మీ ఆధార్‌ డేటా భద్రమేనా? | Data of all Aadhaar number holders is safe | Sakshi
Sakshi News home page

మీ ఆధార్‌ డేటా భద్రమేనా?

Mar 3 2026 4:32 AM | Updated on Mar 3 2026 4:32 AM

Data of all Aadhaar number holders is safe

సాక్షి, హైదరాబాద్‌: ఆధార్‌ నంబర్‌.. యునీక్‌ ఐడెంటిఫికేషన్‌ అథా­రిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేసే 12 అంకెల ప్రత్యేక సంఖ్య భారతీయ పౌరులకు గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంక్‌ ఖాతా మొదలు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మొబైల్‌ సిమ్‌ కార్డు దాకా అనేక సేవల్లో ఆధార్‌ వినియోగం పెరిగింది. ఈ  నేపథ్యంలో ఆధార్‌ డేటా భద్రత అత్యంత కీలకంగా మారింది. ఆధార్‌ వివ­రా­లను నిర్లక్ష్యంగా అప­రి­చి­తులతో పంచుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమా­దం ఉందని పోలీసులు హెచ్చ­రిస్తున్నారు. ఆధార్‌ కార్డును ఎవరికీ ఈ–మెయిల్‌ చేయవద్దని సూచిస్తున్నారు.

ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించి మోసగాళ్లు కొత్త సిమ్‌లు తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలకు లేదా ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల బాధితులకు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటు­న్నారు. అలాగే దొంగిలించిన ఆధార్‌ వివరాలతో కేటుగాళ్లు బాధితుల పేరిట రుణాలు తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అనేక సేవలకు ఆధార్‌ అనుసంధాన­మై ఉండటం వల్ల అది లీక్‌ అయితే వ్యక్తిగత గోప్యతకు పెద్ద ముప్పుగా మారుతుందని.. ఫోన్, ఎస్‌ఎంఎస్, ఫేక్‌ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ద్వారా సైబర్‌ మోసగాళ్లు ఆధార్‌ వివరాలు దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలా రక్షించుకోవాలి?
⇒  ఆధార్‌ నంబర్, ఓటీపీ ఎవరితోనూ పంచుకోవద్దు
⇒  అపరిచిత లింక్‌లలో ఆధార్‌ వివరాలు నమోదు చేయవద్దు
అవస­రమైతే పూర్తి ఆధార్‌ బదులుగా మాస్క్‌డ్‌ ఆధార్‌ వినియోగించాలి 
యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఆధార్‌ లాక్‌/అన్‌లాక్‌ సదుపాయాన్ని ఉపయోగించాలి
అను­మా­నాస్పద కార్యక­లాపాలు గమనిస్తే వెంటనే సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement