కామన్‌వెల్త్ గేమ్స్‌లో రష్మిక..! | Rashmika mandanna will participate in commom Wealth Games event | Sakshi
Sakshi News home page

Rashmika: కామన్‌వెల్త్ గేమ్స్‌లో రష్మిక..!

Jul 22 2026 4:37 PM | Updated on Jul 22 2026 5:21 PM

Rashmika mandanna will participate in commom Wealth Games event

ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో నేషనల్ క్రష్ మెరవనుందా? ఈ క్రీడల సంగ్రామం ముగింపు వేడుకలకు హాజరు కానుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొగనుందని తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్‌తో కలిసి ఈ వేడుకకు హాజరకానున్నట్లు సమాచారం. వచ్చే నెల ఆగస్టు 2న జరగనున్న ఈ వేడుకల్లో భారతదేశం తరఫున నిర్వహించే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొగననుంది. ఈ వేడుకలో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా కామన్‌వెల్త్ గేమ్స్ అధికారిక ఫ్లాగ్‌ను భారత్‌కు అందించనున్నారు. 2030లో జరగబోయే 100 ఏళ్ల శతాబ్ది కామన్వెల్త్‌ గేమ్స్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరం అతిథ్యం ఇవ్వనుంది. గతంలో 2010లో ఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించిన తర్వాత.. భారత్ ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం రెండోసారి కావడం విశేషం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement