గాయని అరుణా సాయిరామ్ ప్రసిద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, స్వరకర్త కూడా. ఆమె లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి కర్ణాటక గాయనిగా చరిత్ర సృష్టించారు. ఆమె భారత ప్రభుత్వ "పద్మశ్రీ" అవార్డు గ్రహీత. ఆమె సంగీత నాటక అకాడమీ వైస్ చైర్‌పర్సన్‌గా కూడా సేవలందించారు. ప్రస్తుతం ఆమెకు 72 ఏళ్ల వయసు. అయినా ఈ వయసులో కూడా తన సహసిద్ధమైన కురులతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఆ కురుల సౌందర్య కోసం తాను ఎలాంటి కేర్ తీసుకుంటుందో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. తన ఆరోగ్యకరమైన జుట్టు కోసం తన అత్తగారి నుంచి సంక్రమించిన జుట్టుకు పోషణనిచ్చే తల నూనె రెసిపీని పంచుకున్నారు. ఇప్పటికీ తాను ఆ నూనెనే వాడతానంటూ..దాని తయారీ విధానం పంచుకున్నారు. తాము ఎల్లప్పుడూ ఇంట్లోనే లభించే మూలికలు, సుగంధద్రవ్యాలతోనే నూనెని తయారు చేసుకుంటామని కూడా చెప్పారామె.
ఆ నూనె ఎలా తయారు చేయాలంటే..
కావలసిన పదార్థాలు
మెంతి గింజలు
కలోంజి గింజలు
చిన్న ఉల్లిపాయలు
మందార పువ్వుల రేకులు
మందార ఆకులు
కరివేపాకు
గోరింటాకు ఆకులు
లోపల గుజ్జుతో ఉన్న కలబంద
తయారీ విధానం
అన్ని పదార్థాలను కొబ్బరి నూనెలో వేసి, అవి బాగా కలిసే వరకు మెల్లగా వేడి చేయండి. ఆ తర్వాత స్టవ్‌ని ఆపేసి కాసేపు అలానే ఉంచండి. చల్లారిని తర్వాతన ఒక గాజు సీసాలోకి మార్చాలి.
నిపుణులు ఏమంటున్నారంటే..
మెంతి, కలోంజి, చిన్న ఉల్లిపాయలు, మందార పువ్వుల రేకులు , గోరింటాకు, కరివేపాకు, కలబంద వంటివి కొబ్బరి నూనెలో నానబెట్టడం ద్వారా జుట్టుకి పోషణనిచ్చే అమృతం తయారవుతుందని అంటున్నారు. ఈ సౌందర్య పద్ధతి తరతరాలు గౌరవించే సంప్రదాయపద్ధతిగా అభివర్ణించారామె. ఇలాంటి నూనెని క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు బలంగా తయారవ్వడమే కాకుండా, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టుకి చక్కటి మెరుపు సంతరించుకుంటుంది. తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ప్రయోజనాలు..
ఈ నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంటాయి. అలాగే పొడిబారడాన్ని నివారించి, చక్కటి మెరుపుని అందిస్తుంది.
మందార మరియు కరివేపాకు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయని అంటారు. మెంతి జుట్టు ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కలబంద వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఉల్లిపాయలు జుట్టును బలపరచడంలో సహాయపడతాయి. ఇది కృత్రిమ సంకలితాలు లేకుండా లోతైన పోషణను అందిస్తుంది.
అందరికీ సరిపోతుందా?
ఈ రెసిపీ చాలా రకాల జుట్టుకు బాగా పనిచేస్తుంది. జిడ్డుగా ఉండే తల చర్మం ఉన్నవారు తక్కువ సమయం పాటు దీనిని ఉపయోగించవచ్చు, అయితే పొడి జుట్టు ఉన్నవారు రాత్రంతా నూనె రాసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఇది సహజమైన పదార్థాలతో తయారు చేసినందున ఎవరికైనా ఎలాంటి దుష్ఫ్రభావాలు ఉండవని అన్నారు. అంతగా అనుమానం ఉంటే..చిన్న ప్యాచ్ టెస్ట్ చేసి రాసుకుంటే సరి అని అంటున్నారు నిపుణులు.
(చదవండి: ఒకటిన్న ఏడాదిలోనే 67 కిలోలు బరువు..! జస్ట్ ఒక్క నిమిషంలోనే..)


