'72 ఏళ్లలో కేవలం రెండు సినిమాలకే'.. డైరెక్టర్‌ | 35 Movie Director Nanda Kishore Interesting Comments About National Award, Deets Inside | Sakshi
Sakshi News home page

35 Chinna Katha Kadhu Movie: '72 ఏళ్లలో కేవలం రెండు సినిమాలకే'.. డైరెక్టర్‌

Jul 21 2026 9:05 PM | Updated on Jul 22 2026 11:31 AM

35 Movie Director Nanda Kishore Comments about National Award

లెక్కల్లో సున్నా మార్కులు తెచ్చుకునే తెలుగు పిల్లాడి కథే 35 చిన్న కథ కాదు మూవీ. ఈ ఏడాది కేంద్రం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘ఉత్తమ బాలల చిత్రం’గా ఈ సినిమా ఎంపికైంది. జాతీయ అవార్డ్ కొట్టేసి 35 కాదు.. ఏకంగా వంద మార్కులు సాధించింది. 2024 సెప్టెంబర్‌లో విడుదలై హిట్‌గా నిలిచింది. పిల్లల తెలివిని మార్కులతో కొలవ వద్దనే సందేశం నేటి అవసరంగా భావించి కమిటీ ఈ సినిమాను జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది.

తాజాగా 35 చిన్న కథ కాదు మూవీ టీమ్  ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ నంద కిశోర్ కూడా హాజరయ్యారు. తన సినిమాకు జాతీయ అవార్డ్ రావడం తనకు గర్వంగా ఉందన్నారు. దాదాపు 72 ఏళ్ల చరిత్రలో కేవలం రెండు సినిమాలకే నేషనల్ అవార్డ్స్ వచ్చాయని తెలిపారు. అప్పట్లో ఎన్టీఆర్, గుణశేఖర్ కాంబోలో వచ్చిన బాలా రామాయణం.. ఇప్పుడు మా సినిమానేనని వెల్లడించారు. ఈ విషయాన్ని తాను ఎప్పుడు గర్వంగానే చెప్పుకుంటానని నంద కిశోర్ ఆనందం వ్యక్తం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement