మెరిసే చర్మం కోసం న్యూటెల్లా జార్‌..! ఆ నటి బ్యూటీ సీక్రెట్‌.. | Beauty Tips: Nutella the secret to Kate Middleton's glowing skin | Sakshi
Sakshi News home page

మెరిసే చర్మం కోసం న్యూటెల్లా జార్‌..! ఆ నటి బ్యూటీ సీక్రెట్‌..

Jul 24 2026 5:37 PM | Updated on Jul 24 2026 5:51 PM

Beauty Tips: Nutella the secret to Kate Middleton's glowing skin

చర్మ సంరక్షణకు సంబంధించిన ప్రభావవంతమైన వంటింటి చిట్కాలనే అనుసరిస్తారు చాలామంది. సహజసిద్ధమైనవి కావడంతో వాటిపై ఉంటే గట్టి  నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా పొడి శనగపిండి, రోజ్‌ వాటర్‌, పసుపు వరకు మన వంటింట్లో లభించే వాటిని ఉపయోగిస్తారు. ఇలా సహజసిద్ధమైన చిట్కాలనే అనుసరించే వారిలో వేల్స్ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ కూడా ఉంది. ఆమె మచ్చలేని చందమామలాంటి మోము రహస్యం తన వంటగదిలోనే ఉందని చెబుతోంది ఆమె వ్యక్తిగత బ్యూటీషియన్‌ డెబోరా మిచెల్. 

క్షణాల్లో కాంతి వంతమైన ముఖం కోసం వంటగదిలో ఉండే న్యూటెల్లా జార్‌ను ఉపయోగిస్తారని వెల్లడించింది. అంతేగాదు ఆమె మెరిసే చర్మం కోసం ఒక విచిత్రమైన పేస్‌ మాస్క్‌ని కూడా ఉపయోగిస్తారని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఆమె సౌందర్యం కోసం ఓట్‌మీల్, కేల్, స్పిరులినా, మాచా, పాలకూర, రొమైన్ ,  బ్లూబెర్రీలతో తయారు చేసిన ఒక క్లాసిక్ గ్రీన్ స్మూతీ వంటివి తీసుకుంటుంది. తన చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి తాజా పదార్థాలన్నింటినీ తింటుందని చెప్పుకొచ్చింది. 

మధ్యాహ్నం లేదా సాయంత్రం పూట చిరుతిండిగా కూడా ఆమె పచ్చి పండ్లు, కూరగాయలతో పాటు సూపర్ ఫుడ్ అయిన గోజీ బెర్రీలను తీసుకుంటుందని తెలిపింది. అలాగే ఆ బ్యూటీషియన్‌ సహజంగా మెరిసే చర్మం కోసం నాలుగు సులభమైన ఇంట్లో తయారు చేసుకునే ఫేస్‌ మాస్క్‌లు గురించి కూడా వెల్లడించింది. అవేంటంటే..

తేనె, పెరుగు ఫేస్ మాస్క్ (పొడి చర్మం కోసం)
కావలసినవి: 1 టేబుల్ స్పూన్ సాదా పెరుగు, 1 టీస్పూన్ తేనె
ఉపయోగించే విధానం: ఈ రెండు పదార్థాలను కలిపి మెత్తని పేస్ట్ లా చేసి, ముఖానికి , మెడకు పట్టించండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇది చర్మానికి తేమను అందించి, మృదువుగా ఉండేలా చేస్తుంది.  చర్మం సహజ తేమ అవరోధానికి మద్దతు ఇస్తుంది.

ఓట్మీల్, తేనె ఫేస్ మాస్క్ (సున్నితమైన చర్మం కోసం)
కావలసినవి: 2 టేబుల్ స్పూన్ల మెత్తగా రుబ్బిన ఓట్స్, 1 టేబుల్ స్పూన్ తేనె, కొద్దిగా గోరువెచ్చని నీరు

ఉపయోగించే విధానం: అన్ని పదార్థాలను కలిపి చిక్కటి పేస్ట్ లా చేయండి. మెల్లగా అప్లై చేసి, 10–15 నిమిషాలు ఉంచి, ఆ తర్వాత సాధారణ నీటితో కడిగేయండి. ఇది పొడిబారిన మరియు సున్నితమైన చర్మానికి ఉపశమనం కలిగించి, తాత్కాలిక ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. అలాగే, ఇది సున్నితమైన ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తుంది.

కలబంద దోసకాయ ఫేస్ మాస్క్ (చల్లదనం, తేమ కోసం)

కావలసినవి: 2 టేబుల్ స్పూన్ల తాజా కలబంద జెల్, 2 టేబుల్ స్పూన్ల దోసకాయ గుజ్జు
ఉపయోగించే విధానం: రెండింటినీ కలిపి శుభ్రమైన చర్మానికి అప్లై చేయండి. కడిగే ముందు 15 నిమిషాలు అలాగే ఉంచండి.ఇది చర్మానికి తాజా అనుభూతిని కలిగించి, తేలికపాటి తేమను అందించి, చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది.

శనగపిండి, పెరుగు, పసుపు ఫేస్ మాస్క్ (జిడ్డు చర్మం కోసం)

2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ సాదా పెరుగు మరియు చిటికెడు పసుపు

ఉపయోగించే విధానం: అన్ని పదార్థాలను కలిపి మెత్తని పేస్ట్ లా చేసి, చర్మానికి సమానంగా అప్లై చేయండి. కడిగే ముందు 10–15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోండి.ఇది చర్మంలోని అధిక నూనెను తొలగించి, ఎక్స్‌ఫోలియేట్ చేసి, లోపలి నుంచి బయట వరకు తాజాగా కనిపించేలా చేస్తుందని అంటారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement