10 రోజులు లీవ్‌ తర్వాత ఉద్యోగికి బాస్‌ బంపరాఫర్‌ | after 10 day leave boss offers one more day to settle in | Sakshi
Sakshi News home page

10 రోజులు లీవ్‌ తర్వాత ఉద్యోగికి బాస్‌ బంపరాఫర్‌

Jun 9 2026 12:30 PM | Updated on Jun 9 2026 1:15 PM

after 10 day leave boss offers  one more day to settle in

కార్పొరేట్‌ కంపెనీల్లో  ఓ పదిరోజులు సెలవు తీసుకోవడం, వెకేషన్‌ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే తిరిగి ఉద్యోగంలో చేరిపోవడం చాలా కామన్‌.  కానీ  వచ్చిన వెంటనే ఆఫీస్ పనిలో పడిపోవడం ఎందుకు, ఇంకో రోజు రెస్ట్‌ తీసుకొని  హ్యాపీగా రా అని  మేనేజర్ చెప్పడం ఎక్కడైనా విన్నారా? వినలేదు కదా. అలా గొప్పమనసు చాటుకున్న  ఒక మేనేజర్‌ను బాస్‌ విత్‌ హార్ట్‌ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. 

తన అనుభవాన్ని ఒక ఉద్యోగి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దాని ప్రకారం 10 రోజుల సుదీర్ఘ సెలవుల తర్వాత తిరిగి వచ్చిన  సదరు  ఉద్యోగి, తాను మరుసటి రోజు నుండి విధుల్లో చేరుతున్నట్లు   మెసేజ్ చేశాడు. దానికి ఆయన స్పందిస్తే.. వెరీ గుడ్‌.. రేపు కూడా సెలవు తీసుకో, కాస్త కుదురుకో. బుధవారం నుంచి ఆఫీసుకు రావచ్చులే అని రిప్లై రావడంతో ఆశ్యర్యం పోయాడు. అందుకే తన సంతోషాన్ని నెటిజనులతో పంచకున్నాడు. తన మేనేజర్‌తో వాట్సాప్‌ చాట్ స్క్రీన్‌షాట్‌ను రెడ్డిట్‌లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఎంతో కఠినమైన  వాతావరణంలో పనిచేసి వచ్చిన తనకు, మేనేజర్ చేసిన ఈ చిన్న  సాయం ఎంతో సంతోషాన్ని, సంస్థలో తన విలువను తెలియజేసిందని పేర్కొన్నాడు.

ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
సాధారణంగా కార్పొరేట్ రంగంలో ఇంతటి దయాగుణాన్ని ఊహించలేమని, ఇది నమ్మశక్యంగా లేదని పలువురు  నెటిజన్లు రక రకాలుగా స్పందించారు. మానవీయ కోణంలో ఆలోచించే లీడర్‌షిప్‌కు ఇదొ అరుదైన ఉదాహరణ అని నెటిజన్లు కొనియాడు తున్నారు. 

ఇదీ చదవండి: ఎయిరిండియాకు షాక్‌ : రెట్టింపు ఫైన్‌

ఇదే మెసేజ్‌ మా బాస్‌ పెడితే సెటైరిక్‌గా అంటున్నాడేమో అని భయపడతా, ఎందుకంటే అంత టాక్సిక్‌ వాతావరణం ఉంటుంది అని ఒకరు,  మరొకరైతే ఉద్యోగం నుంచి తీసేయడానికి ఇదొక సంకేతమేమోనని భయపడతా అని వెల్లడించారు.

"ఒక రోజు సెలవు అడిగితేనే మా మేనేజర్ తన సొంత ఆస్తి అడిగినట్లు ముఖం పెడతాడు" అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.  నిజంగా నువ్వు  చాలా లక్కీ బ్రో అంటూ మేనేజర్‌పై  ప్రశంసల జల్లు కురిసింది.

ఇదీ చదవండి : 51 ఏళ్ల అక్క, 48 ఏళ్ల తమ్ముడు, కన్నీళ్లు తెప్పించే అనురాగం

Advertisement
 
Advertisement
Advertisement