హోటల్‌లో భోంచేసి, మిగిలిన ఫుడ్‌ తెచ్చుకుంటున్నారా? ఇది మీ కోసమే! | Luxury hotel in Mumbai asks customer to sign disclaimer before taking leftover food | Sakshi
Sakshi News home page

హోటల్‌లో భోంచేసి, మిగిలిన ఫుడ్‌ తెచ్చుకుంటున్నారా? ఇది మీ కోసమే!

Jul 22 2026 6:57 PM | Updated on Jul 22 2026 7:17 PM

Luxury hotel in Mumbai asks customer to sign disclaimer before taking leftover food

ఏదైనా హోటల్‌కు వెళ్లినపుడు మనం ఆర్డర్‌ చేసిన ఫుడ్‌మిగిలిపోతే ప్యాక్‌ చేయించుకొని ఇంటికి తెచ్చుకోవడం చాలామందికి అలవాటే కదా. అయితే  ఒక స్టార్‌హోట్‌లో జరిగిన ఒక సంఘటన నెట్టింట  నవ్వులు పూయిస్తోంది.  అంతేకాదు ఆహార భద్రత, హోటల్ బాధ్యతలపై నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ నడుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఐటీసీ మరాఠా (ముంబై) హోటల్‌కి వెళ్లిన ఒక కస్టమర్‌  అనుభవాన్ని   ఎక్స్‌లో షేర్‌ చేయడంతో ఇది  వైరల్‌గా మారింది.  గౌరవ్ సబ్నిస్ అనే ఎక్స్‌  యూజర్‌  షేర్‌ చేసిన వివరాల ప్రకారం మిగిలిపోయిన ఆహారాన్ని (లెఫ్టోవర్స్‌) ఇంటికి తీసుకెళ్లడానికి ఒక కస్టమర్‌ను లీగల్ డిస్‌క్లైమర్‌పై సంతకం చేయమని చెప్పడం గమనార్హం. ఈ పోస్ట్‌తో పాటు ఆ డిస్క్లైమర్ ఫారమ్ ఫోటోను కూడా జత చేస్తూ, ఇది చాలా విచిత్రంగా ఉందని గౌరవ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వందే భారత్‌లో నాన్న ఫస్ట్‌ రైడ్‌... ఓ పుత్రుడి ఎమోషనల్‌ స్టోరీ

డిస్క్లైమర్ ఫారమ్‌లో ఏ ముందంటే...
రిస్క్ కస్టమర్‌దే : ఈ సౌకర్యం కేవలం 'ఆ లా కార్ట్' (À la carte) మెనూ ద్వారా ఆర్డర్ చేసిన ఫ్రెష్ ఆహారానికి మాత్రమే వర్తిస్తుంది. బఫే ఆహారానికి ఇది వర్తించదు. అలాగే ప్యాక్ చేసిన ఆహారాన్ని 2 గంటల్లోపు తినాలి, లేదా పడేయాలి. ఆహారం హోటల్ ప్రాంగణం దాటిన తర్వాత దానిని ఎలా రవాణా చేస్తారు లేదా నిల్వ చేస్తారనే దానిపై హోటల్‌కు ఎలాంటి నియంత్రణ ఉండదు. కాబట్టి దాని భద్రతకు హోటల్ హామీ ఇవ్వదు. ఆహారం తిన్న తర్వాత ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే దానికి ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ గానీ, వారి యాజమాన్యం గానీ బాధ్యత వహించవని స్పష్టం చేశారు.  అంతేకాదు పార్శిల్ తీసుకెళ్లే ముందు కస్టమర్ తమ పేరు, చిరునామా, తేదీ, సమయం, సంతకం పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: 30 ఏళ్ల క్రితం పేపర్ లీక్‌పై పోరు, ఎముకలు విరిగాయ్‌ : ఈయన్ని గుర్తు పట్టారా?

నెటిజన్ల స్పందన
ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది చాలా తెలివైన నిర్ణయమని, హోటల్ తన బ్రాండ్ పేరు దెబ్బతినకుండా ఉండేందుకు తీసుకున్న ముందస్తు జాగ్రత్త అని  కొందరు అభిప్రాయపడ్డారు. వండిన ఆహారంలో బ్యాక్టీరియా త్వరగా చేరే అవకాశం ఉంది. సరిగ్గా నిల్వ చేయకుండా కొన్ని గంటల తర్వాత తిని  పుడ్‌ పాయిజన్‌ అయితే  హోటల్‌ను నిందించడం సరికాదని కొందరు పేర్కొన్నారు. వేరే స్టార్ హోటళ్లలో కూడా ఇలాంటి నియమాలు ఉన్నాయని, బయటి నుండి తెచ్చుకునే ఆహారానికి కూడా కొన్ని హోటళ్లు ఫారమ్‌లు నింపిస్తాయని   మరికొందరు తన అనుభవాన్ని గుర్తుచేశారు. హోటల్ తీరుపై స్పందిస్తూ, ఇంకా నయం.. గుర్తింపు  కోసం ఆధార్ సంఖ్యను అడగలేదు అంటూ నెటిజన్ ఫన్నీగా  కామెంట్ చేశారు.

ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్‌ కారు కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement