ఒకటిన్న ఏడాదిలోనే 67 కిలోలు బరువు..! జస్ట్‌​ ఒక్క నిమిషంలోనే.. | Woman Lost 67 Kg In More Than One Year Shares Best Exercises | Sakshi
Sakshi News home page

Weight Loss: ఒకటిన్న ఏడాదిలోనే 67 కిలోలు బరువు..! జస్ట్‌​ ఒక్క నిమిషంలోనే..

Jul 22 2026 10:45 AM | Updated on Jul 22 2026 11:39 AM

Woman Lost 67 Kg In More Than One Year Shares Best Exercises

బరువు తగ్గడం అంటే కఠినమైన డైట్‌, కష్టతరమైన వ్యాయామాలు, అధిక సమయం జిమ్‌ సెషన్‌ అనే భావన అందరిలో ఉంటుంది. కానీ కొందరు అవేమీ అవసరం లేకుండా రోజువారీ సరదాగా చేసే వర్కౌట్లతోనే సాధ్యమని చూపిస్తారు. అయితే వాటి ఏదో ఒక్కసారి కాకుండా ఇన్నిసార్లు అని చేస్తే చాలు అధిక సంఖ్యలో కేలరీలు, కొవ్వుని తగ్గించుకోవచ్చని అంటోంది ఈ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.

క్రమం తప్పకుండా చేసే చిన్నపాటి కదలికలు కూడా మిమ్మల్ని చురుకుగా ఉంచుతాయని చెబుతున్నారు  ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ రాజీ ఘంగాస్. ఆ వ్యాయామాలు ఒక నిమిషంలోనే గరిష్ట కేలరీలను తగ్గించగలదని అంటున్నారు. తాను సుమారు 155 కేజీల బరువు ఉండేదాన్ని అన్ని క్రమం తప్పకుండా చేసే తేలికపాటి వ్యాయామాలతోటే ఇంతలా బరువు తగ్గానంటూ తన వెయిట్‌లాస్‌ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. 

అంతేగాదు రోజువారి దినచర్యలో సులభంగా చేర్చుకోగలిగే ఒక ఐదు సాధారణ కదలికల వ్యాయామాలను గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో పంచుకుంది. బరువు తగ్గడం అంటే కేవలం జిమ్‌లో గంటల తరబడి గడపడం కాదు, క్రమం తప్పకుండా చేసే చిన్నపాటి కదలికలు కూడా అని అంటున్నారామె. 

చురుకుగా ఉంచడానికి, ఫిట్‌నెస్‌ని మెరుగుపరుచుకోవడానికి, కేలరీలను కరిగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారామె. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేలా చూసుకోవడం, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి వాటితోనే స్మార్ట్‌గా మారిపోవచ్చిన చెబుతోంది. తాను చెప్పబోయే చిన్న పాటి వర్కౌట్లు ఎంతటి బిజీ షెడ్యూల్‌లో అయినా సులభంగా చేయొచ్చని చెప్పుకొచ్చింది. అలా చేసే తాను సుమారు 67 కిలోలు పైనే తగ్గినట్లు తెలిపింది. అవేంటంటే..

జంపింగ్ జాక్స్: పాదాలను కలిపి, చేతులను పక్కన ఉంచి నిలబడండి. కాళ్ళను దూరంగా చాపుతూ, చేతులను తల పైకి ఎత్తుతూ గెంతండి. తిరిగి ప్రారంభ స్థానానికి గెంతి, మళ్ళీ చేయండి.ఇలా కొద్దిసేపు రిపీట్‌ చేయాలి.

హై నీ క్లాప్: నిటారుగా నిలబడి, ఒక మోకాలిని ఛాతీ వైపుకు పైకి లేపుతూ, పైకి లేపిన మోకాలి కింద లేదా పైన చేతులతో చప్పట్లు కొట్టండి. వేగంగా రెండు కాళ్ళ మధ్య మార్చి మార్చి చేయండి.

స్టాండింగ్ క్రాస్-బాడీ క్రంచ్: మీపాదాలను భుజాల వెడల్పులో ఉంచి నిలబడి, చేతులను తల వెనుక ఉంచండి. ఒక మోకాలిని పైకి లేపుతూ, దానికి ఎదురుగా ఉన్న మోచేతిని దాని వైపుకు తీసుకురండి. తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చి, రెండవ వైపున కూడా చేయండి.

ఫార్వర్డ్ అండ్ బ్యాక్‌వర్డ్ జంప్: మపాదాలను కలిపి నిలబడండి. రెండు పాదాలతో ముందుకు గెంతి, వెంటనే తిరిగి ప్రారంభ స్థానానికి గెంతండి. మెత్తగా కింద పడటానికి మోకాళ్ళను కొద్దిగా వంచి ఉంచండి.

స్పాట్ జాగింగ్: ఒకే చోట నిలబడి, ముందుకు కదలకుండా జాగింగ్ చేయండి. కదలికను సున్నితంగా, స్థిరంగా ఉంచడానికి, మచేతులను సహజంగా ఊపుతూ పాదాలను సౌకర్యవంతమైన వేగంతో పైకి లేపండి.

చురుకుగా ఉండటం ఎల్లప్పుడూ సంక్లిష్టంగా ఉండనవసరం తన వర్కౌట్లతో చెప్పకనే చెప్పింది ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ రాజీ. క్రమం తప్పకుండా చేసే కొన్ని సాధారణ కదలికలు కూడా ఫిట్‌నెస్ అలవాటును పెంపొందించుకోవడాన్ని సులభతరం చేస్తాయి.  

వ్యాయామం చేయడం కొత్తగా ప్రారంభిస్తున్నట్లయితే, నెమ్మదిగా మొదలుపెట్టి, సరైన భంగిమపై దృష్టి సారించి, శక్తి సామర్థ్యాలు మెరుగుపడే కొద్దీ రౌండ్ల సంఖ్యను పెంచుకోడం మంచిదని సూచిస్తోంది. కాబట్టి మరింత కష్టతరమైన మార్గం కాకుండా సులువుగా సునాయాసంగా చేసే వర్కౌట్లను ఎంచుకుని కిలోల కొద్దీ బరువు తగ్గేందుకు రెడీ అవుదామా మరి..!.

 

(చదవండి: పెళ్లిలో ప్రాంక్‌ తెచ్చిన తంట..!పాపం ఆ వధువు స్నేహితురాలు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement