ఆన్‌లైన్‌లో సీజేపీ నిరసన: 8.4 లక్షలు దాటిన సంతకాలు! | CJP Protest Gains Online Momentum As Over 8.4 Lakh People Sign Digital Petition Against Exam Irregularities | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో సీజేపీ నిరసన: 8.4 లక్షలు దాటిన సంతకాలు!

Jul 23 2026 7:51 AM | Updated on Jul 23 2026 10:41 AM

Cockroaches fly high online too Nearly nine lakh join CJP petition

న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త ఆందోళనకు ఆన్‌లైన్‌లో భారీ మద్దతు లభిస్తోంది. సీజేపీ అధికారిక వెబ్‌సైట్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ సామూహిక పిటిషన్‌పై ఇప్పటివరకు దాదాపు 8.41 లక్షల మంది డిజిటల్‌గా సంతకాలు చేశారు. ఢిల్లీలో జరిగే నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేని విద్యార్థులు, యువతీ యువకులు ఈ ఆన్‌లైన్ పిటిషన్‌లో పెద్దఎత్తున భాగస్వామ్యమవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఉద్యమానికి సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నిరసనల ద్వారా ప్రధానంగా కొన్ని డిమాండ్లను లేవనెత్తుతున్నారు.అవి..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
పరీక్ష విధానంలోని అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం చెల్లించాలి.
పరీక్ష విధానంలో సమూల సంస్కరణలు చేపట్టాలి.
సోనమ్ వాంగ్‌చుక్‌ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలి.

మరోవైపు నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆయనకు మద్దతుగా 'ఛేంజ్.ఆర్గ్' (Change.org) వేదికగా కూడా ప్రజలు గళం విప్పుతున్నారు. జూలై 13 నుండి వాంగ్‌చుక్‌కు మద్దతుగా 51 పిటిషన్‌లు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా లక్షలాది సంతకాలు సేకరణ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: 2027లో ఉత్తరప్రదేశ్‌ను ఏలేది ఎవరు?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement