రాత్రివేళ రెచ్చిపోయిన పందుల దొంగలు..! | Pig Theft Gang Police Chase Goes Viral | Sakshi
Sakshi News home page

రాత్రివేళ రెచ్చిపోయిన పందుల దొంగలు..!

Jul 11 2026 7:22 AM | Updated on Jul 11 2026 7:22 AM

Pig Theft Gang Police Chase Goes Viral

మద్దూర్‌(కోస్గి): సినిమా స్టోరీని తలపించేలా నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో పందుల దొంగలు హల్‌చల్‌ చేశారు. పందులను దొంగలించి వాహనంలో పారిపోతుండగా అడ్డుకున్న పోలీసులపై దాడికి ప్రయతి్నంచారు. ఓ హోంగార్డు తలపై బీరు బాటిల్‌తో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గురువారం అర్ధరాత్రి ఓ బొలేరో వాహనంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పందులను దొంగిలించి కోస్గి రోడ్ల గుండా వెళ్లేందుకు ప్రయతి్నంచారు. 

పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో దొంగల వాహనం దారి తప్పింది. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి దగ్గర నూతన భవనానికి రంగులు వేస్తున్న కూలీలను దారి విషయమై దొంగలు వాకాబు చేశారు. అర్ధరాత్రి ఎక్కడ నుంచి వస్తున్నారు..మీరు ఎక్కడకు వెళ్లాలి అని పెయింటర్లు నిలదీయడంతో మారణాయుధాలు చూపించి పరారయ్యారు. 

ఈ విషయం పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు యువకులు సమాచారం ఇచ్చారు. విధుల్లో ఉన్న ఏఎస్సై, మరో ముగ్గురు సిబ్బందితో, ఇద్దరు పెట్రోలింగ్‌ బైక్‌పై పట్టణంలో గాలించారు. దొంగల వాహనం బస్టాండ్‌ ముందుకు రావడంతో పోలీసులు వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. వాహనంలోని ఓ వ్యక్తి బీరు సీసాతో బైక్‌పై ఉన్న హోంగార్డు సురేందర్‌ తలపై బలంగా కొట్టి పారిపాయాడు. తీవ్ర రక్తస్రావమైన సురేందర్‌ను స్థానిక ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా తలకు కుట్లు వేశారు. ఈ విషయమై జిల్లా పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఉదయం వరకు వాహనాలు తనిఖీ చేసినా దొంగల వాహనం దొరకలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement