ఐపీఎల్-2026లో భాగంగా జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్యవంశీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో వైభవ్ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు.
వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయినా కొంచెం అతడికి నొప్పి తగ్గలేదు. వైభవ్ నడిచేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్ల సాయంతో వైభవ్ మైదానాన్ని వీడాడు. ఇది నిజంగా రాజస్తాన్ రాయల్స్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. వైభవ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో కూడా భారీ సెంచరీతో సూర్యవంశీ చెలరేగాడు. కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో వైభవ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే టోర్నీ కీలక సమయంలో వైభవ్ గాయపడడం రాజస్తాన్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఒకవేళ వైభవ్ గ్రేడ్-3లో ఉన్నట్లయితే పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతోంది. అదే జరిగితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను వైభవ్ వైదొలగనున్నాడు.
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు అతడితో పాటు పాటు ధ్రువ్ జురెల్(51), ఫెరీరా(33) రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, షకీబ్ హసన్, నితీశ్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.


