విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న మోదీ ప్రభుత్వం: సోనియా  | Modi govt treating students seeking accountability as enemies of nation | Sakshi
Sakshi News home page

విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న మోదీ ప్రభుత్వం: సోనియా 

Jul 25 2026 4:49 AM | Updated on Jul 25 2026 4:49 AM

Modi govt treating students seeking accountability as enemies of nation

న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అకౌంటబిలిటీ కోరిన పాపానికి మోదీ ప్రభుత్వం విద్యార్థులపట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని, ఈ దేశ భవిష్యత్తుగా కాకుండా శత్రువులా చూస్తోందని కాంగ్రెస్‌ పార్లమెంటరీప ఆర్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించార.ఉ. దేశ విద్యా వ్యవస్థను దిగజారుస్తున్న మోడీ ప్రభుత్వ డొల్లతనాన్ని ఈ దేశ విద్యార్థులు బట్టబయలు చేశారని వ్యాఖ్యానించారు. 

విద్యార్థుల పక్షాన నిలవడం నైతికంగానే కాకుండా రాజకీయ, రాజ్యాంగబద్ధ ధర్మం కూడా అని స్పష్టం చేశారు. నిరాశ నిస్పృహలను కలిగించే విద్యావ్యవస్థ, మోడీ ప్రభుత్వపు అహంకార ధోరణి, బాధ్యతారాహిత్యం వంటి అంశాలన్నీ నిరసనలకు దారితీయడం సహజ పరిణామమేనని సోనియాగాంధీ ‘ద హిందూ’పత్రికలో ‘ఆన్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ కొలాప్స్, యంగ్‌ ఇండియాస్‌ ట్రామా’శీర్షికతో రాసిన కథనంలో పేర్కొన్నారు. 

కేంద్ర హోం శాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు ‘ఛలో సంసద్‌’సందర్భంగా విద్యార్థులపై చూపిన క్రూరత్వం ఈ ప్రభుత్వ హయాంలో కొత్తేమీ కాదని, 2020లో సీఏఏ నిరసన ప్రదర్శనల సందర్బంగానూ పోలీసులు, పారా మిలటరీ బలగాలు దారుణంగా వ్యవహరించాయని, మహిళ రెజ్లర్లపై జరిగిన దమనకాండను కూడా ఈ దేశం మరచిపోలేదని అన్నారు.

 విద్యార్థులు ధైర్యంగా వేస్తున్న ప్రశ్నలకు ఈ ప్రభుత్వం పిరికితనంతో జవాబు చెబుతోందని, క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టడంలో దారుణంగా విఫలమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసేందుకు నిరాకరించడం ప్రజల మనసుల్లో గూడుకట్టుకుపోయిన ఆగ్రహానికి ఆజ్యం పోసిందని అన్నారు. ఎనీ్టయేను శక్తిమంతం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఇచి్చన సలహాలను బహిరంగంగానే తిరస్కరించడం ద్వారా ప్రధాన్‌ ధిక్కారాన్ని ప్రదర్శించడమే కాకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆ కథనంలో ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement