పెల్లెట్‌ గన్‌లు గురిపెట్టారు | Delhi Police Action Over Sahil Alleged Pellet Gun Injury | Sakshi
Sakshi News home page

పెల్లెట్‌ గన్‌లు గురిపెట్టారు

Jul 25 2026 6:15 AM | Updated on Jul 25 2026 6:20 AM

Delhi Police Action Over Sahil Alleged Pellet Gun Injury

ఇదిగో సాక్ష్యం: రాహుల్‌ 

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద ఈ నెల 20వ తేదీన శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా పెల్లెట్‌ గన్స్‌తో కాల్పులు జరిపారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. పెల్లెట్స్‌ ఉపయోగించారనడానికి ఈ విద్యార్థే నిదర్శనమంటూ సాహిల్‌ అనే యువకుడిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. విద్యార్థులపై కాల్పులు జరిపి, లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని పునరుద్ఘాటించారు. 

సాహిల్‌ త్రివర్ణ పతాకం చేతబూని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు అతడిపై పెల్లెట్‌ గన్‌తో దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. సాహిల్‌ కన్ను దెబ్బతి న్నదని, ఆ కంటితో అతనికి ఏమీ కనిపించడం లేదని తెలిపారు. సాహిల్‌ శరీరానికి తగి లిన గాయాలను సైతం రాహుల్‌ మీడియాకు చూపించారు. వేలాది మంది యువతకు ఇదే పరిస్థితి ఎదురైందని, వారిపై పెల్లెట్‌ గన్లతో కాల్పులు జరిపి, లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు. నిరసనకారులు చేసిన నేరం ఏమిటని తీవ్రంగా ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ ఒక ‘క్రిమినల్‌ ఎడ్యుకేషన్‌ మినిస్టర్‌’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. భారత విద్యా వ్యవస్థ పతనానికి ప్రతీకగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement