ఈ భూమి మీద మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెప్పడం వింటుంటాం. ఏడుగురో ఏమో కానీ మనలా అచ్చం ఒక్కరు కనపడినా చాలని ఫీలవుతుంటాం. సడన్‌గా మనలాంటి వ్యక్తి ఎవరైనా ఎదురుగా వస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది. ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇలాంటి అనుభవం ఒక్కసారైనా ఎదురవ్వాలని మనం కూడా కోరుకుందాం.
మనకేమో గానీ.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్న ఓ వ్యక్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఇతన్ని రవితేజ మూవీస్‌లో డూప్‌గా వాడుకోవచ్చు కదా కామెంట్స్ పెడుతున్నారు. అయితే రవితేజకు అచ్చం జిరాక్స్ కాపీలా అతనెవరో వివరాలేమీ తెలియదు. ఈ వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అచ్చం మనలాగే అలా ఎవరైనా ఉంటే చూడాలని మీకు కూడా అనిపిస్తోంది కదూ.
As it is గా వున్నాడు,డూప్ గ వాడుకోవచ్చు కదా ఎలాగో కాండిడేట్ ఫేస్ వాడి పోయినట్టు వుంటుంది#Raviteja pic.twitter.com/jBgMjGLmDB
— TVR Media 🚩🚩🚩 (@Tvr_Media7) July 21, 2026


