ఢిల్లీ :కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకారు. సోషల్ మీడియాలో మంత్రులు యాక్టివ్‌గా ఉన్నారా.. లేదా అని నిలదీశారు. ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది యాక్టివ్‌గా ఉన్నారని ఆరా తీశారు. మంత్రులందరూ సోషల్ మీడియాలో కచ్చితంగా యాక్టివ్‌గా ఉండాలని ఆదేశించారు.
ప్రభుత్వ పథకాలు అందులో పోస్ట్ చేయడం కాదు.. వాటి గురించి అర్థం అయ్యేలా వీడియోలు పోస్ట్ చేయాలన్నారు. యువత ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, మంత్రులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ వారితో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిందేనన్నారు మోదీ.


