నిరసనల్లో షబానా అజ్మీకి ఆకస్మిక తలతిరుగుడు..! ఎందుకిలా అంటే.. | Shabana Azmi: Highlights Causes of Sudden Dizziness | Sakshi
Sakshi News home page

Sudden Dizziness: నిరసనల్లో షబానా అజ్మీకి ఆకస్మిక తలతిరుగుడు..! ఎందుకిలా అంటే..

Jul 21 2026 12:47 PM | Updated on Jul 21 2026 12:51 PM

Shabana Azmi: Highlights Causes of Sudden Dizziness

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన శాంతియుత విద్యార్థి నిరసనలో పాల్గొంటున్నప్పుడు బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ స్వల్ప అనారోగ్య సమస్యకు గురైనట్లు సమాచారం. నిరసన ప్రదర్శన వీడియోలలో వాలంటీర్లు, భద్రతా సిబ్బంది ఆ 75 ఏళ్ల నటికి సహాయం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ రద్దీగా ఉన్న పరిసరాలలో మద్దతుదారులు ఆమెకు విసనకర్రతో విసురుతుండగా, ఆమె విశ్రాంతి తీసుకుంటుండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. ఆ నటి ఆరోజు అంతకుముందు నిరసన ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకున్నారు. వాటిలో నటుడు ప్రకాశ్‌ రాజ్‌తో కలిసి ట్రక్కులో తోటి నిరసనకారులతో ప్రయాణిస్తున్న దృశ్యాలను కూడా పంచుకున్నారామె. 

ఈ ప్రదర్శన శాంతియుతంగా, విద్యా సంస్కరణకు మద్దతుగా జరిగిందని పునరుద్ఘాటించారు కూడా. అయితే ఆమెకు ఆ సమయంలో ఆకస్మికంగా తలతిరగడానికి గల కచ్చితమైన కారణం అధికారికంగా వెల్లడించినప్పటికీ..తరుచుగా నిర్లక్ష్యంగా చూసే ఈ ఆరోగ్య లక్షణం గురించి వెలుగులోకి వచ్చింది. ఇది చూడటానికి సాధారణ సమస్యే కానీ..ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో అసలు ఆకస్మిక తలతిరుగుడు అంటే ఏంటి? ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.

ఆకస్మిక తలతిరుగుడు అంటే..
తల తేలిపోతున్నట్లుగా అనిపించి, స్పృహతప్పి పడిపోవడం, సమతుల్యత కోల్పోవడం అని అంటారు. లేదా చుట్టూ ఉన్న పరిసరాలు గిరగిర తిరుగుతున్నట్లు అనిపించడం వంటి అనుభూతులను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా వృద్ధులలో అత్యంత వైద్య సంరక్షణ కోరడానికి అత్యంత సాధారణ కారణాలలో ఈ ఆరోగ్య సమస్య కూడా ఒకటి. 

చాలా సందర్భాలలో తల తిరగడం తాత్కాలికమే. అందుకోసం కేవలం విశ్రాంతి, తగినంత నీరు తాగడం లేదా మూల కారణానికి చికిత్స చేయడం ద్వారా తగ్గిపోతుంది. ఒక్కోసారి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కూడా మారుతుంది. 

ఎందుకిలా జరుగుతుందంటే..

ఎక్కువసేపు ఆరుబయట కార్యకలాపాలు చేసేటప్పుడు లేదా రద్దీగా ఉండే కార్యక్రమాలలో ఇలా జరుగుతుంది

డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం)

వేడి వాతావరణం, అధికంగా చెమట పట్టడం, తగినంత ద్రవపదార్థాలు తీసుకోకపోవడం వల్ల రరక్తపోటు పడిపోయి, ఇది తల తిరగడానికి కారణమవుతుంది.

ఎక్కువసేపు ఆరుబయట ఉండటం వల్ల హీట్ ఎగ్జాషన్ (వేడి అలసట) కలగవచ్చు. దీని లక్షణాలలో తల తిరగడం, అలసట, తలనొప్పి, వికారం, అధికంగా చెమట పట్టడం వంటివి ఉంటాయి.

రక్తపోటు అకస్మాత్తుగా తగ్గడం - ముఖ్యంగా వేగంగా నిలబడిన తర్వాత - మెదడుకు రక్త ప్రసరణను తగ్గించి, తల తేలిపోవడానికి దారితీస్తుంది.

భోజనం మానేయడం లేదా ఎక్కువసేపు శారీరక శ్రమ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయి, నీరసం, వణుకు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

లోపలి చెవి రుగ్మతలు కారణంగా కూడా ఇలా జరగొచ్చు.

రక్తపోటు మందులు, నిద్రమందులు కొన్ని యాంటీడిప్రెసెంట్లతో సహా కొన్ని రకాల మందులు వృద్ధులలో తల తిరగడానికి కారణం కావొచ్చు. 

వైద్య అత్యవసర పరిస్థితిగా ఎప్పుడు పరిగణిస్తారు..

ఛాతీ నొప్పి

అకస్మాత్తుగా నీరసించడం లేదా తిమ్మిరి

మాట్లాడటంలో ఇబ్బంది

తీవ్రమైన తలనొప్పి

స్పృహ కోల్పోవడం

దృష్టి మసకబారడం లేదా రెండుగా కనిపించడం

నిరంతర వాంతులు

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ఎలా నివారించాలి?

సాధారణ జీవనశైలి చర్యలు ప్రమాదాన్ని తగ్గించగలవు.

ముఖ్యంగా వేడి వాతావరణంలో, తగినంత నీరు తాగండి.

విరామం లేకుండా ఎక్కువసేపు నిలబడటం మానుకోండి.

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, క్రమం తప్పకుండా సమతుల్య భోజనం చేయండి.

కూర్చున్న లేదా పడుకున్న స్థితి నుంచి నెమ్మదిగా లేవండి.

వెచ్చని వాతావరణంలో తేలికపాటి దుస్తులు ధరించండి.

అత్యధిక వేడిలో నీడ లేదా ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాలను ఆశ్రయించండి.

తల తిరగడం తరచుగా జరుగుతుంటే, వైద్యుడి సలహాలు, సూచనలు తీసుకోవాలి. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: వర్షాకాలంలోనే ఇన్ఫెక్షన్లు ఎందుకు అధికం.. ? వైద్యులు ఏమంటున్నారంటే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement