ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు | GV Prakash Kumar National Award And AR Rahman Praises | Sakshi
Sakshi News home page

GV Prakash Kumar: మేనల్లుడి జాతీయ అవార్డ్.. మామ విషెస్

Jul 21 2026 8:33 AM | Updated on Jul 21 2026 9:19 AM

GV Prakash Kumar National Award And AR Rahman Praises

ప్రముఖ సంగీత దర్శకుడు,ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌‌ది సంగీత కుటుంబం. ఇతడి‌ తండ్రి నుంచి సోదరీమణి రెహానా, కూతురు ఖతీజా, కొడుకు ఏఆర్‌.అమీన్‌ ఇలా అంతా సంగీత కళాకారులే. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్..‌ రెహమాన్‌కు స్వయంగా మేనల్లుడు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల 72వ జాతీయ అవార్డులను ప్రకటించింది. అందులో 'అమరన్'‌ చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడు(నేపథ్య సంగీతం) అవార్డు జీవీ ప్రకాష్‌ కుమార్‌ని వరించింది. ఇది ఈయన అందుకోబోతున్న మూడో జాతీయ అవార్డు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

2019లో సూర్య హీరోగా నటించిన 'సూరరై పోట్రు'(ఆకాశమే హద్దురా) చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ జాతీయ అవార్డ్ అందుకున్నారు. తర్వాత 2024లో 'వాత్తి' చిత్రానికిగానూ మరోసారి పురస్కారం ఇతడిని వరించింది. ఇప్పుడు 'అమరన్'తో జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా జీవీని‌ మేనమామ ఏఆర్‌ రెహమాన్‌ అభినందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.

జీవీ ప్రకాష్‌ కుమార్‌ మీరు మూడో జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు అభినందనలు. ఇదీ మన కుటుంబం గెలుచుకున్న 10వ జాతీయ అవార్డు. ఇది మన కుటుంబానికి చాలా గర్వకారణమైన తరుణం. సంగీతంపై మీ ఆసక్తి, నిజాయితీ,అంకిత భావం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. మరిన్ని మైలు రాళ్లు అధిగమించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి అని ఏఆర్‌ రెహమాన్‌ పేర్కొన్నాడు. 

(ఇదీ చదవండి: పృథ్వీరాజ్, విక్ర‌మ్‌కు అందుకే అవార్డులు ఇవ్వ‌లేదా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement