గాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన | CJP Protest Live Updates And Highlights, Jantar Mantar Protest, Centre's Reaction, Security Measures And Latest News | Sakshi
Sakshi News home page

గాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన

Jul 23 2026 8:48 AM | Updated on Jul 23 2026 8:15 PM

CJP Protest Live Updates: Jantar Mantar CJP Protest Centre Reaction News

నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న సీజేపీ. జంతర్‌ మంతర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు నిరసనలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజా పరిణామాలు ఇవే..

Live Updates

08: 14 PM

గాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన
ఇండి కూటమి ఎంపీల కొవ్వొత్తుల ప్రదర్శన
గాంధీ స్మృతి కేంద్రం వద్ద నివాళులర్పిస్తున్న ఇండి కూటమి నేతలు
మొదట ఇండియా గేట్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భావించిన నేతలు
ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ స్మృతి కేంద్రానికి వచ్చిన నేతలు
నీట్‌ లీక్‌ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇండికూటమి నేతల నివాళి
 

07: 30 PM

  • విద్యార్థులకు అండగా ప్రతిపక్ష ఎంపీలంతా రోడ్డెక్కాలని భావించాం: రాహుల్‌
  • ఇండియాగేట్‌కు వెళ్దామంటే అనుమతి ఇవ్వలేదు
  • విద్యార్థులంతా రోడ్డుపై ఉన్నారు
  • రాజ్‌ఘాట్‌కు వెళ్దామని అనుకుంటున్నాం
  • మా బస్సును పోలీసులు అడ్డుకున్నారు
  • బస్సును వదిలి డ్రైవర్‌ వెళ్లిపోయాడు

07:18 PM

  • ఢిల్లీలో ఇండి కూటమి నేతల ర్యాలీ
  • రాజ్‌ఘాట్‌కు ర్యాలీగా వెళ్తున్న రాహుల్‌, ఇండి కూటమి నేతలు
  • రాజ్‌ఘాట్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్న ఇండి కూటమి నేతలు
  • విద్యార్థులు ఒంటరి వారు కాదు.. బాసటగా నిలుస్తాం: రాహుల్‌

07:08 PM

  • ఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసనలు
  • రాహుల్‌ నివాసంలో ముగిసిన ఇండి కూటమి ఎంపీల భేటీ
  • రాజ్‌ ఘాట్‌ బయల్దేరిన రాహుల్‌, ఇండి కూటమి నేతలు
  • విద్యార్థులకు అండగా ఉంటాం: రాహుల్‌

06:13 PM

  • రాహుల్‌ గాంధీ నివాసంలో విపక్షాల కీలక భేటీ
  • విద్యార్థుల ఆందోళనలు, తాజా పరిణామాలపై చర్చ
  • సమావేశం అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లే యోచన
  • రాహుల్‌ గాంధీ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

04:50PM

  • రేపు దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపు
  • శాంతియుతంగా నిరసనలు చేపట్టాలన్న సీజేపీ
     

03:21 PM

  • నీట్‌ పేపర్‌ లీక్‌ కేసుపై కేంద్రం కీలక నిర్ణయం
  • నాలుగు రాష్ట్రాల్లో 5 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు
  • బాంబే హైకోర్టులోని రెండు బెంచ్‌ల్లో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు
  • పేపర్‌ లీక్‌ చట్టం కింద ప్రతిరోజూ విచారణ

03:13 PM

  • సీజేపీని మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం
  • అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమన్న కేంద్రం..
  • జంతర్‌మంతర్‌లోనే చర్చలు జరగాలని పట్టుబడుతున్న సీజేపీ

02:03 PM

కేంద్రం సంచలన నిర్ణయం

  • ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం అమలు
  • నిరసనకారుల్ని మూడు నెలల బంధించే అధికారం
  • సీజేపీ నిరసనల నేపథ్యంలో పోలీస్‌ కమిషనర్‌కు విశేష అధికారాలిచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తరంజిత్ సింగ్ సంధు
  • సీజేపీ ఆందోళనలతో ఢిల్లీ పోలీసులకు అదనపు అధికారాలు
  • నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద నిర్బంధించే అవకాశం
  • గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ

1:58 PM | నిరసనకారుల్ని బెదిరించిన పోలీస్‌పై చర్యలు

  • ముంబైలో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసు డ్రైవర్‌ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు.
  • ‘‘డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తా’’ అంటూ విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌.
  • వీడియోపై స్పందించిన ముంబై పోలీస్‌ శాఖ.. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.
  • నిరసనకారులపై తప్పుడు కేసులు పెట్టడం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.

01:18 PM | సీజేపీకి అనూహ్యంగా పెరుగుతున్న మద్దతు

  • జంతర్‌ మంతర్‌ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్‌ జనతా పార్టీ ఆందోళనలు
  • అంతకంతకు పెరుగుతున్న మద్దతు 
  • కమల్‌ హాసన్‌, నసీరుద్దీన్‌ షా లాంటి దిగ్గజ నటుల మద్దతు
  • మొదటి విద్యార్థి మరణం దగ్గరే ప్రభుత్వం స్పందించి ఉండాల్సిందేన్న కమల్‌
  • బాలీవుడ్‌ మద్దతు ప్రకటించకపోవడం సిగ్గుచేటన్న షా
  • ఆందోళనలకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్న బాలీవుడ్‌ తారలు
  • ఇటు సౌత్‌లోనూ పలువురి సపోర్ట్‌

12:21 PM | మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు దృష్టి

  • సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో మూసివేసిన మెట్రో స్టేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది.
  • సెంట్రల్‌ ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లు మూసివేయడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు.
  • సుప్రీంకోర్టు సమీప మెట్రో స్టేషన్‌ మూసివేత వల్ల కేసులకు హాజరయ్యే వారికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.
  • ఎంట్రీ పాస్‌లు ఉన్న న్యాయవాదులు, రిజిస్ట్రీ సిబ్బందిని భద్రతా తనిఖీల తర్వాత అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
  • సమస్య పరిష్కారం కాకపోతే మధ్యాహ్నం తర్వాత తాను జోక్యం చేసుకుంటానని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ తెలిపారు.
  • ఇప్పటికే మెట్రో అధికారులతో మాట్లాడాలని సుప్రీంకోర్టు పరిపాలన విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
 
11:33 AM | ముంబైలో పోలీస్‌ వాహనం నుంచి నిరసనకారుల పరార్‌
  • చెంబూర్‌లో జరిగిన CJP నిరసనల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
  • అదుపులోకి తీసుకున్న విద్యార్థులను తరలిస్తున్న పోలీస్‌ వ్యాన్‌ తలుపును ఓ వ్యక్తి తెరిచినట్లు వైరల్‌ వీడియోలో కనిపించింది.
  • దీంతో పలువురు విద్యార్థులు వాహనం నుంచి బయటకు వచ్చి పరారైనట్లు సమాచారం.
  • నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు.
  • దాదాపు 700–800 మంది ఆందోళనలో పాల్గొన్నట్లు వెల్లడించారు.
  • సుమారు 200 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

11:31 AM | రాళ్ల దాడిలో ఢిల్లీ ఏసీపీకి గాయాలు

  • జంతర్‌ మంతర్‌ వద్ద బుధవారం రాత్రి జరిగిన రాళ్ల దాడిలో ఢిల్లీ పోలీస్‌ ఏసీపీ వివేక్‌ భగత్‌ గాయపడ్డారు.
  • తలకు గాయం కావడంతో పాటు చేతులు, కాళ్లు, భుజంపై గాయాలైనట్లు ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రి అధికారులు తెలిపారు.
  • చెవి నుంచి రక్తస్రావం, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

11:14 AM | ప్రధాని మోదీ ట్వీట్‌పై CJP చీఫ్‌ సెటైర్‌

  • పేపర్‌ లీక్‌ కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పందించారు.
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలంటూ మరోసారి డిమాండ్‌ చేశారు.
  • ప్రధాని ట్వీట్‌లోని “యువత భవిష్యత్తు, సంక్షేమమే ముఖ్యం” అన్న వ్యాఖ్యలపై సెటైరికల్‌గా పోస్టు చేశారు.
  • ‘‘Hi, my name is Nothing’’ అంటూ గ్రాఫిక్‌ను షేర్‌ చేశారు.

 

 

11:08 AM | బిహార్‌ అసెంబ్లీలో నీట్‌ నిరసనల సెగ

  • విద్యార్థులపై లాఠీచార్జ్‌ అంశం బిహార్‌ అసెంబ్లీని కుదిపేసింది.
  • విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.
  • విద్యార్థులపై పోలీసుల చర్యను ప్రశ్నించారు.
  • మరోవైపు తమ వాహనంపై దాడి చేసిన వారిని అధికార కూటమి ఎమ్మెల్యేలు ‘గూండాలు’గా అభివర్ణించారు.
  • అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

జంతర్‌ మంతర్‌ వద్ద ఉద్రిక్తత

  • పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లేందుకు యువత ప్రయత్నం
  • అడ్డుకున్న పోలీసులు.. భారీగా మోహరింపు
  • యువతను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు
  • ఇవాళ పార్లమెంట్‌ సమావేశాలు నాలుగో రోజు భేటీ
  • ఉభయ సభల్లోనూ విపక్షాల నిరసనలతో కొనసాగుతున్న వాయిదాల పర్వం
  • శాంతియుతంగానే నిరసనలు కొనసాగుతాయన్న సీజేపీ
  • చలో సంసద్‌ మళ్లీ ఉండబోదన్న సీజేపీ
  • జంతర్‌ మంతర్‌ వద్దే దీక్ష చేస్తున్న మద్దతుదారులు
  • నిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని సీజేపీ ఆరోపణ
  • అప్రమత్తంగా ఉండాలని వలంటీర్లకు ప్రతినిధుల పిలుపు

11:04 AM | అభిజిత్‌ దీప్కేకు అస్వస్థత

  • CJP వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేకు అస్వస్థత
  • నిరసనలకు దూరంగా ఇవాళ రెస్ట్‌ తీసుకోనున్న దీప్కే
  •  గత కొన్ని రోజులుగా జ్వరం, తీవ్ర ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు సీజేపీ వెల్లడి.
  • నొప్పి నివారణ మందులతో ఇప్పటివరకు కొనసాగానని.. విశ్రాంతి కోసం కొంత సమయం పాటు నిరసన స్థలం నుంచి దూరంగా ఉంటాడని వెల్లడి
  • తిరిగి సాయంత్రానికి తిరిగి జంతర్‌ మంతర్‌కు వచ్చే చాన్స్‌.

10:50 AM | పోలీసుల చర్యలపై ప్రియాంక గాంధీ ప్రశ్నలు

  • నిరసనకారులపై లాఠీఛార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగంపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
  • ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిజంగా శ్రద్ధ చూపిస్తే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు.
  • విద్యార్థులతో నేరుగా చర్చలు జరిపి వారి సమస్యలు వినాలని కేంద్రాన్ని కోరారు.

10:46 AM | ‘విద్యార్థుల మాట వినండి’

  • నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంతో విద్యార్థులు వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని ప్రియాంక గాంధీ అన్నారు.
  • సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వినాలని సూచించారు.

10:43 AM | జంతర్‌ మంతర్‌కు అలఖ్‌ పాండే

  • ఫిజిక్స్‌ వాలా సీఈవో అలఖ్‌ పాండే జంతర్‌ మంతర్‌ వద్ద CJP నిరసనల్లో పాల్గొన్నారు.
  • ఆందోళనకారులను ‘పాక్‌ ఫండెడ్‌’, ‘చైనా మద్దతుదారులు’గా చిత్రీకరించడాన్ని తప్పుబట్టారు.
  • పోలీసుల చర్యల్లో గాయపడిన విద్యార్థుల అంశాన్ని ప్రస్తావించారు.

10:34 AM | చండీగఢ్‌కు విస్తరించిన నిరసనలు

  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో చండీగఢ్‌లోనూ నిరసనలు జరిగాయని CJP తెలిపింది.
  • దేశవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తున్నాయని పేర్కొంది.

10:31 AM | చర్చలు ఉంటాయా? ఉండవా?!

  • మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌ చేస్తున్న విపక్షాలు, నిరసనకారులు
  • రాజీనామా తర్వాతే పార్లమెంట్‌ ఉభయ సభల్లో చర్చ జరగాలంటున్న ప్రతిపక్షాలు
  • అప్పటిదాకా సమావేశాలను ముందుకు వెళ్లనివ్వబోమని స్పష్టీకరణ
  • ఇటు.. జంతర్‌ మంతర్‌ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్‌ జనతా పార్టీ ఆందోళనలు
  • మంత్రి రాజీనామా చేస్తేనే ఆందోళనలు విరమిస్తామని స్పష్టీకరణ
  • ఇదివరకే మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు
  • రాజీనామా సహా మూడు డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి
  • డిమాండ్లపై ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయని కేంద్రం
  • చర్చలు ఉంటాయంటూనే.. ముందుకు అడుగు వేయని వైనం
  • చర్చలకు కేంద్రమే దిగి రావాలని.. తాము వెళ్లబోమని సీజేపీ కుండబద్ధలు
  • లీక్‌కు కారకులైన వాళ్లను వదలమని.. కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటన
  • మంత్రి రాజీనామాపై మాత్రం మౌనం!
  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతోనే ముడిపడి ఉన్న నీట్‌ నిరసనల వ్యవహారం
  • కేంద్రం నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • చర్చలు ఉంటాయా? ఉండవా? అనే సందిగ్ధం

10:00 AM | నిరసనల్లోకి చొరబడ్డ అసాంఘిక శక్తులు!

  • కాక్రోచ్‌ జనతా పార్టీ సంచలన ఆరోపణలు 
  • సీజేపీ ప్రతినిధి అశుతోష్‌ రంకా మాట్లాడుతూ.. నిరసనల్లోకి కొందరు అసాంఘిక శక్తులు చొరబడ్డారని తెలిపారు. 
  • వారిని నియంత్రించేందుకు వాలంటీర్ల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. 
  • రాత్రి సమయంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారని, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని ఆరోపించారు.


09:49 AM | ‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’

  • పేపర్‌ లీక్‌లపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంపై రాహుల్‌ గాంధీ స్పందించారు. 
  • యువత భవిష్యత్తుకు అత్యధిక నష్టం చేసింది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు.


09:49 AM | ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే: CJP
 

  • పేపర్‌ లీక్‌ కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుపై స్పందించిన CJP.. 
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది.


09:42 AM | పోలీస్‌పై దాడి వీడియో వైరల్‌
జూలై 20న జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఇందులో కొందరు ఆందోళనకారులు ఢిల్లీ పోలీస్‌ సిబ్బందిని వెంబడించి దాడి చేసినట్లు కనిపిస్తోంది.

09:28 AM | ముంబైలోనూ CJP నిరసనలు.. 1,500 మందికి పైగా పాల్గొనడం
NEET పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ముంబై శివాజీ పార్క్‌లో భారీ నిరసన చేపట్టారు. ఇందులో నటులు, కమెడియన్లు కూడా పాల్గొన్నారు.

09:17 AM | NEET పేపర్‌ లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు: ప్రధాని మోదీ ప్రకటన

పరీక్షల పేపర్‌ లీక్‌లకు పాల్పడిన వారిపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

09:05 AM | ముంబైలో నిరసనలు.. 200 మంది అదుపులోకి

అనుమతి లేకుండా నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు. శివాజీ పార్క్‌లో జరిగిన ఆందోళనలో సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

08:59 AM | నిరసనల్లో గాయపడిన పోలీస్‌ అధికారి ఫొటో వైరల్‌

CJP ఆందోళనల్లో ఇన్‌స్పెక్టర్‌ నందకిశోర్‌పై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఫొటో బయటకు వచ్చింది.

08:21 AM | కేంద్రంపై ఆప్‌ నేత అతిషి విమర్శలు

ఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేతపై ఆప్‌ నేత అతిషి స్పందించారు. సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కానీ విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు.

08:21 AM | ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుంది: CJP చీఫ్‌
CJP వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని కోరారు.

08:21 AM | గాయపడిన పోలీసులను పరామర్శించిన సీనియర్‌ అధికారి

ఢిల్లీ పోలీస్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ స్పెషల్‌ కమిషనర్‌ దేవేశ్‌ చంద్ర శ్రీవాస్తవ ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన పోలీసులను పరామర్శించారు.

07:55 AM | పోలీస్‌ అధికారి చర్యలపై CJP స్పందన
నిరసనకారిణిని కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ADCPను విధుల నుంచి తప్పించడంపై CJP స్పందించింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

🔴 08:21 AM | ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేత

CJP నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు. రాజీవ్‌ చౌక్‌, మండీ హౌస్‌, ఐటీవో వంటి కీలక స్టేషన్ల వద్ద రాకపోకలను నిలిపివేశారు. జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు మోహరించాయి.

🔴 08:13 AM | మంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం: CJP

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని CJP వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పష్టం చేశారు. నిరసన 34వ రోజుకు చేరిందని, సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష 26వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

🔴 07:55 AM | పోలీస్‌ అధికారిపై చర్యలకు CJP డిమాండ్‌

జంతర్‌ మంతర్‌ వద్ద మహిళా నిరసనకారిపై పోలీస్‌ అధికారి చేయి చేసుకున్న వీడియో వైరల్‌ కావడంతో.. సదరు అధికారిని సస్పెండ్‌ చేసి, విచారణ జరపాలని CJP డిమాండ్‌ చేసింది.

🔴 07:24 AM | భద్రత కట్టుదిట్టం.. మెట్రో సేవలపై ప్రభావం

కేంద్ర ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు.

🔴 07:13 AM | ఇంటర్నెట్‌ నిలిపివేతపై కాంగ్రెస్‌ ఆరోపణలు

జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. యువత నిరసన గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

🔴 05:01 AM | ముంబైలో 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

CJPకి మద్దతుగా జరిగిన అనుమతి లేని నిరసనలపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు. గత ఐదు రోజుల్లో 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి.. దాదాపు 400 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

🔴 03:46 AM | నాగ్‌పూర్‌లో నిరసనకారుల తరలింపు

నాగ్‌పూర్‌లోని సంవిధాన్‌ స్క్వేర్‌ వద్ద కొనసాగిన నిరసనను పోలీసులు రాత్రివేళ తొలగించారు. గడువు ముగిసినా ఆందోళన కొనసాగించడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్య సమయంలో కొందరు యువకులు జాతీయ గీతం ఆలపించారు.

🔴 02:44 AM | మరో పోలీస్‌ చర్యపై CJP ఆరోపణలు

జంతర్‌ మంతర్‌ వద్ద ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారని CJP ఆరోపించింది. మరోసారి పోలీస్‌ చర్యకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? అంటూ ప్రశ్నించింది.

🔴 02:04 AM | షరతులతో దీక్ష విరమిస్తా: సోనమ్‌ వాంగ్‌చుక్‌

నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని సోనమ్‌ వాంగ్‌చుక్‌ తెలిపారు. విద్యార్థులు కూడా తాత్కాలికంగా ఆందోళన విరమించి చర్చలకు రావాలని కోరారు.

🔴 01:45 AM | నిరసనలో నేరస్తుడి హల్‌చల్‌!

జూలై 20న జంతర్‌ మంతర్‌ నిరసనలో చరిత్ర కలిగిన నేర చరిత్ర కలిగిన హాజీ అఫ్జల్‌ కనిపించినట్లు ఓ వీడియో వైరల్‌ అయింది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

🔴 01:18 AM | బ్యారికేడ్లు దాటేందుకు మళ్లీ ప్రయత్నం

జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు నిరసనకారులు బ్యారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గతంలో రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే.

🔴 11:16 PM | దేశవ్యాప్తంగా నిరసనలపై కేంద్రం సమీక్ష

CJP ఆందోళనలు పలు రాష్ట్రాలకు విస్తరించడంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. మహారాష్ట్రలో అత్యధికంగా నిరసనలు నమోదయ్యాయని, ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ, అసోం, హర్యానాల్లోనూ ఆందోళనలు జరిగాయని అధికారులు తెలిపారు.

🔴 10:30 PM | ఢిల్లీలో రాళ్ల దాడి ఘటన

కనాట్‌ ప్లేస్‌ సమీపంలోని టాల్స్టాయ్‌ మార్గ్‌ వద్ద పోలీసులు, RAF సిబ్బందిపై కొందరు రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ గాయపడినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement