17 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

17 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

Mar 7 2026 9:34 AM | Updated on Mar 7 2026 9:34 AM

17 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

మైలవరం: అక్రమంగా రవాణా చేస్తున్న 17 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారి పి.వాణి తెలిపారు. ఈ నెల 5న అందిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు పరిధిలో మూడు రేషన్‌ షాపుల్లో స్థానిక అధికారులతో కలిసి తనిఖీలు చేశామన్నారు. నాలుగు టన్నుల తేడాను గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల అనంతరం విజయవాడ వెళుతుండగా మార్గంమధ్యలో మైలవరం మండలం బాడవ టోల్‌ ప్లాజా వద్ద గురువారం రాత్రి అనుమానాస్పదంగా ఉన్న లారీని గుర్తించి తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీలలో 300 ప్లాస్టిక్‌ బ్యాగ్‌లతో నిండిన 17 టన్నుల రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి మైలవరం పోలీస్‌ స్టేషన్‌కు లారీని తరలించి, స్థానిక తహశీల్దారును కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఓ వి. శ్రీనివాస్‌, డీటీ బి. రామకృష్ణ, ఆర్‌ఐ కిశోర్‌, స్థానిక వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement