డ్రగ్స్‌ కేసు పెడతా.. జీవితాలను నాశనం చేస్తా : పోలీస్‌ బెదిరింపు వీడియో వైరల్‌ | Will Frame You In Case Mumbai Cop Suspended For Threatening Protesters | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసు పెడతా.. జీవితాలను నాశనం చేస్తా : పోలీస్‌ బెదిరింపు వీడియో వైరల్‌

Jul 23 2026 2:57 PM | Updated on Jul 23 2026 3:19 PM

Will Frame You In Case Mumbai Cop Suspended For Threatening Protesters

సాక్షి, ముంబై: నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాలుస్తోంది. విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్‌ అభ్యర్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం  అనే ప్రధాన డిమాండ్లతో సీజేపీ పోరాటానికి రోజు రోజుకు యువత నుంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఢిల్లీలోని జంతర్‌ వంతర్‌ వద్ద విద్యార్థుల ఆందోళనపై పోలీసులు లాఠీలతో  విరుచుకుపడ్డారు. భాష్ప వాయువు ప్రయోగించిన వైనం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని  రగిలించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ధర్నాలు ర్యాలు ఉదృతంగా సాగుతున్నాయి.  

మహారాష్ట్రలోని ముంబైలోని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శివాజీ పార్క్, చెంబూర్ , ఆజాద్ మైదాన్‌తో సహా నగరంలోని కీలక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పౌరులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు  తీరుపై, ముంబై కాంగ్రెస్ ఎక్స్‌లో  పోస్ట్ చేసిన ఒక వీడియో కొత్త వివాదానికి దారితీసింది. దీనికి ప్రకారం ఒక పోలీసు అధికారి నిరసన ప్రదేశం నుండి అదుపులోకి తీసుకున్న విద్యార్థుల బృందాన్ని నిరసనల్లో పాల్గొంటే అక్రమ మాదకద్రవ్యాల కేసులోఇరికిస్తానని బెదిరించడం కనిపిస్తుంది. అంతేకాదు నిరసనకు తిరిగి రావద్దని,  మళ్లీ ఇక్కడ కనిపిస్తే, మీ బ్యాగుల్లో 50-50 గ్రాముల పౌడర్ (మాదక ద్రవ్యం) పెడతాను, దాంతో మీ జీవితం నాశనమైపోతుంది అంటూ  ఆ పోలీసు అధికారి విద్యార్థులతో అనడం వీడియోలో ఉంది. 

(కిచిడీ ఫెయిల్‌, అంతరిక్ష వంటకాల్లో మూడింటికే చోటు : ఎందుకో?)

ఇదీ చదవండి: రూ. 20 లక్షలు ఖర్చు పెళ్లికి అవసరమా? నెట్టింట తీవ్ర చర్చ

 ఈ వీడియో వైరల్‌ కావడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ముంబై పోలీసులు, దీనికి సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులపై విచారణను ప్రారంభించారు. విచారణ పూర్తయ్యే వరకు, వీడియోలో యూనిఫాంలో కనిపించిన సదరు అధికారిని ప్రస్తుత విధి నిర్వహణ నుండి తప్పించారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. 

 

ఇదీ చదవండి: వందే భారత్‌లో నాన్న ఫస్ట్‌ రైడ్‌... ఓ పుత్రుడి ఎమోషనల్‌ స్టోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement