breaking news
Krishna
-
మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకా మరి.. శ్మశానాన్నీ వదల్లేదు
సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో శ్మశాన వాటికలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. మచిలీపట్నంలో క్రైస్తవుల స్మశాన వాటికను టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ కబ్జా చేసేశారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో క్రైస్తవులకు ఏర్పాటు చేసిన స్మశాన వాటికకు టీడీపీ నేత తాళం వేశారు. క్రైస్తవుల స్మశాన వాటిక కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడు ఎకరాలు కొనుగోలు చేశారు. క్రైస్తవుల స్మశాన వాటిక నిర్వహణను నగరపాలక సంస్థకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది.నగరపాలక సంస్థ నిర్వహణలో ఉన్న స్మశాన వాటికను తన చేతుల్లోకి తీసుకున్న టీడీపీ నేత.. స్మశాన వాటికను తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. స్మశాన వాటికకు తాళం వేసి.. టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ తన గేదెలను పెంచుకుంటున్నారు. దీంతో టీడీపీ నేతపై మున్సిపల్ కమిషనర్‌కు క్రైస్తవులు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటున్న టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రాణనష్టం నివారణపై మెగా మాక్ డ్రిల్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రమాదాల సమయంలో భద్రతా సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడి, ప్రాణనష్టాన్ని నివారించే విషయంపై విజయవాడ డివిజన్లో ఎన్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, ఫైర్, రైల్వే బ్రేక్ డౌన్, స్టేట్ గవర్నమెంట్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు సంయుక్తంగా మెగా మాక్ డ్రిల్‌ను శుక్రవారం నిర్వహించాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ (పీసీఎస్ఓ) కె.వెంకటరమణారెడ్డి, డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పర్యవేక్షణలో ఫోన్‌మెన్ బంగ్లా వద్ద రైల్వే అప్యార్డ్ కాలనీలో మాక్ డ్రిల్ జరిగింది. ప్రమాదానికి గురైన రెండు రైల్వే కోచ్‌లు ఒకదానిపై ఒకటి వేలాడుతుండగా.. అందులోని ప్రయాణికులు రక్తపు గాయాల మధ్య ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఉండే విధంగా నెలకొల్పారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీం, వైద్య బృందం, సివిల్ డిఫెన్స్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టా యి. ఎన్డీఆర్ఎఫ్ బృందం రైల్వే కోచ్‌లలో ఇరు క్కుపోయిన ప్రయాణికులను సురక్షితంగా రక్షించేందుకు అత్యాధునిక టూల్స్ ఉపయోగించారు. రైల్వే కోచ్‌ల కిటికీలు, రూఫ్‌లు కట్ చేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వీరికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లలో వైద్యులు ప్రథమ చికిత్స చేసి అనంతరం అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. కొన్ని కోచ్‌లకు మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సిబ్బందిని సంసిద్ధం చేసే నిరంతర చర్య మాక్ డ్రిల్ అనంతరం పీసీఎస్ఓ కె. వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో ఏ సమయంలో అయినా సిబ్బందిని సంసిద్ధత చేసే నిరంతర చర్య మాక్ డ్రిల్ అని పేర్కొన్నారు. మాక్ డ్రిల్స్ ద్వారా రియల్ టైమ్‌లో సిబ్బంది పనితీరు ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రాణనష్టం నివారించే లక్ష్యంగా ఇటువంటి మాక్‌డ్రిల్స్ ఉపయోగపడతాయన్నారు. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ డివిజన్లో ఇటువంటి మాక్ డ్రిల్స్ సిబ్బందిలోని సమన్వయాన్ని మెరుగుపరుస్తుందన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు పీ.ఈ.ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అల్లూరి, పింగళి చిరస్మరణీయులు
చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్యలు చిరస్మరణీయులని కలెక్టర్ డీకే బాలాజీ కొనియడారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమం సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో వారు చేసిన సాయుధపోరాటం ప్రత్యేక అధ్యాయమన్నారు. మన్యం వాసుల కష్టాలు కడతేర్చడానికి బ్రిటీష్ వారిని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం జరిపి ప్రాణత్యాగం చేశారన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు. మహాత్మాగాంధీతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారన్నారు. ఇలాంటి ముఖ్యమైన నాయకుల కార్యక్రమాలు జరుపుకోవడం వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఇన్ చార్జి డీఆర్వో శ్రీదేవి, గిరిజన సంక్షేమాధికారి ఫణిధూర్జటి, కలెక్టరేట్ ఏవో ఏఎస్ఎన్ రాధిక, సిబ్బంది పాల్గొన్నారు. నివాళులర్పించిన కలెక్టర్, జేసీ -
వైద్య విద్యార్థులపై పోలీసుల తీరు దారుణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, తమకు శాశ్వత రిజిస్ట్రేషన్ కల్పించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులను జట్టుపట్టుకుని పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్ చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైద్య విద్యను నిర్వీర్యం చేస్తూ వైద్య కళాశాలల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం, విదేశాల్లో చదువుకున్న వారిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం అన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రారంభించిన 17 వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తి చేస్తే ఇక్కడే వైద్య విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందన్నారు. అయితే వైద్య కళాశాలల నిర్మాణాలను నిలిపివేసి, ఎన్ఎంసీ మంజూరు చేసి సీట్లు కూడా వద్దని చెప్పిన కూటమి ప్రభుత్వం, కనీసం విదేశాల్లో చదువుకున్న వారిని సైతం ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ‘సీఎం చంద్రబాబు కళాశాలలు ఏర్పాటు చేయరు, విదేశాల్లో చదువుకున్న వారికి పీఆర్ ఇవ్వరూ.. ఇదేం దాష్టికం’ అంటూ ప్రశ్నించారు. తక్షణమే ఎన్ఎంసీతో చర్చించి వారికి పీఆర్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పుల్లేరులో యువకుడి మృతదేహం లభ్యం ఉయ్యూరు: ఉయ్యూరు పరిధిలోని పుల్లేరు కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఉయ్యూరు పట్టణ పోలీసుల కథనం మేరకు రెల్లికాలనీకి చెందిన రావులపూడి సాయిచంద్రశేఖర్ (25) ఉయ్యూరు మున్సిపాలిటీలోని ప్రజారోగ్య విభాగంలో ఔట్ సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి ప్రమాదవశాత్తూ కాలుజారి పుల్లేరు కాలువలో గల్లంతయ్యాడు. స్థానికుడు నాని ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు కాలువలో గాలింపు చేపట్టారు. మూడో వార్డు పరిధిలోని పుల్లేరు కాలువలో తూడులో చిక్కుకుని చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. కాగా చంద్రశేఖర్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ -
ఇంటింటికీ తెలియజేయండి
చంద్రబాబు మోసాలను వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్రెడ్డిమొగల్రాజపురం (విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన మోసాలను వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి తెలియజేయాలని ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని మారుతీనగర్ రామాలయం వీధిలోని లయన్స్ భవన్లో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ క్యూ ఆర్ కోడ్ ఆవిష్కరించే కార్యక్రమం శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథి వేణుగోపాల్‌రెడ్డి క్యూ ఆర్ కోడ్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పట్టించుకోవడం లేదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిచాడని.. సూపర్‌సిక్స్ పథకాలను నమ్మి ఓట్లు వేసిన ఓటర్లు మాత్రం ఓడిపోయారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆయన విలువ రాష్ట్ర ప్రజలకు తెలిసిందన్నారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మాటలు నమ్మి తాము మోసపోయామని కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని టీడీపీ నాయకులే చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ నాయకుల ఫోన్లను కూడా అధికారులు, పోలీసులు లిఫ్ట్ చేసేవారు కాదని చెప్పారు. మార్పు కనిపిస్తోందివైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలు, పరామర్శలకు వస్తున్న ప్రజాధరణను చూసి అధికారుల్లో సైతం మార్పు కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నాయకులు ఫోన్లకు స్పందించడమే కాకుండా గౌరవంగా మాట్లాడుతున్నారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటూ ప్రజలు ఒత్తిడి చేస్తుండటంతో రానున్న రోజుల్లో కూటమిలోని నాయకులు బయట తిరగలేని పరిస్థితులు వస్తాయన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను వైఎస్సార్ సీపీ శ్రేణులు మరింతగా ప్రచారం చేయాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వారితో నేతలు, కార్యకర్తలు మాట్లాడాలన్నారు. విజయవాడను నిర్లక్ష్యం చేస్తే సహించం.. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ తాము అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్థి పేరుతో విజయవాడను నిర్లక్ష్యం చేస్తే సహించబోమన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో నగరాభివృద్ధివైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రూ.600 కోట్లతో నగరాభివృద్ధి చేశామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల కంటే తాము అధికారంలోకి వస్తే మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కలిసి బాండ్లు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇలా ఏ పథకాన్నీ అమలు చేయలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధినే తాను చేశానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పుకుంటున్నారన్నారు. వైఎస్సార్ సీపీని వదిలి వెళ్లిన నాయకులంతా మళ్లీ వచ్చి పార్టీలో చేరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని అవినాష్ పేర్కొన్నారు. కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, నాయకులు కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు అడపా శేషు, పుప్పాల కుమారి, రామిరెడ్డి, అంబేడ్కర్, అమర్నాథ్, నిర్మలాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
రేపు రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డుల ప్రదానం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వృత్తిపట్ల నిబద్ధత, సేవాభావంతో సేవలందిస్తున్న వైద్యులను రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డులతో సత్కరించనున్నట్లు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఇచ్చే అవార్డులకు ఏపీ, తెలంగాణాకు చెందిన పలువురు వైద్యులను ఎంపిక చేసినట్లు తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ మొగల్రాజపురం సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ లక్ష్మీశలు అతిథులుగా పాల్గొని అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. గుంటూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్.మురళిబాబురావుకు జీవన సాఫల్య పురస్కారం ఇస్తున్నట్లు తెలిపారు. రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డులను విజయవాడకు చెందిన సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ లింగమనేని సుబ్బారావు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అవిర్నేని శశిబాల, హైదరాబాద్‌కు చెందిన సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఆయుర్వేద విభాగంలో ఫిజీషియన్ డాక్టర్ ఏ గాయత్రీదేవి, న్యాచురోపతి విభాగంలో ఫిజీషియన్ డాక్టర్ చింతా రవికుమార్, సేవా రంగంలో హీల్ పేరడైజ్ చైర్మన్ డాక్టర్ కోనేరు సత్య ప్రసాద్‌కు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చందు శ్రీనివాస్, డాక్టర్ పద్మజ, జయకామేశ్వరి, కె.పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. -
రిమాండ్‌కు హత్య కేసు నిందితులు
జి.కొండూరు: చెవుటూరులో హైమావతిని(65)ని హత్య చేసిన ఆమె మనవడు ఉమ్మడి వేణుగోపాలరావుతో పాటు అతడికి సహకరించిన స్నేహితుడు ఆకుల గోపిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు తెలిపారు. నిందితులు ఇద్దరిని శుక్రవారం సాయంత్రం జి.కొండూరు పోలీసుస్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యకు గల కారణాలను వెల్లడించారు. ఏసీపీ మాట్లాడుతూ ఆస్తి పంపకాల విషయమై వివాదం తలెత్తి నాయనమ్మ, తాతయ్యను హతమార్చితే ఆస్తి తనకే వస్తుందని భావించిన నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. పరిటాలలో నివాసం ఉంటున్న నిందితుడు వేణుగోపాలరావు అతడి స్నేహితుడు గోపీతో కలిసి ఈ నెల ఒకటో తేదీన బైక్‌పై చెవుటూరు వచ్చారన్నారు. వేణుగోపాలరావు నాయనమ్మ హైమావతి కదలికలను పసిగట్టారన్నారు. హైమావతి పశువులను మేపేందుకు గ్రామ శివారులోని పొలాల్లోకి వెళ్లగా ఉదయం 11.15 గంటల సమయంలో నిందితుడు వేణుగోపాలరావు అక్కడికి వెళ్లి వెదురు కర్రతో దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కదలికలను పసిగట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించి, నిందితులను త్వరితగతిన అదుపులోకి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మైలవరం సీఐ దాడి చంద్రశేఖర్, జి.కొండూరు ఎస్ఐ కె.సతీష్‌కుమార్, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
ఎవరి జేబులోకెళ్లాయో!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామినర్స్‌కు రెమ్యునరేషన్ నిధులు ఎటు వెళ్లాయో అంతుచిక్కడం లేదు. ఎందుకంటే ఇంటర్ బోర్డు అధికారులేమో రెమ్యునరేషన్ ఇచ్చేశామని చెబుతుంటే ఎగ్జామినర్స్ అందలేదని స్పష్టం చేస్తున్నారు. ఇంటర్‌బోర్డు అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల తీరుతో అధ్యాపకులు అల్లాడుతున్నారు. గడిచిన రెండేళ్లుగా అధ్యాపకులకు బోర్డు నుంచి రావాల్సిన నిధులు పక్కదారి పట్టినట్లు ప్రచారం జరుగుతున్నా అధికారు లెవరూ నోరు విప్పడం లేదు. వివరాల్లోకి వెళితే ఇంటర్మీడియెట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన రెమ్యూనరేషన్లు విధులు నిర్వహించిన అధ్యాపకులకు బిల్లుల చెల్లింపులో రెండేళ్లుగా అనేక అవకతవకలు జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐపీఈ (ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్) పరీక్షల్లోనూ, సప్లిమెంటరీ పరీక్షల్లోనూ ప్రయోగ పరీక్షలు తప్పనిసరి. వీటిలో పాల్గొనే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఒకేషనల్ ఎగ్జామినర్లకు రెండేళ్లుగా రెమ్యూనరేషన్లు బకాయి పెట్టారు. జిల్లాలో సుమారు 250 మంది ఎగ్జామినర్లు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి వారు పని చేసిన రోజుల మేరకు సుమారు రూ.7500 నుంచి రూ.15 వేల వరకు రావాల్సి ఉంది. ఈ బకాయిలు రాష్ట్రంలో కోట్లలో ఉంటాయి. ఒప్పించి ప్రాక్టికల్స్ తంతు ముగించేశారు 2024 వృత్తి విద్యాకోర్సుల పరీక్షల బకాయిలు చెల్లిస్తేనే, 2025 సంవత్సరపు ప్రయోగ పరీక్షలు నిర్వహణకు సహకరిస్తామనీ, లేకపోతే బాయ్ కాట్ చేస్తామని అధ్యాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే విధులకు హాజరు కావాలని బోర్డు అధికారులు ఎలాగోలా ఒప్పించి ప్రాక్టికల్స్ తంతు ముగించేశారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా 2024కు సంబంధించి రెమ్యునరేషన్ ఎవరికీ చెల్లించలేదని వారు చెబుతున్నారు. ఈ ఏడాది సైతం అరకొరగానే చెల్లింపులు జరిగాయని వివరిస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలోని కమిషనర్ కార్యాలయంలో ఉండే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంప్రదించి రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్లందరికీ న్యాయం చేయాలని విన్నవించినా స్పందన కరువైందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కదారి పట్టాయనే ఆరోపణలు రాష్ట్రంలో ఇలాంటి అధ్యాపకులు సుమారు 2500 నుంచి 3000 మంది వరకు ఉన్నారు. వీరికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు పెద్దస్థాయి ఉద్యోగులు పక్కదారి పట్టించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ బోర్డు అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు తెర తీసిన విధానాలు ప్రస్తుత స్థితికి కారణమని తెలుస్తోంది. గతేడాది మూల్యాంకనం చేసిన అధ్యాపకుల రెమ్యునరేషన్లు సైతం కొంతమందికి పూర్తిగా చెల్లించలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరికి నిధులలేమి కారణం చూపిస్తూ కోత విధించారని తెలిసింది. నిబంధనల మేరకు కేటాయించిన నిధులు ఏమయ్యాయని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్మీడియెట్ అధికారులబాధ్యతారాహిత్యం ప్రాక్టికల్ ఎగ్జామినర్ల రెమ్యునరేషన్ బకాయిలపై అధ్యాపకుల ఆగ్రహం రెండేళ్లుగా రెమ్యునరేషన్ ఎగ్గొట్టడంపై తీవ్ర విమర్శలు పేద విద్యార్థుల అడ్మిషన్ ఫీజులూ అడ్డుగోలుగా వసూళ్లు వృత్తి విద్యా కోర్సుల మొదటి ఏడాది ఫీజులపై ఫిర్యాదు చేసినా స్పందన సున్నా వృత్తివిద్యా కోర్సుల ఫీజులు గందరగోళం ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్న మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశ రుసుం విషయంలో ఇంటర్మీడియెట్ అధికారులు గందరగోళానికి అవకాశం ఇస్తున్నారు. కమిషనర్ ఆదేశాల ప్రకారం వృత్తివిద్యలో చేరిన విద్యార్థులు రెండురకాల లేబొరేటరీ ఫీజులను మాత్రమే చెల్లించాలి. కానీ గ్రూప్–డి ల్యాబ్ ఫీజు రూ.495 సైన్స్ విద్యార్థుల నుంచి మాత్రమే వసూలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఒకేషనల్ విద్యార్థుల నుంచి కూడా ఆ మొత్తాన్ని కొంతమంది ప్రిన్సిపాళ్లు వసూలు చేస్తున్నారని సమాచారం. దీంతో ఒకేషనల్ అడ్మిషన్లపైనా వ్యతిరేక ప్రభావం చూపుతోందనీ అధ్యాపకులు వాపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం పుస్తకాలు, నోట్సులు, బ్యాగు, ఉచిత భోజనం అందిస్తూ ప్రవేశాలు పెరిగేందుకు కృషి చేస్తుంటే, పేద విద్యార్థులపై అదనపు ఫీజు భారం మోపడం అన్యాయమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం కోరితే నిర్లక్ష్య సమాధానం ఒకేషనల్ కోర్సులో 2025–2026 విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది వృత్తివిద్య గ్రూపులో చేరబోయే విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెల్లించవలసిన మొత్తం ఫీజు ఎంతో తెలియజేయగలరని ఆర్టీఐ చట్టం క్రింద భీమవరానికి చెందిన కె.శ్రీనివాసరావు సమాచారం కోరారు. గ్రూప్–డి ల్యాబ్ ఫీజు విషయంలోనూ స్పష్టమైన వివరాలు పంపాలనీ నివేదించారు. దీనికి సంబంధిత హోదాలో ఉన్న అధికారి సమాచారం ఇవ్వ కుండా తిరస్కరించారని తెలిసింది. దరఖాస్తుదారు మళ్లీ బోర్డుకు అప్పీలు చేశారు. దీనిపైనా స్పష్టత కరువైందని దరఖాస్తుదారుడు చెబుతున్నారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
● ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ● ఐదుగురుకి తీవ్ర గాయాలు జి.కొండూరు: ఆర్టీసీ బస్సు, డీసీఎం వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. బస్సులో 30 మంది వరకు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఐదుగురు వ్యక్తులకు గాయాలై ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలలోకి వెళ్తే.. తెలంగాణా రాష్ట్రం, వరంగల్ జిల్లా, హన్మకొండ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి గుంటూరుకు వస్తుంది. ఇదే క్రమంలో గుంటూరు జిల్లా గనపవరం నుంచి పీవీసీ కిటికీ డోర్ల లోడుతో డీసీఎం వాహనం తెలంగాణా రాష్ట్రంలోని కొత్తగూడెంకు బయలుదేరింది. జి.కొండూరు శివారులోకి రాగానే 30 నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు వాహనాల క్యాబిన్లు ఒకదానిలోకి మరొకటి చొప్పించుకుపోయి బస్సు డ్రైవర్ బట్టి నర్సింహరావు రెండు కాళ్లు ఇరుక్కుపోయాయి. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జి.కొండూరు ఎస్ఐ సతీష్‌కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒక జేసీబీ, క్రేన్ సాయంతో అర్ధగంటపాటు శ్రమించి రెండు వాహనాలను విడదీశారు. బస్సు డ్రైవర్ నర్సింహరావుని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ నర్సింహరావుకు ఎడమకాలు విరిగిపోగా మరొక డ్రైవర్ జానపరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్లు ఇద్దరూ హన్మకొండకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా డీసీఎం వాహనం క్యాబిన్లో ఉన్న వల్లూరి సందీప్ కుడి చేతికి రెండు వేళ్లు తెగిపోయాయి. గర్నెపూడి రత్నకుమార్ తలకు స్వల్ప గాయమైంది. గర్నెపూడి ఉదయ్‌భాస్కర్ కుడి కాలు విరిగిపోగా, ఎడమ కాలు పాదం తెగిపోయింది. డ్రైవర్ గుంటుపల్లి నాగప్రసాద్కి ఎటువంటి గాయాలు కాలేదు. డీసీఎం వాహనంలో డ్రైవర్ మినహా ప్రయాణిస్తున్న ముగ్గురు క్షతగాత్రులు కూడా గుంటూరు శివారు బుడంపాలెంలో నివాసం ఉంటూ గనపవరం పీవీసీ కిటీకీల డోర్ల తయారీ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిసింది. క్షతగాత్రులు అందరినీ రెండు అంబులెన్స్‌లలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణహాని లేదని పోలీసులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది వరకు ప్రయాణికులకు ఎటువంటి గాయాలు లేకపోవడంతో వారందరూ వేరే వాహనాల్లో గమ్య స్థానాలకు చేరుకున్నారు. ఎడమవైపు వెళ్లాల్సిన బస్సు కుడి వైపునకు వచ్చి డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన క్రమంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపారు. -
బీమా.. రైతుకు భారం
కృష్ణాజిల్లాలో సాగు విస్తీర్ణం : 1.79 లక్షల హెక్టార్లు పసుపు సాగు : 2,200 హెక్టార్లు కంకిపాడు: రైతు సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించింది. రైతులపై భారం మోపుతోంది. ప్రీమియం సొమ్ము చెల్లిస్తేనే పంటల బీమా వర్తించేలా మార్గదర్శకాలను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. కూటమి అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలపై కోట్లాది రూపాయల ప్రీమియం భారం పడుతోంది. మరోవైపు అన్నదాత సుఖీభవ ఎప్పుడు అందుతుందో తెలియక, సాగుకు పెట్టుబడుల కోసం రైతులు దిగులు చెందుతుంటే ప్రీమియం సొమ్ము చెల్లించాలంటూ అధికారులు తెస్తున్న ఒత్తిడి తలకు మించిన భారంగా మారిందంటూ ఆవేదన చెందుతున్నారు. 4.47 లక్షల ఎకరాల్లో సాగుభూమి కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో 4.47 ఎకరాల్లో (1.78 లక్షల హెక్టార్లు) సాగు భూమి ఉంది. ప్రధానంగా వరి, చెరకు, పసుపు, పత్తి, వేరుశనగ, కూరగాయలు, కంద కూరగాయలు సాగులో ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగుకు ఉపక్రమించారు. జిల్లాలో వ్యవ సాయ పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. పంటల బీమా నుంచి తప్పుకున్న కూటమి సర్కార్ కూటమి సర్కార్ పంటల బీమా నుంచి కూడా తప్పుకుంది. రైతు నెత్తిన భారాన్ని మోపి చోద్యం చూస్తోంది. కృష్ణా జిల్లాలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి, పసుపు పంటలను ఎంపిక చేశారు. జిల్లాలో 1.68 లక్షల హెక్టార్లు (4.21 లక్షల ఎకరాలు) సాగు జరుగుతుంది. వరిని గ్రామం యూనిట్ కింద ఎకరాకు రైతు వాటాగా రూ.830 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంది. పసుపు పంటకు జిల్లా యూనిట్‌గా బీమా వర్తింపజేయనున్నారు. జిల్లాలో 5,500 ఎకరాల్లో పసుపు సాగు జరగనుంది. దీనికి ఎకరానికి రూ.1,100 ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో రైతులపై భారం ఈ రెండు పంటలకు వర్తింపజేయనున్న బీమాకు రైతులపై రూ 35.56 కోట్లు మేరకు భారం పడ నుంది. వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు ఆగస్టు 15వ తేదీ కాగా, పసుపు పంటకు జులై 31 ఆఖరిగడువుగా నిర్దేశించారు. ఎప్పుడు అందుతుందో.. అప్పుడే రెండో ఏడాదిలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తోంది. అధికారులు ఓ వైపు అర్హుల జాబితాను రూపొందించే పనిలోనే ఉన్నారు. ఈ ఏడాది అన్నదాత సుఖీభవ సొమ్ము ఎప్పటికి రైతు ఖాతాలకు చేరుతుందో తెలీని దిక్కుతోచని స్థితి. ఖరీఫ్ సాగుకు పెట్టుబడులు సమకూర్చుకోవటం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే పంటల బీమా పొందేందుకు ప్రీమియం చెల్లించాల్సిందేనని సర్కారు తేల్చి చెప్పటం, ఉత్తర్వులు జారీ చేయటం పట్ల అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పంటల బీమాకు తిలోదకాలు ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ప్రీమియం చెల్లించాలి కృష్ణా జిల్లాలో వరి, పసుపు పంటలకు బీమా జిల్లా రైతులపై రూ.35.56 కోట్లు భారం వరి సాగు : 1.68 లక్షల హెక్టార్లు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజననాడు వైఎస్సార్ సీపీ హయాంలో ఉచిత బీమా ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో ప్రధాన మంత్రి ఫసల్ బీమా అమలుకు పాలకులు చర్యలు తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట దిగుబడులకు నష్టం వాటిల్లితే రైతులకు ఆర్థిక సాయం అందించడం, వాతావరణ అంశాల ఆధారంగా సంభవించిన నష్టంతో దిగుబడులు తగ్గితే బీమా పరిహారం చెల్లించడం ప్రధాన మంత్రి ఫసల్ బీమా ఉద్దేశం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ బీమాను ప్రభుత్వమే భరించింది. ఉచితంగా వైఎస్సార్ పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంది. అన్నదాత సుఖీభవ ఏదీ? రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్న ప్రధాన హామీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాలన చేపట్టి ఏడాది దాటుతున్నా ఇప్పటి వరకూ రైతు సంక్షేమానికి బాటలు వేయలేదు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట మేరకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు అందించాల్సి ఉంది. తొలి ఏడాది జిల్లాలో రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఆషాఢ సారె, శుక్రవారం నేపథ్యంలో కిటకిటలాడిన క్యూలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసే భక్త బృందాలతో పాటు శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గ మాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచే ఆలయ ప్రాంగణంలోని అన్ని క్యూలు భక్తులతో కిటకిటలాడాయి. మరో వైపున అమ్మవారికి సారెను సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తబృందాలు ఆలయానికి తరలివచ్చాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. రూ. 300 టికెట్టుపై భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు క్యూలను పర్యవేక్షించారు. సాయంత్రం అమ్మవారికి నిర్వహించిన పంచహారతుల సేవ, పల్లకీ సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
హిందూ సమాజంపై ఉగ్రదాడులకు అవకాశం
వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): హిందూ సమాజంపై ఉగ్రదాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వబిలిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందన్నారు. దీనికి ఉదాహరణగా ఇతర రాష్ట్రాల్లో అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని ఇక్కడకు వచ్చిన ఉగ్రవాదులు అబూబకర్ సిద్దిక్, మహ్మద్ ఆలీలలను అరెస్టు చేశారన్నారు. ఇటీవల రాయచోటిలో హిందువుల ఊరేగింపుపై దాడి చేయడం వంటి సంఘటనల వెనుక ఉగ్రమూకల కుట్ర ఉందన్నారు. ఇటీవల విజయనగరంలో కూడా కొందరు ఉగ్రవాదులను ఎన్ఐఏ గుర్తించిందన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శులు భూపతిరాజు సుబ్బరాజు, పర్రే కోటేశ్వరరావు, విజయవాడ మహానగర్ కార్యదర్శి కే.రామకృష్ణ, సహ కార్యదర్శి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎన్టీటీపీఎస్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ అగ్నిమాపక దళ విభాగంలోని వాహన డ్రైవర్ దొమ్మాళి కృష్ణారావు (57) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాదపడుతున్న అతనికి కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయించారు. అయినా అరోగ్యం సహకరించకపోవడంతో మళ్లీ విజయవాడ వైద్యశాల్లో చికిత్స చేయించి గురువారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. శుక్రవారం తెల్లవారే సమయానికి ఇంటి సమీపంలో ఆరుబైట కాలిన గాయాలతో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి భార్య, ఉద్యోగం చేస్తున్న కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కృష్ణారావు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సమస్యలపరిష్కారానికి కృషి
కోనేరుసెంటర్: సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కృష్ణా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఆయన పోలీసు దర్బార్ నిర్వహించారు. దీనిలో ఎస్పీ సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసువృత్తి కత్తిమీద సాములాటిదన్నారు. అలాంటి వృత్తిలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో మెలగాల్సి ఉంటుందన్నారు. యూనిఫామ్ మన ఐడెంటిటీని తెలియజేస్తుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ప్రధానమైందన్నారు. సివిల్ పోలీసులతో పాటు ఏఆర్ సిబ్బంది విశిష్టమైన సేవలను అందిస్తున్నారన్నారు. మీతో పాటు హోంగార్డులు సైతం పోలీసుశాఖకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సిబ్బంది సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. సిబ్బంది ఉద్యోగంతో పాటు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు దర్బారులో సిబ్బంది అనేక సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఇతర సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు. కృష్ణా ఎస్పీ గంగాధరరావు -
పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో సీఎస్ఆర్ నిధుల ద్వారా చేపట్టే పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ డీకే బాలాజీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో సీఎస్ఆర్ నిధుల ద్వారా చేపట్టే పనుల పురోగతిపై సమావేశం నిర్వహించి, మండలాల వారీగా శుక్రవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో నీటిని శుద్ధి చేసే సూక్ష్మ నీటి ఫిల్టర్లను నిర్మించటంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు సరైన శ్రద్ధ చూపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా బీపీసీఎల్, కోల్ ఇండియా తదితర కంపెనీల సీఎస్ఆర్ నిధులు సమకూర్చినప్పటికీ నాలుగు నెలలుగా పనులు పురోగతి సాధించకపోవటం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 53 ఫిల్టర్ల నిర్మాణ పనులు రూ. 8.59 కోట్ల వ్యయంతో మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు 25 పనులు మాత్రమే పూర్తి చేశారన్నారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని, మరో ఐదు పనులు ఇంకా ప్రారంభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ బిల్లుల చెల్లింపుల కోసం తన వద్దకు రావటం లేదన్నారు. అసలు పనులు జరుగుతున్నాయా లేదా అని అధికారులను ప్రశ్నించారు. బిల్లులు చెల్లించిన వాటికి వినియోగ ధ్రువీకరణ పత్రాలు సేకరించాలన్నారు. ఇంకా ప్రారంభించని పనులను రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. వాటి స్థానంలో కొత్త పనులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 702 ఇంకుడు గుంతలు నిర్మాణాలు మంజూరు కాగా అందులో 305 పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. మిగిలిన నిర్మాణాలు కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, నీటి సౌకర్యం లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నటరాజు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, సీపీఓ భీమరాజు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఎంఎంసీలో లెక్కలేనితనం
● మచిలీపట్నం నగరపాలక సంస్థ అకౌంట్స్ విభాగంలో అక్రమాలు ● కాంట్రాక్టర్ల నుంచి మినహాయించిన మొత్తాలను ఆయా శాఖలకు జమ చేయని వైనం ● బదిలీపై వచ్చిన కొత్త జేఏఓకు చార్జి అప్పగించని ఇన్చార్జి అకౌంటెంట్ ● లోపాలు బయటపడతాయని కార్యాలయంలో కనిపించని ఇన్చార్జి ఏఓ! మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నగర పాలక సంస్థ కార్యాలయం అకౌంట్స్ విభాగం అవినీతికి అడ్డాగా మారిందనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. కమిషనర్ కనుసైగల్లోనే ఈ విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేశారనేందుకు ఇక్కడ చోటు చేసుకున్న ఘటనలు బలం చేకూర్చుతున్నాయి. అకౌంటెంట్‌గా అనుభం లేని, అర్హత లేని జూని యర్ అసిస్టెంట్ మోహనగోపాల్ను ఆ సీట్లో నియమించి రూ.లక్షల ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా చెల్లింపులు చేశారనేది ప్రధాన విమర్శ. కమిషనర్‌తో పాటు ఇంజినీర్లు, అకౌంట్ ఆఫీసర్ సైతం అడ్వాన్స్‌ల రూపంలో రూ.లక్షల్లో నిధుల డ్రా చేసుకోవటం విమర్శలకు తావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా కూటమి పెద్దల ఆదేశాలతో ఏడాది కాలంగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు మాత్రం అత్యవసరం పేరుతో కౌన్సిల్ ఆమోదం లేకుండా బిల్లులు చెల్లించడం గమనార్హం. చార్జి అప్పగించని ఇన్చార్జ్ అకౌంటెంట్ పెడన మునిసిపాలిటీలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసిన జేఏఓ మల్లేశ్వరరావు నెలన్నర క్రితం ఎంఎంసీకి బదిలీపై వచ్చారు. దీంతో ఇక్కడ ఇన్చార్జ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న మోహనగోపాల్ను రెవెన్యూ విభాగానికి కమిషనర్ బదిలీ చేశారు. అయితే జేఏఓకు అకౌంట్స్‌కు సంబంధించిన ఫైల్‌తో చార్జ్ని అప్పగించాల్సిన గోపాల్ నూతన ఏఓకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. చార్జ్ అప్పగిస్తే ఈ అక్రమాల బాగోతం బయటపడుతాయనే అప్పగించటంలేదనే వాదనలు బాహాటంగానే వినవస్తున్నాయి. అందువల్లే గోపాల్ కార్యాలయంలో కూడా కనిపించడంలేదని సిబ్బంది సైతం పేర్కొంటున్నారు. చార్జ్ అప్పగించడంలో జాప్యం చేస్తున్నా కమిషనర్ కూడా మిన్నకుండి పోవటం విమర్శలకు తావిస్తోంది. సకాలంలో జమకాని జీఎస్టీ, ఐటీ నిధులు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన అనంతరం జీఎస్టీ రెండు శాతం, ఐటీ ఒక శాతం నిధులను ఎంఎంసీ మినహాయిస్తుంది. ఈ మొత్తాన్ని సకాలంలో ఆయా శాఖలకు ఏఓ జమ చేయాలి. కానీ ఇక్కడ అలా జరగకపోవటంతో ఆయా శాఖలు సంబంధిత కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ వసూళ్లకు పూనుకుంటున్నాయి. ఆయా శాఖలకు కార్పొరేషన్ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉన్నా ఏఓ ఇటీవల రూ.5 లక్షలను నగరంలోని ఓ అకౌంటెంట్ పేరుతో జమ చేయటం అనుమానాలకు తావిస్తోంది. నగరపాలక సంస్థలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా ఆడిట్, విజిలెన్స్, ఏసీబీ శాఖల అధికారులు కన్నెత్తి చూడకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజలకు ఉరితాడుగా మారిన 120 జీఓను రద్దు చేయాలని, పర్యావరణంతో పాటు స్థానికుల జీవనోపాధిని కాపాడాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు అధ్యక్షతన గురువారం కొల్లేరు ప్రజల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి బదులుగా వారు కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని విమర్శించారు. కొల్లేరు ప్రజలకు హానికరమైన ఎకో సెన్సిటివ్ జోన్‌ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కొల్లేరు ప్రజలకు సీపీఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు సంఘం సీనియర్ నాయకుడు వై. కేశవరావు మాట్లాడుతూ.. మూడో కాంటూరు నుంచి ఐదో కాంటూరు వరకు పది కిలోమీటర్ల దూరంలో సున్నితమైన పర్యావరణ ప్రాంతం పేరుతో 26 నిబంధనలు విధించి మొత్తం కొల్లేరును పూర్తిగా అటవీ శాఖ చేతుల్లో పెట్టబోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీని ప్రభావం ఏలూరు జిల్లాలోని నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, ఏలూరు, పెదపాడు, మండవల్లి, కై కలూరు, ఆకివీడు మండలాల్లోని కొల్లేటి ప్రాంతంలోని 89 గ్రామాలపై పడుతుందన్నారు. అధికారులు తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయాలను సేకరించి నివేదికలు పంపించడం దారుణమన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్‌పై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. కొల్లేరు ప్రజలకు ఉరితాడుగా మారిన జీఓ 120ను రద్దు చేయాలి రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025u8లో అభినందనలు లబ్బీపేట(విజయవాడతూర్పు): గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గురువారం కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అన్యాయం చేశారు.. ఆదుకోండి సుదూర ప్రాంతాలకు తమను బదిలీ చేశారని సచివాలయ గ్రామ వ్యవసాయ సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంచేయాలని కృష్ణా కలెక్టర్ బాలాజీని కోరారు.నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు గురువారం రూ.లక్ష విరాళం సమర్పించారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ‘సుపారి పాలన’ను వివరించాలని ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాం. వాటిని గాలికి వదిలేసి ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాం. సమస్యలు పరిష్కారం కాలేదంటూ అన్ని వర్గాల ప్రజలు రోడ్డుక్కుతున్నారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు ఇలా ఎవరిని కదిపినా నిప్పులు చెరుగుతున్నారు. పింఛన్లను కుదించాం. అన్ని పథకాలకు మంగళం పాడేశాం. తల్లికి వందనంలో కోతలు పెట్టాం. ఇప్పుడు ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి? హామీలపై నిలదీస్తే వారికి ఏమని చెప్పాలి’ అని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలైన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు తమకు అనుకూలమైన వారి ఇళ్లకే వెళ్లి మొక్కుబడిగా ముగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నెలరోజులు ఎలా నెట్టుకురావాలా అని తలలు పట్టుకొంటున్నారు. దందాలపై నిలదీస్తారని భయం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకుల దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు వారు చేయని దందా లేదు. ఇసుక, మట్టి అక్రమ రవాణాతో రూ.కోట్లు కొల్లగొట్టారు. ఊరూరా బెల్ట్ షాపులు, పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆక్రమణలు, కబ్జాలు ఇబ్బడి ముబ్బడిగా చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులతో వేధించారు. వీటన్నింటితో ఐదేళ్ల తరువాత కనిపించాల్సిన ప్రభుత్వ వ్యతిరేకతను ఏడాదిలోని మూటగట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ముందుకెళ్లేందుకు ముఖం చెల్లక కొంత మంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం, నందిగామ ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు. నందిగామ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని సుపరిపాలనలో భాగంగా కంచకచర్లలో పాల్గొన్నారు. తమకు అనుకూలమైన ప్రాంతంలో కేవలం నామ మాత్రంగా కొన్ని ఇళ్లకు మాత్రమే వెళ్లి కార్యక్రమాన్ని గంటలోపే ముగించారు. కృష్ణా జిల్లాలో..●● సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి మచిలీపట్నం 48వ డివిజన్లోని వడ్డెర కాలనీలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఎంపిక చేసుకున్న ఇళ్లకు మాత్రమే మంత్రి వెళ్లి పథకాల గురించి వివరించారు. కొన్ని ఇళ్ల వద్ద ప్రజలు తమ ప్రాంతంలో నాలుగు నెలలుగా వీధిదీపాలు వెలగటం లేదని, తాగునీరు సక్రమంగా సరఫరా కావటం లేదని మంత్రిని నిలదీశారు. పోతేపల్లి గ్రామంలో గురువారం ఇదే రీతిలో కార్యక్రమం సాగింది. ● అవనిగడ్డ నియోజకవర్గంలో మొక్కుబడిగా సుపరిపాలన కార్యక్రమం జరుగుతోంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కూడళ్ల వద్ద, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. ఈ కార్యక్రమంపై టీడీపీ నాయకులకు సైతం ఆసక్తి లేకపోవటం గమనార్హం. ● పామర్రు నియోజకవర్గంలోని పామర్రు టౌన్లో జరిగిన సుపరిపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా పాల్గొన్నారు. ప్రకటించిన విధంగా ప్రతి ఇంటికి వెళ్లకుండా వారికి అనుయాయులుగా ఉన్న వారి ఇళ్ల వద్దకే వెళ్లి వారితోనే సమయం గడుపుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఆందోళనతో కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ● గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడలో సుపరిపాలన కార్యక్రమం తూతూ మంత్రంగా జరుగుతోంది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కార్యక్రమం జరుగుతుందనే సమాచారాన్ని ఎవరికీ ముందస్తుగా ఇవ్వకుండా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి రెండు ఫొటోలు దిగి మమ అనిపిస్తున్నారు. ● పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కాటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గురువారం పర్యటించారు. ప్రధాన ప్రాంతాల్లో పర్యటించి టీడీపీ అనుకూల వ్యక్తుల ఇళ్లకు మాత్రమే వెళ్లారు. ప్రతి ఇంటికీ వెళ్లి ‘మై టీడీపీ’ యాప్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కార్యక్రమం మొక్కుబడిగానే సాగింది. ● గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, రామవరప్పాడు గ్రామాల్లో సుపరిపాలన కార్యక్రమం గురువారం జరిగింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ కూడా టీడీపీ అనుకూల గ్రామాల్లో ఆ పార్టీ కార్యకర్తల ఇళ్లకు మాత్రమే వెళ్లి ఫొటోలు దిగి కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. పెడన నియోజకవర్గంలో సైతం కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. 7న్యూస్రీల్సమస్యలు వద్దంటూ.. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికిపూడికి సమస్యలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. తిరువూరు మండలం, కోకిలంపాడులో రోడ్డు అధ్వానంగా ఉందని, మోకాలిలోతు గుంతలు, బురదతో నిండిందని, వాహనాలు గోతుల్లో ఇరుక్కుపోతున్నాయని, నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నామని గ్రామస్తులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వచ్చింది సమస్యల గురించి కాదని, సంక్షేమ పథకాల గురించి వచ్చామంటూ ఎమ్మెల్యే కొలికపూడి మాట దాటవేశారు. ఎమ్మెల్యే ముందు సమస్యల గురించి చెప్పకుండా జనాలను టీడీపీ స్థానిక నాయకులు వారించారు. గురువారం సైతం అదే తంతు జరిగింది. తిరువూరులోని తొమ్మిదో వార్డులో డ్రెయిన్లు సరిగా లేక ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ‘ఇప్పుడు సమస్యల గురించి వద్దు. మీకు తల్లికి వందనం వచ్చిందా? లేదా? అంటూ వారు అడిగిన సమస్యను ఎమ్మెల్యే దాట వేశారు. జగ్గయ్యపేటలో సైతం తమకు అనుకూలమైన వారి ఇళ్లకే టీడీపీ నాయకులు వెళ్లారు. విజయవాడ వెస్ట్‌లో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలైంది. విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. అన్ని ఇళ్లనూ సందర్శించని టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల హామీలపై ప్రజలు నిలదీస్తారని ఆందోళన తమకు అనుకూలమైన వారి ఇళ్లకే వెళ్తున్న వైనం సమస్యలు వద్దు.. సంక్షేమ పథకాలు అందాయా లేదా అంటూ దాట వేత -
కార్తికేయుని సేవలో ప్రముఖులు
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాండిచ్చేరి మాజీ మంత్రి, ఆ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, చైన్నె వాసి, టీటీడీ బోర్డు సభ్యుడు కృష్ణమూర్తి, అనురాధ దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థానం ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, వేద పండితులు, అర్చక స్వాములు స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వారు పుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి కృష్ణమూర్తి, అనురాధ దంపతులు రూ.1,00,116 విరాళం సమర్పించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం, ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ స్వామివారి చిత్రపటం, లడ్డుప్రసాదాలను మల్లాడి కృష్ణారావు, కృష్ణమూర్తి, అనురాధకు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్ పూజలు చేశారు. యోగాను ఒలింపిక్ క్రీడల్లో చేర్చాలి చిలకలపూడి(మచిలీపట్నం): యోగాను ఒలింపిక్ క్రీడల్లో చేర్చాలని ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు జి.కృష్ణ కోరారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మకు యోగా పోటీల ఆహ్వానపత్రికను ఆయన గురువారం అందజేశారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ.. యోగా ఆసియా క్రీడల్లో ఇప్పటికే చోటు దక్కించుకుందని, ఒలింపిక్ క్రీడల్లో కూడా చేర్చేలా కృషి చేస్తున్నామని పేర్కొ న్నారు. ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. జిల్లా స్థాయిలో ఈ నెల 19వ తేదీన ఉయ్యూరు దత్త కల్యాణ మండపంలో యోగా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బెనర్జీ, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేపు బీఎస్ఎన్ఎల్ నేషనల్ లోక్ అదాలత్ మధురానగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వివిధ కోర్టుల్లో ఈ నెల ఐదో తేదీన బీఎస్ఎన్ఎల్ నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుందని సంస్థ విజయవాడ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నూజివీడు, మచిలీపట్నం, కైక లూరు, గుడివాడ, అవనిగడ్డ, ఉయ్యూరు, గన్నవరం కోర్టుల్లో ‘నేషనల్ లోక్ అదాలత్’ జరుగుతుందని పేర్కొన్నారు. క్లోజ్ చేసిన బీఎస్ఎన్ఎల్ ఫోన్ల తాలూకు వినియోగదారులకు న్యాయసేవాధికార సంస్థల ద్వారా నోటీ సులు ఇచ్చామని, వారు కోర్టుకు హాజరుకా కుండా ముందుగానే బకాయిలు చెల్లించొచ్చని సూచించారు. ఈ నెల ఐదో తేదీలోపు వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించొచ్చని, పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత తగిన రాయితీ కూడా పొందవచ్చని పేర్కొన్నారు. బకాయిల తీర్మానం జరిగిన తర్వాత సర్వీసులను పునరుద్ధరణ చేసుకోవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం 0866 – 2444266/ 83338 98997/ 94901 88990/ 94901 45222 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. కృష్ణా డీఎస్ఓ పార్వతి బదిలీచిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వి.పార్వతిని బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను తూర్పుగోదావరి జిల్లా డీఎస్‌ఓగా ఉద్యోగోన్నతిపై బదిలీ చేశారు. ఆమె స్థానంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శివరామప్రసాద్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. -
కనిపించని పలు ఎం బుక్‌లు, బిల్లుల ఫైళ్లు
ఎంఎంసీలోని అకౌంట్స్ విభాగంలో కొన్ని సంవత్సరాలకు సంబంధించిన పనుల ఎం బుక్‌లు, బిల్లుల ఫైళ్లు కనిపించడం లేదు. తమ బిల్లులు ఎప్పుడు చేస్తారంటూ వెళ్తున్న కాంట్రాక్టర్లకు ఆ ఫైళ్లు కనిపించటంలేదనే సమాధానం వినిపించడంతో వారు ఆందో ళనకు గురవుతున్నారు. ఇటీవల ఓ కాంట్రాక్టర్ ఈ విషయమై ఫిర్యాదు చేయటంతో ఇన్చార్జ్ ఏఓ వెతకగా కొన్ని ఫైళ్లే దొరికాయని చెబుతున్నట్లు తెలిసింది. ఇంకా చాలా ఫైళ్లు మాయమయినట్లు సమాచారం. ఈ విషయంపై కాంట్రాక్టర్లు లింగం రవికిరణ్, ఎడమా నరేంద్ర ఇటీవల మునిసిపల్ కమిషనర్ బాపిరాజును కలసి తమ గోడును వినిపించారు. -
రైతులకు తీవ్ర నష్టం
జి.కొండూరు మండలంలోని లోయ ప్రాంతంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన తొమ్మండ్రం వాగు కొండపల్లి పారిశ్రామిక వాడను ఆనుకొని కట్టుబడిపాలెం గ్రామం మీదుగా సైపన్ ద్వారా బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను దాటి కవులూరు శివారులోని వ్యవసాయ భూముల మీదుగా ప్రవహించి తారకరామా ఎత్తిపోతల పథకం ఎడమ కాలువలో కలుస్తుంది. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలు వాగులో కలిసి వ్యవసాయ భూముల మీదుగా ప్రవహిస్తోంది. దీంతో కవులూరు పరిధిలో 600 ఎకరాల సాగుబూములు చవుడుబారి రైతులు నష్టపోయారు. వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసన, ఈగలు, దోమల కారణంగా కట్టుబడిపాలెం గ్రామ ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. కలుషిత నీరు తాగిన మేకలు, గేదెలు, ఆవులు, పందులు వంటి మూగ జీవాలు పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీ
గన్నవరం: స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ చోరీ జరిగిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి దొంగలు కార్యాలయంలోకి చొరబడి సుమారు రూ. 13.56లక్షల విలువైన నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు, తోక బిళ్లలను అపహరించుకుపోయారు. పోలీసుల సమాచారం ప్రకారం.. స్థానిక చింతలపేటలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే అధికా రులు, సిబ్బంది బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. తిరిగి గురువారం విధులకు హాజరైన సిబ్బంది కార్యాలయ తలుపు గొళ్లెం పగులకొట్టి ఉండడం గమనించి సబ్‌రిజిస్ట్రార్ వీవీవీ ప్రసాద్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో కార్యాలయానికి చేరుకున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డు రూమ్ తలుపులు తీసి ఉండి స్టాంపులు భద్రపరిచిన బీరువా పగులకొట్టి ఉండడటాన్ని గుర్తించారు. ఆధారాల సేకరణ.. సబ్‌రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కార్యాలయాన్ని పరిశీలించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ దొంగల వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ రవీంద్రనాథ్, జిల్లా రిజిస్ట్రార్ మూర్తి, డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ బీవీ శివప్రసాద్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులు, సిబ్బంది నుంచి చోరీ ఘటనపై వివరాలు సేకరించారు. సీసీఎస్ సీఐ గోవిందరాజు నేతృత్వంలోని బృందం కార్యాలయ పరిసరాల్లోని సీసీ ఫుటేజ్‌లను సేకరించి దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై సబ్‌రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవి మిస్సింగ్.. సుమారు రూ.13,56,300 విలువైన రూ. 50 నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు 3,600, రూ.100 ధర కలిగిన నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు 3,600, తోక బిళ్లలు రూ.50 ధర కలిగినవి 12,500, రూ.100 ఖరీదు కలిగినవి 4,609 చోరీకి గురైనట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఉండడం పట్ల ఆఫీస్‌లో పనిచేసే ప్రైవేట్ సిబ్బంది వ్యవహరశైలిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. ఈ చోరీ ఘటన వల్ల గురువారం స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. చోరీకి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరణ, విచారణ కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయినట్లు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ తెలిపారు. తిరిగి శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రూ.13.56లక్షల విలువైన స్టాంప్‌లు అపహరణ గన్నవరంలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు -
మేళతాళాలతో దుర్గమ్మకు సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మేళతాళాలు.. మంగళ వాద్యాలతో భక్తులు దుర్గమ్మ కొండకు తరలివస్తున్నారు. సకుటుంబ సమేతంగా అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి సారె సమర్పించేందుకు తరలివచ్చిన భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకుంది. గురువారం సుమారు 40కి పైగా భక్త బృందాలు, 1200 మందికి పైగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. సారెను సమర్పించేందుకు విచ్చేస్తున్న భక్త బృందాలు, భక్తులకు దేవస్థానం సకల సదుపాయాలను కల్పిస్తోంది. ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి భక్తులు సారె సమర్పిస్తున్నారు. మహామండపం ఆరు, ఏడు అంతస్తుల్లో అమ్మవారికి సమర్పించిన పసుపు, కుంకుమ, గాజులు, చలి మిడి, మిఠాయిలను మహిళలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. సారె సమర్పించిన భక్తులు అమ్మవారి అన్న ప్రసాదాలతో పాటు ఉచిత ప్రసాదాలను దేవస్థానం అందించింది. 10వ తేదీ వరకు అంతరాలయ దర్శనం రద్దు? ఆషాఢం సారె, వారాంతం, శాకంబరీదేవి ఉత్స వాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు ఆలయ ఈఓ శీనానాయక్ పేర్కొన్నారు. ప్రస్తుతం రోజూ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలను ఈఓ నిలిపివేశారు. తాజాగా పదో తేదీ వరకు అంతరాలయ దర్శనం రద్దు చేయాలనే ఆలోచన చేయడం గమనార్హం. -
వయస్సు 24.. చోరీలు 24
మధురానగర్(విజయవాడసెంట్రల్): నాలుగు నెలలో 12 చోరీలు చేసిన నిందితుడు ఉయ్యాల రాజేష్(24)ను గుణదల పోలీసులు అరెస్టు చేసి రూ.6లక్షలు విలువ చేసే 60గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ డి. దామోదరరావు తెలిపారు. స్థానిక గుణదల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అలా దొరికాడు.. గుణదల మురళీనగర్ కట్టమీద ఇటీవల చోరీ జరిగింది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుణదల పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనుమానితులు, నేరస్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందానికి అందిన సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒక యువకుడు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. జల్సాలకు అలవాటు పడి.. విచారణలో నిందితుడు అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్(24)గా గుర్తించామని ఏసీపీ చెప్పారు. జల్సాలకు అలవాటు పడిన రాజేష్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడ్డాడన్నారు. ఈ క్రమంలో రాజేష్‌పై అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేశామని చెప్పారు. 2024 సెప్టెంబర్‌లో దొంగతనం కేసులో గుణదల పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించామని తెలిపారు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన రాజేష్ నేర ప్రవృత్తి మార్చుకోకుండా చోరీలకు పాల్పడ్డాడని.. నాలుగు నెలల వ్యవధిలో 12 దొంగతనాలు చేశాడని వివరించారు. సాంకేతిక ఆధారాలు ఆధారంగా.. సాంకేతిక పరిజ్ఞానం, చోరీ జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు పరిశీలించి పాత నేరస్తులతో పరిశీలించగా రాజేష్‌ను నిందితుడిగా గుర్తించామని ఏసీపీ చెప్పారు. రాజేష్‌పై ఇప్పటికే పలు పోలీస్స్టేషన్లలో 12 కేసులు ఉన్నాయన్నారు. గుణదల పోలీస్‌స్టేషన్ పరిధితో పాటు పటమట, రాజోలు, నూజివీడు, నర్సాపురం, నాయుడుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజేష్ చోరీలు చేశాడని వివరించారు. నేరస్తుడుని అరెస్టు చేయటంతో పాటు అతని వద్ద నుంచి రూ.6లక్షలు విలువచేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. నాలుగు నెలల్లో 12 దొంగతనాలు ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు రూ. 6లక్షలు విలువైన ఆభరణాలు స్వాధీనం -
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు
ఈగల్ టీం ఐజీ రవికృష్ణ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ టీం ఐజీ ఆరే రవికృష్ణ తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు ఈగల్ టీం సభ్యులు, పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా గురువారం విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా బిహార్ నుంచి చైన్నెకు గంజాయి చాక్లెట్లను తీసుకువెళ్తన్న వ్యక్తిని గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఈ సందర్బంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నా మని తెలిపారు. గంజాయి కేసులకు సంబంధించి 80 శాతం ఒడిశా నుంచే ఇతర ప్రాంతాలకు రైళ్లలో సరఫరా అవుతున్నట్లు గుర్తించామని, దీనిని అరికట్టేందుకు అన్ని రైల్వేస్టేషన్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ సహకారంతో ఈగల్ టీంలు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాయని వివరించారు. డ్రోన్లు, శాటిటైట్ టెక్నాలజీని ఉపయోగించి అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను వదిలే ప్రసక్తే లేదని, వారి ఆస్తులను అటాచ్ చేస్తామని తెలిపారు. భవిష్యత్‌లో కూడా గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ఇటువంటి తనిఖీలు ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సరిత, రైల్వే సీనియర్ డీఎస్సీ షణ్ముగ వడివేల్, జీఆరీపీ డీఎస్పీ రత్నరాజు, సీఐలు జి.వి.రమణ, దుర్గారావు, ఆర్పీఎఫ్ సీఐ పతే అలీబేగ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్యాయం చేశారు.. ఆదుకోండి
కృష్ణా జిల్లా కలెక్టర్‌ను వేడుకున్న గ్రామ వ్యవసాయ సహాయకులు చిలకలపూడి(మచిలీపట్నం): ఇటీవల నిర్వహించిన బదిలీల్లో సుదూర ప్రాంతాలకు తమను బదిలీ చేసి అన్యాయం చేశారని సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లా పాపలతో ఉన్న తమను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయటం ఎంతో బాధ కలిగించిందన్నారు. కలెక్టర్ డీకే బాలాజీని గురువారం రాత్రి కలిసి తమ గోడును వెలిబుచ్చారు. సచివాలయా ల్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న తమ వెసులుబాటు పట్టించుకోకుండా ఇష్టానుసారం బదిలీ చేశారని కలెక్టర్‌కు వివరించారు. అనారోగ్య సమస్యలు, స్పౌజ్ కేసులు, చంటి పిల్లలు ఉన్న తమను సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఎలా వెళ్లేదని విన్నవించారు. వందల కిలోమీటర్ల దూరం.. జగ్గయ్యపేటలో పనిచేస్తున్న వారిని నాగాయలంకకు.. ఎ.కొండూరు నుంచి పమిడిముక్కల, మొవ్వ ప్రాంతాలకు బదిలీ చేయటంతో వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందన్నారు. తమకు వచ్చే జీతం చార్జీలకే సరిపోతుందని, జీవనం ఎలా గడుపుతామని కన్నీరు పెట్టుకున్నారు. రీకౌన్సెలింగ్ నిర్వహించి ర్యాంకుల ఆధారంగా బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వ్యవసాయశాఖ సంచాలకులను పిలిచి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ సంచాలకులు గ్రామ వ్యవసాయ సహాయకులతో మాట్లాడుతూ సమస్యలను పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారికి హామీనిచ్చారు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
తిరువూరు: ఎ.కొండూరు మండలం పాతరేపూడి తండాలో గత నెల 26న కోట రాము అనే వ్యక్తిని హత్య చేసిన ఇరువురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తిరువూరు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం ఎ.కొండూరు మండలం తూర్పు మాధవరానికికు చెందిన ఆదూరి చార్లెస్‌కు, రెడ్డి గూడెం మండలం కూనపరాజు పర్వకు చెందిన బత్తు ల కుమారితో వివాహేతర సంబంధముంది. కొద్దికాలంగా కోట రాము కూడా కుమారిని తనతో వివా హేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడు. అడ్డు తొలగించుకోవాలని.. కుమారి ఈ విషయాన్ని చార్లెస్‌కు చెప్పగా, ఇరువురూ కలసి రామును అడ్డు తొలగించుకోవాలని భావించారు. రామును కొత్త రేపూడి గ్రామశివారులోని మామిడి తోట వద్దకు కుమారి తీసుకురాగా, చార్లెస్ కర్రతో అతని తలపై బలంగా బాదాడు. రాము తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోగా.. కుమారి, చార్లెస్ పరారయ్యారు. తన భర్త మూడు రోజులుగా కనిపించట్లేదని హతుడి భార్య వెంకటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, 29న పాత రేపూడి మామిడితోటలో లభ్యమైన మృతదేహం రాముదిగా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. కుమారి, చార్లెస్‌పై వెంకటేశ్వరమ్మ అనుమానం వ్యక్తం చేయగా.. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు వివరించారు. నిందితులను అరెస్టు చేసి తిరువూరు కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ రిమాండుకు ఆదేశించారని తెలిపారు. తిరువూరు సీఐ గిరిబాబు, ఎ.కొండూరు ఎస్ఐ కృష్ణ పాల్గొన్నారు. -
రసాయన వ్యర్థం.. రైతుకు అనర్థం
జి.కొండూరు: ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామికవాడలో ఉన్న పలు కంపెనీల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలను పక్కనే ఉన్న జి.కొండూరు మండలంలోని తొమ్మండ్రం వాగులో కలుస్తున్నాయి. ఈ వ్యర్థాల కారణంగా వాగుకు రెండువైపులా ఉన్న కట్టుబడిపాలెం గ్రామస్తులు వ్యాధుల బారిన పడుతున్నారు. వాగులో నీరు తాగి మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. రసాయన వ్యర్థాలు తిష్టవేయడంతో కవులూరుకు చెందిన వందల ఎకరాల సాగు భూమి చవుడుబారుతోంది. కట్టుబడిపాలెం, కవులూరు గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఈ సమస్యపై పోరాడుతున్నా ఫలితం కనిపించలేదు. అప్పుడప్పుడూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హడావుడి చేయడం తప్ప రసాయన వ్యర్థాలను వాగులోకి విడుదల చేయకుండా అడ్డుకోలేకపోతున్నారని రెండు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రెండు గ్రామాల ప్రజలు ఇటీవల వాగు వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఖరీఫ్ సాగు కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వేల లీటర్ల వ్యర్థాలు.. కొండపల్లి ఐడీఏలో నాలుగు వందల వరకు పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఫార్మా, కెమికల్ కంపెనీలు 12, ప్లాస్టిక్ కంపెనీలు మూడు, మడ్డి ఆయిల్ కంపెనీలు నాలుగు, టైర్ ఆయిల్ కంపెనీలు మూడు వరకు ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి రోజుకు వేల లీటర్లు రసాయన వ్యర్థాలు విడుదలవుతాయి. ఈ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు రసాయన పరిశ్రమల సొసైటీ ఆధ్వర్యంలో కొండపల్లి సమీపంలోనే రూ.8 కోట్లతో రీసైక్లింగ్ యూనిట్‌ను నిర్మించారు. అయితే ఈ వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా రీసైక్లింగ్ యూనిట్‌కు తరలించాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆయా కంపెనీల నిర్వాహకులు తమ ప్రాంగణాల్లోనే నిల్వ ఉంచి వర్షంపడినప్పుడు, రాత్రి వేళ, సెలవు రోజుల్లో పరిశ్రమలకు పక్కనే ఉన్న తొమ్మండ్రం వాగులోకి వదిలేస్తున్నారు. కొండపల్లి ఐడీఏ కంపెనీల వ్యర్థాలు తొమ్మండ్రం వాగులోకి విడుదల రసాయన వ్యర్థాలతో చవుడుబారుతున్న సాగు భూములు వ్యాధుల బారిన పడుతున్న కట్టుబడిపాలెం గ్రామస్తులు వాగులో నీరు తాగి మృత్యువాత పడుతున్న మూగజీవాలు చర్యలు తీసుకోకుంటే ఎడారే తొమ్మండ్రం వాగులోకి రసాయన వ్యర్థాలను వదలడం వల్ల భూములు చవుడుబారుతున్నాయి. పంటలు పండక రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యపై ఎంత పోరాటం చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే వ్యవసాయ భూమి ఏడారిలా మారుతుంది. – చెరుకూరి శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకుడు, కవులూరు గ్రామం -
జాతీయ రహదారిపై గుంతలు పూడ్చాలి
కేసరపల్లి(గన్నవరం): చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై గుంతలు పూడ్చి, రెండు వైపులా పచ్చదనం పెంపొందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక అంత ర్జాతీయ విమానాశ్రయం నుంచి కేసరపల్లి వరకు జాతీయ రహదారిని ఆయన గురువారం పరిశీలించారు. విమానాశ్రయం నుంచి అమరావతికి నిత్యం వీవీఐపీలు, విదేశీ ప్రతినిధులు వస్తుంటారని, ఈ నేపథ్యంలో జాతీయ రహదారిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సూచించారు. రహదారిపై ఏర్పడిన గుంతలు, బుడమేరు కాలువ వంతనపై పగుళ్లను తక్షణం పూడ్చి రాకపోకలకు అనువుగా మార్చాలని ఆదేశించారు. సెంట్రల్ డివైడర్‌పై వెలగని ఎల్ఈడీ లైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, రోడ్డుపైకి విస్తరించిన పొదలు, పిచ్చి మొక్కలను తక్షణం తొలగించి శుభ్రం చేయాలని, రోడ్డుకు రెండువైపులా పూల కుండీలను ఏర్పాటు చేసి పచ్చదనం పెంపొందించాలని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ లక్ష్మీపార్థ సారథి, ఎన్హెచ్ఏఐ పీడీ విద్యాసాగర్, తహసీల్దారు కె.వెంకటశివయ్య, ఎంపీడీఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై గుంతలను పరిశీలిస్తున్న కలెక్టర్ బాలాజీ -
పంట బీమాను సద్వినియోగం చేసుకోండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బీమా పరిహారం పొందేందుకు రైతులు స్వచ్ఛందంగా పంట బీమా పథకంలో చేరవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మనోహర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ భూమి ఉన్న యజమాని, సీసీఆర్సీ కార్డు పొందిన కార్డుదారులు ఈ పథకంలో చేరడానికి అర్హులన్నారు. పంట రుణం తీసుకున్న రైతులకు అదనంగా బీమా ప్రీమియం కూడా మంజూరు చేస్తామన్నారు. పంట రుణం తీసుకోని రైతులు కామన్ సర్వీస్ సెంట ర్లు, బ్యాంకుల్లో ప్రీమియం చెల్లించి జాతీయ పంట బీమా పోర్టల్‌లో నమో దు చేసుకుని ఈ పథకంలో చేరవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో కూడా ప్రీమియం చెల్లించవచ్చన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద నోటిఫై చేసిన పంటలకు ఈ బీమా సౌకర్యం లభిస్తుందన్నారు. -
మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) నగర కమిటీ ఆధ్వర్యంలో మునిసిపల్ ఇంజినీరింగ్(వాటర్, పార్కు, వెహికల్ డిపో మెకానిక్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్) కార్మికులు వినూత్న ప్రదర్శన చేపట్టారు. అర్ధనగ్నంగా మొలలకు వేప కొమ్మలు కట్టుకుని నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి నినాదాలు చేశారు. జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం తొమ్మిదో రోజుకు చేరుకుంది. మున్సిపల్ యూనియన్ నగర గౌరవాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, పారిశుద్ధ్య కార్మికులతో విజయవాడ ధర్నా చౌక్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర అధ్యక్షుడు జ్యోతిబసు, నగర కోశాధికారి స్టీఫెన్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ మావే.. అంతా మాకే!
దోపిడీకి కాదేదీ అనర్హం అన్న చందంగా తయారైంది పామర్రు నియోజకవర్గం పరిస్థితి. మట్టి, ఇసుక, మద్యం, రేషన్ బియ్యం ఇలా దేనిని వదలకుండా అక్రమార్జనకు తెరతీశారు. విచ్చల విడిగా జూద క్రీడలు నిర్వహిస్తూ రూ. లక్షల్లో దండుకుంటున్నారు. మండలానికో కలెక్షన్ ఏజెంట్‌ను ఏర్పాటు చేసుకొని.. నియోజకవర్గ ముఖ్యనేత దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే రూ. కోట్లను కొల్లగొట్టినట్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. – సాక్షి ప్రతినిధి, విజయవాడ మట్టిని కొల్లగొట్టేస్తున్నారు.. మొవ్వ మండలంలో కోసూరు, మొవ్వ, అయ్యంకి, పెద్దముత్తేవి, నిడుమోలు గ్రామాల్లోని చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు చేసి, రూ.10 కోట్లకు పైగా దండుకొన్నారు. పామర్రు మండలం పసుమర్రులో రూ.3కోట్లు, రిమ్మనపూడి, నిబానపూడి, కొమరవోలు, నిమ్మకూరులో రూ.కోటి విలువైన మట్టి దోపిడీ చేశారు. పెదపారుపూడి మండలంలోని వెంట ప్రగడలో ఓ ప్రైవేటు స్కూలుకు రూ.3కోట్ల విలువైన మట్టిని తోలారు. పమిడిముక్కల మండలంలో గోపవానిపాలెంలో పెద్ద ఎత్తున అక్రమ మట్టితోలకాలు చేశారు. ఇవన్నీ ఆయా మండల పచ్చ నేతల కనుసన్నల్లోనే జరిగాయని.. ఇందులో నియోజకవర్గ ముఖ్యనేతకు వాటాలున్నట్లు తెలుస్తోంది. రేషన్‌పై పక్కా డీల్.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రేషన్ బియ్యం దందాను పామర్రులోని ఓ రైస్ మిల్లర్‌కు అప్పజెప్పారు. ఇప్పుడు రూటు మార్చి, నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లే బియ్యం కిలోకు రూ.3 చొప్పున డీల్ కుదుర్చుకొని, పెనమలూరు నియోజకవర్గానికి చెంది న వ్యక్తికి దందా వ్యవహారాన్ని అప్పజెప్పటం చర్చనీయాంశంగా మారింది. ఈ లెక్కన నెలకు రూ.50లక్షల వరకు ముఖ్యనేత ఖాతాలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఊరూరా ‘బెల్ట్’.. నియోజకవర్గంలోని 106 గ్రామాల్లో, జనాభాను బట్టి బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. ఈ బెల్ట్ షాపులు గ్రామాల్లో వేలం నిర్వహించి అప్పజెప్పారు. ప్రతి బెల్ట్ షాపు నుంచి అక్కడ జరిగే వ్యాపారాన్ని బట్టి నెలకు రూ.50లక్షల వరకూ మామూళ్లు వసూలు చేస్తున్నారు. చిరు ఉద్యోగులపై వేధింపులు.. గ్రామాల్లో బుక్ కీపర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇలా చిరు ఉద్యోగులపైనా పచ్చనేతలు చిన్న, చిన్న ఫిర్యాదులు చేసి, వారిని తొలగించి, ఆ స్థానంలో డబ్బులు తీసుకొని, వేరే వారిని నియమిస్తున్నారు. ఉపాధి హామీ పనుల్లో పచ్చనేతలు పనులకు వెళ్లకున్నా మస్టర్ వేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. టీడీపీలోని రెండు వర్గాల మధ్య తగాదా ఏర్పడి ఈ విషయం బహిర్గతం అయ్యింది. ఓ వర్గం వారు కరపత్రాలు వేసి పంచిన ఘటన పెదపారుపూడిలో చోటు చేసుకొంది. తప్పుడు కేసులు.. వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు కేసుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ జరిగింది, దీంతో ఓ వర్గం వారు టీడీపీ నాయకుడిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ టీడీపీ నాయకుడు ఫ్వార్డర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌కు సంబంధించి, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేయడం గమనార్హం. విచ్చలవిడిగా జూదం ఏరులై పారుతున్న మద్యం యథేచ్ఛగా రేషన్ దందా అడ్డూఅదుపులేని ఇసుక, మట్టి అక్రమ రవాణా మండలానికో ఏజెంటును పెట్టి మరీ వసూళ్లు అంతా నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లోనే..పామర్రులో హద్దులు దాటుతున్న దోపిడీ పర్వం -
ఎన్సీసీ రెజిమెంట్‌ను సందర్శించిన డీడీజీ
గన్నవరం: స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల ఆవరణలోని 3(ఏ) ఆర్‌అండ్‌వీ ఎన్సీసీ రెజిమెంట్ యూనిట్‌ను ఆంధ్ర, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ ఎయిర్ కమోడోర్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ నరసింగ్ సైలాని బుధవారం సందర్శించారు. తొలుత కాకినాడలోని ఎన్సీసీ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్మోహన్ అగర్వాల్‌తో పాటు వచ్చిన డీడీజీ ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. రెజిమెంట్‌లో జరుగుతున్న హార్స్ రైడింగ్ శిక్షణ, ఇతర కార్యకలాపాల గురించి డీడీజీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్ల హార్స్ షోను స్వయంగా తిలకించారు. ఎన్సీసీ క్యాడెట్లు చేసిన హార్స్ రైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు డీడీజీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం డీడీజీ నరసింగ్ సైలాని మాట్లాడుతూ.. ఎన్సీసీ శిక్షణ విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు. దేశ రక్షణకు అవసరమైన ఉన్నతమైన నైపుణ్యాలు కలిగిన క్యాడెట్లను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక రెజిమెంట్ యూనిట్ అభివృద్ధిలో ఆధునికీకరణ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. కల్నల్ సి.కె.నాయక్, ఎయిర్ వింగ్ కమాండర్ అజిత్ రాఠి, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.వి.ఎస్.కిషోర్, యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ తీర్థప్రసాద్, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ డాక్టర్ ఎల్.జయబాల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ వింగ్ పరిశీలన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఎన్సీసీ ఎయిర్ వింగ్‌ను డీడీజీ నరసింగ్ సైలాని పరిశీలించారు. ఎన్సీసీ క్యాడెట్లకు అందిస్తున్న పైలెట్ శిక్షణ, ట్రైనింగ్ విమానాల పని తీరును పర్యవేక్షించారు. -
కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని చాటాలి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పి, భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ఆకాంక్షించారు. కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్లో జరుగుతున్న పనులను పర్యాటక, మునిసిపల్ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. కళాత్మక సౌందర్యం ఉట్టిపడేలా వేసిన మ్యూరల్ పెయింటింగ్స్‌ను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఎక్స్పీరియన్స్ సెంటర్లో మిగిలిన పనులు త్వరితగతిన పూర్తిచేసి వీలైనంత త్వరగా పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. భవనం చుట్టూ ఫెన్సింగ్ పనులను పూర్తిచేయాలన్నారు. చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నా మని, ఇందులో భాగంగా శతాబ్దాల చారిత్రక నేపథ్యం కలిగిన కొండపల్లి బొమ్మల విశిష్టతను పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎ.శిల్ప, కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్యకీర్తన, తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ఆలయాలపై జరిగిన దాడులపై విచారణ చేపట్టాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హిందూ ఆలయాలపై గతంలో జరిగిన దాడులపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులు, కూల్చివేతకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో జాతీయ హిందూ ధార్మిక సదస్సు–2025 బుధవారం జరిగింది. ఈ సదస్సులో వివిధ ప్రాంతాల నుంచి సాధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సు పాల్గొన్న మాధవ్ మాట్లాడుతూ.. దేవాలయాల ద్వారానే మన దేశ నిర్మాణం, సామాజిక వ్యవస్థల ప్రతిష్ట జరిగాయన్నారు. దేవాలయాలు, గోవులను సంరక్షిస్తే మన ధర్మం నిలుస్తుందన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ మాట్లాడుతూ.. తిరుపతి, తిరుమల క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా గుర్తించాలని కోరారు. తిరుమల, తిరుపతిలో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించాలని కోరారు. దేవాలయ భూములు, ఆస్తులను ఆన్లైన్ చేయాలని కోరారు. ఈ సదస్సులో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సంఘటనా కార్యదర్శి రవి కుమార్, సాధుపరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణ రావు, గజల్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు నాగోతు రమేష్ నాయుడు, అడ్డూరి శ్రీ రాం, మిట్టా వంశీ తదితరులు పాల్గొన్నారు. -
సత్తాచాటిన చోరంపూడి ఉన్నత పాఠశాల విద్యార్థులు
బంటుమిల్లి: మండలంలోని చోరంపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్పులు సాధించి రికార్డు సృష్టించారు. 15 మంది విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌లతో చోరంపూడి పాఠశాల జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. బుధవారం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. 2024 సంవత్సరంలో పాఠశాల నుంచి 17 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాశారు. వారిలో 15 మంది స్కాలర్షిప్పులకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం వి.ధనలక్ష్మి మాట్లాడుతూ.. తమ విద్యార్థులు తమ్ము పెద్దిరాజు, కొక్కిలిగడ్డ స్నేహశ్రీ జిల్లాలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించారని తెలిపారు. జిల్లా స్థాయిలో పాఠశాలకు గుర్తింపు తెచ్చి ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన సోషల్ మాస్టర్ కె.శివరామప్రసాదుతోపాటు ఉపాధ్యాయులు, శ్రమించిన విద్యార్థులను ఎంఈఓ–2 వెంకటేశ్వరరావు స్వయంగా, ఎంఈఓ–1 మునీబ్బాను ఫోన్లో అభినందించారు. -
బీభత్సం సృష్టించిన లారీ
● ఆర్టీసీ బస్సును ఢీకొని దూసుకెళ్లిన లారీ ● డివైడర్ దాటి మరో లారీని ఢీకొన్న వైనం ● నుజ్జునుజ్జయిన రెండు లారీల క్యాబిన్లు ● క్యాబిన్లలో ఇరుక్కుపోయిన డ్రైవర్లు, క్లీనర్లు ● తీవ్ర గాయాలపాలైన డ్రైవర్లు, క్లీనర్లు కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక జాతీయ రహదారిపై సత్యంగారి హోటల్ జంక్షన్ వద్ద బుధవారం వేకువ జామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొని ఆ తరువాత డివైడర్‌ను దాటి రెండో వైపు ప్రయాణిస్తున్న మరో లారీని ఎదురుగా బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు క్యాబిన్లలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. వినుకొండకు చెందిన బొమ్మిడి నాగార్జున, తాడేపల్లిగూడెంనకు చెందిన ఆరిమెల్లి వెంకటేష్ లారీ డ్రైవర్లుగా జీవిస్తున్నారు. మంగళవారం రాత్రి నాగార్జున పది టైర్ల లారీలో సన్‌ఫ్లవర్ ఆయిల్ లోడ్‌చేసుకుని క్లీనర్ జి.వెంకటేశ్వర్లుతో కలిసి కాకినాడ నుంచి గొల్లపూడి బయలుదేరాడు. వెంకటేష్ మరో లారీలో స్టీల్ సామగ్రి లోడ్ చేసుకుని క్లీనర్ గల్ల వంశీకృష్ణతో కలిసి విజయవాడ నుంచి తణుకు బయలుదేరాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జాము ఆరుగంటల సమయంలో కృష్ణలంకలోని సత్యంగారి హోటల్ జంక్షన్ వద్దకు రాగానే సన్‌ఫ్లవర్ ఆయిల్ లోడ్‌తో మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు వైపు మంగళగిరి నుంచి బస్టాండ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ తరువాత డివైడర్ పై నుంచి అవతలి వైపునకు దూసుకెళ్లి స్టీల్ సమగ్రితో తణుకు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఏం జరిగిందోనని ఘటనా స్థలానికి పరుగులు పెట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, క్రేన్ సాయంతో డ్రైవర్లు, క్లీనర్లను బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ప్రభుత్వా స్పత్రికి తరలించారు. లారీ ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు వెనుక వైపు అద్దం పగిలిపోయింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సీఐ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది హైవే మీద అడ్డంగా ఉన్న రెండు లారీలను క్రేన్ సాయంతో తొలగించారు. ఆర్టీసీ డ్రైవర్ ఎం.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రోజూ యోగ సాధన చేయడం ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసికంగా ప్రశాంతత చేకూరుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. వ్యతిరేక ఆలోచనలు దూరమవుతాయని తెలిపారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 రోజుల పాటు నిర్వహించిన యోగా ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని అసోసియేషన్ హాలులో బుధవారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ హాజరై యోగ సాధన చేసిన వారికి సర్టి ఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. యోగాంధ్ర కార్యక్రమం జిల్లాలో విజయవంతం కావడంలో అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ పాత్ర ఉందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఆరు వేల మంది యోగా గురువులతో తొమ్మిది లక్షల మందికి యోగాను చేరువ చేశామని తెలిపారు. యోగాను వ్యాయామంగా కాకుండా జీవితంలో ఒక భాగంగా చూడాలన్నారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మిరియాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. యువత చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే యోగ సాధన చేయాలన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దాసరి కాశీ విశ్వనాథ్, కార్యదర్శి పి.వి.రమణ, కోశాధికారి ఎ.లావణ్యకుమార్, రిటైర్డ్ డీసీపీ హరికృష్ణ, యోగా గురువు అంకాల సత్యనారాయణతో పాటుగా యోగ సాధకులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సభ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ యోగ సాధకులతో కలిసి యోగాసనాలు, ప్రాణా యామం చేశారు. యోగా గురువు అంకాల సత్యనారాయణను కలెక్టర్ లక్షీశ తోపాటుగా అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. -
నిలబడదాం.. నిలదీద్దాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకు వచ్చేలా ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్ సీపీ రీజనల్ ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల ముందు బాబు, పవన్‌లు బాండ్ల రూపంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రజలు నిలదీసేలా ఇంటింటికీ వెళ్లి వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నియోజకవర్గ ఇన్చార్జిలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం బుధవారం విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ పేరుతో రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. అనంతరం దానిని స్కాన్ చేసి ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలు, ఇంటింటికీ ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియజేస్తూ ఇచ్చిన బాండ్ల గురించి వివరించారు. ఎన్ని హామీలు ఇచ్చారు.. ఎన్ని అమలు చేశారనే విషయాలను ప్రతి ఇంటికీ వెళ్లి ఎలా అవగాహన కలిగించాలని పార్టీ ప్రతినిధులకు వివరించారు. కక్షే లక్ష్యం.. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా సంక్షేమ పథకాల అమలును విస్మరించి వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందన్నారు. వాళ్లు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చేస్తామన్నారు. ప్రతి గ్రామం, పట్ణణం, మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబును ఎవరూ నమ్మరని.. బాండ్లు ఇచ్చి మరీ నమ్మించారని, కానీ ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. వాటిపై ప్రజలు నిలదీసేలా చైతన్యం తీసుకు వద్దామన్నారు. ● మాజీ మంత్రి, పార్టీ మైలవరం ఇన్చార్జి జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాలతో గద్దెను ఎక్కారన్నారు. పార్టీ నాయకులందరం ప్రజలకు అండగా నిలుద్దామన్నారు. మాట ఇస్తే తప్పే కుటుంబం కాదని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. ● మాజీ మంత్రి, పార్టీ విజయవాడ పశ్చిమ ఇన్చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది కాలంగా ప్రజలకు చేసిందేమి లేదన్నారు. వైఎస్ జగన్ ఒక్క పిలుపు ఇస్తే లక్షలాదిగా ప్రజలు వస్తున్నారన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ● మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ ఇన్చార్జి మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో అబద్దాల పుట్ట అన్నారు. జగన్ సుపరిపాలన, చంద్రబాబు మోసపు పాలన గురించి ప్రజలకు తెలియజేద్దామన్నారు. ● మాజీ ఎమ్మెల్యే, పార్టీ పామర్రు ఇన్చార్జి కై లే అనిల్‌కుమార్ మాట్లాడుతూ కేసులు పెడితే భయపడేది లేదన్నారు. దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అబద్ధాలకు కేరాఫ్ చంద్రబాబు.. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం మోసాలు కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు అబద్దాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడని ఎద్దేవా చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నల్లగట్ల స్వామిదాసు, మొండితోక జగన్మోహనరావు, సింహాద్రి రమేష్‌లతో పాటు నియోజకవర్గ ఇన్చార్జిలు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) తన్నీరు నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, ఉప్పాల రాము ప్రభుత్వ తీరును విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఇంటింటికీ ఇచ్చిన బాండ్లపై ప్రశ్నించేలా చైతన్యం తీసుకురావాలి ఆగస్టు 4 వరకూ గ్రామస్థాయిలో కార్యక్రమం వైఎస్సార్ సీపీ రీజనల్ ఇన్చార్జి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయవాడలో వైఎస్సార్ సీపీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం చంద్రబాబు అంటే మోసం.. చంద్రబాబు అంటే మోసం గ్యారంటీ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా పార్టీ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. జగన్ నాయకత్వంలో మనమంతా మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. -
తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలలు
పటమట(విజయవాడతూర్పు): చదువుకోవటం ఇష్టంలేక హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు చిన్నారులను బుధవారం పటమట పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల మేరకు హైదరాబాద్‌కు చెందిన 8వ తరగతి చదివే కందుకూరి సూర్యప్రకాష్(13), కర్నూలు జిల్లా నందికొట్కూరు, మారుతీనగర్‌కు చెందిన 9వ తరగతి చదివే కత్తిపోగు రాజ్ కుమార్(15) కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండ లం, ఏకమూరు గ్రామంలోని రెహబత్ వలంటరీ హాస్టల్లో ఉంటూ స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకుంటున్నారు. వీరిద్దరూ బుధవారం ఉదయం 7.30గంటలకు హాస్టల్లో చెప్పకుండా బయటకు వచ్చారు. దీనిపై సదరు హాస్టల్ వార్డె న్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశా రు. బాలురు ఇరువురూ బుధవారం పట మట ఆటోనగర్‌లో సంచరిస్తున్నారని, పంటకాల్వ రోడ్డులో ఉన్నారని స్టేషన్‌కు సమాచారం రావటంతో అక్కడికి వెళ్లిన పటమట సీఐ పవన్‌కిషోర్ బాలురును విచారించగా విషయం తెలిసింది. దీంతో వెంటనే సంబంధిత హాస్టల్‌కు, తల్లిదండ్రులకు సమాచారం అందించి అప్పగించారు. 17 క్రషర్లు సీజ్కంచికచర్ల: మండలంలోని పరిటాల, దొనబండ క్వారీలు, క్రషర్లను మైనింగ్, పర్యావరణ, ఇరిగేషన్‌శాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు విరుద్ధంగా క్రషర్లు నడుపుతున్నారని గుర్తించి 17 క్రషర్లను తాత్కాలికంగా సీజ్ చేశారు. రెండు రోజుల నుంచి తమ పంట పొలాలు క్రషర్ల వల్ల దుమ్మూ, ధూళితో నిండి ఉంటున్నాయని, దీంతో పంటలు దెబ్బ తింటున్నాయని, క్రషర్ల యాజమాన్యంపై చర్య లు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. విష యం తెలుసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, మైనింగ్ ఏఈ, ఇరిగేషన్ ఏఈలు క్వారీలు, క్రషర్లను తనిఖీ చేశారు. ఇరిగేషన్ అధికారులు కాచేటి వాగుపై అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని ఇరిగేషన్ ఏఈ రాజేష్ తెలిపారు. -
పేకాట ‘డెన్’లు..
మొవ్వ మండలం కోసూరులో గ్రామ స్థాయి టీడీపీ నేత ఆధ్వర్యంలో పేకాట జరుగుతున్నట్లు తెలుస్తోంది. పెడన, పామర్రు నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతంలోని ఓ తోటలో జరిగే పేకాటకు కాజ గ్రామానికి చెందిన టీడీపీ నేత నేతృత్వం వహిస్తున్నట్లు చెబుతున్నారు. పామర్రు మండలం కేదారేసుపల్లెలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువజన విభాగం కీలక నేత కనుసన్నల్లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ శిబిరాలు పోలీసు కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. నియోజకవర్గంలోని ముఖ్యనేతకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఈ పేకాట నిర్వాహకులే అన్నీ తామై వ్యవహరించడం, నిర్వహణ మొత్తం ఖర్చులను భరించడం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది, -
‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్’పై సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సర్వే నిమిత్తం జిల్లాకు వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రాజ్ ప్రియ్ సింగ్ బృందానికి కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సర్వేపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు, సమస్యలు తెలియజేయాలని కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులను కోరారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరాకు అవసరమైన స్టోరేజ్ ట్యాంకులు ప్రధాన సమస్యగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా పేరుకుపోయిన చెత్తను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించేందుకు పెద్ద మొత్తంలో భారీ వాహనాలు, వాటి నిర్వహణకు నిధులు అవసరమన్నారు. తీర ప్రాంతంలోని నేలల ప్రభావం వల్ల ఇళ్ల నిర్మాణ పునాది పటిష్టంగా నిర్మించేందుకు అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి ఉందని, ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణాలకు ఒక యూనిట్‌కు అందించే రూ.1.8 లక్షల నగదును పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో పర్యటన.. కేంద్ర బృందం ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి మురుగుకాల్వలు, పారిశుద్ధ్య పనులు, ఇంటింటికీ తాగునీరు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, తడి, పొడి చెత్త నిర్వహణ, కంపోస్టు ఎరువు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు, వాటి ద్వారా అందుతున్న సేవలను పరిశీలించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్షన్ ఆఫీసర్ కేశవ్ రోజ్, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్ యాదవ్, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటరావు, పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణారావు తదితరులు పాల్గొన్నారు.గ్రామాల్లో పరిస్థితులు పరిశీలించిన కేంద్ర బృందం -
వైభవంగా సారె సంబరం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు ఆషాఢ మాస సారెను తమ సంప్రదాయాల మేరకు సమర్పిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బుధవారం అమ్మవారికి సారె సమర్పించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ప్రారంభమైన సారె సంబరం సాయంత్రం వరకు కొనసాగింది. మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్త బృందాలకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా భక్త బృందాలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారి దర్శనం అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి భక్తులు సారె సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో తమ తోటి భక్త బృందాలకు, భక్తులకు సారెను ప్రసాదంగా పంపిణీ చేశారు. బుధవారం 30కి పైగా భక్త బృందాలు, 500 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో కొద్ది సేపటి క్రితం విజయవాడ సబ్ జైల్ నుంచి విడుదలయ్యారు. వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైఎస్సార్సీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం,మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవ భక్తుని చక్రవర్తిలతో పాటు వైస్సార్సీపీ శ్రేణులు, వంశీ అభిమానులు జైలు వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. -
వల్లభనేని వంశీకి బెయిల్.. నేడు విడుదల
సాక్షి, నూజివీడు: కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏలూరు జిల్లా నూజివీడులోని 15వ అదనపు జిల్లా జడ్జి కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారంటూ అ పెట్టిన అక్రమ కేసులో వంశీ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. నాలుగు రోజుల క్రితం వాదనలు ముగిశాయి. మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ 15వ అదనపు జిల్లా జడ్జి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఈరోజు వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వల్లభనేని వంశీపై అనేక కేసులు బనాయించారు. ఈ క్రమంలోనే వంద రోజులకు పైగా వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఉన్నారు. గత నెలలో రెండు కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరు కాగా, తాజాగా ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. దాంతో వంశీపై పెట్టిన కేసులన్నింటిల్లోనూ బెయిల్ మంజూరైంది. మొత్తం అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్ లభించడంతో నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశీ జైలు నుంచి విడులవుతున్న నేపథ్యంలో ఆయన మద్దతుదారులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకునే అవకాశం ఉంది. -
కార్మికుల సత్తా చాటుదాం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేసి, కార్మిక వర్గ సత్తా చాటుదామని రాష్ట్ర కార్మిక ఉద్యోగ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, 10గంటల పని విధానాన్ని, అధిక గంటల పని విధానాన్ని, రాత్రి సమయంలో మహిళలు పని చేసే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ సమ్మెను చేపడుతున్నట్లు సంఘాలు ప్రకటించాయి. గవర్నర్‌పేటలోని బాలోత్సవ్ భవన్లో ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంపల్లి రవీంద్రనాథ్ అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల, రైతుల, వ్యవసాయ కూలీ చేతివృత్తులు, మహిళా, యువజన, విద్యార్థి రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. ‘ఉపాధి’లో సంస్కరణలు అవసరం.. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతన మార్కెట్ విధానాన్ని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించాలని, రుణాలు రద్దు చేయాలని, రైతులకు అన్ని వేదాల సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని, రోజుకు రూ.800 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్లకు వ్యతిరేకంగా, బీజేపీ దాని అనుబంధ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం సత్తా చాటేందుకు జూలై 9న జరిగే సమ్మెలో కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు, శ్రామిక మహిళా నాయకులు వెంకట సుబ్బారావమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జల్లి విల్సన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు వై.కేశవరావు, పి.జమలయ్య, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి పాల్గొన్నారు. 9న సమ్మెను విజయవంతం చేద్దాం రాష్ట్ర కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు పిలుపు -
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
గుడివాడరూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ మహబూబ్ షరీఫ్ మంగళవారం తెలిపారు. గుడివాడ రైల్వే స్టేషన్ పరిధిలోని దోసపాడు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మరణించినట్లు తెలిపారు. మృతుని వయస్సు 60ఏళ్లు ఉంటుందని, బ్లూబై కంపెనీ తెలుపు, నీలం రంగు గడులు గల చొక్కా(రెడీమేడ్ షర్ట్), తెలుపు, నలుపు, నీలం రంగు గడుల లుంగి ధరించి ఉన్నాడన్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9440627570, 9866221412లో సంప్రదించాలని రైల్వే ఎస్ఐ కోరారు. -
కొనసాగుతున్న సారె సంబరం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారె సమర్పిస్తున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకుని తమ కుటుంబం పిల్లాపాపలతో సంతోషంగా ఉండేలా దీవించమని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి తాము సారెగా తీసుకువచ్చిన చీరలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, మిఠాయిలను సమర్పిస్తున్నారు. సారె తీసుకువచ్చిన భక్త బృందాలకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందిస్తున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్త బృందాలు సారెను అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందిస్తూ సంతోషాలను పంచుకుంటున్నారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు దేవస్థానం ఉచిత ప్రసాదంతో పాటు అన్న ప్రసాదాలను అందజేస్తోంది. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఈవో శీనానాయక్ అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దుర్గగుడికి తరలివస్తున్న భక్తబృందాలు -
మెరుగైన సేవలే లక్ష్యంగా కార్యాచరణ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా మెరుగైన ప్రపంచం కోసం ఉత్తమ సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు కృష్ణా జిల్లా సహకార శాఖ అధికారి కె. చంద్రశేఖరరెడ్డి అన్నారు. సహకార వారోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా మంగళవారం కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు తాము కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాథమిక సహకార సంఘాల్లో నమూనా బోర్డు మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్, మోడల్ ఆడిట్ జరిగాయన్నారు. బుధవారం సహకార సంఘాలు, డీసీసీబీలలో లోన్‌మేళా నిర్వహించటం ద్వారా నూతన సభ్యులను చేర్చుకోవటం, డిపాజిట్ల సేకరణ నిర్వహిస్తామన్నారు. 3వ తేదీన సంఘా లు ఉత్పత్తి చేసినవి ప్రదర్శించటం, సంఘ చరిత్రను, అభివృద్ధిని ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. 4వ తేదీన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సహకార రంగంపై రెండు గంటలపాటు బోధనలు చేస్తారన్నారు. 5వ తేదీన సహకార దినోత్సవం సందర్భంగా సంఘాల ఆవరణలో సహకార జెండా ఎగురవేస్తారన్నారు. ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టి సహకార రంగం ద్వారా మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణా జిల్లా సహకారశాఖ అధికారి చంద్రశేఖరరెడ్డి -
ప్రేమ చిగురించిన చోటే.. ప్రాణమూ పోయింది
ముద్దనూరు/పుట్రేల(విస్సన్నపేట): ఆ రెండు మనసులను పనిచేసే ప్రాంతమే పరిచయం చేసింది.. ప్రేమను చిగురించేలా చేసింది. పెళ్లిపీటల కోసం సిద్ధ పరచింది. మరో రెండు నెలల్లో ఒక్కటి చేయాలని చూసింది. కానీ ఇంతలోనే మృత్యువు ఆ ఇద్దరినీ కబళించింది. ఆ పనిచేసే ప్రాంతంలోనే పాశాన్ని విసిరింది. అనుకోని విపత్తు వారి ఆశలను ఆహుతి చేసింది. ఎన్నో ఆకాంక్షలతో కొత్త జీవితాన్ని ఆరంభించాలకున్న ఆ జంట.. ఇంట పెను విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫార్మా పరిశ్రమలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన యువతీ, యువకులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్‌రెడ్డి(25), ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేలకు చెందిన రామాల. శ్రీరమ్య ఫార్మా పరిశ్రమలో ఉద్యోగులు. ఇక్కడే వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఇరువురూ తమ పెద్దలను ఒప్పించారు. మరో రెండునెలల్లోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన తరుణంలో విషాదం వెంటాడింది. సోమవారం ఇద్దరూ పరిశ్రమలో విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వారిద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో పెనికలపాడు, పుట్రేల గ్రామాల్లో మంగళవారం తీవ్ర విషాదం అలముకుంది. రెండునెలల్లో పెళ్లి చేద్దామనుకున్నాం... రామాల నారయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె జ్యోత్స్న బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. చిన్న కుమార్తె శ్రీరమ్య తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసి ఆరు నెలల క్రితమే సిగాచి ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఇంతలో ఘోర విపత్తులో చిన్న కుమార్తె ప్రాణాలు కోల్పోవడాన్ని తలచుకుంటూ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. నిఖిల్ రెడ్డి కుటుంబంతో మాట్లాడి ఆషాఢం వెళ్లిన తర్వాత పెళ్లి చేద్దామనుకున్నామని తీరా ఈ విషాద సంఘటనలో ఇరువురు చనిపోయారని మృతురాలి తల్లి పద్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. పాశమైలారం ఫార్మా ప్రమాదంలో కాబోయే దంపతులు దుర్మరణం -
ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6,400కోట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు బకాయిపడిన ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ దాసరి భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బందెల నాసర్ జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్ పేరిట రూ.6400 కోట్లు బకాయిపెట్టిందన్నారు. టీడీపీ యువగళం పాదయాత్రలోనూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా కేవలం రూ.600కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకొందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కానందున యాజమాన్యాలు వేధిస్తున్నాయని, విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఫీజులు చెల్లించలేక కళాశాలల్లోనే సర్టిఫికెట్లు ఉన్నాయని, విద్యార్థులు ఉన్నత విద్య చదవలేక, మరో పనికి వెళ్లలేక, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నాలుగో తేదీ నుంచి ధర్నాలు.. బకాయిలు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 4 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. 11న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కార్తీక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యశ్వంత్, శరత్, అమర్నాథ్, ప్రణీత్, డేవిడ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. తక్షణం విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ -
కొండచిలువ హతం
మైలవరం: మైలవరం మండలం జంగాలపల్లి గ్రామంలో పాడుబడిన బావి వద్ద పేరుకుపోయిన చెత్తలో ఉన్న కొండచిలువను గమనించిన గ్రామస్తులు మంగళవారం కర్రలు, కత్తులతో హతమార్చారు. గ్రామానికి చెందిన రైతు వేల్పులకొండ ప్రసాద్‌కు పాము కన్పించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కేకలు పెట్టడంతో యువకులు పరుగున వెళ్లి దానిని హతమార్చారు. కొండ చిలువ సుమారు 10 అడుగుల పొడవు, 15కిలోలు బరువు ఉందని యువకులు తెలిపారు. కాగా జంగాలపల్లి గ్రామం నుంచి బయటికి రావాలంటే దారి మార్గం సరిగా ఉండకపోగా, కొద్దిపాటి వర్షానికి రహదారికి గండ్లు పడి కనీసం నడవడానికి కూడా గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యం పట్ల అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం గృహావసరాలకు బావి నీటిని వాడుకుంటూ ఉంటారని, అదే విధంగా అక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారని గ్రామస్తులు తెలిపారు. బావి పాడైపోయి ఉండటంతో గ్రామస్తులు చెత్తా చెదారం తీసుకువచ్చి అక్కడే పడేస్తున్నారని దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, ప్రమాదకరమైన పాములు తిరుగుతూ భయానక వాతావరణం నెలకొంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగునకు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వద్దు
గూడూరు: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమంలో ఎంపికై న గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం మండల పరిధిలోని లేళ్లగరువు గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. పంచాయతీలో నిర్వహిస్తున్న నీరు, పారిశుద్ధ్యం, ఎస్‌డబ్ల్యూపీసీ తదితర రిజిస్టర్లను పరిశీలించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, ప్రార్థనా మందిరాలను సందర్శించి అక్కడ ఉన్న వసతులపై ఆరా తీశారు. ఆయా ప్రదేశాలలో ఉపాధి హామీ నిధులతో ఇంకుడు గుంతలు, కంపోస్ట్ గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ప్రార్థనా మందిరం దగ్గర తడిచెత్త– పొడిచెత్త బుట్టలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పనుల నిర్వహణపై అసంతృప్తి.. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన చెక్‌లిస్ట్ ప్రకారం గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చినప్పటికీ పనులు నిదానంగా జరుగుతుండటం సహేతుకం కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఎల్పీఓ మహమ్మద్ రజావుల్లా, డీఎల్డీఓ పద్మావతి, ఎంపీడీఓ కె.వి.రామకృష్ణ, తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నటరాజ్, సర్పంచి మానస, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో మమేకం.. మండల పరిధిలోని లేళ్లగరువు, కప్పలదొడ్డి పాఠశాలలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మమేకం అయ్యారు. లేళ్లగరువు పాఠశాలలో 8 మంది విద్యార్థులు మాత్రమే ఉండటంతో ఒకే టీచర్ ఉన్నారు. దీంతో కంకటావలో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్‌కు విద్యార్థులను పంపితే నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులకు సూచించారు. కప్పలదొడ్డిలో విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
ఫలించిన వంశీ న్యాయ పోరాటం
గన్నవరం: గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ న్యాయ పోరాటం ఫలించింది. వివిధ కేసుల్లో గత 138 రోజులుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న ఆయనకు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి బయటకు రావడానికి మార్గం సుగమమైంది. రెడ్‌బుక్ కక్షతో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వల్లభనేని వంశీమోహన్‌పై ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు చేసింది. రెండున్నరేళ్ల క్రితం గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడి కేసు పునర్ విచారణ పేరుతో వంశీమోహన్‌ను 71వ నిందితుడిగా చేర్చింది. ఈ కేసు ఫిర్యాదుదారుడైన సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేశారని తప్పుడు కేసు పెట్టి.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం టీడీపీ పెద్దల సూచనల మేరకు ఆయనపై గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి, హనుమాన్‌జంక్షన్ పీఎస్‌ల్లో పదికి పైగా అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో గత ఐదు నెలలుగా విజయవాడ జిల్లా జైలులో ఆయన రిమాండ్‌లో కొనసాగుతున్నారు. ఆరోగ్యం క్షీణించినా.. గణనీయంగా బరువు తగ్గిపోవడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలతో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం కరుణించలేదు. ప్రభుత్వం తరఫున ఆయనకు సరైనా వైద్య సేవలు కూడా అందించలేదు. చివరికి హైకోర్టు జోక్యంతో ఆయుష్ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తనపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై న్యాయ పోరాటం సాగిస్తూ వచ్చిన ఆయనకు తొమ్మిది కేసుల్లో కోర్టుల నుంచి ఉపశమనం లభించింది. చివరికి బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీపై 2019లో నమోదైన కేసులో కూడా నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు భారీ ఊరట లభించింది. జైలు నుంచి ఆయన బుధవారం విడుదలయ్యే అవకాశం ఉందని వంశీమోహన్ తరఫు న్యాయవాదులు పేర్కొంటున్నారు. వంశీమోహన్‌కు బెయిల్ రావడం పట్ల నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ మంజూరు.. నేడు విడుదలయ్యే అవకాశం -
రుణాలను సద్వినియోగం చేసుకోండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి తదితరాల ద్వారా పొందిన రుణాలను తప్పనిసరిగా జీవనోపాధి కార్యకలాపాలకు ఉపయోగించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. సంపద సృష్టికి రుణాలు వాడుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన వార్షిక రుణ–జీవనోపాధి ప్రణాళిక నుంచి సూక్ష్మ రుణ ప్రణాళిక – జీవనోపాధులపై సమావేశం జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలు పొందే రుణాలపై పర్యవేక్షణ చేసి.. ఆ రుణాలను కుటుంబాల ఆర్థిక సాధికారతకు ఉపయోగపడేలా చేయిపట్టి నడిపించాలని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. రూ.1,266 కోట్లతో కార్యాచరణ.. జిల్లాలో 16 మండల సమాఖ్యలు, 767 గ్రామ సమాఖ్యలు, 24,880 స్వయం సహాయక సంఘాలు, 2,47,611మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. 2024–25లో 1,93,691మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ. 1,147.59 కోట్ల మేర రుణ మద్దతు లభించిందన్నారు. 2025–26కు సంబంధించి స్వయం సహాయక సంఘాల సభ్యుల వ్యక్తిగత జీవనోపాధి అవసరాలు ఆధారంగా దాదాపు రూ.1,266 కోట్ల వార్షిక రుణ–జీవనోపాధి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు వివరించారు. కుటుంబ స్థాయి సర్వే ఆధారంగా ఈ వార్షిక రుణ ప్రణాళికకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 30 వరకు ప్రచారం.. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎల్డీఎం కె.ప్రియాంక వివరించారు. బ్యాంక్ లింకేజీపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, యూఎల్బీల్లో కనీసం ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందంహనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రాజ్ ప్రియాసింగ్ నేతృత్వంలోని బృందం మంగళవారం పరిశీలించింది. తొలుత రేమల్లె గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు పండ్లతోటల సాగు, బంద్రీ చెరువు పూడికతీత, పశువుల షెడ్ల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ చానల్ పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మామిడి మొక్కలు పెంచుతున్న రైతు సంగీతరావుతో మాట్లాడారు. సాగు వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మడిచర్ల గ్రామంలో పంట కుంట, బీటీ రోడ్డు, రజక చెరువులో పూడిక తీత, పశువుల షెడ్డు నిర్మాణం, మ్యూజిక్ సోక్ పిట్ పనులను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. పీఎంఏవై–జీ పథకం కింద గ్రామంలో చేపట్టిన గృహ నిర్మాణాలను సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద కానుమోలు నుంచి రంగయ్య అప్పారావు పేట, రామ శేషాపురం గ్రామాల మీదగా రామన్నగూడెం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ సీఈఓ కన్నమ్మ నాయుడు, డ్వామా పీడీ శివ ప్రసాద్ యాదవ్, డీఆర్డీఏ పీడీ హరహరినాథ్, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాసరావు, ఎంపీడీఓ జోగేశ్వరరావు, ఏపీఓ అశోక్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు, పలువురు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అవనిగడ్డ: ఖరీఫ్ సాగు ఆరంభంలోనే కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతోంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 40 శాతానికి పైగా విత్తనాలను రైతులకు వారి గ్రామాల్లోనే అందించి ఆదుకుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పదిశాతం విత్తనాలు మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకొంది. దీంతో కృష్ణాజిల్లా రైతులు వరి వంగడాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అరకొరగా విత్తనాలు కృష్ణాజిల్లాలో ఈ ఖరీఫ్‌లో 1.64 లక్షల హెక్టార్లలో రైతులు వరిసాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ఎక్కువగా ఎంటీయూ 1061, బీపీజీ 5204 రకాలను రైతులు సాగుచేస్తారు. గత సంవత్సరం ఎంటీయూ 1262, 1318 రకాలను పలుచోట్ల సాగుచేయగా వాటిని కొనేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. దీంతో ఈ సంవత్సరం రైతులు ఆ రకాల జోలికెళ్లడం లేదు. సాధారణంగా ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనాలను రైతులు నారుమడికి ఉపయోగిస్తారు. ఈ సీజన్లో 1.02 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవగా ప్రభుత్వం 10,650 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకొంది. దీంతో విత్తనాలు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వచ్చిన లోడులు వచ్చినట్టు అయిపోతున్నాయి. రైతులు పనులు మానుకుని గంటల తరబడి ఎదురు చూసినా కొన్ని చోట్ల విత్తనాలు దొరకడం గగనంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 40 నుంచి 45 శాతం విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేసింది. అవసరమైతే డిమాండ్‌ను బట్టి మరో ఐదు శాతం విత్తనాలు సరఫరా చేసింది. ఈ ప్రభుత్వం పదిశాతం మాత్రమే సరఫరా చేయడంతో రైతులు విత్తనాలు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం కూడా విత్తనాల కోసం రైతులకు ఇబ్బందులు తప్పలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయిందని రైతులు తమకు తామే సర్దిచెప్పుకొన్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కొనసాగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం సబ్సిడీపై అవసరమైనన్ని వరివిత్తనాలు సరఫరా చేసింది. ఇప్పుడు చాలా తక్కువ వచ్చాయని చెబుతున్నారు. బయట షాపుల్లో రేటు ఎక్కువ. కల్తీ విత్తనాలు వచ్చే ప్రమాదముంది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాల సరఫరా పెంచాలి. – చిరివేళ్లే యానాదిరావు, పిట్టల్లంక కృష్ణాజిల్లాలోని బందరు, కేఈబీ కెనాల్‌కు ఇటీవల సాగునీరు విడుదల చేశారు. గతంలో బోర్ల కింద అక్కడక్కడా రైతులు నారుమళ్లు పోసుకున్నారు. పంట కాలువలకు సాగునీరు విడుదల చేయడంతో ఇప్పుడే నారుమళ్లు పోసుకునే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఆదిలోనే విత్తనాలకు ఈ విధంగా డిమాండ్ ఉంటే సాగు పనులు ముమ్మరం చేస్తే పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 65 శాతం మంది కౌలు రైతులు ఉన్నారు. ఏటా పంట చేతికందగానే 85 శాతం మంది కౌలు రైతులు విత్తనాలకు తీయకుండానే ధాన్యం విక్రయిస్తారు. వీరంతా ప్రస్తుతం ఎక్కడో ఒకచోట విత్తనాలు కొనుగోలు చేసి సాగుచేయాల్సిందే. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి సాగుకు సరిపడా విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. గత సంవత్సరం సబ్సిడీ విత్తనాలు సరిగా సరఫరా చేయలేదు. ఈ సంవత్సరం అదే ధోరణి అవలంబిస్తోంది. ప్రైవేటు షాపుల్లో విత్తనాలు తెచ్చుకోవడానికి వెళ్లిన రైతులు బాగోలేవని తిరిగి వచ్చేస్తున్నారు. – బీసాబత్తిన ప్రసాద్, మాజీ డీసీ చైర్మన్, నాగాయలంక అవనిగడ్డ సబ్ డివిజన్‌కు బీపీటీ 5204 రకం 515 క్వింటాళ్లు, ఎంటీయూ 1061 రకం 154 క్వింటాళ్లు, 1318 రకం 110 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి. ప్రస్తుతం వీటిని రైతులుకు సబ్సిడీపై అందిస్తున్నాం. ప్రైవేటు విత్తన షాపులను తనిఖీ చేస్తున్నాం. ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. – జయప్రద, ఏడీఏ, అవనిగడ్డ 9న్యూస్రీల్సరిపడా విత్తనాలు ఇవ్వాలి కృష్ణా జిల్లాలో 1.64 లక్షల హెక్టార్లలో వరిసాగు 1.02 లక్షల క్వింటాళ్ల వరి వంగడాలు అవసరం ప్రభుత్వం సరఫరా చేసింది 11,650 క్వింటాళ్లే.. విత్తనాల కోసం రైతులకు తప్పని ఇబ్బందులు గత ప్రభుత్వంలో 40 శాతానికి పైగా విత్తనాల పంపిణీ అవసరమైతే ఇండెంట్ పెట్టి సరఫరా చేసిన వైనం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిఇప్పుడే ఇలా ఉంటే.. తనిఖీలు చేస్తున్నాం -
గూడూ పోయే.. దారీ కరువాయె
రోడ్డు విస్తరణ పేరుతో అడ్డంగా ఉన్నాయంటూ పక్కా ఇళ్లను హడావిడిగా కూల్చేశారు. పరిహారం ఇస్తామని చెప్పారు. – ఇది 2016 నాటి మాట మరోవైపు కమీషన్లకు ఆశపడి ముందస్తు అంచనాలు, వర్క్ ఆర్డర్లు లేకుండా పనులను మొదలు పెట్టారు. కానీ కాంట్రాక్టర్ కిలోమీటర్ దారికి రూ.కోటి కొట్టేయాలనుకుని ప్రతిపాదన పంపాడు. దీన్ని ప్రభుత్వం తిరస్కరించడంతో పనులను మధ్యలోనే ఆపేశాడు. – ఇది ప్రస్తుత పరిస్థితి జి.కొండూరు: ‘లోకేశ్.. మా ఊరి దారి సమస్య పరిష్కరించండి’ అంటూ మంత్రి నారా లోకేశ్ ఫొటోలతో మైలవరం మండలం వెల్వడం గ్రామస్తులు ఫ్లెక్సీలతో మంగళవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం మైలవరం నుంచి నూజివీడు వెళ్లే రహదారిని విస్తరించే క్రమంలో వెల్వడంలో కొన్ని సర్వే నంబర్లు నోటిఫై చేశారు. రహదారి అభివృద్ధి పనులను నాలుగు నెలల కిందట హడావిడిగా చేపట్టారు. మార్గం పొడవునా వెట్ మిక్స్ వేశారు. అయితే అర్ధంతరంగా రహదారి విస్తరణ నిలిచిపోయింది. దీంతో ఎండొస్తే దుమ్ము, వానొస్తే రహదారిపై గోతుల్లో చేరిన నీటితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం కనిపించలేదు. దీంతో గ్రామస్తులంతా దారిపొడవునా నారా లోకేశ్ ఫొటోలతో ఫ్లెక్సీలు కట్టారు. ఇదిలా ఉంటే 2016 రహదారి విస్తరణలో గ్రామంలో కొందరి ఇళ్లను కూల్చేశారు. పరిహారం ఇవ్వలేదు. దీంతో వారు సైతం లోకేశ్ ఫొటోలతో ఫ్లెక్సీలు వేయించి వినూత్న నిరసనకు దిగారు. కాంట్రాక్టర్ అత్యాశ.. మొదటికి వచ్చిన సమస్య మైలవరం–నూజివీడు ఆర్‌ఆండ్‌బీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా వెల్వడం అయ్యప్ప స్వామి గుడి నుంచి ఐదు కిలోమీటర్ల మేర ఉన్న తారు రోడ్డును అంచనాలు, వర్క్ ఆర్డర్లు లేకుండా పూర్తిగా తొలగించి నాలుగు నెలల క్రితం రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు. తారు రోడ్డును పూర్తిగా తొలగించడానికి ఆర్అండ్బీ అధికారులు అడ్డుచెప్పినా కాంట్రాక్టరు తనకు స్థానికంగా రాజకీయ అండ ఉందనే ధోరణికి పోయాడు. తారురోడ్డును తవ్వి వెట్‌మిక్స్ వేసిన తర్వాత నిధుల మంజూరుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరారు. కిలోమీటరుకు రూ.కోటి వరకు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు పంపాడు. వీటిని ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టరు మూటా ముల్లె సర్దుకొని వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో నిత్యం రాకపోకలు సాగుతుండటంతో వెట్‌మిక్స్ కదిలి రహదారి అంతా ఛిద్రంగా మారింది. దారిపొడవునా గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గుంతల్లో నీరు చేరి చిన్న కొలనుల్లా తలపిస్తున్నాయి. రహదారి విస్తరణ పేరుతో హడావిడిగా ఇళ్లను కూల్చేసిన అధికారులు మధ్యలోనే పనులు ఆపేసిన కాంట్రాక్టర్ అర్ధంతరంగా నిలిచిన మైలవరం–నూజివీడు రహదారి పనులు రహదారి బాగు చేయాలంటూ మంత్రి లోకేశ్ ఫొటోతో వెలిసిన ఫ్లెక్సీలు లోకేష్ ఫ్లెక్సీతో నిరసన తెలుపుతున్న గ్రామస్తులుఈ ఫొటోలోని వృద్ధ దంపతుల పేర్లు చనుమోలు సత్యనారాయణ, సామ్రాజ్యం. వీరికి వెల్వడం గ్రామంలో సర్వే నంబరు 498/1లో ఇల్లు ఉంది. అయితే 2016లో మైలవరం–నూజీవీడు ఆర్అండ్బీ రహదారి విస్తరణలో భాగంగా వీరి ఇంటిని అధికారులు కూల్చారు. అప్పటి నుంచి వీరికి ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. దీనిపై అధికారులను సంప్రదించగా ఇళ్లు కూల్చిన స్థలంలో రోడ్డు వేయలేదని, పరిహారం ఇవ్వాల్సిన పనిలేదని చెప్పినట్లు బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మంత్రి లోకేశ్ ఫ్లెక్సీని గ్రామంలో కట్టారు. -
4 వరకు హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత
కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హంసలదీవి సాగరతీరం బీచ్ గేట్లను మూసివేసినట్లు ఇన్చార్జి ఫారెస్ట్ ఆఫీసర్ మోహిని విజయలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో పాటు ఈదురుగాలులు తీవ్ర కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీ వరకు బీచ్ గేట్లను మూసి వేస్తామని వివరించారు. పర్యాటకులు సహకరించి ఈ మూడు రోజుల పాటు బీచ్‌కు రాకుండా ఉండాలని కోరారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచే బీచ్ గేట్లకు అటవీ అధికారులు తాళాలు వేశారు. త్వరలో ఎ.కొండూరుకు కృష్ణా జలాలు తిరువూరు: మరో 45 రోజుల్లో ఎ.కొండూరు మండలానికి కృష్ణా నదీజలాలను సరఫరా చేస్తా మని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎ.కొండూరులో జల్‌జీవన్ మిషన్ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. త్వరితగ తిన పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత తాగు నీరందించే లక్ష్యంతో జల్ జీవన్‌మిషన్ అమలవుతోందన్నారు. కిడ్నీబాధిత తండాలకు కృష్ణా నదీ జలాలు ఇచ్చే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి జరుగుతోందని, ఇప్పటికే ప్రధాన పైపులైను పనులు పూర్తయ్యాయని వివరించారు. అనంతరం కంభంపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పరిశీలించారు. డెంగీపై విస్తృత అవగాహన కల్పించాలిలబ్బీపేట(విజయవాడతూర్పు): వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగీ నివారణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం డెంగీ డే సందర్భంగా వ్యాధిపై అవగాహన కల్పించే రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను డాక్టర్ మాచర్ల సుహాసిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెలరోజులు యాంటీ డెంగీ, యాంటీ మలేరియా మాసంగా పాటిస్తామని తెలిపారు. డెంగీ, మలేరియా ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా వ్యాధులపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రంలో తప్పనిసరిగా ఈ నెల రోజులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతి బాబు, డీపీఎంఓ డాక్టర్ నవీన్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ బాలాజీ, డాక్టర్ కార్తీక్, డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర కీలకం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజల ఆరోగ్య పరిరక్షణకు శ్రమించే వైద్యులను సమాజంలోని అన్ని వర్గాల వారు గౌరవించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ సూచించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు వైద్యులను మంగళవారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లా డుతూ.. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమన్నారు. నిరంతరం ప్రజాసేవపై చిత్త శుద్ధి, అంకితభావంతో పనిచేసే వైద్యులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఎంతో ప్రయాస పడి వైద్య విద్యను అభ్యసించి వ్యక్తిగత, కుటుంబ పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచటానికి కృషి చేస్తున్న వైద్యులపై ప్రజలు, నాయకుల ధోరణిలో మార్పు రావాలన్నారు. ఆఖరి క్షణం వరకు రోగుల ప్రాణాలు కాపాడేందుకు శ్రమించే వైద్యులపై దాడులు సరి కాదని పేర్కొన్నారు. విశిష్ట సేవలందించిన వైద్యులకు సత్కారం జాతీయ డాక్టర్స్ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన పది మంది వైద్యులను మంత్రి సత్య కుమార్ యాదవ్ సత్కరించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మశ్రీవాత్సవ, ప్రస్తుత డీఎంఈ, శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ డి.ఎస్.వి.ఎల్.నరసింహం, జనరల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ ఎ.అశ్విని కుమార్, కార్డియాలజిస్ల్టు డాక్టర్ ఎ.శ్రీనివాసరావు, డాక్టర్ పి.భాస్కరనాయుడు, డాక్టర్ జి.భవానీప్రసాద్, న్యూరోసర్జన్ డాక్టర్ కె.సత్యవరప్రసాద్, డాక్టర్ ఎం. కృష్ణనాయక్, డాక్టర్ ఆర్.మురళీబాబూరావు, ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ టి.భారతిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి, హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, డీఎంఈ అకడమిక్ డాక్టర్ జి.రఘునందనరావు, మానసిక వైద్యుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ డాక్టర్స్ డే సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులకు సత్కారం -
వంతెన నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): పెనమలూరు మండలం పోరంకిలో బందరు కాలువపై వంతెన నిర్మాణానికి సంబంధించి అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సమీక్షించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ బాలాజీ బంద రులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోరంకి వద్ద బందరు కాలువపై వంతెన నిర్మాణం గురించి సమీక్షించారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సమీ పంలో వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆయన చర్చించారు. బందరు కాలువ కట్టపై ఇరువైపులా ఉన్న ఆక్రమణలు, భూసేకరణ, పరిహారం, నిర్మాణానికి పట్టే సమయం తదితర అంశాలపై అధికారులతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఉయ్యూరు ఆర్డీఓ బి.ఎస్.హేలా షారోన్, ఇరిగేషన్ ఎస్ఈ మోహన్‌రావు, రహదారులు భవనాలు ఎస్ఈ భాస్కరరావు, ఈఈ లోకేష్, కంకిపాడు తహసిల్దార్ గోపాలకృష్ణ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం గన్నవరంలో ల్యాండ్ అయ్యింది. హైదరాబాద్‌లో ల్యాండింగ్‌కి వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ అధికారులు గన్నవరం విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఇండిగో విమానంలో మొత్తం 222 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదం తర్వాత ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. వరుసగా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం.. విమాన ప్రయాణం అంటేనే భయపడేలా చేస్తున్నాయి. తాజాగా ఓ విమానానికి పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. జూన్ 14వ తేదీన ఢిల్లీ నుంచి వియన్నా బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పై నుంచి కిందకు దిగిపోయింది. ఉన్నపళంగా 900 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగి పోవడంతో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి నియంత్రణలోకి తీసుకొచ్చారు. -
వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
విజయవాడ: ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు వల్లభనేనికి వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఇప్పటివరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైనట్లయ్యింది. రేపు వల్లభనేని వంశీ జిల్లా జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వల్లభనేని వంశీపై అనేక కేసులు బనాయించారు. ఈ క్రమంలోనే వంద రోజులకు పైగా వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఉన్నారు. గత నెలలో రెండు కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరు కాగా, తాజాగా ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. దాంతో వంశీపై పెట్టిన కేసులన్నింటిల్లోనూ బెయిల్ మంజూరైంది. మొత్తం అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్ లభించడంతో రేపు(బుధవారం) జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రత్యక్ష దైవాలు వైద్యులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ప్రాణాపాయంతో ఆస్పత్రికి వచ్చిన రోగికి సత్వర వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించిన వైద్యుడిని దైవంతో సమానంగా భావిస్తారు. రోగులకు సేవలు అందించే క్రమంలో పలువురు వైద్యులు ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అయినప్పటికీ తమ వృత్తి ధర్యాన్ని నెరవేరుస్తూనే ఉంటారు. కరోనా సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వైద్యుడు కరోనా బారినపడి చావు అంచులదాకా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఒకప్పుడు రోగి లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స చేసే వాళ్లు. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి వ్యాధినైనా నిర్ధారించడమే కాదు. ముందస్తుగా లక్ష ణాలు గుర్తించే పరికరాలు వచ్చాయి. ఎంఆర్ఐ, సీటీ, పెట్సీటీలు ఉన్నాయి. దీంతో కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించగలుగుతున్నారు. చికిత్సలో సత్ఫలితాలు సాధించగలుగుతున్నారు. గర్భస్థ పిండానికి సైతం వైద్యం చేసే స్థాయికి మన వైద్యులు ఎదిగారు. అరుదైన జబ్బులకు విజ యవంతంగా చికిత్సలు అందిస్తున్నారు. జబ్బు చేసి వచ్చిన వారు నయం అయిన తర్వాత ఆస్పత్రి నుంచి వెళ్లేటప్పుడు రోగి తెలిపే కృతజ్ఞతలే వైద్యులకు సంతృప్తి నిస్తాయి. ప్రాణాపాయంతో వచ్చిన వారికి పునర్జన్మ సేవలు అందిస్తూ ఇన్ఫెక్షన్స్ బారిన పడిన వారెందరో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రాణం పోస్తున్నారు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం... -
సీఎస్ఆర్ నిధుల మంజూరుకు అంచనాలు తయారుచేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల మంజూరుకు అంచనాలు తయారుచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో స్మార్ట్ ఆంధ్ర ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఎన్.నరేష్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, రక్షిత మంచినీటి పథకాలకు అవసరమైన మరమ్మతులు, దివ్యాంగులకు ఉపకరణాలు, మునిసిపాల్టీలకు చెత్తను తరలించే ట్రాక్టర్లు తదితర అవసరాల కోసం ఆయా శాఖల అధికారులు అంచనాలు రూపొందించి నివేదిక సమర్పించాలన్నారు. నివేదిక తయారీలో ప్రాధాన్యత పనులను దృష్టిలో ఉంచుకుని తయారుచేయాలన్నారు. ప్రస్తుతం కొన్ని శాఖలు నిధుల మంజూరు కోరుతూ పనులను ప్రతిపాదించాయని అయితే ప్రాధాన్యత గల పనులను సూచిస్తూ సవరించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. గుడివాడలో తాగునీటి వసతి కల్పనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ హామీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రక్షిత మంచినీటి పథకాల మరమ్మతులకు అవసరమైన నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో సీటీస్కాన్ పరికరం కొనుగోలు, భవనాలు లేని పాఠశాలల్లో నిర్మాణాలు, మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఏఆర్టీ సెంటర్ భవన నిర్మాణం, పలు పీహెచ్‌సీల్లో అవసరమైన వైద్యపరికరాల కోసం తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో సీపీవో ఎస్.భీమరాజు, డీఈవో పీవీజే రామారావు, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదిని సింగ్, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.అధికారులకు కలెక్టర్ బాలాజీ ఆదేశం -
మానసిక నిపుణుల అవసరం పెరిగింది
త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి లబ్బీపేట (విజయవాడతూర్పు): ప్రస్తుత సమాజంలో జీవనశైలి, దురలవాట్ల కారణంగా మానసిక రుగ్మతలు పెరిగాయని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. అందువల్ల మానసిక నిపుణుల అవసరం కూడా సమాజంలో పెరిగిందన్నారు. విజయవాడలోని ఇండ్లాస్ హాస్పిటల్స్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన ఎం.ఫిల్ క్లినికల్ సైకాలజీ, పీడీసీపీ కోర్సులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి ఆయన విజయవాడలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి ఆయా కోర్సుల్లో అడ్మిషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మానసిక రుగ్మతలను సైతం ఆరోగ్య సమస్యలు గానే పరిగణించి చికిత్సనందించాలని సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, మానసిక వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇండ్లాస్ హాస్పిటల్స్ క్లినికల్ సైకాలజీ విభాగం డైరెక్టర్లు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ ఇండ్ల మాట్లాడుతూ మానసిక వైద్యాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికా రెడ్డి పాల్గొన్నారు. బీడీసీ రిటైనింగ్ వాల్ పరిశీలించిన మంత్రి నిమ్మల కొండపల్లి(ఇబ్రహీంపట్నం): గతేడాది బుడమేరు కట్టకు గండ్లు పడిన ప్రాంతంలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను సోమవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. మిగులు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం పూర్తి చేస్తున్నామని, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద పాతగేట్ల స్థానంలో రూ.1.8 కోట్లతో నూతన గేట్లు అమర్చినట్లు తెలిపారు. బుడమేరు కట్ట పటిష్టత కోసం వెలగలేరు– ఈలప్రోలు మధ్య 7 కిలోమీటర్ల పొడవునా గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల పొడవునా డ్రైన్లో పూడికతీత పనులు జరుగుతున్నట్లు తెలిపారు. కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా బుడమేరు నీరు సముద్రంలో కలిసేలా రూ.9 కోట్లతో డీసిల్టింగ్ పనులు జరుగుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రితో పాటు జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాలు కృషి చేయాలి..
పెడన: వస్త్ర ప్రపంచంలో ఎన్ని ఆధునిక డిజైన్లు అవతరిస్తున్నా వన్నెతగ్గనిదిగా సహజసిద్ధ కలంకారీ నిలుస్తోంది. ఈ ప్రాచీన కళకు సరికొత్త హంగులు అద్దుతున్న తరుణంలో మరింత ప్రాచుర్యం కోసం కలంకారి పరిశ్రమలు చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తోంది. ఆఫ్‌లైన్ బిజినెస్‌తో పాటు ఆన్లైన్ షాపింగ్ కూడా ఉండటంతో.. ఫ్యాషన్ డిజైన్ యూనివర్సిటీలు, కళాశాలలు దీనిపై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలోనే డెహ్రాడూన్‌లోని గ్రాఫిక్ ఏరా హినియన్ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైన్ చేస్తున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ప్రాజెక్టు వర్క్‌కు కలంకారీని ఎంపిక చేసుకున్నారు. వర్సిటీలో మొత్తం 45 మంది వివిధ ప్రాంతాల్లో, ముగ్గురు ముగ్గురు చొప్పున 15 బ్యాచ్‌లుగా విడిపోయి ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఊటీ, వెస్ట్ బెంగాల్, బెనారస్ తదితర ప్రాంతాల్లో ప్రాజెక్టు చేస్తున్నారు. వారిలో ఒక బ్యాచ్ కృష్ణా జిల్లాలోని పెడనలో శ్రీనివాస కోరమండల్ కలంకారీ అండ్ హ్యాండ్ లూమ్స్ హౌస్‌ను ఎంపిక చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే వీరు ప్రాజెక్టు వర్క్ మొదలు పెట్టి 15 రోజులు అయింది. ప్రాసెసింగ్ నుంచి ప్రింటింగ్ వరకు.. ప్రాజెక్టు వర్క్ చేసేందుకు వచ్చిన విద్యార్థినులు కోరా క్లాత్‌ను ఏ విధంగా సిద్ధం చేయాలి, సహజ సిద్ధ రంగులు ఏ విధంగా తయారు చేస్తున్నారు.. ఏయే రంగులు వేటి ద్వారా వస్తున్నాయి.. వంటి వివరాలను తెలుసుకోవడంతో పాటు లిఖితపూర్వకంగా నమోదు చేసుకుంటున్నారు. రికార్డులు రాసుకుంటూ స్వయంగా క్షేత్రస్థాయిలో ప్రాసెసింగ్‌లో భాగస్వాములవుతున్నారు. కలంకారీపై తొలిసారిగా ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న డెహ్రాడూన్ వర్సిటీ విద్యార్థినులు కళకు సరికొత్త హంగులద్దడమే లక్ష్యమంటున్న విద్యార్థినులు సహజ సిద్ధ కలంకారీ కళను బతికించడానికి, మరింత ప్రాచుర్యం చెందేలా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టు వర్క్‌లను చేసుకునేలా విద్యార్థులను ప్రొత్సహించేలా అడుగులు వేస్తే బాగుంటుంది. విద్యార్థినులు స్వతహాగా ప్రాజెక్టు వర్క్ చేయాలని రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారికి చేయగలిన సహాయం చేస్తాం. – పిచ్చుక వరుణ్‌కుమార్, శ్రీనివాస కోరమండల్ అధినేత, పెడన -
ఏఎన్ఎం బదిలీలకు కౌన్సెలింగ్
మచిలీపట్నం అర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏఎన్ఎం గ్రేడ్–3 ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ సోమవారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. శర్మిష్ఠ కౌన్సెలింగ్‌ను పర్యవేక్షించారు. ఉద్యోగులు సేవా రిజిస్టర్, ప్రాధాన్యతలు, విద్యార్హతల జిరాక్స్, పారామెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఒరిజినల్స్‌తో ఉదయం 8గంటల నుంచి కార్యాలయంలో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. సోమవారం పొద్దుపోయేవరకు సాగిన కౌన్సెలింగ్‌లో 368 మంది ఎన్టీఆర్, 329మంది కృష్ణా, 94మంది ఏలూరు జిల్లాలోని ఉద్యోగులు బదిలీ అయ్యారు. మునిసిపాలిటీలతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు సీనియారిటీ జాబితాల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీ ఉత్తర్వులను అందజేశారు. -
కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
ఇఫ్టూ భవన నిర్మాణ కార్మిక సంఘాల విలీన సభ డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు కె. పోలారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఇఫ్టూ అనుబంధ.. ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం విలీన సభ జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో పోలారి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో హామీలను ఇచ్చారన్నారు. బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారానికి వచ్చి ఏడాది అయినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు అట్టడుగు స్థాయిలో ఉండడం బాధాకరమన్నారు. నూతన కమిటీ ఎన్నిక.. ఇఫ్టూ ఉపాధ్యక్షుడు ఆర్.మోహన్ మాట్లాడుతూ రెండు సంఘాలను ఒకే సంఘంగా విలీనం చేశామని, ఇకపై ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం పేరుతో పనిచేస్తుందని ప్రకటించారు. ఈ మేరకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు. నూతన సంఘానికి అధ్యక్షుడిగా ఆర్.మోహన్, ప్రధాన కార్యదర్శిగా కె.వి రమణ, ఉపాధ్యక్షుడిగా ఏసురత్నం, సహాయ కార్యదర్శిగా ఎం. నాగరాజు, కోశాధికారిగా గుబ్బల ఆదినారాయణ, మరో 12 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
కోనేరుసెంటర్: మీకోసంలో అందిన అర్జీలను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ న్యాయం కోసం వచ్చే బాధితులకు అండగా నిలబడి న్యాయం జరిగేలా చూడటమే మన కర్తవ్యమన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలనిని, ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మసలుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, ఫిర్యాదుదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలన్నారు. ఫిర్యాదుదారుల పట్ల అమర్యాదగా మాట్లాడినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీకోసం కార్యక్రమంలో మొత్తం 38 అర్జీలు అందుకున్నట్లు చెప్పారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీకోసంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు -
పెద్ద ఎత్తున ఇసుక, మట్టి దోపిడీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ‘కిశోర’ పర్వంగా ప్రారంభమైన అవినీతి, అక్రమాలు.. రోజురోజుకీ శౌర్య రూపం దాల్చుతున్నాయి. పార్లమెంట్ ముఖ్యనేత కార్యాలయంలోనే ఉంటూ ‘ఆయన’ తన హవా నడిపిస్తున్నారు. ఈయన చేతిలో పార్లమెంట్ ముఖ్యనేత కీలుబొమ్మగా మారారని టీడీపీ వర్గాలే బహిరంగంగా పేర్కొంటున్నాయి. ప్రతి పనికీ రేటు కట్టి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, పేకాట, బూడిద దేనిని వదలకుండా కోట్ల రూపాయలు దోచేస్తున్నట్లు చెబుతున్నారు. విజిలెన్స్, మైనింగ్, పోలీసు వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పార్లమెంటు నేత కార్యాలయానికి వచ్చిన వారిని గంటల తరబడి నిలబెట్టడం, వారి పట్ల దురుసుగా వ్యవహరించటం పరిపాటిగా మారినట్లు చెబుతున్నారు.విజిలెన్స్ అధికారులతో దాడులు..ఎన్టీఆర్ జిల్లాలో రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లు, ట్రాన్స్పోర్టర్లు.. తనకు కప్పం చెల్లించకుండా గ్రావెల్, మట్టి ఎక్కడ తవ్వినా విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేసి, వారితో దాడులు చేయించి వాహనాలు సీజ్ చేయిస్తున్నారని, బేరం కుదిరిన తరువాతే వాహనాలను రిలీజ్ చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తి హైవే కాంట్రాక్టర్‌తో మట్టి తోలకం ఒప్పందం కుదుర్చుకొని తోలుతుంటే, విజిలెన్స్ అధికారులతో దాడులు చేయించి వాహనాలను సీజ్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. రూ.20లక్షలు ముడుపులు ముట్టిన తర్వాతే ఆ వాహనాలను రిలీజ్ చేయించినట్లు పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో ఇబ్బందులు పడి డబుల్ పెనాల్టీ కట్టడం ఎందుకనే భావనతో, ఇతనితోనే ముందుగా ఒప్పందం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి..దోపిడీ పర్వం ఇలా..●హైవే పనులకు గ్రావెల్ తోలుకుంటున్న కాంట్రాక్టర్‌ను బెదిరించి రెండు విడతలుగా రూ.కోటి వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.●తిరువూరులో రేషన్ మాఫియా నుంచి రూ.20 లక్షలు, మట్టి మాఫియా నుంచి రూ.20లక్షలు, పేకాట శిబిరాల నిర్వహణ నుంచి నెలకు రూ.10 లక్షలు మామూళ్లు వసూలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో తిరువూరు నియోజకవర్గ ముఖ్యనేతకు కొంత వాటా ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.●ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో తిరువూరు నియోజకవర్గంలో కోడి పందేలు, కోత ముక్క ఆట ఆడించినందుకు రూ.కోటిపైగా వసూలు చేసి, ‘కిశోరం’తో పాటు నియోజకవర్గ ముఖ్యనేత సగం సగం తీసుకున్నట్లు అప్పట్లో చర్చ నడిసింది.●జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగ్రంచిపోలు, నందిగామ నియోజకవర్గంలోని గండేపల్లి తెలంగాణ నుంచి క్యాసినో బృందాలను తెచ్చి జూద శిబిరాలు నిర్వహించారు. ఇందుకోసం ఒక్కో దాని నుంచి రూ.40లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు బలంగా వినిపించాయి.●ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీటీపీఎస్ బూడిదను హైవే పక్కనే డంప్ చేసి, ఇతనే ఒక్కో లారీ లోడింగ్ కోసం టోకెన్‌కు రూ.3,500 తీసుకొని ఇస్తున్నట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. రోజుకు పెద్ద సంఖ్యలో టోకెన్లు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలన్నీ ఆ పార్లమెంట్ ముఖ్యనేత కార్యాలయం కేంద్రంగానే సాగుతుండటం.. ఆ ముఖ్యనేత అస్సలు నోరు మెదపకపోవడంతో.. అంతా ఆయనకు తెలిసే జరుగుతోందా అన్న చర్చలు ఆ పార్టీ వర్గాల్లోనే నడుస్తోంది.సీఐ పోస్టింగ్‌కు రూ.30లక్షలు..జిల్లాలోని ఓ రూరల్ నియోజకవర్గం పరిధిలో సీఐ పోస్టింగ్‌కు రూ.30లక్షలు వసూలు చేసినట్లు బహిరంగానే చర్చించుకొంటున్నారు. ముడుపులు చెల్లించి పోస్టింగ్ తెచ్చుకోవడంతో ఆ సీఐ రెచ్చిపోతున్నారని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. ఆ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పాత కేసులకు సంబంధించి దాదాపు 250–300 మంది ముద్దాయిలను స్టేషన్‌కు ిపిలిపించి.. వారి నుంచి రూ.20వేల నుంచి రూ.30వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నా యి. కొంత మంది వ్యభిచారులను స్టేషన్‌కు పిలిపించి, వారి ఫోన్లో ఉన్న కొంత మంది వ్యక్తులకు ఫోన్ చేసి, బెదిరించి, ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడంతో, విషయం బయటకి చెప్పుకోలేక కొంత మంది టీడీపీ నేతలే లోలోన కుమిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీఐ దందాలో అక్రమాల కిశోరానికి వాటా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆ సీఐ విజయవాడ నగరంలోని ప్రముఖ బంగారు దుకాణంలో రూ.50లక్షల బంగారం కొనుగోలు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
సహజ సిద్ధ రంగులు ఆకట్టుకున్నాయి..
కలంకారీ డిజైన్లను ఆన్లైన్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చూశా. స్వయంగా పరిశీలించి తెలుసుకోవడం కోసం ఈ ప్రాజెక్టును ఎంపిక చేసుకున్నా. సహజ సిద్ధ రంగులతో డిజైన్లు ముద్రించడం, పర్యావరణానికి ఎటువంటి హానీ కలుగకుండా ఉండేలా ఈ పరిశ్రమలుండటం వల్ల ఈ రంగంపై దృష్టిపెట్టాను. ట్రెడిషనల్‌గా ఉండే ఈ కలంకారీ డిజైన్లను వెస్ట్రన్ డిజైన్వైపు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ఎంపిక చేసుకున్నా. – కుషుబుకుమారి, డెహ్రాడూన్ యూనివర్సిటీ -
పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు
చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను, స్థానికసంస్థలను నిర్వీ ర్యం చేస్తోందని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీకి సోమవారం మీకోసం కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సైతం దారి మళ్లిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను అగౌరవపరుస్తూ చట్టాలను తుంగలోకి తొక్కుతున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని టీడీపీ నేతలు జేబు నింపుకొనే సంస్థగా మార్చుకున్నారన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పధకంలో జరుగుతున్న అవినీతిపై తక్షణమే న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనులను గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. సర్పంచులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులను స్థానిక సంస్థలకు వెంటనే జమ చేయాలన్నారు. బిల్లుల చెల్లింపులో రాజకీయ జోక్యాన్ని నివారించాలన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 సవరణల మేరకు సర్పంచులకు ఉన్న అధికారులను అమలు చేయాలని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంపుదల చేయాలని, పెండింగ్ గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నామా వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు సీహెచ్ లక్ష్మీనారాయణ, ఆర్.కళ్యాణి, వైఎస్సార్ సీపీ నాయకులు ఎ.సత్యనారాయణ, డి.విజయకుమార్, కె.నాగరాజు, ఆర్.ప్రసాద్ తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు -
జీవనశైలి వ్యాధులు పెరిగాయి
సమాజంలో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మూడు పదుల వయస్సులోనే మధుమేహం, రక్తపోటు, ఒబెసిటీలకు గురవుతున్నారు. దీంతో హార్ట్ ఎటాక్, పక్షవాతం వంటి జబ్బుల బారిన పడుతున్నారు. ప్రతి వైద్యుడు బాధ్యతగా వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి. – డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి, మధుమేహ వ్యాధి నిపుణుడు క్యాన్సర్‌ను జయించేలా చికిత్సలు ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే జీవితం ముగిసినట్లేనని భావించేవాళ్లు. కానీ నేడు ఎంతోమంది క్యాన్సర్ రోగులకు స్వస్థత చేకూర్చి సాధారణ జీవితం గడిపేలా చేయగలుగుతున్నాం. అదే మాకు సంతృప్తినిస్తుంది. క్యాన్సర్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది. ఇంకా కొందరు నాలుగో దశలో చికిత్సకోసం వస్తున్నవారు ఉన్నారు. ప్రస్తుతం అత్యాధునిక నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో సూక్ష్మదశలోనే క్యాన్సర్‌ను నిర్ధారించి సత్ఫలితాలు సాధించగలుగుతున్నాం. రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వంటి వాటిని అత్యుత్తమ చికిత్సా పద్ధతుల ద్వారా నయం చేయగలుగుతున్నాం. – డాక్టర్ ఎన్.సుబ్బారావు, క్యాన్సర్ వైద్య నిపుణుడు ●రోగి కృతజ్ఞతే మాకు సంతృప్తి నిత్యం ఎంతో మంది ఆయాసం, శ్యాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో వస్తుంటారు. వారికి సరైన చికిత్స అందిస్తే వారు తర్వాత ఓపీకి వచ్చినపుడు మా పట్ల ఎంతో కృతజ్ఞతా భావం కనపరుస్తుంటారు. అదే మాకు కొండంత సంతృప్తి నిస్తుంది. కోవిడ్ సమయంలో వందలాది మందికి సేవలు అందించాం. ఆ సమయంలో మాకు కోవిడ్ సోకే అవకాశం ఉంటుందని తెలిసినా, రోగులకు చికిత్స అందించడమే లక్ష్యంగా పనిచేశాం. అదే మాకు సంతృప్తి నిస్తుంది. –టి.కార్తీక్, శ్యాసకోశ వ్యాధుల నిపుణుడు విలువలతో కూడిన సేవలు అందించాలి వైద్యుడు సమాజ సేవకునిగా పనిచేయాలి. వైద్యాన్ని వ్యాపారంగా పరిగణించకూడదు. రోగులతో మంచిగా మెలగాలి. విసుక్కోకూడదు. సమయపాలన, కమిట్మెంట్, డిసిప్లేన్ అనేది చాలా ముఖ్యం. ప్రభుత్వాస్పత్రిలకు పేదలే వస్తుంటారు. పేదలకు వైద్య సేవలు అందించే అదృష్టం ప్రభుత్వ వైద్యులకు మాత్రమే ఉంటుంది. అలాంటి చోట విద్యనభ్యసించే వారు సైతం సేవా భావాన్ని అలవర్చుకోవాలి. –డాక్టర్ ఆలపాటి ఏడుకొండలు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల -
ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేయటం అదృష్టం
జిల్లా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: పోలీసుశాఖలో సుదీర్ఘకాలం పా టు పనిచేసి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉద్యోగ విరమణ చేయడం అదృష్టంగా భావించాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందిని సోమవారం ఆయన తన కార్యాలయంలో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా సన్మానించారు. సిబ్బంది అందించిన సేవలను పోలీసుశాఖ ఎన్నడూ మరువదన్నారు. ఎస్ఐలు పి.ప్రసాద్‌రాజు (సీసీఎస్, మచిలీపట్నం), ఎండీ మస్తాన్‌ఖాన్ (మహిళా పీఎస్, మచిలీపట్నం), ఏఎస్ఐ వై.సత్యనారాయణ (డీటీఆర్బీ), టి.బెనర్జీబాబు (హెచ్‌సీ, బందరు ట్రాఫిక్), కె.శ్రీనివాసరావు (హెచ్‌సీ, పీసీఆర్), టి.ఆనందరావు (హెచ్‌సీ, ఏఆర్), బి.సుబ్బయ్య (హెచ్‌సీ, ఏఆర్) ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఉన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, పలువురు డీఎస్పీలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి యలమర్రు(పెదపారుపూడి): విద్యు త్ మోటారు నుంచి వచ్చిన విద్యుత్ సరఫరా కారణంగా ఓ వలస కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని యలమర్రులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కలుపుకూరి సూరి(18) పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం ముండ్రువారిపాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడు. సూరి తన తల్లి పాకీరమ్మతో కలిసి రెండు రోజుల క్రితం యలమర్రు గ్రామంలోని మూల్పూరి నరేంద్ర అనే రైతు పొలంలో పనులకు వచ్చారు. సోమవారం ఉదయం పొలంలో గట్లు పని చేస్తుండగా పక్కనే విద్యుత్ మోటారు నుంచి విద్యుత్ సరఫరా కావటంతో షాక్ తగిలి అక్కడికక్కడే పడి పోయాడు. తోటి కూలీలు స్థానిక పీహెచ్‌సీకి తరలించగా పరీక్షలు చేసిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించామని ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డివైడర్‌ను ఢీకొని ఇరువురు యువకులు దుర్మరణం కోనేరుసెంటర్: రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసుల విచారణలో తేలింది. జరిగిన సంఘటనపై ఇనకుదురుపేట పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బందరు మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన దాలిపర్తి పవన్‌కళ్యాణ్ (23), కోడూరు గ్రామానికి చెందిన మేడా రవీంద్ర (22) మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో క్లీనర్లుగా పనిచేస్తున్నారు. సోమవారం చిన్నాపురం గ్రామంలోని మద్యం దుకాణంలో వారిద్దరూ పూటుగా మద్యం తాగి బైక్‌పై మితిమీరిన వేగంతో మచిలీపట్నం వస్తుండగా శారదానగర్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇరువురి తలలు పగిలిపోయి మెదళ్లు బయటికి వచ్చి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు ఇనకుదురుపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఇరువురి కుటుంబాలకు అందజేసినట్లు సీఐ పరమేశ్వరరావు తెలిపారు. పొట్టకూటి కోసం వెళ్లి అనంతలోకాలకు..! కోడూరు: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మేడ రవీంద్ర(25) తల్లిదండ్రులు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో రవీంద్ర మచిలీపట్నంలోని బంధువుల ఇంటి వద్ద ఉంటూ ఓ ప్రయివేటు ట్రావెల్స్‌లో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం స్నేహితుడితో కలిసి మచిలీపట్నం వెళ్తుండగా శారదనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రవీంద్ర మృతితో రామకృష్ణాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గొల్లపూడిలోని గోదావరి రుచులు హోటల్ సమీపంలో జరిగింది. ఆదివారం అర్థరాత్రి సమయంలో ఓ వ్యక్తి విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే రోడ్డులో గొల్లపూడి గోదావరి రుచులు హోటల్‌కు ఎదురుగా నడుచుకుంటూ వెళుతున్నాడు. వెనుక నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ఆ వ్యక్తిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో మృతుని తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. -
జగన్మాతకు తెలంగాణ బంగారు బోనం
సాదర స్వాగతం.. కళాకారులు, కమిటీ ప్రతినిధులు, భక్తులతో ఘాట్‌రోడ్డుపై పండుగ వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వద్ద బంగారు బోనానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో శీనానాయక్, అర్చకులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం బంగారు, వెండి బోనంతో పాటు పూజా సామగ్రి, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను ఆలయ ఈవో, ఆలయ అర్చకులకు అందజేశారు. అమ్మవారి దయతో ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఉత్సవ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ఎన్. రమేష్‌బాబు, వెంకటరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కిక్కిరిసిన బ్రాహ్మణ వీధి.. బోనాలతో ఊరేగింపుగా వస్తున్న భక్తులుఇంద్రకీలాద్రి(విజయవాడపపశ్చిమ): హైదరాబాద్ లోని భాగ్యనగర్ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ తరఫున ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం తెలంగాణ బంగారు బోనాన్ని సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషా లతో ఉండాలని కోరుతూ గత 16 ఏళ్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి బోనాల కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 500 మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. భక్తుల బారులు.. జోగిని శ్యామలాదేవి బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు ముందుకు నడిచారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రి పరిసరాలకు తరలివచ్చారు. దుర్గాఘాట్‌కు చేరుకున్న ఊరేగింపు కృష్ణమ్మకు గంగ తెప్పను సమర్పించిన పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం దుర్గాఘాట్, ఘాట్‌రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఇంద్రకీలాద్రికి తరలివచ్చిన భాగ్యనగర్ బోనం 500మందితో భారీ ఊరేగింపు ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు -
గజిబిజి.. గందరగోళం!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో గజిబిజి గందరగోళంగా తయారయ్యాయి. జూన్ మాసంలో ప్రభుత్వం చేపట్టిన ఈ బదిలీల పర్వం ముగిసినప్పటికీ ఇంకా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులోకి రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇంకా అనేక సమస్యలు వెంటాడుతున్నా ఇప్పటి వరకూ వాటిని పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టలేదని ఆయా సంఘాల నేతలు మండిపడుతున్నారు. బదిలీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అమలు చేసిన నియమ నిబంధనలు మొదటి నుంచి గందరగోళంగా తయారు కావటంతో చివరి వరకూ ఉపాధ్యాయులు వాటిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చాలా రోజులు నిరసనలతో ఉపాధ్యాయులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినా ఇంకా సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వాటిని భర్తీ చేయరా? ఉమ్మడి కృష్ణాజిల్లాలో సగానికి పైగా మండలాల్లో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో భారీగా ఖాళీలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రెడ్డిగూడెం, చాట్రాయి, జి.కొండూరు, వత్సవాయి, జగ్గయ్య పేట, గంపలగూడెం ఇలా దాదాపుగా సగానికి పైగా మండలాల్లో ఉన్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవటంతో విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. విజయవాడ అర్బన్లోనూ మునిసిపల్ విద్యాసంస్థల్లో ఖాళీలు కనిపిస్తున్నాయి. ఇటీవల 150 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించటంతో ఆ మేర ఆయా పోస్టుల్లో భర్తీ చేయాల్సిన అధికారులు దృష్టి పెట్టకపోవటంతో ఖాళీలు అలాగే కొనసాగుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీ, ఎంటీఎస్ సిబ్బందికి సంబంధించి సుమారు ఐదారు వందల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. పోస్టింగ్ ఇచ్చినా బదిలీ కానీ వైనం.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికారులు పెద్ద సంఖ్యలో బదిలీలు నిర్వహించారు. అయితే ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్న పాఠశాల నుంచి బదిలీ అయిన విద్యాసంస్థకు వెళ్లకుండా వందల సంఖ్యలో అక్కడే కొనసాగుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. బదిలీ అయిన చోటకు వేరే ఉపాధ్యాయుడు రాకపోవటంతో అక్కడి నుంచి పోస్టింగ్ ఇచ్చిన పాఠశాలకు వెళ్లలేక పలువురు ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. ఈ విధమైన పరిస్థితులు ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా శివారు ప్రాంతాల్లో ఉన్న చాలా పాఠశాలల నుంచి బయటకు వచ్చిన ఉపాధ్యాయులు వారి స్థానంలో అక్కడకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భాషా పండితులు సమస్యలతో సతమతం.. తెలుగు భాషా పండితులు, అలాగే తెలుగు బోధించే ఇతర ఉపాధ్యాయుల మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారి బదిలీల విషయంలో సందిగ్ధం నెలకొంది. వీరిలో కొంతమందికి పోస్టింగ్ ఇచ్చినా మొత్తం మీద వివాదంతో గజిబిజిగా తయారైంది. ఉర్దూ ఉపాధ్యాయుల అంశంలోనూ ఆ సంఘ నేతలు సమస్యలు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో టీచర్ల బదిలీల్లో అయోమయం సరైన కసరత్తు చేయకుండా బదిలీలు చేపట్టడంతో సమస్యలు ఇంకా సగానికి పైగా మండలాల్లో భర్తీ కాని ఖాళీలు పోస్టింగ్ ఇచ్చినా బదిలీ కాని వైనం అధికారుల తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయులుసమస్యలు తక్షణం పరిష్కరించాలి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి చాలా సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దీని వల్ల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సైతం అవస్థలు పడుతున్నారు. అధికారులు త్వరితగతిన సమస్యలను పరిష్కరించి ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలి. –ఎ.సుందరయ్య, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, ఎన్టీఆర్ జిల్లా ప్రణాళిక లేకపోవటంతోనే సమస్యలు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి సరైన ప్రణాళిక లేకపోవటంతో అన్ని మండలాల్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకా చాలా మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖ అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలి. – ఎంవీ మహంకాళేశ్వరరావు, అధ్యక్షుడు, వైఎస్సార్ టీఏ, కృష్ణాజిల్లా కొరవడిన కసరత్తు.. విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేయకుండా, సరైన ప్రణాళిక లేకుండా బదిలీల ప్రక్రియను నిర్వహించడంతో అనేక సమస్యలు తలెత్తాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు అవగాహనా రాహిత్యంతో నిబంధనలు ఏర్పాటు చేసి బదిలీలు చేయాలని ఆదేశించటం వల్ల కూడా సమస్యలు తలెత్తాయని విద్యాశాఖ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
ముగిసిన జగన్నాథ రథయాత్ర
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీజగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పూరిలో జరుగుతున్న జగన్నాథ స్వామి రథయాత్ర తరహాలో ఇక్కడ విజయవాడ ఇస్కాన్ మందిరం అధ్యక్షుడు శ్రీమాన్ చక్రధారి దాసు నేతృత్వంలో జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు నిర్వహించడంపై భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా లోక కల్యాణార్థం సుదర్శన నారసింహ యజ్ఞం నిర్వహించారు. పూలతో అలంకరించిన ఎడ్లబండిలో శ్రీసుభద్ర మహారాణి వేంచేసి ఉండగా.. సీతానగరం వీరాంజనేయ స్వామి గుడి నుంచి ప్రారంభమైన శోభా యాత్ర ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతమ్మవారి పాదాల సమీపంలో ఏర్పాటు చేసిన గుండిచ మందిరం వరకు సాగింది. ఇందులో భాగంగా మహిళలు జగన్నాఽథ, బలభద్ర – సుభద్రల మూర్తులకు సారె సమర్పించారు. ఆలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సవాల్లో భాగంగా భరత నాట్య కళాకారులు శ్రీజ, డాక్టర్ గౌతమి, సత్యవతి చక్రవర్తి ప్రదర్శించిన నృత్యాలు భక్తులను అలరించాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన ఇస్కాన్ భక్త బృందం, రాక్ బాండ్ గానం చేసిన హరినామ సంకీర్తనలు ఆధ్యాత్మిక డోలికల్లో ముంచెత్తాయి. అలాగే మహిళల కోలాటం, పురుషుల విలువిద్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలంకరించిన ఎడ్లబండిపై శోభాయాత్రమహిళల సాంస్కృతిక ప్రదర్శనలుసీతానగరం వద్ద సారె సమర్పణకు వస్తున్న మహిళలులోక కల్యాణార్థం సుదర్శన నారసింహ యజ్ఞం భక్తజనం సారె సమర్పణ -
ప్రభుత్వ పాఠశాలలో టేకు చెట్లు నరికివేత
చౌటపల్లి గ్రామస్తుల ఆగ్రహం వీరులపాడు: ప్రభుత్వ పాఠశాలలోని చెట్లను నరికి కలపను కాజేయడానికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని చౌటపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో 20 ఏళ్ల నాటి 30 టేకు చెట్లు ఉన్నాయి. వాటిలో ఐదు చెట్లు ఎండు దశకు చేరుకున్నాయి. దీంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా విద్యుత్ మిషన్‌తో చెట్లను కట్ చేసి తొలగించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లను తొలగించాలంటే ఉన్నతాధికారుల ఆదేశాలతో పాటు మండల పరిషత్‌లో తీర్మానం చేసి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాల ఆవరణలో ఉన్న కలపను స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఎంఈవో పాల్ కెనడీని వివరణ కోరగా పాఠశాల ఆవరణలో చెట్ల తొలగించేందుకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఆయన చెప్పారు. అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్ ఘంటసాల: అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని పౌరహక్కుల సంఘం కృష్ణా జిల్లా కమిటీ సభ్యుడు జక్కా కేశవరావు అన్నారు. ఘంటసాల గోటకంలో కేశవరావు ఆదివారం మాట్లాడుతూ శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు నాయకత్వం పదేపదే ప్రకటిస్తున్నా, మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారన్నారు. మోదీ, షా ప్రభుత్వం మే 21 నుంచి మావోయిస్టు అగ్ర నాయకుల నుంచి కార్యకర్తలను పెద్ద సంఖ్యలో బూటకపు ఎన్కౌంటర్లతో కాల్చి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్లో మన పౌరులను దారుణంగా చంపిన పాకిస్తాన్ పాలకులతో శాంతి చర్చలు జరపగలిగిన కేంద్రం మావోయిస్టులతో చర్చలకు నిరాకరించి నరమేథాన్ని కొనసాగించడం కుటిలనీతి కాదా అని ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని సహజవనరులను పాలకులు బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలపై మావోయిస్టులు ఆప్రాంత ప్రజలను చైతన్యం పర్చడంతో గిరిజనలు, ఆదివాసీలు ఎదురిస్తుండటంతో దీనికి ప్రతిగా ఆపరేషన్ కగార్ మొదలైందన్నారు. ఈ దోపిడీకి అడ్డుపడుతున్న అటవీ చట్టాన్ని మార్చివేసి అటవీ సంరక్షణ నిబంధనలు 2022 చట్టాన్ని పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల మధ్య అప్రజాస్వామికంగా తీసుకొచ్చారన్నారు. దోపిడీ ఉన్నంతకాలం ప్రజలు హక్కుల కోసం పోరాడతారని చెప్పారు. -
ప్రభుత్వ బడిని కాపాడుకుందాం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనా ఉందని, సర్కార్ బడుల్లో అడ్మిషన్ల పెంపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆ సంఘ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల దగ్గర చదివించాలని కోరారు. ప్రభుత్వం ఉపాధ్యాయులని బోధనకి ఎక్కువ సమయం కేటాయించే విధంగా చూడాలని, ఆన్లైన్ పనులను ప్రభుత్వం చెప్పటం మానుకోవాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్‌కుమార్ మాట్లాడుతూ మోడల్ ప్రైమరీ కాన్సెప్ట్‌ను వినియోగించుకుని, ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రాథమిక పాఠశాలల రోల్ పెంచాలని కోరారు. ఐక్యంగా పోరాటం.. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ సుందరయ్య మాట్లాడుతూ గతకాలం సంఘం కార్యకలాపాల రిపోర్ట్‌ను ప్రవేశపెట్టారు. జరిగిన బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాలను ఐక్యంగా నడిపి ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వంతో మాట్లాడి అనేక సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, నాయకులు మచ్చా శ్రీనివాస్, ఎం. కృష్ణయ్య, పి. నాగేశ్వరరావు, హరిప్రసాద్, కె. గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు -
నిరంతర యోగాతో సత్ఫలితాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. ఆదివారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్‌లో జరిగిన యోగాభ్యాసన కార్యక్రమం కలెక్టర్ పాల్గొన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం యోగా సాధన చేయాలన్నారు. యోగా సాధనను ఏ ఒక్క రోజుకో, నెలకో పరిమితం చేయకూడదన్నారు. నిత్యం జీవితంలో భాగం చేసుకొని సాధన చేయడం ద్వారా దాని ఫలితాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆయుష్ అధికారి డాక్టర్ రత్న ప్రియదర్శిని, యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. క్రీస్తు మార్గం అనుసరణీయంగుణదల(విజయవాడ తూర్పు): సర్వమానవాళి రక్షణ ప్రణాళికలో భాగంగా ఏసుక్రీస్తు ఈ లోకానికి అరుదెంచారని, ఆయన అనుసరణీయమని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజ్ అన్నారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయంలో ఆదివారం ఉదయం సమష్టి దివ్య బలి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఈ లోకానికి వెలుగన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. అనుదిన ప్రార్థనతో పాటు భక్తి విశ్వాసాలను కొనసాగించాలని వివరించారు. దేవుడు బోధించిన ప్రేమ, జాలి, దయ వంటి సద్గుణాలను కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. -
ఎత్తిపోతలు.. ఉత్తమాటలు
జి.కొండూరు: ఎత్తిపోతల పథకాల విషయంలో ప్రజాప్రతినిధివి ఉత్తిమాటలుగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చింతలపూడి పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని ఎన్నికల ప్రసంగాల్లో ఎమ్మెల్యే ఊదరగొట్టారు. చింతలపూడి సంగతి దేవుడెరుగు మైలవరం నియోజకవర్గానికి జీవనాడిగా ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణను సైతం గాలికొదిలేశారు. దశాబ్దాల చరిత్ర ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణ లోపం కారణంగా ప్రస్తుతం మోటార్లు పని చేయడం లేదు. కాలువంతా తూడు కాడతో నిండిపోయింది. పని చేస్తున్న ఒకటి, రెండు మోటార్లు ఎత్తిపోసినా నీరు ముందుకు కదలకు రైతులు నరకయాతన పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికీ నిర్లక్ష్యం నీడలోనే తారకరామ ఎత్తి పోతల పథకం ఉండటంతో ఈ ఏడాది కూడా సాగునీరందడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్వహణను గాలికొదిలేశారు తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణను స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు గాలికొదిలేశారు. తారకరామ కుడి కాల్వపై ఉన్న నాలుగు పంప్‌హౌస్‌లలో మోటార్లు సరిగా పనిచేయని పరిస్థితి నెలకొంది. 9.25 కిలోమీటర్ల మేర ఉన్న తారకరామ కుడి కాల్వలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, తుమ్మ, జమ్ము, తూడు, మొదలైన వాటితో నిండిపోయాయి. దీంతో కాల్వలో నీరు ముందుకు నడవక పంపు హౌస్‌లలో ఉన్న మోటార్లకు నీరందడంలేదు. ఈ నాలుగు పంపు హౌస్‌లలో 14 మోటార్లు ఉండగా 8 పూర్తిగా పని చేయడంలేదు. మిగిలిన ఆరు మోటార్లు కూడా విద్యుత్ లోఓల్టేజీ కారణంగా, తూడు కాడతో మోటార్లకు నీరందక, మరమ్మతులు జరగక అంతంతమాత్రం పని చేస్తున్నాయి. ఆయకట్టు కింద 4,820 ఎకరాలు తారకరామ ఎత్తిపోతల పథకం మొదటి పంప్ హౌస్ నుంచి రెండో పంప్ హౌస్‌కి మధ్య ఆయకట్టు సాగు భూమి 850 ఎకరాలు ఉంది. కట్టుబడిపాలెం సమీపంలో రెండో పంపుహౌస్ నుంచి మూడవ పంపు హౌస్‌కు మధ్య ఆయకట్టు 980ఎకరాలు ఉంది. పినపాక గ్రామం సమీపంలోని మూడవ పంప్ హౌస్ నుంచి నాలుగో పంప్‌హౌస్‌కు మధ్య ఆయకట్టు 1,123ఎకరాలు ఉంది. జి.కొండూరు సమీపంలో నాలుగో పంప్‌హౌస్ కింద ఆయకట్టు 1,867ఎకరాలు ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పంప్ హౌస్‌ల నిర్వహణను గాలికి వదిలి వేయడంతో మోటార్లు సరిగా పని చేయడం లేదు. ఈ నాలుగు పంప్ హౌస్‌ల కింద ఉన్న 4,820 ఎకరాల వ్యవసాయ భూమికి నీరందడంలేదు. ప్రారంభం నుంచి 6.6కిలోమీటర్లు వద్దనే నిలిచిపోయిన ఎడమ కాల్వలో సైతం తూడుకాడ పెరిగి నీరు అంతం మాత్రంగానే ప్రవహిస్తోంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ ఎత్తిపోతల పథకంపై దృష్టిసారిస్తే రైతులకు కష్టాలు తొలగిపోతాయి. చింతలపూడి పూర్తి చేసి ఆరునెలల్లో నీరందిస్తానన్న ప్రజాప్రతినిధి! తారకరామ ఎత్తిపోతల నిర్వహణను గాలికొదిలేసిన వైనం మోటార్లు పనిచేయక, తూడుకాడతో నీరు ముందుకు కదలక రైతుల గగ్గోలు ఆయకట్టులో 4,820 ఎకరాల సాగు ప్రశ్నార్థకంతారకరామ కుడికాల్వపై ఉన్న నాలుగు పంపుహౌస్‌ల వివరాలు అంశాలు మొదటి లిఫ్ట్ రెండవ లిఫ్ట్ మూడవ లిఫ్ట్ నాల్గవ లిఫ్ట్ మోటార్లు సంఖ్య 4 4 3 3 పనిచేయని మోటార్లు 2 2 2 2 మోటార్ల కెపాసిటీ ఎచ్పీ 120 120 120 75 నీటి సామర్థ్యం క్యూసెక్లు 57.84 57.84 38.56 30.36 ఆయకట్టు ఎకరాలు 850 980 1123 1867 మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం తారకరామ ఎత్తిపోతల పథకంలో మోటార్ల మరమ్మతులకు రూ.3.57 కోట్ల వ్యయ అంచనాలతో ప్రతిపాదనలను సిద్ధం చేశాం. ఏపీ జెన్కో అధికారులు ఇటీవల పరిశీలించారు. ప్రతిపాదనలు పంపిన తర్వాత నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తాం. తారకరామ కుడి, ఎడమ కాల్వల్లో తూడుకాడ తొలగించడానికి రూ.8.9 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. –జి.వెంకటేశ్, తారకరామ ఏఈ -
మేమింతే.. మారమంతే!
వక్ఫ్ భూములపై మళ్లీ వాలిన ‘పచ్చ’గద్దలు!పెనమలూరు: తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో ఉన్న కొండపల్లి ఖాజీ వక్ఫ్ భూములను పచ్చగద్దలు ఆక్రమించే పనిలో ఉన్నాయి. ఈ భూములకు గత కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ గోపాలకృష్ణ బహిరంగ కౌలు వేలం నిర్వహించారు. వక్ఫ్ అధికారులు భూముల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టారు. అయితే అత్యంత విలువైన వక్ఫ్ భూములు ఆక్రమించటానికి కొంతమంది రంగంలోకి దిగారు. దీనిపై కొండపల్లి ఖాజీ సర్వీస్ ఇమామ్ ఎస్‌హెచ్ హుస్సేనీ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. తాడిగడప, పెదపులిపాక గ్రామాలలో వక్ఫ్ భూములు దాదాపు 40 ఎకరాలకు పైగానే ఉన్నాయి. ఈ భూములు చాలా ఏళ్లుగా కొంత మంది ‘పచ్చ’నేతలు ఆక్రమించి నయాపైసా కౌలు చెల్లించకుండా సాగు చేశారు. దీనిపై ‘సాక్షి’ దిన పత్రికలో కథనాలు రావటం, వక్ఫ్ అధికారులు స్పందించటంతో ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో కౌలు బహిరంగ వేలం తహసీల్దార్ గోపాలకృష్ణ సమక్షంలో ఇటీవల నిర్వహించారు. కౌలు వేలంలో పలువురు రైతులు పాల్గొని రూ.25 లక్షలకు కౌలువేలం పాడారు. ఇక కోర్టు అనుమతులతో కౌలు పాట పాడిన వారు వక్ఫ్ భూములు సాగు చేయాల్సి ఉంది. అదును చూసి.. చొరబడి.. కొంతమంది కోర్టు ఉత్వర్వులకు వ్యతిరేకంగా, తహసీల్దార్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ వక్ఫ్ భూముల్లోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించి భూములు దున్నారని కొండపల్లి ఖాజీ సర్వీస్ ఇమామ్ ఎస్‌హెచ్ హుస్సేనీ పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోడవరానికి చెందిన టి.శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురు వ్యక్తులు చట్ట విరుద్ధంగా వక్ఫ్ భూముల్లోకి ప్రవేశించి భూములు దున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇమామ్ ఎస్‌హెచ్ హుస్సేనీ కోరారు. ఈ ఆక్రమణలపై ఇక పోలీసులు చిత్తశుద్ధితో ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కౌలు వేలం నిర్వహించినా ఆగని వైనం పోలీసులకు ఫిర్యాదు -
జగజ్జననికి జేజేలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల్లో భక్తులు జగజ్జననికి జేజేలు పలుకుతున్నారు. దుర్గమ్మకు సారె సమర్పణ కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం తరలివస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు 70 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారిని దర్శించుకునేందుకు మూడు గంటల సమయం పట్టగా, సామాన్య భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఉదయం నుంచే అంతరాలయ దర్శనం పూర్తిగా నిలిపివేశారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పణకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు ఆపేశారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే అంతరాలయ దర్శనం కల్పించారు. ఉత్సవమూర్తికి సారె సమర్పణ తెలంగాణ నుంచి అమ్మవారికి సమర్పించే బంగారు బోనంను చూసేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలోనే వేచి ఉండటంతో మరింత రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. సారె ఇవ్వడానికి వచ్చిన భక్తులు తొలుత ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారెను సమర్పించారు. అనంతరం భక్తబృందంలోని సభ్యులకు సారెలోని పసుపు, కుంకుమతో పాటు ప్రసాదాలను పంపిణీ చేశారు. రద్దీ నియంత్రణకు దేవస్థానంలోని ఇంజినీరింగ్, పరిపాలనా విభాగం, ఇతర విభాగాల సిబ్బందికి అదనపు విధులను కేటాయించారు. సూర్యోపాసన సేవ దుర్గగుడిలో ఆదివారం సూర్యోపాసన సేవ చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్యభగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దుర్గమ్మకు సారె, బోనాలు సమర్పణ 70 వేల మందికి పైగా భక్తులకు అమ్మ దర్శనం అంతరాలయ దర్శనం రద్దు సర్వ దర్శనానికి మూడు గంటలు -
శ్రీమన్నారాయణుడి ఆలయంలో కోటి అష్టాక్షరీ మహాయజ్ఞం
కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన ఉల్లిపాలెం గోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణస్వామి ఆలయంలో కోటి అష్టాక్షరీ మహాయజ్ఞాన్ని (శ్రీమన్నారాయణ యజ్ఞం) భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజీయర్ స్వామి తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో మహాయజ్ఞం నిర్వహణపై వివిధ వర్గాల ప్రముఖులతో స్వామీజీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 16 నుంచి 28 వరకు 13 రోజుల పాటు మహాయజ్ఞం నిర్వహించేందుకు పండితులు ముహూర్తాన్ని నిర్ణయించినట్లు స్వామిజీ చెప్పారు. దీనికి13 ప్రత్యేక యాగశాలలను నిర్మించడంతో పాటు అందులో 108 హోమగుండాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ కోటి సార్లు అష్టాక్షరీ మంత్రాన్ని జపించనున్నట్లు స్వామీజీ తెలిపారు. ఆలయంలో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు శ్రీమన్నారాయణుడి ఆలయంలో ప్రస్తుతం రూ.2 కోట్లతో అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నట్లు అష్టాక్షరీ స్వామి చెప్పారు. రూ.కోటితో గాలిగోపురం నిర్మాణం జరుగుతుండగా పనులు తుదిదశకు చేరినట్లు తెలిపారు. ఆలయం ఉత్తర, దక్షిణ ద్వారాలకు ఆర్చిల నిర్మాణాలు చేస్తున్నట్లు చెప్పారు. మహాయజ్ఞం సమయానికి అభివృద్ధి పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మహాయజ్ఞంపై రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆలయంలో ప్రతి శని, ఆదివారాలు అన్నదానం ఏర్పాటుకు కృషి చేస్తున్న దాతలను సత్కరించారు. బృందావనం పీఠాధిపతి అష్టాక్షరీ బృందావనం స్వామీజీ, అనంతపురానికి చెందిన వ్యాపారవేత్త దామోదర్‌దాస్, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 16 నుంచి 28 వరకు నిర్వహణ అష్టాక్షరీ స్వామి ఆధ్వర్యంలో సమావేశం -
వాహనచోదకుడి మృతి
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): నడిరోడ్డుపై వాహనచోదకుడు మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెస్ట్ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని వేపచెట్టు ప్రాంతానికి చెందిన కొప్పుల పద్మ, తిరుపతిరావు(40) భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. తిరుపతిరావు చికెన్ షాపు నడుపుతుంటాడు. నున్నలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో శనివారం తిరుపతిరావు హాజరయ్యాడు. ఆ తర్వాత తిరుపతిరావు తన మోపెడ్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. వెస్ట్ బైపాస్ రోడ్డులో పాతపాడు సమీపానికి వచ్చే సరికి తాను వాహనం నడపలేకపోతున్నానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన పద్మ, తన కుమారులకు విషయం చెప్పగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే తిరుపతిరావు అపస్మారక స్థితిలో ఉండటంతో పద్మ 108కు ఫోన్ చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది తిరుపతిరావును పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తిరుపతిరావు కాలు విరిగిపోయి ఉండటంతో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.రేపూడిలో వ్యక్తి హత్యతిరువూరు: ఎ.కొండూరు మండలం రేపూడి శివారు మామిడితోటలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. రెడ్డిగూడెం మండలం పాత మద్దులపర్వకు చెందిన కోట రాము(46) మృతదేహంగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం అదృశ్యమై మామిడితోటలో శవమై కనిపించిన రాము వివాహితుడు. అతనికి ఇద్దరు సంతానం. కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వివాహేతర సంబంధమే రాము హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తిరువూరు సీఐ గిరిబాబు తెలిపారు.తృటిలో తప్పిన పెను ప్రమాదంనిడుమోలు సెంటర్ సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ప్రయివేట్ బస్సునిడుమోలు(మొవ్వ): త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై మొవ్వ మండలంలోని నిడుమోలు సెంటర్ సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో హైదరాబాదు నుంచి మచిలీ పట్నం మీదుగా వెళ్తున్న ఎన్ఎల్. 07 0847 నంబర్ ప్రైవేట్ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విజయవాడ వరకు ఒక డ్రైవరు నడపగా విజయవాడలో డ్యూటీ ఎక్కిన బస్సు డ్రైవర్ రాజకుమార్ పాత చెక్ పోస్ట్ ప్రాంతానికి రాగానే నిద్రమత్తులో కళ్లు మూయడంతో ఘటన జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 31 మంది ప్రయాణికులు, డ్రైవర్ సురక్షితంగా ఉన్నారు. ఆ సమయంలో ఎలాంటి జనసంచారం, ట్రాఫిక్ కానీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో బస్సు ముందు బాగా పూర్తిగా దెబ్బతినగా రెండు విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. భారీగా శబ్దం రావడంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న కూచిపూడి ఎస్ఐ కే ఎన్ విశ్వనాథ్ సిబ్బందితో ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. సమాచారం తెలియడంతో విద్యుత్ శాఖ మొవ్వ ఏఈ రమేష్, శ్రీహరి సిబ్బందితో తరలి వచ్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు తీసుకున్నారు. -
సత్తా చాటిన బాడీ బిల్డింగ్ క్రీడాకారులు
పెనమలూరు: రాష్ట్ర స్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చాటి పతకాలు సాధించారు. ఈ నెల 22వ తేదీన కావలిలో నిర్వహించిన సింహపురి మిస్టర్ ఆంధ్ర రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో స్పోర్ట్స్ ఫిజిక్‌లో ఎం.దినేష్ బంగారు పతకం గెలిచాడు. బాడీ బిల్డింగ్ 55 కేజీల విభాగంలో వి.సూర్యదేవరవరప్రసాద్, కాంస్య పతకం, 85 కేజీల విభాగంలో ఏ.నాగ అభినవ్ కాంస్య పతకం సాధించారు. క్రీడాకారులను కానూరు అశోక్ జిమ్‌లో ఆదివారం అభినందించి మెమెంటోలు అందజేశారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి తాల్లూరి అశోక్, కోచ్ అల్లూరిరెడ్డి, ఎమ్మెల్యే బోడెప్రసాద్, డాక్టర్ వెలినేని పవన్, యువజన సర్వీసుల శాఖ అధికారి రఘురామ్ తదితరుల అభినందించారు. ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేయండి: డీఈవో వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను విక్రయిస్తున్న విద్యాసంస్థల్లో తనిఖీలు చేసి నివేదికలు సమర్పించాలని ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ దినపత్రికలో ఇటీవల ప్రచురితమైన ‘ప్రైవేటు’ దోపిడి కథనానికి డీఈవో స్పందించారు. అలాగే వివిధ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావటంతో ఆయన మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలను తక్షణమే తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ను అధిక ధరలకు విక్రయించటం, అధిక ఫీజుల వసూలు చేసిన వారి పాఠశాలల గుర్తింపు రద్దు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ముగిసిన నాట్య ప్రాక్టికల్ పరీక్షలు కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠంలో మూడు రోజులుగా జరుగుతున్న సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. పరీక్షలకు 21 మంది విద్యార్థులు హాజరయ్యారని పరీక్షలకు అధికారిగా వ్యవహరించిన సుధీర్‌రావు తెలిపారు. కళా పీఠం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాల కృష్ణ నట్టువాంగంతో, టీచింగ్ అసిస్టెంట్ పసుమర్తి హరినాథ శాస్త్రి మృదంగంపై సహకరించారు. ఫొటోగ్రఫీలో జిల్లాస్థాయి పోటీలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 19న ఫొటోగ్రఫీలో విశేష ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లా స్థాయిలో పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఫొటో జర్నలిస్టులు, ఫొటో గ్రాఫర్లు పోటీలలో పాల్గొనవచ్చన్నారు. జూలై 31వ తేదీలోగా తమ ఎంట్రీలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామని.. మొదటి విభాగంలో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, స్వచ్ఛాంధ్ర/స్వచ్ఛ ఎన్టీఆర్, యోగాంధ్ర అంశాలకు సంబంధించి ఫొటో ఎంట్రీలు పంపొచ్చన్నారు. రెండో విభాగంలో తల్లికి వందనం/విద్య, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం – 2 ఉన్నాయని, మూడో విభాగంలో అత్యుత్తమ న్యూస్ ఫొటో పోటీ ఉంటుందన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ (రూ. 10 వేలు), ద్వితీయ (రూ. 7వేలు), తృతీయ (రూ. 4 వేలు) బహుమతులతో పాటు రూ. 2 వేలు చొప్పున ఆరుగురికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు వివరించారు. ఒరిజినల్ ఫొటో ఎంట్రీలను డీపీఆర్వో కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, విజయవాడ–520002 చిరునామాకు నేరుగా లేదా పోస్టల్ ద్వారా సమర్పించవచ్చని, ఇతర వివరాలకు 9121215373లో సంప్రదించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. -
కనులపండువగా కల్యాణం
గుడ్లవల్లేరు: డోకిపర్రు భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణాన్ని మెయిల్ అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆధ్వర్యంలో వైభవోపేతంగా కనులపండువగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు పురిటిపాటి వీరారెడ్డి, విజయలక్ష్మి దంపతులు, బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు ఉన్నారు. వ్యక్తిపై గొడ్డలితో దాడి మైలవరం: రెడ్డిగూడెం మండలం బూరుగగూడెంలో భూ వివాదం శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బూరుగుగూడెంలో మట్టకొయ్య శ్రీను(55) తండ్రి వెంకయ్య కు కె.మనోజ్, అతని తండ్రి జయరాజు కుబుంబ సభ్యులకు ఇంటి సరిహద్దు వివాదముంది. దీంతో మనోజ్ కుటుంబసభ్యులు మట్టకొయ్య శ్రీను ఇంటిపై దాడికి దిగారు. రెండువైపులా గొడవలు పెరగగా మనోజ్ గొడ్డలితో శ్రీను తలపై బలంగా నరికాడు. దీంతో శ్రీను ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. శ్రీను కుటుంబం భయాందోళనకు గురై హుటాహుటిన రెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి స్థానిక వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. అక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అనంతరం కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గతేడాది నుంచి మమ్మల్ని చంపేందుకు అనేక సార్లు ప్రయత్నించారని, ఈ రోజు తెగించి గొడ్డలితో దాడి చేశారన్నారు. తమకు మనోజ్ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, ప్రాణ రక్షణ కల్పించాలని మీడియా ద్వారా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
వాణిజ్య బ్యాంకులకు దీటుగా కేడీసీసీబీ సేవలు
చిలకలపూడి(మచిలీపట్నం): వాణిజ్య బ్యాంకులకు దీటుగా కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా సేవలు అందిస్తున్నామని బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. బ్యాంకు మహాజన సభ సమావేశం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లా రైతాంగానికి, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు, మత్స్యకార్మికులకు, ఉద్యోగులకు అర్హతను బట్టి రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఈ ఏడాది రూ.13,500 కోట్లు టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 7,500 డ్వాక్రా సంఘాలకు ఇప్పటివరకు రుణాలు ఇచ్చామని, దీనిని 10 వేల సంఘాల వరకు పెంచి రుణాలు విస్తృతం చేయడానికి నిర్ణయించామన్నారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం జిల్లా రైతాంగానికి రూ.2 వేల కోట్ల వరకు రుణాలు ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. గృహా లు, వాహన కొనుగోలు, విద్యా రుణాలు, ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు రూ.100 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.3,200 కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నాయని, దీనిని రూ.3,700 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బ్యాంకు ఖాతాదారులకు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం సౌకర్యం కల్పించామన్నారు. త్వరలో రిజిస్ట్రార్ ఆఫీస్ ఉన్న ప్రదేశాల్లో ఉన్న తమ బ్యాంకు బ్రాంచ్‌లలో ఈ–స్టాంపింగ్ బిజినెస్ ప్రారంభిస్తామన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సంఘాల్లో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో సీఈవో ఎ.శ్యామ్‌మనోహర్, డీసీవో చంద్రశేఖరరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా డీసీవో శ్రీనివాసరెడ్డి, ఆప్కాబ్ జీఎం పీఎస్ మణి, జనరల్ మేనేజర్ బీఎల్ చంద్రశేఖర్, రంగబాబు పాల్గొన్నారు. ఈ ఏడాది రూ.13,500 కోట్ల టర్నోవర్ లక్ష్యం బ్యాంకు ఖాతాదారులకు యూపీఐ సేవలు చైర్మన్ నెట్టెం రఘురాం -
బంగారం రికవరీలో పోలీసుల చేతివాటం
గన్నవరం: చోరీకి గురైన బంగారం రికవరీ విషయంలో ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు చేతివాటం ప్రదర్శించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సదరు బంగారం కొనుగోలు చేసిన నగలు దుకాణం యాజమానిని కేసు నుంచి తప్పించేందుకు పెద్ద మొత్తంలో పోలీసులు వసూలు చేశారు. అంతే కాకుండా తక్కువ నాణ్యత కలిగిన బంగారంతో చోరీకి గురైన వస్తువులను తయారు చేయించి రికవరీ చూపించారు. ఈ ఘటనకు సంబంధించి సదరు నగల వ్యాపారితో ఎస్ఐ, ఓ కానిస్టేబుల్ ఫోన్లో జరిపిన సంభాషణలు బయటకు రావడంతో పోలీసుల నిజస్వరూపం బట్టబయలైంది. వివరాలిలా వున్నాయి. ఇటీవల ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నలుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఐదు బైక్‌లు, బంగారం, వెండి వస్తువులను రికవరీ చేశారు. వీరిని ఈ నెల 17న గన్నవరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆత్కూరు పోలీసులు అరెస్ట్ చూపించిన విషయం తెలిసిందే. రెండు కాసుల రికవరీలో... నిందితుల్లో ఒకరు చోరీ చేసిన రెండు కాసుల బరువైన రెండు బంగారు గొలుసులను ఏలూరులోని ఓ నగల వ్యాపారికి మాయమాటలు చెప్పి విక్రయించాడు. పట్టుబడిన దొంగ ఇచ్చిన సమాచారం మేరకు ఆత్కూరు పోలీసులు సదరు నగల వ్యాపారిని విచారించారు. అయితే సదరు వ్యాపారి నుంచి చోరీకి గురైన 22 క్యారెట్ బంగారు గొలుసులను రికవరీ చేయకుండా, అతనిని బెదిరించి తక్కువ నాణ్యత కలిగిన 18 క్యారెట్ బంగారంతో సదరు గొలుసులను తయారు చేయించారు. దీనికి ప్రతిఫలంతో పాటు నగల వ్యాపారిని కేసులో ఇరికిస్తామని భయపెట్టి రూ.30 వేలు నగదును పోలీసులు ముందుగానే వసూలు చేశారు. మరో రూ.10 వేలు నగదును ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లో పనిచేసే ఉద్యోగి ఖాతాకు ఫోన్‌పే ద్వారా జమ చేయించి వసూలు చేశారు. నగదు లావాదేవీలు, బంగారం నాణ్యత, తయారీ గురించి స్వయంగా ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ మహేష్ సదరు నగల వ్యాపారితో జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులు బయటపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా డబ్బుల కోసం ఆత్కూరు పోలీసులు డిమాండ్ చేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సదరు నగల వ్యాపారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు నగల వ్యాపారితో ఎస్ఐ, కానిస్టేబుల్ మహేష్ జరిపిన ఆడియో రికార్డులతో ఫిర్యాదులు ఇప్పటికే ఉన్నతాధికారులకు చేరాయి. రాష్ట్ర డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్, ఏలూరు రేంజ్ డీఐజీ, కృష్ణాజిల్లా ఎస్పీకి కొంత మంది ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే ఈ ఫిర్యాదుపై విచారణ కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఆరోపణలు అవాస్తవం... రికవరీ చేసిన బంగారం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఎస్ఐ సురేష్ వివరణ ఇచ్చారు. మొదట రికవరీ చూపించాల్సిన బంగారం కంటే తక్కువ బంగారం ఇవ్వడంతో మందలించామనే అక్కసుతో సదరు వ్యాపారి తమపై ఫిర్యాదు చేసి ఉండవచ్చన్నారు. చోరీ కేసుల విచారణ, దొంగలను పట్టుకునేందుకు అయ్యే ఖర్చులను రాబట్టేందుకు నగల వ్యాపారిని తమ సిబ్బంది నగదు అడిగి ఉండవచ్చని అన్నారు. -
విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకం
మచిలీపట్నంఅర్బన్: కృష్ణాజిల్లాలో స్కూల్ బస్సుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారుతోంది. జిల్లా పరిధిలో ఉన్న 1009 ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో 736 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేసినట్టు రవాణాశాఖ లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన 273 బస్సులు ఫిట్నెస్ లేకుండానే రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. స్కూల్ బస్సులు నిజంగా పిల్లలకు సురక్షితమా అనేది ఇప్పుడు తల్లిదండ్రుల్లో ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. తుక్కుకు వెళ్లాయా? పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా ఇంకా జిల్లాలో 28 శాతం బస్సులు ఫిట్నెస్ పరీక్షకు రవాణా శాఖ కార్యాలయానికి రాలేదు. ఫిట్నెస్ లేని కొన్ని బస్సులను తుక్కుకు పంపించామని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ఎన్ని తుక్కుకు వెళ్లాయి...మిగిలిన బస్సుల సంగతి ఏమిటి అన్న విషయంపై ఇప్పటికీ అధికారులకు స్పష్టత లేదు. స్కూల్ బస్సులపై దృష్టి సారించాలి ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభం కావడంతో, ఆ బస్సులపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్కూల్ బస్సులకు సంబంధించిన ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ తదితర అంశాలపై కచ్చితంగా తనిఖీలు చేయాలి. బస్సు నడిపే డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే లైసెన్స్, కనీసం ఐదేళ్ల అనుభవముందా, కంటి పరీక్షలు జరిగాయా అన్నదానిపై అధికారుల బృందం తనిఖీ చేయాలి. జిల్లాలో 273 ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు మొత్తం 1009 స్కూల్ బస్సుల్లో 736 బస్సులకే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళన -
అస్త్ర వారాహిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం
నాగాయలంక: కృష్ణానదీ తీరంలోని శ్రీరామపాదక్షేత్రంలో ఉన్న శ్రీకనకదుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలలో శుక్రవారం అమ్మవారు అస్త్ర వారాహిదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. వారాహి సంప్రద్రాయ నియమ నిష్ఠల దీక్షాబద్దులైన ఆలయ అర్చకులు ముదునూరి శ్రీనివాసశాస్త్రి, అచ్యుత శేఖరశర్మ బ్రహ్మత్వంలో ప్రాతఃకాలంలో వారాహి మాతకు శాస్త్రోక్త పూజ జరిపి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. విశేష అలంకారం తదుపరి భక్తుల దర్శనానికి అవకాశం కలిగించారు. ఈ సందర్భంగా పీఠం వద్ద కామాడి దుర్గాప్రసాద్–సీత దంపతులు పీటలపై కూర్చున్నారు. శ్రీరామక్షేత్రం కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఉప్పల లీలాకృష్ణ ప్రసాద్(బుజ్జి) కమిటీ పెద్దలు పర్యవేక్షించారు. పాలిసెట్ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025 పరీక్షలో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం కొనసాగింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో స్పెషల్ కేటగిరి అభ్యర్థులు 148, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్రంలో 213 మంది, ఆంధ్ర లయోలా డిగ్రీ కళాశాల ఆవరణలో 170 మంది జనరల్ కేటగిరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైంది. 531 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను శుక్రవారం పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. నేటి షెడ్యూల్ శనివారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో స్పెషల్ కేటగిరి అభ్యర్థులు ఆంగ్లో ఇండియన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ మొదటి నుంచి చివరి ర్యాంకు వరకు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 120001 నుంచి 127000 లోపు ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 127001 నుంచి చివరి ర్యాంకు పొందిన జనరల్ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం పొందిన అభ్యర్థులు ఈ నెల 30వ తేది సోమవారం నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఐటీఐ కళాశాల ఉద్యోగి దుర్మరణం
పామర్రు: విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిలో బల్లిపర్రు వద్ద ఐటీఐ కళాశాల జూనియర్ అసిస్టెంట్ రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలైన సంఘటన శుక్ర వారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరులో నివాసం ఉంటున్న కొసనం రత్నాకర్(35) గుడివాడలోని ఐటీఐ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తన మోటర్ బైక్‌పై గుడివాడకు విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై వస్తుండగా పామర్రు మండలం బల్లిపర్రు గ్రామ అడ్డరోడ్డు వద్ద వెనుక నుంచి వ్యాన్ బలంగా ఢీకొట్టింది. రత్నాకర్ బైక్‌పై నుంచి పడిపోవడంతో బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని వివరాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. -
కమిషనర్ V/s మేయర్
చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ వ్యవహారశైలిపై, కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి వినతిపత్రం అందజేశారు. మేయర్ మాట్లాడుతూ 2024 మార్చి 11వ తేదీన పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆమోదించామని, అయితే ఈ బడ్జెట్‌కు సంబంధించి జమాఖర్చులు మొత్తం మునిసిపల్ కమిషనర్, ఆయా విభాగాల అధికారులు, ఉద్యోగస్తులు అందరూ ఏకమై సుమారు రూ.32 కోట్ల సాధారణ నిధులను అత్యవసర ఖర్చుల పేరుతో ఉద్యోగస్తులకు చెక్కుల ద్వారా, పని అంచనాలను రూ.10 లక్షల్లోపు భాగాలుగా విభజించి పాలకవర్గం ఆమోదం లేకుండా సంవత్సరం బడ్జెట్ మొత్తాన్ని దుర్వినియోగం చేశారన్నారు. 2025 ఏప్రిల్ 1 తరువాత కూడా పనులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ విచ్చలవిడిగా కంటింజెంట్ బిల్లు కింద ఉద్యోగుల పేరు మీద లక్షల రూపాయలు చెక్కులు జారీ చేస్తూ నిధులను బ్యాంకుల నుంచి డ్రా చేస్తున్నారన్నారు. కౌన్సిల్లో ప్రశ్నించినా సమాధానం చెప్పని కమిషనర్ 2025 ఏప్రిల్ 15వ తేదీన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్‌ను వీటిపై ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారన్నారు. అదే సమావేశంలో తాము ఈ అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అవినీతి నిరోధకశాఖ అధికారులు కూలంకషంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశామన్నారు. నగరపాలక సంస్థలో 2024 ఏప్రిల్1 నుంచి 2025 మార్చి వరకు జరిగిన ఆర్థిక లావా దేవీల పరిశీలనకు బ్యాంక్ స్టేట్మెంట్లు, సీఎఫ్ఎంఎస్ లావాదేవీల వివరాలు ఇవ్వాలని లేఖ రాసినప్పటికీ కమిషనర్ ఇంత వరకు స్పందించలేదన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా కోశాధికారి బందెల థామస్‌నోబుల్, నగర అధ్యక్షుడు మేకల సుధాకర్‌బాబు (సుబ్బన్న), ఉపాధ్యక్షుడు గూడ వల్లి నాగరాజు, కాగిత జవహర్‌లాల్‌నెహ్రూ, తిరుమలశెట్టి ప్రసాద్, మొహమ్మద్ సాహెబ్, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మాజీ కౌన్సిలర్లు చిటికిన నాగేశ్వరరావు, శీలం బాబ్జి పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. కార్పొరేషన్ కమిషనర్ వ్యవహారశైలిపై విచారణ చేపట్టండి రూ.32 కోట్ల సాధారణ నిధులు దుర్వినియోగం చేశారు పాలకవర్గ తీర్మానం లేకుండా నిధులు వెచ్చిస్తున్నారు కలెక్టర్ బాలాజీకి వినతిపత్రం అందజేసిన మేయర్ వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు -
సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ సమర్పణ
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి దర్శి వాస్తవ్యులు యారాశి శ్రీకాంత్ రెడ్డి, చంద్రిక కుటుంబ సభ్యులు వెండి నాగపడగను శుక్రవారం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్నవారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణకు 550 గ్రాములు.. సుమారు రూ. 60 వేలతో చేయించిన నాగపడగను స్వామివారి కానుకగా అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో అధికారులు సత్కరించారు. దాతలకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. సచివాలయ కార్యదర్శుల బదిలీలు షురూ మచిలీపట్నంటౌన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, 8 మున్సిపాలిటీల పరిధిలో వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న పలు విభాగాల కార్యదర్శుల బదిలీ ప్రక్రియను శుక్రవారం మచిలీపట్నం మునిసిపల్ కార్యాలయంలోని పాత కౌన్సిల్ హాల్లో ప్రారంభించారు. బదిలీ కమిటీ చైర్మన్, నగర కమిషనర్ సీహెచ్‌వీవీఎస్ బాపిరాజు, డీఎంఏ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నాగభూషణం పర్యవేక్షణలో ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో జరిగింది. కార్యదర్శులుగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసిన వారిని తప్పని సరిగా బదిలీ చేయడానికి జాబితాలు సిద్ధం చేశారు. సీనియారిటీ, వయసు, ప్రజాప్రతినిధుల సిఫార్సులు, రిక్వెస్టులను పరిశీలించి శుక్రవారం రాత్రికి బదిలీ జాబితాను పూర్తిచేయడానికి కసరత్తు చేస్తున్నారు. కార్యదర్శులు ప్రస్తుతం పని చేస్తున్న వార్డు, నివసించే వార్డు కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయనున్నారు. ఐసీఈయూ ప్లాటినం జూబ్లీ లోగో ఆవిష్కరణ మచిలీపట్నంటౌన్: భారత దేశ బీమా రంగ ట్రేడ్ యూనియన్ అల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌ను ఏర్పాటుచేసి జూలై 1వ తేదీ నాటికి, 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ సంఘ ప్లాటినం జూబ్లీ లోగోను నాయకులు శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. స్థానిక ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ సంఘ మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి కిషోర్, నేతలు జె.సుధాకర్, డి.వాసు, ఎల్.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఉరుసు కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కాలేషా వలి బాబా ఉరుసు మహోత్సవం గురువారం రాత్రి ముగిసింది. బాబా వారికి చాదర్, గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముజావర్ల ఇళ్ల నుంచి బయలు దేరిన గంధం మహోత్సవం ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొన సాగింది. అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మత పెద్దలు హాజరయ్యారు. గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించండి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామ, వార్డు సచివాలయాల్లోని సర్వేయర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ కోరారు. సమస్యల పరిష్కారానికి విజయవాడ ధర్నా చౌక్‌లో సర్వేయర్లు చేపట్టిన మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు శుక్ర వారంతో ముగిశాయి. ఆయన మాట్లాడుతూ జీవో నంబరు 5లో మార్పులు చేసి.. అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాలని కోరారు. నిబంధనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయన్నారు. బదిలీల ప్రక్రియలో సొంత మండలం నిబంధన సవరించాలని సూచించారు. దీక్షలో గ్రామ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
డీఈఓ కార్యాలయం ముట్టడి
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు గుర్తింపు లేకుండా నడుపుతున్న యాజమాన్యాలు, అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్), పెట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ సంయుక్త ఆద్వర్యంలో శుక్రవారం డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. వారు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు. డీఈఓ ముందు బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పీడీఎం జిల్లా కన్వీనర్ అరవింద్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయికుమార్ కలెక్టర్ బాలాజీకి వినతిపత్రం సమర్పించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సాధిక్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక దందా
పచ్చనేతల కూటమి ప్రభుత్వం కొన్ని నెలల తర్వాత ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టింది. దీంతో అధికార పార్టీ చోటా మోటా నాయకులకు ఇది వరంగా మారింది. ఉచిత ఇసుకను కృష్ణానది, మున్నేరు, కట్టలేరు ఉపనదుల్లో ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు చేర్చి రాత్రి సమయంలో పెద్ద లారీలకు లోడింగ్ చేసి తెలంగాణలోని మధిర, ఖమ్మం, వైరా తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసరలో ఓ చోటా నాయకుడు మాత్రం ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నాడని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇసుకకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. కంచికచర్ల మండలం వేములపల్లిలో లారీల్లో తరలివెళ్తున్న ఇసుక సాక్షి ప్రతినిధి, విజయవాడ: పచ్చనేతలు జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు నదుల్లో ఇసుత తవ్వకాలపై నిషేధం ఉంది. వాటిని తుంగలో తొక్కి నదుల నుంచి యథేచ్ఛగా తెలంగాణకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దందా అంతా పార్లమెంటు ప్రజాప్రతినిధి, నియోజక వర్గ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోంది. చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పడం తప్ప, ఆచరణలో అమలు కావడం లేదు. పర్యవేక్షించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు మామూళ్లు తీసుకొంటూ పచ్చ జెండా ఊపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. తోడేస్తున్నారు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇసుక లబ్ధిదారులకు అందుబాటులో ఉండేది. దీంతో ప్రతిఒక్కరూ సకాలంలో ఇళ్లు నిర్మించుకునేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి కానరావడం లేదు. రీచ్‌ల్లో కాంట్రాక్టర్‌కు నగదు చెల్లిస్తే చాలు ఎంత కావాలంటే అంత ఇసుకను లోడ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. నో చలానా... ఓన్లీ క్యాష్ అంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా లేకుండా విజయవాడ పార్లమెంట్ ప్రజాప్రతినిధి అనుచరులు, ఒక్కో లారీకి రూ.10వేలు ఇస్తే చాలు ఎన్ని టన్నులైనా లారీలకు నింపుతామని బహిరంగంగానే అంటున్నారు. కూటమి నేతలకు ఎవరికీ సంబంధం లేకుండా ఏకపక్షంగా పార్లమెంటు ప్రజాప్రతినిధి అనుచరులు మూడు రీచ్‌ల నుంచి ఇసుకను తోడేస్తున్నారు. అధికారుల వత్తాసు జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో ఇసుక రీచ్ నుంచి రోజుకు 300 నుంచి 400 లారీల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు. వాటిలో కొన్ని లారీల ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడ లారీ ఇసుక ధర లక్ష రూపాయలు పలుకుతోంది. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే సమయంలో పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు సైతం ఈ దందాకు వత్తాసు పలుకుతున్నారు. పార్లమెంటు ప్రజా ప్రతినిధి కార్యాలయంలో ఉండే అవినీతి‘ కిశోరం’ ఈ దందాకు రింగ్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘జగ్గయ్యపేట’లో వత్సవాయి మండలంలో ఇందుగు పల్లి, ఆళ్లూరుపాడు, పోలంపల్లి వద్ద మునేరు నుంచి ఇసుక అక్రమంగా టిప్పర్‌లో తెలంగాణకు తరలి పోతోంది. టిప్పర్లకు జేసీబీ ద్వారా ఇసుక లోడింగ్ చేస్తున్నారు. పెనుగంచిప్రోలు శివారులో వెంచర్లో ట్రాక్టర్లతో మునేరు నుంచి ఇసుక డంప్‌చేసి అర్ధరాత్రి తర్వాత లారీల్లో లోడ్ చేసి తెలంగాణకు తరలిస్తున్నారు. అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు మునేరు ఇసుక రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో శివాపురం, జొన్నలగడ్డ మీదుగా తెలంగాణకు తరలిపోతోంది. ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లో సాగుతోంది. చెక్‌పోస్టులున్నా దాటిపోతోంది జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి, రావిరాల, మల్కాపురం, అన్నవరం, గ్రామాల్లోని కృష్ణానది, మునేరు, పాలేరు నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా పక్క రాష్ట్రానికి వెళ్లిపోతోంది. చందర్లపాడు మండలం కాసరబాద నుంచి కృష్ణానది నుంచి ఇసుక లారీల్లో అక్రమంగా సరిహద్దులోని చెక్‌పోస్టులు సూర్యాపేట మీదుగా తెలంగాణాకు వెళ్తోంది. చెక్‌పోస్టులు ఉన్నా అధికారుల అండదండలతో సరిహద్దు దాటుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాలేరు, మునేరులలో నీరు ఉండటంతో ఇసుకను ఖాళీ ప్రదేశాలతో డంపింగ్ చేస్తున్నారు. తెలంగాణకు అక్రమ రవాణా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బుట్ట దాఖలు నదుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు తెలంగాణలో లక్ష రూపాయలు పలుకుతున్న లారీ ఇసుక ధర కోట్లలో దోచుకుంటున్న ఇసుక, మట్టి మాఫియా రింగ్ మాస్టర్‌గా అవినీతి ‘కిశోరం’ తిరువూరు టు తెలంగాణ తిరువూరు నియోజకవర్గ పరిసరాల్లోని తెలంగాణ సరిహద్దు గ్రామాలకు కృష్ణా నది ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీ నుంచి ఇసుకను టిప్పర్లలో తిరువూరు శివారులోని మర్లకుంట–తోకపల్లి, అక్కపాలెం, గంపలగూడెం మండలంలోని ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామాల్లో దళారులు డంప్ చేస్తున్నారు. అక్కడ నుంచి ట్రాక్టర్లలో ఇసుకను కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాలకు తరలిస్తున్నారు. ట్రాక్టరు ఇసుక రూ.6వేల చొప్పున విక్రయిస్తున్నారు. మూడు రోజుల క్రితం తిరువూరు మీదుగా తరలుతున్న రెండు ఇసుక టిప్పర్లను తెలంగాణ టాస్క్‌ఫోర్స్ అధికారులు పెనుబల్లి మండలంలో స్వాధీనం చేసుకున్నారు. -
విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో విపత్తులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ హాలులో శుక్రవారం జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఆర్వో కె చంద్రశేఖరరావు, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీద్ జావెల్, కెఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీవోలు స్వాతి, బాలసుబ్రహ్మణ్యం, హేలా షారోన్, ఇరిగేషన్ ఎస్ఈ మోహనరావు, డీఎస్వో పార్వతి పాల్గొన్నారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించాలి భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సమావేశపు హాలులో ఎన్నికల అధికారులు అసిస్టెంట్ ఎన్నికల అధికారులతో ఆయన మాట్లాడి సూచనలు చేశారు. ‘ఆక్వా’ సమస్యల పరిష్కారానికి చర్యలు జిల్లాలో ఆక్వా పరిశ్రమల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శుక్రవారం ఆక్వా పరిశ్రమల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ డీకే బాలాజీ -
పేరుకే డివిజనల్ రైల్వే ఆస్పత్రి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పేరుకే డివిజనల్ రైల్వే ఆస్పత్రి.. కానీ వసతులు మాత్రం కానరావు. విజయవాడ రైల్వే డివిజన్ దువ్వాడ నుంచి గూడూరు వరకు విస్తరించి ఉంది. ఈ పరిధిలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రధాన కేంద్రమైన విజయవాడ రైల్వే డివిజనల్ ఆస్పత్రికి వస్తుంటారు. ఇటువంటి ఆస్పత్రిలో సరైన మౌలిక సదుపాయాలు అందడం లేదని రోగులు, వారి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసతులు ఏవీ? డివిజన్లోని దువ్వాడ, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ, ఏలూరు, గుడివాడ, మచిలీపట్నం, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, బిట్రగుంట, కావలి, నెల్లూరు, గూడూరు తదితర ప్రాంతాల నుంచి అనారోగ్యంతో బాధపడే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాల నుంచి రైళ్లలో ప్రయాణించి విజయవాడ రైల్వే ఆస్పత్రికి వస్తుంటారు. కానీ సౌకర్యాలు లేకపోవడమే ఇక్కడ సమస్యగా మారింది. వృద్ధుల పరిస్థితి మరింత దయనీయం ముఖ్యంగా రైల్వే ఆస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువగా వయోభారంతో బాధపడే విశ్రాంత ఉద్యోగులు ఉంటున్నారు. వారిలో ఎవరైనా ఒకరు అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే రోగిని వీల్‌చైర్‌లో కుర్చోపెట్టుకుని వృద్ధులే వైద్యుల వద్దకు, అక్కడ నుంచి వార్డుకు, ఎక్స్‌రేతో పాటు పలు రకాల పరీక్షల కోసం ల్యాబ్‌లకు కూడ తీసుకు వెళ్లాల్సి వస్తుంది. వయోభారంతో వీల్‌చైర్, స్ట్రెచ్చర్లను తోసుకుంటూవారు పడే బాధలు నిత్యం రైల్వే ఆస్పత్రిలో కనిపిస్తుంటాయి. డబ్బు కడుతున్నా అందని సదుపాయాలు ప్రతి నెలా ఉద్యోగులు జీతంలోను, విశ్రాంత ఉద్యోగులు తమ పెన్షన్‌లో మెడికల్ ఎలవెన్స్ రూపంలో ఏటా లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారు. అయినా తమకు సరైన వైద్య సదుపాయాలు విజయవాడ డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కష్టమైనా తాముండే ప్రాంతంలోనే ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. పట్టించుకోని ఉన్నతాధికారులు రైల్వే అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సరైన వైద్యసేవలు అందించకుండా సిబ్బంది చిన్నచూపు చూస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఆస్పత్రిలో వార్డు బాయ్స్ కూడా అందుబాటులో ఉండటం లేదని.. ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని విభాగాలకు వైద్యులు లేరని, సిబ్బంది కూడా అంతంతమాత్రంగా ఉన్నారు. ఇప్పటికై నా డీఆర్ఎం, ఏడీఆర్ఎం, సీఎంఎస్‌లు క్షేత్రస్థాయిలో పరిశీలించి రోగులకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ర్యాంపు మార్గంలో వీల్‌చైర్‌లో రోగిని తీసుకెళుతున్న కుటుంబ సభ్యులు విజయవాడ ఆస్పత్రిలో దివ్యాంగులు, వృద్ధులకు కనీస సౌకర్యాలు కరవు పట్టించుకోని రైల్వే ఉన్నతాధికారులు రైల్వే ఆస్పత్రిలో 10 విభాగాలు ఉన్నాయి. నిత్యం సుమారు 500 మంది ఓపీ వస్తారు. రైల్వే ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే దివ్యాంగులు, నడవలేని వృద్ధులు వసతుల్లేక తిప్పలు పడుతున్నారు. రోగుల అనారోగ్య పరిస్థితి మేరకు ఆస్పత్రి సిబ్బంది వీల్చైర్లు, స్ట్రెచ్చర్లలో క్యాజ్వాల్టీ, సంబంధిత వైద్యుల వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రైల్వే ఆస్పత్రిలో కానరాదు. అత్యవసర పరిస్థితిలో కూడా రోగులు అంబులెన్స్‌లు, ప్రైవేటు వాహనాల్లో రైల్వే ఆస్పత్రులకు వస్తే అక్కడ రోగులను వెంటనే క్యాజువాల్టీకి తరలించేందుకు వార్డుబాయ్స్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండటంలేదు. దీనిపై సిబ్బందిని అడిగితే బయట వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు ఉంటాయని వాటిపై రోగిని మీరే తీసుకు రావాలని చెబుతున్నారు. రోగుల సహాయకులే అవి ఎక్కడున్నాయో వెతుక్కుని వాటిలో క్యాజ్వాల్టీకి తీసుకెళ్తున్నారు. అక్కడ వైద్యులు పరీక్షించిన అనంతరం వారికి ఎక్స్‌రే, రక్తపరీక్షలకు వెళ్లాలన్నా బంధువులే రోగులను వీల్చైర్లు, స్ట్రెచ్చర్లలో తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రణమిల్లిన భక్తజనం
అమ్మవారికి సారె సమర్పణకు తరలివస్తున్న భక్త బృందాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తజనం ప్రణమిల్లారు. ఆషాఢ మాసోత్సవాలు, శుక్రవారం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారెను సమ ర్పించారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఆలయ ఈవో వి. సుబ్బారావు దంపతులు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి పట్టుచీర, సారెను సమర్పించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ● ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. దీంతో మహా మండపం ఆరో అంతస్తులో పండుగ వాతావరణం నెలకొంది కిటకిటలాడిన క్యూలైన్లు ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. మహా మండపం, లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్డులో కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో సర్వ దర్శనం క్యూలైన్‌తో పాటు రూ. 100, రూ. 300 టికెట్ క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం 4 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా, సేవలో పాల్గొనే టికెట్లకు డిమాండ్ కనిపించింది. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. మౌలిక వసతుల పరిశీలన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై నోడల్ అధికారి టి.చంద్రకుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. నోడల్ అధికారి వెంట దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
Kodali Nani: కొడాలి నానికి ముందస్తు బెయిల్
సాక్షి,విజయవాడ:మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ముందస్తు బెయిల్ లభించింది. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదైంది. అయితే, ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. కిందికోర్టులో బెయిల్ తీసుకోవాలని కొడాలి నానికి హైకోర్టు ఆదేశించింది. ఆదేశాల మేరకు కొడాలి నాని శుక్రవారం గుడివాడ కోర్టులో ష్యూరిటీ పత్రాలు సమర్పించారు. అనంతరం,ముందస్తు బెయిల్ పొందారు. -
ప్రయాణికుడి చెంపపై కొట్టిన మహిళా కండక్టర్
తోట్లవల్లూరు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పట్ల మహిళా కండక్టర్ అనుచితంగా ప్రవర్తించటమే కాకుండా చొక్కా పట్టుకుని చెంప చెళ్లుమనిపించిన ఘటన మండల కేంద్రమైన తోట్లవల్లూరులో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరు వెళుతున్న ఆర్టీసీ బస్సును గురువారం ఉదయం ఓ వ్యక్తి ఎక్కాడు. టికెట్ తీసుకునే క్రమంలో టికెట్‌కు సరిపడా చిల్లర లేకుండా బస్సు ఎందుకు ఎక్కావంటూ మహిళా కండక్టర్ ప్రయాణికుడి పట్ల దురుçసుగా ప్రవర్తించారు. ఈ విషయమై ఇరువురి మధ్య వాదన జరగటంతో కనకదుర్గమ్మ కాలనీ వద్ద కండక్టర్ బస్సును నిలిపివేశారు. ప్రయాణికుడిని బస్సు నుంచి దించి, ‘నన్ను బూతులు తిడతావా’ అంటూ అతని చొక్కా పట్టుకుని చెంపపై కొట్టారు. ఈ ఘటనను చూసిన పలువురు స్థానికులు నివ్వెరపోయారు. టికెట్ తీసుకునే విషయంలో ప్రయాణికుడి పొరపాటు ఉన్నప్పటికీ, అతని చొక్కా పట్టుకుని కొట్టేంత వరకు వెళ్లిన మహిళా కండక్టర్ ప్రవర్తన పట్ల గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
AP: పోలీసుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య
సాక్షి, కృష్ణా జిల్లా: పోలీసుల వేధింపులు తాళలేక మండలంలోని పులిగడ్డకు చెందిన బొర్రా నాగశ్రీనివాస్ (26) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల చర్యను నిరసిస్తూ మృతుడి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. మృతుడి బంధువుల కథనం మేరకు.. పులిగడ్డలో వారం రోజుల క్రితం జరిగిన ఓ కొట్లాట విషయమై నాగశ్రీనివాస్, అతని తండ్రి రాంబాబుపై కొంత మంది ఫిర్యాదు చేశారు.ఈ విషయమై రాంబాబు, నాగశ్రీనివాస్‌ను ఎస్ఐ పలుసార్లు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. మంగళవారం కూడా పోలీసులు ఫోన్ చేసి, కొట్లాట కేసును ఒప్పుకోవాలని, చెప్పినట్టు వినకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన నాగశ్రీనివాస్ కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.కుటుంబ సభ్యులు అతడిని తొలుత అవనిగడ్డ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు చేతులెత్తేయడంతో తిరిగి అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు.పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన ఎస్ఐ, పోలీసుల వేధింపుల వల్లనే నాగశ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించిన బంధు వులు బుధవారం రాత్రి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కోడూరు, నాగాయలంక ఎస్ఐలు చాణక్య, రాజేష్ వచ్చి ట్రాఫిక్‌కు ఇబ్బంది అవుతోందని చెప్పడంతో అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని చర్చలు జరపడంతో మృతుడి బంధువులు ఆందో ళన విరమించారు. తన కుమారుడు మృతికి కారకులైన ఎస్ఐ, పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి రాంబాబు డిమాండ్ చేశారు. -
లెవల్ నిర్వహిస్తేనే..
కోమటిగుంట లాకులు వద్ద లాకులు బిగించి ఏడు అడుగులు నీటి మట్టం నిర్వహించాలి. అప్పుడే రెగ్యులేటర్‌కు ఎగువన ఉన్న భూములకు సాగునీరు అందుతుంది. పంట కాలువల షట్టర్లు తెరచుకోవటంతో పాటుగా తూములు ద్వారా పంట కాలువల్లోకీ నీరు మళ్లుతుంది. అయితే ప్రస్తుతం ఈ రెగ్యులేటర్ వద్ద నీటి మట్టం ఆరు అడుగులు మాత్రమే ఉంది. దీంతో రెగ్యులేటర్‌కు ఎగువన ఉన్న పంట కాలువలకు నీరు ఎక్కక, సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడు అడుగులు లెవల్ నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. లేనిపక్షంలో నాట్లకు సిద్ధమవుతున్న నారుమడులు ఎండుముఖం పట్టే ప్రమాదం ఉందని అన్నదాతలు వాపోతున్నారు. -
గవర్నర్‌కు ఘన స్వాగతం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌నజీర్‌కు విశ్వవిద్యాలయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం ఆయన వర్సిటీకి చేరుకోగా.. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ రాంజీ పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత రూ.3.20 కోట్లతో నిర్మించిన వంటశాలను ప్రారంభించారు. కార్యనిర్వాహక మండలి సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అకడమిక్ బ్లాక్ చేరుకుని స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ కార్యదర్శి హరిజవహర్‌లాల్, సంయుక్త కార్యదర్శి పీఎస్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల్లో నిరాశ.. స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య, విశిష్ట అతిథుల చేతుల మీదుగా పట్టాలు పొందవచ్చని ఎంతో ఆశగా వచ్చిన పీహెచ్డీ, పీజీ పట్టాదారులు నిరాశ పడ్డారు. గవర్నర్ గౌరవ డాక్టరేట్, గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు మాత్రమే ఆయన చేతుల మీదుగా అందజేశారు. మిగిలిన వారికి వర్సిటీ వీసీ, కింది స్థాయి అధికారుల చేతుల మీదుగా అందజేయడంలో వారు పెదవి విరిచారు. -
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జ్ఞానమణి
హనుమాన్‌జంక్షన్ రూరల్: వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాపులపాడు మండలం శేరినరసన్నపాలెంనకు చెందిన కైలే జ్ఞానమణి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధ వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలం పనిచేస్తున్న జ్ఞానమణి గతంలో బాపులపాడు జెడ్పీటీసీ సభ్యు రాలిగా, మహిళా విభాగం ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షురాలిగా సేవలు అందించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని, మహిళల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడతానని జ్ఞానమణి తెలిపారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానమణికి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. స్వయం సహాయక బృందాలకు రుణ మంజూరు లేఖ పటమట(విజయవాడతూర్పు): మహిళలు ఆర్థి కంగా బలోపితం అయ్యేందుకు ప్రభుత్వం, బ్యాంకులు కృషి చేస్తున్నాయని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తృప్తి క్యాంటీన్ లబ్ధిదారులకు బుధవారం రుణ మంజూరులేఖను ఆయన అందించారు. ఈ సందర్భంగా తేజ్‌భరత్ మాట్లాడుతూ.. నగరంలో నాలుగు క్యాంటీన్లను మంజూరు చేశామని, వీటిలో కంటెయినర్ల సమీకరణ, కిచెన్ ఎక్విప్మెంట్ మొదలగు ఏర్పాటు చేయటానికి ఒక్కో క్యాంటీ న్కు రూ.14.51 లక్షలు రుణం మంజూరు చేశామని తెలిపారు. ఈ క్యాంటీన్లు జన సాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే పంజా సెంటర్లో భారత ఓవర్సీస్ బ్యాంక్, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ద్వారా తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ పట్టణ సాధికార విభాగం ప్రాజక్ట్ అధికారి పి.వెంకటరమణ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. ఐదు రోజులు ముందుగానే రేషన సరుకుల పంపిణీ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో రేషన్‌షాపుల ద్వారా జూలై నెల రేషన్‌ను ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన రేషన్ కార్డుదారులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే సంబంధిత డీలర్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. -
కావాలి కనికరం!
అనాధీనం..రైతులకు పట్టాలు ఇవ్వాలి.. బుడమేరు పరీవాహక ప్రాంతంలో దశాబ్దాల కాలంగా రైతులు భూములను సాగు చేసుకుంటున్నా పట్టాలు ఇవ్వకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారు. కాలువలో ఉన్న భూమి అంటూ పట్టాలు ఇవ్వడం లేదు. ఎగువన ఇదే డ్రెయిన్‌లో పట్టాలు ఇచ్చి దిగువన ఉన్న భూములకు పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయం. వెంటనే ప్రభుత్వం స్పందించి అసైన్డ్ కమిటీ ద్వారా రైతులకు పట్టాలు ఇవ్వాలి. – ఆర్సీపీ రెడ్డి, సీపీఎం నాయకుడు తీవ్రంగా నష్టపోతున్నాం.. బుడమేరు వరదలు వచ్చినప్పుడు పంట పూర్తిగా నీట మునిగి నష్టపోతున్నాం. పట్టాలు లేని కారణంగా మాకు నష్టపరిహారం ఇవ్వడం లేదు. పట్టాలు ఇవ్వాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకుంటూనే ఉన్నాం. మా గోడు విన్న నాయకుడే లేడు. కనీసం వ్యవసాయశాఖ నుంచి వచ్చే రాయితీలు ఇవ్వడం లేదు. మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం పట్టాలు ఇప్పించాలి. – సత్యనారాయణ, రైతు ఎల్‌ఎన్‌పురం గుడివాడరూరల్: బుడమేరు పరీవాహక ప్రాంతంలోని అనాధీన భూముల్లో సాగు చేసుకునే రైతులు పట్టాలు ఇప్పించాలంటూ దశాబ్దాలుగా వేడుకుంటున్నారు. పట్టాలు లేకపోవడంతో భూములు ముంపునకు గురైనా పరిహారం రాకపోవడం, సాగుకు వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. నందివాడ మండలంలోని చేదుర్తిపాడు, ఒద్దులమెరక, పుట్టగుంట, అరిపిరాల, రామాపురం, కుదరవల్లి, ఇలపర్రు గ్రామాల పరిధిలోని బుడమేరు డ్రెయిన్‌లో దాదాపుగా 1000 ఎకరాల వరకు అనాధీన భూమి ఉంది. ఆయా గ్రామాల పరిధిలోని నిరుపేద బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల పేద రైతులు వంశపారంపర్యంగా భూములను సాగు చేసుకుంటున్నారు. దక్కని నష్ట పరిహారం.. అనాధీన భూముల్లో సాగు చేసిన రైతులకు నష్ట పరిహారం అందించడం లేదు. ఇదే పరీవాహక ప్రాంతంలో ఎగువన విజయవాడ నుంచి బాపులపాడు మండలం వరకు పట్టాలు ఉన్న భూములకు ముంపునకు గురయ్యాయని ఎకరాకు రూ.10వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించారు. అనాధీన భూముల రైతులకు పట్టాలు లేవన్న సాకుతో నష్టపరిహారం ఇవ్వలేదు. వాస్తవానికి 1950కు ముందు ఇదే ప్రాంతంలో బుడమేరు కరకట్టలు నిర్మించకముందు భూములను పంట భూములుగా పరిగణించి వరదలు వచ్చిన సమయంలో నష్టపరిహారం చెల్లించారు. జలగం వెంగళ్రావు సీఎంగా ఉన్న సమయంలో బుడమేరు ఇరువైపులా కరకట్టలు నిర్మించారు. అప్పటి నుంచి కాలువల పరిధిలో ఉన్న భూములకు నష్టపరిహారం చెల్లించేది లేదని సుప్రీంకోర్టు తీర్పును వంకగా చూపి భూములకు పట్టాలు ఇవ్వకుండా నష్టపోయినా నష్టపరిహారం చెల్లించడం లేదు. ఫలితంగా రైతులు నష్టపోతూ వస్తున్నారు. ఏటా సాగు చేస్తున్నా భూములకు సంబంధించి ఈ–క్రాప్ నమోదు చేస్తున్నా అధికారులు పంట నష్టపోతే పరిహారం ఇవ్వడం లేదు. పంట నష్టం ఇవ్వని పక్షంలో ఈ–క్రాప్ ఎందుకు నమోదు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క రూపాయీ రాలేదు.. బుడమేరు ఆధునికీకరణ పేరిట విజయవాడ నుంచి ఇలపర్రు వరకు దాదాపుగా 5రీచ్‌లుగా విభజించి డ్రెయిన్‌ను తవ్వారు. ఆధునికీకరణలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం రూపంలో ప్రభుత్వం భారీగానే నిధులు మంజూరు చేసింది. ప్రాంతాలను బట్టి పట్టాలు ఉండి భూములు కోల్పోయిన రైతులకు రూ.లక్షల్లో పరిహారం చెల్లించింది. నందివాడ మండలంలోని అనాధీన భూముల రైతుల భూములు దాదాపుగా 100 ఎకరాలకు పైగా ఆధునికీకరణలో కోల్పోయారు. పట్టాలు లేకపోవడంతో రైతులకు ఒక్క రూపాయి నష్టపరిహారం చెల్లించలేదు. తాతలు, తండ్రుల నుంచి సాగు చేసుకుంటూ వస్తున్న భూమి ఒక్కసారిగా కోల్పోవడంతో కుటుంబాలు వీధిన పడ్డాయి. నష్ట పరిహారం చెల్లించాలంటూ భూములు కోల్పోయిన రైతులు అధికారులు, పాలకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా దక్కలేదు. గతంలో 1990కు ముందు పంట నష్టపోయి పరిహారం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పట్టా భూములుగా పరిగణించాలంటూ పాలకులు, అధికారులను వేడుకుంటున్నా కరుణించడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే బుడమేరు రైతులకు న్యాయం చేసి పట్టాలు ఇప్పిస్తామని గద్దెనెక్కిన నాయకులు పంట నష్టం ఇప్పించడంపై నోరు మెదపడం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు.దశాబ్దాల రైతు కష్టాలు తీరేదెప్పుడో? గతేడాది బుడమేరు వరదలో పంట కోల్పోయినా పరిహారం శూన్యం ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా పట్టించుకోని పాలకులు ఈ–క్రాప్ చేసినా పరిహారం దక్కడం లేదని రైతుల గగ్గోలు పట్టాలు ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి -
683 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్ –2025లో ర్యాంకులు పొందిన విద్యార్థుల సర్టిఫి కెట్ల పరిశీలన ప్రక్రియ బుధవారం కూడా కొనసాగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు–216 మంది, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో–247 మంది, ఆంధ్రా లయోల కళాశాల ఆవరణలోని కేంద్రంలో–220 మంది జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. మొత్తం 683 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ధ్రువీకరణ పత్రాలను అందజే శామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. నేటి షెడ్యూల్ ఇదీ.. ● స్పెషల్ కేటగిరీకి సంబంధించి గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో ఎన్సీసీలో 40,001 నుంచి 80 వేల ర్యాంకు వరకు, స్పోర్ట్స్ కేటగిరీలో ఒకటి నుంచి 60 వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. జనరల్ కేటగిరీకి సంబంధించి మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 86,001 నుంచి 95 వేల లోపు ర్యాంకు వరకు, ఆంధ్రా లయోల డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 95,001 నుంచి లక్షా నలభై వేల లోపు ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. -
‘వైద్య సేవ’తో నిధులు సమకూర్చుకోవాలి
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసే పరిస్థితి లేదని, ఎన్టీఆర్ వైద్య సేవ కేసులకు వైద్యం చేసి నిధులు సమకూర్చుకోవాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ) డి.వెంకటేశ్వరరావు సంబంధిత వైద్య అధికారులకు సూ చించారు. స్థానిక సర్వజన ప్రభుత్వాస్పపత్రి, మెడి కల్ కాలేజీని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ముఖ్య విభాగాలైన ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఐసీసీయూ, ఎంఐసీయూ, జనరల్ వార్డు, లేబర్ వార్డులను పరిశీలించారు. ప్రతి వార్డులో వసతులు, పరిశుభ్రత, రోగులకు అందుతున్న సేవల గురించి వివరంగా విచారణ చేశారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులపై సమీక్ష నిర్వహించారు. వెంటిలేటర్ పనిచేయకపోవడాన్ని గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నచిన్న మరమ్మతులు చేయకపోవటంపై ఇంజినీరింగ్ విభాగం అధికారులను మందలించారు. వైద్యులు స్థానికంగా నివసించాలి మెడికల్ కాలేజీలో వైద్యులతో ఏడీఎంఈ వెంకటేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యులు స్థానికంగానే నివసించాలని, అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం ఏర్పాటు, మౌలిక వసతుల మెరుగుదల, అవసరమైన సిబ్బంది నియామకం, పరికరాల నిర్వహణపై సమగ్ర నివేదిక సంబంధిత శాఖకు అందజేయనున్నట్లు ఏడీఎంఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.ఆశాలత, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ నిరంజన్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ టి.టి.కె.రెడ్డి, పలువురు వైద్యులు, వైద్య కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వెంకటేశ్వరరావు ప్రభుత్వాస్పత్రి, మెడికల్ కాలేజీలో ఆకస్మిక తనిఖీలు వార్డుల్లో వసతులు, పరిశుభ్రత, వైద్య సేవలపై సమీక్ష వెంటిలేటర్ పని తీరుపై అసంతృప్తి -
రైల్వే సమగ్రతలో టీటీఈల పాత్ర కీలకం
సీనియర్ డీసీఎం రాంబాబు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారతీయ రైల్వే సమగ్రతను నిలబెట్టడంలో టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్లు (టీటీఈలు) కీలక పాత్ర పోషిస్తారని విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు పేర్కొన్నారు. విజయ వాడ డివిజన్లో టికెట్ తనిఖీ తీరుపై సీనియర్ డీసీఎం అధ్యక్షతన డీఆర్ఎం కార్యాలయంలోని కాన్పరెన్స్ హాలులో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యాప్తంగా స్క్వాడ్ ఇన్‌చార్జ్‌లు, ఎమినిటీస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. సీనియర్ డీసీఎం రాంబాబు మాట్లాడుతూ.. టీటీఈలు విధుల్లో అవలంబించే అంకితభావం, వృతి నైపుణ్యం, మంచి ప్రవర్తన సంస్థపై నేరుగా ప్రతిబింబిస్తాయని తెలిపారు. వారు విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తు రాయితీ కోటా దుర్వినియోగం, టికెట్ లోని పేరు మార్పులు, సరైన ఐడీ కార్డులు లేకుండా ప్రయాణించే వారిని నివారించాలని ఆదేశించారు. వారు విధుల్లో ఎదుర్కోనే ఇబ్బందుల గురించి అడిగి తెలసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అత్యుత్తమ పనితీరు కనపర్చిన టీటీలను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో కమర్షియల్ మేనేజర్ బి.వి.ఎన్.ఎస్.రవి ప్రసాద్, పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్, కమర్షియల్ అధికారులు పాల్గొన్నారు. -
నాట్లలోనే నీటి గోస
నీళ్లు రావటం లేదు.. మా ఉప్పలూరు, వేల్పూరు, పునాదిపాడు, కోలవెన్ను ప్రాంతాలు కోమటిగుంటకు ఎగువన ఉన్నాయి. లాకులు వద్ద ఏడు అడుగులు లెవల్ మట్టం ఉండేలా చూడాలి. అప్పుడే పంట కాలువల్లోకి నీరు చేరుతుంది. జూన్ ఆఖరు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. వరి నారుమడులను బతికించుకోవటానికి కాలువలు, మురుగు కాలువల్లో ఉన్న నీటిని ఆయిల్ ఇంజిన్లతో మళ్లిస్తున్నాం. ఎకరాకు రూ. 5 వేలు పైగా ఖర్చులు అవుతున్నాయి. మా బాధలు గుర్తించి సాగునీటి సమస్యను తీర్చాలి. – నెరుసు రమేష్, రైతు, ఉప్పలూరు కంకిపాడు: ఖరీఫ్ ఆరంభంలోనే సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహం ఉన్నా, సరైన లెవల్ నిర్వహణ జరగకపోవటంతో ఎగువ ప్రాంత పంట కాలువలకు నీరు ఎక్కడం లేదు. దీంతో ఆయా కాలువల పరిధిలోని వ్యవసాయ భూముల్లో సాగు ప్రశ్నార్థకంగా తయారైంది. కాలువల్లో ఉన్న అడుగు బొడుగు నీటిని ఆయిల్ ఇంజిన్ల ద్వారా పొలాలకు మళ్లించి నారుమళ్ల సంరక్షణకు అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు. సాగుకు సన్నద్ధం.. కంకిపాడు లాకులు పరిధిలో 35వేల ఎకరాల్లో సాగు భూమి ఉండగా కోమటిగుంట రెగ్యులేటర్ పరిధిలో 3.43లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ప్రస్తుతం ఈ రెండు లాకులు నుంచి దిగువకు సాగునీటి సరఫరా అవుతోంది. బోర్ల సదుపాయం ఉన్న రైతులు మాత్రం నారుమడులు పోయటంతో పాటుగా, దమ్ములు పూర్తి చేసి వరి నాట్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కట్లు వర్ణనాతీతం.. లాకులకు ఎగువ ప్రాంత రైతులు మాత్రం సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువ నీటిపై ఆధారపడి సాగుకు ఉపక్రమించే అన్నదాతలు కాలువల్లో నీరు సమృద్ధిగా లేక వరి నారుమడుల సంరక్షణ, భూములను దమ్ము చేసేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. కంకిపాడు, కోమటిగుంట రెగ్యులేటర్‌కు ఎగువన ఉన్న పంట కాలువలకు నీరు ఎక్కకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రధానంగా పెనమలూరు, కంకిపాడు మండలాల్లోని అనేక గ్రామాల్లో పంట కాలువలు సాగునీరు లేక, జమ్మి, తూటికాడతో అధ్వానంగా కనిపిస్తున్నాయి. అడుగుబొడుగున ఉన్న నీటిని ఆయిల్ ఇంజిన్లతో వరి నారుమడులకు, భూముల దమ్ములకు మళ్లిస్తూ వరి నాట్లకు అతి కష్టం మీద సన్నద్ధమవుతున్న పరిస్థితి. సాగు మొదట్లోనే భారం.. ఖరీఫ్ సాగు మొదట్లోనే రైతులపై భారం మీద భారం పడుతోంది. వ్యవసాయశాఖ నుంచి విత్తనాలు పంపిణీ కూడా అరకొరగానే సాగింది. తొలకరి పలకరింపుతో పొలాలు అదును తప్పకుండా ఉండేందుకు బయటి మార్కెట్లో 30 కిలోల వరి విత్తనం బ్యాగులు రూ.1100–రూ.1200 చొప్పున కొనుగోలు చేసి వరి నారుమడులు పోసుకున్నారు. ప్రస్తుతం నారుమడులు సంరక్షించుకోవటానికి, భూములను దమ్ము చేసుకోటానికి సాగునీటికి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఎకరం పొలం ఆయిల్ ఇంజిన్లతో తడిపేందుకు 10 గంటల సమయం పడుతోంది. ఇందుకోసం ఎకరాకు రూ. 4500 నుంచి రూ.5500 వరకూ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. పంట కాలువల్లో సాగునీరు అందుబాటులో ఉంటే తూములు, గండ్లు ద్వారా పొలాలకు సమృద్ధిగా నీరు అందించుకునే వాళ్లమని రైతులు వాపోతున్నారు. అవసరమైన లెవెల్ లేక తెరచుకోని పంట కాలువల గేట్లు ఆయిల్ ఇంజిన్లపై ఆధారపడుతున్న రైతులు ఖరీఫ్ ఆరంభంలోనే సాగుకు అన్నదాతల తంటాలు -
పోలీసుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య
అవనిగడ్డ: పోలీసుల వేధింపులు తాళలేక మండలంలోని పులిగడ్డకు చెందిన బొర్రా నాగశ్రీనివాస్(26) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల చర్యను నిరసిస్తూ మృతుడి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. మృతుడి బంధువుల కథనం మేరకు.. పులిగడ్డలో వారం రోజుల క్రితం జరిగిన ఓ కొట్లాట విషయమై నాగశ్రీనివాస్, అతని తండ్రి రాంబాబుపై కొంత మంది ఫిర్యాదు చేశారు. ఈ విషయమై రాంబాబు, నాగశ్రీనివాస్‌ను ఎస్ఐ పలుసార్లు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. మంగళవారం కూడా పోలీసులు ఫోన్ చేసి, కొట్లాట కేసును ఒప్పుకోవాలని, చెప్పినట్టు వినకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన నాగశ్రీనివాస్ కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడిని తొలుత అవనిగడ్డ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు చేతులెత్తేయడంతో తిరిగి అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన ఎస్ఐ, పోలీసుల వేధింపుల వల్లనే నాగశ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించిన బంధు వులు బుధవారం రాత్రి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కోడూరు, నాగాయలంక ఎస్ఐలు చాణక్య, రాజేష్ వచ్చి ట్రాఫిక్‌కు ఇబ్బంది అవుతోందని చెప్పడంతో అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని చర్చలు జరపడంతో మృతుడి బంధువులు ఆందో ళన విరమించారు. తన కుమారుడు మృతికి కారకులైన ఎస్ఐ, పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి రాంబాబు డిమాండ్ చేశారు. -
1న వైద్యులకు అవార్డుల ప్రదానం
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించనున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న వారికి బెస్ట్ డాక్టర్ అవార్డ్స్–2025 అందజేయనున్నారు. ఈ అవార్డులకు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదగా అందించనున్నట్లు వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. అవార్డులు అందుకుంటున్న వారిలో జనరల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ ఎ.అశ్విని కుమార్, కార్డియాలజిస్ట్‌లు డాక్టర్ ఎ.శ్రీనివాసరావు, డాక్టర్ పి. భాస్కరనాయుడు, జనరల్ సర్జన్, డీఎంఈ–ఏపీ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం, డాక్టర్ జి.భవానీ ప్రసాద్, న్యూరో సర్జన్ డాక్టర్ కె. సత్యవరప్రసాద్, డాక్టర్ ఎం.కృష్ణనాయక్, న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మ శ్రీవస్తవ, డాక్టర్ ఆర్.మురళీ బాబూరావు, ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ టి.భారతి ఉన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మునిసిపల్ కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెలో వాటర్, పార్క్, వెహికల్ డిపో మెకానికల్, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్యం, డ్రెయినేజీ, మలేరియా విభాగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమెరికా సామ్రా జ్యావాదాన్ని, యుద్ధోన్మాదాన్ని ఖండించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని ఖండించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ప్రదర్శన జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లా డుతూ.. యుద్ధం ముగిసిందని కొందరు అనుకుంటున్నారని, కాల్పుల విరమణ కేవలం తాత్కాలికమేనని అన్నారు. మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అమెరికా, ఇజ్రాయిల్ తమ ఇష్టానుసారం ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద అడ్డగోలుగా దాడులు చేస్తున్నాయని విమర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్ తప్ప మరే దేశం అణ్వాయుధాలే కాదు అణుశక్తి కూడా కలిగి ఉండకూడదని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు నిర్ధారణ కాకున్నా అమెరికా, ఇజ్రాయిల్ భయంకర ఆయుధాలు ప్రయోగించి వందల మందిని పొట్టనబెట్టుకున్నాయని వివరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయిల్‌కు కొమ్ముకాస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నగర కార్యదర్శి కె.కోటేశ్వరరావు, వామ పక్ష నాయకులు వై.వెంకటేశ్వరరావు, కె.వి.వి.ప్రసాద్, పెన్మత్స దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఉద్యోగోన్నతులు కల్పించాలని ఏపీ గ్రామ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో సర్వేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన మూడు రిలే నిరాహార దీక్ష బుధవారం ప్రారంభమైంది. దీక్షలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుబాబు, ప్రధాన కార్యదర్శి పి. సాయికిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పర్యాయాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గ్రామ సర్వేయర్ల హేతుబద్ధీకరణ తర్వాతే ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టాలన్నారు. బదిలీల్లో స్థానిక మండలం నిబంధనను తొలగించాలని కోరారు. ఇప్పటికే పిల్లలకు పాఠశాలలు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు బదిలీలు చేస్తే స్కూల్స్ మారడం ఇబ్బందికరంగా, ఆర్థికంగా భారంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రక్షాళన చేయాలని భావిస్తే పై క్యాడర్ నుండి కింది స్థాయి క్యాడర్ వరకూ వారి పరిధిని బట్టి స్థానిక నిబంధన వర్తింపజేయాలని కోరారు. హేతుబద్ధీకరణ ప్రక్రియ చేసే ముందు ప్రమోషన్ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియజేయాలని డిమాండ్‌చేశారు. ఎటువంటి సిఫార్సులను అనుమతించకుండా పారదర్శకంగా బదిలీలు చేయాలని విజ్ఞప్తిచేశారు. అసోసియేషన్ ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ -
200 కిలోల గంజాయి పట్టివేత
లబ్బీపేట(విజయవాడతూర్పు): విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి చైన్నెకు అక్రమంగా రవాణా చేస్తున్న 200 కిలోల గంజాయిని విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, ఒకకారు, మినీ గూడ్స్ వ్యాన్‌ను సీజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఈ కేసు వివరాలను బుధవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్ల డించారు. సీపీ కథనం మేరకు.. గంజాయి అక్ర మంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని గీతానగర్ కట్ట ప్రాంతంలో ఎస్ఐ భానుప్రసాద్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేసి గంజాయి బ్యాగులను గుర్తించారు. డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో మినీ గూడ్స్ వ్యాన్ డ్రైవరు పోలీసుల తనిఖీలను గమనించి వాహనం ఆపి, పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాల నుంచి రూ.15 లక్షల విలువగల 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విశాఖపట్నం జిల్లా తగరపు వలస, భీమునిపట్నం ప్రాంతాలకు చెందిన అండి నాగరాజు, తమిళనాడులోని ఉత్తమ పలయాన్, కక్కిసింగయన్పట్టి గ్రామానికి చెందిన అనబలగన్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నాగరాజును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతను మధురై ప్రాంతానికి వలస వెళ్లి ఆ ప్రాంతంలో గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉండటంతో విశాఖ ఏజెన్నీ ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు కొనుగోలుచేసి, చైన్నెలో ఎక్కువ ధరకు విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాగరాజు తనకు తెలిసిన అనబలగన్కు విషయం చెప్పి, అతని గూడ్స్ వాహనాన్ని ప్రత్యేక అరలుతో తయారు చేయించి గంజాయి తరలిస్తున్నారు. ఇలా రెండుసార్లు పట్టుబడి జైలుకు కూడా వెళ్లివచ్చారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కారు ముందు, వెనుక గూడ్స్ వాహనం వెళ్తుండగా రెండింటినీ పోలీసులు పట్టుకున్నారు. ఒక్కొక్క వాహనం నుంచి 100 కిలోల చొప్పున 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సమావేశంలో సౌత్ ఏసీపీ డి.పావన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు నిందితుల అరెస్టు కారు, మినీ గూడ్స్ వ్యాన్ సీజ్ -
‘ప్రాజెక్ట్ కామధేను’లో పంజాబ్ డెయిరీ ప్రతినిధులు
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వీరవల్లిలోని ‘ప్రాజెక్టు కామధేను’ పాల ఉత్పత్తుల కర్మాగారాన్ని పంజాబ్‌కు చెందిన వెర్కా మిల్క్ యూనియన్ (డెయిరీ) ప్రతినిధులు బుధవారం సందర్శించారు. దేశంలోనే అత్యాధునిక సాంకేతికతతో పూర్తి ఆటోమేషన్ మిల్క్ ప్లాంట్‌గా రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ కామధేను ఫ్యాక్టరీని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సూచనల మేరకు వెర్కా డెయిరీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. పాలు, పాల ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్‌లో అధునాతన మిషనరీ పనితీరును పంజాబ్ ప్రతినిధులకు ప్రాజెక్టు కామధేను ప్లాంట్ హెడ్ ఎం.సరిత వివరించారు. రోజుకు సగటున పది లక్షల లీటర్ల మిల్క్ ప్రొసెసింగ్ సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించినట్లు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రగతిని వివరించారు. వెర్కా మిల్క్ యూనియన్ వైస్ చైర్మన్ ఉపేందర్ సింగ్, డైరెక్టర్ రమణదీప్ సింగ్, జనరల్ మేనేజర్ హర్మేందర్ సింగ్ సందు, ఇంజినీరింగ్ మేనేజర్ హజూర్ సింగ్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష
జి.కొండూరు: ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా గురుకుల బాలికల పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు కుంటముక్కల సాంఘి క సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షను జి.కొండూరు మండల విద్యాశాఖ అధికారి వీరాస్వామి పర్యవేక్షించారు. పాఠశాల హెచ్ఎం కె.బ్యూలా మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొమ్మిది గురుకుల బాలికల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఆరో తరగతిలో ప్రవేశానికి 604 మంది విద్యార్థినులు దరఖాస్తు చేయగా 419మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. అదేవిధంగా ఏడో తరగతిలో ప్రవేశం కోసం 513 మంది దరఖాస్తు చేయగా 425మంది, ఎనిమిదో తరగతిలో ప్రవేశానికి 480మంది దరఖాస్తు చేయగా 460 మంది, తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి 472మంది దరఖాస్తు చేయగా 412మంది విద్యార్థినులు పరీక్షకు హాజరైనట్లు చెప్పారు.విశ్వనాథరెడ్డికి డాక్టరేట్ ప్రదానంచిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం 6, 7, 8 స్నాతకోత్సవ కార్యక్రమంలో ‘సాక్షి’ స్టేట్ బ్యూరో చీఫ్ మల్లు విశ్వనాథరెడ్డి పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగంలో ఆయన పలు పరిశోధనలు చేసి విశ్వవిద్యాలయంలో వాటిని నివేదికలను అందజేసి పీహెచ్డీను సాధించారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ పీహెచ్డీ సర్టిఫికెట్‌ను గౌరవ డాక్టరేట్ ప్రధానకర్తలు మండవ ప్రభాకరరావు, ఎంఎన్వీ రవికుమార్, చలమలశెట్టి అనిల్‌కుమార్, యూనివర్సిటీ రెక్టార్ బసవేశ్వరరావు చేతుల మీదుగా విశ్వనాథరెడ్డి అందుకున్నారు.5న జాతీయ లోక్అదాలత్చిలకలపూడి(మచిలీ పట్నం): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదా లత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తల గోపీ తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్‌బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లయిమ్‌లు అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. సంబంధిత కక్షిదారులు తమ న్యాయవాదులను సంప్రదించి లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కై కలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు, మొవ్వ కోర్టుల్లో ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తామన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్‌లో కేసులు సిఫార్సు చేయించుకుని సమయం వృఽథా కాకుండా చూసుకోవాలన్నారు.వైఎస్సార్ సీపీలో నియామకాలుగాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాలలో నియమించారు. పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శులుగా నంబూరి రవి (జగ్గయ్యపేట), వెన్నం రత్నారావు (విజయవాడ సెంట్రల్), రాష్ట్ర ఆర్టీఐ విభాగం కార్యదర్శిగా మల్లెల వెంకట చిన్నారెడ్డి(విజయవాడ ఈస్ట్), రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ ప్రధాన కార్యదర్శి షేక్ హసన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.నేటి నుంచి మహిళా సర్పంచ్‌లకు శిక్షణహనుమాన్జంక్షన్రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, గ్రామ పరిపాలన విధానాలపై మహిళా సర్పంచ్‌లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బాపులపాడు ఇన్చార్జి ఎంపీడీవో త్రినాథ తిరుమలరావు బుధవారం తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని మహిళా సర్పంచ్‌లకు గుడివాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శిక్షణ ఉంటుందని చెప్పారు. -
ముంపు.. ముప్పు..
బుడమేరు పరీవాహక ప్రాంతం కావడంతో తరచూ వరదలు వచ్చిన సమయంలో నష్టపోతున్నారు. ముఖ్యంగా గతేడాది సెప్టెంబర్‌లో సంభవించిన బుడమేరు వరద రైతుల కంట కన్నీరు మిగిల్చింది. రైతులు ఆరుగాలం శ్రమించి ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట వరద ధాటికి పూర్తిగా కొట్టుకుపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ఒక్క గింజ చేతికి వచ్చిన పాపాన పోలేదు. ఇలపర్రు, కుదరవల్లి, రామాపురం రెవెన్యూ పరిధుల్లో దాదాపుగా 700ఎకరాలకు పైగా అనాధీన భూమి సాగవుతోంది. భూముల్లో వేసిన పంట పూర్తిగా నాశనం కావడంతో రైతులు నట్టేట మునిగారు. -
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ఆత్కూరు(గన్నవరం): పరీక్షలలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉంగుటూరు మండలం ఆత్కూరులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన మొగల్ వహీదాబి(19) పాలిటెక్నిక్ డిప్లొమా చదివింది. అయితే సోమవారం విడుదలైన డిప్లొమా పరీక్ష ఫలితాల్లో వహీదాబి నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన ఆమె తమ్ముడు ఉరి బిగించుకుని వేలాడుతున్న వహీదాబిని బంధువుల సాయంతో కిందకు దించి గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. వహీదాబి తండ్రి ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి, సోదరుడితో కలిసి ఉంటుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతికంచికచర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం పట్టణంలో జరిగింది. ఎస్ఐ బి. రాజు కథనం మేరకు కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన షేక్ సమీర్ పాషా(20) విజయవాడ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్ష రాసి బైక్‌పై ఇంటికి వస్తున్నాడు. కంచికచర్ల శ్రీ శివసాయి క్షేత్రం సమీపంలోకి రాగానే నేషనల్ హైవేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చి బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో సమీర్పాష రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సమీర్పాష తండ్రి జమాలి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అతని అక్కకు మూడేళ్ల క్రితం వివాహమైంది.ఇసుక లారీలు సీజ్తిరువూరు: రాష్ట్రం నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను ఆ రాష్ట్ర పోలీసులు పెనుబల్లి మండలం మర్లకుంట వద్ద మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సరిహద్దు గ్రామాల్లో నిఘా పెట్టి తిరువూరు నుంచి పెనుబల్లి, వేంసూరు, కల్లూరు మండలాలకు ఇసుక తరలకుండా కట్టడి చేశారు. తిరువూరు శివారు తోకపల్లి మీదుగా మర్లకుంట తదితర గ్రామాలకు నిత్యం ఇసుక లారీలు వెళుతున్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో రెండు టిప్పర్లను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు పోలీసులు సైతం మరో టిప్పరును ఇసుక తరలిస్తుండగా మల్లేల రోడ్డులో పట్టుకున్నారు.భారీగా గంజాయి పట్టివేతకృష్ణలంక(విజయవాడతూర్పు): గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యాన్‌లో తరలిస్తున్న గంజాయిని కృష్ణలంక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం టాటా వ్యాన్‌లో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఒక టాటా వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా అందులో పెద్ద మొత్తంలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. సీజ్ చేసిన గంజాయి దాదాపు 100 కేజీల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆయిల్ పామ్ తోటల్లో ఎలుకల నివారణపై అవగాహన
ఘంటసాల: ఆయిల్ పామ్ పంటల్లో ఎలుకల ఉద్ధృతి తగ్గించుకోవడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెప్పే సూచనలు, సలహాలు రైతులు పాటించాలని కృష్ణాజిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి అన్నారు. జిల్లా ఉద్యాన శాఖ, ఉండవల్లి ఆగ్రోస్ ఎల్.ఎల్.పి. ఆధ్వర్యంలో ఘంటసాల కేవీకే సమన్వయంతో ఆయిల్ పామ్ తోటల్లో ఎలుకల నివారణపై రైతులకు అవగాహన సదస్సు ఘంటసాల సత్యసాయి మినీ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే సమన్వయకర్త డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఆయిల్ పామ్‌తో పాటు అన్ని పంటల్లో ఎలుకల నివారణకు రైతులంతా సామూహికంగా చేపట్టాలన్నారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి.మంజువాణి మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటల్లో పోషక, నీటి యాజాన్యం, మాగాణుల్లో వేసుకున్న పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా ఘంటసాల, చల్లపల్లి, మొవ్వ, పామర్రు, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఉండవల్లి ఆగ్రోస్ ఎల్.ఎల్.పి., ఎఫ్3 సంస్థలతో ఆయిల్ పామ్ పండించే రైతులకు నూరు శాతం రాయితీపై మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎకరానికి 57 మొక్కలు, హెక్టారుకు 143 మొక్కలు చొప్పున ఇస్తున్నామని, వాటిని నాటే సమయంలో మొక్కల మద్య 9 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉండవల్లి ఆగ్రోస్ డీజీఏం బి.హరికృష్ణ, 3ఎఫ్ ఆయిల్ పామ్ సీనియర్ మేనేజర్ యు.విక్రమ్‌రాజు, పామర్రు ఉద్యాన శాఖ అధికారి జె.కీర్తిదేవ్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రేవతి తదితరులు పాల్గొన్నారు. -
షరా‘మామూలే’!
పెనమలూరు: యనమలకుదురు ఇసుక క్వారీలో మామూళ్ల వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. టీడీపీ నేతలు హుకుంతో రెవెన్యూ అధికారులు క్వారీ గేటుకు తాళం వేశారు. వివరాల్లోకి వెళితే.. యనమలకుదురు ఇసుక క్వారీని 15ఏళ్ల క్రితం రివర్ కన్జర్వేటర్ ఆదేశాలతో నదిలో ఇసుక తవ్వకాలు నిషేధించారు. అప్పటి నుంచి ఇసుక క్వారీలో తవ్వకాలు జరగటం లేదు. మధ్యలో కొందరు ఇసుక మాఫియా తవ్వకాలు చేయటంతో గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాపై పోలీసులు సస్పెక్ట్ షీట్లు తెరిచింది. కూటమి పాలనలో మళ్లీ మొదలు.. కాగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నిషేధ ఇసుక క్వారీలో అక్రమం తవ్వకాలు మొదలుపెట్టారు. చట్టాన్ని, నిబంధనలు గాలికి వదిలేశారు. అధికారులు ఇదంతా చూస్తూనే ఉన్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. నిషేధ ఇసుక క్వారీ పరిస్థితి ప్రమాదంగా మారింది. తవ్వకాలతో నదిలో భారీ గుంతలు ఏర్పడి నదీ పరీవాహక ప్రాంతం ప్రమాదకరంగా మారింది. గొడవేంటంటే.. ఇసుక ట్రాక్టర్‌కు రూ. 500 మామూలు ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేయటంతో సోమవారం రాత్రి క్వారీ వద్ద గొడవ తలెత్తింది. దీనికి ట్రాక్టర్లలో ఇసుక తరలించేవారు అభ్యంతరం తెలిపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితుల ఏర్పడ్డాయి. పోలీసులు, సొసైటీ, రెవెన్యూ సిబ్బందికి ఇప్పటికే మామూళ్లు ఇస్తున్నామని, ఇప్పుడు టీడీపీ నేతలకు కూడా మామూళ్లు ఇస్తే తమకు ఏమి మిగులుతుందని ట్రాక్టర్ యజమానులు అడ్డం తిరిగారు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి ఇసుక క్వారీ గేటుకు పోలీసుల అండదండలతో రెవెన్యూ అధికారుల చేత మంగళవారం తాళం వేయించారు. అధికారులు కళ్ల ఎదుటే నిషేధ ఇసుక క్వారీలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా.. మామూళ్ల విషయంలో గొడవ జరుగుతున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా.. కేవలం టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు క్వారీకి తాళాలు వేయడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అంతేకాక ఈ మామూళ్ల వ్యవహారం తెరపైకి రావటంతో ఈ దందాలో ఎవరెవరి పాత్ర ఉందనేది స్పష్టమయింది. చట్టం తనపని తాను చేసుకు పోతుందని కూటమి నేతలు తరచూ ఊకదంపుడు ప్రకటనలు చేస్తుంటే మరి యనమలకుదురులో చట్టం ఏమయిందో ఆ నేతలే చెప్పాల్సి ఉంది. వాటా ఇవ్వడం లేదన్న నెపంతో టీడీపీ నేతల రాద్ధాంతం యనమలకుదురు క్వారీ గేటుకు తాళం -
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025 పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం కొనసాగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 155 మంది, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 142మంది, ఆంధ్రా లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 196 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 493 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. నేటి షెడ్యూల్ ఇలా.. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో బుధవారం నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నామని విజయసారథి చెప్పారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి పాలిసెట్–2025 పరీక్షలో 1 నుంచి 40 వేల లోపు ర్యాంకు పొందిన ఎన్సీసీ అభ్యర్థులు, 1 నుంచి చివరి ర్యాంకు పొందిన విభిన్న ప్రతిభావంతుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు. ● మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 68,001 నుంచి 77 వేల ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 77,001 నుంచి 86 వేల లోపు ర్యాంకు పొందిన జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు. -
‘పట్టా’భిషేకానికి వేళాయె
ఏర్పాట్ల పరిశీలన.. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న గవర్నర్ పర్యటన ఏర్పాట్లను ఎస్పీ ఆర్. గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, వర్సిటీ వీసీ రాంజీలతో కలిసి కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. వంటశాల ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి వర్షం పడే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లను చేయాలన్నారు. విశ్వవిద్యాలయంలోని వంటశాలను ప్రారంభించిన అనంతరం బ్యాటరీ కారులో వైఎస్సార్ పరిపాలనా భవనానికి చేరుకుని అక్కడ పోలీస్ గౌరవవందనం స్వీకరించాక వైఎస్ చాన్స్‌లర్ చాంబర్లో కార్యనిర్వాహక మండలి సభ్యులతో సమావేశమవుతారన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు ఆడిటోరియానికి చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, ఏఎస్పీలు, ఆర్డీఓ పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం 6, 7, 8 స్నాతకోత్సవాలు బుధవారం నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్ కూన రాంజీ తెలిపారు. విశ్వవిద్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని మధ్యాహ్నం 3 గంటలకు విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సమావేశం జరుగుతుందన్నారు. ముందుగా నూతనంగా నిర్మించిన వంటశాలను ప్రారంభిస్తారని తెలిపారు. గవర్నర్ నజీర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర హాజరవుతారన్నారు. 6వ స్నాతకోత్సవానికి సంబంధించి ఎన్ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ మండవ ప్రభాకరరావు, 7వ స్నాతకోత్సవానికి సంబంధించి అమెరికాలోని అలభామ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంఎన్వీ రవికుమార్, 8వ స్నాతకోత్సవానికి సంబంధించి గ్రీన్ కో గ్రూపు సీఈవో చలమలశెట్టి అనిల్‌కుమార్‌కు గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నట్లు రాంజీ తెలిపారు. పలువురికి గోల్డ్‌మెడల్స్, పట్టాలు.. ఈ స్నాతకోత్సవాలలో 17 మంది విద్యార్థులకు 21 గోల్డ్‌మెడల్స్, 63మందికి పీహెచ్డీ పట్టాలతో పాటు ఇరువురు ఎంఫిల్ పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేస్తామని వీసీ తెలిపారు. వీరితో పాటు పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తి చేసిన 300 మంది విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఉష, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బ్రహ్మచారి పాల్గొన్నారు. నేడు కృష్ణా యూనివర్సిటీ 6, 7, 8 స్నాతకోత్సవాలు పాల్గొననున్న చాన్స్‌లర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరాలు వెల్లడించిన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రాంజీ -
రోగం తిరగబెట్టింది!
విజయవాడ జీజీహెచ్‌లో స్ట్రెచర్లు, వీల్ చైర్లూ లేక రోగుల అవస్థలుపేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది విజయవాడ జీజీహెచ్ పరిస్థితి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించడంతో అత్యుత్తమ సేవలు అందించింది. రాష్ట్రానికే పెద్దన్న పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వాస్పత్రికి రోగం తిరగబెట్టింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సమస్యల జబ్బు తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా రోగంతో వచ్చే ప్రజలకు కనీస వసతులు ఆస్పత్రిలో కరువైపోయాయి. స్ట్రెచర్లు ఉండవు.. కనీసం వీల్ చైర్లు కనపడవు.. దీంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, వివిధ రకాల ఆపరేషన్లు అయి నడవలేని పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చే వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది.మరోవైపు ఆస్పత్రిలో మందుల కొరత సరేసరి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెద్దాస్పత్రిలో కనీస వసతులు కల్పించి పుణ్యం కట్టుకోవాలని పలువురు రోగులు విన్నవిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ స్క్రాప్‌గా మారిన స్ట్రెచర్లు, వీల్ చైర్లు -
వెసులుబాటు కల్పించండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): వార్డు సచివాలయ ఉద్యోగులను ఒక వార్డు నుంచి మరో వార్డుకు బదిలీ చేయవచ్చని ప్రభుత్వం జీఓ జారీ (జీఓ ఎంఎస్ నంబర్ 6) చేయడం పట్ల ఏపీ గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య హర్షం వ్యక్తం చేశారు. అదే మాదిరిగా గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా సొంత మండలాల్లో విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర కమిటీ సభ్యుడు బగ్గా జగదీష్‌తో కలిసి మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు. హేతుబద్దీకరణ ప్రక్రియ వల్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని, మిగులు ఉద్యోగుల భవితవ్యంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాము విన్నవించిన అంశాలపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి సానుకూలంగా స్పందిస్తూ సొంత మండలాల్లో పని చేసే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని అర్లయ్య పేర్కొన్నారు.నైపుణ్యాభివృద్ధితో ఆర్థిక వృద్ధి సాధ్యందిశ కమిటీ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ప్రణాళికాబద్ధ ఆర్థిక పురోగతికి ముఖ్యంగా యువతలో నైపుణ్యాభివృద్ధి కీలకమని.. ప్రతి మండలంలో స్థానిక పారిశ్రామిక అవసరాలు, అభివృద్ధికి దోహదం చేసే వనరులను దృష్టిలో ఉంచుకొని నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జగ్గయ్యపేట, తిరువూరు ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, కొలికపూడి శ్రీనివాసరావు హాజరైన ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతి, భవిష్యత్తు కార్యాచరణ, సమస్యల గుర్తింపు, పరిష్కారానికి చర్యలపై చర్చించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పీ4 విధానం అమల్లో జిల్లాను ముందు నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాలను చేరుకునేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, సీపీవో వై.శ్రీలత, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీఈవో డీఎంఎఫ్ విజయకుమారి, డ్వామా పీడీ ఎ.రాము, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, హౌసింగ్ పీడీ పి.రజనీకుమారి, డీఈవో యూవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను కలిసిన డీఐపీఆర్ఓ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్ ): సమాచార పౌర సంబంధాల శాఖ ఎన్టీఆర్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె.వి.రమణారావు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ జి.లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న రమణారావును ఎన్టీఆర్ జిల్లాకు బదిలీ చేస్తూ సమాచార డైరెక్టర్ ఉత్వర్తులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న యు.సురేంద్రనాథ్ నుంచి రమణరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైన సమాచార పౌరసంబంధాల శాఖలో డీఐపీఆర్‌ఓగా సమర్థంగా పని చేసి ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల మధ్య సమన్వయం చేస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రమణరావుకు జిల్లా లక్ష్మీశ సూచించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డీఐపీఆర్ఓ వెంట డీపీఆర్ఓ ఎస్.వి.మోహన్ రావు, డివిజనల్ పీఆర్ఓ కె.రవి, ఏవీఎస్ వి.వి.ప్రసాద్ తదితరులు ఉన్నారు.సమస్యలు పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగుల వినతిచిలకలపూడి(మచిలీపట్నం): తమ సమస్యలను పరిష్కరించాలని, రేషన్లైజేషన్, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు జి.గోపీచంద్ కోరారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీకి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపీ చంద్ మాట్లాడుతూ.. వార్డు సచివాలయాలకు వార్డు టు వార్డు బదిలీలకు అవకాశం కల్పించాలన్నారు. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, సీనియార్టీ, మెరిట్ ప్రాతిపదికన బదిలీలు నిర్వహించాలని కోరారు. రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులు ఉద్యోగులను ఏ డిపార్టుమెంట్లోకి తీసుకుంటారో ఇంత వరకు సమాచారం లేదని, జాబ్‌చార్ట్, డిపార్ట్మెంట్ పరిధి తెలియజేసి రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమ్యలన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి కృష్ణాజిల్లా అధ్యక్షుడు ఎం.వి.శ్యామ్‌నాథ్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.కొండలమ్మకు రూ.31.81 లక్షల ఆదాయంగుడ్లవల్లేరు: మండలంలోని వేమవరంలో వేంచిసిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలోని హుండీ కానుకులను మంగళవారం లెక్కించారు. హుండీ కానుకల ద్వారా రూ.31,81,084 ఆదాయం సమకూరింది. మచిలీపట్నం శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సత్యప్రసాద్ బాబు పరివేక్షణలో దేవదాయ సిబ్బంది హుండీలను తెరిచి కానుకలను లెక్కించారు. 51 రోజులకు ఈ ఆదాయం సమకూరింది. కానుకల లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.కోటిలింగాలను దర్శించుకున్న హంపీ పీఠాధిపతిముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామంలోని కోటిలింగ హరిహర మహా క్షేత్రంలోని అమృతలింగేశ్వర స్వామిని జగద్గురు ఆదిశంకరాచార్య హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ హరిదుర్గానాగేశ్వరరావు పూర్ణకుంభంతో స్వామీజీకి స్వాగతం పలికారు. అనంతరం అమృతలింగేశ్వర స్వామికి పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటిలింగాల సమీపంలోని హంపీ పీఠం మొదటి వార్షికోత్సవంలో భాగంగా వచ్చామన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో విశ్రాంత ఈఓ దూళిపాళ్ల సుబ్రహ్మణ్యం, అర్చ కులు తేజ, హర్ష, సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట
ఏపీఎస్ఈబీ ఇంజినీర్స్ అసోసియేషన్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీసీపీడీసీఎల్, ఏపీ ట్రాన్స్‌కో ఇంజినీర్లు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఏపీఎస్ఈబీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రామారావు, ప్రధాన కార్యదర్శి నాగప్రసాద్ పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చామని గుర్తుచేశారు. విజయవాడలో ఏపీఎస్ఈబీ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశం మంగళవారం జరిగింది. సమ్మె నోటీసు, 1999 నుంచి 2004 మధ్య నియమితులైన వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి జీపీఎఫ్ ఇవ్వాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఏఈఈల నియామకం తక్షణం చేపట్టాలని, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఎర్న్డ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో అసోసియేషన్ అసోసి యట్ ప్రెసిడెంట్ రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేయడం లేదని ఇంజినీర్లపై అధిక పనిభారం మోపుతోందని పేర్కొన్నారు. ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని, ట్రైపార్టీ అగ్రిమెంట్‌ను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఇంజినీర్లకు పీఆర్సీ 2022లో తీరని అన్యాయం జరిగిందని గుర్తుచేశారు. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె బాట పట్టడం తప్ప మరో మార్గంలేదని తేల్చిచెప్పారు. అనంతరం అసోసియేషన్‌కు విశిష్ట సేవలందించి ఇటీవల పదవీ విరమణ చేసిన బి.వి.నాగేశ్వర రావును సత్కరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు వంశీ, ఇర్ఫాన్, కృష్ణప్రసాద్, కంపెనీ నాయకులు రాజేష్ ఖన్నా, నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఎం.వి.వి.రామకృష్ణ, బి.రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతుల గోడు పట్టని కూటమి ప్రభుత్వం
పెనుగంచిప్రోలు: కూటమి ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. మునేరు వరదల సమయంలో తువ్వకాలువకు పడిన గండ్లను నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ముందుగా స్థానిక చెరువుకట్ట వద్ద నుంచి భారీ ర్యాలీగా కాలువ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. తువ్వకాలువకు పడిన గండ్లను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో మునేరుకు భారీగా వరదలు వచ్చి తువ్వకాలువకు 50 చోట్ల గండ్లు పడగా, వాటిని పూడ్చడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. గండ్లు పూడ్చటానికి అంచనాలు రూపొందించామని అధికారులు, నాయకులు చెబుతున్నా నేటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదన్నారు. వరదల కారణంగా ఖరీఫ్‌తోపాటు రబీ పంటలను కూడా రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. గండ్లను పూడ్చకుంటే ప్రస్తుత ఖరీఫ్‌లో పంటల సాగు సాధ్యం కాదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వరదలకు తువ్వకాలువకు గండ్లు పడితే వెంటనే పూడ్చి రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు. రైతుల తరఫున వైఎస్సార్ సీపీ ఇప్పటికే పలుమార్లు ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదన్నారు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్(చిన్నా), బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, పార్టీనాయకులు కొత్తపల్లి పెంటయ్య, పొన్నం కోటేశ్వరరావు, బూడిద నరసింహారావు, నర్రమనేని వెంకటేష్, దేరంగుల శ్రీనివాసరావు, కీసర లోకేశ్వరరావు, మెండెం రామారావు, కనగాల రమేష్, నంబూరి రవి, కనకపూడి భాస్కరరావు, చేని రాంబాబు, సర్పంచ్ బి.జ్యోతిబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. తువ్వకాలువ గండ్లను వెంటనే పూడ్చాలి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
తక్షణమే స్పందిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించగలం
తాడేపల్లి రూరల్: అనుకోని విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట్ దీపక్ అన్నారు. తాడేపల్లి పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి సంసిద్ధత’పై ఎయిమ్స్ వైద్యులు, ఆంధ్ర, తెలంగాణ, పుదుచ్చేరి, చత్తీస్‌గడ్‌కు చెందిన 30 మంది వైద్యులకు మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ దీపక్ మాట్లా డుతూ.. విపత్తుల ముందు, ఆ తరువాత అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు, డాక్టర్లు విపత్తుల ప్రమాద తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మంగళగిరి ఎయిమ్స్‌లోని నిర్మాణాత్మక పరికరాలు, అనుభవం కలిగిన డాక్టర్లు, మెడిసిన్, టెస్టింగ్ పరికరాలు, బ్లడ్‌బ్యాంక్ వంటి ఇతర వివరాలను అందజేయాలని సూచించారు. సమావే శంలో ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడీ డాక్టర్ రామమోహన్, డాక్టర్ రమ్యజ్యోతి, విపత్తుల సంస్థ అధికారులు ఆర్ఎస్ఐ మధుబాబు, జీఐఎస్ ఎక్స్పర్ట్ హరీష్, ప్రాజెక్ట్ మేనేజర్లు బస్వంత్, కిషోర్, సతీష్, పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. -
వీఎంసీ కౌన్సిల్లో టీడీపీ దాష్టీకం
ప్రధానాంశాలు ఇవీ.. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాభివృద్ధిపై చర్చించేందుకు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. అరుపులు, కేకలు, బెదిరింపులతో అలజడి సృష్టించారు. దీంతో సభలో సుమారు గంటపాటు గందరగోళ వాతావరణం నెలకొంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం జరిగింది. 156 అంశాలను అజెండాలో పొందుపరచగా మూడు అంశాలను కౌన్సిల్ తిరస్కరించింది. మరో రెండు అంశాలను ఆఫీస్ రిమార్కులకు పంపింది. మొత్తం 149 అంశాలను ఆమోదిస్తూ తీర్మానం చేసి, ఒక అంశాన్ని ధ్రువపరచగా మరో అంశాన్ని రికార్డు చేసింది. రాద్ధాంతం చేసిన టీడీపీ కార్పొరేటర్లు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో ఉన్న జవహర్ ఆటోనగర్ మ్యూచువల్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ స్టోర్స్ (జమాక్) గృహ సముదాయానికి నగర పాలక సంస్థ నుంచి తాగునీరు సరఫరా చేయాలని వచ్చిన ప్రతిపాదనపై చర్చిస్తుండగా టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేశారు. ఐలా కూడా స్థానిక సంస్థేనని, ఆ సంస్థ సమస్యలను వారే పరిష్కరించుకోవాలని వైఎస్సార్ సీపీ సభ్యులు సూచించారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ పాలనలో సైతం వీఎంసీ నీటిని ఇవ్వలేదని గుర్తుచేశారు. ఐలా నుంచి బకాయిలు రావాలని సభ్యులు చర్చిస్తుండగా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఓ క్రమంలో మేయర్ పోడియం వద్దకు వచ్చి మరీ కౌన్సిల్‌కు వ్యతిరేకంగా పార్టీల ప్రస్తావన తీసుకొచ్చారు. సెక్షన్ 89 ప్రకారం మేయర్ ఆదేశాలను ధిక్కరించినందుకు, సభను సజావుగా నిర్వహించేందుకు టీడీపీ సభ్యులు ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణిని సస్పెండ్ చేస్తునట్లు మేయర్ భాగ్యలక్ష్మి ప్రకటించారు. వారిని సభ నుంచి వెళ్లాలని సూచించారు. వారు వెళ్లకపోవడంతో మార్షల్స్‌ను పిలిపించారు. అయితే మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు బెదిరింపులకు దిగారు. ఉద్యోగాలు ఊడతాయని, తమ ప్రభుత్వంలో విధులు ఎలా నిర్వర్తిస్తారో చూస్తామని బెదిరించారు. జమాక్ గృహ సముదాయానికి వీఎంసీ తాగునీరు సరఫరా చేయాలన్న అంశాన్ని తిరస్కరిస్తూ కౌన్సిల్ తీర్మానించింది. అరుపులు.. కేకలు.. బెదిరింపులతో గందరగోళం సృష్టించిన టీడీపీ కార్పొరేటర్లు ఏపీఐఐసీ కాలనీలోని జమాక్ గృహ సముదాయానికి తాగునీటి సరఫరాపై వివాదం ఐలా పరిధిలోని అంశాన్ని ఆ లోకల్ బాడీనే పరిష్కరించుకోవాలని కౌన్సిల్ సూచన కౌన్సిల్‌కు ఆటంకం కలిగించిన చెన్నుపాటి ఉషారాణి, ముమ్మినేని ప్రసాద్ సస్పెన్షన్ వారిని బయటకు తీసుకెళ్లేందుకు వచ్చిన మార్షల్స్‌పై బెదిరింపులకు దిగిన టీడీపీ కార్పొరేటర్లు జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన గృహ సముదాయాల్లో 2,053 గృహాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని, లబ్ధిదారులకు పంపిణీ చేయలేదని ప్రశ్నోత్తరాల్లో సభ్యులు ప్రస్తావించారు. దీనిపై అధికారులు సమాధానమిస్తూ.. ఇప్పటి వరకు 803 మంది లబ్ధిదారులను గుర్తించామని, కొంతమంది లబ్ధిదారులకు పేర్లు, అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు సక్రమంగా లేకపోవడంతో అర్హుల జాబితాలో సీనియారిటీలో ఉన్న వారికి కేటాయింపులు చేస్తామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై ఏ చర్యలు తీసుకుంటారని సభ్యులు ప్రశ్నించారు. దీనిపై డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) రూపొందించి రెండు–మూడు రోజుల్లో కన్సల్టెన్సీకి అప్పగించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మని అధికారులు బదులిచ్చారు. వీఎంసీలో అధికారుల కొరత వేధిస్తోందని, సీఎంఓహెచ్, ఎస్టేట్స్ అధికారి, కింది స్థాయిలో ఇంజినీరింగ్ విభాగంలో ఏఈలు, ఇతర అధికారులు లేకపోవడంతో అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు సక్రమంగా చేరడం లేదని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మరింతగా గ్రీనరీ అభివృద్ధి చేయాలని, సెంట్రల్ డివైడర్లు, పార్కులు, కామన్ సైట్లలో గ్రీనరీ పెంపొందించాలని వచ్చిన అంశం ఆమోదం పొందింది. ఇటీవల వీఎంసీ కార్పొరేటర్లు దక్షిణ భారత విజ్ఞాన యాత్రలో భాగంగా కేరళలో పర్యటించారు. అక్కడి మాదిరిగా నగరంలోనూ మల్టీస్టోర్డ్ పార్కింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించొచ్చని డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజరెడ్డి చేసిన ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో మల్టీ స్టోర్డ్ కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానం చేశారు. -
భూ సేకరణ పడక..
గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణే అడ్డంకి గడ్డమణుగు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 173/3లో ఇద్దరు రైతుల నుంచి 48 సెంట్ల భూమిని హైవే కోసం తీసుకున్నారు. ఆ రైతులు అందుబాటులో లేరు. ఈ భూమిని నేను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. నష్ట పరిహారం కోసం అవసరమైన పత్రాలన్నీ నేనే అధికారులకు ఇచ్చాను. అయినప్పటికీ పరిహారం ఇవ్వకుండా నేను సాగు చేస్తున్న పత్తి, మునగ పైర్లును అన్యాయంగా దున్నేశారు. నాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. – అజ్మీరా హేమానాయక్, రైతు, గడ్డమణుగు, జి.కొండూరు మండలం సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ – ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే ప్యాకేజీ–3 పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణే ఈ పనులకు ప్రధాన అడ్డంకిగా మారింది. బాధిత రైతులకు పరిహారంగా ఇచ్చేందుకు నిధులు మంజూరైనా పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. భూ సేకరణ జాప్యం కావడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించి పరుగులు పెట్టించారు. అప్పట్లో జాయింట్ కలెక్టర్ సంబంధిత గ్రామాల రైతులతో చర్చించి భూ సేకరణను తుది దశకు తెచ్చారు. కూటమి అధికారంలో వచ్చాక భూసేకరణ పనులు అటకెక్కాయి. దాదాపు ఏడాదిన్నరగా భూసేకరణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. దీంతో రహదారి పనులు ప్రారంభించ డంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటికీ పలు చోట్ల భూసేకరణ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. 14 గ్రామాల్లో 351 ఎకరాలు విజయవాడ – నాగపూర్ ఎకనామిక్ కారిడార్‌లో అంతర్భాగంగా విజయవాడ – ఖమ్మం మధ్య ప్యాకేజీ–3కి సంబంధించి 29.70 కిలో మీటర్ల మేర రహదారి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రహదారి కోసం ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం, జి.కొండూరు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలోని 14 గ్రామాల్లో 351 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 136 ఎకరాల భూమి సేకరించారు. ఇంకా 215 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రధానంగా రహదారి వెంబడి 22.5 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. 3డీ నోటిఫికేషన్ స్థాయిలో మరో 30 ఎకరాలు ఉంది. ఈ భూములకు సంబంధించిన సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. దీనికితోడు భూసేకరణలో భూమికి సంబంధించి మార్కెట్ విలువల్లో వ్యత్యాసాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఏడాదిన్నర క్రితమే రూ.220 కోట్ల మేర అవార్డులు పాసైనా ఇప్పటి వరకు కేవలం రూ.65 కోట్లు మాత్రమే భూములు కోల్పోతున్న రైతులకు పంపిణీ చేశారు. డాక్యుమెంట్లు సమర్పించలేదని, ఇతర చిన్న చిన్న కారణాలతో పరిహారం పంపిణీ నిలిచిపోయింది. క్షేత్ర స్థాయిలో కొంత మంది రెవెన్యూ అధికారులు డబ్బులకు ఆశపడి, భూములు కోల్పోతున్న రైతులను పరిహారం పంపిణీ విషయంలో ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద భూసేకరణకు నిధుల సమస్య లేకున్నా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే జాతీయ రహదారి పనుల ప్రారంభంలో జాప్యానికి కారణమని స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఈ భూసేకరణ పనులపైన దృష్టి సారించకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అన్యాయంగా పైరు దున్నేశారు ఎన్టీఆర్ జిల్లాలో ప్యాకేజీ–3 కింద 29.70 కి.మీ. మేర జాతీయ రహదారి ఏడాదిన్నర క్రితమే రూ.230 కోట్ల అవార్డు పాసైనా బాధిత రైతులకుపంపిణీ చేసింది రూ.65 కోట్లే నత్త నడకన సాగుతున్న భూ సేకరణ పనులు కొలిక్కి రాని అసైన్డ్ భూముల వ్యవహారం గ్రీన్ ఫీల్డ్ హైవే ఇలా.. పరిహారం ఇవ్వకుండానే రహదారి పనులు మా అత్తగారు చొక్కం వెంకట్రావమ్మ పేరుతో సర్వే నంబరు 12–3లో గల 1.90 ఎకరాల్లో 60 సెంట్లు భూమిని గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తీసుకున్నారు. అయితే ఈ భూమి రికార్డుల్లో చాకలి ఇనామ్‌గా నమోదైందని పరిహారం ఇవ్వడం లేదు. 40 సంవత్సరాలుగా ఈ భూమిని మేము సాగు చేసుకుంటున్నాం. ఈ భూమికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాసుపుస్తకాలు కూడా ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి పరిహారం అందించాలి. – కొండపల్లి సత్యనారాయణ, చెర్వుమాధవరం, జి.కొండూరు మండలం విజయవాడ – నాగపూర్ ఎకనామిక్ కారిడార్ (జాతీయ రహదారి) పనులను పనులను గత నెల ఏడో తేదీన ప్రారభించారు. 80 శాతం భూమి అప్పగిస్తేగానీ పనులు ప్రారంభం కావు. భూసేకరణలో జరుగుతున్న జాప్యంతో 60 శాతం భూమిని మాత్రమే అధికారులు అప్పగించారు. దీంతో జి.కొండూరు మండలంలో కాంట్రాక్టు సంస్థ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం కంపచెట్లు తొలగింపు, భూమి చదును చేయడం వంటి పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.745.83 కోట్లు. మెగా కాంట్రాక్టు సంస్థ ఈ పనులకు మే 23, 2023లో అగ్రిమెంట్ చేసుకొంది. ఈ పనులను ప్రారంభించిన రెండేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంది. 29.707 కిలోమీటర్ల రహదారిలో 1.345 కిలోమీటర్ల స్లిప్ రహదారి ఉంది. మేజర్ బ్రిడ్జి ఒకటి, మైనర్ బ్రిడ్జిలు 19, వీయూపీఎస్లు ఆరు, ఎల్వీయూపీఎస్లు ఐదు నిర్మించాల్సి ఉంది. -
అమరావతిలో మరోసారి భారీ ఎత్తున భూ సమీకరణ.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్
సాక్షి,విజయవాడ: అమరావతి కోసం కూటమి ప్రభుత్వ మళ్ళీ భూ సమీకరణ చేపట్టేందుకు సిద్ధమైంది. భూ సమీకరణ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే అమరావతి కోసం 54 వేల ఎకరాల భూముల సేకరణ చేపట్టిన కూటమి ప్రభుత్వం.. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున భూ సమీకరణకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
కర్కశపు తండ్రి కటకటాల పాలు
మైలవరం: మైలవరంలో ఇటీవల ఇద్దరు చిన్నారులను తండ్రే హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి కనబడకుండా పోయిన నిందితుడు రవిశంకర్ కటకటాల పాలయ్యాడు. మైలవరం పోలీస్ స్టేషన్లో సోమవారం సీఐ చంద్రశేఖర్ విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న మైలవరంలోని మారుతీనగర్‌లో ఓ రేకుల షెడ్డు నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు తమకు సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి తలుపులు తెరచి చూడగా ఇద్దరు చిన్నారులు వేములమడ హిరణ్య(12), వేములమడ సాయి(9) విగత జీవులుగా మంచంపై పడి ఉన్నారు. వారి తండ్రి వేములమడ రవిశంకర్ చిన్నారులను హత్య చేశాడు. భార్యపై అనుమానం, పిల్లలు తనకు పుట్టలేదన్న అపోహతో ఈ హత్యలకు పాల్పడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానంతో అరెస్ట్.. నిందితుడు రవిశంకర్, అతని భార్య చంద్రిక గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. చంద్రిక ఉపాధి కోసం విదేశాలకు వెళ్లింది. దంపతుల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. నిందితుడు రవిశంకర్‌కు భార్యపై అనుమానం ఉండటంతో ఆ పిల్లలు తనకు పుట్టారా అని పలుమార్లు భార్యను ప్రశ్నించడం, అనుమానంగా చూడటం చేస్తుండేవాడని తమ విచారణలో తేలింది. ముందుగా చిన్నారి సాయిని ఓ చీరతో ఒక గదిలో ఉరివేసి చంపాడు, తరువాత హిరణ్యను మరో గదిలో దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఇద్దరినీ ఒకే మంచంపై పడుకోబెట్టాడు. కేసు తప్పుదారి పట్టించేందుకు ఇబ్రహీంపట్నం ఫెర్రీలో సిమ్ కార్డు వదిలి వైజాగ్ పారిపోయాడు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. మంగళవారం నిందితుడిని కోర్టులో హజరు పర్చనున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. కారు – ఆటో ఢీ : నలుగురికి గాయాలు మక్కపేట(వత్సవాయి): కారు ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలైన ఘటన సోమవారం గ్రామ శివారులో జరిగింది. జగ్గయ్యపేట వైపు నుంచి వస్తున్న కారు వత్సవాయి వైపు నుంచి వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు కాళ్లు, చేతులు, తలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆటోల్లో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఇసుక, బుసక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
ఘంటసాల: మా లంక భూముల్లో ఇసుక, బుసుక అక్రమంగా తవ్వకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన ముదిరాజ్ ఫీల్డ్ లేబర్ కో–ఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఘంటసాల తహసీల్దార్ కార్యాలయంలో, స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధి కోడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామ రెవెన్యూ పరిధిలోని ఆర్ఎస్.నెం.176 ఏ1 నుంచి 176 ఏ80 వరకు, ఆర్ఎస్.నెం.1272లో వల్లభామాణిక్యమ్మ లంకభూమి కృష్ణానది గర్భాన ఉందన్నారు. సదరు లంక భూమిని ముదిరాజ్ కులానికి చెందిన 80 మంది నిరుపేద రైతులమైన తాము 1950 సంవత్సరానికి పూర్వం చల్లపల్లి జమిందార్ వారి నుంచి కొనుగోలు చేసి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. గతేడాది కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా లంక భూముల్లో కొంత భాగం మట్టిపొర ఏర్పడి ఇసుక, బుసక మేట వేసిందన్నారు. మా భూముల్లో మేట వేసిన ఇసుక, బుసకను బాపట్ల జిల్లా గాజుల్లంక ప్రాంతానికి చెందిన హరిదాసు అనే వ్యక్తి మాకు తెలియకుండా సుమారు 9 ఎకరాల వరకు దొంగతనంగా ఇసుక, బుసక తవ్వకాలు చేపట్టి దోచుకున్నారని ఆరోపించారు. హరిదాసుపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని విన్నవించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఎన్.ఉమామహేశ్వరరావు, ఎన్వీ రామరాజు, డి.బాబు ఉన్నారు. -
ముగిసిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీలు
మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కౌన్సెలింగ్‌కు జిల్లా అధికారులు ఆదివారం సన్నద్ధమయ్యారు. అప్పటికే ఉమ్మడి కృష్ణాలో 115 మంది 2008, 150 మంది 1998 డీఎస్సీలకు చెందిన ఎంటీఎస్ టీచర్ల బదిలీల నిమిత్తం సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. కౌన్సెలింగ్ కోసం డీఈఓ కార్యాలయానికి చేరుకున్న ఉమ్మడి జిల్లా ఎంటీఎస్ టీచర్లు ఖాళీలను పూర్తి స్థాయిలో ప్రదర్శించా లంటూ ఆందోళనకు దిగిన విషయం పాఠకులకు విదితమే. అనంతరం ఉమ్మడి కృష్ణాలోని 264 మందికి మొత్తం 644 పోస్టులు ఖాళీలు ప్రదర్శించడంతో టీచర్లు శాంతించారు. బదిలీల వెబ్ లింక్ సాయంత్రం వరకు రాకపోవడంతో ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యారు. పొద్దుపోయాక ప్రారంభమైన బదిలీల్లో తొలుత 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు ప్రాధాన్యమిచ్చారు. ఆదివారం అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ జరిగింది. నిబంధనల మేరకు ఈ నెల 20 నాటికి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా 22వ తేదీ నాటికి మొత్తం ఉమ్మడి కృష్ణాలోని 264 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీలు విద్యాశాఖ పూర్తి చేసింది. అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ టీచర్ల అసహనం -
సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం
చిలకలపూడి(మచిలీపట్నం): చట్ట పరిధిలో సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్‌శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారి సమస్యలను ఎస్పీ ప్రత్యక్షంగా తెలుసుకుని వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యల గురించి చింతించవద్దని, మీ సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తున్నామని వారికి ధైర్యం చెప్పారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఆ ఫిర్యాదులను బదిలీ చేసి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో 36 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. రక్షణ కల్పించాలని వినతి.. ● హనుమాన్జంక్షన్కు చెందిన హరి తన స్నేహితునికి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రూ.3 లక్షలు అప్పుగా ఇచ్చానని చెప్పాడు. అప్పు ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఇంత వరకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా అడిగినందుకు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి దాడులకు పాల్పడుతున్నారని వాపోయాడు. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఎస్పీకి కోరాడు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు -
ఆక్రమణకు గురైన అమ్మవారి భూములపై సమీక్ష
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ కేదారేశ్వరపేట పరిధిలోని లోటస్ ప్రాంతంలో ఆక్రమణకు గురైన శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి భూములకు సంబంధించి శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్ సమీక్ష జరిపారు. ఆక్రమణకు గురైన భూములలో వెలిసిన కట్టడాల క్రయ విక్రయాలను నిలుపుదల చేస్తూ 22ఏ 1సీ నిషేధిత జాబితాలో చేర్చడంపై రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, నగరపాలక సంస్థలతో సమన్వయం గురించి సోమవారం సాయంత్రం దేవాలయ లీజెస్, ల్యాండ్ విభాగం సిబ్బందితో సమీక్షించారు. సత్యనారాయణపురం పాత సర్వే నంబర్ 118, ఆర్ఎస్ నంబర్ 112లో సుమారు రూ.200 కోట్ల విలువైన ఈ భూమి సంరక్షణ నిమిత్తం దేవస్థానం నుంచి ఎటువంటి కాలయాపన లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓ తెలిపారు. అదే విధంగా మహామండపం దిగువ ప్రాంతంలో స్థలాభావ సమస్య పరిష్కారం కోసం ఆలయ ఇంజినీర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. నూతన అన్న ప్రసాదం భవన నిర్మాణం, లడ్డూ పోటు భవన నిర్మాణ ప్రాంతాల్లో ఇంకా స్థల సేకరణపై సాధ్యాసాధ్యాల గురించి చర్చించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కోటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
యోగా నిత్య జీవితంలో ఓ భాగం కావాలి
మచిలీపట్నంటౌన్: యోగా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో ఓ భాగం కావాలని కృష్నా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీ యోగసభ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్‌లోని ఉదయపు నడక మిత్రమండలి భవనంలో సోమవారం యోగా గురువు మద్దాల చింతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణ తరగతుల్లో కలెక్టర్ పాల్గొని సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, యోగాసనాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం మే నెల 21వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ముగిసిందన్నారు. యోగా కార్యక్రమం అధికారికంగా ముగిసినప్పటికీ యోగా సాధన మన నిత్యజీవితంలో ఓ భాగం చేసుకుని నిరంతరం కొనసాగించాలని సూచించారు. మచిలీపట్నం నగరంలో ఏపీ యోగాసభ ఆధ్వర్యంలో గాంధీనగర్లోనే కాకుండా చింతగుంటపాలెం, కాస్మోపాలిటన్ క్లబ్, గొడుగుపేట, శంకరమఠంలో కూడా ఉచితంగా యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. -
సౌత్ జోన్ హాకీ పోటీలకు పమిడిముక్కల విద్యార్థులు
పమిడిముక్కల: తుంకూర్(బెంగళూరు)లో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరగబోయే సౌత్ జోన్ హాకీ చాంపియన్‌షిప్ పోటీలకు పమిడిముక్కల హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్ఎం వై.దుర్గాభవాని తెలిపారు. బాలుర విభాగంలో కౌశిక్, రఘునాథ్, రోహిత్‌కుమార్, జిగ్నేష్, లోకేష్‌బాబు, బాలికల విభాగంలో విజయలక్ష్మి, హిమబిందు, ఆరాధ్య, లక్ష్మీప్రియ, శ్రీవల్లి, దేవిశ్రీ, సాయి మహాలక్ష్మి, సాయిశ్రీ ఎంపికై నట్లు తెలిపారు. హైస్కూల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎంపికై న విద్యార్థులను, పీడీ నారాయణను హెచ్ఎం, ఉపాధ్యాయులు, ఎన్ఎంసీ చైర్మన్ రావూరి సుకన్య అభినందించారు.కొనసాగిన పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలనమొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మూడో రోజైన సోమవారం కొనసాగింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 149, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్రంలో 133 మంది, ఆంధ్ర లయోలా డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 135 మంది సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం పూర్తైంది. మొత్తం 417 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను సోమవారం పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు.నేటి షెడ్యూల్మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 50001 నుంచి 56 వేల ర్యాంకు వరకు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 56001 నుంచి 62 వేల ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 62001 నుంచి 68 వేల ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి తెలిపారు.నాట్య రాత పరీక్షలు ప్రారంభంకూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో మూడు రోజుల పాటు సాగే కూచిపూడి నాట్య సర్టిఫికెట్, డిప్లమో రాత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు పరిశీలకులుగా హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డి. వెంకట సత్యనారాయణ, ఇన్విజిలేటర్లుగా పసుమర్తి హరినాఽథశాస్త్రి, ఏలేశ్వరపు శ్రీని వాసులు వ్యవహరిస్తున్నారు. తొలి రోజు పరీక్షలో 37 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారని ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెం డెంట్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ తెలిపారు.ముక్కపాడు ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీగన్నవరం: ఉంగుటూరు మండలం ముక్కపాడు ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం న్యూఢిల్లీ నుంచి వచ్చిన వైద్యుల బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. డాక్టర్ అనూప్, డాక్టర్ రిచామిశ్రా బృందం ఆరోగ్య కేంద్రం రికార్డులను పరిశీలించింది. కేంద్రం పరిధిలోని గర్భిణులు, చిన్నపిల్లలు, షుగర్, బీపీ వ్యాధిగ్రస్తుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకుంది. ఆరోగ్య కేంద్రంలో ఔషధాలు, వ్యాక్సినేషన్ స్టాక్ తదితర అంశాలపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సత్వర వైద్య సేవలందించాలని, చిన్నపిల్లలు, బాలింతలకు వ్యాక్సిన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఉంగుటూరు పీహెచ్సీ వైద్యాధికారి విజయ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయ వాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం (దుర్గగుడి)కి హుండీ కానుకల ద్వారా రూ.3,70,41,400 ఆదాయం లభించింది. ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహామండపం ఆరో అంతస్తులో సోమవారం హుండీ కానుకల లెక్కింపు చేర్చారు. 18 రోజులకు రూ.3,70,41,400 నగదు, 501 గ్రాముల బంగారం, 6,948 గ్రాముల వెండి లభించాయి. కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనానాయక్ పర్యవేక్షించగా అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రంగారావు, దేవదాయ శాఖ సిబ్బంది, వన్‌టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. చల్లపల్లి విద్యార్థికి జాతీయస్థాయి గుర్తింపు చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన విద్యార్థి వేముల హేమంత్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. చల్లపల్లికి చెందిన వ్యాపారి వేముల పాండురంగారావు, దీపిక దంపతుల కుమారుడు హేమంత్ విజయవాడలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) చదివి ప్రస్తుతం ఆర్టికల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2024 జూన్‌లో నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) పరీక్షల్లో కళాశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన హేమంత్ జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించాడు. న్యూఢిల్లీలో సోమవారం ఐసీఎంఏఐ ఆధ్వర్యంలో 12వ నేషనల్ స్టూడెంట్ కాన్వకేషన్–2025 జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఐసీఎంఏఐ అధ్యక్షుడు బిభూతి భూషణ్ నాయక్ చేతుల మీదుగా వేముల హేమంత్ ధ్రువపత్రాన్ని, పతకాన్ని అందుకున్నాడు. -
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి కోరారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీలందరూ పేద కుటుంబాలకు చెందిన వారని ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదైనందు వల్ల సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదన్నారు. అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదని అందుకోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేయాలన్నారు. అనంతరం డీఆర్వో కె.చంద్రశేఖరరావు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, సీహెచ్ జయరావుతో పాటు అంగన్వాడీల సంఘం నాయకులు ఎం.నిర్మలజ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025కూటమి ప్రభుత్వం తనలాంటి విద్యార్థులెందరినో మోసగించింది. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం కన్నా ఎక్కువే ఇస్తామని ప్రగల్బాలు పలికి నేడు తనతో పాటు అర్హత ఉన్న పలువురు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము జమ చేయడం లేదు. కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. – ప్రసాద్, బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి, పెనమలూరు●చిలకలపూడి(మచిలీపట్నం)/మచిలీపట్నంటౌన్: కూటమి చేస్తున్న మోసాలపై యువత, నిరుద్యోగులు కదం తొక్కారు. మోసం చేసినందుకు వారంతా పోరాటానికి సిద్ధమయ్యారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రశ్నించారు. ఏడాది పూర్తయినా హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగభృతి పేరుతో ఒక్కొక్కొరికి రూ. 36 వేలు బకాయిలు పడింది. 2025–26 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కూడా కేటాయించని సర్కారు ఏ విధంగా హామీలు అమలు చేస్తుందో తెలపాలని యువత ప్రశ్నించింది. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని యువత పోరులో నిలదీసింది. నిరుద్యోగులకు చేసిన మోసాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన యువత పోరులో నిరసన గళం విప్పింది. పార్టీ కృష్ణా యువజన విభాగం అధ్యక్షుడు మేరుగమాల శ్రీకాళేశ్వరరావు (కాళి) అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. జగన్ వెంటే నడుద్దాం రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు తిరుమాని శ్రీనివాసరావు మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు వేసి టీడీపీ నేతలు వారి అవసరాలు తీర్చుకున్నారే తప్ప ప్రజల ఇక్కట్లు తీర్చలేదన్నారు. హామీలు కచ్చితంగా అమలు చేసే పార్టీలో మనం ఉన్నామని ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా జగన్ వెంటే నడుద్దామన్నారు. క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు కారే మహంతి మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా వేల సంఖ్యలో హాజరుకావటం చూస్తుంటే ఆయనకు ఉన్న ఆదరణ ఏమిటో తెలుస్తోందన్నారు. వలంటీర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు పొలిమెట్ల వంశీకృష్ణారావు మాట్లాడుతూ చంద్రబాబు హామీలు నమ్మి బలైపోయామన్నారు. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ కాశిం మాట్లాడుతూ జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూర్ణ సాగర్, వైఎస్సార్ సీపీ సీనియర్ నేతలు పతివాడ రాఘవరావు (చిన్నారి), పాలేటి చంటి, ఎస్టీ సెల్ నేత వీరబ్రహ్మేంద్రనాయక్, కల్చరల్ వింగ్ నేత గుమ్మడి విజయ్‌కుమార్, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు కొల్లూరి శామ్యూల్, వైఎస్సార్ టీయూసీ నేత తాడిశెట్టి శ్రీనివాసరావు, సోషల్ మీడియా వింగ్ చింతలపూడి లక్ష్మీనారాయణ, పబ్లిసిటీ వింగ్ అద్దేపల్లి చందు, ఇంటెలెక్చువల్ వింగ్ నితీష్చంద్ర, ఎంప్లాయీస్, పెన్షనర్స్ వింగ్ నేత తోట సీతారామాంజనేయులు, వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు మేకల సుధాకర్‌బాబు (సుబ్బన్న), షేక్ అచ్చెబా, లంకా సూరిబాబు, శీలం బాబ్జి, గూడవల్లి నాగరాజు, కాగిత జవహర్లాల్ నెహ్రూ, కొలుసు హరిబాబు, తిరుమలశెట్టి ప్రసాద్, కార్పొరేటర్లు, నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. అనంతరం ధర్నా చౌక్ నుంచి అనుబంధ విభాగాల నాయకులు ర్యాలీగా కలెక్టర్‌కు తరలివెళ్లి డీఆర్వో కె.చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందజేశారు. కూటమి పాలకులు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు చూపక పోగా ఇస్తానన్న నిరుద్యోగ భృతిని సైతం మర్చిపోయారు. పాలకులు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధి చూపడం లేదు. ఫలితంగా నాలాంటి ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నాం. కూటమి పాలన ప్రారంభమై ఏడాది పూర్తైనా నిరుద్యోగులను ఆదుకోకపోవడం దుర్మార్గం. – జుజ్జువరపు పృధ్వీరాజు, నిరుద్యోగి, రాజుపేటగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పని చేసిన వలంటీర్లను కూటమి పాలకులు తీవ్రంగా మోసగించారు. ఎన్నికల ముందు రాజీనామా చేసిన తనలాంటి ఎంతో మంది వలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుని నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబునాయుడు నాడు ప్రకటించారు. ప్రభుత్వ పాలన ప్రారంభమై ఏడాది కాలం పూర్తయినా ఆయన వలంటీర్ల ఊసే ఎత్తడంలేదు. ఈ వ్యవస్థను కొసాగిస్తాని చెప్పి ఏడాదైనా అమలు చేయకుండా మిన్నకుండిపోయారు. – భట్రాజు కొండబాబు, మచిలీపట్నం7న్యూస్రీల్కూటమి ప్రభుత్వం వెన్నుపోటుపై నిరసన గళం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అవి ఎక్కడ? నిరుద్యోగులకు భృతి ఏది? యువతకు ఏం చేశారు? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎగ్గొట్టింది చంద్రబాబు కాదా? వైఎస్సార్ సీపీ యువత పోరులో ప్రశ్నించిన నేతలు -
ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ సాధ్యమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సీనియర్ అధికారుల బృందం పేర్కొంది. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ ఎన్.ప్రకాష్, అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్ అభినవ్ వాలియా సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక నవీకరణ, డిజాస్టర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కార్యకలాపాలు, విపత్తు ముప్పు తగ్గింపుతో పాటు భవిష్యత్తు విపత్తులను ఎదుర్కొనే వ్యవస్థ పటిష్టత తదితర అంశాలపై సమీక్షించి, సమన్వయ శాఖల అధికారులతో చర్చించారు. మాక్ డ్రిల్స్ నిర్వహణ, సామర్థ్య నిర్మాణంపై అధికారులకు శిక్షణ, సమన్వయం వంటి అంశాల్లో జిల్లాలో చర్యలు బాగున్నాయన్నారు. బుడమేరు వరదల సమయంలో బాధితులకు చేయూతనివ్వడం, పునర్మిర్మాణ చర్యల్లో అధికార యంత్రాంగం చూపిన చొరవను కూడా బృందం సభ్యులు ప్రశంసించారు. వరదల్లో వ్యవసాయ డ్రోన్లతో ఆహారం పంపిణీ.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే సరైన సన్నద్ధత విషయంలో ప్రతి శాఖా తమదైన ప్రత్యేక విపత్తు నిర్వహణ ప్రణాళికలను రూపొందించడం కీలకమని చెప్పారు. చట్ట ప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై రియల్‌టైమ్ హెచ్చరికల వ్యవస్థలో సచేత్ కీలక మైలురాయి అని, ఈ యాప్‌పై అధికారులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను పొందుపరచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆపద మిత్ర, ఇతర వలంటీర్ సేవలకు ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని ఎన్డీఎంఏ అధికారుల బృంద సభ్యులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ బుడమేరు వరదల్లో వ్యవసాయ డ్రోన్లను ఆహారం పంపిణీకి ఉపయోగించామన్నారు. పారిశుద్ధ్య కార్యకలాపాల్లోనూ డ్రోన్లను వినియోగించినట్లు తెలిపారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, డీపీవో పి.లావణ్య కుమారి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీఏవో డీఎంఫ్ విజయకుమారి, పశు సంవర్థక అధికారి ఎం.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక సమావేశంలో ఎన్డీఎంఏ అధికారుల బృందం -
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పాపారావు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం సాక్షిలో ‘దందాకు అండదండలు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా మళ్లీ మళ్లీ చేస్తున్న వ్యక్తులపై నిఘా పెట్టామన్నారు. ప్రివెంటివ్ ఆఫ్ బ్లాక్ మార్కెట్ యాక్టు ప్రకారం ఐదుగురిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్, పోలీసు కమిషనర్‌కు సూచించినట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్ మెంట్‌ను కట్టుదిట్టం చేశామని, బియ్యం సరిహద్దులు దాట కుండా పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నామని వివరించారు. ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో అన్లైన్లో ఆర్ఐలు, డీటీలు, తహసీల్దార్లు, ఆర్డీఓలు తనిఖీలు చేసి వివరాలు నమోదు చేస్తున్నారన్నారు. బియ్యం పక్కదారి పట్టకుండా ప్రజలకు నిత్యావసర సరుకులను సక్రమంగా అందేలా చర్యలు తీసుకొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రివెంటివ్ ఆఫ్ బ్లాక్ మార్కెట్ యాక్టు ప్రకారం క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసిన ఐదుగురిలో రేషన్ బియ్యం మాఫియా డాన్ రామచంద్రరావు పేరు ఉన్నట్లు సమాచారం. ఇతనిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. క్షేత్ర స్థాయిలో తనిఖీలు ముమ్మరం డీఎస్ఓ పాపారావు -
సత్వరమే అర్జీలు పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): మీ కోసంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, ఆర్డీవో కె.స్వాతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు 146 అర్జీలను స్వీకరించారు. అర్జీలు ఇవే ● సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల్లో సొంత మండల పరిగణనలోకి తీసుకోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇందుకోసం సరైన మార్గదర్శకాలు విడుదల చేసి బదిలీల ప్రక్రియ చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు డీవీ భార్గవి, యూఎన్ జ్యోతి, సత్యనారాయణ, శ్రీనివాసరావు అర్జీ ఇచ్చారు. ● గూడూరు మండలం చిట్టిగూడూరు గ్రామానికి చెందిన మధిరి నాగభూషణం తన తండ్రి వెంకట్రామయ్య వీఆర్ఏగా పని చేస్తుండగా 1973లో డొంక పోరంబోకు భూమి 21 సెంట్ల భూమికి పట్టా మంజూరు చేశారని తెలిపారు. తాను కూడా వీఆర్ఏగా, అటెండరుగా పనిచేసి పదవీ విరమణ చేశానని ఎలాంటి పింఛను లేదని భూమిపై ఆధారపడి జీవిస్తున్న తనను లంకా చంద్రశీల అతని కుమారులు కలిసి భూమిని రాత్రికి రాత్రి కబ్జా చేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై గూడూరు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. మీ కోసంలో 146 అర్జీలు స్వీకరణ డీఆర్వో చంద్రశేఖరరావు -
మాదక ద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నం
మచిలీపట్నంటౌన్: గంజాయి, మత్తు పదార్థాల వినియోగంతో యువత జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటోందని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.గోపి చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దిన వారోత్సవాల్లో భాగంగా సోమవారం కృష్ణాజిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవహారం చేపట్టారు. ర్యాలీలో కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ సమాజంలోని కొన్ని అసాంఘిక శక్తుల వల్ల యువత తప్పుదారి పట్టి మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచి భవిష్యత్తును అందించడానికి కృషి చేయాలన్నారు. చిన్నారులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి గుర్తిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలి.. వ్యవస్థ పరంగా మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయని జస్టిస్ గోపి చెప్పారు. అదేవిధంగా వాటిని అరికట్టడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమన్నారు. ప్రతి నేరం ఘోరం వెనుక ఈ మాదకద్రవ్యాల వినియోగం ముఖ్య భూమిక పోషిస్తోందని, యుక్త వయసుకు వచ్చిన వారి పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వారిలో అనుమానాస్పద ప్రవర్తన గుర్తించినట్లయితే వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించి వివరాలు రాబట్టాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసైనట్లు గుర్తిస్తే వెంటనే వారికి అందుకు సంబంధించిన పునరావాస కేంద్రంలో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ముందుకు రావాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిల్వలు, వినియోగంపై ప్రజలకు ఎలాంటి సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య, మచిలీపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోతురాజు, న్యాయమూర్తులు, అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోపి -
వైఎస్ జగన్‌పై కూటమి భారీ కుట్ర
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ విమర్శించారు. జగన్ పల్నాడు పర్యటనపై తాను మాట్లాడిన వీడియోను మహేష్ సోమవారం విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు అర్బన్ ఎస్పీ సతీష్‌కుమార్ నేరుగా పత్రికా ప్రకటన విడుదల చేసి, మీడియాతో సమావేశమై కాన్వాయ్ ఉన్న ప్రైవేటు వెహికల్ ఢీ కొందని, ఆ ప్రైవేటు వాహనం నంబర్ ఇదీ అని ప్రకటించారని గుర్తుచేశారు. ఆ వాహనం ఓనర్‌ను పిలిపించి వాళ్లను జామీను తీసుకుని స్టేషన్ బెయిల్ మీద విడుదల చేయడం వాస్తవం కాదా, మీరు దీన్ని కాదనగలరా? అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిందని తెలియగానే.. జగన్ కాన్వాయ్‌ను అనుసరిస్తున్న నాయకులు లాన్ మీద ఉన్న సింగయ్యను చూసి ఆటోలోగానీ, సొంత కారులోగానీ ఆస్పత్రికి తీసుకెళ్తామని అక్కడున్న పోలీసులను అడిగితే వాళ్లు నిరాకరించారని, 108 వాహనం ద్వారా మాత్రమే పంపిస్తామని అక్కడున్న ఏఎస్ఐ రాజశేఖర్ చెప్పారని పేర్కొన్నారు. దీని వల్ల అమూల్యమైన 35 నిమిషాల సమయం వృథా అయ్యిందని, నాయకుల వాహనంలో తీసుకెళ్లేందుకు అనుమతించి ఉంటే ప్రాణాలు కాపాడే వారిమని మహేష్ స్పష్టంచేశారు. మాజీ సీఎంపై కేసు నమోదు.. పోలీసుల దుందుడు చర్య వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని పార్టీ నాయకులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ప్రత్తిపాడు పార్టీ ఇన్చార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబానికి చేతనైనంత మేర పార్టీగా తమ బాధ్యతను నిర్వర్తించామని మహేష్ పేర్కొన్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి టీడీపీ పాఠాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని పోతిన మహేష్ పేర్కొన్నారు. ఏదైనా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయినప్పుడు ఆ వీడియోను వాస్తవమో కాదో తెలుసుకున్న తర్వాతే ఎస్పీ స్థాయి అధికారి కానీ పోలీసు ఉన్నతాధికారులు గానీ బయటకు వస్తారని, అలాంటి నిర్ధారణలేవీ లేకుండానే ఒక మాజీ ముఖ్యమంత్రిపై కేసు పెట్టడం దుందుడుకు చర్య అని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ నేత పోతిన వెంకట మహేష్ -
ఈవీఎంల గోడౌన్ భద్రతపై ప్రత్యేక దృిష్టి పెట్టండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్ భద్రత, పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతర పర్యవేక్షణ జరగాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన గోడౌన్ల సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన సోమవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గల ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరిచే గోడౌన్‌ను అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, వివిధ పార్టీల నాయకులు యేదుపాటి రామయ్య, తరుణ్ కాకాని, కె.పరమేశ్వరరావు, ఎ.నాగేంద్రప్రసాద్, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ డెప్యూటీ తహసీల్దార్ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ -
స్వీపర్ పోస్టుకు కమిషన్ డిమాండ్.. మహిళపై టీడీపీ నేత వేధింపులు
సాక్షి,కృష్ణాజిల్లా : కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు మరింత బరితెగిస్తున్నారు. స్కూల్లో స్వీపర్ ఉద్యోగం ఇప్పించినందుకు కమిషన్ ఇవ్వాలంటూ మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామ టీడీపీ ఇన్ఛార్జ్ నీలం రమేష్ వేధింపులకు పాల్పడ్డాడు. అదేంటని ప్రశ్నించినందుకు దాడికి దిగాడు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుద్రవరంలోని స్కూల్లో ఓ మహిళకు రమేష్ స్వీపర్ ఉద్యోగం ఇప్పించాడు. స్వీపర్ ఉద్యోగం చేసినందుకు గాను సదరు మహిళకు వచ్చే జీతం రూ.6వేలు. అందులోనే తన కమిషన్ రూ.3వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సదరు మహిళ ఖాతాలో ఆరు నెలల వేతనం జమైంది.ఆ విషయం తెలుసుకున్న టీడీపీ నేత రమేష్ తన కమిషన్ ఇవ్వాలని మహిళను వేధించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలి భర్త బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై బాధితురాలి భర్తపై రమేష్ దాడికి దిగాడు. టీడీపీ నేత రమేష్ నుంచి తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసుల్ని వేడుకుంటున్నారు. -
రోడ్డెక్కిన కృష్ణా జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు
సాక్షి, కృష్ణా జిల్లా: జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత( రోడ్డెక్కారు. ఆమెకు తీవ్ర అవమానం జరగడమే అందుకు కారణంగా తెలుస్తోంది. నాగాయలంక మండల పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశంలో గ్రామపార్టీ అధ్యక్షుడు ఉప్పల ప్రసాద్ ఏమైందో తెలియదుగానీ ఒక్కసారిగా స్వర్ణలతతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆమెపైకి వాటర్ బాటిల్ విసిరేశారు. ఆ దురుసు ప్రవర్తనతో ఆమె షాక్ తిన్నారు. అవమాన భారంతో కంటతడి పెట్టిన ఆమె రోడ్డు పై భైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా మహిళా అధ్యక్షురాలైన తనకే అలాంటి పరిస్థితి ఎదురవ్వడంపై ఆమె తన మాటల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు పార్టీలో ఇచ్చే గౌరవం ఇదేనా?. ఉప్పల ప్రసాద్ పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ నినాదాలు చేశారామె. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె పీఎస్‌కు వెళ్లగా.. విషయం తెలిసిన పార్టీ నేతలు కొందరు ఆమెకు సర్దిచెప్పి ఫిర్యాదు చేయించకుండానే బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం.