్‌గా మార్చారు. దాని సంగతేమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తే అశోక్‌నగర్‌లో వారి వీపులు పగలగొడుతున్నారు. తుదిదశలో ఉన్న ఆరు సాగునీటి ప్రాజెక్టులని బడ్జెట్లో ప్రస్తావించారు కదా.. ఆ ప్రాజెక్టుల పేర్లేమిటో చెప్పండి.లేదా సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న మొదటి సంవత్సరంలో 1,913 ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. ఎన్నికల ముందు 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని ప్రకటనలు చేసి.. ఇప్పుడు మేమిచ్చి న నోటిఫికేషన్‌కు 5 వేల పోస్టులు మాత్రమే పెంచి దగా డీఎస్సీ చేశారు. ఉద్యోగాలపై తప్పుడు లెక్కలు.. కేసీఆర్ ముల్కీ రూల్స్ నుంచి 610 జీవో కోసం పోరాడి స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసి.. తొమ్మిదిన్నరేళ్లలో 1.62 లక్షల ఉద్యోగాలిచ్చారు. మా హయాంలో ఇచ్చి న నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పత్రాలు పంచటం తప్ప కొత్త ఉ ద్యోగాల కల్పన ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న 57 వేల ఉద్యోగాల్లో 50 వేలు మా హయాంలోనివే. ఈ ప్రభుత్వం ఆరు వేలు కూడా భర్తీ చేయలేదు. రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ మొహబ్బత్ కా దుకాణ్ (ప్రేమ దుకాణం) అంటుంటే.. రేవంత్ మాత్రం నఫ్రత్ కా మాకాన్ (విద్వేషాల ఇల్లు) అంటున్నారు..’’అని హరీశ్‌రావు మండిపడ్డారు. వాటిని వడ్డీలేని రుణాలుగా పరిగణిస్తారా? ‘‘ఐదేళ్లలో వడ్డీ లేని రుణాల కింద రూ.లక్ష కోట్లు అందజేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఉంటే ఆ ఉత్తర్వులు సభ ముందుంచాలి. లేని పక్షంలో సభను తప్పుదోవ పట్టించినందుకు సభకు క్షమాపణ చెప్పాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మహిళా సంఘాలకు ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇప్పిస్తామంటున్నారు. వాటిని వడ్డీ లేని రుణాలుగా పరిగణిస్తారా చెప్పాలి?’’ పాలనా వైఫల్యాలతో దెబ్బతిన్న పురోగతి‘‘జీఎస్టీ వృద్ధిరేటులో తగ్గుదల, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ ఆదాయం తగ్గడం, వాహనాల అమ్మకాల్లో తగ్గుదల.. ఇలా రాష్ట్ర ఆదాయం తగ్గింది. కేసీఆర్ హయాంలో దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా, దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గాయి. ఫార్మా సిటీ రద్దు, ఎయిర్ పోర్టుకు మెట్రో రద్దు, హైæడ్రా పేరిట సాగించిన విధ్వంస కాండ, మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా, ఆర్ఆర్ టాక్స్‌లు, సంక్షేమ పథకాల అమలు సరిగా లేక గ్రామాలకు ద్రవ్య ప్రవాహం తగ్గడం, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు చెల్లించకపోవడం, రియల్ ఎస్టేట్ కుప్పకూలడం.. ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి, వృద్ధి రేటు మందగించింది. పరిస్థితి ఇలా ఉంటే, బడ్జెట్లో మాత్రం ఘనమైన అంకెలు చూపి ప్రజలను మోసం చేస్తున్నారు.ఆర్థిక విధ్వంసం చేసిన మీరా విమర్శించేది?: భట్టి విక్రమార్క⇒ బడ్జెట్‌పై చర్చకు సమాధానంలో బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ ⇒ ఆదాయం లేకున్నా పెంచుతూ పోయింది మీరే... మీరు చేసిన అప్పులు తీర్చలేక చస్తున్నాం ⇒ పదేళ్లు ఎంతో అవమానించారు.. మౌనంగా భరించాం ⇒ అన్నీ అనుభవించే ఇక్కడకొచ్చాం.. మీరెన్ని మాట్లాడినా బాధపడంసాక్షి, హైదరాబాద్: ‘‘గత పదేళ్ల పాలనలో రూ.16.70 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఏం సాధించారు? నాగార్జునసాగర్ నిర్మించారా? ఎస్సారెస్పీ, ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టు వంటివేమైనా నిర్మించారా? హైటెక్ సిటీ కట్టారా? ఏం చేశారయ్యా అంటే కాళేశ్వరం అంటారు. ఆ కాళేశ్వరం ఏమైందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇక మీరు చెప్పడానికేముంది? సింగరేణికి రూ.77 వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు. పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం చేసి, వ్యవస్థలను నాశనం చేసిన మీరు.. వాస్తవిక బడ్జెట్‌ను పెట్టిన మమ్మల్ని విమర్శిస్తారా?’’ అని బీఆర్ఎస్పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు శుక్రవారం రాత్రి శాసనసభలో, శాసన మండలిలో భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలు చేసిన విమర్శలను ఘాటుగా తిప్పికొట్టారు. భట్టి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చూపినా నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదు. 2016–17లో రూ.8వేల కోట్లు, 2018–19లో రూ.40 వేల కోట్లు, 2021–22లో రూ.48 వేల కోట్లు, 2022–23లో రూ.52 వేల కోట్లకుపైగా, 2023–24లో రూ.58,571 కోట్లు ఖర్చు చేయలేదు.మేం మీలాగా బడ్జెట్‌ను ప్రతీసారి 20 శాతానికిపైగా పెంచుకుంటూ పోలేదు. అలా పెంచితే ఈసారి బడ్జెట్ రూ.4 లక్షల 18 వేల కోట్లు అయ్యేది. మేం అలా చేయకుండా.. వాస్తవాల మీద బడ్జెట్ పెట్టాం. మీరు ఆదాయం ఉన్నా, లేకున్నా పెంచుతూ పోయారు. ఔటర్ రింగ్‌రోడ్డును రూ.7 వేల కోట్లకే 30 ఏళ్ల కాలానికి అమ్ముకున్నారు. దొడ్డిదారిన ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు. తర్వాత వచ్చే ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయాన్ని కూడా ముందే తీసుకున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేశాం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అమ్మకాల ద్వారా రోజుకు కోటిన్నర ఆదాయం వచ్చేది. 30 వేల టన్నులు అమ్మేవారు. ఆరేడు నెలలుగా సీరియస్‌గా దృష్టి పెట్టాం. ఇసుక మాఫియాను కట్టడి చేశాం. రోజుకు 70 వేల టన్నులు అమ్ముతున్నాం. ఆదాయం రోజుకు రూ.3 కోట్లకు పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాల ద్వారా ఏటా రూ.600 కోట్ల ఆదాయం కోల్పోయాం. పదేళ్లలో రూ.6 వేల కోట్ల ప్రభుత్వ ధనం ఎక్కడికి పోయిందో బీఆర్ఎస్ వాళ్లే చెప్పాలి. ఇకపై రాష్ట్రంలోని అన్ని మాఫియాలను కట్టడి చేస్తాం. ఆదాయం పెంచుతాం. అవమానాలను పదేళ్లు మౌనంగా భరించాం రైతు రుణమాఫీ కింద పదేళ్లలో మీరు రూ.28,053 కోట్లు ఇస్తే.. మేం నాలుగు నెలల్లోనే రూ.20,617 కోట్లు ఇచ్చాం. మీరు జాప్యం చేయడంతో రైతు రుణమాఫీ కంటే వడ్డీల కింద రూ.13 వేల కోట్లు జమ చేసుకున్నారు. నిర్బంధం, స్వేచ్ఛ, నిరంకుశత్వం గురించి మీరా మాట్లాడేది? ఏ ఒక్కరోజైనా సభను ప్రజాస్వామికంగా నడిపారా? నేను పదేళ్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, సీఎల్పీ నేతగా అక్కడ కూర్చుని ఉంటే ఎంత అవమానించారో తెలియదా?తలవంచుకుని భరిస్తూ, మీకు సహకరించామే తప్ప అడ్డగోలుగా ఏదంటే అది మాట్లాడలేదు. సభాపతి, సభా నాయకుడు, ప్రభుత్వం గురించి తూలనాడలేదు. మేం పడిన అనుమానాలు ఈ సభలో ఎవరూ పడి ఉండరు. అయినా సభ ఔన్నత్యాన్ని కాపాడాం. అన్నీ చూసే ఇక్కడికి వచ్చాం.. మీరెన్ని మాట్లాడినా, రన్నింగ్ కామెంట్రీలు చేసినా బాధపడేది లేదు. అవన్నీ చూసి చూసి, అనుభవించి ఇక్కడకు వచ్చాం. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని మహిళలందరికీ లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు బరాబర్ ఇస్తాం. రాష్ట్రంలోని మహిళలందరూ ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేట్టు చేయాలన్నదే మా ప్రభుత్వం. సీఎం ఆలోచన. మేం ఉద్యోగాలు రాని పిల్లలకు రాజీవ్ యువ వికాసంతో రూ.6 వేల కోట్లు ఇవ్వబోతున్నాం. బ్రాహ్మణ పరిషత్‌కు రూ.50 కోట్లు ఉండే.. ఇంకో 50 కోట్లు కలిపి ఇచ్చాం. వైశ్యులు కార్పొరేషన్ కావాలని అడిగితే మీరు ఇవ్వలేదు. మేం రాగానే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.25 కోట్లు ఇచ్చాం..’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అన్నీ ఉత్త మాటలే.. పదేళ్లలో కృష్ణానది, గోదావరి నదుల మీద నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లందించారా? కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే మీరు. పదేళ్లలో దళితుల అభివృద్ధి కోసం రూ.1,81,877 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చు చేయలేదు. దళితబంధు గురించి బడ్జెట్లో రూ.17,700 కోట్లు పెట్టి ఒక్క రూపా యి అయినా విడుదల చేశారా? అమాయకులైన గిరిజనులను ఆడవాళ్లని కూడా చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టించారు. మేం సబ్‌ప్లాన్ నిధులను తు.చ. తప్పకుండా ఖర్చు చేస్తాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధత అని పేర్కొన్నారు.మీ అప్పులే కడుతున్నాం స్వామీ.. కేసీఆర్ నెరవేర్చని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. ఈ ఏడాది రూ.1,58,041 కోట్ల అప్పులు తెచ్చి .. రూ.1,53,359 కోట్ల మేర గత ప్రభుత్వ అప్పులు, వడ్డీల కింద చెల్లించాం. మీరు చేసిన అప్పులు తీర్చలేక, తప్పులు సరిదిద్దలేక, నిద్రలేక చస్తున్నాం. మీ అప్పులే కడుతున్నాం స్వామీ. తెచ్చి న అప్పుల్లో కట్టిన అప్పులు పోను ఈ సంవత్సరానికి మా ప్రభుత్వం అవసరాల కోసం వాడుకున్నది రూ.4,682 కోట్లు మాత్రమే. మీలాగా నాలుగు గోడల మధ్య బంధించుకుని ఎవరికీ ఏమీ చెప్పకుండా, ఎవరినీ కలవకుండా మూసేసి పాలన చేయదల్చుకోలేదు. మా ప్రభుత్వం 24/7 తలుపులు తెరిచి ఉంటాయి. -
‘మహాలక్ష్మి పథకం లేదు కానీ.. అందాలు పోటీలకు మాత్రం సిద్ధం’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రతీ విషయంలోనూ పారియిందంటూ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం తాము అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ బడ్జెట్ పై ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వకుండా పారిపోయింది. శాసన సభ చరిత్రలో చీకటి రోజు. ప్రభుత్వం తలుపు లు తెచిచే ఉంటాయని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి... కేవలం 20 శాతం కమిషన్ కోసం మాత్రమే తెరిచి ఉంచారని ఎద్దేవా చేశారు హరీష్.ప్రభుత్వం 20 శాతం కమిషన్ అడుగుతుందని కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లో ధర్మ చేశారు. ఉద్యోగుల విషయంలో భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టించారు. 2 లక్షల ఉద్యోగలా గురించి ప్రశ్నిస్తే సభను వాయిదా వేసి పారిపోయారు. ఎల్ఆర్ఎస్ అంశంలో భట్టి విక్రమార్క దాట వేశారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తే డబ్బులు చెల్లించాల్సిదేని భట్టి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయలేదు. బీఆర్ఎస్ అప్పులపై లెక్కలు చూపించాలంటే పారిపోయారు. కాంట్రాక్టర్లు అంటే పెద్ద పీట .. ఉద్యోగులు అంటే చిన్నచూపు. మహాలక్ష్మి పథకం అమలు లేదు కానీ.. అందాల పోటీలు పెడుతున్నారు. ప్రభుత్వం దగ్గర మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయింది. సభలో అబద్ధాలు చెప్పి ప్రభుత్వం పారిపోయింది’ హరీష్ విమర్శనాస్త్రాలు సంధించారు. -
‘టార్గెట్ సజ్జనార్’ క్యాంపెయినింగ్!
పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్‌లను ఏపీలో బ్లాక్ చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. అందులోని ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి. ‘గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గ్రూపులు యువతను సులభంగా ఆకట్టుకుని వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్ నిర్వాహకులు– ఇన్ఫ్లూయన్సర్ల మధ్య భారీ స్థాయిలో మనీలాండరింగ్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే పంజగుట్ట పోలీసుస్టేషన్లో 11 మందిపై, మియాపూర్ ఠాణాలో 25 మందిపై నమోదైన కేసులపై లోతుగా ఆరా తీస్తోంది. ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాత కేసు నమోదు చేసి, నిందితులను నోటీసులు జారీ చేసి విచారించనుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’తోనే ఈ కథ మొదలైంది. దీంతో ప్రస్తుతం బెట్టింగ్ మాఫియా ఆయనకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో ప్రచారం మొదలెట్టింది.ఈ బెట్టింగ్ మాఫియా దందా మొత్తం వ్యవస్థీకృతంగా సాగుతోంది. వీళ్లు అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్ములో దాదాపు 50 శాతం తమ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లూయన్సర్లకు ఇస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరి సోషల్‌మీడియా ఖాతాలో పోస్టు చేసిన లింకు ద్వారా అయితే ఏఏ పంటర్ తమ యాప్‌ను యాక్సెస్ చేశారనేది నిర్వాహకులు తెలుసుకుంటున్నారు. ఆ వ్యక్తి ద్వారా తమకు వచ్చిన మొత్తంలో 50 శాతం ఇన్‌ఫ్లూయన్సర్‌కు ఇస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ లావాదేవీల్లో అత్యధికంగా నగదు రూపంలో హవాలా ద్వారా జరుగుతున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇందులో విదేశీ కోణాన్నీ అనుమానిస్తూ ఆరా తీస్తున్నారు. ఈ యాప్స్‌కు ఉన్న విదేశీ లింకుల పైనా దర్యాప్తు చేయనుంది. ఆ కేసులన్నీ తిరగదోడేందుకు నిర్ణయం.. బెట్టింగ్ ఉచ్చులో చిక్కి రాష్ట్రంలో 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులన్నీ ఆయా జిల్లాలు, కమిషనరేట్లలో ఆత్మహత్యలుగానే నమోదయ్యాయి. అయితే.. వారి మృతికి బెట్టింగ్ యాప్స్ కారణమని ఆధారాలు సేకరిస్తే... వారే ఆత్మహత్యకు పురిగొల్పినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయా కేసులను సమీక్షించి, ఆధారాలు ఉన్న వాటిలో బెట్టింగ్ యాప్స్ గుర్తించి వాటినీ నిందితులుగా చేర్చడానికి కసరత్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ నిందితులుగా చేరితే సాంకేతికంగా దాని నిర్వాహకుడు ఆ జాబితాలో చేరతాడు. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలు, ఇన్ఫ్లూయన్సర్ల వివరాలు తెలిస్తే వారినీ ఆయా కేసుల్లో నిందితులుగా చేర్చనున్నారు.ఇన్ఫ్లూయన్సర్లను మళ్లీ ప్రయోగిస్తున్న మాఫియా.. బెట్టింగ్ యాప్స్ ద్వారా వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ దందాను గుర్తించిన వీసీ సజ్జనార్ ఇటీవల తన సోషల్‌మీడియా ఖాతాల్లో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో యుద్ధం ప్రకటించారు. దీనిపై స్పందించిన విశాఖపట్నం పోలీసులు లోకల్ బాయ్ నానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆపై సూర్యాపేట అధికారులు బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేయగా.. అతడు విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు పంజగుట్టలో కేసు నమోదు కావడంతో పాటు బెట్టింగ్ యాప్స్ దందాపై పోలీసుల దృష్టిపడింది. దీంతో బెట్టింగ్ మాఫియా సజ్జనార్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. దీనికోసం కొన్ని వీడియోలు చేయడానికి కొందరు ఇన్‌ఫ్లూయన్సర్లతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరికి చెల్లింపులు కూడా జరిగినట్లు భావిస్తున్నారు. మెట్రో రైళ్లపై బెట్టింగ్ ప్రకటనల తొలగింపు కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నట్లు తమ దృష్టికి రావడంతో వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎల్అండ్టీ, సంబంధిత అడ్వర్టటైజ్మెంట్ ఏజెన్సీలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీంతో గురువారం రాత్రి మెట్రో రైళ్లపై ఉన్న బెట్టింగ్ వాణిజ ప్రకటనలను పూర్తిగా తీసివేసినట్లు చెప్పారు. డబ్బులు కోల్పోయిన వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. -
సీబీఐ అదుపులో మరో అవినీతి తిమింగలం
సాక్షి,హైదరాబాద్: మరో అవినీతి తిమింగలం దొరికింది.మెదక్ జీఎస్టీ సూపర్ డెంట్ రవి రాజన్ అగర్వాల్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీ శాఖలో ఉన్నతాధికారిగా చెలామణి అవుతున్న రవి రాజన్ అగర్వాల్‌పై అవినీతి ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మెదక్ జీఎస్టీ కార్యాలయంపై సీబీఐ అధికారులు దాడులు జరిపారు.సోదారులు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, విచారణ నిమిత్త రవి రాజన్‌ను హైదరాబాద్‌కు తరలించారు. -
‘బిల్డ్ నౌ’ ఎలా పని చేస్తుంది..?
సాక్షి, హైదరాబాద్: సామాన్యులు సైతం సులభంగా ఇంటి నిర్మాణ, లే ఔట్ అనుమతులు పొందేలా ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ‘బిల్డ్ నౌ’ను జీహెచ్ఎంసీ (GHMC) అందుబాటులోకి తెచ్చింది. ‘బిల్డ్ నౌ’తో భవన నిర్మాణ అనుమతుల కోసం ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. స్థలం ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చో, వదలాల్సిన సెట్బ్యాక్లు తదితర భవన నిర్మాణ నిబంధనల సమాచారం తెలుపుతుంది. సామాన్యులు ఇంటి అనుమతికి దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుందని, డ్రాయింగ్స్ పరిశీలన నిమిషాల్లోనే పూర్తవుతుందని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ శ్రీనివాస్ తెలిపారు.ప్రస్తుతం టీజీబీపాస్లో ఇన్స్టంట్ అప్రూవల్‌కు, మిగతా అనుమతులకు వేర్వేరు విండోస్ ఉండగా, బిల్డ్ నౌలో అన్నింటికీ ఒకే విండోతో త్వరితగతిన అనుమతులు జారీ అవుతాయి. భవన నిర్మాణం పూర్తయ్యాక ఎలా ఉంటుందో కూడా త్రీడీలో చూపుతుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ప్రారంభించిన దీన్ని క్రమేపీ హెచ్ఎండీఏ, డీటీసీపీ, తెలంగాణ (Telangana) మొత్తం అమల్లోకి తేనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా గురువారమే ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకున్న ముగ్గురికి అనుమతులు జారీ చేశారు. ఇలా పని చేస్తుంది.. → ఏఐతో పాటు సురక్షిత డిజిటల్ ట్రాన్సాక్షన్, స్థలం పరిమాణానికి సంబంధించిన అవగాహన, ఆలోమేషన్ వంటి వాటితో అత్యంత వేగంగా అనుమతుల జారీ. → దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ వ్యవస్థ సులభతరం.. మెరుపువేగం. → 5 నిమిషాల్లోపునే డ్రాయింగ్ పరిశీలన పూర్తవుతుంది. ఇప్పటి వరకు 2–30 రోజుల సమయం పట్టేది. → అధునాతన క్యాడ్ ప్లగిన్. డిజైన్ సాఫ్ట్‌వేర్‌తో ప్రత్యక్ష అనుసంధానం. → డ్రాయింగ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ తక్షణమే నిర్ధారిస్తుంది. → సాధారణ లోపాలు నివారిస్తూ దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేస్తుంది. → వాట్సాప్ ద్వారానూ అప్డేట్స్ తెలియజేస్తుంది. ప్రాసెస్ ఫ్లోను దరఖాస్తుదారులు ఆన్లైన్లో చూసుకోవచ్చు. → సందర్భానుసారం మారే ఫీజులు, టారిఫ్‌లు, ప్రాసెసింగ్ ఫీజులు తక్షణమే నవీకరించుకోవచ్చు. 360 డిగ్రీస్ పారదర్శకత. → స్థూల, సూక్ష్మస్థాయిల్లో ప్రాజెక్ట్ పరిస్థితి, పనితీరు పరిశీలన. → వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం. → పట్టణ నియమ నిబంధనలు మార్పుల్పి క్షణాల్లో అప్డేట్ చేసుకోవచ్చు. → పాలసీ ఆధారిత అప్డేట్స్ను రిపోర్టులు, చట్టపర పత్రాల్లో అమలు చేయొచ్చు. → అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లిష్తో పాటు తెలుగు, ఉర్దూ భాషల్లోనూ ఉంటుంది. ఎన్ని అంతస్తులైనా.. → ఇప్పటి వరకు డ్రాయింగ్స్ పరిశీలనకే ఎన్నో రోజులు పట్టేది. బిల్డ్‌నౌతో 7.7 ఎకరాల విస్తీర్ణంలోని హైరైజ్ భవనాలకు, 33 అంతస్తులున్న 5 టవర్లకు, 12 అంతస్తుల ఎమినిటీస్ బ్లాక్‌కు, 22 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియా భవనాలకైనా 5 నిమిషాల్లోనే పరిశీలన పూర్తవుతుంది. → సింగిల్ విండోతో వివిధ ప్రభుత్వ విభాగాల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. → జియో ఇంటెలిజెన్స్‌తో ఆటోమేటిక్‌గానే మాస్టర్ప్లాన్లు, సంబంధితమైనవి పరిశీలిస్తుంది. → అడ్వాన్స్డ్ క్యాడ్ ప్లగిన్ భారీ భవనాలకు సైతం ఆర్కిటెక్టులు, ఇంజినీర్ల సమయాన్ని తగ్గస్తుంది. వారాలు, నెలల నుంచి రెండు మూడు రోజులకు తగ్గుతుంది. → క్యాడ్ ప్లగిన్ వినియోగానికి సంబంధించి వెబ్సైట్ నుంచి వన్ టూ వన్ వీడియో కన్సల్టేషన్ కూడా జరపొచ్చని చెబుతున్నారు. →సిటిజెన్ సెంట్రిక్ డిజైన్‌తో పనిచేస్తుంది. -
‘చంద్రబాబు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు’
హైదరాబాద్: ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలముందు సూపర్ సిక్స్ అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంలోకి వచ్చాక ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన హర్షకుమార్.. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల ఊసేలేదని విమర్శించారు.‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు , తల్లికి వందనం లేదు. పెన్షన్ పెంపు లేదు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఏపీలో ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు. అమరావతి , పోలవరం అంటూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో ఒకరిపై ఒకరు పొగడ్డలకే సరిపోయింది. తిరుపతిలో తలపెట్టిన మాలల సభను చంద్రబాబు అడ్డుకున్నారు. ఏపీలో పాశవిక పాలన సాగుతోంది. మాలలను, మాదిగలను వేరు చేసి రాజకీయాలకు వాడుకుంటున్నారు. మాలల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి ఓటమి రుచి చూపించారు. ప్రజల్లో పూర్తీ వ్యతిరేఖతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటోంది’ అని మండిపడ్డారు. -
సీఎం రేవంత్‌రెడ్డితో హరీష్‌రావు భేటీ.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డితో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు భేటీ అయ్యారు. ఆయన వెంట పద్మారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. సీఎంతో అరగంటకు పైగా హరీష్‌రావు మాట్లాడారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. భేటీ అనంతరం పద్మారావు మీడియాతో మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో ఉన్న సమస్య కోసం సీఎం దగ్గరకు వెళ్లామని పేర్కొన్నారు.‘‘మేము వెళ్లేసరికి సీఎం రూమ్ నిండా మంది ఉన్నారు. 15 నిమిషాల పాటు సీఎంతో ఏమీ మాట్లాడలేదు. పద్మారావు నియోజకవర్గంలో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కోరాం. సీఎం వెంటనే వేం నరేందర్ రెడ్డికి ఆ పేపర్ ఇచ్చి చేయమని చెప్పారు’’అని పద్మారావు తెలిపారు. పద్మారావు రమ్మన్నారని తాను కూడా వెళ్లినట్లు హరీష్‌రావు పేర్కొన్నారు.డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన మీటింగ్‌ను బహిష్కరించాం. చెన్నైలో జరిగే మీటింగ్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేయట్లేదు. డీఎంకే వాళ్ళు పిలిచారని మేము వెళ్తున్నాం. డీఎంకే మాకు ఫ్రెండ్లీ పార్టీ. ఘోష్ కమిటీ నివేదిక గురించి నాకు తెలియదు’’ అని హరీష్‌రావు చెప్పారు.కాగా, అంతకు ముందు.. సీఎం రేవంత్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి చెన్నై బయలుదేరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమినేషన్‌పై రేపు(శనివారం) చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి రేవంత్ హాజరుకానున్నారు. -
తెలంగాణ పరువు తీసిందెవరు?.. కవితపై సీతక్క సీరియస్
సాక్షి, హైదరాబాద్: సీఎం రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ శాసనమండలిలో కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. మీ కుటుంబమే పరువు తీసిందంటూ కవితపై మండిపడ్డారు. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది.. మీ కుటుంబమే.. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కరప్షన్‌కి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్.. మహిళలకు అడుగడుగున అన్యాయం చేసింది బీఆర్ఎస్సే’’ అంటూ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మొదటి ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవిలో మహిళలు లేరు. మహిళా కమిషన్‌కి సభ్యులు లేరు. మహిళలు పొదుపు చేసుకున్న రూ.1800 కోట్ల అభయ హస్తం నిధులు ఇవ్వలేదు. పావలా వడ్డీ ఇవ్వలేదు. మహిళ సంఘాలకు ఇవ్వాల్సిన రూ. 3700 కోట్ల వడ్డీలు చెల్లించలేదు. తెలంగాణను మీరు సస్యశ్యామలం చేస్తే.. రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారు’’ అంటూ సీతక్క ప్రశ్నించారు.‘‘మేము పంట కాలువలు మూసివేసినట్లుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి దోచుకుతున్నారు. మీరు నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారు?. మీరు చేయలేని ఉద్యోగాల భర్తీ మేం చేస్తున్నాం. 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. మీరు అన్ని చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు. బీఆర్ఎస్ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాలేదు. మీరు మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లతో వచ్చారు. మేము 65 సీట్లతో అధికారులకు వచ్చాము. పదేళ్లలో ఎన్ని ఇండ్లు ఇచ్చారు?’’ అంటూ సీతక్క నిలదీశారు.‘‘ప్రజలకు ఇళ్లు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. మేము వచ్చి 15 నెలలు అయింది.. అప్పుడే అన్ని కావాలన్నట్టుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు.. వారి పేరు పథకాలకు పెడితే ఎందుకంత కడుపు మంట?, మీరు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఎన్నో హామీలు తుంగలో తొక్కారు. రాష్ట్రం పరువు తీసింది మీరే.. తప్పుడు ప్రచారం చేయొద్దు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా అప్పల కోసమే కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది’’ అని సీతక్క హితవు పలికారు. -
తక్కువ వడ్డీకే రుణాలివ్వండి.. నాబార్డు ఛైర్మన్‌తో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ శుక్రవారం భేటీ అయ్యారు. ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్‌ను సీఎం కోరారు. మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని సీఎం కోరారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్‌కు రేవంత్ విజ్ఞప్తి చేశారు.స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరిన సీఎం.. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు స్కీమ్‌లు నిధులు మార్చి 31లోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలని సీఎం అన్నారు.స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు. కొత్త గ్రామ పంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నాబార్డు ఛైర్మన్ ప్రతిపాదించారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతోపాటు తాండూరు ఎమ్మెల్యె మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఉప్పల్ స్టేడియంలో ఎల్లుండి ఐపీఎల్ మ్యాచ్.. భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్ల రాచకొండ సీపీ సుధీర్ వెల్లడించారు. శుక్రవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ (IPL-2025) మ్యాచ్‌ల భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఉప్పల్ స్టేడియంలో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు. 2,700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని.. 300 మంది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్లో 1,218 మంది, 12 మంది బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఐపీఎల్ 2025 మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. రేపు (శనివారం) నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్-ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆదివారం (ఎల్లుండి) సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. -
లోన్ యాప్ నిర్వాహకులకు డీజీ షికా గోయల్ హెచ్చరికలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌ను ఏ విధంగా ఉపయోగించిన నిషేధమే. త్వరలోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్ హెచ్చరికలు జారీ చేశారు.తెలుగు రాష్టాలను కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో టాలీవుడ్ డొంక కదులుతోంది. తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మియాపూర్ వాసి ఫిర్యాదు మేరకు సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే 11 మందిపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారికి నోటీసులిచ్చి విచారణ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారంపై శిఖా గోయల్ స్పందించారు. 2022 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 797 బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులు నమోదు చేశాం. చట్ట ప్రకారం కఠినంగా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై చర్యలు తీసుకుంటాం.దేశంలోని 133 బెట్టింగ్ యాప్ కంపెనీలను గుర్తించాం. అందులో కొన్నిటికి బెట్టింగ్ యాప్ నిర్వహణను ఆపాలని ఆదేశాలు జారీ చేశాం. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌ను ఏ విధంగా ఉపయోగించిన నిషేధమే లోన్ యాప్‌లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్‌లో మోసం.. ప్రాణం తీసుకున్న యువకుడు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ప్రముఖులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి మోసపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గోదావరిఖని అనిల్ డయాగ్నస్టిక్స్‌లో వర్క్ చేస్తున్న కొరవీణ సాయి తేజ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టాడు. మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
బెట్టింగ్ యాప్స్ కేసు.. చిరు ప్రస్తావన తెచ్చిన సీపీఐ నారాయణ
న్యూఢిల్లీ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. చేతి నిండా అవకాశాలు ఉన్నవాళ్లు కూడా తప్పుడు పనులతో డబ్బు సంపాదించుకోవడం ఎందుకు? అని ప్రశ్నించారాయన.సినీ నటులను ప్రజలు అనుసరిస్తుంటారు. ఆ విషయం వాళ్లు గమనించాలి. కళామతల్లి ఇచ్చే గుర్తింపును బెట్టింగ్ వంటి తప్పుడు పనులకు దుర్వినియోగం చేయవద్దు. సినీ నటులు ఇప్పటికే చేతినిండా సంపాదించుకుంటున్నారు. సినిమా అవకాశాలు రాకపోతే.. ఓటీటీ సహా ఎన్నో అవకాశాలు ఉండనే ఉన్నాయి. అలాంటప్పుడు సినిమావాళ్లకు ఈ పాడు సంపాదన దేనికి? గుట్కా విషయంలో అప్పట్లో ఒక పనికిమాలిన తీర్పు వచ్చింది. దాన్ని ఆసరా చేసుకుని కొందరు పాన్ పరాగ్ పేరుతో అనైతిక వ్యాపారం చేస్తున్నారు అని మండిపడ్డారాయన. ఈ క్రమంలో గతంలో మెగాస్టార్ చిరంజీవికి తాను రాసిన ఓ లేఖ సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో చిరంజీవి ఓ శీతల పానీయం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటనలు ఇచ్చారు. అప్పుడు ఆయనకు నేనొక లేఖ రాశాను. ఓవైపు రక్తదానం చేస్తూ.. మరోవైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారు? అని ఆయన్ని ప్రశ్నించా. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆ ప్రకటనలు చేయనని ఆయన చెప్పారు. ఆ తర్వాత చెయ్యలేదు కూడా’’ అని నారాయణ అన్నారు. -
బీఆర్ఎస్కు ఎలా కౌంటరివ్వాలో మాకు తెలుసు: భట్టి
Telangana Assembly session Updates..👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై చర్చ..బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్.. 👉బడ్జెట్లో మూల ధన వ్యయం తగ్గిస్తున్నారు. బడ్జెట్లో సూక్తి ముక్తావళి చాలా ఉంది. కానీ, వాస్తవం చూస్తుంటే కమీషన్ల ప్రభుత్వంలా కనిపిస్తుంది. నిధులు లేక వ్యవస్థలు కూనరిల్లుతున్నాయి. సచివాలయంలో ధర్నాలు ఎన్నడూ చూడలేదు. తెలంగాణ నమూనా ఏంటో అర్థం కావడం లేదు. కూల్చివేతల్లోనా, కమీషన్లలోనా అర్థం కావడం లేదు. భూసేకరణ పేరుతో పేద, గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 15 నెలల్లోనే లక్షా 63వేల కోట్లు అప్పులు చేశారు. కేంద్రం నుంచి పొందిన సాయాన్ని గుర్తుచేస్తే బాగుండేది. ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించక పోవడం బాధాకరం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్ చాట్..బడ్జెట్‌పై హరీష్ రావు స్పీచ్ పొలిటికల్ విమర్శలే ఉన్నాయి.బడ్జెట్‌పై హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడలేదు.హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడుతారు అని చూసాం కానీ మాట్లాడలేదు.మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టే అంత సమయం ఇచ్చాం.మాకు ఎలాంటి రాగద్వేషాలు లేవు.హరీష్ రావు.. ఆర్ఆర్ టాక్స్ వ్యాఖ్యలకు సరైన సమయంలో స్పందన ఉంటుంది.బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఎప్పుడు ఎలా కౌంటర్ ఇవ్వాలో మాకు తెలుసు.మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్..పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ తయారు కాబోతోంది.సెంట్రల్ హాల్ తయారు చేయాలని ఆలోచన జరుగుతుంది.కౌన్సిల్ రెడీ అవ్వగానే మధ్యలో హాల్ రెడీ అవుతుంది.అందరికీ కూర్చునే విధంగా హాల్స్ రెడీ చేస్తాం. 👉సభలో బడ్జెట్‌పై ప్రసంగాన్ని ప్రారంభించిన హరీష్ రావు.కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.భట్టి బడ్జెట్ మీద నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు మొండి చెయ్యి చూపారు.ఈ ఏడాదైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన వారి ఆశల మీద భట్టి బకెట్ల కొద్దీ నీళ్లు చల్లారు.ఎన్నికల ముందు రేవంత్ నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ చుట్టూ అంగ ప్రదక్షిణం గావించారు.ఊరూరు బస్సు యాత్రలు చేసి రెచ్చగొట్టారు.నిరుద్యోగులను మీ పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని ఇల్లిల్లూ తిప్పారు.నాడు నమ్మించారు, నేడు నిండ ముంచారు.ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుష్ర్పచారం చేసారు.తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నిధులు, నీళ్లు, నియామకాలు నెరవేర్చిన ప్రభుత్వం మాది.తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది. ముల్కీ రూల్స్ నుంచి 610 దాకా తెలంగాణ పోరాడింది దేని కోసం?స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని. మా ఉద్యోగాలు మాకు కావాలని. అదే చేసిండు కేసీఆర్60-80శాతం మాత్రమే ఉండే స్థానిక రిజర్వేషన్ ను 95శాతానికి పెంచిండు.అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించిండు.ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసింది కేసీఆర్తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్షరాల లక్షా 62వేల ఉద్యోగాలు భర్తీ చేసినం.ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే మీ ప్రచారం విష ప్రచారం.అబద్దమే మీ ఆత్మ. అబద్దమే మీ పరమాత్మ.ఇదే కాదు నీ జాబ్ క్యాలెండర్ సంగతి, నీ నిరుద్యోగ భృతి సంగతి, నువ్వు చెబుతున్న 57 వేల ఉద్యోగాల తప్పుడు లెక్కల సంగతి తేలిపోయింది.జాబుల్లేని క్యాలెండర్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ అంటారా?మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఏడాదిన్నరగా పంచుతున్నవు తప్ప, నువ్వు వెలగబెట్టింది ఏమి లేదు.మీరు చెప్పుకుంటున్న 57వేల ఉద్యోగాల్లో మేం ఇచ్చినవే 50వేలు. ఆరు వేల పోస్టులు కూడా ఇవ్వలేదు.15నెలల పాలనలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చి, భర్తీ చేసిన పోస్టులు ఎన్ని?గ్రామపంచాయతీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు.ప్రభుత్వానికి అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు సవాల్భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గమైనా? సిద్దిపేట నియోజకవర్గమైనా?పూర్తిగా 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్తాను. కృష్ణ జలాలపై ప్రభుత్వం పోరాటం చేయాలి.575 టీఎంసీలను తెలంగాణకు తీసుకురావాలి.కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ సెక్షన్స్-3 తీసుకొచ్చారు.గతంలో నేను కేసీఆర్ సంతకాలు పెట్టినట్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.అక్కడ ఆదిత్య నాథ్, తెలంగాణ నుంచి ఎస్కే జోషి మాత్రమే సంతకాలు చేశారు.కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుంది.కృష్ణా జలాలపై ప్రత్యేక చర్చ పెట్టాలి. చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం.ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే ప్రజలకు తెలుస్తుంది.హరీష్ కామెంట్స్.. మెగా డీఎస్సీ పేరుతో మోసం చేశారు. సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలపై నమ్మకం పోయింది. ఫీజు రియింబర్స్‌మెంట్‌పై గొప్పలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. శ్రీధర్ బాబు కామెంట్స్..నీటి వాటాలపై ప్రత్యేకమైన చర్చ పెడదాం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నీళ్ల వాటాల గురించి స్పష్టమైనటువంటి వైఖరిని తెలిపారు.శాసన మండలిలో జూపల్లి కామెంట్స్..బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది..తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షకు అనుగుణంగా పాలన జరగలేదు.మంత్రి జూపల్లి వాఖ్యల పట్ల బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం..సభలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ సభ్యులు.. హరీష్ రావు కామెంట్స్..👉బడ్జెట్‌పై మాట్లాడుతుంటే అధికారపక్షం నేతలు అడ్డుకుంటున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు రుణమాఫీ చేయడం లేదు. కాంగ్రెస్ పాలనలో రైతులది ఒడవని దుఖం. ఒక్క సిద్దిపేటలోని రూ.2లక్షల రుణమాఫీ కాని వారు 10వేల మంది ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు విషయంలో రికార్డు సృష్టించాం. పన్నులు లేకుండా సాగు నీళ్లు ఇవ్వండి. రుణమాఫీ కాని రైతులందరికీ విడుదల చేయాలని కోరుతున్నాం. సంపూర్ణ రుణమాఫీ జరిగితే నేను బహిరంగ క్షమాపణలకు సిద్ధం. హరీష్ రావు కామెంట్స్..మహాలక్ష్మి 2500, పెన్షన్ పెంపు, వితంతువు పెన్షన్ముఖ్యమంత్రి మంచి కళాకారుడు, వక్త.ఆరు గ్యారెంటీలను బడ్జెట్లో మరిచిపోయారు.పెన్షన్ 4000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని వృద్ధులు కాలం చేస్తున్నారు.కొత్త పెన్షన్స్ లేవు, 4000 పెంపు లేదు, కోత మాత్రం లక్ష మందికి చేశారు.తెలంగాణలో కోటి మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధిదారులు ఉన్నారు.లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. 👉హరీష్ రావు బుద్ధి మాన్యం అనే పదాన్ని అభ్యక్షన్ చేసిన స్పీకర్👉బుద్ధిమాన్యం తప్పేమీ కాదని నిండు సభలో బట్టలూడదీసి కొడతా అని సీఎం అనడం కరెక్టా అంటూ హరీష్ వాదన.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..బుద్ధి మాన్యం అనే వ్యాఖ్యను ఖండిస్తున్నాం.స్పీకర్ అభ్యంతరం చెప్పినప్పుడు ఏకీభవించాలి.జగదీష్ రెడ్డి తరహాలో హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు.స్పీకర్ అభ్యంతరానికి హరీష్ రావు అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదు.బడ్జెట్ పరిధి దాటి అడ్డగోలు వ్యాఖ్యలు హరీష్ రావు చేస్తున్నారు.మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..సభ్యుల సంఖ్య ప్రకారం అందరికీ అవకాశాలు ఇస్తున్నాం.కాంగ్రెస్ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 30 నిమిషాలు ఉంటుంది.బీఆర్ఎస్ సభ్యుల ప్రకారం 19 నిమిషాలు.బిజెపికి ఏడు నిమిషాలు, ఎంఐఎంకి ఐదు నిమిషాలు.హరీష్ రావు కామెంట్స్..నన్ను మాట్లాడమంటే మాట్లాడతా లేదంటే వెళ్ళిపోతాను.ప్రతి చిన్న విషయానికి ఇంట్రప్షన్ చేస్తే కుదరదు. 👉హరీష్ వ్యాఖ్యలు.. భూములను అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా రూ.50వేల కోట్లు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అనుముల వారి పాలనలో ఎన్నికల భూములు అమ్ముతారో చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక మాంద్యం తెలంగాణలో ఉందంటున్నారు. అంచనాలకు అనుగుణంగా రీచ్ అవుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. స్టాంప్, రిజిస్ట్రేషన్ ఆదాయం తెలంగాణలో తగ్గింది. తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి నినాదం ఇస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఉంది?. 👉కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర బుద్ధి రేటు 5.5% ఉంటే బడ్జెట్లో 20% ఉంది అన్నట్లు చెప్పారు. ఆర్థిక మాంద్యం దేశమంతా ఉంటే కర్ణాటకలో ఎందుకు లేదు?. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జీఎస్టీ వృద్ధిరేటు దేశం కంటే ఏనాడు తక్కువ లేదు కాంగ్రెస్ పాలనలో తగ్గింది. గత బీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ రాగానే అన్ని ఎందుకు తగ్గిపోయాయి?. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారు, ఎయిర్‌పోర్టుకు మెట్రో రద్దు అన్నారు, మూసీ ప్రక్షాళన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పెట్టుబడులు రాకుండా పోయాయి అని కామెంట్స్ చేశారు. 👉హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన..హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేసిన విప్‌లు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్..వైఎస్సార్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేశారు.ఎన్నికలకు రెండు మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్డును కమీషన్లకు కకుర్తిపడి అమ్ముకున్నారుబీఆర్ఎస్ కోకాపేటా యాక్షన్ అంతా మాకు తెలుసు.బీఆర్ఎస్ నాయకుల బినామీలు వంద కోట్లకు కొనుగోళ్లను ఎవ్వరూ మర్చిపోలేదు.రోడ్డును ఎవరైనా అమ్ముకుంటారా?చరిత్ర మర్చిపోయి ఎవ్వరూ మర్చిపోలేదు👉మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కామెంట్స్..అధికారంలో ఉన్న వాళ్లకు ఓపిక ఉండాలి.ప్రభుత్వం ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎల్ఏ మినిస్టర్ ఉన్నారు.హరీష్ రావు మాట్లాడేటప్పుడు ప్రతిసారి అడ్డుకోవద్దు. 👉ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కామెంట్స్..శ్రీనివాస్ యాదవ్ నీతులు మాకు కాదు వాళ్ల పార్టీ వాళ్లకు చెప్పుకోవాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి.వాస్తవాలకు దూరంగా మాట్లాడినప్పుడు స్లోగన్స్ ఇవ్వడం తప్పేమీ కాదు.అడ్డగోలుగా మాట్లాడతాము అంటే మౌనంగా ఉండలేం.హరీష్ రావుకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.👉హారీష్‌రావు కామెంట్స్..గత బడ్జెట్లో భట్టి విక్రమార్క చెప్పిన విషయాలను ప్రస్తావించిన హరీష్. గత సంవత్సరం బడ్జెట్‌ను సమీక్షించుకుందాం. ఫార్మాసిటీ భూములపై నాడు పోరాటం చేశారు. ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారు. అలాగే, రుణమాఫీకి 31వేల కోట్లు సిద్ధం చేశామని గత బడ్జెట్లో చెప్పారు. ఇప్పుడు 21వేల కోట్లు రుణమాఫీ చేశామని అంటున్నారు. చేతగాని వాళ్లు ఎవరో ప్రజలకు అర్థమైంది.👉ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. రైతు భరోసా 15వేలు ఇస్తామన్నారు. వానాకాలంలో ఎగబెట్టారు. యాసంగిలో 12వేలు అన్నారు. అది కూడా సరిగా అందలేదు. కౌలు రైతులకు 12వేలు ఇస్తామన్నారు. ఇప్పడు, రైతులు, కౌలు రైతులే తేల్చుకోవాలంటున్నారు. కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్‌గా క్యాలెండర్‌గా మారింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్‌లో 27వేల కోట్లు తక్కువ చేసి చూపారు.👉హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెస్తామంటున్నారు. హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రభుత్వ భూములు అమ్మవద్దన్న వారే అప్పుడు అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. బడ్జెట్లో ప్రజలను మాయచేసే ప్రయత్నం చేశారు.👉జాబ్ క్యాలెండర్‌పై నిలదీస్తే నిరుద్యోగులను అశోక్‌నగర్‌లో అరెస్ట్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు?.. ఉద్యోగాలు ఇచ్చారా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా?. ఆర్ఆర్ఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరమైనా భూసేకరణ చేసిందా?. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడు ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. ఇవి అవాస్తవిక అంచానాలని ఆనాడే చెప్పాను. 👉ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు అసెంబ్లీ, కౌన్సిల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు.👉అలాగే, సివిల్ సప్లై కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.👉లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు. -
వడగళ్ల వాన అలర్ట్.. ఏపీ, తెలంగాణలో రెండు రోజులు వర్షాలే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ద్రోణి కారణంగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక, రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.ద్రోణి తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు తగ్గొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.Moderate Rainfall Recorded at Nirmal & Nizamabad.Upto 2:00 Am Nirmal 20.3 mm Rainfall#TelanganaRains pic.twitter.com/GPi65UJqZf— Telangana Weather Forecast....🛰⛈️ (@SkyForecastMaN4) March 20, 2025మరోవైపు.. ఇప్పటికే గురువారం రాత్రి పలు జిల్లాలో వర్షం కురిసింది. జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర పంట నష్టం జరిగే అవకాశం ఉంది. Weather update!!Now scattered thunder storm rains going in nizamabad, Nirmal district later into jagtial places cover 🌧️— Telangana state Weatherman (@tharun25_t) March 20, 2025ఇక, ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి కారణంగా గంటకు 40-50 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
జగదేక నగరానికి అతిలోక సుందరి
సాక్షి, హైదరాబాద్: అప్పుడెప్పుడో ఓ సినిమాలో అంగుళీయకం కోసం అతిలోక సుందరి దివి నుంచి భువికి దిగొచ్చింది. ఇప్పుడు.. అంగుళీయకం పోకున్నా.. అతిలోక సుందరీమణులెందరో అందాల పోటీల కోసం భాగ్యనగరానికి తరలిరానున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అద్భుతమైన వేడుక ‘మిస్ వరల్డ్ 2025’ నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమవుతోంది.మే 7 నుంచి 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి స్టేడియం, గచ్చిబౌలి ఐఎస్బీ, టీ–హబ్, శిల్పకళావేదిక.. ఇలా పలు వేదికల్లో సుందరీమణులు వారి ప్రత్యేకతను చాటుకుని జగజ్జేతగా నిలిచేందుకు పోటీ పడనున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పోటీలు కావడంతో భాగ్యనగర పేరు ప్రఖ్యాతులు కూడా మరింత విశ్వవ్యాప్తం కానున్నాయి.గతంలో రెండుసార్లు.. మన దేశంలో ఇప్పటివరకు రెండు పర్యాయాలు ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. 1996లో తొలిసారి బెంగళూరు ఇందుకు వేదికైంది. ఆ తర్వాత గతేడాదే 71వ ఎడిషన్ పోటీలకు ముంబై ఆతిథ్యమిచ్చింది. ఇక వరుసగా రెండోసారి.. 72వ ఎడిషన్‌కు కూడా మన దేశమే వేదిక కానుంది. ఇతర దేశాల్లో పోటీలు జరిగినప్పుడు ఏర్పాట్లు ఘనంగా ఉన్నా, భారీ జనసందోహంలో కార్యక్రమాలు జరిగేవి కాదు. అయితే గతేడాది ముంబైలో జరిగినప్పుడు, ఈ కార్యక్రమానికి జనం బ్రహ్మరథం పట్టారు.దీంతో మిస్ వరల్డ్ నిర్వాహకులకు ఇది క్రేజీగా కనిపించింది. దీంతో మరోసారి భారత్‌లోనే నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. నిర్వాహకులతో మాట్లాడి ఒప్పించే బాధ్యతను పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు అప్పగించింది. ఆమె నిర్వాహకులను ఒప్పించడంలో సఫలీకృతం కావడంతో హైదరాబాద్‌కు అరుదైన అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడే ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది.అప్పటి నుంచే ఆయన నిర్వాహకులతో సంప్రదింపులకు సన్నాహాలు ప్రారంభించారు. కాగా ఈసారి 140 దేశాల సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ఆయా కార్యక్రమాలను కవర్ చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 3,300 మంది మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు. బికినీలకు నో.. ప్రపంచ సుందరి పోటీల్లో పలు అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. వాటిల్లో కొన్నింటిలో బికినీల్లాంటి వ్రస్తాలు ధరించాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో శరీరాన్ని ప్రదర్శించే విధంగా వస్త్రధారణ ఉండొద్దని ప్రభుత్వం నిర్వాహకులకు ముందుగానే షరతు విధించింది. ఆయా దేశాల సంప్రదాయ, కాస్త ఆధునిక వ్రస్తాలు ధరించొచ్చని, ఒక పోటీలో పూర్తిగా భారతీయ సంప్రదాయ వ్రస్తాలే ధరించాలని సూచించింది. దీనికి నిర్వాహకులు అంగీకరించారు. గచ్చిబౌలి స్టేడియం టూ హైటెక్స్.. అందాల పోటీల్లో పాల్గొనే సుందరీమణులు మే 6, 7 తేదీల్లో నగరానికి చేరుకుంటారు. 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుక ఘనంగా జరుగుతుంది. తెలంగాణ జానపద, గిరిజన నృత్యాభినయ ఇతివృత్తంతో ఇది ఉంటుంది. నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, టీ–హబ్, శిల్పకళావేదిక, ఐఎస్బీ క్యాంపస్, హైటెక్స్ వేదికల్లో వివిధ అంశాల్లో పోటీలు జరుగుతాయి. వాటిని మిస్ వరల్డ్ నిర్వాహకులే ఎంచుకున్నారు. రాష్ట్రంలో పర్యటనలు ఇలా.. పోటీలు జరిగే సమయంలో సుందరీమణులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. ఆ సందర్భంలో వారందరితో పోచంపల్లి చీరలు కట్టించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వారిని తీసుకెళుతుంది. 40 మందిని ఒక బృందంగా ఏర్పాటు చేసి, ఒక్కో బృందాన్ని ఒక్కోచోటకు తీసుకెళ్తారు. బుద్ధవనం: 12న ఓ బృందం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం సందర్శిస్తుంది. బౌద్ధం ఇతివృత్తంగా ఇది సాగుతుంది. చార్మినార్: 13న సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ఓ బృందం చార్మినార్, లాడ్‌బజార్‌లలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తుంది. అక్కడ షాపింగ్ చేస్తారు. చౌమొహల్లాలో డిన్నర్: 13న చౌమొహల్లా ప్యాలెస్‌లో ప్రత్యక్ష సంగీత విభావరి నడుమ పోటీదారులు విందులో పాల్గొంటారు. కాళోజీ కళాక్షేత్రం: 14న అమెరికా–కరేబియన్ ప్రాంతాల పోటీదారులు వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉదయం 11 నుంచి 2 వరకు అక్కడ స్థానికులు, విద్యార్థులతో ముచ్చటిస్తారు. రామప్ప: సాయంత్రం 5 నుంచి 7 వరకు యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ పేరిణి నృత్యరీతులతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు. యాదగిరిగుట్ట: యూరప్‌నకు చెందిన పోటీదారుల బృందం 15న మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు యాదగిరిగుట్ట దేవాలయాన్ని సందర్శిస్తుంది. పోచంపల్లి: యూరప్‌నకు చెందిన రెండో బృందం 15న సాయంత్రం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ గుర్తించిన పోచంపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడి చేనేత వస్త్ర తయారీ కేంద్రాలను పరిశీలిస్తారు. మెడికల్ టూరిజం: 16న ఆఫ్రికా, మధ్య ప్రాచ్య (మిడిలీస్ట్) దేశాలకు చెందిన పోటీదారులు మెడికల్ టూర్లలో భాగంగా నగరంలోని అపోలో, ఏఐజీ, యశోదా ఆసుపత్రులను సందర్శిస్తారు. స్పోర్ట్స్ ఫైనల్: స్పోర్ట్స్ ఫైనల్ కార్యక్రమం 17న ఉదయం ఏడున్నర నుంచి పదిన్నర వరకు గచి్చబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. కల్చరల్, మ్యూజిక్, డాన్స్, ఫుడ్ ఆర్ట్ : 17న సాయంత్రం నగర శివారులోని ఎకో టూరిజం పార్కులో జరిగే కల్చరల్, ఫుడ్, ఆర్ట్ ఫెస్టివల్లో పాల్గొంటారు. సేఫ్టీ టూరిజం: నగరంలో పోలీసింగ్ తీరును పరిశీలించేందుకు 19న పోటీదారులు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శిస్తారు. సచివాలయం: 19న హుస్సేన్‌సాగర్ తీరం, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం ప్రాంతాలను సందర్శిస్తారు. టీహబ్: 20, 21 తేదీల్లో టీహబ్‌లో మిస్ వరల్డ్ కరేబియన్, మిస్ వరల్డ్ ఆఫ్రికా, మిస్ వరల్డ్ ఏషియా, ఓషియానియాల మధ్య కాంటినెంటల్ ఫినాలే ఉంటుంది. శిల్పారామం: 21న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు శిల్పారామంలో ఆర్ట్స్ క్రాఫ్టŠస్ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. శిల్పకళావేదిక: 22న శిల్పకళావేదికలో టాలెంట్ ఫినాలే జరుగుతుంది. ఐఎస్బీ: గచ్చిబౌలిలోని ఐఎస్బీలో 23న హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ ఫినాలే జరుగుతుంది. హైటెక్స్: 24న హైటెక్స్‌లో మోడల్ అండ్ ఫ్యాషన్ ఫినాలే జరుగుతుంది. హైటెక్స్‌లోనే 25న నగలు వజ్రాభరణాల ఫ్యాషన్ షో జరుగుతుంది. బ్రిటిష్ రెసిడెన్సీ: 26న బ్రిటిష్ రెసిడెన్సీ, తాజ్ ఫలక్‌నుమాలలో పర్పస్ ఈవెంట్ గలా డిన్నర్ ఉంటుంది. ప్రముఖ కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శన ఉంటుంది. హైటెక్స్: మే 31న పోటీల తుది పోరు (గ్రాండ్ ఫినాలె). సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఒంటిగంట వరకు కొనసాగుతుంది. రాష్ట్రావతరణ దినోత్సవంలో ప్రపంచ సుందరి ఈసారి పరేడ్ మైదానంలో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవంలో ప్రపంచ సుందరి సందడి చేయనుంది. మే 31న జరిగే తుదిపోరులో ఏ దేశానికి చెందిన సుందరి విజేతగా నిలుస్తుందో ఆమె.. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మిస్ వరల్డ్ లిమిటెడ్ నిర్వాహకులు అంగీకరించారు.మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న సుందరితో పాటు, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన మొదటి, రెండో రన్నరప్‌లు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నట్టు తెలిసింది. పరేడ్ మైదానంలో జరిగే ముఖ్య కార్యక్రమాలతో పాటు ఆరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి కూడా వారు హజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ గవర్నర్ ఏర్పాటు చేసే హై టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొంటారు. -
‘దేవా’.. ఒక్క మోటారు!
సాక్షి, హైదరాబాద్: ఒక్క మోటార్‌పై 50 వేల నుంచి 65 వేల ఎకరాల్లోని పంటల మనుగడ ఆధారపడి ఉంది. దేవాదుల ప్రాజెక్టు కింద ప్రస్తుత యాసంగిలో సాగు చేస్తున్న ఈ పంటలు మరో రెండు వారాల్లో చేతికొచ్చే దశలో ఉండగా, తీవ్ర నీటి కొరత కారణంగా ఎండిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ కింద దేవన్నపేట వద్ద కొత్తగా నిర్మించిన పంప్‌హౌస్‌లో ఒక్కొక్కటి 31 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు మోటార్లుండగా.. కనీసం ఓ మోటారునైనా యుద్ధప్రాతిపదికన వినియోగంలోకి తేవడం ద్వారా ఆ పంటలకు గోదావరి జలాలను మళ్లించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది.ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి గత 10 రోజులుగా అక్కడే ఉండి పంప్‌హౌస్‌ను సిద్ధం చేసే పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరిలు.. మోటార్‌ను ఆన్ చేసి నీటిని విడుదల చేసేందుకు పంప్‌హౌస్ వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు నిరీక్షించినా సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరిగి వచ్చేశారు.ఇవి ఆస్ట్రియాకి చెందిన ఆండ్రీజ్ కంపెనీ మోటార్లు కావడంతో ఆ దేశం నుంచి సాంకేతిక నిపుణులు పంప్‌హౌస్‌కు చేరుకుని సాంకేతిక అడ్డంకులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాటికి మోటారు సిద్ధం చేసి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి నీళ్లను ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ తాజాగా మంత్రి ఉత్తమ్‌కు సమాచారమిచ్చింది. అదే జరిగితే ధర్మసాగర్లో నిల్వలు పెరిగి అక్కడి నుంచి ఇతర రిజర్వాయర్లకు నీటిని తరలించి స్టేషన్‌ఘన్‌పూర్, హుస్నాబాద్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల ప్రాంతంలోని పంటలకు సరఫరా చేసేందుకు అవకాశం కలగనుంది. 800 క్యూసెక్కులు సరఫరా చేస్తేనే.. దేవాదుల ఎత్తిపోతల కింద 1,28,280 ఎకరాల్లో ఆరుతడి, 70,350 ఎకరాల్లో వరి కలుపుకుని మొత్తం 1,98,630 ఎకరాలకు నీరు అందించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల కింద రాష్ట్రంలో సాగుచేస్తున్న పంటలకు సరిపడా నీళ్లు అందుతుండగా, దేవాదుల ప్రాజెక్టు కిందే తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేవన్నపేట పంప్‌హౌస్‌లోని ఒక మోటార్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చి 800 క్యూసెక్కులను నీటిని సరఫరా చేయగలిగితే అంత మేరకు పంటలను రక్షించుకోగలుగుతామని ప్రభుత్వం భావిస్తోంది. ప్రమాదాలు నివారించే పనుల వల్లే ఆలస్యం పంప్‌హౌస్ నిర్మాణం చాలా రోజుల కిందే పూర్తికాగా, రక్షణ చర్యల్లో భాగంగా పైపులకు సిమెంట్ ఇన్కేసింగ్ పనులు చేయాలని నిపుణులు సూచించారు. పంప్‌హౌస్ లోతు ఎక్కువగా ఉండడంతో నీళ్లు వెనక్కి తన్ని వచ్చినప్పుడు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని గుర్తించడంతో ఈ సిఫారసు చేశారు. గత రెండు నెలలుగా ఈ పనులు జరుగుతుండగా, ఇప్పటికే రెండు మోటార్లకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఇందులో ఒక మోటార్‌ను తక్షణమే వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. మూడో దశ పూర్తైతే ..రైతు దశ తిరిగినట్టే..! సమ్మక్కసాగర్ బరాజ్ బ్యాక్‌వాటర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకం నీళ్లను తరలించనుండగా, ప్రస్తుతం సమ్మక్కసాగర్‌లో 2.5 టీఎంసీల నిల్వలున్నాయి. రోజూ 1500 క్యూసెక్కుల వరద వస్తోంది. దేవాదుల తొలిదశ కింద 5.18 టీఎంసీలు, రెండో దశ కింద 7.25 టీఎంసీలు, మూడో దశ కింద 25.75 టీఎంసీలు కలిపి మొత్తం 38.16 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి మొత్తం 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇప్పటికే తొలి రెండు దశల పనులు పూర్తయ్యాయి. మూడో దశ కూడా పూర్తైతే ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతు దశ తిరగనుంది. -
పేరు గొప్పగుంది.. అప్పు పుట్టకుంది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘గత పాలకులు రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ.8 వేల కోట్లు బకాయిలు పెట్టి పోయారు. నెలకు కొంతమందికి అవసరానికి అనుగుణంగా సర్దుతున్నాం. మరోవైపు కొత్తగా నెలకు వెయ్యి మంది రిటైర్ అవుతున్నారు. వారికి బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవు. ఎక్కడా అప్పు పుడ్తలేదు.. ఎవ్వడు మనల్ని నమ్మడం లేదు. పేరు చూస్తే గొప్పగ ఉంది.. అప్పు పుట్టకొచ్చింది (పుట్టడం లేదు). ఎన్నిరోజులు దాచిపెట్టుకోను. క్యాన్సర్ ఉంటే సిక్స్‌ప్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతరా? ఉన్నదున్నట్లు చెపుతున్న..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గురువారం సాయంత్రం ‘ప్రజాపాలన..కొలువుల పండుగ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో.. పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో 922 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు ఆయన అందజేశారు. అలాగే రాష్ట్రంలో కొత్త భవన నిర్మాణాలకు సంబంధించి ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం ‘ఆన్లైన్’లో దరఖాస్తు చేసుకున్న ముగ్గురికి అనుమతి పత్రాలు అందజేసిన అనంతరం ప్రసంగించారు. ఆ డబ్బే ఉండుంటే అద్భుతాలు చేసేవాణ్ణి.. ‘ఒక ప్రాజెక్టుకు డీపీఆర్ ఇచ్చి, పద్ధతి ప్రకారం అప్పు తీసుకుంటే 4 శాతం వడ్డీకి అప్పులు ఇచ్చేందుకు ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ గుట్టుగా కమీషన్ల కోసం కాళేశ్వరానికి 11 శాతం వడ్డీతో అప్పు తెచ్చారు. దాన్ని 5 శాతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా. అప్పటి పాలకులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే నేను సీఎం అయ్యాక రూ.1.53 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన. ఇందులో రూ.88వేల కోట్లు అసలు, రూ.66 వేల కోట్లు మిత్తి కింద కట్టిన. ఈ డబ్బు నాదగ్గర ఉండుంటే గంటలోనే రుణమాఫీ చేసేవాడిని. 25 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చేవాడిని. ఎన్నో అద్భుతాలు చేసేవాణ్ణి. అప్పట్లో రోజుకు లక్ష టన్నుల చొప్పున ఇసుక దోచుకున్నరు. రూ.7 వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో రైతుబజార్ల తరహాలో ఇసుక బజార్లు పెట్టి మూడు ప్రాంతాల్లో అమ్ముతున్నం. అంతా ఆన్లైన్లోనే..’ అని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలి ‘ప్రజలు మాపై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు. ఎందుకు మాపై కోపం?. నిరుద్యోగులకు ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తున్నందుకా..? అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించినందుకా? రేవంత్‌రెడ్డికి పాలనపై పట్టు రాలేదని మాట్లాడుతున్నారుం. రాజయ్య, ఈటల లాంటి బలహీనవర్గాల వారిని సస్పెండ్ చేస్తేనే పట్టు వచ్చినట్టాం? మేం గడీలలో పెరగలేదు. నల్లమల అడవుల్లో పేదలను చూస్తూ పెరిగాంం. అందుకే మాకు మానవత్వం ఉంది.. మీకు లేదు. ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలిం. మేం విజ్ఞత ప్రదర్శిస్తున్నాం. ఆ విజ్ఞత లేకపోవడం వల్లే ఆయన ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు..’ అని రేవంత్ విమర్శించారు. మిస్ వరల్డ్ పోటీలతో వందల కోట్ల ఆదాయం ‘మిస్ వరల్డ్ పోటీలపై కూడా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పర్యాటక రంగానికి ఇదొక అద్భుతమైన అవకాశం. ప్రపంచం తెలంగాణ వైపు చూడబోతోంది. మే 7 నుంచి 31 వరకు ఈ పోటీలు ఇక్కడ జరగబోతున్నాయి. వేలాది మంది విదేశీయులు రాబోతున్నారు. వివిధ రంగాలకు ఉపాధి లభిస్తుంది. 3 వేల విదేశీ ఛానెల్స్, పత్రికలు రాబోతున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. భవిష్యత్‌లో వందల కోట్ల ఆదాయం రాబోతోంది. ఫార్ములా–ఈ రేస్ ముసుగులో మీరు ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. మీకు, మాకూ పోలికా? పట్టింపులేకుండా వ్యవహరించిన విధానం మీదిం. పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం మాది. త్వరలోనే యాదగిరిగుట్టను వైటీడీ బోర్డు ద్వారా విశ్వవ్యాప్తం చేయబోతున్నాం..’ అని సీఎం తెలిపారు. ఈ ఉద్యోగాలు మీ హక్కు ‘ఈ కారుణ్య నియామకాలు మీ హక్కు. మీ కుటుంబసభ్యుల నుంచి వారసత్వంగా మీకు రావాల్సిన ఉద్యోగాలు ఇవి. గత పాలకులు ఈ నియామకాలను పట్టించుకోలేదంటే.. ఎంత నిర్లక్ష్యం వహించిందో ఆలోచించండి. అలాంటి నిర్లక్ష్యం ప్రజా ప్రభుత్వంలో ఉండకూడదనే ఈ నియామకాలు పూర్తి చేస్తున్నాం. మేం అధికారంలోకి రాగానే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్ 1, 2, 3లలో 2 వేల పైచిలుకు ఉద్యోగాలకు మరికొన్ని రోజుల్లో నియామక పత్రాలు అందించబోతున్నాం..’ అని రేవంత్ తెలిపారు. అక్రమాలు అరికట్టేందుకే ‘బిల్డ్ నౌ’ పోర్టల్ ‘హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు అరికట్టేందుకే ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌ను తీసుకొచ్చాం. ఎంతటివారైనా సరే ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సిందే. ప్రజలకు పారదర్శక పరిపాలన అందించాలన్నదే మా ఉద్దేశం.. అదే గుడ్ గవర్నెన్స్.. ఇది తెలంగాణ మోడల్..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రి ధనసరి అనసూయ, ఎమ్మెల్యేలు వీర్ల శంకర్, కాలె యాదయ్య, సీఎస్ శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, డీటీసీపీ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరికాసేపట్లో పది పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 9.35 దాటితే పరీక్షకు అనుమతించమని ఎస్సెస్సీ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.టెన్త్ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. 28,100 మంది ఇన్విజిలేటర్లు, 2,650 మంది డిపార్ట్మెంట్ అధికారులు పరీక్ష విధుల్లో ఉండనున్నారు. సైన్స్ సబ్జెక్టును రెండు విభాగాలుగా విడగొట్టారు. ఈ కారణంగా ఫిజికల్, బయలాజికల్ పేపర్లు మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకూ జరుగుతాయి. ఇక.. ఈసారి అడిషనల్ లేకుండా పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే 24 పేజీల బుక్లెట్ విద్యార్థులకు అందజేయనున్నారు. అలాగే.. ప్రశ్నపత్రంలోనూ క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే సీరియల్ నంబరు వస్తుంది. పేపర్ లీక్ అయితే అది ఎక్కడి నుంచి జరిగిందని వెంటనే గుర్తించే వీలుందని పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి చెబుతున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను కెమెరాల ఎదురుగానే ఓపెన్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రానికి తేవొద్దని సూచించారు. అనేక చోట్ల సమస్యలు టెన్త్ పరీక్షల నేపథ్యంలో పలుచోట్ల అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సమస్య ఉన్నట్టు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులు డీఈవోలను ఆదేశించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించారు. ప్రత్యేక బస్సులు నడపాలని ఆరీ్టసీని ఆ జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో రోడ్డు సరిగ్గా లేకపోవడం, బస్సులు నడపలేని పరిస్థితి ఉందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. వేసవితీవ్రత కారణంగా విద్యార్థులు డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముందని జిల్లా అధికారులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
న్యాక్‌కు దరఖాస్తు చేస్తే రూ.లక్ష
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు కోసం దరఖాస్తు చేసేలా విద్యా సంస్థలను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అందుకు ముందుకొచ్చే కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు రూ.లక్ష పారితోషికం ఇస్తామని ప్రకటించింది. ఈ అంశంపై సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి గురువారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఉన్నత విద్యలో జాతీయ స్థాయి గుర్తింపు పొందేందుకు న్యాక్ గుర్తింపు అవసరమని, ఈ విషయాన్ని అన్ని సంస్థలకు అర్థమయ్యేలా చెప్పాలని వీసీలను కోరారు. త్వరలో ప్రతీ జిల్లాలోనూ కాలేజీలను గుర్తించి, న్యాక్‌కు దరఖాస్తు చేసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని నిర్ణయించారు. ముందుకు రాని సంస్థలు విద్యా ప్రమాణాలను అంచనా వేసేందుకు న్యాక్ గుర్తింపును జాతీయ స్థాయిలో కొలమానంగా తీసుకుంటున్నారు. మౌలిక వసతులు, నిపుణులైన అధ్యాపకులు, సొంత భవనాలు, లే»ొరేటరీలు, లైబ్రరీ, ఆ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులకు లభిస్తున్న ఉద్యోగాలు, జాతీయ స్థాయిలో వారి ప్రతిభ మొదలైన అంశాలను పరిగణనలోనికి తీసుకొని న్యాక్ గుర్తింపు ఇస్తారు. అయితే, న్యాక్ గుర్తింపుపై రాష్ట్ర విద్యా సంస్థలు ఆసక్తి చూడం లేదు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 362 వర్సిటీలు, 6,176 కళాశాలలకు న్యాక్ గుర్తింపు ఉంది. 695 వర్సిటీలు, 34,734 కళాశాలలకు గుర్తింపు లేదు. తెలంగాణలో 11,055 డిగ్రీ కాలేజీలు, 173 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. 15 యూనివర్సిటీలు 293 కాలేజీలు కలిపి 298 ఉన్నత విద్యా సంస్థలకు న్యాక్ అక్రెడిటేషన్ ఉంది. అందులో 90 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. పునఃసమీక్ష చేసిన ప్రతీసారి మౌలిక వసతుల కల్పన, ఫ్యాకల్టీ కొరత కారణంగా న్యాక్ గుర్తింపు సంఖ్య తగ్గుతోంది. న్యాక్ తప్పనిసరి కాబోతోందా? న్యాక్ గుర్తింపును తప్పనిసరి చేయాలని యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి భావిస్తున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోనూ దీన్ని చేర్చారు. న్యాక్ గుర్తింపు విధానంలోనూ అనేక మార్పులు తేవాలని నిర్ణయించారు. ఏ, బీ, సీ, డీ గ్రేడ్ల స్థానంలో 1 నుంచి 5 అంచెలుగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. 1 నుంచి 4 వరకు ’లెవల్’ పొందిన సంస్థలను జాతీయ విశిష్ట విద్యా కేంద్రాలుగా పేర్కొంటారు.విద్య, పరిశోధనలో అంతర్జాతీయ స్థాయి సామర్థ్యమున్న సంస్థలకు ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గ్లోబల్ ఎక్సలెన్స్ ఫర్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్’పేరుతో ఐదో లెవెల్ గుర్తింపు ఇస్తారు. ఈ కొత్త విధానంపై యూజీసీ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. అక్రెడిటెడ్ విద్యాసంస్థలకు మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్ (ఎంబీజీఏ) పేరిట 1 నుంచి 5 గ్రేడ్లు ఇస్తారు. -
గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం సాయంత్రం 4.39 గంటలకు గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరుకొని కొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో విద్యుత్ డిమాండ్ 17వేల మెగావాట్లకు మించడం ఇదే తొలిసారి. గతేడాది సరిగ్గా ఇదే రోజు రాష్ట్రంలో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 13,557 మెగావాట్లే. గతేడాది మార్చి 8న నమోదైన 15,523 మెగావాట్ల గరిష్ట డిమాండే ఈ ఏడాది ప్రారంభం వరకు అత్యధికం కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 5న డిమాండ్ 15,752 మెగావాట్లకు పెరిగి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ పలుమార్లు కొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుత నెలలో రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16వేల మెగావాట్లకు మించి నమోదవుతోంది. ఈ నెల 18న 335.19 మిలియన్ యూనిట్ల రోజువారీ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో సైతం గురువారం 11,017 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. డిమాండ్ ఎంత పెరిగినా కోతల్లేని సరఫరా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా, రెప్పపాటు కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన సంస్కరణలు, రూపొందించిన ముందస్తు ప్రణాళికలతో పాటు విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి తీసుకున్న చర్యలతో ఇది సాధ్యమైందన్నారు. ఒక్క వినియోగదారుడికి సమస్య రావొద్దు: సందీప్‌కుమార్‌సుల్తానియా వేసవిలో ఏ ఒక్క వినియోగదారుడికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. విద్యుత్ సరఫరాపై గురువారం ఆయన సమీక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ 30 శాతం పెరిగిందని అధికారులు వివరించారు. గత వేసవి అనుభవాల దృష్ట్యా ఈ వేసవిలో ఓవర్ లోడ్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పలు సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో గరిష్ట డిమాండ్ 5,000 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేశామని, ఆ మేరకు సరఫరాకు సిద్ధంగా ఉన్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. -
యుద్ధంతో అల్లకల్లోలం..అయినా కలల సాకారం
రాయదుర్గం: రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంతో అల్లకల్లోలం సాగుతున్నా ఎంబీబీఎస్ విద్యార్థుల కలలు సాకారమయ్యాయి. ఉజ్బెకిస్థాన్‌లో విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన భారతీయ విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమాన్ని గచి్చ»ౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గురువారం ఘనంగా నిర్వహించారు. నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియో విద్యార్థుల గ్రాడ్యుయేషన్ ఏఐజీ ఆస్పత్రిలో మూడో సంవత్సరం నిర్వహించడం విశేషం. అత్యంత నైపుణ్యం కలిగిన వైద్య విద్యార్థులను తీర్చిదిద్దడంలో నియో ఖ్యాతి మరోసారి రుజువైనట్లయ్యింది. రష్యా –ఉక్రెయిన్ దేశాల మద్య యుద్ధం మొదలయ్యాక వీరందరినీ ఉక్రెయిన్ నుంచి ఉజ్బెకిస్థాన్‌కు తరలించారు. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ)లో నియో విద్యార్థుల అసాధారణ విజయం ఈ కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకుంది. గ్రాడ్యుయేషన్‌లో సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు ఏఐజీ ఆస్పత్రి ఆడిటోరియంలో సందడి చేశారు. అంతా ఉత్సాహంగా గడిపి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉజ్బెకిస్థానేలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన 150 మంది విద్యార్థుల్లో 114 మంది(76శాతం) విద్యార్థులు తమ తొలి ప్రయత్నంలోనే ఎఫ్ఎంజీఈలో ఉత్తీర్ణులయ్యారు. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి అవిసెన్నా అవార్డు, గౌరవ ప్రొఫెసర్ పదవితో సత్కారం ప్రపంచ వైద్య, విద్య, ఆరోగ్య సంరక్షణకు చేసిన కృషిని గుర్తిస్తూ ఏఐజీ ఆస్పత్రి వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి అవిసెన్నా అవార్డు, గౌరవ ప్రొఫెసర్ పదవితో ఆయనను సత్కరించారు. ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా ఆయనను సత్కరించారు. అంతేకాకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయ్‌బాబు గౌరవ డాక్టరేట్లు ప్రకటించగా డాక్టర్ సందీప్‌కు గౌరవ ప్రొఫెసర్ పదవిని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ప్రతినిదులు, ఉజ్బెకిస్థాన్ రాయబార కార్యాలయ సభ్యులు పాల్గొన్నారు. -
అడవులు 24.69%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 24.69 శాతం ఉన్నాయని సామాజిక, ఆర్థిక సర్వే 2024–25లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో అడవులు 23.59 శాతం ఉండగా, రాష్ట్రంలో అంతకంటే అధికంగానే ఉన్నట్లు పేర్కొంది. అడవుల సగటు విస్తీర్ణంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2,939 కి పైగా వృక్ష, మొక్క జాతులున్నాయి. 365 పక్షి జాతులు, 131 ఇతర జంతువులు, మృగాల జాతులున్నాయని సర్వేలోతెలిపారు. రాష్ట్రంలో మొత్తం అడవులు 27,688 చ.కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. మొత్తం 12 రక్షిత ప్రాంతాల్లో 9 వైల్డ్‌లైఫ్ శాంక్చురీలు, మూడు జాతీయ పార్కులు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం వనమహోత్సవం, ప్రాజెక్ట్ టైగర్, అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్)ను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించింది. -
మనుషులకంటే ఫోన్ కనెక్షన్లే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జానాభా కంటే ఫోన్ కనెక్షన్లే అధికంగా ఉన్నాయి. మొబైల్ కనెక్షన్ల డెన్సిటీ (సాంద్రత)లో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక ముఖచిత్రం (సోషియో ఎకనామిక్ ఔట్లుక్)లో 2024 సెప్టెంబర్ వరకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రకటించిన డేటాను పొందుపరిచింది. దేశంలో వైర్లెస్ ఫోన్ల డెన్సిటీలో గోవా (152.64 శాతం) మొదటి స్థానంలో ఉంది. కేరళ (115.05 శాతం), హర్యానా (114.08 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. తెలంగాణ (105.82 శాతం) నాలుగో స్థానంలో నిలిచింది. బలమైన సమాచార వ్యవస్థ రాష్ట్రంలో మొత్తం ఫోన్ కనెక్షన్లు 41.94 మిలియన్లు (దాదాపు 4 కోట్ల 19 లక్షల 40 వేలు) ఉన్నాయని ఆర్థిక సర్వేలో తెలిపారు. అందులో వైర్లెస్ కనెక్షన్లు 40.42 మిలియన్లు (4 కోట్ల 42 వేలు) ఉన్నట్లు తేల్చారు. ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.52 మిలియన్లు ఉన్నట్లు వెల్లడించారు. సమాచార వ్యవస్థ తెలంగాణలో బలోపేతంగా ఉన్నట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని సర్వే నివేదికలో ప్రభుత్వం తెలిపింది. పట్టణాలు, నగరాల్లో వైర్లెస్ ఫోన్ నెట్వర్క్ బలంగా ఉంది. మొత్తం వైర్లెస్ కనెక్షన్లలో పట్టణాల్లో 23.87 మిలియన్లు (59.05 శాతం) ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 16.55 మిలియన్లు (40.95 శాతం) ఉన్నాయి. ల్యాండ్‌లైన్ ఫోన్లలో పట్టణా ల్లో 1.46 మిలియన్ కనెక్షన్లు ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో 0.06 మిలియన్లు ఉన్నాయి. బ్రాడ్‌బ్యాండ్ జోరు రాష్ట్రంలో డిజిటల్ ఇన్ఫర్మేషన్ మౌలిక సదుపాయాలు భారీగా విస్తరిస్తున్నాయి. తెలంగాణలో 36.43 మిలియన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నట్లు ట్రాయ్ లెక్కలు తేల్చాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఈ– పరిపాలన, విద్య, ఆరోగ్యం, ఐటీ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో బ్రాండ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లు అధికంగా ఉన్నాయి. బ్రాండ్‌బ్యాండ్, న్యారోబ్రాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లలో బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ 98% ఉన్నాయి. మొత్తం 36.43 ఇంటర్నెట్ కనెక్షన్లలో బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్లు 35.68 మిలియన్లు, న్యారోబ్రాండ్ కనెక్షన్లు 0.75 లక్షలు ఉన్నట్లు వివరించింది. -
చేయూత పింఛన్లు 42,51,341
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చేయూత సామాజిక పింఛన్ల కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో లబ్దిదారులకు మొత్తం రూ.10,514.32 కోట్లు (మార్చిలో చెల్లించాల్సిన రూ.982.20 కోట్లు కలిపి) అందజేసినట్లు సామాజిక ఆర్థిక సర్వే 2024–25లో ప్రభుత్వం తెలిపింది. 2024–25 బడ్జెట్లో ఈ పింఛన్ల కోసం 14,628.91 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 2025–26 వార్షిక బడ్జెట్లో పింఛన్లకు రూ.14,861 కోట్లు కేటాయించింది. మొత్తం 11 కేటగిరీల్లో 42,51,341 మందికి పింఛన్లు అందిస్తున్నారు. వీరిలో దివ్యాంగులకు నెలకు రూ.4,016 చొప్పున, వృద్ధులు, వితంతువులు, ఇతర కేటగిరీలవారికి రూ.2,016 చొప్పున ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం వృద్ధులు ఇతర కేటగిరీల పింఛన్లను రూ.2,016 నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంపుదల ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనేదానిపై స్పష్టత కొరవడింది. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.23 వేల కోట్ల వరకు బడ్జెట్ పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. -
ఐపీఎస్ అభిషేక్ మహంతికి స్వల్ప ఊరట
సాక్షి,హైదరాబాద్: ఐపీఎస్ అభిషేక్ మహంతికి స్వల్ప ఊరట లభించింది. ఏపీకి వెళ్లాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సోమవారం వరకు నిలిపివేసింది. ఇదే అంశంపై కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది.విభజన సందర్భంగా కేటాయించిన రాష్ట్రం ఏపీలో చేరాలని మహంతికి కేంద్రం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐపీఎస్ అభిషేక్ మహంతి క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ కేంద్ర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ తిరుమలాదేవీ ధర్మాసనం విచారణ చేపట్టింది. గురువారం ఏపీలో చేర్చాల్చి ఉండటంతో.. సోమవారం వరకు కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసింది. -
ఆ విషయంపై వివరణ ఇవ్వండి.. ఓయూ రిజిస్ట్రార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆందోళనకు అనుమతి లేకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ఉస్మానియా వర్సిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఉస్మానియా రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఉస్మానియా వర్సిటీలో నిరసనలకు అనుమతి లేదంటూ రిజిస్ట్రార్ ఈ నెల 13న జారీ చేసిన సర్కులర్ చట్టవిరుద్ధమంటూ ఓ విద్యార్థి పిటిషన్ దాఖలు చేశారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1), 21ను ఉల్లంఘించినట్లేనని.. ఆ సర్కులర్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ బీ.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉస్మానియాలో నిరసన కార్యక్రమాలను నిలిపివేస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్న స్టాండింగ్ కౌన్సిల్.. అయితే కాలేజీ ఆవరణల్లో, డిపార్ట్మెంట్లో ఆందోళనలను నిలిపివేసినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిజస్ట్రార్‌కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. -
త్యాగం, పోరాటం రావి నారాయణరెడ్డి వ్యక్తిత్వం
హైదరాబాద్: త్యాగం, పోరాటం కలిపితే ఒక రావి నారాయణరెడ్డి మన కళ్లల్లో కనిపిస్తారని సామాజికవేత్త రావి ప్రతిభారెడ్డి అన్నారు. రావి నారాయణరెడ్డి స్వగ్రామమైన బొల్లేపల్లిలో 10వ తరగతి విద్యార్థులకు గురువారం పరీక్షల మెటీరియల్ అందజేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ తన భూమిని పేదలకు పంచటంతో పాటు, భూమితోనే పేదలకు భుక్తి,విముక్తి లభిస్తుందన్న విశ్వాసంతో సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చారన్నారు.హైదరాబాద్ రాష్ట్రంలో 4వేల గ్రామాల్లో రైతు రాజ్యాలు ఏర్పాటు చేసిన ఘనత రావి నారాయణరెడ్డికే దక్కిందని ప్రతిభారెడ్డి అన్నారు. ఆయన జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని నేటి యువత సమాజం కోసం త్యాగం, అన్యాయాలు, అక్రమాలపై పోరాటాలకు వెనకకాడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొని ప్రతిభారెడ్డిని అభినందించారు. -
అదంతా దుష్ప్రచారం.. నా మీద ప్రజలకు కోపమా?
సాక్షి,హైదరాబాద్: నా మీద వ్యతిరేకత వచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అభివృద్ది చేసినందుకే నాపై ప్రజలు కోపంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కొలువుల పండగ కార్యక్రమం నిర్వహించింది. పంచాయితీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖలో కార్యుణ నియామకాల్ని చేపట్టింది. ఎంపికైన 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించింది.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గత పాలకులు పదేళ్లుగా ఈ నియామకాలు చేపట్టలేదు. కానీ తమ ప్రభుత్వం కారుణ్య నియామకాల్ని చేపట్టింది. నామీద వ్యతిరేకత వచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నాపై కోపంగా ఎందుకు ఉంటారు? మహిళలకు ఉచిత బస్సు కల్పించినందుకా? నాపై కోపం..? ఉద్యోగాలు ఇచ్చినందుకా నాపై కోపం? రుణమాఫీ చేసినందుకా నాపై కోపం? 59వేల మంది ఉద్యోగాలు ఇచ్చినందుకా? నాపై కోపం అని ప్రశ్నించారు. అనంతరం, తెలిపారు. అనంతరం,బిల్డ్ నౌ పోర్టల్‌ను ఆవిష్కరించారు. -
కణ,జన్యు చికిత్సలు మరింత సులభం!
సాక్షి, హైదరాబాద్: టీకా తయారీలో పేరొందిన హైదరాబాదీ సంస్థ భారత్ బయోటెక్ మరో కీలకమైన ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారి జన్యు, కణాధారిత చికిత్సలకు ఉపయోగపడే వ్యవస్థలను ప్రారంభించింది. హైదరాబాద్ శివార్లలోని జినోమ్ వ్యాలీలో సుమారు యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కొత్త వ్యవస్థ ద్వారా కేన్సర్‌సహా అరుదైన వ్యాధులు కొన్నింటికి చికిత్సను అభివృద్ధి చేయడం వేగవంతం కానుంది. కేన్సర్ వంటి వ్యాధులకు ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త రకం చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మన శరీరంలోని రోగ నిరోధక కణాలను చైతన్యపరచడం ద్వారా అవి కేన్సర్ కణాలను మట్టుబెట్టేలా చేసే కార్-టీ చికిత్స వీటిల్లో ఒకటి. అలాగే కొన్ని వ్యాధులకు జన్యు ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కానీ.. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే లభించే ఈ చికిత్సలు చాలా ఖరీదైనవి. ఈ నేపథ్యంలోనే తాము కణ, జన్యు ఆధారిత చికిత్సలను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఈ సరికొత్త వ్యవస్థను సిద్ధం చేసినట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించడం, శరీర కణాలు ఎక్కువ కాలం పాటు మనగలిగే చేయడం, మన లక్ష్యాలకు అనుగుణంగా జన్యువులు తగిన ప్రొటీన్లు ఉత్పత్తి చేసేలా చేయడం ఈ కొత్త వ్యవస్థ నిర్వహించే పనులు. క్లుప్తంగా చెప్పాలంటే కొన్ని వ్యాధుల చికిత్సకు అవసరమైన ప్రత్యేకమైన వైరస్‌లను అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విదేశాల్లో ఎంతో ఖర్చుపెట్టి చేయించుకోవాల్సిన కేన్సర్ చికిత్సలకు మనకు చవకయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హీమోఫీలియా వంటి జన్యుపరమైన వ్యాధులకూ చికిత్స లభించడం మొదలవుతుంది. ‘‘జన్యు, కణ చికిత్సలు చాలా సంక్లిష్టమైనవి. అత్యాధునిక పద్ధతులు, టెక్నాలజీల వాడకం ఉంటుంది. ఎంతో నైపుణ్యం ఉంటే కానీ.. మన అవసరాలకు తగ్గట్టుగా జన్యువుల్లోమార్పులు చేయడం కుదరదు. అయితే వైరస్‌లతో టీకాలు తయారు చేయడంలో భారత్ బయోటెక్ ఇప్పటికే ఎంతో అనుభవం సాధించింది. నైపుణ్యాలను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత అరుదైన, కేన్సర్ వంటి సంక్లిష్టమైన వ్యాధులపై పోరును ముందుకు తీసుకెళ్లగలిగేలా, క్లినికల్ ట్రయల్స్‌కు ఉపయోగపడే హ్యూమన్ గ్రేడ్ వెక్టార్లను తయారు చేసేందుకు ఈ కొత్త వ్యవస్థ ఉపయోగపడుతుంది’’ అని డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచెస్ ఎల్లా మాట్లాడుతూ.. ‘‘ఏఏవీ, లెంటివైరస్, అడినోవైరస్ వంటి వైరల్ వెక్టార్లు కణ, జన్యు చికిత్సల్లో చాలా కీలకపాత్ర పోషిస్తాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలో వీటిని అత్యధిక నాణ్యతతో అభివృద్ధి చేయగలం. తద్వారా రక్త కేన్సర్లు, అవయవాల్లోని కేన్సర్ల చికిత్సకు అవసరమైన వెక్టార్లను తయారు చేయగలం’’ అని తెలిపారు. -
బండి సంజయ్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో బండి సంజయ్‌కు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. 2020 నవంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్‌పై కేసు నమోదైంది. కార్యకర్తల సమావేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ కేసు నమోదైంది. సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. మార్కెట్ పీఎస్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని బండి సంజయ్ తరఫు న్యాయవాది అన్నారు. సాక్ష్యుల వాంగ్మూలంలోనూ తేడాలున్నాయన్నారు. సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఫిర్యాదు చేశారన్న న్యాయవాది వివరించారు. బండి సంజయ్‌పై కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. -
తెలంగాణకు చల్లని కబురు!
హైదరాబాద్, సాక్షి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగల ప్రతాపం రోజురోజుకి పెరిగిపోయి ఉక్కపోతతో జనం అల్లలాడిపోతున్నారు. ఈ తరుణంలో.. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Center) చల్లని కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో రెండురోజుల పాటు వానలు కురుస్తాయని ప్రకటించింది.రాగల 48 గంటల్లో.. అంటే రేపు, ఎల్లుండి ఉత్తర, ఈశాన్య తెలంగాణ అంతటా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుందని తెలిపింది. కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 22వ తేదీ తర్వాత కూడా మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఎండాకాలం మొదలైన కొద్దిరోజులకే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ఇటు తెలంగాణ, అటు ఏపీ మండిపడుతోంది. పలు జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. వడగాల్పులతో జనం విలవిలలాడుతున్నారు. -
‘భూమికి మూడు ఫీట్లు లేరుగాని.. అసెంబ్లీలో తెగ మాట్లాడేస్తున్నారు’
సాక్షి,సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.కేసీఆరే మరోసారి సీఎం అవుతారు. భూమికి మూడు ఫీట్లు లేని వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు.గ్రామ సింహాలు కూడా సింహాల్లా మాట్లాడుతున్నాయి. కేసీఆరే లేకపోతే తెలంగాణనే లేదనేది అక్షర సత్యం. మూడు పాత్రల్లో విజయవంతం అయిన ఏకైక పార్టీ బీఆర్ఎస్.తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్ఎస్ పార్టీ.బీఆర్ఎస్ అధికారంలో రావాలని కోరుకునేది ప్రజల కోసమే. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ పెంచుకునే పనికాకుండా పర్సంటేజీలు పెంచుకునే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. -
Hyderabad: లక్కీ భాస్కర్ కాదు ఇక్కడ .. మగ్గం వర్క్ ఆదిలక్ష్మి ..!
హైదరాబాద్: అధిక డబ్బులు, ఉద్యోగాల ఆశచూపింది. అందినకాడికి దండుకుంది. తేరుకున్న బాధితులు ప్రశ్నించడంతో తాను రిటైర్డ్ పోలీసు అధికారినంటూ బెదిరింపులకు దిగింది. చివరకు ఆ కిలాడీ లేడీ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే కంగుతినాల్సి వచ్చింది.చర్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి ఐజీ మింట్, గణేష్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆదిలక్ష్మి ఆలియాస్ శ్రీదివ్యకాలనీలో మగ్గం వర్క్ చేసుకుంటూ కూమర్తెతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో తన వద్దకు మగ్గం వర్క్ కోసం వచ్చే మహిళలను మచ్చిక చేసుకుని వారికి మాయమాటలు చెప్పి బుట్టలోకి దించింది. రూ.1000 కడితే వారంలో రూ.10వేలు ఇస్తానని, రూ.లక్ష ఇస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి గంటల వ్యవధిలో రూ.20–25 వేలు అధికంగా ఇస్తానంటూ.. నమ్మబలికి సుమారు 100 మంది మహిళల వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అనుమానం వచ్చి అడిగితే దాటవేస్తూ.. ఆమె తీరుపై అనుమానం వచ్చిన కొంతమంది తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మొండికేసింది. డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే తాను రిటైర్డు పోలీసు అధికారినంటూ బెదిరింపులకు దిగింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన మహిళలు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. కానీ పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువించకపోవడం గమనార్హం. పలు కేసుల్లో నిందితురాలు.. తోటి మహిళలను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకున్న కిలాడీ లేడిని చర్లపల్లి పోలీసులు అదపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సదరు మహిళపై మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో 2 కేసులు, మరోస్టేషన్లో ఇంకో కేసు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణకు సహకరించడం లేదు.. సదరు నిందితురాలి సమాచారం సేకరించి విచారణ జరుపుతున్నా పోలీసులకు సహకరించడం లేదని, పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది. మేడిపల్లిలో మగ్గం మిషన్ల కొనుగోళ్లపై అవినీతికి ఆమె పాల్పడిందని, ఈ కేసులో కూడా నిందితురాలని తెలుస్తోంది. -
బీ అలర్ట్.. వారికి కఠిన చర్యలు తప్పవు: సజ్జనార్ హెచ్చరిక
బెట్టింగ్.. ఈ పేరు వింటేనే ఎంతోమంది జీవితాలు ఛిద్రమైన ఉదంతాలు గుర్తుకు వస్తాయి. బెట్టింగ్ యాప్‌లు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఈ వ్యసనంలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఉండగా.. యువత సైతం తప్పుడు దారిలో వెళ్తోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. దీంతో, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘యువత, ఎందరో బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రెటీలు ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకపోవడం మంచిది. యాప్‌ను ఎవరు ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి యాప్ వస్తున్నాయి అనేది చూడాలి. ఎవరు అప్లోడ్ చేస్తున్నారు అనేది పర్యవేక్షించాలి. ఈ యాప్స్ ద్వారా ఎవరు లాభం పొందారు అనేది కూడా విచారణ చేపట్టాలి. ఇలాంటి యాప్స్ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు.ఇలాంటి యాప్స్‌పై అవగాహన కల్పించాలి. ఇప్పటకే పలు విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. డిజిటల్ అరెస్ట్, బ్యాంక్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, ఓఎల్ఎక్స్ నేరాలు ఇలాంటివి అన్నీ గతంలో జరిగాయి. ప్రధాని మోదీ కూడా డిజిటల్ అరెస్ట్ మోసాలను వివరించారు. దీంతో, మోసాలు తగ్గుముఖం పట్టాయి. అలాగే, బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అందరికీ అవగాహన కల్పిస్తే మోసాలు తగ్గిపోతాయి. మళ్లీ చెబుతున్నాను.. బెట్టింగ్ యాప్స్ వెళ్లకండి. జీవితాలను నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్ యాప్స్ మాయలో పడకండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కదలికలు, ప్రవర్తనను గమనించాలి’ అని కోరారు.అలాగే, ప్రస్తుతం మార్కెట్లో వేలాది బెట్టింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయని, వీటిని ప్రోత్సహించే యూట్యూబర్లను, ప్రచారకర్తలను నమ్మ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రికెటర్లు, సినీ స్టార్లు, టీవీ సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు కోసం ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. కష్టపడి పనిచేస్తేనే డబ్బు వస్తుందని, షార్ట్‌కట్ మార్గాల్లో డబ్బును ఆశిస్తే నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే యూట్యూబర్లను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సజ్జనార్ తెలిపారు. ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ అనే ఉద్యమం ఊపందుకుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
పోషకాహార ప్రాధాన్యత : రెసిపీ & డైట్ గైడ్ ఆవిష్కారం
తెలంగాణలోని ప్రముఖ ఆలివ్ హాస్పిటల్ (Olive Hospital) కొత్త ఆరోగ్యకరమైన వంటకాలతో మరో పుస్తకాన్ని విడుదల చేసింది. ప్రసిద్ధ వంటకాలతో , "హోల్సమ్ రెసిపీస్ ఫర్ ఎ వైబ్రెంట్ లైఫ్" (Wholesome Recipes for a Vibrant Life) ఐదో ఎడిషన్‌ను ప్రారంభించింది. ఆసుపత్రి నిపుణులైన డైటీషియన్లు ఈ పుస్తకం,రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించేలా ఈ రెసిపీలను రూపొందించారు.2025 ఎడిషన్‌లో భారతదేశపు గొప్ప పాక సంప్రదాయాలను సమతుల్య పోషకాహారంతో మిళితం చేసే 60 కి పైగా వంటకాలు ఉన్నాయి. ఇందులో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు,రోగనిరోధక శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాలు వంటి వివిధ పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, కాశ్మీరీ పులావ్ బిసి బెలె బాత్, పనీర్ టిక్కా బిర్యానీ, స్పినాచ్ పులావ్ ఉన్నాయి.ఇవన్నీ ఇంట్లో సులభంగా తయారు చేయడంతోపాటు, ఇవి అవసరమైన పోషకాలను అందిస్తాయని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, నాణ్యమన వైద్య విధానాలతో మెరుగన ఆరోగ్య సేవలను అందిసున్న ఆలివ్ హాస్పిటట్ పోషకాహారం పాధాన్యతను వివరిస్తూ దీన్ని విడుదల చేసింది.మెరుగైన ఆరోగ్యం వైపు ఒక అడుగుఆలివ్ హాస్పిటల్ గత నాలుగేళ్లుగా తీసుకొస్తున్న డైట్ ప్లాన్ పుస్తకం ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు, రోగులకు ఉపయోగ పడుతోంది. ఆసుపత్రి వారి శ్రేయస్సు పట్ల నిరంతర నిబద్ధతలో భాగంగా ఇది రోగులకు పంపిణీ చేస్తారు. ప్రోటీన్-రిచ్ వంటకాల్లో పనీర్ టిక్కా బిర్యానీ, మాటర్ పులావ్ ఫీచర్లు, ప్రోటీన్ సుసంపన్నం కోసం పనీర్, టోఫు, కాయధాన్యాలు, బీన్స్, పాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఆకుకూరలతో సమృద్ధిగా ఉండే పాలకూర పులావ్, కాలీఫ్లవర్ లెమన్ రైస్, ఫైబర్-ప్యాక్డ్ రెసిపీలుంటాయి. ఇందులోని వంటకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియకు సహాయపడటానికి మరియు శక్తి స్థాయిలను నిలబెట్టడానికి పదార్థాల సమతుల్య మిశ్రమాన్ని అందిస్తుందని డైటెటిక్స్ హెడ్ సుగ్రా ఫాతిమా చెప్పారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి హరీష్‌రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా, రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసు స్టేషన్లో హరీష్‌రావు, రాధాకిషన్ రావుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, వీరద్దర్నీ పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే, ఈ కేసులో ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగిశాయి. ఇక, తాజాగా హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఫోన్ టాపింగ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇదిలా ఉండగా.. సిద్దిపేట జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్.. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని.. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావులపై గతేడాది ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పంజాగుట్ట పోలీసులు.. హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సహా ముగ్గురి అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేశారని పిటిషనర్ చక్రధర్ గౌడ్ తెలిపారు. ఒక రైతుకు తెలియకుండా అతని పత్రాలతో హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సిమ్‌కార్డు కొనుగోలు చేశారని.. ఆ సిమ్‌ను ఉపయోగించి తనకు బెదిరింపు కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. ఇక ఈ కేసులో ఏ-1గా హరీష్ రావు, ఏ-2గా రాధాకిషన్ రావులు ఉన్నారు. -
ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి మూత్ర విసర్జన
హైదరాబాద్: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి అందులోనే మూత్ర విసర్జన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌భవన్ రోడ్డులో ఆర్బీఎల్ బ్యాంక్ ఏటీఎం ఉంది. అందులో డబ్బులు డ్రా చేసేందుకు ఈనెల 10న వ్యక్తి వచ్చాడు. డబ్బులు డ్రా చేసిన తర్వాత ఏటీఎం డబ్బులు తీసుకునే ప్రాంతంలో మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఏటీఎం సెన్సార్ పాడయ్యింది. ఇటీవల ఏటీఎం పరిశీలించేందుకు ఆర్బీఎల్ బ్యాంక్ ఆపరేషన్స్ మేనేజర్ రవికుమార్ రాగా సెన్సార్ పని చేయడం లేదని గ్రహించాడు. దీంతో సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తి ఉద్ధేశపూర్వకంగా మూత్రవిసర్జన చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దల జోలికి వెళ్లి చెప్పండి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నీటి వనరులు, సర్కార్ భూముల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా.. పేద, మధ్యతరగతి ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సంపన్నులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖుల జోలికెళ్లడం లేదని, ఒకసారి వారి నిర్మాణాల్లో నిబంధనలు పాటించారో, లేదో పరిశీలించాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకు హైడ్రా ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తోందా అని నిలదీసింది. పేద, మధ్యతరగతికి చెందిన ఇళ్లను కూల్చి మీడియాలో ఫొటోలు వేయించుకోవడం కాదని.. మియాపూర్, దుర్గం చెరువు సహా పలుచోట్ల సర్కార్ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ప్రముఖుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అందరికీ ఒకేలా న్యాయం దక్కినప్పుడే హైడ్రా ప్రజాప్రయోజనాలను పరిరక్షించినట్లు అవుతుందని తేల్చిచెప్పింది. ‘ఒకప్పుడు హైదరాబాద్ అంటే చెరువులు, సరస్సుల నగరంగా పేరు ఉండేది. 2000కుపైగా చెరువులు ఉండగా, ఇప్పుడు 200 కూడా లేవు. చెరువుల రక్షణకు నాడు ప్రత్యేక చట్టాలు అమల్లో ఉండేవి. హైడ్రా ఏర్పాటు బాగానే ఉన్నా.. పనితీరు మాత్రం ఆశాజనకంగా లేదు. పేదలతోపాటు పెద్దలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పుడే నిజమైన సార్థకత చేకూరుతుంది. ఇప్పటి ప్రభుత్వాల కంటే నాడు నిజాం చేపట్టిన చెరువుల పరిరక్షణ చర్యలే పకడ్బందీగా ఉన్నాయి. మీరాలం చెరువు పరిధిలో నిర్మాణాలపై ఉమ్మడి సర్వే చేపట్టి.. ఆక్రమణలు ఉంటే తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’అని స్పష్టం చేసింది. ప్రభుత్వానిదా? వక్ఫ్‌దా?రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ సర్వే నంబర్ 329/1, 329/2, 329/3లోని ఆరు ఎకరాల భూమిపై తహసీల్దార్ జారీచేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఫాతిమా, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాద నలు వినిపిస్తూ.. ‘సదరు భూమికి సంబంధించి వక్ఫ్ బోర్డు సీఈవో లేఖ మేరకు తహసీల్దార్ చర్యలు చేపట్టడం చెల్లదు. ఒకవేళ వక్ఫ్‌భూమి అయినా సీఈవో చర్యలు తీసుకోవచ్చు గానీ, నోటీసులు జారీ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదు. ఆ నోటీసులను రద్దు చేయాలి’అని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఇదే హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్య ం మేరకు మీరాలం చెరువు పరిధిలోని ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాం. అన్ని చర్యలు తీసుకుంటున్నాం’అన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మీరా లం చెరువుకు సంబంధించి పిటిషనర్ అభ్యంతరాలపై ఉమ్మ డి సర్వే నిర్వహించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ప్రభుత్వానిదే అని తేలితే చర్యలు చేపట్టాలని, వక్ఫ్ బోర్డుదని తేలితే చర్యలు తీసుకునే బాధ్యతను బోర్డుకు అప్పగించాలని చెప్పారు. నీటి వనరుల ఆక్రమణపై వాల్టా చట్టం కింద చర్యలు తీసుకోవచ్చంటూ విచారణ ముగించారు. -
వైద్య, ఆరోగ్య శాఖ కొంచెం మెరుగు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖకు 2025–26 సంవత్సరానికి బడ్జెట్లో రూ.12,393 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ రూ.11,468 కోట్లతో పోలిస్తే రూ.825 కోట్లు అధికం. ఈ కేటాయింపుల్లో నిర్వహణ పద్దు కింద రూ. 5,666.86 కోట్లు కేటాయించగా, అభివృద్ధి కోసం రూ. 6,070 కోట్లు కేటాయించారు. ఇందులో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కలిపి రూ. 680.63 కోట్లు కేటాయించగా. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ (డీఎంఈ)కు రూ. 3,011 కోట్లు కేటాయించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాధిపతికి రూ. 554.24 కోట్లు కేటాయించారు. ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్ పరిధిలోని కార్యక్రమాలకు రూ. 1686.80కోట్లు కేటాయించడం గమనార్హం. ఇవి కాకుండా ఆయుష్ కోసం రూ.133.52 కోట్లు, డ్రగ్స్ కంట్రోల్ విభాగాధిపతికి రూ.2.10 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ చెల్లింపులకు ఎలా?రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ. 1,143 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచడంతోపాటు వైద్యం ఖర్చుల స్లాట్లను కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఆసుపత్రులతోపాటు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా రోగులకు చికిత్సలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1200 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. తమకు బకాయిలు చెల్లించాలని రెండు నెలల క్రితం నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె కూడా చేశాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కేవలం రూ.1,143 కోట్లను కేటాయించడాన్ని ఆరోగ్య శ్రీ చెల్లింపులకు కొంత ఇబ్బంది కలిగించే విషయంగా ప్రైవేటు ఆసుపత్రులు చెపుతున్నాయి. ఇందులో నిర్వహణ ఖర్చులు పోను మిగిలే రూ. 695.79 కోట్లు మాత్రమే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌కు చేరే అవకాశం ఉంది. -
నీటిపారుదల శాఖకు రూ.23,372 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ.23,372.7 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.11,786.77 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.11,543.87 కోట్లు చూపించింది. చార్జ్డ్ మొత్తం కింద రూ.42.06 కోట్లు కేటాయించింది. అయితే ఈ కేటాయింపుల్లో సింహభాగం రుణాల తిరిగి చెల్లింపులకే పోనున్నాయి. ప్రాధాన్య ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తామన్న ప్రభుత్వ హామీకి తగ్గట్లుగా నిధుల కేటాయింపులు జరగలేదు. 2024–25 బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ.22,301 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో రూ.1,071 కోట్లు పెంచారు. ఈ శాఖకు 2022–23లో రూ.19,349.24 కోట్లు, 2023–24లో రూ.29,766 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. రుణమే పెనుభారం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డితో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న భారీ రుణాలు తిరిగి చెల్లించడానికి సాగునీటి శాఖ బడ్జెట్ కేటాయింపుల్లోని సింహభాగం నిధులు వెళ్లనున్నాయి. రుణాల తిరిగి చెల్లింపులకు రూ.9,877.01 కోట్లు అవసరమని బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల రుణాల తిరిగి చెల్లింపులకు రూ.2,962.47 కోట్లు, కాళేశ్వరం కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపులకు రూ.6,914.54 కోట్లు కేటాయించారు. ఇక తెలంగాణ జలవనరుల సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీడబ్ల్యూఆర్ఐడీసీఎల్)కు రుణం కింద రూ.2,962.47 కోట్లు ప్రతిపాదించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణకు నిధులు రూ.385.38 కోట్లకు తగ్గాయి. ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.7,120 కోట్లు.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మూలధన పెట్టుబడుల కింద బడ్జెట్లో రూ.12,652 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.7120.27 కోట్లు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుల పూర్తితో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6,55,895 ఎకరాలు, 2025–26లో 9,42,778 ఎకరాలను సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా 2025–26 నాటికి మొత్తం 15,98,673 ఎకరాల ఆయకట్టు సాగులోకి రావాల్సి ఉంది. అయితే, నిధులు అరకొరగానే కేటాయించటంతో గడువులోగా ఆయా ప్రాజెక్టులను పూర్తిచేయటం అనుమానంగా మారింది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా వచ్చే నెలలో తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్లో మాత్రం ఈ ప్రాజెక్టుకు నిధులను రూ.248.99 కోట్ల నుంచి రూ.32.22 కోట్లకు తగ్గించడం గమనార్హం. -
పన్ను రాబడులపైనే ఆశలు!
సాక్షి, హైదరాబాద్: పన్నుల ఆదాయమే ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్‌ను ప్రతిపాదించింది. మొత్తం రాబడుల్లో 58 శాతం పన్నుల రూపంలోనే అందుతాయని అంచనా వేసింది. పన్నుల రూపంలో మొత్తం రూ.1.75 లక్షల కోట్లు సమకూరుతాయని పేర్కొనగా.. అందులో రాష్ట్ర సొంత పన్నుల రాబడులే రూ.1.45 లక్షల కోట్ల మేర ఉంటాయని అంచనా వేసింది. ఈసారి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.51 వేల కోట్లు, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.19 వేల కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.27 వేల కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.37 వేల కోట్లు, వాహనాల పన్ను రూపంలో రూ.8,535 కోట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రూ.1,38,181.26 కోట్లు పన్నుల రాబడి ఉంటుందని గత బడ్జెట్లో వస్తుందని అంచనా వేయగా.. సవరించిన అంచనాల్లో రూ.1,29,406.75 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. అంటే బడ్జెట్ అంచనాల కంటే తగ్గినది రూ.8 వేల కోట్లు మాత్రమేకావడం గమనార్హం. ఈ క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరం భారీగా పన్నుల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసుకుంటోంది. రిజిస్ట్రేషన్ల శాఖపై ఆశలు..వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.18,228 కోట్లు సమకూరుతాయని గత బడ్జెట్లో పేర్కొన్నా.. సవరించిన అంచనాల మేరకు ఇది రూ.14,692 కోట్లకు తగ్గింది. అయినప్పటికీ ప్రభుత్వం ఈసారి రూ.19,087.26 కోట్లు సమకూరుతాయని అంచనా వేసుకుంది. ఇది గత బడ్జెట్ ప్రతిపాదన కంటే రూ.1,000 కోట్లు, సవరించిన అంచనా కంటే రూ.5 వేల కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. భూముల విలువల సవరణ తోపాటు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.పన్నేతర ఆదాయం ఎలా?బడ్జెట్లో పన్నేతర ఆదాయం అంచనాలు కూడా పెద్దగా తగ్గలేదు. ఈ పద్దు కింద 2024–25లో రూ.35వేల కోట్లు వస్తాయని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల మేరకు రూ.25,807 కోట్లు సమకూరుతోంది. అంటే రూ.10వేల కోట్లు తేడా ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పన్నేతర ఆదాయం అంచనాలను రూ.31,611.47 కోట్లుగా చూపింది. ఇందులో మైనింగ్ రాయల్టీ, సీవరేజీ ఫీజు, ఇసుక ద్వారా ఆదాయం కింద రూ.8 వేల కోట్ల వరకు వస్తాయని అంచనా వేసింది. మరో రూ.21 వేల కోట్ల వరకు భూముల అమ్మకాల ద్వారా సమకూర్చుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కూడా పెంచారు. 2024–25లో రూ.21,636.15 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. సవరణలో రూ.19,836 కోట్లు వస్తున్నట్టు చూపెట్టారు. ఎక్సైజ్ ఆదాయమూ కీలకమే..2024–25 సవరణ అంచనాల మేరకు ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.25,617.53 కోట్లు సమకూరుతుండగా.. 2025–26లో రూ. 27,623.36 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. ఇది సుమారు రూ.2 వేల కోట్లు అదనం. ఈ ఏడాదిలో వైన్ (ఏ4) షాపులకు లైసెన్సు గడువు ముగియనుండటంతో.. టెండర్లు పిలవనున్నారు. వైన్‌షాపుల కోసం వచ్చే దరఖాస్తుల ఫీజు రూపంలో ఈ మొత్తం సమకూర్చు కోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని అంటున్నారు.పట్టణాలకురూ. 17,677 కోట్లు» నిర్వహణ వ్యయంరూ.7,639.57 కోట్లు »ప్రగతి పద్దు రూ. 8,796.73 కోట్లు »గతేడాది కంటే ప్రగతి పద్దు రూ.3 వేల కోట్లు అధికం »మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు»2025–26 బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్లో పురపాలక శాఖకు రూ.17,677 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు రూ.7,639.96 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి పనుల కోసం ప్రగతి పద్దు కింద రూ.8,796.73 కోట్లు ప్రతిపాదించింది. 2024–25 బడ్జెట్లో ఈ శాఖకు ప్రగతి పద్దు రూ.5,642.35 కోట్లు ఉండగా, ఈసారి రూ.3 వేల కోట్లు అదనంగా కేటాయించారు. ఇందులో పట్టణాభివృద్ధి కోసం రూ.2,957.58 కోట్లు, ప్రజారోగ్యం కోసం రూ.525.47 కోట్లు ప్రతిపాదించారు. గత సంవత్సరం సవరించిన అంచనాల్లో ఈ మొత్తం రూ.106.07 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తాజా బడ్జెట్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,700 కోట్లు, వాటర్‌బోర్డుకు రూ.635 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. పేదింటికి కొంతే.. కావాల్సింది రూ.22,500 కోట్లు.. ఇచ్చింది రూ.12,571 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లతోపాటు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ. 22,500 కోట్లు అవసరమన్నది గృహనిర్మాణ శాఖ లెక్కలు. కానీ, తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ.12,571 కోట్లను ప్రతిపాదించింది. అయితే గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. గత బడ్జెట్లో రూ.7,740 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాదని ప్రభుత్వానికి స్పష్టత ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో 72 వేల ఇళ్లకు సంబంధించి ముగ్గుపోసుకునే పనిని లబ్దిదారులు ప్రారంభించారు. ఈనెలాఖరుకు తొలివిడత రూ.లక్ష వారి ఖాతాల్లో వేయాల్సి ఉంది. ఇప్పుడు నిధుల అవసరం చాలా ఉంది. దీంతో ప్రతిపాదించిన నిధులు, మంజూరు చేస్తున్న ఇళ్ల సంఖ్య ప్రకారం చూస్తే సరిపోదు. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం ఆ ఇళ్లన్నీ పూర్తయ్యే పరిస్థితి ఉండదన్న అంచనాలో ప్రభుత్వం ఉంది. రెండుమూడు విడతల నిధుల విడుదలతోనే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో ఈ కేటాయింపులు సరిపోతాయన్న అంచనాతో ఉన్నట్టు సమాచారం. ఇక, ఈ ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇవ్వాల్సి ఉంది. అక్కడి నుంచి ఎన్ని నిధులు వస్తాయో ఇంకా స్పష్టత రాలేదు. -
‘ప్రత్యేక నిధి’కి భారీగా..
సాక్షి, హైదరాబాద్ : దళిత, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి ఈసారి భారీగా పెరిగింది. 2025–26 వార్షిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కింద రూ.57,400.43 కోట్లు కేటాయించింది. గత వార్షిక బడ్జెట్లో ఎస్డీఎఫ్ కింద 50,180.13 కోట్లు కేటాయింపులు జరపగా... ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం రూ.7,220.30 కోట్లు అదనంగా కేటాయింపులు చేసింది. ఇందులో షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్) కింద రూ.40,231.61 కోట్లు కేటాయించగా, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్డీఎఫ్) కింద రూ.17,168.82 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల్లోనూ ఎస్సీ ఎస్డీఎఫ్కు అధిక ప్రాధాన్యం దక్కింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ.7,107.57 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. ఎస్టీ ఎస్డీఎఫ్కు మాత్రం 112.73 కోట్లు మాత్రమే పెరిగాయి. పరిశ్రమలకు రూ.3,527 కోట్లుఐటీ శాఖకు రూ.774 కోట్లు.. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.1,730 కోట్లు» ప్రగతి పద్దు కింద 2024–25 వార్షిక బడ్జెట్లో పరిశ్రమల శాఖకు 2,248.13 కోట్లు కేటాయించి, తర్వాత రూ.1,321.57 కోట్లకు సవరించారు. తాజా బడ్జెట్లో పరిశ్రమల శాఖకు ప్రగతిపద్దు కింద రూ.2,383.42 కోట్లు ప్రతిపాదించారు. » పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీల బకాయిలు రూ.4,236 కోట్ల మేర పేరుకుపోయిన నేప థ్యంలో ప్రస్తుత బడ్జెట్లో వీటికి రూ.1,730 కోట్లు కేటాయించారు. » టీ హబ్ ఫౌండేషన్‌కు గత ఏడాది బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో నయాపైసా ఇవ్వలేదు. » ఐటీ శాఖకు 2024–25 బడ్జెట్లో ప్రగతిపద్దు కింద రూ.771.20 కోట్లు ప్రతిపాదించి, చివరకు 337.30 కోట్లకు సవరించారు. తాజా బడ్జెట్లోనూ ప్రగతిపద్దు కింద ఈ శాఖకు రూ.771.20 కోట్లు ప్రతిపాదించారు.» కొత్త పారిశ్రామిక పార్కుల్లోని ప్లాట్లలో 5 శాతం మహిళా పారిశ్రామికవేత్తలకు, 15 శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తారు.» ప్రైవేటు ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు స్టాంప్ డ్యూటీ, విద్యుత్ చార్జీలు, భూమి ధరల్లో రాయితీలు ఇస్తామని ప్రకటించారు.» 2050 నాటికి రాష్ట్రమంతటా పారిశ్రామిక అభివృద్ధి కోసం ‘మెగా మాస్టర్‌ప్లాన్ 2050’ పాలసీ తెస్తామని ప్రభుత్వం తెలిపింది.» పాలసీలో భాగంగా ఐటీ, ఫార్మా, హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, మెటల్, చేనేత, ఆభరణాల తయారీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు.» జాతీయ రహదారి 163కు ఇరువైపులా హైదరాబాద్– వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటును ప్రతిపాదించారు. -
బీసీలకు సంక్షేమం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్ భారీ ఊరటనిచ్చింది. 2025– 26 బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు రూ.11,405 కోట్లు కేటాయించారు. ఇందులో శాఖాపరమైన అవసరాల కోసం రూ.1,008 కోట్లు కేటాయించగా.. సంక్షేమ పథకాల కోసం రూ.10,397 కోట్లు కేటాయించారు. 2024–25 బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు రూ.9,200.32 కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.2,204 కోట్లు అదనంగా ప్రతిపాదించారు.వివిధ కులాలకు చెందిన ఒక్కో ఆర్థిక సహకార సంస్థకు రూ.50 కోట్లు చొప్పున కేటాయించారు. వడ్డెర, కృష్ణబలిజ, వాల్మీకి బోయ, భట్రాజు, విశ్వబ్రాహ్మణ, శాలివాహన, కల్లుగీత, సగర, నాయీబ్రాహ్మణ, వాషర్మెన్, ముదిరాజ్, కుమ్మర, మున్నూరుకాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర కార్పొరేషన్లకు నిధులు ప్రతిపాదించారు. రజక, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్లకు విద్యుత్ చార్జీల రాయితీకి రూ.100 కోట్లు చొప్పున కేటాయించారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు కేటాయించారు.‘రాజీవ్ యువ వికాసం’తో స్వయం ఉపాధి4 ప్రధాన సంక్షేమ శాఖలకు తాజా బడ్జెట్లో రూ.34,079 కోట్లు కేటాయించారు. ఇందులో బీసీ శాఖకు రూ.11,405 కోట్లు, ఎస్సీడీడీకి రూ.11,561 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.7,522 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.3,591 కోట్లు కేటాయించారు. షెడ్యూల్డ్ కులాల అభి వృద్ధి శాఖకు తాజా బడ్జెట్లో రూ.11,561 కోట్లు కేటా యించారు. ఇందులో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురు కుల విద్యా సంస్థల సొసైటీకి రూ.4,394.68 కోట్లు కేటా యించారు. దళితబంధు పథకానికి (అంబేడ్కర్ అభయ హస్తం) రూ.1,000 కోట్లు ప్రతిపాదించారు.గతేడాది రూ.2 వేల కోట్లు ప్రతిపాదించినప్పటికీ నిధులు విడుదల చేయకపోవడం గమనార్హం. కాగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు రూ.7,522 కోట్లు కేటాయించారు. గిరిజన గురు కుల సొసైటీకి రూ.667.89కోట్లు ప్రతిపాదించారు. మైనా ర్టీ సంక్షేమ శాఖకు రూ.3,591 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే మైనార్టీ సంక్షేమానికి రూ.589 కోట్లు అధికంగా కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ రాజీవ్ యువ వికాసాన్ని కొత్తగా ఆవిష్కరించింది. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.6వేల కోట్లు కేటాయించింది. సంక్షేమ శాఖలకు సంబంధించి కార్పొరేషన్ల ద్వారా రాయితీ పద్ధతిలో ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందించనుందిరాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు ఈసారి బడ్జెట్లో రూ.2,862 కోట్లు కేటాయించారు. ఇందులో శాఖాపరమైన నిర్వహణకు రూ.973 కోట్లు, సంక్షేమ పథకాల కోసం రూ.1,888 కోట్లు కేటాయించారు.కార్మిక సంక్షేమ శాఖకు రూ.900 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ కింద రూ.479 కోట్లు, పథకాల కింద రూ.421 కోట్లు ప్రతిపాదించారు. -
అంకెల్లో పెరిగింది శాతంలో తగ్గింది
తాజా బడ్జెట్లో ప్రభుత్వం విద్యా రంగానికి రూ.23,108 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.1,816 కోట్లు ఎక్కువని పేర్కొంది. మొత్తం బడ్జెట్లో విద్యాశాఖ వాటా 7.57 శాతంగా ఉంది. అయితే గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపు పెరిగినా, మొత్తం బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కేటాయింపుల శాతం తగ్గింది. 2024–25 బడ్జెట్ మొత్తం రూ.2,74,058 కోట్లు. ఇందులో విద్యా రంగం కేటాయింపులు రూ.21,292 కోట్లు అంటే మొత్తం బడ్జెట్లో 7.77 శాతం. కానీ 2025–26 మొత్తం బడ్జెట్ రూ.3,04,965 కోట్లు. ఇందులో విద్యారంగానికి కేటాయింపులు రూ.23,108 కోట్లు. అంటే 7.57 శాతం. అంటే 2024–25తో పోల్చుకుంటే ఈసారి విద్యకు 0.20 శాతం మేర కేటాయింపులు తగ్గాయన్నమాట. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బోధన, విశ్వవిద్యాలయాల ఆధునీకరణ, బోధనా సిబ్బంది నియామకాలు, ఉన్నత విద్యలో సాంకేతిక పురోగతి, నైపుణ్యాభివృద్ధి కల్పన, ప్రభుత్వ వర్సిటీల పరిధిలో తీసుకొచ్చే కొత్త కంప్యూటర్ కోర్సులకు మౌలిక వసతులు కల్పనకు సరిపడా నిధుల కేటాయింపు జరగలేదని విద్యారంగ నిపుణులు అంటున్నారు. విద్య పద్దులో ఇవీ కీలకాంశాలు.. పాఠశాల విద్యకు రూ.19,341.23 కోట్లు కేటాయించారు.గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.13,763 కోట్లు ఎక్కువ. కేటాయింపుల్లో 91 శాతం టీచర్లు, సిబ్బంది వేతనాలకే ఖర్చవుతుంది. గత ఏడాది కొత్తగా 10 వేల మంది టీచర్లనియామకం చేపట్టారు. దీంతో వేతనాల ఖర్చు పెరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా26 వేల ప్రభుత్వస్కూళ్ళున్నాయి.వీటిల్లో 3 వేల స్కూళ్ళల్లో డిజిటల్ విద్య, మరో 1,500 స్కూళ్ళల్లో ఏఐ టెక్నాలజీతో బోధనచేపడతామని ప్రభుత్వం తెలిపింది. తొలిదశలో రూ.50 కోట్లు ఖర్చవుతుందని విద్యాశాఖ అంచనా వేయగా..ప్రస్తుతబడ్జెట్లో రూ.40 లక్షలు కేటాయించారు. పరీక్షల నిర్వహణకు రూ.6 కోట్ల నుంచి రూ.7.50 కోట్లకు నిధులు పెంచారు. ఉన్నత విద్యలో సమూల మార్పుల దిశగా అనేకనివేదికలు రూపొందించారు. ఇప్పటికే వర్సిటీల్లో కొత్త కోర్సులు తీసుకొచ్చారు. కంప్యూటర్ అనుబంధ కోర్సులకు ప్రత్యేక మౌలిక వసతుల కల్పన అవసరం. వీటికోసం రూ.500 కోట్లు కావాలని ప్రతిపాదించినా వాటి ఊసు లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రూ.2,900 కోట్లే.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రూ.11,600 కోట్ల మంజూరుకు పాలనపరమైన అనుమతులూ ఇచ్చింది. కానీ ప్రస్తుత బడ్జెట్లో ఈ స్కూళ్ళ నిర్మాణానికి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.2,900 కోట్లే కేటాయించింది. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్లు వెచ్చించినా, ఈ ఏడాది మొదలు పెట్టే స్కూళ్ళ సంఖ్య 15కు మించే అవకాశం లేదు. నైపుణ్యాభివృద్ధి దిశగా కాలేజీల్లో స్కిల్ కోర్సులు, ఏఐ విద్యా విధానం ప్రతిపాదనలు సిద్ధం చేసినా... వీటికి నిధుల కేటాయింపును చూపించలేదు. పారిశ్రామిక కార్పస్ ఫండ్ నుంచి వీటిని అమలు చేయాలనే ఆలోచనతో ఉంది. 6 గ్యారంటీలు 56 వేల కోట్లుసాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన ప్రధాన హామీలైన ఆరు గ్యారంటీల కోసం బడ్జెట్లో రూ.56,084 కోట్లు కేటాయించారు. వీటికి వరుసగా రెండో ఏడాది కూడా ప్రాధాన్యమిస్తూ గత బడ్జెట్లో కేటాయించిన దాని కంటే రూ.9వేల కోట్ల వరకు అదనంగా ప్రతిపాదించడం విశేషం. రైతుభరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, సన్నధాన్యానికి బోనస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు ఈ నిధులను కేటాయిస్తున్నట్టు బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు. రైతు భరోసాకు గత ఏడాది కంటే రూ.3వేల కోట్లు పెంచగా, గత ఏడాది తరహాలోనే పింఛన్లకు నిధులు చూపెట్టారు. అంటే ఈసారి కూడా పింఛన్ల పెంపు హామీ పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడం లేదని బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక, నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అవసరమయ్యే 4 లక్షలకుపైగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.12,571 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఇళ్ల నిర్మాణంలో కేంద్రమిచ్చే సాయం పోను ఈ నిధులు సరిపోతాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతి, గృహలక్ష్మికి తగిన కేటాయింపులు చేశామని అంటున్నాయి. అయితే, మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున భృతి ఇస్తామనే ముఖ్యమైన గ్యారంటీతోపాటు ఆరు గ్యారంటీల్లోని ఇతర అంశాలను బడ్జెట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. అంటే ఆ గ్యారంటీల అమలుకు మరో ఏడాది ఆగాల్సిందేనన్న మాట. రోడ్లు, భవనాల శాఖకు రూ.5,907 కోట్లుసాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖకు ప్రభుత్వం రూ.5,907 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో రీజినల్ రింగురోడ్డుకు గత బడ్జెట్లో చూపినట్టుగానే రూ.1,525 కోట్లను చూపింది. భూసేకరణకు వీటిని వినియోగించనున్నారు. గత బడ్జెట్లో ఈ నిధులను చూపినా, వాటిని వినియోగించలేదు. ఇక మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్ల నిర్మాణానికి రూ. 50 కోట్లను మాత్రమే ప్రతిపాదించింది. జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల కోసం రూ.300 కోట్లు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.251 కోట్లు కేటాయించింది. హైబ్రిడ్ యాన్యూట్ మోడ్‌లో రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను రూ.300 కోట్లను బడ్జెట్లో చూపింది.